president ramnath kovind
-
మహాత్మ గాంధీకి నివాళులర్పించిన రామ్ నాథ్ కోవింద్
-
నీట్‌పై రగడ.. మరోసారి హీటెక్కిన తమిళ రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులో నీట్(National Entrance-cum-Eligibility Test or NEET)పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఆమోదించాలని గురువారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. మరోవైపు.. ‘‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్.. కేంద్ర హోంశాఖకు పంపారు. కానీ, రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరిస్తారు’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అన్నారు. కాగా, నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలంలోని తన ఇంట్లో 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కూడా చదవండి: రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంటే కళ్లు మూసుకోం.. తమిళనాడు గవర్నర్ తీరు, కేంద్రంపై ఆగ్రహం -
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
‘పద్మ’ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, పంజాబీ జానపద గాయకుడు గుర్మీత్ బావా (మరణానంతరం), టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరుగనుంది. ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. -
విశాఖకు సీఎం జగన్
-
సీఎం జగన్ విశాఖ టూర్ కి సర్వం సిద్ధం
-
అట్టడుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. మొత్తం రైతుల్లో 80 శాతం ఉన్న సన్నకారు రైతుల అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం, రికార్డు స్థాయిలో పంటల సేకరణ, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలు మన సమష్టి విజయాలని చెప్పారు. దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు ఇవి చోదక శక్తిగా పని చేస్తాయని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు ఘనతలను ప్రస్తావించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. గోవా విముక్తి పోరాట యోధుల స్మారకం నిర్మాణం, అఫ్గానిస్తాన్ నుంచి గురుగ్రంథ సాహిబ్ స్వరూపాలను వెనక్కి తీసుకురావడం, భారత్‌లో రైతాంగం సాధికారత కోసం సర్కారు కృషి వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా 2020–21లో రక్షణ రంగం ఆధునీకరణకు 87 శాతం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 209 రకాల రక్షణ పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్గా భావించాలని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులు నిరుపమాన సేవలందించారని కొనియాడారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే 150 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ప్రజలకు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు టీకా మొదటి డోసు, 70 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. 15–18 ఏళ్ల కేటగిరీకి కరోనా టీకా ఇస్తున్నట్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని గుర్తుచేశారు. అతిపెద్ద ఆహార పంపిణీ పథకం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 19 నెలల్లో 80 కోట్ల మంది లబ్ధి పొందారని, దీని కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకమని వివరించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ను తెరపైకి తెచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పెదవి విరిచారు. చైనా, పాకిస్తాన్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ, నాగాలాండ్‌లో పౌరుల ఊచకోతపై ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే 2021–22 నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకముందు తొలుత సభ ప్రారంభం కాగానే చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మహేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీలు జయంత రాయ్, దేబేంద్రనాథ్ బర్మన్, ఎం.మోజెస్, గణేశ్వర్ కుసుమ్, కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పార్లమెంట్ 255వ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల జాబితాను సెక్రెటరీ జనరల్ రాజ్యసభకు సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. సభా హక్కుల ఉల్లంఘన... పెగాసస్ స్పైవేర్ సమస్యపై గత ఏడాది పార్లమెంట్లో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం సోమవారం నోటీసు సమర్పించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఆధారంగా నోటీసును సమర్పించినట్లు తెలిపారు. స త్యాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందన్న ఆధారాలు బహిర్గతం అయ్యాయన్నారు. పెగాసస్‌పై ప్రత్యేక చర్చ అక్కర్లేదు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కోరుకుంటే ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అక్కర్లేదన్నారు. -
బాబూరామ్‌కు అశోక చక్ర
న్యూఢిల్లీ: జమ్ము, కాశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి బాబూరామ్ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణిక్‌కు రాష్ట్రపతి కోవింద్ అవార్డును అందజేశారు. 2020 ఆగస్టులో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ బాబూరామ్ అమరుడయ్యారు. ఆరోజు ఆయన చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులున్న ఇంటిపక్క పౌరులను కాపాడారు. అనంతరం ధైర్యంగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించి ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. ఈ సాహసానికి ఆయనకు మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారం దక్కింది. శౌర్యచక్ర అవార్డు మరణానంతరం సుబేదార్ శ్రీజిత్, హవల్దార్ అనిల్ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్ కుమార్ రెడ్డికి దక్కింది. -
ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర దిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భారతీయ సైనిక పాటవాన్ని చాటిచెప్పేలా యుద్ధవిమానాలతో భారీ ఫ్లైపాస్ట్ నిర్వహించారు. 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పలు సైనిక వాహనాలను ప్రదర్శించారు. కరోనా కారణంగా వేడుకలకు విదేశీ అతిధిని ఆహ్వానించలేదు. వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. అయితే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆటోడ్రైవర్లు, నిర్మాణ కార్మికులను ప్రత్యేక అతిధులుగా గౌరవించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పెరేడ్ ఆరంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ విజయ్ కుమార్ మిశ్రా, మేజర్ జనరల్ అలోక్ కకేర్ నేతృత్వంలో సైనికులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయగీతాలాపన, 21 తుపాకుల గన్‌సెల్యూట్ జరిగాయి. భారత ఆర్మీ 61వ కేవలరీ రెజిమెంట్ సైనికులు మార్చింగ్‌లో ముందు నిలిచారు. ఉత్తరాఖండ్ టోపీతో ప్రధాని గణతంత్ర ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ యుద్ద మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాధ్, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు రిపబ్లిక్ డే పెరేడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరాఖండ్‌కు పత్య్రేకమైన టోపీ ధరించారు. దీనిపై ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రీకరించారు. అలాగే మణిపూర్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శాలువా ధరించారు. పెరేడ్లో ఎన్సీసీ కేడెట్లు షహీదోం కో శత్ శత్ నమాన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సైతం తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర ప్రజాపనుల శాఖ నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు నివాళినర్పిస్తూ శకటాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కొత్తగా లోక్ అదాలత్ శకటం పెరేడ్లో అడుగుపెట్టింది. విదేశాల్లో గణతంత్ర దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారతీయులు 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ సహా పలు దేశాధినేతలు ఈ సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. పలు దేశాల్లో భారతీయ కమిషన్ కార్యాలయాల్లో వేడుకలు జరిపారు. బీజింగ్‌లో భారత రాయబారి విమల్ జాతీయజెండాను ఎగురవేసి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సింగపూర్‌లో హైకమిషనర్ సిద్ధార్ధ్ నాథ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భారత్‌లో మరింత బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ హిందీలో భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి అనేక అంశాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లా ప్రధాని షేక్ హసీనా చెప్పారు. భూటాన్, ఇండియాల స్నేహం కాలానికి నిలిచిందని ఆ దేశ ప్రధాని లోటే ష్రింగ్ తెలిపారు. భారత ప్రజలకు శ్రీలంక ప్రధాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్లో ఇండియా రాయబారి సురేశ్ కుమార్ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఇండో– యూఎస్ బంధం కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్రూనై, న్యూజిలాండ్, ఇటలీ, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రిపబ్లిక్ డే ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే సంబరాలు భారత 73వ గణతంత్ర సంబరాలు అన్ని రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. ఆయా రాష్ట్రాల ప్రజలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను కాపాడేందుకు పాటుపడతామని ప్రతిన పూనారు. కరోనా కారణంగా ప్రేక్షకుల సంఖ్యపై పలు రాష్ట్రాల్లో పరిమితులు విధించారు. కాశ్మీర్లో ప్రఖ్యాత లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై మువ్వన్నెల జెండాను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసుఫ్, సాహిల్ బషీర్ పాల్గొన్నారు. ముందు జాగ్రత్తగా కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. లోయలో పుకార్లు వ్యాపింపజేసేవారిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన రిపబ్లిక్‌డే ప్రసంగంలో నిప్పులు చెరిగారు. రాజాంగ్య మౌలికతను కాపాడేందుకు ప్రతినపూనాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగితను తొలగిస్తామని హర్యానా సీఎం ఖటర్ ప్రతిజ్ఞ చేశారు. పెట్రోల్‌పై సబ్సిడీని జార్ఖండ్ సీఎం సోరెన్ ప్రకటించారు. మహిళా శిశువుల కోసం ప్రత్యేక పథకం తెస్తామని చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ చెప్పారు. కేరళలో మంత్రి అహ్మద్ తలకిందులుగా జాతీయజెండాను ఆవిష్కరించడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రాభివృద్ధికి తీసుకునే చర్యలను మేఘాలయ ముఖ్యమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్‌లో మద్యనిషేధం ఆవశ్యకతను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ నొక్కిచెప్పారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నోవిజయాలు సాధించిందని మహారాష్ట్ర గవర్నర్ చెప్పారు. కేంద్రం తిరస్కరించిన శకటాన్ని తమిళనాడు ప్రభుత్వం మెరీనా బీచ్‌లో ప్రదర్శించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో సీఎం అరవింద్, లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ స్వతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీమా భవానీ బృందం విన్యాసాలు పెరేడ్లో బీఎస్ఎఫ్కు చెందిన మహిళా జవాన్లతో కూడిన సీమా భవానీ మోటర్‌సైకిల్ టీమ్ చేసిన విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ప్రముఖులంతా ఈ బృందానికి నిల్చొని చప్పట్లతో గౌరవం ప్రకటించారు. భారతీయ ఐక్యతను ప్రతిబింబించేలా 485 మంది డాన్సర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలకు గుర్తుగా 75 యుద్ధ విమానాలు ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా, కాక్‌పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను వాయుసేన ప్రదర్శించింది. ఆకాశంలో విమాన విన్యాసాల ప్రత్యక్ష ప్రసారం ఇదే తొలిసారి. వేడుకలకు దాదాపు 5వేల మంది హాజరయ్యారు. కరోనా పూర్వం ఈ వేడుకలకు దాదాపు లక్షమంది వచ్చేవారు. వీక్షకులంతా కరోనా నిబంధనలు పాటించారు. అలాగే వీక్షకులు సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వేడుకలకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. నగరం మొత్తాన్ని పోలీసులు దిగ్భంధనం చేశారు. -
బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. -
ప్రభుత్వాలకు మీరు మార్గదర్శకులు
న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి, వారి సేవ కోసం కట్టుబడి ఉండాలన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలని ఉద్బోధించారు. ప్రజల్లో చైతన్యం పెంచడంలో, జాతీయ లక్ష్యాలను సాధించేగా దిశగా వారికి స్ఫూర్తినివ్వడంలో గవర్నర్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గవర్నర్లు జిల్లాలకు వెళ్లాలని, జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను సందర్శించాలని రాష్ట్రపతి చెప్పారు. ప్రజల సహకారంతో బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలని గవర్నర్లను కోరారు. కరోనాపై పోరాటంలో చురుకైన పాత్ర ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చిరస్మరణీయ పోరాటం సాగించిందని, ఇందులో గవర్నర్లు తమ వంతు సహకారం అందించారని కోవింద్ ప్రశంసించారు. ఈ పోరాటంలో వారు చురుగ్గా వ్యవహరించారని కొనియాడారు. దేశంలో కరోనా ఉధృతి సమయంలో వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులంతా అసాధారణ త్యాగం, అంకితభావంతో విధులు నిర్వర్తించారని గుర్తుచేశారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్లో జరిగింది. పథకాల అమలును పర్యవేక్షించాలి: వెంకయ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటి అమలులో గవర్నర్ల పాత్ర కీలకమని తెలిపారు. గవర్నర్ పదవిని కేవలం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా భావించకూడదని, రాష్ట్రానికి తొలి పౌరుడిగా ప్రజలకు సేవ చేయాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సంస్కృతిని కాపాడడానికి తోడ్పాటునందించాలని గవర్నర్లకు వెంకయ్య పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వారధి: మోదీ గవర్నర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గవర్నర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పొరుగు రాష్ట్రాల గవర్నర్లతోనూ తరచుగా భేటీ కావాలని, దానివల్ల ప్రజల సమస్యలు తెలుస్తాయని వెల్లడించారు. రాష్ట్రాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడుతూ ఉండాలని మోదీ వివరించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ల మధ్య అనుసంధానం కోసం ఓ సంస్థాగత యంత్రాంగం ఉండాలన్నారు. ఒక రాష్ట్రంలో గవర్నర్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాల గవర్నర్లు సైతం అందిపుచ్చుకోవాలని కోరారు. -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
పద్మ అవార్డుల ప్రదానోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదిగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ కళాకారుడు కనకరాజుకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. -
సమన్యాయం అందించేందుకు సహకరించండి!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అందరికీ సమన్యాయం అందించడానికి ప్రజా ప్రభుత్వాలు సహకారమందించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. వివిధ కోర్టుల్లో ఖాళీల పూరింపునకు కొలీజయం చేసిన సిఫార్సులను సత్వరమే ఆమోదించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సిఫార్సుల సత్వర అమలుతో పెండింగ్ కేసుల సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చన్నారు. ఇప్పటికే పలు సిఫార్సులను ఆమోదించామని, త్వరలో మిగిలినవాటికి అనుమతినిస్తామన్న కేంద్ర న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌తో న్యాయవ్యవస్థలో నెలకొన్న లోతైన సమస్యలు బయటపడ్డాయన్నారు. బలహీనవర్గాలకు సత్వర సమన్యాయం అందాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నల్సా(జాతీయ న్యాయసేవల అథారిటీ) ఆధ్వర్యంలో ఆరువారాలు సాగే ‘పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్, అవుట్‌రీచ్ క్యాంపెయిన్’ను రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ శనివారం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో సీజేఐ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమని గాంధీ భావించేవారని రమణ గుర్తు చేశారు. సమ్మిళిత వృద్ధి మాత్రమే స్థిరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుందనేది కాదనలేని సత్యమని తెలిపారు. సమన్యాయం తక్షణ అవసరం సమన్యాయం అందించకుండా సామాజిక ఆర్థిక సమానత్వం సాధించడం అసాధ్యమన్నారు. దీన్ని గుర్తించి అందరికీ సమన్యాయం అందించేందుకు కార్యనిర్వాహక, చట్టసభలు, న్యాయవ్యవస్థలు కలిసి పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య నాణ్యత నాణ్యమైన న్యాయంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజాస్వామ్య దేశంలో సంస్థల్ని నిలబెట్టేది ప్రజల విశ్వాసం, నమ్మకమేనని పునరుద్ఘాటించారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైన నల్సా కోట్లాదిమందికి సేవలందించిందన్నారు. గాందీజీ జయంతినాడు మొదలైన ఈ కార్యక్రమం నెహ్రూ జయంతి రోజున ముగుస్తుందన్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు చేరుకోవడానికి యతి్నస్తున్నామని, దీనికి అందరి సహకారం కావాలన్నారు. న్యాయవాది అయిన రాష్ట్రపతిని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు రమణ చెప్పారు. చట్టపరమైన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రపతి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ధికి పాటుపడాలి సీనియర్ న్యాయవాదులు మహాత్మా గాంధీ ఆదర్శాలను పాటించి, పేదలకు సేవలందించాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. మహిళాభివృద్ధికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళాభివృద్ది భావన నుంచి మహిళల వల్ల అభివృద్ధి అనే భావనకు మరలాలన్నారు. సహేతుకమైన మూల్యానికి ఉత్తమ న్యాయ ప్రతిభ అందుబాటులో ఉండాలని గాంధీ కోరుకునేవారన్నారు. లాయర్లు తమ సమయంలో కొంత బలహీనవర్గాల సేవలకు కేటాయించాలన్నారు. కోర్టు బయట పరిష్కారాలను గాం«దీజీ బలంగా విశ్వసించేవారన్నారు. న్యాయవాద వృత్తిలో మహిళల పాత్ర మరింత పెరగాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. అందరికీ న్యాయ సేవలు అందించడానికి నల్సా చేస్తున్న సేవలనుకోవింద్ ప్రశంసించారు. -
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు రండి
సాక్షి, న్యూఢిల్లీ/శంషాబాద్ రూరల్ (హైదరాబాద్): వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరగబోయే 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆహ్వానాన్ని అందజేశారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకావాలని కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని చినజీయర్ స్వామి కలిశారు. కాగా, నేడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలసి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా ఆహ్వానించనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కలిసినవారిలో చినజీయర్ స్వామితోపాటు మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ధనుష్ ఇన్ఫోటెక్ సీఎండీ. డి.ఎస్.ఎన్.మూర్తి తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 2న ముహూర్తం శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్దిని పురష్కరించుకుని ఏర్పాటు చేస్తున్న సమతామూర్తి రామానుజుల విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు చేపట్టనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. 1,100 టన్నుల బరువు ఉండే 216 అడుగుల పంచలోహ విగ్రహంతోపాటు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.వెయ్యి కోట్ల అంచనాతో స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 2014లో ఈ పనులకు చినజీయర్ స్వామి భూమిపూజ చేశారు. నిత్యం పూజలు అందుకునేవిధంగా 120 కిలోల బంగారంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక్కడ అద్భుతమైన మ్యూజికల్ ఫౌంటెయిన్, శ్రీరామానుజుల జీవిత విశేషాలను తెలియజేసేలా ఉత్తమ సాంకేతిక విజ్ఞానంతో సన్నివేశాలు, వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. స్ఫూర్తి కేంద్రంలో 108 దివ్య క్షేత్రాలు స్ఫూర్తి కేంద్రంలో భద్రవేది, దివ్య మండపంతోపాటు 108 దివ్యక్షేత్రాలు, గరుడ మండపం, శరణాగత మండపం, గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. చైనాలో ప్రత్యేక నిపుణులతో, ఆధునిక సాంకేతికతతో విగ్రహాల తయారీ చేపట్టారు. విడి భాగాలుగా ఇక్కడికి తరలించి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. -
సుప్రీంకోర్టుకు 9 మంది జడ్జీలు...
సాక్షి, న్యూఢిల్లీ: తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి కోవింద్ ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ ఏఎస్ ఓకా, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు జడ్జి బేలా త్రివేది, బార్ నుంచి న్యాయవాది పీఎస్ నరసింహలను కొలిజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. 31న జడ్జీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో 34 జడ్జీ పోస్టులుండగా వీరి నియామకంతో జడ్జీల సంఖ్య 33కు చేరనుంది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! జస్టిస్ విక్రమ్‌నాథ్ జస్టిస్ విక్రమ్‌నాథ్ సెప్టెంబర్ 24, 1962లో అలహాబాద్‌లో జన్మిం చారు. అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 10, 2019న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. చరిత్రలో మైలురాయి!..జస్టిస్ నాగరత్న సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందిన కర్ణాటక హైకోర్టు జడ్జి బీవీ నాగరత్న సెప్టెంబర్ 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. జస్టిస్ నాగరత్న 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, ఆర్బిట్రేషన్లకు సంబంధించిన కేసులకు పేరుగాంచారు. జస్టిస్ జేకే మహేశ్వరి మధ్యప్రదేశ్‌లో జన్మించిన జస్టిస్ మహేశ్వరి 1985లో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. నవంబర్ 25, 2005న మధ్యప్రదేశ్ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నవంబర్ 25, 2008న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్టోబర్ 7, 2019న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇటీవల సిక్కింకు బదిలీ అయ్యారు. జస్టిస్ బేలా మాందుర్య త్రివేది 1983లో కెరియర్ ప్రారంభించిన జస్టిస్ త్రివేది సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పేరుగాంచారు. 1995లో అహ్మదాబాద్ సిటీ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గుజరాత్ హైకోర్టు ప్రత్యేక అధికారి(నిఘా)గా పనిచేసిన ఆమె గుజరాత్ ప్రభుత్వం న్యాయ సలహాదారుగా పనిచేశారు. జస్టిస్ సీటీ రవికుమార్ కేరళకు చెందిన జస్టిస్ చుడలాయిళ్ తేవన్ రవికుమార్ జనవరి 6, 1960న జన్మించారు. జనవరి 5, 2009న కేరళ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబరు 15, 2010న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సీటీ రవికుమార్ జనవరి 5, 2022 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా మహారాష్ట్రకు చెందిన జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా మే 25, 1960లో జన్మించారు. జూన్ 28, 1983లో బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. నవంబర్ 12, 2005న బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మే10, 2019న పదోన్నతి పొందారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ తమిళనాడుకు చెందిన జస్టిస్ ఎంఎం సుందరేశ్ మద్రాస్ లా కళాశాల నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. 1985లో తమిళనాడు, పుదుచ్చేరి బార్కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. మార్చి 31, 2009న అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎంఎం సుందరేశ్ మార్చి 29, 2011న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగో తెలుగు న్యాయమూర్తి..జస్టిస్ పీఎస్ నరసింహ ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి తర్వాత నాలుగో తెలుగు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బాధ్యతలు చేపట్టను న్నారు. బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వ్యక్తి పీఎస్ నరసింహ. మే 3, 1953లో హైదరాబాద్‌లో జన్మించారు. జస్టిస్ హిమా కోహ్లి 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలు అయిన జస్టిస్ హిమా కోహ్లి ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. మే 29, 2006న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి ఆగస్టు 29, 2007న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 7, 2021లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. -
Ram Nath Kovind: దేశమంతా గర్వపడుతోంది
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇకపై ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించేలా మన ఆటగాళ్లంతా స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు. ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, బజరంగ్, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్‌ల తోపాటు కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు, ఇతర క్రీడాకారులు, కోచ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, నితీశ్ ప్రామాణిక్, ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు నరీందర్ బత్రా, రాజీవ్ మెహతా కూడా పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయం
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఒక దేవాలయం. ప్రజల సంక్షేమం కోసం చర్చలు, సంవాదాలు జరిగే, నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వేదిక’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. నిరంతర అంతరాయాలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొనడం, పాలక– ప్రతిపక్షాలు పట్టుదలకు పోవడంతో షెడ్యూల్‌కంటే రెండురోజుల ముందే సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రథమపౌరుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్న విశిష్టతపై మాట్లాడటం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కోవింద్ టీవీలో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. కోవిడ్–19 రెండో వేవ్ సృష్టించిన విలయం నుంచి దేశం ఇంకా బయటపడలేదని చెప్పారు. మహమ్మారి విషయంలో ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఇంకా ఏం మాట్లాడారంటే.. ► మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం. ► కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ► వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు మన అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తాయి. వారు తమ పంట ఉత్పత్తులకు మరింత మేలైన ధర పొందడానికి ఈ సంస్కరణలు ఉపకరిస్తాయి. ► కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించింది. ► వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కృషి వల్ల కరోనా సెకండ్ వేవ్‌పై పైచేయి సాధించగలిగాం. ► కరోనా ప్రతికూల కాలంలో కూడా వ్యవసాయ రంగంలో పురోగతి సాధించాం. మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వ్యాపారులు, వలస కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ► కరోనా వ్యాప్తి వల్ల నష్టపోయిన రంగాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తిరిగి కోలుకునేందుకు తగిన సాయం అందిస్తోంది. ► కోవిడ్–19 నియంత్రణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 50 కోట్లకు పైగా టీకా డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లే రక్షణ కవచం. కరోనా తీవ్రత కొంత తగ్గినప్పటికీ వైరస్ ఇంకా పూర్తిగా పోలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ► భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని చాలామంది అనుమానించారు. ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ► పురాతన కాలంలోనే భారత గడ్డపై ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయి. ఆధునిక యుగంలోనూ ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నో పశ్చి మ దేశాల కంటే భారత్ ముందంజలో ఉంది. ► సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ► మన పార్లమెంట్ త్వరలో కొత్త భవనంలోకి మారబోతోంది. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ► మీ కుమార్తెలకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు కల్పించండి అని తల్లిదండ్రులను కోరుతున్నా. ► ఉన్నత విద్యా సంస్థల నుంచి సైనిక దళాల దాకా.. ప్రయోగశాల నుంచి క్రీడా మైదానాల దాకా ప్రతిచోటా ఆడబిడ్డలు వారిదైన ముద్ర వేస్తున్నారు. ► ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వారికి అభినందనలు. 121 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన దేశం ఈసారి గతంలో కంటే అధికంగా పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయం. ► భారత క్రీడాకారిణులు ఎన్నో అవరోధాలను అధిగమించి ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. ► మన ఆడబిడ్డల ప్రతిభా పాటవాలు, వారు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి చెందిన భారత్‌ను ఇప్పుడే దర్శించగలుగుతున్నా. అగ్రస్థానానికి ఎదిగిన ఆడపిల్లల కుటుంబాల నుంచి నేర్చుకోవాలని, వారికి అవకాశాలు కల్పించేందుకు తోడ్పడాలని తల్లిదండ్రులకు నా సూచన. ► జమ్మూకశ్మీర్‌లో కొత్త పొద్దు పొడిచింది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కలలను నిజం చేసుకొనేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో కృషి చేయాలి. ► ఆధునిక పారిశ్రామిక విప్లవం మానవళికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. వాతావరణ మార్పులు పెనుశాపంగా మారుతున్నాయి. ► మంచు కరిగిపోయి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పారిస్ వాతావణ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంది. అంతేకాదు వాతావరణ పరిరక్షణకు భారత్ చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేస్తోంది. ఈ విషయంలో మిగతా ప్రపంచ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ► ను ఇటీవల బారాముల్లాలో డాగర్ వార్ మెమోరియల్‌ను సందర్శించా. అక్కడ ‘నేను చేసే ప్రతి పని దేశం కోసమే’అని రాసి ఉంది. ఇదే మన నినాదం కావాలి. దేశ ప్రగతి కోసం పూర్తి అంకితభావంతో పని చేయాలి. భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి మనమంతా ఒక్క తాటిపైకి రావాలి. -
రాష్ట్రపతి, ప్రధానికి వైఎస్సార్సీపీ ఎంపీల లేఖ
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి, ప్రధానికి వైఎస్సార్సీపీ ఎంపీలు శుక్రవారం లేఖ రాశారు. తీవ్రమైన ఆర్థిక మోసానికి పాల్పడ్డ ఇందు భారత్ పవర్ లిమిటెడ్,ఇందు భారత్ పవర్ ఇన్ఫ్రా, ఆర్కే ఎనర్జీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇందు భారత్ కంపెనీలు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టాయని, రూ.941.71 కోట్ల రూపాయాల ప్రజాధనం స్వాహా చేశారని’’ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. ‘‘విద్యుత్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకుని నిధులను పక్కదారి పట్టించారు. ఎస్బీఐ నుంచి రూ.63.46 కోట్లు తీసుకుని ఎగ్గొట్టారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా జరగడం లేదు. దీని వల్ల ప్రజలకు సంస్థలపై ఉన్న నమ్మకం పోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని’’ లేఖలో కోరారు. ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలి. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలి. రూ.వేల కోట్ల ప్రజధనాన్ని కాపాడాలని లేఖలో వైఎస్సార్సీపీ ఎంపీలు పేర్కొన్నారు. -
Ramnath Kovind: కలలో కూడా అనుకోలేదు!
లక్నో/కాన్పూర్: గ్రామీణ నేపథ్యం ఉన్న తనలాంటి సామాన్యుడు దేశ అత్యున్నత పదవిని పొందగలగడని కలలో కూడా ఊహించలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్దేహత్ జిల్లాలోని తను పుట్టిన ఊరు పారౌంఖ్ పౌరులనుద్దేశించి ఆదివారం కోవింద్ ప్రసంగించారు. స్వస్థలాన్ని చూడగానే భావోద్వేగానికి గురైన రాష్ట్రపతి.. మోకాళ్లపై వంగి అక్కడి నేలకు నమస్కరించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కోవింద్ తన సొంతూరికి రావడం ఇదే ప్రథమం. ‘నాలాంటి సామాన్య పల్లెటూరి పిల్లవాడు దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దాన్ని నిజం చేసింది. నేను ఏ స్థాయికి చేరుకున్నా, ఆ ఘనత ఈ నేలకు, ఈ మట్టికి, ఇక్కడి ప్రజలకే చెందుతుంది’ అని కోవింద్ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇతర స్వాతంత్య్ర సమర యోధులకు కోవింద్ నివాళులర్పించారు. అక్కడి మిలన్ కేంద్రం, వీరాంగన ఝల్కారీ బాయి ఇంటర్ కాలేజ్‌లను సందర్శించారు. ‘నా కుటుంబ విలువల ప్రకారం, కులాలకతీతంగా గ్రామంలోని అత్యంత వృద్ధురాలిని అమ్మగా, అత్యంత వృద్ధుడిని తండ్రిగా భావిస్తాం. ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. తన గ్రామం మట్టివాసన, ఇక్కడి జ్ఞాపకాలు తన హృదయంలో పదిలంగా ఉన్నాయన్నారు. ‘పారౌంఖ్ అంటే నా దృష్టిలో కేవలం ఒక గ్రామం కాదు. ఇది నా మాతృభూమి. దేశ సేవకు స్ఫూర్తినిచ్చిన నేల. ఆ స్ఫూర్తితోనే మొదట హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు.. ఆ తరువాత రాజ్యసభకు, ఆపై రాజ్‌భవన్‌కు.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నా’నన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది ప్రధానమంత్రులయ్యారని, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిని మాత్రం తానేనని కోవింద్ వెల్లడించారు. అందరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులు రాష్ట్రపతిభవన్‌ను చూసేందుకు త్వరలో ఏర్పాట్లు చేస్తానన్నారు. స్కూల్లో తన క్లాస్మేట్స్ అయిన జస్వంత్ సింగ్, చంద్రభాన్ సింగ్, దశరథ్ సింగ్‌లను కలుసుకోలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. -
వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి'
భోపాల్ : హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని ఓ మహిళా రైతు రాష్ట్రపతికి లేఖ రాసింది. అంతేకాకుండా ఫ్లయింగ్ పర్మిషన్ కూడా ఇప్పించాని విఙ్ఙప్తి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేఖ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ జిల్లాకు చెందిన బసంతి బాయ్ అనే మహిళ చిన్న పూరి గుడిసెలో నివసించేది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే తనకున్న 2 బిగాల పొలంలోకి వెళ్లాలంటే పరమానంద్ అనే రైతుకి చెందిన పొలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయన తన ఇద్దరు కుమారులు సైతం బసంతితో వాగ్వాదానికి దిగేవారు. కొన్నాళ్ల తర్వాత ఆ దారిని మూసి వేయించారు. ఈ విషయంపై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. కాలినడకన వెళ్లేందుకు వీలు లేకపోవడంతో హెలికాప్టర్ కొనడానికి లోన్ ఇప్పించాలని లేఖలో కోరడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఈ సమస్యను తానే దగ్గరుండి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. చదవండి : (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) (మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు) Alleging denial of passage into her agricultural plot, woman in MP's Mandsaur district writes to President of India for loan and license to fly by helicopter into her plot. On spot official probe, however, finds clear passage to woman's plot. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/zEiWdN0MiM — Anuraag Singh (@anuraag_niebpl) February 12, 2021 -
ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారిని చూసిన తర్వాత గుణపాఠాలు నేర్చుకుని ప్రజా ఆరోగ్యానికి అన్ని ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్లో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య యూనివర్సిటీ 23వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంబీబీఎస్, పీజీ పట్టభద్రులకు పట్టాలను, బంగారు పతకాలను అందజేసి ప్రసంగించారు. ఆరోగ్యం, విద్యా రంగాలు అత్యంత ప్రధాన రంగాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల విజయం .. భవిష్యత్తులో కరోనా వంటి అంటురోగాలు విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలంటే ఆరోగ్య రంగం మరింత బలోపతం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ యోజన ద్వారా మన శాస్త్రవేత్తలు కరోనాకు టీకాను కనిపెట్టారని, దీనివల్ల మనదేశంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందించడం సాధ్యమైందని చెప్పారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన ఘనత మనదేశానికి దక్కుతుందని చెప్పారు. ఇది మన శాస్త్రవేత్తల విజయమని కొనియాడారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి పని చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఖండాంతరాలకు భారత్ ఖ్యాతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని యలహంకలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు రోజులుగా కొనసాగుతున్న 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. చివరి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరై, వైమానిక ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనతో భారత ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందని అన్నారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ వైమానిక ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను ప్రశంసించారు. సుమారు 530 కంపెనీలు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్నట్లు చెప్పారు. హైబ్రిడ్ ఫార్మాట్లో తొలిరోజు ఏరో షో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్తో రూ.48 వేల కోట్ల ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అబ్బురపరిచిన విన్యాసాలు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనలో భాగంగా స్వదేశీ నిర్మిత తేజస్, భారత వాయుసేనకు చెందిన సుఖోయ్, రఫేల్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ హెలికాప్టర్ల విన్యాసాలు అలరించాయి. ఈసారి వైమానిక ప్రదర్శనలో అమెరికాకు చెందిన బీఐఓ బాంబర్ విమానం మినహా విదేశీ విమానాలన్నీ పాల్గొన్నాయి. కాగా, కోవిడ్–19 కారణంగా బ్రిటన్, ఐరోపా దేశాలు ప్రదర్శనలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశాయి. కానీ, ఆయా దేశాల రక్షణ శాఖ అధికారులు హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చిన బోయింగ్, ఎయిర్‌బస్, లుఫ్తాన్సా, లాక్టిన్‌హెడ్ తదితర కంపెనీలు భారత కంపెనీలతో ఒప్పందం చేసుకుని రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు. -
7న చిత్తూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన బెంగళూరు విమానాశ్రయం నుంచి వైమానికదళ హెలికాప్టర్లో ఆదివారం మ«ధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్ అక్కడినుంచి రోడ్డు మార్గాన సత్సంగ్ ఆశ్రమానికి చేరుకుంటారు. (చదవండి: దాడుల పాపం టీడీపీదే..) అక్కడ జరిగే శంకుస్థాపన, భారత్ యోగా విద్యా కేంద్ర ‘యోగా కేంద్రం’ ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్సంగ్ విద్యాలయంలో మొక్కలు నాటుతారు. అనంతరం సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు. తదుపరి విద్యార్థులు, టీచర్లతో ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడ్నుంచీ హెలికాప్టర్లో బెంగళూరుకు తిరుగు పయనమవుతారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతి కోవింద్‌తో కలసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదనపల్లె బీటీ కళాశాలలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం గన్నవరానికి తిరుగుపయనమవుతారు.(చదవండి: స్థానిక ఎన్నికలు: టీడీపీ నేతల దౌర్జన్యకాండ) -
10కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలను ఆయన గట్టిగా సమర్థించారు. వీటి అమలుతో 10 కోట్ల మంది సన్నకారు రైతులు తక్షణమే ప్రయోజనం పొందుతారని తెలి పారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రా జధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, రై తుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరగడం చా లా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏ సీ) వద్ద శాంతికి పొరుగు దేశం విఘాతం కలి గిస్తోందంటూ పరోక్షంగా చైనాపై మండిపడ్డా రు. కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ► సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి కొన్ని దేశాలు చేస్తున్న కుట్రలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ►పేదలు, సన్నకారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల పురోగతికి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ► కొత్త సాగు చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో వివిధ పార్టీలు ఈ చట్టాలకు మద్దతునిచ్చాయి. ► రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. అదే సమయంలో చట్టాలను గౌరవించాలని, రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించాలని రాజ్యాంగం బోధించిందన్న సంగతి మరచిపోవద్దు. ► మూడు కొత్త సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుంది. కోర్టు ఆదేశాలతో ఈ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ► సన్న, చిన్నకారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.13 లక్షల కోట్లను బదిలీ చేసింది. ► కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు 8 నెలలపాటు ఉచి తంగా నిత్యావసరాలను సరఫరా చేసింది. ► కరోనా కల్లోల సమయంలోనూ భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. బహిష్కరించిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి తన ప్రసంగంలో గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్లో రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతుండగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. -
ఫిబ్రవరి 1వ తేదీకి లోక్‌సభ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉభయ సభలు కొలువు దీరాయి. సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షలాది పౌరుల ప్రాణాలను కరోనానుంచి కాపడగలిగామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త కేసుల సంఖ్య వేగంగా తగ్గుతోందని, అలాగే రికవరీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభనుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రులు, ఇతర సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆర్థికసర్వే-2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది. రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత జమ్ము కాశ్మీర్ ప్రజలకు కొత్త అధికారం దక్కింది. ► సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. ఈఓడీబీలో భారత్ ర్యాంక్ మెరుగుపడింది. ► ఒకప్పుడు ఇక్కడ రెండు మొబైల్ తయారీ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేవి. ► స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పుడు మనం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నాం. ► రెరాతో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు ► ఇస్రో గగన్ యాన్, చిన్న శాటిలైట్లను పంపే ప్రయోగాలు విజయవంతం. ► పారిశ్రమిక రంగంలో పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. ► వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చాం. ► కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంతో, ప్రతీసభ్యుడు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా మెరుగైన సౌకర్యాలు పొందుతారు. ► కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి. కానీ యాదృచ్చికంటగా స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరానికి చేరుకుంటున్న తరుణంలో కొత్త పార్లమెంట్ హౌస్ నిర్మాణం ప్రారంభం కావడం సంతోషకరం. ► జాతి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► భారతదేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడటం కోసం వాస్తవాధీన రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించాం. ► గల్వాన్ లోయలో గత ఏడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్ల వీరమరణం మరువలేనిది. ► దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకుంటారు. ► కరోనా మహమ్మారి నుంచి ప్రతి పౌరుడిని కాపాడుకుంటూ, ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్నాం. ► ఈ కరోనా టైంలోనూ ప్రపంచ పెట్టుబడిదారులకు భారతదేశం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలిచింది. ► కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13వేల కోట్లు బదిలీ ► ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది ► రెండు వ్యాక్సిన్లు కూడా భారత్‌లోనే రూపొందించారు ► కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ఉపయోగం ► కొత్త చట్టాలతో రైతులకు విస్తృత అవకాశాలు ► రైతులకు మరింత లబ్ధి కలిగించేందుకే కొత్త చట్టాలు తీసుకొచ్చాం ► కొత్త చట్టాలతో 10 లక్షల మంది రైతులకు తక్షణ ఉపయోగం ► ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి కోవింద్ ► క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మనిర్భర ప్యాకేజీ వరంగా మారింది ► గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ ధ్యేయం ► రైతుల అభివృద్ధి కోసం కిసాన్ రైలు తీసుకొచ్చాం ► మత్స్యకారుల కోసం కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ► దేశవ్యాప్తంగా 24వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలు ► జనఔషధి పరియోజన్ ద్వారా దేశవ్యాప్తంగా పేదలకు చౌకగా ఔషధాలు ► వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ► మత్స్యకారుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.20వేల కోట్ల వ్యయం ► 3 వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుంది ► గణతంత్ర దినోత్సవం రోజున హింస జరగడం బాధాకరం. దేశానికి ఎంతో పవిత్రమైన జాతీయ జెండాకు అవమానం జరిగింది. ► భావ ప్రకటనా స్వేచ్ఛా హక్కును కల్పించడంతోపాటు చట్టాలను గౌరవించాలని కూడా రాజ్యాంగం బోధిస్తుంది ► ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది. ► తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. ► కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో శక్తివంతమైన దేశంగా భారత్ నిలిచింది. ► ఆర్థిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాం. ► సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచాం. ► కరోనాపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. ► సమయానుకూల చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగాం. ► మానవత్వంతో కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపించాం. ► పేదల కోసం వన్ నేషన్, వన్ రేషన్ కార్డు అమలు చేశాం. ► జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లోకి నగదు బదిలీ చేశాం. ► ఆరు రాష్ట్రాల్లో గ్రామీణ్ కల్యాణ్ యోజన అమలు చేశాం. ► 14 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ► దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ► దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అవుతున్నాయి ► ఆరేళ్ల కాలంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయి. ► సన్నకారు రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది. ► కోటిన్నర మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్. ► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. ► దేశంలోని 24,000 ఆసుపత్రులలో ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాలను పొందవచ్చు. ► దేశవ్యాప్తంగా 7000 కేంద్రాల్లో పేదలు చాలా తక్కువ ఖర్చుతో మందులు పొందుతున్నారు. ► కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో చాలా మంది పౌరులను కోల్పోయాము. ప్రధానంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కాలంలోనే కన్నుమూశారు. కోవిడ్ కారణంగా ఆరుగురు ఎంపీలు మనల్ని విడిచి వెళ్లారు. వారందరికి నివాళులు అర్పిస్తున్నాం. కాగా, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: దశాబ్దంలో తొలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి సంబంధించి ఈ దశాబ్దం కాలా కీలకమైందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా ముఖ్యమైనది. స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో 2020 లో మొట్టమొదటిసారిగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4-5 మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ కూడా 4-5 మినీ బడ్జెట్లుగా కనిపించనుందని భావిస్తున్నానని మోదీ తెలిపారు. కరోనా సంక్షోభం, వాక్సినేషన్, ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు నేడు (శుక్రవారం, జనవరి 29) మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు కొనసాగనున్న ఈ సమావేశాల తొలిరోజు అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థికసర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న దేశ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రైల్వే బడ్జెట్‌ను కూడా యూనియన్ బడ్జెట్లోనే కలిపి ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు ఒక్కొక్కరు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు సంఘీభావంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించా లని 17 ప్రతిపక్ష పార్టీలునిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
వేడెక్కనున్న పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలకు సంఘీభావంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడికి సిద్ధం కావడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వేడెక్కనున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు. రైతు ఆందోళనలకు సంఘీభావంగా కాంగ్రెస్, ఆప్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన సమావేశాలు వాడీవేడిగా సాగనున్నట్టు సంకేతమిచ్చింది. శుక్రవారం ఉదయం ఉభయ సభల ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగిత రహిత కార్యకలాపాలు ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్, ఎకనామిక్ సర్వే సహా అన్ని పత్రాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రయివేటు మెంబర్స్ బిజినెస్ కూడా పునరుద్ధరించారు. వర్షాకాల సమావేశాల్లో వారాంతపు సెలవులు లేకుండా సాగగా.. బడ్జెట్ సమావేశాల్లో శని, ఆదివారాలను వారాంతపు సెలవులుగా పునరుద్ధరించారు. బడ్జెట్ సమావేశాల్లో వచ్చే బిల్లులు ఇవే.. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చడానికి ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆర్డినెన్స్ 2020, మధ్యవర్తిత్వం; సయోధ్య (సవరణ) ఆర్డినెన్స్–2020, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) ఆర్డినెన్స్–2021 తదితర ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రతిపాదించనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు రానున్నాయి. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు 29వ తేదీతో మొదలై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత నిధుల పద్దులను పరిగణనలోకి తీసుకుని స్థాయీ సంఘాలు తమ నివేదికలు సిద్ధం చేసేందుకు వీలుగా తొలి విడత సమావేశాలను ఫిబ్రవరి 15న వాయిదా వేస్తారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగుతాయి. చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి ప్రహ్లాద్ రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ సహా 16 ప్రతిపక్షాలు ప్రకటించడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తప్పుపట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీరు అడిగితే దేనిపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన సమయం మేరకు చర్చించేందుకు మేం సిద్ధం. సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం. ఇలా బహిష్కరించడం అవాంఛనీయం..’అని పేర్కొన్నారు. -
రైతన్నకు సెల్యూట్ చేయాలి: రాష్ట్రపతి
ఢిల్లీ : దేశంలోని ప్రతి భారతీయుడు అన్నం పెట్టే రైతన్నకు సెల్యూట్ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 72వ రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వంటి కష్ట సమయంలోనూ అన్నదాతలు సాగులో వెనకుడుగు వేయలేదని, వారి కృషి వల్లే దేశం ఆహారొత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. దేశానికి రైతులు ఆహార భద్రత అందిస్తుంటే, సైనికులు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీ కాస్తున్నారని అన్నారు. గడ్డకట్టే చలిలోనూ మన సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. కరోనా వైరస్‌ను దేశం ధీటుగా ఎదుర్కొందని, మహమ్మారిని కట్టడి చేసేందుకు మన శాస్త్రవేత్తలు అత్యంత తక్కువ సమయంలోనే టీకాను తయారు చేసి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది సేవలు మరువలేనవన్నారు. (సాగు చట్టాలపై ఆందోళన తొలగించాలి) -
సాగు చట్టాలపై ఆందోళన తొలగించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో భారత సాయుధ దళాలు సదా సిద్ధంగా ఉంటాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తక్షణమే స్పందించేందుకు సరైన సమన్వయంతో సాయుధ దళాలు సర్వ సన్నద్ధంగా ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా విస్తరణ వాద ప్రయత్నాన్ని భారతీయ జవాన్లు సాహసోపేతంగా తిప్పికొట్టిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. నేటి 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన రైతులకు దేశవాసులంతా సెల్యూట్ చేస్తారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాధారణంగా సంస్కరణ మార్గం తొలి దశలో అపార్థాల పాలవుతుందని, అయితే, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్లో నెలకొన్న, రాజ్యాంగ విలువల్లో భాగమైన సౌభ్రాతృత్వ భావన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా ఆయన అభివర్ణించారు. అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా భారత్ నిరాశను దరి చేరనీకుండా, ఆత్మ విశ్వాసంతో సుదృఢంగా నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కూడా ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం కరోనా టీకాను తీసుకోవాలని దేశ ప్రజలకు రాష్ట్రపతి సూచించారు.టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ పెరేడ్ చాలా ప్రత్యేకం! భారత్ డెబ్భైరెండో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పెరేడ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో దర్శనమిస్తుండగా, కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో మిస్సవుతున్నాయి. అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన ట్రూప్స్, తొలి మహిళా ఫైటర్ పైలెట్, కొత్తగా ఏర్పడ్డ లడఖ్ శకటం, కొత్తగా కొన్న రఫేల్ జెట్స్ ప్రదర్శన తొలిమారు రిపబ్లిక్‌డే పెరేడ్లో దర్శనం ఇవ్వనున్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవ పెరేడ్లో చీఫ్ గెస్ట్ లేకపోవడం ఇదే తొలిసారి. అలాగే మిలటరీ వెటరన్స్ ప్రదర్శన, మోటర్‌సైకిల్ డేర్‌డేవిల్స్ ప్రదర్శన కూడా ఈ దఫా లేవు. -
పద్మ విభూషణ్ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం
చండీఘర్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నా విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకను పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా. తాజాగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. బాదల్ తన లేఖలో.. రైతుల పట్ల కేంద్రం తీసుకున్న చర్య పట్ల తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైతుల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కారణంగా అలాంటి రైతులు బాధ పడుతుంటే.. ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషన్ పురస్కారం వల్ల వచ్చిన గౌరవం తనకు అవసరం లేదని బాదల్ రాసుకోచ్చారు. కాగా 2015లో భారత ప్రభుత్వం బాదల్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేటి కేంద్ర మంత్రుల భేటీలో రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. -
అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్
న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు. ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమణ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యంత్ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పాల్గొన్నారు. -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
24న తిరుమలకు రాష్ట్రపతి
సాక్షి, తిరుమల: ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకనున్నారు. (చదవండి: అశ్లీల వీడియో వివాదం: ఎస్వీబీసీ ఉద్యోగి తొలగింపు) తిరుమలకు చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి.. శ్రీవారి దర్శనార్థం తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి తిరుమలకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రేపు(మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (చదవండి: తిరుమలలో కుండపోత వర్షం) -
హర్సిమ్రత్ కౌర్ రాజీనామా ఆమోదం
సాక్షి, ఢిల్లీ : అకాలీదళ్ ఎంపీ, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామాను రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. తక్షణం ఆమె రాజీనామాను అమల్లోకి వస్తుందని రాష్ర్టపతి భవన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్రప్రభుత్వం ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని శిరోమణి అకాలీదళ్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఈ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని నాలుగు పేజీల రాజీనామా లేఖను సమర్పించారు. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ప్రకటించారు. రైతు బిడ్డగా, వారికి సోదరిలా నిలబడటం గర్వంగా ఉందని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించకుండా వ్యవసాయరంగ బిల్లులను తీసుకువచ్చిన ప్రభుత్వంలో తాను భాగస్వామ్యం కావడం ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. (వ్యవసాయ బిల్లులకు నిరసనగా రాజీనామా) బిల్లులకు నిరసనగా భారత్‌బంద్ రైతలుకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ వ్యవసాయ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా చేపట్టామని బీజేపీ పేర్కొంటోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆరోపించాయి. ఇక ఈ బిల్లులపై పంజాబ్, హరియాణా రైతాంగం గత కొద్దివారాలుగా ఆందోళనలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్సిసి) సెప్టెంబరు 25న భారతబంద్‌కు పిలుపునిచ్చింది. (ఉల్లి ఎగుమతుల నిషేధంపై ఎన్సీపీ ఫైర్) -
టాప్–10లో నిలవాలి
న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో టాప్–10లో నిలుస్తుందనే నమ్మకముందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రానున్న కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికల్లో కొత్త చరిత్ర లిఖిస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మానసిక శక్తితో ఆటగాళ్లు కోవిడ్–19ను దీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను కోవింద్ స్మరించుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జాతీయ క్రీడా పురస్కారాలను అందజేశారు. ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన ఆటగాళ్లను, కోచ్‌లను అభినందించారు. క్రీడాకారులంతా అద్వితీయ ప్రదర్శనలతో భారతీయులందరికీ మరపురాని మధుర స్మృతులను అందించారని కొనియాడారు. ‘వర్చువల్’గా అవార్డుల స్వీకరణ 44 ఏళ్ల ఈ అవార్డుల చరిత్రలో కరోనా కారణంగా కొత్త సంప్రదాయానికి తెర తీయాల్సి వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరగాల్సిన ఈ వేడుకలు సాంకేతిక హంగులతో ముందుకొచ్చాయి. వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో అలరించాయి. దీనికి దేశంలోని 11 భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలు వేదికలుగా నిలిచాయి. రాష్ట్రపతి భవన్‌తో అనుసంధానమైన సాయ్ కేంద్రాలు అత్యంత సురక్షిత వాతావరణంలో వేడుకల్ని నిర్వహించాయి. మొత్తం 74 (5 ఖేల్‌రత్న, 27 అర్జున, 13 ద్రోణాచార్య, 15 ధ్యాన్‌చంద్ ) మంది ఈ ఏడాది జాతీయ అవార్డులను గెలుచుకోగా శనివారం 60 మంది ఈ పురస్కారాలను స్వీకరించారు. ఖేల్‌రత్నకు ఎంపికైన మహిళా హాకీ ప్లేయర్ రాణి రాంపాల్, పారాలింపియన్ తంగవేలు సాయ్ పుణే కేంద్రం నుంచి... టీటీ ప్లేయర్ మనికా బాత్రా బెంగళూరు నుంచి ఈ అవార్డులను అందుకున్నారు. దుబాయ్‌లో ఉండటంతో రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కరోనా సోకడంతో వినేశ్ ఫొగాట్, ఏపీ బ్యాడ్మింటన్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ తమ అవార్డులను అందుకోలేదు. భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ అవార్డు విజేతలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మరో తీపి కబురు అందించింది. జాతీయ క్రీడా అవార్డుల ప్రైజ్‌మనీ భారీగా పెంచినట్లు మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. నూతన విధానం ప్రకారం ఖేల్‌రత్న పురస్కారానికి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీగా చెల్లించనున్నారు. గతంలో ఇది రూ. 7.5 లక్షలుగా ఉంది. దీనితో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల ప్రైజ్‌మనీలో కూడా మార్పులు చేశారు. గతేడాది వరకు ఈ అవార్డులకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లిస్తుండగా... ఈ ఏడాది నుంచి అర్జున, ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం గ్రహీతలకు రూ. 15 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ద్రోణాచార్య (రెగ్యులర్), ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలు రూ. 10 లక్షల చొప్పున అందుకోనున్నారు. దీనిపై మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ‘చివరిసారిగా 2008లో ప్రైజ్‌మనీలో మార్పులు జరిగాయి. ప్రతీ పదేళ్లకోసారి ఈ మొత్తాన్ని సమీక్షించాల్సిన అవసరముంది. ప్రతీ రంగంలోని నిపుణుల సంపాదనలో ఏటికేడు వృద్ధి ఉంటున్నప్పుడు క్రీడాకారులకు ఎందుకు ఉండకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈసారి ఎక్కువ సంఖ్యలో అవార్డు విజేతలను ఎంపిక చేయడం పట్ల వస్తోన్న విమర్శలను ఆయన తప్పి కొట్టారు. ‘ప్రపంచ వేదికపై మన అథ్లెట్ల ప్రదర్శన గణనీయంగా మెరుగైంది. అందుకే వారి కృషికి గుర్తింపునిచ్చాం. అథ్లెట్ల ఘనతల్ని ప్రభుత్వం గుర్తించకపోతే వారిని నిరాశపర్చినట్లే. గత నిర్ణయాలతో తాజా వాటిని పోల్చకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
శాంతి మన విధానం
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు. ‘పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టార’ని ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి పరోక్షంగా హెచ్చరించారు. ‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది’ అన్నారు. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారని కొనియాడారు. నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగించారు. ‘భరతమాత ముద్దుబిడ్డలు వారు. దేశ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశమంతా సెల్యూట్ చేస్తోంది’ అన్నారు. ఒకవైపు సరిహద్దులను, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుతున్న త్రివిధ దళాలు, పారామిలటరీ, పోలీసు బలగాలు మనకు గర్వకారణమన్నారు. గల్వాన్‌లోయ వద్ద చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబ భారత్‌ను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదేనని వివరణ ఇస్తూ విదేశీ పెట్టుబడుదారుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. వైద్యులకు సెల్యూట్ కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ‘దురదృష్టవశాత్తూ వారిలోనూ చాలామంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఈ దేశ హీరోలు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే’ అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే, విమానయాన, విద్యుత్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇతర సేవల్లోని వారు అంతా ఈ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచమంతా తలుపులు మూసుకున్నవేళ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు, ఇతర వసతులు అందేలా వీరు ప్రజా సేవలో నిమగ్నమయ్యారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది ప్రాణాలను బలిగొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని ఆయన ప్రశంసించారు. కరోనా ముప్పును ముందుగానే పసికట్టి, సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. ‘భారీ జనాభా ఉన్న, విస్తారమైన, వైవిధ్యభరిత భారత్ లాంటి దేశంలో ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మానవాతీత శక్తులుండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కూడా సరైన చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ‘ప్రజలంతా కలసికట్టుగా పోరాడారు. ప్రభుత్వాలు, ప్రజలు.. అంతా కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ మహమ్మారి విస్తృతిని సాధ్యమైనంతగా అడ్డుకోగలిగాం’ అన్నారు. 2020 నేర్పిన పాఠం 2020 సంవత్సరంలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవులు సర్వ శక్తిమంతులనే భ్రమను తొలగించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. విభేదాలు పక్కనబెట్టి భూగోళ రక్షణ కోసం మానవాళి అంతా ఏకమైన శతాబ్దం ఇదని కోవింద్ వ్యాఖ్యానించారు. మానవ సమాజం ఏర్పర్చుకున్న కృత్రిమ అడ్డుగోడలను కరోనా కూల్చివేసిందన్నారు. ఆరోగ్య సేవల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు గుర్తు చేసిందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వ వైద్యశాలలే ముందున్నాయన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా పేదలు, రోజు కూలీలు దారుణంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన తదితర సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసిందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆర్థిక పునరుత్తేజానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు. రామాలయ నిర్మాణం గర్వకారణం అయోధ్యలో ఆగస్ట్ 5న రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రస్తావించారు. అది భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘దశాబ్దాలుగా దేశప్రజలు గొప్ప సంయమనాన్ని, ఓపికను ప్రదర్శించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి’ అని పేర్కొన్నారు. -
సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి 20 లక్షల విరాళం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో పోరాడి విజయం సాధించి అమరులైన సైనికులకు నివాళిగా ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ.20 లక్షలు విరాళమిచ్చారు. కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన శ్వాసకోçశ సంబంధిత యంత్రాలను కొనుగోలు చేస్తారని అధికారులు వెల్లడించారు. రూ. 20 లక్షలను చెక్కు ద్వారా అందించారని పేర్కొన్నారు. రాష్ట్రపతి తన ఖర్చులను తగ్గించుకుని ఈ డబ్బును విరాళం ఇచ్చినట్లు చెప్పారు. -
రాష్ట్రపతిగా మూడేళ్లు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంనాటికి పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నారని రాష్ట్రపతి కార్యాలయం ఒక ట్వీట్లో వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో 7వేల మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని కోవింద్ కలుసుకున్నట్టు ఆ ట్వీట్లో వెల్లడించింది. ఈ మూడేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, సంక్షోభ సమయంలో ప్రదర్శించిన మానవత్వం గురించి రాష్ట్రపతి భవన్ వివరించింది. ► కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కి రాష్ట్రపతి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. ► కరోనా నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ తొలిసారిగా డిజిటల్ సదస్సులను ఏర్పాటు చేసింది. ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడి కరోనా పరిస్థితులపై చర్చలు జరిపారు. ► రాష్టపతి భవన్లో నిర్వహించే కార్యక్రమాలకు ఆన్లైన్ ద్వారా ఆహ్వానించే ఈ–ఇన్విటేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ► పార్లమెంటు పాస్ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు. 13 ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. 11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. ► రాష్ట్రపతి భవన్లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై నిషేధం విధించి వాటి స్థానంలో గాజు బాటిల్స్‌ను వినియోగించడం మొదలు పెట్టారు. ► మూడో ఏడాది పదవీకాలంలో రామ్‌నాథ్ ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు. ► రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న కోవింద్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధి విషయంలో మూడేళ్లుగా కోవింద్‌తో కలిసి పని చేస్తుండడం అద్భుతమైన అనుభూతినిస్తోందన్నారు. -
‘మీ త్యాగం సమున్నతం’
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సేనలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సంతాపం తెలిపారు. అమరవీరుల సమున్నత త్యాగాలను ఆయన కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అత్యున్నత త్యాగం చేసిన సైనికుల ధైర్యానికి సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నానని రాష్ట్రపతి కోవింద్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో నేలకొరిగిన సైనికులందరూ భారత సాయుధ దళాలు నెలకొల్పిన సంప్రదాయాలను సమున్నతంగా నిలబెట్టారని కొనియాడారు. వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి : కరోనాపై పోరులో రాష్ట్రపతి సాయం -
కరోనాపై పోరులో రాష్ట్రపతి సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి తనవంతు సాయం అందించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ ముందుకొచ్చారు. తన వేతనంలో ఏడాది పాటు 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఖర్చులకు కళ్లెం వేయడానికి పలు దేశీయ యాత్రలు, ఇతర కార్యక్రమాలను రాష్ట్రపతి గణనీయంగా తగ్గించుకుంటారు. పరిమిత సంఖ్యలోనే అతిథులు.. రాష్ట్రపతి రామ్‌నాథ్ తాజా నిర్ణయాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్ 20 శాతం తగ్గుతుందని అంచనా. రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర బడ్జెట్‌కు ప్రతిఏటా రూ.200 కోట్లకుపైగా కేటాయిస్తారు. ఈసారి ఇందులో రూ.40–45 కోట్లు మిగలనున్నాయి. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోమ్, స్టేట్ బాంక్వెట్స్ వంటి కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించనున్నారు. వడ్డించే ఆహార పదార్థాల సంఖ్యను కుదిస్తారు. అలంకరణకు తక్కువ పుష్పాలు వాడనున్నారు. సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకు ఉపయోగించే లిమోసిన్ కారు(ధర రూ.10 కోట్లు) కొనుగోలుకు ఈసారి దూరంగా ఉండాలని రాష్ట్రపతి నిర్ణయించారు. విద్యుత్, ఇంధన వ్యయాన్ని తగ్గించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కార్యాలయాలను పర్యావరణ హితంగా మారుస్తారు. కాగితం వాడకాన్ని భారీగా తగ్గిస్తారు. పీఏం–కేర్స్ ఫండ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి నెలలో తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సీవీసీగా సంజయ్ కొఠారి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారి(63) సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. శనివారం ఉదయం కొరాఠీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కొఠారి, హరియాణా కేడర్‌కు చెందిన వారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయన 2016లో పదవీ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వ రంగ సంస్థల పదవుల ఎంపిక బోర్డు(పీఈఎస్బీ)కు చైర్మన్‌గా నియమితులయ్యారు. 2017లో రాష్ట్రపతి కోవింద్‌కు కార్యదర్శిగా ఎంపికయ్యారు. సీవీసీగా ఆయన 2021 జూన్ వరకు కొనసాగుతారు. కొఠారీ నియామకంతో ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ‘సీవీసీ నియామక విధానాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆ పదవికి దరఖాస్తు కూడా చేసుకోని, ఎంపిక కమిటీ పరిశీలించని వ్యక్తిని నియమించింది. సీవీసీ పదవికి ఎంపిక ప్రక్రియ మళ్లీ చేపట్టాలి’అని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ డిమాండ్ చేశారు. ప్రధాని నేతృత్వంలోని హోం మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నేత సభ్యులుగా ఉండే కమిటీ సీవీసీని ఎంపిక చేయడం ఆనవాయితీ. సీవీసీ పదవీ కాలం నాలుగేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటారు. సీవీసీ కేవీ చౌదరి గత ఏడాది జూన్‌లో రిటైరైనప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. కాగా, రాష్ట్రపతి కోవింద్ కార్య దర్శిగా పీఈఎస్బీ చైర్మన్ కపిల్ దేవ్ త్రిపాఠీని ఈనెల 20నే కేంద్రం నియమించింది. -
మహమ్మారి కోరల్లో 724 మంది
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నాటికి కరోనా మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య 724కు పెరిగిపోయింది. గత 24 గంటల్లో మరో ఏడుగురు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 17కు చేరుకుందని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరులతో అన్నారు. కర్ణాటకలో ఇప్పటివరకూ ఇద్దరు మరణించగా మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒకొక్కరు చొప్పున కరోనాకు బలైన విషయం తెలిసిందే. వ్యాధి బాధితుల్లో 47 మంది విదేశీయులు కాగా, 66 మందికి నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క వ్యక్తి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాడని, దీంతో దేశం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య 640 అయ్యిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వ్యాధి చికిత్సకు మందులు అభివృద్ధి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టనున్న సాలిడారిటీ ట్రయల్‌లో భారత్ కూడా భాగస్వామి కానుందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయినా వైద్య పరికరాల కొరత రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 10వేల వెంటిలేటర్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చామని, వీటికి అదనంగా మరో 30 వేల వెంటిలేటర్లను రానున్న ఒకట్రెండు రోజుల్లో తయారు చేయాల్సిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్‌ను కోరామన్నారు. వలస కార్మికులకు ఆహారం, నీరు, పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించామని, హోటళ్లు, హాస్టళ్ల వంటివి తెరిచే ఉండాలని, తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలిల శ్రీవాస్తవ తెలిపారు. వలస కార్మికులను రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఆలోచన ఏదీ లేదని ఆమె స్పష్టం చేశారు. రోగులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం టెలీమెడిసిన్ వినియోగంపై మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. గడచిన రెండు నెలల్లో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు సుమారు 15 లక్షల మంది ఉన్నారని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా తెలిపారు. కరోనా నేపథ్యంలో వీరందరినీ కచ్చితంగా పరిశీలించేందుకు నిఘా వ్యవస్థలను పటిష్టీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో సార్క్ దేశాలన్నింటికీ ఒక ఉమ్మడి ఎలక్ట్రానిక్ వేదికను ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. సార్క్ దేశాల ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదన చేసింది. అతిక్రమించిన అధికారులపై చర్యలు.. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తున్న అధికారులపై ప్రభుత్వాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తెలంగాణలో తన కుమారుడి అంతర్జాతీయ ప్రయాణ వివరాలను దాచి ఉంచినందుకు ఓ డీఎస్పీపై చర్యలు తీసుకున్నట్టుగానే కేరళలో ఓ ఐఏఎస్ అధికారిపై, ఢిల్లీలో ఓ పోలీస్ అధికారిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవలే విదేశాల్లో హనీమూన్ జరుపుకుని వచ్చిన యువ ఐఏఎస్ అధికారి, కొల్లం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై నిబంధనల ఉల్లంఘనకు గాను పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రయత్నించిన రైల్వే పోలీస్ అధికారిని అధికారులు సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో మాస్కులు, శానిటైజర్లను అధిక ధరలకు అమ్ముతున్న ఓ కెమిస్టును విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. మా విమానాలు వాడుకోండి... భారతీయ పౌరులను దేశంలోకి తిరిగి తీసుకొచ్చేందుకు, అత్యవసర సేవల కోసం తమ విమానాలు, సిబ్బంది, విమానాశ్రయ ఉద్యోగులను వాడుకోవచ్చునని ప్రైవేట్ విమానయాన సంస్థ గో ఎయిర్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇండిగో కూడా ఇటీవలే ఇలాంటి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం ఉండగా.. సరుకుల రవాణా చేసేవి మాత్రం యథావిధిగా చేయవచ్చు. అయితే ఇండిగో, గో ఎయిర్ లాంటి దేశీ విమానయాన సంస్థలు ప్రయాణికుల్లేకుండా, కేవలం సరుకులు మాత్రమే రవాణా చేసేందుకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఉపరాష్ట్రపతి ఒక నెల వేతనం సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు, లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మద్దతుగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన ఒక నెల వేతనాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. షిర్డీ సాయి సంస్థాన్ రూ.51 కోట్ల విరాళం సాక్షి ముంబై: కరోనా వైరస్‌పై పోరాటంలో మహారాష్ట్ర సర్కారును ఆదుకునేందుకు షిర్డీ సాయి సంస్థాన్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51 కోట్ల విరాళం ప్రకటించింది. ‘రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే అయిదుగురు మృతి చెందగా, 120 మందికిపైగా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు షిర్డీ సాయి సంస్థాన్ సీఈఓ అరుణ్ డోంగరే పేర్కొన్నారు. గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాధి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రథమ పౌరులుగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో, రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన మార్గదర్శనం చేయడంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పోషించే పాత్ర కీలకమని రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం వారు సంయుక్తంగా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలను చైతన్య పరిచే విషయాల్లో చొరవతీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆహారపంపిణీ కేంద్రం వద్ద కొట్లాడుతున్న నిరాశ్రయులు నిర్మానుష్యంగా మారిన కేరళలోని మెప్పుయుర్ రోడ్డుపై పునుగుపిల్లి -
ఆ అతిథుల జాబితాలో మన్మోహన్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవనున్నారు. పలు విపక్ష నేతలను ఈ విందుకు ఆహ్వానించకపోయినా రాష్ట్రపతి ఇచ్చే విందులో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారని భావిస్తున్నారు. అగ్రదేశాధినేత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి విందును బహిష్కరించాలని లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి నిర్ణయించిన క్రమంలో విందుకు హాజరయ్యేందుకు సర్దార్జీ సంసిద్ధమవడం గమనార్హం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని ఈ విందుకు ఆహ్వానించకపోవడంపై విపక్ష నేత మండిపడుతున్నారు. విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని పక్కనపెట్టడమేనని చౌధరి పేర్కొన్నారు. మనసు మార్చుకున్న మన్మోహన్ కాంగగ్రెస్ అధినేత్రి, యూపీఏ చీఫ్ సోనియా గాంధీని ఆహ్వానించనందుకు నిరసనగా ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరు కారాదని ముగ్గురు కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధరి, గులాం నబీ ఆజాద్‌లు విందుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చదవండి : 'సిక్కుల ఊచకోత జరిగేది కాదు' -
న్యాయవ్యవస్థ కృషి అమోఘం
న్యూఢిల్లీ: లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి ప్రసంగించారు. ‘లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సాధించడంలో భారత సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ చురుకైన, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసింది. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విశాఖ మార్గదర్శకాలు మొదలుకొని, సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్ పోస్టుల్లో నియమించేందుకు ఉద్దేశించిన పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు వరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశాన్ని ప్రగతిశీల సామాజిక పరివర్తన దిశగా తీసుకెళ్తున్నాయి’అని పేర్కొన్నారు. ‘దేశంలో భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడం హర్షణీయం. సామాన్యులకు న్యాయాన్ని సులభతరం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సంస్కరణలను తెచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పులు రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థ మరింత పటిష్టం చేశాయి. న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్న వివిధ లోపాలను గుర్తించి, సరిచేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన నిశ్శబ్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమతూకం సాధించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు అనేక దేశాల దృష్టిని ఆకర్షించాయి. సమాచార సాంకేతికాభివృద్ధి కారణంగా తలెత్తిన సమాచార పరిరక్షణ, గోప్యతా హక్కు వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంది’అని పేర్కొన్నారు. ‘లింగపరమైన న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణపై సమకాలీన దృక్పథాలు, మారుతున్న ప్రపంచంలో రాజ్యాంగానికి గతిశీల వ్యాఖ్యానం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమన్వయం, నేటి ఇంటర్నెట్ యుగంలో గోప్యతా హక్కు రక్షణ అనే ఐదు వేర్వేరు అంశాలు ప్రపంచ న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నిటిలోనూ లింగపరమైన న్యాయం అనే అంశమే ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రాధాన్యంగా ఉంది. పెరుగుతున్న ప్రజాకర్షక విధానాలపై గత దశాబ్దంలో రాజ్యాంగ విలువల ప్రాతిపదికన విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామం రాజ్యాంగాల మూలాలపై మరో చర్చకు తెరలేపింది’అని తెలిపారు. ప్రపంచవేగంగా, అనూహ్యంగా ఇటీవలి కాలంలో పరిణామం చెందుతూ వస్తోంది. దీనివల్ల న్యాయవ్యవస్థ మరింత క్రియాశీలకంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం, రాజీ మార్గాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తీర్పులను సత్వరం వెలువరించడంలో కోర్టులు చాలా ప్రగతిని సాధించాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే: సీజేఐ పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. ‘పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే. పర్యావరణ అంశాలను జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు అడ్డుకాజాలవు. భూమిపై మనిషి ఒక బీజంగా మాత్రమే కాదు, పరాన్నజీవిగా మారాడు. భూమికి ఇస్తున్న దానికంటే భూమి నుంచి మనిషి తీసుకునేదే ఎక్కువనే అభిప్రాయం ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒకే విధమైన అంతర్జాతీయ చట్టాలు అవసరం’అని సీజేఐ తెలిపారు. ‘దేశంలోని 103 కోట్ల ప్రజల హక్కులకు జవాబుదారీగా ఉంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్ష మేరకు తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో వివిధ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు. -
ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీడియాదే
సాక్షి, బెంగళూరు: ‘కొత్తగా వస్తున్న మాధ్యమాలు అనతికాలంలోనే ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలో నిజాలను జనాలను తెలియజేయాల్సిన బాధ్యత మాధ్యమాలదే. కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయ మాధ్యమాలు వాస్తవాలను వెలుగులోకి తేవడంతో విజయవంతం అయ్యాయి’అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. శనివారం బెంగళూరులోని హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ది హడిల్’ నాలుగవ ఎడిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి మాట్లాడుతూ మాధ్యమ రంగంలో వాస్తవాలు తెలియజేయడం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, న్యాయం, మానవీయత అనే ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇటీవల కాలంలో కొత్తగా ఎన్ని పత్రికలు వచ్చినా.. ఎప్పటి నుంచో ఉన్న వార్తా సంస్థలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. క్రీడలు, వ్యాపారం, రాజకీయం, సామాజిక రంగాల వార్తలకు ప్రముఖ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సోషల్ మీడియా పెరిగిపోతున్నా, పత్రికలకు ప్రాధాన్యం తగ్గలేదన్నారు. జాతిపిత కూడా విలేకరే... జాతిపిత మహాత్మాగాంధీ కూడా పత్రికా విలేకరిగా పని చేశారని రాష్ట్రపతి గుర్తు చేశారు. సత్యం, ప్రామాణికమే మాధ్యమాల ప్రధాన ఆయుధం అన్నారు. మాధ్యమాల్లో నిజాయితీ, పాలనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం యడియూరప్ప అన్నారు. పాలనలోని పారదర్శకతను గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియా రంగంపై ఉందని చెప్పారు. మంచి పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. -
నిర్భయ కేసు విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణని సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదావేసింది. అలాగే రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌నూ శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తన పాత లాయర్‌ను తొలగించారని, కొత్త లాయర్‌ను నియమించు కోవడానికి సమయం అవసరమని దోషి పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ(డీఎల్ఎస్ఏ) మరో లాయర్‌ను సూచించగా అందుకు పవన్ సుముఖంగా లేనట్టు తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. విచారణ ఆలస్యం కావడంతో జడ్జి ధర్మేంద్ర. పవన్ తరఫున వాదించేందుకు రవి క్వాజీ అనే లాయర్‌ను కొత్తగా నియమించారు. -
సీఏఏ చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్ముని ఆశయ సాధనకు కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) చారిత్రకమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. నిరసనల పేరుతో కొందరు హింసకు పాల్పడటం దేశాన్ని, సమాజాన్ని బలహీనపరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి అధికార పక్షం నేతలు బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించగా ప్రతిపక్షం నిరసన ప్రకటించింది. సుమారు 70 నిమిషాల పాటు జరిగిన రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... బడ్జెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను పార్లమెంటుకు తీసుకువస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెరవేరిన గాంధీజీ ఆశయం.. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో నిరసనల పేరుతో హింస చెలరేగడం సరికాదు. సర్వమత సమానత్వం భారత్ చిరకాలంగా నమ్ముతున్న సూత్రం. దేశ విభజన సమయంలో ఈ నమ్మకంపై తీవ్రమైన దాడి జరిగింది. పాకిస్తాన్లో నివసించేందుకు ఇష్టపడని హిందువులు, సిక్కులు భారత్‌కు తిరిగి రావచ్చు. అలా వచ్చిన వారు ఇక్కడ సాధారణ జీవితం గడిపేలా చేయడం ప్రభుత్వ బాధ్యతని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. ఆయన ఆకాంక్షలను గౌరవించడం అందరి బాధ్యత. ఉభయసభలు ఆ బాధ్యతను నెరవేర్చడం సంతోషకరమైన విషయం. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా సీఏఏ అమల్లోకి రావడం సంతోషకరం. పాకిస్తాన్లో జరుగుతున్న నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి వంటి ఘటనలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా ఇలాంటి ఘటనలను ఖండించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలి. దేశీయ ఉత్పత్తులనే కొనండి... దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు రికార్డు స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉంచిన నమ్మకాన్ని బలపరిచేదిగా ఉంది. ఈ తీర్పుపై దేశ ప్రజలు స్పందించిన తీరు ప్రశంసార్హమైంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానమైన హక్కులు సాధించుకోవడం ద్వారా జమ్మూ కశ్మీర్, లడాఖ్ ప్రజలూ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఓ చారిత్రక ఘట్టం. జాతి ప్రయోజనాల కోసం ప్రతి వ్యక్తి తన బాధ్యతలు గుర్తెరిగి నడుచుకునేలా చేయాలి. అందరం కలిసికట్టుగా ఈ దశాబ్దాన్ని తమ బాధ్యతలను నెరవేర్చేందుకు అంకితం చేద్దాం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం త్రివిధ దళాల మధ్య సమన్వయం సాధించేందుకు దోహదపడుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మహిళల భద్రత కోసం 1,000 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహిళలకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు ఇవి దోహదపడతాయి. సభలో తొలిరోజు.. ► సమావేశానికి ముందుగా రాష్ట్రపతి కోవింద్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు తోడ్కొని వచ్చారు. ► మొదటి వరుసలో ప్రధాని మోదీతోపాటు మంత్రులు థావర్ చంద్ గహ్లోత్, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, తదితరులతోపాటు ప్రతిపక్షం నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే ఆసీనులయ్యారు. ► కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదటి వరసకు బదులుగా శశి థరూర్, మనీష్ తివారీ తదితరులతో కలిసి ఐదో వరుసలో కూర్చున్నారు. ► రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు తెలుపుతున్న నిరసనలను టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్ తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ కనిపించారు. ► బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి చెందిన అతుల్ రాయ్ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాయ్.. రేప్ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. కోర్టు పెరోల్ ఇవ్వడంతో ప్రమాణం చేశారు. -
అహింసాయుతంగా పోరాడండి
న్యూఢిల్లీ: సదాశయం కోసం జరిగే పోరాటం అహింసాయుతంగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. సామాజిక, ఆర్థిక ఆకాంక్షలను సాధించుకునే క్రమంలో రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింసను నిత్య జీవితంలో అంతర్భాగంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతో ఉందన్నారు. ‘ప్రజలే దేశ భవితను నిర్ణయించే అసలైన శక్తి. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు. ‘దేశాభివృద్ధికి అంతర్గత భద్రత ఎంతో కీలకం. దేశ అంతర్గ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది’ అని చెప్పారు. ‘స్వచ్ఛభారత్ అభియాన్ ఎంతో తక్కువకాలంలోనే ఘన విజయం సాధించింది. సబ్సిడీపై వంటగ్యాస్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు పలు ప్రభుత్వ పథకాలను ప్రజలు తమవిగా చేసుకోవడం ద్వారా అవి విజయవంతమయ్యాయి’ అని అన్నారు. ‘ప్రజాస్వామ్యం కేవలం అలంకారప్రాయంగా కాకుండా, ఆచరణాత్మకంగా ఉండాలని భావిస్తే మనం ఏం చేయాలి? ఆర్థిక, సామాజిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ పద్ధతులను తప్పకుండా అనుసరించాలనేదే నా అభిప్రాయం’ అంటూ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన మాటలను రాష్ట్రపతి ఈ సందర్భంగా ఉటంకించారు. -
49 మందికి ‘బాల్ శక్తి’ అవార్డులు
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మంది చిన్నారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘బాల్ శక్తి’అవార్డులను ప్రదానం చేశారు. 2020 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కోవింద్ అందజేశారు. అవార్డు కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రాన్ని అందించారు. దీనికిగానూ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలల్లో ఆవిష్కరణలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. దొంగల బారి నుంచి రష్యా వాసిని కాపాడిన ఇషాన్ శర్మ.. చిన్న వయసులో సైద్ధాంతిక రచయితగా రికార్డుల్లోకెక్కిన ఓంకార్ సింగ్.. పిన్న వయసున్న పియానిస్ట్ గౌరీ మిశ్రా..తదితరులు అవార్డులు అందుకున్నారు. డౌన్ సిండ్రోమ్, మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొరక్ బిశ్వాస్ నాట్య రంగంలో అసాధారణ ప్రతిభ చూపడంతో బాల్ శక్తి అవార్డు అందుకున్నాడు. -
అలహాబాద్ వర్సిటీ వీసీ రాజీనామాకు ఆమోదం
న్యూఢిల్లీ: అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్ లాల్ హంగ్లూ రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ) వెల్లడించింది. అనేక అవక తవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రాష్ట్రపతి ఆదేశించారని పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్చార్డీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి వర్సిటీ వీసీగా ఉన్న సమయంలోనూ హంగ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. -
సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పౌరసత్వ బిల్లు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్లో ఐయూఎంఎల్ ఆరోపించింది. మత ప్రాతిపదికన ఒక వర్గానికి చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం రాత్రి ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఐయూఎంఎల్ తరఫున న్యాయవాది పల్లవి ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే బిల్లుకు సంబంధించిన కార్యాచరణపై స్టే విధించాలని కోర్టును కోరారు. ఏ చట్టమైనా అక్రమ వలసదారులను ఉద్దేశించి రూపొందించాలంటే.. మతం, కులం, జాతీయత ఆధారంగా కాకుండా.. మొత్తం అక్రమ వలసదారులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదే కాదు, అమానవీయమైనది కూడా అని అన్నారు. కాగా, ఈ బిల్లు సుప్రీంకోర్టు కొట్టివేయడం తథ్యమని కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రభస పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ హింసను రాజేస్తోందని అధికార పక్షం వ్యాఖ్యానించడంతో గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజ్వరిల్లుతున్న హింస అంశాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లేవనెత్తారు. ఈ బిల్లు వల్ల మొత్తం ఈశాన్య ప్రాంతమంతా అట్టుడుకుతోందన్నారు. ‘ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈశాన్యం మరో కశ్మీర్‌లా మారింది’ అన్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రెండు ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే హింసను రాజేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జోషి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వారితో పాటు డీఎంకే సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. -
నిర్భయ దోషికి క్షమాభిక్ష వద్దు!
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు శుక్రవారం కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ సిఫారసును రాష్ట్రపతికి పంపించింది. దిశ హత్యాచార నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన రోజే ఈ సిఫారసు చోటు చేసుకుంది. మరోవైపు, క్షమాభిక్ష వినతిని తోసిపుచ్చాలని నిర్భయ తల్లి కూడా రాష్ట్రపతిని కోరింది. 2012 డిసెంబర్లో నిర్భయను ముకేశ్, పవన్, వినయ్, అక్షయ్‌లు పాశవికంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం ఆ నలుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. వారిలో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఏడేళ్లు గడచిపోయినా, తమకు న్యాయం జరగలేదని, అదే అవేదనను ఇంకా అనుభవిస్తూనే ఉన్నామని రాష్ట్రపతికి రాసిన లేఖలో నిర్భయ తల్లి వివరించారు. తమలా కాకుండా, దిశ తల్లిదండ్రులకు సత్వరమే న్యాయం లభించిందని ఆ లేఖలో ప్రస్తావించారు. -
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్ఎస్సీ) కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఎస్సీఎల్ఎస్సీలో పెండింగ్ కేసులు తగ్గాయి. జనవరి 2018 లో 3,800 కేసులు ఉండగా.. ఆగస్టు 2019 నాటికి 1811కు తగ్గాయి. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు. నల్సా డైరెక్టర్ సునీల్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించారు. న్యాయ సేవలు అందించడంలో సమర్థతను, న్యాయ సేవలు పొందగలిగే అవకాశాలను పెంపొందించడంపై చర్చించారు. నల్సా భవిష్యత్తు కార్యక్రమాలకు మార్గదర్శకంగా జస్టిస్ ఎన్.వి.రమణ ఒక విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించారు. లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం, డిజిటైజేషన్ చేయడం, న్యాయ సేవలు పొందడంలో ప్రొటోకాల్ రూపొందించడం వంటి కార్యక్రమాలపై నల్సా దృష్టిపెట్టనుంది. -
నేను ఉరి తీస్తా.. ఆమె ఆత్మ శాంతిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచార ఘటన ‘నిర్భయ’ కేసు దోషులకు మరణ శిక్ష ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేకపోవడంతో జైలు అధికారులు టెన్షన్ పడుతున్నారన్న వార్తకు స్పందన వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాకు చెందిన రవి కుమార్ దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్‌కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ తీహార్ జైలులో ఎగ్జిక్యూటర్ లేనందున తనను తాత్కాలిక తలారిగా నియమించాలని కోరారు. తద్వారా నిర్భయ కేసు దోషులను త్వరలో ఉరి తీయవచ్చు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆయన పేర్కొన్నారు. కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. నేరస్థులో ఒకడైన రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాల నేరస్థుడు సంస్కరణ గృహంలో ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడంతో, తీహార్ జైలులో ఉన్న వినయ్ శర్మ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. అయితే దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్‌కు మరణశిక్షను అమలు చేయనున్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశముందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అక్కడ తలారి లేక.. ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన తలారీలు ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో ఉన్నారు. తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. Himachal Pradesh: Ravi Kumar, from Shimla has written to President Kovind to appoint him as temporary executioner in Delhi’s Tihar Jail as there is no executioner there.He states, “Appoint me executioner so ‘Nirbhaya’ case convicts can be hanged soon & her soul rests in peace". pic.twitter.com/fqZLarNZIQ — ANI (@ANI) December 4, 2019 -
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(58)ను కేంద్రం నియమించింది. ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ(72)ను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తెలిపింది. రాజస్తాన్ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ స్థానంలో మిశ్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజీవ్ కేబినెట్లో మంత్రికి గవర్నర్ గిరీ కేరళ గవర్నర్‌గా నియమితులైన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్(68) సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన గతంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని మంత్రిగా ఉన్న ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముస్లిం పర్సనల్ లా సంస్కరణలు చేపట్టాలని, ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేయాలని ఆరిఫ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన..2007 వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ చట్టం చేసిన మోదీ ప్రభుత్వానికి ఆయన మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం స్థానంలో ఆరిఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దక్షిణాదిలో బలపడేందుకేనా? న్యూఢిల్లీ: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని గవర్నర్లుగా నియమించడం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల్ని మచ్చిక చేసుకునేందుకు, కొత్త నాయకత్వంతో సంస్థాగతంగా బలం కూడదీసుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ద్రవిడ రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి మార్గం సుగమమయ్యేలా తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ శ్రేణులను చేర్చుకోవడం ద్వారా బీజేపీని విస్తరించుకోవాలనే యోచనలో ఉందని అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతటా బీజేపీ సత్తా చాటినప్పటికీ, ఇప్పటికే బలంగా ఉన్న కర్ణాటక మినహా ప్రభావం చూపలేకపోయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. అయితే, 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈసారి నాలుగు సీట్లు గెలుచుకుంది. అధికార టీఆర్ఎస్కు దీటుగా ఎదిగేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలను చేర్చుకోవడం వంటి చర్యలను వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రాభవం తగ్గడంతో కేరళ వంటి రాష్ట్రాల్లో బలం పుంజుకునేందుకు తమ పార్టీకి మంచి అవకాశాలున్నాయని సీనియర్ నేత ఒకరు అన్నారు. అదేవిధంగా, తమిళనాడులో దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధిల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్‌ను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా నియమించడం కూడా దక్షిణాదిన బలపడేందుకు దోహదం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. -
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
టీటీడీకి అభినందనలు తెలిపిన రాష్ట్రపతి
సాక్షి, తిరుమల : కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టీటీడీపై ప్రశంసలు కురింపించారు. టీటీడీ సౌకర్యాలపై సంతృప్తి చెందిన ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు వేదిక్ యూనివర్శిటీ ప్రత్యేకతల గురించి రాష్ట్రపతికి ఈవో సింఘాల్ వివరించారు. రోండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రపతి చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించేందుకుగానూ రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీహరికోటకు చేరుకుంటారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్
-
తిరుమలలో రాష్ట్రపతి కోవింద్
తిరుమల/రేణిగుంట(చిత్తూరు జిల్లా)/సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. సతీమణి సవితా కోవింద్‌తో కలసి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శనివారం రాత్రికి రాష్ట్రపతి తిరుమలలోనే బస చేశారు. ఆదివారం ఉదయం వరాహస్వామి దర్శనానంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించాక తిరుగు ప్రయాణమవుతారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. : అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం 5.10 గంటలకు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాష, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, డీసీసీబీ చైర్మన్ సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి, చిత్తూరు కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, డీఐజీ కాంతిరాణ టాటా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనశ్రేణిలో రోడ్డు మార్గాన తిరుచానూరుకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని దర్శించుకుని తిరుమలకు వెళ్లారు. శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో గవర్నర్ దంపతులు రేణిగుంట విమానాశ్రయం లాంజ్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముచ్చటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. -
నేడు తిరుమలకు రాష్ట్రపతి కోవింద్ రాక
-
ప్రతి ఒక్కరికీ సాధికారతే లక్ష్యం
న్యూఢిల్లీ: రెండోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ రోడ్‌మ్యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. 2014లో ప్రారంభమైన నిరంతర, నిరాటంక అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రజలు గట్టి తీర్పునిచ్చారని చెప్పారు. భారత ప్రజాస్వామ్య విశ్వసనీయతను ఈ సాధారణ ఎన్నికలు పెంపొందించాయన్నారు. రికార్డు స్థాయిలో 61 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, వీరిలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నాటికి నవభారతాన్ని నిర్మించేలా ప్రతి ఒక్కరికీ సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి కోవింద్ సుమారు గంటసేపు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని అన్నారు. ఎప్పుడూ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటం అభివృద్ధి కార్యక్రమాల వేగం, కొనసాగింపుపై ప్రభావం చూపిస్తోందన్నారు. అందువల్ల ఎంపీలందరూ ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు. లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికైన వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోందన్నారు. భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోందంటూ మెరుపు దాడులను, పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడులను రాష్ట్రపతి ప్రస్తావించారు. తొలుత మెరుపుదాడులతో, ఆ తర్వాత పుల్వామా దాడి నేపథ్యంలో సరిహద్దు పొడవునా ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల ద్వారా ప్రభుత్వం ఈ విషయంలో తన ఉద్దేశాన్ని, సామర్థ్యాన్ని చాటి చెప్పిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సురక్షితమైన, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రైతు సంక్షేమానికి చర్యలు నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. రైతులు, చిరు వ్యాపారులకు పింఛను పథకాలు ప్రారంభించేందుకు, రైతులందరికీ రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేందుకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా గత ఐదేళ్లలో పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాల నిర్మూలన మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధిని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపే విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నల్లధన వ్యతిరేక కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకువెళతామన్నారు. గత రెండేళ్లలో 4 లక్షల 25 వేల కంపెనీ డైరెక్టరపై అనర్హత వేటు వేశామని, 3 లక్షల 50 వేల అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలన్నీ ప్రస్తుతం దేశానికి అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ విధానాన్ని, స్ఫూర్తిని బలోపేతం చేసేలా దేశ ప్రయోజనాల సాధనకు తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకుని పోతోందని చెప్పారు. ప్రసంగం సైడ్‌లైట్స్ ► ప్రసంగ సమయంలో కావేరీ జలాల సమస్యను తీర్చాలంటూ డీఎంకే పార్టీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ► రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ను, రఫేల్ అంశం గురించి ప్రసంగిస్తున్నపుడు ఎన్డీయే సభ్యులు చప్పట్లు చరిచారు. ► ప్రసంగసమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌సహా పలువురు ఎంపీలు మొబైల్ ఉపయోగించడం కెమెరాల కంటపడింది. ► రాష్ట్రపతి వెళ్లిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సభ్యులు పలువురు రాహుల్‌గాంధీని కలిశారు. సెంట్రల్ హాల్ నుంచి బయటకు వస్తూ సోనియా గాంధీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పలకరించుకున్నారు. కోవింద్ ఏడాదిలో ఇది రెండోసారి రాష్ట్రపతి కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. క్రీమ్ కలర్ జోధ్‌పురి సూట్ (బంద్గలా) ధరించిన కోవింద్ అశ్విక దళం ముందూ వెనుకా నడుస్తుండగా బగ్గీలో కాకుండా కార్లో పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు. అంతకుముందు తన వ్యక్తిగత అంగరక్షకుల (పీబీజీ) గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి భవనం వెలుపల అశ్విక దళం (పీబీజీ) రాష్ట్రపతి వెంట ఉండటం అరుదుగా కన్పిస్తుంది. సాధారణంగా ఏడాదిలో మూడుసార్లు రాజధాని వాసులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఏడాది ఇలా జరగడం నాల్గోసారి. -
ఘనంగా గణతంత్రం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యాన్ని చాటుతూ సాగిన శకటాల కవాతు నడుమ 70వ గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పలువురు విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 90 నిమిషాల పాటు సాగిన వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆదర్శాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 22 శకటాలు పరేడ్‌లో పాల్గొనగా, అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి 16 కాగా, మిగిలిన ఆరు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి. అంతకుముందు, శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పరాక్రమ పురస్కారం అశోకచక్రను రాష్ట్రపతి కోవింద్..అమర జవాను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో కలసి రాహుల్ ముందటి వరుసలో కూర్చున్నారు. గతేడాది రాహుల్‌కు ఆరో వరసలో సీటు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కార్యక్రమం చివర వాయుసేన ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి అస్సాం రైఫిల్స్ మహిళా జవాన్లు, మహిళా అధికారి బైక్ స్టంట్లు గణతంత్ర వేడుకల్లో చరిత్ర సృష్టించాయి. మహిళా శక్తిని ప్రదర్శించాయి. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన, 183 ఏళ్ల చరిత్ర గల అస్సాం రైఫిల్స్‌కు మేజర్ కుష్బూ కన్వర్(30) నేతృత్వం వహించారు. నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్‌తోపాటు సిగ్నల్స్ కోర్కు చెందిన కెప్టెన్ శిఖా సురభి చేసిన మోటారు సైకిల్ విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో సంప్రదాయంగా వస్తున్న పురుష జవాన్ల ‘డేర్ డేవిల్స్’ బైక్ విన్యాసాల్లో కెప్టెన్ శిఖా సభ్యురాలు. మొత్తం పురుష జవాన్లతో కూడిన ఆర్మీ సర్వీస్ కార్ప్స్కు లెఫ్టినెంట్ కస్తూరి, ట్రాన్స్‌పోర్టబుల్ శాటిలైట్ టెర్మినల్ కాంటిజెంట్‌కు కెప్టెన్ భావ్నా శ్యాల్ నేతృత్వం వహించారు. ‘రాజస్తాన్‌కు చెందిన నేను, ఒక బస్ కండక్టర్ కూతురుని. నేనే ఈ పని చేయగలిగానంటే బాలికలెవరైనా తమ కలలను నిజం చేసుకోగలరని నా నమ్మకం’ అని ఒక బిడ్డకు తల్లి అయిన మేజర్ కన్వర్ తెలిపారు. లక్షలాది పూలతో సీపీడబ్ల్యూడీ శకటం శకటాల ప్రదర్శనలో సీపీడబ్ల్యూడీ (కేంద్ర ప్రజా పనుల విభాగం) శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శకటాన్ని ఏకంగా 3 లక్షల బంతిపూలు, మల్లె, గులాబీలతో అలంకరించింది. గాంధీ దండి యాత్రను ప్రదర్శిస్తూ, అహింసా మార్గంలో అనుచరులు, వెనుక ప్రపంచ శాంతి, ఐక్యతను ప్రదర్శించింది. పసుపు, నారింజ తలపాగాతో మోదీ రిపబ్లిక్ డే వేడుకల్లో రంగురంగుల తలపాగా ధరించే ఆనవాయితీని మోదీ ఈసారి కొనసాగించారు. ఎరుపు, పైన పసుపు, నారింజ రంగుతో కూడిన తలపాగా, కుర్తా పైజామా, నెహ్రూ ట్రేడ్‌మార్క్ జాకెట్‌తో ప్రధాని పాల్గొన్నారు. గణతంత్ర, ఆగస్టు 15 వేడుకల్లో మోదీ ధరిస్తున్న తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2018 పంద్రాగస్టు వేడుకల్లో కాషాయ రంగు తలపాగా ధరించిన మోదీ 2017లో చిక్కనైన ఎరుపు, పసుపు వర్ణంలో, బంగారు రంగు చారలు కలిగిన తలపాగాను కట్టుకున్నారు. రాజ్‌పథ్ విశేషాలు.. ► రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత 21 తుపాకుల సెల్యూట్‌తో జాతీయ గీతాలాపాన జరిగింది. ఆ తరువాత కవాతు బృందాల నుంచి కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు. ► మార్చింగ్ చేసిన ఆర్మీ బృందాల్లో మద్రాస్ రెజిమెంట్, రాజ్‌పుతానా రైఫిల్స్, సిక్కు రెజిమెంట్, గోర్ఖా బ్రిగేడ్లు ఉన్నాయి. ► సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)లో సభ్యులైన నలుగురు ఈసారి పరేడ్‌లో పాల్గొనడం విశేషం. వారందరి వయసు 90 ఏళ్లకు పైనే ► అమెరికా శతఘ్నులు ఎం777, ఎంబీటీ టీ–90, దేశీయంగా తయారుచేసిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ► పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ బృందం తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ► నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్, సిగ్నల్స్ యూనిట్ కోర్ బృందాలకు మహిళా అధికారులే నేతృత్వం వహించారు. ► 144 మంది యువ అధికారులతో కూడిన నేవీ బృందం వెనకే నేవీ శకటం పరేడ్‌లో పాల్గొంది. ► వైమానిక బృందంలో 144 మంది సైనికులకు చోటు కల్పించారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధ వ్యవస్థల్ని వైమానిక దళ శకటం ప్రదర్శించింది. తేలికపాటి యుద్ధ విమానం, దిగువ స్థాయి తేలికపాటి వెయిట్ రాడార్, సుఖోయ్30ఎంకేఐ, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ► ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లతో పాటు పారా మిలిటరీ, ఇతర అనుబంధ బలగాలు కూడా పరేడ్‌లో పాల్గొన్నాయి. ► ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కారానికి ఎంపికైన 26 మంది బాలలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ► వైమానిక దళ విమానాలు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ► 70వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా శనివారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులకు మిఠాయిలను పంచిపెట్టారు. పాకిస్తానీ సైనికులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని పాక్ సైనికులు ఆలింగనం చేసుకుని, చేతులు కలిపి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లడఖ్‌లో మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఐటీబీపీ జవాన్లు నజీర్ అహ్మద్ తరఫున భార్యకు అశోకచక్ర అందిస్తున్న కోవింద్. వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ. 3 లక్షల పుష్పాలతో రూపొందించిన శకటం -
ఆనంద వీక్షణం
-
హైకోర్టు విభజన : ఏపీకి 16, తెలంగాణకు 10 మంది జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి హైకోర్టు నుంచి 16 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, 10 మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఆ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేయనున్నాయి. ఏపీ హైకోర్టుకు కేటాయించిన జడ్జిలు 1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు) 2. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ 3. జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి 4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి 5. జస్టిస్ దామ శేషాద్రినాయుడు 6. జస్టిస్ మాదాత సీతారామమూర్తి 7. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు 8. జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి 9. జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 10. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్ 11. జస్టిస్ కుమారి జవలాకర్ ఉమాదేవి 12. జస్టిస్ నక్కా బాలయోగి 13. జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజిని 14. జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు 15. జస్టిస్ శ్రీమతి కొంగర విజయ లక్ష్మి 16. జస్టిస్ మాతోజ్ గంగారావు తెలంగాణకు కేటాయించిన జడ్జిలు 1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీరామచంద్రరావు 3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి 4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు 5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి 6. జస్టిస్ బులుసు శివ శంకర్రావు 7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్ 8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు 9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి 10. జస్టిస్ తోడుపునూరి అమర్నాథ్ గౌడ్ -
భారత్‌ను తల సేమియా రహితంగా తీర్చిదిదాలి
-
నేడు రాష్ట్రపతి రాక
కరీంనగర్‌రూరల్: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. కరీంనగర్‌రూరల్ మండలం నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భద్రతాసిబ్బంది ఆస్పత్రి, కళాశాల ఆవరణను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బొల్లారం నుంచి శనివారం ఉదయం 9.40గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10.40కి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటా రు. కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంతోపాటు తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం 10.57 గంటలకు ఆడిటోరియంలోని వేదికపైకి చేరుకుంటారు. పోలీస్బ్యాండ్మేళం ఆధ్యర్యంలో జాతీయగీతా లాపన అనంతరం 11 గంటలకు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వైద్య కళాశాలలో పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చి న ఐదుగురు మెడికల్ విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేస్తా రు. ముందుగా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్ ఈసీఎల్ నర్సింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడనున్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొంటారని ప్రతిమ వైద్య కళాశాల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉదయం 11.45గంటలకు కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్రపతి తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు వెళ్తారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేందుకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడురోజులుగా పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డితో కలిసి సం బంధిత అధికారులతో కలెక్టర్ ఎప్పటికపుడు ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. కళాశాల ఆవరణలో యుద్ధప్రాతిపదికన నాలుగు హెలిప్యాడ్లను నిర్మించారు. రాష్ట్రపతి భద్రతాసిబ్బంది మూడు రోజులుగా వాయుసేన హెలికాప్టర్ ద్వారా ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. ప్రతిమ ఆసుపత్రిని తమ ఆధీనంలోకి తీసుకుని బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కరీంనగర్–మంచిర్యాల రహదారి, నగునూరు–మొగ్ధుంపూ ర్ రహదారుల్లో ప్రత్యేక పోలీస్బృందాలతో నిఘా పెట్టారు. కల్వర్టులను తనీఖీ చేశారు. హెలిప్యాడ్ ఆవరణలోనే బయో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వైద్య బృందాలు, అంబులెన్స్, రాష్ట్రపతి బ్లడ్‌గ్రూప్ డోనర్లను అందుబాటులో ఉంచారు. ఆడిటోరియంలో సమీపంలో ప్రత్యేక వైద్యబృందం అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ ఆదేశించా రు. ప్రొటోకాల్ ప్రకారం బందోబస్తు ఏర్పాటుతోపాటు, జాతీయ గీతం ఆలపించే పోలీస్బ్యాండ్ను సీపీ ఏర్పాటుచేశారు. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, 100 కేవీ జనరేటర్‌ను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించడంతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. సీపీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్లు రాజర్షిషా, ప్రావీణ్య కళాశాలలో ఏర్పాట్లపై అధికారులు, ఆసుపత్రి డీన్ డాక్టర్ వివేకానంద, సీఏవో రాంచందర్‌రావుతో కలిసి పరిశీలించారు. ఆడిటోరియంలోని వేదికను రాష్ట్రపతి భద్రతా అధికారుల సూచనల మేరకు ఏర్పాటు చేశారు. -
దక్షిణాది విడిది... ప్రకృతినిధి
సాక్షి , హైదరాబాద్: నగరంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం ప్రకృతికి ఆలవాలం. పచ్చని పరిసరాలు, ఔషధ, పూల మొక్కలతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారు తోంది ఈ నిలయం. 158 వసంతాలు పూర్తి చేసు కున్న ఈ భవన నిర్మాణం, దాని చుట్టూ అల్లుకున్న చరిత్ర అపురూపం. శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న దృష్ట్యా ఈ నిలయం విశేషాలపై ‘సాక్షి’ కథనం... తండ్రి శంకుస్థాపన.. కొడుకు చేతులు మీదుగా ప్రారంభం ఆసిఫ్‌జాహీ వంశీయుల నాలుగో పాలకుడు నిజాం నజీర్–ఉద్–దౌలా ఈ భవన నిర్మాణానికి 1856లో శంకుస్థాపన చేశారు. అయితే ఇతను 1857లో మరణించారు. ఇతడి కుమారుడు ఐదవ నిజాం అఫ్జల్–ఉద్–దౌలా తండ్రి ప్రారంభించిన భవనాన్ని 1860లో పూర్తి చేయించాడు. ఇలా 158 ఏళ్లకు పూర్వం నిజాం పాలకులు కట్టించిన భవనం ఇది. దీన్ని ఐదవ నిజాం నవాబులు తమ విశ్రాంతి భవనంగా వాడుకున్నారు. ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ప్రహరీ నిర్మించారు. వీటితోపాటు కంద కాలు తవ్వించారు. ఎంతదూరంలో ఉన్న శత్రువు నైనా గుర్తించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టారు. దేశంలో మొత్తం 3 చోట్ల: రాష్ట్రపతికి దేశం మొత్తం మీద 3 భవనాలు ఉన్నాయి. ఒకటి దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్. ఆయన ఉత్తరాదికే పరిమితం కాకుండా మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడున్న ప్రజల సాధదక బాధకాలు తెలుసుకునేం దుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విడిది భవనాన్ని ఏర్పాటు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఒకటి, దక్షిణాది వారికోసం బొల్లారం విడిది గృహం ఏర్పడింది. ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి ఇక్కడికి వస్తారు. వారం నుంచి 2 వారాలు ఉంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేసవిలో సిమ్లాలో ఉంటారు. 25 వేల చదరపు గజాల్లోనే భవనం 98 ఎకరాల విస్తీర్ణంతో ఉండే రాష్ట్రపతి నిలయంలో మధ్యలో రాష్ట్రపతి భవనం, చుట్టూ పచ్చని తోట లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం వైశాల్యం లో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలోనేభవనం ఉంది. మిగతా స్థలంలో రకరకాల ఔషధ మొక్కలు, పూల తోటలు ఉన్నాయి. ఇవి సుమారుగా 7,000 చ.మీ. విస్తీర్ణంలో ఉన్నాయి. వాటిలో సర్పగంధ, కాల బంధ, సిట్రొన్నా, నిమ్మ గడ్డి, ఖుస్, జెరానియం, కొత్తిమీర, గంధపు చెట్టు, గడ్డ దినుసు, జాస్మిన్, కల్మేఘ్, తులసి మొదలైనవి. ఈ తోటను తెలంగాణ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ నిర్మించింది. ఈ భవనం మూడు భాగాల్లో ఉంది ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్ లేదా సెంట్రల్ వింగ్ , ఏడీసీ వింగ్. ఈ 3 విభాగాల్లో కలిసి మొత్తం 20 గదులున్నాయి. వేర్వేరుగా ఉన్నా వీటిని కలుపు తూ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది. ఈ 3 వింగ్‌లకు వేరుగా వంటశాలలు ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఒక వంటశాల దగ్గర మొదలై ఇంకో వింగ్‌లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గర ఆగుతుంది. ఈ సొరంగంలోకి బాగా వెలుతురు వచ్చే విధంగా భూమి వైపు కిటికీలు అమర్చారు. బయటి నుంచి చూస్తే అండర్‌గ్రౌండ్ కనబడుతుంది.బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చాక ఈ మార్గాన్ని నిర్మించారు. అతిథులకు అన్ని సౌకర్యాలు: రాష్ట్రపతితో పాటు, ఆయన కుటుంబీకులు ఉండేందుకు. భద్రతా సిబ్బంది. ప్రెసిడెంట్ వింగ్‌లో సినిమా హాల్ దర్బార్ హాల్, 25 మంది ఒకేసారి భోజనం చేసేలా భోజనశాల, అతిథి గదులు ఇలా అన్ని వసతులు ఉన్నాయి. భవన నిర్మాణమంతా యూరోపియన్ శైలిలో ఉంటుంది. బ్రిటిష్ సైన్యం నుంచి... మన రాష్ట్రపతి నిలయంగా.. 1803లో ఆసిఫ్ జాహీ వంశీయుల మూడో పాలకుడి పట్టాభిషేకం చేశారు. అనంతరం 1806లో ప్రస్తుతం ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో బ్రిటిష్ వారు తమ సైన్యం బస చేయడానికి అనుమతులు పొందారు. బొల్లారంలో బ్రిటిష్ సైనికులకు క్వార్టర్లు కట్టించారు. దానికి దగ్గరలో ఉన్న ఈ భవనంపై బ్రిటిష్ వాళ్ల కన్ను పడింది. అలా బ్రిటిష్ సైన్యాధికారి కార్యాలయంగా మారింది. దీంతో ఇది బ్రిటిష్ రెసిడెన్సీగా మారింది. ఈ భవన స్థలంలో సైనికులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950లో ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 60 లక్షలకు ఖరీదు చేసింది. మరమ్మతులు చేయించి రాష్ట్రపతికి శీతాకాల విడిదిగా మార్చారు. తొలిసారిగా అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 1953 జనవరి నెలలో ఈ భవనంలో బస చేశారు. ఈ నిలయంలో ఒక దేవాలయం కూడా ఉంది. -
రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్
న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది. జూన్‌లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్‌ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ సైతం గవర్నర్‌ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్ అసెంబ్లీని రద్దుచేశారు. -
సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకం
లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: యుగాలుగా గణితం మొదలుకొని లోహ శాస్త్రం వరకూ అనేక శాస్త్ర రంగాలపై తనదైన ముద్ర వేసిన భారతదేశం.. రేపటి తరం టెక్నాలజీలను అం దుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే విజ్ఞానాన్ని సృష్టించే సంస్థలు కృషి, భాగస్వామ్యం కూడా అత్యవసరమని అన్నారు. శనివారం లక్నోలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐఐఎస్ఎఫ్ సమావేశాలను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల కుంభమేళాగా అభివర్ణించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక సమస్యల పరిష్కారంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన టీకా కార్యక్రమానికి శీతలీకరణ పరిజ్ఞానం సాయపడిందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగా ల్లో ఎంత పురోగతి సాధిస్తున్నా మౌలిక శాస్త్ర పరిశోధనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇందు లో 100 గిగావాట్ల వరకూ ఉండే సౌరశక్తి సద్వినియోగానికి కూడా వినూత్న టెక్నాలజీ సాయపడుతోందని వెల్లడించారు. మహిళా ప్రాతినిధ్యం పెరగాలి..:దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్నా.. ఇందులో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సీఎస్ఐఆర్లో మహిళా శాస్త్రవేత్తలు 18.3 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని రాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రం చర్యల కారణంగా గత ఐదేళ్లలో దాదాపు 649 మంది శాస్త్రవేత్తలు విదేశాల నుంచి తిరిగి వచ్చారని తెలిపారు. సైన్స్‌కు ఎల్లలు లేవని, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తూ ఉండటం దీనికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. డీఎన్ఏను వేరు చేయడం ద్వారా రికార్డు గిన్నిస్‌లో స్థానం సాధించిన లక్నో విద్యార్థులు లక్నో నుంచి సాక్షి ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైంది. జీవమున్న ప్రతి ప్రాణిలో ఉండే డీఎన్ఏను 550 మంది విద్యార్థులు ఏకకాలంలో వేరు చేయడం ద్వారా ఈ రికార్డు ఏర్పడింది. గతేడాది అమెరికాలోని సియాటిల్ చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్లో 302 మంది విద్యార్థులు ఓ పండు నుంచి డీఎన్ఏను వేరు చేయడం ద్వారా గిన్నిస్ రికార్డ్ నమోదు చేయగా.. ఈసారి 500కు పైగా ఈ ప్రయత్నం చేసి విజయం సాధించారు. లక్నో శివార్లలోని జి.డి.గోయాంక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు చెందిన రిషినాథ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శనివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో ప్రయోగం మొదలు కాగా.. ఫలితం వెల్లడయ్యేందుకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 550 మంది విద్యార్థులను 13 గుంపులుగా విభజించి ఈ ప్రయోగం నిర్వహించారు. ముందుగా అందించిన కిట్లు, అరటిపండు ముక్కలతో విద్యార్థులు ప్రయోగాన్ని 90 నిమిషాల్లో పూర్తి చేశారు. గిన్నిస్ రికార్డుల ప్రతినిధుల నిశిత పరిశీలన తర్వాత కొత్త గిన్నిస్ రికార్డు స్థాపితమైనట్లు రిషినాథ్ ప్రకటించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విభాగం, విజ్ఞాన భారతిల పేరుతో ఈ రికార్డు నమోదైంది. -
46వ సీజేఐగా జస్టిస్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ (63) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంతటి కీలక బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ గొగోయ్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన గొగోయ్ కోర్టు నంబర్ 1 (సీజేఐ కోర్టు)లో సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడారు. కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, అంతవరకు.. ఉరిశిక్ష, దేశ బహిష్కరణ శిక్షలకు సంబంధించిన కేసులు మినహా ఇతర ఏ కేసులను కూడా అత్యవసరంగా విచారించాలంటూ.. కోర్టు ముందుకు తీసుకురావద్దని సూచించారు. నవంబర్ 17, 2019లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. వస్తూనే రోస్టర్‌పై ఈయన తన ముద్ర చూపించారు. కేసుల కేటాయింపులో పలు మార్పులు చేశారు. దేశానికి ఆ అనుభవం అవసరం: మోదీ సీజేఐగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు కూడా హాజరయ్యారు. ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విశేషానుభవం, అంతఃశుద్ధి, న్యాయపరమైన అంశాలపై నైపుణ్యత దేశానికి ఎంతగానో మేలుచేస్తాయని భావిస్తున్నాను. ఆయన పదవీకాలం ఫలప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2న సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా జస్టిస్ గొగోయ్ ఎంపికపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. సీనియారిటీ ప్రకారం ఆయన్నే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఈయనను తదుపరి సీజేఐగా ప్రతిపాదించారు. ఈ ఏడాది జనవరి 11న సుప్రీంకోర్టు నలుగురు సీనియర్లు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో (జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ జోసెఫ్ కురియన్) నాటి సీజేఐ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. కోర్టు నంబర్ 1లో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనంతో కలిసి జస్టిస్ గొగోయ్ న్యాయవాదులతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత, అత్యవసరంగా విచారించాల్సిన కేసుల పేరుతో కోర్టుముందుకు పిటిషన్లు తీసుకురావద్దని వారికి సూచించారు. ఇలాంటి కేసుల విచారణ విషయంలో పలు నిబంధనలను మార్చాల్సి ఉన్నందున అంతవరకు అత్యవసర కేసులను స్వీకరించబోమని సీజేఐ స్పష్టం చేశారు. ‘కొన్ని నిబంధనలను మార్చాలని భావిస్తున్నాం. ఆ తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. రేపు ఎవర్నయినా ఉరితీస్తున్నారు. దీన్ని ఆపాల్సిందే అనే పరిస్థితి ఉంటే.. మేమే దాన్ని అత్యవసరంగా అర్థం చేసుకుంటాం. అవి మినహా మిగిలిన కేసుల్లో అత్యవసరాన్ని చేర్చకండి’ అని సీజేఐ గొగోయ్ సూచించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్ర మంలో గొగోయ్ మాట్లాడుతూ.. ‘నేను, నా సహచరులు కలిసి ఉత్తమమైన ఫలితాలు సాధించే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాం. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. కేసుల ఫైలింగ్, లిస్టింగ్ మధ్య సమయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నాం. జాబితా నుంచి కేసులు తొలగించకుండా ఉండే వ్యవస్థను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. రోస్టర్‌పై గొగోయ్ ముద్ర గొగోయ్ బాధ్యతలు స్వీకరించగానే సుప్రీంకోర్టులో రోస్టర్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో తాజా మార్పులను ఉంచారు. సీజేఐ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 3 నుంచి తదుపరి సవరణలు వచ్చేంతవరకు కొత్త కేసులకు ఇదే రోస్టర్ అమలవుతుందని అందులో పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొత్త సీజేఐ తన వద్దే ఉంచుకున్నారు. ఈయన నేతృత్వంలోని ధర్మాసనం.. సామాజిక న్యాయం ఎన్నికలు, కంపెనీ చట్టాలు, గుత్తాధిపత్యం, నియంత్రిత వాణిజ్య విధానాలు, ట్రాయ్, సెబీ, బీమా, ఆర్బీఐ, మధ్యవర్తిత్వం, హెబియస్ కార్పస్, క్రిమినల్ కేసులు, కోర్టు ధిక్కరణ, సాధారణ సివిల్ అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ బీ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం కేసులతోపాటు లేఖల ఆధారిత విషయాలు, భూ సేకరణ, అటవీ, పర్యావరణానికి సంబంధించిన కేసులు అప్పజెప్పారు. చేతల్లోనూ ఆదర్శప్రాయుడు! ఉన్నత కుటుంబంలో భోగభాగ్యాల మధ్య పెరిగినా సాధారణ జీవితం గడపడంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తన ఆస్తులు, ఆదాయం ఇతర విషయాల్లో దాపరికానికి అవకాశం లేని విధంగా తన స్థిర, చరాస్తులు, ఇతర ఆర్థిక వ్యవహారాల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడించారు. ప్రస్తుతమున్న 25 మంది సిట్టింగ్ జడ్జీల్లో 11 మందే ఈ విధంగా ఆస్తుల ప్రకటన చేశారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినపుడే ఇచ్చిన డిక్లరేషన్‌లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, వివాహ సమయంలో భార్యకు పుట్టింటి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్టు ప్రకటించారు. సొంత వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకు రుణాలు కూడా లేవు. రెండు బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.6.5 లక్షలు, రూ.16 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. 1999లో తీసుకున్న రూ.5 లక్షల విలువైన ఎల్ఐసీ పాలసీ ముగిశాక వచ్చిన డబ్బే ఆయన బ్యాంకు బాలెన్స్‌లో ప్రధాన వాటాగా నిలుస్తోంది. పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1.6 లక్షల విలువైన బంగారాన్ని కొన్నా రు. 1999లో గువాహటిలో కొనుగోలు చేసిన రూ.1.10 లక్షల విలువైన స్థలాన్ని 2018 జూన్ 6న విక్రయించారు. అస్సాంలోని కామ్రూప్ జిల్లా జపోరిగోగ్ బెల్టోలా గ్రామంలో తల్లి ద్వారా సంక్రమించిన కొంత భూమి (అందులో నిర్మించిన ఇంటిని కూల్చివేశారు) మాత్రమే కలిగి ఉన్నారు. దిబ్రూగఢ్ నుంచి సీజేఐగా 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఆయన జన్మించారు. 1978 లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గువాహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్ చేశారు. 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.2010, సెప్టెంబర్ 9న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
స్నాతకోత్సాహం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఐఐటీ హైదరాబాద్ ఏడో స్నాతకోత్సవం ఆదివారం కందిలోని ఐఐటీహెచ్ ప్రాంగణంలో సందడిగా సాగింది. ఐఐటీహెచ్ పదో వసంతంలోకి అడుగు పెట్టడంతో విద్యార్థులు, సిబ్బంది ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టా సర్టిఫికెట్లు అందుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు, బోధన సిబ్బంది, అతిథులు భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు ఇక్కత్ డిజైన్‌లో రూపొందించిన జకార్డ్ వస్త్రాలు ధరించారు. బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఈఎండీఎస్, ఎండీఈఎస్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్డీ తదితర కోర్సులకు సంబంధించి మొత్తం 566 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు. పట్టాలను అందుకునేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో బారులు తీరడం ఆకట్టుకుంది. పట్టాలు అందుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, స్నేహితులు అభినందనల్లో ముంచెత్తారు. క్యాంపస్‌ను వీడుతున్న విద్యార్థులు తమ స్నేహితులతో జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కేరింతలు కొట్టారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన నలుగురు విద్యార్థులకు రాష్ట్రపతి కోవింద్ బంగారు పతకాలు ప్రదానం చేశారు. బంగారు పతకం అందుకున్న వారిలో వికారాబాద్‌కు చెందిన కొడుగుంట స్నేహారెడ్డి అనే విద్యార్థినికి ఓ ఐటీ కంపెనీలో కోటి రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చినట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రముఖుల రాకతో సందడి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు రాష్ట్రపతికి హెలిప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ నేతృత్వంలోని అధ్యాపక బృందం.. రాష్ట్రపతి దంపతులో పాటు అతిథులను వేదిక వరకు ఊరేగింపుగా తోడ్కొని వచ్చాయి. ఐఐటీహెచ్ పాలక మండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దేశాయ్ ప్రగతి నివేదిక చదివారు. అతిథులకు ప్రొఫెసర్ దేశాయ్ జ్ఞాపికను అందజేయగా, రాష్ట్రపతికి ఐఐటీ అసిస్టెంట్ చంద్రశేఖర్ రూపొందించిన ప్రత్యేక మెమెంటోను అందజేశారు. ఇందులో సిలికాన్‌తో తయారు చేసిన ప్రత్యేక చిప్‌ను అమర్చి, ఐఐటీ ఫొటోలు, వివరాలను నమోదు చేశామని ప్రొఫెసర్ దేశాయ్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లోనికి వచ్చే వారిని విస్తృతంగా తనిఖీల అనంతరం అనుమతించారు. స్నాతకోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జేసీ నిఖిల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మనోహర్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు. -
కరుణానిధికి రాష్ట్రపతి పరామర్శ
సాక్షి, చెన్నై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం చెన్నై వచ్చిన ఆయన, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌తో కలిసి నేరుగా ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధిని పరామర్శించిన అనంతరం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కోవింద్ ట్విట్టర్లో తెలిపారు. జూలై 28 నుంచి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించడం తెలిసిందే. కాగా కరుణానిధికి ఆరోగ్యం బాగాలేదనే బాధతో పుదుకోట్టై జిల్లా కరంబకుడికి చెందిన మూడో వార్డు డీఎంకే కార్యదర్శి మనోహరన్ ఆదివారం గుండె ఆగి మరణించినట్లు సమాచారం. కరుణానిధి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మనోహరన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. -
కరుణానిధికి రాష్ట్రపతి కోవింద్ పరామర్శ
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం పరామర్శించారు. కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా కరుణానిధికి అందిస్తున్న వైద్యచికిత్సల గురించి స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి వెంట తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్, రాష్ట్ర మంత్రి జయకుమార్ ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్దిరోజుల కిందట కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉంది. -
ముగ్గురు సుప్రీం జడ్జీల పదోన్నతికి ఆమోదం
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన వారిలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన వారెంట్లపై కోవింద్ శుక్రవారం సంతకం చేయగా, శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. మహిళా జడ్జీల సంఖ్య మూడుకు చేరింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ కొత్తగా చేరబోతుండగా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు. -
పార్లమెంటుపై నమ్మకం పోతోంది
న్యూఢిల్లీ: పార్లమెంటు సజావుగా నడవడంలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటుపై, ఎంపీలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సమర్థవంతంగా నడిచేలా ఎంపీలు బాధ్యత తీసుకోవాలని మోదీ సూచించారు. సామాన్య ప్రజల సమస్యలను తెలపడం, వారి సంక్షేమానికి కృషిచేసేందుకు ప్రతి ఎంపీకీ అవకాశం రావాలన్నారు. లేదంటే దేశం చాలా నష్టపోతోందన్నారు. 2014–17 కాలానికి ఉత్తమ పార్లమెంటేరియన్లకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో అవార్డులిచ్చిన సందర్భంగా మోదీ మాట్లాడారు. నజ్మా హెప్తుల్లా, హుకుమ్‌దేవ్ నారాయణ్ యాదవ్, గులాంనబీ ఆజాద్, దినేశ్ త్రివేది, భర్తృహరి మహతాబ్ ఈ అవార్డులందుకున్నారు. ఎంపీలు ఓ పార్టీకో, ఓ నియోజకవర్గానికో పరిమితం కారాదని ప్రజల సమస్యల పరిష్కారంలో విస్తృతాంశాలపై చర్చించాలని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయడం కోసం విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని వెంకయ్య నాయుడు అన్నారు. చాలాసార్లు అధికార పార్టీ ఎంపీలే పార్లమెంటును అడ్డుకున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
విశ్వ ఐక్యతా సూత్రం.. యోగా
డెహ్రాడూన్: ప్రపంచవ్యాప్తంగా నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 50 వేల మందికిపైగా ఔత్సాహికులతో కలసి యోగాసనాలు వేశారు. ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో ఐకమత్యం తీసుకొచ్చే శక్తి ఈ ప్రాచీన భారతీయ విద్యకు ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆరోగ్యంతోపాటు, సుఖశాంతులతో నిండిన జీవితం కోసం ప్రజలంతా యోగా సాధన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉదయం ఆరున్నర గంటలకే డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) క్యాంపస్‌కు చేరుకున్న మోదీ.. తొలుత ఔత్సాహికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం దాదాపు అర్ధగంటపాటు యోగాసనాలు వేసి ప్రాణాయామ సాధన చేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ‘అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపునకు వెళ్లే దారిని చూపించి ప్రపంచ ప్రజల జీవన విధానాలను యోగా మెరుగుపరుస్తోంది. డెహ్రాడూన్ నుంచి డబ్లిన్ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు, జకర్తా నుంచి జొహన్నెస్‌బర్గ్ వరకు.. హిమాలయ ప్రాంతమైనా, ఎండలు మండిపోయే ఎడారులైనా.. ఆయా ప్రాంతాల్లోని కోట్లాది మంది ప్రజల జీవన స్థితిగతులను యోగా మరింత ఉన్నతంగా మారుస్తోంది. ప్రపంచ సమాజాల్లో స్నేహపూర్వక భావనను నెలకొల్పుతోంది. ఐకమత్యానికి ఆ భావనే ఆధారం’ అని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కళగా మాత్రమే కాకుండా.. ప్రజలను, దేశాలను ఏకం చేసి, ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాలు విరజిల్లేలా చేసే శక్తి యోగాకు ఉందన్నారు. దేశ ప్రజలు తమకు వారసత్వంగా వచ్చిన కళలు, విద్యను గౌరవించడం నేర్చుకోవాలనీ, అప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుందని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రశాంతమైన, సృజనాత్మకమైన, సంతృప్తికరమైన జీవనాన్ని సాగించాలంటే అందుకు సరైన మార్గం యోగానేనన్నారు. ‘వ్యక్తిగతంగానైనా, సామాజికంగానైనా.. మనం ఎదుర్కొనే అన్ని సమస్యలకూ యోగాలో అద్భుతమైన పరిష్కారం ఉంది. విభజించడానికి బదులుగా యోగా ఏకం చేస్తుంది. పగ, విద్వేషాలకు బదులు యోగా అందర్నీ కలుపుకుపోతుంది. నొప్పిని పెంచడానికి బదులు గాయాన్ని నయం చేస్తుంది. ప్రపంచానికి ఆశాకిరణంగా యోగా నిలుస్తోంది. యోగా విద్య ప్రాచీనమైనదైనప్పటికీ అది ఆధునికంగానే ఉంది. నిరంతరం పరిణామం చెందుతోంది’ అని మోదీ పేర్కొన్నారు. సూరినామ్‌లో రాష్ట్రపతి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం సూరినామ్‌లో ఆ దేశ అధ్యక్షుడు డిజైర్ డెలానో బౌటర్స్తో కలసి యోగా సాధన చేశారు. రెండు దేశాల అధినేతలు కలసి యోగా సాధన చేయడం ఇదే తొలిసారని కోవింద్ ట్విట్టర్లో తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంటు వద్ద పలువురు ఔత్సాహికులతో కలసి యోగా సాధన చేశారు. రాష్ట్రాల్లోనూ ఘనంగా యోగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ ప్రధాని మోదీ ఫిట్నెస్ చాలెంజ్‌కు దీటుగా తన ఇంట్లోనే మీడియా ముందు యోగాసనాలు వేసి చూపించారు. మైసూరులోని రేసుకోర్సు మైదానంలో జిల్లా పాలక మండలి ఆధ్వర్యంలో 70 వేల మంది యోగా సాధన చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా, శిశు సంరక్షణ శాఖ మంత్రి మేనకా గాంధీ గర్భిణులతో కలిసి యోగాసనాలు వేశారు. చండీగఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో 750 మంది వికలాంగులతో కలసి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ యోగా సాధన చేశారు. సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. గైర్హాజరైన పలువురు సీఎంలు యోగా దినోత్సవ కార్యక్రమాలకు పలువురు ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. బిహార్‌లో గవర్నర్ సత్యపాల్ మాలిక్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ తదితరులు పాల్గొన్న కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ హాజరుకాక పోవడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఆరోగ్యం బాగాలేక పోవటంతో యోగా కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయారు. పది రోజుల చికిత్స కోసం ఆయన బెంగళూరుకు వెళ్లారు. కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరలు యోగా కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. పశ్చిమ బెంగాల్లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యోగా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. యోగాకు మతం లేదు: క్రైస్తవ సన్యాసిని తిరువనంతపురం: ఆమె ఓ క్రైస్తవ సన్యాసిని. ప్రతిరోజూ మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి బైబిల్ వాక్యాలను చదువుతుంది. అంతే నిష్ట, శ్రద్ధతో ప్రతిరోజూ సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, యోగాసనాలను వందల మందికి బోధిస్తుంది. దీనిపై చర్చి సంఘాలు, వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేసినా వెనక్కు తగ్గలేదు. ఆమే 67 ఏళ్ల ఇన్‌ఫ్యాంట్ ట్రెసా. నర్సుగా ప్రభుత్వోద్యోగం చేసిన ట్రెసా 2006లో పదవీ విరమణ పొందారు. 30 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్న ఆమె.. ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని యోగా, ధ్యానానికి ప్రాచుర్యం కల్పించేందుకు అంకితం∙చేశారు. కేరళలో రెండు యోగా శిక్షణ కేంద్రాలు ప్రారంభించి వేలాది మందికి యోగా నేర్పుతున్నారు. తన శిక్షణ కేంద్రాల్లో హిందువులతోపాటు క్రైస్తవులు, ముస్లింలు కూడా యోగా నేర్చుకుంటున్నారని, యోగాకు మతంతో సంబంధం లేదని చెప్పారు. లడక్‌లో మంచు కొండల్లో ఐటీబీపీ జవాన్ల యోగా సాధన -
ప్రధాని మోదీ రమజాన్ సందేశం
న్యూఢిల్లీ : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్ ఉల్ ఫితర్ (రమజాన్) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 7.35 గంటలకు నెలవంక కనిపించిందని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ప్రకటించారు. దేశ ప్రజలకు రమాజన్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్‌తో పవిత్ర రమాజాన్/రంజాన్ మాసం ముగుస్తుంది. 30 రోజులపాటు ఉపవాసం ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈ పర్వదినాన్ని జరుపుకునే ముస్లింలు రమజాన్ సందర్భంగా తమ బంధుమిత్రులు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతారు. మసీదులు, ఈద్గాలు, నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహిస్తారు. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ నిరుపేదలకు సహాయం చేస్తారు. రమజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈద్ ముబారక్. దేశ పౌరులందరికీ, ప్రత్యేకంగా దేశవిదేశాల్లోని మన ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భం మన కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని, మన సమాజం పరస్పర ప్రేమానురాగాలను పెంపొందించాలని కోరుకుంటున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ‘ఈద్ ముబారక్, ఈ పర్వదినం సమాజంలో మన ఐక్యతను, సామరస్యాన్ని మరింత పెంపొందించాలని ఆశిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా దేశ ప్రజలకు రమజాన్ శుభాకాంక్షలు చెప్తూ.. ఆడియో ఫైల్‌ను షేర్ చేశారు. పలువురు జాతీయ రాజకీయల నాయకులు, పలువురు ప్రముఖులు కూడా రమజాన్ శుభాకాంక్షలుత తెలిపారు. -
27న సోలార్ చరఖా పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఐదు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సౌర చరఖా పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 27న ప్రారంభించనున్నారు. తొలి రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 క్లస్టర్లలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామనీ, కేంద్రం రూ. 550 కోట్ల రాయితీని అందిస్తుందని సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం వెల్లడించారు. ఈ పథకంతో తొలి రెండేళ్లలోనే లక్ష వరకు ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఎంఎస్ఎంఈ కార్యదర్శి చెప్పారు. ఒక్కో క్లస్టర్లో 400 నుంచి 2,000 మంది వరకు చేతి వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందన్నారు. దేశవ్యాప్తంగా 15 అత్యాధునిక సాంకేతిక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనీ, వాటిలో 10 వచ్చే మార్చికల్లా కార్యకలాపాలను ప్రారంభిస్తాయని చెప్పారు. ఈ పదింటిలో విశాఖపట్నం, పుదుచ్చేరి, బెంగళూరు కూడా ఉన్నాయి. బుధవారం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని 33 అంతస్తుల ‘బ్యూ మాండ్’ ఆకాశహర్మ్యం నుంచి ఎగసిపడుతున్న మంటలు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవంతి 26వ అంతస్తులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నివసిస్తున్నారు. 32, 33వ అంతస్తుల్లో మాత్రమే మంటలు వ్యాపించాయి. భవంతిలోని వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.