
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్‌లో ఆదివారం మ«ధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్ అక్కడినుంచి రోడ్డు మార్గాన సత్సంగ్ ఆశ్రమానికి చేరుకుంటారు. (చదవండి: దాడుల పాపం టీడీపీదే..)
అక్కడ జరిగే శంకుస్థాపన, భారత్ యోగా విద్యా కేంద్ర ‘యోగా కేంద్రం’ ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్సంగ్ విద్యాలయంలో మొక్కలు నాటుతారు. అనంతరం సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు. తదుపరి విద్యార్థులు, టీచర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడ్నుంచీ హెలికాప్టర్‌లో బెంగళూరుకు తిరుగు పయనమవుతారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతి కోవింద్‌తో కలసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదనపల్లె బీటీ కళాశాలలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం గన్నవరానికి తిరుగుపయనమవుతారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ)