ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ ఐటీ సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇటీవల యుఎస్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ వేర్వేరు విభాగాలకు చెందిన దాదాపు 240 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొంత కాలంగా చిన్న కంపెనీలు & పెద్ద కంపెనీలు అని తేడా లేకుండా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. కరోనా తగ్గినా.. ఆర్థిక మాంద్యం ఉద్యోగులను భయపెట్టేస్తోంది. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగాయాలను కోల్పోయారు. కాగా ఈ జాబితాలోకి మరి కొంతమంది చేరనున్నారు.
అమెరికన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ వర్క్‌ఫోర్స్‌లోని దాదాపు 4 శాతం మందిని తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. మసాచుసెట్స్ రాష్ట్రంలోని ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్లయింట్ ఎంగేజ్‌మెంట్ విధానాన్ని సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా కంపెనీ బిజినెస్ వ్యూహాన్ని మరింత మెరుగుపరచడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
పెగాసిస్టమ్స్ ఉద్యోగులను తొలగించడం వరుసగా ఇది రెండవ సారి కావడం గమనార్హం. గత జనవరిలో కూడా సంస్థ నాలుగు శాతం మంది ఉద్యోగులను తొలగించింది. కాగా రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగిస్తుందా అని ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment