Madanapalle
-
మా ఎమ్మెల్యేకు నెలనెలా రూ.30 లక్షలు ఇవ్వాలట..
మదనపల్లె: ‘మా ఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి చెప్పుకున్న గోడు ఇది.తాను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించాలని ఆమె వారిని వేడుకున్నారు. అధికార పారీ్టకి చెందిన మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అక్కడి తహసీల్దార్ నేరుగా ముఖ్యమంత్రినే కలిసి ఆరోపించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. పాలనా వ్యవహారాల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అరాచకం ఈ సంఘటనకు అద్దంపడుతోంది. తన ఫిర్యాదులో తహసీల్దార్ ఖాజాబీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు..‘ఆయన చెప్పిన పనులు వీలుకాక పోయినా చేసి తీరాల్సిందేనంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రతీపని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు. మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నంబర్లు 718/8ఎ, 774/3, 510/1ఏ/2, వెంకప్పకోట సర్వే నంబర్.71/2కు సంబంధించి రెవెన్యూ చట్టం ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్ చేశానని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెదిరిస్తూ, నన్ను ఆఫీసుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్ 965/5, 595లో 1.80 ఎకరాల్లో లేఔట్ వేసి రెండు సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలన్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు సెంట్లు ఇచ్చే అవకాశంలేదని చెబితే వినిపించుకోలేదు.ల్యాండ్ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవలు ఎమ్మెల్యేకు చెప్పకుండా చేయరాదని హుకుం జారీచేశారు. అలాగే, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అస్లాం బాషాను ఎమ్మెల్యే తన చెప్పుచేతల్లో ఉంచుకుని, రికార్డులను సబ్ కలెక్టరేట్, కలెక్టరేట్‌కు పంపకుండా, పాలనాపరమైన పనులు జరగనీయకుండా అడ్డుకుంటూ, మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్నారు. పైగా.. టీడీపీ అనుకూల పత్రికలో నాపై అసత్యాలు ప్రచారం చేయించారు’.. అంటూ ఆమె సీఎం, లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. -
AP: ధర్మవరం సీఐ తల్లి కిడ్నాప్
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సీఐ తల్లికే దిక్కులేకపోతే? సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. -
ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దీనిపై వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ప్రమాదమా? అనేది తేల్చలేదని ఏపీ రెవెన్యూ సరీ్వసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై నేటికీ సీఐడీ విచారణ కొనసాగుతోందని... ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో వాస్తవాలు ఇంకా నిరా్ధరణ కాలేదు.ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనికిరాని కాగితాలను తీసివేస్తే.. వెంటనే ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగలపెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే మీడియా ప్రసారం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పనిచేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.తహసీల్దార్ కార్యాలయాల్లో రోజువారీ ఖర్చులకు కూడా నిధుల్లేవు. ప్రభుత్వం ఆదేశాలిస్తుంది గానీ నిధులివ్వట్లేదు’ అని అన్నారు. ‘ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో అద్దె వాహనాలకు కూడా నిధులు లేవు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితరాలకు నిధులివ్వకపోవడంతో.. సిబ్బంది జీతాల నుంచే ఖర్చు పెడుతున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శిగా రామిశెట్టి వెంకట రాజేశ్‌ను ఎన్నుకున్నట్లు చెప్పారు. -
ఒకటా రెండా?.. కాల్చుకు తింటోంది!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.ఒక్క సివిల్ సర్వీసు అధికారులే కాకుండా గ్రూప్–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపులకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో ప్రకటన చేయించింది.ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతోపాటు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కిందిస్థాయి ఉద్యోగులు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవరానికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజమహేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికారులు, ఉద్యోగులను అనుమానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేకపోయింది.ముద్ర వేసి ఇబ్బందులు..ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులపై పార్టీ ముద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. -
ఆధారాలుంటే చూపండి.. నిరూపించండి
సాక్షి, హైదరాబాద్: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో తన ప్రమేయం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, సీబీఐ సహా ఎవరితో దర్యాప్తు జరిపినా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచి్చన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఎదుర్కొంటున్నందునే తనను టార్గెట్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తానెలాంటి తప్పు చేయకపోయినా, కుట్రలతో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. వారి అనుకూల పత్రికల్లో తనపై దు్రష్పచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం నుంచి మంత్రుల వరకు ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నారని, ఏ ఆధారాల్లేకపోయినా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచి్చన హామీలను అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటున్నారని, సూపర్ సిక్స్ గురించి కూడా బాబు మాట్లాడటంలేదంటూ దెప్పిపొడిచారు. నాపేరు చెప్పించే కుట్ర మదనపల్లెలో తగలబడ్డాయని చెబుతున్న రికార్డులు ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీస్‌తో పాటు సచివాలయంలో కూడా ఉంటాయని చెప్పారు. ఆ రికార్డులన్నింటి డేటా రిట్రీవ్ చేశామని చెబుతున్నారని, ఇక ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాతా చాలా మందిని హత్య చేశారని, చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయని, ఆ కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు స్పందించడంలేదని ప్రశి్నంచారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరగ్గానే ఏదో పెద్ద విపత్తు సంభవించినట్లు ఏకంగా డీజీపీని హెలికాప్టర్లో పంపారని గుర్తు చేశారు. -
ఆధారాలుంటే నిరూపించండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్
సాక్షి, చిత్తూరు జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని.. కావాలనే తమ పార్టీ నేతలపై అవాస్తవాలు రాయిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని తేల్చి చెప్పారు.‘‘చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు వ్యతిరేకంగా పనిచేశారు. మదనపల్లెలో రికార్డులు తగలపడితే మాపై నిందలు వేస్తున్నారు. కార్యకర్తలతో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఆధారాలు ఉంటే నిరూపించండి. తప్పుడు ఆరోపణలు చేసి అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మా కుటుంబం పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. మా ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచాం. కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారు’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు.టీడీపీ కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. రికార్డులు కాలిపోయాయని డీజీపీ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాంతో కుట్రలు చేస్తున్నారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల హామీలు నెరవేర్చాలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటే చంద్రబాబు భయపడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా క్యారక్టర్ దెబ్బ తీసేవిధంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు‘‘ అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్.. అగ్నిప్రమాదం కేసుకు రాజకీయ రంగు
సాక్షి, అన్నమ్మయ్య జిల్లా: మదనపల్లె అగ్నిప్రమాదం కేసులో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా విచారణ పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె అగ్నిప్రమాదం కేసు పేరుతో విచారణ చేపట్టారు.అగ్నిప్రమాదం కేసు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అగ్ని ప్రమాదం కేసుకి ఒక్క పూటలోనే రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్‌గా కేసును మలిచారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజకీయ కోణంలోనే పోలీసుల విచారణ చేస్తున్నారు. రికార్డులు కాలితే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కారణమంటూ విచారణ చేస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులందరినీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు.మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ పోలీసు బలగాలతో విచారణ చేస్తున్నారు. ముందు 982 ఎకరాల ఫైళ్లు దగ్ధమంటూ హడావుడి చేసిన పోలీసులు.. తీరా ఆ 982 ఎకరాల పుంగనూరు రికార్డులు సెటిల్ మెంట్ ఆఫీసర్ దగ్గరే ఉన్నట్టు విచారణలో తేలింది. తాజాగా 22ఏ రికార్డుల దగ్ధమంటూ అడ్డగోలు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష సాధింపుకి ఫైళ్ల దగ్ధం కేసును వాడుకుంటున్న అధికార పార్టీ.. సహేతుకమైన ఫిర్యాదు లేకుండా ఇష్టానుసారంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు వేధింపులకు దిగుతున్నారు. -
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం
సాక్షి రాయచోటి/బి.కొత్తకోట/మదనపల్లె/సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం అర్థరాత్రి అగి్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఓ ఛాంబర్ కుడివైపు సెక్షన్లు పూర్తిగా.. ఎడమవైపు సెక్షన్లు కొంతమేర దగ్థమయ్యాయి. అలాగే, వీటికి ఎదురుగా ఉన్న విభాగాలూ మొత్తం కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు దగ్థమయ్యాయి. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నపళంగా హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిపిన తనిఖీల్లో ఏపీఎస్పీడీసీఎల్, ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు విద్యుత్ సరఫరా వైర్లు, మీటరు, ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా వైరింగ్ కొన్నిచోట్ల కాలిపోయినట్లు గుర్తించారు. అలాగే, సీఐడీ, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగం, పోలీసు అధికారులూ విచారణ జరిపారు. ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారులు, తహశీల్దార్లు, ఉద్యోగులనూ విచారించారు. అంతేకాక.. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టిపెట్టారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి డాగ్‌స్కా్వడ్‌లు.. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఫోరెన్సిక్ విభాగం నిపుణులను రప్పించారు.అధికారుల హడావుడితో హైటెన్షన్.. అంతకుముందు.. సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇక అగి్నప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవడం.. ఎక్కడలేని హడావుడి నెలకొనడంతో సబ్‌కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరితో ఏం మాటా్లడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.అవసరమైతే కేసు సీఐడీకి బదిలీ: డీజీపీ అనంతరం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. అగి్నప్రమాదంపై వీఆర్ఏ డీటీకి తెలపడం, ఆమె ఆర్డీఓకి చెప్పడం.. ఆయన ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపుచేశారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి సీఐడీకి కేసు బదిలీచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖలోని 25 అంశాలకు చెందిన రన్నింగ్ ఫైల్స్ దగ్థమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. అలాగే, దగ్థమైన రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. -
మదనపల్లెలో గ్యాంగ్ వార్
భార్య, కుమార్తె చంపవద్దంటూ కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా. కనికరం లేని కిరాతకులు వారి కళ్లెదుటే హతమార్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. వర్గాల ఆధిపత్య పోరుకు ప్రత్యర్థులు కలబడి బహుజన భీమ్‌సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రిని కిరాతకంగా నరికి చంపేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు.మదనపల్లె : ఆధిపత్య పోరులో ప్రత్యర్థుల చేతిలో ఒకరు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని 2వ వార్డు మంజునాథ కాలనీ జగనన్న లే అవుట్లో బహుజన భీమ్‌సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రి(35) నివసిస్తున్నాడు. శేషాద్రి లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో కలకత్తాకు చెందిన కమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రెడ్డి మహేశ్వరి ఉంది. కమలకు తెలుగు సరిగా రాదు. రాత్రి 11 గంటల సమయంలో గొల్లపల్లె దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్, అతడి అనుచరులు చరణ్, మణికంఠ, చెన్నారెడ్డి, కొందరు లావాదేవీల విషయమై చర్చించాలని మిద్దె పైకి తీసుకెళ్లారు. మాటా మాటా పెరిగి వివాదం తలెత్తడంతో శేషాద్రిపైనా కత్తులతో దాడికి పాల్పడ్డారు. చేతి వేళ్లు అడ్డుగా పెట్టడంతో తెగి కిందపడ్డాయి. ప్రాణ భయంతో శేషాద్రి వారి నుంచి తప్పించుకుని మిద్దైపెనుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దుండగులు తలుపులు పగల గొట్టి బెడ్ రూమ్‌లో దాక్కున్న శేషాద్రిని హాల్ లోకి లాక్కొచ్చారు. తన భర్తను చంపవద్దని శేషాద్రి భార్య కమల, కూతురు రెడ్డిమహేశ్వరి వేడుకుంటున్నా.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారి కళ్లెదుటే శేషాద్రిని విచక్షణా రహితంగా నరికి చంపారు. భర్తను కళ్లముందే చంపేయడంతో కమల షాక్‌కు గురైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకుని రోదిస్తూ పోలీసులకు హిందీలో వివరించడం కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐలు వలీబాషా, యువరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కొండుపల్లె ఆనంద్, చరణ్, మణికంఠ, చెన్నారెడ్డిలతో పాటు ఆరుగురిపై ప్రాథమికంగా హత్యకేసు నమోదుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆధిపత్య పోరులో భాగంగానే శేషాద్రి హత్య జరిగిందని, ఇందులో రాజకీయకోణం లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల అదుపులో నలుగురు?హత్యకు కుట్రదారుగా భావిస్తున్న కొండుపల్లె ఆనంద్ 2014, 2020లో జరిగిన రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. శేషాద్రి హత్యకేసులో దోషులు ఎంతమంది పాల్గొన్నారనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. శనివారం ఉదయం శేషాద్రి ఇంటికి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం వెళ్లి ఆధారాలు సేకరించారు. అయితే హత్యచేసిన తర్వాత నలుగురు నిందితులు నేరుగా టూటౌన్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో వినియోగించిన ఏపీ–04ఏఎఫ్–5733 నెంబర్ ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు.ఆధిపత్యం కోసమే హత్యపుంగనూరు శేషాద్రి, కొండుపల్లె ఆనంద్ ప్రజా సంఘాల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. కొండుపల్లె ఆనంద్ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషాద్రి చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట శేషాద్రి మదనపల్లె ఎమ్మెల్యేకు పీఏ తానేనని చెబుతూ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసినట్లు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అతడిపై 420 కేసు నమోదైంది. అనంతరం శేషాద్రి తన మకాం మంజునాథ కాలనీకి మార్చాడు. ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆనంద్‌కు పోటీగా బహుజన భీమ్ సేనను స్థాపించి కాలనీలో పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామారావు కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో ఆనంద్, శేషాద్రి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు చంపేస్తామని బెదిరించుకోవడం, గొడవలు పడడం, సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శించుకోవడం, పోలీస్ స్టేషన్లో రాజీప్రయత్నాలు జరగడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో శేషాద్రిని ముట్టుబెట్టేందుకు ఆనంద్ వర్గం పథకం వేసింది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని, శుక్రవారం రాత్రి శేషాద్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆనంద్ వర్గీయుల చేతిలో అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. -
డబుల్ సెంచరీ గ్యారంటీ..జగన్ పిలుపు..
-
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ సెంచురీకి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన... వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు నెగ్గాలని పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం జగన్ మాస్ ర్యాగింగ్...దద్దరిల్లిన మదనపల్లె
-
పెన్షన్లు ఆపింది చంద్రబాబే: సీఎం జగన్
అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచి వచ్చే పశుపతి లాగా అధికారం కోసం ఐదేళ్ల తర్వాత ‘పసుపు’పతి చంద్రబాబు వస్తున్నాడు. వదల బొమ్మాళి వదలా.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్నాడు. కుర్చీ కోసం ఈ ‘పసుపు’పతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతాడు. పొరపాటున నమ్మారంటే సంక్షేమాభివృద్ధికి వ్యతిరేకంగా ఓటేసినట్లే. ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లే. కుట్రలు, కుతంత్రాలతో జెండాలతో జత కట్టిన తోడేళ్లు ఒక్కటై వస్తున్నాయి. మోసపోకూడదని ఇంటింటా చెప్పాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, కడప : ‘చంద్రబాబుకు పేదలంటే గిట్టదు. వారికి మేలు చేస్తున్న మన వలంటీర్ల వ్యవస్థ అంటే అసలే గిట్టదు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై ఏడుపే. ఈ ఏడుపులో భాగంగా మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛన్ ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. ఈ పెన్షన్ డబ్బులు అందితే తప్ప జీవితాలు గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇచ్చిపోతున్న వలంటీర్లపై తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించాడు. వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. జగన్‌ను నేరుగా దెబ్బ కొట్టలేక ముసలి వాళ్లపై కక్ష తీర్చుకుంటున్నారు. ఇలాంటి మనిషిని ఏమనాలి?’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 6వ రోజు మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నానన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు, వికలాంగులకు తోడుగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి.. ఏకంగా ఆ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఈ పెద్దమనిషి గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఇలానే వ్యతిరేకించాడని, పేద పిల్లలకు ట్యాబులిస్తుంటే కూడా వ్యతిరేకించారని చెప్పారు. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించిన చంద్రబాబుది పెత్తందారీ భావజాలం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి పెత్తందార్లకు, ఇలాంటి పేదల వ్యతిరేకులకు పొరపాటున ఓటు వేస్తే.. తమ పెన్షన్లు, తమకు అందే స్కీములు, ఇంటింటికీ వచ్చి సేవలందించే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు మనమే గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుందని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మెరిట్ విద్యార్థి పరీక్షలకు భయపడతాడా? ► ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా విడివిడిగా రాలేకపోతున్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు.అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ఇంత మంచి జరిగింది కాబట్టే మీ జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టాడు. అందుకే ఈరోజున ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరూ కుట్రలు, కుతంత్రాలతో ఏకమవుతున్నారు. ► ఇంత మంది జతకట్టి వచ్చినా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటువైపు గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్.. పరీక్ష పాసవుతాడా? ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు, ఆయన కూటమి నిలబడగలుగుతుందా? ► విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా మన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లు, పేద వర్గాలు భయపడరు. పైగా పెత్తందారులతో సమరానికి మేమంతా సిద్ధం.. అని చెబుతున్నారు. ► ‘175 అసెంబ్లీ స్థానాలకు 175, 25 ఎంపీ సీట్లుకు 25 మొత్తం రెండు వందల సీట్లు.. ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా.. మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందార్లను ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలి వచ్చిన సమరయోధుల సముద్రంలా మదనపల్లె కనిపిస్తోంది. టీడీపీకి ఓటు వేసిన వారికీ మంచి చేశాం ► ఈ ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో 75 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారున్నారు. నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద, ట్యాబులు, విద్యా కానుక లాంటివి కలుపుకొంటే అది రూ.లక్ష కోట్లు అదనం. మొత్తంగా రూ.3.70 లక్షల కోట్ల పైచిలుకు పంపించాం. ఇదీ మన ట్రాక్ రికార్డు. ► చంద్రబాబు పేరు చెబితే.. ఆయన చేసిన ఏ మంచీ గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు, ఇంటికే వచ్చి పింఛన్ ఇచ్చే, ఇతర సేవలు అందించే వలంటీర్లు, విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, ట్యాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు.. ఇంగ్లిష్ మీడియం, ట్యాబులు, డిజిటల్ బోధన, ఆర్బీకేలు, రైతన్నలకు సున్నా వడ్డీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్‌న్‌పుట్ సబ్సిడీ గుర్తుకొస్తాయి. ► 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చాం. మనం వచ్చేటప్పటికి 4 లక్షల ఉద్యోగాలుంటే, ఏకంగా మరో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మీ జగనే. ఇందులో 80 శాతం ఉద్యోగాలు నేను నా.. నా.. నా.. నా.. అని పిలుచుకునే వర్గాల వారే ఉన్నారు. ► అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఈ పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మహిళా సాధికారత, దిశ యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ఉందంటే.. గుర్తుకొచ్చేది మీ జగనే. 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. ► కొత్తగా 4 సీ పోర్టులు కడుతున్నాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఎయిర్ పోర్టులు, వాటి విస్తరణ వేగంగా జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ ఎవరూ వినని కంపెనీలు ఈరోజు రాష్ట్రంలోకి అడుగులు వేస్తున్నాయి. నిజమైన సామాజిక న్యాయానికి జైకొడదాం ► నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి. రాబోయే రోజుల్లో పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? ప్రజలకు మంచి చేసిన ఫ్యాను.. మీ ఇంట్లోనే ఉంటుంది. అంటే అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీని గటగటా తాగేసి తన వారిని తాకట్టుపెట్టిన గ్లాసు సింక్‌లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ► ఆ పొత్తుల, ఎత్తుల, జిత్తుల ముఠా ఎన్ని చేసినా, ఏమిచెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒక్కటే. మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. మన భవిష్యత్తు, మన తల రాతలు ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మళ్లీ అన్నను తెచ్చుకుందాం.. అన్నే రావాలి. ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగు పడటానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడటానికి, మళ్లీ అన్నే రావాలని ప్రతి ఒక్కరికీ, ప్రతి గడపకూ వెళ్లి చెప్పండి. పేదల రక్తం పీల్చే పసుపుపతి చంద్రబాబు ► మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు నారా చంద్రబాబునాయుడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్న ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి పొత్తులు పెట్టుకున్నాడు. ఈ మూడు పార్టీలూ కలిసి ఇంటింటికీ ముఖ్యమైన హామీలు అంటూ పాంప్లెట్ పంపించారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోడీ ఫొటోలు.. కింద చంద్రబాబు నాయుడు సంతకంతో ఈ పాంప్లేట్ (చూపిస్తూ) పంపించాడు. ► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్ టైజ్మెంట్లతో హోరెత్తించారు. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. రూ.87,612 కోట్లు రుణ మాఫీ చేశాడా? పొదుపు సంఘాల డ్వాక్రా రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశాడా? ఇంటింటికీ ఉద్యోగం.. లేదా నెలనెలా రూ.2 వేల నిరుద్యోగభృతి ఇస్తామ న్నాడు. ఐదేళ్లు.. అంటే 60 నెలలకు నెలకు రూ.2000 చొప్పున లెక్కిస్తే.. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చారా? అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు.. చేశాడా? ► మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా? రాష్ట్రాన్ని సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మన మదనపల్లెలో ఏమన్నా కనిపించిందా? ఇలా 650 హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మోసం. అవే పొత్తులు. ఇప్పుడు సూపర్ సిక్సు, సూపర్ సెవెన్ అంటూ మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తామంటున్నారు. ► గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా వద్దా? పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని ఏకంగా కోర్టుకు వెళ్లి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టాలా.. వద్దా? ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడుదాం. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను.. కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుడదామని కోరుతున్నా. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌తో, మైనార్టీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న ఈ చంద్రబాబుకు, కూటమికి ఈసారి ఎన్నికల్లో 30 చెరువుల నీళ్లు తాగించండి. మన అభ్యర్థులకు దీవెనలు అందించండి మన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్న అభ్యర్థులపై మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలి. రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, రైల్వేకోడూరు నుంచి కొరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట నుంచి అమర్నాథ్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ద్వారకనాథ్‌రెడ్డి, మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్, పీలేరు నుంచి రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను గెలిపించాలి. మన గుర్తు ఫ్యాను అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ తిప్పికొట్టాలి. రెండు బటన్లు నొక్కాలి.. ► పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి ఆగకూడదంటే, మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికే రావాలి అంటే బాబు లాంటి సైంధవులు ఎప్పటికీ అడ్డు పడే అవకాశం ఇవ్వకూడదు. అది జరగాలి అంటే ప్రతి పేదవాడు మరో 40 రోజుల్లో రెండు బటన్లు నొక్కాలి. ఆ పేదవాళ్ల కోసం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు. ఆ పేదవాళ్లందరూ, అక్కచెల్లెమ్మలందరూ ఏకమై కేవలం రెండే రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. అప్పుడు ఈ వదల బొమ్మాళీ ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. ► జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే, జరుగుతున్న ఈ మంచి అంతా మళ్లీ కొనసాగుతుంది. మళ్లీ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి నేరుగా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటానని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఎన్నికల సంగ్రామంలో అబద్ధాన్ని, మోసాన్ని మట్టి కరిపించడానికి నేను సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమా.. (సిద్ధమే అని కేకలు). అలాగైతే సెల్ ఫోన్లు బయటకు తీసి.. టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి పైకి ఎత్తి చూపించారు). ► ఓటు అడిగే నైతికత ఇంటింటికీ మంచి చేసిన మనకు మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని.. ఒక బైబిల్, ఖురాన్న్, భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాకే ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం. ఈ 58 నెలల్లో ఇంటింటికీ మేలు జరిగి ఉంటే మీ జగన్‌కు, మీ బిడ్డకు, మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తోడుగా నిలవాలి. -
మేమంతా సిద్ధం: సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన మదనపల్లె సభ (ఫొటోలు)
-
పేదల రక్తం పీల్చే పసుపుపతిని ఎవరూ నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా : అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు బయటకొచ్చారని మండిపడ్డారు. పసుపుపతి అయిదేళ్ల తరువాత వచ్చి వదల బొమ్మాళి అంటున్నారని దుయ్యబట్టారు. కుర్చీ కోసం పసుపుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆరో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్‌ను జనం నీరాజనాలు పలికారు. మంగళవారం మదనపల్లె బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 2014లో ఈ పసుపుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని ప్రస్తావించారు. ముగ్గురి ఫొటోలతో ఉన్న హామీల పత్రాలను ఇంటింటికి పంపించారని, ఆ హామీలను ఒక్కటేనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి ఇదే డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. 2014 కంటే ఎక్కువ హామీలంటూ మరో డ్రామాకు తెరతీస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పసుపుపతిని ఎవరైనా నమ్ముతారా అని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాన్ చేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోక కత్తిరించాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేక.. కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. పేదలకు, పెత్తందారులకు కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు. జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. మోసాలే అలవాట్లుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వారితో ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నాం. గత హామీలు నెరవేర్చారా? గతంలో చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కిందరూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే.. నిరుగ్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తానన్నాడు. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు. నిర్మించాడా? 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రజలంతా కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించాలి జగన్ పేరు చెప్తేనే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకొస్తాయి జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి రూ. 2లక్షల 70 వేల కోట్ల పేదల ఖాతాల్లో జమ చేశాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తు రాదు. లంచాలు, వివక్షలేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన. రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్ పాలన. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 31 లక్షలపైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేంది.. మీ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తు కొచ్చేది.. మీ జగన్ దిశ యాప్ అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు పేదలంటే చంద్రబాబుకు కక్ష తన మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి అవ్వతాతలకు పెన్షన్రాకుండా చేయించాడు. పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదని తన మనుషులతో పిటిషన్ వేయించాడు. నిమ్మగడ్డ రమేష్‌తో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పేదలకు అన్యాయం చేశారు. బాబుకు ఓటు వేస్తే పెన్షన్, పథకాలను అందించిన వలంటీర్ల రద్దకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. బాబు గెలిస్తే పెన్షన్లు, పథకాలు, వాలంటరీర్ వ్యవస్థను రద్దు చేస్తాడు. మీ పెన్షన్ మీ ఇంటికి రావాలంటే బాబులాంటి సైంధవులు రాకూడదు. వృద్ధులకు, వికలాంగులకు మంచి చేస్తున్న వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు రద్దుచేయాలన్నారు. -
ఈ సారి డబుల్ సెంచరీకి మీరు సిద్ధమా: వైఎస్ జగన్
-
99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’ అంటూ మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు మదనపల్లెలో కనిపిస్తున్న ప్రజాభిమానం.. జనసముద్రంలా తలపిస్తోందన్నారు సీఎం జగన్. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలివచ్చిన సమరయోధుల సముద్రంలా కనిపిస్తుందని తెలిపారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో ఆరు వారాల్లో జరగబోయే కురుసంగ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో గొప్ప విజయం కళ్ల ఎదుటే కనిపిస్తుందన్నారు. మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరోరోజు దిగ్విజయంగా సాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. ‘మేమంతా సిద్ధం’లో భాగంగా మదనపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని.. 99 శాతం వాగ్దానాలు నెరవేర్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు వారికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు ఇంటింటికి మంచి చేశామని, ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతన్నామని తెలిపారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నారని ప్రతిపక్ష కూటమిని ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికీ లేదని దుయ్యబట్టారు. ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడాలని అన్నారు. 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా? ‘ఇంతమంది జతకట్టి వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?. అటు వైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారు ఉన్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా. మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా?. 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా. విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడటం లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు. -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ దద్దరిల్లిన మదనపల్లె సభ
-
సీఎం జగన్ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు..!
-
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జనగర్జన
-
Watch Live: మదనపల్లె మేమంతా సిద్ధం సభ
-
అన్నమయ్య జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లి-బెంగుళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఐదుగురి మృతి చెందారు. మదనపల్లి మండలం బార్లపల్లి వద్ద ఘటన జరిగింది. -
బిల్డప్ బాబాయ్ అసలు గుట్టు బట్టబయలు
మదనపల్లె: మదనపల్లె టీడీపీ రేసులో ఉన్న బిల్డప్ బాబాయ్ కోడికొళ్ల అమరనాథ్ అసలు గుట్టు బయటపడింది. అతని ప్రధాన అనుచరుడు రాయల్ గణి మీడియా సమావేశం పెట్టి అతని చిట్టా బయటపెట్టాడు. అరచేతిలో స్వర్గం చూపించే రకం అమర్నాథ్.. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబునే మించిపోయి నియోజకవర్గ ప్రజలను మోసగించేందుకు పలు గిమ్మిక్కులకు పాల్పడ్డాడు. వీటన్నింటిని అతని అనుచరుడు రాయల్ గణి మంగళవారం మీడియాకు వెల్లడించాడు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం రంగసముద్రానికి చెందిన వ్యక్తి కోడికళ్ల అమరనాథ్ గతంలో రైతుల నుంచి చీనీ, మామిడి, వేరుశెనగ కొనుగోలు వ్యాపారం చేసేవాడు. రైతులకు డబ్బులివ్వకుండా మోసం చేయడంతో మదనపల్లెతో పాటు కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పలు స్టేషన్లలో అతనిపై 420, చెక్‌బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మదనపల్లె వన్‌టౌన్‌లో కేసు నమోదయ్యాక బెంగళూరు పారిపోయి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పుడు బెంగళూరు నుంచి అద్దె గన్మెన్లు, బౌన్సర్లను వెంటేసుకుని హఠాత్తుగా మదనపల్లెలో ప్రత్యక్షమయ్యాడు. పట్టణానికి చెందిన రాయల్ గణిని వెంటేసుకుని టీడీపీ నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆదికేశవులునాయుడు కుటుంబానికి సన్నిహితుడినని, బలిజ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని టీడీపీ ముఖ్యనాయకుల్ని కలిసి అభ్యర్థించాడు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాడు. బాబు సీఎం కావాలని 10 వేల మంది ముస్లింలకు అజ్మీర్ యాత్ర చేయిస్తున్నానని, దానికి రూ.కోటి చెక్కు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. 20 వేల మంది హిందువులను కాశీయాత్రకు సొంత ఖర్చులతో పంపుతానని, పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చాడు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి సీతారామ లక్ష్మణ పంచలోహ విగ్రహాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేశాడు. ఇటీవల పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతున్నట్లు నటించి, ఫొటోలు తీయించుకుని, బాబుకు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకున్నాడు. అయితే రాయల్గణితో అతనికి తేడా రావడంతో మీడియా ముందు అతని శిష్యుడే అక్రమాల్ని వెల్లడించాడు. అమర్నాథ్ పెద్ద మోసగాడని, ఆదికేశవులునాయుడు కుటుంబానికి, అతనికి ఏమీ సంబంధం లేదని గణి తెలిపాడు. అంబానీ, అదానీ, అమిత్‌షాతో తనకు వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని, అతడిపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని వెల్లడించాడు. అజ్మీర్ యాత్ర పేరుతో రూ.కోటి చెక్కు డ్రామా అని తెలిపాడు. అతని విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదీ చదవండి: టీడీపీ ‘ఐ’ గేమ్..! -
విపరీతంగా పెరిగిపోతూ డబుల్ సెంచరీ కొట్టిన టమాట
-
టీడీపీ కార్యాలయంలో జై జగన్ అంటూ నినాదాలు..
చిత్తూరు జిల్లా: టీడీపీలో ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నాయకులు ఏకంగా పార్టీ కార్యాలయంలోనే చంద్రబాబు వైఖరిపై విమర్శలు కురిపించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టీడీపీ కార్యాలయంలో చంద్రబాబును బూతులు తిడుతూ టీడీపీ నేత విద్యాసాగర్ ఆగ్రహావేశం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. టీడీపీ నేత విద్యాసాగర్.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ సందర్భంగా వ్యగ్యాంస్త్రాలు సంధించారు. వయసైపోయాక బాబుకి వేపకాయంత వెర్రి వచ్చిందని మాట్లాడారు. బస్టాండ్‌లో టీడీపీ జెండా తగులబెడతానని అన్నారు. జగన్ మాకేమీ ద్రోహం చేయలేదు.. జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోకు సంబంధించిన ఘటన కొన్ని రోజుల క్రితం జరగగా.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: పార్లమెంట్ సాక్షిగా బయటికొచ్చిన వాస్తవాలు