resign
-
జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు.. సుప్రీం కోర్టు సీరియస్
న్యూఢిల్లీ: ఆయనొక న్యాయమూర్తి. హోలీ పండుగ కోసం కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లారు. సరిగ్గా అదే టైంలో ఆయన అధికారిక బంగ్లాలో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పుతున్న టైంలో ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. ఆయనపై బదిలీ వేటు వేసింది!.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yaswant Varma) ఇంట నోట్ల కట్టలు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీం కోర్టు కొలిజీయం(Supreme Court Collegium) ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన జస్టిస్ వర్మ ఇంట్లో లేని టైంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు ఆర్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీం కోర్టు దృష్టికి విషయాన్ని చేరవేశారు. అయితే ఆ కరెన్సీ విలువ ఎంత అనేది మాత్రం బయటపెట్టలేదు.జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందనే సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో.. ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకుంటే అంతర్గత దర్యాప్తునకు ఆదేశించి.. అటుపై పార్లమెంట్ ద్వారా ఆయన్ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు.యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.తొలగింపు ఎలాగంటే..అవినీతి, అవకతవకలకు పాల్పడే న్యాయమూర్తుల విషయంలో చర్యల కోసం 1999లో సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. తొలుత భార త ప్రధాన న్యాయమూర్తి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు న్యాయమూర్తి నుంచి వివరణ కోరాల్సి ఉంటుంది. ఆ వివరణతో సంతృప్తి చెందితే ఫర్వాలేదు. అలాకాని పక్షంలో ఒక కమిటీ వేసి అంతర్గత దర్యాప్తునకు సీజేఐ ఆదేశించొచ్చు. ఈ కమిటీలో ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు జడ్జిలు ఉంటారు.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. సదరు న్యాయమూర్తిని రాజీనామా చేయమని చీఫ్ జస్టిస్ కోరవచ్చు. అప్పుడు ఆ జడ్జి రాజీనామా చేస్తే ఫర్వాలేదు. ఒకవేళ చేయని పక్షంలో.. ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సదరు జడ్జిని తొలగించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. -
కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ
టొరంటో: కెనడా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా గతంలో సేవలందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్నీను కెనడా ప్రధానమంత్రి పీఠం వరించింది. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తానని జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో పాలక లిబిరల్ పార్టీ నూతన సారథి కోసం ఎన్నికలు నిర్వహించగా కార్నీ ఘన విజయం సాధించారు. దాంతో తదుపరి ప్రధానమంత్రిగా 59 ఏళ్ల కార్నీ త్వరలో బాధ్యతల స్వీకరించనున్నారు. ట్రంప్ సారథ్యంలోని అమెరికాతో కెనడా వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ కెనడా ప్రధాని పగ్గాలు కార్నీ చేపడుతుండటం గమనార్హం. ఆదివారం లిబరల్ పార్టీ సారథ్యం కోసం జరిగిన ఓటింగ్‌లో కార్నీ 1,31,674 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లలో ఏకంగా 85.9 శాతం ఓట్లు కార్నీ కొల్లగొట్టడం విశేషం. గతంలో మహిళా ఉపప్రధానిగా సేవలందించిన క్రిస్టినా ఫ్రీలాండ్ రెండోస్థానంలో సరిపెట్టుకున్నారు. ఈమెకు కేవలం 11,134 ఓట్లు పడ్డాయి. అంటే మొత్తం ఓట్లలో కేవలం 8 శాతం ఓట్లు ఈమెకు దక్కాయి. గవర్నమెంట్ హౌస్ లీడర్ కరీనా గౌల్డ్(4,785 ఓట్లు) మూడో స్థానంతో, వ్యాపా ర అనుభవం ఉన్న నేత ఫ్రాంక్ బేలిస్(4,038) నాలుగో స్థానంతో సరిపెట్టు కున్నారు. మొత్తం 1,51,000 మందికిపైగా పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.పదవీ స్వీకారం ఎప్పుడు ?పార్టీ ఎన్నికల్లో గెలిచినా వెంటనే కార్నీ ప్రధాని పీఠంపై కూర్చోవడం కుదరదు. ట్రూడో ప్రధానిగా రాజీనామా చేసి గవర్నర్ జనరల్‌కు సమర్పించాలి. కెనడా ఒకప్పుడు బ్రిటన్ వలసరాజ్యం కావడంతో ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్–3 సమ్మతితో గవర్నర్ జనరల్.. కార్నీతో నూతన ప్రధానిగా ప్రమాణంచేయిస్తారు. అయితే అక్టోబర్ 20వ తేదీలోపు కెనడాలో సాధారణ ఎన్నికలు చేపట్టాల్సిఉంది. అందుకే కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికలకు పిలుపిచ్చే వీలుంది.ట్రంప్‌ను నిలువరిద్దాంపార్టీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక వందలాది మంది మద్దతుదారులనుద్దేశించి కార్నీ ప్రసంగించారు. అమెరికా దిగు మతి టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ ఇకపై ఏమాత్రం నమ్మలేని దేశం(అమెరికా) మనకు గడ్డు పరిస్థితు లను తీసుకొచ్చింది. అయినాసరే మనం ఈ పరిస్థితిని దీటుగా ఎదుర్కోగలం. అమెరికా దిగుమతి టారిఫ్‌లకు దీటుగా మనం కూడా టారిఫ్‌లు విధిస్తాం. మమ్మల్ని అమెరికా గౌరవించేదాకా ఇవి కొనసాగుతాయి. అమెరికన్లు మా సహ జవనరులు, భూములు, నీళ్లు, ఏకంగా మా దేశాన్నే కోరుకుంటున్నారు. ఏ రూపంలోనూ కెనడా ఎప్పటికీ అమెరికాలో భాగం కాబోదు. ట్రంప్ గెలవకుండా నిలువరిద్దాం’’ అని వందలాది మంది మద్దతుదారులను ద్దేశించి కార్నీ ప్రసంగించారు.బ్యాంకర్ పొలిటీషియన్కెనడా, బ్రిటన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌లకు సారథ్యం వహించి అపార బ్యాంకింగ్ అనుభవం గడించిన మార్క్ కార్నీ ఇప్పుడు కెనడా ప్రధానిగా కొత్త పాత్ర పోషించనున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ హోదాలో 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి కెనడాను గట్టెక్కేలాచేసి శెభాష్ అనిపించుకున్నారు. వలసలు, అధికమైన ఆహార, ఇళ్ల ధరలతో ప్రస్తుతం కెనడా సతమవుతున్న వేళ ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేప డంతో కార్నీ తన బ్యాంకింగ్ అనుభవాన్ని పరిపాలనా దక్షతగా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.హార్వర్డ్‌లో ఉన్నత విద్య: 1965 మార్చి 16వ తేదీన వాయవ్య కెనడాలోని ఫోర్ట్‌స్మిత్ పట్టణంలో కార్నీ జన్మించారు. తర్వాత ఆల్బెర్టా రాష్ట్రంలోని ఎడ్మోంటెన్‌లో పెరిగారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 1988లో ఉన్నతవిద్య పూర్తిచేశారు. ఈయనకు ఐస్ హాకీ అంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో ఐస్హాకీ బాగా ఆడేవారు. తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త డయానా ఫాక్స్‌ను పెళ్లాడారు. వీళ్లకు నలుగురు కుమార్తెలు. కెనడా పౌరసత్వంతోపాటు ఈయనకు ఐరిష్, బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌కు గవర్నర్‌గా పనిచేసినకాలంలో తొలిసారిగా బ్రిటన్ పాస్‌పోర్ట్ సంపాదించారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో దశాబ్దానికిపైగా పనిచేశారు. లండన్, టోక్యో, న్యూయార్క్, టొరంటోలో పనిచేశారు. తర్వాత 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడాలో డిప్యూటీ గవర్నర్‌గా పనిచేశారు.3 శతాబ్దాల్లో తొలిసారిగా: 2013 నుంచి ఏడేళ్లపాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా సేవలందించారు. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను స్థాపించగా గత 300 సంవత్సరాల్లో ఆ బ్యాంక్‌కు గవర్నర్‌గా ఎన్నికైన తొలి బ్రిటీషేతర వ్యక్తిగా 2013లో కార్నీ చరిత్ర సృష్టించారు. బ్రెగ్జిట్ వేళ బ్రిటన్ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాంకర్‌గా కార్నీ సమర్థవంత పాత్ర పోషించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను వీడాక ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దౌత్యవేత్తగా సేవలందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
సాక్షి, అమరావతి: ‘మీ ఒత్తిడితోనే యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు రాజీనామా చేశారు.. ఆధారాలు ఇవిగో.. ఏమాత్రం నిజాయితీ ఉన్నా న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాజీనామా లేఖను ట్యాగ్ చేస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.. నారా లోకేశ్ ఆదేశాలతో చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేశ్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు’ అంటూ వైఎస్సార్సీపీ ఎత్తి చూపింది. ‘వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారని మంత్రి నారా లోకేశ్‌ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని లోకేశ్ బుకాయించారు. ‘ఇదిగో.. ఇప్పుడు నారా లోకేశ్ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతున్నాం. ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయమై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని, న్యాయం గెలుస్తుందని స్పష్టం చేసింది. -
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు బీరెన్ సింగ్ సమర్పించారు. మణిపూర్ అల్లల్లు. రెండు జాతుల మధ్య రేగిన వైరం. ఎంతటి హింసకు దారి తీసిందో అంతా చూశాం. ఇప్పటికీ ఇదే విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కుకీ, మైతేయ్ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే, ఈ అల్లర్ల వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో ఇటీవల బీరేన్ సింగ్.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం, కొద్ది సేపటి క్రితం బీరేన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనా చేశారు. -
ట్రంప్ వార్నింగ్.. ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు క్యూ
వాషింగ్టన్ : ‘ఇంటి నుంచి పనిచేయడం కాదు. ఆఫీస్‌కు వస్తారా? ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా?. ఆఫీసుకు వచ్చి పని చేయండి. లేదంటే ఫిబ్రవరి 6 తారీఖులోపు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన ఉద్యోగులకు బైఅవుట్ చెల్లిస్తాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) 20లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు (US federal workers) అల్టిమేట్టం జారీ చేశారు. దీంతో ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ గడువు ముగియనున్న తరుణంలో వేలాది మంది ఉద్యోగులు రాజీనామా చేసేందుకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది.అమెరికాలో 2.3 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు 40వేల మంది తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా (resign) చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వారందరూ ట్రంప్ ఇచ్చే బైఅవుట్ ప్యాకేజీకి సిద్ధపడి రాజీనామా చేసినట్లు వాషింస్టన్ పోస్ట్ తెలిపింది. వైట్ హౌస్ వర్గాలు సైతం ధృవీకరించినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వృథా ఖర్చులను తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డోజ్ బాధ్యతల్ని బిలియనీర్ ఎలాన్‌మస్క్‌కు బాధ్యతల్ని అప్పగించారు. అయితే, అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డోజ్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలు జారీచేస్తూ వస్తున్నారు.ఇందులో భాగంగా అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కారు బైఅవుట్‌ను ప్రకటించింది.కొవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పని చేస్తున్నారు. తాజాగా వారు వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది.ఆఫీస్‌కు రావాలనుకుంటే రావొచ్చు. వద్దనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి ఒక ఈ-మెయిల్ 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పంపింది. అందులో ఫిబ్రవరి 6లోపు స్వచ్ఛందంగా ఉద్యోగాలు రాజీనామా చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లు వివరించారు.దీంతో ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేశారు. మరికొందరు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు.👉చదవండి : సంకెళ్లతో భారత వలసదారులు.. స్పందించిన కేంద్రం -
Delhi Elections: ఆప్‌కు భారీ షాక్..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపధ్యంలో రాజధానిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది.కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. టికెట్లు దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎనిమిదిమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే, దళిత నేత రోహిత్ కుమార్, పాలం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ జూన్ ఉన్నారు.వీరంతా తమ రాజీనామా పత్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)తో పాటు అరవింద్ కేజ్రీవాల్‌పై పలు ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు ఇవ్వలేదు. ఇంతవరకూ మౌనం వహించినవారంతా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన రోహిత్ కుమార్ మెహ్రోలియా తన రాజీనామా పత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘వారికి బాబా సాహెబ్ ఫొటో మాత్రమే కావాలి. ఆయన ఆలోచనలు కాదు. అలాంటి అవకాశవాద, కృత్రిమ వ్యక్తులతో నా సంబంధాన్ని ముగించుకుంటున్నాను’ అని రాశారు.ఇదేవిధంగా ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం(Membership)తో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో చిక్కుకుంది’ అని పేర్కొంటూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని, కానీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడం బాధాకరంగా ఉందని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.పాలం ఎమ్మెల్యే భావన గౌర్ తన రాజీనామాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా రాశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ సిద్ధాంతం నుండి వైదొలిగిందని’పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలలో ఇటువంటి ఆరోపణలు చేశారు.ఇది కూడా చదవండి: మరొకరిని బలిగొన్న పూణె వైరస్ -
కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా
టొరంటో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(53) ప్రధాని పదవికి, అధికార లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా పదవిలో కొనసాగుతానన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా, తొమ్మిదేళ్ల పాలన అనంతరం నాయకత్వ మారి్పడి కోరుతూ అధికార పారీ్టలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. ‘పార్టీ నేత, ప్రధాని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్త ఎంపిక ప్రక్రియలో తదుపరి నేత ఎన్నికయ్యే వరకు ప్రధానిగా కొనసాగుతాను’ అని ట్రూడో మీడియా సమావేశంలో ప్రకటించారు. పారీ్టలో అంతర్గత కుమ్ములాటలున్నాయని బహిరంగంగానే అంగీకరించారు. ‘‘రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నేతను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితులుండగా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నేను ఉత్తమ ఎంపిక కాలేననే విషయం స్పష్టమైంది. అందుకే బరి నుంచి తప్పు కోవాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘నేను పోరాటయోధుడిని. కెనడా కోసం పోరాడేందుకు నా శరీరంలో అణువణువూ సిద్ధమే. కానీ ఎంతగా కృషి చేస్తున్నా కొంతకాలంగా పార్లమెంట్ సజావుగా సాగడం లేదు. అందుకే పార్లమెంట్ సమావేశాలను కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్ జనరల్‌కు తెలిపా. అందుకామె అంగీకరిస్తూ సమావేశాలను జనవరి 27 నుంచి మార్చి 24కు వాయిదా వేశారు’’ అని వివరించారు. ఆలోగా కొత్త నేతను ఎంపిక చేసుకునేందుకు అధికార పారీ్టకి వీలు చిక్కుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ప్రజాదరణలో అధికార లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ ఎంతో మెరుగ్గా ఉంది. ఈ దశలో ట్రూడో రాజీనామా ప్రకటనతో అధికార పారీ్టకి సరైన దిశానిర్దేశం చేసే నేత కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. జనవరి 27వ తేదీన పార్లమెంట్ సమావేశాలు మొదలైతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మూడు ప్రతిపక్ష పారీ్టలు ప్రకటించడం గమనార్హం. దీనిని తప్పించుకునేందుకే ట్రూడో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయించినట్లు చెబుతున్నారు. పదేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ముగింపు పలుకుతూ లిబరల్ పార్టీ నేతగా ఉన్న ట్రూడో 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి పియెర్రె గతంలో రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసి, మంచి పేరు సంపాదించుకున్నారు. ట్రూడో పాలన మొదట్లో బాగుందనిపించినా రాన్రానూ ఆయన ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ వచి్చంది. ఆహారం, ధరలు ఆకాశాన్నంటడం, వలసలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. అంతకుముందు హౌసింగ్ మంత్రి వైదొలిగారు. ట్రూడో రాజీనామా చేయాలంటూ బాహాటంగానే కొందరు నేతలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఇవి కూడా ట్రూడో తాజా నిర్ణయానికి బలమైన కారణాలుగా ఉన్నాయి. -
రాజీనామా చేయనున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో?
ఒట్టావా: కెనడా (canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళో, రేపో అధికార లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రూడ్ ఇప్పటి వరకు తన భవిష్యత్ కార్యచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బుధవారం జరిగే కీలక జాతీయ కాకస్ సమావేశానికి ముందు ట్రూడో తన పదవికి రాజీనామా చేయొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని (Canadian Prime Minister) బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ట్రూడో రాజీనామాకు గల కారణాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో అధికార లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోనుందంటూ పలు సర్వేలు స్పష్టం చేశాయి. దీనికి తోడు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై కవ్వింపు చర్యలకు దిగారు.ఇటీవల, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా అవతరించడం గొప్ప ఆలోచనని వ్యాఖ్యానించారు. కెనడాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా చాలా మంది కెనడియన్లు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై ట్రూడోతో ప్రస్తావించారు. కానీ ట్రూడో మాత్రం ట్రంప్‌కు ధీటుగా బదులివ్వలేకపోయారు. ఈ వరుస పరిణామాలు ట్రూడో ఉక్కిరిబిక్కిరి అయ్యారని, ఫలితంగా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారంటూ వెలుగులోకి వచ్చిన కెనడా మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. రాజీనామా అనంతరం ట్రూడో తక్షణమే ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటారా? లేదంటే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ట్రూడో రాజీనామా చేస్తే .. ప్రస్తుత ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్తో తాత్కాలిక నాయకుడిగా, ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం. -
Christopher Wray : ‘ట్రంప్ రాకముందే నేనే రాజీనామా చేస్తా’
వాషింగ్టన్ : అమెరికా శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఆ లోపే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ప్రకటించారు. క్రిస్టోఫర్ నిర్ణయంపై ‘గ్రేట్ డే ఫర్ అమెరికా’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు.‘కొంత కాలంగా సుదీర్ఘంగా సాగిన ఆలోచలన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వ పాలన ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తా. ఆపై వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని క్రిస్టోఫర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల పదవీకాలంలో ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా క్రిస్టోఫర్‌కి మరో మూడేళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ రాకముందే పదవి నుంచి పక్కకి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.2017లో 38,000 మంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్‌కు అధిపతిగా క్రిస్టోఫర్ని ట్రంప్ నియమించారు. ఆ తర్వాత అమెరికాలో జరిగిన వరుస పరిణామల నేపథ్యంలో ట్రంప్‌పై క్రిస్టోఫర్ చర్యలు తీసుకున్నారు. తాజా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ నిర్ణయంపై ట్రంప్ స్పందించారు.క్రిస్టోఫర్ రాజీనామా అమెరికాకు గొప్ప రోజు. క్రిస్టోఫర్ వ్రే నాయకత్వంలో ఎఫ్‌బీఐ ఎలాంటి కారణాలు లేకుండా నా ఇంటిపై అక్రమంగా దాడి చేసింది. చట్టవిరుద్ధంగా అభిశంసన, నేరారోపణలు చేయడంలో శ్రద్ధగా పనిచేసింది. అమెరికా విజయం, భవిష్యత్తుకు అంతరాయం కలిగించడానికి చేయాల్సిన వన్సీ చేసింది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లోని పోస్ట్‌లో పేర్కొన్నారు. 🇺🇸Trump Nominates Cash Patel For FBI Director.😎 pic.twitter.com/f8d6I4l6gE— S p r i n t e r (@SprinterFamily) November 14, 2024తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా తన సన్నిహితుడు కాష్ పటేల్‌ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ‘తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు చేపడతారని గర్వంగా ప్రకటిస్తున్నా. కాష్ ఎంతో తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అవినీతిపై పోరాటం, దేశ ప్రజల రక్షణ కోసం తన కెరీర్లో ఎక్కువ కాలం వెచ్చించిన పోరాటయోధుడు’ అని ప్రశంసించారు. 44 ఏండ్ల పటేల్ 2017లో ట్రంప్ హయాంలో యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. -
దక్షిణ కొరియాలో పొలిటికల్ ట్విస్ట్.. కీలక మంత్రి రాజీనామా
సియోల్: దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక, దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అనంతరం, అధ్యక్షుడు.. కిమ్ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్‌ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై ఆ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు. -
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. తదుపరి మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. షిండే రాజీనామా కీలకంగా మారింది. మరోవైపు నేటితో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి.శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా మరోవైపు శాసన సభ ప్రాంగణంలో ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన 10 మంది, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)కి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుందనే అంశాలపై నేడు స్పష్టత లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫడ్నవీస్‌కే ఎక్కువ అవకాశం..బుధవారం కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పలు రకాల ఊహగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ, మహాయుతి కూటమి అత్య«ధిక స్థానాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన, ముఖ్యమంత్రిగా అయిదేళ్ల అనుభవమున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవినివ్వాలని బీజేపీ నేతలు కోరుతుండగా మరోవైపు శివసేన (షిండే) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగింది. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి, చూపిన ప్రభావం వల్లే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మహాయుతి కూటమి రికార్డు స్థాయి స్థానాలను కైవసం చేసుకుందని శివసేన నేతలు చెబుతున్నారు. కాగా సీఎం పదవిరేసుకు ఏక్నాథ్ షిండే పేరును పరిశీలించే పక్షంలో అజిత్ పవార్ పేరును కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ అధిష్ఠానంతో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు చర్చల అనంతరం స్పష్టం కానుందని చెప్పవచ్చు. కాగా ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్టయితే దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం (జేఎంఎం) 34 సీట్లు గెలుచుకుంది. ఇంతలో ఒక విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చీఫ్ సుదేష్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్‌యూ పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ పార్టీ జార్ఖండ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఈ విజయం సాధించింది. ఈ ఒక్క సీటు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నిర్మల్ మహతో కూడా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ చీఫ్ సుదేష్ మహతోకు లేఖ పంపానని అన్నారు.తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానన్నారు. తద్వారా సుదేష్ మహతో ఇక్కడ(మండూ) జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్‌యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఈ పార్టీ కేవలం మండూ సీటును మాత్రమే గెలుచుకుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లు పుంజుకునే చాన్స్ -
రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఆధ్వర్యంలోని రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వ్యవహరిస్తున్న దర్శన్ మెహతా ఆ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రిలయన్స్ బ్రాండ్స్ వ్యాపారంలో భాగమైన ఆయన రిలయన్స్ గ్రూప్‌లో మెంటార్‌గా ఉండబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.తదుపరి తరం నాయకులకు మెహతా మార్గదర్శకత్వం వహిస్తారని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ గ్రూప్‌లో వ్యాపార అవకాశాలను విశ్లేషించడానికి, కొత్త వాటిని అన్వేషించడానికి కూడా ఆయన సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపింది. మెహతా రిలయన్స్ బ్రాండ్స్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. రిలయన్స్ బ్రాండ్స్ మొదటి ఉద్యోగుల్లో మెహతా కీలక వ్యక్తిగా ఉన్నారు. 2007లో రిలయన్స్ బ్రాండ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంస్థలోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన అరవింద్ బ్రాండ్స్ వంటి కంపెనీల్లో పని చేశారు. విలాసవంతమైన, ప్రీమియం విభాగాల్లో రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మెహతా కృషి చేశారు.ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్గడిచిన కొన్నేళ్లుగా రిలయన్స్ బ్రాండ్స్ అనేక గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. బాలెన్సియాగా, జిమ్మీ చూ, బొట్టెగా వెనెటాతో సహా 90 కంటే ఎక్కువ బ్రాండ్లు రిలయన్స్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ స్వదేశీ డిజైనర్ బ్రాండ్లను కూడా పరిచయం చేస్తోంది. మెహతా అనంతరం రిలయన్స్ బ్రాండ్‌కు కొత్త ఎండీని నియమించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి రిలయన్స్ బ్రాండ్లను పర్యవేక్షిస్తూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్న వికాస్ టాండన్, దినేష్ తలూజా, ప్రతీక్ మాథుర్, సుమీత్ యాదవ్‌లతో కోర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
-
ఆప్ పార్టీకి, మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు విమర్శలు చేస్తూ, ఒక ప్రకటిన విడుదల చేశారు.కైలాష్ ఆ పకటనలో పార్టీలో పలు వింత వివాదాల ఉన్నాయని, అవి అందరినీ పలు సందేహాలకు గురిచేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఆప్ నుండి విడిపోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని, అందుకే తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.కేంద్రంతో పోరాడడం వల్ల సమయం వృధా అని కైలాష్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతోందని, కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయామన్నారు. యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని, అది నేడు అత్యంత కలుషితంగా మారిందన్నారు. ఢిల్లీలో ని సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. Delhi Minister and AAP leader Kailash Gahlot resigned from primary membership of Aam Aadmi Party; writes to party national convenor Arvind Kejriwal.The letter reads, "There are many embarrassing and awkward controversies like the 'Sheeshmahal', which are now making everyone… https://t.co/NVhTjXl1c2 pic.twitter.com/wVU7dSesBa— ANI (@ANI) November 17, 2024ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కైలాష్ గెహ్లాట్‌ను ఈడీ విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడైన విజయ్ నాయర్ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారిక నివాసంలో నివసించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కాగా కైలాష్ గెహ్లాట్ రాజీనామా తర్వాత బీజేపీ నేత కపిల్ మిశ్రా ఒక ప్రకటన చేశారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా లేఖతో పలు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని గెహ్లాట్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాశారన్నారు. కైలాష్ గెహ్లాట్ తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినదని కపిల్ మిశ్రా అన్నారు. -
శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ రాజీనామా
చండీగఢ్: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి, పంజాబ్ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్ ఎస్ చీమా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘శిరోమణి అకాలీదళ్ అధక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించారని, పార్టీకి కొత్త అధ్యక్షుడిని అందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు తన నాయకత్వంపై విశ్వాసం ఉంచినందుకు, తనకు మద్దతు, సహాకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్బీర్ సింగ్ బాదల్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చారు. చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుం. కాగా అకాలీదళ్ అధ్యక్ష పదవి, ఆఫీస్ బేరర్లు, కార్యవర్గానికి డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. -
ఆఫీస్‌కు రండి.. లేదా కంపెనీ మారండి!
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అమెజాన్ ఇకపై పూర్తిగా ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జనవరి, 2025 నుంచి వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సీఈఓ మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. కంపెనీ వృద్ధి కోసం విభిన్న ఆలోచనలు పంచుకునేందుకు ఉద్యోగుల వ్యక్తిగత సహకారం అవసరమని తెలిపారు.పదిలో తొమ్మిది మంది ఓకేఈ సందర్భంగా గార్మాన్ మాట్లాడుతూ..‘కంపెనీ వృద్ధికి ఉద్యోగులు సహకరించాలి. ఇప్పటి వరకు చాలామంది ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఈ విధానం మారనుంది. 2025, జనవరి నుంచి ఉద్యోగులు పూర్తిగా కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ చర్య సంస్థ ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నాం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఇతర సంస్థల్లో చేరవచ్చు. పూర్తి సమయం పని చేసేందుకు ఇష్టపడని ఉద్యోగుల కోసం ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించవచ్చు. చాలా మంది ఉద్యోగులు మార్పుకు మద్దతు ఇస్తున్నారు. నేను మాట్లాడిన పది మంది ఉద్యోగుల్లో తొమ్మిది మంది కంపెనీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారు’ అని గార్మాన్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు: ఆయనో మేధావి అంటూ..ఉత్పాదకత పెరుగుతున్నట్లు ఆధారాలు లేవుఇదిలాఉండగా, చాలా మంది అమెజాన్ ఉద్యోగులు కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులు కార్యాలయంలో పని చేసేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఆఫీస్‌లో పని చేయడం ద్వారా ఉత్పాదకత మెరుగవుతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవన్నారు. కార్యాలయానికి వెళితే అనవసరమైన ప్రయాణ సమయం, ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు అమెజాన్ తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని కోరింది. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయడానికి అనుమతించింది. ఈ విధానాన్ని కాదని అమెజాన్ ఐదు రోజులు ఆఫీస్‌కు రమ్మనడం తగదని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
కోల్‌కతా ఘటన: మరో 60 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా!
కోల్‌కతా: ఇటీవల కోల్‌కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్జీ ఆర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హాస్పిటల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆస్పత్రిలో డాక్టర్ల భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి ‘ఆమరణ నిరాహార దీక్ష’ చేపట్టారు. మరోవైపు.. రోజురోజుకీ జూనియర్ డాక్టర్ల నిరసనలకు సీనియర్ డాక్టర్ల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ ఘటనపై ఆందోళన చేపడుతున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా తాజాగా ఆర్జీ కర్ ఆస్పత్రికి చెందిన మరో 60 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారికి మద్దతుగా 50 మంది డాక్టర్లు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చదవండి: RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా -
క్షమించరాని తప్పు ఆర్.కృష్ణయ్య రాజీనామాపై కారుమూరి రియాక్షన్
-
సీఎం పదవికి రాజీనామా చేస్తా
-
అభయ ఘటన కేసు : సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలింది. కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి అభయ ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలో.. తప్పు చేస్తున్నా సరే ప్రభుత్వంపై అభిమానం ఉందని కొంతమందిని, అవినీతిపరుల్ని పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, అందుకు సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు అవితీని పాల్పడ్డ అధికారులకు(లేదా వైద్యులు) ప్రమోషన్లు ఇచ్చి వారికి మరింత ఉన్నత స్థానాల్ని కేటాయించడాన్ని తాను అంగీకరించబోమని’ అని సిర్కార్ చెప్పారు.అంతేకాదు అభయ కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరుగుతుందని ఆశించా. దారుణం జరిగిన నాటి నుంచి న్యాయం చేస్తారనే ఎంతో ఒపికతో ఎదురు చూశా. అది జరగలేదు. పైగా ప్రభుత్వం నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం విఫలమైంది అని దీదీకి రాసిన లేఖలో సిర్కార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీదీ ఓ సలహా ఇచ్చారు. రాజకీయం కోసం నిరసనలు చేయకుండా.. బాధితురాలికి న్యాయం చేకూరేలా.. నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో ఆర్జీకార్ అభయం ఘటనలో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీకార్ ఆస్పత్రి ఘటనలో సొంత పార్టీ నేతలే మమతా తీరును విమర్శిస్తున్నారు. అలా విమర్శించినందుకే టీఎంసీ నేత శాంతాను సేన్‌ను పార్టీ పదవి నుంచి తొలగించింది. సుఖేందు శేఖర్ సైతం తిరుగు బావుటా ఎగురవేశారు. అభయ ఘటనలో దీదీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నారు. తాజాగా, రాజ్యసభ సభ్యుడు జవహార్ సిర్కార్ రాజీనామా చేయడం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. -
రాజీనామాకు సాయం చేసే కంపెనీలు!
ఉద్యోగం మానేయాలనుకుంటే భారత్‌లో రాజీనామా పత్రం ఇచ్చి నోటీస్ పీరియడ్ పూర్తిచేస్తే సరిపోతుంది. కానీ జపాన్ దేశంలో మాత్రం రాజీనామా ఇచ్చినా కంపెనీలు దాన్ని ఆమోదించడం లేదట. దాంతో చాలామంది ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి వారికోసం జపాన్‌లో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రాజీనామా తంతును పూర్తిచేసి ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఆ కంపెనీలను ఆశ్రయిస్తున్న క్లయింట్ల సంఖ్య ఏటా పెరుగుతోంది.జపాన్‌లో సరిపడా కార్మికశక్తి లేక కంపెనీలు ఉన్న ఉద్యోగులు రాజీనామాలు ఆమోదించడం లేదు. దాంతో తమ కొలువులు వదిలివేయడం ఉద్యోగులకు సవాలుగా మారుతోంది. ఎగ్జిట్, ఆల్బాట్రాస్ వంటి కంపెనీలు కార్మికులు రాజీనామా చేయడంలో సహాయపడుతున్నాయి. ఇందుకోసం 20,000 యెన్లు(దాదాపు రూ.11,600) వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఈ కంపెనీలు తమ క్లయింట్ యజమానికి కాల్ చేసి రాజీనామాను సమర్పించి దాన్ని ఆమోదించే వరకు అవసరమయ్యే తంతును పర్యవేక్షిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న చాలా వెసులుబాట్లు అనుభవిస్తున్న వారు ఉద్యోగానికి రాజీనామా సమర్పించిన వెంటనే కొన్ని సంస్థలు వృత్తిపరంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఇబ్బందులను సైతం న్యాయబద్ధంగా పరిష్కరిస్తూ ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. 2017లో ప్రారంభమైన ఎగ్జిట్ కంపెనీ ఏటా సుమారు 10,000 మంది క్లయింట్లకు సాయం చేస్తున్నట్లు తెలిపింది.యువత ఎక్కువగా ఉన్న భారత్‌లో శ్రామికశక్తికి ప్రస్తుతం ఢోకాలేదు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన చేరిన జపాన్ వంటి దేశాల్లో యువతలేక అల్లాడిపోతున్నారు. కంపెనీల్లో పనిచేసే సరైన శ్రామికశక్తి లేక ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం పిల్లల్ని కనడానికి ప్రభుత్వం అక్కడి దంపతులకు ప్రత్యేక వెసులుబాటు అందిస్తోంది. నిరుద్యోగం, అధిక జీవన వ్యయం, మహిళల పట్ల వివక్ష తదితర సమస్యలతో అక్కడి జనాభా తగ్గిపోతోంది. వివాహం చేసుకుని సంతానాన్ని కనే వారికి జపాన్ ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా యువత నిర్ణయంలో పెద్ద మార్పు ఉండడంలేదని తెలుస్తోంది. జపాన్ 2070 నాటికి 30 శాతం మేర జనాభాను కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా కార్మికశక్తి లేక సంక్షోభంలోకి చేరే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ -
Bangladesh: హిందూ టీచర్ల బలవంతపు రాజీనామాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి, హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి పలు నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపిన వివరాల ప్రకారం ఆగష్టు 29న కొందరు విద్యార్థులు బరిషల్లోని బకర్గంజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు.ఆగస్ట్ 18న అజింపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డైలీ స్టార్ వార్తాపత్రికతో బారువా మాట్లాడుతూ 'ఆగస్టు 18కి ముందు వారు ఎప్పుడూ నా రాజీనామాను అడగలేదు. ఆ రోజు ఉదయం వారు నా కార్యాలయంలోకి చొరబడి నన్ను అవమానించారు’ అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది.కబీ నజ్రుల్ యూనివర్శిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ స్టడీస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ షంజయ్ కుమార్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను డిపార్ట్మెంట్ హెడ్ పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. -
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా
బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు భగ్గుమన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు డిమాండ్ చేశారు. సీజేఐతోపాటు ఇతర న్యాయమూర్తులు పదవి నుంచి దిగిపోవాలంటూ భారీ ఎత్తున విద్యార్ధులు ఢాకాలోని కోర్టు వద్ద గుమిగూడి నిరసనలు చేశారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్లు చేశారు.వీటికి సీజేఐ అంగీకరించారు. తన పదవికి రాజీనామా చేస్తానని ఒబైదుల్ హసన్ వెల్లడించారు. కాగా ఒబైదుల్ హసన్ గత ఏడాదిలోనే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు విధేయుడిగా ఉండేవారు. అయితే దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే సీజేఐ కూడా దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఈ నిరసనలు ఒక్కసారిగా చెలరేగాయి. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. గత ఆదివారం మరోసారి హింస చెలరేగి.. 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి. బంగ్లాదేశ్‌లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమితులయ్యారు. -
ఏడాదిలో 42 వేల మంది రాజీనామా.. కారణం చెప్పిన రిలయన్స్
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)లో ఉద్యోగులు సంఖ్య తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈఏడాది 42,052 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆర్ఐఎల్ వార్షిక నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం శ్రామికశక్తి 3,47,362గా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో 3,89,414గా ఉండేది. అయితే రాజీనామా చేసిన 42,052 మంది ఉద్యోగుల్లో 38,029 మంది రిలయన్స్ రిటైల్ నుంచే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.కంపెనీ నివేదికలోని వివరాల ప్రకారం..రిటైల్ రంగంలోని వ్యాపారానికి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత తీవ్ర అంతరాయంగా మారుతోంది. సాధారణంగా రిటైల్ రంగంలోని ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగాలు మారే రేటు) ఎక్కువగా ఉంటుంది. దాంతో రిలయన్స్ రిటైల్ నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 38,029 మంది రాజీనామా చేశారు. అందులోనూ జియోలో అత్యధికంగా ఉద్యోగం వీడారు. జియోలో 43% కాంట్రాక్ట్ ఉద్యోగులు(ఉద్యోగం రెగ్యులర్ కానివారు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్‌టైమ్ చేస్తున్నవారు, అప్రెంటిస్‌లు, ఇంటర్న్లు) ఉన్నారు. రిలయన్స్ రిటైల్‌లో పని చేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో సగానికి పైగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారేనని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: ఊహించిందే జరిగింది.. వడ్డీరేట్ల మార్పు ఎప్పుడంటే..ఇదిలాఉండగా, రిలయన్స్ గ్రూప్ ఉద్యోగుల్లో 53.9% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారని వార్షిక నివేదికలో వెల్లడించారు. అందులో 21.4% మహిళలున్నారు. అలాగే, కొత్తగా నియమితులైన వారిలో 81.8% మంది 30 ఏళ్లలోపు వారు కాగా, 24.0% మంది మహిళలు. ఉద్యోగం మానేసిన వారిలో 74.9% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే కావడం విశేషం. అందులో 22.7% మంది మహిళలు ఉన్నారు. -
కేకే రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
బజాజ్ ఎలక్ట్రికల్స్ సీఈవో రాజీనామా
బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనూజ్ పొద్దార్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30న ఆయన పదవి నుంచి వైదొలగుతారని కంపెనీ మీడియా ప్రకటనలో వెల్లడించింది.పరివర్తన కాలంలో అనూజ్ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ శేఖర్ బజాజ్ నిర్వర్తించనున్నారు. 2022 మార్చిలో మొదటిసారిగా బజాజ్ ఎలక్ట్రికల్స్‌ను నికర రుణ రహితంగా మార్చడంలో కృషి చేసిన పొద్దార్, కంపెనీని సవాలుతో కూడిన దశలో నడిపించడం, దాని కార్యకలాపాలను పునర్నిర్మించడంలో ఘనత పొందారు.పొద్దార్ నాయకత్వంలో, బజాజ్ ఎలక్ట్రికల్స్ తన ఫ్లాగ్షిప్ బ్రాండ్ 'బాజాజ్'ని పునరుద్ధరించింది, 'హౌస్ ఆఫ్ బ్రాండ్స్' నిర్మాణాన్ని రూపొందించింది, 'మార్ఫీ రిచర్డ్స్' బ్రాండ్ కోసం దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఆయన పదవీకాలంలో కంపెనీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను మెరుగుపరిచింది."బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. అలాగే గత ఐదున్నర సంవత్సరాలుగా కంపెనీ పరివర్తన, వృద్ధి ప్రయాణాన్ని రూపొందించడంలో అనుజ్ అందించిన అద్భుతమైన సహకారాన్ని గుర్తించింది" అని బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్న కాలంలో పొద్దార్ నాయకత్వాన్ని బజాజ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ శేఖర్ బజాజ్ కొనియాడారు. -
విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు
ఎచ్చెర్ల క్యాంపస్: ‘రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు. తక్షణమే రాజీనామా చేయండి..’ అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం(బీఆర్‌ఏయూ) వైస్ చాన్స్‌లర్ ఆచార్య కేఆర్ రజిని, రిజిస్ట్రార్ పి.సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ చాంబర్ ఎదుట గురువారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు.ముందుగా వీసీ వద్దకు వెళ్లి ‘ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు’ అని ప్రశ్నించారు. ‘అది మీకు అనవసరం..’ అని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ చాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ, రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ, రిజిస్ట్రార్, ఇతర అధికారులు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారు.అనంతరం ‘మీరు రాజీనామా ఎలా చెయ్యరో చూస్తాం..’ అంటూ వీసీని హెచ్చరించి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచి రాజీనామా చేయాలని వీసీకి పలుమార్లు హెచ్చరికలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఏకంగా వీసీ రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీసీని అవమానించడం అన్యాయందళిత వీసీని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అవమానించడం, బెదిరించడం అన్యాయమని యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుజాత, రెక్టార్ అడ్డయ్య, ఓఎస్డీ కావ్య జ్యోత్స్న తదితరులు తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఏర్పడిన 16 ఏళ్ల తర్వాత దళిత మహిళకు వీసీగా అవకాశం వస్తే అడ్డగోలుగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసేవారిపై జాతీయ మహిళా కమిషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.వైస్ చాన్సలర్ రజిని జనవరి 18న బాధ్యతలు చేపట్టారని, మూడేళ్లు కొనసాగుతారని స్పష్టంచేశారు. బలవంతపు రాజీనామాలు అన్యాయమని ఖండించారు. వీసీ చాంబర్ ఎదుట ఆందోళన చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చట్టపరంగా వర్సిటీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు యూనివర్సిటీలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల నిర్వహణకు సైతం ఆటంకం కలిగించారన్నారు. -
ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం.. 24 గంటల్లోనే రాజీనామా ఎందుకంటే?
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి రాయ్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక, కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్ ఎంఎన్ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.అయితే, కృష్ణ కుమారి రాయ్ రాజీనామాపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sikkim Chief Minister Prem Singh Tamang’s wife Krishna Kumari Rai resigns as MLA,a day after taking oath. pic.twitter.com/asimdk98Uh— KGFChandra (@FieldsKolar) June 13, 2024 -
టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సహకార సంఘంలో కొంత మంది కాంగ్రెస్‌లో చేరిన కారణంగానే తాను ఈ పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.ఇక, తన రాజీనామా అనంతరం రవీందర్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘ఇన్ని రోజులు నాకు అండగా ఉన్నవారికి ధన్యవాదాలు. సహకార సంఘంలో కొంత మంది ఇప్పుటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ, నేను ఇంకా ఈ పదవిలో కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నాను. 2015లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకులో డైరెక్టర్లు పార్టీలు మారారు. విశ్వాసం కోల్పోయిన చోట ఉండవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. టెస్కాబ్ చైర్మన్‌గా నేను, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవులకు రాజీనామా చేస్తున్నాం.గత తొమ్మిది సంవత్సరాలుగా సహకార వ్యవస్థలో ప్రగతి జరిగింది. రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా నేను తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నాను. తెలంగాణ సహకార వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అనుసరించాలని నీతి ఆయోగ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుకు అనేక అవార్డులు వచ్చాయి. ఈ ప్రభుత్వ విధానాలు అందరికి బాగుండేలా ఉండాలి. సహకార వ్యవస్థలో మేము రిటైర్డ్ అధికారులను పెట్టలేదు. నేను నా ఇష్టం వచ్చినట్లు ఎవరికీ పదవులు ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుకు కొద్ది రోజుల క్రితమే టెస్కాబ్ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాణం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అవిశాస్వ తీర్మాణానికి ముందే రవీందర్ రాజీనామా చేయడం విశేషం. మరోవైపు.. రవీందర్ రావును కూడా పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, రవీందర్ రావు మాజీ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో తాను పార్టీ మారలేనని చెప్పినట్టు తెలుస్తోంది. -
మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ గురించి అందరికి తెలుసు. ఈ ఫౌండేషన్‌కు కో-చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిలిండా (Melinda Gates) ఎట్టకేలకు తన పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఫౌండేషన్‌లో నా చివరి రోజు జూన్ 7 అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోలేదు. బిల్, నేను కలిసి ప్రారంభించిన ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పరిష్కరించడానికి అసాధారణ కృషి చేసాము. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను సమర్థుడైన సీఈఓ మార్క్ సుజ్మాన్, ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్.. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానని మిలిండా పేర్కొన్నారు.దాతృత్వం తదుపరి అధ్యాయంలోకి వెళ్లడానికి నాకు సరైన సమయం వచ్చింది, అందుకే రాజీనామా చేస్తున్న అంటూ మిలిండా వివరించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు మిలిండా ఈ నిర్ణయం తీసుకున్నారు.మిలిండా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా తరువాత.. ఆమె దాతృత్వ ప్రయోజనాల కోసం 12.5 బిలియన్ల డాలర్లను అందుకుంటారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను అని మిలిండా పేర్కొన్నారు.మిలిండా గేట్స్ ప్రపంచ నాయకత్వం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే బాధ్యత మమ్మల్ని ఎంతగానో ఆకర్శించాయి. ఈమె రాజీనామా నాకు కష్టమైన వార్త. నేను కూడా.. మిలిండాను ఆరాధించే వారిలో ఒకరిని. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను అని సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు.pic.twitter.com/JYIovjNYKo— Melinda French Gates (@melindagates) May 13, 2024 -
కాంగ్రెస్‌కు మరో దెబ్బ! పార్టీకి పరిశీలకుల గుడ్‌బై!
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు లోక్‌సభ స్థానాలకు పార్టీ పరిశీలకులుగా ఉన్న నీరజ్ బసోయా, నసీబ్ సింగ్‌లు కాంగ్రెస్ పార్టీని వీడతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపించారు.ఇరువురూ నేతలూ ప్రధానంగా కాంగ్రెస్ ఆప్ పొత్తును తమ రాజీనామాలకు కారణాలుగా తమ లేఖలలో పేర్కన్నారు. “ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు రోజురోజుకూ పెద్ద చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఆత్మగౌరవం ఉన్న నాయకుడిగా నేను ఇకపై పార్టీలో కొనసాగలేను" అంటూ మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి పార్టీ పరిశీలకుడు నీరజ్ బసోయా పేర్కొన్నారు.రాజీనామా చేసిన మరో మాజీ ఎమ్మెల్యే, వాయువ్య ఢిల్లీ పార్టీ పరిశీలకుడు నసీబ్ సింగ్.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవిందర్ యాదవ్ నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అరవింద్ కేజ్రీవాల్ తప్పుడు ఎజెండాపై పంజాబ్‌లో ఇప్పటివరకూ విమర్శల దాడి చేసిన దేవిందర్ యాదవ్ ఇప్పుడు ఢిల్లీలో ఆప్‌ను, ఆ పార్టీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించడం తప్పనిసరి" అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరవింద్ సింగ్ లవ్లీ ఢిల్లీ యూనిట్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మరో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. -
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్‌లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్‌కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్‌ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్‌గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్‌లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్‌ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
-
గత పదేళ్లలో కాంగ్రెస్ సాధించిందేమిటి? ఎందరు పార్టీని వీడారు?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పదేళ్ల పార్టీ లెక్కలను పరిశీలిస్తే.. 2014 నుంచి నేటివరకూ 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు 50 మందికి పైగా బడా నేతలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ నేతలంతా తాము కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ నాయకత్వం, పనితీరులో లోపమే కారణమని చెబుతున్నారు. వీరు పార్టీని వీడిన ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన పదేళ్లలో లోక్‌సభ, అసెంబ్లీతో కలిపి మొత్తం 51 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని చవిచూసింది. ఇటీవలే మిలింద్ దేవరా, గీతా కోడా, బాబా సిద్ధిఖీ, రాజేష్ మిశ్రా, అంబ్రిష్ డెర్, జగత్ బహదూర్ అన్నూ, చంద్మల్ జైన్, బసవరాజ్ పాటిల్, నరన్ రథ్వా, విజేందర్ సింగ్, సంజయ్ నిరుపమ్, గౌరవ్ వల్లభ్ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇక కాంగ్రెస్‌ను వీడిన 12 మంది మాజీ ముఖ్యమంత్రులతో పాటు బడానేతల విషయానికొస్తే ఈ జాబితాలో హిమంత బిస్వా శర్మ, చౌదరి బీరేందర్ సింగ్, రంజిత్ దేశ్‌ముఖ్, జికె వాసన్, జయంతి నటరాజన్, రీటా బహుగుణ జోషి, ఎన్ బీరెన్ సింగ్, శంకర్ సింగ్ వాఘేలా, టి. వడక్కన్, జ్యోతిరాదిత్య సింధియా, కేపీ యాదవ్, ప్రియాంక చతుర్వేది, పీసీ చాకో, స్తిన్ ప్రసాద్, జితిన్ ప్రసాద్ , లలితేష్ త్రిపాఠి, పంకజ్ మాలిక్, హరేంద్ర మాలిక్, ఇమ్రాన్ మసూద్, అదితి సింగ్, సుప్రియా అరోన్, ఆర్పీఎన్ సింగ్, అశ్విని కుమార్, రిపున్ బోరా, హార్దిక్ పటేల్, సునీల్ జాఖర్, కపిల్ సిబల్, కుల్దీప్ బిష్ణోయ్, జైవీర్ షెర్గిల్, అనిల్ ఆంటోనీ, సీఆర్ కేస్వానీ తదితరులు ఉన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ ఓటమి పాలైన ఎన్నికలు.. లోక్ సభ ఎన్నికలు: 2014, 2019 హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు: 2017 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013,2023 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2023 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: 2015, 2020 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014 సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 అసోం అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2019 నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు: 2022 మిజోరం అసెంబ్లీ ఎన్నికలు: 2018 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: 2013, 2018, 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు: 2023 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 గోవా అసెంబ్లీ ఎన్నికలు: 2017, 2022 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: 2018 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలు: 2016, 2021 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: 2022 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు: 2014, 2019 -
పైలెట్ల రాజీనామా.. విస్తారా ఎయిర్‌లైన్స్ సేవల్లో అంతరాయం
విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నేపథ్యంలో వేతనాల సవరణ అంశంపై పైలట్లు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫలింతగా విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరో 38 విస్తారా విమాన సేవలు నిలిచిపోయాయి. ముంబయి నుంచి 15, దిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమాన సర్వీసులు రద్దయినట్లు విస్తారా ప్రకటించింది. ఈ తరణంలో ఆ సంస్థకు చెందిన 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకు ముందు వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం విస్తారా పైలెట్లు శిక్షణ పొందారు. ట్రైనింగ్ తర్వాత సుమారు సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడంతో కలవరం మొదలైంది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు అందించే విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడు పైలెట్ల కొరత మరిన్ని ఇబ్బందులు గురి చేస్తోంది. -
మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న వాలంటీర్లు..
-
ప్రతిపక్షాల తీరుతో మనస్తాపం.. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
కృష్ణా: ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేసిందని తెలిపారు. తమ దగ్గర్నుంచి మొబైల్ సిమ్స్, డివైస్‌లు తీసేసుకున్నారని చెప్పారు. ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, తాము ఎవరిదగ్గర డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని అన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఉదయం నుంచి తమకు వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ప్రజలు అన్నీ చూస్తున్నారు..’ వలంటీర్ల రాజీనామా
సాక్షి, అనకాపల్లి: ఓ అక్కా.. ఓ చెల్లి.. ఓ అవ్వా.. ఓ తాతా అంటూ ఒకటో తేదీన ఉదయాన్నే తలుపు తట్టి చిరునవ్వుతో ఫించన్ అందించే పరిస్థితికి బ్రేక్ పడింది. సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టి.. ఎండనకా వాననకా, ఆఖరికి కరోనాను సైతం లెక్క చేయకుండా నాలుగన్నరేళ్లు నిర్విరామంగా విధులు నిర్వహించారు వలంటీర్లు. అలాంటి వ్యవస్థకు ఆటంకాలు కలగజేయాలని కుట్ర కార్యరూపం దాల్చింది. పెన్షన్‌దారులు మండుటెండలో మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మందికిపైగా వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా, సంక్షేమ వారధులుగా వలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు. అయితే.. ఈ నాలుగున్నరేళ్లలో వలంటీర్లను మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు.. ప్రజా సేవకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవమానాల్ని దిగమింగుకుని తమ సేవల్ని వలంటీర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు.. ఈసీ కోడ్ పేరుతో తమ విధులకు విఘాతం కలిగించడాన్ని వలంటీర్లు భరించలేకపోతున్నారు. ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో 23 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తానం గ్రామ వలంటీర్లు సాక్షితో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకునే వెళ్ళే అదృష్టం సీఎం జగన్ మాకు ఇచ్చారు. కానీ, మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా హింసించారు. పేదలకు, లబ్ధిదారులకు సేవ చేస్తుంటే.. స్లీపర్ సెల్స్ అని అపవాదు చేశారు. ఇప్పుడు ఇలా విధులకు ఆటంకాలు విధించారు. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అప్పుడే విధుల్లో చేరతాం’’ అని వలంటీర్లు శపథం చేశారు. ‘ ఏపీ ప్రజలు అన్ని చూస్తున్నారు.. మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకునే దిశగా అడుగులేస్తున్నారు’ అని వలంటీర్లు చెబుతున్నారిప్పుడు. పెందుర్తి పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగా తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లు తెలస్తోంది. -
కాంగ్రెస్ సొంత ఇల్లులాంటిది..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు కీలక నేతల నిష్క్రమణలు కొనసాగుతుండగా.. తాజాగా పార్టీ సెక్రెటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు (కేకే) కూడా అదే బాట పట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. 53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ లోనే పని చేశా. ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లినవారు ఎప్పటికైనా ఇంటికే చేరతారు. 84 ఏళ్ల వయసులో నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరతా..’ అని కేకే గురువా రం నాడిక్కడ మీడియాకు చెప్పారు. అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తో కేకే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసినట్లు సమాచారం కాగా..ఆ తర్వాత బంజారాహిల్స్ నివాసంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్లో చేరా ‘బీఆర్ఎస్లో నేను పని చేసింది పదేళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరా. కానీ కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది. నేను మొదటి సారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యస భకు ఎన్నికయ్యా. ప్రస్తుతం నేను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజే నేను కాంగ్రెస్‌లో చేరబోవడం లేదు. ఏ రోజు చేరేదీ తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతా..’ అని కేకే చెప్పారు. నేను బీఆర్ఎస్లో ఉండి చేసేదేమీ లేదు ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా ఆయనపై గౌరవం ఉంది. బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు బాగా సహకరించారు. కానీ సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశా. పీసీసీ అధ్యక్ష పదవి మొదలు కొని రాజ్యసభ వరకు నాకు కాంగ్రెస్ ఎన్నో అవకా శాలు ఇచ్చింది. ప్రస్తుతం రాజకీయ చరమాంకంలో ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేసేదేమీ లేదు. కేసీఆర్‌కు కూడా ఇదే చెప్పా. బీఆర్ఎస్కు సంబంధించిన అంశాలపై కూడా ఆయనతో మాట్లాడా. కవిత అరెస్టుతో పాటు పార్టీ అంతర్గత అంశాలపైనా చర్చ జరిగింది. కవితను అక్రమంగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని అనుకుంటున్న నా కుమారుడు విప్లవ్ నిర్ణయం మంచిదే..’ అని కేశవరావు అన్నారు. నేను మాత్రం పార్టీ మారను: విప్లవ్‌కుమార్ పార్టీ మారే విషయంలో తన తండ్రి కేశవరావు, సోదరి విజయలక్ష్మి తీసుకునే నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేకే కుమారుడు విప్లవ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై వారు స్పష్టత ఇచ్చిన తర్వాతే, దానిపై తన అభిప్రా యం వెల్లడిస్తానని చెప్పారు. తాను మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్కు గట్టి మద్దతుదారుడినని, కేసీఆర్ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వంలో విప్లవ్‌కుమార్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేయడం తెలిసిందే. కేకే నివాసానికి ఇంద్రకరణ్‌రెడ్డి కేసీఆర్‌తో భేటీ తర్వాత కేకే బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. ఇంద్రకరణ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఇంద్రకరణ్‌రెడ్డి, అరవింద్‌రెడ్డితో పాటు కేకే కుమా ర్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఈనెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మీ కుటుంబానికి ఏం తక్కువ చేశా?: కేసీఆర్ విశ్వసనీయ సమాచారం మేరకు.. కేసీఆర్‌తో జరిగిన భేటీలో బీఆర్ఎస్లో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలతో కూడిన ఓ నోట్‌ను కేకే అందజేశారు. ఈ సందర్భంగానే కేకేతో పాటు విజయలక్ష్మి పార్టీని వీడుతున్నారనే వార్తలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై కేకే వివరణ ఇస్తూ.. రాజకీయంగా ఇదే తన చివరి ప్రయాణం అని, కాంగ్రెస్‌లోనే చనిపోతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యూ ట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో కేకే వెల్లడించిన అభిప్రాయాలపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడాన్ని ప్రజలు గమనిస్తారు. మీ ఆలోచన మానుకోండి. మీ కుటుంబానికి పార్టీ తక్కువేమీ చేయలేదు. మీకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండు పర్యాయాలు రాజ్యసభకు పంపించా. మీ కుమారుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చా. మీరు కోరిన మీదటే పార్టీలో ఎంతోమంది నిబద్ధత కలిగిన వారిని పక్కన పెట్టి మరీ మీ కూతురు విజయలక్ష్మికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఇచ్చాం. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పెద్దరికంతో వ్యవహరించాల్సింది పోయి మీడియాలో నాపైనా, పార్టీ నాయకులపైనా విమర్శలు చేయడం సరికాదు..’ అంటూ కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ అర్ధంతరంగా ముగిసిందని సమాచారం. -
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
-
బీజేపీకి బిగ్ షాక్
లోక్‌సభ ఎన్నికల ముందర బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ Brijendra Singh(51) ఆదివారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. రాజీనామా ప్రకటించిన కొన్నిగంటలకే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. హర్యానా రాజకీయ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి చౌద్రీ బీరేందర్ సింగ్(77) తనయుడే ఈ బ్రిజేందర్ సింగ్. హర్యానా హిసార్ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా తన రాజీనామాను ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారాయన. I have resigned from the primary membership of BJP,due to compelling political reasons. I extend gratitude to the party, National President Sh. JP Nadda, Prime Minister Sh. Narendra Modi, & Sh Amit Shah for giving me the opportunity to serve as the Member of Parliament for Hisar. — Brijendra Singh (@BrijendraSpeaks) March 10, 2024 ఆ తర్వాత బ్రిజేందర్ సింగ్.. ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ, సైద్ధాంతిక విబేధాల వల్లే తాను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు మీడియాకు బ్రిజేందర్ తెలియజేశారు. రైతుల ఆందోళన, రెజ్లర్ల నిరసనలు.. ఇలా చాలాకారణాలు ఉన్నాయని చెప్పారాయన. అలాగే.. కాంగ్రెస్ చేరిక సంతోషాన్ని ఇస్తోందని బ్రిజేందర్ చెప్పారు. గతంలో 42 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించిన బీరేందర్ సింగ్.. 2014లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక ఆయన తనయుడైన బ్రిజేందర్ 1998లో సివిల్స్ 9వ ర్యాంకర్. ఐఏఎస్ అధికారిగా 21 ఏళ్లపాటు సొంత రాష్ట్రానికి సేవలు అందించిన బ్రిజేందర్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హిసార్ ఎంపీగా.. పార్లమెంట్లో పలు కమిటీలకు సైతం బ్రిజేందర్ పని చేశారు. తండ్రి బీరేందర్‌తో బ్రిజేందర్ జాట్ కమ్యూనిటీకి చెందిన బ్రిజేందర్ కుటుంబానికి ముందు తరాల నుంచే హర్యానా రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరి ఆయన పోటీ చేయొచ్చని తెలుస్తోంది. -
ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందర.. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆ రాజీనామాను ఆమోదించారు. అరుణ్ గోయల్ పదవీకాలం 2027 వరకు ఉండగా.. ఇంత ముందుగానే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నది తెలిసిందే. అయితే అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ కాలం పూర్తి చేసుకుని దిగిపోయారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానం భర్తీ చేసేందుకు కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈలోపు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు. తాజా రాజీనామా పరిణామంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీల భర్తీ ఓ ప్రక్రియను అనుసరించి జరుగుతుంది. సీఈసీ అండ్ ఓఈసీ యాక్ట్ Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ప్రకారం.. న్యాయ శాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ(ఇద్దరు కేంద్ర కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు) ఐదుగురు పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రధాని నేతృత్వంలోని కమిటీకి (ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీ) అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాళీ భర్తీ చేయడం కోసం ఈ కమిటీ భేటీ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రెండు ఖాళీల నేపథ్యంలో ముందుకు వెళ్తుందా? అనేది చూడాలి. గోయల్ ఎన్నికల కమిషనర్ ఎంపికనే వివాదం అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 2022 నవంబర్ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అరుణ్ గోయల్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ‘మెరుపు వేగం’తో ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంబంధిత వార్త: సీఈసీ, ఈసీ నియామకాలపై సుప్రీం అసహనం ‘ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్ గోయల్ సామర్థ్యాలను ప్రశ్నించట్లేదు. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. గోయల్ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్ మొదలుపెట్టిన రోజే అపాయింట్మెంట్ ఎలా జరిగింది. ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన న్యాయశాఖ నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే... వారిలో చిన్నవాడైన అరుణ్ గోయల్ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీం ప్రశ్నలకు అటార్నీ జనరల్ స్పందిస్తూ.. ‘‘ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదు. గతంలో కూడా 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్ నుంచే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు’’ అని బదులిచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ ఎంపికను కొట్టేయలేమని చెబుతూనే.. ఆ పిటిషన్‌ను ఆ సమయంలో రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు తీసుకోవడం గమనార్హం. -
బీజేపీకి షాక్.. ఎంపీ రాజీనామా - కారణం ఏంటంటే..
పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగక ముందే.. ఝర్‌గ్రామ్‌కు చెందిన బీజేపీ ఎంపీ 'కునార్ హెంబ్రమ్' (Kunar Hembram) తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే పార్టీకి రాజీనామా చేసినట్లు హేంబ్రామ్ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే హెంబ్రమ్ తన నిర్ణయాన్ని పార్టీకి తెలియజేశారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా కునార్ హెంబ్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం అనేక ఊహాగానాలకు దారితీసింది. అయితే తాను మరే ఇతర రాజకీయ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేత రాజీనామాపై టీఎంసీ స్పందిస్తూ.. ఓటమిని పసిగట్టి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. బీజేపీ సీటును కోల్పోతుందని ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే ఇలాంటి పరిణామాలు బీజేపీలో ముందు ముందు మరిన్ని జరుగుతాయని వెల్లడించారు. -
‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’
పెరుగుతున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో చాలా టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అందులో కొన్ని కంపెనీలు నేరుగా ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించినట్లు మెయిల్ పంపుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులనే వారి కొలువులకు రాజీనామా చేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే కంపెనీ మారాలనుకుంటున్న వారికి ఇదో అవకాశంగా ఆ కంపెనీలు చెబుతున్నాయి. ఉద్యోగుల సంఖ్యను కుదించాలని యోచిస్తున్న ఐబీఎం ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరుతోంది. కంపెనీలో పనిచేయాలని కోరుకోని వారు స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని ఐబీఎం చెబుతోంది. ఇష్టంలేని పని చేయకూడదని చెప్పింది. ఐబీఎం నుంచి బయటకు వెళ్లాలని కోరుకోని ఉద్యోగులను మాత్రం కంపెనీ తొలగించాలనుకోవడం లేదని ఓ వార్తా కథనం ద్వారా తెలిసింది. ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో ఐబీఎం ధోరణిలో మార్పు కనిపిస్తోంది. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని భావించే ఉద్యోగులు ముందుకు రావాలని ఐబీఎం కోరుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే క్రమంలో కంపెనీ చేపట్టే చర్యల్లో ఇది ఓ భాగమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఐబీఎం ఈ చర్యను రిసోర్స్ యాక్షన్‌గా అభివర్ణిస్తోంది. ఇదీ చదవండి: ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు గత నెలలో నాలుగో త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా స్వచ్ఛంద రాజీనామాల ప్రతిపాదనకు కంపెనీ ఆమోదం తెలిపింది. కంపెనీని వీడటం ఇష్టం లేని వారిని లేఆఫ్స్‌తో తొలగించడం కంటే స్వచ్ఛందంగా తప్పుకునే ఉద్దేశం ఉన్న ఉద్యోగులను గుర్తించాలని ఐబీఎం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. -
టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు. 2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది. కాగా కునాల్ ఘోష్ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. -
టీడీపీ ఎన్డీయేలో చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ రాజీనామా
-
పేటీఎంలో మరో కీలక పరిణామం..
ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్మెంట్ డిప్యూటీ ఎండీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు -
ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ నిరసనలు
ఢిల్లీ: ఆప్, బీజేపీ కార్యకర్తల హోరాహోరీ నిరసనలతో ఢిల్లీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చండీగఢ్ ఎన్నికల్లో మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నిరసన చేపట్టింది. అటు.. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ కూడా ఆందోళన నిర్వహించింది. పరిస్థితుల్ని అదుపు చేయడానికి పోలీసులు భారీ భద్రతను మోహరించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలో పాల్గొనటానికి వెళుతున్న ఆప్ వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. 25 మందికి పైగా నాయకులను సింగు సరిహద్దు వద్ద నిర్బంధించారు. వీరిలో హర్యానా ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో చేరారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ఢిల్లీ ఆప్ సర్కార్ రోజుకో స్కామ్ బయటపడుతుందని దుయ్యబట్టారు. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. భారీ స్థాయిలో జనం రావడంతో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌కు వెళ్లే అనేక రహదారుల్లో పోలీసులు బారికేడ్లు వేశారు. ఇదీ చదవండి: హేమంత్ సొరెన్‌కు అండగా నేనున్నా: మమతా బెనర్జీ -
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
చంపై సోరెన్‌ను ‘జార్ఖండ్ టైగర్’ అని ఎందుకంటారు?
చంపై సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా నిర్ణయం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా .. చంపై సోరెన్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. చంపై.. హేమంత్ సోరెన్‌కు దగ్గరి బంధువని చెబుతారు. చంపై ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉంది. చంపై సోరెన్ ‘జార్ఖండ్ టైగర్’గా పేరొందారు. చంపై సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంపై క్యాబినెట్ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు,షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీహార్ నుండి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చినప్పుడు చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై కూడా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు చంపైని ‘జార్ఖండ్ టైగర్’ అని పిలవడం ప్రారంభించారు. చంపై 2005లో తొలిసారిగా జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. సెప్టెంబర్ 2010 నుండి జనవరి 2013 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబర్, హౌసింగ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చంపై.. జూలై 2013 నుండి డిసెంబర్ 2014 వరకు ఆహార, పౌర సరఫరాలు, రవాణా కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 2014లో జార్ఖండ్ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికయ్యారు. 2019లో నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీనితో పాటు హేమంత్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్రమ భూ కుంభకోణం కేసులో చిక్కుకున్న హేమంత్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కాంగ్రెస్ కూటమి సోరెన్ ప్రభుత్వంలో శాసనసభా పక్ష నేతగా రవాణా మంత్రి చంపై సోరెన్‌ను ఎన్నుకున్నాయి. హేమంత్ సోరెన్‌కు చంపై అత్యంత సన్నిహితుడని చెబుతారు. -
అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
పాట్నా: మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటు.. బీజేపీ ఇటు జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఇదీ చదవండి: Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం! -
ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా పై కొమ్మినేని రియాక్షన్
-
బాబుకు బిగ్ షాక్..అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఔట్
-
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సీనియర్ నేత గుడ్‌బై
Milind Deora.. ముంబయి: మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు చేరిపోనున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ మండిపాటు మిలింద్ దేవరా పార్టీ నుండి వైదొలగడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డాడు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఉన్న సుధీర్ఘ బంధాన్ని పంచుకున్నారు. "మురళీ దేవరాతో నాకు సుదీర్ఘ కాలంపాటు అనుబంధం ఉంది. మేము ఎంతో అభిమానంతో ఉండేవాళ్లం. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులు ఉన్నారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది.తథాస్తు..!" అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్ -
ఏపీ మీడియా అకాడమీకి కొమ్మినేని రాజీనామా
విజయవాడ, సాక్షి: సీఆర్ ఏపీ మీడియా అకాడమీ(సీ రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ) చైర్మన్ పదవికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారాయన. తనపై నమ్మకంతో మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించి.. పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారాయన. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు.. 2022 నవంబర్ 10వ తేదీన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ 13 నెలల 15 రోజులు కాలంలో వర్కింగ్ జర్నలిస్టుల కోసం పలుకార్యక్రమాలు చేయగలగడం సంతృప్తినిచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారాయన. అయితే.. ఈ నెల 16 వరకు సంక్రాంతి నేపథ్యంలో సెలవులు ఉండడంతో.. 17 వ తేదీ నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇక సీఆర్ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ హోదాలో అందించిన సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో "జర్నలిజం లో డిప్లమో" కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేయడం తమకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయంగా చెప్పారాయన. అదేవిధంగా, డిప్లమో కోర్సు తో పాటుగా, ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టులకోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన పేర్కొన్నారు. అనంతపురం నుంచి ఉద్దానం (శ్రీకాకుళం జిల్లా) వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్టుల అభివృద్ధిని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి ప్రజలకు మీడియా ద్వారా వివరించగలిగామని ఆయన తెలిపారు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియాను కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేయగలిగామన్నారు. తమ పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులందరికీ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆ ప్రకటనలో కొమ్మినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. -
మా రాజీనామాకి చంద్రబాబే కారణం.. కేశినేని శ్వేత సంచలన నిజాలు
-
టీడీపీ కి కేశినేని నాని కుమార్తె గుడ్ బై
-
అందుకే రాజీనామా చేశా
-
టీడీపీకి మరో బిగ్ షాక్
-
కేశినేని నాని సంచలన నిర్ణయం
-
ఎయిర్ ఏషియా సీఈవో రాజీనామా.. కారణమిదే..
ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఆపరేటర్ ఎయిర్ ఏషియా బెర్హాడ్ (AirAsia Berhad) మలేషియా యూనిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియాద్ అస్మత్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ఎయిర్‌లైన్‌లో నాయకత్వంలో చెప్పుకోదగ్గ మార్పును సూచిస్తోంది. కారణమిదేనా? రియాద్ అస్మత్ 2018 జనవరిలో ఎయిర్ ఏషియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బోర్డులో సలహాదారుగా మారాలనే యోచనతో ఆయన సీఈవోగా వైదొలగడానికి సిద్ధమయ్యారు. అస్మత్ నిష్క్రమణ ప్రకటనలో గల కారణాలకు సంబంధించి నిర్దిష్ట వివరాలు లేవు. అయితే ఎయిర్ ఏషియా ఏవియేషన్ గ్రూప్ పునర్నిర్మాణ కార్యక్రమాలు, సిబ్బంది మార్పులపై రాబోయే అప్డేట్లను ఇది తెలియజేస్తోంది. బడ్జెట్ ఎయిర్‌లైన్ సెక్టార్లో ప్రముఖ సంస్థ అయిన ఎయిర్ ఏషియా ఏవియేషన్ పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్లను, రానున్న మహమ్మారి నేపథ్యంలో తలెత్తే ఒడిదుడుకులను అధిగమించడానికి ఈ సంస్థాగత మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రియాద్ అస్మత్ తన నైపుణ్యం, అనుభవాన్ని కంపెనీ కోసం మరింతగా వినియోగించేందుకు సలహాదారుగా మారుతున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. -
ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం!
సరిగ్గా వారం రోజుల్లో ఈ ఏడాది(2023) ముగియనుంది. కొత్త సంవత్సరం సోమవారంతో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎన్నో అనూహ్య పరిణామాలకు సాక్షిగా నిలిచింది. ఈ సంవత్సరంలో కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులు కనిపించాయి. 2023లో పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉదయ్ కోటక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్ణీత సమయం కంటే ముందే పదవిని వదిలిపెట్టి, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కోటక్ ఇంత హఠాత్తుగా ఎందుకు తన పదవిని విడిచిపెట్టారనే దానిపై ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే ఆయన రాజీనామా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2. రాజేష్ గోపీనాథన్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్/టీసీఎస్) దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో ఈ ఏడాది నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ మార్చిలో హఠాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు దశాబ్దాల కంపెనీ చరిత్రలో కేవలం నలుగురు సీఈవోలు మాత్రమే విధులు నిర్వహించారు. 3. వేణు నాయర్ (షాపర్స్ స్టాప్) రిటైల్ స్టోర్ చైన్ షాపర్స్ స్టాప్ సీఈఓ వేణు నాయర్ గత ఆగస్టులో రాజీనామా చేశారు. తన కుటుంబంతో సమయం గడిపేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వేణు షాపర్స్ స్టాప్‌లో చేరారు. కంపెనీని ఓమ్నిఛానల్ రిటైలర్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రాజీనామా మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఈ వార్త బయటకు వచ్చాక కంపెనీ షేర్లు 11 శాతం మేరకు పడిపోయాయి. 4. మురళీ రామకృష్ణన్ (సౌత్ ఇండియన్ బ్యాంక్) మురళీ రామకృష్ణన్ ఈ ఏడాది మార్చిలో ఇండియన్ బ్యాంక్ నుండి నిష్క్రమించారు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. 2020 జూలైలో బ్యాంక్‌లో సలహాదారుగా చేరిన రామకృష్ణన్ నాలుగు నెలల వ్యవధిలోనే ఎండీ, సీఈఓగా ఎదిగారు. 5. మాథ్యూ జాబ్ (క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్) క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ సీఈఓ మాథ్యూ జాబ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇతర కెరీర్ ప్రయోజనాలను కారణంగా చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామా కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు! -
దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అందుకు సంబంధించి బీఎస్ఈకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ పంపారు. నీలంజన్‌రాయ్ 2018 నుంచి తన పదవిలో కొనసాగారు. ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం రాయ్ మార్చి 31, 2024 వరకు ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఎగా కొనసాగుతారు. ‘ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట వృద్ధి చెందేందుకు అవకాశాలను అన్వేషించడానికి, వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీకి రాజీనామా చేశాను. నోటీసు పీరియడ్ వరకు ఈ సంస్థలో విధులు నిర్వర్తిస్తాను. నా పదవీకాలంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని రాయ్ తన రాజీనామా లేఖలో రాశారు. రాయ్ అనంతరం జయేష్ సంఘ్రాజ్కా సీఎఫ్ఓ బాధ్యతలు చేపడుతారని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పింది. జయేష్ ఇన్ఫోసిస్‌లో 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..! ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..డిప్యూటీ సీఎఫ్ఓగా పనిచేస్తున్న జయేష్ సీఎఫ్ఓగా బాధ్యతలు చేపడుతారు. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో చాలా ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నారు. కంపెనీని మరింత అభివృద్ధి చెందించడానికి ఆయన అనుభవం ఎంతో అవసరం అవుతుందని అన్నారు. నీలాంజన్ భవిష్యత్తు ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నట్లు సలీల్ చెప్పారు. -
ఆర్కే పూర్తి సంతృప్తితో ఉన్నారు: ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా అంశంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పందించారు. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియాతో ఈ విషయమై మాట్లాడారు. ‘‘సీఎం జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్ వెంటే నడుస్తారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా బాగా పని చేశారు. మంగళగిరిని బాగా అభివృద్ధి చేశారు. ఆయనకు అసంతృప్తి అనేది లేదు. రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఆర్కే ఉన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రీచ్ అవ్వలేకనే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారు’’ అని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే.. ‘‘మంగళగిరి సీటును బీసీ(పద్మశాలి)లకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అయినప్పటికీ సీఎం జగన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మంగళగిరిలో క్యాడర్‌ను ఆర్కే రూపొందించారు. మళ్లీ మంగళగిరిలో వైఎస్సార్సీపీనే గెలుస్తోంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేశా అనే సంతృప్తిలో ఆర్కే ఉన్నారు. రాజకీయ సమీకరణాల వల్లే ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదు’’ అని అయోధ్య రామిరెడ్డి చెప్పారు. వ్యక్తిగత పనుల వల్లే ఆర్కే రాజీనామా చేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారాయన. -
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయితే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.. వద్దా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీలో ఇంటింటికీ 'మై బీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానిక మంత్రి గోపాల్ రాయ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. "ఈ రోజు మొదటి రోజు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాం. ప్రజలతో మాట్లాడాం. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పని చేశారని వారు చెప్పారు. ఉచితంగా కరెంటు, మంచినీరు, వైద్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు వంటి సౌకర్యాలు కల్పించారని, అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడ్డారు" అని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గత నెలలో విచారణకు పిలిచింది. అయితే కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకాలేదు. ఇది "చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం" అంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. మేం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి అరెస్టు జరిగితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలా లేక జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా అనే విషయాన్ని ప్రజలనే అడిగాం’ అని రాయ్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 2600 పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 21 నుంచి 24 వరకు మొత్తం 250 వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని రాయ్ తెలిపారు. ఏం చేయాలన్నది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు. -
10 నెలల్లో 110 మంది సీఈవోల రాజీనామా.. కారణం ఇదే..!
కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది. ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: మరో నెలలో రూ.625 కోట్లు నష్టం.. ఎవరికీ.. ఎందుకు.. ఎలా? మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి. -
నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్!
‘భూమా’ పేరు రాజకీయాల నుంచి కనుమరుగు కానుందా? నంద్యాల బరిలో నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని కాకుండా ఫరూక్‌ను బరిలోకి దించనున్నారా? ఆళ్లగడ్డలో కూడా అఖిల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? టీడీపీలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ అధినేతలు సాగిస్తున్న చర్చలు ఈ విషయాలనే వెల్లడి చేస్తోంది. పార్టీ నిర్ణయంతో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అత్యధికంగా గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో టీడీపీ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. పైగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ చేసిన సర్వేల్లో కూడా కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టమైనట్లు సమాచారం. ఈ క్రమంలో టిక్కెట్ల ఖారారుపై టీడీపీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. డోన్ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇదివరకే ప్రకటించారు. అయితే డోన్ బరిలో కచ్చితంగా కేఈ కుటుంబం ఉంటుందని, పోటీ చేసి తీరుతుందని కేఈ ప్రభాకర్ తేల్చిచెప్పారు. ఈ టిక్కెట్ బీసీ జనార్దన్‌రెడ్డి సూచన మేరకే చంద్రబాబు ప్రకటించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మనందరెడ్డిపై చంద్రబాబుకు ప్రతీ సందర్భంలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది గ్రహించిన బ్రహ్మం ఇటీవల నంద్యాలకు వచ్చి అరెస్టయ్యే ముందురోజు బీసీ జనార్దన్రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల బహిరంగసభలో బ్రహ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ‘భూమా’ అనుచరులు నినాదాలు చేసినా చంద్రబాబు ఎవ్వరి పేరు ప్రకటించనని, సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఫరూక్‌ను నంద్యాల అభ్యర్థిగా టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీని వీడాలని బ్రహ్మం నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. ఇది తెలిసి టీడీపీ అధిష్టానం ఫరూక్, బ్రహ్మంలను పిలిపించి ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు బ్రహ్మం ససేమిరా అని మధ్యలోనే లేచి వచ్చేశాడని సమాచారం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఎలాగూ ఓటమి తప్పదని జనసేనకు.. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేకపోవడం, మరోవైపు బలిజ ఓటర్లు అధికంగా ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కట్టబెడదామనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఓడిపోయే సీటు, పొత్తులో ఇస్తే సరిపోతుంది, పైగా బలిజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ లాంటి కీలక స్థానం జనసేనకు ఇచ్చామని చెప్పుకునేందుకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీటలో చేరారు. పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్ తనకే వస్తుందని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకునేంత శక్తి తన నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గంలో లేరని, కాబట్టి టిక్కెట్ తనకే వస్తుందని ఇరిగెల తన వర్గీయులతో చెబుతుండటం గమనార్హం. ఏదిఏమైనా ఓ వైపు నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి, మరోవైపు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు టిక్కెట్లు దక్కకపోతే ‘భూమా’ కుటుంబం తొలిసారి పోటీలో లేని పరిస్థితి తలెత్తుంది. ఇదే జరిగితే రాజకీయాల్లో ‘భూమా’ కుటుంబం తెరమరుగైనట్లే! స్వయంకృతాపరాధం భూమా బ్రహ్మనందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్ విఖ్యాత్‌కు టిక్కెట్ దక్కించుకోవాలని అఖిల శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఖిల, బ్రహ్మనికి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇద్దరి విభేదాలతో పరస్పరం బలాన్ని తగ్గించుంటున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఘోర పరాభవం తప్పదని రాబిన్‌శర్మ టీం అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీంతో అఖిలకు కాకుండా భూమా కిషోర్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని ఆ పార్టీ తొలుత భావించింది. అయితే కిషోర్‌కు ఇచ్చినా అఖిల వర్గం మద్దతు ఇవ్వదని గ్రహించింది. ప్రజల్లో నిత్యం ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తోన్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ద్వయం చేతిలో కిషోర్ కూడా ఓటమిని తప్పించుకోలేరని తేలినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో 45వేల బలిజ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని, వారికి టిక్కెట్ ఇద్దామనే ఓ చర్చ నడిచింది. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇదే క్రమంలో బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం కూడా గెలుపును దక్కించుకునేది కాదని తేలినట్లు చర్చ జరుగుతోంది. అఖిలకు అందరూ దూరమే.. ► నాగిరెడ్డి మృతి తర్వాత రాజకీయంగా కీలకంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే దూరమయ్యాడు. ► ‘భూమా’కు అత్యంత సన్నిహితుడు శివరామిరెడ్డి, విజయడైరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో పాటు బంధువర్గం, సన్నిహితులు ఆ గుమ్మం తొక్కడమే మానేశారు. ► ‘భూమా’ కుటుంబం సొంత మండలం దొర్నిపాడులోనే వారికి వ్యతిరేకంగా సర్వేలు వచ్చాయంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
జాబ్ రిజైన్ చేస్తే రూ.4 లక్షలు - అమెజాన్ ఫౌండర్ అదిరిపోయే ఆఫర్!
దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్' ఫౌండర్ 'జెఫ్ బెజోస్' (Jeff Bezos) తమ కంపెనీలో ఉద్యోగం మానేయాలనుకునే వారికి 5000 డాలర్లు ఆఫర్ చేస్తూ ఓ సంచలన ప్రకటన చేశారు. ఊహూ... సంస్థకు ఉపయోగడరని భావిస్తున్న ఉద్యోగులను వదిలించుకునేందుకు కాదీ ప్రకటన. ఉద్యోగుల్లో సంస్థపట్ల ఎంతమందికి విధేయత కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు వేసిన ఎత్తుగడ. అదెలాగంటరా... ? చదివేయండి! ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన అమెజాన్ ఈ రోజు ఈ కామర్స్ విభాగంలో తిరుగులేని కంపెనీగా అవతరించింది. యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా మారాడు. అసాధారణ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న బెజోస్ 2014లో మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి, కంపెనీ పట్ల విధేయత కలిగినవారి కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. ప్రారంభంలో ఈ ఆఫర్ కింద స్వచ్చందంగా జాబ్ వదిలేసేవారికి 2000 డాలర్లు ఇస్తామని ప్రకటించారు, ఆ తరువాత ఈ మొత్తాన్ని 3000 డాలర్లకు పెంచారు, ఇప్పుడు అది 5000 డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో ఈ ఆఫర్ ప్రకటించిన సందర్భంగా 'Please Don’t Take This Offer' అని కోరడం విశేషం. సంస్థలో అందరూ ఉండాలని, ఈ ఆఫర్ ఎవరూ స్వీకరించరని భావిస్తున్నట్లు జెఫ్ బెజోస్ ప్రస్తావించారు. ఇలాంటి ఆఫర్ లాస్ ఏంజెలస్కు చెందిన ఆన్లైన్ రిటైలర్ 'జప్పోస్' మొదట ప్రారంభించింది. ఆ తరువాత బెజోస్ మొదలుపెట్టారు. -
మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయుల రాజీనామా
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు చెలరేగాయి. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్లో ఆందోళనకారులు పాటిల్‌ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించడంపై పాటిల్ మండిపడ్డారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టలేదు. రెండు-మూడు తరాలు అధికారంలో ఉన్నారు. వారే చొరవ తీసుకుని ఉండేవారు. కానీ అదేమీ చేయలేదు. మరాఠా సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ వర్గానికి ఏం చేయలేదు" అని పాటిల్ మండిపడ్డారు. మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు' -
కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలెవరైనా తనను సంప్రదిస్తే, కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
కాంగ్రేస్ పార్టీలో ‘పొన్నాల’ ప్రస్థానం ముగిసినట్టేనా..?
జనగామ: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖాస్త్రం సంధించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పొన్నాలకు.. పార్టీ టికెట్ కూడా రావడం లేదనే సంకేతాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ఆయన రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న విషయాలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కోసం అంకితభావంతో టీపీసీసీ స్థాయికి ఎదిగిన తనకే విలువ లేకపోతే.. సాధారణ బీసీ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆవేదన వ్యక్తం చేయడంపై సానుకూలత ఉంది. అవమానం భరించలేక 45 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తున్న దని కూడా పేర్కొనడంపైన పాజిటివ్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సర్వేలు, ఏఐసీసీ పరిశీలనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు సీనియర్లు ఎందుకు కట్టుబడి ఉండరన్న చర్చ కూడా ఉంది. ఏమీ కాలేని నేతలు కాంగ్రెస్ పార్టీ నీడలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ పదవులను అనుభవించి పార్టీ మేలు కోసం తగ్గితే తప్పేమిటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌పై పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రభావం చూపి.. మరికొందరు టికెట్ రాదని భావించే నాయకులు పార్టీని వీడకుండా టీపీసీసీ చర్యలు చేపడుతోంది. అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి చక్కదిద్దే పనిలో పడింది. టికెట్ రావడం లేదనే సంకేతం... తెలంగాణకు తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 119 స్థానాలకు టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను.. తనకే టికెట్ రావడం లేదన్న సంకేతాలు ఆవేదనకు గురి చేశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కేటాయింపు మొదలు పార్టీ కార్యకలాపాల్లో ‘కింగ్‌మేకర్’గా ఉన్న ఆయనకు కొద్ది రోజులు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా ఉమ్మడి వరంగల్‌లో 1999 నుంచి 2014 వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన గ్రాఫ్ 2016 తర్వాత పార్టీలో పడిపోయింది. ఏఐసీసీతో సైతం గ్యాప్ పెరగడంతోపాటు ఆయన నియోజకవర్గం జనగామకు కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. తాను ఎంత వ్యతిరేకించినా.. కొమ్మూరి ప్రతాపరెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడం మొదలు ఇవన్నీ తనకు టికెట్ రాకుండా చేయడమేనన్న సంకేతాలు ఆయనకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజీనామాకు సిద్ధమైన పొన్నాల లక్ష్మ య్య.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య.. త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా ఈ చేరిక ఉంటుందంటున్నారు. లేదంటే అంతకంటే ముందే మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరవచ్చని అంటున్నారు. 12 ఏళ్లు మంత్రిగా.. పొన్నాల లక్ష్మయ్య నాలుగున్నర దశాబ్దాలు, నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. ముఖ్య మంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 2014 మార్చి 10న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కీలక పదవిని చేపట్టారు. ఏడు పర్యాయాలు జనగామ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మయ్య నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో సీపీఎం అభ్యర్థి అసిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చురగొండి రాజిరెడ్డిపై గెలిచిన పొన్నాల.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే చురగొండి రాజిరెడ్డిపై ఓటమి చెందారు. 1999లో ప్రేమలతారెడ్డి (టీడీపీ), 2004లో ఎ.బస్వారెడ్డి (టీడీపీ), 2009లో కొమ్మూరి ప్రతాపరెడ్డి (టీఆర్ఎస్ (బీఆర్ఎస్)పై పొన్నాల గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తే ముగిసినట్లేనని, పెద్దలు విస్తృత సంప్రదింపులు జరిపితే ఆయన మెత్తబడి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకా శం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. -
నా వల్ల కాదు.. మంత్రి పదవికి ప్రియాంక రాజీనామా
చెన్నై: పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి చందిర ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు డబ్బు, కుట్రలతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చందిర ప్రియాంక తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రికి రంగస్వామికి లేఖ పంపారు. కాగా, లేఖలో ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని, డబ్బుమయంగా మారిపోయాయని అన్నారు. రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని, లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'Could not fight ghost of money power':Puducherry's lone woman legislator and minister, S Chandira Priyanga quits. Watch: https://t.co/C5eaBYqTif pic.twitter.com/2Oq5N5CsPX — editorji (@editorji) October 10, 2023 అలాగే, పుదుచ్చేరిలో రెండు ప్రధాన వర్గాలుగా వన్నియర్లు, దళితులు ఉన్నారని, ఈ వర్గాలకు చెందిన శాసనసభ్యులు తమ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ వర్గాలు మరింత అభివృద్ధి చెందేందుకు, అవినీతి రహిత రాజకీయాల కోసం తన పదవిని వన్నియర్లు లేదా దళితులు లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. pic.twitter.com/5lejQf9uHy — Chandirapriyanga (@SPriyanga_offl) October 10, 2023 ప్రజల మద్దతు లేకపోయినా ధన బలమున్న వారికి ఈ పదవి ఇచ్చి ద్రోహం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేయాలని అభ్యర్థించారు. ఇక, ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి రంగస్వామి నిరాకరించారు. ప్రియాంగ రాజీనామాపై అడిగేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానించకుండా ఎందుకు వచ్చారని వారిపై సీరియస్ అయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్! -
కష్టాల్లో స్టార్టప్: గుడ్‌బై చెప్పిన కో-ఫౌండర్
బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోకు భారీ షాక్ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్‌బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతున్న స్టార్టప్ భారీ పునర్నిర్మాణ ప్లాన్ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి సంస్థ నుంచి నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. (కిర్రాక్ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్ రాయిస్’! వైరల్ వీడియో) 2015 మే నుంచిస్టార్టప్ కంపెనీకి కో-ఫౌండర్‌గా సూరి ఆరేళ్లకు పైగా పనిచేశారు. అలాగే డంజో మర్చంట్ సర్వీసెస్ (DMS)తో సహా కొత్త వ్యాపారాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా గత కొన్ని నెలలుగా నిధుల సమీకరణం కోస కష్టపడుతోంది. ఈ కష్టాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నగదు కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థకు నిధులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వీటన్నింటికి తోడు నష్టాలను చవిచూస్తోంది. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు. జీతాల చెల్లింపులను పలుమార్లు వాయిదా వేసిన సంస్థ గత నెలలో, Dunzo ఆగస్టు నెల జీతాలకుగాను పేరోల్ ఫైనాన్సింగ్ కంపెనీ OneTapతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ రెండో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన గూగుల్ , బకాయిలు చెల్లించమని కోరుతూ కంపెనీకి లీగల్ నోటీసు పంపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో , గూగుల్ కలిపి దాదాపు రూ.4 కోట్లు బకాయినోటీసులిచ్చాయి. అయితే ఎపుడు సూరి పదవీకాలం ముగిసేది, అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనేది వెల్లడించలేదు. సూరి, బిశ్వాస్‌తోపాటు అంకుర్ అగర్వాల్ , ముకుంద్ ఝా కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో బిస్వాస్‌కు మాత్రమే కంపెనీలో 3.57 శాతం ఈక్విటీ వాటా ఉంది. సూరికి ఈక్విటీ లేదు జీతం కూడా లేని కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు Dunzo ఇప్పటివరకు Reliance, Google, Lightrock, Lightbox, Blume Ventures ఇతర కంపెనీల నుంచి 2015 నుండి దాదాపు 500 మిలియన్ డాలర్లను సేకరించింది. రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ప్రైవేట్ మార్కెట్ డేటా ప్రొవైడర్ Tracxn ప్రకారం, ప్రస్తుతం Dunzoలో 19 శాతం యాజమాన్యంతో Google రెండో అతిపెద్ద వాటాదారు. డంజో దాదాపు రూ.250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా
సాక్షి, కల్వకుర్తి: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఏ రాజకీయ నేత ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న ఒక పార్టీలో ఉన్న నేత.. నేడు ఇంకో పార్టీలో చేరుతున్నారు. తాజాగా తెలంగాణలోని అధికార బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించినట్టు తెలిపారు. బీఆర్ఎస్కు గుడ్ బై.. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల లిస్టును కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. నేడు తన నివాసంలో అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు. కిషన్‌రెడ్డితో భేటీ.. మరోవైపు.. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన చిత్తరంజన్ దాస్, బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానుండగా.. ఆయన సమక్షంలోనే చిత్తరంజన్ కాషాయతీర్థం తీసుకోనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చిత్తరంజన్ దాస్ భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించగా.. అందుకే చిత్తరంజన్ దాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నాడు ఎన్టీఆర్‌ను ఓడించి జాయింట్ కిల్లర్‌గా.. ఇదిలా ఉండగా.. చిత్తరంజన్ దాస్‌కి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరుగాంచారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ పోటీ చేయగా.. కాంగ్రెస్ తరపున చిత్తరంజన్ దాస్ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం, చిత్తరంజన్ దాస్ 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరారు. కాగా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. చిత్తరంజన్ రాజీనామా స్థానికంగా బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. నిన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం గూటికి చేరారు. ఇది కూడా చదవండి: కారు చివరి సీట్లు ఖరారు.. పెండింగ్ స్థానాలకూ అభ్యర్థుల ఖరారు -
బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్యే!
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల్లో సీనియర్ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పరిస్థితి బట్టి అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడుతున్నట్టు వెల్లడించారు. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్ ఇవ్వకపోవడంపై గుస్సా.. వివరాల ప్రకారం.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే, బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ నో అపాంట్మెంట్.. మరోవైపు.. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక, బోథ్ నుంచి అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్‌లకు టికెట్ లభించకపోవడంతో వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం -
ఎంపీ అరవింద్‌తో విభేదాలు.. బీజేపీకి గుడ్‌బై
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్మూరు నియోజక వర్గ బీజేపీ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఎంపీ అరవింద్‌తో వినయ్‌కి పడటం లేదు. చివరకు.. ఎంపీ అరవింద్ వ్యతరేకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇటీవల ఆందోళన సైతం చేపట్టారు వినయ్. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆయన పార్టీ మారుతుండడం చర్చకు దారి తీసింది. వినయ్ 2018 లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు వినయ్. ఆ ఎన్నికల్లో దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఈ దఫా ఆర్మూర్ టికెట్ ఆశావాహుల్లో ఈయన కూడా ఉన్నారు. బీజేపీని వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినయ్ బయటకు రావడం.. జిల్లాలో కమలం పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం -
Manipur: సీఎం రాజీనామా హైడ్రామా.. క్లారిటీ ఇచ్చిన బీరేన్ సింగ్
మణిపూర్: అల్లర్ల దృష్ట్యా మణిపూర్‌లో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా హైడ్రామా చోటుచేసుకుంది. మణిపూర్‌లో కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాకాండపై సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. దీంతో సీఎం ఈ రోజు రాజీనామా చేయడానికే నిశ్చయించుకున్నారు. కానీ భారీ సంఖ్యలో మహిళలు సీఎం ఇంటికి వచ్చి మద్దతు తెలపడంతో సీఎం తన నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రెండు నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. అల్లరిమూకలు రెచ్చిపోవడంతో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అల్లర్లు తగ్గకపోవడంతో సీఎం బీరేన్ సింగ్‌పై అసహనం మొదలైంది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. రాష్ట్ర ప్రజలు సీఎంపై నమ్మకం కోల్పోయారని 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. కేంద్రం చొరవ తీసుకోవాలని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. At this crucial juncture, I wish to clarify that I will not be resigning from the post of Chief Minister. — N.Biren Singh (@NBirenSingh) June 30, 2023 ఈ డిమాండ్లపై విసిగిపోయిన సీఎం బీరేన్ సింగ్ కూడా రాజీనామాకు పూనుకున్నారు. గవర్నర్ నివాసానికి బయలుదేరే సమయంలో చాలా మంది మహిళలు గుంపులుగా సీఎం నివాసానికి వచ్చారు. రాజీనామా చేయకూడదని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సీఎం రాజీనామా లేఖ చినిగిన పేపర్ ముక్కలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల అనంతరం తాను రాజీనామా చేయట్లేదని సీఎం బీరేన్ సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. #WATCH | Moment when women supporting Manipur CM Biren Singh tore up his resignation letter pic.twitter.com/dB8IjWNmya — ANI (@ANI) June 30, 2023 మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న అల్లర్లు హింసాకాండగా మారాయి. సైన్యానికి అల్లరిమూకలకు మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే 100 మంది మరణించారు. ఈ ఘర్షణ ప్రాంతాల్లో ఈ రోజు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పర్యటిస్తున్నారు. ఇదీ చదవండి: మణిపూర్ హింస ఎఫెక్ట్.. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా? -
మణిపూర్ హింస ఎఫెక్ట్.. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా?
ఇంపాల్: కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మణిపూర్‌లో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాడపడ్డారు. ఈ నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం బీరేన్ సింగ్ తన పదవికి మరికాసేపట్లో రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మణిపూర్‌లో హింస నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మణిపూర్ గవర్నర్ అనసూయ యుకీకి రాజీనామా పత్రాన్ని సమర్పించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను వివరించేందుకు ఈనెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిని అమిత్ షాకు ఆయన వివరించారు. ఈ క్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు మణిపూర్‌లో హింస కొనసాగుతూనే ఉంది. దీంతో, ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. సీఎం ఇంటివైపు శవయాత్ర యత్నం. -
టీసీఎస్‌కు షాక్.. వేలలో మహిళా ఉద్యోగులు రిజైన్
-
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్‌ను బాలాసాహెబ్‌తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్‌కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, విపక్షాల ముఖ్యనేత శరద్ పవార్ తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన ఆత్మకథ పుస్తకం రెండో ఎడిషన్ రిలీజ్ కార్యక్రమంలో.. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనన్న పవార్.. ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పవార్ తన రాజీనామా ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆయన రాజీనామా చేయొద్దంటూ వేదిక మీదకు ఎక్కి నినాదాలు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజీనామా వెనక్కు తీసుకోవాలంటూ కోరారు. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు. 👉 ‘‘రాజ్యసభ సభ్యుడిగా ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. అంతదాకా కొనసాగుతా. కానీ, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోను అని ఆటోబయోగ్రఫీ ‘లోక్ మజే సంగతి’ సెకండ్ ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘సరిగ్గా 1960 మే 1వ తేదీన మే డే నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసుకున్న ఆయన.. మనిషికి అత్యాశ ఉండకూడదని, ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందేనని 83 ఏళ్ల పవార్ వ్యాఖ్యానించారు. 👉 అయితే తర్వాతి అధ్యక్ష పదవి కోసం పార్టీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందన్న ఆయన.. ఎన్సీపీ సీనియర్ నేతలతో కూడిన కమిటీని తాను రికమండ్ చేస్తానని, వాళ్లే తర్వాతి పార్టీ చీఫ్ ఎంపిక బాధ్యత చేపడతారని వెల్లడించారు. ఆ కమిటీ ప్రఫుల్ పటేల్, సునీల్ తాట్కరే, పీసీ చాకో, అజిత్ పవార్, సుప్రియా సులే, జయంత్‌పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్ తదితరులు ఉంటారని ఆయన తెలిపారు. 👉 గత కొంతకాలంగా.. మహారాష్ట్రలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జోరుగా నడుస్తోంది. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి వెళ్లబోతున్నాడంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే అజిత్ పవార్ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు. 👉 మరోవైపు ఈ బాబాయ్-అబ్బాయ్ నడుమ గ్యాప్ గురించి, హఠాత్తుగా ఏం పరిణామం జరగబోతుందా? అనే ఆసక్తికర చర్చ మహా రాజకీయాల్లో నడుస్తుండగానే పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించారు. పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యంపై అజిత్ అసంతృప్తిగా ఉన్నారని, పవార్ యువనాయకత్వాన్ని ప్రొత్సాహించడం అజిత్‌కు నచ్చడం లేదనే టాక్ మరోవైపు నడుస్తోంది. 👉 వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కోసం.. విపక్షాలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు జరుగుతున్న కృషిలో పవార్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటోంది కూడా. ఇలాంటి టైంలో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం. "I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/h6mPIk4wgJ — ANI (@ANI) May 2, 2023 పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ 👉 జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది. 👉 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్‌ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్‌లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్. 👉 పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఏక పక్షంగా ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జయంత్ పాటిల్ మాత్రం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 👉 ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో సోనియా గాంధీ అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తోంది. 👉 ప్రభుత్వాలతో దోస్తీ కొనసాగించిన శరద్ పవార్.. కేంద్ర మంత్రి పదవులను సైతం చేపట్టారు. ప్రతిపక్షంలోనూ ఆయన రాజకీయంలో తన మార్క్ ప్రదర్శించేవారు. 👉 మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఎన్సీపీ.. నాగాలాండ్‌లోనూ ప్రభావం చూపెడుతూ వస్తోంది. ఈ తరుణంలోనే ఈసీ నిబంధనలకు లోబడి.. చాలా ఏళ్ల కిందటే జాతీయ పార్టీ హోదా పొందింది ఎన్సీపీ. కానీ, తాజాగా ఆ హోదాను కోల్పోవడం గమనార్హం. 👉 పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. చీలిక వర్గాలు, అసంతృప్తులు, వెన్నుపోటులు ఎదురైనా.. పవార్ నాయకత్వం వాటిన్నింటికి చెక్ పెడుతూ నిలకడగా ఎన్సీపీ నావను ముందుకు నడిపింది. ఇదీ చదవండి: మన్ కీ బాత్@100.. ఒక్కో ఎపిసోడ్‌కు 8.3 కోట్లు? -
పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి, గార్ల: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా గార్ల జెడ్పీటీసీ సభ్యురాలు జాటోత్ ఝాన్సీలక్ష్మి బుధవారం ప్రకటించారు. ఈ సందర్బంగానే ఆమెతోపాటు మరో 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గార్లలోని పొంగులేటి, కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానం లభించలేదన్నారు. ఆయన వెంట తిరుగుతున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు సైతం ప్రభుత్వం భద్రతను తొలగించడం కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. ఇది కూడా చదవండి: భారత్ పరివర్తన్ మిషన్‌గా బీఆర్ఎస్ -
అది నిజమని నిరూపిస్తే..రాజీనామా చేస్తా! దీదీ సవాల్
తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అదే గనుక నిజమైతే తాను రాజీనామా చేస్తానని సవాలు కూడా విసిరారు మమత. ఎన్నికల సంఘం తృణమూల్ పార్టీ అర్హతను సమీక్షించిన తర్వాత జాతీయ పార్టీ హోదాను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మమతపై సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు కాల్ చేసి మమత అభ్యర్థించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మమత..నేను అమిత్ షాకు ఫోన్ చేసి అడిగినట్లు నిజమైతే ఈ క్షణమే నా పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలను విని తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానన్నారు. సువేందు అబద్ధాలు చెబుతున్నాడంటూ విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న యత్నాల గురించి కూడా వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు మౌనం చాలా గొప్పదని, ప్రతిపక్షాలు కలవవని అనుకోవద్దన్నారు. మేమందరం ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నామని, అది ఒక్కసారిగా గాలివానాల వస్తుందని అన్నారు. అంతేగాదు స్వలింగ వివాహ చట్టం గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా సున్నితమైన విషయం అని, ప్రజల నాడి తోపాటు కోర్టు ఆదేశాలను కూడా చూసి ఒక అభిప్రాయానికి రావాలన్నారు. (చదవండి: భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..) -
Karnataka Polls: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. మాజీ సీఎం రాజీనామా..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరుతున్నారు. తాజాగా కమలం పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఈయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. అయినా అధిష్ఠానం మాత్రం టికెట్ కేటాయించలేదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తనను చివరకు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని జగదీశ్ చెప్పుకొచ్చారు. లింగాయత్ వర్గానికి చెందిన ఈయన ఎన్నికల ముందు పార్టీని వీడటం బీజేపీకి కచ్చితంగా నష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. జగదీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. టికెట్ ఖరారు చేసుకున్నాకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
రిజైన్ పెట్టు..ప్యాకేజీ పట్టు..
