ఆంబులెన్స్‌కి దారివ్వండి.. అధికారులతో సీఎం జగన్‌ | Let the ambulance go CM Jagan with the officials At Madanapalle | Sakshi
Sakshi News home page

ఆంబులెన్స్‌కి దారివ్వండి.. మదనపల్లె పర్యటనలో అధికారులతో సీఎం జగన్‌

Published Wed, Nov 30 2022 2:39 PM | Last Updated on Wed, Nov 30 2022 5:14 PM

Let the ambulance go CM Jagan with the officials At Madanapalle - Sakshi

సాక్షి, అన్నమయ్య జిల్లా: బుధవారం మదనపల్లె పర్యటనలో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మంచి గుణం ప్రదర్శించారు. పర్యటనలో భాగంగా వేదిక వద్దకు ఆయన చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్‌కు ఓ ఆంబులెన్స్‌ ఎదురొచ్చింది. 

అప్పటికే రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్‌సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అంతహడావుడిలోనూ ఓ ఆంబులెన్స్‌ రాకను గమనించిన సీఎం జగన్‌.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. 

దీంతో.. కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి  అంబులెన్సుకు దారిచ్చారు అధికారులు. ఆ సమయంలో ఆంబులెన్స్‌ నుంచి పేషెంట్‌ బంధువులు చేతులెత్తి సీఎం జగన్‌కు నమస్కరించారు.

ఇదీ చదవండి: మీ బిడ్డ.. ఈ వైఎస్‌ జగన్‌కు నిజాయితీ ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement