
లక్సెట్టిపేట్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ గుండ అమర్‌నాథ్ దాతృత్వంతో అధ్యక్షుడు డాక్టర్ గోసుల రాఘవరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అంబులెన్స్ బహూకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు. నాటా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మందికి చేయూత అందిస్తోంది.
‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజ సేవయే నాటా బాట’ అనే లక్ష్యంతో అమెరికాలో పలు కార్యక్రమానలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతిని కాపాడుతోంది. అదేవిధంగా పలు హెల్త్ క్యాంప్స్, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో సమాజ సేవ చేస్తూ అమెరికాలో ముందు వరసలో ఉంటోంది. ఈ అంబులెన్సు బహూకరణ కు సహకరించిన దాతలను, అందరినీ సమన్వయం చేసిన గుండ అమర్‌నాథ్‌ను నాటా అధ్యక్షులు డాక్టర్ గోసల రాఘవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment