సాక్షి, హైదరాబాద్: ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను రూ.137 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి పోలీసు కస్టడీ గడువు ముగియడంతో సీసీఎస్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 2 రోజుల పోలీసుల విచారణలో ఆయన కొత్త అంశాలను బయటపెట్టలేదు. తనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులకు అన్ని విషయాలు తెలిసే అప్పులు ఇచ్చాయని మాత్రమే చెప్పుకొచ్చాడు. మరికొన్ని అంశాలు రాబట్టాలని భావిస్తున్న పోలీసులు మరో 2 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
సైఫాబాద్ పరిధిలో వ్యక్తి హత్య
ఖైరతాబాద్: జులాయిగా తిరిగే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో వద్ద సమీర్ (35) జులాయిగా తిరుగుతూ వైట్‌నర్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 8గంటల సమయంలో పిల్లర్ నెం 1244–45 మధ్య రక్తం మడుగులో పడిఉన్నాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పరీక్షించి చూడగా తల వెనుక, కుడిచేయి, భుజం మీద పదునైన ఆయుధంతో కోసిన గాయాలు గుర్తించారు. అప్పడికే చనిపోయి ఉండటంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.
చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment