భోపాల్ : హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని ఓ మహిళా రైతు రాష్ట్రపతికి లేఖ రాసింది. అంతేకాకుండా ఫ్లయింగ్ పర్మిషన్ కూడా ఇప్పించాని విఙ్ఙప్తి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేఖ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన బసంతి బాయ్ అనే మహిళ చిన్న పూరి గుడిసెలో నివసించేది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే తనకున్న 2 బిగాల పొలంలోకి వెళ్లాలంటే పరమానంద్ అనే రైతుకి చెందిన పొలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయన తన ఇద్దరు కుమారులు సైతం బసంతితో వాగ్వాదానికి దిగేవారు.
కొన్నాళ్ల తర్వాత ఆ దారిని మూసి వేయించారు. ఈ విషయంపై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. కాలినడకన వెళ్లేందుకు వీలు లేకపోవడంతో హెలికాప్టర్ కొనడానికి లోన్ ఇప్పించాలని లేఖలో కోరడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఈ సమస్యను తానే దగ్గరుండి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.
చదవండి : (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర)
(మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు)
Alleging denial of passage into her agricultural plot, woman in MP's Mandsaur district writes to President of India for loan and license to fly by helicopter into her plot. On spot official probe, however, finds clear passage to woman's plot. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/zEiWdN0MiM
— Anuraag Singh (@anuraag_niebpl) February 12, 2021
Comments
Please login to add a commentAdd a comment