చొప్పదండి: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడో కొడుకు. అమానుషమైన ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో శనివారం రాత్రి జరిగింది. నాలుగేళ్ల క్రితం తండ్రిని కూడా చంపేశాడు. చాకుంటకు చెం దిన పోలుదాసరి రాయమల్లు–హనుమమ్మ దంపతులకు కొండయ్య ఒక్కడే సంతానం. పెళ్లయి పిల్లలు కలిగినా మద్యానికి బానిసైన కొండయ్యలో మార్పు రాలేదు. డబ్బులు ఇవ్వాలని నిత్యం వృద్ధురాలైన తల్లిని వేధించేవాడు. శనివారం రాత్రి కూడా డబ్బుల కోసం గొడవపడి తల్లిని తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం తండ్రిని..
కొండయ్య తీరుతో విసిగిపోయిన భార్య 15 ఏళ్ల క్రితమే అతడిని వదిలేసింది. గ్రామంలోనే వేరేచోట ఉంటోంది. రాయమల్లు–హనుమమ్మ వృద్ధాప్యంలోనూ కూలి చేసి సంపాదించిన డబ్బులో కొంత కోడలు, మనుమరాళ్లకు ఇచ్చేవారు. నిత్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతోనూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో 2016లో రాయమల్లును తీవ్రంగా కొట్టి చంపేశాడు. తండ్రి హత్య కేసులో 10 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. 2017లో హనుమమ్మ బెయిల్‌పై కొడుకును విడిపించింది.
(చదవండి: చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు)
Comments
Please login to add a commentAdd a comment