బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనూజ్ పొద్దార్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30న ఆయన పదవి నుంచి వైదొలగుతారని కంపెనీ మీడియా ప్రకటనలో వెల్లడించింది.
పరివర్తన కాలంలో అనూజ్ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ శేఖర్ బజాజ్ నిర్వర్తించనున్నారు. 2022 మార్చిలో మొదటిసారిగా బజాజ్ ఎలక్ట్రికల్స్‌ను నికర రుణ రహితంగా మార్చడంలో కృషి చేసిన పొద్దార్, కంపెనీని సవాలుతో కూడిన దశలో నడిపించడం, దాని కార్యకలాపాలను పునర్నిర్మించడంలో ఘనత పొందారు.
పొద్దార్ నాయకత్వంలో, బజాజ్ ఎలక్ట్రికల్స్ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ 'బాజాజ్'ని పునరుద్ధరించింది, 'హౌస్ ఆఫ్ బ్రాండ్స్' నిర్మాణాన్ని రూపొందించింది, 'మార్ఫీ రిచర్డ్స్' బ్రాండ్ కోసం దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఆయన పదవీకాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరిచింది.
"బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అలాగే గత ఐదున్నర సంవత్సరాలుగా కంపెనీ పరివర్తన, వృద్ధి ప్రయాణాన్ని రూపొందించడంలో అనుజ్ అందించిన అద్భుతమైన సహకారాన్ని గుర్తించింది" అని బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్న కాలంలో పొద్దార్ నాయకత్వాన్ని బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment