దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్‌మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది.
ట్రాట్‌మన్‌ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్‌సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్‌మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు.
స్టెఫానీ ట్రాట్‌మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్‌మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment