నాస్‌డాక్-లిస్టెడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్‌ఈసీ ఫైలింగ్ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్‌సైడ్‌కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.
మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్‌ఈసీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్‌ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్‌మెంట్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.
సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. డెన్నిస్ వుడ్‌సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment