Cheat
-
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువతి
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిట్టనిలువునా మోసగించిందో కిలేడీ. ఈ కేసులో తిరుపతికి చెందిన తమ్మ హేమమణి అలియాస్ ప్రీతి రెడ్డి..ఆమెకు సహకరించిన కొండారెడ్డిలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన 45 ఏళ్ల బాధితుడికి గతేడాది మేలో విడాకుల మ్యాట్రిమోనీ యాప్ ద్వారా హేమమణితో పరిచయం ఏర్పడింది. తాను ఎంబీబీఎస్, ఎండీ అర్హతలు కలిగిన కార్డియాలజిస్ట్ అని పరిచయం చేసుకుంది. విడాకులు తీసుకొని భర్తతో దూరంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో తక్కువ కాలంలోనే పలు సామాజిక మాధ్యమాలలో ఇరువురూ సన్నిహితులుగా మారిపోయారు. కొంతకాలం తర్వాత నిందితురాలు వివాహ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో బాధితుడు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె రోగికి చికిత్స చేయడానికి నిధులు అవసరమని పేర్కొంటూ బాధితుడి నుంచి సొమ్ము వసూలు చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. తర్వాత ఆమె బాధితుడిని మళ్లీ సంప్రదించి తన తల్లి చనిపోయిందని అత్యవసరంగా ఇంకొంత సొమ్ము అవసరముందని చెప్పింది. పలు లావాదేవీల్లో మొత్తం రూ.4.97 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ మధులత నేతృత్వంలోని బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
కహానీలు చెబితే కడుపు నిండుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా తీరు భలే విచిత్రంగా ఉంటుంది. వారికి లాభం జరిగితే ప్రజలందరికీ జరిగినట్లే. వారి ఇబ్బందులు ప్రజలందరి సమస్యలు! ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ సంక్రాంతి వరాలు వచ్చేశాయట!. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందట!. పచ్చి అబద్ధాలను వండి వార్చేఈ ఎల్లో మీడియా ఉరఫ్ ఈనాడులో వచ్చిన కథనాల్లో కొన్ని ఇవి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నీ అమలు చేసి ఉంటే ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లు కానీ.. తిమ్మిని బమ్మి చేసినట్లు ప్రతి వాగ్ధానాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు కూటమి నానా తంటాలూ పడుతూంటే ఎల్లోమీడియా ఆ అబద్ధాలకు వంతపాడుతూ మురిసిపోతోంది. ఎన్నికలకు ముందు ఒక రకమైన అసత్యాలు.. ఇప్పుడు ఇంకో రకంగా బిల్డప్ ఇస్తూ జనాన్ని మభ్యపెడుతోంది. 😱కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు.. రాష్ట్రంలో అరాచకమే ఎక్కువ. జగన్ టైమ్‌లో జరిగిన అభివృద్దిని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వృద్దుల ఫించన్ వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే ఇతర హామీని పూర్తిగా అమలు చేయని కూటమి, ఎన్నికల ప్రణాళికలో ఉన్న సుమారు 175 వాగ్దానాల జోలికే వెళ్లలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రోజుకో కొత్త రకం భజన కీర్తలను పాడుతోంది. అయితే.. 👉జనం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నేతలు చేసిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ఈ మధ్య ఒక సీనియర్ పాత్రికేయుడు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించినప్పుడు ప్రజల్లోని ఈ అసంతృప్తిని గమనించారు. జగన్ ఉండి ఉంటే ఫలానా స్కీమ్ కింద తమకు ఇంత డబ్బు వచ్చి ఉండేది.. చేతులలో డబ్బు ఆడేది.. అని చెప్పుకుంటున్నారట. కానీ అంతకు మూడు రెట్లు సాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తమను వంచించారని ఎక్కువ మంది భావిస్తున్నారట!.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఏ స్కీమ్ కూడా ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. ‘అమ్మ ఒడి’ని మార్చి ప్రతి బిడ్డకు రూ.15 చొప్పున ఇస్తామన్న కూటమి నేతలు, కావాలంటే ఇంకా పిల్లలను కనండని బంపర్ ఆఫర్ ప్రకటించిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తూచ్ అనేశారు. జాకీ మీడియా కూడా ‘అమ్మ ఒడి’ అంటే బటన నొక్కడమని ధనం వృధా చేయడమేనని ఊదరగొట్టింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతోందో చూడండి. 👇ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు పొమ్మన్నారురైతు భరోసా జాడ కనిపించడం లేదు. విద్యా దీవెన, వసతి దీవెన ఏమయ్యాయో తెలియదు. ఆరోగ్య శ్రీని నీరుకార్చే పనిలో ఉన్నారు. జగన్ ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీమ్ తెస్తే, ఇప్పుడు అది గాలికి పోయినట్లు ఉంది. ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సేవలందించేందుకు జగన్ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని జీతాలూ పెంచుతామని చంద్రబాబు ఉగాది పండగనాడు దైవ సాక్షిగా ప్రకటించినా.. ఇప్పుడు దానికి మంగళం పలికారు. మరోవైపు.. ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వంట నూనెల ధరలే లీటర్‌కు రూ.30 నుంచి రూ.40 వరకూ పెరిగాయి. పప్పులు, కూరగాయల ధరలన్ని అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నిటి ఫలితంగా సంక్రాంతి వచ్చినా ప్రజలు చేతిలో డబ్బులు ఆడక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా తగ్గాయి. ఇందుకు ఉదాహరణ ఏమిటంటే.. లెక్కలు ఇలా.. 👇ఒక్క కృష్ణా జిల్లాలోనే వైఎస్ జగన్ పాలనలో 2023 లో పండగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో వస్త్ర వ్యాపారం రూ.3000 కోట్ల మేర జరిగితే కూటమి పాలన వచ్చిన 2024లో అదే కాలానికి కేవలం రూ.1200 కోట్లుగానే ఉంది. కిరాణా వ్యాపారం పరిస్థితి అలాగే ఉంది. గతంతో పోల్చితే ఈసారి లావాదేవీలు రూ. వెయ్యి కోట్ల తగ్గాయి. బంగారం వ్యాపారం రెండు నెలల టైమ్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3000 కోట్ల టర్నోవర్ జరిగితే, కూటమి పాలనలో అది రూ.1500 కోట్లుగా ఉంది. ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా సగానికి సగం పడిపోయాయి. అప్పట్లో రూ.800 కోట్లు ఉంటే, ఈ సారి రూ.400 కోట్లే ఉంది. వీటి ఫలితంగా జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయమూ తగ్గింది. ఏపీలో జీఎస్టీ వసూళ్లు బీహారు కన్నా తక్కువ కావడం పరిస్థితిని తెలియచేస్తుంది. జగన్ టైమ్ లో 12 శాతం జీఎస్టీ వసూళ్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర భాగాన ఉంటే, ఈ సారి ‘- 6’ శాతం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 👉ఈ లెక్కలు ఇలా ఉన్నా, ఎల్లో మీడియా మాత్రం సంక్రాంతికి ప్రజలంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. అవును.. నిజమే.. మార్గదర్శికి సంబంధించిన కేసులలో గత ప్రభుత్వం జప్తు చేసిన రూ.వెయ్యి కోట్లను ఈ ప్రభుత్వం రాగానే తీసి వేసింది కదా!.. అందువల్ల ఈనాడు వారికే పండగే కావచ్చు. సామాన్యుడికి వస్తే ఎంత? రాకపోతే ఎంత? సంక్రాంతి వరాలు రూ.6700 కోట్లు అంటూ పెద్ద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. గతంలో జగన్ ఒక్క స్కీమ్ కింద ఈ స్థాయిలో ప్రజలకు డబ్బు ఇచ్చేవారు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ డబ్బు అంతా ఏమైందో కాని స్కీమ్ లు అమలు చేయలేదు. 🤔నిజంగానే చెప్పిన హామీలు చెప్పినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు చేసి ఉంటే సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఇచ్చి ఉండాలి. కానీ అందులో ఆరోవంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఉద్యోగులకు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన మొత్తాలలో కొద్ది, కొద్దిగా ఇచ్చి పండగ చేసుకోమంటోంది. ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.1300 కోట్లు ఇచ్చారు. ఇది ఏ మూలకు వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కీమ్, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అర కొరగానే ఇచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటెరిమ్ రిలీఫ్ ప్రకటిస్తామని అన్నా, దాని గురించి మాట్లాడడం లేదు. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని వాస్తవ పరిస్థితి చెప్పడం వేరు. మొత్తం హామీలు అమలు చేసినట్లు బిల్డప్ ఇచ్చి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రచారం చేసుకోవడం వేరు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. 😥గతంలో ధరలు కొద్దిగా పెరిగినా, విద్యుత్ చార్జీల సర్దుబాటు జరిగినా ఇదే చంద్రబాబు ,పవన్ ఏ స్థాయిలో విమర్శలు చేసేవారు! ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటివి ఎంత దారుణమైన కథనాలు రాసేవి. మరి ఇప్పుడు రూ.15 వేల కోట్ల విద్యుత్ భారం మోపినా, రెండున్నర లక్షల మంది వలంటీర్ల నోటికాడి కూడు తీసేసినా, తల్లులకు ప్రతి ఏటా వచ్చే రూ.15 వేలు ఎగ్గొట్టినా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేసినా, నిరుద్యోగులకు రూ.3,000 ఖాయమని చెప్పి ఊరించి తూచ్ అంటున్నా, వారంతా సంతోషంగా ఉన్నారని భ్రమ పడాలన్నది ఎల్లో మీడియా లక్ష్యంగా ఉందనుకోవాలి. అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ వచ్చేసిందని ఈనాడు బోగస్ వార్తలు ఇస్తోంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటే సంక్రాంతి పండగ బాగా చేసుకుంటారు కాని, కహానీలు చెబితే కడుపు నిండుతుందా?. కాకపోతే క్యాసినోలు, జూదాలు, కోడి పందేలు ఆడించి, ఎక్కడబడితే అక్కడ మద్యం అమ్మించి ఇదే సంక్రాంతి అనుకోండని అంటున్నారు. పేదలు వీటితో సరిపెట్టుకోవలసిందేనా!..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చంద్రబాబు మార్క్ మోసం.. తల్లికి వందనంతో పిల్లిమొగ్గలు!
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక హామీ విషయంలో ఇప్పటికే మోసం జరిగిందని రాజకీయ విమర్శలు వినిపిస్తుండగా .. తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చా మొదలైంది. పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. అయితే.. ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు!... పిల్లలను బడికి పంపే తల్లుల విషయంలో జగన్ సర్కార్ మోసం చేస్తోందని, తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామంటూ చంద్రబాబు గత రెండేళ్లుగా చెబుతూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దీనిని బాగా ప్రచారం చేశారు. ఎన్నికల టైంలో కూటమి అభ్యర్థులు సైతం ఈ అంశాన్ని తమ ప్రచార అంశంగా మార్చుకున్నారు. అంతెందుకు.. ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి నిమ్మలరామానాయుడు స్వయంగా ఒక ఇంటి దగ్గరికి వెళ్లి.. ఆ ఇంట్లో పిల్లలను చూపిస్తూ.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు.. అంటూ ఇంట్లో అందరికీ పథకం వర్తిస్తుందని లెక్కలు సైతం చెప్పారాయన.కానీ, పథకం విధివిధానాల ప్రకారం.. ఒక్కో తల్లికి రూ.15,000 మాత్రమే ఆర్థిక సహాయం అంటూ మెలిక పెట్టారు. జీవో 29 ప్రకారం.. ఒక ఇంట్లో ఆధార్ కార్డు ఆధారంగా (ఆధార్ లేకుంటే దరఖాస్తు చేసుకోవాలని.. అది వచ్చేలోపు పది రకాల కార్డుల్ని అనుమతిస్తామని చెప్పారు) తల్లులకు తల్లికి వందనం వర్తింపజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఒక ఇంటికి రూ.15వేలు.. ఇంట్లో ఒక్కరికే వర్తింపజేయడమన్నమాట. అలాగే.. వైట్ రేషన్‌కార్డు లబ్ధిదారులకే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం చేసింది కూడా ఇదే కదా!. కాకపోతే ఇప్పుడు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా పేర్కొనడంతో పాటు విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, పేదరికం దిగువన లాంటి అంశాల్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ పథకం అమలుపైనా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన తల్లిదండ్రుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలతో గందరగోళం నెలకొనగా, రానున్న రోజుల్లో ఇది లబ్ధిదారులకు కోత పెట్టే చంద్రబాబు మాయేనన్న చర్చ మరోవైపు నడుస్తోంది. -
మోసం, కుట్రలతో గెలవడం కంటే ఓటమే మేలు: టాలీవుడ్ హీరోయిన్ సంచలన పోస్ట్
నటి పూనమ్ కౌర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏముందో ఓ లుక్కేద్దాం పదండి.పూనమ్ కౌర్ తన ట్వీట్లో రాస్తూ.. కుట్రపూరితంగా, మోసం చేసి గెలవడం కంటే.. ఒక యోధుడిగా ఓడిపోవడమే మేలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ ఏపీలో జరిగిన ఎన్నికల గురించే పోస్ట్ చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Loosing as a principled warrior is better than winning as conspiring cheater .#justthoughts— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 21, 2024 -
టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు. -
ప్రేయసి కోసం పరీక్ష.. చిక్కుల్లో ప్రియుడు!
ప్రేమ ఎంత గొప్పదో అని తెగ ఫీలైపోయే ప్రేమికులు.. కొన్నిసార్లు అంతే తిప్పల్ని ఎదుర్కొక తప్పదు కూడా. ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. పంజాబ్‌లో జనవరి 7వ తేదీన బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్ సింగ్ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్ కౌర్ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు. ఫ్రూఫ్ల కింద.. వెంట పరంజిత్ కౌర్ పేరుతో సృష్టించిన ఫేక్ వోటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాడు. కానీ, విధి అతన్ని తప్పించుకోనివ్వలేదు. బయోమెట్రిక్ డివైస్ దగ్గర అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ యువతి దరఖాస్తు ఫారమ్‌ను తిరస్కరించిన అధికారులు ఆమెను అనర్హులిగా ప్రకటించిన అంగ్రేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్లైన్ గేమ్ ఆడి..
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్‌పూర్‌లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్‌కుమార్ యాదవ్ కుమారుడు అంకిత్ యాదవ్‌ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్‌పూర్‌కు చేరుకున్నారు. ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్‌ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్‌ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రంప్ మోసగాడే: తేల్చేసిన న్యూయార్క్ జడ్జి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు దాదాపు పదేళ్లపాటు తప్పుడు ఆర్థిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్ మోసానికి పాల్పడ్డారంటూ ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా పలు ఒప్పందాలు చేసుకోవడంతోపాటు, అక్రమంగా రుణాలు పొందారని న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్ తెలిపారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్నారు. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం కేసు విచారణ నేపధ్యంలో ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ట్రంప్, అతని ముగ్గురు పిల్లలు సంయుక్తంగా వారి కంపెనీల విలువను పెంచి, బ్యాంకులు, బీమా సంస్థలకు చూపారని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఆరోపించారు. ట్రంప్‌కు, ఆయన సంతానానికి 250 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని, న్యూయార్క్ లో ట్రంప్ వ్యాపారం చేయకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌కు విధించాల్సిన శిక్షపై నిర్ణయం తీసుకునే ముందు న్యూయార్క్ జడ్జి ఆర్థర్ ఎంగ్రోన్ అక్టోబర్ 2న నాన్-జ్యూరీ ట్రయల్‌ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు. విచారణకు ముందే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అతని లాయర్లు న్యూయార్క్ న్యాయమూర్తిని గతంలో కోరారు. కాగా న్యూయార్క్ జడ్జి ఇచ్చిన తీర్పు.. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బకానుంది. ఇది కూడా చదవండి: చైనా ముంగిట మాద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై? -
ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపి.. తియ్యగా మాట్లాడి, అప్పటి నుంచి అసలు కథ మొదలు!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్బుక్ ప్రొఫైల్‌లో యువతి ఫొటో పెట్టి యువకులతో చాటింగ్ చేసి అనంతరం బ్లాక్మెయిల్ చేసి లక్షలు దోచుకున్న దాసరహళ్లికి చెందిన రవికుమార్(24) అనే నిందితుడిని రామనగర సీఈఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కుణిగల్ తాలూకా కగ్గేరికి చెందిన రవికుమార్ బెంగళూరు దాసరహళ్లిలో ఉంటూ సెకెండ్ పీయూసీ చదివి ప్రైవేటు డాటాబేస్ కంపెనీలో పనిచేసేవాడు. యువతి ఫొటోతో ఫేస్బుక్ ఖాతా ఓపెన్ చేశాడు. రామనగరకు చెందిన రాజేశ్ అనే యువకుడు రిక్వెస్ట్ పంపాడు. అతనితో తీయగా మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం సేకరించాడు. అనంతరం బ్లాక్మెయిల్ చేసి పలు విడతలుగా రూ.41 లక్షలు వసూలు చేశాడు. ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి పెళ్లి చేసుకొమ్మంటే.. ప్రాణం తీశాడు -
రెండేళ్ల ప్రేమ, పెద్దలు కూడా ఒప్పుకున్నారు.. అంతలో ఊహించని ట్విస్ట్
క్రిష్ణగిరి(బెంగళూరు): ఇటీవల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కొందరు మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు వెళ్లి దంపతులుగా మారుతున్నారు. చాలా మంది వారి ప్రేమకు మధ్యలోనే బ్రేకప్ చెప్పడమో లేదా మోసం చేయడమో వంటి ఘటనలే ఎక్కువ జరుగుతున్నాయి. అయితే కొందరు ఈ బాధను ఎలాగోఒకలా బయటపడుతుండగా.. మరికొందరు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాలు.. సూళగిరి తాలూకా ముదుగురికి సమీపంలోని బి. సింగిరిపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప కూతురు యశోద (19), కడతూరు గ్రామానికి చెందిన ప్రదీప్‌లు గత రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలని తీర్మానించారు. ఇంతలో ప్రియుడు ప్రదీప్ ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. మోసపోయానని విరక్తి చెందిన యశోద మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: అమ్మకు బై చెప్పిన 5 నిమిషాల్లోనే.. -
నా పేరు గీతా.. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అని చెప్పి.. కొన్ని రోజుల తర్వాత
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్బుక్లో గీతా సెక్సీ పేరుతో ఉన్న ప్రొఫైల్ నిజమని నమ్మిన కనకపురకు చెందిన యువకుడు సైబర్ నేరస్తుల మాయలో పడి రూ.41 లక్షలు పొగొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. కనకపుర నివాసి రాజేశ్ రూ.41 లక్షలు సమర్పించుకున్న బాధితుడు. కొన్ని రోజుల క్రితం రాజేశ్‌కు గీతా సెక్సీ పేరుగల ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తన పేరు గీత అని చెప్పిన సైబర్ నేరస్తుడు బెంగళూరు, రామనగర, శివమొగ్గ తదితర జిల్లాల్లో ఎస్కార్ట్ సర్వీస్‌లు ఇస్తానని, నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన రాజేశ్ తన పర్సనల్ విషయాలు ఫోటోలు షేర్ చేసాడు. కొన్ని రోజులకు అపరిచిత వ్యక్తి ఫొటోలు, వివరాలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. పలు దఫాలుగా మొత్తం రూ.41 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు. దీంతో బాధితుడు రామనగర సెన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. చదవండి 45 నిముషాల ప్రయాణానికి మూడు గంటలకు పైగా వెయిటింగ్.. -
పర్సు ఇంట్లో మరిచిపోయా.. కాల్ చేస్తే స్విచాఫ్.. న్యాయవాదికే మస్కా కొట్టిన కేటుగాళ్లు
జయపురం(భువనేశ్వర్): ‘సార్.. పర్స్ ఇంట్లో మరచిపోయాను. చికిత్స కోసం డబ్బు అవసరం. ఫోన్ పేలో పంపించగలరు. ఉదయం 11గంటలకు తిరిగి ఇస్తా’నని కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్‌కు ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. పరిచయస్తుని పేరు చెప్పడంతో అతను కూడా వివిధ దఫాలుగా రూ.30 వేలు జమ చేశారు. అయితే కొద్ది సేపటికే ఫోన్ స్విచాఫ్ రావడం, డబ్బు తిరిగి జమ కాకపోవవంతో మోసపోయానని గ్రహించిన న్యాయవాది జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితుడి వివరణ ప్రకారం... మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి దాస్ బాబుగా పేరు చెప్పి, ఆస్పత్రిలో ఉన్నానని.. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పర్స్ మర్చిపోయానని తెలిపాడు. రూ.10 వేలు అవసరం అయ్యాయని, ఇంటికి వచ్చి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అడిగినంత ఫోన్ పే చేశారు. కొద్ది సేపటికే మరో రూ.10 వేలు అడగ్గా, మళ్లీ బదిలీ చేశారు. అనంతరం ఫోన్ చేసి ఫోన్ పేలో రూ.30 వేలు పంపానని నకిలీ రసీదు వాట్సాప్‌కు పంపించాడు. పారపాటున రూ.10 వేలు అధికంగా జమయ్యాయని, మిగతా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని కోరడంతో తిరిగి జమ చేశారు. అయితే అకౌంట్లో చూడగా నగదు లేకపోవడం, సంబంధిత వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన అతను.. పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో! -
ఆరేళ్ల ప్రేమ.. ఆరా తీస్తే అసలు నిజం తెలిసి షాకైంది!
కొరుక్కుపేట: ప్రేమిస్తున్నానని ఆరేళ్లుగా కలిసి తిరిగి మరో మహిళను పెళ్లి చేసుకున్న జైలు గార్డుపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు.. చైన్నెలో జైలు గార్డ్‌గా పనిచేస్తున్న భరత్ ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతికి మాట ఇవ్వడంతో ఇద్దరు కలిసి చాలా ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా భరత్ యువతితో మాట్లాడడం ఆపేశాడు. అతని ఫోన్‌కు సంప్రదించినా లిప్ట్ చేయలేదు. ఆరా తీస్తే ఓ మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అతన్ని ప్రశ్నించగా తనకు వివాహం అయ్యిందని.. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోనంటూ బెదిరించాడని.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. చదవండి Madhya Pradesh Satna Incident: సాత్నాలో నిర్భయ తరహా ఘాతుకం.. ఒంటి నిండా పంటి గాట్లు పెట్టి మరీ.. -
నమ్మబలికి మోసం చేశారు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘మార్గదర్శి యాజమాన్యం నన్ను నిలువునా ముంచేసింది. నా నుంచి 18 నెలల పాటు నెలకు రూ. లక్ష వాయిదాలుగా వసూలు చేసి పాట పాడిన డబ్బు ఇవ్వకుండా 4 నెలలు నరకయాతన చూపించారు.’ అంటూ ట్యాక్స్ కన్సల్టెంట్, న్యాయవాది, మార్గదర్శి బాధితుడు ముష్టి శ్రీనివాస్ వాపోయారు. ఆయన గురువారం విజయవాడలోని జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో విలేకరులతో.. “మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ కె.శ్రీనివాసులు 2021 ఆగస్టులో నా దగ్గరకు వచ్చి మార్గదర్శిలో చిట్ వేయాలని కోరారు. అప్పటికే నా ఆస్తిని బ్యాంక్‌లో తనఖా పెట్టానని, చీటీ డబ్బులు ఇవ్వాలంటే సెకండ్ చార్జ్ తనఖా ద్వారా ఇస్తారా అని అడిగాను. ఓటీఎస్ తెచ్చుకుంటే హెడ్ ఆఫీస్‌తో మాట్లాడి చిట్ పాడుకునే అవకాశం కల్పిస్తామని ఇద్దరూ నమ్మబలికారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 18 నెలలు క్రమం తప్పకుండా వాయిదా డబ్బులు కట్టాను. 2022 డిసెంబర్ 29న బ్యాంకుతో ఓటీఎస్ ఒప్పందం చేసుకున్నాను. ఓటీఎస్ వచ్చిన వెంటనే మార్గదర్శి మేనేజర్‌కు తెలియజేసి చీటీ పాడాలని కోరాను. ఓటీఎస్ లెటర్, షూరిటీ, బ్యాంకు రసీదు, టైటిల్‌డీడ్ ఫారాలు మార్గదర్శికి అందించాను. ఫిబ్రవరి నెలలో చిట్ పాడతానంటే ఆ నెల వాయిదా కట్టించుకున్నారు. ఫిబ్రవరిలో పాట ఇవ్వకుండా మోసం చేశారు. మార్చిలో పాట ఇస్తామని, పాటలో పాల్గొనే అర్హత కోసం ముందే రూ. లక్ష వాయిదాగా చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బుల కోసం మా ఇంటికొచ్చారు. బార్బర్ షాపు వద్ద ఉన్నానని తెలుసుకుని అక్కడకొచ్చి మరీ డబ్బు వసూలు చేశారు. ఆ తరువాత పాట జరిగిందా.. లేదా అని అడిగినా ఎవరూ చెప్పలేదు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్ ఫోన్ చేసి మీకే పాట వచ్చిందని, రూ. 11.50 లక్షలకు పాడారని చెప్పారు. పాట ఇంత మొత్తానికి పాడమని వాళ్లకు నేను లెటర్ ఇవ్వలేదు. వాళ్లే పాట నిర్ణయించేశారు. నా డబ్బులు నాకివ్వమని పలుమార్లు కోరినా ఇవ్వలేదు. షూరిటీ ఫారాలు ఇవ్వలేదని ఏప్రిల్ 14న, సెంకడ్ చార్్జపైనా అభిప్రాయం కోసం హెడ్ ఆఫీసుకు పంపామని 24వ తేదీన, సరైన షూరిటీలు సమర్పించ లేదని జూన్ 8న లెటర్లు పంపారు. వాటని్నంటికీ వెంటనే సమాధానం ఇచ్చాను. బ్రాంచి చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తి తుదకు నేను కట్టిన డబ్బులనైనా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు’ అని వివరించారు. రిజిస్ట్రార్‌ను మేనేజ్ చేసి 50 మందికి బదులు 30 మందినే గ్రూపులో రిజిస్టర్ చేశారని తెలిపారు. ఈనాడు వితండవాదం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఈనాడు బృందం బాధితుడు ముష్టి శ్రీనివాస్‌తో వితండ వాదానికి దిగింది. మార్గదర్శి తప్పేమీ లేదని, తప్పందా బాధితుడు ముష్టి శ్రీనివాస్‌దేనని చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. ఎన్‌పీఏపై ఈనాడు సంధించిన ప్రశ్నలకు ఏ మాత్రం జంకకుండా బాధితుడు సమాధానమిచ్చారు.. తాను డిఫాల్టర్‌ని అయితే, సరిగా వాయిదాలు కట్టకపోతే నేను పాట పాడేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. సెకండ్ చార్జ్ ద్వారా షూరిటీ తీసుకోకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. దాదాపు అరగంట పాటు ప్రశ్నించినా బాధితుడు దీటుగా బదులిచ్చారు. దీంతో చేసేది లేక ఈనాడు బృందం అక్కడి నుంచి నిష్క్రమించింది. రామోజీరావుపై చీటింగ్ కేసు ♦ మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచి మేనేజర్, మరికొందరిపైనా కేసు ♦ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై విజయవాడ న్యాయవాది ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, విజయవాడ: మార్గదర్శి చిట్స్‌లో మోసాలపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ యజమాని చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్‌తో పాటు విజయవాడ లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్, పలువురు సిబ్బందిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గురువారం చీటింగ్ సహా ఇతర సెక్షన్లతో కేసు నమోదయింది. సక్రమంగా వాయిదాలు చెల్లించినా, చిట్లో పాడుకొన్ని నగదు ఇవ్వకుండా మార్గదర్శి యాజమాన్యం నాలుగు నెలలుగా ఇబ్బందులు పెడుతోందని బాధితుడు, న్యాయవాది ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్), 120బి, సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 64 ఏళ్ల వయసున్న బాధితుడు ముష్టి శ్రీనివాస్ టాక్స్ కన్సల్టెంట్‌గా, కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. 2021 సెప్టెంబర్‌లో మార్గదర్శి లబ్బీపేట బ్రాంచ్‌లో చిట్ వేశారు. 50 నెలల పాటు నెలకు రూ. లక్ష చిట్లో పాల్గొన్నారు. 19 నెలలు (రూ.19 లక్షలు) చిట్ నగదు సక్రమంగానే చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 37.50 లక్షలకు చిట్ పాడారు. అయితే, ఆయన చెల్లించాల్సిన నగదును మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ఇప్పటివరకు చెల్లించకపోవడంతో బాధితుడు తమను ఆశ్రయించినట్లు రాణా తెలిపారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంక్ ఖాతా ఉండాల్సి ఉండగా, బ్రాంచ్‌లో ఒకే బ్యాంక్ ఖాతాను అన్ని గ్రూపులకు వినియోగిస్తూ, డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజ కిరణ్, లబ్బీపేట బ్రాంచ్ మేనేజర్, పలువురు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్రాంచ్ మేనేజర్ బి.శ్రీనివాస్‌ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నట్ల తెలిపారు. మరికొందరు ఉద్యోగులు, సిబ్బందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. -
భార్య మిస్సింగ్ అంటూ 12 మంది భర్తల ఫిర్యాదు.. ఫోటో చూడగానే పోలీసులకు దిమ్మ తిరిగింది!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా చేసే ఓ వేడుక. జీవితంలో ఇదొక మధురమైన జ్ఞాపకంగా కూడా భావిస్తుంటాం. అంతటి ప్రాముఖ్యం ఉంది గనుకే ప్రజలు వివాహాల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అయితే కొందరు మాత్రం ఈ వివాహ బంధాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడ్డదారులు తొక్కడమే కాకుండా ఎంతటి దారుణాలకైన పాల్పడేందుకు వెనకాడడం లేదు. తాజాగా, జమ్మూకాశ్మీర్‌లో ఓ కిలాడీ డబ్బుల కోసం ఏకంగా ఒకరు ఇద్దరు కాదు 27 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసింది. స్కెచ్ వేసిందిలా వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలలో తమ భార్య కనిపించడం లేదంటూ 12 మంది యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకులు ఇచ్చిన ఫొటోలు చూసిన పోలీసులు షాకయ్యారు. ఆ 12 మంది భర్తలు ఇచ్చిన ఫొటోలలో ఉన్నది ఒకే మహిళ కావడమే అందుకు కారణం. దీనిపై కాస్త లోతుగా పోలీసులు విచారణ జరపగా.. కాస్త అటూఇటూగా అందరు చెప్పిన స్టోరీ ఒకేలా ఉంది. ఓ యువతి మధ్యవర్తి సాయంతో పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజుల కాపురం చేశాక ఏదో ఒక కారణం చెప్పి కనిపించకుండా పోవడం.. పోతూ పోతూ ఇంట్లో ఉండే డబ్బు, నగలతో ఉడాయించడం. ఇలా ఆ కిలేడి ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసింది. అయితే అనుకోకుండా వీరిలో 12 మంది మాత్రమే పోలీస్ స్టేషన్ వరకు రావడంతో ఈ బండారం మోత్తం బయటపడింది. 27 మందిని పెళ్లి చేసుకొని 20 రోజులు వారితో ఉండి.. డబ్బు, బంగారంతో పారిపోయిందని సమాచారం. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫొటో ఆధారంగా మాయలేడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం గురించి తెలిసిన వారు రకరకాలుగా అనుకుంటున్నారు. చదవండి స్నేహితుడికి సెండాఫ్ ఇచ్చి వస్తూ.. -
రూ.2000 నోట్లు మార్పిడి.. 90 లక్షలు నష్టం.. ఎలాగంటే!
పార్వతీపురం: ‘రెండు వేల రూపాయల నోట్లు రూ.కోటి ఇస్తాం. మీరు రూ.500 నోట్లు రూ.90లక్షలు ఇవ్వండి చాలు..’ అని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. రూ.పది లక్షలు లాభం ఆశ చూపించి రూ.90లక్షలతో ఉడాయించారు. ఈ ఘటన పార్వతీపురంలో సోమవారం జరిగింది. పార్వతీపురం రూరల్ ఎస్ఐ వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురానికి చెందిన ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తుంటారు. వారి వద్దకు స్థానిక వడ్డీ వ్యాపారుల ద్వారా వారం రోజుల కిందట ఎన్.చక్రపాణి(కాకినాడ), ఎస్కే నజీమ్(భీమవరం) వచ్చి కలిశారు. తమకు తెలిసినవారి వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇస్తే... రూ.2వేల నోట్లు రూ.కోటి ఇస్తారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరిని పార్వతీపురం పిలిపించి ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్‌లతో మాట్లాడించారు. ఒకే రోజు రూ.10 లక్షలు వస్తుందని ఆశతో ఆబోతుల అనిల్‌కుమార్, ఎల్.అనిల్‌కుమార్ వారితో ఒప్పందానికి అంగీకరించారు. తమ వద్ద ఉన్న నగదుతోపాటు స్నేహితులు, బంధువుల వద్ద కొంత తీసుకువచ్చి రూ.90 లక్షలను సోమవారం ఆ వ్యక్తులకు ఇచ్చారు. కొద్దిసేపు ఇక్కడే ఉంటే రూ.కోటి తెస్తామని చెప్పి వెళ్లిన ఇద్దరు తిరిగి రాలేదు. దీంతో తాము మోసపోయినట్టు గుర్తించిన ఆబోతుల అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించిన చక్రపాణి, నజీమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ఏపీలో బంగారం తవ్వకాలు! ఎన్ఎండీసీ రూ. 500 కోట్ల వ్యయం.. -
మిడిల్‌క్లాస్ భర్త.. రేయింబవళ్లు కష్టపడి భార్యని చదివిస్తే.. జాబ్ వచ్చాక మరొకరితో
గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. అయితే అది పూర్తి కాకుండానే ఆమెకు వివాహం జరిగిపోయింది. అయితే అదృష్టం కొద్ది ఆమెకు అర్ధం చేసుకునే వ్యక్తి భర్తగా వచ్చాడు. తన భార్య కలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడితే.. చివరికి కలలో ఊహించని షాక్ ఇచ్చింది ఆ మహిళ. ప్రస్తుతం తన భార్య చేసిన మోసానికి లబోదిబో మంటూ ఆ భర్త గుండెలు బాదుకుంటున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. జాబ్ రాగానే బండారం బయటపడింది అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఇద్దరు దంపతులు. అయితే మధ్యతరగతి కావడంతో వారిద్దరూ వివాహం తర్వాత ఆర్థికంగా కష్టనష్టాలను అనుభవించారు. ఏదో ఒకరకంగా బతుకు బండిని ముందుకు సాగిస్తూ వస్తున్నారు. అంతలో జ్యోతి మౌర్య తాను ప్రభుత్వ ఉద్యోగం చేయడం తన కల అని భర్తకు విన్నవించుకుంది. అయితే అలోక్ చేస్తోంది చిన్న ఉద్యోగమే కావడంతో ఇది అంత సులభం కాదని అతనికి తెలుసు. భార్య కలనే తన కల భావించి దాన్ని సాకారం చేసుకునే దిశగా ఆమెను ప్రోత్సహించాడు. అందుకు అలోక్ తనకు వీలైనంత సహాయం చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను ప్రయాగ్‌రాజ్‌లోని మంచి కోచింగ్ సెంటర్లో చేర్పించి ఆమె లక్ష్యానికి చేరువయ్యేలా చేశాడు. ఎట్టకేలకు ఆమె 2016లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక తన అసలు రంగును బయటపెట్టింది ఆ భార్య. తన భార్యకు గొప్ప ఉద్యోగం వచ్చిందని సంతోషించేలోపు ఆమె ఆ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె ఎఫైర్ గురించి తెలుసుకున్న అలోక్ తన భార్యకు నచ్చజెప్పేందకు ఎంతగానో ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం తన భర్త మాటలు పట్టించుకోకపోగా.. అలోక్‌పై తప్పుడు వరకట్నం కేసు పెట్టి అతడిని అరెస్టు చేయించింది. అలోక్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ ఉద్యోగం పోవడంతో.. ఉన్న ఉపాధిని కూడా కోల్పోయాడు. తన భార్యే సర్వస్వంగా బతికిన తనను ఇంత మోసం చేస్తుందని ఊహించలేకపోయానంటూ అలోక్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇప్పుడు ఆమె తన పై ఆఫీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. ఈ భర్త గోడు విన్న నెటిజన్లు.. అతనికి పట్ల సానుభూతి చూపుతూ కామెంట్స్ పెడుతున్నారు. पति ने बीवी को पढ़ा-लिखाकर बनाया SDM,मैडम ने होमगार्ड कमांडेंट से चलाया अफेयर, हस्बैंड ने दिखाए सबूत Story- @varnitavajpayee pic.twitter.com/O5i7BwNIoL — CrimeTak.in (@CrimeTakBrand) June 22, 2023 -
అడిగింది ఇస్తే.. హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి..
తిరువొత్తియూరు(చెన్నై): సినిమాలో హీరోయిన్ అవకాశం ఇప్పిస్తాను.. అందుకు నేనడిగినంత డబ్బులు ఇవ్వాలని ఓ యువతి వద్ద పలు లక్షలు మోసం చేసిన దుండగుల కోసం పొలీసులు గాలిస్తున్నారు. చైన్నె టీనగర్ ప్రకాశం రోడ్డులో ప్రసిద్ధ సినిమా నిర్మాణం ఈ క్రియేషన్ పేరుతో సంస్థ నడుపుతున్నారు. కొత్త సినిమాలకు నటీనటులు కావాలని కొందరు ప్రచారం చేస్తూ సంప్రదించిన యువతీయువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. 3 నెలలు గడిచినా కొత్త సినిమాలో నటించడానికి తమకు పిలుపు రాలేదని మోసపోయిన యువతులు కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న చిత్ర నిర్మాణ సంస్థ డైరెక్టర్ జగదీశన్ (50)ను ప్రశ్నంచగా తమ సంస్థ తరపున నటించడానికి ఎవరినీ ఎంపిక చేయలేదని వారితో చెప్పారు. తాము ఎటువంటి ప్రకటనలను ఇవ్వలేదని అని చెప్పాడు. అది విని షాక్ తిన్న యువతీ, యువకులు ఏమి చేయాలో తోచలేదు. దీనిపై ఈ క్రియేషన్‌న్స్ కో–డైరెక్టర్ జగదీశన్ యువతులకు ఇచ్చిన సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా తేనాంపేట పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు యువతుల నుంచి డబ్బులు తీసుకుని పోలీసులను మోసం చేసిన అనుమానితుల సెల్‌ఫోన్ నంబర్లను పరిశీలిస్తున్నారు. చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం -
‘రేటింగ్ ఇవ్వండి.. రెట్టింపు సొమ్ము పొందండి’..దిమ్మతిరిగే కొత్త మోసం!
సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వెబ్సైట్లు, ఇతర లింకులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తే చాలు మీరు లెక్కించలేనంత ఆదాయం మీ సొంతమవుతుందంటూ ఒక మోసగాడు సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చాడు. దీనికి విపరీతమైన స్పందన రావడంతో ఆ మోసగాడు చెలరేగిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ‘ఇంట్లో కూర్చుని సంపాదించండి’ అంటూ పలు ప్రకటనలు మనకు కనిపిస్తుంటాయి. అయితే వీటిలో చాలావరకూ మోసపూరితమైనవని తేలుతుంటాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతం వెలుగుచూసింది. గురుగ్రామ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్ 57 నివాసి సుబ్రత్ ఘోష్ తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత మార్చినెలలో తనకు టెలిగ్రామ్ యాప్‌లో ఒక ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన కనిపించిందని సుబ్రత్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని వెబ్సైట్లకు, లింకులకు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ప్రతీరోజూ పెద్దమెత్తంలో సొమ్ము పొందవచ్చని దానిలో పేర్కొన్నారని తెలిపాడు. అయితే ఈ ఉద్యోగం చేసేందుకు ముందుగా రూ.10 వేలు చెల్లించాలని దానిలో పేర్కొన్నారన్నాడు. ఈ మేరకు తాను వారు కోరిన మొత్తాన్ని చెల్లించడంతో వారు తనకు 30 లింకులు పంపించి, ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వాలని కోరారన్నాడు. దీనిని పూర్తి చేశాక తనకు రూ. 18 వేలు పంపారన్నాడు. దీంతో తనకు వారిపై నమ్మకం పెరిగిందన్నాడు. అయితే అప్పుడు ఆ మోసగాడు..పెట్టుబడి మొత్తం పెంచితే వర్క్ కేటాయింపు కూడా పెరుగుతుందని తెలిపారన్నాడు. దీంతో తాను దఫదఫాలుగా రూ.25,29176 వారికి పెట్టుబడి రూపంలో చెల్లించానన్నాడు. అయితే ఆ మెసగాళ్లు తాను టాస్క్ పూర్తి చేసినా, దానిలో తప్పులు ఉన్నాయంటూ సొమ్ము ఇవ్వలేదని తెలిపాడు. పైగా మరో రూ.12 లక్షలు చెల్లించాలని కోరారన్నాడు. దీంతో తాను మోసపోయాననే సంగతి గ్రహించానని బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: క్షణాల్లో చెల్లింపులు చేసే క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందంటే.. -
రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట టోకరా
సాక్షి,దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నగరంలో రూ.2 వేల నోట్ల మార్పిడి పేరిట రూ.60 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. విశాఖకు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ తనకు తెలిసిన వారిని నమ్మించాడు. విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామారావు అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా విజయవాడ నుంచి రూ.90 లక్షల విలువైన రూ.500 నోట్లు తెప్పించారు. వాటిని భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డి సహాయంతో శనివారం సాయంత్రం గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ వద్దకు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరుకున్న ధర్మరాజు, అతని స్నేహితులు కాకినాడకు చెందిన ఎండీ అహ్మద్, సునీల్ అలియాస్ చిన్నాను కలిశారు. నగదు మారుస్తామని చెప్పిన ధర్మరాజు, అతని స్నేహితులు అహ్మద్, సునీల్ కలిసి రామారావు నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోటార్ సైకిల్‌పై ఉడాయించారు. వారి కోసం వెతికినా కనిపించకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి రామారావు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ధర్మరాజుతో పాటు అతని గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకుని రూ.60 లక్షలు రికవరీ చేశారు. ఈ గ్యాంగ్ వెనుక ఉన్న సూత్రధారులెవరు, ఎంతమందిని మోసం చేశారనే విషయాలపై పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే తరహాలో రాజమండ్రిలో కూడా ఒక కేసు నమోదైనట్టు తెలుస్తోంది. చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ -
‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం
తాను ఒక క్రూజ్‌షిప్ కెప్టెన్ అని చెప్పుకుంటూ జనాల నుంచి ఏకంగా రూ.2.78 కోట్ల సొమ్ము కాజేసిన వ్యక్తికి కేవలం రూ. 36 వేలు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చిన వింత ఉదంతం సంచలనంగా మారింది. ఆ మోసగాని పేరు జాడీ ఆలివర్. అతను చాలామందిని కలిసి, ఎవరికైనా సరే షిప్పులో సెలవులు ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు గుంజేవాడు. సదరు మోసగాడు షిప్పు కెప్టెన్ తరహా దుస్తులు ధరించి తిరుగుతుండేవాడు. అందరికీ నకిలీ ఐడీ కార్డు చూపించి ప్రలోభపెట్టేవాడు. మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బ్రిటన్‌లో చోటుచేసుకుంది. ఆ మోసగాడు నకిలీ అకౌంట్ ద్వారా జనాలకు ఈ మెయిల్స్ పంపించి, తాను కార్నివాల్ పీఎల్సీ ఉద్యోగిని అని చెప్పుకునేవాడు. కోర్టు విచారణ నేపధ్యంలో..మోసగాడు జనానికి ఒక షీటు పంపేవాడని, దానిలో ట్రిప్స్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉంటాయని వెల్లడయ్యింది. ఈవిధంగా అతను సేకరించిన మొత్తాన్ని ఆన్లైన్ జూదానికి వినియోగించేవాడు. ఆన్లైన్ జూదం కోసం రుణాలు కూడా తీసుకునేవాడు. అయితే ఇప్పుడు అతని దగ్గర బాధితులకు ఇచ్చేందుకు కేవలం రూ.36 వేలు మాత్రమే ఉన్నాయి. బాధితులలో చాలామంది తాము దాచుకున్న మొత్తాన్ని ఆలివర్ చేతిలో పెట్టారు. జీవితంలో మరచిపోలేని విధంగా సెలవులను ఆనందంగా గడపుతామనే ఉద్దేశంలో అతనికి డబ్బులు చెల్లించారు. అతని బారిన పడినవారిలో ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్నారు. ఇవాన్స్ అనే ఒక బాధితుడు మాట్లాడుతూ ‘ఆలీవర్ దగ్గర నేను ఎంత సొమ్ము పోగొట్టుకున్నానో చెప్పుకోలేను. ఎందుకంటే ఈ విషయం ఇప్పటికీ నా కుమారునికి చెప్పలేదు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడంలో నాదే పూర్తి బాధ్యత’అని అన్నారు. మరో బాధితుడు మార్షల్ గోడాయీ మాట్లాడుతూ‘దీని ప్రభావం నా భార్య ఆరోగ్యం మీద పడింది. గతంలో మేము డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పోగొట్టుకున్న మొత్తం మాకెంతో విలువైనది’ అని అన్నారు. 2018లో బాధితులు ట్రిప్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ విషయమై పోలీసులకు తెలిసింది. బాధితులు తమ బ్యాగులతో ఎదురుచూసినప్పటికీ ఎటువంటి షిప్పు రాలేదు. ఆలీవర్ వారికి 2018 జనవరి 1నుంచి 2019 జనవరి 2 వరకూ ట్రిప్పు చేయిస్తానని నమ్మబలికాడు. కాగా అలీవర్ ఒక ప్రాంతంలో భార్యతో ఉంటూ, మరోప్రాంతంలో ప్రియురాలితో కాలం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆలివర్ చేసిన మోసాలు కోర్టులో నిర్థారణ కావడంతో కోర్టు అతనిని దోషిగా ఖరారు చేసింది. జడ్జి రిచర్డ్ విలియమ్స్ నేరస్తునికి ఆరు ఏళ్ల ఒకనెల పాటు జైలుశిక్ష విధించారు. -
‘కేజీ బంగారం రూ.5 లక్షలు’
కణేకల్లు(బెంగళూరు): తక్కువ ధరకు బంగారమిస్తామంటూ ఆశచూపి ఓ వ్యక్తి నుంచి కర్ణాటక ముఠా రూ.5 లక్షలు కొట్టేసింది. వివరాలు.. కణేకల్లు పరిధిలోని కళేకుర్తికి చెందిన రుద్ర బాధితుడు. హొసపేటె జిల్లా హువిన హడగలికి చెందిన నాగరాజు, మరికొందరితో నకిలీ బంగారు మోసాలకు పాల్పడేవాడు. అతడు రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లులో జావేద్ అనే వ్యక్తికి కేజీ బంగారం రూ.5 లక్షలకు ఇస్తానని, ఎవరైనా ఉంటే తీసుకురమ్మని చెప్పాడు. జావేద్ ఈ విషయాన్ని రుద్రకు చెప్పడంతో ఆయన ఆశపడి రూ.5 లక్షలు రెడీ చేసుకున్నాడు. నాగరాజు, జావేద్, మరికొందరు ముఠాసభ్యులు రుద్రతో రూ.5 లక్షలు తీసుకొని నకిలీ బంగారాన్ని అంటగట్టారు. రుద్ర ఊరికి వచ్చాక బంగారాన్ని పరీక్షింపజేయగా నకిలీదని తెలిసి కణేకల్లు పోలీసులకు ఆశ్రయించాడు -
నీట్‌గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి
అన్నానగర్(చెన్నై): నకిలీ పత్రాలతో బ్యాంకులో రూ.1.28 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన ప్రైవేట్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు వేలండిపాళయంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్ అనే పథకం కింద జీతం ఖాతా ఉన్న వారికి రుణం ఇస్తున్నారు. 2019–20 వరకు కోయంబత్తూరుకు చెందిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా ఉన్న మార్టిన్ సాకో, విజయకుమార్ కంపెనీలో పని చేస్తున్నట్లు 44 మందికి నకిలీ పత్రాలు సిద్ధం చేసి రూ.1.28 కోట్ల రుణం పొందారు. బ్యాంకు ఆడిట్లో నకిలీ పత్రాలతో రుణం తీసుకున్నట్టు తేలింది. దీంతో మండల మేనేజర్ సెంథిల్‌కుమార్ కొబయాషి మునిసిపల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్ మేనేజర్ దండపాణి, జయప్రకాష్ నారాయణన్, అసిస్టెంట్ మేనేజర్ రాధిక, ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పని చేసిన మార్టిన్ సాకో, విజయకుమార్‌పై కేసు నమోదు చేశారు. వీరిలో రాధిక, విజయకుమార్ తదితరులను అరెస్టు చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ సాకో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను ఊటీలో ఉన్నట్లు సమాచారం అందగా అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువతితో సహజీవనం.. చివరికి ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అని యువతితో సహజీవనం చేసి..గర్భందాల్చాక నమ్మక ద్రోహానికి పాల్పడటమే కాకుండా అబార్షన్ చేయించుకోకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్లో నివసించే యువతి(22) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. 2020లో వరంగల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ బూక్యా కల్యాణ్(25)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఇద్దరూ షికార్లు కొట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె కల్యాణ్‌తో శారీరక సంబంధాలు కూడా కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భందాలి్చంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను అబార్షన్ చేయించుకోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వారం రోజులుగా ఆమె ఫోన్ చేస్తే స్పందించడంలేదు. దీంతో బాధితురాలు వరంగల్‌లోని కల్యాణ్ స్వగ్రామానికి వెళ్లి ఆరా తీయగా.. అప్పటికే మరో యువతితో కల్యాణ్‌కు వివాహ నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని తెలిసింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించగా రూ.10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 493, 420, 417,313 506, వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అదంతా ఫేకేనా.. శాంసంగ్ చీటింగ్ చేస్తోందా?
అత్యంత కెమెరా జూమింగ్ సామర్థ్యంతో శాంసంగ్ అల్ట్రా సిరీస్ స్మార్ట్ఫోన్లను గత నెలలో విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ స్పేస్ జూమ్ ఫీచర్‌తో వచ్చింది. అయితే ఈ ఫోన్ తీసే స్పేస్ జూమ్ ఫోటోలు నకిలీవని తాను చేసిన పరిశోధనలో తేలిందని ఓ రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Oscar Award: థియేటర్ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్ గయ్ మామూలోడు కాదు.. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్23 జూమ్ లెన్స్‌లతో తీసిన చంద్రుని ఫోటోలను అందరూ ఆసక్తిగా చూశారు కానీ వాటి ప్రామాణికతపై తనకు మొదటి నుంచే సందేహాలు ఉన్నాయని, అవి పూర్తిగా అసలైనవి కావని అని రెడిట్‌లో ibreakphotos అనే పేరుతో ఉన్న ఓ యూజర్ పోస్ట్ చేశారు. దానికి సంబంధంచి పూర్తి వివరణ కూడా అందులో ఇచ్చారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. తాను ఇంటర్నెట్ నుంచి చంద్రుని హై రెజల్యూషన్ ఫొటోను డౌన్లోడ్ చేసి దాని సైజ్ తగ్గించి గాస్సియన్ బ్లర్‌ను అప్లయి చేశానని, దీంతో అస్పష్టంగా మారిందని రెడిట్ యూజర్ పేర్కొన్నారు. ఆ తర్వాత దాన్ని శాంసంగ్ స్పేస్ జూమ్ కెమెరాతో ఫొటో తీస్తే ఆ ఫొటో చాలా స్పష్టంగా వచ్చిందని తెలిపారు. కానీ అది అసలైన ఫొటో కాదని, ఇలా అస్పష్టంగా ఉన్న ఫొటో స్పష్టంగా చేసేందుకు శాంసంగ్ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మోడల్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్‌బర్గ్‌పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! -
ఐదేళ్ల ప్రేమ, పెళ్లి చేసుకుంటానని బాండ్ కూడా రాసి.. చివర్లో షాక్ ఇచ్చాడు!
సాక్షి,సనత్‌నగర్(హైదరాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్దుడిపై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం..ఇందిరానగర్ కాలనీ ఐడీపీఎల్ గుడిసెల సమీపంలో నివసించే యువతి (23) ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. బోరబండ భవానీశంకర్నగర్కు చెందిన ఆతం మల్లేష్ (27) ఐదేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని 2022 ఏప్రిల్ 29న ఓ బాండ్ కూడా రాసిచ్చాడు. అయితే ఇటీవల పెళ్లి చేసుకోమని యువతి కోరగా అందుకు నిరాకరిస్తూ వస్తున్నాడు. అంతేకాక వేరొక యువతితో వివాహానికి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. చదవండి అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి.. -
వంచనకు పరిచయం.. సామాజిక మాధ్యమాల్లో వేదికగా..
అనంతపురంలోని పాతూరుకు చెందిన స్వాతి (పేరు మార్చాం) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బెంగళూరుకు చెందిన అబ్బాయి వలలో పడింది. ఉన్నఫళంగా ఒకరోజు ఇంటినుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. చివరకు పోలీసుల జోక్యంతో అమ్మాయిని వెతికి ఇంటికి తెచ్చారు. ధర్మవరానికి చెందిన అమ్మాయి కావ్య (పేరు మార్చాం) అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఒకరోజు ఉన్నఫళంగా అబ్బాయితో వెళ్లిపోయింది. ఇరవై రోజుల తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా కనుక్కుని అమ్మాయిని తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అబ్బాయితో వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. వీరిద్దరే కాదు ఎంతోమంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల ద్వారా ముక్కూమొహం తెలీని వ్యక్తులు విసిరిన వలలో చిక్కుకుని మోసపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు కచ్చితంగా తమ పేరుపై ఖాతాలు తెరిచేస్తున్నారు. ప్రతిదీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయమవుతున్నారు. అలా చాటింగ్‌తో స్నేహం పెంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా వారిని చూడకపోయినా.. వారి గుణగణాలు, నేపథ్యం తెలియకపోయినా గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో అమ్మాయిలను కొందరు అబ్బాయిలు ట్రాప్‌లో పడేస్తున్నారు. క్రమక్రమంగా అమ్మాయిలు తమ కెరీర్‌ను పక్కనపెట్టి పోకిరీల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి మాధ్యమాల ద్వారా నష్టపోతున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొంపముంచుతున్న ఇన్స్టాగ్రామ్ ఇటీవలి కాలంలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులంటూ పరిచయమైన ఈ ఫోన్లు ఇప్పుడు పర్సనల్ ఖాతాల వరకూ వెళ్లాయి. ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా చాటింగ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామన్న కనీస అవగాహన కూడా లేకుండా అబ్బాయిలకు వ్యక్తిగత వివరాలు షేర్ చేస్తున్నట్టు వెల్లడైంది. దీన్ని కొందరు అబ్బాయిలు అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. అమ్మాయిలు నష్టపోయే వరకూ వాస్తవ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిలు నష్టపోయాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని చదువు మాన్పిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది వ్యవధిలో 71 మంది అమ్మాయిలు ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అబ్బాయిల వలలో పడినట్టు తేలింది. బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ సామాజిక మాధ్యమాల బాధితుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఎక్కువయ్యాయి. నెలకు ఐదారు కేసులు వస్తున్నాయి. తల్లిదండ్రుల కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచి అబ్బాయిలను మందలించి పంపిస్తున్నాం. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు షేర్ చేయద్దు. –ఆళ్ల శ్రీనివాసులు, డీఎస్పీ, ‘దిశ’ పోలీస్ స్టేషన్ వ్యసనంగా మారింది రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షితులు కావడమనేది ‘ఎమోషనల్ డిపెండెన్సీ’ అంటారు. ఆ గ్రూపులో తిరిగే వారిని బట్టి కూడా ఉంటుంది. ముందుగా దీనిపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. నాలుగు రోజుల కిందట 8వ తరగతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కోసం ఏడుస్తోందని తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చారు. ఇలా అలవాటు చేయడం వల్ల వాళ్లు దానికి బానిసల్లా మారి నష్టపోతున్నారు. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం (చదవండి: ‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం.. యాజమాన్యం లెటర్ డ్రామా.. విద్యార్థికి సీరియస్!) -
ప్రధాని నమ్మకంపై దెబ్బకొట్టాడు! ఇక అతనితో పొత్తు పెట్టుకోం!
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆ రాష్ట్ర బిజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనితో పోత్తుకు ఆస్కారమే లేదని కరాఖండీగా చెప్పారు. తమ కార్యకర్తలకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు. నార్త్ బీహార్ జిల్లా దర్భంగాలో రెండు రోజుల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తదుపరి జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్‌కు ఒక పెండ్యులమ్ మాదిరి ఊగిసలాడే అలవాటు ఉందని ఎద్దేవా చేశారు. అతనికి మళ్లీ మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీష్ పార్టీ జేడీయూ ఆ తదనంతరం అతని ఆర్జేడీ మహాఘట్‌బంధన్‌తో పోత్తు పెట్టుకుని మరీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీశ్‌కు సరైన ప్రజాదరణ లేనందువల్లే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కవ సంఖ్యలో సీట్లను గెలుపించుకోలేకపోయిందని అన్నారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో బీజేపీ ఏ అధిక స్థానాలను గెలుచుకుందన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉదారతను చూపిస్తే..కూమార్ మరోసారి సీఎం పదవిని చేపట్టి ఆస్వాదించగలిగారు. ఐతే ఆయన తనకు అలవాటైన ద్రోహం అనే అస్త్రంతో తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపణలు చేశారు. కాగా నితిశ్ కుమార్ మాజీ సన్నిహితుడు ఆర్సీపీ సాయంతో జేడీయూని చీల్చేందుకు యత్నిస్తుందంటూ బీజేపీని దుయ్యబట్టారన్నారు. అలాగే చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ జేడీయూకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ తిరుగుబాటుదారులను నిలబెట్టి..అసెంబ్లీ ఎన్నికల్లో విధ్వంసానికి పాల్పడిందంటూ జేడీయూ పార్టీ ఆరోపణలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలనే కృత లక్ష్యంతో ఉందని పునరుద్ఘాటించారు. అలాగే ఈరోజు నితీష్ గురువు జార్జ్ ఫెర్నాండెజ్ జన్మదినం. నిజానికి నితీశ్‌్ అతన్ని కూడా మోసం చేయడానికి వెనుకాడడు, ఎవరినైనా మోసం చేయగలడు అదే అతని నైజం అంటూ జైశ్వాల్ నితీశ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. (చదవండి: రాహుల్.. ప్రధాని మోదీ వల్లే అంత ప్రశాంతంగా జెండా ఎగరేశావ్!’) -
ఏటీఎం కార్డు మర్చిపోయానని భార్యని దుకాణంలో కుర్చోపెట్టి.. కాసేపు తర్వాత!
యశవంతపుర(బెంగళూరు): దుస్తుల కొనుగోలు చేయడానికి వచ్చి దుకాణదారులను మోసగిస్తున్న కిలాడీ దంపతులను బెంగళూరు గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న అజిత్, గీతాంజలిలు కారులో గిరినగరలోని దుస్తుల దుకాణానికి వచ్చారు. శుభకార్యం ఉందని చెప్పి రూ. లక్షకు పైగా దుస్తులు కొనుగోలు చేశారు. తీరా బిల్లు వేసిన తరువాత చిన్నారికి అనారోగ్యంగా ఉండటంతో ఇంజక్షన్ వేయటానికి వచ్చామని, ఆ సమయంలో ఏటీఎం కార్డు మరిచిపోయానని చెప్పి గీతాంజలిని దుకాణంలో కుర్చోపెట్టి అజిత్ వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తరువాత అజిత్ బైక్‌లో వచ్చి గీతాంజలికి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్లో మాట్లాడుతూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఇందుకు సంబంధించి దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు గిరినగర పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. గతంలోను మద్దూరులో వీరిద్దరు రూ. 4 వేల విలువైన చెప్పులు కొనుగోలు చేసుకుని ఉడాయించారని పోలీసుల విచారణలో బయటపడింది. చదవండి: ప్రియురాలితో గోవా టూర్ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే! -
చదివింది ఎనిమిదో తరగతి..డజను మంది మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజను మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వికాస్ గౌతమ్ అనే మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ నివాసి వికాస్ యాదవ్ అనే పేరుతో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ట్విట్టర్లలో ఐడీ క్రియేట్ చేశాడు. ఆఖరికి ప్రోఫైల్ పోటో కూడా ఒక గవర్నమెంట్ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోను పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక మహిళ వైద్యురాలు ఆన్లైన్లో అతడితో ఒక రోజు చాటింగ్ చేసింది. ఆ తర్వాత అతడిపై నమ్మకం ఏర్పడటంతో తన వివరాలన్ని చెప్పింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకుని ఏకంగా రూ. 25 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. దీన్ని గమనించిన సదరు మహిళా డాక్టర్ ఆ వ్యక్తిని ఫ్రాడ్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఐతే ఆ వ్యక్తి తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పడంతో రాజకీయనాయకుల అండదండ ఉండి ఉంటుందని భావించి తొలుత వెనక్కు తగ్గింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికాస్ గౌతమ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను విచారణలో డజను మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు తేలింది. అతను ఎనిమిదో తరగతి మాత్రమే చదివాడని, ఆ తర్వాత అతను ఇండస్ట్రీయల్ కోర్సు కూడా పూర్తి చేసినట్లు పోలీసులుల తెలిపారు. నిందితుడు వికాస్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో కూడా పనిచేసేవాడని తెలిపారు. అది సివిల్ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థులను చూసి ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడని చెప్పారు. పోలీసులు వికాస్ నేర చరిత్రను తిరగదోడారు. అతడు గతంలో ఉత్తప్రదేశ్, గాల్వియర్లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే..హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు) -
బీడిఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన జ్ఞానేశ్వర్
-
తపస్వి కేసు: ప్రేమికుడు కాదు కేటుగాడు
సాక్షి, గుంటూరు: గుంటూరు తక్కళ్లెపాడులో సోమవారం ఘోర హత్యకు గురైన తపస్వి కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తపస్విని వేధించిన జ్ఞానేశ్వర్ అలియాస్ డింపు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదని, పెయింటింగ్ పనులకు వెళ్లే కూలీ అని పోలీసులు ధృవీకరించారు. కులం విషయంలోనే కాదు.. తనకు మంచి జాబ్ ఉందంటూ తపస్విని అతను మోసం చేశాడని, అది బయటపడేసరికి.. ఆమె దూరం పెట్టడంతో ఇలా ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. మన్నే జ్ఞానేశ్వర్ అలియాస్ డింపు మానికొండ వాసి. రెండేళ్ల కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా తపస్వితో పరిచయం చేసుకున్నాడు. ఆమె పెట్టే ప్రతీ పోస్ట్‌కి లైకులు కొడుతూ.. పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తన ఇంటి పేరును చూపించి.. తాను అగ్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినంటూ ఆ పరిచయాన్ని మరో ట్రాక్‌లోకి ఎక్కించాడు. అతని మాయ మాటలకు ఆమె మోసపోయింది. మూడు నెలల కిందట ఒకరినొకరు కలుసుకున్నారు. జ్ఞానేశ్వర్ పుట్టిన రోజుకి బంగారంతో పాటు కానుకలు కూడా ఇచ్చింది తపస్వి. ఈ క్రమంలో.. తపస్వికి జ్ఞానేశ్వర్ నిజం చెప్పాడు. ఓ నెల క్రితం.. తాను వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని, జాబ్ కూడా లేదని నిజం చెప్పాడు. దీంతో తపస్వి.. జ్ఞానేశ్వర్‌ను అసహ్యించుకుంది. దూరం పెట్టడం ప్రారంభించింది. జ్ఞానేశ్వర్ ఉన్మాదిలా మారాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో.. పోలీసులను ఆశ్రయించింది తపస్వి. ఆపై జ్ఞానేశ్వర్‌ను, అతని తండ్రిని పిలిచి పోలీసులు హెచ్చరించారు. కానుకలను తిరిగి తపస్వికి ఇప్పించి పంపించేశారు. ఇరవై రోజుల క్రితం గన్నవరంలో ఉంటున్న రూమ్ ను ఖాళీ చేసి కృష్ణాపురం వెళ్లిపోయింది తపస్వి. ఆపై పరీక్షల నేపథ్యంలో తక్కెళ్లపాడు(గుంటూరు) స్నేహితురాలు దగ్గరికి వెళ్లింది. తపస్వి మొబైల్ నంబర్, ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ ఐడీ ద్వారా ఆమె ఉన్న చోటును ట్రాక్ చేసిన జ్ఞానేశ్వర్.. ట్రాకింగ్ ద్వారా అక్కడికి వెళ్లి మరీ ఆమెను హతమార్చాడు. ఇదిలా ఉంటే.. జ్ఞానేశ్వర్‌కు గంజాయి, మద్యం అలవాటు ఉందని స్థానికులు చెప్తున్నారు. తరచూ మొబైల్స్ మారుస్తూ.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో వేర్వేరు పేర్లతో ఐడీలు క్రియేట్ చేస్తుంటాడని స్నేహితులు చెప్తున్నారు. తపస్వి క్లోజ్ఫ్రెండ్ను విచారించిన పోలీసులు బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య కేసును మరింత లోతుగా విచారించాలని పోలీసులు నిర్ణయించాయి. నిందితుడు అదుపులో ఉన్నప్పటికీ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన తపస్వి స్నేహితురాలి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తపస్వి బాల్య స్నేహితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల సమయం కావడంతో.. తపస్వి, తక్కెళ్లపాడులోని స్నేహితురాలి దగ్గరికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్.. తపస్విపై దాడి చేశాడు. ఆ సమయంలో తపస్విని రక్షించడానికి ఆమె ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఊహించిన ఆ దాడితో ఆమె షాక్‌కు గురైందట. ఇప్పటికే హత్యకు సంబంధించిన కొంత సమాచారం విభాగ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం కోసమే ఆమెను పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. -
అడ్డంగా ‘బుక్’ చేసేశారు.. క్షణాల వ్యవధిలో..
కోటబొమ్మళి(శ్రీకాకుళం): ఆన్లైన్లో పుస్తకం బుక్ చేసి డబ్బులు చెల్లించిన తర్వాత నిమిషాల వ్యవధిలో అకౌంట్లోని డబ్బులు మాయం కావడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కోటబొమ్మాళి ఎస్ఐ షేక్ ఖాదర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నబమ్మిడి పంచాయతీ సుబ్బారావుపేటకు చెందిన ఆరవెల్లి ప్రదీప్ ఆగస్టు 7న ఓ ఆన్లైన్ వెబ్సైట్లో రూ.200 చెల్లించి ఇంజినీరింగ్‌కు సంబంధించిన మైక్రో కంట్రోలర్ కోర్సు పుస్తకాన్ని బుక్ చేశాడు. అనంతరం 30 నిమిషాల వ్యవధిలో దఫదఫాలుగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1,04,320 సైబర్ నేరగాళ్లు దోచేశారు. నగదు డెబిట్ అయిన విషయం సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైం(విజయవాడ) పోలీసులకు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. వారు వెంటనే స్పందించి బ్యాంకు ఖాతాను బ్లాక్ చేయించారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంపాలని కోట»ొమ్మాళి పోలీసులకు గురువారం సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాధితుడికి న్యాయం జరుగుతుందని, ఆన్లైన్లో వస్తువులు బుక్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో.. -
చీటింగ్ కేసు.. నటుడు, నిర్మాత అరెస్ట్
యశవంతపుర(బెంగళూరు): మోసం కేసుకు సంబంధించి నటుడు, నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కోడిగేహళ్లి పోలీసుస్టేషన్లో బసవరాజ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర జనహిత పార్టీని స్థాపించిన వీరేంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని నమ్మించి 1.88 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అయనను అరెస్ట్ చేశారు. -
వారిద్దరి పరిచయం, ప్రేమగా మారింది.. యువతికి ఐదో నెల అని తెలియడంతో..
సాక్షి,సీతానగరం(విజయనగరం): మండలంలోని అనంతరాయుడుపేట గ్రామానికి చెందిన యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన డిగ్రీ చదివిన యువతి మక్కువ మండలం, సీబిల్లిపెద్దవలస గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. సీబిల్లి పెద్దవలసలో తాతగారి ఇంటిదగ్గర ఉన్నసమయంలో యువకుడితో ఏర్పడిన పరిచయం, ప్రేమగా మారడంతో గర్భం దాల్చింది. ఆ యువతికి ప్రస్తుతం ఐదో నెల రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా విషయం చెప్పింది. దీంతో బాధిత యువతతితో పాటు తల్లిదండ్రులు మక్కువ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు స్పందించి యవతి గర్భం దాల్చడానికి కారణమైన అబ్బాయిని, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. యువతికి న్యాయం చేస్తామని, ఆ అబ్బాయితోనే పెళ్లి చేస్తామని పోలీసులు తొలుత చెప్పి తరువాత మాట మార్చారని బాధితులు వాపోయారు. దీంతో గురువారం సాయంత్రం సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు నమోదు చేసిన ఎస్సై కె.నీలకంఠం ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. న్యాయం చేయమని కోరితే కేసు నమోదు చేశామని, పోలీసులు చెప్పడంతో జీర్ణించుకోలేక పోయిన బాధిత కుటుంబం గంటపాటు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. న్యాయం చేస్తామని చేస్తామని చెప్పిన సాలూరు సీఐ కొద్దివ్యవధిలోనే మాటమార్చి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై నీలకంఠంతోపాటు మహిళా పోలీసులు ఎంతో నచ్చజెప్పినా ఫలితంలేక పోయింది. సమాచారం తెలుసుకున్న పార్వతీపురం డీఎస్పీ సుభాష్ సీతానగరం పోలీస్టేషన్‌కు వచ్చి బాధితురాలితోపాటు తండ్రితో చర్చించి న్యాయం చేస్తామని, మోసం చేసిన వ్యక్తిని మక్కువ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దీంతో బాధితులు నిరసన విరమించారు. చదవండి: అతను వీఆర్ఓ.. ఆమె సచివాలయ ఉద్యోగి.. ఇద్దరూ దారి తప్పారు.. -
బోనీ కపూర్ నుంచి లక్షల్లో చోరీ.. పోయినట్టు కూడా తెలియదు
Boney Kapoor Credit Card Misused And Lost Lakhs Of Money: ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ నుంచి డబ్బు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు. ఈ విషయంపై బోనీ కపూర్ బుధవారం (మే 25) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అంబోలీ పీఎస్ పోలీసులు పేర్కొన్నారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్ తదితర డేటాను నిందితులు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపారు. ఈ ఐదు ట్రాన్సాక్షన్స్‌లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్‌కు తెలియదని.. తర్వాత అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ అకౌంట్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి పేర్కొన్నారు. చదవండి:👇 త్వరలో పెళ్లి !.. అంతలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే.. -
రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని..
మండ్య(బెంగళూరు): రెట్టింపు నగదు ఇస్తామని వంచనకు పాల్పడుతున్న 8 మంది పట్టుబడ్డారు. చామరాజ నగర జిల్లా కొళ్లెగాల తాలుకాలో శరగూరు గ్రామానికి చెందిన నంజుండరాద్య, బెంగళూరు దేవరజీవనహళ్లికి చెందిన శ్రీనివాస్, సలీమూల్లాఖాన్, యనగరకు చెందిన మంజునాథ్, ఎలక్ట్రానిక్‌సిటి శ్రీనివాస్ రెడ్డి, కోళ్ళెగాలలోని హరళె గ్రామానికి చెందిన తాజీజ్ అహ్మద్, దొడ్డబళ్లాపురకు చెందిన నాగరాజులను మద్దూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఈనెల 3న తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాకు చెందిన కిరణ్ కుమార్, అతని స్నేహితుడు ప్రదీప్‌లను సంప్రదించారు. రూ.లక్షకి రెండు లక్షలు, రూ. 5 లక్షలకి రూ. 10 లక్షలుగా అందజేస్తామని మాయమాటలు చెప్పి నగదు ఇప్పించుకొని ఉడాయించారు. మరో ఘటనలో.. నకిలీ జాగాల కిలాడీలు అరెస్ట్ యశవంతపుర: ప్రైవేట్ ఇళ్ల జాగాలకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి వంచనకు పాల్పడుతున్న ఆర్టీనగరకు చెందిన ఫైజ్ సుల్తానా, సహకార నగర శాంతివనకు చెందిన కబీర్ అలియాస్ బాబు, కల్పనా, యోగేశ్, పూజాలను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2.87 లక్షలు నగదు, 102 గ్రాములు బంగారు నగలు, ఓ కారు, నకిలీ ఆధార్ కార్డు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ డాక్టర్ అనూప్‌శెట్టి శుక్రవారం వివరాలు వెల్లడించారు. బెంగళూరు నగరంలోని నరసీపురకు చెందిన సువర్ణమ్మకు 1998లో హెచ్ఎంటీ లేఔట్లో ఇంటి స్థలం మంజూరైంది. స్థలాన్ని అమ్మినట్లు పత్రాలు ఉండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కబీర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్ట్ చేశారు. కల్పనా, యోగేశ్, ఫైజ్ సుల్తానా పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కొద్ది రోజుల తరువాత మరో వ్యక్తికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అనుమానాలున్నాయి.. బాత్రూమ్లో పడింది, మంచం తగిలింది, ఉరేసుకుందని.. -
వీదేశీ మోజు.. తొందరపడ్డారో బతుకు బేజారు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్‌మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్‌పోర్ట్, విమానం టిక్కెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కలిశెట్టి కృష్ణారావు. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురం. ఆరు మాసాలు కిందట రూ.70వేలు ఏజెంట్‌కు చెల్లించి బహ్రెయిన్ వెళ్లాడు. ఉచిత ఏసీ వసతి, భోజనంతో పాటు, ఓటీలు ఉంటాయని చెప్పారు. కానీ, అక్కడికి వెళ్ల్సేరికి ఎడారిలో పడేశారు. చాకిరీ చేయించకుని జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో దాదాపు 2 వేల మందితో కలిసి ఆందోళన చేశారు. అణిచివేయాలని చూశారు. కెమికల్స్, ప్రమాదకరమైన గ్యాస్‌వల్ల ఆసుపత్రి పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చొరవతో భారత్‌కు తిరిగొచ్చారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులకు మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరాగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, ఫిట్టర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలాండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగ యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ∙ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్‌పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ∙కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ∙అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. -
కీలాడీ దంపతులు.. వారే టార్గెట్!
వరంగల్‌క్రైం: షేర్ మార్కెట్ అంటూ నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కిలాడీ దంపతులను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వారినుంచి రూ.2.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్, స్వైపింగ్ మిషనర్, 8 సెల్ఫోన్లు, చెక్‌బుక్‌లు, బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, స్టాంపులు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గోగుల శ్రీనివాస్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు సీపీ డాక్టర్ తరుణ్‌జోషి శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం కొచ్చి జిల్లా ఎర్రాకులానికి చెందిన రేష్మి రవీంద్రన్ నాయర్, బిజ్జు మాధవన్‌లు భార్యాభర్తలు. వీరు ప్రస్తుతం ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ దంపతులు కేరళలో ఉన్నప్పుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని స్థానికులను మోసం చేశారు. బాధితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు కావడంతో దంపతులిద్దరూ ఢిల్లీకి మకాం మార్చారు. పీవీఆర్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున బోగస్ సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో సంస్థ తరఫున ప్రతినిధులను నియమించారు. పీవీఆర్ కన్సల్టెన్సీ పేరున ఆన్లైన్ షేర్మార్కెట్లో పెట్టుబడులు పెడితే 4నుంచి 8శాతం కమీషన్ అందజేస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారు. నమ్మకం కలిగేందుకు ముందుగా పెట్టుబడులకు భారీగా కమీషన్లు చెల్లించారు. నమ్మకం కుదిరిన ప్రజలు ఈ సంస్థలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఎక్కువ మొత్తంలో బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ అయిన వెంటనే వీరు డబ్బును డ్రా చేసుకుని ప్రజలను మోసం చేసేవారు. హనుమకొండవాసి ఫిర్యాదుతో.. హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి సదరు కంపెనీ ప్రతినిధి అంటూ చెప్పుకున్న గోగుల శ్రీనివాస్ ద్వారా కిలాడీ దంపతులతో ఆన్లైన్లో పరిచయమై సుమారు కోటి రూపాయలకుపైగా పెట్టుబడులు పెట్టాడు. కొద్ది రోజులు సక్రమంగానే కమీషన్ చెల్లించిన నిందితులు.. ఆ తరువాత కన్సల్టెన్సీను మూసివేయడంతోపాటు ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి దీనిని సీరియస్‌గా తీసుకుని సైబర్ క్రైంతో పాటు సుబేదారి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి కిలాడీ దంపతులను అదుపులోని స్థానిక న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టి వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరలించినట్లు సీపీ వెల్లడించారు. తప్పించుకున్న మరో నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నందిరాంనాయక్, సైబర్ క్రైం, సుబేదారి ఇన్స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్ ఎస్ఐ పున్నం చందర్, సైబర్ క్రైం ఎస్ఐ నిహారిక, ఏఏఓ ప్రశాంత్, సల్మాన్‌పాషా,ఏఎస్ఐ సత్తయ్య, సైబర్ క్రైం కానిస్టేబుల్ కిషోర్, సుబేదారి కానిస్టేబుళ్లు కమల, రాములును పోలీస్ కమిషనర్ అభినందించారు. -
మెంబర్షిప్ పేరుతో హెరిటేజ్ మోసం
సాక్షి,పీఎంపాలెం (భీమిలి): హెరిటేజ్ సంస్థ మెంబర్ షిప్‌ల పేరుతో మోసానికి పాల్పడింది. హెరిటేజ్ ఫ్రెష్ పేరున పీఎంపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డులోనూ, 7 వ వార్డు వుడాకాలనీ రోడ్డులోనూ బహుళ అంతస్తుల భవనంలో ఒకేమారు డిపార్టుమెంట్ స్టాల్స్ ప్రారంభించింది. నిత్యావసర సరకులు తోపాటు పండ్లు, కూరగాయలు, గృహోపరణాలు, పూజా సామగ్రి ఈ స్టోర్స్‌లో లభిస్తాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రూ.వెయ్యి చెల్లి మెంబర్ షిప్ కార్డు పొందితే స్టోర్‌లో కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో వందలాది మంది మెంబర్ షిప్ తీసుకున్నారు. అయితే గత నెల 28న రెండూ స్టోర్స్ మూసివేశారు. ఎందుకు మూసివేశారో అక్కడ సమాధానం చెప్పేవాళ్లు లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఫిబ్రవరి చివరి వారంలో కూడా మెంబర్ షిప్ తీసుకున్నారు. ఇలా అకస్మాతుగా స్టోర్స్ మూసివేసి వినియోగదారులను మోసం చేయడం తగదని పలువురు బాధితులు పేర్కొన్నారు. -
12 ఏళ్ల నుంచి ఇదేతీరు.. ముందు పరిచయం,ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
సాక్షి,పెద్దపల్లిరూరల్: పెళ్లి సంబంధాల పేరిట మ్యాట్రీమోనిలో మహిళలను....నమ్మిన స్నేహితులను మాయామాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన ఘరానా మోసగాడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వెంకటాపురం మధిర (ప్రస్తుతం కూకట్పల్లి, హైదరాబాద్)కు చెందిన వాసిరెడ్డి రాహుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురితో పరిచయాలు పెంచుకుని వారి నుంచి లక్షల్లో నగదు అప్పుగా తీసుకుని ఎగవేస్తున్నాడు. ► సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో మరో పెళ్లి కోసం మ్యాట్రీమోని.కామ్‌లో తన వివరాలు పోస్ట్ చేయగా, వాటిని చూసిన రాహుల్ తాను పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. రూ.15.5లక్షల నగదు, ఐదున్నరతులాల బంగారం తీసుకున్నాడు. సుల్తానాబాద్ మహిళ నుంచి అప్పుగా తీసుకుంటూ తిరిగి చెల్లిస్తూ కొంతకాలం నమ్మించిన నయవంచకుడు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్షల్లో డబ్బు వసూలు చేశాడన్నారు. అత్యవసరమంటూ ఐదున్నర తులాల బంగారాన్ని తీసుకుని మణçప్పురం ఫైనాన్స్‌లో కుదువ పెట్టి రూ.లక్షా 30వేల నగదు తీసుకున్నాడు. ► రాహుల్ మోసగించాడని తెలుసుకున్న సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సుల్తానాబాద్ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు రాహుల్ నుంచి రూ.లక్ష నగదు, చెక్కులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 12 ఏళ్ల నుంచి ఇదేతీరు... మోసాలు చేయడమే నైజంగా పెట్టుకున్న రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో, 2013లో విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఏసీపీ చెప్పారు. ఇటీవల తనకు ఐటీ సమస్య ఉందని స్నేహితులను నమ్మించి, వారి పేరిట లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని మొదటి మూడునెలలు సక్రమంగా చెల్లించి,, ఆ తర్వాత కట్టకపోవడంతో స్నేహితులే అప్పు చెల్లించాల్సి వచ్చిందని ఏసీపీ తెలిపారు. ► రాహుల్ బాధితుల గురించి ఆరా తీయగా.. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్‌ఖలీల్ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ.2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ.2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని ఏసీపీ చెప్పారు. ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలొద్దు... ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలను ఉంచి మోసపోవద్దని ఏసీపీ సారంగపాణి అన్నారు. సెల్ఫోన్లలో మాయామాటలతో నమ్మించే మోసగాళ్ల వలలో ఎక్కువగా మహిళలే పడి మోసపోతున్నారన్నారు. ఆన్లైన్లో చాటింగ్‌లతో మొదలై మాటల దాకా వస్తే అప్రమత్తంగా ఉండాలని గ్రహించుకోవాలన్నారు. -
జనం జేబుల్ని సులభంగా.. ఏడాదికి రూ.150 కోట్లు!
బనశంకరి: ఆన్లైన్ చెల్లింపుల వల్ల ప్రజల పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. కానీ మోసగాళ్లు కూడా జనం జేబుల్ని అంతే సులభంగా ఖాళీ చేస్తున్నారు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే కర్ణాటకలో ఏడాదికి రూ.150 కోట్లు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. 2019 నుంచి 2022 జనవరి వరకు రూ.434 కోట్లను సైబర్ వంచకులు కాజేశారు. అంటే రోజుకు రూ.39.61 లక్షలను బాధితులు కోల్పోతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారించి స్వాధీనం చేసుకుంది రూ.55 కోట్లు మాత్రమే. సైబర్ నేరాల హబ్.. ► కన్నడనాట 2021 లో ప్రజల నుంచి రూ.157 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో కూర్చుని క్షణాల్లో ఫోన్ కాల్స్ ద్వారా, ఖాతా, ఓటీపీ వివరాలను తెలుసుకోవడం, మోసపూరిత లింక్‌ల ద్వారా బ్యాంకు అకౌంట్లు నుంచి కోట్లాది రూపాయలను లూటీ చేస్తున్నారు. దీంతో దక్షిణాదిలో కర్ణాటక అనేది సైబర్ నేరాల హాట్‌స్పాట్‌గా తయారైంది. ► రాష్ట్రంలో వివిధ సైబర్ పోలీస్స్టేషన్లలో నమోదైన 29,816 కేసుల్లో 6,673 కేసులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 60 శాతం కేసులు సాక్ష్యాధారాలు లేక నత్తనడకన సాగుతున్నాయి. ► 2021లో నమోదైన సైబర్ నేరాల సంఖ్య 7,462 కి తగ్గినప్పటికీ లూటీ చేసిన మొత్తం ఎక్కువగా ఉంది. రూ.157.94 కోట్లు సైబర్ కేటుగాళ్లు దోచేశారు. ఈ ఏడాది జనవరిలో 735 మంది మోసగించి రూ.15.11 కోట్లను కాజేశారు. మొదటి గంటలో స్పందించాలి.. సైబర్ వంచనకు గురైన ఒక గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. ఈ గంటలోగా బాధితులు పోలీసులకు, బ్యాంకుల సహాయవాణికి కాల్ చేసి సమాచారం అందిస్తే బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మరింత నగదును కోల్పోకుండా చూస్తారు. అలాగే ఏ ఖాతాలకు నగదు వెళ్లిందో సులభంగా గుర్తించవచ్చు. -
నిండా ముంచిన అత్యాశ.. రూ. 20 లక్షలు హాంఫట్
చందుర్తి(వేములవాడ): అత్యాశకు పోయి నిండా మునిగారు. నకిలీ బంగారాన్ని రూ.20లక్షలకు అంటగట్టారు. విషయాన్ని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సుధీర్‌కు ఇదే గ్రా మంలో బెల్టుషాపు వద్ద అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన నవీన్ రెండునెలల క్రితం పరిచయమయ్యాడు. కొద్దిరోజుల క్రితం సొంతూరుకు వెళ్లిన నవీన్ సుధీర్‌కు తరుచూ ఫోన్ చేస్తుండేవాడు. ఎప్పటిలాగే ఈనెల 16న సుధీర్‌కు ఫోన్‌చేసిన నవీన్ తన స్నేహితుల వద్ద కిలో బంగారు పూసలు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని న మ్మబలికాడు. 18న అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి క్రాస్‌రోడ్డుకు రావాలని సూచించాడు. దీంతో సుధీర్ తన స్నేహితులైన ఆ నందం, చంద్రశేఖర్‌ను తీసుకుని వెళ్లారు. నవీన్ వ ద్దనున్న నాలుగు బంగారు పూసలిచ్చి పరీక్షించుకోవాలని సూచించగా.. మెలిమి బంగారమేనని నిర్ధారించుకున్నారు. మొత్తం బంగారం రూ.20లక్షలు అని రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 21న గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.15లక్షలు ఇచ్చి పూసలు తీసుకున్నారు. కొంతదూరం వచ్చాక వాటిని క్షుణ్ణంగా పరీక్షించగా.. నకిలీవిగా గుర్తించారు. వెంటనే గోరంట్లకు చేరుకుని స్థానిక సీఐ జయనాయక్‌కు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అతాశ్యకు పోయి మోసపోయామని భావించిన లింగంపేటకు చెందిన సదరు ముగ్గురు ఊరిలోకి రాలేక హైదరాబాద్‌లోనే ఉన్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
సబ్బు కొంటే.. స్కూటీ ఉచితం.. ఆశకు పోతే ‘ఖర్చు’ అయిపోతారు జాగ్రత్త!
సాక్షి,చిత్తూరు అర్బన్: పది రూపాయలకు ఏమొస్తుందని అడిగితే టీ కూడా రాదంటారు. కానీ రూ.10 ఇస్తే మూడు ఎక్స్ఎల్ సబ్బులతోపాటు స్కూటీ, బంగారు గొలుసు కూడా వస్తుందని మభ్యపెట్టి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు గురువారం ఈ తరహా ఘటనలపై రెండు కేసులు నమోదుచేశారు. ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు.. గతనెల 21న చిత్తూరు నగరంలోని పెద్ద దళితవాడకులో టైలరింగ్ చేస్తూ జీవనం సాగించే నవీన ఇంటి వద్దకు ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. రూ.10 ఇస్తే బట్టలు ఉతికే మూడు సబ్బులు ఇస్తామని, ఓ సబ్బులో లక్కీ కాయిన్ ఉంటుందని.. దీనికి బహుమతి ఇస్తామని చెప్పారు. నవీన రూ.10తో మూడు సబ్బులు కొంటే అందులో ఓ లక్కీ కాయిన్ వచ్చింది. రూ.5500 వేలు విలువచేసే కుక్కర్, కడాయి, హాట్‌బాక్స్, వెజిటేబుల్ కట్టర్, కడాయిను రూ.3700కు ఇస్తామని చెప్పడంతో అంతమొత్తం చెల్లించి నవీన ఆ వస్తువులను తీసుకుంది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న వ్యక్తులు వెళ్లిపోయారు. తక్కువ ధరకే విలువైన వస్తువులు రావడంతో యువతి తెగ ఆనందపడిపోయింది. మూడు రోజుల తరువాత ఓ వ్యక్తి ఫోన్ చేసి తాము సబ్బులు విక్రయించినవారిమేనని చెప్పి, మళ్లీ లక్కీడిప్ తీస్తే రూ.లక్ష విలువ చేసే స్కూటీ, ఓ బంగారు గొలుసు వచ్చిందన్నాడు. దీనికిగానూ రూ.27,700 చెల్లించాలని చెప్పడంతో నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం నవీన జమచేసింది. తరువాత నిందితులు సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇదేతరహాలో గతనెల 22న లెనిన్ నగర్‌కు చెందిన దిలీప్‌ను మోసం చేసి రూ.18,650 బ్యాంకు ఖాతాలో వేయించుకున్నారు. దీనిపై ఎవరికైనా చెబితే పురువుపోతుందని బాధితులు మొదట్లో భావించినా, తనలా ఎవరూ మోసపోకూడదని పోలీసులను ఆశ్రయించారు. రెండు ఘటనలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నువ్వు లేకపోతే బతకలేనని, నమ్మించి శారీరకంగా లోబర్చుకుని..
సాక్షి,వరంగల్: చదువుకునే రోజుల్లో నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు, నీవులేకుండా నేను బతకలేనంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్ వద్ద టెంటు కింద నిరాహారదీక్ష చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్నాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాటం విరమించేది లేదని వాపోయింది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లికి చెందిన బాధితురాలు లోకిని మమత తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాత్యాతండాకు చెందిన భూక్యా రవితో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపింది. తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వంచనకు గురిచేశాడని వాపోయింది. ప్రస్తుతం అటవీశాఖ మంగపేట రేంజ్ పరిధిలోని కొత్తూరు బీటు పరిధిలో బీట్‌ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రవి పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ మోసం చేశాడని వాపోయింది. విషయమై కలెక్టర్, అటవీశాఖ వరంగల్, ములుగు డీఎఫ్ఓ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వాపోయింది. అయినప్పటికి తనకు ఏమాత్రం న్యాయం జరుగలేదని తెలిపింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. చదవండి: వివాహేతర సంబంధం.. మాజీ నక్సలైట్ దారుణ హత్య -
ఏఎస్ఐని మాట్లాడుతున్న అర్జెంటుగా రూ.10వేలు పంపు..
సాక్షి,తుగ్గలి(కర్నూలు): మండల కేంద్రానికి చెందిన అనిల్‌కుమార్ సెల్‌కు ఓ వ్యక్తి ఏఎస్ఐ నంటూ ఫోన్ చేసి రూ.10వేలు దోచేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఏఎస్ఐని మాట్లాడుతున్నానని, ఫోన్ పే ద్వారా డబ్బులు వేయాలని రెండు రోజులుగా ఓ వ్యక్తి (9640579106) అనిల్‌కుమార్‌కు ఫోన్ చేస్తున్నాడు. తమ వాళ్లు ఆస్పత్రిలో ఉన్నారని వెంటనే ఫోన్ పే ద్వారా రూ.10వేలు పంపించాలని కోరాడు. డబ్బు వెంటనే కానిస్టేబుల్ ద్వారా పంపుతానని నమ్మబలికాడు. దీంతో అనిల్ అతను పంపిన (9550566601) నంబరుకు ఫోన్ పే ద్వారా రూ.10వేలు పంపాడు. ఎంతకూ డబ్బులు తీసుకు రాలేదు. కొద్దిసేపటికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించాడు. ఈ మేరకు శనివారం తుగ్గలి పోలీసులకు వివరించినట్లు బాధితుడు తెలిపారు. అయితే ఈ విషయమై ఇంకా కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు. చదవండి: విచక్షణ కోల్పోయి మిత్రుడిని హతమార్చి.. ఇంట్లోనే సగం కాల్చి.. -
రోజూ డబ్బులు వస్తాయని నమ్మించి దంపతులకు టోపి
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): ఇన్వెస్ట్ చేస్తే రోజూ డబ్బులు వస్తాయని నమ్మించి తమని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ యూసఫ్‌గూడకు చెందిన భార్యాభర్తలు శుక్రవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులిద్దరికీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇష్టం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆర్టీ గోల్డ్ యాప్‌లో డబ్బు పెట్టించాడు. ముందుగా రూ. 500కి రూ. 1000 ఇచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ. 2.80 లక్షలు ఇన్వెస్ట్ చేయగా.. వాటిలోంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశీన్‌రెడ్డి తెలిపారు. మరో ఘటనలో.. ఆభరణాల తయారీకి ఇచ్చిన 43 తులాల బంగారంతో పరార్ హిమాయత్‌నగర్: ఆభరణాల తయారు చేసేందుకు ఇచ్చిన 43 తులాల బంగారంతో పనివాళ్లు పరారయ్యారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఎస్హెచ్ఓ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదర్‌గూడలోని యాష్ జ్యువెలరీ షాప్ యజమాని అభిషేక్ అగర్వాల్ కొంత కాలంగా వీరికి నమ్మకంగా ఉన్న అభిజిత్ మైతితో ఆభరణాలను తయారు చేయిస్తున్నారు. ఇటీవల ఒకేసారి 43 తులాల బంగారాన్ని ఆభరణాల తయారు చేసేందుకు ఇచ్చారు. సదరు ఆభరణాలు ఈ నెల 18న ఇవ్వాల్సి ఉంది. అవి రాకపోవడంతో యజమాని అభిషేక్ అగర్వాల్ అభిజిత్ మైతికి ఫోన్ చేయగా.. తనవద్ద పని చేస్తున్న రాహుల్ అమిన్‌తో పంపిస్తున్నానని తెలిపారు. గంటలు గడిచినా రాలేదు. సరికదా ఇద్దరి ఫోన్స్ స్విచ్చాఫ్ వస్తున్నాయి. దీంతో తాను మోసయోయానని తెలుసుకున్న బాధితుడు అభిషేక్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ గట్టుమల్లు వివరించారు. చదవండి: వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి.. -
సినీ ఫక్కీలో డీబీ జ్యువెలర్స్ షాప్‌లో మోసం
-
చెప్పినట్లే చేసినందుకు 4.90 లక్షలు హుష్
సాక్షి,నిజామాబాద్ అర్బన్: బ్యాంక్ ఖాతాకు పాన్‌కార్డు లింక్ చేయమని వచ్చిన మెసేజ్ వచ్చింది. తన మొబైల్లో క్లిక్ చేసిన వ్యక్తి రూ. 4.90 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలివి. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి బ్యాంక్ అకౌంట్‌కు పాన్‌కార్డు లింక్ చేయాలని సెప్టెంబర్ 30త తేదీ మెసేజ్ వచ్చింది. తన మొబైల్లో లింక్ క్లిక్ చేశాడు. కావలసిన సమాచారం అందించాడు. అంతలోనే తన మొబైల్ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగారు. ఆ నంబర్ చెప్పిన కాసేపటికే తన బ్యాంక్ ఖాతాలోని రూ.4.90 లక్షల 330 విత్‌డ్రా అయినట్లు మెస్సేజ్ వచ్చింది. అకౌంట్ నుంచి డబ్బు పోయినట్లు గుర్తించిన బాధితుడు శనివారం మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు. ఈ తరహాలో మోసపోతే 24 గంటల్లోపు 155260 లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దన్నారు. చదవండి: కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు -
కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్న చిప్‌లు
విజయవాడలోని గుణదలలో ఓ పెట్రోల్ బంకులో మోసాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తూనికలు–కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 5 లీటర్లకు 560 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్టు గుర్తించారు. మదర్ బోర్డును పరిశీలించగా అందులో కొన్ని మార్పులు చేసి తక్కువ కొలత వచ్చేట్టుగా చేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఆ బంకులో ఉన్న రెండు యూనిట్ల ద్వారా రోజుకు దాదాపు 7వేల లీటర్ల పెట్రోలులో 840 లీటర్ల వరకు మోసం చేస్తున్నారు. బంకును సీజ్ చేసి యాజమానిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం జరిమానా విధించింది. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని ఓ పెట్రోల్‌బంకులో 5 లీటర్లకు 120 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బంకులోని మెకానికల్, ఎలక్ట్రానిక్ బోర్డులు చూపిస్తున్న నెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే... రెండు బోర్డుల మధ్య 62,458లీటర్ల వ్యత్యాసం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. లీటరుకు రూ. 100 చొప్పున చూసినా నెలలో రూ.62.45లక్షలు దోపిడీ చేశారని అర్థమవుతుంది. బంకులోని మదర్బోర్డ్, డిస్ప్లే బోర్డ్, సెన్సారల్ సర్క్యూట్ బోర్డులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపగా వాటిలో మైక్రో కంట్రోలర్ చిప్ అమర్చినట్టు బయటపడింది. బంకు యజమానిపై కేసు నమోదుచేశారు. ఇవే కాదు తూనికలు కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో 17 బంకుల్లో ఇలా చిప్‌లు పెట్టి మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఆ బంకులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న కొద్దీ వాటి విక్రయాల్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి. పెట్రో ధర లీటరుకు రూ.100 దాటగానే... పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా 100కి.మీ. స్పీడ్ అందుకున్నాయి. పెట్రోలు బంకుల్లో మోసాలు అంటే ఏదో అక్కడ సిబ్బంది ప్రదర్శించే చేతివాటం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ పెట్రో దందా స్థాయి అంతకుమించి ఉంది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రాలుగా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి. ఈ మూడింటికి ముంబై వరకు లింక్ ఉంది. వీరికి సాంకేతిక సహకారం చైనాలోని ముఠాల నుంచి అందుతోందని అధికారులు గుర్తించారు. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు) హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆ ముఠాను పట్టుకోవడంతోనే ఈ మోసాలకు చెక్ పడిందనుకుంటే పొరపాటే. పెట్రోల్ బంకుల్లో టెక్నాలజీ మారుస్తున్న కొద్దీ మోసగాళ్లు కూడా మరింతగా రాటుదేలుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రివర్స్ ఇంజినీరింగ్‌తో ఏమారుస్తున్నారు. ఏటా తూనికలు–కొలతల శాఖ దాడులు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నా...పెట్రోలు బంకుల మదర్‌బోర్డులను మారుస్తున్నా... మోసాలు ఆగడం లేదు. చైనా నుంచి కథ నడుపుతున్న ఆ ముఠా ‘రివర్స్ ఇంజనీరింగ్’ ఎత్తుగడతో మరోకొత్త దొడ్డిదారిని విజయవంతంగా కనిపెడుతుండటం విస్మయపరుస్తోంది. చెక్ మిజర్ క్యాన్‌లో పెట్రోల్ కొలతను పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్ ఫొటో) బంకుల్లో టెక్నాలజీ ట్యాంపరింగ్.. పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలకు పాల్పడే ముఠాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. బంకులకు సరఫరా అయిన పెట్రోలు/ డీజిల్, బంకుల ద్వారా విక్రయాలు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలు... తదితర వివరాలను బంకుల్లో ఉన్న మెకానికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు వెల్లడిస్తాయి. అందుకోసం కీ బోర్డ్, పల్సర్ బోర్డ్, మదర్ బోర్డ్, డిస్ప్లే బోర్డ్ అనే 4 వ్యవస్థలు ఉన్నాయి. ఎంత పెట్రోల్/ డీజిల్ కావాలో కీ బోర్డులో నమోదు చేయగానే.. మదర్ బోర్డ్‌కు సందేశం వెళ్తుంది. ఆ వెంటనే పల్సర్ బోర్డ్‌కు ఆ సందేశం చేరి నిల్వల నుంచి ఆ మేరకు పెట్రోల్/ డీజిల్ పంపింగ్ ద్వారా వినియోగదారుని వాహనం ట్యాంకులోకి చేరుతుంది. ఈ సందర్భంలో బంకుల నిల్వల్లో ఎంత పెట్రోల్/డీజిల్ ఉందన్నది మదర్ బోర్డ్, సెన్సార్ బోర్డ్ ఒకే రీతిలో చూపించాలి. కానీ పెట్రో ముఠాలు ఈ నాలుగు వ్యవస్థలను ట్యాంపర్ చేస్తున్నాయి. చిప్‌లతో మన పెట్రోలుకు చిల్లు ►పల్సర్ బోర్డ్‌కు మదర్ బోర్డ్‌కు మధ్యగానీ మదర్ బోర్డ్‌కు డిస్ప్లే బోర్డ్‌కు మధ్యగానీ ప్రత్యేక చిప్‌ను అమరుస్తున్నారు. దాంతో ఒక పరిమాణంలో పెట్రోల్ కావాలని ఫీడ్ చేస్తే... అంతకంటే తక్కువ మేరకు సందేశం వెళ్లి తక్కువ పెట్రోల్/డీజిల్ బయటకు వస్తుంది. కానీ డిస్ప్లే మాత్రం ఎంత ఫీడ్ చేశారో అంతే వేసినట్టు కనిపిస్తుంది. కానీ వాహనాల్లోకి అంతకంటే తక్కువ పెట్రోల్/డీజిల్ వెళ్తుంది. ►ఇక కీబోర్డ్‌ను ప్రత్యేక చిప్‌తో ట్యాంపర్ చేస్తున్నారు. ఉదాహరణకు కీ బోర్డులో 5 లీటర్లు అని ఫీడ్ చేసినా సరే మదర్‌బోర్డ్‌కు మాత్రం 4.5లీటర్లు అనే సందేశం వెళ్తుంది. దాంతో 4.5లీటర్ల పెట్రోల్/డీజిలే వస్తుంది. అంటే వినియోగదారుడు అరలీటర్ పెట్రోల్‌ను కోల్పోతాడన్నమాట. పెట్రో దోపిడీ ముఠాలు చిప్‌లను ఏర్పాటు చేసి మోసానికి పాల్పడే డిస్ప్లే బోర్డు వెనుకభాగం మదర్ బోర్డులు చిప్‌లను ఏర్పాటు చేసి మోసానికి పాల్పడే పల్సర్ బోర్డ్‌లు ‘రివర్స్ ఇంజనీరింగ్’తో ఏమారుస్తున్న ముఠాలు బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న విషయం తొలిసారిగా హైదరాబాద్‌లోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు, తూనికలు–కొలతల శాఖల అధికారులు నిర్వహించిన దాడుల్లో అటువంటి తరహా మోసాలు బయటపడ్డాయి. దాంతో పెట్రోల్ బంకుల యూనిట్లలో చిప్‌లు అమర్చేందుకు అవకాశం లేకుండా సీళ్లు వేసి సరికొత్త పరిజ్ఞానంతో కంపెనీలు పెట్రో బంకుల యూనిట్లను తయారు చేశాయి. అయినా మోసాలు ఆగలేదు. ఏడాదికో రెండేళ్లకో తూనికలు–కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెట్రో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో సమర్థంగా బురిడీకొట్టిస్తున్నాయి. ఈ దందాకు పెట్రోల్ బంకుల యూనిట్లను ఉత్పత్తి చేసే కంపెనీల్లోని కొందరు నిపుణులు కూడా సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. బంకుల లీజులు.. ఆపై మోసాలు.. పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు మన రాష్ట్రంలోని గుంటూరుజిల్లాలోని పల్నాడు ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలోనూ, హైదరాబాద్‌లలోనూ ఉన్నాయి. సుదీర్ఘకాలం పెట్రోల్ బంకుల్లో పని చేసిన కొందరు అందులో లోటుపాట్లు పసిగట్టారు. వారే ఒక గ్రూపుగా ఏర్పడి వీరు పెట్రోల్ బంకుల యూనిట్లు తయారు చేసే కంపెనీల్లోని కొందరు సాంకేతిక నిపుణులు, చైనాలోని ముఠాలతోనూ సంబంధాలు పెట్టుకున్నారు. ఆ ముఠా సభ్యులే ఏపీ, తెలంగాణతోపాటు ఒడిశా, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులను లీజుకు తీసుకోవడం మొదలుపెట్టారు. భారీ లీజు మొత్తం ఆశ చూపిస్తుండటంతో బంకుల యజమానులు వారికి తమ బంకులను లీజుకు ఇస్తున్నారు. పెట్రోలియం కంపెనీలు కొత్త టెక్నాలజీతో బంకుల యూనిట్లను రూపొందించగానే... ఆ కంపెనీలో పనిచేసే కొందరు నిపుణులే ఆ మదర్బోర్డ్, పల్సర్ బోర్డ్, కీ బోర్డ్, డిస్ప్లే బోర్డులను గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లోని ముఠాల వద్దకు పంపిస్తారు. వాటిని ఎలా తయారు చేసిందీ చెబుతారు. అనంతరం గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లోని ముఠాలు పెట్రో బంకు యూనిట్ల మదర్ బోర్డు, పల్సర్ బోర్డ్, కీ బోర్డ్, డిస్ ప్లే బోర్డ్లను ఏకంగా చైనాకు పంపుతున్నాయి. అక్కడ సాంకేతిక నిపుణులతో వ్యవస్థీకృతమైన అతి పెద్ద ముఠాలు ఆ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ బోర్డులను ఎలా తయారు చేశారన్నది రివర్స్ ఇంజనీరింగ్ విధానం ద్వారా తెలుసుకుంటాయి. అనంతరం వాటిలో ఎక్కడ ఎలాంటి చిప్పెడితే మోసం చేయొచ్చనేది కనిపెడతాయి. ఆ విషయాన్ని ఇక్కడి ముఠాలకు చేరవేస్తాయి. అనంతరం ఇక్కడి ముఠాలు ఆ మేరకు స్థానికంగా ఉన్న నిపుణులతో తాము లీజుకు తీసుకున్న పెట్రోల్ బంకుల యూనిట్లలో ఆ చిప్‌లను అమర్చి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే యజమానులు నిర్వహిస్తున్న బంకుల్లో కంటే లీజుకు ఇచ్చిన పెట్రోల్ బంకుల్లోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మొదలైన దేశాల్లో కూడా ఇదే రీతిలో భారీగా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కొత్తగా రిమోట్ కంట్రోల్.. అధికారుల తనిఖీలు, దాడులు నిరంతరాయంగా జరుగుతుండడంతో దీనినుంచి తప్పించుకోవడం కోసం మరో కొత్త వ్యవస్థనుకూడా ఈ ముఠాలు కనుక్కున్నాయి. పెట్రోల్ బంకుల్లో మదర్ బోర్డ్, పల్సర్ బోర్డ్, డిస్ ప్లే బోర్డులలో చిప్‌లు ఏర్పాటు చేసి ట్యాంపర్ చేస్తున్న ముఠాలు వాటని్నంటికి కేంద్రీకృత వ్యవస్థను రూపొందించి దానిని ఓ రిమోట్ కంట్రోల్‌కు అనుసంధానిస్తున్నాయి. తనిఖీలకు అధికారులు రాగానే వెంటనే ఆ రిమోట్ కంట్రోల్‌తో ఆ బోర్డులన్నీ సాధారణ స్థితికి వచ్చేట్టుగా మేనేజ్ చేస్తున్నాయి. దాంతో చాలా పెట్రోల్ బంకుల్లో మోసాలు అధికారుల తనిఖీల్లో కూడా బయటపడటం లేదు. అధికారులు అంతా ఓకే అని వెళ్లిపోగానే ఆ రిమోట్ కంట్రోల్‌ను ఆన్ చేయగానే కొలతను కంట్రోల్ చేసే చిప్ పనిచేయడం ప్రారంభిస్తుంది. రాష్ట్రంలో రోజుకు రూ.2కోట్లపైనే దోపిడీ... చిప్‌లు అమర్చడం ద్వారా 10 లీటర్ల పెట్రోల్‌కు అర లీటరు నుంచి లీటరున్నరవరకు దోపిడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. పెట్రోల్‌కు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి 10 లీటర్లకు 50ఎంఎల్ వరకు కొలత తక్కువ రావచ్చని ప్రమాణాలు నిర్దేశించారు. కాగా చిప్‌లు అమర్చిన బంకుల్లో 10 లీటర్లకు అర లీటరు నుంచి లీటరున్నర వరకు తక్కువ కొలుస్తున్నారు. ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎక్కువగా 10 లీటర్లకు లీటరు వరకు మోసానికి పాల్పడుతున్నారు. సాధారణంగా ఏకకాలంలో పెద్ద సంఖ్యలో బంకులపై దాడులు నిర్వహిస్తే 5శాతం బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్టు గత రికార్డులు తెలుపుతున్నాయి. ♦మన రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3,878 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో పెట్రోల్ విక్రయించే పెట్రోల్ యూనిట్లు దాదాపు 15వేలు ఉన్నాయి. ♦రోజుకు దాదాపు 1.20 కోట్ల లీటర్ల పెట్రోల్, 2.70కోట్ల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. అంటే మొత్తం దాదాపు 4కోట్ల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు అమ్ముతున్నారు. ♦సగటున 200 పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్నారని భావించినా సరే వాటిలో మొత్తం మీద రోజుకు 20.63 లక్షల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ♦చిప్‌లు అమరిస్తే పది లీటర్లకు సగటున లీటరు మోసం చేస్తున్నారని లెక్కించినా సరే ... 20.63లక్షల లీటర్లకు 2.06లక్షల లీటర్లు మోసం చేస్తున్నట్టు. ♦ప్రస్తుత ధర ప్రకారం లీటరుకు సగటున రూ.100 ధర వేసుకున్నా సరే రోజుకు రూ.2.06కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంలో అంచనా ఇలా ఉంటే ఇక దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారో ఊహించవచ్చు. బంకుల్లో సిబ్బంది మోసాలు సరేసరి.... చాలా పెట్రోల్ బంకుల్లో సిబ్బంది కూడా మోసం చేస్తున్నారు. బంకుల్లో రెండు డిస్పాచ్ పంపులు, రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఓ డిస్ప్లేలో ‘సున్నా’ చూపిస్తూ ఆ పంపు నుంచి కాకుండా మరో డిస్పాచ్ పంపు నుంచి పెట్రోల్/ డీజిల్ పోస్తారు. ♦కార్లు, ఇతర పెద్ద వాహనాల్లో పెట్రోల్/డీజిల్ కొంత వరకు నింపిన తరువాత పైప్ బయటకు తీసి మరో వాహనం వస్తే అందులో నింపుతున్నారు. కారు, ఇతర వాహనాల్లో ఉన్నవారు డిస్ప్లే బోర్డునే చూస్తున్నారు. వారి కారు సైడ్ మిర్రర్‌కు ఆయిల్ ట్యాంకర్‌కు మధ్యలో ఒకరు వచ్చి అడ్డుగా నిలబడతారు. ♦బంకులో సిబ్బంది పెట్రోల్ పూర్తిగా పోసే వరకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. దృష్టి మళ్లించకూడదు. ♦పెట్రోల్ నాణ్యతపై సందేహం ఉంటే వెంటనే ఫిల్టర్ చెక్ చేయమని అక్కడి సిబ్బందిని డిమాండ్ చేయాలి. పెట్రోల్ నాణ్యతను పరీక్షించడానికి పెట్రోల్ బంకుల వద్ద ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటిపై పెట్రోల్ ఒక చుక్క వేయగానే పూర్తిగా ఆరిపోయి మరక కూడా కనిపించకూడదు. అలా అయితేనే ఆ పెట్రోల్ నాణ్యమైనది. మరక కనిపిస్తే కల్తీ చేసినట్టు భావించాలి. డీలర్లు చేయాల్సినవి... ♦పెట్రోల్‌బంకుల్లో పంపుల(నాజల్)లను రోజూ తనిఖీ చేయాలి. ఠి పెట్రోల్ సాంద్రతను రోజూ నమోదు చేయాలి. ♦వినియోగదారులకు సందేహం వస్తే వారి సమక్షంలోనే నిర్దేశించిన 5 లీటర్ల క్యాన్‌లో పెట్రోల్ నింపి పరీక్షచేయాలి. ♦వినియోగదారులు ఫిర్యాదు చేయాలని భావిస్తే అందుకు సంబంధించిన అధికారుల నంబర్లను పెట్రోల్ బంకుల్లో ప్రదర్శించాలి. ♦పెట్రోల్ మోసాలపై తూనికలు, కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబరు 18004254202ను అందుబాటులోకి తెచ్చింది. ♦ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు చేసేందుకు clm&ap@nic.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. పెట్రోల్ బంకుల మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటాం పెట్రోల్ బంకుల్లో మోసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. చిప్‌లు అమర్చడం, ఇతరత్రా విధానాలతో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందుకోసం తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో మళ్లీ తనిఖీలు ముమ్మరం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. – కేఆర్ఎం కిశోర్ కుమార్, కంట్రోలర్, తూనికలు –కొలతల శాఖ మోసాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు పెట్రోల్ బంకుల్లో మోసాలను కట్టడి చేయడానికి తూనికలు–కొలతల శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ కొలత, నాణ్యత సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి 10 రకాల తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందుకోసం ఫ్లయింగ్ స్వా్కడ్లు, ఇతర తనిఖీ బృందాలను నియోగించాం. వాహనదారులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు ప్రవేశపెట్టడంతోపాటు ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం కల్పించాం. – రామ్‌కుమార్, జాయింట్ కంట్రోలర్, తూనికలు –కొలతల శాఖ చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
నీ కోసం యూఎస్ నుంచి వస్తున్నా.. ఎయిర్‌పోర్టులో..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కాంచన్‌బాగ్‌కు చెందిన యువకుడికి కొద్ది నెలల క్రితం ఫేస్బుక్లో ఓ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. కొద్దిరోజులకు మెసేంజర్ చాటింగ్ అనంతరం వాట్సాప్ నంబర్స్‌ను ఇచ్చిపుచ్చుకున్నారు. నిన్ను చూడటానికి యూఎస్ నుంచి కెనడా మీదుగా ఇండియా వస్తున్నా అని చెప్పింది. కట్ చేస్తే.. రెండు రోజుల తర్వాత నీకోసం తెస్తున్న గిఫ్టులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ వాళ్లు పట్టుకున్నారని, నా వద్ద ఉన్న కరెన్సీ మార్చుకునే సమయం కూడా లేదని చెప్పింది. మాటలు విన్న యువకుడు రూ.6.20 లక్షలను అకౌంట్స్‌కు పంపాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో.. నమ్మించి.. బంగారు గొలుసు లాక్కెల్లారు సాక్షి,కాచిగూడ(హైదరాబాద్): మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇంద్రజ (25) భర్త బాలసుమన్ ఇద్దరు మూగవాళ్లు. బుధవారం విద్యానగర్‌లోని మానసిక వికలాంగుల కేంద్రానికి భార్యాభర్తలు కలిసి వచ్చారు. తిరుగు ప్రయాణంలో విద్యానగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ముగ్గురు గుర్తు తెలియని దొంగలు వీరిద్దరికి రైలు టికెట్లను ఇప్పిస్తామని నమ్మించారు. భార్యాభర్తలు రైలు ఎక్కుతుండగా ఇంద్రజ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును టికెట్‌ను ఇప్పించిన వారే లాక్కొని పారిపోయారు. ఈ సంఘటనపై ఇంద్రజ కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్ -
ట్విటర్లో పరిచయం.. ఆపై వాట్సాప్.. చివరికి నమ్మకంగా
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తితో ట్విట్టర్ ద్వారా పరిచయం పెంచుకున్నారు దిల్‌షుక్‌నగర్‌కు చెందిన రాసూరి రాహుల్, అతడి భార్య. కొద్దిరోజుల పరిచయం అనంతరం వాట్సాప్ నంబర్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో గుజరాత్ వ్యాపారస్తుడు నీల్ పటేల్ తనకు చెందిన ‘స్క్వాస్ టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ’ కంపెనీ పేరుతో ట్విట్టర్లో క్రిప్టో కరెన్సీపై ఎడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రమోట్ చేసుకుంటున్నాడు. దీనికి ఆకర్షితులైన రాసూరి రాహుల్, అతడి భార్య నీల్ పటేల్‌ను సంప్రదించారు. రూ.12 లక్షలు నీల్ పటేల్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేశారు. అనంతరం ఫోన్‌కు స్పందించకపోవడంతో శుక్రవారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. రూ.10కోట్లు.. 300మంది బాధితులు గూగుల్ ద్వారా నీల్ పటేల్ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన రాహుల్‌కు పలు విషయాలు తెలిశాయి. తాము కూడా నీల్ పటేల్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేసి మోసపోయామని కొందరు గూగుల్‌లో రివ్యూలు రాశారు. ఇలా ఇప్పటి వరకు 300మంది నుంచి రూ.10కోట్ల మేర ఇన్వెస్ట్ చేయించి వారికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. నీల్ పటేల్‌పై ముంబై, కలకత్తా, ఢిల్లీ, పూణే వంటి నగరాల్లో కేసులు కూడా కేసులు నమోదైనట్లు రాహుల్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు వెల్లడించాడు. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు
-
కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, చిత్తూరు: కలికిరి బ్యాంకు కుంభకోణంలో కొత్త విషయాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో బ్యాంకు మెసెంజర్ అలీ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భార్య ఒత్తిడి మేరకే అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. ఆమె బంగారు నగల కోసం తరచూ తనపై ఒత్తిడి తెచ్చేదన్నారు. వాటిని తట్టుకోలేకే బ్యాంకు నుంచి కోటి రూపాయలు స్వాహా చేసినట్లు చెప్పారు. కాజేసిన సొమ్ముతో రూ. 30 లక్షల విలువచేసే బంగారు నగలు, మరో 70 లక్షలు బంధువుల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ నాగార్జున్ రెడ్డి నేతృత్వంలో మరింత లోతైన విచారణ జరుగుతోంది. చదవండి: ఫొటోషూట్‌కు వెళ్లిన ప్రముఖ మోడల్‌పై చిరుతల దాడి! -
మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ..
సాక్షి,నేరేడ్మెట్( హైదరాబాద్): మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిని నేరేడ్మెట్ పోలీసులు గురువారంఅరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్స్పెక్టర్ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయంలో నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆర్.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది. దీంతో మంత్రాలు, పూజల పేరుతో కొడుకు ఆరోగ్యం నయం చేయడంతోపాటు ఇంట్లోని ఇతర సమస్యలనూ బాగు చేస్తానని నిందితుడు ఆమెను నమ్మించాడు. ఇందుకు బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. తరువాత పూజలు ఎప్పుడు చేస్తావని బాధితురాలు నిందితుడిని అడుగగా రేపుమాపు అంటూ కాలాయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది. ఈ నెల 10న నిందితుడు బా ధితురాలని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మంత్రాలు, పూజల పేరుతో నిందితుడు తనను మోసం చేశాడని బాధితురాలు గుర్తించింది. పలువురు మహిళలు కూడా బెదిరించారని బాధితురాలు నేరేడ్మెట్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ వివరించారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
రూ.137 కోట్ల మోసం.. ‘తెలిసే బ్యాంకులు అప్పిచ్చాయి’
సాక్షి, హైదరాబాద్: ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను రూ.137 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి పోలీసు కస్టడీ గడువు ముగియడంతో సీసీఎస్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 2 రోజుల పోలీసుల విచారణలో ఆయన కొత్త అంశాలను బయటపెట్టలేదు. తనకు అప్పులు ఇచ్చిన బ్యాంకులకు అన్ని విషయాలు తెలిసే అప్పులు ఇచ్చాయని మాత్రమే చెప్పుకొచ్చాడు. మరికొన్ని అంశాలు రాబట్టాలని భావిస్తున్న పోలీసులు మరో 2 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సైఫాబాద్ పరిధిలో వ్యక్తి హత్య ఖైరతాబాద్: జులాయిగా తిరిగే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో వద్ద సమీర్ (35) జులాయిగా తిరుగుతూ వైట్నర్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 8గంటల సమయంలో పిల్లర్ నెం 1244–45 మధ్య రక్తం మడుగులో పడిఉన్నాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు పరీక్షించి చూడగా తల వెనుక, కుడిచేయి, భుజం మీద పదునైన ఆయుధంతో కోసిన గాయాలు గుర్తించారు. అప్పడికే చనిపోయి ఉండటంతో మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి -
ఓఎల్ఎక్స్లో సోఫా.. ఫోన్ చేసి కొంటామన్నారు కాకపోతే..
సాక్షి,అంబర్‌పేట(హైదరాబాద్): సోఫా సెట్ అమ్ముతానని ఓఎల్ఎక్స్లో పోస్టులు పెట్టిన ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఈ సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ సమాచారం మేరకు... బాగ్ అంబర్‌పేటలో నివసించే అక్షయ్ ఇంట్లో ఉన్న సోఫాను రూ. 9 వేలకు అమ్ముతానని ఓఎల్ఎక్స్లో పోస్టు పెట్టాడు. దీనికి స్పందనగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ సోఫా కొంటామని, ముందుగా క్యూ ఆర్ కోడ్ అందిస్తామని దాన్ని స్కాన్ చేయాలని కోరారు. క్యూ ఆర్‌ను స్కాన్ చేసిన అక్షయ్‌కు పంపారు. ఆ కోడ్ ఓపన్ చేసిన అతని ఖాతాలోంచి రూ. 63 వేలు కాజేశారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న అక్షయ్ అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పక్కా ప్లాన్.. భర్తని అడ్డుతొలగించుకుంది chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
క్లాస్‌మేట్‌ను పెళ్లి పేరుతో ట్రాప్.. ఆ తర్వాత..
సాక్షి, హైదరాబాద్: ఒకప్పటి తన క్లాస్‌మేట్‌ను పెళ్లి పేరుతో ట్రాప్ చేశాడు. సౌదీలో వ్యాపారం ప్రారంభిస్తున్నానంటూ 2019లో రూ.6 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మాటల గారడీ చేస్తూ వచ్చాడు. మధ్యలో రూ.లక్ష తిరిగి చెల్లించాడు. చివరికి తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో అందినంత దోచుకుని.. నగరానికి చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం బ్యాంకు పరీక్షల కోసం సిద్ధమవుతూ వరంగల్‌లోని ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంది. అప్పట్లో ఈమెతో పాటే కోచింగ్ తీసుకున్న ఓ యువకుడు ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. 2019లో సోషల్‌మీడియా ద్వారా ఈమెను సంప్రదించిన అతగాడు తాను ఫలానా అంటూ పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్న ఇరువురూ కొన్నాళ్లు కాల్స్, చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తాను సౌదీ అరేబియాలో ఉంటున్నానని, తిరిగి వచ్చాక వివాహం చేసుకుందామని నమ్మించాడు. సౌదీలోనే వ్యాపారం మొదలెడతానంటూ రూ.6 లక్షలు అడిగాడు. ఈ మొత్తం ఇవ్వడానికి యువతి అంగీకరించింది. ఖాతాలో డబ్బులు వేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇదిగో వస్తా... అదిగో వస్తా.. అంటూ యువతితో చెబుతూ వచ్చాడు. బాధితురాలు తీవ్రంగా ఒత్తిడి చేయడంతో రూ.లక్ష ఆమె ఖాతాకు పంపాడు. మిగిలిన మొత్తం పంపకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జంట్‌గా డబ్బు పంపమని మెసేజ్‌లు వస్తున్నాయా?
కుత్బుల్లాపూర్: ఫేస్బుక్ మెసెజ్‌తో ఓ వ్యకి నగదు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. కొంపల్లిలోని హరిహర ఎవెన్యూలో నివసించే కళ్యాణ చక్రవర్తి క్యూపీఎస్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 10న అతని ఫేస్బుక్ అకౌంట్‌కు అర్జంట్‌గా రూ. 18వేల పంపాలని అతని కజిన్ పేరుపై మెసెజ్ వచ్చింది. దీంతో చక్రవర్తి గుగూల్‌పే చేశాడు. తరువాత కాసేపటికేరూ. 12వేలు పంపాల్సిందిగా మరో మెసెజ్ రావడంతో సదరు నగదును ట్రాన్స్ఫర్ చేశాడు. అయినా నగదు పంపాల్సిందిగా మెసెజ్‌లు వస్తుండటంతో అనుమానం వచ్చి తన కజిన్‌కు కాల్ చేయగా ఫేక్ మెసేజ్‌గా తేలింది. దీంతో మోసపోయిన బాధితుడు బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టాటాస్కై కస్టమర్ కేర్ నుంచి అంటూ వల.. ఓటీపీ చెప్పడంతో..
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): టాటాస్కై సెటప్ బాక్స్‌లో చిన్నలోపం ఉండటంతో ఎస్సార్‌నగర్‌కు చెందిన కంచన్ ముఖర్జీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మాట్లాడింది. మరుసటి రోజు ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము టాటాస్కై నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. తన సెటప్ బాక్స్‌లో ఉన్న సమస్యలన్నీ చెప్పాక రీస్టార్ట్ చేసే ముందు తన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని చెప్పమని అడిగారు. క్షణం ఆలస్యం లేకుండా ఓటీపీ చెప్పడంతో.. కంచన్ ముఖర్జీ బ్యాంక్ అకౌంట్లో నుంచి రూ. లక్షా 40 వేలు కాజేశారు సైబర్ నేరగాడు. దీనిపై బాధితురాలు గురువారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఓ వైపు రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతుండడంతో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అపరిచిత కాల్స్, ఈజీ మనీ, గిఫ్ట్‌ల పేరిట ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. -
అదనపు కట్నం తేలేదని.. భార్యకు తెలియకుండా..
సాక్షి, జ్యోతినగర్(కరీంనగర్): వేద మంత్రాల మధ్య తాళికట్టి జీవితాంతం తోడుంటానని వివాహం చేసుకుని ఆమెకు తెలియకుండానే మరో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడిని ఎన్టీపీసీ పోలీసులు అరెస్టుచేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీకి చెందిన నవ్యతను మహదేవపూర్ మండల అన్నారం గ్రామానికి చెందిన మేదరి శేఖర్ 2018లో వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండడంతో నవ్యత పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో శేఖర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమేరకు బాధితురాలు నవ్యత ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో విచారణ అనంతరం శేఖర్‌ను అరెస్టు చేసి గోదావరిఖని కోర్టులో హాజరు పరిచినట్లు ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. -
దారుణం: ప్రేమ పేరుతో మైనర్ బాలికపై 9 నెలలుగా..
సాక్షి, సంగెం(వరంగల్): మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన యుడికుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. చింతలపల్లికి చెందిన వేల్పుల రాకేష్ అదే గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికను గత 9 నెలలుగా ప్రేమిస్తున్నానని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు వివాహానికి నిరాకరించడంతో బాలిక, ఆమె తల్లిదండ్రులు గ్రామపంచాయతీ వద్దకు పిలిపించగా, రాకేష్ ఆయన సోదరులు రవి, అశోక్, తల్లి లచ్చమ్మ కులం పేరుతో దూషించారు. అనంతరం నిందితుడి ఇంటికి వెళ్లితే అక్కడా దూషించడమే కాకుండా బాలిక ఇంటిపై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాకేష్‌పై పోక్సో, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, పాటుగా సోదరులు, తల్లిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మామునూర్ ఏసీపీ నరేష్కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు. చదవండి: కొంపముంచిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. -
వాళ్లు నన్ను మోసం చేశారు: నటి షబానా అజ్మీ
ప్రస్తుతం లైవ్ షాపింగ్ కంటే ఆన్లైన్ షాపింగ్‌కే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. బాలీవుడ్ నటి షబానా అజ్మీకు ఇటువంటి అనుభవం ఎదురైంది. షబానా గురువారం నాడు ఆన్లైన్ డెలివరీ సంస్థ లిక్విడ్జ్ లివింగ్‌లో మద్యం కోనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తాన్ని ఆమె ముందే జమచేసింది కూడా. కాగా వాళ్లు చెప్పిన సమయం మించి పోతున్నా డెలివరీ రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. ఈ రకంగా మరెవరూ మోసపోకూడదని భావించి ఆ సంస్థ పేరు తెలుపుతూ తను లావాదేవీ జరిపిన ఫోటోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అందులో ఆమె.. "జాగ్రత్తగా ఉండండి, నన్ను వాళ్లు మోసం చేశారు. # లిక్విడ్జ్ లైవింగ్‌కు ముందే నేను డబ్బును చెల్లించాను, అనంతరం నేను పెట్టిన ఆర్డర్ రాకపోవడంతో కాల్ చేస్తుంటే ఎటువంటి సమాచారం లేదని’ తెలిపింది. అయితే, ఆమె ఎంత మొత్తంలో పంపిందనే విషయాన్నితెలపలేదు. గతంలో కూడా అక్షయ్ ఖన్నా, నర్గిస్ ఫఖ్రీ, కరణ్ సింగ్ గ్రోవర్తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఇటువంటి వాటిలో మోసపోయారు. BEWARE I have been cheated by them. #Living Liquidz I paid upfront and when the ordered item didnt turn up they stopped picking up my calls! I paid Account no.919171984427 IFSC- PYTM0123456 Name living liquidz Paytm payment bank — Azmi Shabana (@AzmiShabana) June 24, 2021 చదవండి: బిజీ అవుతున్న ప్రియమణి.. మరో లక్కీ ఛాన్స్ -
రెండెళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని కోరగా..
సాక్షి, రఘునాథపాలెం(ఖమ్మం): ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా వాడుకొని, తర్వాత పెళ్లికి నిరాకరించాడనే మనస్థాపంతో ఓ యువతి (17) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని జీకేబంజరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. యువతిని అదే గ్రామానికి చెందిన శరత్ రెండేళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేశాడని, లైంగికదాడికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే రూ.5 లక్షలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు. తల్లితండ్రులకు అంత కట్నం ఇచ్చుకునే స్థోమత లేక పోవడంతో యువతి పురుగుల మందు తాగిందని, ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనను మరుగున పడేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై రఘునాథపాలెం ఎస్ఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: దారుణం: ప్రేమించిన యువతి దక్కలేదని.. -
పుట్టింటికని వెళ్లి మరో వ్యక్తిని పెళ్లాడింది.. ఏకంగా 19 మందిని
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తికి అతడి భార్య ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవాలంటే మరో పుష్కర కాలం పట్టేలా ఉంది. ఇంతకు అతగాడి భార్య ఏ చేసిందో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.. ఇన్నర్ మంగోలియాలోని బయన్నూర్‌కు ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల బలవంతం మీద కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. విశేషం ఏంటంటే 148,000 యువాన్లు (రూ.16.9 లక్షలు) ఎదురు కట్నం చెల్లించి మరీ అతడికి వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అయితే భార్య ఇంట్లో ఏవో సమస్యలు ఉండటంతో పెళ్లైన వెంటనే వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోలేదు. ఇక ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. పెళ్లైన కొద్ది రోజులకు సదరు వ్యక్తి భార్య.. మా అమ్మనాన్నలను చూడాలని ఉంది.. ఓ సారి నా పుట్టింటికి వెళ్లి వస్తాను అని కోరింది. దానికతడు అంగీకరించడంతో ఊరికి వెళ్లింది. ఇదిలా ఉండగా భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒక్కడికే బోర్ కొట్టడంతో సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ టైం పాస్ చేయసాగాడు. ఈ క్రమంలో ఓ పెళ్లి వీడియో అతడి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో పెళ్లి కుమార్తె చాలా అందంగా ఇంకా చెప్పాలంటే.. అచ్చు తన భార్యలాగే ఉంది. కాసేపు వీడియోను పరిశీలించి చూసిన అతడికి ఒక్కసారిగా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఎందుకంటే దానిలో ఉంది తన భార్యే .. డౌట్ లేదు. దాంతో వెంటనే భార్యకు కాల్ చేశాడు. ఎలాంటి స్పందన లేదు.. ఆ తర్వాత అత్తమామకు కాల్ చేస్తే వారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆమె నివసిస్తున్న గ్రామానికి చేరుకుని విచారించగా.. అతడి గాడి భార్య తాజాగా మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. వేరే దారి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి భార్య అతడినే కాక మరో 19 మంది వ్యక్తులను ఇలానే పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు తెలిసింది. ఆమె మోసం చేసిన బాధితుల్లో ఎక్కువ మంది గ్రామాల్లో నివసించేవారే. పైగా వారంతా వయస్సు ముదిరిన మగాళ్లు. త్వరగా పెళ్లి చేసుకోవాలని తొందరపడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఆమె ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఆమె సుమారు 2 మిలియన్ యువాన్లు (రూ.2.28 కోట్లు) మోసం చేసినట్లు పేర్కొన్నారు. అదే ప్రావీన్స్‌కు చెందిన దావా అనే మహిళ కూడా ఆగస్టు 2019 నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతుందన్నారు. దావా సాయంతోనే ఈ మహిళ కూడా పురుషులను మోసాలు చేస్తొందన్నారు. మొత్తానికి పోలీసులు ఈ కేసులో ఇద్దరు మహిళలను, వారి బంధువులుగా నటించిన ఇద్దరు వ్యక్తులతో పాటు వీరికి పెళ్లి సంబంధాలు కుదిర్చన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెళ్లి చేయమంటే ఆగమన్నారు.. అందుకే ఇలా -
ప్రియుడి మోసం.. వెరైటీగా పగ తీర్చుకున్న గర్ల్‌ఫ్రెండ్
సాధారణంగా లవ్‌లో అమ్మాయిలు మోసం చేస్తే.. అబ్బాయిలు అస్సలు కామ్‌గా ఉండరు. తన మాజీ ప్రియురాలి గురించి అడ్డమైన చెత్తంతా ప్రచారం చేసి.. వారి పరువు తీసి సంతోషిస్తారు కొందరు. మరి కొందరు ఏకంగా ప్రియురాలి ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడరు. అదే అమ్మాయి ప్రియుడి చేతిలో మోసపోతే.. ఎవరికి చెప్పుకోలేదు. తనలో తానే బాధపడుతుంది. ఏం చేయలేక మౌనంగా రోదిస్తుంది. అయితే అందరు అమ్మాయిలు ఇలానే ఉంటారు అనుకుంటే పొరపాటు. కొందరు తమను మోసం చేసిన వాడిని జైలుకు లాగుతారు. మరికొందరు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ తరహా వార్తనే. మోసం చేసిన ప్రియుడికి ఓ మహిళ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అతడిని జైలుకు పంపడంతోనే ఆగిపోలేదు. ఏకంగా అతడు చనిపోయినట్లు ప్రచారం చేసి.. అంత్యక్రియలు కూడా నిర్వహించింది. సదరు మహిళ చేసిన పనికి నెటిజనులు అభినందిస్తున్నారు. ఆ వివరాలు.. థేయా లోవరిడ్జ్ అనే మహిళ, ఓ వ్యక్తిని మూడేళ్లుగా ప్రేమిస్తుంది. వివాహం కానప్పటికి ఇద్దరు కలిసే ఉంటున్నారు. మొదట బాగానే ఉన్న థేయా బాయ్‌ఫ్రెండ్ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు మరో మహిళను ప్రేమించాడు. దీని గురించి థేయాకు తెలియకుండా.. కొత్త ప్రియురాలితో కలిసి ఏంజాయ్ చేయసాగాడు. అయితే తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేసి.. వేరే యువతితో తిరుగుతున్నాడని.. థేయాకు తెలిసింది. ఈ మోసాన్ని తట్టుకోలేకపోయింది. తనని మోసం చేసినందుకు ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఓ మంచి ప్లాన్ సిద్ధం చేసుకుంది. తన ప్రియుడి చెల్లెలని కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆ యువతి కూడా అంగీకరించింది. ఈ క్రమంలో థేయా మొదట తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపింది. ఇక ఈ విషయాలు ఏవి తెలియని థేయా మాజీ ప్రియుడి కొత్త లవర్, అతడి మొబైల్‌కు అనేక సార్లు కాల్ చేసింది.. మెసేజ్‌లు పంపంది. కానీ ఎలాంటి రిప్లై రాలేదు. కొద్ది రోజుల పాటు ఆమెను ఇలా కంగారు పెట్టిన థేయా ఓ రోజు బాంబ్ పేల్చింది. ‘‘మీ బాయ్‌ఫ్రెండ్ చనిపోయాడు. ఈ రోజు అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం’’ అని మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి మెసేజ్ చేసింది. ఆమెను నమ్మించడం కోసం ఉత్తుత్తి అంత్యక్రియలు నిర్వహించింది థేయా. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది. తన మాజీ ప్రియుడి కొత్త లవర్‌కి అతడు జైలులో ఉన్నట్లు ఇప్పటికి తెలియదు. ఆమె ఇంకా అతడు చనిపోయాడనే భావిస్తుంది. ప్రతి ఏటా అతడి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పిస్తుందని తెలిపింది థేయా. తనను మోసి చేసినందుకు అతడికి ఇలా జరగాల్సిందే అంటుంది. ఇక ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చదివిన నెటిజనులు థేయాను అభినందిస్తున్నారు. మోసం చేసిన వాడిని ఊరికే వదిలిపెట్టకుండా తగిన బుద్ది చెప్పారు. మీరు చాలా మంది ఆడవారికి ఆదర్శం అని కామెంట్ చేస్తుండగా.. కొందరు మాత్రం మీ మాజీ ప్రియుడి కొత్త గర్ల్ ఫ్రెండ్ అతడు చనిపోయాడని నమ్ముతుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంటే.. భవిష్యత్తులో చచ్చిపోయాడని భావించిన ఆమె లవర్ కళ్ల ముందు ప్రత్యక్షం అయితే ఆ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: నోముల ఆడియో దుమారం -
దెయ్యం వదిలిస్తానంటూ.. రూ. 73 లక్షలు స్వాహా
కువైట్: మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా.. మూఢనమ్మకాలను మాత్రం జయించలేకపోతున్నాడు. శాస్త్రం కంటే మంత్రతంత్రాల మీదే నమ్మకం ఎక్కువ చాలా మందికి. అందుకే మన దగ్గర శాస్త్రవేత్తల కన్నా బాబాలు, స్వామీజీలకు ఆదరణ, గుర్తింపు ఎక్కువ. శాంతి చేస్తాం.. దెయ్యాలను వదిలిస్తామంటూ జనాల దగ్గర డబ్బులు గుంజే వారికి కొదవే లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దెయ్యం వదిలిస్తామంటూ ఏకంగా 73 లక్షల రూపాయలు స్వాహా చేశాడో వ్యక్తి. ఈ ఘటన కువైట్‌లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కైరో రిపోర్ట్స్ ప్రకారం ఓ మహిళ తన ఒంట్లో దెయ్యం ప్రవేశించిందని.. అది తనను కంట్రోల్ చేస్తుందని దాని వల్ల ఏం చేస్తున్నానో తనకే తెలియకుండా పోతుందంటూ స్నేహితురాళ్ల దగ్గర చెప్పుకుని బాధపడింది. దాంతో ఆమె స్నేహితులు తమకు ఓ తాంత్రికుడు తెలుసని.. దెయ్యాలు వదిలించడంలో అతడు ఎక్స్పర్ట్ అని చెప్పి.. సదరు మహిళను అతడి దగ్గరకు తీసుకెళ్తారు. తాంత్రికుడు దెయ్యం వదిలిస్తానని దానికి బాగా ఖర్చవుతుందని వారికి తెలుపుతాడు. ఈ క్రమంలో మహిళ తొలత 4 వేల దినార్లు అతడి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాంతో అతడు దెయ్యం వదిలించే కార్యక్రమం ప్రారంభిస్తాడు. ఏవోవే పూజలు చేసి.. దెయ్యాన్ని పారదోలానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మరో 26 వేల దినార్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం 30 వేల దినార్లు(73 లక్షల రూపాయలు) స్వాహా చేశాడు. ఆ తర్వాత కూడా మహిళకు తన ఆరోగ్యంలో పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహిస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితురాళ్లు, సదరు మాంత్రికుడి మీద ఫిర్యాదు చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఆ దెయ్యం బొమ్మ తిరిగి వచ్చేసిందా? -
దొంగ ఓటు వేసిన తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న
-
‘చరణ్‌తో మీ బిడ్డ పెళ్లి చేయకపోతే ప్రాణ నష్టం’
సాక్షి, చిత్తూరు: మదనపల్లె లాంటి సంఘటనలు చూస్తే.. సాంకేతికత మీద మూఢనమ్మకాలదే గెలుపు అనిపిస్తుంది. మనలోని భయం మన చేత అలా చేయిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని దొంగ స్వామీజీలు, బాబాలు జనాలను మోసం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన చిత్తూరు బి కొత్తకోటలో చోటు చేసుకుంది. పూజల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తి తన అనుచరుడు చరణ్‌తో కలసి దందాలకు పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో వెంకట్ రెడ్డి కన్ను స్థానికంగా ఉన్న కృష్ణా రెడ్డి కుటుంబం మీద పడింది. (చదవండి: బంగారు తల్లులను చంపేసుకున్నాం.. సారీ డాడీ!) ఈ క్రమంలో ‘‘మీ బిడ్డను ఫలానా వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాలి. లేకుంటే కుటుంబంలో ప్రాణ నష్టం తప్పదు’’ అని వెంకట్ రెడ్డి.. కృష్టా రెడ్డిని బెదిరించాడు. అతడి మాటలతో బెంబెలేత్తిన కృష్టా రెడ్డి మెడిసిన్ చేస్తోన్న తన కుమార్తెని వెంకటరెడ్డి అనుచరుడు చరణ్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇక పెళ్లైన కొద్ది రోజులకే చరణ్ భార్యను చిత్ర హింసలకు గురిచేయడం ప్రారంభించాడు. మోసపోయామని తెలిసి కృష్టా రెడ్డి కుటుంబం పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
కాకినాడ రూరల్: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్‌కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సర్పవరం సీఐ గోవిందరాజు ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలోని గంగరాజునగర్ రోడ్డు నంబరు 7కు చెందిన చలగళ్ళ నాగప్రసాద్‌ను ఫోన్లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి చీటింగ్ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఒక వీడియోలో రూ.2వేల నోట్లతో కూడిన అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించి, ఆ తరువాత ఫోన్ ద్వారా రూ.2వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, రూ.500 నోట్లు తమకు కావాలని నమ్మబలికారు. ఇందుకుగాను రూ.90 లక్షల రూ.5 వందల నోట్లకు రూ.కోటి (2వేల నోట్లు) అందిస్తామని నమ్మించారు. సోమవారం సాయంత్రం నాగమల్లిజంక్షన్ వద్దకు రావాలని కోరడంతో అనుమానం వచ్చిన నాగప్రసాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం మేరకు మాటు వేసిన పోలీసులు విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీకి చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, విశాఖపట్నం పెద్దజాలరిపేటకు చెందిన తాటికాయల రాజా రవిశేఖర్, విశాఖపట్నం మల్కాపురానికి చెందిన కామాక నరసింగరావు, విశాఖపట్నానికి చెందిన కోడి కొండబాబు, కాకినాడ కర్ణంగారి జంక్షన్‌కు చెందిన నిడదవోలు సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎస్సై ఎం.నాగేశ్వరరావు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం, పసుపు కొమ్ము కట్టి...
సాక్షి,హైదరాబాద్: నగరంలోని చంపాపేట్ లో ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన చేటుచేసుకుంది. పవన్ అనే వ్యక్తి కర్మాన్ ఘాట్‌కు చెందిన సమీప బంధువుని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పవన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2017లో పెళ్లి పేరుతో బెంగళూరులో యువతి మెడలో పవన్ పసుపు కొమ్ము కట్టాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ పవన్ నాటకమాడాడు. దీంతో బాధితురాలు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు కేసు నమోదు చేసిన పోలీసులు పవన్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం -
పచ్చనేతల.. ప్రలోభాలు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మద్యం, నగదు విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది వార్డుల్లో తిరుగుతూ ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ అభ్యర్థుల తరఫున మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి నారాయణకు చెందిన విద్యాసంస్థల సిబ్బంది, పార్టీ నాయకులు నగదు పంచుతుండగా ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు, పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట చిన్నబాలయ్యనగర్లో ఆదివారం నారాయణ విద్యాసంస్థలకు సంబంధించిన కె.రమేష్‌బాబు, భాస్కర్, మల్లేష్, నరసింహారావు, పుండరీకాక్షయ్యలు ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి దామోదర్, నవాబుపేట ఇన్స్పెక్టర్ కట్టా శ్రీనివాసులు, ఎస్సై వీరప్రతాప్‌లు తమ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నారాయణకు సంబంధించిన కరపత్రాలు, ఓటరు స్లిప్పులు, రూ.2.74 లక్షల నగదును స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నగదు పట్టుకున్న విషయంపై సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నేతలు స్టేషన్‌కు చేరుకుని తమ వారిని వదిలిపెట్టాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం మీడియాకు తెలియడంతో కనీసం తమవారిని మీడియాలో రాకుండా చూడాలని కోరారు. దీంతో అధికారులు వారిని మీడియా కంటపడకుండా లోపల కూర్చోబెట్టారు. మరో రెండుచోట్ల.. నెల్లూరులోని రంగనాయకులపేట రైలువీధిలో ఆదివారం రాత్రి జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన టీడీపీ నాయకులు ఎస్కే లుక్మాన్ తన అనుచరులతో కలిసి ఓటర్లకు నగదు పంపిణీ చేయసాగాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.10 వేల నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు తన అనుచరులతో కలిసి ఆదివారం ఎన్టీఆర్ నగర్లో ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్లయింగ్‌స్క్వాడ్ ఇన్చార్జి జీబీపీ ప్రవీణ తన సిబ్బందితో కలిసి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వర్లు నుంచి రూ.36 వేల నగదు, తెలుగుదేశం పార్టీ కరపత్రాలు, ఓటరు స్లిప్పులను వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర్లును బాలాజీనగర్ పోలీసులకు అప్పగించారు. మద్యం తరలిస్తుండగా.. సంగం: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం తరలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శనివారం అర్ధరాత్రి రెండు చోట్ల పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. సంగం మండలంలోని పడమటి అరవపాళెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పర్వతాల వెంకటరత్నం, తాండ్ర రాము, పర్వతాల అశోక్‌లతోపాటు మరికొందరు శనివారం అర్ధరాత్రి మండల కేంద్రమైన సంగంకు వచ్చారు. అక్కడ ఓ బ్రాందీలో 1,959 క్వార్టర్ మద్యం బాటిళ్లను బస్తాల్లో కట్టుకుని ట్రక్కు ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో సంగం ఎస్సై గోపాల్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులను చూసి కొందరు పారిపోగా వెంకటరత్నం, రాము, అశోక్‌లను అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారికి సంబంధించిన 11 మోటార్‌బైక్‌లను, ట్రక్కు ఆటోను స్టేషన్‌కు తరలించారు. అలాగే మండలంలోని పడమటిపాళెం, పల్లిపాళెంలో రెండు బైక్‌లపై మద్యం తరలిస్తున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పఠాన్, షేక్ రసూల్, ఫయాజ్ బాషా, తమలపాకుల ప్రశాంత్, పర్సుబోయిన పెంచలప్రసాద్, ప్రసాద్‌లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 154 క్వార్టర్ బాటిళ్లను, రెండు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు మాఫీకి విఫలయత్నాలు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకులు భారీ ఎత్తున మద్యం తరలిస్తూ పట్టుబడడంతో ఆ పార్టీ మండల నాయకులు ఆదివారం పోలీసు స్టేషన్‌కు పరుగులు తీశారు. వారిని వదిలేయాలంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు చేశారు. కేసు నమోదు చేశామని బుచ్చిరెడ్డిపాళెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్‌బాబు, ఎస్సై గోపాల్ వారికి చెప్పారు. ఎలాగైనా కేసు లేకుండా చూడాలని కొందరు నాయకులు మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. అయితే పోలీసులు వారి పట్టించుకోలేదు. ఈ దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రమేష్, సిబ్బంది రవీంద్రబాబు, శంకరయ్య, హరిబాబు, ఎస్సై గోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేష్‌బాబు సంగం వచ్చి మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులను అభినందించారు. టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. గూడూరులో 371 బాటిళ్ల స్వాధీనం గూడూరు రూరల్: రూరల్ మండలంలోని చెంబడిపాళెం గ్రామంలో ఓటర్లకు పంచేందుకు టీడీపీకి చెందిన కట్టా శివయ్య అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 371 మద్యం బాటిళ్లను ఆదివారం గూడూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూరల్ ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బోగోలు మండలంలో భారీగా మద్యం పంపిణీ బిట్రగుంట: బోగోలు మండలంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐదురోజుల నుంచి గ్రామాలకు పెద్దఎత్తున చీప్‌లిక్కర్ తరలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోలీసులు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నా తరలింపు మాత్రం ఆగడం లేదు. దగదర్తి మండలం ఉలవపాళ్లలోని ఒక మద్యం దుకాణం, బోగోలులోని మరో మద్యం దుకాణం, ఇస్కపల్లిలోని మద్యం దుకాణాల ద్వారా గ్రామాలకు భారీ స్థాయిలో మద్యం చేరవేస్తున్నారు. బోగోలులోని టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి స్లిప్పులు రాసిస్తే ఆయా దుకాణాల్లో మద్యం కేసులు అందజేస్తున్నారు. కేసుల కొద్దీ మద్యాన్ని గ్రామాలకు తరలించడంతోపాటు ఓటర్లకు నేరుగా మద్యం స్లిప్పులు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో మూడురోజులు మాత్రమే గడువుండటంతో ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న ఈ చౌకబారు పనులపై మహిళలు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులు భారీ స్థాయిలో మద్యం పంపిణీ చేస్తున్నా పోలీసులు, ఎన్నికల నిఘా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. మర్రిపాడులో రూ.10 లక్షల పట్టివేత మర్రిపాడు: మండలంలో టీడీపీ నాయకులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.10 లక్షల నగదును ఆదివారం ఫ్లయింగ్‌స్క్వా డ్ అధికారులు, మర్రిపాడు పోలీసులు పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు.. కంపసముద్రం గ్రామంలో టీడీపీ నేత మల్లు రమణారెడ్డి ఇంట్లో రూ.10 లక్షలు నగదు నిల్వ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో కలిసి నాయకుడి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. నగదుకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదును ఉంచినట్లు చెబుతున్నారు. నగదును ట్రెజరీలో జమ చేస్తామని మర్రిపాడు ఎస్సై కొండపనాయుడు పేర్కొన్నారు. కాగా మండలంలో రెండురోజుల నుంచి టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, నగదు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో కాలనీకి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారు. -
మత్స్యకారులకు బాబు.. మోసం..
చంద్రబాబు మోసానికి.. దగాకు బ్రాండ్ అంబాసిడర్. గత ఎన్నికలకు ముందు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను ఐదేళ్లుగా వంచించారు. ఏటా వేట విరామ సమయంలో రూ.4 వేల జీవన భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు విధివిధానాల ఖరారు పేరుతో తొలి ఏడాది కాలక్షేపం చేశారు. ఆ తర్వాత రెండేళ్లు లబ్ధిదారుల ఎంపికలో అనేక కొర్రీలు పెట్టి.. అరకొర మందినే ఎంపిక చేశారు. వారికి కూడా భృతి ఇవ్వలేదు. గత రెండేళ్లుగా అసలు ఎంపికలు, భృతి చెల్లింపులే లేవు. తాజాగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో మత్స్యకారులకు ప్రకటించిన ప్రణాళికనే కాపీ కొట్టి చంద్రబాబు మరో సారి మోసపూరిత హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ ఐదేళ్లుగా చంద్రబాబు మోసానికి గురైన మత్స్యకారులు ‘నిన్ను నమ్మం బాబూ’ అంటున్నారు. వాకాడు: అలల సాగరంలో పోరాడి గాలించి చేపలు పట్టడమే మత్స్యకారుల యాంత్రిక జీవనం. వేటే జీవనాధారమైన మత్స్యకారులు ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ తీరు కారణంగా పట్టెడు మెతుకులకు గంగపుత్రులు అలల్లాడుతున్నారు. ప్రాణాను పణంగా పెట్టి బతుకుదెరువు కోసం నిత్యం కడలిపై సమరం చేస్తున్నారు. ఒకప్పుడు గంగపుత్రులంటే.. లక్ష్మీపుత్రులుగా పేరుండేది. కొన్నేళ్లుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల నేపథ్యంతో పాటు, తీరప్రాంతంలో విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాల్లోకి విడుదల చేయడంతో తీరం వెంబడి జల కాలుష్యం పెరిగిపోయింది. వీటి ప్రభావంగా మత్స్య సంపద మనుగడకు ప్రమాదంగా మారింది. ఇది అంతిమంగా మత్స్యకారుల బతుకుదెరువుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రంలో ఆటుపోటులు, అల్పపీడనాలు, వాయిగుండాలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు, మత్స్య సంపద పునరుత్పత్తి వంటి కారణాలతో చేపల వేట రోజులు తగ్గిపోయాయి. అన్ని పరిస్థితులు బాగున్నా.. నానాటికి తగ్గిపోతున్న మత్స్య సంపద తగ్గిపోవడంతో రోజంతా గాలించినా.. చేపలు చేతికి చిక్కని పరిస్థితులు నెలకొంటున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం లేక మత్స్యకారులు ప్రత్యామ్నాయంగా కూలి పనులు వెతుక్కుంటున్నారు. ఒకప్పుడు సముద్రంలో వేట తప్ప వేరే పని లేని మత్స్యకారులు ఇప్పుడు రైతు కూలీలుగా, బేల్దారీ పనులకు కూలీలుగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఏ పని చేతకాక సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. చంద్రబాబు మోసం ఇలా.. మత్స్య సంపద పునరుత్పత్తి కాలంగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు వేట విరామాన్ని అమలు పరుస్తున్నారు. గతంలో ఈ సమయంలో అదనంగా బియ్యం మాత్రమే ఇచ్చేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో వేట విరామ సమయంలో రూ.2 వేల ఇచ్చేవారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు అంతే మొత్తాన్ని ఇచ్చేవారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి వేట విరామ సమయలో రూ.4 వేల జీవన భృతి ఇస్తామని ప్రకటించారు. దీన్నే కాపీ కొట్టిన చంద్రబాబు తాను కూడా అంతే మొత్తం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. జిల్లాలో 13 సముద్ర ముఖద్వారాల నుంచి వేట సాగించే కుటుంబాలు 1.25 లక్షలు ఉన్నాయి. వీరందరికి రూ.4 వేల వంతున ఏటా జీవన భృతి ఇవ్వాల్సి ఉంది. అయితే చంద్రబాబు సీఎం అయిన తొలి ఏడాది విధివిధానాల పేరుతో కాలక్షేపం చేశారు. 2015, 2016 సంవత్సరాల్లో లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు పెట్టి ఆఖరికి 70 వేల మందిని ఎంపిక చేశారు. వీరికి కూడా అరకొర మందికే వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాలేదని మత్స్యశాఖ అధికారుల చుట్టూ తిరుగుతుంటే.. ఇదిగో అదిగో అంటూ చెబుతున్నారు. చివరిగా 2017, 2018 సంవత్సరాల్లో అసలు లబ్ధిదారుల ఎంపిక చేసినా.. జీవన భృతి నిధులు కేటాయించనే లేదు. తాజాగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొట్టి వేట విరామ సమయంలో రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చి ఆ తర్వాత మోసం చేసే నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో హామీతో మత్స్యకారులకు లబ్ధి కావలి నుంచి తడ వరకు 12 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. కావలి, అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, చిల్లకూరు, వాకాడు, కోట, సూళ్లూరుపేట, తడ మండలాలు ఉన్నాయి. అందులో 113 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 సముద్రపు ముఖ ద్వారాల నుంచి సముద్రంపై వేట చేసే మత్స్యకారులు 1.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వేట విరామం భృతిని మత్స్యకారులకు అందజేయడంలో వివిధ ఆంక్షలు, కొర్రీలు పెడుతుందని వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లాలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల జీవితాల్లో మంచి మార్పు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఏటా వేట విరామ సమయంలో రూ.10 వేల జీవన భృతి కల్పిస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. బోట్లు లేని వారికి కొత్త బోట్లు, ఫ్రీ రిజిస్ట్రేషన్, మత్స్యకార కార్పొరేషన్ వంటివి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేట సాగించే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. -
మంత్రి నారాయణ ఒక స్వార్థపరుడు
‘మంత్రి నారాయణ ఒక స్వార్థపరుడు. అతని స్వార్థం కోసం బంధువులను కూడా పావుగా వాడుకున్నాడు. మనిషిని ఎలా వాడుకోవాలో నారాయణకు వెన్నతో పెట్టిన విద్య. అతని వల్ల ఒక్కరు కూడా బాగుపడిన వారు లేరు. నారాయణను నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతాడు. అలాంటి వ్యక్తిని నమ్మి ఓటు వేస్తే ఓటర్లకు చుక్కలు చూపిస్తాడు’ అని నెల్లూరుసిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి నారాయణ గురించి ఆయన తోడల్లుడు బండి రామ్మోహన్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, నెల్లూరు: నారాయణ మెడికల్ కాలేజ్‌లో చాలా మంది అమ్మాయిలు అనుమానాస్పదస్థితిలో చనిపోవడానికి షాడో మంత్రే కారణం. ఈ విషయం నారాయణకు తెలుసో లేదో కానీ షాడో మంత్రి మెడికల్ కళాశాల్లో కీలక పదవిలో ఉన్నప్పుడే కొంత మంది అమ్మాయిలు చనిపోయారు. అతని వేధింపుల వల్లే చనిపోయారని అందరికీ తెల్సిందే. షాడో మంత్రి అకృత్యాలు, అన్యాయాలతో ఎంతమంది బలైనారో నాకు తెలుసు. నారాయణ లోగుట్టు షాడో మంత్రికి తెలుసు కాబట్టే అతడ్ని దూరంగా పెట్టడు. షాడో మంత్రి వల్లే నారాయణకు బంధువర్గం దూరమైంది. ఆ షాడో వల్లే మంత్రి నారాయణకు ఓటమి తప్పదు. 40 ఏళ్లలో నారాయణ వల్ల బాగుపడిన వారు ఒక్కరు కూడా లేరు మంత్రి నారాయణ స్వార్థపరుడు. 40 ఏళ్ల చరిత్రలో ఒక్కరికి కూడా సాయం చేసిన దాఖలాల్లేవు. రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్న మంత్రికి తన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పటికీ ఒక్కరికి కూడా సాయం చేసిన పాపాన పోలేదు. నారాయణ స్నేహితుల్లో చాలామంది పేదవారు ఉన్నారు. అలాంటి వారికి కూడా సాయం చేయని వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించిన వారికి ఏం న్యాయం చేస్తాడు? నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశానని మంత్రి నారాయణ చెబుతున్న దాంట్లో ఆయన స్వార్థం ఉంది. కేవలం ఎమ్మెల్యేగా పోటిచేసి గెలవాలనీ ఉద్దేశంతో నిధులు తెచ్చావు. నీవు మంత్రిగా పనిచేస్తే జిల్లా అంతా అభివృద్ధి చేయాలి కదా? నెల్లూరు నగరం వరకే ఎందుకు పరిమితం అయ్యావు? నీ సొంత నిధులతో ఎక్కడైనా అభివృద్ధి పనులు చేశావా? రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నావు. అంత అభివృద్ధి చేస్తే ఓటుకు రూ.5 వేలు వంతున ఇస్తానని ఎందుకు చెబుతున్నావు. వాస్తవంగా నీవు అభివృద్ధి చేసి ఉంటే నీకు ప్రజలే ఓట్లెయ్యాలి కదా. మంత్రి నారాయణ పుట్టుకతో కోటీశ్వరుడు కాదు. కష్టపడి చదువుకున్నాడు. ఆ చదువుతోనే వ్యాపారం చేసి 40 ఏళ్లలో రూ.40 వేల కోట్లు సంపాదించాడు. విద్య, వైద్యాన్ని అమ్మి ఏడాదికి రూ.1000 కోట్లు సంపాదిస్తాడు. ఇలా సంపాదన రావాలంటే ఎంత దోపిడీ చేయాలి. ఎంతమంది పేదలను పీల్చి పిప్పిచేశాడో నాకు బాగా తెలుసు. 25 ఏళ్లు అతని వెన్నంటే ఉన్నాను. విద్యాసంస్థల్లో ఎన్నెన్ని అక్రమాలు జరిగాయో నాకు తెలుసు. నిజాయితీగా ఎవరైనా రూ.వేలకోట్లు సంపాదిస్తారా? ఎన్నో అక్రమాలు చేశాడు కాబట్టే అన్ని వేల కోట్లు సంపాదించాడు. -
ఎన్నికల బరిలో ‘దేశం’ చీటర్స్
తెలుగుదేశం పార్టీ నేతలు సచ్ఛీలురని, తాను నిప్పు, నిజాయతీ పరుడనని చంద్రబాబు చెబుతుంటాడు. కానీ ఆయన తన పార్టీ తరఫున జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల బరిలో అవినీతి పరులు, మోసగాళ్లు, రౌడీయిజం చెలాయించే వాళ్లకే టికెట్లు ఇచ్చి నిలబెట్టారు. వీరిలో ప్రైవేట్ వ్యక్తుల భూముల కబ్జాలు, వెంచర్ల పేరుతో రూ.కోట్లు కాజేసి చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదైన ఒక అభ్యర్థి ఉండగా, ఇంకో అభ్యర్థిపై అవినీతి, అక్రమాలు, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మరో అభ్యర్థి అయితే రౌడీయిజం చెలాయిస్తూ వివాదాస్పదుడిగా చరిత్రకెక్కారు. మచ్చలేని, అవినీతి లేని నేతలకే టికెట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిసభలో ఊదరగొడుతున్నాడు. మరి ఈ నేతలకు టికెట్లు ఇవ్వడంపై ఆయన ఎంతటి నిప్పో అర్థమవుతోంది. సాక్షి, నెల్లూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి నేరచరితులు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రధానంగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపైనే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అధికార పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా, మిగతా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. అందరూ ఈ ఐదేళ్లు అనేక పథకాలు, పనుల పేరుతో కమీషన్లగా వందల రూ.కోట్లు దోచుకున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు చేసిన పనులు చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రలోభాలు, తాయిలాలపైనే అధారపడి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులపైకేసులు నమోదైనట్లు వారే ఆఫిడవిట్లో పేర్కొన్నారు. మరి కొంత మందిపై కేసుల నమోదు కాకపోయినా వివాదాస్పద వైఖరి, అడ్డగోలు వ్యవహరాలు మాత్రం లెక్కకు మించి ఉన్నాయి. జిల్లాలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి మళ్లీ టికెట్లు దక్కించుకున్న ఉదయగిరి, కోవూరు టీడీపీ అభ్యర్థులు బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై కేసులు లేనప్పటికి తరచూ వివాదాస్పద వైఖరి, కాంట్రాక్టర్లను బెదిరింపుల్లో నిత్యం హల్చల్ చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగిన అనేక మంది నేతలు వివాదాలు, భూదందాలతో నిన్నటి వరకు హడావుడి చేసిన వారే. అయితే అధికారం చేతిలో ఉండటంతో ఎన్ని అరాచకాలు చేసిన ఎక్కడా కేసులు నమోదు కాని పరిస్థితి. జిల్లాలో సీఎం చంద్రబాబు మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈక్రమంలో అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి వ్యవహార శైలిపైన చర్చ సాగుతోంది. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడుల్లా పదేపదే మచ్చలేని పాలన అందించే నేతలు అంటూ కొనియాడుతుంటారు కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రియల్ కేసుల్లో పోలంరెడ్డి కోవూరు టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థానికంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధి హోదాలో కాంట్రాక్ట్ వర్కులు నిర్వహిస్తూ అందినంత మేరకు గడిచిన ఐదేళ్లలో భారీగా దండుకున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ కేసులకు సంబంధించి వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఘట్కేసర్ మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పోలంరెడ్డిపై తెలంగాణ రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ, హబ్సిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నంబర్ 287/13 నమోదైంది. ఈ కేసు పోలంరెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీకి, కొనుగోలుదారులకు మధ్య ఉంది. నాంపల్లి అడిషనల్ చీఫ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్–463/14గా కేసు జరుగుతోంవది. సెక్షన్ 406, 420 కింద కేసులు ఉన్నాయి. కేసు నంబర్ 40/2015తో ఘట్కేసర్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించి సీసీ నంబర్ 396/16 ఎల్బీ నగర్ కోర్టులో సెక్షన్ 465 ,418, 420, 423, 663, 468 కింద కేసులు నమోదయ్యాయి. కేసు నంబర్ 457/2017తో ఘట్కేసర్లో నమోదైందని కేసు సీసీ నంబర్ 4075/18 కింద ఎల్బీ నగర్ కోర్టులో నడుస్తోంది. సెక్షన్ 120(బీ), 406, 464, 506, రెడ్‌విత్ 420 కింద నమోదైంది. బడా కాంట్రాక్టర్‌గా చీటింగ్ కేసుల్లో బొల్లినేని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో చీటింగ్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏసీబీ కేసు కూడా ఉండటం గమనార్హం. స్థానికంగా నేతలకు అందుబాటులో ఉండకపోవటంతో పాటు ఫైబర్ చెక్‌డ్యాంల్లో భారీగా అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పసుపు కుంభకోణంలోనూ ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీ నేతలపైనే కేసులు నమోదయ్యాయి తరచూ స్థానికంగా వివాదాస్పద వైఖరితోనే బొల్లినేని రాజకీయం చేస్తుంటారు. ప్రధానంగా రామారావుపై మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. బొల్లినిని రామారావు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు. ఇతనిపై ఎఫ్ఐఆర్ నంబర్ 0495/2017న ఉత్తరప్రదేశ్‌లోని లలిత్ పూర్ స్టేషన్లో సెక్షన్ ఐపీసీ 420, 406, 467, 468, 569, 471, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. నగదు చెల్లింపు వ్యవహారంలో కేసు నమోదు. లలిత్పూక్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్ 4895/2017తో కేసు కొనసాగుతోంది. లతిత్పూర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 0908/2017తో ఠానాలో కేసు నమోదైంది. ఇది కూడా లలిత్పూర్ కోర్టులో సెక్షన్ 120బీ, 420, 467, 468, 504, 471,406 తదితర సెక్షన్ల కింద నమోదై అయి విచారణ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నంబర్ 0203/2017తో కేసు నమోదైంది. పీసీ109, 120బీ, 420 తదితర సెక్షన్ల కింద, కరప్షన్ యాక్ట్ 13(1),సీ, 13(2)బి,డీ కింద ఏసీబీ కోర్టులో కేసు కొనసాగుతోంది. కురుగొండ్లది వివాదాస్పద వైఖరి కాంట్రాక్టర్లను బెదిరించడం, అధికారులపై మైక్‌లు విసిరి నానా గందరగోళం చేయడం పోలీసు ఉన్నతాధికారుల్ని టార్గెట్ చేసి దూషించడం ఇదంతా వెంకటగిరి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ వివాదాస్పద వైఖరి. నెల్లూరులో అద్దెక భవనాన్ని తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేయండా దౌర్జన్యంగా ఆక్రమించి, రౌడీయిజం చేసిన ఘటనలు ఉన్నాయి. అతను అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, పార్టీలో సీనియర్ నేతగా ఉండటంతో వివాదాలు జరిగి పోలీసు స్టేషన్ వరకు వ్యవహారాలు వెళ్లినా ఎక్కడా మాత్రం కేసులు నమోదు కాని పరిస్థితి. -
దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయల టోకరా!
సాక్షి, విజయవాడ : భూమి అమ్మకం పేరిట ఓ వ్యక్తి దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందని నమ్మ బలికి ట్రస్ట్‌ను మోసం చేసి కటకటాలపాలయ్యాడు. పలు కేసుల్లో నిందితుడైన కేసినేని రమేశ్ అలియాస్ నవీన్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు కాజేశాడు. ఈ పీఠానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు అందజేశారు. మోసాన్ని గ్రహించిన ట్రస్ట్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు పాత నేరస్థుడేనని గుర్తించారు. గతంలో అతనిపై అనేక ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు. -
ఉద్యోగం రావడంతో పెండ్లికినిరాకరించిన ప్రియుడు
నల్లగొండ క్రైం : ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ప్రియుడి ఇంటి ఎదుట దివ్యాంగురాలైన యువతి ఆదివారం ధర్నాకు దిగింది. వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని మెళ్లదుప్పలపల్లికి చెందిన దివ్యాంగ యువతి పాలడుగు ప్రేమలత అదే గ్రామానికి చెందిన పగడాల రమేష్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి దివ్యాంగురాలు కావడంతో త్వరగా ఉద్యోగం వస్తుందని భావించిన రమేష్ ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి ఆటంకం ఉండదని భావించి.. పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో శారీరకంగా ఒక్కటయ్యారు. దీంతో ప్రేమలత గర్భవతి అయ్యింది. ప్రేమలత కంటే ముందే రమేష్‌కు అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఆరు నెలలుగా నకిరేకల్ అగ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రేమలత రమేష్‌ను నిలదీసింది. నిన్నే విహహం చేసుకుంటానని నమ్మబలికి.. గర్భంతో ఉన్న ప్రేమలతకు టాబ్లెట్లు ఇచ్చి గర్భస్త్రావం చేయించాడు. ప్రస్తుతం వారం రోజులుగా ప్రేమలతతో రమేష్ సరిగా మాట్లాడకపోవడంతో బంధువులు ఇంటికి వెళ్లిన ప్రేమలత తిరిగి గ్రామానికి చేరుకుంది. అసలు ఏం జరిగిందని.. వాకబు చేయగా.. రమేష్ పెళ్లిసంబంధం విషయం తెలిసింది. దీంతో ప్రమలత జరిగిన విషయం పెద్దమనుషులకు చెప్పింది. గ్రామస్తులంతా ఆమెకు అండగా నిలిచారు. ప్రియుడి ఇంటిముందు టెంట్‌వేసి ధర్నాకు దిగారు. యువతి తల్లి పెద్దులమ్మతో కట్నం, కానుకల విషయమై మాట్లాడారు. రూ.15లక్షల విలువైన ఎకరం భూమితో పాటు మరో 4తులాల బంగారం పెడతామని గ్రామపెద్దలు యువతి తరుపున హామీ ఇచ్చినా అందుకు రమేష్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ప్రస్తుతం రమేష్ పరారీలో ఉన్నాడు. ఈ విషయమై గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువతి తల్లి పెద్దులమ్మ తన కూతురికు న్యాయం చేయాలని కోరుతోంది. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రాములు విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీచ్చినప్పటికీ యువతీతో పాటు గ్రామస్తులు ఆందోళన విరమించేందుకు నిరాకరించారు. ఫిర్యాదు ఇవ్వాలని కోరినప్పటికీ ప్రేమలత ఒప్పుకోలేదు. తనతో మూడేళ్లపాటు కలసిఉన్నాడని, గర్భస్త్రావానికి సంబంధించిన వైద్యుల చిట్టిని పోలీసులకు చూపించింది. -
ఏటీఎంలో ఘరానా మోసం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఏటీఎంల్లో మో సాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎంత ప్రచారం చేస్తున్నా ఖాతాదారులు మేల్కోవడం లేదు. మళ్లీ మళ్లీ మోసపోతునే ఉన్నా రు. తాజాగా గోపాలపట్నంలో మరో ఉదంతం వెలుగు చూసింది. బాజీజంక్షన్ ఎస్సీకాలనీకి చెందిన ఎం. నాగేశ్వరరావు డబ్బులు డ్రా చేసేందుకు ఓ ఏటీఎంకు వెళ్లారు. ఆయనకు కళ్లజోడు లేకపోవడంతో వెనక నిల్చున్న వ్యక్తిని సాయం కోరారు. పిన్ నంబర్ చెప్పి రూ.2వేలు డ్రా చేయాలంటూ ఏటీఎం కార్డు ఇచ్చారు. తిరిగి కార్డు తీసుకుని ఇంటికి వచ్చేశారు. మంగళవారం కూడా మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే పిన్ నంబర్ పని చేయలేదు. ఆరా తీస్తే ముందు రోజు సహకరించిన వ్యక్తి నుంచి తీసుకున్న ఏటీఎం కార్డు తనది కాదని తేలింది. దీంతో ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ రామ్కుమార్ని సంప్రదించారు. ఖాతా నంర్ ఆధారంగా నగదు వివరాలు పరిశీలిస్తే..నిందితుడు నగరంలోని మరో మూడు ఏటీఎంలలో తన కార్డుతో రూ.20వేలు, రూ.17వేలు, రూ.3వేలు చొప్పున మొత్తం రూ.40వేలు డ్రా చేసినట్టు తేలింది. వెంటనే నాగేశ్వరరావు ఖాతాను బ్లాక్ చేశారు. తన మనుమరాలి కోసం దాచిన పింఛను డబ్బులు ఇలా నష్టపోయానని నాగేశ్వరరావు ఎస్ఐ మహంతి శ్రీనివాస్‌కు ఫిర్యాదిచ్చారు. బాధితుడికి నిందితుడు ఇచ్చిన కార్డు కూడా మరొకరిదని తేలింది. ఆ ఏటీఎం కార్డుపై ఎన్.అప్పలనాయుడు అని ముద్రించి ఉంది. నిందితుడు ఘరానా మోసగాడే అయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. కాగా, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు సిబ్బంది సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తే అనుమానించాల్సిందేనని, పిన్, ఓటీపీ చెప్పి మోసం చేస్తున్న సంఘటనలపై జాగ్రత్తగా ఉండాలని రామ్‌కుమార్ స్పష్టం చేశారు. -
భర్త ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష
ప్రకాశం, చీరాల రూరల్: వెంట పడ్డాడు.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు.. ప్రేమించానన్నాడు.. చివరకు పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం ఆమెతో కాపురం చేశాడు. తీరా తల్లిదండ్రుల మాటలు విని ఇద్దరు బిడ్డలు కలిగిన అనంతరం ఆమెను వదిలేశాడు. పోలీసులైనా న్యాయం చేస్తారని స్టేషన్ మెట్లెక్కినా న్యాయం జరగలేదు. దీంతో ఆ అభాగ్యురాలు చేసేదేమీలేక దిక్కు తోచని స్థితిలో ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చీరాలలోని వైకుంఠపురంలో వెలుగుచూసింది. ఇదీ..జరిగింది వేటపాలేనికి చెందిన సయ్యద్ హమీద, చీరాలకు చెందిన గండి సాయి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సాయి ఆటో డ్రైవర్. ఇద్దరు పాపరాజు తోటలోని పోలేరమ్మ గుడి సమీపంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. కొంత కాలం కాపురం సక్రమంగానే సాగింది. ఈ క్రమంలో గతేడాది జూన్ 19న ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొంత కాలానికి అనారోగ్యానికి గురై బిడ్డ చనిపోయాడు. ప్రస్తుతం ఆమె రెండో నెల గర్భిణి. ఈ నెల 6వ తేదీ నుంచి భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. భర్త సాయి తల్లిదండ్రులు వైకుంఠపురంలోని మహాలక్ష్మమ్మ చెట్టు సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలుసుకున్న ఆమె.. వారి ఇంటికి వెళ్లి పరిశీలించింది. వారంతా అక్కడి నుంచి తమ స్వగ్రామం ఒంగోలు వెళ్లినట్లు ఆమెకు సమాచారం అందింది. ప్రస్తుతం ఆ ఇంట్లో సాయి అమ్మమ్మ మాత్రమే ఉంటోంది. ఏం చేయాలో పాలుపోని ఆమె ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. నీకు వివాహమైనట్లు ఆధారాలు చూపించాలని అక్కడ విధులు నిర్వర్తించే పోలీసులు ఆమె వద్ద ఫిర్యాదు స్వీకరించలేదు. పైపెచ్చు నీ భర్త తల్లిదండ్రులు నీమీద కేసు పెట్టే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో భయాందోళన చెందిన ఆమె.. స్టేషన్ నుంచి వెనుదిరిగింది. చేసేదేమిలేక ఆమె తన భర్త ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. గతంలోనే ఆమెకు వివాహమైంది.. హమీదాకు గతంలో రియాజ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఐదేళ్ల కరిష్మా, నాలుగేళ్ల నవాజ్ ఉన్నారు. దంపతుల మధ్య సఖ్యత లేకపోవడంతో పెద్దలు సమక్షంలో తెగతెంపులు చేసుకుని ఎవరికి వారు విడివిడిగా ఉంటున్నారు. పిల్లలు మాత్రం హమీద వద్దే ఉంటున్నారు. ఆ తర్వాత గండి సాయితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మొదటి భర్తకు చెందిన ఇద్దరు పిల్లలతో సహా పాపరాజు తోటలోని ఓ అద్దె గృహంలో ఉంటున్నారు. తన భర్తను అతని తల్లిదండ్రులే తీసుకెళ్లి దాచారని బాధితురాలు హమీదా కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని, తన పిల్లలను హాస్టల్లో చేర్చించి చదివించాలని ప్రతి ఒక్కరినీ వేడుకొంటోంది. భర్త ఇంటి ముందు మౌన దీక్షకు దిగిందన్న సమాచారం అందుకున్న ఒన్‌టౌన్ పోలీసులు బాధితురాలి వద్దకు చేరుకుని ఆమె వివరాలు సేకరిస్తున్నారు.