Ambulance
-
ఈ ఉద్యోగాలు చేస్తుంటే... మతిమరుపు రాదు!
అల్జీమర్స్. వయసుతో పాటు వచ్చే మతిమరుపు. ఇది కొందరిలో మరణానికీ దారి తీస్తుంది. అయితే కొన్ని రకాల వృత్తుల్లోని వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశమే లేదంటున్నాయి అధ్యయనాలు! ముఖ్యంగా డ్రైవింగ్‌లో ఉండేవాళ్లు ఆల్జీమర్స్‌తో మరణించే ప్రమాదం తక్కువట. అయితే బైక్ నడిపేవాళ్లు ఈ జాబితాలోకి రారు. అలాగే పైలట్లకు కూడా ఇది వర్తించదు. టాక్సీ, అంబులెన్స్ వంటివాటిని నడిపేవాళ్లకే అల్జీమర్స్ వచ్చే అవకాశం తక్కువట. అల్జీమర్స్ మెదడు వ్యాధి. జ్ఞాపకశక్తిని, ఆలోచనలను, రోజువారీ పని చేసే శక్తిని క్రమంగా తగ్గించేస్తుంది. ఇది వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపతుంది. మెదడు కణాలు దెబ్బతినడం, సరిగా పని చేయకపోవడం అల్జీమర్స్‌కు దారితీస్తుంది. దాంతో గందరగోళంగా మాట్లాడటం, అత్యంత సన్నిహితులను కూడా గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. 2020 నుంచి 2022 మధ్య మరణించిన 90 లక్షల మంది వైద్య చరిత్రను పరిశీలించారు. వీరిలో 443 రకాల వృత్తులకు సంబంధించిన వారున్నారు. వారిలో 3.88 శాతం మరణాలు, అంటే మూడున్నర లక్షల మంది అల్జీమర్స్‌తో చనిపోయారు. వారిలో ట్యాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు చాలా తక్కువ మంది ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. ఆ డ్రైవర్లకు ఎందుకు రాదంటే... పరిశోధన ఫలితాలను లోతుగా అధ్యయనం చేసిన మీదట ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్టు సైంటిస్టులు తెలిపారు. అవేమిటంటే... → అల్జీమర్స్ ప్రారంభంలో మెదడులోని హిప్పోకాంపస్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. → టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లలో రియల్ టైమ్ స్పేషియల్ థికింగ్, నావిగేషన్ ఈ హిప్పోకాంపస్‌కు చక్కని వ్యాయామంలా పని చేస్తున్నాయట. → ఈ నిరంతర వ్యాయామం వల్ల వారిలో అది చురుగ్గా, చైతన్యవంతంగా పని చేస్తోంది. → అదే బస్సు డ్రైవర్లు, విమానాల పైలట్లలో అంత నావిగేషన్ స్కిల్స్ ఉండటం లేదని అధ్యయన బృందం సారథి డాక్టర్ విశాల్ పటేల్ తెలిపారు. → నావిగేషన్స్ స్కిల్స్ పెంచే మానసిక వ్యాయామాలు మెదడును ప్రభావితం చేసి చురుగ్గా ఉంచుతాయని ఆయన వివరించారు. → కనుక వాటిపై దృష్టి పెడితే చాలని అధ్యయనకారులు చెబుతున్నారు. → మానసికంగా చురుగ్గా ఉంటే అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తి సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తేల్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలీసు వాహనాలను ఢీకొట్టి.. అంబులెన్స్ తో పరార్
-
డయాలసిస్ బాధితులకు 108లో ఉచిత ప్రయాణానికి మంగళం
-
ప్రజారోగ్యంపై పగ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేసేశారంటూ ప్రతి వేదికపై గుండెలు బాదుకుంటున్న సీఎం చంద్రబాబే నిజానికి వాటన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. గతంలో పేదలకు మేలు చేసిన అనేక కార్యక్రమాలకు ఆయన మంగళం పాడుతూ రివర్స్ పాలన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఉన్నపళంగా నిలిపేసి వారిని కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. చివరికి.. వారి ప్రాణాలతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, అనుయాయులకు వాటి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం నిధులు చెల్లించకుండా 108, 104 వాహనాలను మూలనపడేయడం ఇందుకు నిదర్శనం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి రోగులకు చుక్కలు చూపుతోంది. ఇందులో భాగంగా డయాలసిస్ రోగులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రవాణా సదుపాయానికి కూడా తిలోదకాలిచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో డయాలసిస్‌కు ఆస్పత్రికి వెళ్లాల్సిన వ్యక్తి 108 అంబులెన్సుకు ఫోన్‌చేస్తే నిమిషాల వ్యవధిలోనే రోగి ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గత మూడు వారాలుగా ఈ సేవలకు మంగళం పాడేసింది. బాధితులు 108కు ఫోన్ చేసినా అంబులెన్స్‌లు రావడంలేదు. ‘కేవలం తీవ్ర అనారోగ్య సమస్యలుంటేనే అంబులెన్స్ వస్తుంది.. డయాలసిస్ కోసం రాదు’ అని కాల్‌సెంటర్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారని డయాలసిస్ బాధితులు వాపోతున్నారు.అవస్థలుపడుతూ ఆస్పత్రులకు.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 600 మందికి పైగా రోగులు 108 అంబులెన్సుల ద్వారా డయాలసిస్‌కు వెళ్లేవారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకూ 2.50 లక్షల మందికి పైగా ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 108 సేవలపై చీకట్లు కమ్ముకున్నాయి. డీజిల్‌కు కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. ఫలితంగా డయాలసిస్‌తో పాటు ఇతర అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు రాక కొందరు మరణించారు. ఉచిత రవాణా కల్పించాలని డిమాండ్.. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా డయాలసిస్ రోగులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో కిడ్నీ బాధితులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. గ్రామానికి 30 నుంచి 50 కి.మీల దూరంలో ఉండే డయాలసిస్ కేంద్రాలకు ఒకసారి వెళ్లి రావాలంటే కనీసం రూ.500 నుంచి రూ.1,500 వరకూ బాధితులు ఖర్చుచేయాల్సి వస్తోంది. కొందరికి వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్ అవసరమవుతోంది. వారికి ఈ ఖర్చు తలకుమించిన భారమవుతోంది. దీంతో.. ప్రయాణ ఖర్చులకు భయపడి కొందరు డయాలసిస్‌ను నిర్లక్ష్యంచేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి 108 అంబులెన్స్‌ల్లో ఉచిత రవాణాకు అవకాశం కల్పించాలని డయాలసిస్ రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ బస్సుల్లోనైనా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది.. కొన్నేళ్లుగా నా భర్త చిరంజీవికి డయాలసిస్ చేయిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 108 ద్వారా ఉచితంగా ఆస్పత్రికి తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు వాహనం రావడం లేదు. వారంలో మూడు రోజులు సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి ఉంది. దీంతో ఆటోలో వచ్చినప్పుడల్లా రూ.300 వరకు ఖర్చవుతోంది. ఆటోలో వస్తున్న సమయంలో నా భర్త ఒక్కోసారి అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది. ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మాలాంటి వారిని ఆదుకోవాలి.– లీలావతి, వడ్డిపల్లి, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు.. మా తమ్ముడు సత్యనారాయణ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి భార్య లేదు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో డయాలసిస్‌కు నేనే తీసుకురావాల్సి వస్తోంది. ప్రతిసారీ రూ.500 వరకు ఖర్చవుతోంది. మాలాంటి పేదలకు ప్రతిసారీ ఇలా రూ.వందలు ఖర్చు పెట్టుకోవడం చాలా భారంగా ఉంది. డయాలసిస్ చేయించుకుని తీసుకెళ్లేలోపు నా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు. – జయలక్ష్మి, ధర్మభిక్షం కాలనీ, అక్కంపల్లి, అనంతపురం జిల్లా మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి..అప్పు చేసి డయాలసిస్ కోసం తిరుగుతున్నాం. గత ప్రభుత్వం డయాలసిస్ రోగుల కోసం 108 అంబులెన్సులో ఉచిత ప్రయాణ సేవలు అందించింది. దీంతో మాకు రవాణా ఖర్చులు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి 108 సేవలను ఆపేశారు. దీంతో రవాణా చార్జీలు కష్టంగా మారాయి. మేము బంగారుపాళ్యం నుంచి ఆటోలో రావాలంటే రూ.500పైన డబ్బులు తీసుకుంటున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి. –శ్యామల, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లాఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి.. ఆంజనేయులు. అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి నివాసి అయిన ఈయన గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అనంతపురం సర్వజనాస్పత్రికి వారంలో మూడుసార్లు డయాలసిస్ కోసం వెళ్లాల్సి ఉంది. గత ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆంజనేయులు 108 అంబులెన్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచి ఆస్పత్రికి వచ్చేవాడు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఉచిత రవాణా సదుపాయాన్ని నిలిపేయడంతో కుమారుడితో కలిసి బైకుపైన అవస్థలు పడుతూ ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలా ఆంజనేయులు ఒక్కరే కాదు.. డయాలసిస్ రోగులకు చంద్రబాబు ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం నిలిపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.కొండ్రు ఇసాక్, అతడి భార్య రాణమ్మ. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం విజయనగర్ కాలనీలో వీరు నివాసముంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా వీరు నెలలో 13 రోజులు 30 కిలోమీటర్లు ప్రయాణించి కనిగిరి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికి వచ్చి అంబులెన్స్ తీసుకువెళ్లేదని, డయాలసిస్ చేయించుకుని ఇంటికి వచ్చేవారమని ఆ దంపతులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మూడు వారాలుగా అంబులెన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో వెళ్తుంటే రూ.1,000 నుంచి 1,500 తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలా నెలలో 13 రోజులకు ఆటోకి రూ.19,500 అవుతోందని, ఇది కాకుండా మందులు రూ. 5,000 వరకూ అవుతున్నాయని కలత చెందుతున్నారు. -
108 ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్‌గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్‌కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ -
అంబులెన్స్‌కు దారివ్వని కారు.. షాకిచ్చిన పోలీసులు!
రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా వెంటనే తమ వాహనాలను సైడ్‌కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.దీంతో ఆ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్‌కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024 -
అంబులెన్స్ కు దారి ఇవ్వని కారు డ్రైవర్
-
కారు ఓనర్‌కి పోలీసుల షాక్.. అంబులెన్స్‌కి దారి ఇవ్వలేదని..
తిరువనంతపురం: కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.2.5 లక్షల జరిమానా విధించడంతో అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు కారు యాజమాని దారి ఇవ్వలేదు. పేషెంట్‌ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతీ సియాజ్ కారు నడుపుతున్న ఓ వ్యక్తి మాత్రం దారి ఇవ్వలేదు. అయితే, కారు యజమాని ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని స్పష్టమవుతోంది.అయితే, అంబులెన్స్ ముందు కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో రికార్డ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వెంటనే స్పందిస్తూ.. నేరుగా ఆ కారు యాజమాని ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లారు. రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వీడియో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేవు.A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn— MDApp (@MDAppMDApp) November 17, 2024 -
పేలిన అంబులెన్స్.. తప్పిన పెను ప్రమాదం
-
అంబులెన్స్‌లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గర్భిణీ, ఆమె కుటుంబం అంబులెన్స్‌లో భారీ పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం.. జల్గావ్లోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్ పేలుడు ఘటన జరిగింది. అంబులెన్స్‌లో గర్భిణీ, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. అంబులెన్స్ డ్రైవర్ తన వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే దిగిపోయాడు. అప్రమత్తమైన డ్రైవర్.. అంబులెన్స్‌లో ఉన్నవారిని సైతం వెంటనే దిగాల్సిదిగా కోరాడు.Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024అదేవిధంగా వాహనం నుంచి దూరంగా ఉండమని సమీపంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేశాడు. వాహనం మొత్తం మంటల్లో చిక్కుకొని.. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు వ్యాపించింది. దీంతో భారీ శద్ధంతో పేలుడుకు సంభవించింది. అయితే ప్రమాదంలో డైవర్‌తో సహా.. గర్భిణీ,ఆమె కుటుంబం సురక్షింతంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్గ్రా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెట్రోల్ పంపు దగ్గర పార్క్ చేసిన అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
అంపశయ్యపై అంబులెన్సులు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెనుముప్పు దాపురించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు అండగా నిలవాల్సిన ‘108’ అంబులెన్సులకు పెద్దఆపద వచ్చింది. ఈ ఆపద్భాందవికి ఫోన్‌చేస్తే కుయ్ కుయ్‌మంటూ నిమిషాల్లో ఘటనా స్థలంలో వాలిపోయి బాధితులకు చేయూతనివ్వాల్సిన అంబులెన్స్‌లు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్లక్ష్యంగా కారణంగా డీజిల్‌లేక ముందుకు కదలడంలేదు. ఇలా బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 290 అంబులెన్స్‌లు ఆగిపోయాయి. దీంతో.. వైద్యసాయం కోసం 108కు ఫోన్‌చేసిన వారికి ‘మీ దగ్గరలో అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆస్పత్రులకు వెళ్లండి’ అని కాల్ సెంటర్ ప్రతినిధులు బదులిచ్చారు. బిల్లులు మంజూరు చేయాలని కోరినా..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులన్నీ అస్మదీయులకు కట్టబెట్టడంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ) నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను తప్పించడానికి పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన బిల్లుల్లో ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఇలా ఏకంగా రూ.141 కోట్ల బిల్లులు నిలిచిపోవడంతో గడిచిన మూడు నెలలుగా 104, 108 సిబ్బందికి అరబిందో సంస్థ వేతనాలు చెల్లించలేదు. మరోవైపు.. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు.అయినప్పటికీ దీపావళికి ముందు 108 కాల్ సెంటర్ నిర్వహణ సంస్థకు బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం అరబిందోకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఒకవైపు ఎంఓయూ రద్దుచేసుకుని వెళ్లిపోవాలని సంస్థపై ఒత్తిడి చేస్తూనే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంటోందని ఎల్లో మీడియా లీకులిచ్చి కథనాలు రాయించింది. దీంతో కొన్ని రోజులుగా అరువుపై డీజిల్ పోసే పెట్రోల్ బంకులు సైతం రెండు మూడ్రోజులుగా చేతులెత్తేశాయి. దీంతో.. 108 సేవలకు అంతరాయం ఏర్పడుతుందని.. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అరబిందో సంస్థ మంగళవారం ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఐదు నెలలుగా బిల్లులు నిలిచిపోవడం, రివాల్వింగ్ ఫండ్ కూడా లేకపోవడంతో వారం, పది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డీజిల్‌లేక అంబులెన్సులు నిలిచిపోతున్నా బాబు సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.నాలుగుసార్లు ఫోన్‌చేసినా రాలేదు..మా అమ్మాయి తేళ్లూరు అశ్రితకు కడుపులో నొప్పి రావడంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు నాలుగుసార్లు ఫోన్‌చేసినా 108 రాలేదు. దీంతో.. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు పెట్టే స్థోమతలేక బస్సులో విజయవాడ తీసుకెళ్లాం. – తేళ్లూరు నాగేశ్వరరావు, చాట్రాయిసాయం అందక హాహాకారాలు..నిజానికి.. 2019కు ముందు బాబు పాలనలో కునారిలి్లన 108 వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఊపిరిలూదుతూ 768 అంబులెన్సులతో బలోపేతం చేసింది. ఇందులో బ్యాకప్ పోను 731 వాహనాలు క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందిస్తుంటాయి. ఇలా సగటున రోజుకు మూడువేలకు పైగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అంబులెన్సులు అండగా నిలుస్తున్నాయి. అంటే.. రోజుకు నాలుగు పైగా కేసులకు ఒక్కో అంబులెన్స్ అటెండ్ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో డీజిల్‌లేక బుధవారం ఒక్కరోజే 290 అంబులెన్సులు నిలిచిపోయాయి.500లోపు వాహనాలు అరకొరగా సేవలు కొనసాగిస్తున్నాయి. ఉదా.. ఏలూరు జిల్లాలో 108 వాహనాలు మొత్తం 29 ఉండగా మంగళవారం డీజిల్‌లేక 12 వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాటిల్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు, మండవల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెంలకు చెందిన వాహనాలున్నాయి. ఇక మంగళవారం 108 అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన బాధితులు ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయించలేక హాహాకారాలు చేస్తున్నారు.⇒ ఈ చిత్రంలోని మహిళ అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. 108 వాహనం కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో కుటుంబీకులే రూ.500 బాడుగతో ఆటో మాట్లాడుకుని 15 కి.మీ దూరంలోని సర్వజనాస్పత్రికి ఆమెను తీసుకువచ్చారు.⇒ ఈ చిత్రంలోని మహిళ పేరు పార్వతమ్మ. స్వగ్రామం అనంతపురం జిల్లా ముద్దలాపురం. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు 108 వాహనం కోసం ఫోన్ చేయగా.. అదిగో.. ఇదిగో అంటూ మధ్యాహ్నం వరకూ గడిపారు. ఆ తర్వాత స్పందించ లేదు. దీంతో కుటుంబీకులు 32 కి.మీ దూరంలోని అనంతపురం సర్వజనాస్పత్రికి ఆటోలో తీసుకువచ్చారు. -
కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పూరమ్ ఉత్సవాల సమయంలో అంబులెన్సు సౌకర్యాన్ని దుర్వినియోగం చేశారంటూ కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వక ర్యాష్ డ్రైవింగ్‌తోపాటు మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద త్రిస్సూర్ ఈస్ట్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక సీపీఐ నేత కేపీ సుమేశ్ ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి అభిజిత్ నాయర్, అంబులెన్సు డ్రైవర్‌ను నిందితులుగా చేర్చారు. పూరమ్ ఉత్సవాల వేదిక వద్దకు చేరుకునేందుకు వీరు పోలీసు ఆంక్షలను ధిక్కరిస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని సుమేశ్ ఆరోపించారు. మంత్రి సురేశ్ గోపీ ఈ ఆరోపణలను ఖండించారు. కారులో వస్తుండగా ప్రత్యర్థి పారీ్టల గూండాలు దాడి చేయడంతో అక్కడే ఉన్న అంబులెన్సులో ఉత్సవాల వేదిక వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. -
ఇసుజు డీ-మ్యాక్స్ ఆంబులెన్స్: ధర ఎంతంటే..
ఇసుజు మోటార్స్ ఇండియా ఏఐఎస్-125 టైప్ సీ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 'డీ-మ్యాక్స్ అంబులెన్స్' లాంచ్ చేసింది. ఈ అంబులెన్స్ రోగులను తరలించే సమయంలో భద్రతను అందించేలా తయారైంది. దీని ప్రారంభ ధర రూ. 25.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో RZ4E 1.9-లీటర్, 4-సిలిండర్ వీజీఎస్ టర్బో ఇంటర్‌కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 120 కేడబ్ల్యు పవర్, 360 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ అంబులెన్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తగిన విధంగా ఉండేలా దృఢంగా నిర్మితమై ఉంది.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌లో.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఇంటలిజెంట్ బ్రేక్ ఓవర్-రైడ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ అండ్ కో-డ్రైవర్ సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ వార్ణింగ్ సిస్టమ్, డ్రైవర్ & కో-డ్రైవర్ కొరకు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ క్యాబిన్ కొరకు కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, సైడ్ ఇంట్రూషన్ ప్రొటక్షన్ బీమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.ఇసుజు డీ-మ్యాక్స్ అంబులెన్స్‌ను కంపెనీ రోగుల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది. కాబట్టి ఇందులో వార్నింగ్ లైట్లు, ఫ్లాషర్లు, సైరన్లు, సైడ్ లైట్లు, సులభంగా గుర్తించడానికి అనుకూలంగా ఉండేలా హై-విజిబిలిటీ స్టిక్కర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుడీ-మ్యాక్స్ అంబులెన్స్ లాంచ్ సందర్భంగా ఇసుజు మోటార్స్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ 'టోరు కిషిమోటో' మాట్లాడుతూ.. అత్యాధునిక ఫీచర్లతో దీనిని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇసుజు ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉంది. ఈ లాంచ్‌తో, ఇసుజు మోటార్స్ ఇండియా ఆటోమోటివ్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంతుందని అన్నారు. -
మీరు మనుషులేనా
-
‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో
మనిషికి,కుక్కకు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. విశ్వాసానికి మరో పేరుగా , గ్రామసింహంగా మనుషులతో పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే పెంపుడు జంతువు శునకం. కాసింత గంజిపోసినా, ఏంతో విధేయతగా ఉంటుంది. తనను ఆదరించిన యజమాని కొండంత ప్రేమను చాటుతుంది. అవసమైతే ప్రాణాలు కూడా ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహంలేదు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వైరల్ వీడియో గురించి తెలుసుకుందాం పదండి! A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW— TaraBull (@TaraBull808) September 12, 2024అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని ఆంబెలెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంన్నారు. అలా వెళ్తున్న యజమానానిని చూసి కుక్క మనసు ఆగలేదు. అంబులెన్స్‌ను అనుసరిస్తూ పోయింది. చివరికి దాని ఆత్రం, ఆరాటాన్ని చూసిన ఆంబులెన్స్ డ్రైవర్కూడా చలిచించిపోయాడు. వెంటనే వెహికల్ ఆపి ఆగి దాన్ని కూడా ఎక్కించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఎక్స్‌లో తెగ వైరలవుతోంది. తారా బుల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ దృశ్యాలను ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది. చాలామంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్ మంచి మనసును మెచ్చుకోవడం విశేషం. (కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!)పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం కోసం, యజమాని ఇంట్లో పిల్లలకోసం ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాడి, ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది. అసలు ఒక కుక్కను పెంచు కోవాలనే ఆలోచనలోని అర్థం పరమార్థం ఇదే. అంతేకాదు యజమానులు కూడా తమ డాగీ అంటే ప్రాణం పెట్టే వారే. ఎంత ప్రేమ అంటే దాన్ని కుక్క అనడం కూడా వాళ్లకి నచ్చదు. దానికి పెట్టిన పేరుతోనే పిలవాలి. ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా సాదుకుంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు. (ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!) -
హృదయ విదారకం.. ‘బిడ్డల మృతదేహాలను భుజాన వేసుకుని’
భార్య శవాన్ని భుజాన మోసుకొని వెళ్లిన భర్త.. కొడుకు మృతదేహాన్ని చేతలపై తీసుకెళ్లిన తండ్రి.. ఇలాంటి వార్తలను అప్పుడప్పుడూ పేపర్లు,టీవీల్లో చూస్తుంటాం. ప్రైవేట్ అంబులెన్స్‌లకు డబ్బులు ఇవ్వలేక.. ప్రభుత్వ ఆస్పత్రులను అంబులెన్స్‌లను పంపించక.. కొందరు అభాగ్యులు.. భుజాలపైనా తమ అయినవారి మృతదేహలను తీసుకెళ్లిన ఘటన గతంలో పలు చోట్ల జరిగాయి. ఈ కాలంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. తాజాగా మహారాష్ట్రలో హృదయ విదారక దృశ్యాలు వెలుగుచూశాయి. గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకాలో ఓ తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమారుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో తీవ్రమైన జ్వరంలో బాలురు మరణించారు. దీంతో ఆసుపత్రి నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న తమ గ్రామానికి మృతదేహాలను భుజాలను మోసుకెళ్లారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు మైనర్ బాలుర మృతదేహాలపే ఓ జంట వారి భుజాలపై మోసుకెళ్తూ బురదతో కూడిన అటవీ మార్గం గుండా వెళ్తున్న వీడియోను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.‘ఇద్దరు సోదరులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే వారికి సకాలంలో చికిత్స లభించలేదు. కొన్ని గంటల్లోనే వారి పరిస్థితి క్షీణించింది. గంటల వ్యవధిలో ఇద్దరు బాలురు మరణించారు. వారి మృతదేహాలను స్వగ్రామమైన పట్టిగావ్‌కు తరలించడానికి కూడా అంబులెన్స్ లేదు. తల్లిదండ్రులు వర్షంలో తడిసిన బురద మార్గం గుండా 15 కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. గడ్చిరోలి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క భయంకరమైన వాస్తవికత ఈ రోజు మళ్లీ తెరపైకి వచ్చింది.’అంటూ వాడెట్టివార్ విషాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.‘గడ్చిరోలి జిల్లాకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మారావు బాబా అత్రమ్ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తూ మహారాష్ట్ర ఎలా అభివృద్ధి చెందుతుందో వాదిస్తున్నారని కాని గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి గడ్చిరోలిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో, అక్కడ ఎలా మరణాలు సంభవిస్తున్నాయో తెలుసుకోవడం లేదు.’ అని మండిపడ్డారు.అయితే విదర్భ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోవది. సెప్టెంబరు 1న ఒక గర్భిణీ గిరిజన మహిళ తన ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించింది. స్థానిక ఆసుపత్రికి ఆమెను సమయానికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌ను రాకపోవడంతో నొప్పులతో తనువు చాలించింది. -
అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్ భార్యనే వేధించి..
అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ దారుణానికి పాల్పడ్డారు. బ్రెయిన్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భర్తను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణం నుంచి బాధితురాలు ప్రతి ఘటించడంతో నిందితులు ఆమె భర్తకు ధరించిన ఆక్సిజన్ మాస్క్ తొలగించారు. అందిన కాడికి డబ్బుల్ని దోచుకుని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను అతని భార్య చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రి ఖర్చులు భరించలేక మరుసటి రోజే అంబులెన్స్‌లో భర్తను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఓ అంబులెన్స్‌ను మాట్లాడుకుని ఇంటికి బయలు దేరారు బాధితురాలు, ఆమె తమ్ముడు. అర్ధరాత్రి కావడంతో మార్గం మధ్యలో అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించారు. ముందు క్యాబిన్లో కూర్చోమని, ఆపై వేధించారు. వేధింపులకు పాల్పడడం గుర్తించిన బాధితురాలి తమ్ముడు అడ్డుకోగా.. చివరగా ఛవానీ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై అంబులెన్స్‌ను ఆపారు. భర్తకు తగలించిన ఆక్సిజన్ మాస్క్‌ను తొలగించారు. బాధితుణ్ని బలవంతంగా కిందకు దించారు. అనంతరం డబ్బు, నగదుతో అక్కడి పరారయ్యారు.ఆక్సిజన్ మాస్క్ తొలగించడంతో అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ జితేంద్ర దుబే తెలిపారు -
అనగాని కోసం అంబులెన్సు ఆపిన పోలీసులు
-
AP: మంత్రి కాన్వాయ్ కోసం.. అంబులెన్స్‌ను ఆపేశారు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను పోలీసులు ఆపేశారు. మంత్రి కాన్వాయ్ వెళ్లే వరకు అంబులెన్స్‌ను వదలలేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి సత్య ప్రసాద్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. వారి వాహన శ్రేణి వెళ్లే క్రమంలో పందిమెట్ట జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాలు వెళ్లే వరకు చేయి అడ్డుపెట్టి అంబులెన్సును ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయించారు.టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్.. కళ్లు తిరిగి పడిపోయిన విద్యార్థులుమరోవైపు, నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తీరుతో ఆరుగురు విద్యార్థులు సొమ్ముసిల్లి పడిపోయారు. తాను ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా స్కూల్ విద్యార్థులను ఎమ్మెల్యే తీసుకురాగా, ఎండ తీవ్రతకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. విద్యార్థులను కావలి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా ఎమర్జెన్సీ వార్డు తలుపులను టీడీపీ నేతలు మూసేశారు. -
తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! కూతురు మరణం దిగమింగి మరీ వాయనాడ్..!
కేరళలో ప్రకృతి ప్రకోపానికి శవాల దిబ్బగా మారింది వాయనాడ్. కొండచరియలు వాయనాడ్ని తుడిచిపెట్టేశాయి. ఈ ఘటనలో మొత్తం 295 మంది మృతి చెందారు. వాయనాడ్ విషాదం ఎందరినో కదిలించింది. ప్రముఖులు, సెలబ్రెటీలు తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఈ ఘటనలో ఎన్నో కన్నీటి కథలు, వ్యథలు ఉన్నాయి. ఈ విషాద ఘటనలో ఒక మహిళ తమ వ్యక్తిగత బాధను పక్కన పెట్టి మరీ ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చి అందరిచేత ప్రశంసలందుకుంది. ఆమెనే దీపా జోసెఫ్. ఎవరంటే ఆమె..!కేరళలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ దీపా జోసెఫ్. దారుణ వినాశనాన్ని చవిచూసిన వాయనాడ్‌లో తన అంబులెన్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బాధితులు రక్షించి నిస్వార్థంగా సహాయ సహకారాలు అందించింది. తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్న వారికి తన వంతుగా సాయం అందించి ఆయా మృతదేహాలను వారికి చేరవేసింది. ఆ ఘటనలో బాధితుల మృతదేహాలను అందజేసేటప్పుడూ కొన్ని దృశ్యాలు మెలితిప్పేసేవని చెబుతోంది దీపా. ఒక్కోసారి తనకు కూడ కన్నీళ్లు ఆగేవి కావని చెబుతోంది. ఎవరంటే ఆమె..?కరోనా మహమ్మారి సమయంలో దీపా జోసెఫ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబ జీవనాధారం కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించింది. కేరళలో ఈ వృత్తిలో పనిచేస్తున్న తొలి మహిళ దీపానే కావడం విశేషం. సవాళ్లతో కూడిన ఈ వృత్తిలో చాలా ధైర్యంగా సాగిపోయింది దీపా. అయితే వ్యక్తిగత విషాదం కారణంగా తన వృత్తి నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. తన కన్న కూతురు బ్లడ్ కేన్సర్‌తో చనిపోవడంతో డిప్రెషన్‌కి వెళ్లిపోయింది దీపా. దీంతో విధులకు గత కొద్ది రోజులుగా దూరంగానే ఉండిపోయింది.వాయునాడ్ దుర్ఘటన గురించి విని మళ్లీ విధుల్లోకి వచ్చి బాధితులకు తన వంతుగా సాయం అందించింది. తన బాధను దిగమింగి ప్రజలకు నిస్వార్థంగా సాయం అందించింది. నిరంతరం రోడ్లపై ప్రజలకు అందుబాటులో ఉంటూ..సహాయ సహకారాలు అందించి అందరిచేత ప్రశంసలందుకుంది దీపా. కాగా, ఆమె నాటి విషాద దృశ్యాలను గుర్తు చేసుకుంటూ..బాగా కుళ్లిపోయిన మృతదేహాలను కూడా తరలించినట్లు తెలిపింది. కొన్ని ఘటనల్లో అయితే తెగిపోయిన అవయవాల ఆధారంగా తమ వాళ్లను గుర్తించాల్సిన పరిస్థితి చూసి తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది దీపా. ఈ అనుభవాలను తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, అదే తన బాధను పక్కన పెట్టి సాయం చేయాలనే దిశగా పురిగొల్పిందని అంటోంది దీపా. ప్రస్తుతం తానింకా విధుల్లోకి వెళ్లడం లేదు కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో అంబులెన్స్‌డ్రైవర్‌గా పనిచేస్తానని తెలిపింది. నిజంగా గ్రేట్ జీవనాధారం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వ్యక్తిగత విషాదంతో పనికి దూరమయ్యింది. కానీ ఆ బాధను కూడా పక్కనపెట్టి వాయనాడ్ విషాదంలోని బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం కూడా.(చదవండి: గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!) -
డైవింగ్ రాదు.. కానీ అంబులెన్స్ కొట్టేశాడు
-
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
-
మీ ఆరోగ్యానికి పూచీ మాది
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వైద్యుడైన మాజీ సీఎం వైఎస్సార్ ఆ విషయాన్ని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వ్యవస్థ 2014–19 మధ్య బాబు పాలనలో నిర్విర్యమైంది. తర్వాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్సార్ కన్నా మరో రెండడుగులు ముందుకు వేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్స్‌లు 768, ఎంఎంయూలు 936, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2,204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు. దేశంలో అగ్రస్థానంలో ఏపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సుమారు 25 కోట్లకుపైగా ప్రజలకు 988 అంబులెన్స్‌లు ఉన్నాయి. యూపీ కంటే ఐదు రెట్లు తక్కువ జనాభా ఉన్న ఏపీలో 768 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో తక్కువ సంఖ్యలో అంబులెన్స్‌లు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్ ఉంది. తెలంగాణలో 75,524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒకటి చొప్పున అంబులెన్స్‌లు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు సేవల విస్తరణ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్స్‌లు 336 లే ఉన్నాయి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. దీంతో సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్స్‌లు ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలు తీసుకొచ్చారు. దీంతో అంబులెన్స్‌ల సంఖ్య 748కు పెరిగింది. దీనికి రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్‌లో అదనంగా మరో 20 అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీనికి రూ.4.76 కోట్లు వెచి్చంచారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్‌ల సంఖ్య 768కి చేరింది. 2023లో 2.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన పాత వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచి్చస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు సగటున 3 వేలకు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్స్‌లు సేవల్లో ఉన్నాయి. 2020 జూలై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్స్‌లు కాపాడాయి. పల్లె చెంతకే వైద్యులు వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమం కింద 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాబు పాలనలో ఒక వాహనంలోనే ఆస్పత్రుల నుంచి ఇద్దరు, ముగ్గురు బాలింతలను ఇళ్లకు తరలించేవారు. ఈ ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏసీ వాహనంలో ఒక బాలింతను, ఆమె సహాయకులను మాత్రమే ఇంటి వరకూ సురక్షితంగా చేరుస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ. 499 మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రస్తుతం రూ.895 ఖర్చు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణులు ఈ సేవలను పొందారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పల్లె ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండుసార్లు పల్లెలకు 104 ఎంఎంయూలతో పాటు వెళుతున్నారు. అన్ని పల్లెలను నెలలో రెండుసార్లు సందర్శించేందుకు వీలుగా 936 ఎంఎంయూలను సమకూర్చారు. ఈ విధానంలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వైద్య సేవలను ప్రభుత్వం అందించింది. -
అంబులెన్స్ కి దారిచ్చిన సీఎం జగన్
-
గుంతలో పడిన అంబులెన్స్ : బతికొచ్చిన తాత
గతుకులు, గుంతల రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. కానీ అదే గుంత మనిషికి ప్రాణం పోసింది. నమ్మ శక్యంగా లేకపోయినా ఇది నిజం. హర్యానాలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుసుకుంది. అనారోగ్య కారణాలతో దర్శన్ సింగ్ బ్రార్ (80)చనిపోయాడు.అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో పాటియాలా నుండి కర్నాల్ సమీపంలోని అతని ఇంటికి తీసుకు వెళుతున్నారు. మరోవైపు అతని బంధువులు అంత్యక్రియలు అన్ని ఏర్పాట్లు చేసేవారు. కానీ విధి మరోలా ఉంది. ఉన్నట్టుండి అంబులెన్స్ గుంతలో పడింది. అదే మృతుడికి ప్రాణం పోసింది. అంబులెన్స్‌లో అతనితో పాటు ఉన్న మనవడు తన తాత చేయి కదలడం గమనించాడు. వెంటనే ఊపిరి పరక్షీంచగా గుండె కొట్టుకోవడంతో వెంటనే బ్రార్‌ను ఆసుపత్రికి తరలించాడు. అతడు బతికే ఉన్నట్లు అక్కడి వైద్యులుప్రకటించారు. కర్నాల్‌లోని ఎన్‌పి రావల్ ఆసుపత్రిలో క్రిటికల్ ICUలో చికిత్స పొందుతున్నాడు. నిజంగా ఇది అద్భుతం, దేవుడి దయ, ఆయన త్వరగా కోలుకోవాలంటూ బంధువులు కోరుకుంటున్నారు భూమ్మీద ఇంకా నూకలున్నాయి అంటూ సంతాపం తెలపడానికి వచ్చిన బంధువులంతా ఆ కుటుంబాన్ని అభినందించి వెళ్లారు. క్రిటికల్, కానీ శ్వాస ఉంది బాధితుడు శ్వాస తీసుకుంటున్నాడు. రక్తపోటుతో పాటు పల్స్ ఉన్నాయి, అయితే ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నందున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రావల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నేత్రపాల్ తెలిపారు.