సాక్షి, హైదరాబాద్ : నిత్యం ఏదో ఓ చోట సాఫ్ట్‌వేర్ కంపెనీలు బిచాణా ఎత్తేస్తుంటాయి. ఈ తరహాలోనే హైదరాబాద్ నగరంలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన అన్వర్ అనే వ్యక్తి టోలిచౌకీలో నివాసం ఉంటున్నాడు. అతడు మార్వెల్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. రూ.2.50 లక్షల ప్యాకేజీ ఇస్తానంటూ ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేశాడు. ఆపై బోర్డు తిప్పేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.