మాదాపూర్: ఉద్యోగలిస్తామని డబ్బు తీసుకొని నిరుద్యోగులను మోసం చేసిన ఓ వ్యక్తిని మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ నరేష్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొరపల్లి గ్రామానికి చెందిన కడవేరుగు మురళీమోహ¯ŒS 2015లో మాదాపూర్ సైబర్ టవర్స్‌లో ‘ఓవర్ టెక్నాలజీ’ పేరిట సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. నెల్లూరు జిల్లా ఎస్‌వీ అగ్రహారానికి చెందిన దోనేపర్తి వెంకటసుఖేష్ (27) నిజాంపేటలో ఉంటున్నాడు. ఇతను ఓవర్ టెక్నాలజీకి కన్సల్టెంట్‌గా వ్యవహరించేవాడు. బ్యాక్ డోర్ పద్ధతిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి సైబర్ టవర్స్‌లో ఉన్న ఆఫీస్‌కు తీసుకెళ్లి మేజింగ్ డైరెక్టర్ మురళీతో మాట్లాడించేవాడు.
ఈ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే రూ. లక్షా 20 వేలు నుంచి లక్షా 50 వేలు చెల్లించాలని చెప్పేవారు. నామమాత్రపు ఇంటర్వూలు నిర్వహించేవారు. ఇలా ఈ కేటుగాళ్లు దాదాపు సుమారు 80 మంది విద్యార్థులను ఉద్యోగంలో పెట్టుకొని డబ్బు దండుకున్నారు. తర్వాత జీతాలు చెల్లించకుండా కాలయాపన చేసి ఈ ఏడాది మే 21న కంపెనీని మూసి ఇద్దరూ పరారయ్యారు. గార్లపాటి అనిల్‌రెడ్డి అని బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో వెంకటసుఖేష్‌ను నిజాంపేటలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.