b. vinod kumar
-
కేసీఆర్ దూతను వెంటాడుతున్న చేదు జ్ఞాపకం
సాక్షి, కరీంనగర్: గత ఎన్నికల్లో పరాభవమా.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అనుభవం ఎదురవుతుందా? అనే అనుమానమా?.. మొత్తంగా ఆయనలో గతం తాలుకా చేదు జ్ఞాపకాలు వదిలిపోవడం లేదు. ఎక్కి దిగిన ప్రతీ వేదికలోనూ అవే మాటలు మాట్లాడుతున్నారు. ఆయనే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ బాస్ కేసీఆర్‌కు దూతగా భావించే మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీ వినోద్ మళ్లీ క్యాడర్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది పాత ముచ్చటే. కానీ, మళ్లీ మళ్లీ జరుగుతోంది. గత ఎన్నికల్లో తన ఓటమికి వీరంతా కారణమంటూ స్టేజ్ పైనున్న నేతలందరినీ వరుసబెట్టి చూపిస్తూ చేస్తున్న వ్యాఖ్యానించారాయన. ఎక్కి దిగిన ప్రతీ స్టేజీపైనా.. వినోద్ నోట ఇవే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గత పార్లమెంటరీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. తన ఓటమికి ఎమ్మెల్యేలు, కార్యకర్తలే కారణమంటూ నిందిస్తున్నారు. బండి సంజయ్ లాంటివాళ్లు గట్టిగా మాట్లాడుతుంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలు కౌంటర్ ఇవ్వకుండా ఏంచేశారన్నది? వినోద్ వేసుకుంటూ పోతున్న ప్రశ్న. మొన్న గంగాధర మండలం చాకుంటంలో.. అంతకుముందు హిమ్మత్ రావు పేటలో... అంతకుముందు ఇంకెక్కడో.. ఇలా ప్రతీచోటా వినోద్ నోట ఇవే వ్యాఖ్యలు వినిపిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వినోద్ నోట వస్తున్న వ్యాఖ్యలు గత ఎన్నికల చేదు జ్ఞాపకాలే అయినా.. వచ్చే ఎన్నికలపై ప్రభావం కోరుకుంటున్నారేమో. ఓటమి పునరావృతం కాకూడదని కోరుకుంటున్న ఆయన.. పార్టీ కేడర్‌లో చరుకలతో కూడిన బూస్ట్ ఇస్తున్నారేమో అనే చర్చా నడుస్తోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన మాట్లాడిన ప్రతీసారి ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. -
బోయినపల్లి వినోద్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్
సాక్షి, హనుమకొండ: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. హనుమకొండలో గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. -
తెలంగాణ ప్రభుత్వానికి ‘నాటా ’ అంబులెన్స్ బహూకరణ
లక్సెట్టిపేట్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ గుండ అమర్నాథ్ దాతృత్వంతో అధ్యక్షుడు డాక్టర్ గోసుల రాఘవరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అంబులెన్స్ బహూకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు. నాటా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మందికి చేయూత అందిస్తోంది. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజ సేవయే నాటా బాట’ అనే లక్ష్యంతో అమెరికాలో పలు కార్యక్రమానలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతిని కాపాడుతోంది. అదేవిధంగా పలు హెల్త్ క్యాంప్స్, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో సమాజ సేవ చేస్తూ అమెరికాలో ముందు వరసలో ఉంటోంది. ఈ అంబులెన్సు బహూకరణ కు సహకరించిన దాతలను, అందరినీ సమన్వయం చేసిన గుండ అమర్నాథ్ను నాటా అధ్యక్షులు డాక్టర్ గోసల రాఘవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: కొత్తూర్‌లో డా.వైఎస్సార్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్ -
జమిలికి టీఆర్‘ఎస్’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అభిప్రాయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు న్యాయ శాఖ కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం ఢిల్లీలో లా కమిషన్ సమావేశానికి హాజరై సీఎం రాసిన లేఖను ఆయనకు అందజేశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు. లోక్‌సభ, అసెంబ్లీలకు విడిగా ఎన్నికల వల్ల ప్రతిసారీ 4 నుంచి 6 నెలల పాటు అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల పనుల్లో గడపాల్సి వస్తోందని, దీనివల్ల రాష్ట్రాల్లో ప్రజాధనం వృథా అవుతోందని వివరించారు. అంతేకాకుండా ఐదేళ్ల కాలంలో రాజకీయ పార్టీలు, అభ్య ర్థులు రెండుసార్లు ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి వస్తోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఏడాది కాలంపాటు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవుతోందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గం అని లేఖలో సీఎం వివరించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా లా కమిషన్ అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే న్యాయశాఖ నివేదిక ఇచ్చింది: వినోద్ దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌ల అజెండా కాదని, 1983లోనే దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ నివేదిక ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వివరించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు మళ్లీ ఏటా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎంతో సమయం, ప్రజాధనం వృథా అవుతోంది. దీన్ని అరికట్టేందుకు దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’’అని వినోద్ పేర్కొన్నారు. -
'లీకేజీ డొంక కదులుతోంది'
