‘ఎమ్మెల్యే టికెట్టు నాదే.. ఆ దుర్మార్గుల్ని నమ్మొద్దు’ | Choppadandi MLA Ravi Shankar Sunke Counter Dissatisfied BRS Leaders | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే టికెట్టు నాదే.. ఆ దుర్మార్గుల్ని నమ్మొద్దు’

Published Wed, Aug 16 2023 8:18 PM | Last Updated on Wed, Aug 16 2023 8:18 PM

Choppadandi MLA Ravi Shankar Sunke Counter Dissatisfied BRS Leaders - Sakshi

సాక్షి, కరీంనగర్‌: అసంతృప్త నేతలపై బహిరంగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ తరపున మళ్ళీ చొప్పదండి ఎమ్మెల్యే టిక్కెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారాయన. గంగాధర మండలం బూర్గుపల్లిలో బీసీబంధు చెక్కు పంపిణీలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్.. అసంతృప్తవాదులు చేస్తున్న ప్రచారంపై స్పందించారు.

చొప్పదండి నుంచి మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ నాదే. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ పదే పదే చెబుతున్నారు. చాలా స్పష్టంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో కొందరికి వాళ్ల వాళ్ల స్థానాల నుంచే పోటీ అని చెబుతున్నారు.  కానీ, కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ వాటిని నమ్మొద్దంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో.. మరోసారి తనను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

గత కొద్దిరోజులుగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అసమ్మతి నేతలు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఇవాళ స్వయంగా ఆయన తిరుగుబాటు నేతలపై మండిపడటం, టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement