steps down
-
బజాజ్ ఎలక్ట్రికల్స్ సీఈవో రాజీనామా
బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనూజ్ పొద్దార్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30న ఆయన పదవి నుంచి వైదొలగుతారని కంపెనీ మీడియా ప్రకటనలో వెల్లడించింది.పరివర్తన కాలంలో అనూజ్ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ శేఖర్ బజాజ్ నిర్వర్తించనున్నారు. 2022 మార్చిలో మొదటిసారిగా బజాజ్ ఎలక్ట్రికల్స్‌ను నికర రుణ రహితంగా మార్చడంలో కృషి చేసిన పొద్దార్, కంపెనీని సవాలుతో కూడిన దశలో నడిపించడం, దాని కార్యకలాపాలను పునర్నిర్మించడంలో ఘనత పొందారు.పొద్దార్ నాయకత్వంలో, బజాజ్ ఎలక్ట్రికల్స్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ 'బాజాజ్'ని పునరుద్ధరించింది, 'హౌస్ ఆఫ్ బ్రాండ్స్' నిర్మాణాన్ని రూపొందించింది, 'మార్ఫీ రిచర్డ్స్' బ్రాండ్ కోసం దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఆయన పదవీకాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరిచింది."బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అలాగే గత ఐదున్నర సంవత్సరాలుగా కంపెనీ పరివర్తన, వృద్ధి ప్రయాణాన్ని రూపొందించడంలో అనుజ్ అందించిన అద్భుతమైన సహకారాన్ని గుర్తించింది" అని బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్న కాలంలో పొద్దార్ నాయకత్వాన్ని బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొనియాడారు. -
TCS: టీసీఎస్‌లో మరో పరిణామం.. వైదొలిగిన ఎస్వీపీ
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీనానాథ్ ఖోల్కర్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ అనుబంధ విభాగాలకు గ్లోబల్ హెడ్‌గా ఉన్న ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సంస్థను విడిచిపెట్టారు. ఖోల్కర్ స్థానంలో రాజీవ్ రాయ్‌ను టీసీఎస్ నియమించింది. దీనానాథ్ ఖోల్కర్ 1996లో టీసీఎస్‌లో డేటా వేర్‌హౌసింగ్, డేటా మైనింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు. తర్వాత అది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీస్‌గా మారింది. తన సుదీర్ఘ అనుభవంలో ఆయన టీసీఎస్ ఈసర్వ్ సీఈవో, ఎండీగా, బీఎఫ్ఎస్ఐ బీపీవో హెడ్‌గా ఎదిగారు. 2017-22 కాలంలో అనలిటిక్స్, ఇన్సైట్స్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. “నా కెరీర్లో పరిశ్రమలోని అద్భుతమైన నాయకులు, నిపుణులతో, అలాగే టీసీఎస్‌లో మా భాగస్వాములు, మా కస్టమర్లు, అనేక మంది సభ్యులతో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను పనిచేసిన ప్రతి బృందం ప్రత్యేకమైనది. అనేక గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది” అని దీనానాథ్ ఖోల్కర్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
ఎల్అండ్టీ చైర్మన్‌గా వైదొలిగిన ఎ.ఎం. నాయక్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.ఎం. నాయక్ లార్సెన్ & టూబ్రో (L&T) నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అధికారికంగా వైదొలిగారు. 23 బిలియన్ డాలర్ల వ్యాపార సమ్మేళనం నాయకత్వ బాధ్యతలను ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్‌కు అందించారు. 81 ఏళ్ల నాయక్ ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉంటారని, గత కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను మరింత పెంచడంపై దృష్టి సారిస్తారని ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది. దాతృత్వంతో ప్రత్యేక గుర్తింపు ఎ.ఎం. నాయక్ పారిశ్రామిక, దాతృత్వ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇండియన్ పోస్ట్ సంస్థ ఈ సందర్భంగా ఆయనపై ఒక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది. త్వరలో ప్రచురితం కానున్న ఎ.ఎం.నాయక్ జీవిత చరిత్ర పుస్తకం ‘ది మ్యాన్ హూ బిల్ట్ టుమారో’ ముఖచిత్రాన్ని ఎల్ అండ్ టీ మాజీ డైరెక్టర్లు, నాయక్ కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో అణగారిన వర్గాల విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి ఎ.ఎం.నాయక్ కృషి చేస్తున్నారు. అలాగే నిరాలీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ద్వారా రాయితీ ధరకు సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను పేదలకు అందిస్తన్నారు. గుజరాత్లో ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చిన నాయక్, 1965లో ఎల్అండ్టీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆరు దశాబ్దాలు ఆ సంస్థలో పనిచేసిన ఆయన 1999లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా, 2003లో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ బోర్డు ఆయనకు ఛైర్మన్ ఎమిరిటస్ హోదాను సైతం ప్రదానం చేసింది. -
కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా.. బండి మనసులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించడంతో బండి సంజయ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ‘మన జీవితాల్లో కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా ముగించాల్సి వస్తుంది’ అంటూ పేర్కొన్నారు. తన పదవీకాలంలో ఒకవేళ ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టి ఉన్నప్పటికీ అన్యదా భావించకుండా అందరి ఆశీస్సులను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తనది బాధాకర కథ కానందున సంతోషంగా ఉన్నానని.. తనపై దాడులు, అరెస్టుల సమయంలో నేతలంతా అండగా నిలిచి తనకు మధురానుభూతులు మిగిల్చారన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలబడ్డ బీజేపీ కార్యకర్తలందరికీ హ్యాట్సాఫ్ తెలుపుతున్నానన్నారు. సుఖదుఃఖాల్లో కార్యకర్తలంతా తన వెంట నిలిచారని... తాను సైతం ఎల్లప్పుడూ వారిలో ఒకడిగా ఉన్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. (చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?) అవకాశం ఇచ్చిన అగ్రనేతలకు ధన్యవాదాలు... తనలాంటి సాధారణ కార్యకర్తకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచి్చనందుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, శివప్రకాశ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్‌లకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక బీజేపీ ఖమ్మం టౌన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. Officially signing off as @BJP4Telangana State President 🙏 Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri… — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023 బీజేపీ పరిణామాలపై నాయకుల స్పందనలు ఇలా... ► ‘బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన జి.కిషన్‌రెడ్డికి అభినందనలు... బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బాగా పనిచేసింది. కిషన్‌రెడ్డి నేతృత్వంలో అధికారాన్ని సాధిస్తుంది’ – దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ► బండి సంజయ్ మార్పు బాధాకరమే అయినా, పార్టీ మరింత మంచి బాధ్యతను ఆయనకు అప్పగిస్తుందని భావిస్తున్నా. – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ► బండి మార్పుపై కార్యకర్తలు భావోద్వేగాలకు గురికావొద్దు. ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దు. సంజయ్‌కు పార్టీనాయకత్వం సముచిత గౌరవం కల్పిస్తుంది. – బీజేపీ నేత, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకరరెడ్డి ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి... హంపిలో జరగనున్న జీ–20 సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చివరకు ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పాటు బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్కడకు వెళ్లినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...దానిపై ఆయన మీడియాతో ఎలాంటి కామెంట్ చేసేందుకు ఇష్టపడలేదు. రెండు మూడు చోట్ల ఆయన స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా మౌనమే సమాధానమైంది. బండి ఛాంబర్ ఖాళీ...ఆఫీస్ కారు అప్పగింత... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తనకు అందిన ఫార్చునర్ వాహనాన్ని పార్టీ కార్యాలయా నికి బండి సంజయ్ తిప్పి పంపించారు. అదే విధంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడి చాంబర్‌ను ఖాళీ చేశారు. బండి అవినీతిపై విచారణ జరపాలి.. పోలీసులకు కరీంనగర్ కార్పొరేటర్ ఫిర్యాదు కరీంనగర్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌పై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్‌సింగ్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమల్జిత్కౌర్ సోహన్‌సింగ్ మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్ పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పారని.. ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ‘బీజేపీకి బీసీలు గుణపాఠం చెబుతారు’ కాచిగూడ (హైదరాబాద్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలహీన వర్గాలను బలిచేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకీ బలహీన వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు. ఆయా మంగళవారం కాచిగూడలోని మహాసభ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. (చదవండి: కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు: ఈటల) -
అమూల్ ఎండీగా సోధి రాజీనామా
సాక్షి,ముంబై: అమూల్ బ్రాండ్‌తో తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రూపిందర్ సింగ్ సోధి సోధి సోమవారం రాజీనామా చేశారు. గతంలో గుజరాత్లో మాత్రమే పరిమితమైన అమూల్ సోధి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర , రాజస్థాన్ నుండి పాల సహకార సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చారు. అమూల్ కోసం 50కి పైగా కొత్త ఉత్పత్తులను పరిచయం చేసిన విజయవంతమయ్యారు. సోమవారం (జనవరి 9) జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల సర్వీసు తర్వాత ఆయన ఈ పదవిని వీడారు. గత రెండేళ్లుగా ఎక్స్టెన్షన్ మీద ఉన్నాననీ, తన రాజీనామాను బోర్డు ఆమోదించిందని సోధి ప్రకటించారు. ప్రస్తుత ఆపరేటింగ్ ఆఫీసర్ జయన్ మెహతాకు తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇండియన్ డారీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అయిన సోధి 2010. జూన్ నుండి అమూల్ ఎండీగా పని చేస్తున్నారు. 1982లో అమూల్‌లో సీనియర్ సేల్స్ ఆఫీసర్‌గా చేరాడు. 2000 నుండి 2004 మధ్య, అమూల్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా పనిచేసిన , ఆతరువాత జూన్ 2010లో ఎండీగా ప్రమోట్ అయ్యారు. -
సంచలనం రేపుతున్న ఎన్ఎస్డీసీ ఛైర్మన్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజన్సీ చీఫ్ పదవికి ఎస్ రామదొరై (71) రాజీనామా చేశారు. అనారోగ్యకారణాల రీత్యా ఆయన సంస్థ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త నియామకం చేపట్టేంతవరకు స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఆంట్ర పెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ గవర్నింగ్ బాడీ మరియు సెక్రటరీ, వైస్ చైర్మన్ రోహిత్ నందన్ ఛైర్మన్ పదిలో కొనసాగనున్నారు. దీంతోపాటు దొరై రాజీనామాతో భవిష్యత్తుల రోడ్ మ్యాప్ పై చర్చించడానికి రేపు ఎన్ఎస్డీసీ సమావేశం కానుంది. ఒకవైపు టాటా రచ్చెకెక్కిన బోర్డ్ రూం వ్యవహారంలో విమర్శలు కొనసాగుతుండగానే, మరోవైపు ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్న టాటా గ్రూపు మాజీ అధికారి రాజీనామా అంశం సంచలనంగా మారింది. మరోవైపు కొత్త చైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాను ప్రధాన మంత్రి అంగీకరించారని తెలిపాయి. అయితే ఈ రాజీనామా వార్తలపై దొరై ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా యూపీఏ ప్రభుత్వం నియమించిన ఎన్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో దిలీప్ చెనోయ్, సీఓఓ అతుల్ భట్నాగర్ గతేడాది రాజీనామా చేశారు. కేబినెట్ హోదాలో మే 2013 లో దొరై ఎన్ఎస్డీసీ చైర్మన్ గా నిమితులయ్యారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాజీ వైస్ చైర్మన్ గా ఆయన టాటా గ్రూపునకు సేవలందించారు. గతంలో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ ఎన్ఎస్డీసీ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కెప్టెన్సీకి బెయిలీ గుడ్ బై
మెల్బోర్న్: ఆస్ట్రేలియా టి-20 జట్టు కెప్టెన్ పదవి నుంచి జార్జి బెయిలీ వైదొలిగాడు. టెస్టు కెరీర్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెయిలీ చెప్పాడు. 2012లో కెప్టెన్‌గా నియమితుడైన బెయిలీ 27 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. బెయిలీ రాజీనామాను క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 2016లో జరిగే ప్రపంచ కప్‌కు జట్టును పటిష్టం చేయడంపై దృష్టిసారిస్తోంది. ఆసీస్ పొట్టి ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సివుంది. బెయిలీ స్థానంలో అరోన్ ఫించ్‌ను నియమించే అవకాశముంది.