కరీంనగర్: ఎంసెట్ లీకేజీ వ్యవహారం ఎన్నేళ్ల నుంచి సాగుతోందో త్వరలోనే బయటపడనుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ లీకేజీ వ్యవహారంలో తిమింగలాన్ని తమ ప్రభుత్వం పట్టుకొందని, మొత్తం డొంక కదులుతోందన్నారు. సీఎం, మంత్రులు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. తామే దొంగలను పట్టుకొని, ఎప్పటి నుంచి దొంగతనం జరుగుతుందనేది ఆరా తీస్తుంటే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎంసెట్ లీకేజీ ఐదేండ్లు, పదేండ్లు... ఎప్పటినుంచి జరుగుతుందనేని త్వరలో తెలుస్తుందన్నారు. అప్పుడు ఆ లీకేజీకి ఎవరు మద్దతునిచ్చారనేది కూడా బయటపడుతుందని చెప్పారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
'సెక్షన్ - 26 సవరణపై కేంద్రమంత్రితో చర్చించా'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు...హైకోర్టు ఏర్పాటు... హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా.. తదితర అంశాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడతో చర్చించినట్లు కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి సదానందగౌడతో వినోద్‌కుమార్ భేటీ అయ్యారు. అనంతరం వినోద్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.... విభజన చట్టంలోని సెక్షన్ - 26లో చేయవలసిన చిన్నపాటి సవరణపై కూడా మంత్రితో చర్చించినట్లు చెప్పారు. ఈ సెక్షన్లో చేసే సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో స్థానాలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఇదే సవరణపై సదానందగౌడకు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు లేఖ రాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే దశలో ఉందన్నారు. ఈ బిల్లు తయారీపై కేంద్ర హోంశాఖ, న్యాయశాఖకు తమ అభిప్రాయాలను పంపించిందని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు వచ్చేలా అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి సదానంద గౌడని కోరినట్లు చెప్పారు. ఒకటిరెండు రోజుల్లో తమ శాఖ నుంచి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో 450 మంది న్యాయమూర్తులు ఉన్న విషయాన్ని కూడా ఆయనతో ప్రస్తావించారన్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై చర్చించినట్లు చెప్పారు. ఉమ్మడి హైకోర్టులో 42 శాతం తెలంగాణ న్యాయమూర్తుల ఎంపిక జరగాలని కోరినట్లు తెలిపారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో న్యాయ శాఖలో జరిగిన అన్యాయం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరుగవద్దు అన్నదే తమ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని సదానంద గౌడ ఎదుట వివరించినట్లు చెప్పారు. ఇదే విధంగా లోయర్ జ్యూడిషియరీ నుంచి జరిగే ఎంపికలో తెలంగాణ వాటా ఉండాలని మంత్రికి వివరించానన్నారు. ఈ అంశాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో తప్పకుండా మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టులో అప్పిల్ చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'నిధుల్లో కోత విధించిన కేంద్రం'
వేములవాడ(కరీంనగర్ జిల్లా): తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తోందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఆరోపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత మూడు నెలలకే రూ.2600 కోట్ల నిధులు తగ్గించిందని అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలోని వాజ్‌పేయి ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన తదితర పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధికి పాటుపడిందన్నారు. ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంకెల గారడీ చేస్తూ నిధుల్లో కోత పెడుతోందని అన్నారు. 69వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగంలో గ్రామాల అభివృద్ధి గురించి ప్రస్తావించలే దన్నారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రధానమంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. వాటర్‌షెడ్ పథకం నిధులు విడుదల చేయడం లేదని, మోడల్ స్కూల్స్ భారాన్ని రాష్ట్రంపైనే వేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. -
మెట్రో రైలులో కేంద్ర మంత్రి వెంకయ్య ప్రయాణం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ ఎంపీలు బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ నగరానికి మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు, ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాచుర్యం పెంచేందుకు ఇటీవల ఎంపీలు తరచుగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. -
బినామీ లెక్కలేవీ బాబూ: వినోద్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: బినామీల పేర్ల మీదున్న ఆస్తుల వివరాలు చెప్పకుండా అవే పాత లెక్కలను చంద్రబాబునాయుడు చెప్తానంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీచేసిన వారందరి ఆస్తుల వివరాలు వెబ్సైట్లలో ఉన్నాయన్నారు. కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు సహా ఏవైనా తప్పు చెప్తే అనర్హతకు గురౌతారని కూడా ఎన్నికల సంఘం చెప్తోందని వివరించారు. ఆస్తులను చంద్రబాబు ఒక్కరే ప్రకటించినట్టు, మిగిలినవారూ ప్రకటించాలని సవాల్ విసరడం అందరికీ నవ్వు తెప్పిస్తోందని వినోద్‌కుమార్ అన్నారు. చంద్రబాబు చెప్పిం దాంట్లో కొత్తేమీ లేదన్నారు. బినామీ ఆస్తుల వివరాలను కూడా చంద్రబాబుకు దమ్ముంటే వెల్లడించాలని ఆయన సవాల్ చేశారు.