loan sanction
-
రుణాల మంజూరులో కీలకంగా యూపీఐ
న్యూఢిల్లీ: రుణాల మంజూరులో యూని ఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కీలకంగా మారిందని ఒక నివేదిక వెల్లడించింది. ‘ఓపెన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు: రుణం పొందడంలో చిక్కులు’ పేరుతో చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రధానంగా క్రెడిట్ హిస్టరీ (గతంలో రుణం పొందడం) లేని వారు రుణం అందుకోవడానికి యూపీఐ దోహద పడుతోంది. యూపీఐ యాప్స్ ఆధారంగా జరిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సమాచారం అందుబాటులో ఉన్నందున.. రుణ మంజూరుకై నిర్ణయాలు తీసుకునేందుకు రుణ దాతలకు మార్గం సుగమం అవుతోంది. మొదటిసారిగా అధికారికంగా రుణం అందుకోవడానికి సామాన్యులకు వీలు కల్పి స్తోంది. యూపీఐ లావాదేవీలలో 10% పెరుగుదల క్రెడిట్ లభ్యత 7% దూసుకెళ్లేందుకు దారితీసింది. రుణగ్రహీ తలను మెరుగ్గా అంచనా వేయడానికి రుణదాతల కు డిజిటల్ ఫైనాన్షియల్ హిస్టరీలు ఎలా ఉపయోగపడ్డాయో ఈ గణాంకాలు ప్రతి బింబిస్తున్నాయి. రుణాల్లో వృద్ధి ఉన్నప్ప టికీ డిఫాల్ట్ రేట్లు పెరగలేదు. యూపీఐ– ఆధారిత డిజిటల్ లావాదేవీ డేటా రుణ దాతలు బాధ్యతాయుతంగా విస్తరించడంలో సహాయపడింది. 2016లో ప్రారంభించినప్పటి నుండి భారత్‌లో ఆర్థిక లభ్యతను యూపీఐ సమూలంగా మార్చింది.75 శాతం యూపీఐ కైవసం..యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 30 కోట్ల మంది వ్యక్తులు, 5 కోట్ల మంది వ్యాపా రులు అడ్డంకులు లేని డిజిటల్ లావా దేవీలను నిర్వహించడానికి వీలు కల్పించింది. 2023 అక్టోబర్ నాటికి భారత్‌లోని మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 75 శాతం యూపీఐ కైవసం చేసుకుంది. పాల్గొనే బ్యాంకుల కస్టమర్లందరికీ చెల్లింపులను సేవగా అందించడానికి యాప్‌లను రూపొందించడానికి థర్డ్ పార్టీ వెండార్లను యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అనుమతిస్తుంది. రియల్ టైమ్‌లో ధృవీకరించదగిన డిజిటల్ లావాదేవీల సమాచారం యూపీఐ ఆధారంగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ సమాచారాన్ని రుణాన్ని అందుకునే ప్రక్రియలో భాగంగా ఆర్థిక సంస్థలు, అనుబంధ కంపెనీలతో పంచుకో వచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా యూపీఐని ఆదరించడంలో అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. యూపీఐతో భారత దేశం సాధించిన విజయం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఓపెన్ బ్యాంకింగ్ విధానాలతో కలపడం ఎక్కువ మందికి రుణాలు అందుతాయి. అలాగే ఆవిష్కరణలను, సమానమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని అధ్యయనం వివరించింది. -
గృహ రుణం కావాలా..? ప్రాసెసింగ్ ఫీజు లేదు.. వడ్డీ తక్కువే..
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఇంటి రుణాలపై వడ్డీని తగ్గించింది. 8.45 శాతంగా ఉన్న వడ్డీ రేటులో 15 పాయింట్లు కట్ చేసింది. తమ బ్యాంకులో తీసుకునే గృహ రుణలపై 8.3 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సదరు రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇది పరిమితకాలపు ఆఫర్ అని, ఈ నెలాఖరు వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. గృహ రుణాల జారీలో ముందు వరుసలో ఉన్న ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తమ బ్యాంక్ మాత్రం అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోందని బ్యాంక్ పేర్కొంది. ఈ వడ్డీ రేటుకు 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే రూ.లక్షకు రూ.755 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. రుణ ప్యాకేజీలో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందిస్తున్నామని చెప్పింది. సోలార్ ప్యానెల్స్‌కు.. సంప్రదాయ గృహ రుణాలతో పాటు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌కు సైతం రుణాలు అందిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. 7 శాతం వడ్డీకే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజూ లేకుండా ఈ తరహా రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గరిష్ఠంగా 120 నెలలకు గానూ ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతంగా రుణం పొందొచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ సైతం పొందొచ్చని వివరించింది. గమనిక: ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు మార్చి 30, 31న పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం.. -
ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..!
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులతో పాటు ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు తమ వినియోగదారులకు క్రెడిట్, రుణాలు ఇవ్వడం, కార్డు బిల్లుల చెల్లింపులు వంటి ఎన్నో సదుపాయాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫిన్ టెక్ కంపెనీ ఫోన్‌పే తన యూజర్ల కోసం కొత్తగా ‘క్రెడిట్’ ఆప్షన్ తెచ్చింది. ఈ విభాగంలో యూజర్లు ‘క్రెడిట్ బ్యూరో స్కోర్’ చెక్ చేసుకోవచ్చు. యూజర్ల క్రెడిట్ వాడకం, క్రెడిట్ ఏజ్, ఆన్ టైం పేమెంట్స్ తదితర వివరాలతో కూడిన నివేదికను క్రెడిట్ బ్యూరో స్కోర్ అందిస్తుంది. హోం పేజీలోని క్రెడిట్ సెక్షన్‌ను ఉపయోగించుకుని క్రెడిట్ లేదా రూపే కార్డుల లావాదేవీలు, రుణాల చెల్లింపులు, అదనపు భారం లేకుండా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదీ చదవండి: ‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..! ఫోన్‌పే సీఈఓ హేమంత్ గాలా స్పందిస్తూ ‘ఫోన్‌పే యాప్‌లో క్రెడిట్ సెక్షన్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాం. పలు సెగ్మెంట్లలో యూజర్ల క్రెడిట్ అవసరాలను తీర్చడమే క్రెడిట్ సెక్షన్ లక్ష్యం. యూజర్ల క్రెడిట్ హెల్త్ నిర్వహణతోపాటు ఆర్థిక సాధికారత కల్పించేందుకు సంస్థ కృషిచేస్తోంది. భవిష్యత్తులో వినియోగదారులకు కన్జూమర్ లోన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇందుకోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని ఆయన వివరించారు. -
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
Pre-Budget Meet: ప్రోత్సాహకాలు.. తక్కువ వడ్డీ రేటు కావాలి!
న్యూఢిల్లీ: దేశం నుంచి ఎగుమతుల పురోగతికి అలాగే ఈ రంగంలో ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్లో ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని ఎగుమతిదారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని, తక్కువ వడ్డీరేటుకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 5వ ప్రీ–బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె గురువారం ఎగుమతి సంఘాలు, సేవా రంగాల ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరిసహా ఆ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగుమతి రంగం ప్రతినిధులు చేసిన పలు విజ్ఞప్తుల్లో ముఖ్యాంశాలు... ► డాలర్ మారకంలో రూపాయి బలహీనత వల్ల ఎగుమతుల పోటీతత్వంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఎగుమతి సంఘాల భారత సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. భారత్ ఎగుమతుల విలువ 460–470 బిలియన్ డాలర్ల వరకూ పురోగమించేందుకు (2021–22లో 400 బిలియన్ డాలర్లు) మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ (ఎండీఏ) కింద ప్రకటించిన రూ.200 కోట్లు సముద్రంలో నీటి బొట్టని కూడా సమాఖ్య పేర్కొంది. ‘కాబట్టి, పటిష్ట ఎగుమతుల మార్కెటింగ్ కోసం, గత సంవత్సరం ఎగుమతుల విలువలో కనీసం 0.5 శాతం కార్పస్‌తో ఎగుమతి అభివృద్ధి నిధిని సృష్టించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది. అలాగే సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ద్వారా ఎగుమతి చేసే వస్తువుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని సూచించింది. పరిశోధనా, అభివృద్ధి (ఆర్అండ్డీ), టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేయబడిన పన్ను) రద్దు ద్వారా విధానపరమైన సరళీకరణలు జరగాలని విజ్ఞప్తి చేసింది. దేశీ మార్కెటింగ్ కోసం ఎగుమతిదారులు చేసే వ్యయాలపై 200 శాతం పన్ను మినహాయింపు కోరింది. గ్లోబల్ ఇండియన్ షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలను పొడిగించాలని సూచించింది. ఎంఎస్ఎంఈకి పన్ను రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి కీలక సూచనలు చేస్తూ, విమానాశ్రయంలో విదేశీ పర్యాటకులకు పన్ను రిఫండ్ చేయాలని కోరింది. దీనివల్ల పర్యాటకం రంగం పురోగతితోపాటు హస్తకళలు, తివాచీలు, ఖాదీ, తోలు వస్తువుల ఎగుమతులు మెరుగుపడతాయని పేర్కొంది. ► వెట్ బ్లూ క్రస్ట్, ఫినిష్డ్ లెదర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పునరుద్ధరించాలని సమావేశంలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) డిమాండ్ చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌లు, వస్త్రాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి దేశీయ ఎగుమతిదారులు ప్రధానంగా ఇటువంటి తోలులను దిగుమతి చేసుకుంటారు. ఫినిష్డ్ లెదర్ డ్యూటీ–ఫ్రీ దిగుమతి తయారీదారుల పోటీ తత్వం మరింత మెరుగుపడ్డానికి ఈ చర్య దోహపదడుతుందని తెలిపింది. ► ముడి సిల్క్, సిల్క్ నూలు (15 శాతం నుంచి 10 శాతం వరకు దిగుమతి సుంకం), ముడి పత్తి (సుంకం రహితం), రాగి ఖనిజాలు వంటి అనేక వస్తువులపై కస్టమ్స్ సుంకాలను సవరించాలని ఎగుమతిదారులు సూచించారు, భారతదేశ ఎగుమతులు ప్రతికూల భూభాగంలోకి ప్రవేశించాయి. ► విస్తృత పన్ను రాయితీ ప్రయోజనాలతో డిమాండ్‌ను ప్రోత్సహించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కోరింది. ► ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎ శక్తివేల్సహా విప్రో లిమిటెడ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జేఈపీసీ), తమిళనాడు, కలకత్తా, ఉత్తర అస్సోంకు చెందిన ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌తో సహా పలు కంపెనీలు, వాణిజ్య, పరిశ్రమల సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
లోన్‌యాప్ సంస్థలపై కొరడా
సాక్షి, అమరావతి: ‘మీకు రుణం కావాలా.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రెండు గంటల్లోనే మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం’.. అంటూ గుంటూరుకు చెందిన మూర్తికి ఓ ఫోన్ వచ్చింది. కరోనాతో తన చిరు వ్యాపారం దెబ్బతినడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆయన అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉన్నారు. దాంతో ఆ ఫోన్‌కాల్‌కు సానుకూలంగా స్పందించి ‘రూ.లక్ష లోన్ కావాలి’ అని అన్నారు. వారు అడిగిన వివరాలన్నీ యాప్‌లో అప్లోడ్ చేశారు. ఆయన అడిగింది రూ.లక్ష.. కానీ, ఇచ్చింది రూ.70వేలే.. అంటే ముందే రూ.30వేలు వడ్డీ కింద ఉంచుకుని రూ.లక్ష అప్పు ఇచ్చినట్లు చూపించారు. ఆ తరువాత నుంచి ప్రతినెలా వాయిదాలు కడుతున్నా అప్పు పెరుగుతోందే కానీ, తగ్గడంలేదు. చివరికి రూ.రెండు లక్షలు చెల్లించిన తరువాతగానీ ఆయన మోసాన్ని గుర్తించలేదు. దాంతో వాయిదాలు చెల్లించడం మానేయడంతో ఫోన్లో తీవ్రపదజాలంతో దూషణలు, బెదిరింపులు మొదలయ్యాయి. వాట్సాప్ మెసేజులు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులను దూషిస్తూ ఆయన ఫోన్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు ప్రత్యక్షమయ్యాయి. ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టారు. దీంతో మూర్తి సైబర్ పోలీసులను ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టారు. ..ఇలా మూర్తి ఫిర్యాదుపైనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లోన్‌యాప్ కంపెనీల ఆగడాలపై రాష్ట్ర సైబర్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఈ అనధికారిక సంస్థల ఆగడాల నుంచి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు ద్విముఖ వ్యూహంతో కార్యాచరణను వేగవంతం చేశారు. మోసాలకు పాల్పడుతున్న వాటిపై కఠిన చర్యలను వేగవంతం చేశారు. మొదటి స్థానంలో తిరుపతి జిల్లా ఈ తరహా మోసాలపై రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 63 కేసులు నమోదుచేశారు. లోన్‌యాప్ కంపెనీలపై కేసుల్లో తిరుపతి జిల్లా మొదటిస్థానంలో ఉండగా గుంటూరు, విశాఖజిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ కంపెనీలపై అత్యధికంగా కేసులు నమోదు చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విస్తృతంగా అవగాహన.. నిజానికి.. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోన్‌యాప్ కంపెనీల్లో 90 శాతం కంపెనీలకు రిజర్వ్ బ్యాంకు అనుమతిలేదు. చైనాలో ఉంటూ ఇక్కడ అనధికారికంగా కాల్ సెంటర్లు ఏర్పాటుచేసుకుని మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే లోన్‌యాప్ కంపెనీల మోసాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సైబర్ పోలీసు విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పలు సూచనలు చేసింది. అవి.. ► తెలియని వ్యక్తులు, కంపెనీలు పంపించే లింక్‌లు, ఈమెయిల్స్ ఓపెన్ చేయకూడదు. చేస్తే.. ఆ యాప్ డౌన్లోడ్ కాగానే వారి ఫోన్/ల్యాప్‌టాప్‌లోని కాంటాక్టŠస్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారం, వాటికి వచ్చే ఓటీపీ నంబర్లతోసహా సమాచారమంతా కూడా లోన్‌యాప్ కంపెనీకి అందుబాటులోకి వస్తుంది. ► అందుకే ఏదైనా లింక్‌ను క్లిక్ చేసేముందు ఆ కంపెనీకి గుర్తింపు ఉందా లేదా, గుర్తింపు ఉంటే ఆ కంపెనీకి రేటింగ్‌ను తెలుసుకోవాలి. ► బ్యాంకులు, గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ కంపెనీలు మాత్రమే రుణాలు మంజూరు చేసేందుకు అనుమతి ఉంది. మిమ్మల్ని సంప్రదించిన కంపెనీ ఆ కేటగిరీకి చెందుతుందో లేదో పరిశీలించాలి. ► ఆధార్ నంబర్, కాంటాక్ట్స్ వివరాలు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగితే ఇవ్వొద్దు. ► ఆర్బీఐ గుర్తింపు పొందిన ఏ కంపెనీ కూడా రుణం మంజూరుచేసే ముందే కొంత మొత్తాన్ని మినహాయించుకోదు. అలా చేస్తామని ఏ కంపెనీ అయినా చెబితే మోసానికి పాల్పడుతున్నట్లే లెక్క. ► అలాగే, హామీలు, డాక్యుమెంట్లు అవసరంలేకుండా ఎవరైనా రుణం ఇస్తామన్నా విశ్వసించొద్దు. ► మీ యూపీఐ పిన్ నంబర్లు, పాస్వర్డ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరికీ చెప్పొద్దు. గుర్తింపు పొందిన బ్యాంకులు ఆ వివరాలు అడగవు. ► తెలియని ఖాతాల నుంచి మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే ఆ విషయాన్ని మీ బ్యాంకు అధికారులకు తెలియజేయండి. లేకపోతే మోసపూరిత లోన్‌యాప్ కంపెనీలు మీరు రుణం కోరితేనే బ్యాంకులో జమచేశామని చెప్పే ప్రమాదముంది. ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థలు మరోవైపు.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు పలు వ్యవస్థలను పోలీసులు ఏర్పాటుచేశారు. అవి.. ► డయల్ 1930 : లోన్ యాప్ కంపెనీల మోసాలపై ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ► సైబర్‌మిత్ర వాట్సాప్ నం. 9121211100 : లోన్‌యాప్‌ల మోసాలు, వేధింపులపై దీనికీ ఫిర్యాదు చేయవచ్చు. ► సైబర్ క్రైమ్ పోర్టల్ : లోన్‌యాప్ కంపెనీలతోపాటు ఇతర సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ పోర్టల్: www. cybercrime. gov. in లోన్‌యాప్ మోసాలపై కఠిన చర్యలు లోన్‌యాప్‌ల కంపెనీల మోసాలు, వేధింపులపై పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌తోపాటు బాధితులు ఫిర్యాదులు చేసేందుకు వివిధ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చాం. లోన్యాప్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మోసపోయామని భావిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ జిల్లాల వారీగా లోన్‌యాప్ మోసాలపై నమోదైన కేసులు.. -
వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ హిస్టరీ చూడకుండానే లోన్ యాప్స్ రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నిముషాల్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. లోన్ యాప్స్ ద్వారా రుణం పొందితే అధిక వడ్డీ చెల్లించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా కస్టమర్లు వీటినే ఎంచుకుంటున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇటీవలి కాలంలో లోన్ యాప్స్ మోసాలు, వేధింపులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 2 లక్షల పైచిలుకు మంది పాలుపంచుకున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది 21–30 ఏళ్ల వయసువారే. ఇవీ సర్వే ముఖ్యాంశాలు.. లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసు అని సర్వేలో పాల్గొన్న వారిలో 1,40,387 (70 శాతం) మంది తెలిపారు. లోన్ ఇస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలను 86,796 (43 శాతం) మంది అందుకున్నారు. సర్వేలో పాల్గొన్నవారుగానీ వారి సన్నిహితులు, బంధువుల్లో లోన్ యాప్స్ ద్వారా రుణం పొందినవారు 1,02,106 (51 శాతం) ఉన్నారు. తాముగానీ, తమకు తెలిసినవారిలో లోన్ యాప్స్ బాధితులూ ఉన్నారని 1,34,607 మంది (67 శాతం) వెల్లడించారు. ఈ స్థాయిలో బాధితులు ఉన్నప్పటికీ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదని 79 శాతం మంది చెప్పడం గమనార్హం. -
ఇండియన్ రైల్వేకు వరల్డ్ బ్యాంక్ రుణం!
న్యూఢిల్లీ: రైలు సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇందుకుగాను 245 మిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.78 చొప్పున రూ.1,911 కోట్లు రుణాన్ని ఆమోదించినట్లు బహుళజాతి ఆర్థిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) విభాగం నుంచి ఈ రుణ మంజూరీలకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది. ఏడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్సహా 22 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ప్రపంచ బ్యాంక్ ప్రకటన ప్రకారం, భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి దేశంలో మరింత ట్రాఫిక్‌ను రోడ్డు నుండి రైలుకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే సరుకు రవాణా, ప్రయాణీకులను సురక్షితంగా, వేగంగా గమ్య స్థానాలకు చేర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను (జీహెచ్‌సీ) తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రైల్వే రంగంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుందని వరల్డ్ బ్యాంక్ (ఇండియా) ఆపరేషన్స్ మేనేజర్, యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడేకి మోరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ♦ ఇండియన్ రైల్వే మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, ప్రపంచంలో నాల్గవ–అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతుండడం గమనార్హం. ♦ భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు ఈ విభాగం పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. సరకు రవాణా వేగం, విశ్వసనీయతలకు కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా, సంవత్సరాలుగా రోడ్డు రవాణా ట్రక్కులకు రైల్వే తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. రవాణాలో రైల్వే మార్కెట్ షేర్ దశాబ్దం కిత్రం 52 శాతం అయితే, 2017–18లో 32 శాతానికి తగ్గింది. ♦రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉంది. సరుకు రవాణా రంగం దాదాపు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే. ట్రక్కుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కేవలం ఐదవ వంతును మాత్రమే రైల్వే రంగం విడుదల చేస్తుంది, ♦ భారతీయ రైల్వేలు 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని యోచించడం హర్షణీయం. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులను తొలగించగల సామర్థ్యాన్ని రైల్వే రంగం కలిగి ఉంది. ♦ భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కాలుష్యాన్ని తగ్గించడానికే కాకుండా, కోట్లాది మంది రైలు ప్రయాణీకులకు ఊరట కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అధికంగా ఉన్న రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇక భారత్ సంస్థల పోటీ తత్వాన్ని సైతం పెంచే అంశం ఇది. -
'లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం'
సాక్షి, హైదరాబాద్: ‘వనిత’ (పేరు మార్చాం) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. వ్యక్తిగత అవసరాల కోసం ఫాస్ట్ కాయిన్ అనే లోన్ యాప్‌లో రూ.18 వేలు రుణం తీసుకుంది. నెల రోజుల తర్వాత చక్రవడ్డీ కలుపుకొని రూ.25 వేలు చెల్లించింది. కానీ, యాప్‌లో మాత్రం పేమెంట్ జరిగినట్లు చూపించలేదు. తెల్లారి ఆమెకు యాప్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది ‘మీరింకా లోన్ కట్టలేదని, త్వరగా చెల్లించకపోతే మీ న్యూడ్ ఫొటోలను మీ కుటుంబీకులకు పంపిస్తామని’ బెదిరించారు. తెల్లారి అన్నంత పనీ చేసేశారు. దీంతో బాధితురాలు వెంటనే యాప్‌లో రూ.25 వేలు చెల్లించింది. ఇలా పలుమార్లు నిర్వాహకుల బెదిరింపులతో రూ. 2 లక్షలపైనే చెల్లించినా.. వదలకపోవటంతో బాధితురాలు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోన్ యాప్ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. వరుస అరెస్ట్‌లు, యాప్ బ్యాన్లతో ఏడాది పాటు కార్యకలాపాలకు దూరంగా ఉన్న లోన్ యాప్ నిర్వాహకులు మళ్లీ పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో 60కి పైగా లోన్ యాప్ వేధింపుల కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) ఢిల్లీ, బెంగళూర్ల నుంచి నిర్వహణ లోన్ యాప్ యజమానులు చైనాలో ఉంటారు. కానీ బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆపరేట్ చేయిస్తుంటారని సైబర్ క్రైమ్స్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నెలకు రూ.10 వేలు, రూ.15 వేలు వేతనం ఇస్తూ.. వారితో బాధితులు, వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటారని వివరించారు. కాల్ సెంటర్ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేస్తున్నామని, ఇటీవలే చంఢీఘడ్‌లోని అక్రమ కాల్ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసి. జైలుకు పంపించామన్నారు. లోన్ యాప్ బాధితుల్లో 10 శాతం వరకు మహిళలు ఉన్నట్లు తెలిపారు. రుణ గ్రహీతలు పురుషులైతే వాళ్ల కాంటాక్ట్ లిస్ట్‌లోని ఆడవాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తుంటారన్నారు. 600 పైగా చట్టవిరుద్ధ లోన్ యాప్స్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 1,100లకు పైగా ఆన్లైన్ లోన్ యాప్‌లు ఉన్నాయి. వీటిలో 600 యాప్స్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను సాగిస్తున్నాయని వెల్లడించింది. ఫాస్ట్ కాయిన్, రిచ్క్యాష్, క్విక్ క్యాష్, సూపర్ వాలెట్, లక్కీ వాలెట్, స్పీడ్ లోన్, హ్యాపీ వాలెట్, క్యాష్ ఫిష్, రూపియా బస్, లైవ్ క్యాష్, బెస్ట్ పైసా, రూపియా స్మార్ట్, రూపీ బాక్స్, లోన్ క్యూబ్, క్రెడిట్ బాక్స్ వంటివి ప్రముఖమైనవి. ఆయా యాప్స్‌ను బ్యాన్ చేయాలని గూగుల్‌కు లేఖ రాసింది. -
పరేషాన్ వద్దు.. లోన్ మోసాలను గుర్తించండి ఇలా!
ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు పాన్‌కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. సిబిల్ స్కోర్ అంటే..? బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి సిబిల్ ఇచ్చే స్కోర్(క్రెడిట్ స్కోర్)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణ చరిత్ర ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. 900 పాయింట్ల దగ్గరగా మీ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం లభించే అవకాశాలు ఉంటాయి. ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లేదా సీఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు కూడా స్కోర్ అందిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించాలి రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్ స్కోర్‌ను రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్ వెబ్సైట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. (క్లిక్: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) ఇలా చేయొద్దు! ► ఐడీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ► ఆధార్, పాన్‌కార్డ్ నంబర్లను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయొద్దు. ► స్కాన్ చేసిన ఆధార్, పాన్‌కార్డ్ కాపీలను మీ ఈ-మెయిల్లో పెట్టుకోవద్దు. ► ఈ-మెయిల్లో మీ పాన్‌కార్డ్‌ను షేర్ చేయాల్సివస్తే incognito మోడ్‌లో బ్రౌజర్‌ను వాడాలి. ► గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్ చేసి మాత్రమే వాడాలి. ► ప్లబిక్ వై-ఫై వినియోగించి ఆన్లైన్ ట్రాన్టాక్షన్స్ చేయొద్దు. ► పాన్‌కార్డ్ ఇమేజ్ మీ ఫోన్లో సేవ్ చేసివుంటే.. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్ ఇవ్వొద్దు. వెంటనే స్పందించండి మీకు తెలియకుండా మీ పేరు ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ బ్యూరో వైబ్‌సైట్ ద్వారా మీ ఫిర్యాదును ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్లైన్లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్ పంపవచ్చు. (క్లిక్: మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..) -
మారుతీ సుజుకీకి భారీ నిధులు
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్థ జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ (జేబీఐసీ) ఇప్పటి వరకు ఎస్బీఐకి రూ.11,400 కోట్లు సమకూర్చింది. ఈ మొత్తాన్ని మారుతీ సుజుకీ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఎస్బీఐ వినియోగిస్తోంది. మరో రూ.3,800 కోట్లు ఇచ్చేందుకూ జపాన్ సంస్థ సిద్ధమైంది. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి దేశంలో సుమారు రూ.60,800 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్టు భారత్‌లో జేబీఐసీ కీలక ప్రతినిధి టొషిహికో కురిహరా తెలిపారు. ‘మారుతీ సుజుకీకి కావాల్సిన నిధులకై ఎస్బీఐకి రూ.15,200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 2020 నవంబర్–డిసెంబర్ మధ్య సగం మొత్తం సమకూర్చాం. అలాగే రూ.3,800 కోట్లు అందించాం. మిగిలిన రూ.3,800 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం అయ్యాం. భారత్‌లో ఉన్న జపాన్ సంస్థలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చేందుకు ముందున్నాం’ అని వివరించారు. -
రుణమిస్తామని రూ.కోటి టోపీ
యశవంతపుర: కావలసినంత అప్పులు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఐదు మందిని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరుకు చెందిన విన్సన్ అనే వ్యక్తి గార్మెంట్స్ పరిశ్రమను స్థాపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అతని గురించి తెలుసుకున్న సంతోష్, సందేశ్‌లు అప్పు ఇప్పిస్తామని స్నేహం చేశారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సమావేశమై విన్సన్‌కు పెద్దమొత్తంలో రెండువేల నోట్లను చూపించారు. రూ.నూరు కోట్లు అప్పు కావాలంటే రూ. కోటి కమీషన్ ఇవ్వాలని చెప్పి డబ్బు తీసుకున్నారు. కొన్నిరోజుల తరువాత సంతోష్, సందేశ్‌లు పత్తా లేరు. విన్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్, సందేశ్‌లతో పాటు ఐదు మందిని అరెస్ట్ చేశారు. -
లోను కోసం వెళితే.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యి..
సాక్షి,హిమాయత్‌నగర్: అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో..లోను తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన నగర వాసికి దిమ్మతిరిగే నిజం తెలిసింది. మీ పేరుపై, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్‌పై ఆల్రెడీ లోను ఉంది మళ్లీ ఇంకొకటి ఎలా ఇస్తారనడంతో..నగర వాసికి తేరుకోవడానికి గంట సమయం పట్టింది. గుర్తు తెలియని వ్యక్తుల తన పేరుతో రూ. 11.70 లక్షల రుణం పొందారంటూ.. తనకు న్యాయం చేయాలని బుధవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు చాదర్ఘట్ వాసి రాము. వ్యక్తిగతంగా డబ్బు అవసరం ఉండటంతో.. రాము చాదర్‌ఘట్‌లోని ఎస్బీఐకి వెళ్లాడు. పాన్‌కార్డ్, ఇంటిపత్రాలు, తదితర డాక్యుమెంట్స్‌ను లోను సెక్షన్ వారికి ఇచ్చాడు. వారి వెరిఫికేషన్‌లో గత ఏడాది లోను తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం రాముకు లోను సెక్షన్ వాళ్లు చెప్పడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన ప్రమేయం లేకుండా అంత డబ్బు లోను ఎవరు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆ«ధారాలతో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. -
పట్టణ సేవలకు ఏడీబీ రూ.2,625 కోట్ల రుణం
న్యూఢిల్లీ: భారత్‌లో పట్టణ సేవల పురోగతికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 350 మిలియన్ డాలర్ల (రూ.2,625 కోట్లు)ను రుణంగా ఇవ్వనుంది. మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వాలు సంస్కరణలను చేపట్టడంతోపాటు.. పనితీరు ఆధారితంగా పట్టణ పాలకమండళ్లకు నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు ఈ కార్యక్రమం అమలు విషయంలో ఏడీబీ సలహా, మద్దతు సేవలను అందించనుంది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా, ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి సోమవారం సంతకాలు చేశారు. విధాపరమైన సంస్కరణలను అమలు చేయడంలో, పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పనకు సంబంధించి పట్టణ పాలక మండళ్లకు ఏడీబీ తన సేవలను అందిస్తుంది. వాతావరణం మార్పులు, పర్యావరణ, సామాజిక భద్రతా చర్యలను కూడా సూచిస్తుందని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలియజేసింది. అసోంలో నైపుణ్య యూనివర్సిటీకి సాయం అసోంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఏడీబీ మరో 112 మిలియన్ డాలర్లను రుణంగా ఇవ్వనుంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను బలోపేతం చేసేందుకు యూనివర్సిటీ ఏర్పాటు మార్గం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏడీబీతో ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్‌కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పని చేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. -
పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకు భరోసా!
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టులకు (గ్రీన్ ఫైనాన్స్) బ్యాంకుల రుణాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా పిలుపునిచ్చారు.తద్వారా సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. ‘‘గ్రీన్ ఫైనాన్స్ అన్న పదానికి ముందు తగిన నిర్వచనం ఇవ్వాలి. ఈ విభాగానికి సంబంధించి పటిష్ట నియంత్రణను అలాగే ఈ తరహా రంగాలకు మరింత ఫైనాన్స్ రావడానికి ఈ అంశం దోహదపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి’’ అని ఎస్బీఐ చైర్మన్ అన్నారు. ఈఎస్జీ (ఇన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్) ఇండియా లీడర్షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖారా చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦గ్రీన్ ఫైనాన్స్ విషయంలో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను తొలుత పరిశీలించాలి. అలాగే ఇందుకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల విషయంలో మూలసూత్రాలను అభివృద్ధి చేయాలి. ఆ రంగంలో వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలి. తద్వారా ఒక ‘‘గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం’’ ఆవిష్కరణ జరగాలి. ♦బ్యాంకులు గ్రీన్ ప్రాజెక్ట్‌లకు తగిన క్రెడిట్ అందించలేకపోతే అలాగే ఆయా ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోలో ఇబ్బందులను కనిపెట్టలేకపోతే ఈ విభాగంలో రిటర్న్స్ తీసుకోవాలనుకునే డిపాజిటర్లు, వాటాదారులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదముంటుంది. ♦ పర్యావరణం, తత్సంబంధ సామాజిక అంశాలు, నిర్వహణ విషయాల్లో ఎస్బీఐ చొరవను పరిశీలిస్తే, 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంక్ తన వంతు ప్రయత్నం చేయనుంది. ఈ దిశలో పలు లక్ష్యాల సాధనకు కృషి చేయనుంది. ♦ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మాత్రమే బ్యాంక్ పరిమితం కాదు. చెట్ల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, క్యాంపస్‌లో సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం తదితర చర్యల్లో పురోగతికి బ్యాంక్ తగిన పాత్ర పోషిస్తుంది. – ప్రస్తుతం వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతోంది. ఈ పరిస్థితుల్లో వాతావరణానికి జరిగే నష్టం అవకాశాలనూ బ్యాంక్ గుర్తించే పనిలో ఉంది. ♦ పర్యావరణ పరిరక్షణ సానుకూల ప్రాజెక్టుల విషయంలో రుణాల పెంపునకు బ్యాంక్ తగిన కృషి చేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రుణగ్రహీతలకు బ్యాంక్ రుణ సదుపాయాలను సులభతరంగా అందిస్తోంది. రూ.50 కోట్లు దాటిన రుణాల విషయంలో ఈఎస్జీ విషయంలో ఆయా పారిశ్రామికవేత్తల కృషిని బట్టి వారికి ఒక స్కోర్‌ను అందించడం జరుగుతోంది. ♦ పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి దోహదపడే ప్రొడక్టులను, సేవలను రూపకల్పన చేయడంలో గత కొన్నేళ్లుగా ఎస్బీఐ తగిన ప్రయత్నం చేస్తోంది. ♦2018–19 నుంచి 800 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ బాండ్లు, గ్రీన్ లోన్ బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది. తద్వారా సమీకరించిన నిధులను పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకే వినియోగిస్తోంది. ♦కాగా, అక్యూట్ గ్రూప్‌నకు చెందిన ఈఎస్జీ రేటింగ్ ఏజెన్సీ– ఈఎస్‌జీరిస్క్.ఏఐ55 ఈ సందర్భంగా పరిశ్రమలోని టాప్–500 టాప్ –500 లిస్టెడ్ కంపెనీల నుండి 21 విజేతలను ప్రకటించింది. -
మౌలిక రంగానికి రుణ లభ్యత అంతంతే!
ముంబై: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) మౌలిక రంగం ప్రాజెక్టులకు ఇచ్చిన రుణం అంతంతేనని ఇక్రా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణమని సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. అయితే మౌలిక రంగం పరోగతిపై సమీప భవిష్యత్తులో ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని మధ్య కాలికంగా ఈ విభాగం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... - 2021 మర్చి 31 నాటికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్సీలు కలిసి మౌలిక రంగానికి ఇచ్చిన రుణ అంచనా రూ.24.7 లక్షల కోట్లు. 2020 ఇదే కాలంతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ. జూన్ 30 వరకూ మౌలిక రంగానికి రుణ పరిమాణం బలహీనంగానే ఉంది. కరోనా సెకండ్‌వేవ్ ప్రేరిత సవాళ్లు దీనికి ప్రధాన కారణం. - ఒక్క ఐఎఫ్‌సీల విషయంలో మౌలిక రంగానికి గత ఐదేళ్లలో రుణం పెరుగుతోంది. 2021మార్చి 31 వతేదీ నాటికి 54 శాతం పురోగమించింది. అయితే బ్యాంకుల షేర్ గడచిన ఐదేళ్లలో 61 శాతం నుంచి నుంచి 46శాతానికి పడిపోయింది. - 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2024– 2025 ఆర్థిక సంవత్సరం వరకూ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) కింద రూ.111 లక్షల కోట్లకు పైగా మౌలిక రంగం పెట్టుబడులపై కేంద్రం దృష్టి సారించడం ఈ రంగానికి భవిష్యత్ సానుకూల అంశాల్లో కీలకమైనది. - ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితులు బాగున్నాయి. స్వల్ప కాలిక రుణాలకు సంబంధించి లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. - ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీల విషయానికి వస్తే, ప్రభుత్వ రంగంలో సంస్థలు లాభాల బాటకు మళ్లాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) వాటా తగ్గింది. రుణ వ్యయాలు తక్కువగా ఉన్నాయి. - ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగుదల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. -
‘స్కోర్’ బాగుంటే రుణం ఈజీ!
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచి్చతంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం... ఎలా లెక్కిస్తారంటే.. రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిరీ్ణత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కలి్పస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కలి్పస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడమే స్కోర్‌ను పెంచుకోవడానికి ప్రాథమిక సూత్రం. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల, మర్చిపోవడం కారణంగానే వాయిదా రోజున చెల్లింపులు చేయలేకపోతే.. కంపెనీ నుంచి మీ కాల్ వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆ వాయిదాను చెల్లించేయాలి. రీపేమెంట్లో ఎలాంటి జాప్యం చేసినా సరే రుణదాతలు దీన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తుంటారు. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచి్చన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచి్చన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మీ స్కోర్‌ను పెంచుకోవాలంటే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు లేకపోతే దాన్ని తీసుకుని పరిమిత వినియోగంతోపాటు సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్‌ను పెంచుకోవచ్చు. -
రూ.137 కోట్ల మోసం.. ‘తెలిసే బ్యాంకులు అప్పిచ్చాయి’
సాక్షి, హైదరాబాద్: ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను రూ.137 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి పోలీసు కస్టడీ గడువు ముగియడంతో సీసీఎస్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 2 రోజుల పోలీసుల విచారణలో ఆయన కొత్త అంశాలను బయటపెట్టలేదు. తనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులకు అన్ని విషయాలు తెలిసే అప్పులు ఇచ్చాయని మాత్రమే చెప్పుకొచ్చాడు. మరికొన్ని అంశాలు రాబట్టాలని భావిస్తున్న పోలీసులు మరో 2 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సైఫాబాద్ పరిధిలో వ్యక్తి హత్య ఖైరతాబాద్: జులాయిగా తిరిగే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో వద్ద సమీర్ (35) జులాయిగా తిరుగుతూ వైట్నర్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 8గంటల సమయంలో పిల్లర్ నెం 1244–45 మధ్య రక్తం మడుగులో పడిఉన్నాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పరీక్షించి చూడగా తల వెనుక, కుడిచేయి, భుజం మీద పదునైన ఆయుధంతో కోసిన గాయాలు గుర్తించారు. అప్పడికే చనిపోయి ఉండటంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి -
రుణ అర్హత పెంచుకోవడానికి మార్గలివే
దేశంలో సగం మంది స్వయం ఉపాధిలో ఉన్న వారే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సొంత కాళ్లపై నిలబడ్డవారే ఉంటారు. వీరు రెండు విభాగాలుగా ఉంటారు. ‘సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్’ అంటే ఏదో విభాగంలో నైపుణ్యం ఉన్న వారు. వీరికి ఏదో ఒక విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్స్, డెంటిస్ట్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు ఇలాంటి వారిని సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్‌గా పేర్కొంటారు. ప్రత్యేక నైపుణ్యాల్లేకుండా ఉపాధి ఏర్పాటు చేసుకున్న వారు నాన్ ప్రొఫెషనల్స్ విభాగంలోకి వస్తారు. ప్రధానంగా వీరు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం, ట్రేడింగ్ తదితర పనుల్లో ఉంటుంటారు. రెండో విభాగం ఎక్కువగా అసంఘటిత రంగం కిందకే వస్తుంది. చిన్న పట్టణాల్లో వీరి ప్రాతినిధ్యం బలంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్థుల వృద్ధిని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు ఎన్నో తీసుకున్నాయి. అయినప్పటికీ సొంత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు రుణం పొందాలంటే నిపుణులు కాని స్వయం ఉపాధిలోని వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి వారు రుణ అర్హతలను పెంచుకునే మార్గాలు చూద్దాం.. రుణానికి అడ్డంకులు.. - నెలవారీ అస్థిర ఆదాయం ఉండడం - క్యాష్ రూపంలో ఆదాయం చూపించే రుజువులు లేకపోవడం - వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లేకపోవడం. ఉదాహరణకు ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, వ్యాట్ రిజిస్ట్రేషన్, ఇతర లైసెన్స్‌లు - రుణ చరిత్ర లేకపోవడం లేదా పరిమితంగా ఉండడం. లేదంటే ప్రతికూల చరిత్ర ఉండడం. - పన్ను రిటర్నుల చరిత్ర లేకపోవడం - కేవైసీకి సంబంధించి అసంపూర్ణ డాక్యుమెంట్లు - ఖాతాల నిర్వహణ సజావుగా లేకపోవడం ఇటువంటివి రుణ అర్హతలకు ప్రతికూలతలుగా భావించాలి. దీంతో రుణాలిచ్చే సంస్థలకు.. రుణ గ్రహీత చరిత్రను సమగ్రంగా తెలుసుకుని, రుణ అర్హతను అంచనా వేయడం కష్టమవుతుంది. రుణాలిచ్చే సంస్థలకు ఈ విభాగం పెద్ద సవాళ్లతో కూడుకున్నదే. దీంతో రుణ పరపతి తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దరఖా స్తు ప్రాసెసింగ్ కూడా ఆలస్యమవుతుంది. అంతేకాదు దరఖాస్తు తిరస్కరణకు కూడా గురికావచ్చు. అందుకనే స్వయం ఉపాధిలోని వారు వ్యాపారం, ఆదాయానికి సంబంధించి వీలైనన్ని డాక్యుమెంట్లను సమర్పించడం మంచిది. తద్వారా వేగంగా రుణాలను పొందేందుకు మార్గం సులువవుతుంది. ఇందుకోసం చేయాల్సినవి ఏవిటంటే..? రుణ అర్హతలను పెంచేవి.. - వ్యాపార ఖాతాలను ఎటువంటి తప్పుల్లేకుండా, కచ్చితంగా నిర్వహించాలి. అంతేకాదు ఆయా అకౌంట్లను చార్టర్డ్ అకౌంటెంట్లతో ఆడిట్ కూడా చేయించుకోవాలి. - ఆదాయపన్ను రిటర్నులను సమయానికి కచ్చితంగా దాఖలు చేయాలి. - వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. - వ్యాపారంలో భాగంగా వచ్చే ఇతర ఆదాయానికి రుజువులను కూడా దగ్గర ఉంచుకోవాలి. రుణ దరఖాస్తు అధికారి కోరిన ప్రతీ సమాచారంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలి. దీనివల్ల మీ గురించి, మీ వ్యాపారం గురించి మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు పడుతుంది. - మీకు సంబంధించి, మీ వ్యాపారానికి సంబంధించి తీసుకునే ఏ రుణంలో అయినా చెల్లింపుల్లో వైలఫ్యం, జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల క్రెడిట్హిస్టరీపై ప్రభావం పడకుండా ఉంటుంది. చదవండి : బంగారం రుణాల్లోకి షావోమీ ! -
పీఎన్బీతో ఎన్ఎఫ్డీబీ ఒప్పందం
హైదరాబాద్: జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి(ఎన్ఎఫ్డీబీ).. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మత్స్య పరిశ్రమలకు పీఎన్బీ ద్వారా రుణ సాయం లభించనుంది. మత్స్య రంగంలో సామర్థ్యం ఉండీ, అంతగా వెలుగుచూడని పరిశ్రమలకు ఎఫ్ఐడీఎఫ్, ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన కింద రుణ వితరణకు గాను పీఎన్బీతో ఒప్పందం వీలు కల్పిస్తుందని ఎన్ఎఫ్డీబీ సీఈవో సువర్ణ చంద్రప్పగిరి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సువర్ణ చంద్రప్పగిరి, పీఎన్బీ ఎండీ, సీఈవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పర్సనల్ లోన్, బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే
ప్రతి ఒక్కరికి ఆర్ధిక సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు బ్యాంక్‌లోన్, లేదంటే బంగారంపై లోన్ తీసుకోవడమో చేస్తుంటారు. అదే సమయంలో ఏ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మంచిదో ఆలోచించరు. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామా? లేదా? అనేది మాత్రమే ఆలోచిస్తుంటారు. అయితే ఆర్ధిక నిపుణులు మాత్రం బ్యాంక్ లోన్, బంగారంపై లోన్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాంక్‌లోన్, బంగారంపై లోన్ తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వడ్డీ రేట్లు: బ్యాంక్ లోన్ మన ఆర్ధిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. అంతా బాగుంటే పర్సనల్ లోన్‌పై సాధారణంగా 10నుంచి 24 శాతం వరకు వడ్డీ ఉంటుంది. తీసుకున్న మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల్లో తీరుస్తారనే అంశంతో పాటు రిస్క్ అసెస్మెంట్ను బట్టి బంగారంపై తీసుకునే లోన్లపై వడ్డీ రేటు 7.00 నుంచి 29 శాతం వరకు ఉంటుంది. రుణం మొత్తం: తీసుకున్న మొత్తాన్ని ఎంత కాలంలో చెల్లిస్తారనే అంశాన్ని బట్టి రూ .50,000 నుండి 15 లక్షల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు 30 లక్షల నుండి 40 లక్షల వరకు లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తుంటాయి. బంగారంపై రుణం: బంగారంపై ఇచ్చే రుణం లోన్-టు-వాల్యూ (ఎల్టివి) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ బంగారం ఎన్ని గ్రాములు ఉంది. ప్రస్తుత మార్కెట్లో దాని వ్యాల్యూ ఎంత ఉంది. మీరు ఎంత లోన్ కావాలనుకుంటున్నారు? మీకు కావాల్సిన లోన్ కి, మార్కెట్ లో బంగారంపై ఉన్న రేట్‌కి ఎంత వ్యత్యాసం ఉంది' అనే విషయాల్ని పరిగణలోకి తీసుకొని లోన్ వ్యాల్యూను మార్చేస్తుంటాయి. బంగారు లోన్ ఎల్టివి నిష్పత్తిపై ఆర్బీఐ 75 శాతం విధించింది. ప్రాసెసింగ్ టైమ్ : లోన్ ఇచ్చే ముందు జరిగే ప్రాసెస్‌లో వ్యక్తిగత వివరాలతో పాటు ఐటిఆర్ ఫారాలు / పేస్లిప్స్ జత చేయాల్సి ఉంటుంది. ఇలా జత చేసిన అనంతరం లోన్ ఇచ్చే సమయం 2 రోజుల నుంచి 7వరకు ఉంటుంది. లోన్ ప్రాసెస్ తొందరగా పూర్తయితే మనకు కావాల్సిన లోన్ తొందరగానే వస్తుంది. తిరిగి చెల్లించే సమయం : తీసుకున్న లోన్ ను కొన్ని బ్యాంక్ లు లేదంటే ఆర్ధిక సంస్థలు 7 సంవత్సరాల వరకు గడువును విధిస్తాయి. అయితే పర్సనల్ లోన్ సాధారణంగా 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. బంగారంపై తీసుకున్న లోన్ తిరిగి చెల్లించే సమయం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని బ్యాంక్‌లు 4 నుంచి 5 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువ సమయాన్ని ఇస్తుంటాయి. పేలవమైన క్రెడిట్ ప్రొఫైల్: వడ్డీ రేట్లు మీ బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారిపోతుంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్‌లు తీసుకునే సమయంలో జాగ్రత్త వహించాలి. క్రెడిట్ స్కోర్లు, నెలవారీ ఆదాయం, జాబ్ ప్రొఫైల్, కంపెనీ ప్రొఫైల్ మొదలైనవి పర్సనల్ లోన్ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్స్ ఆధారంగా, కొన్ని సంస్థలు ఇచ్చే లోన్లపై ఎంత వడ్డీ విధించాలో నిర్ణయిస్తాయి. ఏది మంచిది : కొంతలో కొంత పర్సనల్ లోన్ కంటే బంగారంపై లోన్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్యాంక్ లో తీసుకున్న పర్సనల్ లోన్‌ను విధించిన గడువులోపు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే ఎన్ని అనార్ధాలు జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం. అదే బంగారంపై లోన్ తీసుకుంటే గడువులోపు పే చేయలేదంటే అదే బంగారాన్ని వేలం వేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు: బంగారంపై తీసుకునే లోన్ ప్రాసెసింగ్ ఫీజు సాధారణంగా 2 శాతం వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు లోన్ తీసుకునే వ్యక్తులు, సన్నిహిత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1 శాతం నుంచి 3 శాతం వరకు ఉంటుంది. -
వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి'
భోపాల్ : హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని ఓ మహిళా రైతు రాష్ట్రపతికి లేఖ రాసింది. అంతేకాకుండా ఫ్లయింగ్ పర్మిషన్ కూడా ఇప్పించాని విఙ్ఙప్తి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేఖ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ జిల్లాకు చెందిన బసంతి బాయ్ అనే మహిళ చిన్న పూరి గుడిసెలో నివసించేది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే తనకున్న 2 బిగాల పొలంలోకి వెళ్లాలంటే పరమానంద్ అనే రైతుకి చెందిన పొలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయన తన ఇద్దరు కుమారులు సైతం బసంతితో వాగ్వాదానికి దిగేవారు. కొన్నాళ్ల తర్వాత ఆ దారిని మూసి వేయించారు. ఈ విషయంపై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. కాలినడకన వెళ్లేందుకు వీలు లేకపోవడంతో హెలికాప్టర్ కొనడానికి లోన్ ఇప్పించాలని లేఖలో కోరడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఈ సమస్యను తానే దగ్గరుండి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. చదవండి : (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) (మిస్ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు) Alleging denial of passage into her agricultural plot, woman in MP's Mandsaur district writes to President of India for loan and license to fly by helicopter into her plot. On spot official probe, however, finds clear passage to woman's plot. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/zEiWdN0MiM — Anuraag Singh (@anuraag_niebpl) February 12, 2021 -
అసభ్య, బూతు సందేశాలు పంపేది ఢిల్లీలోని సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోయిన డిఫాల్టర్స్‌ను వేధించడానికి అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వేర్వేరు స్టేజ్ల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్టేజ్–1 కాల్ సెంటర్లలోని ఉద్యోగులు కేవలం రిమైండర్స్ మాత్రమే పంపిస్తుంటారు. గుర్గావ్లో ఉండే స్టేజ్–2 కాల్ సెంటర్లలోని వారు వేధింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేస్తుంటాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) కేంద్రంగా పనిచేసే స్టేజ్–3 సెంటర్ల నుంచి డిఫాల్టర్లతో పాటు వారి సంబంధీకులకు నకిలీ లీగల్ నోటీసులు, అభ్యంతరకర, అసభ్య సందేశాలు వెళ్తుంటాయి. ఈ యాప్స్ కేసులకు సంబంధించి సిటీ సైబ ర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్, గుర్గావ్ల్లోని కాల్ సెంటర్లపై దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఉద్యోగులనే డైరెక్టర్లుగా.. కలర్ ప్రిడెక్షన్ తరహా మరికొన్ని గేమింగ్స్ యాప్స్ నిర్వహించిన చైనా కంపెనీలు వాటిలో డైరెక్టర్లుగా తమ దేశీయుల్ని నియమించుకున్నాయి. అయితే ఈ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి వీటికి సంబంధించిన కాల్ సెంటర్లలో ఉద్యోగుల్నే డైరెక్టర్లుగా ఉంచుతున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపుతూ వీటిని రన్ చేస్తున్నాయి. గుర్గావ్లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 2, హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్టల్లోని 3 కాల్ సెంటర్లు 30 యాప్స్ కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ లియోఫంగ్ టె క్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రై.లి., పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రై.లి., నబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో బెంగళూరులో రిజిస్టరైన సంస్థల అధీనంలో నడుస్తున్నాయి. పంజగుట్టలోని కాల్ సెంటర్లో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న జీవన జ్యోతితో పాటు సెల్వరాజ్ సింగిలు లియోఫంగ్, హాట్ఫుల్లకు, రవికుమార్ మంగల, వెంకట్లు పిన్ ప్రింట్, నబ్లూమ్లకు డైరెక్టర్లుగా ఉన్నారు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) బెదిరింపులు.. బూతులతో.. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ, డిఫాల్టర్లను అడ్డంగా వేధిస్తున్న అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నిర్వాహకులు కాల్ సెంటర్ల ఉద్యోగుల ద్వారా వేస్తున్న వేషాలు అన్నీఇన్నీ కావు. బాధితుల్ని బెదిరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణా వద్దకు వచ్చాడు. అదే సమయంలో సదరు యాప్‌కు చెందిన కాల్ సెంటర్ నుంచి డబ్బు కట్టాలని, లేదంటే ‘తీవ్ర పరిణామాలు’ ఉంటాయని వాట్సాప్‌లో సందేశం వచ్చింది. దీనికి సమాధానంగా బాధితుడు తాను సైబర్ క్రైమ్ ఠాణా వద్ద ఉన్నాననే దానికి సూచికంగా ఆ స్టేషన్ బోర్డును ఫొటో తీసి షేర్ చేశాడు. ఇది చూసిన కాల్ సెంటర్ ఉద్యోగి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. (చదవండి: ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!) వెనకున్నది చైనీయులే..! దాదాపు నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన ఈ కాల్ సెంటర్ల వెనుక చైనీయులే ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన చైనా జాతీయురాలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వెళ్లింది. అలాగే గుర్గావ్లోని సెంటర్లకు నేతృత్వం వహించిన మరో చైనీయుడి పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ అధికారుల తనిఖీల్లో లభ్యమైంది. ఈ రెండింటితో పాటు ఇతర ఆధారాల నేపథ్యంలోనూ ఈ అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వెనుక చైనా జాతీయుల ప్రమేయమున్నట్లు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో 600 మంది, గుర్గావ్లోని వాటిల్లో 500 మంది టెలికాలర్స్‌గా ఉన్నారు. వీళ్లు కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా షిఫ్ట్‌ల వారీగా, 24 గంటలూ విధులు నిర్వర్తిస్తూ జకార్తా నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ సంస్థల్లోని ఉద్యోగులు ప్రతి 2–3 నెలలకు మారిపోతుండటం వెనుక ఏమైనా కారణముందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి లావాదేవీలు.. మైక్రో ఫైనాన్స్ యాప్స్ నిర్వాహకులు తమ ఆర్థిక లావాదేవీలూ తేలిగ్గా బయటపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వారికి నేరుగా జీతాలు చెల్లించట్లేదు. దీనికోసం ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశాయి. వారికి మరో థర్డ్ పార్టీ నుంచి యూఐపీ, నగదు రూపంలో డబ్బు పంపిస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి జరుగుతున్న ఈ లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా 30 యాప్స్‌కు సంబంధించిన 10 బ్యాంక్ ఖాతాలు, 80 వ్యాలెట్స్ గుర్తించారు. వీటిలోకి నగదు రాకపోకల్ని అధ్యయనం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా కార్యకలాపాలు నడుపుతున్న ఈ సంస్థలు 20 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి హోస్ట్ అవుతున్నాయి. గూగుల్ నిబంధనల ప్రకారం రీ పేమెంట్ పీరియడ్ 60 రోజులు. అయితే ఈ యాప్స్ మాత్రం వారం నుంచి పక్షం రోజుల్నే గడువుగా నిర్దేశించాయి. అందరూ నిందితులు కాదు.. ఈ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో 16 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి మంగళవారం గుర్గావ్, సిటీల్లోని కాల్ సెంటర్ల నుంచి బిందురాణి, జ్యోతి మాలిక్, అమిత్, రమణ్‌దీప్ సింగ్, ప్రభాకర్ ధంగ్వాల్, మధుబాబు సింగి, మనోజ్‌కుమార్ సింగి, మహేశ్ కుమార్ సింగి, తరుణ్, పవన్‌కుమార్, జీవన్ జ్యోతిలను అరెస్టు చేశారు. దాదాపు 700 ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఈ యాప్స్‌తో పాటు వాటి లావాదేవీలకు సంబంధించిన వ్యాలెట్స్ హోస్టింగ్‌కు సంబంధించి గూగుల్ సేవలు అందించే ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ఈ వ్యవహారాల్లో సూత్రధారులపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోపక్క ఈ కాల్సెంటర్లలో పనిచేస్తున్న అందరూ నిందితులు కాదని.. ఎవరైతే అసభ్య సందేశాలు పంపి ఉంటారో వారినే అరెస్టు చేస్తామని సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నుంచి వేధింపులు ఎదురైతే ‘100’కు లేదా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో లేదా స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఈ తరహా కేసులు దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ దందాలో ఎవరూ చిక్కవద్దని సూచించారు. -
ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టంట్ రుణాల పేరుతో పలువురిని ఆకర్షించి, వడ్డీ, పెనాల్టీగా అధిక మొత్తం వసూలు చేస్తూ, చెల్లించలేకపోయిన వారి పరువు, ప్రాణాలు తీస్తున్న మైక్రో ఫైనాన్స్ యాప్స్ కేసుల దర్యాప్తును హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సాంకేతిక ఆధారాలను బట్టి హైదరాబాద్‌లో మూడు, గుర్గావ్లో ఒక కాల్ సెంటర్ ఆచూకీ కనిపెట్టారు. సోమవారం వీటిపై దాడి చేసిన ప్రత్యేక బృందాలు.. మొత్తం 1,100 మంది ఉద్యోగులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ యాప్స్ వెనుక చైనా కంపెనీలే ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని నిర్థారించడం కోసం సాంకేతిక సమాచారం ఇవ్వాల్సిందిగా ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ. సంస్థకు ఈ–మెయిల్ పంపారు. విదేశాల్లో ఉన్న సూత్రధారులే తెర వెనుక ఉండి ఈ యాప్స్ నడిపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డైరెక్టర్లు అంతా డమ్మీలే... వివిధ రకాల ఆన్లైన్ వ్యాపారాల పేర్లతో భారత్‌లో కంపెనీలు రిజిస్టర్ చేయిస్తున్న చైనీయులు ఎలాంటి అనుమానం రాకుండా వాటిలో భారతీయుల్నే డైరెక్టర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డైరెక్టర్లలో చిన్నచిన్న వ్యాపారులు, నిరుపేదలు కూడా ఉన్నారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల జీతాలకు ఆశపడుతున్న వారిని ఎంపిక చేసుకుని సాంకేతికంగా డైరెక్టర్లుగా చేస్తున్నారు. వీరందరినీ డమ్మీలుగా ఉంచుతున్న చైనీయులు ఆయా యాప్స్ నిర్వహణ, పర్యవేక్షణకు తమ దేశీయుల్నే నియమించుకుంటున్నారు. (లోన్‌యాప్: తల్లి ఫొటోలు మార్ఫింగ్) ఇండోనేసియా నుంచి వస్తున్న ఆదేశాలు... ఈ పాత్రధారులకు లోన్ యాప్స్ నిర్వహణ, విధివిధానాల్లో మార్పులు, అమలుకు సంబంధించి విదేశాల్లోని సూత్రధారుల నుంచే ఆదేశాలు అందుతున్నాయి. దీనికోసం వాట్సాప్ సహా వివిధ రకాల యాప్స్‌ను వాడుతున్నారు. అయితే వీటి ద్వారా చైనా నుంచి నేరుగా ఆదేశాలిచ్చే ఆస్కారం లేకపోవడంతో ఇండోనేసియా, మలేసియా తదితర దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ ఉండే చైనీయులిచ్చే ఆదేశాల ప్రకారం.. దేశంలో ఉంటున్న పాత్రధారులు పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ‘వేధింపుల’కోసం కాల్‌సెంటర్లు... తమ యాప్స్ నుంచి లోన్లు తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలమైన వారిని ‘వేధించడానికి’ సూత్రధారులు కాల్సెంటర్లను ఎంచుకుంటున్నారు. ఇక్కడి పాత్రధారులకు ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని కాల్‌సెంటర్లతో ఒప్పందాలు చేసుకునే బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. ఇలా దాదాపు 30 వరకు యాప్స్ నిర్వాహకులు హైదరాబాద్‌లో 3, గుర్గావ్లో ఒక కాల్ సెంటర్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీళ్లకు పాత్రధారుల నుంచి ‘డిఫాల్టర్స్ జాబితాలు’అందుతాయి. వాటి ఆధారంగా వారితో పాటు కుటుంబీకులు, స్నేహితులు పరిచయస్తులకు కాల్స్ చేయడం... వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా సందేశాలు పంపడం, ప్రత్యేకంగా గ్రూప్‌లు క్రియేట్ చేసి వేధించడం ఈ కాల్సెంటర్స్లోని ఉద్యోగుల పని. (చదవండి: ఈ దోపిడీ మరో ‘దృశ్యం’ ) రెండు ప్రాంతాల్లో వరుస దాడులు... ఈ లోన్ యాప్స్ వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో 12 కేసులు నమోదయ్యాయి. బాధితులకు వచ్చిన వేధింపు కాల్స్, సందేశాలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ నంబర్లు రిజిస్టర్ అయి ఉన్న చిరునామాలు, అవి యాక్టివేట్ అయి ఉన్న లొకేషన్స్‌ను సేకరించారు. హైదరాబాద్ బేగంపేటలో రెండు ప్రాంతాల్లో ఉన్న కాల్‌సెంటర్లతో పాటు పంజగుట్టలో ఒక చోట, గుర్గావ్లో రెండు చోట్ల ఉన్న కాల్ సెంటర్లపై సోమవారం దాడులు చేశారు. వీటిలో పని చేస్తున్న 1,100 మంది ఉద్యోగులతో పాటు నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి తమకు వివిధ యాప్స్ ద్వారా అందుతున్న ఆదేశాలు, జాబితాల ఆధారంగా వీళ్లు పని చేస్తున్నట్లు తేల్చారు. హోస్టింగ్స్ వివరాలు తెలిస్తే కొలిక్కి... ఈ తరహా లోన్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్స్‌లో 250 ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీటి నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాలతో పాటు గూగుల్ పే తదితర వ్యాలెట్స్ ద్వారా జరుగుతున్నట్లు తేలింది. గూగుల్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ. అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి సమాచారం సేకరిస్తే ఆయా యాప్స్‌ను ఎవరు? ఎక్కడ నుంచి హోస్ట్ చేస్తున్నారు? ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఎవరి పేరుతో ఉన్నాయి? తదితర వివరాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో వాటిని అందించాల్సిందిగా కోరుతూ ఆల్ఫాబెట్ సంస్థలకు ఈ–మెయిల్ పంపారు. అక్కడ నుంచి సమాధానం వస్తే ఈ కేసుల్లో అనేక విషయాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు యూపీవాసులు రాజేంద్రనగర్: ఇన్స్టంట్ లోన్ యాప్ ఊబిలో చిక్కి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీల్ కేసులో సైబరాబాద్ క్రైమ్, రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ డేటాతో పాటు యాప్‌లను గుర్తించారు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రెండు టీమ్‌లు బెంగళూర్‌తో పాటు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కాల్ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసులో కొంత పురోగతి సాధించినట్లు సమాచారం. పూర్తి సాంకేతికత ఆధారాలను సేకరించి ఆ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరినీ సైబర్‌క్రైమ్ పోలీసులు రాజేంద్రనగర్ పీఎస్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా వారిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.