సాక్షి, కరీంనగర్: గత ఎన్నికల్లో పరాభవమా.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అనుభవం ఎదురవుతుందా? అనే అనుమానమా?.. మొత్తంగా ఆయనలో గతం తాలుకా చేదు జ్ఞాపకాలు వదిలిపోవడం లేదు. ఎక్కి దిగిన ప్రతీ వేదికలోనూ అవే మాటలు మాట్లాడుతున్నారు. ఆయనే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ బాస్ కేసీఆర్‌కు దూతగా భావించే మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్.
ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీ వినోద్ మళ్లీ క్యాడర్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది పాత ముచ్చటే. కానీ, మళ్లీ మళ్లీ జరుగుతోంది. గత ఎన్నికల్లో తన ఓటమికి వీరంతా కారణమంటూ స్టేజ్ పైనున్న నేతలందరినీ వరుసబెట్టి చూపిస్తూ చేస్తున్న వ్యాఖ్యానించారాయన. ఎక్కి దిగిన ప్రతీ స్టేజీపైనా.. వినోద్ నోట ఇవే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
గత పార్లమెంటరీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. తన ఓటమికి ఎమ్మెల్యేలు, కార్యకర్తలే కారణమంటూ నిందిస్తున్నారు. బండి సంజయ్ లాంటివాళ్లు గట్టిగా మాట్లాడుతుంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలు కౌంటర్ ఇవ్వకుండా ఏంచేశారన్నది? వినోద్ వేసుకుంటూ పోతున్న ప్రశ్న. మొన్న గంగాధర మండలం చాకుంటంలో.. అంతకుముందు హిమ్మత్ రావు పేటలో... అంతకుముందు ఇంకెక్కడో.. ఇలా ప్రతీచోటా వినోద్ నోట ఇవే వ్యాఖ్యలు వినిపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
అయితే వినోద్ నోట వస్తున్న వ్యాఖ్యలు గత ఎన్నికల చేదు జ్ఞాపకాలే అయినా.. వచ్చే ఎన్నికలపై ప్రభావం కోరుకుంటున్నారేమో. ఓటమి పునరావృతం కాకూడదని కోరుకుంటున్న ఆయన.. పార్టీ కేడర్‌లో చరుకలతో కూడిన బూస్ట్ ఇస్తున్నారేమో అనే చర్చా నడుస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన మాట్లాడిన ప్రతీసారి ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment