software company
-
గెలుపే లక్ష్యం.. అలుపెరగని పోరాటం
లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. సివిల్స్‌లో నిరాశ ఎదురైనా ఆగిపోలేదు. ఆత్మ విశ్వాసంతో తన గమ్యాన్ని, ప్రయాణాన్ని మార్చుకుని గ్రూప్–1 ఆఫీసర్‌గా(Group-1 Officer) అరవింద్(Arvind) ఎంపికయ్యారు. పంచాయతీ సెక్రటరీగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా(Software Engineer) పని చేసినా ఆ ఉద్యోగాలతో సంతృప్తి లేదు. జీవన సమరంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. లక్ష్మీపురం(గుంటూరు): కర్నూలుకు చెందిన కడారుకొండ ఓంకార్ సీనియర్ న్యాయవాది. ఆయన భార్య రేవతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు కె.సాయి తేజ డాక్టర్. రెండో కుమారుడు కె. అరవింద్ ప్రస్తుతం గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా(DSP) పని చేస్తున్నారు. భార్య సామా శ్వేత సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉన్నారు. వీరికి రణ్విత్ అనే కుమారుడు ఉన్నాడు. సివిల్స్‌లో అపజయం అరవింద్ 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈగల్ ఐజీగా ఉన్న ఆకే రవికృష్ణ కర్నూల్ ఎస్పీగా ఉండేవారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తరచూ కలిసేవారు. సివిల్ సర్వీసెస్‌కు కావాల్సిన మెళకువలు తెలుసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదు. సివిల్ సర్వీసెస్ అధికారి కావాలన్న అరవింద్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి సివిల్స్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నారు. 2016లో మెయిన్స్ వరకు వెళ్లి వెనుదిరిగారు. మరలా శిక్షణ కొనసాగతున్న సమయంలో 2016–17 హైదరాబాద్‌లో యాక్సెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగ అవకాశం దక్కింది. సివిల్స్ శిక్షణ పొందుతూనే కుటుంబానికి భారం కాకూడదని ఏడాదిన్నరపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన సామా శ్వేత అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2020 అక్టోబర్ 29న ఇద్దరు వివాహం చేసుకున్నారు. మరలా 2017లో గ్రూప్–1 పరీక్షలకు హాజరై మెయిన్స్ వరకు వెళ్లి అరవింద్ వెనుదిరిగారు. మరలా 2018, 2019, 2020లో సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్లి చివరి దశలో నెగ్గలేక పోయారు. అయితే, భార్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2020లో పూర్తిగా గ్రూప్–1కు శిక్షణ పొందడం ప్రారంభించారు. ఆ సమయంలో 2019–2022 వరకు కర్నూల్ నగరంలో పంచాయితీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 2018లో గ్రూప్– 1 మరలా రాశారు. 2022 జులైలో వచ్చిన ఫలితాల్లో గ్రూప్– 1 ఆఫీసర్‌గా అత్యధిక ఉత్తీర్ణతతో సాధించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డీఎస్పీగా శిక్షణ పొందారు. 2023 నవంబర్ నుంచి 2024 జూన్ వరకు వెస్ట్ గోదావరి భీమవరంలో ట్రైనీ డీఎస్పీగా పని చేశారు. 2024–2025 జనవరి వరకు వైజాగ్ గ్రే హౌండ్స్‌లో బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 20న లా అండ్ ఆర్డర్ విభాగంలో గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సివిల్ సర్వెంట్ కావాలని కలలు చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉండేది. సివిల్స్‌లో అపజయం ఎదురైనా నిరాశ చెందలేదు. తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో ప్రోత్సహించారు. వివాహం అయిన తరువాత నా భార్య శ్వేత కూడా ప్రోత్సహించేది. ఎన్నసార్లు పడినా, లేచి నిలబడగలగం అనే మనో ధైర్యం ఉండాలి. ఎలాగైనా సాధించి తీరాలన్న దృఢసంకల్పం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొగలం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి – అరవింద్ -
Devika Sharath Chandra: మొగుడే యముడు
-
Software Employee: భర్త శరత్ వేధింపులే కారణమని మృతురాలి బంధువుల ఆరోపణ
-
Hyderbad Software: వివాహం జరిగిన 6 నెలలకే..
-
రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఢిల్లీలో జీవితం ప్రారంభం..1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.అమెరికాకు తరలివెళ్లి..సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్లో కెరియర్ ప్రారంభించారు.కెరియర్లో ఒడిదొడుకులు1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్-సోవియట్ యూనియర్ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులుఇన్నోవా సొల్యూషన్స్ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. -
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్‌లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్‌లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్‌కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్‌పూర్‌లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్) -
మాదాపూర్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఐదో అంతస్తులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.ఆఫీస్‌లోని యూపీఎస్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించిందని ఫైర్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. సెలవు కావడంతో ఆఫీస్‌లో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేద. మంటలు చెలరేగడంతో మిగిలిన కార్యాలయాల్లోని సిబ్బంది కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్‌హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్‌తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్‌హౌస్‌లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్‌తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్‌తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్‌ను ఎంచుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్‌హౌస్‌లో ఉన్న స్పేస్‌కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్‌మెంట్స్‌లో ఇంటీరియర్‌కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్‌తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్‌హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
తలకాయ కట్ చేస్తా బిడ్డా..
బంజారాహిల్స్(హైదరాబాద్): యాప్ రూపకల్ప నలో భాగంగా ఓ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కోట్లాది రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్ట డమే కాకుండా అడగడానికి ఇంటికొచ్చిన సీఈఓను అంతుచూస్తానని బెదిరించిన ఘటనలో హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరాషేక్, ఆమె భర్త సమీర్‌ఖాన్ లపై బంజారాహిల్స్‌లో క్రిమినల్ కేసు నమో దెంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–12లోని ఎమ్మెల్యే కాల నీలో నివసించే నౌహీరా షేక్ వ్యాపారాల పేరుతో డబ్బులు వసూలు చేసి వేలాది మందికి కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. ఎవరెవరికి బకాయి ఉన్నారో, వారికి సంబంధించిన లెక్కలు తేల్చేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బెంగళూరుకు చెందిన వన్హెల్ప్ టెక్నాలజీ సీఈఓ మహ్మద్ అఖిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.2021–23లో వన్ హెల్ప్ టెక్నాలజీ ఈ యాప్ రూపకల్పనలో భాగంగా బకాయిదారులకు చెల్లించాల్సిన డబ్బు లతో వివరాలు రూపొందించింది. ఇందుకు గాను రూ.7.46 కోట్లు నౌహీరా షేక్ సదరు సంస్థ సీఈఓకు అఖిల్‌కు బాకీ పడింది. ఈ డబ్బులు తరచూ అడుగుతున్నా, ఆమె దాటవేస్తూ వచ్చింది. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడ తానని బెదిరించసాగింది. ఈ నెల 11వ తేదీన అఖిల్ నౌహీరాషేక్ ఇంటి కొచ్చాడు.తనకు బాకీ పడ్డ రూ.7.46 కోట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఆగ్రహంతో ఊగిపోయిన నౌహీరా షేక్ తలకాయ కట్ చేస్తా బిడ్డా..ఇక్కడే హత్య చేసి పాతిపెడతా..హైదరాబాద్ దాటి ఎలా వెళతావో చూస్తా అంటూ బెదిరించడమే కాకుండా ఆమె భర్త సమీర్‌ఖాన్ దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బయటకు గెంటించాడు. మా సంగతి మీకు తెలియదు.. నాకున్న కేసుల్లో ఇంకోటి చేరుతుంది అంతే..అంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపులన్నీ అఖిల్ వారికి తెలియకుండా రికార్డు చేసి బంజారాహిల్స్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నౌహీరాషేక్, ఆమె భర్తపై బీఎన్ఎస్ సెక్షన్ 351 (2)(3) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తగా 27.3 లక్షల టెక్ జాబ్స్.. సాఫ్ట్వేర్ కంపెనీ నివేదిక
ముంబై: వర్ధమాన సాంకేతికతల తోడ్పాటుతో కొత్తగా కోట్ల సంఖ్యలో కొలువులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2023లో 42.37 కోట్లుగా ఉన్న వర్కర్ల సంఖ్య 2028 నాటికి 45.76 కోట్లకు పెరగనుంది. వెరసి అయిదేళ్ల వ్యవధిలో వర్కర్ల సంఖ్య 3.38 కోట్ల స్థాయిలో వృద్ధి చెందనుంది. వినూత్న టెక్నాలజీల దన్నుతో కీలక రంగాల్లో కొత్తగా 27.3 లక్షల టెక్ కొలువులు రానున్నాయి.అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్‌నౌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక, సాంకేతిక పరివర్తన కారణంగా తయారీ రంగంలో 15 లక్షలు, విద్యారంగంలో 8.4 లక్షలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో 80 లక్షల మేర ఉద్యోగాలు పెరగనున్నాయి. అధునాతన నైపుణ్యాలు అవసరమయ్యే హై–వేల్యూ ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?జనరేటివ్ ఏఐ విభాగం పురోగమించే కొద్దీ ఏఐ సిస్టమ్స్ ఇంజినీర్లు, ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్లు, ప్లాట్‌ఫాం ఓనర్లకు గణనీయంగా ప్రయోజనం చేకూరనుంది. రిటైల్ ప్రొఫెషనల్స్ మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాలకు సంబంధించి తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. -
కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం..అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?
గతేడాది వరకు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. ఆరంకెల జీతం. ఉద్యోగ జీవితంలో క్లిష్టమైన సమస్యల్ని మేనేజ్ చేసిన నైపుణ్యం. 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయారు. తల్లి, సోదరుడి అండతో ఏ చీకూచింత లేని జీవితం. రూ.కోట్లలో బంగారం, కట్నం ఇచ్చి మరీ నగరంలోని ఓ చార్టర్డ్ అక్కౌంటెంట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. ఈ 8 మాసాల్లో ఏం జరిగిందో.. ఎంత క్షోభ అనుభవించిందో.. ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, సోదరుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతమ్మధార: నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన సత్యప్రియ(31) ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లీ, సోదరుడు ఇది ముమ్మాటికీ అత్తింటి వారు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ద్వారకా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు. సత్యప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించారు. అన్నయ్య అడబాల రామకృష్ణ హైదరాబాద్‌లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ హెడ్. వీరి సొంతూరు రాజమండ్రి. సత్యప్రియ బెంగళూరులోని డిలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. తర్వాత హైదరాబాద్‌కు మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన ఎల్లిశెట్టి కార్తికేయ(32)తో హైదరాబాద్‌లో ఘనంగా వివాహం జరిగింది. కార్తికేయ విశాఖలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని కృపా నిలయంలో ఉంటున్నారు. ఈ నెల 5న వీరు అరకు వెళ్లారు. సత్యప్రియ అక్కడి నుంచి తల్లి శ్రీవెంకటరమణకు వీడియోకాల్ చేసింది. ఐ మిస్ యూ అని చెప్పడంతో తల్లి కంగారు పడింది. వెంటనే ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. కానీ, కుమార్తె ఏమీ లేదని చెప్పిందట. బుధవారం భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు.గురువారం ఉదయం కార్తికేయ యథావిధిగా ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తల్లికి ఫోన్ చేసి తన బాధ వెల్లబోసుకుంది. సత్యప్రియ పిన్ని కుమార్తెకు వివాహం కుదిరిందని తల్లి చెప్పగా, చెల్లికి బాగా విచారణ చేశాకే మంచి సంబంధం ఖాయం చేయండని సలహా ఇచ్చింది. గురువారం భర్తకి వాట్సప్‌లో కార్టూన్ బొమ్మ పంపించి, మధ్యాహ్నం 12.30 సమయంలో ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. తిరిగి 2.30కు కాల్ చేయగా ఆమె నుంచి బదులు రాలేదు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని సత్యప్రియ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోడలు చనిపోయి ఉండటాన్ని చూసిన అత్త స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరి్పంచారు. కుమార్తె ఆత్మహత్య విషయమై అత్తింటివారు కాకుండా వేరే వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేయడం గమనార్హం. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సత్యప్రియ మామ సూర్యచంద్రరావు కోడలి తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. పోలీసులకు రాత్రి 10.20 కు ఫిర్యాదు చేయడం విశేషం. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోస్టుమార్టం శనివారం చేస్తారని సమాచారం. విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి నుంచి కారులో శుక్రవారం ఉదయం తల్లి, సోదరుడు విశాఖ చేరుకున్నారు. ద్వారకా స్టేషన్లో తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో రూ.4.5 కోట్ల విలువైన బంగారం, కట్నం ఇచ్చామని, పెళ్లికి మరో రూ.కోటి ఖర్చయిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మొదటి నుంచి అల్లుడు తల్లిదండ్రుల మాటలు విని, తన కుమార్తెను అనుమానంతో వేధించేవాడని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏసీపీ రాంబాబు పర్యవేక్షణలో ద్వారకా స్టేషన్ సీఐ బీవీ రమణ మృతు రాలి భర్త, అత్త, మామల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట టోకరా
గుంటూరు: సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ‘డెవలప్ ట్రీస్ డీఎస్ఆర్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ ఫేస్బుక్ ద్వారా ప్రచారం హోరెత్తించింది. భారీ వార్షికాదాయం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, బీమా ఇతరత్రా సౌకర్యాలు కలి్పస్తామని నిరుద్యోగులకు ఆ సంస్థ ఎర వేసింది. ఏపీ, తెలంగాణతోపాటు పాండిచ్చేరి, కన్యాకుమారి, బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర నిరుద్యోగులు ఆ ప్రకటనకు ఆకర్షితులయ్యారు.సుమారు 600 మంది రూ.లక్షల్లో డిపాజిట్ చెల్లించి ఉద్యోగాల్లో చేరారు. ఎవరికీ జీతాలు, పీఎఫ్ చెల్లింపులు లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు అమరావతి రోడ్డులో ఆ ప్రైవేట్ కంపెనీని 2021లో స్థాపించారు. ఫేస్బుక్ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించారు. దాదాపు 600 మంది చేరగా.. 100 నుంచి 150 మంది గుంటూరులోని కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. పొరుగు రాష్ట్రాల్లో వారు వర్క్‌ఫ్రమ్ హోం చేసే వారున్నారు. భారీగా వసూళ్లు ఆ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసింది. ఆ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి కష్టాలు మొదలయ్యాయి. జీతం అడిగితే ట్రైనింగ్ అంటూ దాటవేసేవారు. గట్టిగా అడిగితే బూతులు తిట్టేవారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడేవారు. 3 నెలల శిక్షణ అనంతరం నెలకు రూ.40 వేల జీతం, వార్షిక ఆదాయం రూ.6 లక్షలు చెల్లిస్తామని చెప్పేవారు. పురందేశ్వరి, పెమ్మసాని బంధువులంటూ.. తమకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిన్ని వరుస అని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బంధువని నిర్వాహకులు చెప్పుకునేవారు. పోలీస్ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, హైదరాబాద్‌లో ఓ రౌడీïÙటర్ పేరు కూడా చెప్పి బెదిరించేవారని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు గుంటూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని గుంటూరుకు చెందిన షేక్.రసూల్ తెలిపారు.తాము డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలవగా.. రాజోలు ఎమ్మెల్యేతో మాట్లాడించారని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యే గళ్లా మాధవికి విన్నవించామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశలేదని బాధితులు సీహెచ్.సాయి (విజయనగరం), జగదీ‹Ù, ఝాన్సీ (శ్రీకాకుళం), హేమంత్, మహేందర్ (తెలంగాణ) వాపోయారు. -
భాష లోకల్.. ర్యాగ్తో గ్లోబల్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి దాకా పోగేసింది రూ.లక్ష. దాన్ని రెట్టింపు చేయాలనుంది. మనసులోని ఈ మాటను ‘చాట్ జీపీటీ’కి చెప్పడమే ఆలస్యం.. రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకూ చేయగల బిజినెస్ ప్రోగ్రాం రెడీ చేసి పెడుతుంది. ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు గోండు భాషలో మాట్లాడితే.. అమెరికాలో ట్రంప్ విని అవలీలగా అర్థం చేసుకునేలా మారిపోతుంది. అమెరికా, ఆఫ్రికా వాళ్లు ఏ భాషలో మాట్లాడినా.. మనకు తెలుగులోనే వినిపిస్తుంది. మనం తెలుగులో మాట్లాడుతుంటే.. వాళ్లకు అర్థమయ్యే భాషలో వారికి వినిపిస్తుంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన, సృష్టించబోతున్న ఇలాంటి అద్భుతాలు ఎన్నో. ఏఐ సృష్టించే కొత్త భాషతో మారుమూల ప్రాంతాల్లోని వారి మనోగతంతో సహా విశ్లేషించే టెక్నికల్ టూల్‌ను చూడబోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్న ఆ టూల్.. ‘రిట్రైవల్–అగ్మెంటెడ్ జనరేషన్ (ర్యాగ్)’. ‘ర్యాగ్’ కోసం భారీ పెట్టుబడులు చాట్ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్‌పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే (632 బిలియన్ డాలర్లు) ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్ టూల్స్‌కు ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఏంటీ దీని ప్రత్యేకత? మన దేశంలోని మారుమూల పల్లెలో మాట్లాడే స్థానిక భాషను అమెరికా అధ్యక్షుడు కూడా అర్థం చేసుకునేలా చేయగల సత్తా ర్యాగ్ టూల్స్‌కు ఉంటుంది. కొన్ని వేల భాషలను, కోట్ల కొద్దీ పదాలను అత్యంత వేగంగా విశ్లేíÙంచగలవు. కృత్రిమ మేధలోని డీప్ లెరి్నంగ్ సాంకేతికతను ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి ఈ టూల్స్‌ను రూపొందించినట్టు నిపుణులు చెప్తున్నారు.ఉదాహరణకు కొన్ని పోలికలతో వధువు కావాలని జీపీటీలో సెర్చ్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా సరిపోయే వ్యక్తులు, వారి అలవాట్లు, వారి హావభావాలతో చిత్రాలను అందిస్తుంది. సీ, సీ ప్లస్ ప్లస్, డెవాబ్స్ వంటి అనేక కంప్యూటర్ కోడింగ్ భాషలున్నాయి. ర్యాగ్ టూల్స్ క్షణాల్లోనే ఆ భాషల్లో కోడింగ్స్ రాయగలవు. కాల్ సెంటర్లలో కొన్ని వేల మంది చేసే పనిని ఒక్క ర్యాగ్ టూల్‌తో సాధించవచ్చు. కంపెనీల ఆడిట్ రిపోర్టులు, అంతర్గత వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యాపార లింకులు వంటి పనులెన్నో ర్యాగ్తో ఇట్టే ముగించే వీలుంది. ఉపాధికి దెబ్బపడుతుందా? సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి ‘ర్యాగ్’ టూల్స్‌తో చాలెంజ్ అనే చెప్పాలని నిపుణులు అంటున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగాల నుంచి కోడింగ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా ఉపాధి తగ్గుతుందని.. కార్యాలయాల్లో పనిచేసే పద్దతులు మారిపోతాయని చెప్తున్నారు. ఎక్కడో ఉండి మరెక్కడో కంపెనీని నడిపే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని వివరిస్తున్నారు. పోటీ పడితేనే అవకాశాలు.. మన దేశంలో ఏటా 24 లక్షల మంది టెక్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వారిలో కేవలం 8 శాతం మందికే తగిన స్కిల్స్ ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు చెప్తున్నాయి. ఇక ముందు ర్యాగ్తో పోటీ పడి, అంతకన్నా మెరుగైన ఆలోచనతో పనిచేసే వారికే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఏఐతో పోటీపడే తెలివితేటలు ఉంటే తప్ప, కొత్తగా, భిన్నంగా ఆవిష్కరించే సత్తా ఉంటే తప్ప నిలదొక్కుకోవడం కష్టమేనని పేర్కొంటున్నాయి. ఏఐతో పోటీ పడితేనే రాణించగలం చాట్ జీపీటీ సహా ఏఐ ప్రయోగాలు ముందుకెళ్తున్న నేపథ్యంలో ‘ర్యాగ్’ సాంకేతికత మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. డీప్ లెరి్నంగ్‌లో భాగంగా దీనిపై విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఇక మీదట ఏఐతో పోటీపడి, క్రియేటివిటీని రుజువు చేసుకుంటేనే సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్ ‘ర్యాగ్’ కోసం భారీ పెట్టుబడులు చాట్ జీపీటీ వచి్చన తర్వాత కృత్రిమ మేధ టూల్స్‌పై అంతర్జాతీయ సంస్థలు అత్యంత ఆసక్తి చూపుతున్నాయి. ఐడీసీ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2028 నాటికి రూ.50లక్షల కోట్లకుపైనే ఖర్చుపెట్టనున్నాయి. మన భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలు దాదాపు రూ.20 వేల కోట్లకుపైనే ఏఐ టూల్స్ కోసం వెచి్చస్తున్నాయి. తక్కువ వనరులతో అత్యంత అద్భుతంగా పనిచేసే సామర్థ్యం ర్యాగ్ టూల్స్‌కు ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
బంజారాహిల్స్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరి స్రవంతినగర్‌లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్ కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసుకు పరిచయం అయ్యాడు. తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్కిరణ్కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్ ఆఫర్ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. అయితే మరో కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్‌లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
న్యూజెన్ సాఫ్ట్వేర్ బంపర్ లాభాలు
న్యూఢిల్లీ: సాప్ట్వేర్ ఉత్పత్తుల సంస్థ న్యూజెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో (క్యూ2) బలమైన పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 47 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరింది.క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.48 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.361 కోట్ల ఆదాయాన్ని సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.293 కోట్లతో పోల్చి చూస్తే 23 శాతం పెరిగింది.‘‘అన్ని కీలక మార్కెట్లలో మెరుగైన పనితీరు సాధించాం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో బలమైన వృద్ధి నమోదవుతోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కీలక విభాగాలుగా ఉన్నాయి. ఇన్సూరెన్స్, ప్రభుత్వ విభాగాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది’’అని న్యూజెన్ సాఫ్ట్వేర్ సీఈవో వీరేందర్ జీత్ తెలిపారు. కంపెనీ ఉద్యోగుల సంఖ్య 4,400కు చేరింది. -
‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’
సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు. -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్‌జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్‌లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్‌జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్‌జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్‌వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్‌కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్‌టెక్ ప్లాట్‌ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
మంథనిలో సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
-
ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సీపీవో రాజీనామా
నాస్డాక్-లిస్టెడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్ఈసీ ఫైలింగ్ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్సైడ్కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్ఈసీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్‌ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. డెన్నిస్ వుడ్‌సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు. -
అడిగినంత జీతం.. ఎంత మంచి సీఈవో!!
శాలరీ నెగోషియేషన్.. అదేనండి జీతాల బేరసారాలు. ఇది ప్రతి ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగమైన, సాధారణమైన, సంక్లిష్టమైన విషయమే. అభ్యర్థి ఎంత ఆశిస్తున్నారు.. కంపెనీ బడ్జెట్ ఎంత అన్నవాటి మధ్య ఈ జీతం చర్చలు జరుగుతాయి. అయితే బెంగుళూరుకు చెందిన ఒక సీఈవో తన కంపెనీలో ఇలాంటి తతంగం ఏమీ లేకుండా అభ్యర్థులు అడిగినంత జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ జోకో సహ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్.వి లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టారు. తమ కంపెనీలో నియామక ప్రక్రియ నుంచి శాలరీ నెగోషియేషన్ దశను తప్పించామని, అభ్యర్థులు అడిగినంత జీతాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కారణాలను సైతం ఆయన వివరించారు.“నా బృందం కోసం 18 మందికి పైగా నియమించుకున్న తర్వాత, ప్రపంచ స్థాయి ప్రతిభను నిలుపుకునే రహస్యాన్ని నేను కనుగొన్నాను. మేము శాలరీ నెగోషియేషన్ చేయము. వారు అడిగినంత అక్షరాలా చెల్లిస్తాము” అని జోకో సీఈవో అర్జున్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.“ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి సవరిస్తాం. కారణం సింపుల్” అంటూ తన నిర్ణయం వెనుక నాలుగు కారణాలను ఆయన పేర్కొన్నరు. తాను ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే శాలరీ నెగోషియేషన్ చేశానని, అది కూడా అభ్యర్థి అడిగినదాని కంటే పెంచడం కోసమని వివరించారు. అదే ఉద్యోగానికి బయట ఇతర కంపెనీలు ఇస్తున్నదాని కంటే ఆ అభ్యర్థి తక్కువ అడగడంతో తాను మరింత ఆఫర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.సీఈవో అర్జున్ ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి దానికి అనేక స్పందనలు వచ్చాయి. ప్రశ్నలు, కామెంట్లు వెల్లువెత్తాయి. అభ్యర్థులు అసమంజసమైన జీతాలు అడిగితే ఎలా? అంటూ మరో కంపెనీ సీఈవో ప్రశ్నించారు. అది సరే వార్షిక పెంపు మాటేంటి అని ఏఐ అండ్ అనలైటిక్స్‌లో పనిచేస్తున్న ఓ యూజర్ అడిగారు. పరిమిత వనరులు ఉన్న స్టార్టప్‌లు, బల్క్ రిక్రూట్మెంట్ అవసరమయ్యే పెద్ద కంపెనీలకు ఇది సరిపోకపోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు. -
జీతాలివ్వని ఐటీ కంపెనీ.. ఆందోళనకు దిగిన ఉద్యోగులు
సాక్షి,హైదరాబాద్: మరో సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులకు హ్యాండిచ్చింది. హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ఆన్ పాసివ్ టెక్నాలజీస్ ఉద్యోగులు సోమవారం(జులై 22) ఆందోళనకు దిగారు. కంపెనీపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కంపెనీలో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు పోరుబాట పట్టారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పది సంవత్సరాల అనుభవం ఉంది. పే స్లిప్, పీఎఫ్ సరిగా లేకపోవడంతో వేరేచోట ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఉద్యోగులు వాపోయారు. జీతాలడిగితే కంపెనీ యాజమాన్యం ఈరోజు రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. తమ జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లిస్తే విధులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ డబ్బులు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. -
ఒకే ‘క్లౌడ్’ను నమ్ముకుంటే ఇంతే..
సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్ అజూర్ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ సర్వీసెస్ ‘అజూర్’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్ సైబర్ సెక్యూరిటీలో ఒక అప్డేట్ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దుఐటీ కంపెనీలు డేటా బ్యాకప్ కోసం కేవలం ఒక క్లౌడ్ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్ వంటి అనేక క్లౌడ్ సర్వీసులు ఉన్నాయి.తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్ సర్వీసులు అందించే కోర్వేవ్ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఒక ఐటీ వెండర్పైనే ఆధారపడకుండా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్ ఓకు ఇస్క్ చెబుతున్నారు.మైక్రోసాఫ్ట్‌తో పాటు మ్యాక్, లీనక్స్ వంటి ఐటీ వెండర్స్నూ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్ చేసిన ప్రకటన దీనికి ఊతమిస్తోంది. సెబర్ సెక్యూరిటీలో అప్‌గ్రెడేషన్ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్కే పరిమితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌స్ట్రైక్ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాలనూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.తప్పించుకున్న రష్యామైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యాప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించాయి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటువంటి సహకారం అందించలేదు.ఈ సంక్షోభానికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్ స్ట్రైక్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్వేర్ పైనే ఆధారపడుతోంది. కాస్పర్స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్ సెక్యూరిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది. -
యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 2,200 మంది తొలగింపు
యూఎస్‌కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘యూకేజీ’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన తాజా రౌండ్లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 14% మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లతో 2,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచానా వేస్తున్నారు.జూలై 4న సెలవు రోజు కావడంతో జూలై 3వ తేదీనే తొలగింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. యూకేజీ లేఆఫ్‌ల గురించి బిజినెస్ జర్నల్ నివేదించింది. ఫ్లోరిడాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ భారీ లేఆఫ్‌లతో తన శ్రామిక శక్తిని ఎలా తగ్గించుకుందో వివరించింది. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ ఈమెయిల్ ప్రకారం కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తగ్గించిందని నివేదిక పేర్కొంది.అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉన్న అతిపెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్లలో ఒకటైన యూకేజీ మొత్తం 15,882 మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. కీలకమైన వృద్ధి రంగాలపై దృష్టి సారించడం, దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యంగా చేస్తున్న సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగింపులను ప్రారంభించినట్లు యూకేజీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ తొలగింపులను వచ్చే వారం ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంతలోపే వార్తలు బయటకు రావడంతో కంపెనీ తన చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుత ఉద్యోగాల కోతలు యునైటెడ్ స్టేట్స్కే పరిమితం అవుతాయని క్రిస్ టాడ్ ధ్రువీకరించారు. -
జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చెలరేగిన మంటలు
-
హైదరాబాద్: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఓ సాప్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామంటూ నిరుద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులు నుంచి డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. రైల్ వరల్డ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసింది.సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన రైల్ వరల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసినట్లు సమాచారం. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్‌ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.మాన్సీ జైన్..‘డిజిటల్పానీ’ అనే సాఫ్ట్వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది. అక్షితా సచిదేవా..ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్‌లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్‌ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.ఇరాగుహ..స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్‌ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. -
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
ఓ వ్యక్తి చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యమైపోతోంది. దీంతో కొందరు సొంతంగా బిజినెస్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీని కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఇటీవల వింగిఫై వ్యవస్థాపకుడు ఒక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వింగిఫైలో తనకు ఉద్యోగం కావాలని. ''ఉద్యోగం కోసం నేను 500 డాలర్లు (రూ. 41000 కంటే ఎక్కువ) చెల్లిస్తాను. వారం రోజుల్లో నా పనితనాన్ని నిరూపించుకుంటాను. ఆలా నిరూపించుకోని సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ టీమ్ సమయాన్ని వృధా చేయకూడదని చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.ఈ పోస్టును వింగిఫై ఛైర్మన్ పరాస్ చోప్రా షేర్ చేసిన తరువాత నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగార్ధుల పరిస్థితి ఇది అని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అయితే చోప్రా మాత్రం ఇది అందరి దృష్టిని ఆకర్శించింది అని అన్నారు.This is how you get attention!(Obviously won’t take money but very impressed with the pitch) pic.twitter.com/mlJIL0154u— Paras Chopra (@paraschopra) May 3, 2024 -
సీఈవోకే షాక్ ఇచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ.. రూ.1000 కోట్లు క్యాన్సిల్!
దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ దాని సీఈవోకే షాక్ ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీగా సేవలందిస్తున్న ఫ్రెష్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన గిరీష్ మాతృబూతంకు 2022లో కేటాయించిన ఆరు మిలియన్ స్టాక్ యూనిట్ల పనితీరు అవార్డును రద్దు చేసింది. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పనితీరు లక్ష్యాలలో చేసిన మార్పులే సీఈవో పనితీరు అవార్డును రద్దు చేయడానికి కారణంగా నాస్డాక్-లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్రెష్‌వర్క్స్ పేర్కొంది. అయితే 19 మిలియన్ల డాలర్ల (రూ.157 కోట్లు) విలువతో కొత్త వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డుకు సీఈవో గిరీష్ మాతృభూతం అర్హులవుతారని కంపెనీ తెలిపింది. “సీఈవో మాతృభూతం పర్ఫామెన్స్ బేస్డ్ రిస్ట్రిక్టివ్ స్టాక్ యూనిట్స్ అవార్డును రద్దు చేసి 2024లో ఆయనకి వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డును అందించాలని నిర్ణయించడంతోపాటు దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని పెట్టుబడిగా పరిగణించేందుకు కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నాం" అని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 2023కి ఫ్రెష్‌వర్క్స్ మొత్తం స్టాక్ ఆధారిత పరిహారం ఖర్చు 212 మిలియన్ డాలర్లు. 2021లో కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. కంపెనీ బోర్డు 6 మిలియన్ స్టాక్ యూనిట్లను ఈసీవో మాతృభూతమ్కు బహుళ-సంవత్సరాల పనితీరు-ఆధారిత పరిమిత స్టాక్ యూనిట్ అవార్డుగా మంజూరు చేసింది. సీఈవో పనితీరు అవార్డు మొత్తం విలువ 131 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు). -
ఇక టెక్ గురూ.. సాఫ్ట్వేర్ బిజినెస్‌లోకి రాందేవ్ బాబా!
యోగాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాందేవ్ బాబా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతీయ యోగా, పురాతన ఆయుర్వేద చికిత్సల ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. యోగాతో పాటు ఆయుర్వేదం, వ్యాపారంలో సైతం ఆయన రాణిస్తున్నారు. తాజాగా రాందేవ్ బాబా నేతృత్వంలోని కంపెనీ సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెక్నాలజీ సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేసేందుకు పతంజలి ఆయుర్వేద్ ఆసక్తిని వ్యక్తం చేసింది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. పుణేకు చెందిన అష్దాన్ ప్రాపర్టీస్ రోల్టాకు అత్యధిక బిడ్డర్‌గా ప్రకటించిన కొద్ది వారాలకే బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని కంపెనీ రూ. 830 కోట్లు ఆఫర్ చేసింది. పతంజలి ఆయుర్వేద్ తన ఆఫర్‌ను చేర్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని ఆశ్రయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో సంస్థ చేరికను ప్యానెల్ నిర్ణయిస్తుంది. మూడుసార్లు దివాలా.. కమల్ సింగ్ అనే వ్యక్తి రోల్టాను డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రమోట్ చేశారు. ఈ సంస్థ జనవరి 2023లో దివాలా ప్రక్రియలో చేరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రూ. 7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని విదేశీ బాండ్ హోల్డర్లకు మరో రూ. 6,699 కోట్లు బకాయిపడింది. రోల్టా మొదటిసారిగా 2016లో విదేశీ కరెన్సీ రుణాలను డిఫాల్ట్ చేసింది. మూడుసార్లు దివాలా తీసివేసిన తర్వాత ఆఖరికి యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌తో ఎన్సీఎల్టీకి చేరింది. ఇదీ చదవండి: టెక్ ప్రపంచాన్ని శాసించిన బ్యాంకర్! ఇన్నాళ్లకు తెరపైకి.. కంపెనీ డిఫెన్స్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, పవర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, హెల్త్‌కేర్‌లలో సేవలు అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కాగా ఈ కాలంలో ఆదాయం రూ.38 కోట్లు మాత్రమే. రోల్టాకు ఉన్న రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ముంబైలోని ఆస్తులు బిడ్డర్లకు కలిసివచ్చే అవకాశం ఉంది. తమ హోమ్ డెలివరీ అప్లికేషన్ కోసం రోల్టా ఐటీ మౌలిక సదుపాయాలను పతంజలి ఆయుర్వేద్ పరిశీలిస్తున్నట్లు ఈటీ నివేదిక పేర్కొంది. -
SAP: ఏఐపై ఫోకస్.. 8,000 ఉద్యోగాలకు ఎసరు!
జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏపీ ఎస్ఈ (SAP SE) ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు, కృత్రిమ మేధస్సు(AI)పై దృష్టి పెట్టింది. ఇందుకు అనుగుణంగా ఈ సంవత్సరం కార్యకలాపాలను పునర్నిర్మించే ప్రణాళికను ఆవిష్కరించింది. దీంతో దాదాపు 8,000 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. పునర్నిర్మాణ ప్రణాళిక ద్వారా ప్రభావితమయ్యే ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవు కార్యక్రమాలు, అంతర్గత రీ-స్కిల్లింగ్ చర్యల ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఎస్ఏపీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా మార్పులు లేకుండానే ఈ సంవత్సరాన్ని ముగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించేందుకు ఈ మార్పులు ఏడాదంతా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా 2023 డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,07,602 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులు ఉన్నట్లు ఎస్ఏపీ వివరించింది. ఇదీ చదవండి: ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు! కంపెనీ నాలుగో త్రైమాసిక ఐఎఫ్ఆర్ఎస్ (ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్)యేతర ఆదాయంలో 5 శాతం లాభాన్ని నమోదు చేసినట్లు ఎస్ఏపీ విడిగా పేర్కొంది. దీంతో ఈ ఆదాయం 8.47 బిలియన్ యూరోలకు (రూ.76 వేల కోట్లు) చేరినట్లు తెలిపింది. అలాగే క్లౌడ్ సేల్స్ 20 శాతం పెరిగి 3.7 బిలియన్ యూరోలకు (రూ.33 వేల కోట్లు) చేరినట్లు వెల్లడించింది. -
ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 300 మందికి ఉద్వాసన!
కొత్త ఏడాదిలోనూ రోజూ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఏదో ఒక కంపెనీలో లేఆఫ్‌ల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గ్లోబల్ డేటా ప్రొటెక్షన్, రాన్సమ్వేర్ సంస్థ వీమ్ (Veeam) 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవలి మార్పులతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. కంపెనీలో తొలగింపుల గురించి కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్లాక్ అండ్ ఫైల్స్ ప్రకారం.. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా తనతోపాటు సుమారు 300 మంది సహోద్యోగులు జాబ్స్ కోల్పోయారని ఒక సీనియర్ క్యాంపెయిన్ అకౌంట్ మేనేజర్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. తొలగింపులను గురించి కంపెనీ ధ్రువీకరించినప్పటికీ ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న ఖచ్చితమైన సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. 2006లో స్థాపించిన ఈ ఐటీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా సేవలందిస్తూ పరిశ్రమలో ప్రధాన సంస్థగా మారింది. కంపెనీ కస్టమర్ లిస్ట్‌లో ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్లైన కోకా-కోలా, బీఎండబ్ల్యూతో పాటు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి. తమ వ్యాపార ప్రణాళికలను బహిర్గతం చేయమని వీమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాథ్యూ బిషప్ తెలిపారు. అయితే తాము కొన్ని చోట్ల నియామకాలను పెంచుతున్నామని, కొన్ని మందిని బదిలీ, మరికొంత మందిని తప్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభావితమైన వీమ్ ఉద్యోగులు తదుపరి కెరీర్ అవకాశాన్ని కనుగొనడంలో వారికి సహాయం అందిస్తామన్నారు. వీమ్ సంస్థ రాన్సమ్వేర్, ఇతర సైబర్ ముప్పుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించడంతో ప్రసిద్ది చెందింది. 2023లో నగదు, స్టాక్ డీల్‌లో 150 మిలియన్ డాలర్లకు కుబెర్నెట్స్ బ్యాకప్, డిజాస్టర్ రికవరీలో అగ్రగామిగా ఉన్న కాస్టెన్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. భారతీయ సంతతికి చెందిన ఆనంద్ ఈశ్వరన్ 2022లో వీమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు. -
క్రికెట్ బెట్టింగ్.. రూ.40 లక్షలు అప్పు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
పల్నాడు: ఆర్థిక బాధలతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దీపావళి రోజున నాదెండ్ల మండలం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే, సివిల్ పోలీసులు తెలిపిన వివరాలు.. రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన బద్దూరి గంగిరెడ్డి(33) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఈపూరు మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన లావణ్యతో వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప ఉంది. గత నెల 23న దసరా పండుగ సెలవులపై భార్య, పాపతో అలవాల చేరుకున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులందరూ తిరుపతి వెళ్లేందుకు బయలుదేరగా, నాకు పని ఉంది మీరు వెళ్లడంటూ గ్రామంలోనే ఉండిపోయాడు. తనకు కంపెనీ పని ఉందంటూ నాలుగైదు రోజుల క్రితం నరసరావుపేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. దీపావళి పండుగకు ఇంటికి వెళ్లకుండా ఆదివారం ఉదయం 10 గంటలకు ద్విచక్రవాహనంపై సాతులూరు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చాడు. తన సోదరి సంధ్యకు ఫోన్ మెసేజ్ పంపాడు. తాను బతకనని, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ చేశాడు. ఆతర్వాత కొద్దిసేపటికి సాతులూరు రైల్వే స్టేషన్ పట్టాలపై చేరుకున్నాడు. ఆసమయంలో గుంటూరు–గుంతకల్లు వెళ్లే పాసింజర్ కిందపడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే లింగారెడ్డి మృతి చెందాడు. రైల్వే కీమెన్ కోటేశ్వరరావు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. రైల్వే సీఐ పి.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎస్ఐ శ్రీనునాయక్, చిలకలూరిపేట రూరల్ సీఐ అశోక్‌కుమార్, నాదెండ్ల ఎస్ఐ జె.బలరామిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. స్టేషన్ మాస్టర్ కుమారరాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా నష్టపోయి రూ.40 లక్షలు అప్పులపాలుకాగా తండ్రి లింగారెడ్డి తీర్చాడు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభం కావటంతో బెట్టింగ్‌లకు అలవాటు పడి తీవ్రంగా నష్టపోయాడు. దీంతో కలత చెందిన లింగారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
ఐటీకి బ్యాడ్ టైమ్.. 25 ఏళ్ల టెక్నాలజీ చరిత్రలో ఇదే తొలిసారి!
భారత ఐటీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో చాలా వరకు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేయడంతో పాటు.. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. వారిని వేతనాలు తగ్గించుకొని చేరాలని చెబుతున్నాయి. ఫలితంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవలందించే 10 కంపెనీలలో తొమ్మిదింటిలో నియామకాలు తగ్గాయి. నివేదిక ప్రకారం, 25 ఏళ్ల దేశ ఐటీ రంగ చరిత్రలో నియామకాలు తగ్గడం ఇదే తొలిసారి. జులై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2) ముగింపు నాటికి ప్రముఖ టాప్ 10 భారత ఐటీ కంపెనీల్లో వర్క్‌ఫోర్స్ 2.06 మిలియన్లకు పడిపోయింది. త్రైమాసికం ప్రారంభంలో ఈ సంస్థలు 2.11 మిలియన్ల ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఒక్క ఎల్ అండ్ టీ మాత్రమే ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ మాత్రమే ఉద్యోగుల నియామకాల్లో వృద్దిని సాధించింది. క్యూ2లో 32 మంది ఉద్యోగులను నియమించుకుంది. తద్వారా హెడ్‌కౌంట్‌ను ఆల్ టైమ్ హై 22,265కి చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సహా ఇతర ప్రధాన సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. అనిశ్చితే కారణం ఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ స్టాఫింగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ చెమ్మన్‌కోటిల్‌ను మాట్లాడుతూ..మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల నియమకాలు తక్కువగా ఉన్నాయి. చివరి నాటికి ఈ హెడ్‌కౌంట్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. వర్క్ ప్రొడక్టివిటీని పెంచే టెక్నాలజీతో పాటు గిగ్స్ వంటి విభాగాల ఉద్యోగుల నియామకాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. -
గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు!
కరోనా లాక్డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించగా, మరికొన్ని సంస్థలు ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది, ఇందులో భాగంగానే ఇటీవల లింక్డ్ఇన్ 668 మంది ఉద్యోగులను తొలగించింది. లింక్డ్ఇన్ తొలగించిన ఉద్యోగులలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ టీమ్ ఎంప్లాయిస్ ఉన్నారు. కంపెనీ రెవెన్యూ ఇప్పటికీ పురోగతి చెందకపోవడమే ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని సంస్థ స్పష్టం చేసింది. ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు వరకు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లలో భారీగా పెరిగిన ఉద్యోగాల కోతలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్సైట్ పేర్కొంది. 2022 - 23 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు 4,04,962 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో మాత్రం 1,061 టెక్ కంపెనీలు 164,769 మందిని, 2023 అక్టోబర్ 13 నాటికి 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! 2023 జనవరిలోనే 89,554 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2022లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు 2023 ప్రారంభం నాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం లేఆప్స్ కొంత తక్కువయ్యాయి, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు. -
ఐటీ ఉద్యోగాలని ముంచేశారు
అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ఉదంతం అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌ను ‘స్పందన’లో కలసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాప్తాడుకు చెందిన టీడీపీ నేత కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శశి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గుర్రం వెంకటరామ్, భానుచంద్రతో పాటు మరికొంత మంది ఘరానా కేటుగాళ్లు.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరిట బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వల వేశారు. ప్రధానంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రాల వద్ద పాగా వేసిన వీరు అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 150 మందికి పైగా నిరుద్యోగులను ముగ్గులోకి దింపారు. శాలరీ ప్యాకేజీని బట్టి ధర ఉంటుందంటూ ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేశారు. ఇలా రూ. 5 కోట్లకు పైగా దండుకున్నారు. డబ్బిచ్చిన వారికి ఆరు నెలల శిక్షణ కూడా ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో రూ.10 వేల నుంచి రూ.18 వేల దాకా గౌరవ వేతనం కూడా చెల్లిస్తామని నమ్మబలికారు. నకిలీ కంపెనీ పెట్టి... బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ‘సార్టీస్ టెక్నాలజీ లిమిటెడ్’ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు. నిజమని నమ్మి డబ్బు కట్టిన వారు అదే ప్రాంతంలో అద్దెకు గదులు తీసుకుని ఆరు నెలల పాటు వారు చెప్పిన పని చేసుకుంటూ వచ్చారు. అయితే.. వారికి కంపెనీ పనులు పూర్తి కాలేదంటూ గౌరవ వేతనం కూడా చెల్లించలేదు. చేసేది లేక చాలా మంది నిరుద్యోగులు ‘ఎలాగూ ఇన్ని నెలలు ఉన్నాం కదా?! మిగిలిన కాలం పూర్తి చేస్తే ఉద్యోగం దొరుకుతుంద’న్న ఆశతో అప్పులు చేసి మరీ కాలం గడిపారు. తీరా నిర్వాహకులు రాత్రికి రాత్రే కంపెనీకి తాళాలు వేసి అనంతపురానికి చేరుకున్నారు. బాధితులు బెంగళూరు నుంచి ఇళ్లకు రాలేక, అయిన వారికి ముఖం చూపించలేక నరకయాతన అనుభవించారు. నాన్న ఆరోగ్యం బాగోలేదన్నా కనికరించలేదు పుట్టపర్తికి చెందిన ఓ యువకుడు తండ్రికి తెలియకుండా లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి వారికి చెల్లించాడు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో అతను అనంతపురం వచ్చి వారిని కాళ్లా వేళ్లా పడినా డబ్బివ్వలేదు. పైగా మరోసారి వస్తే నీపైనే ఎదురు కేసు పెట్టి లోపలేయిస్తామని బెదిరించారు. డబ్బడిగితే బెదిరిస్తున్నారు! నిరుద్యోగులను వంచించిన వారు అనంతపురంలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారిని బాధితులు కలసి తమ డబ్బు తిరిగివ్వాలని కోరితే... బెదిరింపులకు దిగుతున్నారు. ‘మా వెనుక రాప్తాడుకు చెందిన టీడీపీ నేతలు ఉన్నారు. ఖబడ్దార్’ అంటూ దాడులకు సైతం తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్‌లోని చిత్రావతి అతిథి గృహం వద్దకు బాధితులను పిలిపించుకుని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ‘అన్నీ మూసుకుని వెళతారా? లేక తన్నులు తింటారా’ అంటూ బెదిరించారు. డబ్బు తిరిగివ్వకపోగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కొంత మంది బాధితులు సోమవారం జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. -
ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాద్: పురుగుల మందు తాగి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెహ్రూనగర్‌లో కొంతకాలంగా మౌనిక (23) తన స్నేహితురాలు సౌమ్యతో కలిసి ఉంటుంది. మౌనిక మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. కాగా ఇటీవలే సౌమ్య తన సొంతూరికి వెళ్లగా మౌనిక గదిలోనే ఉంది. మౌనిక స్వస్తలం మంచిర్యాల. తమ తల్లిదండ్రులు ఫోన్ చేయగా మౌనిక నుంచి స్పందన రాకపోవడం చుట్టు పక్కల వాళ్లకు ఫోన్ చేసి ఆరా తీసారు. తెలిసిన వ్యక్తి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా గది తలుపులు తెరచి ఉన్నాయని, మౌనిక స్మృహలో లేదని తెలిపాడు. పక్కనే పురుగల మందు బాటిల్ కూడా ఉందని తెలిపాడు. వెంటనే 108కి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి చూసి చనిపోయిందని తెలిపారు. ప్రేమే కారణమా..? 2 నెలల క్రితం ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని మౌనిక తెలిపిందని దీనికి అంగీకరించకపోవడంతో తమతో మాట్లాడడం లేదని తల్లిదండ్రలు తెలిపారు. కాగా ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని మౌనిక తమతో తెలిపిందన్నారు. ఈ విషయంపైనే తమ కూతురు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మౌనిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఉద్యోగులకు తప్పని లేఆఫ్స్ తిప్పలు.. మళ్ళీ ఎంతమందంటే?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇటీవల యుఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ వేర్వేరు విభాగాలకు చెందిన దాదాపు 240 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొంత కాలంగా చిన్న కంపెనీలు & పెద్ద కంపెనీలు అని తేడా లేకుండా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. కరోనా తగ్గినా.. ఆర్థిక మాంద్యం ఉద్యోగులను భయపెట్టేస్తోంది. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాయాలను కోల్పోయారు. కాగా ఈ జాబితాలోకి మరి కొంతమంది చేరనున్నారు. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ వర్క్‌ఫోర్స్‌లోని దాదాపు 4 శాతం మందిని తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్లయింట్ ఎంగేజ్మెంట్ విధానాన్ని సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా కంపెనీ బిజినెస్ వ్యూహాన్ని మరింత మెరుగుపరచడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? పెగాసిస్టమ్స్ ఉద్యోగులను తొలగించడం వరుసగా ఇది రెండవ సారి కావడం గమనార్హం. గత జనవరిలో కూడా సంస్థ నాలుగు శాతం మంది ఉద్యోగులను తొలగించింది. కాగా రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగిస్తుందా అని ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
‘అన్నా చనిపోతున్నా’ అంటూ మెసేజ్ చేసి...
హైదరాబాద్: ‘నన్ను క్షమించు అన్నా..నేను చనిపోతున్నా..నేను ఫెయిల్ అయ్యాను’ అంటూ ఓ వ్యక్తి తన అన్నకు ఫోన్లో మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ మేడిపల్లికి చెందిన మాదారం సునీల్ (38)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఈయన సూర్యటవర్స్‌లోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే సంస్థలో అతని అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సంస్థ ఎండీని కారులో సూర్యటవర్‌లోని కార్యాలయం వద్ద డ్రాప్ చేశాడు. అదే సమయంలో ఆయన అన్న భోజనం చేద్దామని ఆహ్వానించగా సమాధానం చెప్పకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో వాట్సప్‌లో భార్య మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు. తెలిసిన వాళ్లు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడ ఆచూకీ దొరక లేదు. దీంతో బుధవారం రాత్రి మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసికున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
TS Crime News: కుటుంబ కలహాలతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన పుట్ల కిరణ్ కుమార్(32) సాఫ్ట్వేర్ ఉద్యోగి. కాగా గోదావరి ఖనికి చెందిన అశ్వినితో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లి అయిన నెలకే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం కిరణ్ కుమార్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో నగరంలోని నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. అలాగే గోదావరిఖనిలో అశ్విని కూడా కిరణ్‌కుమార్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈనెల 23న కౌన్సె లింగ్‌కు రావాలని తెలిపారు. 21న అర్ధరాత్రి కిరణ్ కుమార్ సిద్దిపేటలోని తన ఇంటికి వచ్చాడు. తన మేన బావమర్ది పల్లె నరేందర్‌తో కలిసి 22న సాయంత్రం వారు రంగనాయకసాగర్ కట్టపైకి బైక్ మీద వెళ్లారు. కిరణ్ ఫోన్ మాట్లాడుకుంటూ దూరంగా వెళ్లాడు. చాలాసేపు వరకు రాకపోయే సరికి బావమరిది వెళ్లి చూడగా ఫోన్ మాత్రమే కనిపించింది. తన బావ కనిపించలేదు. పోలీసుల కౌన్సెలింగ్‌కు భయపడి పారిపోయి ఉండొచ్చని నరేందర్ భావించాడు. గురువారం రంగనాయక సాగర్‌లో కిరణ్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బావమర్ది నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. -
పనిఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
భాగ్యనగర్‌కాలనీ: పనిఒత్తిడి కారణంగా ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దయాల్గూడ ఎలైట్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న భగవాన్ నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగవాన్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు తెలిసిన వారి వద్ద విచారించినా ఫలితం లేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అవకాశాలను సృష్టించుకోవాలి!
‘డ్రీమ్ బిగ్, ఫాలో యువర్ పాషన్, వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్’... నాలుగు మాటలు. ఈ నాలుగు మాటలే వీణాగుండవెల్లిని విజేతగా నిలబెట్టాయి. ‘ఇలా ముందుకెళ్లమని నాకెవ్వరూ చెప్పలేదు. స్వీయశోధన తో తెలుసుకున్న సత్యాలివి. కొత్తతరానికి నేను చెప్పగలిగిన సూచన ఇది. నేను ఆచరించిన మార్గమే నా సందేశం’ అన్నారామె. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసిన వీణ ఆ తర్వాత యూఎస్ వెళ్లి శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఇమాజియా సాఫ్ట్వేర్ కంపెనీని నిర్వహిస్తున్న వీణ ఇటీవల హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సాంకేతిక రంగంలో విజయవంతమైన తన జర్నీని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘యూఎస్‌లో నేను కానన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిస్కో సిస్టమ్స్‌లో పని చేసిన తర్వాత టెక్నాలజీ రంగంలో సొంత కంపెనీ ప్రారంభించాను. ఇంటర్నెట్ మొదలైన రోజులు, అలాగే వైటూకే క్రైసిస్ ఎదురైన రోజులు కూడా. ఆ సమస్యలను అధిగమిస్తూ ఇంటర్నెట్ ఆధారిత ఫైనాన్స్ అప్లికేషన్స్ సర్వీసులందించింది మా సంస్థ. ఈ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందని నమ్మాను, నా నమ్మకమే పునాదిగా ముందుకెళ్లాను. ఒక దశ తరవాత కంపెనీ కార్యకలాపా లను విస్తరించాలనే ఉద్దేశంతో వెంచర్ క్యాపిటల్ ద్వారా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాను. మా కంపెనీ సేవల పట్ల నమ్మకం కలిగినప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందడుగు వేయలేక΄ోయారు. అందుకు కారణం మహిళను కావడమే. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్తున్నాను. ఆ మేరకు పెట్టుబడి పెట్టేవాళ్లలో విశ్వాసం కలిగించడం కొంచెం కష్టమైందనే చెప్పాలి. కష్టం అని వదిలిన వాళ్ల వెంట సక్సెస్ రాదు. కష్టాన్ని జయించడమే విజయానికి తొలిమెట్టు. మొత్తానికి నాకున్న సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశ్వాసం కలిగిన తరవాత పెట్టుబడులు పెట్టారు. కానీ ఆ తర్వాత ‘మీ కంపెనీలో మా ప్రతినిధి సీఈవో హోదాలో ఉంటారు. మీరు టెక్నాలజీ పా ర్ట్ చూసుకోండి’ అన్నారు. ఆ షరతును అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. టాప్‌లో ఉన్న మా కంపెనీ ఒడిదొడుకులకు లోనయింది. తిరిగి టాప్‌లో నిలపడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ముందుచూపు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వినియోగం ఇప్పుడు బాగా ఎక్కువైంది. మేము 2015లోప్రోడక్ట్ బిల్డ్ చేశాం. సాంకేతిక రంగానికి ఏఐని పరిచయం చేశామని చెప్పాలి. ఆ తర్వాత మూడేళ్లకు కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక సహకారాన్ని డిజిటల్‌గా అందించడం మొదలుపెట్టాం. మరో రెండేళ్లలో ఫైనాన్షియల్ డాక్యుమెంట్లను చదివి, ప్రాజెస్ చేయగలిగిన తొలి ఏఐ ఇంజన్‌ను తీసుకొచ్చాం. ఈ రంగంలో మేమిచ్చిన డైరెక్షన్‌ను ముందుచూపున్న కంపెనీలు అందుకున్నాయి. మేము ఏఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు వేగంగా జరుగుతుంటే వ్యాపా రం కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఓటూసీ (ఆర్డర్ టూ కస్టమర్) ్రపా సెస్‌ని మా కంపెనీ చేస్తుంది. తొంభై దేశాల్లో, 25 భాషల్లో మా సేవలందింస్తున్నాం. భవిష్యత్తు దర్శనం విజేత కావాలంటే భవిష్యత్తును దర్శించగలగాలి. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదు. అలాగే అవకాశాలను అందిపుచ్చుకోవడమనేది పా త మాట. అవకాశాలను సృష్టించుకోవాలనేది ఈ జనరేషన్ అనుసరించాల్సిన ఫార్ములా. హెన్రీ ఫోర్డ్ ఒక ఇంజనీర్‌గా మిగిలిపోలేదు. తన ఆలోచనతో రవాణాకు యంత్రంతో నడిచే కారు అనే వాహనానికి రూపకల్పన చేసి పా రిశ్రామికవేత్త అయ్యాడు. గుర్రం మీద ప్రయాణించే కాలాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. మన ఆలోచన సమాజానికంటే ముందుండాలి. అది శతాబ్దం కావచ్చు, దశాబ్దం కావచ్చు. ఆ సమయానికి సమాజం మన ఆలోచనను స్వాగతించవచ్చు లేదా విమర్శించనూ వచ్చు. కానీ దానిని నిరూపించిన తరవాత మన వెంట నడిచి తీరుతుంది’’ అన్నారు వీణా గుండవెల్లి. ఆమె తన విజయాలనే పా ఠ్యాంశాలుగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో బోధిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారికి సహాయం చేయడానికి టచ్ ఏ లైఫ్ పేరుతో ఒక ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనం చేకూరే స్టార్టప్‌లతో ముందుకు వచ్చే యువతకు చేయూతనిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమెను వరించిన అవార్డుల ప్రస్తావనకు ఆమె ‘ఎన్నని చెప్పాలి, అయినా ఆ లెక్క ఇప్పుడెందుకు’ అన్నారు నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి -
క్రికెట్ ఆడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని ఘట్టుపల్లి శివారులో చోటు చేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మడ్డిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మర్రిపూడి మణికంఠ(26) కోరల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీకెండ్ కావడంతో శనివారం స్నేహితులతో కలసి కోరుపోలు చంద్రారెడ్డి స్టేడియంలో క్రికెట్ ఆడాడు. బౌలింగ్ చేసిన మణికంఠ ఛాతి, వీపులో నొప్పిగా ఉందని స్నేహితులకు చెప్పి కారులో పడుకున్నాడు. కాసేపటికి స్నేహితులు వెళ్లి చూడగా నోటి నుంచి నురగలు వచ్చాయి. ఎంత పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సయ్య కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
ఒత్తిడి లేని ఉద్యోగం చాలంటున్న భారతీయులు
-
మళ్లీ ఆఫీసులు కళకళ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో కార్యాలయాలు తిరిగి ఉద్యోగులతో సందడిగా మారుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లోగడ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో మెజారిటీ ఉద్యోగులు పనిచేయడం తెలిసిందే. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. వారంలో కొన్ని రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు మంగళం కూడా పలికాయి. కంపెనీలు తమ పని విధానాలను సమీక్షించుకుంటున్నాయి. ఐటీ పరిశ్రమలో పని విధానాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిపై ప్రభావం చూపుతాయి. కనుక కంపెనీల్లో ప్రస్తుతం అమలవుతున్న పని విధానాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు విధానాల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఓ సర్వే నిర్వహించింది. ఈ సంఘంలో 300కు పైగా కంపెనీలు భాగస్వాములుగా ఉంటే, మూడింట ఒక వంతు కంపెనీలు సర్వేలో పాల్గొని వివరాలు తెలిపాయి. సర్వేలోని అంశాలు.. ► ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేసేందుకు కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఫలితంగా మూడింట ఒక వంతుకు పైగా కంపెనీల్లో 60 శాతానికి పైగా ఉద్యోగులు ఇప్పుడు వారంలో కనీసం రెండు రోజులు ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. పెద్ద కంపెనీల్లో కార్యాలయాలకు వచ్చే వారు 22 శాతంగా ఉంటే, చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో 38 శాతంగా ఉన్నారు. ► 62 శాతం కంపెనీల్లో 19 శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్‌కు వెలుపల ఉన్న చోట నుంచే పనిచేస్తున్నారు. ఈ మేర ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా పనిచేయడం అన్నది 2023లోనూ, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 21 శాతం కంపెనీల్లో అయితే 20–39 శాతం మేర ఉద్యోగులు, 13 శాతం కంపెనీల్లో 40–59 శాతం మేర ఉద్యోగులు హైదరాబాద్ బయటి నుంచే సేవలు అందిస్తున్నారు. ► 26 శాతం కంపెనీల్లో నూరు శాతం ఉద్యోగులు వారంలో అన్ని రోజులూ (సెలవులు మినహా) కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారు. 28 శాతం కంపెనీల్లో మూడు రోజుల కార్యాలయ పనివిధానం నడుస్తోంది. 14 శాతం కంపెనీల్లో వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వస్తుంటే, 15 శాతం కంపెనీలు ఫ్లెక్సీ (వీలునుబట్టి ఎక్కడి నుంచి అయినా) పని విధానాన్ని ఆచరిస్తున్నాయి. ► భవిష్యత్తులో అవసరమైతే 2–5 రోజుల పాటు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా కంపెనీలు విధానాలను రూపొందించుకున్నాయి. వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని భావిస్తున్నాయి. ► భవిష్యత్తులో పూర్తిగా ఆఫీసుకే వచ్చి పనిచేసే విధానాన్ని అమలు చేస్తామని 35 శాతం కంపెనీలు చెప్పాయి. వారంలో మూడు రోజులు అయినా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని 26 శాతం కంపెనీలు తెలిపాయి. 12 శాతం కంపెనీలు వారంలో రెండు రోజుల విధానాన్ని అనుసరిస్తామని పేర్కొన్నాయి. ► టీమ్ వర్క్, సహకారం, సంస్థలో పని సంస్కృతి, గుర్తింపు, విధేయత, వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధి అంశాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు రావడంపై ప్రభావం చూపించనున్నాయి. ► సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో మెజారిటీ ఐటీ రంగం నుంచే ఉన్నాయి. 27 శాతం ప్రొడక్ట్ కంపెనీలు కాగా, 24 శాతం ఇంటెగ్రేటెడ్ ఐటీ, ఐటీఈఎస్ సేవల రంగానికి చెందినవి ఉన్నాయి. -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ
న్యూఢిల్లీ: జీవితం ఎపుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో తెలియదు. ఒకానొక క్షణంలో ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది. అదే కొత్త ఆవిష్కారానికి బీజం వేస్తుంది. గ్లోబల్ సాప్ట్వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎండీ ఆనంద్ దేశ్‌పాండే సక్సెస్‌స్టోరీ అలాంటిదే. గ్లోబల్ బిజినెస్‌తో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా, దేశ్‌పాండే రూ. 10,600 కోట్ల నికర విలువకు చేరుకున్నారు. మహారాష్ట్రలోని అకోలాలో ఆనంద్ దేశ్‌పాండే జన్మించారు. కానీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) టౌన్షిప్లో పెరిగారు. పాఠశాల విద్య తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతోఆటు ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్షలో కూడా పాస్ కావడంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లో చేరాడు. ఐఐటీ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుని నిర్ణయించారు. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తైన తరువాత ముఖ టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్ (HP)లో తన ఉద్యోగంలో చేరాడు. ఇదే యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ హోల్డర్ కూడా. ఇక్కడే దేశ్‌పాండే జీవితం కీలక మలుపు తిరిగింది. వర్క్ వీసా లేదా గ్రీన్ కార్డ్ పొందాలా లేదంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇండియా తిరిగి వచ్యేయ్యాలి అనే రెండేరెండు ఆప్షన్స్ ఉన్నాయి. చివరికి ఆరునెలల తర్వాత ఇండియాకు తిరిగి రావాలనేనిర్ణయించుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాకు గుడ్‌బై చెప్పేశారు. అలా 1990లో పూణేలో తన సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రారంభించాడు. అయితే ఇలా కంపెనీ అంత ఈజీగా ఏమీ సాధ్య పడ లేదు. తన దగ్గరున్న సొమ్ముతోపాటు, స్నేహితులు,కుటుంబ సభ్యుల దగ్గర అప్పు తీసుకున్నాడు. చివరికి రూ.2 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ స్థాపించాడు. ఆరోజు దేశ్ పాండే చేసిన రిస్క్ అతన్ని బిలియనీర్‌ను చేసింది. ప్రస్తుతం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మార్కెట్ క్యాప్ రూ.36,000 కోట్లకు పైగా ఉందంటే అతని కృషిని పట్టుదల అర్థం చేసుకోవచ్చు.(బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్‌పై భారీ ఆఫర్) లాంచ్ చేసిన పదేళ్లకు తొలిసారిగా దేశ్‌పాండే కంపెనీ 2000లో ఇంటెల్ క్యాపిటల్ ద్వారా ఒక మిలియన్ల డాలర్ల భారీ నిధులను సేకరించింది. అనంతరం 2005లో నార్వెస్ట్ వెంచర్ పార్టనర్లు, గాబ్రియేల్ వెంచర్ పార్టనర్లు దేశ్‌పాండే సంస్థలో 20 మిలియన్లు పెట్టుబడి పెట్టాయి ఇక ఆ తరువాత 2010లో ఐపీవోను విజయవంతంగా పూర్తి చేశారు. దేశ్‌పాండే మంచి పరోపకారి కూడా. తన కుటుంబంతో కలిసి దేఆస్రా అనే ఫౌండేషన్‌ను కూడా నిర్వహిస్తుండటం విశేషం. దీని ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నారు. 2012లో IIT ఖరగ్‌పూర్ విశిష్ట పూర్వవిద్యార్థిగా గుర్తింపు, 2007లో ఇండియానా యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్ ద్వారా కెరీర్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. 1.1 బిలియన్ డాలర్లు సంపద ఉన్నపుడే ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల డేటాలో ఆనంద్ దేశ్‌పాండే బిలియనీర్ల ఎలైట్ క్లబ్లో చేరారు. -
ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,000 మంది నియామకం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ప్లూరల్ టెక్నాలజీ వచ్చే మూడేళ్లలో 1,000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోనుంది. వీరిలో 500 మంది జపనీస్ భాషలో శిక్షణ పొందినవారై ఉండనున్నారని సంస్థ సీఈవో సునీల్ సవరం తెలిపారు. (విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్) ఇటీవలే సాంకేతిక సహకారాల కోసం జపాన్‌కు చెందిన ఓపెన్ సెసేమ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. 2025 నాటికల్లా ఇరు సంస్థల ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సర్వీసులు తదితర వ్యాపారాల ఆదాయం 100 మిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) -
ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కు పండగే, భారీ ప్యాకేజీలు..ప్రమోషన్లే.. ప్రమోషన్లు!
ఐఐటీ బొంబాయి విద్యార్ధి జీతం ఏడాదికి రెండు కోట్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన కుర్రాడికి వేతనం కోటి.. ఇరవై నిండిన అమ్మాయి సంపాదన ఎనబై లక్షలు ఎక్కడ చూసిన క్యాంపస్ నియమాకాల్లో దుమ్మురేపుతున్న కుర్రకారు వార్తలే.. ఇదంత గతం. కానీ ఇప్పుడు ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లు కంపెనీలు వెనక్కి తీసుకుంటున్నాయనే కథనాల్ని చదివే ఉంటాం. నాణేనికి ఒకవైపు ఇలా ఉంటే ..మరోవైపు మాత్రం ఫ్రెషర్లు భారీ ఎత్తున ప్యాకేజీలు తీసుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం ఇట్టే దక్కించుకుంటున్నారని అంటున్నారు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ విభాగాధిపతి క్రిష్ శంకర్. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫ్రెషర్ల గురించి, వారి జీతభత్యాలు, ప్రమోషన్ల గురించి క్రిష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్‌లో ఏడేళ్ల పాటు సేవలందించిన కృష్ణశంకర్ మంగళవారం (మార్చి 21) పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో కొత్తగా (ఫ్రెషర్స్) ఉద్యోగంలో చేరిన వారి భవిష్యత్ ఎలా ఉంటుంది? ఐటీ కంపెనీల్లో ఏయే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీలు ఎంత ఎక్కువ శాలరీలు చెల్లిస్తున్నాయనే అంశాలపై ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో క్రిష్ శంకర్ మాట్లాడారు. చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్య గమనిక! ఇటీవల కాలంలో ఉద్యోగుల జీతాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై ‘ గతంలో ఐటీ కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగికి మూడేళ్ల తర్వాతగాని జీతభత్యాలు 50 శాతం పెరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ రంగం వృద్ధి సాధించడంతో ట్రైనీల జీతాలు మూడేళ్లలో 90 శాతం పెరుగుతున్నాయని’ చెప్పారు. తక్కువ జీతం తీసుకునే వారి సంఖ్య తగ్గి అదే విధంగా ఐటీ రంగంలో వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తున్న వారికి కంపెనీలు భారీ ఎత్తున శాలరీ ప్యాకేజీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్రెషర్‌గా ఐటీ ఉద్యోగంలో చేరిన డిజిటల్ ఇంజినీర్, పవర్ ప్రోగ్రామర్స్ ఇలా వివిధ రకాలైన రోల్స్‌లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, వారి జీతాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయని అన్నారు. రూ.3.5 లక్షల ప్యాకేజీ తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. పవర్ ప్రోగ్రామర్స్ రూ.6.2లక్షలు, డిజటల్ ఇంజినీర్లు రూ.9 లక్షలు ప్యాకేజీ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. 4ఏళ్లకే ప్రమోషన్లు జీతాలతో పాటు వేగంగా ప్రమోషన్లు తీసుకుంటున్నారని, కంపెనీలో జేఎల్4 ((job level 4)టెక్నాలజీ అనలిస్ట్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి నాలుగేళ్లలో పదోన్నతులు లభిస్తున్నాయి. గతంలో ప్రమోషన్లు రావాలంటే కనీసం 7 నుంచి 8 సంవత్సరాలు పట్టేదని కృష్ణశంకర్ పేర్కొన్నారు. బ్రిడ్జ్ ప్రోగ్రామ్ గురించి మీకు తెలుసా? ఫ్రెషర్సే కాకుండా సంస్థలో పనిచేస్తూ ఎక్కువ శాలరీ కోసం వేరే కంపెనీలో చేరేందుకు ఇష్టపడుతున్న వారికి, లేదంటే ఉన్న ఫీల్డ్‌ను వదిలేసి మరో ఫీల్డ్‌లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నవారికి ‘ఇన్ఫోసిస్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నట్లు క్రిష్ శంకర్ వెల్లడించారు. ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అర్హులైన ఉద్యోగులు భారీ ప్యాకేజీలు, ప్రమోషన్లు దక్కించుకుంటున్నారని సూచించారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారికి స్కిల్స్ ఉంటే రెండేళ్లలో పదోన్నతి పొందవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ఇక ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్‌లో అర్హులైన ఉద్యోగులకు ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై తర్ఫీదు ఇస్తున్నామని, డిమాండ్ ఆధారంగా ఉద్యోగులకు ఆ టెక్నాలజీలో నైపుణ్యం సంపాదించేందుకు తోడ్పాటునందిస్తున్నట్లు ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిష్ శంకర్ స్పష్టం చేశారు. చదవండి👉 మేనేజర్లకు ఆదేశాలు..ఉద్యోగుల్లో క్షణ క్షణం.. భయం.. భయం! -
రంగారెడ్డి జల్లా షాబాద్‌లో ఐటీ సెంటర్: మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో త్వరలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఐటీ సెంటర్ ఏర్పాటు వల్ల 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. బుధవారం చందనవెల్లిలో వెల్స్పన్ పరిశ్రమ రెండో యూనిట్‌ను మంత్రి సబితారెడ్డి, ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులతో కలసి ఆయన ప్రారంభించారు. తర్వాత వెల్స్పన్ చైర్మన్ బీకే గోయెంకా తదితరులతో కలిసి కంపెనీలో కలియదిరిగి పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. చందనవెల్లిలో ప్రస్తుతం వెల్స్పన్ కంపెనీతోపాటు ఐటీఈఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేంద్రంలో మహిళలు, యువకులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కలి్పంచే బాధ్యతను కంపెనీ తీసుకుందని చెప్పారు. ఐటీ సెంటర్ ఏర్పాటుతో మరిన్ని చిన్న, మధ్య తరహా కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సీతారాంపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఐటీని మరింతగా విస్తరిస్తామని ప్రకటించారు. 40 నుంచి 50 పరిశ్రమల ఏర్పాటుకు కృషి వెల్స్పన్లో కార్యక్రమం అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. చందనవెల్లి, సీతారాంపూర్‌కు పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడ 40 నుంచి 50 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైతాబాద్, చందనవెల్లి, మాచనపల్లి గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు హెచ్ఎండీఏ ప్లాట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో పాలమూరు పూర్తి చేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేసి షాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్ చెప్పారు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘హెచ్–1బీ’ గ్రేస్ పీరియడ్ 12 నెలలకు పెంచాలి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో లే–ఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇతర రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫలితంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు నిరుద్యోగులుగా మారుతున్నారు. హెచ్–1బీ(నాన్–ఇమ్మిగ్రెంట్) వీసాపై ఉంటున్నవారు ఉద్యోగం పోయాక 60 రోజుల్లోగా(2 నెలలు) మరో కొలువు వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఈ గ్రేస్ పిరియడ్‌ను 60 రోజుల నుంచి 12 నెలలకు(ఒక సంవత్సరం) పెంచాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అండ్ గ్లోబల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనే రెండు భారత–అమెరికన్ సంస్థలు పోరాటం ప్రారంభించాయి. భారత టెకీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆన్లైన్లో పిటిషన్లు సమర్పిస్తున్నాయి. అధ్యక్షుడితోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి, యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్‌కు ఆన్లైన్లో పిటిషన్లను పంపిస్తున్నాయి. -
ఐటీ సేవల జోరు.. నెమ్మది
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల పరిశ్రమ వృద్ధి వేగం.. స్వల్పకాలికం నుంచి మధ్యకాలికంగా మందగించనుంది. ప్రతికూల స్థూలఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు ఐటీపరంగా అవసరమైనవైతే తప్ప మిగతా వ్యయాలను తగ్గించుకోనుండటమే ఇందుకు కారణం. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు అధిక స్థాయిలో రిక్రూట్ చేసుకున్నందున సమీప భవిష్యత్తులో హైరింగ్ కూడా తగ్గవచ్చని పేర్కొంది. స్థూలఆర్థిక ప్రతికూలతల కారణంగా గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే డిమాండ్ ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. బేస్ ఎఫెక్ట్, కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల వల్ల దేశీ ఐటీ సరీ్వసుల సంస్థల వృద్ధి కొంత నెమ్మదించింది. ఇక్రా ప్రకారం.. ► వేతనాల ఖర్చులు పెరగడం తదితర అంశాల వల్ల నిర్వహణ లాభాల మార్జిన్లు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కానున్నాయి. ► ఐటీకి కీలకమైన విభాగాల్లో ఒకటైన .. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా) సెగ్మెంట్ ఇటీవలి కాలంలో మిగతా విభాగాలతో పోలిస్తే కాస్త మందగించింది. రుణ లావాదేవీలు నెమ్మదించడం ఇందుకు కొంత కారణం. స్థూలఆర్థిక సవాళ్లు కొనసాగిన పక్షంలో తయారీ, హెల్త్‌కేర్ సెగ్మెంట్లతో పోలిస్తే తనఖా రుణాలు, రిటైల్ సెగ్మెంట్లలో వృద్ధి మరింతగా నెమ్మదించవచ్చు. ► కొన్నాళ్లుగా భారీ అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటుతో పరిశ్రమ సతమతమవుతోంది. ప్రధానంగా డిజిటల్ టెక్నాలజీ నిపుణులు డిమాండ్‌కు తగ్గ స్థాయిలో దొరకడం లేదు. అయితే, గత రెండు త్రైమాసికాలుగా అట్రిషన్ తగ్గుముఖం పడుతోంది. వచ్చే రెండు–మూడు క్వార్టర్లు ఇదే ధోరణి కొనసాగవచ్చని, ఆ తర్వాత కాస్త స్థిరపడవచ్చని ఇక్రా అంచనా వేసింది. ► వృద్ధి వేగం మందగించవచ్చని భావిస్తున్నప్పటికీ దేశీ ఐటీ సర్వీసుల పరిశ్రమ అంచనాలపై ఇక్రా స్టేబుల్ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తోంది. డిజిటల్..క్లౌడ్ సేవలు సహా ఐటీ సరీ్వసులకు డిమాండ్ పెరుగుతుండటం, మన కంపెనీలు దీటుగా పోటీపడగలగడం, కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. -
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి... మరో రూ. 16వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. గత సంవత్సరం ప్రారంభంలో రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో ఒక్కోటీ సగటున 100 మెగావాట్ల ఐటీలోడ్ (సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు వినియోగించిన లేదా వాటి కోసం కేటాయించే విద్యుత్ మొత్తం)తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ తాజాగా దావోస్ వేదికగా మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు మరో రూ. 16 వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తంగా 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే 10–15 ఏళ్లలో ఈ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయని పేర్కొంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకే ఈ భారీ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వివరించింది. మైక్రోసాఫ్ట్‌తో బంధం బలోపేతం: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 డేటా సెంటర్లు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం సంతోషకరమన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లో హైదరాబాదే కీలకమని, భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భారత్ కేంద్రంగా తమ సంస్థ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు కీలకంగా మారతాయన్నారు. -
మళ్లీ మొదటికి వచ్చింది.. టెక్కీలకు తీపికబురు చెప్పనున్న కంపెనీలు!
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో ఈ మహమ్మారి రూపాంతరం చెంది విలయతాండవం చేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయాలు, లాక్డౌన్ దేశాన్ని పట్టుకున్నందున వర్క్ ఫ్రమ్ హోం (Work From Home) తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, భారత్‌లో వైరస్ భయంతో ఇప్పటికే ఆతిథ్యం, రవాణా, పర్యాటకం, రియల్ ఎస్టేట్‌తో సహా వివిధ రంగాలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఒమిక్రాన్ (Omicron) కొత్త BF.7 వేరియంట్ చైనాను వణికిస్తున్న తరుణంలో దేశంలో ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా మొదలయ్యాయి. అయితే జాగ్రత్తలు ఎన్ని తీసుకున్న కరోనా ఫోర్త్ వేవ్ దేశాన్ని మరో సారి వణికిస్తుందేమోనని భయం ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలకు ఇది తలనొప్పిగా మారిందనే చెప్పాలి. నిన్నటి వరకు ఆఫీస్‌కు రావాలని, హైబ్రిడ్ వర్క్ మోడల్లో పనిచేయాలని కంపెనీలు తమ ఉద్యోగులను సన్నద్ధం చేస్తూ వచ్చాయి. టెక్కీలు కూడా అయిష్టంగానే వీటికి అంగీకరించారు. అయితే తాజా పరిస్థితులతో చూస్తుంటే కంపెనీలకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపేలా ఉన్నాయంటూ నివేదికలు కూడా ఊపందుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు బాగా పెరగడంతో, దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమను తాము సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా జపాన్, దక్షిణ కొరియా, చైనాతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు ప్యాసింజర్లకు కోవిడ్ (COVID-19) పరీక్షను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో వైపు మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్! -
మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ముంబై: మూన్‌లైటింగ్ (రెండో చోట్ల ఉద్యోగాలు చేయడం)పై వివాదం నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఇది అనైతిక వ్యవహారంగానే భావిస్తున్నారు. వాల్యువోక్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో దాదాపు 81 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం మూన్‌లైటింగ్‌కు ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు. సర్వేలో పాల్గొన్న ప్రతి అయిదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే (19 శాతం) మూన్‌లైటింగ్ వైపు మొగ్గు చూపగా మిగతా వారు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం అనైతికమేనని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 1,281 సంస్థలు, 1,533 మంది ఉద్యోగార్థులు .. ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం మూన్‌లైటింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది (37 శాతం) .. అకస్మాత్తుగా ప్రధాన ఉద్యోగం పోయినా ఆదాయం దెబ్బతినకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. మరికొందరు (27 శాతం) కొంత అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కంపెనీల అభిప్రాయం మాత్రం మరో రకంగా ఉంది. చేతిలో తగినంత పని లేకపోవడం వల్ల ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మళ్లుతున్నారని 31 శాతం సంస్థలు భావిస్తుండగా, రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారి చేతిలో సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్లుగా నివేదిక పేర్కొంది. క్వైట్ క్విటింగ్ సమస్య.. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, అలసట పెరిగిపోతుండటం వల్ల క్వైట్ క్విటింగ్ (క్రమంగా నిష్క్రమించడం) సమస్య పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఇలాంటి ఉద్యోగులు తాము ఉద్యోగాన్ని అట్టే పెట్టుకునేందుకు అవసరమైన కనీస విధులను మాత్రమే నిర్వర్తిస్తూ క్రమంగా పని నుండి తప్పుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగంపై సంతృప్తి తక్కువగా ఉండటం, సవాళ్లు లేక బోరింగ్‌గా ఉండటం వంటి కారణాలు ఎక్కువగా ఉంటున్నట్లు 33 శాతం కంపెనీలు తెలిపాయి. 21 శాతం కంపెనీలు.. ఉద్యోగం పట్ల నిబద్ధత లేకపోవడమే ఈ తరహా నిష్క్రమణలకు కారణమని అభిప్రాయపడ్డాయి. ఉద్యోగుల కోణంలో చూస్తే 29 శాతం మంది.. తీవ్రమైన పని భారం, అలసటే క్వైట్ క్విటింగ్కు కారణమని తెలిపారు. మేనేజర్లు, బాస్‌ల నుండి సహకారం లేకపోవడం వల్లే ఈ ధోరణి పెరుగుతోందని 23 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
ఐటీ ఉద్యోగులకు షాక్.. అప్పటి నుంచి 100 శాతం వర్క్ ఫ్రమ్ ఆఫీస్!
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ క్యాపిటల్‌గా మారిన గ్రేటర్ సిటీలో వచ్చే ఏడాది జనవరి నుంచి వంద శాతం ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేలా నగరంలోని ఐటీ కంపెనీలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు ఉద్యోగులకు వర్తమానాలు పంపినట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటివరకు హైబ్రీడ్ విధానంలో.. అంటే సుమారు 70 నుంచి 80 శాతం మంది ఆఫీసుకు వచ్చి పనిచేస్తుండగా.. మరో 20 నుంచి 30 శాతం మంది వర్క్‌ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ పలువురు కార్యాలయంలో అత్యవసర సమావేశాలకు హాజరయ్యేందుకు వారంలో ఒకటి రెండు మార్లు ఆఫీసులకు వస్తున్నారు. ప్రస్తుతం మహానగరం పరిధిలో అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పూర్తిస్తాయిలో కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా వర్క్‌ఫ్రం హోం అయినప్పటికీ ఆయా కంపెనీలు, ఉద్యోగుల ఉత్పాదకత, ఎగుమతులు ఏమాత్రం తగ్గలేదని హైసియా వర్గాలు పేర్కొనడం విశేషం. ఐటీలో నయా ట్రెండ్ ఇలా... నగరంలో కార్పొరేట్, బడా, చిన్న ఐటీ కంపెనీలు సుమారు 1500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఈ ఏడాది జూన్–అక్టోబరు మధ్యకాలంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతోన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతానికి పెరిగినట్లు హైసియా వర్గాలు తెలిపాయి. దిగ్గజ కంపెనీలుగా పేరొందిన టీసీఎస్,ఇన్ఫోసిస్ కంపెనీలు సైతం ఈజాబితాలో ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీల్లో ఈ ట్రెండ్ 27 శాతం మేర నమోదైందట. అనుభవం గడించిన ఉద్యోగులు ఇతర కంపెనీలకు వలసలు పోతుండగా..ఫ్రెషర్స్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈపరిణామం ఈ రంగంలో కొత్తేమీ కానప్పటికీ ఇటీవల మరింత పెరగడం విశేషమని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టుల జోరు పెరిగింది.. నిపుణులైన ఐటీ ఉద్యోగులు వలసబాట పట్టడానికి ప్రధాన కారణం నూతన ప్రాజెక్టులేనని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో పలు కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని అధికంగా అమలు చేస్తున్న కారణంగానే ఐటీ ప్రాజెక్టులు అనూహ్యంగా పెరిగాయి. అమెరికా,యూరప్,కెనడా,ఆ్రస్టేలియా దేశాలకు చెందిన సంస్థలకు నగరంలోని పలు కంపెనీలు ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. వీటికి ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రధానంగా కృత్రిమ మేథ,మిషన్ లెరి్నంగ్,బ్లాక్‌చైన్,సైబర్‌సెక్యూరిటీ సంబంధిత ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగిందట. ఇందులో అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడం విశేషం. డిజిటల్ టెక్నాలజీ నిపుణులకు తాజాగా 30 శాతం మేర డిమాండ్ పెరగడం ఐటీలో నయా ట్రెండ్. -
‘వెనక ఇంత జరిగిందా’.. ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన ప్రముఖ ఐటీ కంపెనీ!
ఐటీలో రోజుకో అంశం తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. నిన్నటి వరకు మూన్‌లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్‌పై చర్చ నడవగా, తాజాగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలు పొందుతున్నారనే అంశం తెరపైకి వచ్చింది. తాజగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ యాక్సెంచర్ తమ నియామక ప్రక్రియలో కంపెనీని తప్పుదారి పట్టించిన ఉద్యోగులపై వేటు వేసింది. సంస్థలో ఉద్యోగం పొందడానికి నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్, ఇతర తప్పుడు పత్రాలను ఉపయోగించిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ఆ ఉద్యోగులపై వేటు.. యాక్సెంచర్ కంపెనీ కఠిన వాణిజ్య నైతిక విలువలను అనుసరిస్తుందని, కంపెనీ నియమ, నిబంధలను పాటించని వారిపై వేటు తప్పదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి కొందరు ఉద్యోగాలు పొందారన్న విషయం తెలియడంతో వారిని తొలగించింది. అయితే అలా పని చేస్తున్నా వారిలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న దానిపై యాక్సెంచర్ పూర్తి వివరాలు తెలపాల్సి ఉంది. వీటితో పాటు మరో అంశంపై స్పందిస్తూ.. నకిలీ జాబ్ పోస్టుల పట్ల అభ్యర్థులు జాగ్రత్త వహించాలని సూచించింది. యాక్సెంచర్‌లో ఉద్యోగం కోసం కొన్ని ఎంప్లాయిమెంట్ ఏజెన్సీలు, కొందరు వ్యక్తులు ఉద్యోగార్థుల వద్ద డబ్బు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. వాటిని నమ్మకండి యాక్సెంచర్‌లో ఉద్యోగం ఇచ్చే క్రమంలో డబ్బు వసూలు చేయాలని తాము ఏ సంస్ధకు, వ్యక్తికి అధికారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. నకిలీ జాబ్ ఆఫర్ల పట్ల అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బ్లాగ్ పోస్ట్‌లో హెచ్చరించింది. యాక్సెంచర్‌లో జాబ్ కోసం ఏ ఒక్కరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ సంస్థలో నియామకం కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని, ఉద్యోగాల కోసం ఎవరూ ఎప్పుడూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి: Dropout Chaiwala: విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు! -
ముదురుతున్న మూన్‌లైటింగ్.. తెరపైకి మరో కంపెనీ, అసలేం జరుగుతోంది!
న్యూఢిల్లీ: మూన్‌లైటింగ్ (ఒకే సారి రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) అనేది ఉద్యోగ కాంట్రాక్టును ఉల్లంఘించడమేనని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఐటీ సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ స్పష్టం చేసింది. మూన్‌లైటింగ్ చేస్తున్నారని తేలిన ‘కొందరు’ ఉద్యోగులను గత 6–12 నెలల్లో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు పేర్కొంది. అయితే, ఎంత మందిపై చర్యలు తీసుకుందో వెల్లడించలేదు. కంపెనీలో దాదాపు 4,581 మంది ఉద్యోగులున్నారు. ఈ విషయంలో మిగతా వారికి మరింత స్పష్టం ఇచ్చేందుకే.. మూన్‌లైటింగ్ చేస్తూ దొరికిన వారిని వెంటనే తొలగించినట్లు కంపెనీ ఎగ్జి క్యూటివ్ వైస్ చైర్మన్ జోసెఫ్ స్పష్టం చేశారు. కాగా గత మూన్‌లైటింగ్ వివాదం ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా మూన్లైటింగ్కి పాల్పడుతున్నారని విప్రో 300 మందిని ఉద్యోగులను తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక అప్పటి నుంచి దీనిపై భిన్నస్వరాలు వినపడుతోంది. కొన్ని కంపెనీలు దీనికి మద్దతు తెలుపుతుండగా , మరొకొన్ని సంస్థలు మాత్రం అంగీకరించే సమస్య తేదని తేల్చేస్తున్నాయి. చివరికి మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు ఏకంగా పెద్ద చర్చే నడుస్తోంది. ప్రముఖ దిగ్జజ కంపెనీ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ.. మూన్‌లైటింగ్ మోసం అంటూ దీనిపై ఘాటుగానే స్పందించారు. ‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఏరివేసే పనిలో ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు. చదవండి: ‘ఐటీపై మూన్లైట్’ -
టెక్ కంపెనీల్లో.. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ..
ఒక బడా ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఇతర కంపెనీలకూ పని చేస్తున్నట్టు తేలింది. ఇంకేముంది? యాజమాన్యం అతన్ని తొలగించింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్‌ట్యాప్‌లు ఉండడమే కాదు, ఏ ల్యాప్‌ట్యాప్‌ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. మూన్‌లైటింగ్ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. పేరోల్‌లో ఉన్న 300 మందిని విప్రో తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. మూన్‌లైటింగ్ మోసం అంటూ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ద్వంద్వ ఉద్యోగాలను అనుమతించేది లేదని నొక్కిచెప్పింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తీసివేస్తామని హెచ్చరించింది. వేలాది కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు. దేశంలో 2008 నుంచి 2020 వరకు ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి కొంత అభద్రతా భావంతో పనిచేశారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీలు ఏ క్షణంలో తమ ఉద్యోగాలకు ఎసరు పెడతాయో తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎక్కువ పని గంటలు, అతి తక్కువ వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు సుదీర్ఘ కాలం తీసుకోవడం లాంటి పరిస్థితి దాచాలన్నా దాగని వాస్తవం. కానీ 2020లో కోవిడ్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు డిజిటల్ వైపు మారాయి. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు వెల్లువెత్తాయి. ఎవరూ ఊహించని ఈ పరిస్థితితో ఐటీలో మానవ వనరుల కొరత తీవ్రమైంది. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు రెట్ల జీతం ఇచ్చి కంపెనీలు తీసుకున్నాయి. ఫ్రెషర్లకు, అరకొరగా స్కిల్స్, నాలెడ్జి ఉన్న అభ్యర్థులను సైతం నియమించుకున్నాయి. ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు క్యూ కట్టడంతో ఉద్యోగుల సమస్యపై కంపెనీలు వ్యూహాత్మక మౌనం పాటించాయి. మూడవ లాక్డౌన్ తరువాత ప్రాజెక్టులు కూడా క్రమబద్ధం కావడంతో ఉద్యోగుల సమస్య వైపు కంపెనీలు దృష్టి సారించాయి. అందులో మొదటి అడుగు హైబ్రిడ్ పని విధానం. ఈ విధానంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తించాలని తేల్చిచెప్పాయి. ఇక్కడే సమస్య మొదలైంది. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులలో చాలామందికి సరైన నైపుణ్యాలు, అనుభవం లేవని, వాళ్ళు కంపెనీకి సమర్పించిన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు కూడా తప్పుడువేనని తేలింది. ఈ సమస్యను మరింత లోతుగా పరిశీలించడంతో నమ్మశక్యం కానీ విషయాలు ఐటీ కంపెనీలకు బోధపడ్డాయి. ఇంటి నుంచి పని నేపథ్యంలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఒకేసారి రెండు, మూడు కంపెనీలకు పనిచేస్తున్నట్లు (మూన్‌లైటింగ్) గుర్తించాయి. కొందరైతే వాళ్ళ పనిని అనుభవజ్ఞులకు ఇచ్చి చేయించుకున్నట్లు తేలింది. మరోవైపు కొత్తగా చేరినవారిని, బెంచ్‌పైన ఉన్న అభ్యర్థులను క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఇంటర్వ్యూలో గట్టెక్కితేనే కంపెనీ జీతం చెల్లిస్తుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే! గడిచిన రెండేళ్లలో రెండు చేతులా సంపాదనకు అలవాటు పడ్డ సిబ్బంది కొంతమంది ఉన్న ఉద్యోగాలలో మంచిది ఒకటి ఎంచుకొని హైబ్రిడ్ విధానానికి మారారు. ఇంకొంతమంది మూన్‌లైటింగ్ విధానాన్ని చట్టబద్ధం చేయాలని బహిరంగంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపైన చర్చ ఊపందుకొంది. ఈ పరిస్థితుల్లో నాణ్యత దెబ్బతినడం, డేటా ప్రైవసీకి భంగకరం అని క్లయింట్లు భావించి ప్రాజెక్టులను రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మనుగడకే ఇబ్బంది కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అత్యంత అనుకూలం, లాభదాయకం. కానీ ఉద్యోగులు ఎంచుకుంటున్న విధానాలను క్రమబద్ధం చేయకుంటే ప్రపంచ ఐటీ రంగంలో భారత కంపెనీల పట్ల ఉన్న సానుకూలతను చేజేతులా కోల్పోతాము. విదేశీ క్లయింట్లు డేటా సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అందుకు ఉన్న చట్టాలు కూడా రోజు రోజుకి పటిçష్ఠం అవుతున్న సంగతి అనుభవజ్ఞులైన ఉద్యోగులకు తెలుసు. తమ ఉద్యోగులు రెండు మూడు కంపెనీలకు పనిచేస్తున్న విషయం తెలిస్తే మెజారిటీ క్లయింట్లు ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటే ఒక్క ఐటీ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక రంగాన్ని కూడా విషమ పరిస్థితుల్లోకి నెట్టడం ఖాయం. కొంతమంది క్లయింట్లు కన్సల్టెంట్ విధానానికి మొగ్గు చూపినా, బిల్లింగ్ విషయంలో విపరీతంగా తగ్గిస్తే కంపెనీల ఆదాయంలో భారీ కోతపడే అవకాశం ఉంటుంది. కన్సల్టెంట్ విధానం స్వల్పకాలంలో కంపెనీలకు, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు లాభదాయకంగా కనపడినా, ధీర్ఘకాలంలో ఐటీ రంగం మనుగడకే ఇబ్బంది. అవర్లీ బిల్లింగ్ లేదా మొత్తం పని గంటలు గణనీయంగా తగ్గించమని ఒత్తిడి చేస్తే కంపెనీల ఆదాయం, లాభాలు తగ్గుతాయి. ఐటీ రంగానికి గొడ్డలిపెట్టు మూన్‌లైటింగ్ విధానం ఐటీ రంగానికి ఒక గొడ్డలిపెట్టు. ఈ విధానానికి అనుభజ్ఞులైన ఉద్యోగుల నుండి మద్దతు పెరుగుతూ ఉంటే మరొక వైపు లక్షల సంఖ్యలో నిరుద్యోగులుగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. తమ అవకాశాలను గణనీయంగా దెబ్బ తీస్తుందని ఆందోళన చెందుతున్నారు. మూన్‌లైటింగ్ చట్టబద్ధం అయితే కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలకు, క్యాంపస్ రిక్రూట్మెంట్లకు స్వస్తి పలుకుతాయని భావిస్తున్నారు. ‘వైద్య రంగంలో డాక్టర్ల కొరత ఉంటుంది కాబట్టి వాళ్లకు కన్సల్టెంట్ విధానం పనికి వస్తుంది. కానీ లక్షల సంఖ్యలో మానవ వనరులు ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఈ విధానం అవసరం లేదు’ అని కాంటార్ జీడీసీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ కందుకూరి సురేశ్ బాబు తెలిపారు. మూన్‌లైటింగ్‌కు ఓకే మూన్‌లైటింగ్‌ను సమర్థించే కంపెనీలూ లేకపోలేదు. టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ అయితే కాలానికి అనుగుణంగా మారుతూ ఉండవలసిన అవసరాన్ని ఎత్తి చూపారు. పని విధానంలో మార్పులను స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఎవరైనా సమర్థత, ఉత్పాదకత నిబంధనలకు అనుగుణంగా, ఆ వ్యక్తి మోసం చేయనంత వరకు కొంత అదనపు డబ్బు సంపాదించాలని కోరుకుంటే తన కంపెనీ విలువలు, నైతికతకు విరుద్ధంగా ఏమీ చేయరు. ఈ విషయంలో నాకు ఏమీ ఇబ్బంది లేదు. రెండు చోట్లా పని చేయడాన్ని ఒక విధానంగా చేయాలనుకుంటున్నాను. మీరు దీన్ని చేయాలనుకుంటే సంతోషం. కానీ దాని గురించి బహిరంగంగా ఉండండి’ అని గుర్నానీ అన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ మూన్‌లైటింగ్ పాలసీని ప్రకటించింది. సంస్థ విధులకు ఆటంకం కలగకుండా గిగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు తన ఉద్యోగులకు అనుమతినిచ్చింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే, పని విషయంలో స్విగ్గీ, విప్రో.. పూర్తిగా భిన్నమైన స్వభావం కలవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడానికి స్విగ్గీని ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయితే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉందని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా గుర్తు చేశారు. ‘విప్రో వర్సెస్ స్విగ్గీ – ఈ రెండు కంపెనీలనూ ఒకేగాటన కట్టలేము. ఫార్చూన్–500 కంపెనీలకు విప్రో సేవలు అందిస్తోంది. ఈ సంస్థలకు డేటా గోప్యత ప్రాణప్రదమైనది. డేటా బయటకు పొక్కే అవకాశం ఉందని భావిస్తే అవి సహించవు’ అని అన్నారు. ‘ఒక సంస్థలో పనిచేస్తూ మరో కంపెనీకి మూన్లైటింగ్కి పాల్పడడం అనైతికం. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. దీనికి అనుమతించేది లేదు. కానీ భవిష్యత్ వర్క్‌ఫోర్స్ మోడల్ అనేది కన్సల్టెంట్లుగా పనిచేసే వ్యక్తుల సమూహం. సహకార సమూహాలుగా కంపెనీల కోసం ఉత్పత్తులను రూపొందిస్తారు. వారు ఒకే సమయంలో ఐదు వేర్వేరు కంపెనీల కోసం దీన్ని చేయవచ్చు. అయితే చాలామంది వ్యక్తులు భవిష్యత్తులో వ్యవస్థాపకులుగా మారబోతున్నారని, వారు సొంతంగా కంపెనీలను ప్రారంభించాలని చూస్తున్నారని కంపెనీలు గుర్తించాలి’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ‘ఉద్యోగుల నుంచి పారదర్శకత లేకపోవడం వల్ల మూన్‌లైటింగ్‌పై భిన్నాభిప్రాయాలు ఉత్పన్నమవుతాయి. పూర్తి సమయం ఉద్యోగిగా ఉన్నప్పుడు ప్రస్తుత యజమానికి తెలియజేయకుండా ఇతర అవకాశాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య తలెత్తుతుంది. ఇక్కడే యజమాని, ఉద్యోగుల మధ్య నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. దీనిని ఎలా పరిష్కరించాలన్నదే ముందున్న సవాలు. మహమ్మారి తదనంతరం పని విషయంలో ఉద్యోగుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీలు అప్‌గ్రేడ్ అవ్వాలి. కంపెనీలు రెండు మోడళ్లను స్వీకరించాలి. ఒకటి కంపెనీలో పూర్తి సమయం కేటాయించే ఉద్యోగులను కలిగి ఉండడం. మరొకటి గిగ్ వర్కర్లతో సైతం పనులు చేయించుకోవడం. బహుళ ఉద్యోగాలు చేయడం సమస్య కాదు. కానీ దీన్ని ఎలా చేస్తారన్నదే ప్రశ్న’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబజానీ ఘోష్ వెల్లడించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) భారత్‌లో సాంకేతిక పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఉద్యోగి ఒక కంపెనీలో చేరే ముందు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ ఎంప్లాయీ ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఇక్కడ పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం, మేధాసంపత్తి హక్కులను, వ్యాపార రహస్యాలను, సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం, ల్యాప్‌టాప్ వంటి సంస్థ అందించిన ఆస్తులను ఇతరులతో, ఇతర కంపెనీలతో పంచుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. ఇలా ఒప్పందాన్ని కాలరాసిన ఉద్యోగిని తీసివేసే హక్కు సంస్థలకు ఉంటుంది. ‘ఉద్యోగులు తమ ఆఫర్ లెటర్లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. వారు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలతో పని చేయాలనుకుంటే గిగ్ వర్కర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు’ అని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ మనీషా సబూ తెలిపారు. ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ‘ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఐటీ కంపెనీలు 2003–04లో రూ.2.5–3 లక్షలు ఆఫర్ చేశాయి. ఇప్పుడు ఇదే రోల్‌కు రూ.3–3.5 లక్షలు చెల్లిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఇప్పుడు వేతనం రూ.6.5–7 లక్షలు ఉండాలి. జీతాలు మెరుగ్గా ఉంటే జాబ్ వదిలేయరు. మూన్‌లైటింగ్‌కు పాల్పడరు’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికులు స్వతంత్రంగా, తాత్కాలికంగా పనిచేసేవారే గిగ్ కార్మికులు. అంటే ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్స్ వంటి వారు అన్నమాట. ఫ్రీలాన్స్ ఐటీ నిపుణులూ గిగ్ జాబితాలో వచ్చి చేరారు. పని, కాంట్రాక్ట్ పూర్తి అయ్యేవరకు లేదా కొన్ని గంటల కాలానికి వీరు సేవలు అందిస్తారు. వీరి కోసం ఆన్లైన్ వేదికలూ వచ్చాయి. గిగ్‌వర్కర్, గిగ్ఇండియా, వర్క్ఫ్లెక్సి, ఫ్లెక్సిపుల్, ఫ్లెక్స్‌జాబ్స్, జంగిల్వర్క్స్, గిగ్మోస్ వంటివి వీటిలో ఉన్నాయి. ఈ వేదికల్లో కార్మికులు, నిపుణులు తమ పేర్లను నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ల కాల్స్ ఆధారంగా పని ఒప్పదం కుదురుతుంది. ఫలానా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ పోర్టల్స్‌లో తాటికాయంత అక్షరాలతో ఇవి ఊదరగొడుతున్నాయి. అంతేకాదు ఎన్ని డబ్బులు అందుకుంటారో వెల్లడిస్తున్నాయి. ఏ కంపెనీకి ఎంతమంది నిపుణుల సేవలు అవసరమో కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని గంటలు, రోజులు పనిచేయాల్సి ఉంటుందీ తెలియజేస్తున్నాయి. ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే? నిపుణుల కొరత, సేవల ఖర్చు పెరగడం, సరైన నిపుణుల దొరక్కపోవడం, సమయానికి పనులు పూర్తి చేయడం కోసం, పోటీ కంపెనీని దెబ్బతీయడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి, త్వరితగతిన ప్రాజెక్టును డెలివరీ చేయడం కోసం కొన్ని కంపెనీలు మూన్‌లైటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రధానంగా స్టార్టప్స్ ఇందుకు సై అంటున్నాయి. అదనపు సంపాదన కోసం... జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది. బీమా, అద్దెలూ అధికం అయ్యాయి. ‘కోవిడ్’ మహమ్మారి కారణంగా భవిష్యత్తు పట్ల భయం పట్టుకుంది. అనుకోని ఖర్చులు మీద పడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. జీవనం అస్తవ్యస్తం అయింది. ఉద్యోగం ఉంటుందా లేదా అన్న సందేహం. చివరకు డబ్బే జీవితం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రతిభకు పదునుపెట్టారు. కొత్త కోర్సులు చేశారు. మరో కంట పడటం లేదు కదా అన్న భావనతో ఇతర కంపెనీలకూ పని చేస్తున్నారు. తద్వారా అదనంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇంటి నుంచి పని విధానం ఇందుకు కలిసి వచ్చింది. ఎలా బయటపడిందంటే? మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) సాయంతో కంపెనీలు గుర్తిస్తున్నాయి. యూఏఎన్ ఆధారంగా అభ్యర్థి ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నదీ, ఎప్పుడు చేరిందీ వంటి వివరాలను కంపెనీలు తెలుసుకుంటున్నాయి. అలాగే సంస్థ అందించిన ల్యాప్‌టాప్స్‌ను కంపెనీ సర్వర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాయి. అంతా క్యాష్ మూన్‌లైటింగ్ మరో కంట కనపడకుండా అభ్యర్థులు కన్సల్టెంట్ల అవతారం ఎత్తుతున్నారు. అత్యధికంగా యూఎస్, యూకే కంపెనీల నుంచి కాంట్రాక్ట్ తీసుకుని అవసరం అయితే ఓ నలుగురిని పెట్టుకుని పని పూర్తి చేస్తున్నారు. నగదు రూపంలో మాత్రమే అందుకునే ఈ ప్రతిఫలాన్ని కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. బ్యాంక్ క్యాష్ కార్డులు, గిఫ్ట్ వోచర్లనూ స్వీకరిస్తున్నారు. - నూగూరి మహేందర్ చట్టం ఏం చెబుతోంది కార్మిక చట్టాలు కార్మికుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించబడ్డాయి. చేస్తున్న పని అలసటకు దారి తీయకూడదు. సాధారణంగా వారానికి 48 గంటలు– అంటే రోజుకు 8 గంటల పని. వారానికి ఒక రోజు విశ్రాంతి ఉంటుంది. రెండు కంపెనీల కోసం ఒక వ్యక్తి పనిచేస్తున్నట్లయితే ఈ భావనను ఉల్లంఘించినట్టే! సాధారణంగా ఒక వ్యక్తిని తొలగించినప్పుడు చేతిలో ఉద్యోగం ఉందా? మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇప్పటికే వేరే ఉద్యోగం ఉంది. కాబట్టి తొలగింపును తీవ్రంగా పరిగణించలేము. కంపెనీలు సాధారణంగా అపాయింట్మెంట్ ఉత్తర్వుల్లో తమ వ్యాపార గోప్యత గురించి కూడా పేర్కొంటాయి. ఉద్యోగి ఒకే రకమైన యూనిట్లో మరోచోట పనిచేస్తుంటే, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే! కాబట్టి కంపెనీలు చర్య తీసుకోవచ్చు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్– సెక్షన్ 69 రెండు చోట్లా ఉపాధిని నిరోధించడానికి నిర్దేశించినది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉద్యోగికి సెలవు ఇచ్చిన లేదా సెలవులో ఉన్న ఒక రోజు లేదా రోజులో కొంత సమయం ఏ సంస్థలో కూడా పని చేయకూడదు. ఏ యజమాని అయినా ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగా అనుమతించకూడదు. –శ్యామ్‌సుందర్ జాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, హైదరాబాద్–2 ఒకే ప్రవర్తనా నియమావళి కోవిడ్ తర్వాత పని విధానం మారింది. కార్పొరేట్లు తమ ఉద్యోగ ఒప్పందాలను పునర్నిర్వచించుకోవాలి. ఉద్యోగులతో సంబంధాలను మెరుగుపరచాలి. ఉద్యోగులు, యజమానుల మధ్య భారీ సంక్లిష్టతను, విభజనను మూన్‌లైటింగ్ సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో ఐటీ ఉద్యోగుల కోసం మోడల్ ప్రవర్తనా నియమావళి అవసరం. పనిగంటలు, సెలవులు, విధి విధానాల విషయంలో ప్రామాణికత రావాలి. ఉద్యోగులకు తమ సంస్థలోనే అదనపు పని గంటలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అందుకు తగ్గట్టుగా నగదుతో ప్రోత్సహించాలి. నిపుణులను సొంతంగా తీర్చిదిద్దాలి. ఇందుకు నియామకాల్లో 30 శాతం మంది ఫ్రెషర్స్ ఉండేలా చూసుకోవాలి. అభ్యర్థి ఉద్యోగంలో చేరుతున్న సమయంలోనే ఒప్పందంలోని అంశాలను సవివరంగా తెలియజేయాలి. – వెంకా రెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణుడు నియామకాల్లో స్తబ్ధత తప్పుడు ఇంటర్వ్యూలు, తప్పుడు అనుభవ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగులను తొలగించడాన్ని కంపెనీలు వేగవంతం చేశాయి. గత రెండు, మూడు నెలలుగా నూతన నియామకాలు చేపట్టకుండా తప్పుడు అభ్యర్థులను తొలగించడంపైన దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా నియామకాల్లో స్తబ్ధత నెలకొంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపొతే క్లయింట్ల నమ్మకం కోల్పోయి తమ సంస్థలే కాకుండా ఐటీ రంగం మొత్తం కుదేలయ్యే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీ గుర్తించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. – నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్ -
ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు! వచ్చే 12 నెలల్లో..
ముంబై: ఐటీ రంగంలో సగం మంది నిపుణులు (53 శాతం మంది) వచ్చే ఏడాది కాలంలో నూతన ఉద్యోగంలో చేరిపోవచ్చని ‘స్కిల్‌సాఫ్ట్ 2022 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ’ నివేదిక తెలిపింది. మెరుగైన పారితోషికంతోపాటు, ప్రస్తుత ఉద్యోగంలో శిక్షణ, పురోగతి లేకపోవడం, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపించడం కారణాలుగా పేర్కొంది. ఐటీల్లో టీమ్ లీడర్లు, ఆపై స్థాయి ఉన్న వారు తమ బృందంలో నైపుణ్యాల లోటును ఎదుర్కొంటున్నట్టు స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. నిపుణుల వలస, తిరిగి నిపుణులను ఆకర్షించడం అనే రెండు పెద్ద సవాళ్లను ఐటీ రంగం ఎదుర్కొంటున్నట్టు నివేదిక ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది వచ్చే 12 నెలల్లో తాము కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చని చెప్పారు. సుమారు 8,000 మంది స్కిల్‌సాఫ్ట్ సర్వేలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీకి మారే విషయంలో ఉన్న వేగం, తగినన్ని సాంకేతిక వనరులు లేకపోవడం ఐటీ నిపుణులను కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. ‘‘అధ్యయనం అన్నది ఉద్యోగులు, సంస్థల పరస్పర అభివృద్ధికి ప్రేరణనిస్తుంది. ముఖ్యంగా నిపుణులను కాపాడుకోవడంలో ఉన్న ఇబ్బందులు, ఆవిష్కరణల వేగం దృష్ట్యా సంస్థలకు శిక్షణ ఎంతో సాయపడుతుంది’’అని స్కిల్‌సాఫ్ట్ జనరల్ మేనేజర్ జాచ్ సిమ్స్ పేర్కొన్నారు. నేర్చుకునే సంస్కృతి ఏర్పాటు చేయడం, నైపుణ్యాల అభివృద్ధి అన్నవి విజయానికి కీలకమన్నారు. నైపుణ్యాలు కలిగిన ఆశావహల నియామకం, వారిని కాపాడుకునే విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చదవండి: జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్వర్క్ పొందండిలా! -
ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ రాజీనామా చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ఫోసిస్ గ్లోబల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ విభాగానికి ఆయన సారథ్యం వహించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో న్యూక్లియర్ సైంటిస్టుగా కెరియర్ ప్రారంభించిన రవి కుమార్ 2002లో ఇన్ఫీలో చేరారు. 2016లో ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2017లో డిప్యుటీ సీవోవోగా నియమితులైన రవి .. ఆ తర్వాత సీవోవోగా పదోన్నతి పొందుతారనే అంచనాలు ఉండేవి. అయితే, అప్పటి సీవోవో యూబీ ప్రవీణ్ రావు రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫీ ఆ పోస్టునే తీసివేసింది. -
మూన్ లైటింగ్ దుమారం: విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!
ఒకే సమయంలో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని తొలగించిన విప్రో.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 10 నుంచి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఏదైనా మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనంటూ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. అయితే విప్రో తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం (నైట్స్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విప్రో ఉద్యోగులకు పంపిన ఇ - మెయిల్స్‌లో..‘హైబ్రిడ్ పని విధానాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించే ఈ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది’ అంతేకాదు ‘మా రిటర్న్ టు ఆఫీస్ పాలసీలో సౌకర్యవంతమైన, హైబ్రిడ్ విధానాన్ని విప్రో అవలంభిస్తోంది. అక్టోబర్ 10 నుండి లీడర్షిప్ రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వారానికి మూడుసార్లు తిరిగి కార్యాలయాలకు రావాలి. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో ఆఫీసులు ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి👉 ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం! ఈ నేపథ్యంలో ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు విప్రో పెట్టిన మెయిల్‌పై ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజ స్పందించారు. దేశీయ టెక్ సంస్థ ఉద్యోగులకు అకస్మాత్తుగా ఈ-మెయిల్ పంపింది. ‘కంపెనీ నెల క్రితమే మెయిల్ పంపి ఉండాల్సింది. ఉద్యోగులకు కావాల్సిన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు ఉండేది. అలాగే, ఉద్యోగుల అనుమతి, వారి అభిప్రాయాలను కంపెనీ పరిగణనలోకి తీసుకోవాల్సిందని’ అన్నారు. కొద్ది రోజుల క్రితం టీసీఎస్ గత సెప్టెంబర్‌లో మరో ఐటీ రంగ సంస్థ టీసీఎస్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని చెప్పింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీలో భాగంగా టీం లీడర్లు హెచ్ ఆర్ టీం విభాగంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 300 మందిపై వేటు ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ వివాదం దుమారం రేపుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో తమ కాంపిటీటర్లతో కలిసి వర్క్ చేయడంపై విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యర్ధి కంపెనీల్లో సైతం పనిచేస్తుండడాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తరుణంలో విప్రో వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికి ఉద్యోగుల్ని ఆఫీసుకు రావాలని పిలుపునివ్వడంతో రెండేసి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. చదవండి👉 పదోతరగతి కుర్రాడికి అమెరికా నుండి పిలుపు -
ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్!
ఆఫర్ లెటర్లు అందుకుని ఎప్పుడెప్పుడు ఉద్యోగాలలో చేరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనిపించుకోవాలన్న ఫ్రెషర్లకు భారీ షాక్‌నే ఇచ్చాయి ఐటీ దిగ్గజాలు. అన్ని రౌండ్లు పూర్తి చేసి ఆఫర్ లెటర్ కూడా అందుకున్న విద్యార్ధుల ఉద్యోగాలలో జాప్యం చేసిన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. బిజినెస్‌లైన్ కథనం ప్రకారం.. విద్యార్థులు 3-4 నెలల క్రితమే టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత కంపెనీల నుంచి వారు ఆఫర్ లెటర్లు కూడా అందుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగే ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఐటీ సంస్థలు నెలల తరబడి ఆలస్యం చేశాయి. ప్రస్తుతం విద్యార్థులు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్లు ఆయా కంపెనీల నుంచి లెటర్స్ అందుకోవడంతో ఎంపికైన విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో కంపెనీలు వారి అర్హతా నిబంధనలు, కంపెనీ మార్గదర్శకాల అనుసరించి ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపినట్లు చెబుతున్నారు. మార్కెట్లో మనీ ఫ్లో కఠినతరంగా మారడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండడం వంటివి నెలల తరబడి ఉన్న స్టార్టప్‌ల నుంచి దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న టెక్ దిగ్గజాల వరకు అన్ని ఐటీ కంపెనీలపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. ప్రతికూల వ్యాపార పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేసాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఇటీవల నియామకాల ప్రక్రియను నిలిపివేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
హెచ్‌సీఎల్ టెక్ కొత్త లోగో
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నూతన లోగోను, బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. క్లయింట్లు, ప్రజలు, కమ్యూనిటీల విషయంలో కంపెనీ వైఖరిని ప్రతిబింబించే విధంగా ‘సూపర్ చార్జింగ్ ప్రోగ్రెస్’ అంటూ లోగో పక్కన క్యాప్షన్‌ను పెట్టింది. లోగోలో రాకెట్ సింబల్‌ను చేర్చింది. నిత్యం తమ క్లయింట్ల డిజిటల్ పరివర్తనాన్ని వేగవంతం చేసే విధంగా కొత్త లోగోకు రూపకల్పన చేసినట్టు కంపెనీ తెలిపింది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
మాదాపూర్‌లో హైటెక్ దందా.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులు చదివి.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వారికి ఊహంచని షాక్ తగిలింది. ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు బోర్డు తిప్పేసింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ధన్యోన్ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే, అంతకుముందు.. సదరు ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసింది. ఉద్యోగం ఫైనల్ చేసుకున్న వారితో కంపెనీ డీల్ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్ లెటర్స్ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. -
ఇన్ఫోసిస్ ఓకే.. 21,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3.2 శాతం పుంజుకుని రూ. 5,360 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,195 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 24 శాతం ఎగసి రూ. 34,470 కోట్లకు చేరింది. కీలక మార్కెట్లలో ప్రధానమైన యూఎస్‌సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు తలెత్తినప్పటికీ ఈ ఏడాది ఆదాయంలో 14–16 శాతం వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా(గైడెన్స్) వేయడం గమనార్హం. గతంలో 13–15 శాతం వృద్ధి అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ1లో పటిష్ట ఫలితాలు, డిమాండ్ ఔట్లుక్ నేపథ్యంలో గైడెన్స్‌ను మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. త్రైమాసికవారీగా చూస్తే క్యూ1లో నికర లాభం 5.7 శాతం క్షీణించింది. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. నిర్వహణా మార్జిన్లు వీక్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ నిర్వహణా మార్జిన్లు 23.7 శాతం నుంచి 20.1 శాతానికి డీలాపడ్డాయి. గతేడాది క్యూ4లోనూ ఇవి 21.5 శాతంగా నమోదయ్యాయి. విక్రయాలు, మార్కెటింగ్ ఖర్చులు పెరగడంతో నిర్వహణా వ్యయాలు 14.4 శాతం హెచ్చాయి. క్యూ1లో రూ. 6,914 కోట్ల నిర్వహణా లాభం ఆర్జించింది. ఈ కాలంలో 21,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించింది. కంపెనీ ఆదాయంలో యూఎస్ నుంచి 17.8 శాతం, యూరప్ నుంచి 21.9 శాతం చొప్పున వార్షిక వృద్ధిని సాధించింది. భారీ డీల్స్తోకూడిన కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.7 బిలియన్ డాలర్లు(రూ. 13,600 కోట్లు)గా నమోదైంది. వేతన పెంపు, ఉద్యోగ నియామకాల ద్వారా నిపుణుల నియామకాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. ఇతర హైలైట్స్ ► జూన్ చివరికల్లా ఇన్ఫోసిస్ మొత్తం సిబ్బంది సంఖ్య 3,35,186కు చేరింది. 2022 మార్చికల్లా ఈ 3,14,015 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ► గత 12 నెలల సగటు ప్రకారం ఉద్యోగ వలస 28.4 శాతానికి ఎగసింది. గతేడాది క్యూ4లో ఇది 27.7 శాతంకాగా.. గత క్యూ1లో 13.9 శాతమే. ► 106 క్లయింట్లను కొత్తగా జమ చేసుకుంది. దీంతో ఇన్ఫోసిస్ మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,778ను తాకింది. ► 10 కోట్ల డాలర్ల క్లయింట్లు 38కాగా, 5 కోట్ల డాలర్ల క్లయింట్లు 69కు చేరారు. కోటి డాలర్ల క్లయింట్ల సంఖ్య 278కు చేరింది. చదవండి: Cryonics: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా? -
వేలకోట్ల బిజినెస్: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు!
మనదేశానికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి. వేలకోట్ల బిజినెస్ మార్కెట్‌తో అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని నాస్కామ్ - ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారతీయ టెక్ కంపెనీల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాస్కామ్ - ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రకారం..2017 నుంచి భారత్‌కు చెందిన టెక్ కంపెనీలు 22శాతం వృద్దితో అమెరికన్లకు ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. అలా నాటి నుంచి యావరేజ్ శాలరీ ఒక్కొక్కరికి 1,06,360 డాలర్లను చెల్లిస్తూ 2లక్షల మందికి పైగా అమెరికన్లతో పలు ప్రాజెక్ట్‌లపై పనిచేయించుకుంటున్నాయి. "మన దేశానికి చెందిన టెక్ సంస్థలు అమెరికన్ ఉద్యోగులతో పాటు కొత్త కొత్త టెక్నాలజీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తద్వారా పరిశ్రమలు, క్లయింట్ల కోసం అత్యాధునిక ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తున్నాయని" నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అన్నారు. అమెరికాలోనే ఎక్కువ వరల్డ్ వైడ్‌గా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో డిమాండ్ - సప్లయ్ ఎక్కువగా ఉంటుందని ఘోష్ తెలిపారు. వాటి ఆధారంగా ఈ డిజిటల్ వరల్డ్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ..సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అందుకు కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ఫార్చ్యూన్ - 500 కంపెనీస్‌లో సుమారు 75శాతం ఇండియన్ కంపెనీలు అమెరికా ప్రధాన కేంద్రంగా ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాయి. అమెరికన్ ఎకానమీకి వెన్నుదన్నుగా కరోనాతో పాటు ఇతర సంక్షోభాల నుంచి గట్టెక్కేలా అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా భారత్ కంపెనీలు నిలుస్తున్నాయి. అలా 2021 అమెరికాకు చెందిన 20 రాష్ట్రాలలో 1.6 మిలియన్ మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించడంతో పాటు 396 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపాయి. తద్వారా 198 బిలియన్ డాలర్ల నిధుల్ని అందించి అమెరికా ఎకానమీకి పరోక్షంగా సహకరిస్తున్నాయి. స్వామి కార్యం స్వకార్యం స్వామి కార్యం స్వకార్యం అన్న చందంగా భారత్ టెక్ కంపెనీలు అమెరికాలో పెట్టబడులతో లాభాల్ని అర్జిస్తున్నాయి. అదే సమయంలో అమెరికన్ల వృద్ది కోసం పాటు పడుతున్నాయి. అంతేకాదు ప్రజెంట్ జనరేషన్ తో పాటు నెక్ట్స్ జనరేషన్లో ఈజీగా జాబ్స్ పొందేలా ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ భారత్ టెక్ కంపెనీలు భారీగా నిధుల్ని ఖర్చు చేస్తున్నాయని నాస్కామ్ నివేదిక హైలెట్ చేసింది. స్టెమ్‌లో రాణించేలా నాస్కామ్ నివేదికలో పేర్కొన్నట్లుగా..ఇండియన్ టెక్ కంపెనీలు అమెరికాలో 180 యూనివర్సీలు, కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీలతో పాటు ఇతర ఎడ్యుకేషన్‌కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్(స్టెమ్) వ్యవస్థను బలోపేతం చేసేలా 1.1 బిలియన్ డాలర్ల నిధుల్ని ఖర్చు చేశాయి. దీంతో పాటు స్కూల్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు, అకడమిక్, కార్యాచరణ, ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేటివ్ సవాళ్లను పరిష్కరించడంలో నిష్ణాతులయ్యేలా డిజైన్ చేసిన కే-12 అనే కార్యక్రమం కోసం 3 మిలియన్లకు పైగా ఖర్చు చేశాయి. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2.9 మిలియన్ల మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందారు. అదనంగా, 2,55,000 మంది ప్రస్తుత ఉద్యోగులు ఈ రంగం ద్వారా నైపుణ్యం పొందారు అవకాశాల గని అమెరికాలో వచ్చే దశాబ్దంలో ఇతర వృత్తుల కంటే స్టెమ్ వృత్తుల డిమాండ్ 1.5 రెట్లు వేగంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం యూఎస్‌లో ఐటీ రంగం 70శాతం వృద్ది నమోదు చేస్తుంటే..2030 నాటికి స్టెమ్ విభాగంలో ఉపాధి అవకాశాలు 51 శాతంగా ఉండనున్నాయి. అమెరికాలో అలా భారత్‌లో ఇలా అమెరికాలో టెక్నాలజీ రంగంలో విసృత అవకాశాలతో పాటు ఉద్యోగాల రూప కల్పన జరుగుతుంది. కానీ భారత్‌లో టెక్ కంపెనీల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశీయంగా హెచ్‌సీఎల్ సంస్థ జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 6వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అట్రిషన్ రేట్ ఆ సంస్థను కుదిపేస్తుంది. టీసీఎస్ సైతం జూన్, 2022 త్రైమాసికంలో 14,136 మంది ఉద్యోగుల్ని హయర్ చేసుకుంది. జూన్, 2022 త్రైమాసికంలో ఐటీ విభాగంలో అట్రిషన్ రేటు 19.7 శాతంగా ఉంది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 17.4 శాతంతో పోలిస్తే ఎక్కువ అని టీసీఎస్ తెలిపింది. -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ చేతికి డెన్మార్క్ సంస్థ!
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ విభాగంలో పట్టున్న డెన్మార్క్ కంపెనీ బేస్(బీఏఎస్ఈ) లైఫ్ సైన్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు పూర్తి నగదు రూపేణా 11 కోట్ల యూరోలు(రూ. 875 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలు ద్వారా లైఫ్ సైన్సెస్ డొమైన్లో మరింత నైపుణ్యాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా యూరోప్‌లో సేవలు విస్తరించనున్నట్లు పేర్కొంది. యూరప్, నార్డిక్స్ ప్రాంతంలో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యాలు, క్లౌడ్ ఆధారిత పరిశ్రమ సొల్యూషన్స్ విస్తరణకు దోహదపడనున్నట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు అంచనా వేస్తోంది. బేస్ లైఫ్‌కు 200 మంది అత్యుత్తమ పరిశ్రమ నిపుణులున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇన్ఫీ షేరు 0.7% పెరిగి రూ.1,448 వద్ద క్లోజైంది. -
Vizag: ‘ఇన్ఫోసిస్’ గుడ్‌న్యూస్.. ఆగస్టు నుంచే సేవలు!
దొండపర్తి(విశాఖ దక్షిణ): విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు నుంచే సేవలు అందించేందుకు ఆ సంస్థ సమాయత్తమవుతోంది. ముందుగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఓ ప్రైవేట్ నిర్మాణంలో కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు నగరంలో అన్వేషిస్తున్నారు. చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు 800 ఉద్యోగుల కోసం.. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ సంస్థ మెట్రో నగరాల్లోనే కార్యకలాపాలు సాగిస్తోంది. టైర్–2 నగరాల్లో అన్నింటి కంటే విశాఖే ప్రథమ స్థానంలో ఉండడంతో.. ఇక్కడి నుంచి సేవలు అందించేందుకు ఇన్ఫోసిస్ ఆసక్తి చూపిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఓ ప్రైవేట్ భవనంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. 750–800 మంది ఉద్యోగులు పనిచేసేందుకు అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు అన్వేíÙస్తున్నారు. ఇక్కడ కార్యాలయం ఏర్పాటు వల్ల రాష్ట్రానికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు హైదరాబాద్, చెన్నై, ముంబయి వంటి దూర ప్రాంతాలకు వెళ్లనవసరం ఉండదు. పశి్చమ, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు విశాఖ నుంచే పనిచేసే అవకాశం కలగనుంది. త్వరలో పూర్తి స్థాయిలో సేవలు ఇన్ఫోసిస్ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త నిర్ణయాలతో విశాఖలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఇప్పటి వరకు సొంత నిర్మాణాల్లోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా నాలుగు ప్రాంతాల్లో తొలిదశలో ప్లగ్ అండ్ ప్లే ద్వారా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో తొలి ప్లగ్ అండ్ ప్లే కార్యాలయానికి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కోవిడ్ కారణంగా ప్రస్తుతం అధిక శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నారు. కోవిడ్ క్రమంగా తగ్గుతుండడంతో మళ్లీ కార్యాలయాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులను మెట్రో నగరాలకు రప్పించే కంటే రాష్ట్రంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇన్ఫోసిస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. అందుకు అనువైన వాతావరణాన్ని కలి్పస్తామని భరోసా కలి్పంచింది. దీంతో విశాఖ కేంద్రంగా సంస్థ సేవలు అందించేందుకు సంస్థ ఆసక్తి చూపించింది. భవిష్యత్‌లో విస్తరణ ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ.. భవిష్యత్తులో సంస్థ సేవలు విస్తరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇన్ఫోసిస్ రాకతో విశాఖలో ఐటీ పునరుత్తేజానికి బాటలు పడతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆగస్టు నుంచే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. మున్ముందు మరిన్ని బహుళ జాతి సాఫ్ట్వేర్ సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని విద్యావేత్తలు, నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ
-
మాదాపూర్‌లో బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది. ఈ క్రమంలో సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసి వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి జీతాలు ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా రెండు వారాల క్రితం కంపెనీ వెబ్సైట్,మెయిల్స్ బ్లాక్ చేసింది ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ. దీంతో షాకైన ఉద్యోగులు సమాచారం ఆరా తీసేందేకు ప్రయత్నించగా సంస్థకు సంబంధించి ఉద్యోగులు,బోర్డ్ లేకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మొద్దు ఇక ఈ ఘటనపై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘మే 28 న హన్మకొండ కు చెందిన యువకుడు తమకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడలోని ఇన్నో హాబ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలిసింది. ఆ తరువాత బోర్డు తిప్పేసి నిందితులు పారిపోయారు. ఉద్యోగం ఇచ్చిన తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి బుకాయించారు. ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. బ్యాక్ డోర్ ఉద్యోగాలను నమ్మొద్దు. అలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నారంటే మీరే ఎంకరేజ్ చేస్తున్నట్లు. ప్రస్తుతం కంపెనీకీ సంబంధించి కమలేష్ కుమారి, రాహుల్ అలోక్, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గుర్తించాం. వీళ్లంతా హెచ్ ఆర్, మేనేజ్మెంట్కు సంబంధించిన వాళ్లు. చదవండి: AP Crime: ఇలా చేశావేంటి అలెగ్జాండర్.. యువతిని నమ్మించి.. మోసగించి.. మరో మహిళతో.. -
మరో ఐదేళ్ల పాటు, ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్!
మరో 5ఏళ్ల పాటు ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా సీఈఓ సలీల్ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జులై 1నుంచి 2027 మార్చి 31వరకు ఆయన తన పదవిలో కొనసాగనున్నారు. ఇక ఎప్పటిలాగే ఇన్ఫోసిస్ ఎక్స్‌ప్యాండ్ స్టాక్ ఓనర్ షిప్ -2019 ప్లాన్ లో భాగంగా ఆయనకు ఇన్ఫోసిస్ షేర్లను కట్టబెట్టనుంది. ఇన్ఫోసిస్ ప్రకటన మే 21న ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ(ఎన్ఆర్సీ) సభ్యులు సలీల్ పరేఖ్‌ను మళ్లీ సంస్థ సీఈవోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో పరేఖ్ ఈ ఏడాది జులై 1,2022 నుంచి మార్చి 31,2027వరకు పదవిలో ఉంటారని ఇన్ఫోసిస్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్ తెలిపింది. -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్‌లు,ప్రమోషన్లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!
ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజాలు అట్రిషన్ రేట్ తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. కోవిడ్-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్‌ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు డిజిటల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అట్రిషన్ రేట్ తగ్గిస్తూ, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎంఫసిస్లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్ బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్(ఈఎస్ఓపీఎస్) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్‌లో స్మార్ట్‌గా చేసేందుకు సిల్స్, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్‌ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు! -
ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు!
కరోనా మహమ్మారికి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగింది.దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సైతం డిమాండ్ ఏర్పడింది. అయితే తమకు అర్హులైన ఉద్యోగుల్ని ఎంపిక చేయడం టెక్ సంస్థలకు కత్తిమీద సాములాగా తయారైంది. అందుకే వేలకోట్లు ఖర్చు చేసి మరీ స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. మార్కెట్లో ఉన్న డిజిటల్ స్కిల్ కొరతను అధికమిస్తున్నాయి. దీంతో టెక్ మార్కెట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు స్టాఫింగ్ ఏజెన్సీల సాయంతో ఉద్యోగల్ని (సబ్ కాంట్రాక్టర్స్ను) నియమించుకుంటున్నాయి. స్టాఫింగ్ ఏజెన్సీలు సైతం వాళ్ల పద్దతిలో సెలక్ట్ చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాలరీ, ఇన్స్యూరెన్స్ కవరేజ్‌తో పాటు ఇతర బెన్ఫిట్స్ను అందిస్తున్నాయి. అయితే ఈ తరహా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెసీఎల్'లు పోటీ పడుతున్నాయి. అందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నాయి. సాధారణ ఉద్యోగుల నియామకానికి సమానంగా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇలా ఈఏడాది ఫైనాన్షియల్ ఇయర్లో టీసీఎస్ 34.2శాతం వృద్ధితో కాంట్రాక్ట్ ఉద్యోగులపై రూ.16,975కోట్లు ఖర్చు చేస్తుండగా ఇన్ఫోసిస్ 77.9శాతం వృద్ధితో రూ.12,607కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో విప్రో 30శాతం వృద్ధితో రూ.10,858 కోట్లు ఖర్చు చేయగా..23శాతం వృద్ధితో హెచ్‌సీఎల్ ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్మినెంట్ చేస్తున్నాయి సంస్థలు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకోవడం వల్ల డిమాండ్‌కు అవసరమయ్యే డిజిటల్ స్కిల్స్‌ను ఉపయోగించుకోవడంతో పాటు, స్కిలున్న ఉద్యోగుల్ని గుర్తించడం స్టాఫింగ్ ఏజెన్సీలకు సులభం అవుతుంది.తద్వారా సంస్థకు వస్తున్న ప్రాజెక్ట్‌లను తక్కువ సమయంలో పూర్తి చేయడం, ఐటీ సంస్థల్ని కుదిపేస్తున్న అట్రిషన్ రేట్‌ను తగ్గించుకునేందుకు సంస్థలు ట్రై-బై-అప్రోచ్ పద్దతిని అవలంభిస్తున్నాయని టెక్ అడ్వైజరీ సంస్థ క్యాటలిన్క్స్ పార్టనర్ రామ్ కుమార్ రామ మూర్తి తెలిపారు. ట్రై-బై-అప్రోచ్ పద్దతి అంటే కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగులు నియమించుకొని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నాయి. అవసరం అనుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సంస్థలు సాధారణ ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాయి. చదవండి👉సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్, ఎన్ని సెలవులు కావాలంటే అన్నీ తీసుకోండి! -
అమెరికా టు కరీంనగర్.. సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే రెండో బ్రాంచ్
శోధించి సాధించాలన్న తపన ఉంటే ఎంతటి లక్ష్యమైనా చిన్నదైపోతుందని నిరూపించారు కరీంనగర్‌కు చెందిన అన్నదమ్ములు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి తామేందుకు కంపెనీ పెట్టకూడదన్న ఆలోచన చేశారు. వెంటనే ఆచరించారు. నేడు అగ్రరాజ్యానికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీని కరీంనగర్ కేంద్రంగా నడుపుతూ 30మందికి ఉపాధినిస్తున్నారు.. కరీంనగర్ పాతబజార్‌కు చెందిన అన్నదమ్ములు శశిధర్, మనోజ్ కుమార్. అమెరికాకు చెందిన ఆ కంపెనీ బ్రాంచీలు దేశవ్యాప్తంగా బెంగళూర్‌లో ఒకటి ఉండగా.. రెండోది కరీంనగర్ కావడం విశేషం. – కరీంనగర్‌టౌన్ కంపెనీ స్థాపనే లక్ష్యంగా పన్నెండేళ్ల క్రితం మెట్రోనగరాలకే పరిమితమైన సాఫ్ట్వేర్ కంపెనీని కరీంనగర్లో సైతం నెలకొల్పాలనే సంకల్పాన్ని పెట్టుకున్నారు శశిధర్, మనోజ్ కుమార్. ఎంబీఏ పూర్తిచేసి 2010లో హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కొద్ది నెలల పాటు పని చేశారు. వీరి పనితనం చూసిన మరో కంపెనీ ప్రతినిధి ‘మీలో సత్తాఉంది.. సొంతంగా చేసుకోండి’ అంటూ... ఆ కంపెనీకి సంబంధించిన బ్రాంచి ఇచ్చాడు. ఏం ఆలోచించకుండా సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్ పేరుతో కరీంనగర్‌కు 2010లోనే కంపెనీని తీసుకొచ్చారు. ఇద్దరితో మొదలై.. 2010లో కరీంనగర్‌లోని పాతబజార్‌లో సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీలో అన్నదమ్ములిద్దేరే ఉద్యోగులు. కేవలం రెండు కంప్యూటర్లతో రెండేళ్లపాటు ఇద్దరే రేయింబవళ్లు కష్టపడ్డారు. 2012లో కంపెనీస్థాయి పెరిగి, పనిభారం ఎక్కువ కావడంతో దశలవారీగా మరో ఆరుగురిని నియమించుకున్నారు. ప్రస్తుతం 30మంది సాఫ్ట్వేర్లతో సహస్ర సర్వీసెస్ కంపెనీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. లాక్డౌన్లో సైతం సక్సెస్‌గా నడుస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా మహమ్మారి రాకతో ఆందోళ చెందాం. కంపెనీ పరిస్థిత ఎలా ఉండబోతుందోన్న టెన్షన్. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ఇచ్చారు. మా కంపెనీ ఇవ్వలేదు. దీంతో మేం కొంత మందిని ఉద్యోగాలనుంచి తీసివేసి వర్క్ కొనసాగించాం. మా కష్టం ఫలించింది. కరోనాలోనూ బాగా నడిచింది. ప్రస్తుతం తీసేసిన వారందరిని మళ్లీ తీసుకున్నాం. – నేదునూరి శశిధర్ మరింత మందికి ఉపాధి ఇద్దరితో మొదలై 30మందితో ప్రస్తుతం కంపెనీ నడిపిస్తున్నాం. భవిష్యత్‌లో మరింత మందికి ఉద్యోగాలివ్వడమే మా లక్ష్యం. కంపెనీని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చి కరీంనగర్ పేరు అగ్రరాజ్యానికి వినపడేలా చేస్తాం. గతంలో కరీంనగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే ఏదోలా చూసేవారు. నేడు ఐటీ టవర్ రావడం, పలు కంపెనీలు మేం ఉద్యోగాలు ఇస్తాం అంటూ ముందుకురావడం శుభపరిణామం. – నేదునూరి మనోజ్ కుమార్ -
ఐటీ కంపెనీ ఆఫర్:రండి బాబు రండి పెళ్లి సంబంధాలు చూస్తాం,శాలరీలు పెంచుతాం!
కరోనా కారణంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త టెక్నాలజీతో ఉద్యోగులు అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలకు చెందిన ఇతర సంస్థలతో పాటు టెక్ కంపెనీల్లో సైతం అట్రిషన్ రేటు తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఓ ఐటీ సంస్థ ఉద్యోగులకు కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్లేంటని అనుకుంటున్నారా? ప్రపంచ వ్యాప్తంగా అన్నీ సంస్థల్లో కంటే ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ అట్రిషన్ రేటును తగ్గించేందుకు మదురైలోని సాఫ్ట్ వేర్ సంస్థ శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ (ఎస్ఎంఐ) అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకోసారి ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూడడమే కాదు,ఇంక్రిమెంట్లను అందిస్తుంది. కంపెనీ ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకు 6 నుంచి 8 శాతం ఇంక్రిమెంట్లు, ఉద్యోగుల పర్ఫామెన్స్‌ను బట్టి టాప్ 40 లేదా టాప్ 80 ఉద్యోగులకు అదనపు బెన్ఫిట్స్ అందిస్తుంది. 100కోట్లకు చేరువలో 2006లో శివకాశిలో ఎస్ఎంఐ సంస్థను ప్రారంభించి..ఆ తర్వాత 2010 మధురైకి మార్చారు.ఎస్‌ఎంఐతో దాని అసోసియేట్ కంపెనీలో కలిపి మొత్తం 750 మంది పనిచేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది 5ఏళ్లకు పైగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేరువలో ఉంది. కాగా,ఆ కంపెనీలో అట్రిషన్ రేటును తగ్గించేందుకు ఎస్ఎంఐ సంస్థ ప్రతినిధులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి👉యాపిల్ ఉద్యోగుల సంచలన నిర్ణయం, సీఈఓ టిమ్‌కుక్‌కు భారీ షాక్! -
భారత్‌కు బంపరాఫర్! అమెరికా,యూరప్ దేశాలకు రష్యా భారీ షాక్!
తమతో ఖయ్యానికి కాలు దువ్వుతున్న దేశాలకు రష్యా భారీ షాకివ్వనుంది. ఓ వైపు యుద్ధం కొనసాగిస్తూనే..పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల్ని తట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా అమెరికాతో పాటు యూరేపియన్ దేశాలకు చెక్ పెడుతూ..రష్యా..భారత్‌లో భారీ ఎత్తున ఐటీ సంస్థల్ని ఏర్పాటు చేయనుంది. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును తప్పుబడుతూ ఇప్పటి వరకు 400 దిగ్గజ కంపెనీలు ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. యుద్ధం కారణంగా 2లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మాస్కో మేయర్ ప్రకటించారు. అయినా రష్యా యుద్ధ మంత్రాన్నే జపిస్తోంది. అదే సమయంలో భారత్‌తో స్నేహం తమకు లాభిస్తోందని రష్యా భావిస్తుంది. అందుకే భారత్‌తో పాటు బ్రిక్స్ దేశాల భాగస్వామ్యంలో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయనుంది. 261ఐటీ కంపెనీలకు అధిపతి రష్యాలో సెయింట్ పీటర్ బర్గ్ కేంద్రంగా రస్ సాఫ్ట్ అనే సంస్థ 261 ఐటీ కంపెనీలకు, అందులో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తుంది. ఈ రస్ సాఫ్ట్ సంస్థ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌లో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్(బీజీబీఎస్)కు రష్యాకు చెందిన ఐటీ సంస్థలు.. భారత్‌కు చెందిన పలు ఐటీ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. మేం నమ్ముతున్నాం అమెరికా,యూరప్ దేశాలు రష్యాపై విధిస్తున్న ఆంక్షల కారణంగా అనేక సవాళ్లతో పాటు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఆ ఇబ్బందుల వల్లే వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నామని మకరోవ్ చెప్పారు. కాబట్టి, బ్రిక్స్ దేశాలతో పాటు ఐటీ రంగంలో అగ్రగామిగా అడుగులు వేస్తున్న భారత్ లో సంస్థల్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు రస్‌సాఫ్ట్ ప్రతినిధి పీటీఐ చెప్పారు. “గత కొన్ని రోజులుగా, మా(రస్‌సాఫ్ట్) ప్రతినిధి బృందం అనేక భారతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. తమ భాగస్వామ్యంలో ఇక్కడ(భారత్‌లో) సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు భారత్‌కు చెందిన 19 సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ , టెలిమెడిసిన్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో సేవలందించే సంస్థలు ఎక్కువగా ఉన్నట్లు రస్ సాఫ్ట్ సహా మా నైపుణ్యాన్ని అందించగల అనేక రంగాలు ఉన్నాయి, ”అని రస్ సాఫ్ట్ అధ్యక్షుడు వాలెంటిన్ మకరోవ్ వెల్లడించారు. బీజీబీఎస్ ఓ మంచి అవకాశం రస్ సాఫ్ట్ ప్రతినిధి బృందం, భారతీయ కంపెనీల మధ్య సత్సంబంధాలు నెరిపేందుకు బీజీబీఎస్ సులభతరం చేసిందని మకరోవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యన్ ఐటీ కంపెనీలు సాంకేతిక నైపుణ్యంతో భారతీయ సంస్థలను ఎలా పెంచవచ్చో వివరించామన్నారు. పన్నులో రాయితీ ఇస్తూ ఆర్టీపీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందుబాటులో తీసుకొని రావడం, సాఫ్ట్వేర్ ద్వారా ట్రాఫిక్ మూవ్‌మెంట్స్‌ను ఆప్టిమైజ్ చేయడం, విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేయడం, లాజిస్టిక్స్ కోసం సమాచార వ్యవస్థలపై పని చేయడంలో చాలా అవకాశాలు ఉన్నాయని మకరోవ్ చెప్పారు. పెద్దన్నతో భారత్ ఢీ అమెరికాతో పోటీపడే స్థాయికి భారత్ అడుగులు వేస్తుందని మకరోవ్ పేర్కొన్నారు. అయితే తయారీ నాణ్యతలో మెరుగులైన ఫలితాల్ని సాధించే అవకాశం ఉందని అన్నారు. “ప్రపంచ మార్కెట్లో ఇతర దేశాలకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్‌కు సహాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. దాని కోసం కొత్త సాఫ్ట్వేర్ పరిజ్ఞానాన్ని అందుబాటులో తేవాలంటే భారతీయ మానవ వనరులను పొందడం మాకు అవసరం. కలిసి ఉత్పత్తులన్ని తయారు చేయడం, ఇక్కడ, విదేశాలలో విక్రయించడం మా లక్ష్యం, ”అని మకరోవ్ స్పం చేశారు. ఇక అంతర్జాతీయ వాణిజ్యం కోసం అమెరికన్ డాలర్‌పై ఆధారపడకుండా ఉండటానికి డిజిటల్ కరెన్సీ, రూపాయి-రూబుల్ చెల్లింపు వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తామని మకరోవ్ పునరుద్ఘాటించారు. చదవండి👉పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు..బాబోయ్ వద్దంటున్న ఉద్యోగులు! -
స్మార్ట్ డీవీ సాఫ్ట్వేర్ కంపెనీకి శ్రీకారం
పెనుమూరు(చిత్తూరు): ఏపీలో రూ.50 కోట్లతో స్మార్ట్ డీవీ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కొటార్లపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీకి గురువారం ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్పలు ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. నారాయణస్వామి మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్పలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీలిస్తోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ, మెడికల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డీవీ గ్రూప్ కంపెనీ చైర్మన్ దీపక్‌కుమార్ తాల మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 3,000 మందికి ఉపాధి కల్పనే తమ కంపెనీ ఏర్పాటు వెనుక ముఖ్యోద్దేశమన్నారు. -
కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, అమలాపురం టౌన్(తూ.గో): ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిగా 1999లో రాష్ట్రపతి అవార్డు పొందారు. ఉద్యోగ జీవితంలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన ఆదర్శ ఉపాధ్యాయుడు. పేరు ఓరుగంటి శ్రీరామ్మూర్తి. ఊరు ముమ్మిడివరం మండలం అనాతవరం. ఆయన కుమారుడి పేరు రమేష్. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. కాలిఫోర్నియాలో ‘టెక్ మంత్రా నౌ’ పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి ఫౌండర్, సీఈఓగా పని చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ పుట్టి, పెరిగిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, గ్రామీణ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్నది శ్రీరామ్మూర్తి ఆశయం. ఈ విషయాన్ని అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న తనయుడు రమేష్ దృష్టిలో పెట్టారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే లక్ష్యంతో టెక్ మంత్రా నౌ కంపెనీ శాఖను రమేష్ అనాతవరంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ శాఖలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నైలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంతూరు అనాతవరంలో.. అదీ పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ కొత్త శాఖ శనివారం ప్రారంభమవుతోంది. ఈ వివరాలను శ్రీరామ్మూర్తి, అమెరికా నుంచి వచ్చిన ఆయన తనయుడు రమేష్‌లు అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మంటపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు అనాతవరంలో జాతీయ రహదారి 216 చెంతన నెలకొల్పిన ఈ కంపెనీలో ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 25 మందిని నియమించామని రమేష్ తెలిపారు. కాలిఫోర్నియాలో 2014లో స్థాపించిన తమ కంపెనీ ఏడో శాఖను అనాతవరంలో నెలకొల్పుతున్నామన్నారు. తాను అనాతవరం హైస్కూలులోనే పదో తరగతి వరకూ చదువుకున్నానని తెలిపారు. తమ కంపెనీలో ట్రైనింగ్ హెచ్ఆర్గా పని చేస్తున్న పేరి విశాలి, డెలివరీ స్ట్రాటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్న నూకల చిన వెంకటరత్నంలు కూడా కోనసీమకు చెందిన వారేనని చెప్పారు. వారు అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల పూర్వ విద్యార్థులని తెలిపారు. తండ్రి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, తన ఆశయానికి అనుగుణంగా పుట్టిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్న కుమారుడు రమేష్ ప్రయత్నాన్ని అభినందించారు. -
సంచలనం, టీనేజర్ చేతికి మైక్రోసాఫ్ట్ రహస్యాలు..భారీగా పడిపోతున్న షేర్లు!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలను టీనేజర్ పరుగులు పెట్టిస్తున్నాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు ఎన్వైదా, యుబిసాఫ్ట్, శాంసంగ్ సంస్థల్ని హ్యాక్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ సంస్థలు సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని ఆశ్రయించడంతో ఈ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నిపుణులు సైతం హ్యాకింగ్ వెనుక ల్యాప్సస్$ (Lapsus$) అనే గ్రూప్ ఉన్నట్లు నిర్ధారించారు. హ్యాకింగ్ ఎందుకు చేశారనే అంశంపై స్పష్టత లేకున్నా..ఆ హ్యాకింగ్ గ్రూప్‌కు మాస్టర్ మైండ్ 16ఏళ్ల టీనేజరేనని తేలింది. సైబర్ నిపుణుల అంతర్గత విచారణలో ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతంలో టీనేజర్ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. టీనేజరే అయినా దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేయడంతో దాదాపూ 15వేల మంది క్లయింట్ల డేటా బహిర్ఘతం అయ్యింది. అందుకే హ్యాకింగ్ కోసం ఏదైనా సైబర్ గ్యాంగ్ హస్తం ఉందా అన్న కోణంలో సదరు సైబర్ ఎక్స్ పర్ట్స్ సభ్యులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతా సీక్రెట్ దర్యాప్తులో నిందితుడు 'వైట్', 'బ్రీచ్బేస్' అనే మారు పేర్లతో హ్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హ్యాకింగ్ కోసం ఉపయోగిస్తున్న 7అకౌంట్లను సైబర్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ అకౌంట్ బ్రెజిల్‌కు చెందిన మరో యువకుడికి చెందిందని, ఇంతపెద్ద కంపెనీలను ఎందుకు హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేస్తే కలిగే లాభాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీనేజర్‌కు హ్యాకింగ్‌లో నైపుణ్యంగా ఎక్కువగా ఉందన్నారు. ల్యాప్సస్$ గ్రూప్ పేరుతో చేస్తున్న హ్యాకింగ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఓక్తాకు చెందిన 366మంది క్లయింట్లు నష్టపోయారు. ఓక్తా షేర్లు 9శాతం పడిపోయాయి.ఆ కంపెనీ కార్యకాలపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పుడు ఇదే అంశం మిగిలిన సంస్థలకు ఆందోళన కలిగిస్తుందన్నారు. కంపెనీలను హ్యాక్ చేయడానికి, వారి డేటాను దొంగిలించి, దానిని విడుదల చేసేందుకు పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు సైబర్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు టీనేజర్ నివసించే ప్రాంతాన్ని గుర్తించినా, అతని జాడ తెలియరాలేదు. హ్యాకర్స్ టార్గెట్ ఏంటీ? అనే విషయాలతో పాటు టీనేజర్‌ను పట్టుకునేందుకు మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. -
గంజాయి మత్తులో ‘సాఫ్ట్వేర్లు’
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. కొన్ని సందర్భాల్లో రేవ్ పార్టీలు నిర్వహించుకుంటూ సింథటిక్ డ్రగ్ ఎండీఎంఏ వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఓ వైద్యుడికీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) అధికారులు రట్టు చేశారు. మొత్తం 16 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. హెచ్–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోవిడ్ విజృంభణ తర్వాతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో డ్రగ్స్ అలవాటు పెరిగిందని ఆనంద్ తెలిపారు. యాప్రాల్‌కు చెందిన స్టాక్‌మార్కెట్ ట్రేడర్ జవాలా పాండే తరచు గోవా వెళ్లేవాడు. ►డ్రగ్స్‌కు అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రయించడం మొదలెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోనేరావ్, లఖన్ గంజాయి పండిస్తున్నారు. దీన్ని అదే జిల్లా వాసులు ఉల్లాస్ సాబ్లే, గోటి హరిసింగ్, అమర్ సింగ్, సకారాం సాబ్లే ఎర్తిగ కారులో నగరానికి తరలిస్తున్నారు. వీరి నుంచి గంజాయి పాండేకు అందుతోంది. పాండే గంజాయితో పాటు అరకుకు చెందిన యశ్వంత్ నుంచి హష్ ఆయిల్, పాండుచ్చేరీలో ఉంటున్న నైజీరియన్ నికొలస్ నుంచి ఎండీఎంఏ డ్రగ్ ఖరీదు చేస్తున్నాడు. వీటిని ఇతగాడు ఆదిత్య రాజన్ (ప్రైవేట్ సంస్థ మేనేజర్), జయబాలాజీ (విద్యార్థి), నిఖిల్ షెనోయ్ (డీజే ప్లేయర్)లకు అమ్ముతున్నాడు. ►నగరంలోని అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో కేజీ రూ.10 వేలు ఉంటున్న గంజాయి సిటీలో వినియోగించే వారి దగ్గరకు వచ్చేసరికి రూ.60 వేలకు చేరుతోంది. 10 గ్రాములు 500 ఖరీదు చేస్తున్న ఎండీఎంఏను పెడ్లర్స్ రూ.2 వేలకు అమ్ముతున్నారు. మాదకద్రవ్యాలను పెడ్లర్లు రాత్రి వేళల్లో కార్ఖానా వద్ద ఉన్న హాకీ గ్రౌండ్స్‌లో వినియోగదారులకు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ కె.నర్సింగ్‌రావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్‌రెడ్డిలు తమ బృందాలతో రంగంలోకి దిగారు. ►డ్రగ్స్ విక్రేతలు పాండే, నికోలస్, నిఖిల్, సోనేరావ్, అమర్, ఉల్లాస్, సకారాం, హరీష్, ఆదిత్య, జయ బాలాజీలను పట్టుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న బంజారాహిల్స్ వాసి మహ్మద్ మడ్నే (వైద్యుడు), మాదాపూర్ వాసి సాయి అనిరుధ్ (ఐటీ కంపెనీ ఫౌండర్), మియాపూర్ వాసి కుషా మిశ్రా (ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్), శేరిలింగంపల్లికి చెందిన సిద్థార్థ్ విజయ్ కుమరన్ (ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్), నిజాంపేల వాసి రోహిత్ కుమార్ (ఐటీ కంపెనీలో హెచ్ఆర్ విభాగం), గంగారం వాసి బాలాజీ భగవాన్ సింగ్‌లను (ఐటీ కంపెనీ కౌంటెంట్) అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5.4 లక్షల విలువైన డ్రగ్స్, వాహనాలు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. -
శాలరీ రూ.7.3లక్షలు!! విద్యార్ధులకు టీసీఎస్ బంపరాఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ విద్యార్ధులకు బంపరాఫర్ ప్రకటించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన 'ఆఫ్-క్యాంపస్ డిజిటల్ హైరింగ్'గ్రామ్ కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అవకాశం కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25. అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. తేదీలను త్వరలోనే కంపెనీ ప్రకటించనుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు వారి అర్హతలను బట్టి జీతం పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్లు సంవత్సరానికి రూ.7 లక్షలు పొందుతారు. అయితే వారి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు సంవత్సరానికి రూ.7.3 లక్షల జీతం పొందవచ్చు. అర్హతలు ►ఏదైనా నుండి బ్యాచిలర్ లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) లేదా (ఎంటెక్)/బ్యాచిలర్ లేదా మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీఈ) లేదా (ఎంఈ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ)/మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ఈ) నుండి విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ 2019,2020, 2021లో పట్టభద్రులు మాత్రమే దరఖాస్తచేసుకోవడానికి అర్హులు. ►అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో కనీసం 6-12 నెలల పని అనుభవం కూడా కలిగి ఉండాలి. ►అభ్యర్థులు 10, 12వ తరగతి, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్‌లో కనీసం 70% మొత్తం మార్కులను స్కోర్ చేసి ఉండాలి. ►అభ్యర్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు మరియు నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. ►విద్యలో ఖాళీలు ఏవైనా ఉంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ప్రకటించాలి. అత్యధిక విద్యార్హత వరకు మొత్తం అకడమిక్ గ్యాప్ 24 నెలలు మించకూడదు. ►పూర్తి సమయం కోర్సులు మాత్రమే పరిగణించబడతాయి, పార్ట్ టైమ్/కరస్పాండెన్స్ కోర్సులు పరిగణించబడవు. ఎంపిక విధానం కంపెనీ నిర్వహించే రెండు రౌండ్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ వ్రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ. రాత పరీక్ష రిమోట్‌గా నిర్వహించబడుతుంది. అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 నిమిషాలు), వెర్బల్ ఎబిలిటీ (10 నిమిషాలు), అడ్వాన్స్డ్ కోడింగ్ (60 నిమిషాలు) ఆధారంగా పలు ప్రశ్నలుంటాయి. -
శ‘బాష్’ హైదరాబాద్.. 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్న జర్మనీ సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తమ సాఫ్ట్వేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ, జర్మనీకి చెందిన ‘బాష్’ ప్రకటించింది. దీని ద్వారా హైదరాబాద్ కేంద్రంగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కంపెనీ సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘బాష్’ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందిన తీరును వివరించారు. మొబిలిటీ, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్, గృహోపకరణాల రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా ‘బాష్’కు పేరున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ గుర్తు చేశారు. వందేళ్ల క్రితం భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించిన బాష్.. 25 ఏళ్ల క్రితం బెంగళూరు కేంద్రంగా ఐటీ కార్యకలాపాలు మొదలు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుకూల విధానాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ నగరంలో ‘బాష్’ అడుగుపెట్టడం గొప్ప విషయమని అన్నారు. కాగా, హైదరాబాద్‌లో తమ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ‘బాష్’ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. కేటీఆర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాష్ కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం, సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు సుందర రామన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
బంపర్ ఆఫర్..! సాఫ్ట్ వేర్ జాబ్‌కు రిజైన్ చేస్తే రూ.4లక్షలిస్తాం!!
ఓ సాఫ్ట్వేర్ సంస్థ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్ చేస్తే సమారు $2,500 నుంచి 5వేల డాలర్లు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తుంది. కానీ ఉద్యోగులు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్ని ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. కొత్త ఉద్యోగుల నియామకం లేదా, ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఆ సంస్థను వదిలి వెళ్లకుండా ఉండేలా చూడడం ఆయా సంస్థలకు కత్తిమీద సాములాగా మారింది.అందుకే ఉద్యోగుల భద్రతా, శాలరీను పెంచడం, బోనస్ ఇవ్వడంతో పాటు వారి పిల్లల ఎడ్యుకేషన్ కు సంబంధించి అనేక ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా కొత్త టాలెంట్ కోసం అరిజోనాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ 'ట్రైన్యువల్' సీఈఓ క్రిస్ రోంజియో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి జాబ్‌కు రిజైన్ చేస్తే సమారు $2,500 (సుమారు.రూ.2లక్షలు )చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు. రోంజియో 2020,మే' లో పే-టు-క్విట్ పాలసీని ప్రారంభించారు. ఈ పాలసీలో భాగంగా ఉద్యోగులు తమ జాబ్‌కు రిజైన్ చేసిన రెండు వారాల్లో కంపెనీ ప్రకటించిన రూ.2కోట్లను ఉద్యోగులకు అందిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా కొత్త ఉద్యోగుల నియమాకం సులభం అవ్వడంతో పాటు, ఉద్యోగం నుంచి రిజైన్ చేస్తున్న ఉద్యోగులు ఎలాంటి ఆర్ధిక సమస్యలు ఉండొద్దని భావించారు. తాజాగా పే-టు- క్విట్లో భాగంగా ఈ ఆఫర్‌ను రూ.2లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచారు. ఇప్పటికీ ఆ ఆఫర్‌ను తిరస్కరించే ఉద్యోగులకు అదనపు 'బెన్ ఫిట్స్' ను కోల్పోతారని రోంజియో వెల్లించారు. ఈ సందర్భంగా రోంజియో మాట్లాడుతూ..తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సంవత్సరానికి $80,000, $100,000 సంపాదిస్తున్నట్లయితే, $2,500 చాలా తక్కువగా ఉండొచ్చు.లేదంటే వేరే సంస్థకు వెళ్లేందుకు ఇష్టపడకపోవచ్చు. అందుకే ఆఫర్‌ను $2,500 నుంచి $5000('సుమారు రూ.4లక్షలు) పెంచాం. అయినా జాబ్‌కు రిజైన్ చేయలేదంటే వారికి అదనపు బెన్ఫిట్స్' ను అందించమని చెప్పారు. చదవండి: ఉద్యోగులకు షాక్, టీకా వేయించుకుంటారా..ఉద్యోగం నుంచి తొలగించమంటారా! -
ఐటీ కంపెనీల పనితీరు భేష్!
ముంబై: ఎగుమతుల ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని సాధించనున్నాయి. సీజనల్‌గా చూస్తే నిజానికి సాఫ్ట్వేర్ పరిశ్రమలో అక్టోబర్–డిసెంబర్(క్యూ3) బలహీన కాలంగా విశ్లేషకులు పేర్కొంటుంటారు. అయితే క్యూ3లో త్రైమాసికవారీగా ఆదాయాలు సగటున 2.6–6 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక అంచనా వేసింది. ట్రాన్స్‌ఫార్మేషన్‌పై వ్యయాలు పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం నుంచీ ఐటీ దిగ్గజాల క్యూ3 ఫలితాల విడుదల ప్రారంభంకానుంది. బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తొలుత ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. వార్షిక ప్రాతిపదికన క్యూ3 ఆదాయ అంచనాలను కొటక్ నివేదిక వెల్లడించనప్పటికీ షేరువారీ ఆర్జన(ఈపీఎస్)పై మిశ్రమంగా స్పందించింది. కొన్ని కంపెనీల ఈపీఎస్‌లో 15 శాతం క్షీణతకు అవకాశముంటే.. మరికొన్ని దిగ్గజాలు 11 శాతంవరకూ వృద్ధిని అందుకోవచ్చని అభిప్రాయపడింది. సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల ఆధారితంకావడంతో డాలరు బలపడటం లాభించనున్నట్లు పేర్కొంది. ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడంతో 20–90 బేసిస్ పాయింట్లమేర మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు తెలియజేసింది. వృద్ధి బాటలో... కొటక్ నివేదిక ప్రకారం లార్జ్ క్యాప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా.. మిడ్ క్యాప్స్‌లో ఎల్టీ ఇన్ఫోటెక్ ముందుండే అవకాశముంది. ఆయా కంపెనీలు ఇటీవల సిబ్బందిని పెంచుకోవడం, ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలను ఇందుకు ప్రస్తావించింది. ఉద్యోగ వలసలు(ఎట్రిషన్) వేధిస్తున్నప్పటికీ డీల్స్ కుదుర్చుకోవడంలో సఫలంకావడం సానుకూలతలుగా పేర్కొంది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ 4.5 శాతం పురోగతి సాధించనుండగా.. ఇన్ఫోసిస్ 3.7 శాతం, టీసీఎస్ 2.6 శాతం చొప్పున వృద్ధి చూపవచ్చని బ్రోకింగ్ సంస్థ కొటక్ అంచనా వేసింది. మధ్యస్థాయి కంపెనీలు 5–6 శాతం పుంజుకోవచ్చని, వార్షికంగా చూస్తే మరింత అధికంగా సగటున 20–34 శాతం మధ్య ఆదాయాల్లో వృద్ధి నమోదుకావచ్చని విశ్లేషించింది. అయితే ఈపీఎస్ వృద్ధిలో విప్రో యథాతథంగా, ఇన్ఫోసిస్ 6 శాతం, టీసీఎస్, టెక్ మహీంద్రా 13–14 శాతం చొప్పున సాధించే వీలుండగా.. హెచ్‌సీఎల్ క్షీణతను చవిచూడవచ్చని పేర్కొంది. ఇబిట్ నీరసం... క్యూ3లో వార్షికంగా సగటున అన్ని కంపెనీల నిర్వహణ (ఇబిట్) మార్జిన్లు మందగించవచ్చని కొటక్ నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం ఇందుకు ఎట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు, సీనియర్ల నియామకాలు, యుటిలైజేషన్ తగ్గడం, వ్యయాలు పెరగడం వంటివి ప్రభావం చూపనున్నాయి. కాగా.. ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను 1 శాతంమేర పెంచి 17–17.5 శాతంగా ప్రకటించవచ్చు. తొలుత 12–14 శాతం వృద్ధి అంచనాలతో ఏడాదిని ప్రారంభించడం గమనార్హం. ఇక హెచ్‌సీఎల్ రెండంకెల ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. 12 శాతం పురోగతిని అందుకునే వీలుంది. -
ఓ4ఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ వాఘేలా
సప్లయ్ చైన్ సాస్ స్టార్టప్ 'ఓ4ఎస్' సాంకేతికతను మరింత బలోపేతం చేయడానికి, విస్తృతంగా వ్యాపార లక్ష్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సీనియర్ లీడర్షిప్ టీమ్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇటీవలే ప్రశాంత్ వాఘేలాను ఐటీ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. సాఫ్ట్ వేర్ రంగంలో 17ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రశాంత్ ఈకామర్స్, ఫార్మా, ఎడ్యూటెక్తో పాటు డెలాయిట్, జీఎస్కే ,యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉందని ఓ4ఎస్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఓ4ఎస్ వ్యవస్థాపకుడు దివయ్ కుమార్ మాట్లాడుతూ..“ఓ4ఎస్ కుటుంబంలో ప్రశాంత్‌ను స్వాగతిస్తున్నాం.వచ్చే మూడేళ్లలో 200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కంపెనీ మార్కెటింగ్, సేల్స్, ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి విభిన్న వర్టికల్స్‌లో బృందాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, విశాఖపట్నం: అప్పటివరకు సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి విధులకు బయలుదేరిన ఆ యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. కశింకోట హౌసింగ్ కాలనీకి చెందిన పావాడ రామ్‌కుమార్ (35) విశాఖలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు అతను బస్సులో వెళ్లేవాడు. బుధవారం మాత్రం సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో సరదా గడిపి.. బైక్‌పై నైట్ డ్యూటీకి కశింకోట నుంచి విశాఖ బయలుదేరాడు. అతని బైక్‌ను అనకాపల్లి జాతీయ రహదారిలో కొప్పాక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రామ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రామ్‌కుమార్ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య జానీఫర్ (గర్భిణి), రెండేళ్ల వయసు గల కుమారుడు ఉన్నారు. రామ్‌కుమార్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ప్రే‘ముంచాడు’.. వీడు మామూలోడు కాదు!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): యువతిని ప్రేమించానని నమ్మబలికాడు.. ఆమె నుంచి లక్షలకు లక్షలు డబ్బులు తీసుకున్నాడు.. తీరా ఆమెతో ఓ కారు కొనుగోలు చేయించి.. ఆ కారుతో ఉడాయించాడు. చివరికి యువతి ఫిర్యాదు మేరకు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ సుప్రజ, అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ సీఐ డి.నరేష్‌కుమార్‌లు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నల్లచెరువుకు చెందిన ఓ యువతి విప్రోలో ఉద్యోగం చేస్తోంది. గతేడాది ఓ చాటింగ్ యాప్ ద్వారా నల్లపాడు రోడ్డు ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన చిల్లంపూడి విజయభాస్కర్‌రెడ్డితో ఆమెకు పరిచయమేర్పడింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ విజయభాస్కర్‌రెడ్డి నమ్మబలికాడు. ఇంటీరియర్ పనులు చేసుకుంటున్న అతను.. తాను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్పాడు. యువతి నుంచి లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లయ్యాక మనకు ఇబ్బందులుండవ్ ఇద్దరం కలిసి స్మార్ట్ సర్వీసెస్ అనే కంపెనీ ఏర్పాటు చేద్దామని, పెళ్లయ్యాక ఇక ఎలాంటి ఇబ్బందులుండవంటూ ఆ యువతిని విజయభాస్కర్‌రెడ్డి నమ్మించాడు. ఈ క్రమంలో యువతికి సంబంధించిన పలు బ్యాంకు, క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకునేలా చేసి, దాదాపు రూ.25 లక్షల వరకూ ఆమె వద్ద నుంచి తీసుకున్నాడు. అలాగే ఆమెతో ఓ కారును కొనుగోలు చేయించి 2021 మే 25న గుంటూరు అరండల్‌పేటలోని ఓ హోటల్‌కు భోజనానికి తీసుకెళ్లాడు. యువతిని ఏమార్చి ఆమె హ్యాండ్ బ్యాగులోని కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చి కారుతో పరారయ్యాడు. పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి.. విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. అలాగే మరికొంత మంది యువతులనూ మోసం చేసినట్టు గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. -
ఈమె మా అమ్మ
మధుప్రియ పేదింటి అమ్మాయి. కష్టపడి చదివింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడిక ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంటుందని చుట్టుపక్కల అందరికీ తెలుసు. అయితే ప్రియకు తన తల్లి గురించి ఈమధ్యే .. అదీ నాన్న చెబితే.. ఒక నిజం తెలిసింది. అంత నిజం తెలిశాక మధుప్రియ ఊరుకుంటుందా? ‘చూడండి ఈ తల్లి కూతుర్నే నేను..’ అని లోకానికి చెప్పడం కోసమే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చుని తక్కెడ పట్టుకుంది. ఇంతకీ ప్రియకు తెలిసిన నిజం ఏమిటి? మధుప్రియకు పెద్ద ప్రమోషనే వచ్చింది. గత రెండేళ్లుగా చెన్నైలోని ఎఫ్.పి.ఎస్. ఇన్నొవేషన్స్ ల్యాబ్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్స్ అసోసియేట్‌గా పని చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీకి అసోసియేట్ మేనేజర్ అయింది. యూఎస్ కంపెనీ అది. పెద్ద జీతం. ఇక ప్రమోషన్ అంటే ఇంకా పెద్ద జీతం. మధుప్రియ ఇంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆడపిల్లలెవరూ లేరు. తనే మొదటి అమ్మాయి. డిగ్రీ చదువుతుండగానే క్యాపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ అయింది. ఎఫ్.పి.ఎస్. (ఫుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్) లోనే. సాఫ్ట్వేర్ కంపెనీ అది. అయితే ఇప్పుడొచ్చిన ప్రమోషన్ కన్నా పెద్ద ప్రమోషన్ ఆమె జీవితంలో మరొకటి ఉంది. ‘‘ఈమె మా అమ్మ’’ అని గర్వంగా చెప్పుకోవడమే ఆమె తనకు తను ఇచ్చుకున్న ప్రమోషన్. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంది. తండ్రికి చిన్న ఉద్యోగం. వాళ్లిద్దరి రోజువారి సంపాదనను బట్టి చూస్తే ప్రియ పేదింటి అమ్మాయే. కష్టపడి చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ‘‘ఇప్పుడు నేను సాధించిన ప్రమోషన్లో కూడా విశేషం లేదు’’ అంటోంది ప్రియ! అలా ఆమె అనడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం కూడా తండ్రి చెబితేనే ఆమెకు తెలిసింది. చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్‌కి తండ్రి వెళ్లేవాడు. తల్లి ఆలస్యంగా వెళ్లేది! ఆలస్యంగా అంటే.. మీటింగ్ అయిపోయాక. ఎప్పుడూ అంతే. ‘‘ఎందుకమ్మా ఆలస్యంగా వస్తావ్’’ అని ప్రియ అడిగేది. ‘‘ఇప్పటికి పనైందమ్మా’’అని తల్లి చెప్పేది. అయితే.. తన బిడ్డ కూరగాయలమ్మే ఆమె కూతురు అని తక్కిన పిల్లలకు తెలియకుండా ఉండటం కోసం ఆమె కావాలని ఆలస్యంగా చేసేదని తండ్రి చెప్పినప్పుడు ప్రియ కళ్ల వెంబడి నీళ్లు తిరగాయి. వెళ్లి తల్లిని కావలించుకుంది. అక్కడితో ఆగలేదు. ‘ఈమె మా అమ్మ’ అని చెప్పాడానికే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చొని తక్కెడ పట్టుకుంది. ప్రమోషన్ వచ్చి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా కూడా అమ్మతో కలిసి కాసేపైనా కూరగాయలు అమ్ముతుంది! ఈ అమ్మ కూతుర్నని చెప్పుకోవడాన్ని మించిన ప్రమోషన్ ఏముంటుంది అని నవ్వుతుంది. ‘‘ఈ ప్రమోషన్ మా అమ్మకే అంకితం’’ అంటోంది. ∙ -
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల: శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు బుధవారం సాయంత్రం రూ.కోటి విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి.ఎస్.జయరాఘవేంద్ర ఈ విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీని దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు డి.పి.అనంత తిరుమలలోని బంగళాలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ఎ.వి.ధర్మారెడ్డికి అందజేశారు. వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. చదవండి: జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత -
సాఫ్ట్ వేర్ కంపెనీల పై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం
-
గూగుల్ గుడ్ న్యూస్: వారానికి 3 రోజులే ఆఫీస్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రాకతో ప్రజల జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థల ఉద్యోగులు గత సంవత్సరం నుంచి ‘వర్క్ ఫ్రమ్ హోం’ విధానం అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో కొన్ని మార్పులతో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగుల కోసం ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ నూతన పద్ధతి ప్రకారం గూగుల్ ఉద్యోగులు ఇకపై వారంలో కేవలం 3 రోజులు ఆఫీస్‌కు వస్తే సరిపోతుంది. మిగిలిన రెండు రోజులు వారు ఎక్కడి నుంచైనా పని చేసే వెసలుబాటును కల్పిస్తోంది. ఈ విషయాన్ని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. 3 రోజలు ఆఫీసుకు వస్తే చాలు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టి గూగుల్ కార్యాలయాలను తిరిగి తెరిచినా 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోం) చేస్తారని, 20 శాతం మంది కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో పని చేస్తారు. ఈ క్రమంలో మిగిలిన 60 శాతం మందికి ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ పద్ధతిలో పనిచేసే వెసలుబాటు ఉంటుందని కంపెనీ సీఈవో వెల్లడించారు. గూగుల్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 1,40,000 మంది ఫుల్‌టైమ్ (పూర్తిస్థాయి) ఉద్యోగులున్నారు. భారత్‌లో గూగుల్ సంస్థకు పని చేసే ఉద్యోగులు ఎక్కువ మంది బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గుర్గావ్లోనే ఉన్నారు. ( చదవండి: Tata Motors: టాటా మోటార్స్‌కు సీసీఐ షాక్! ) The future of work at Google is flexibility. The majority of our employees still want to be on campus some of the time yet many would also enjoy the flexibility of working from home a couple days a week…— Sundar Pichai (@sundarpichai) May 6, 2021 -
సరికొత్త రికార్డుకు చేరువలో టీసీఎస్
భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ, ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటి కంపెనీలలో ఒకటైన టీసీఎస్ సరికొత్త రికార్డుకు చేరువలో ఉంది. టీసీఎస్ వచ్చే మూడు నెలల్లో 5 లక్షల ఉద్యోగుల గల సంస్థగా అవతరించనుంది. దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలవనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో ప్రపంచ స్థాయి ప్రతిభ గల ఉద్యోగులు ఇండియాలో కూడా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. గత సంవత్సరంలో 40,185 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు. కేవలం జనవరి-మార్చి 2021 కాలంలోనే 19,388 మంది ఉద్యోగులను సంస్థ చేర్చుకుంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.2 బిలియన్ డాలర్ల ఒప్పందాలను ఇతర కంపెనీలతో కుదుర్చుకుంది. భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ అమెరికా సహా పలు విదేశాలకు కూడా సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తోంది. దేశం నుంచి అత్యధిక సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తున్న ఐటీ కంపెనీగా గుర్తింపు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు యాజమాన్యం తెలిపింది. నాల్గవ త్రైమాసిక ఆదాయాల విడుదల సమయంలో జర్నలిస్టులతో జరిపిన సంభాషణలో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ మాట్లాడుతూ.. కొత్త ఉద్యోగుల నియామకం ఎక్కువ భాగం క్యూ 1(ఏప్రిల్-జూన్), క్యూ 2(జూలై-సెప్టెంబర్)లలో జరుగుతుందని పేర్కొన్నారు. 1968లో ఏర్పాటైన టీసీఎస్ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగింది. ఐటీ సేవలతో పాటు, బిజినెస్, కన్సల్టెన్సీ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్స్ విభాగాల్లో సేవలందిస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. రికార్డు స్థాయి సాఫ్ట్ వేర్ ఎగుమతులతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జూన్ నెలాఖరునాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల మార్క్ ను అధిగమించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
ఘరాన మోసం... సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటు యువతకు టోకరా!
ఖమ్మం: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు, వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డిని బుధవారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అంకిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి గత ఏడాది ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విసన్నపేటలో టిమాటిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి, అందులో నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పలువురు వద్ద కంపెనీలో వాటాలు ఇస్తానంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాడు. విసన్నపేటకు చెందిన తిరుమల జయరాం అనే బాధితుడు రూ.15 లక్షలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, మోసపోవడంతో వీఎం బంజర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థి వద్ద రూ.3.5లక్షలు మోసం చేయడంతో అక్కడ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి నరేష్‌కుమార్‌రెడ్డి వీరితోపాటు పలువురిని మోసగించి మలేషియాకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చి, తిరిగి మలేషియా వెళ్తుండగా పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఉండటంతో తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు గుర్తించి వీఎం బంజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై తోట నాగరాజు, కానిస్టేబుళ్లు కనకారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావులతో కలిసి తిరుచురాపల్లి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ప్రాంషీట్ వారెంట్‌తో ఇక్కడికి తరలించి సత్తుపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, కొన్ని బ్యాంక్ అకౌంట్‌్లను సీజ్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సీఐ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు. -
నచ్చావోయ్.. జాబిలి మీద ఎకరం నీదే..
నోయిడా: కష్టపడి చేసినదానికి కాస్తంత ప్రశంస లభిస్తే అదే పదివేలుగా భావిస్తారు ఉద్యోగులు. కానీ నోయిడాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని అలా ఊరికే మెచ్చుకుని వదిలేయలేదు. ఏకంగా జాబిలి మీద ఎకరా కొనిచ్చింది. ఈ మేరకు ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. జాగరన్ నివేదిక ప్రకారం.. బిహార్‌లోని దర్భంగాకు చెందిన ఇఫ్తేకర్ రహమానీ నోయిడాలో ఏఆర్ స్టూడియోస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ విభాగంలో పని చేసే అతడు అమెరికన్ కంపెనీ 'లూనా సొసైటీ ఇంటర్నేషనల్' కోరిక మేరకు ఓ సాఫ్ట్వేర్ తయారు చేసిచ్చాడు. దీని ద్వారా చంద్రుడి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిచ్చిన వ్యక్తి ప్రతిభకు మెచ్చిన కంపెనీ అతడిని ఘనంగా సత్కరించింది. ఏకంగా చంద్రమండలం మీద ఎకరం భూమికి యజమానిని చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కూడా సంతోషంతో వేడుకలు జరుపుకుంటున్నారట. ఈ క్రమంలో ఊరందరికీ స్వీట్లు పంచుతున్నారట. ఏదేమైనా ఉద్యోగికి జాబిలి మీద జాగా ఇవ్వడం నిజంగా విడ్డూరమేనంటున్నారు నెటిజన్లు. చదవండి: నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి! పోలీస్ మాట: శానిటైజర్ బదులు గంగాజలం, గంధం -
నైట్‌షిఫ్ట్‌తో క్యాన్సర్ ముప్పు!
న్యూఢిల్లీ: అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులతో రాత్రిపూట కూడ పనిచేయించు కొంటున్నాయి. ఈ కంపెనీలు ప్రధానంగా అమెరికా,యూకే దేశాలతో తమ ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో రాత్రిపూట ఉద్యోగాలు చేసేవారికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం తెలిసిందే..అయితే తాజాగా, వాషింగ్టన్ యూనివర్సీటీ పరిశోధనల్లో మరొక భయంకరమైన విషయాన్నివెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం, పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని తెలిపింది. కాగా,ఈ రీసెర్చ్‌ను జర్నల్ ఆఫ్ పినీల్ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు. అయితే..రాత్రిళ్ళు పనిచేసే వారిలో జీవ గడియారంలో మార్పులు వచ్చి..ఏదిసరిగ్గా గుర్తుండక పోవడం, ఆకలిలేకపోవడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో గుండె సంబంధిత ప్రభావం కూడా ఎక్కువేఅని అంటున్నారు. కాగా, తాజా పరిశోధనలతో నైట్ షిప్టులు ప్రమాదకరమనే విషయం మరోసారి రుజువైంది. చదవండి: మేనకోడలిని దారుణంగా చంపాడు! -
ఐటీ షేర్ల దూకుడు- సరికొత్త రికార్డ్స్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. తొలుత కొంతమేర ఊగిసలాటకు లోనైనప్పటికీ ప్రస్తుతం సెన్సెక్స్ 311 పాయింట్లు జంప్‌చేసింది. 46,318కు చేరింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు ఎగసి 13,557 వద్ద ట్రేడవుతోంది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలోనూ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం యాక్సెంచర్ పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. యాక్సెంచర్ అంచనాలను మించిన గైడెన్స్ ప్రకటించడంతో ఐటీ రంగానికి డిమాండ్ పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు విప్రో తాజాగా జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 70 కోట్ల డాలర్ల డీల్‌ను కుదుర్చుకోవడం, రూ. 9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుండటం వంటి అంశాలు జత కలిసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఐటీ కౌంటర్లలో కనుగోళ్లకు ఎగబడుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా అటు బీఎస్ఈలోనూ, ఇటు ఎన్ఎస్ఈలోనూ ఐటీ ఇండెక్సులు తాజాగా సరికొత్త గరిష్టాలను చేరాయి. అంతేకాకుండా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌తోపాటు.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్ చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. (ఐటీ రికార్డ్- మళ్లీ 46,000కు సెన్సెక్స్) రికార్డుల బాట ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 24,162ను అధిగమించగా.. బీఎస్ఈలో 24,174కు చేరింది. సాఫ్ట్వేర్ సేవల కంపెనీలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇంట్రాడేలో టీసీఎస్ రూ. 2,919 వద్ద, ఇన్ఫోసిస్ రూ. 1255 సమీపంలో, టెక్ మహీంద్రా రూ. 960 సమీపంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రూ. 933 సమీపంలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ బాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ రూ. 3,685 సమీపంలో, ఎంఫసిస్ రూ. 1,533 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 265 సమీపంలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ. 1,459 వద్ద చరిత్రాత్మక గరిష్టాల రికార్డులను సాధించాయి. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్) లాభాల్లో ఇతర కౌంటర్లలో బీఎస్ఈలో రామ్‌కో సిస్టమ్స్, ఈక్లెర్క్స్, హెచ్జీఎస్, ఫస్ట్‌సోర్స్, మాస్టెక్, టాటా ఎలక్సీ, ఎన్ఐఐటీ లిమిటెడ్, మైండ్‌ట్రీ, ట్రైజిన్, ఇంటెలెక్ట్ డిజైన్, శాస్కెన్ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్ తదితరాలు 8-3.5 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! -
ఐటీ రంగం కావాలంటే మేము రావాలి : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో భాగ్యనగరం బాగా రాణించాలంటే తమకే పట్టం కట్టాలని ఓటర్లను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందడంతో స్థానిక సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కేటీఆర్ ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికరమైన విషయం తెలియజేశారు. ఐటీ ఉద్యోగి గర్వపడేలా భాగ్యనగరంలో ఐటీ రంగం వృద్ధి రెట్టింపు వేగంతో జరుగుతోందని తెలిపారు. 2014 సంవత్సరంలో రూ. 57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు ప్రస్తుతం లక్షా 29 వేల కోట్లకు చేరుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. ప్రఖ్యాత సంస్థలు కోలువుదీరేలా హైదరాబాద్ ఎదిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. రాబోయే కాలంలో ఐటీ రంగం మరింత వృద్ధి సాధించాలంటే డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి మద్ధతుగా నిలవాలని అభ్యర్థించారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. 149 స్థానాల్లో బీజేపీ బరిలో ఉంది. 146 స్థానాలలో కాంగ్రెస్ పోటి చేస్తుంది. సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 స్థానాలలో, 51 ఎంఐఎం డివిజన్లలో అభ్యర్థలను రంగంలోదించారు. TRS Govt led IT Exports & Employment to double in the last six years in Hyderabad. Let's multiply this growth in coming years. Be a proud techie of Hyderabad! Vote for Car symbol on Dec 1st. #HyderabadWithTRS pic.twitter.com/RjQi5PQZL1 — KTR (@KTRTRS) November 24, 2020 -
అమ్మకు నో అడ్మిషన్
‘మమ్మీ.. హండ్రెడ్ రుపీస్.. ప్లీజ్’ మమ్మీ దగ్గర డబ్బులు తీసుకోవడం.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి బైక్ కిక్ కొట్టడం!! జాబ్ చేసే అబ్బాయిలు కూడా.. బయట తిన్నాకే.. ఇంటికి వెళ్లడం! తినకుండా వస్తే.. బయటి నుంచే తెప్పించుకోవడం! ఇంట్లో తినేవాళ్లా.. వద్దంటే వినేవాళ్లా! ఇప్పుడు సీన్ మారుతోంది. యూట్యూబ్ చూసి ఇంట్లోనే.. స్టౌ వెలిగిస్తున్నారు మగపిల్లలు! అమ్మను కూడా వంటింట్లోకి రానివ్వకుండా.. ఇంటికే రెస్టారెంట్ లుక్ తెస్తున్నారు! ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు ఇదివరకటంత ఉద్ధృతంగా లేవు. బయటి నుంచి తెప్పించుకునేవారు బాగా తగ్గిపోయారు. కారణం తెలిసిందే. కరోనా. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న మగపిల్లలు ఇంటినే రెస్టారెంట్‌గా మార్చేస్తున్నారు! ఇంట్లోవాళ్లని ఆశ్చర్యపరిచేలా రకరకాల వంటకాలను అందంగా అలంకరించి మరీ సిద్ధం చేస్తున్నారు. ‘నీకు నువ్వు తయారు చేసుకో’ అనే ఒక ఆరోగ్యకరమైన పద్ధతిని పాటిస్తున్నారు. కొత్త కొత్త వంటకాల కోసం యూ ట్యూబ్‌ను గాలిస్తున్నారు. వీళ్ల కోసమే అన్నట్లు రుచికరంగా వండే విధానాలను చెప్పే సైట్లు ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాంటి సైట్లలో ‘దివ’ రెస్టారెంట్ చెఫ్ రితు దాల్మియా నిర్వహిస్తున్న ‘డిఐవై–డు ఇట్ యువర్సెల్ఫ్’ ఒకటి. ‘‘కొన్ని వంటకాలను ఇంటి దగ్గర తయారు చేయటం అందరికీ సాధ్యపడదు. అందుకే నేను వాటి తయారీ విధానాన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఉదాహరణకు చైనీస్, థాయి వంటకాలు తయారు చేయాలంటే.. కొద్దిగా నీళ్లు లేదా కొబ్బరి పాలు కలపాలి. అప్పుడు తాజాగా తయారవుతాయి. అవి డైనింగ్ టేబుల్ మీదకు వచ్చేసరికి రెస్టారెంట్లో ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. మంచి చెఫ్లమన్న తృప్తీ మిగులుతుంది’’ అంటారు దల్మియా. ఆ మాట నిజమే. ఒకప్పుడు పెద్దవాళ్ల దగ్గర వంటలు నేర్చుకునేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఇంటింటి పెద్దగా మారింది. ఆడవాళ్లే కాకుండా.. ప్రతి ఇంటా నలభీములు తయారవుతున్నారు. పానీపూరీ, వడపావ్, బిసబేళబాత్, పనీర్బటర్ మసాలా.. ఒకటేమిటి.. అన్ని దేశాల, రాష్ట్రాల వంటకాలను యూ ట్యూబ్‌లో చూస్తూ తయారుచేస్తున్నారు. పిల్లల వంటకాలు రుచి చూసిన తల్లులు వారిని ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇంట్లోని వారిని మరింత ఆనందింపజేసేందుకు, ఆశ్చర్యపరిచేందుకు యూత్ అంతా ఇంట్లోనే బార్బిక్యూ అనుభూతి చెందేలా సెట్టింగ్స్ కూడా వేస్తున్నారు. మొఘలాయ్, తండూరీ, షావర్మ వంటి వెరైటీలు చేసి అవురావురుమనిపించేలా వడ్డిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పని ఒత్తిడి నుంచి కాసేపు రిలాక్స్ అవ్వటానికి కూడా వంట మంచి సాధనంగా పనిచేస్తోంది. ‘అమ్మా.. ఆకలి’ అని ఎప్పుడూ ఇంట్లో అమ్మ మీదే ఆధారపడకుండా అమ్మకూ చేసిపెట్టే యువతరాన్ని గత ఏడు నెలలుగా చూస్తున్నాం. కరోనా మన యువతరానికి శుభ్రతను మాత్రమే కాదు, వంటనూ నేర్పిందనే అనుకోవాలి. అమ్మకు విశ్రాంతి రకరకాల వంటకాలు చేయడటం వల్ల వంటలో నైపుణ్యం సాధిస్తున్నాను. బయటవారు ఎలా చేస్తారో తెలియదు కనుక, మన చేత్తో మనం చేసుకోవటం బెస్ట్ అనిపిస్తోంది. ఇన్ని రోజులూ తెలిసో తెలియకో బయట నుంచి తెచ్చుకున్నాం. ఈ విపత్కర సమయంలో స్వయంగా వండుకుని తినటం అలవాటైపోయింది కనుక ఇక ఎవరి మీదా ఆధారపడక్కర్లేదు. ఇంట్లో అమ్మ నిరంతరం పనిచేస్తుంటుంది. అమ్మకి విశ్రాంతి ఇవ్వాలి. అమ్మతో ఎక్కువ గడపాలి. అమ్మకు çసహాయపడాలి. – శివతేజ, సాఫ్ట్వేర్ ఉద్యోగి, విజయవాడ అందమైన అనుభూతి లిటిల్ థింగ్స్ బ్రింగ్ మోర్ హ్యాపీనెస్. అమ్మనాన్నలకి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. వాళ్లకు స్వయంగా నేనే వండి పెట్టడం ఒక అందమైన అనుభూతి. ఇంట్లో వాళ్లందరం కలిసి కూర్చుని తినటం కూడా ఆనందంగా అనిపిస్తోంది. ఆఫీస్‌లో పనిని ఉద్యోగులు పంచుకుంటారు. అలాగే ఇంట్లో మేం కూడా ఒకరు కూరలు తరగటం, ఒకరు వండటం, ఒకరు మసాలాలు చూడటం.. ఇలా విభజించుకుంటున్నాం. అందరం తలో చెయ్యి వేయడటం వల్ల రుచికరమైన డిష్ త్వరగా సిద్ధమవుతోంది. – శ్రీవాత్సవ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, హైదరాబాద్ – వైజయంతి పురాణపండ -
ఈ ఐటీ షేర్ల సొగసు చూడతరమా?
తొలుత కనిపించిన ఆటుపోట్ల నుంచి బయటపడుతూ జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 303 పాయింట్లు జంప్‌చేసి 39,877ను తాకగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 11,735 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో మైండ్‌ట్రీ లిమిటెడ్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, ఆల్‌సెక్ టెక్నాలజీస్, సైబర్‌టెక్ సిస్టమ్స్, తెరా సాఫ్ట్వేర్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. మైండ్‌ట్రీ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం దూసుకెళ్లి రూ. 1,469 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,590 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.11 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.25 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 2,809 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,959 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 13,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 27,500 షేర్లు చేతులు మారాయి. ఎంఫసిస్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 1,414 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,454 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 16,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 62,000 షేర్లు చేతులు మారాయి. ఆల్‌సెక్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం లాభపడి రూ. 265 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 350 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2,000 షేర్లు చేతులు మారాయి. తెరా సాఫ్ట్వేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం ఎగసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 8,000 షేర్లు చేతులు మారాయి. సైబర్‌టెక్ సిస్టమ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 14 శాతం జంప్‌చేసి రూ. 84 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 88 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 26,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి. -
పతన మార్కెట్లోనూ ఈ చిన్న షేర్లు భళా
ఉన్నట్టుండి పెరిగిన అమ్మకాలతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 725 పాయింట్ల వరకూ పడిపోగా.. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో అధిక శాతం సాఫ్ట్వేర్ సేవల కంపెనీలు కావడం గమనార్హం! జాబితాలో శాస్కన్ టెక్నాలజీస్, శాక్సాఫ్ట్ లిమిటెడ్, సిగ్నిటీ టెక్నాలజీస్, రామ్‌కో సిస్టమ్స్, కనోరియా కెమికల్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం.. శాస్కన్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 644 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 684 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 17,900 షేర్లు చేతులు మారాయి. సిగ్నిటీ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 383 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 410 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 29,000 షేర్లు చేతులు మారాయి. శాక్సాఫ్ట్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం ర్యాలీ చేసి రూ. 405 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 447 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 69,000 షేర్లు చేతులు మారాయి. రామ్‌కో సిస్టమ్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం లాభపడి రూ. 390 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 397 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో లక్ష షేర్లు చేతులు మారాయి. కనోరియా కెమికల్స్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం లాభపడి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 44 వరకూ ఎగసింది. బీఎస్ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 48,500 షేర్లు చేతులు మారాయి. -
కరోనా వ్యాక్సిన్‌లో ‘తెలుగోడి సాఫ్ట్వేర్’
సాక్షి, కాకినాడ: కాకినాడకు చెందిన ప్రైమ్‌సాఫ్ట్ సాఫ్ట్వేర్ సంస్థ అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహిస్తోన్న కోవిడ్–19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ ట్రయల్స్‌కు అవసరమైన ‘సబ్జెక్ట్ డేటా’ను అందిస్తోంది. దిగ్గజ ఔషధ తయారీ సంస్థలన్నీ తమ ఉత్పత్తులకు ప్రామాణికంగా తీసుకునే రోచెస్టర్ క్లినికల్ రీసెర్చ్ సంస్థకు.. మన రాష్ట్రానికి చెందిన ఈ కంపెనీ సేవలందిస్తోంది. ప్రైమ్‌సాఫ్ట్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఇప్పటికే 750 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ► అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణలో గత ఏడాది సాధారణ పరిశీలన కోసం కాకినాడకు వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు.. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు(ఎస్టీపీ)లో కొలువుదీరిన ప్రైమ్‌సాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ► కాకినాడ సంస్థ ఆవిష్కరించిన అధునాతన సాఫ్ట్వేర్లను చూసి అప్పట్లోనే మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల కోవిడ్–19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో వినియోగించే ’సబ్జెక్ట్ డేటా’ సాఫ్ట్వేర్ రూపొందించాలని కోరారు. ► అప్పటికే ఇదే ప్లాట్‌ఫాంపై పని చేస్తున్న ప్రైమ్‌సాఫ్ట్ స్థానిక సిబ్బంది.. రోజుల వ్యవధిలోనే సీసీ ఈసోర్స్ పేరుతో క్లినికల్ ట్రయల్స్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమెరికన్ సంస్థకు అందజేశారు. క్లినికల్ ట్రయల్స్ జరిగే అన్ని అంచెల్లోనూ సీసీ ఈ–సోర్స్ తన సేవలను అందిస్తోంది. ► సంస్థ కృషికి గోదావరి వాసిగా గర్విస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఐటీ అసోసియేషన్ గోదావరి రీజియన్ చైర్మన్ కృష్ణారెడ్డి కొవ్వూరి అన్నారు. ► ప్రైమ్‌సాఫ్ట్ సీఈఓ ఆళ్ల నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం పిలుపు మేరకు స్థానిక యువతకు ప్రాధాన్యమిచ్చామని, తద్వారా అద్భుతమైన ప్రయోజనాలు రాబట్టామని చెప్పారు. -
ఐటీ షేర్ల లాభాల హవా- భారీ ట్రేడింగ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సాధించిన ఫలితాలు ఐటీ రంగానికి జోష్‌నిస్తున్నాయి. దీంతో మధ్యస్థాయి ఐటీ కంపెనీల షేర్లకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ల నేపథ్యంలోనూ క్యూ1(ఏప్రిల్-జూన్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బుధవారం విప్రో కౌంటర్ 15 శాతం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఆకర్షణీయ పనితీరు చూపడంతో పలు ఐటీ కౌంటర్లు నేటి ట్రేడింగ్‌లో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జాబితాలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎంఫసిస్, మాస్టెక్, సొనాటా సాఫ్ట్వేర్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ప్రస్తుతం 9.2 శాతం జంప్‌చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7.9 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈలో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 1.18 కోట్ల షేర్లు కావడం గమనార్హం! ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 2291 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2336ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.7 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం! ఎంఫసిస్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ఎంఫసిస్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 1035 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1099ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 13.8 లక్షల షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.54 లక్షల షేర్లు మాత్రమే! మాస్టెక్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం మాస్టెక్ లిమిటెడ్ షేరు 9.2 శాతం జంప్‌చేసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 955ను అధిగమించింది. బీఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 42,000 షేర్లు చేతులు మారాయి. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లు మాత్రమే కావడం గమనార్హం! సొనాటా సాఫ్ట్వేర్ ఎన్ఎస్ఈలో ప్రస్తుతం సొనాటా సాఫ్ట్వేర్ షేరు 4 శాతం లాభపడి రూ. 245 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 252ను తాకింది. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నానికల్లా 13.4 లక్షల షేర్లు చేతులు మారాయి.ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.6 లక్షల షేర్లు మాత్రమే! -
ఐటీ రంగంపై వేలాడుతున్న కరోనా కత్తి
-
నిర్మానుష్యంగా మారిన సాప్ట్వేర్ జంక్షన్
-
డబ్బులు ఇవ్వమన్నందుకు లైంగిక వేధింపులు
సాక్షి, ఖమ్మం : సాఫ్ట్వేర్ కంపెనీలో వాటా ఇస్తానని చెప్పి తాంత్రిక బాబా ఓ మహిళను నమ్మించాడు. ఆమె వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని స్టేషన్ రోడ్‌కు సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన భర్త మృతి చెందటంతో తనకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంతో పిల్లలను పోషించుకుంటోంది. ఇంట్లో తరచూ సమస్యలు ఉంటుండడంతో.. ఆమె బంధువు ఒకరు విజయవాడలోని భవానీపురానికి చెందిన త్రిశక్తి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు తాంత్రికబాబా అయిన కోనాల అచ్చిరెడ్డి గురించి చెప్పారు. దీంతో ఆమె విజయవాడ వెళ్లి బాబాను కలిసింది. కొద్ది నెలల్లో వారి మధ్య పరిచయం పెరిగింది. ఈ క్రమంలో బాబా తన మాయమాటలతో ఆమెను నమ్మించాడు. తాము విశాఖ పట్టణంలో సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నామని, రూ.50 లక్షలు ఇస్తే నిన్ను డైరెక్టర్‌గా చేస్తామని బాబాతో పాటు ఆయన కుమారుడు వంశీకృష్ణారెడ్డి ప్రలోభపెట్టారు. అనంతరం 50 లక్షల రూపాయలతో పాటు ఆమె దగ్గర నుంచి కారును కూడా తీసుకున్నారు. ఈ తర్వాత ముఖం చాటేశారు. నిలదీసిన మహిళకు లైంగిక వేధింపులు తన డబ్బులు తీసుకుని మోసగించారని బాబాతో పాటు ఆయన కుమారుడు, అనుచరులను సదరు మహిళ నిలదీయటంతో తమ వద్ద నగ్న చిత్రాలు ఉన్నాయని, డబ్బులు అడిగితే అవి సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీస్తామని బెదిరించారు. పైగా ఖాళీ ప్రామీసరి నోట్లపై సంతకాలు సైతం చేయించుకున్నారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె వారం రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాబా అతని కుమారుడు, అనుచరులపై 420, 354(ఎ),406, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో అచ్చిరెడ్డి, అతని కుమారుడు.. మహిళ ఫిర్యాదు మేరకు ఖమ్మం వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ విజయవాడకు వెళ్లగా అప్పటికే తాంత్రికబాబా, అతని కుమారుడు వంశీకృష్ణారెడ్డి పారిపోయారు. త్వరలో వారిని పట్టుకుంటామని సీఐ రమేష్ తెలిపారు. కాగా బాబా అనుచరుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
నగరంలో హడలెత్తించిన జీఎస్టీ దాడులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు నగరంలోని 23 ప్రాంతాల్లో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రూ.కోట్లలో సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు జూబ్లీహిల్స్‌లోని ఓ వర్ధమాన సినీనటి నివాసంపై దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సదరు హీరోయిన్ షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ నటి రూ.20 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని సమాచారం. చిట్‌ఫండ్, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలతోపాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, తదితర ఆఫీసుల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం విద్యార్థులను విదేశాలకు పంపే కన్సల్టెన్సీలు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. బుధవారం నుంచి జీఎస్టీ అధికారులు జంటనగరాల్లో దాడులు జరుపుతున్నారు. వీటిలో ఓ సినీనటుడి వ్యాపార సంస్థలతోపాటుగా పలు మౌలిక సదుపాయాల కంపెనీలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, స్టీలు వ్యాపారాలపై బుధవారం చేసిన దాడుల్లో దాదాపు రూ.40 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. -
సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా విదేశాలకు నల్లధనం
న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో... ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మోటెక్ సాఫ్ట్వేర్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ అంధేరీ ప్రాంతం నుంచి గత 20 ఏళ్లుగా నడుస్తూ... మిలియన్ల డాలర్లను స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో తనకున్న విదేశీ సంస్థల ద్వారా డిపాజిట్ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దర్యాప్తు విషయంలో పన్ను అధికారులు స్విట్జర్లాండ్ ప్రభుత్వ సాయాన్ని కోరారు. దీంతో మోటెక్ సాఫ్ట్‌వేర్‌కు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేరషన్ (ఎఫ్‌టీఏ) నోటీసు జారీ చేసింది. పది రోజుల్లోగా నియమిత వ్యక్తి (నామినేటెడ్) వివరాలను సమర్పించాలని కోరింది. సమాచారం పంచుకోవడాన్ని వ్యతిరేకించే హక్కును వినియోగించుకునేందుకే చట్టబద్ధంగా ఈ నోటీసు జారీ చేసింది. జెనీవా బ్రాంచ్‌లో 500 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లతో అతిపెద్ద భారత ఖాతాదారుగా మోటెక్ సాఫ్ట్వేర్ పేరు ఇటీవలే వెలుగు చూసిన హెచ్ఎస్బీసీ జాబితాలో ఉండడం గమనార్హం. -
తలకిందులైన సాఫ్ట్వేర్ లైఫ్‌స్టైల్..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తవగానే ఎంఎన్సీ కంపెనీలు కొలువిచ్చాయి. కెరీర్ మొదలు పెట్టగానే ఐదంకెల జీతం.. ఐదు రోజుల పని.. వీకెండ్ పార్టీలు, మాల్స్‌లో షాపింగ్‌లు.. బ్రాండెడ్ వస్తువులు.. ఖరీదైన సెల్ఫోన్లు.. ఇదీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగి లైఫ్ అంటే ఇంత సుఖంగా ఉంటుందా అన్న రేంజ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు మనవాళ్లని పెంచి పోషించాయి. సాఫ్ట్వేర్ ఇదో డిగ్రీ పేరో.. కోర్సు పేరో.. కాదు.. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో అంతకన్నా స్వేచ్ఛగా యువతను ఎగిరేలా చేసినా ఓ లైఫ్ట్రెండ్. ఇండియాలో సాఫ్ట్వేర్ బూమ్ మొదలయ్యాక సీన్ అంతా మారిపోయింది. సాప్ట్వేరు.. జీవితం వేరు.. దేశంలో ఏ రంగంలో ఇవ్వలేనన్ని జీతాలు ఒక్క సాఫ్ట్వేర్ రంగం మాత్రం ఇవ్వగలిగింది. ఒక్క జీతాల్నే కాదు. ఒక ఉద్యోగి ఊహించని సదుపాయాల్ని కల్పించింది. ఉద్యోగులకు ప్రాజెక్టులు లేకపోయినా సరే వారికి ప్రాజెక్టులు వచ్చే వరకు పూర్తి జీతం ఇచ్చి బెంచ్ మీద ఉంచింది. బాస్ ఒక్కమాట అన్నా సరే రిజైన్ లెటర్ ఇచ్చి మర్నాడే వేరే కంపెనీలో జాయిన్ అయిపోయేవారు. దీంతో తమ జీవితాలకు అసలు ఢోకా లేదనుకున్నారు. వీళ్లను చూసి కొత్తతరం అంతా ఇంజనీరింగ్ బాట పట్టారు. క్యాంపస్‌లో బీటెక్‌లు పూర్తిచేయకముందే కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవి. కంపె నీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటివ్లతో ఒక్కసారిగా లగ్జరీ ఆవరించేసింది. కానీ కాలం, కర్మం కలసి రాకపోవడంతో తత్వం బోధపడి, సాఫ్ట్వేర్ ఉద్యోగుల దూకుడు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ.. దేశంలో ఎక్కడా లేనంతమంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఏటేటా తెలుగు రాష్ట్రాల్లో పుట్టుకొస్తారు. వీరికితోడు ఇన్స్టెంట్ ఉద్యోగం కోసం కోర్సులు నేర్చుకుని మరీ రెడీ అయ్యేవారు. సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా ఒకప్పుడు గ్రూప్స్ కోచింగ్‌కు కేంద్రమైన అమీర్‌పేట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్‌కు అడ్డాగా మారడమే దీని క్రేజ్‌కు అద్దంపడుతోంది. అమెరికాలో గానీ.. ఇక్కడ గానీ.. సాఫ్ట్వేర్ ఓ పదేళ్లు నడిచింది. జనం డబ్బులు నీళ్లలా ఖర్చు చేశారు. కొద్దిమంది తెలివైన వాళ్లు డబ్బులు దాచుకున్నారు. కానీ ఇంతలోనే వారికి తత్వం బోధపడింది. సాప్ట్‌వేర్‌ను ఓ సునామీ ముంచెత్తింది. అమెరికాలో లేమండ్స్ బ్రదర్స్ దెబ్బకి అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే చిన్నాభిన్నమైపోయింది. దీంతో అక్కడి బ్యాంకులు, సాఫ్ట్వేర్ సంస్థలు భారత్‌కి తమ ఔట్స్సోర్స్ సేవల్ని పూర్తిగా నిలిపివేశాయి. అంతే.. ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆర్డర్లు ఆగిపోయాయి. ఆ దెబ్బకి కంపెనీలన్నీ కాస్ట్ కట్టింగ్ మెథడ్‌ని ఫాలో అయ్యాయి. అప్పటివరకు విదేశీ కంపెనీల నుంచి లక్షల్లో తీసుకుని తమ ఉద్యోగులకి వేలల్లో ఇచ్చే కంపెనీలు ఒక్కసారిగా తమకు బిజినెస్ రాకపోయే సరికి ఉద్యోగుల్ని ఒక్కొరిని తొలగించడం మొదలుపెట్టాయి. అప్పటివరకు లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సాఫ్ట్వేర్ బాబులకు కొత్తగా పింక్‌స్లిప్‌లు అలవాటయ్యాయి. అప్పటివరకు కంపెనీకి రాకపోయినా పట్టించుకోని హెచ్ఆర్ మేనేజ్మెంట్ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా తీసేయడం మొదలు పెట్టేశాయి. దీంతో ఒక్కసారిగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు మొదలైం ది. పింక్స్లిప్లతోపాటు, అప్పటివరకు లేని ఆర్థిక అభద్రత కొత్తగా పరిచయమైంది. 2007 లో వచ్చిన మాంద్యం ఐటీపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారి లైఫ్ మారిపోయే సరికి జీవితం విలువేంటో తెలిపొచ్చింది. భరించలేని ఒత్తిడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందని తెలిపేందుకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉండే హంగులు, ఎంప్లాయీస్ ఆర్భాటాలు, ఐదు రోజుల పని ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఆఫీస్‌లో వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు ఎవరికీ తెలియవు. తెల్లారితే చాలు ఒత్తిడికి ఎంత నలిగిపోతారో అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. 5రోజుల్లో ఎన్ని టార్గె ట్లు ఉంటాయో వారికే తెలుసు. కళ్ల ముందు కనిపించే టార్గెట్లు, ముంచుకొచ్చే డెడ్లైన్లు, భయపెట్టే పింక్‌స్లిప్‌లు ఇలా ఒత్తిళ్ల వలయం లో సమస్యల అరణ్యంలో పనిచేస్తున్నామని పలువురు ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. సేవింగ్స్‌పై దృష్టి పెట్టడం అవసరం: శివ, ఇన్ఫోసిస్ ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగులు జీతాన్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ప్లేఆఫ్స్ వల్ల ఉద్యోగాలకు భద్రత కష్టతరమైంది. ఈ మధ్య కాలంలో దుబారా తక్కువగా ఉండే ఎంజాయ్మెంట్స్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అధిక ప్రాధాన్యతఇస్తున్నారు. ఒకప్పటి వైభవం లేదు.. ఒకప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ వైభవం ఇప్పుడు లేదనే చెప్పాలి. కొత్త ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక్కో కాలేజీ నుంచి వందల నుంచి తీసుకునే కంపెనీలు పది మందికి మించి తీసుకోవడం లేదు. కొత్త ఉద్యోగం అటుంచితే ఉన్న ఉద్యోగాలు పీకేయడం మొదలైంది. 2015 మార్చిలో ఒక దిగ్గజ సంస్థ 35 వేల మందిని ఒకేసారి తొలగించింది. ఎప్పుడు పింక్‌స్లిప్ వస్తుందో తెలియక నిత్యం భయంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లైఫ్ వేరు, ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు. ఉద్యోగం పోయినా బ్యాంకు బాలెన్స్ లేకపోవడం, ఈఎంఐలు కూడా భారీగా మిగిలిపోయాయి. మాంద్యం దెబ్బకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కార్లను కూడా తిరిగి అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు నష్టానికే తాము కొన్న ఫ్లాట్లను లోన్లు ఇచ్చిన బ్యాంకులకే అప్పగించాల్సి వచ్చింది. దీంతో అప్పటివరకు చేసిన తప్పుల్ని ఒక్కసారి బేరీజు వేసుకన్నారు. క్రెడిట్ కార్డుల్ని బలవంతంగా వదిలించుకోవడం, వీకెండ్ పార్టీలకు వెళ్లడం మానేసి వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ వీకెండ్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచించేవాళ్లు ఇప్పుడు ఈ వీకెండ్‌లోగా ఉన్న ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇడ్లీ బండి దగ్గరే టిఫిన్లు గతంలో కిటకిటలాడిన హోటళ్లు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. అక్కడికి వెళ్లాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డుపక్కన ఇడ్లీ బండ్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. నెలంతా చేసే ఖర్చులు తగ్గించారు. చిట్లు కట్టుకుంటూ పొదుపు మంత్రాలు జపిస్తున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా కార్లు వాడిన వారు నడకకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫీసులో ఇష్టానుసారం వర్క్ చేయకుండా జాగ్రత్తగా ఆచితూచి వర్క్ చేస్తున్నారు. ప్రమోషన్ కోసం, కెరీర్లో ఎదగడం కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. ఇలా ఒకప్పటి ఉద్యోగులకు ఇప్పటి సాఫ్ట్వేర్ జీవితాలకు ఎంతో తేడా కనిపిస్తుంది. – సందీప్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ సమయంలో ఆఫీసులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగం నాది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్సర్సైజ్లు చేయడంలాంటివి చేయాలా? – కె.పల్లవి, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే గర్భిణులు ఒకే పొజిషన్లో కూర్చుని ఎక్కువ సేపు కంప్యూటర్ మీద పని చేయకుండా రెండు గంటలకొకసారి లేచి అటూ ఇటూ తిరగడం చెయ్యాలి. ఎక్కువ ముందుకు వంగి పని చెయ్యకుండా నడుమును కుర్చీకి మంచిగా ఆన్చి కూర్చుని పని చేసుకోవాలి. లేకపోతే నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. గర్భం పెరిగే కొద్దీ బరువు పెరగడం, తర్వాత కాళ్ల వాపులు రావడం వంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి టేబుల్ కింద చిన్న స్టూల్ వేసుకుని, లేదా డస్ట్‌బిన్ మీద కాళ్లు ఎత్తుగా పెట్టుకుని కూర్చోవాలి. మంచినీళ్లు బాగా తాగాలి. మధ్యలో పండ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. చిన్నగా కాళ్లను తిప్పడం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చెయ్యాలి. డాక్టర్ సలహా మేరకు చిన్నగా మెట్లు ఎక్కి దిగడం, కింద కూర్చుని మెల్లగా లేవడం వంటివి కొద్దిగా చెయ్యవచ్చు. హెల్త్ఫైల్ కాపీ ఫొటో తీసి మీ ఫోన్లో పెట్టుకోవాలి. ఆఫీసులో ఏదైనా సమస్య వస్తే, వెంటనే నేరుగా హాస్పిటల్‌కి వెళ్లి మీ ఫోన్లోని కాపీ చూపించవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) గురించి వివరంగా తెలియజేయగలరు. ఇది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుందా? ఈ ఇండెక్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? – పి.మాలిక, టంగుటూరు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అంటే ఒకరి బరువును కేజీల్లో చూసి, ఎత్తును మీటర్లలో కొలిచి, బరువులో మీటర్లను రెట్టింపు చేసి భాగించడం ద్వారా లెక్కిస్తారు. ఎవరైనా ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఇదొక సూచిక. బీఎంఐ 18.5 ఉంటే బరువు తక్కువ ఉన్నట్లు, 18.5 నుంచి 24.9 వరకు ఉంటే తగిన బరువు ఉన్నట్లు, 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు ఉన్నట్లు, 30 కంటే ఎక్కువ ఉంటే మరీ అధిక బరువు లేదా ఒబేసిటీ ఉన్నట్లు అంచనా. ప్రపంచం మొత్తం మీద బీఎంఐ లెక్క, వాల్యూ ఒకే విధంగా ఉంటుంది. బీఎంఐ ఆధారంగా ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో చూడటం జరుగుతుంది. బీఎంఐ తక్కువగా ఉంటే బరువు పెరగమని, ఎక్కువగా ఉంటే బరువు తగ్గమని సూచించడం జరుగుతుంది. బీఎంఐ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఎంఐ సాధారణ స్థాయిలో ఉండేలా చూసుకోవడం మంచిది. మా వారి ఉద్యోగం షిఫ్ట్‌ల ప్రకారం ఉంటుంది. కొన్నిసార్లు పగలు, కొన్నిసార్లు రాత్రి ఉంటుంది. బయటి తిండి ఎక్కువగా తినడం వల్ల ఆయన లావు అవుతున్నారు. దీనివల్ల ఈస్ట్రోజెన్ సమస్య ఏర్పడి పిల్లలు కలగకపోవచ్చునని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. – ఆర్జీ, విజయనగరం అధిక బరువు ఉండటం వల్ల కొందరు మగవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా తయారవుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఈస్ట్రోజెన్‌గా మార్పు చెంది, టెస్టోస్టిరాన్ మోతాదు తగ్గిపోతుంది. దీనివల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం, కోరికలు సరిగా లేకపోవడం, కలయికలో ఇబ్బందులు వంటి సమస్యల వల్ల సంతానం కలగడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల స్క్రోటమ్‌లో వృషణాలకు గాలి ఆడక, వాటి ఉష్ణోగ్రత పెరిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు వల్ల బీపీ, సుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి మీవారు ఏదో రకంగా బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయామాలు చెయ్యడం, వదులుగా ఉండే లోదుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వీర్యపరీక్ష చేయించుకుని, డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్ -
భద్రత.. భరోసా
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వారి కోసం ఇప్పటికే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ‘షీ షటిల్’ సర్వీసులు నడిపిస్తున్న పోలీసులు... రాత్రి సమయాల్లో వారికి మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ పేరుతో 2016 జూన్ 16న విడుదల చేసిన జీవో 51 ప్రకారం... రాత్రి సమయాల్లో మహిళలకు తప్పనిసరిగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఆ బాధ్యతలను ఆయా కంపెనీలు చూసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం ఆదేశించారు. ఏదైనా పని నిమిత్తం కంపెనీ ఏర్పాటు చేసే క్యాబ్‌లలో వెళ్లని పక్షంలో సదరు ఉద్యోగినులు కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చాలా సందర్భాల్లో కార్యాలయాలకు వెళ్లిన మహిళలు ఇంటికి తిరిగిరాని పక్షంలో కుటుంబసభ్యులు కంగారుపడి పోలీసులను ఆశ్రయిస్తున్న సంఘటనలు పెరుగుతుండడంతో సీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలకు ఐటీ కంపెనీలు సమ్మతించాయి. మహిళల కోసం క్యాబ్‌లు నడుపుతామంటూ తెలిపాయి. -
ఓటేయండి, సాక్ష్యం చూపండి లేదంటే.. సెలవు కట్
పాలికె, అసెంబ్లీ, లోక్‌సభ.. ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఉద్యాననగరిలో ఐటీ, బీటీ తదితర అనేక సంస్థల ఉద్యోగులకు సెలవే. అయితే అనేకమంది పోలింగ్ కేంద్రాలకు కాకుండా విహార యాత్రలకు వెళ్తున్నారని ఫిర్యాదులు రావడంతో కంపెనీలు నివారణ చర్యలు చేపట్టాయి. బనశంకరి: రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకుండా సెలవును గడిపే ఐటీ కంపెనీ ఉద్యోగులను యాజమాన్యాలు కట్టడి చేయబోతున్నాయి. ఈ నెల 18 తేదీన బెంగళూరులో జరిగే పోలింగ్ రోజున కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుని, ఆ ఆధారాలను హెచ్ఆర్ విభాగంలో సమర్పించాలి. అప్పుడే వేతన సమేత సెలవు లభిస్తుంది. లేనిపక్షంలో ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి పలు చర్యలు చేపడుతోంది. ప్రతి ఎన్నికల్లోనే విద్యావంత ఓటర్లు పోలింగ్ రోజున ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారని, గ్రామీణ ప్రదేశాల కంటే నగరాల్లో పోలింగ్‌శాతం తక్కువగా నమోదు కావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నగరంలోని ఐటీ, బీటీ కంపెనీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులను ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు తప్పనిసరిగా ఓటు వేయాలని తమ ఉద్యోగులను ఆదేశించాయి. వేతన సెలవు పక్కదారి ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారు. ఈ సెలవును ఉద్యోగులు విశ్రాంతికి, విహార యాత్రలకు మార్చుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అంతే తప్ప బాధ్యతగా ఓటు వేయడం లేదు. దీనిని నివారించడానికి యజమాన్యాలు తమ ఉద్యోగులకు వేతన సమేతంగా సెలవు కావాలంటే ఓటింగ్‌లో పాల్గొన్నట్లు పూర్తి ఆధారాలు అందజేయాలి. లేని పక్షంలో ఆ రోజు సెలవు రద్దు చేస్తామని చెబుతున్నాయి. ఇన్పోసిస్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు సందేశం పంపినట్లు సమాచారం. -
ఆ చూపులే దొరకబడతాయి..
‘ఆ మొహం ఏంట్రా.. దొంగతనం చేసేవాడిలా అలా పెట్టావూ’అంటూ మనం అప్పుడప్పుడు స్నేహితులను గేలి చేస్తుంటాం. దొంగతనం చేసే వారి ముఖకవళికలు తేడాగా ఉంటాయి కదా మరి.. అచ్చు ఇదే ఐడియాను ఉపయోగించి జపాన్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఏదైనా షాపింగ్ మాల్లో అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను వారి ముఖ కవళికల ఆధారంగా ఈ సాంకేతికత గుర్తిస్తుంది. కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుని ఈ సాంకేతికతను తయారుచేశారు. 2002లో టామ్‌క్రూజ్ హీరోగా నటించిన మైనారిటీ రిపోర్ట్ సినిమాలో ఇలాంటి సాంకేతికతనే వాడారు. వాకాఐ అనే జపాన్‌కు చెందిన కంపెనీ రూపొందించిన ఈ సాంకేతికత పేరు ‘వాక్ఐ’. సీసీ కెమెరాలోని ఫుటేజీ ఆధారంగా వ్యక్తుల ముఖ కవళికలను ఈ సాంకేతికత అధ్యయనం చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి అనుమానంగా కనిపించినా.. ఏదైనా దొంగతనం చేస్తాడని భావించినా ఆ టెక్నాలజీ ఫోన్లోని సంబంధిత యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. వెంటనే అప్రమత్తమై అతగాడిని పట్టేసుకోవచ్చన్న మాట. 2018 డిసెంబర్లో యొకహామాలోని షాపింగ్‌మాల్‌లో టోపీ దొంగిలించిన ఓ వ్యక్తిని పట్టించడంతో ఈ టెక్నాలజీ పేరు మారుమోగిపోయింది. వచ్చే మూడేళ్లలో టోక్యోలో లక్ష స్టోర్లలో దీన్ని వినియోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ‘వాక్ఐ’చెబుతోంది. -
13 ఏళ్లకే సాఫ్ట్వేర్ కంపెనీ
దుబాయ్: 9 ఏళ్లకే మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 ఏళ్లకే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని దుబాయ్‌లో స్థాపించాడు. కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేశ్ ఐదేళ్లకే కంప్యూటర్ వాడటం ప్రారంభించాడు. ఈ బుడతడు ఇప్పటికే పలు కంపెనీలకు వెబ్సైట్లు, లోగో లు రూపొందిస్తున్నాడు. ఆదిత్యన్ కేరళలోనే పుట్టినా తన తల్లిదండ్రుల తో కలిసి 8 ఏళ్ల క్రితం నుంచి దుబాయ్‌లో ఉంటున్నాడు. తాజాగా అతను ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని అక్కడే స్థాపించాడు. ప్రస్తుతానికి ఇందులో ముగ్గురు ఉద్యోగులుండగా వారంతా ఆదిత్యన్ సహ విద్యార్థులు, స్నేహితులే. కంపెనీకి యజమాని అవ్వాలంటే 18 ఏళ్ల కనీస వయసు ఉండాలనీ, అయితే ట్రైనెట్ సొల్యూషన్స్ కూడా కంపెనీలాగే పనిచేస్తుందనీ, ఇప్పటికే 12 మంది క్లైంట్లకు ఉచితంగా సేవలందించామని ఆదిత్యన్ తెలిపాడు. -
టెకీలకు గుడ్‌న్యూస్ : ఐటీలో నియామకాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : రాబోయే ఆరు నెలల్లో ఐటీ రంగంలో సంస్థలు పెద్దఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.పలు ఐటీ కంపెనీలు ప్రధానంగా జూనియర్ లెవెల్ ఉద్యోగాలను భారీగా రిక్రూట్ చేస్తాయని ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. అమెరికాలో ప్రతిపాదిత వీసా నియంత్రణల నేపథ్యంలో భారత్‌లో గత కొద్దినెలలుగా తగ్గుముఖం పట్టిన నియామకాలు క్రమంగా ఊపందుకుంటున్నాయని ఈ నివేదిక పేర్కొంది. రానున్న రెండు త్రైమాసికాల్లో ఐటీ రంగంలో నియామకాలు చేపట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. భారీ ఐటీ దిగ్గజాలు హైరింగ్ ప్రణాళికలకు పదునుపెడుతుండగా, నాన్ ఐటీ కంపెనీలు సైతం డిజిటల్ వైపు మళ్లేందుకు అనుగుణంగా సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టిసారించాయి. ఐటీ కంపెనీలు భారీ వడపోతల అనంతరం జూనియర్ లెవెల్లో నియామకాలను పెద్దఎత్తున చేపడతాయని, సృజనాత్మకత, వినూత్న ఆలోచనాధోరణి కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్యాకేజీలు లభిస్తాయని నివేదిక పేర్కొంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చైన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలపై స్టార్టప్‌లు పనిచేస్తుండటంతో స్టార్టప్‌లలోనూ నియామకాలు భారీగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 550 ఐటీ కంపెనీల యాజమాన్యాలతో ఇంటర్వ్యూల ద్వారా వారి హైరింగ్ ప్రణాళికలను ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే విశ్లేషించింది. -
అప్పులబాధతో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ఆత్మహత్య
నవాబుపేట(జడ్చర్ల) : సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు బీటెక్ అయిపోగానే.. సాఫ్ట్వేర్ కోర్సులు పూర్తిచేశాడు. ఆ తర్వాత తనకే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో అప్పులు చేసి మరీ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు వస్తాయని భావించినా అలాంటిదేమీ లేకపోవడం.. అప్పులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని తన బంగారు జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని కొల్లూర్ పరిధిలోని బట్టోనిపల్లి తండాకు చెందిన హరికృష్ణనాయక్(23) గత ఏడాది హరిభారతి ఆర్గనైజేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీనీ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాడు. దాదాపుగా రూ.40 లక్షలు వెచ్చించి ఈ కంపెనీని ఏర్పాటుచేయగా, 22 మందికి ఉపాధి కల్పించాడు. రానురాను ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ఉద్యోగులకు సైతం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో మనోవేదనకు గురైన హరికృష్ణ మహబూబ్‌నగర్‌లోని తన గదిలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తల్లిదండ్రులు రాంచందర్‌నాయక్–హేమ్లీ బాయి ఉన్నారు. -
జాబ్ ఫైరింగ్... మా డ్యూటీ!
ప్రస్తుతం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులను పిలిచి వారికి అర్థమయ్యేలా చెప్పి, ఏ మాత్రం నొప్పించకుండా వారిని పంపించేయడం సవాలుతో కూడుకున్న పనే. వారి తప్పేమీ లేకుండానే రాజీనామా చేయమంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లో స్వల్ప వాదులాటలూ జరుగుతుంటాయి. ఉద్యోగులను భయపెట్టేందుకు కంపెనీలు బౌన్సర్లను కూడా నియమించుకుంటున్నాయని ఇటీవలే తెలిసొచ్చింది. ఆ తర్వాత నష్టపోయిన ఉద్యోగులు చట్టాలను ఆసరాగా చేసుకుని కంపెనీలపై కేసులు పెడుతుండటమూ చూస్తున్నాం. కానీ కంపెనీలకు ఇంత కష్టం కలిగించకుండా, న్యాయపర చిక్కులూ రాకుండానే అనవసరం అనుకున్న ఉద్యోగులను పంపించేసే మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ విధానంలో ఓ వైపు కొందరికి ఉద్యోగాలు పోతుంటే మరికొందరికి మాత్రం దీని ద్వారా పని దొరుకుతుండటం విశేషం. ఇంతకీ వీరి పనేమిటంటే కంపెనీలు ఏ ఉద్యోగిని చూపిస్తే ఆ ఉద్యోగితో మాట్లాడి, వారిని ఒప్పించి, ఏ గొడవా లేకుండా ఉద్యోగాలు మాన్పించి పంపించేయడమే. ఈ పనులు చేసిపెట్టడానికి ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని కంపెనీలు విదేశాల్లో ఎప్పటినుంచో ఉన్నాయి. భారత్‌లోనూ వాటి సంఖ్య, అక్కడ పనిచేసే వారికి డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వీటిని ఔట్సోర్సింగ్ కన్సల్టెంట్, ఔట్‌సోర్స్ టర్మినేటర్, ఫైరింగ్ కన్సల్టెంట్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. హెచ్ఆర్తో పనిలేకుండానే... సాధారణంగా ఏ కంపెనీలో అయినా మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం కీలకమైనది. సంస్థ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం, పనితీరును, సామర్థ్యాన్ని మదింపు చేసి బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఏటా వేతనాలు పెంచడంతోపాటు, అనుకున్న విధంగా రాణించలేని వారిని తొలగించడం కూడా వీరి పనే. కానీ కొత్త విధానంలో మాత్రం ఉద్యోగుల తొలగింపులో హెచ్ఆర్ విభాగం పాత్ర చాలా పరిమితం. ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించాలో కంపెనీ నిర్ణయించాక, వారి జాబితాను ఫైరింగ్ కన్సల్టెంట్ కంపెనీలకు ఇస్తే చాలు. ఆ కంపెనీ ఉద్యోగులు వచ్చి, ఉద్వాసనకు గురికానున్న ఉద్యోగులతో మాట్లాడతారు. వారికి పూర్తిగా పరిస్థితిని వివరించి, నచ్చజెప్పి, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకుని వాటిపై ఉద్యోగి సంతకాలు తీసుకుని రాజీనామా చేయిస్తారు. ఘర్షణాత్మక వైఖరికి అవకాశం లేకుండా సులువైన పద్ధతులను అనుసరిస్తారు. ఇలాంటి విషయాల్లో హెచ్ఆర్ మేనేజర్లకు శిక్షణ కూడా ఇస్తారు. భారత్‌లోనూ పెరుగుతున్న డిమాండ్ మరొకరి ఉద్యోగాన్ని ఊడగొట్టే ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు మన దగ్గరా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ రంగం కొత్త వృత్తిగా అవతరిస్తోంది. ఈ తరహా సేవల కోసం గతేడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు 88.7 బిలియన్ డాలర్లు ఖర్చుచేసినట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న ఐడీసీ(ఎన్వైఎస్ఈ–ఐడీసీ) పరిశోధక సంస్థ వెల్లడించింది. పెద్ద కంపెనీలతో పోల్చితే చిన్న కంపెనీలకు ఉద్యోగుల రిక్రూట్మెంట్, పనితీరు సమీక్ష, ఉద్వాసనలు వంటి ముఖ్యమైన విధుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలు లేనందువల్ల ఇటువంటి కన్సల్టెన్సీలపై ఆధారపడుతున్నాయంది. ఈ తరహా సేవలందించే ట్రైనెట్ అనే అమెరికన్ కంపెనీ వ్యవస్థాపకుడు మార్టిన్ బాబినెట్ మాట్లాడుతూ 2002తో పోల్చితే తమ ఆదాయం ఇప్పడు ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపించడంలో అనుభవం, నైపుణ్యం ఉన్న వారిని హెచ్ఆర్ విభాగంలో నియమించుకుంటున్నాయి. 2009లో విడుదలైన, ప్రముఖ నటుడు జార్జి క్లూనీ నటించిన హాలీవుడ్ సినిమా ‘అప్ ఇన్ ది ఎయిర్’ ఈ తరహా కథాంశంతో వచ్చిందే. ఈ సినిమా అప్పట్లోనే వివిధ దేశాల్లో కలిపి 44 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. మన దేశంలో ఉన్న రైట్ మేనేజ్మెంట్, ఆప్టిమమ్, హ్యుమన్ డైనమిక్, హ్యుసిస్ కన్సల్టింగ్, షిల్పుట్సీ వంటి కన్సల్టెన్సీ సంస్థలు ఈ కోవకు చెందినవే. ‘మా కంపెనీ సేవలను పొందేందుకు ఒక్కో ఉద్యోగికి రూ.2 లక్షల వరకు ఆయా సంస్థలు వెచ్చిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం వరకు మా సేవలను ఎక్కువగా గ్లోబల్ కంపెనీలే ఎక్కువగా ఉపయోగించుకునేవి. రానురాను మా సేవలు కోరుతున్న భారతీయ కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది’ అని రైట్ మేనేజ్మెంట్ సంస్థకు ఇండియా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ పాండే తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కలకలం; ఐటీ ఉద్యోగుల గెంటివేత
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వాకం హైదరాబాద్‌లో కలకలం రేపింది. 200 మంది ఉద్యోగులను బలవంతంగా తొలగించడం ఆందోళన రేకెత్తించింది. తమను భయపెట్టి బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేయించిందంటూ వెరిజాన్ డాటా సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(వీడీఎస్) కంపెనీపై పలువురు ఉద్యోగులు ఈ నెల 4న పోలీసులను ఆశ్రయించారు. బౌన్సర్లతో భయపెట్టి.. కంపెనీ యాజమాన్యం 2017 డిసెంబర్ 12, 13 తేదీల్లో మీటింగ్ రూమ్‌కు ఒక్కొక్కరిని పిలిపించి తాము ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు సంతకాలు చేయాలని ప్రింటెడ్ పేపర్లు తమ ముందు ఉంచిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉద్యోగులు వాపోయారు. అప్పటికే ఆ గదిలో బౌన్సర్లతో హెచ్ఆర్ మేనేజర్ కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు కొంత సమయం కావాలని తాము అడగగా హెచ్ఆర్ మేనేజ్మెంట్ నిరాకరించిందని, రాజీనామా పత్రాలపై సంతకం పెట్టడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెబుతూ బౌన్సర్లకు సైగలు చేసిందని ఆరోపించారు. తమలో కొందరు సీట్లలోంచి లేచి బయటకు రాబోగా బౌన్సర్లు తమను కదలనీయకుండా అదిమిపెట్టారన్నారు. తమను మానసికంగా, భౌతికంగా హింసించి రాజీనామా పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, తమంతగా తాము రాజీనామాలు చేయలేదని వివరించారు. అనంతరం బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది తమను కార్యాలయం నుంచి బయటకు గెంటేశారని, కనీసం తమ సొంత వస్తువులు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బౌన్సర్ల, సెక్యూరిటీ సిబ్బంది దురుసు చర్యలు ఆ భవనంలోని, చుట్టుపక్కల భవనాల్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉన్నాయన్నారు. కంపెనీ యాజమాన్యం వాటిని ధ్వంసం చేయకముందే స్వాధీనం చేసుకుని పరిశీలించాల్సిందిగా పోలీసులను బాధితులు కోరారు. తమ ఫిర్యాదును పరిశీలించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, చెన్నై కార్యాలయంలోనూ పలువురు ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, చెన్నైలో మొత్తం 1250 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు గత డిసెంబర్లోనే వార్తలు వచ్చాయి. దీనిపై వెరిజాన్ డాటా కంపెనీ స్పందించలేదు. ఉద్వాసనలు- ఆందోళనలు ఐటీ రంగంలో ఉద్యోగుల ఉద్వాసనలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేషన్, అప్డేట్ కాకపోవడం వంటి కారణాలు చూపుతూ ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. సీనియర్ ఉద్యోగులను తీసేసి వీరి స్థానంలో తక్కువ వేతనాలకు కొత్తగా సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. ఐటీ ఉద్యోగుల హక్కులు కాపాడేందుకు ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్(ఫైట్) కూడా పనిచేస్తోంది. గతేడాది కాగ్నిజెంట్‌లో ఉద్యోగులను తొలగించినప్పుడు ‘ఫైట్’ గట్టిగా పోరాడింది. -
సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎస్సీ క్యాబ్స్
సాక్షి, హైదరాబాద్ ఎస్సీ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఆ కార్పొరేషన్ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే శిక్షణ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ఆ శాఖ.. క్యాబ్‌ల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. దీనికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకడుతోంది. శిక్షణ పొంది, అనుభవం ఉన్న వారికి నేరుగా ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు వాహనాలను కొనుగోలు చేసేందుకు కార్ల కంపెనీలతో మంతనాలు జరుపుతోంది. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేసి.. వచ్చే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టనుంది. 2017–18లో వెయ్యి యూనిట్ల గ్రౌండింగ్‌కు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు ప్రాధాన్యత... రెండేళ్ల క్రితం కార్ల పథకాన్ని అమలు చేసినప్పటికీ ఎస్సీ శాఖ నిర్వహణ లోపంతో విఫలం చెందింది. మెజారిటీ లబ్ధిదారులు వాటిని మధ్యలోనే అమ్మేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ కంపెనీల్లో క్యాబ్‌ల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోనుంది. అదేవిధంగా మెట్రోరైల్, ఓలా కంపెనీలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఆయా కంపెనీలతో చర్చలు కూడా జరపడంతో, కార్పొరేషన్ తరుఫున క్యాబ్‌ల నిర్వహణకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తొలి విడత ఒక్కో కంపెనీలో 250 కార్ల చొప్పున నాలుగు కంపెనీల్లో వెయ్యి కార్లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. నేరుగా కంపెనీతో అనుసంధానం కావడంతో బిల్లులకు ఎలాంటి ఇబ్బందులుండవని, ఉపాధికి హామీ ఉంటుందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇది విజయం సాధిస్తే వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని భారీగా అమలు చేయనుంది. పెద్ద సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేస్తున్నందున తక్కువ ధరకు తీసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టయోటా కంపెనీతో చర్యలు జరుపుతున్నారు. ఈనెలాఖరులోగా వాహనాల ధరలు ఖరారు చేసి, వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. -
ఆ ఫొటోలు పంపితేనే ఉద్యోగం.. లేదంటే!
సాక్షి, హైదరాబాద్ : అశ్లీల ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ ఓ యువతిని వేధిస్తున్న నిందితుడిని హైదరాబాద్ షీ–టీమ్స్ సోమవారం అరెస్టు చేసినట్లు అదనపు సీపీ స్వాతిలక్రా వెల్లడించారు. సదరు యువతి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రముఖ సంస్థలో నిందితుడు హెచ్ఆర్ విభాగం అధిపతిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువతి సిటీకి చెందిన ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటర్వ్యూ సైతం పూర్తి చేసిన ఆమెకు ఉద్యోగం వచ్చింది, లేనిది తర్వాత చెప్తానంటూ చెప్పిన ఆ సంస్థ హెచ్ఆర్ విభాగాధిపతి బి.నరేందర్ సింగ్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఈ నెంబర్‌కు యువతి వాట్సాప్ ద్వారా సంప్రదించి తన ఉద్యోగం విషయం ఏమైందంటూ అడిగారు. దీనికి సమాధానంగా ‘నీ హాట్ ఫొటోస్ పంపాలంటూ’ అతడి నుంచి సమాధానం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు కొన్నాళ్ల వరకు మిన్నకుండిపోయారు. ఆపై మరోసారి సంప్రదించగా.. అలాంటి సమాధానమే వచ్చింది. తాను మరికొన్ని ప్రముఖ సంస్థలకూ రిక్రూట్మెంట్స్ చేస్తుంటానని, హాట్ హాట్ ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానని, లేకుంటే భవిష్యత్తులోనూ ఎక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానంటూ బెదిరించాడు. ఈ పరిణామంతో షాక్‌కు గురైన బాధితురాలు సిటీ షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు సోమవారం నిందితుడిని అరెస్టు చేశారు. వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని స్వాతిలక్రా కోరారు. వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
ఆ జాబ్స్ కనుమరుగు
సాక్షి,న్యూఢిల్లీ: నైన్ టూ ఫైవ్ జాబ్‌లు, ఏటా బోనస్, బోలెడన్ని లీవ్‌లు ఇవన్నీ ఇక తీపిగుర్తులుగా మారనున్నాయి. మారుతున్న వ్యాపార ధోరణులు, విపరీతంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు నియామక వ్యూహాలను మార్చేస్తున్నాయి. ఆటోమేషన్ వంటి నూతన టెక్నాలజీలకు మళ్లుతున్న క్రమంలోనూ నియామక ప్రక్రియ రూపురేఖలు మారుతున్నాయి. శాశ్వత ఉద్యోగులు, నాలుగైదేళ్ల కాలపరిమితితో కూడిన కాంట్రాక్టు నియామకాలకు కంపెనీలు స్వస్తి పలకనున్నాయి. అవసరమైనప్పుడు హైరింగ్ ఆ తర్వాత ఫైరింగ్ విధానానికి సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే భారత్‌లో 56 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకున్నాయని కెల్లీఓసీజీ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. రానున్న రెండేళ్లలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని 71 శాతం కంపెనీలు యోచిస్తున్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. అత్యవసర, తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీల్లో చోటుచేసుకుంటున్నాయి. ఈ పద్ధతిలో ఆయా సంస్థలు డిమాండ్‌ను అనుసరించి ఆయా ప్రాజెక్టులు, సైట్‌పై అత్యవసర, తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. తమ అవసరం తీరిన తర్వాత సదరు ఉద్యోగులను సాగంపుతాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కలిగిన పనివేళలుండటంతో ఫ్రీల్యాన్సర్లుగా సేవలందించేందుకు ఉద్యోగులూ ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
భారీ ఆర్డర్ దక్కించుకున్న రామ్‌కో సిస్టమ్స్
సాక్షి, ముంబై: ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ రామ్‌కో సిస్టమ్స్ లిమిటెడ్ భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో ఉత్పత్తులు మరియు సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న రామ్‌కో సిస్టమ్స్ బ్రిటీష్ మల్టీనేషనల్ బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ కంపెనీనుంచి మల్టీ మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను సాధించింది. యూరోపియన్ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ నుంచి మల్టీ మిలియన్ డాలర్ల పేరోల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆర్డర్ లభించినట్లు రెగ్యురేటరీ ఫైలింగ్ లో రామ్ కో తెలిపింది. దీంతో మిడ్ కాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్ రామ్‌కో సిస్టమ్స్ జోరందుకుంది. 11శాతం లాభాలతో కొనసాగుతోంది. ఒకదశలో దాదాపు 15 శాతానికిపైగా ఎగిసింది. ఆర్డర్లో భాగంగా యూరోపియన్ సంస్థ కార్యకలాపాలు విస్తరించిన 14 దేశాలలో యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మేనేజ్డ్ పేరోల్ సర్వీసులను నిర్వహించనున్నట్లు రామ్‌కో సిస్టమ్స్ పేర్కొంది. పేరోల్స్, పన్నులు, అటెండెన్స్, లీవులు, లోన్లు, రీఇంబర్స్మెంట్ తదితరాల నిర్వహణను గ్లోబల్ ప్లాట్‌ఫామ్ ద్వారా చేపట్టనున్నట్లు వివరించింది. ఇటీవలే, గ్లోబల్ పేరోల్ అసోసియేషన్ ద్వారా 2017 సం.రంలో హైలీ రికమెండెడ్ పేరోల్ సాఫ్ట్వేర్ సరఫరాదారు రివార్డును కూడా సొంతం చేసుకుంది. -
బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్ : నిత్యం ఏదో ఓ చోట సాఫ్ట్వేర్ కంపెనీలు బిచాణా ఎత్తేస్తుంటాయి. ఈ తరహాలోనే హైదరాబాద్ నగరంలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన అన్వర్ అనే వ్యక్తి టోలిచౌకీలో నివాసం ఉంటున్నాడు. అతడు మార్వెల్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. రూ.2.50 లక్షల ప్యాకేజీ ఇస్తానంటూ ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేశాడు. ఆపై బోర్డు తిప్పేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. -
బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ
హైదరాబాద్: నగరంలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది. వందల మంది నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నగరంలోని మాదాపూర్ కేంద్రంగా ఏర్పాటైన సాఫ్ట్వేర్ కంపెనీ 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి చివరకు వారికి జీతలు చెల్లించకుండా చేతులెత్తేసింది. మాదాపూర్ సైబర్ గేట్‌వేలో serinux పేరుతో కంపనీ ఏర్పాటైంది. శిక్షణతో పాటు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారు కంపెనీ ప్రతినిధులు. అనంతరం నెలలు గడుస్తున్న వారికి జీతం ఇవ్వక పోవడంతో ఉద్యోగులు నిలదీశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత రెండేళ్లలో నగరంలో 9 సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడగా 1000 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. కంపెనీ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు బ్యాక్ డోర్ నియామకాలు చేసే కంపెనీలలో చేరవద్దని పోలీసులు కోరుతున్నారు. -
‘పెట్యా’ దాడిలో భారత్‌కు ఏడో స్థానం
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రాన్సమ్వేర్ ‘పెట్యా’ ప్రభావానికి అధికంగా లోనైంది భారతే అని భద్రతా సాఫ్ట్వేర్ సంస్థ సిమాంటెక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల అధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉందని పేర్కొంది. ఉక్రెయిన్, రష్యాల్లో పెట్యా ప్రభావం అత్యధికంగా ఉందని వెల్లడించింది. పెట్యా దాడికి గురైన జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు(జేఎన్పీటీ)లో ఐటీ మౌలిక వసతుల భద్రతను పెంచడానికి, రద్దీని తగ్గించడానికి చర్యలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది. -
ఈ ఏడాది 1.5 లక్షల ఐటీ కొలువులు
♦ భారీ తొలగింపు వార్తలను ఖండించిన నాస్కామ్ ♦ ఐటీ రంగంలో కొనసాగాలంటే నైపుణ్యాలను పెంచుకోవాల్సిందే: చంద్రశేఖర్ న్యూఢిల్లీ: ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులంటూ వస్తున్న వార్తలను సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ (నాస్కామ్) తోసిపుచ్చింది. ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని ఈ రంగం భర్తీ చేసుకోనుందని తెలిపింది. టెక్కీలు ఐటీ పరిశ్రమలో కొనసాగాలనుకుంటే మాత్రం తమ నైపుణ్యాలను మెరుగుదిద్దుకోవాల్సిందేనని సూచించింది. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజంట్ తదితర కంపెనీలు ఈ ఏడాది 50,000 మందిని తొలగించనున్నట్టు ఇటీవల వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మేము ఈ వార్తలను చాలా స్పష్టంగా ఖండిస్తున్నాం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో నికరంగా 1.7 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. ఒక్క నాలుగో త్రైమాసికం (2017 జనవరి–మార్చి)లోనే నికరంగా 50,000ని టాప్ 5 కంపెనీలు నియమించుకున్నాయి’’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విప్రో, కాగ్నిజంట్, మైండ్‌ట్రీ కంపెనీల ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ సంఘంలో సభ్యులుగా ఉన్న వారిని సంప్రదించగా... ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని నియమించుకోనున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. ఆటోమేషన్, రోబోటిక్స్, అనలైటిక్స్, సైబర్ సెక్యూరిటీ తరహా కొత్త టెక్నాలజీల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న క్రమంలో ఉద్యోగులు తిరిగి నూతన నైపుణ్యాలను సంతరించుకోవాలని లేకుంటే మనుగడ సాగించలేరని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు టెక్ స్టార్టప్‌లు, ఈకామర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ వంటి కొత్త అవకాశాల నేపథ్యంలో 2025 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేస్తున్నామని చంద్రశేఖర్ చెప్పారు. ఏటా పనితీరు మదింపు అనంతరం కొంత మంది ఉద్యోగులను తొలగించడం అన్నది ఐటీ పరిశ్రమలో సహజంగా జరిగే ప్రక్రియ. ‘‘ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం భిన్నంగా ఏమీ ఉండదు. పనితీరు ఆధారంగా ఉద్యోగుల్లో మార్పుల వల్ల 0.5% నుంచి 3% వరకు ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’ అని చంద్రశేఖర్ వివరించారు. ఉద్యోగులకు శిక్షణ, కొత్త టెక్నాలజీలపై నైపుణ్య సాధన కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని నాస్కామ్ చైర్మన్ రామన్‌రాయ్ వెల్లడించారు. -
‘ఏపీ సాఫ్ట్వేర్ కంపెనీలకు సత్తా లేదు’
► అందుకే రాష్ట్రేతర కంపెనీలకు ప్రోత్సాహం ►రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి విశాఖపట్నం: రాష్ట్రంలోని సాప్ట్వేర్ కంపెనీలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయగలిగే సత్తా లేకపోవడంతోనే సాప్ట్వేర్ సర్వీసులన్నీ రాష్ట్రేతర కంపెనీలకే ఇవ్వాల్సి వస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి అన్నారు. పెద్ద ప్రాజెక్టులు ఏది ఇచ్చినా చేయగలమని నిరూపించుకోవాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాప్ట్వేర్ సర్వీసులు ఇక్కడివారికి ఇస్తామని చెప్పారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పారిశ్రామిక వేత్తలతో స్థానిక నోవొటెల్ హోటల్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడారు. సదస్సులో సీఐఐ విశాఖ చాప్టర్ చైర్మన్ తిరుపతిరాజు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను రాష్ట్రంలో పెట్టడంతో రైతులతో పాటు గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి కల్పించినట్లవుతుందని సూచించారు. ఎస్ఎంఎస్ఈలకు 20 శాతం సబ్సిడీ అందజేయాలని మాజీ చైర్మన్ శివకుమార్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శ్రీ సిటీ విషయంలో మరిన్ని రాయితీలు ఇవ్వాలని కోరారు. స్టీల్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఖాయిలా పడ్డ పరిశ్రమలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. లాజస్టిక్ పార్కుకు అనుమతులు ఇవ్వాలని, రోడ్డు కనెక్టవిటీ, టోల్ గేట్ల సమస్య పరిష్కరించాలని కోరారు. అనంతరం నక్కపల్లి, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లలోని పరిశ్రమలను మంత్రి పరిశీలించారు. సుగర్ఫ్యాక్టరీల భవితవ్యంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతిపక్షాలు కోరితే సమావేశాలకు అనుమతులిస్తాం.... ఏయూ మైదానంలో సమావేశాలు నిర్వహించేందుకు ప్రతిపక్షాలు కోరితే అప్పటి వర్సిటీ అకాడమిక్ పరిస్థితులు, నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అమర్నాథ్రెడ్డి చెప్పారు. విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడు పనుల్ని ఆయన గురువారం పరిశీలించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా నగరానికి వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణతో పాటు పార్టీ నేతలు గద్దె బాబురావు, రెహ్మాన్‌లు ఆయనను సత్కరించారు. -
సీమ టు సాఫ్ట్వేర్!
రాయలసీమ నుంచి రావడమే ఆలస్యం హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో పవన్‌కల్యాణ్ జాయిన్ కానున్నారట! పవన్‌కు సాఫ్ట్వేర్ జాబ్ అవసరం ఏముంది? అని ఆలోచిస్తున్నారా! ఆయనలోని హీరోకి అవసరమే మరి. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. అందులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే ఐటీ ఎనలిస్ట్‌గా పవన్ కనిపిస్తారట! ఏప్రిల్ తొలి వారంలో త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ‘కాటమరాయుడు’లో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పంచెకట్టులో ఆయన లుక్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. ఈ లుక్‌కి పూర్తి భిన్నంగా త్రివిక్రమ్ సినిమాలో లుక్ ఉంటుందట. సై్టలిష్ అండ్ ట్రెండీగా కనిపిస్తారట. డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 18న నిర్వహించి, 24న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. -
కంపెనీ పెట్టి.. 25వేల కోట్లకు అమ్మేశాడు!
అతడు ఢిల్లీ ఐఐటీలో చదివాడు. తర్వాత అమెరికాలో యాప్ డైనమిక్స్ అనే సాఫ్ఘ్వేర్ కంపెనీ పెట్టాడు. దాని పనితీరు బాగుందని సిస్కో కంపెనీ దానిమీద కన్నేసింది. మంచి డీల్ ఆఫర్ చేసింది. ఇంకేముంది, బ్రహ్మాండంగా తన కంపెనీని అమ్మేశాడా యువకుడు. అతడిపేరు జ్యోతి బన్సల్. యాప్ డైనమిక్స్ వ్యవస్థాకుడు, చైర్మన్. అతడి కంపెనీని కొనేందుకు సిస్కో సిస్టమ్స్ ఆఫర్ చేసిన ధర.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు!! ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరిగిన దాఖలాలు లేవు. ఇన్నాళ్లూ కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన సిస్కో లాంటి కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వైపు కూడా విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు సరిగ్గా వారం క్రితం హ్యూలెట్ పాకార్డ్ (హెచ్‌పీ) కంపెనీ కూడా సింప్లివిటీ అనే మరో సాఫ్ట్వేర్ కంపెనీని రూ. 4418 కోట్లకు కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉన్న డబ్బును తెప్పించుకునేలా అమెరికన్ కంపెనీలను ప్రోత్సహించాలన్న ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగానే ఈ కంపెనీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సిస్కో లాంటి పెద్దస్థాయి టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. తమ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల కోసం ఈ టేకోవర్ బాగా ఉపయోగపడుతుందని సిస్కో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ సాల్వాంగో చెప్పారు. యాప్ డైనమిక్స్ సంస్థ అప్లికేషన్లను మేనేజ్ చేయడంతో పాటు వాటిని విశ్లేషిస్తుంది. దానికి 2వేల మందికి పైగా కస్టమర్లున్నారు. నాస్డాక్, నైక్, ఇప్పటివరకు సిస్కో కూడా ఈ కంపెనీ కస్టమర్లే. వాస్తవానికి ఎప్పటినుంచో యాప్ డైనమిక్స్ సంస్థ ఐపీఓకు వెళ్లాలని చూస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సిస్కో రంగంలోకి దిగింది. దాంతో ఒక్కసారిగా కంపెనీ ప్రాధాన్యాలు మారిపోయాయి. వాస్తవానికి యాప్ డైనమిక్స్ సంస్థకు 2015 నవంబర్ నెలలో వాల్యుయేషన్ చేయిస్తే, దాని విలువ సుమారు 12915 కోట్ల రూపాయలని తేలింది. కానీ, దాదాపు దానికి రెట్టింపు ధరను సిస్కో ఆఫర్ చేయడంతో ఇక కాదనలేకపోయారు. -
సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. మాదాపూర్‌లోని క్సెనో స్పేస్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. జనరేటర్ ఓవర్‌హీట్ అయి ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖాధికారి తెలిపారు. -
సాఫ్ట్వేర్ కంపెనీలపై‘ర్యాన్సమ్వేర్’ వల!
సైబర్ దాడులకు దిగిన పాకిస్తాన్ హ్యాకర్లు - ఈ-మెయిళ్లు, యాడ్ల ద్వారా వైరస్లు - కంప్యూటర్లలోని డేటాను లాక్ చేస్తూ సొమ్ము కోసం డిమాండ్లు - ఇటీవలే ఓ సంస్థ కంప్యూటర్లు హ్యాక్ - రూ. 420 కోట్లు ఇవ్వాలన్న హ్యాకర్లు! - రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సాక్షి, హైదరాబాద్: భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు (హ్యాకర్లు) భారతదేశంలోని సంస్థలపై సైబర్ దాడులకు దిగుతున్నారు. ‘ర్యాన్సమ్ వేర్’గా పిలిచే వైరస్‌లను ప్రముఖ సంస్థల కంప్యూటర్లలో చొప్పించి, లాక్ చేస్తున్నారు. తిరిగి అన్‌లాక్ చేసేం దుకు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సైబరాబాద్‌లోని ఓ ప్రముఖ సంస్థపై ఇటీవల ‘ర్యాన్సమ్ ఎటాక్’ చేసిన పాకిస్తాన్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఈ తరహా దాడులు పెరిగిపోవడంతో సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ రంగంలోకి దిగింది. ఈ-మెయిళ్లు, ప్రకటనల ద్వారా.. పాకిస్తాన్ హ్యాకర్లు ‘సైబర్ ఎక్స్టార్షన్, బ్రౌజర్ లాకర్, రాన్సమ్వేర్’ వంటి వైరస్‌లను వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన సంస్థల్లోని కంప్యూటర్లకు ఈ-మెయిల్స్, యాడ్స్ రూపంలో ఈ వైరస్‌లను పంపిస్తున్నారు. వాటిలోని లింక్‌లపై క్లిక్ చేస్తే చాలు వైరస్ కంప్యూటర్లోకి చొరబడుతుంది. వెంటనే కంప్యూటర్లోని డేటా మొత్తాన్ని ‘ఎన్‌క్రిప్ట్’ చేసి, లాక్ చేస్తుంది. మానిటర్‌పై ‘మీ కంప్యూటర్ను లాక్ చేశాం’ అనే సందేశం కనిపిస్తుంది. డేటాను అన్‌లాక్ చేసే పాస్వర్డ్ తమ వద్ద ఉందని చెబుతూ, అన్‌లాక్ చేయాలంటే భారీగా సొమ్ము ఇవ్వాలంటూ సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నా రు. ఈ కంప్యూటర్ల స్క్రీన్‌పై నిర్దేశిత గడువుకు సంబంధిం చిన కౌంట్‌డౌన్ సమయం కూడా కనిపిస్తుంది. సొమ్ము చెల్లించకపోతే తాము పాస్‌వర్డ్‌ను నిర్వీర్యం చేస్తామని, దాంతో డేటాను శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని హ్యాక ర్లు బెదిరిస్తున్నారు. ఎవరైనా ఆ టైమర్‌ను, వైరస్ ప్రోగ్రామ్‌ను మార్చాలని ప్రయత్నించినా, నగదు డిపాజిట్ చేసిన ట్లు తప్పుడు వివరాలు పొందుపరిచినా కౌంట్‌డౌన్ సమ యం మరింత తగ్గిపోవడం ఈ వైరస్‌కు ఉన్న మరో లక్షణం. నాన్-సెమెట్రిక్ విధానంలో.. కంప్యూటర్లోని డేటా ఎన్క్రిప్షన్ (లాక్ చేయడం)లో సెమెట్రిక్, నాన్ సెమెట్రిక్ అని రెండు రకాలు ఉంటాయి. సెమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్‌లాకింగ్‌కు ఉపకరించే పబ్లిక్, ప్రైవేట్ ‘కీ’లు ఒకటే ఉంటాయి. నాన్-సెమెట్రిక్ విధానంలో మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ర్యాన్సమ్వేర్ పంపే హ్యాకర్లు ఈ విధానంలోనే కంప్యూటర్లను లాక్ చేస్తారు. అంటే వారి వద్ద ఉన్న ప్రైవేట్ ‘కీ’ తెలిస్తే తప్ప డేటాను అన్‌లాక్ చేయడం సాధ్యం కాదు. ఫార్మాట్ చేస్తే అందులో డేటా మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కంపెనీలు విలువైన, అత్యవసరమైన డేటాను పోగొట్టుకోలేక.. మనీప్యాక్, ఓచర్స్, ఈ-మనీ, బిట్‌కాయిన్ రూపాల్లో హ్యాకర్లు డిమాండ్ చేసిన సొమ్మును చెల్లించాల్సి వస్తోంది. హ్యాకర్లు సొమ్ము అందాక వైరస్ ప్రోగ్రామ్ ద్వారానే అన్‌లాక్ ‘కీ’ పంపుతున్నారు. దాన్ని వినియోగిస్తే కంప్యూటర్ యథాప్రకారం పనిచేసి, అందులోని డేటా భద్రంగా అందుబాటులోకి వస్తుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలపై.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ర్యాన్సమ్వేర్ బారినపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్చువల్ కరెన్సీ అయిన ‘బిట్ కాయిన్స్’ రూపంలో ఆ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ దాడులను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక సైబర్ నిపుణులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల ర్యాన్సమ్వేర్తో పాటు బ్రౌజర్ లాకర్ వైరస్ ముప్పు పెరిగింది. దానితో కంప్యూటర్ లాక్ కావడంతో పాటు.. ఇలా లాక్ చేసినది అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్లుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అన్ని దేశాల్లో నేరంగా పరిగణించే చైల్డ్ పోర్న్ వెబ్సైట్లు చూశారనో, మరో ఉల్లంఘనగానో పేర్కొంటూ కంప్యూటర్ను లాక్ చేసినట్లు హ్యాకర్లు పేర్కొంటారు. ఈ వైరస్‌ల్లోని మరో లక్షణం ఏమిటంటే.. అవి వెబ్‌క్యామ్‌ను ఆపరేట్ చేయడంతో పాటు కంప్యూటర్ ఐపీ అడ్రస్, లొకేషన్లను మానిటర్‌పై డిస్ప్లే చేస్తాయి. అంతేకాదు ‘మీ కదకలను గమనిస్తున్నాం. తదుపరి చర్యలు చేపట్టకూడదంటే చేసిన తప్పుకు జరిమానా చెల్లించండి’ అనే డిమాండ్ కనిపిస్తుంది. దీంతో భయపడిపోయే వినియోగదారులు సొమ్ము చెల్లిస్తున్నారు. ఫోన్లకూ ఈ వైరస్ ముప్పు ‘‘కేవలం కంప్యూటర్లు మాత్రమే కాదు స్మార్ట్ఫోన్లకూ ర్యాన్సమ్ వేర్ ముప్పు ఉంది. ఫోన్లలో ఉన్న డేటాను సైతం సైబర్ నేరగాళ్లు లాక్ చేస్తున్నారు. ఎక్కువగా వ్యక్తిగత ఫోన్లు, కంప్యూటర్లతో పాటు చిన్న చిన్న కంపెనీలు మాత్రమే దీని బారినపడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు పటిష్టమైన ఫైర్‌వాల్స్ (రక్షణ సాఫ్ట్వేర్లు) ఏర్పాటు చేసుకోవడంతో వీటి బారినపడట్లేదు. గత పదేళ్లలో భారతదేశంలో 2,400 రెట్లు సైబర్ నేరాలు పెరిగాయి. ఇటీవల ఓ సంస్థను ఎటాక్ చేసిన పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు రూ.420 కోట్లు డిమాండ్ చేశారన్న విషయం మా దృష్టికి రాలేదు. ఆ స్థాయి కార్పొరేట్ సంస్థకు అలా జరుగుతుందని మేం భావించట్లేదు..’’ - ఎ.భరణి, సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అనుమానాస్పద మెయిల్స్, యాడ్స్ ఓపెన్ చేయొద్దు ర్యాన్సమ్వేర్, బ్రౌజర్ లాకర్ వైరస్లు ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న ముప్పేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అపరిచిత ఐడీల నుంచి వచ్చే ఈమెయిల్స్, అనుమానాస్పద యాడ్స్ కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో మంచి యాంటీ వైరస్ ఏర్పాటు చేసుకోవడమే వీటిని పరిష్కారమని పేర్కొంటున్నారు. బ్రౌజర్ లాకర్ కొన్ని యాంటీ వైరస్‌లకు లొంగినా.. ర్యాన్సమ్వేర్కు మాత్రం పరిష్కారం లేదని అంటున్నారు. హ్యాకర్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే ప్రైవేట్ ‘కీ’ ఏర్పాటు చేయరని, దాంతో బాధితులంతా సొమ్ము చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ హ్యాకర్లు బోగస్ సర్వర్లు, ఐపీ అడ్రస్‌లను వినియోగిస్తారని, అందువల్ల పట్టుకోవడం కష్టసాధ్యమని పేర్కొంటున్నారు. -
బిచాణా ఎత్తేసిన సాఫ్ట్వేర్ సంస్థ
బంజారాహిల్స్: నగరంలో మరో సాఫ్ట్వేర్ సంస్థ బిచాణా ఎత్తేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని సైబర్హైట్స్లో ఉన్న వ్యాంకో గ్లోబల్ టెక్ సాఫ్ట్వేర్ సంస్థను తమకు జీతాలు చెల్లించకుండా మూసేశారని బాధిత సాఫ్ట్వేర్ ఇంజినీర్లు గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెలన్నర రోజులుగా తమకు జీతాలు ఇవ్వకుండా సంస్థ సీఈఓ శ్రీకాంత్ కిరణ్ చెరు, సృజన గొట్టిముక్కల వేధింపులకు గురి చేస్తున్నారని, జీతం అడిగితే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం తాము ఆందోళన చేయగా గురువారం ఇస్తామని హామీ ఇచ్చి సంస్థకు తాళాలు వేసి అందుబాటులో లేకుండాపోయారని తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న 200 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు రూ. 1.25 కోట్ల జీతాలు బాకీ ఉన్నారని తెలిపారు. కొంతమందికి చెక్కులు ఇచ్చారని, అవి కూడా బౌన్స్ అయ్యాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. -
బ్యాక్ డోర్ పద్ధతిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు?
మాదాపూర్: ఉద్యోగలిస్తామని డబ్బు తీసుకొని నిరుద్యోగులను మోసం చేసిన ఓ వ్యక్తిని మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొరపల్లి గ్రామానికి చెందిన కడవేరుగు మురళీమోహ¯ŒS 2015లో మాదాపూర్ సైబర్ టవర్స్‌లో ‘ఓవర్ టెక్నాలజీ’ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. నెల్లూరు జిల్లా ఎస్వీ అగ్రహారానికి చెందిన దోనేపర్తి వెంకటసుఖేష్ (27) నిజాంపేటలో ఉంటున్నాడు. ఇతను ఓవర్ టెక్నాలజీకి కన్సల్టెంట్‌గా వ్యవహరించేవాడు. బ్యాక్ డోర్ పద్ధతిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి సైబర్ టవర్స్‌లో ఉన్న ఆఫీస్‌కు తీసుకెళ్లి మేజింగ్ డైరెక్టర్ మురళీతో మాట్లాడించేవాడు. ఈ కంపెనీలో ఉద్యోగం పొందాలంటే రూ. లక్షా 20 వేలు నుంచి లక్షా 50 వేలు చెల్లించాలని చెప్పేవారు. నామమాత్రపు ఇంటర్వూలు నిర్వహించేవారు. ఇలా ఈ కేటుగాళ్లు దాదాపు సుమారు 80 మంది విద్యార్థులను ఉద్యోగంలో పెట్టుకొని డబ్బు దండుకున్నారు. తర్వాత జీతాలు చెల్లించకుండా కాలయాపన చేసి ఈ ఏడాది మే 21న కంపెనీని మూసి ఇద్దరూ పరారయ్యారు. గార్లపాటి అనిల్‌రెడ్డి అని బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో వెంకటసుఖేష్ను నిజాంపేటలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ సంస్థ
హైదరాబాద్: నగరంలో మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సంస్థ నిర్వాహకులు నిరుద్యోగుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేశారు. డబ్బులు చేతికి అందిన తర్వాత సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. బాధితులు విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులను అరెస్ట్ చేశారు. గతంలోనూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. ఉద్యోగాల ఆశ చూపి నిర్వాహకులు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడం, తర్వాత సంస్థను మూసివేసి పరారైన సంఘటనలు ఉన్నాయి. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని..
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి యువతుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి వారిని ఇంటర్వ్యూల పేరుతో నిర్మానుష ప్రదేశాలకు తీసుకెళ్లి వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుంటున్న రావళ్లె స్వరాజ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు. jobs fraud, software company, man arrest, ఉద్యోగాల మోసం, సాఫ్ట్ వేర్ కంపెనీలు, యువకుడి అరెస్టు -
వెబ్సైట్ డెవలప్ చేస్తానని..
వెబ్సైట్ డెవలప్ చేస్తానని చెప్పిన ఓ ఘనుడు ఓ సాఫ్ట్వేర్ సంస్థ యజమానిని నమ్మించి అతని సెల్‌ఫోన్‌తో ఉడాయించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ఐఏఎస్ కాలనీకి చెందిన మహమద్ మౌజం(26) స్కూల్ బిజినెస్ సొల్యుషన్ పేరుతో ఓ సాఫ్ట్వేర్ సంస్థను ఈ నెల 13న ప్రారంభించాడు. సంస్థకు సంబంధించి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను తయారుచేస్తానంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి జస్ట్ డయల్ ద్వారా సంప్రదించాడు. దీంతో ఇద్దరు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10సిలోని ఓ రెస్టారెంట్లో కలుసుకున్నారు. కాసేపు ఈ కామర్స్ గురించి మాట్లాడిన శ్రీనివాస్ మౌజంను నమ్మించి తన ఫోన్ స్విచ్చాఫ్ ఉందని చెప్పి మౌజం సెల్‌ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్లిన అతను అలానే ఉడాయించాడు. ఇది గుర్తించిన మౌజం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన నెక్సాస్ 5ఎక్స్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడ సీసీ ఫుటేజీని సేకరించి విచారిస్తున్నారు. -
నగరంలో మరో ఏడు ఐటీ పార్కులు
హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజధాని శివార్లలో మరో ఏడు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్న నేపథ్యంలో.. అందుకనువైన వసతులను కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఈ మేరకు నగర శివార్లలో ఐటీ పార్కులకు అవసరమైన భూములను గుర్తించింది. వివాదరహిత ఈ భూములను సాఫ్ట్వేర్ సంస్థల స్థాపనకు అనువుగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. నిర్ధేశిత ఐటీ పార్కుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపడం ద్కారా సాఫ్ట్వేర్ కంపెనీలకు ద్వారాలు తెరవాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే ఐటీ హబ్‌గా మారిన గచ్చిబౌలి, మాదాపూర్ కాకుండా... ఐటీ పరిశ్రమను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏడింటికి అంగీకారం.. శివార్లలో తొమ్మిది చోట్ల ఐటీ పార్కులను ప్రకటించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఇందులో రెండు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏడింటికి సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇటీవల ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఐటీ పార్కుల అభివద్ధిపై విస్తత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే బుద్వేల్‌లో పర్యాటక సంస్థకు చెందిన సర్వే నం.291 టు 299/పీ వరకు గల 91 ఎకరాలు, సర్వే నంబర్లు 282-299 లలోని 164.35 ఎకరాలను ఐటీ పార్కులకు వినియోగించనున్నారు. అలాగే, ఇటీవల జర్నలిస్టుల హౌసింగ్ కాలనీ కోసం ప్రతిపాదించిన బుద్వేల్లోని వీడీఓటీ సీ ఆధీనంలో ఉన్న 120 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నారు. జర్నలిస్టులకు ప్రత్యామ్నాయంగా మియాపూర్‌లో కేటాయించాలని నిర్ణయించారు. అలాగే వాలంటరీలోని 252 ఎకరాలు, పుప్పాల్గౌడ సర్వే నంబర్లు 304-307, 329, 331-339లలోని 100.12 ఎకరాల్లో కూడా ఐటీ పార్కు రానుంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 28, 29లలోని 160 ఎకరాలు, కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని సర్వే నంబర్లు 453, 454లోని భూమిని కూడా ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. -
బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
రోడ్డున పడ్డ బాధితులు రూ.50 లక్షలతో ఉడాయించిన యజమాని తిరుపతిక్రైం: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఆశచూపించి వారి వద్ద లక్షలాది రూపాయలు దోచుకుని బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ బాగోతం మంగళవారం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. ఈస్టు సీఐ రామ్‌కిషోర్ వివరాల మేరకు.. వీవీ మహల్ రోడ్డులో వెరిజోటెక్ ఐటీ సొల్యూషన్ కంపెనీ నిర్వహించేవారు. మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్‌గా విశాఖపట్నానికి చెందిన విశ్వప్రసాద్ వ్యవహరించేవాడు. 2015లో స్థాపించి 91 మందికి కోర్సులు నేర్పిం చి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపిం చాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేల నుంచి లక్ష వరకు వసూలు చే శాడు. సుమారు రూ.60 నుంచి 70 లక్షలకు పైగా వసూలు చేశాడు. మొదటగా చేరిన వారికి ఆ సంస్థలో ఉన్న జావా, ఎక్స్ ఎంఎల్ సర్వీసెస్, సీవీఎస్ తదితర కోర్సులు నేర్పించి వారికి సంవత్సరానికి రూ.3 నుంచి 4 లక్షల వరకు ప్యాకే జీ ఇప్పిస్తామని నమ్మించి కోర్సులో చేర్పించుకునేవాడు. అలా నమ్మి చేరితే కోర్సుకు మొదటగా రూ.10 వేలు చెల్లిం చాలి. ఇదిపూర్తి అయిన వెంటనే ఆఫర్‌లెటర్ ఇచ్చి లక్షల్లో వసూలు చేసేవారు. అయితే ఇలా ఆఫర్ లెటర్లు ఇచ్చినవారికి బెంగళూరులో తమ సంస్థ ఉందని నమ్మించేవారు. ఇలా నమ్మిన బాధితులు మోసపోయి రోజు ఆఫీసు చుట్టూ తిరగలేక మంగళవారం తిరుపతిలోని న్యూ ఇందిరా నగర్లో నివాసముం టున్న హరిప్రసాద్ ఈస్టు పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాఫ్ట్వేర్ కంపెనీలో సోదాలు నిర్వహించి దానిని నిర్వహిం చిన యజమాని కోసం ఆరా తీశారు. అక్కడ పనిచేసేవారు యజమాని కొద్దిరోజుల నుంచి కనిపించడంలేదని సమాచారం ఇచ్చారు. ఈ సోదాలలో 91 మంది బాధితుల బయోడేటాలు, కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు కూడా ఏదీ కూడా పనిచేయదని కనీసం ఓ ఫ్యాన్ కూడా తిరగదన్నారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఒక కార్యాలయంగా చిత్రీకరించనట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఈస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఓ బాధితుడు మాత్రమే ఫిర్యాదు చేశాడు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో అంచనా వేయలేక పోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమో దు చేసి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
నటుడి సాఫ్ట్వేర్ సంస్థలో అగ్నిప్రమాదం
కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధం ఆళ్వార్‌పేటలో ఘటన టీనగర్: ఆళ్వార్‌పేటలో నటుడు అరవింద్‌స్వామికి సొంతమైన సాఫ్ట్వేర్ సంస్థలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో వందకు పైగా కంప్యూటర్లు, ఫర్నిచర్ సామగ్రి దగ్ధమయ్యాయి. ఆళ్వార్‌పేట సీపీ రామసామి రోడ్డులో ఆక్స్ఫర్డ్ పేరిట మూడంతస్తుల భవనం ఉంది. రెండోఅంతస్తులో సినీనటుడు అరవింద్‌స్వామికి చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ఉంది. ఈ సంస్థ నుంచి మంగళవారం ఉదయం హఠాత్తుగా పొగలు వచ్చాయి. కొద్ది సేపట్లోనే మంటలు వ్యాపించడంతో అక్కడున్న వాచ్‌మన్ వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈలోపు సంస్థలో ఉన్న 100కు పైగా కంప్యూటర్లు, వాటికి అవసరమైన పరికరాలు, ఫర్నీచర్లు మంటల్లో కాలిపోయాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఏసీ మిషన్ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. -
మంచితనాన్ని వాడేసుకుంటే ఎలా?
జీవన గమనం నేనో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. నాకు జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఆచార వ్యవహారాలన్నీ మా చెల్లెలు, బావగారి చేత చేయించాను. దుర దృష్టవశాత్తూ కొద్ది రోజుల తర్వాత మా బావ గారు ఓ ప్రమాదంలో చనిపోయారు. అందుకు కారణం నా పెళ్లి బాధ్యతలు తీసుకోవడమేనని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. అల్పజ్ఞానులు అనుకుందామంటే అమ్మాయి తండ్రి విద్యుత్ సంస్థలో మంచి స్థాయిలో ఉన్నవారు. ఇప్పుడు నేనేం చేయాలో సలహా ఇవ్వండి. - కృష్ణ, వికారాబాద్ ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉన్నాడా, కింద స్థాయిలో ఉన్నాడా అన్నది కాదు చర్చ. మానసిక స్థాయి, హేతుదృష్టి (రేషనలిజం), పరిస్థితిని అర్థం చేసుకునే విధానం మొదలైనవన్నీ ఉద్యోగం మీద ఆధారపడి ఉండవు. ఆ సంగతి పక్కన పెడదాం. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... రేపు వాళ్ల ఇంట్లో ఏ అనర్థం జరిగినా, దానికి మిమ్మల్నే కారణ భూతుల్ని చేస్తారు. అంత దేబిరించుకుని వివాహం చేసుకోవలసిన అవసరం మీకుందా? లేదా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీకు బాగా నచ్చి, మరొకరిని వివాహం చేసుకోవడానికి మీ మనసు అంగీకరించపోతుంటే... ఆమెతో డెరైక్ట్‌గా మాట్లాడండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి వచ్చి వివాహం చేసుకునే ధైర్యం ఆమెకు ఉంటే, ఆపై ఏం చేయాలా అని మీరు ఆలోచించుకోండి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. మీరన్నట్టు వాళ్లు అల్ప జనులే. మూర్ఖుల మనసు రంజింపజాలము అన్నాడో ప్రముఖ కవి. కాబట్టి అలాంటివారికి దూరంగా ఉండటమే మంచిది. నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. మరేదైనా చేయాలని పిస్తోందా అంటే అదీ లేదు. నా లక్ష్యం ఏమిటో, అసలు నాకు దేనిమీద ఆసక్తి ఉందో కూడా అర్థం కావడం లేదు. నా మెదడు ఎందుకిలా తెల్ల కాగితంలా తయారయ్యిందో తెలియడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా? - అంకిత్, చెన్నై మనం చేస్తున్న పని మీద ఉత్సాహం లేనప్పుడు మెదడు తెల్ల కాగితంలానే తయారవు తుంది. చదువు మీద శ్రద్ధ లేకపోవడం తప్పు కాదు కానీ ఏ గమ్యం లేక పోవడం తప్పు. ప్రతి మనిషిలోనూ మరో మనిషి నిద్రిస్తూ ఉంటాడు. అతడిని నిద్ర లేపాలి. అతడికి ఇష్టమైన పనేదో తెలుసు కుని, దాన్ని హాబీగా పెట్టుకుంటే అప్పుడు గమ్యంవైపు ఆనందంగా వెళ్లవచ్చు. మీలో ఏ కళ ఉన్నదో ఒక నిర్ణయానికి రండి. దాని సాధన ప్రారంభించండి. జీవితం బాగుండటానికి అదే మొదటి మెట్టు. నేనో మధ్య తరగతి వ్యక్తిని. బంధాలకు విలువిస్తాను. బాధ్యతలను ఇష్టంగా మోస్తాను. అలా అని నా మంచితనాన్ని అందరూ అడ్వాంటేజ్‌గా తీసుకుంటే తట్టుకోలేకపోతు న్నాను. బంధువులంతా ఎప్పుడూ ఏదో ఒక సహాయం అడుగుతూనే ఉంటారు. పనుల్లో సహాయమైతే ఫర్వాలేదు. కానీ ఆర్థిక సాయం చేయలేని పరిస్థితి. అలా అని చెప్పినా విని పించుకోరు. నువ్వయితే కాదనవనే నీ దగ్గరకు వచ్చాం అంటూ ఇబ్బంది పెట్టేస్తుం టారు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి. - రంగనాయకులు, నెల్లూరు భయం తర్వాత మనిషికి అత్యంత ప్రమాదకరమైన జబ్బు మొహమాటం. ఒకమ్మాయి క్లాస్మేట్స్ చాలామందికి వేసవి సెలవుల్లో పెళ్లిళ్లయ్యాయి. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఫ్రెండ్ పెళ్లికీ ఆమె వెళ్లింది. కొన్ని నిశ్చితార్థాలకి కూడా అటెండ్ అవ డంతో చదువులో వెనకబడింది. గ్రాడ్యు యేషన్లో మంచి మార్కులతో పాసయినా సివిల్స్ ప్రిలిమ్స్‌లో దారుణంగా ఫెయిలైంది. ఇటువంటి సందర్భాల్లో ‘నో’ చెప్ప లేని బలహీనత, ఎవరేమనుకుంటారో అన్న మొహమాటం, ఆత్మ న్యూనత, ఐడెంటిటీ క్రైసిస్ మిళితమై ఉంటాయి. ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం కన్నా... కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని ‘మొహమాటం’ అంటారు. కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం కంటే, ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని ‘దాతృత్వం’ అంటారు. అవతలివారు మనతో ఎలావుంటే మనకి బావుంటుందో మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఇతరులకి ‘నో’ చెప్పడం మనల్ని వారికి దూరం చేయవచ్చు. కానీ ‘ఎస్’ చెప్పడం మనల్ని మనకి దూరం చేస్తుంది. ఇతరుల కోరికలకీ మన ఇబ్బందులకీ మధ్య సరైన గీత గీసుకోగలిగితే మానవ సంబంధాలు బావుంటాయి. ఈ ప్రశ్న మీ పేరు మీదే పంపించారో, మరో పేరు పెట్టారో తెలియదు. మీ పేరు రంగనాయకులై, మీరు నెల్లూరు నుంచే రాసి ఉంటే కనుక ఈ పత్రిక కాపీని జిరాక్స్ తీయించి మీ బంధువులందరికీ పంపించండి చాలు. - యండమూరి వీరేంద్రనాథ్ -
సాఫ్ట్వేర్.. కుదేల్
తమిళనాడు రాజధాని చెన్నై నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు కుదేలయ్యాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచి కదిలే పరిస్థితి లేకపోవడం, ఆఫీసులలోకి కూడా నీళ్లు వచ్చేయడంతో చాలా కంపెనీలు ఆదివారం వరకు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి కార్మిక శాఖ ఇప్పటికే రెండు రోజులు సెలవులు ప్రకటించింది. వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని చూస్తున్నా, ఎక్కడా విద్యుత్ సరఫరా గానీ, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలు గానీ లేకపోవడంతో దానికి కూడా వీలు కుదరట్లేదు. ఇన్ఫోసిస్, యాక్సెంచర్, టీసీఎస్, ఐబీఎం లాంటి ప్రధాన కంపెనీలన్నింటిపైనా కూడా వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది అయ్యింది. అప్పట్లో చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. నగరం నుంచి బయటకు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోయాయి. విమానాశ్రయం కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోవడంతో వాయుమార్గం ఆప్షన్ సైతం లేదు. తాత్కాలికంగా నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్‌ను పౌర విమానాశ్రయంగా ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌బస్ ఎ 320 విమానం ఒకదాన్ని అక్కడ ల్యాండ్ చేసి పరీక్షించారు. అయితే, ఆ ఎయిర్‌బేస్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడివరకు వెళ్లడం కూడా పెద్ద సమస్యగానే ఉంది. మరో నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాంతో సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి. -
సాఫ్ట్వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వర్షాలు
భారీ వర్షాలతో సాఫ్ట్వేర్ కంపెనీలు అతలాకుతలం అవుతున్నాయి. ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. మరోవైపు క్లయింటులు మాత్రం తమ అవసరాల కోసం యాజమాన్యాల మీద ఒత్తిడి తేవడం మానట్లేదు. చెన్నైలో పనిచేస్తున్న వాళ్లలో కీలక ఉద్యోగులు చాలామందిని వేరే ప్రాంతాలకు పంపేసి.. అక్కడినుంచి పని చేయాల్సిందిగా కోరతున్నారు. ప్రధానంగా ఐబీఎం, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, టీసీఎస్.. ఇలాంటి పలు కంపెనీల ఉద్యోగులు చాలామంది భారీ వర్షాల కారణంగా ఆఫీసులకు వెళ్లలేకపోతున్నారు. దాంతో, చెన్నైలో ఉన్న చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరుతున్నాయి. పోనీ కనీసం కొంతమందినైనా 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆప్షన్ ఉపయోగించుకుని పని చేయిద్దామంటే, చెన్నైలో చాలా ప్రాంతాలలో కరెంటు ఉండట్లేదు. దాంతో పాటు.. మొత్తం జలమయం అయిపోవడంతో ఇంటర్నెట్ సదుపాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లతో పని చేయించడం ఎలాగో అర్థం కాక, పని జరిగే వీలు లేక యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. చెన్నై కేంద్రంగా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు, విద్యుత్ లైన్లు బాగా పాడయ్యాయి. కేవలం వీటి రూపంలో కలిగిన నష్టాలే దాదాపు రూ. 8,481 కోట్ల మేరకు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వస్తుసేవలు, ఇలాంటి సాఫ్ట్వేర్ సేవలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ నష్టం ఎన్ని లక్షల కోట్లకు చేరుకుంటుందో చూడాలి. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. దాంతో అక్కడి ఉన్నతోద్యోగులను అత్యవసరంగా బెంగళూరు పంపేసి.. అక్కడినుంచి ప్రాజెక్టుల పని చూస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వాళ్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ.. వేర్వేరు నగరాలకు సిబ్బందిని పంపుతున్నారు. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి. -
సైదులు
సింగిల్ పేజ్ స్టోరీ నిన్న రాత్రి ఎనిమిది, ఎనిమిదింపావు మధ్యలో వచ్చినట్టుంది చీకటి. వచ్చి ఎనిమిది గంటలు దాటిందో ఏమో? సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిలా వెళ్లటానికి సిద్ధమవుతూ, తర్వాత షిఫ్ట్ రావలసిన సూర్యుడికి రమ్మని కేకేసింది. క్యాబ్ మిస్సయ్యి సిటీ బస్‌లో వస్తున్న ఉద్యోగిలా సూర్యుడు మెల్లగా వస్తున్నాడు. పీరయ్య మటన్ కొట్లో... కోళ్ల బోన్లో ఉన్న శీనయ్య కోడి ‘సైదులు’ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. మర్డర్ చేసి దొరికిపోయిన నేరస్తుడిలా బిక్కుబిక్కుమని భయంతో అటూ ఇటూ చూస్తూ... ‘ఏంటో ఈ కోడి బతుకు!’ అని తిట్టుకుంటోంది. రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లోలా తలుపు తీసిన చప్పుడయ్యింది. లోపలికి వచ్చిన పీరయ్య ఎడం చేత్తో లైట్ వెయ్యబోయి, ఆగి కుడిచేత్తో వేశాడు. ఓల్టేజ్ సరిగా లేదో, బల్బ్ సరిగా లేదో... లైట్ మాత్రం దీనంగా వెలుగుతోంది. సాన పట్టించుకొచ్చిన రెండు కత్తులు అరుగుమీద పెట్టి, దేవుడి పటం ముందు నిల్చొని మొక్కుకుంటున్నాడు పీరయ్య. తనని బతికించమని అదే దేవుణ్ని మొక్కుకుంది సైదులు. చంపటానికి వచ్చిన పీరయ్యా అదే దేవుణ్ని మొక్కుతుండటం చూసి అసలీ దేవుడి కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాలేదు సైదులికి. పూజ ముగించిన పీరయ్య కోళ్లను నరికే మొద్దు బండని శుభ్రం చేస్తున్నాడు. కొట్లో క్యాలెండర్ అక్టోబర్ మూడు చూపిస్తోంది. ‘‘గాంధీతాత దయవల్ల ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా బతకగలిగాను. కాని, లాభమేంటి? రోజు మొత్తం భయం భయంగా బతకటం తప్ప. ఎవరికొచ్చిందో స్వాతంత్రం, మాకు మాత్రం రాలేదు’’ అని సైదులు నిట్టూర్చింది. ‘‘దేవుడా... దేవుడా... ప్లీజ్! బతికి బయటపడే అవకాశమైతే కనపడట్లేదు. కానీ బతకాలనుంది. గుడ్లు పెట్టే వయసు రాకముందే గుడ్లు తేలెయ్యాల్సొస్తుందని బాధగా ఉంది. ప్లీజ్ దేవుడా... ప్లీజ్, ప్లీజ్’’ అని దేవుణ్ని ప్రార్థిస్తోంది సైదులు. పీరయ్య వచ్చి బోను తెరిచాడు. అంతలో దీనంగా వెలుగుతోన్న లైట్ కాస్తా ఆరిపోయింది. సైదులు వెంటనే బోను నుంచి బయటికి దూకి చీకట్లో పరిగెత్తింది. ఏమీ కనిపించకపోవడంతో కోడి ఎటు పోయిందో గుర్తించలేకపోయాడు పీరయ్య. అక్కడి నుండి బయటపడ్డ సైదులు మాత్రం పక్కనున్న పొలాల్లోంచి రయ్యిరయ్యిమని శీనయ్య ఇంటికి బయలుదేరింది. తను చిన్నగా వున్నప్పటినుంచి తనని ప్రేమగా పెంచాడు శీనయ్య. తనకున్న దాంట్లో భార్యాపిల్లలతో హాయిగానే జీవిస్తున్నాడు. శీనయ్య ఇంట్లోంచి సైదులుని దొంగతనంగా ఎత్తుకొచ్చి పీరయ్యకి అమ్మేశాడు సుబ్బులు. ‘ఆడు కనపడాలీ... ముక్కుతో వాడి పిక్క ముక్కలు ముక్కలు చేసి చంపేస్తా’ అని తిట్టుకుంటూ వెళ్తోంది సైదులు. శీనయ్యని చూసి రెండు రోజులు దాటింది. తనని చూసి శీనయ్య ఎంత ఆనందపడతాడో గుర్తుకొస్తూనే సైదులు వేగం ఇంకా పెరిగింది. ఎలాగైతేనేం ఇంటికి చేరుకుంది సైదులు. దొడ్డి గుమ్మం వైపు వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూసింది. శీనయ్య నాలుగేళ్ల కొడుకు అశోక్, అక్క స్వాతి మీద చెయ్యేసుకుని పడుకున్నాడు. ఎప్పటిలాగే వాడి భయం చూసి నవ్వుకుంది సైదులు. ఒంట్లో నలతగా వుందో ఏమో? శీనయ్య భార్య లక్ష్మి మంచం మీద పడుకుని వుంది. రెండు ప్లేట్లలో ఉప్మా పెట్టుకుని వచ్చి ‘తిను’ అంటూ ఒక ప్లేట్ లక్ష్మికి ఇచ్చాడు శీనయ్య. ‘‘భార్య లక్ష్మి అంటే అంత ప్రాణం శీనయ్యకి. అందుకే శీనయ్య అంటే అంత గౌరవం లక్ష్మికి. వాళ్లిద్దరి అన్యోన్యత గురించి మాట్లాడుకోని కోడి గానీ, మనిషి గానీ లేడు’’ అనుకుంటూ దొడ్డి వాకిలి గుండా ఇంట్లోకి వచ్చింది సైదులు. ఉప్మా వాసన బాగా వస్తుండటంతో వాళ్లకి కనిపించకుండా వంటింట్లోకెళ్లింది. తనలాగే శీనయ్యకీ పల్లీలు ఎక్కువగా వేసి చేసిన ఉప్మా అంటే ప్రాణం. మెల్లిగా వంటింట్లోకెళ్లిన సైదులు తన ముక్కుతో ఉప్మా కాస్త పక్కనేసుకుని ఆస్వాదిస్తూ తింటోంది. రెండు రోజుల్నుంచి తినిందో లేదో గబగబా నాలుగు ముద్దలు కడుపులోకేసింది. ఎందుకో గొంతు పట్టేసినట్టు అనిపించింది సైదులుకి. కడుపులో మెలికలు తిరిగే నొప్పి, కళ్లు తిరుగుతున్నాయ్. కడుపులో అగ్గి పోసినట్టుగా వుంది. ఏమయ్యిందో ఏమో అర్థం కావట్లేదు. భరించలేని బాధ. కాస్త ఓపిక తెచ్చుకుని వంటింటి గుమ్మం దాకా వచ్చి చూసింది. నోట్లోంచి నురగులు కక్కుతూ చచ్చిపోతున్నారు శీనయ్య, లక్ష్మి. కోడి గుండె ఆగిపోయింది. విషయం తెల్సి చుట్టుపక్కలవాళ్లంతా వచ్చారు. ఉత్తమ వ్యవసాయదారుడు అని రాసున్న ఒక అవార్డు ముక్క, సగం కాలి కట్టెల పొయ్యిలో ఉంది. పీరయ్య మటన్ కొట్లోనే చావాల్సిన సైదులు చావు శీనయ్య ఇంట్లో రాసిపెట్టుంది. పిల్లల్ని ఓదార్చిన ఆ వూరి ఎం.ఎల్.ఎ. బయటికి వచ్చి, ఎవరూ చూడకుండా డెటాల్‌తో చేతులు కడుక్కుని వెళ్లిపోయాడు. - కళ్యాణ్ రాఘవ పసపుల -
గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!
జీవన గమనం నేనొక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను చేస్తోన్న ఉద్యోగం నాకు సుఖాన్నిస్తోంది. కానీ నా నమ్మకాలకు వ్యతి రేకంగా పని చేస్తేనే ఆ ‘సుఖం’ నాకు లభి స్తోంది. ఇలా నమ్మకాలకి, మరింత సుఖపడ టానికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎలా సమన్వయపరచుకోవాలి? ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిందేనా? - నన్నపనేని, సామర్లకోట ‘నా నైతిక విలువల్ని వదులుకోవాలా, సుఖాన్ని వదులుకోవాలా’ అన్నది మీ ప్రశ్న. హోటల్లో ఇడ్లీ తింటున్నప్పుడు పక్క వాడి పూరీని చూసి, తప్పు నిర్ణయం తీసు కున్నామేమో అని బాధపడితే ఇడ్లీ ఏ మాత్రం సంతృప్తినివ్వదు. మీ ఉద్యోగం మీకు సుఖాన్నిస్తోంది కానీ సంతృప్తినివ్వ ట్లేదని రాశారు. ఒక పని సంతృప్తినివ్వక పోవడానికి కారణం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి - శారీరకంగా మనం ఆ పని చేయలేకపోయినప్పుడు. ఉదాహరణకి, రోగంతో బలహీనమైన వ్యక్తి రైల్వే కూలీగా పనిచేస్తే చాలా బాధపడవలసి ఉంటుంది. రెండోది - మానసికంగా ఆ పని ఇష్టం లేకపోయినప్పుడు. ఉదాహర ణకి, సృజనాత్మకత ఉన్న ఒక కళాకారిణి బ్యాంక్‌లో రొటీన్ ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు చాలా నిరాసక్తత ఆవహి స్తుంది. మూడోది - చేస్తున్న పనికి, సిద్ధాంతాలకు నిరంతర ఘర్షణ జరుగుతున్నప్పుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా లంచాలు, కమీషన్లు ఉంటాయి. మీ సమస్య మూడోదే అనుకుంటున్నాను. నైతిక విలువల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తికి, పక్క సీట్లో కూర్చుని లంచాలు తీసుకుం టున్న వ్యక్తి రోజురోజుకీ ధనవంతుడవడం చూసి... ‘తనకున్న నైతిక విలువ గొప్పదా ధనం విలువ గొప్పదా’ అన్న సంఘర్షణ మొదలవుతుంది. మీ సమస్య ఇదే అయితే ముందొక నిర్ణయం తీసుకోండి. సుఖం అనేది రెలిటివ్ టర్మ్. దానికి అంతు లేదు. డబ్బు నిశ్చయంగా సుఖాన్ని స్తుంది. కానీ ఆనందాన్ని ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం మీకు బతకటానికి లోటు లేదు కదా! నిరంతరం ‘నేను చాలా మంచివాడిని, అందుకే నాకిన్ని బాధలు’ అని మనసులో సంఘర్షిస్తూ ఉంటే ఆనందం ఎప్పటికీ దొరకదు. నేను నైతిక విలువలు కోల్పో మని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. ఘర్షణను వదులుకుని జీవించమని చెప్తున్నానంతే. లంచం పొందడానికి వీలున్న కుర్చీలో కూర్చుని కూడా నిజాయితీగా బతికేవాడి మొహంలో ఉండే ప్రశాంతత, విలువలు కోల్పోయిన వ్యక్తి ముఖంలో ఉండదు. కష్టపడి సంపాదించే డబ్బు సంతృప్తినిస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా కాలేజీలో ఒక లెక్చెరర్ దగ్గర సాయంత్రం ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. ఓ రోజు ఆయన ఒంటరిగా ఉన్న నా దగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పారు. నేనేం మాట్లాడ లేదు. గురువును ప్రేమించడం తప్పు అని నా ఉద్దేశం. కానీ ఆయన తనకే దురుద్దేశం లేదని, నేను కూడా సెటిలయ్యాక మా పేరెంట్స్‌తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఆయనను నమ్మాలా? లేక నో చెప్పాలా? - సుజిత, నకిరేకల్ ఇందులో ‘నమ్మటం’ అన్న ప్రసక్తి ఎక్కడుంది? మీ అభ్యంతరం కేవలం ఆయన మీ ‘గురువు’ అన్నదొక్కటే అయితే, మిగతా అన్ని విషయా ల్లోనూ ఆయన కరెక్టుగా ఉంటే.. ఏమాత్రం సంశయించకుండా వివాహం చేసుకోవచ్చు. అయినా గురువును పెళ్లాడటం తప్పు అని ఎక్కడా రాసి లేదు. ఈ రోజుల్లో బీటెక్ పాసయిన కుర్రాళ్లే తర్వాతి సంవత్సరం లెక్చెరర్స్గా మారు తున్నారు. మీ ఉత్తరాన్ని బట్టి అతను మంచివాడిలానే కనిపిస్తున్నాడు. వయ సులో ఎక్కువ తేడా లేకపోతే నిరభ్యంత రంగా పెళ్లి చేసుకోవచ్చు. బెస్టాఫ్ లక్. నేను ఎమ్మెస్సీ చదువుతున్నాను. కానీ నాది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే అని అందరూ అంటుంటారు. మా నాన్న అయితే ఎక్కడ పడితే అక్కడే తిట్టేస్తుంటారు. నాకు చాలా బాధనిపిస్తోంది. నిజానికి ఏ పని ఎలా చక్క బెట్టాలో నాకు తెలియదు. అందుకే అందరూ అనేది నిజమేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అనిపిస్తోంది. హాస్టల్లో ఉండి చదివితే మైండ్ మెచ్యూరవుతుందని విన్నాను. నేనెప్పుడూ హాస్టల్లో లేను. అందుకే నా మైండ్ ఎదగలేదా? - సునీల్, అనంతపురం ఒక తాగుబోతు తండ్రి కన్నా, పిల్లల్ని సరిగ్గా పెంచలేని తండ్రి నికృష్టుడు అని ఎక్కడో చదివాను. ఎదిగిన పిల్లల్ని అందరి ముందూ తిడితే వాళ్ల మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రతి తండ్రీ తెలుసుకోవాలి. మీకు జ్ఞానం లేక పోవడానికి (కనీసం మీరు అలా అను కుంటూ ఉండడానికి) కారణం మీ తండ్రి ఒక్కరే కాకపోవచ్చు. ఏదేమైనా, హాస్టల్లో ఉండి చదువుకుంటే మైండ్ మెచ్యూర్ అవుతుందనుకోవడం నూరుపాళ్లూ నిజం కాదు. మీరు ఎలానూ మరికొంత కాలానికి ఉద్యోగంలో ప్రవేశిస్తారు. అప్పుడు సహజంగానే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. చదువు ఆఖరి దశలో ఇల్లు వదిలి హాస్టల్లో చేరితే కొత్త సమస్యలు రావచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా కొంతకాలం ఆగండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో టోకరా
రాంగోపాల్‌పేట్: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నిరుద్యోగి నుంచి రూ.2లక్షలు కాజేశాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే రేపుమాపు అంటు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుడి తండ్రి మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన కుమారస్వామి ప్రభుత్వ ఉద్యోగి. ఇతని కుమారుడు రాకేష్ బీటెక్ పూర్తి చేసి అమీర్‌పేట్‌లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గత కొద్ది నెలల క్రితం అమీర్‌పేట్‌కు చెందిన చక్రధర్ అనే వ్యక్తి రాకేష్‌కు పరిచయం అయ్యాడు. తాను ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్ష రూపాయలు ఇవ్వాలని రాకేష్‌ను నమ్మించాడు. దీంతో రాకేష్ జూలై 15వ తేదీన చక్రధర్‌కు లక్ష రూపాయలు ఇచ్చాడు. కానీ, ఉద్యోగం మాత్రం రాలేదు. దీంతో రాకేష్ ఒత్తిడి చేయడంతో ఓ ఎంఎన్సీ కంపెనీకి చెందిన అపాయింట్మెంట్ లెటర్‌ను తెచ్చి ఇచ్చాడు. అటు తర్వాత రెండు రోజులకే ఆ కంపెనీ దివాళా తీసిందని మరో లక్ష రూపాయలు ఇస్తే ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. తన స్నేహితుడు ప్రదీప్ అకౌంట్‌కు ఆ డబ్బును బదిలీ చేయాలని చక్రధర్ కోరడంతో రాకేష్ అలాగే చేశాడు. కానీ, మళ్లీ ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత నెల 10వ తేదీన రాకేష్ ఆయన తండ్రి కుమారస్వామిలు చక్రధర్‌ను గట్టిగా నిలదీయడంతో చెక్కును అందించాడు. కానీ, అందులో డబ్బు లేవు. అప్పటి నుంచి చక్రధర్ తప్పించుకుని తిరుగుతూ డబ్బు ఇవ్వకుండా ఉద్యోగం చూపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన కుమార స్వామి శనివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బు లావాదేవీలు అన్నీ సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద జరగడంతో మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇర్ఫాన్ అయ్యాడు శంకర్!
హైదరాబాదీ పేరుతో బెంగళూరు వాసి ఎత్తుగడ ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి వేరే వారి సర్టిఫికెట్లు చోరీ గుట్టురట్టు చేసి ‘బ్యాంకు రుణం’ దరఖాస్తు సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరే కనీస అర్హత లేని ఇర్ఫాన్ అనే ఓ వ్యక్తి ప్రముఖ సంస్థలో రవి శంకర్ శర్మ పేరుతో క్వాలిటీ మేనేజర్‌గా మారాడు. అదెలా సాధ్యమైంది? చివరకు ఏ రకంగా గుట్టురట్టైంది? బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారంతో అసలు మన నగరానికి సంబంధం ఏమిటి..? ఈ ప్రశ్నలకు జవాబులతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం... గోవా నుంచి వచ్చి బెంగళూరులో... బెంగళూరు ఆర్టీ నగర్ పరిధిలోని గంగానగర్‌లో నివసిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ స్వస్థలం గోవా. పదో తరగతి పూర్తయ్యాక డిప్లమో కోర్సులో చేరిన ఇతగాడు ఆర్థిక కారణాలతో డ్రాప్ఔట్గా మారాడు. బతుకుతెరువు కోసం తన తల్లితో కలిసి కర్ణాటకకు వలస వచ్చి బెం గళూరులో స్థిరపడ్డాడు. పూర్తై పదో తరగతి, పూర్తి కాని డిప్లమోకు సంబంధిం చిన సర్టిఫికెట్లతో బెంగళూరులో ఉద్యోగ వేట ప్రారంభించాడు. కనీస విద్యార్హతలు లేకపోవడంతో సుదీర్ఘకాలం ప్రయత్నించినా ఎక్కడా ప్లేస్మెంట్ లభించలేదు. అయినా ఇంటర్వ్యూలకు వెళ్లడం మాత్రం మానుకోలేదు. సర్టిఫికెట్లు తస్కరించి రవి శంకర్‌గా.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తున్న రవి శంకర్ శర్మ 2008లో బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇదే ఇం టర్వ్యూకు వచ్చిన ఇర్ఫాన్.. రవి శంకర్‌తో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయటకు వెళ్లినప్పుడు అదును చూసుకుని శంకర్‌కు చెందిన సర్టిఫికెట్లు, ఇతర యోగ్యతా పత్రాలను ఇర్ఫాన్ తస్కరించాడు. తిరిగి వచ్చిన రవి శంకర్ ఆయా విద్యా సంస్థల నుంచి డూప్లికేట్ పత్రాలు తీసుకున్నారు. శంకర్ పత్రాలను తస్కరించిన ఇర్ఫాన్ వాటిపై తన ఫొటోలను పెట్టి ఫోర్జరీ పత్రాలు రూపొందించాడు. వీటి ఆధారంగా తన పేరు రవి శంకర్ శర్మ అంటూ 2010లో బెంగళూరులోని ఎంఫసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తరవాత మరో ప్రముఖ సంస్థ కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్‌లో క్వాలిటీ మేనేజర్‌గా చేరాడు. సీఐబీఐఎల్ డేటాబేస్ ఆధారంగా... తన పేరిట మరెవరో క్రెడిట్‌కార్డులు, బ్యాంకు రుణం తీసుకున్నారని గుర్తిం చిన రవి శంకర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సీఐబీఐఎల్)ను ఆశ్రయించారు. బ్యాంకు రుణాల డిఫాల్టర్ల డేటాబేస్‌ను పర్యవేక్షించే ఈ సంస్థ బెంగళూరులో రుణం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని బాధితుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు బెంగళూరులోని సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు రుణం, క్రెడిట్ కార్డుల చెల్లిం పులు కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓ శాలరీ అకౌంట్ నుంచి జరిగినట్లు గుర్తించిన సీసీబీ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దీంతో అతడు అన్ని విషయాలు బయటపెట్టడంతో గతనెల 14న అరెస్టు చేసింది. అసలు పేరుతో ఉన్న ఓటర్ ఐడీ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో రీడ్‌వేర్ కార్యాలయం
హైదరాబాద్: భారత్‌లో అతి పెద్ద డిజిటల్ పబ్లికేషన్స్ ప్లాట్ఫామ్అయిన రీడ్వేర్డాట్కామ్ను నిర్వహించే మీడియాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇటీవలే హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుర్గావ్లో ప్రధాన కార్యాలయం ఉందని, దీని తర్వాత వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదేనని మీడియాలజీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, కామిక్స్, ఇతర పుస్తక ప్రచురణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని మీడియాలజీ వ్యవస్థాపకులు గౌరవ్ భట్నాగర్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ.. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమకు మంచి రీడర్షిప్ ఉందని తెలిపారు. మొబైల్ సీఎంఎస్ సొల్యూషన్‌తో మొబైల్ వినియోగదారులకు సమర్థవంతంగా కనెక్ట్ కాగలమని మీడియాలజీ సీఈఓ, డెరైక్టర్ మనీష్ థింగ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఐటీ కంపెనీల ‘గన్’తంత్రమ్!
భద్రత కోసం సాఫ్ట్వేర్ సంస్థలకు గన్ లెసైన్స్‌లు ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఐటీ సంస్థలకు శిక్షణ హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలు ఇకపై కంప్యూటర్లో బగ్స్, మాల్వేర్లను నాశనం చేయడమే కాదు.. భౌతికంగా తమపై దాడి చేసే ముష్కరమూకల పని కూడా పట్టనున్నాయి. ఐటీ కంపెనీలను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాఫ్ట్వేర్ కంపెనీల నిలయమైన గచ్చిబౌలి ప్రాంతంలో భద్రతా ప్రమాణాలను పరీక్షించారు. గచ్చిబౌలి పరిసరాల్లో దాదాపు 500 ఐటీ కంపెనీలు రిజిస్టర్ అయినవే ఉన్నాయి. వీటి రక్షణకు ఆయా సెక్యూరిటీ ఏజెన్సీలు తీసుకుంటున్న చర్యలను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సిబ్బంది అధ్యయనం చేశారు. అకస్మాత్తుగా జరిగే దాడులను ఎదుర్కొనేందుకు వాళ్ల వద్ద ఉన్న సెక్యూరిటీ, ప్రొటెక్షన్ తదితరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎవరి వద్దా ఆయుధాలు లేవన్న విషయం తేలింది. అయితే గచ్చిబౌలి క్యాంపస్‌లోని ఒక కంపెనీకే ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డింగ్ ఉందని గుర్తించారు. దీని మాదిరిగానే ఇతర కంపెనీలూ భద్రతా ప్రమాణాలు పాటిస్తే జరగబోయే నష్టాన్ని తగ్గించవచ్చని భావించారు. ఎస్సీఎస్సీ చైర్మన్‌గా ఉన్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇతర సిబ్బందితో కలసి కార్యచరణ రూపొం దించారు. పోలీసు కమిషనరేట్ నిబంధనల ఆధారంగా ఐటీ కంపెనీలకు గన్ లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. రాత్రిపూట పరిసర ప్రాంతాలను పర్యవేక్షించేందుకు నైట్ విజన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సమకూర్చుకోవాలని కంపెనీలకు సూచించారు. నిబంధనలు ఇలా... పారా మిలిటరీ ఫోర్స్, మాజీ పోలీసు అధికారి హెడ్లుగా ఉన్న ఆయా ఐటీ కంపెనీల సెక్యూరిటీ ఏజెన్సీలకు గన్ లెసైన్స్‌లు త్వరితగతిన జారీ చేస్తున్నారు. ఆ కంపెనీలో ఏం జరిగినా కంపెనీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. గన్ లెసైన్స్ పొందిన కంపెనీ సెక్యూరిటీ సిబ్బందికి కూడా తగిన తర్ఫీదు ఇస్తారు. ‘లెసైన్స్డ్ తుపాకీలు ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపైనా వివరాలు సేకరిస్తాం. వారి ప్రొసీజర్‌ను కూడా ఆడిట్ చేస్తాం. లెసైన్సులు తప్పనిసరంటూ ఏ కంపెనీపైనా ఒత్తిడి తేవడం లేదు’ అని ఎస్సీఎస్సీ అంటోంది. ఆయుధాలుంటేనే అడ్డుకోగలరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉండాలి. ఉగ్రవాద దాడు ల్ని ఎదుర్కొనేందుకు ఆయుధాలున్న సిబ్బంది అవసరం. కానీ ఐటీ కారిడార్‌లోని సంస్థల భద్రత ప్రమాణాలు ఈ స్థాయిలో లేనందున ఆ సంస్థలకు గన్ లెసైన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించాం. ఆయా సంస్థల అవసరాలను బట్టి రెండుకు మించి గన్ లెసైన్స్‌లు ఇస్తాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ పెద్ద కంపెనీల స్పందన బాగుంది.. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లో విమెన్, సేఫ్టీ సెక్యూరిటీ, ట్రాఫిక్ ఫోరమ్లున్నాయి. సేఫ్టీ సెక్యూరిటీ ఫోరమ్ సభ్యులు ఐటీ సంస్థల భద్రతా ప్రమాణాలను అధ్యయనం చేశారు. పోలీసు కమిషనర్ గన్ లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు పెద్ద కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ ప్రణాళిక పూర్తిగా కార్యరూపం దాల్చనుంది. - భరణికుమార్, ఎస్సీఎస్సీ కార్యదర్శి -
భవిష్యత్తు క్లౌడ్ కంప్యూటింగ్‌దే!
♦ ఐటీ, సేవల రంగంతో పాటు ఇప్పుడు వైద్యానికి క్లౌడే ♦ పేషెంట్ మెడికల్ ఇమేజెస్, నివేదిక విశ్లేషణ అన్నీ దీంతోనే ♦ ‘పికాసో’తో సగానికి సగం తగ్గనున్న వ్యయం, సమయం ♦ ‘సాక్షి’తో రికో ఎండీ మనోజ్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పైరసీ అంటే టక్కున గుర్తొచ్చేది సినిమాలే. కానీ, ఇప్పుడీ భయం సాఫ్ట్వేర్ కంపెనీలకూ పట్టుకుంది. ఉదయం విడుదలైన సినిమాలు సాయంత్రానికల్లా పైరసీ రూపంలో బయటికొచ్చేస్తే ఎలాగైతే నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టమొస్తుందో.. అంతకు రెట్టింపు నష్టం సాఫ్ట్వేర్ ఆప్లికేషన్ల పైరసీతోనూ కలుగుతోందంటున్నారు రికో ఇండియా ఎండీ మనోజ్ కుమార్. గతేడాది దేశంలో సాఫ్ట్వేర్ పైరసీల నష్టం విలువ రూ.3.5-4 బిలియన్ డాలర్లుంటుందని అంచనా వేశారాయన. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో సాఫ్ట్వేర్ పైరసీని పూర్తిగా అడ్డుకోవచ్చని చెప్పారాయన. ‘‘క్లౌడ్ కంప్యూటింగ్ మున్ముందు ఐటీ, సేవల రంగానికే కాక విద్యా, వైద్యం, సినిమా, ఇండస్ట్రీ.. ఇలా పలు రంగాలకూ విస్తరిస్తుంది’’ అన్నారాయన. పికాసో పేరిట దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ ఎనేబుల్డ్ మెడికల్ ఇమేజింగ్ సొల్యూషన్‌ను శుక్రవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. - క్లౌండ్ కంప్యూటింగ్ విధానం అటు కంపెనీలకు, ఇటు వినియోగదారులకు ఇద్దరికీ లాభమే. ఇప్పటివరకు ఒక సాఫ్ట్‌వేర్‌ను కొనాలంటే వేలు, లక్షల్లో చెల్లించాలి. అలా కొన్న సాఫ్ట్వేర్లు కొన్ని కంప్యూటర్లకే పరిమితమయ్యేవి. ఎక్కువ కంప్యూటర్లకు వాడాలంటే మళ్లీ కొనాల్సి వచ్చేది. దీంతో సాఫ్ట్వేర్ అప్లికేషన్లు పైరసీకి గురయ్యేవి. ఇప్పటికీ పైరసీ సాఫ్ట్వేర్లు ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఆప్లికేషన్లు రూపొందించే కంపెనీలకు నష్టం కలుగుతోంది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్‌తో సాఫ్ట్వేర్ పైరసీకి అడ్డుకట్ట వేయవచ్చు. అదే సమయంలో సాఫ్ట్వేర్ వాడకంలోనూ ఖర్చును తగ్గించుకునే వీలుంది. అందుకే భవిష్యత్తు క్లౌడ్ కంప్యూటింగ్‌దే. ఎంత వాడుకుంటే అంతే రుసుము చెల్లించే విధానం వల్ల వినియోగదారులూ ఇటే మొగ్గు చూపుతున్నారు. - ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), సేవల రంగాలకే పరిమితమైన క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఇప్పుడు వైద్య రంగానికీ తీసుకొచ్చాం.వెబ్ ఆధారితమైన పికాసో.. ఆసుపత్రులకు, రోగులకు విస్రృతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వైద్య ప్రక్రియ సులభతరం అవ్వడమే కాక, వేగవంతమవుతుంది కూడా. రేడియాలజీ, ఆర్థోపీడిక్, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆప్తాల్మాలజీ, ఆంకాలజీ చికిత్సల్లో పికాసోను వినియోగించుకోవచ్చు. -
సాఫ్ట్ రాక్స్
సిటీకి రాక్ బ్యాండ్స్ కొత్త కాదు. తొలుత మ్యూజిక్ కంపెనీలకు, ఆడియో వ్యాపారం చేసేవారికి పరిమితమైన ఈ బ్యాండ్స్ నిదానంగా తమ పరిధిని విస్తరించుకున్నాయి. విభిన్న రంగాలకు చెందిన వారిని సైతం మమేకం చేసుకుంటూ కాలేజీ క్యాంపస్‌లలోనూ సందడి చేయడం మొదలు పెట్టాయి. అదే క్రమంలో లేటెస్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీలను అల్లుకుపోతున్నాయి. రాక్ సరిగమల్లో వారికున్న పనితనాన్ని చూపిస్తూ.. పని ఒత్తిడికి చెక్ పెడుతున్నారు టెకీలు. ఊపే.. ఊరట.. ‘రాక్ మ్యూజిక్‌లో ‘ఊపు’ ఎక్కువ. ఉద్యోగరీత్యా శారీరక శ్రమ తక్కువుండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాక్ అంటే ‘షేక్’ అయిపోవడానికి కారణం అదే’ అంటున్నారు స్లెడ్జ్ బ్యాండ్ నిర్వాహకులు అంజానీ. పబ్స్, కేఫ్‌లలో నిర్వహించే రాక్ బ్యాండ్ ప్రదర్శనలకు క్యూ కట్టే వారిలో ఐటీ ఉద్యోగులే ముందుంటారనేది నగర మెరిగిన సత్యమే. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో నిర్వహించే పలు ఈవెంట్లలో కూడా దేశ విదేశాలకు చెందిన బ్యాండ్లు వెల్లువెత్తడమూ సిటీకి అనుభ వమే. అయితే సాక్షాత్తూ ఐటీ సిబ్బందే రాక్ బృందాలుగా మారడం మాత్రం ఇటీవలే మొదలైంది. ‘కంపెనీలలో నిర్వహించే రకరకాల ఈవెంట్ల సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ వెలుగు చూస్తోంది. గాయకులు, రచయితలు, గిటారిస్ట్‌లు.. తమలోనూ ఉన్నారని ఈ కంప్యూటర్ యోధులు నిరూపించుకుంటున్నారు. వీళ్లంతా కలిసి ఒక బృందంగా ఏర్పడాలనే ఆలోచనకు రూపమే రాక్ బ్యాండ్’ అని సాఫ్ట్‌టెక్ కంపెనీకి చెందిన చారు చెప్పారు. మేం ఇద్దరం... మాకిద్దరు... ఇదేదో ఫ్యామిలీ ప్లానింగ్ స్లోగన్ అనుకోవద్దు. రాక్ బ్యాండ్ ప్లానింగ్ తీస్తున్న రాగం. తొలుత ఇద్దరిలో పుడుతున్న ఆలోచనే మరో ఇద్దరిని చేర్చుకుని పూర్తిస్థాయి బ్యాండ్‌గా మారుతోంది. ‘బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం నలుగురు సభ్యులు తప్పనిసరి’ అని అల్టర్ ఇగోజ్ బ్యాండ్ సృష్టికర్త విజయ్ చెప్పారు. తదనంతరం మరో ఇద్దరు, ముగ్గురు చేరినా పర్లేదు. ‘మా కంపెనీలో ఇన్‌హౌస్ ఈవెంట్ సందర్భంగా ప్రదీప్ దామోదరం, అజయ్‌లు మంచి గిటారిస్ట్లని అర్థమైంది. ఆకృతి కొమ్ముల, భూదేవ్ కాకటిలు మంచి సింగర్స్ అని తెలిసింది. అప్పుడే బ్యాండ్ ఫార్మేషన్ ఐడియా వచ్చింది’ అని ఫ్యాక్ట్‌సెట్ రాక్ బ్యాండ్ బృంద సభ్యులు వివరించారు. డ్రమ్స్లో ప్రావీణ్యం ఉన్న నితిన్ సూత్రావె వీరికి జత కలవడంతో ఇక బృందానికి ఫుల్ షేప్ వచ్చేసింది. ‘లాస్ట్ టైమ్ కంపెనీ ఆన్యువల్ ఈవెంట్లో మా బ్యాండ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి సూపర్బ్ అప్లాజ్ వచ్చింది’ అంటూ వికాస్ ఆనందం వ్యక్తం చేశాడు. గిటారిస్ట్‌గా ఈ జట్టులో చేరిన వికాస్.. పని విరామ సమయంలో తాము సాధన చేస్తామని చెప్పాడు. ప్రస్తుతం సిటీలో ఉన్న డెలాయిట్, కాగ్నిజెంట్, వెల్స్ఫ్రాగో వంటి పలు కంపెనీల ఉద్యోగులు కూడా రాక్ బ్యాండ్స్‌కు రూపుకట్టారు. కంపెనీకి నేమ్.. ఎంప్లాయీకి ఫేమ్.. ఉభయ కుశలోపరి కావడంతో ఈ రాక్ బ్యాండ్స్‌ను కంపెనీ యాజమాన్యాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. సిటీలో ఇతర రాక్ బ్యాండ్స్లాగే కంపెనీ ఉద్యోగులు ఏర్పాటు చేస్తున్న బ్యాండ్స్‌కు ప్రత్యేకంగా పేర్లున్నా, ఎక్కువగా కంపెనీల పేర్లతోనే ఇవి నడుస్తున్నాయి. డెల్లాయిట్ ఉద్యోగులు ‘డి-స్ట్రింగ్స్’ పేరుతో, ఫ్యాక్ట్‌సెట్ స్టాఫ్ ‘సంయుక్త్’ పేరుతో బ్యాండ్స్ నిర్వహిస్తున్నారు. అయితే వీటిని డెల్లాయిట్ బ్యాండ్, ఫ్యాక్ట్‌సెట్ బ్యాండ్ అనే వ్యవహరిస్తున్నారు. కంపెనీల అంతర్గతంగా, ఇతర కంపెనీల మధ్య కూడా రాక్ గమకాల సమరాలు సాగుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన బ్యాండ్స్ ఇన్ హౌస్ లేదా కంపెనీల ఆధ్వర్యంలోని కార్యక్రమాలకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. టాలెంట్‌ను పెంచుకుంటూ.. వినోదం పంచే మరిన్ని రాక్ బ్యాండ్స్ టెకీల సారథ్యంలో రానున్నాయి. సో... గెట్ రెడీ టు రాక్... -
లెక్కాపత్రం లేదు!
రికార్డులు నిర్వహించని ఫలితం ఇచ్చింది 18,700 ఎకరాలంటున్న అధికారుల 14,099 ఎకరాలే అని చెబుతున్న సంస్థలు తేలని 4,601ఎకరాల లెక్కలు మిగులు’ భూముల అన్వేషణలోబయటపడిన బండారం సర్కారు భూముల లెక్క తప్పింది. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం వివిధ ఏజెన్సీల (ప్రభుత్వ విభాగాలు)కు బదలాయించిన స్థలాలకు రెక్కలొచ్చాయి. భూ కేటాయింపుల రికార్డులను సరిగా నమోదు చేయకపోవడంతో జిల్లాలో 4,601 ఎకరాల భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. హెచ్ఎండీఏ, టీఐఐసీ, దిల్, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, హౌసింగ్ బోర్డు తదితర సంస్థలకు 18,700 ఎకరాలు కేటాయించినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తుండగా.. తమకు 14,099 ఎకరాలు మాత్రమే బదలాయించినట్లు ఆయా సంస్థలు బుకాయిస్తుండడం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాఫ్ట్వేర్ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు, పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలను కల్పించే టీఐఐసీ, హెచ్ఎండీఏలకు కొన్నేళ్లుగా ప్రభుత్వం భూములను కట్టబెడుతోంది. ఈ విభాగాలు ఆయా సంస్థల అవసరాలను పరిగణనలోకి తీసుకొని భూ కేటాయింపులు జరుపుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు అందడమే తరువాయి.. ఆగమేఘాల మీద భూములను అప్పగిస్తున్న జిల్లా యంత్రాంగం.. వాటి రికార్డుల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం వహించింది. అంతేకాకుండా ఆ సంస్థలకు స్వాధీనం చేసిన భూమి.. నిర్ధేశిత అవ సరాలకు వినియోగిస్తున్నారా? ఎంత మేర కేటాయించారనే అంశాన్ని విస్మరిస్తోంది. దీంతో ఇటు జిల్లా యంత్రాంగం.. అటు హెచ్ఎండీఏ, టీఐఐసీ, టీహెచ్బీ తదితర సంస్థలకు జరిపిన భూ కేటాయింపులకు సంబంధించిన సమాచారంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కారు.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఆయా శాఖలకు కేటాయించిన భూములు, వినియోగంలోకి రాగా, మిగులు భూమి ఎంత ఉందనే సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం భూ కేటాయింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేసింది. పాత రికార్డుల దుమ్ము దులిపిన అధికారగణం.. జిల్లా వ్యాప్తంగా 18,700 ఎకరాల మేర భూమి ఆయా శాఖలకు బదలాయించినట్లు లెక్క తేల్చింది. అదే సమయంలో సంబంధిత శాఖల నుంచి సమాచారాన్ని కోరింది. ఈ మేరకు ఆయా శాఖలు పంపిన నివేదికతో జిల్లా యంత్రాంగం దిమ్మతిరిగింది. కేటాయించిన భూమికి.. ఆయా శాఖలు తేల్చిన లెక్కకు పొంతన కుదరకపోవడంతో గందరగోళంలో పడింది. ఏకంగా 4,601 ఎకరాల మేర తేడా రావడం... ఎన్నిసార్లు లేఖలు రాసినా సంబంధిత విభాగాలు స్పందించకపోవడం మిన్నకుండిపోయింది. హెచ్ఎండీఏదే పెద్ద వాటా! నగరీకరణను ఆసరా చేసుకొని స్థిరాస్తి వ్యాపారాన్ని చేసిన హెచ్ఎండీఏ అప్పనంగా భూములను సేకరించింది. నగర శివార్లలో 6,105 ఎకరాలు సేకరించిన సదరు సంస్థ తమకు కేవలం 3,353 ఎకరాలు మాత్రమే కేటాయించారని బుకాయిస్తోంది. అలాగే పారిశ్రామిక అవసరాలను పర్యవేక్షించే టీఐఐసీ కూడా భూముల లెక్కలను తప్పుగా చూపింది. ఆ సంస్థ తీసుకున్న భూమి 8,682 ఎకరాలని జిల్లా యంత్రాంగం వాదిస్తుండగా, టీఐఐసీ మాత్రం 7,032 ఎకరాలు మాత్రమేనని ఢంకా బజాయిస్తోంది. దిల్, తెలంగాణ హౌసింగ్‌బోర్డు, రాజీవ్ గృహకల్ప భూ కేటాయింపుల్లో కూడా సామీప్యత లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్నట్లు గుర్తించిన స్థలాల సమాచారంలోనూ తేడా కనిపిస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 10,396 ఎకరాల మేర సదరు సంస్థల వద్ద మిగులు భూములు ఉన్నట్లు తేల్చగా, సంస్థలు మాత్రం 6,624 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక సమర్పించింది.