-
రాజీనామా చేస్తే సంవత్సరం శాలరీ ఫ్రీ.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్
గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని భారీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తూనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, మెటా వంటి దాదాపు సుమారు 570 టెక్ కంపెనీలు 2023లో మాత్రమే 1,60,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. లెక్కకు మించిన సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతో ఉద్యోగుల్లో కొత్త భయం ఏర్పడింది. నివేదికల ప్రకారం.. గూగుల్, అమెజాన్ కంపెనీలు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో చాలా మంది ఉద్యోగులను తొలగించాయి, కానీ యూరోపియన్ దేశాలలోని ఉద్యోగులను తొలగించడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ దేశాల్లో ఉన్న కఠినమైన కార్మిక రక్షణ చట్టాల కారణంగా ఈ కంపెనీలు వెంటనే ఉద్యోగులను తొలగించలేకపోతున్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో, టెక్ కంపెనీలు ఉద్యోగులతో చర్చించకుండా ప్రజలను తొలగించకూడదు. కావున ఈ చర్చల వల్ల తొలగింపులు కొంత ఆలస్యం అవుతున్నాయి. కంపెనీలు లేఆఫ్‌లను అమలు చేయడానికి ముందు చట్టబద్ధంగా ఈ కౌన్సిల్లతో సంప్రదించవలసి ఉంటుంది. (ఇదీ చదవండి: Mercedes AMG GT 63 S E Performance: భారత్‌లో విడుదలైన కొత్త కారు - పూర్తి వివరాలు) ఫ్రాన్స్‌లో, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, దానికి తగిన ప్రతిఫలంగా పొందాలని కోరించి. అయితే ఐదు నుంచి ఎనిమిదేళ్లు అనుభవం ఉన్న కొంతమంది సీనియర్ మేనేజర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే వారికి ఒక సంవత్సరం వేతనంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజీని అమెజాన్ అందించనున్నట్లు కూడా తెలుస్తోంది. జర్మనీలో అమెజాన్ వారి ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించి, స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా, గూగుల్ తన 8,000 మంది ఉద్యోగులలో యూకేలో 500 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఈ ఉద్యోగులకు విభజన ప్యాకేజీలు కూడా అందించనున్నట్లు వెల్లడించింది. డబ్లిన్, జ్యూరిచ్లలో గూగుల్ తన ఉద్యోగులలో 200 మందికి పైగా తొలగించాలని యోచిస్తోంది. -
గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా, మనసంతా ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్ శుక్రవారం ఉదయం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా టీసీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్లోమరొకరు ఉండటం సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు. అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే.. కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు. కాగా గోపీనాథన్ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. 2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, 2017లో సీఎండీగా ఎంపికయ్యారు. -
మంత్రి నిరంజన్‌రెడ్డికి షాక్.. ఆత్మాభిమానం చంపుకోలేకేనన్న నేతలు!
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాకా వనపర్తి జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో ముసలం మొదలైంది. మంత్రికి సన్నిహితులుగా పేరొందిన ముఖ్య నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డితోపాటు వనపర్తి, పెద్దమందడి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలు ప్రదర్శించారు. వీరితోపాటు మరో 11 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడమే కాకుండా బీఆర్ఎస్ లో తాము ఎదుర్కొన్న బాధలను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక..: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ మామూలు కార్మికులు సైతం ఆత్మగౌరవం కోరుకుంటారని.. అలాంటిది అధికారంలో ఉండి కూడా ఆత్మగౌరవాన్ని పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. నిరంజన్‌రెడ్డికి పేరొచ్చిందంటే మేమే కారణం పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డికి నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరు వచ్చేందుకు తమ శ్రమే కారణమన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది ఎవరో వారి మనసులో ఉందని.. త్వరలోనే వారు బాహాటంగా చెప్పే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నియంత పాలన అంతం కోసం ఇక నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఇప్పటివరకు తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న మంత్రి నిరంజన్ రెడ్డికి అతడి సొంత సెగ్మెంట్ నుంచే వ్యతిరేకత పెల్లుబికడంతో పాటు తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. -
బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా
బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కీలక పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్) ఛైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ మైసూర్ శాండిల్ సబ్బులతో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. విరూపాక్షప్ప దేవనగెరె జిల్లా చిన్నగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కుమారుడు ప్రశాంత్ మదల్ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్డులో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే తండ్రి తరఫున ఇతడు లంచాలు తీసుకుంటాని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేఎస్డీఎల్ కార్యాలయంలో రూ.40లక్షలు తీసుకుంటున్న ప్రశాంత్‌ను లోకాయుక్త అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కార్యాలయంలోనే రూ.1.7కోట్ల నగదును గుర్తించారు. అనంతరం విరూపాక్షప్ప ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి మొత్తం రూ.6కోట్లు సీజ్ చేశారు. అవినీతి డబ్బుతో కుమారుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో విరూపాక్షప్ప కేఎస్డీఎల్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే లోకాయుక్తకు పట్టుబడ్డ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన కుటుంబంపై కుట్ర జరగుతోందని ఆయన ఆరోపించారు. కాగా.. ప్రశాంత్ అవినీతికి పాల్పడుతూ లంచాలు తీసుకుంటున్నాడని లోకాయుక్తకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వారు గురువారం చాక్యచక్యంగా అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాంగ్రెస్ విమర్శలు.. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు అవినీతికి పాల్పడుతున్నట్ల రుజువుకావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలకు ఎక్కుపెట్టింది. బీజేపీ భ్రష్ట జనతా పార్టీ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. చివరకు మైసూర్ శాండిల్ సబ్బు అందమైన సువాసనను కూడా 40శాతం కమిషన్ సర్కారు కలుషితం చేసిందని మండిపడ్డారు. చదవండి: కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్ ఇవే.. -
బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?
అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అలాగే ఆ పార్టీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉంటూ గ్రూపులు మార్చడంలో కాని, ఆ తర్వాత పార్టీలు మార్చడంలో కాని ఆరితేరినవారే. తన అవసరార్ధం కన్నా బీజేపీలో చేరారు. ఆయనేదో రాష్ట్రం అంతటిని, కనీసం కాపు సామాజికవర్గంలో అయినా ప్రభావితం చేస్తారేమోనని ఆశపడి బీజేపీ భంగపడింది. చివరికి ఆయన తన దారి తాను చూసుకున్నారు. పోతూ, పోతూ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై, పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. బీజేపీ అర్డెంట్‌గా జనసేనతో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన మనసులో మాట కావచ్చు. కాని అందుకు పార్టీ అధిష్టానం ఇష్టపడడం లేదు. బీజేపీని దారుణంగా మోసం చేసి, అవమానించిన చంద్రబాబుతో జతకట్టడానికి అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు ససేమిరా అంటున్నారు. మరోసారి ఎలాగోలా ఎమ్మెల్యేగా అయినా గెలవాలని తాపత్రయపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ,ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొత్త కూటమి ఏర్పడితే కాని అది సాధ్యం కాదని భావిస్తుండవచ్చు. కాకపోతే ఆ మాట చెప్పకుండా, బీజేపీ ఏదో అన్యాయం చేసినట్లు, తన వర్గంవారిని పదవుల నుంచి తొలగించడంపైన ఏవేవో ఆరోపణలు చేశారు. అది వేరే విషయం. కన్నా చరిత్ర చూస్తే ఒకరకంగా అదృష్టవంతుడే అని చెప్పాలి. గతంలో కావూరి సాంబశివరావు, ఎన్.జి.రంగా వంటివారి ద్వారా తొలిసారి పెదకూరపాడు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ పొందారు. అప్పట్లో ఆయన నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గానికి సన్నిహితం అయ్యారు. తొలుత చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. కాని నేదురుమల్లి మంత్రివర్గంలో స్థానం పొందారు. మొదటిసారే శాసనసభకు ఎన్నికైనా ఆయనకు ఈ అవకాశం రావడం అదృష్టమే. ఆ తర్వాత నేదురుమల్లి కోటాలో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో కూడా కొనసాగారు. 1994,99, 2004 లలో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఆయనకు పడేది కాదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. కాని 2004 నాటికి వైఎస్ వర్గానికి దగ్గరయ్యారు. వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి పదవి పొందారు. 2009లో నియోజకవర్గాల డిలిమిటేషన్ కారణంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారి మళ్లీ గెలిచారు. అప్పటికే సీనియర్ నేతగా గుర్తింపు పొంది తిరిగి వైఎస్ మంత్రివర్గంలో తన బెర్త్ తాను పొందారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన మళ్లీ గ్రూపు మార్చుకున్నారు. రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు రోశయ్యకు, కన్నాకు గుంటూరు రాజకీయాలలో పడేది కాదు. అది వేరే అంశం. రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. సీఎం సీటుకు కూడా పోటీపడాలని ప్రయత్నించారు. కాని అవి దక్కలేదు. 2014లో ఆయన కాంగ్రెస్‌లోనే పోటీచేసి ఓడిపోయారు. గుంటూరు రాజకీయాలలో కన్నాకు పెద్ద ప్రత్యర్దిగా ఉన్న రాయపాటి సాంబశివరావు అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపిగా గెలిచారు. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉండడంతో రాయపాటి కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని తన పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తనను ఇబ్బంది పెడతారోనని సందేహించారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమి చేయాలా అన్నదానిపై ఆలోచించి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఇందుకు సంబంధించి ప్లెక్సీలు కూడా వెలిశాయి. కాని సడన్‌గా అమిత్ షా పోన్ చేసి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. వారి మధ్య అప్పుడు ఏమి జరిగిందో కాని, ఆయన వైసీపీలోకి వచ్చే ఆలోచన విరమించుకుని సాకు కోసం ఆస్పత్రిలో చేరారు. బీజేపీలోకి వెళితే సేఫ్ అని ఆయన నమ్మారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, కన్నాకు మధ్య ఉప్పు, నిప్పుగా పరిస్థితి ఉండేది. కన్నా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రంగాతో పాటు తనను కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కన్నా బీజేపీలో చేరితే అక్కడ జాక్ పాట్ తగిలినట్లుగా ఆయన బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. దాంతో రాష్ట్ర స్థాయి ఎలివేషన్ బాగా వచ్చింది. 2019 లో నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట వైసీపీకి చెందిన కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలే మెయిన్ టెయిన్ చేసినట్లు చెబుతారు. కాని తాను కోరిన కొన్ని పనులు జరగడం లేదని అసంతృప్తి ఉండేదట. దాంతో ఆయన క్రమంగా వైసీపీకి దూరంగా ఉండడం ఆరంభించారు. అంతలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లును తీసుకు రావడం, అమరావతి పేరుతో ఒక కృత్రిమ ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహించడం వంటి ఘట్టాలు జరిగాయి. ఈ అమరావతి వ్యవహారంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త దగ్గరయ్యారు. తిరుపతిలో జరిగిన ఒక సభలో చంద్రబాబుతో కలిసి చేతులు ఎత్తారు. ఇది ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గతంలో శాసనసభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇలా కలుస్తారని ఊహించగలరా? అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉండి, తదుపరి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో ఈయన సన్నిహితంగా కనిపించేవారు. అమరావతిలో ఏమైనా ప్రయోజనమో, లేక రాజకీయ బందమో తెలియదు కాని టీడీపీతో దగ్గరవుతున్న సంకేతాలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే 2019లో పార్టీ పంపించిన డబ్బు పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బీజేపీ అధినాయకత్వానికి కన్నా పై క్రమేపి విశ్వాసం తగ్గింది. ఆ క్రమంలో ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినా, అది పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. అయినా కన్నా బీజేపీపై కన్నా, పక్కచూపులే ఎక్కువగా చూస్తున్నారన్న ప్రచారం జరిగేది. దానికితోడు కన్నా తనతో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు కొందరు తనకు సన్నిహితులైనవారిని కూడా బీజేపీ నుంచి బయటకు తీసుకువెళతారమోనన్న అనుమానంతో కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వారిని తొలగించారు. అది కన్నాకు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈలోగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈయనను కలిసి రాజకీయాలు చర్చించారు. జనసేనలోకి వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేయాలని కన్నా భావించారు కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి వెనుకాడారట. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతను జనసేనలో చేర్చుకుంటే ఇబ్బంది వస్తుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నా బహుశా టీడీపీలో చేరడానికి మానసికంగా సన్నద్దమయ్యే బీజేపీని వీడారని భావిస్తున్నారు. కన్నా అనుచరులు టీడీపీలోకి వెళదామని సూచించారట. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లవద్దని చెప్పారట. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ఇలా తన పార్టీలోకి వద్దామనుకున్నవారిని చేర్చుకుంటే ఎలా ఫీల్ అవుతారో తెలియదు. జనసేన కార్యకర్తలనే తీవ్రంగా అవమానించిన నటుడు బాలకృష్ణ ఎదుట కూర్చున్న వ్యక్తికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చేమో!. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా దూషించిన కన్నా ఇప్పుడు ఆయనలో తన భవిష్యత్తు చూసుకుంటున్నారట దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి మరోసారి నిర్దారణ అవుతుంది. దీని వల్ల కన్నా లక్ష్మీనారాయణకు గౌరవం పెరుగుతుందని చెప్పలేకపోయినా, ఎన్నికల ఫలితాన్ని బట్టి చూసుకోవచ్చులే అని ఆయన సరిపెట్టుకుని ఉంటారు.అందుకే కన్నా అద్దె ఇంటి వంటి బీజేపీని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. కాకపోతే కన్నాకు కొత్త ఇంటి కోసం వెదుకుతూ చివరికి తన ఒకప్పటి రాజకీయ శత్రువు ఇల్లే శరణ్యం అవడమే ఆయన దయనీయ స్థితికి అద్దం పడుతోందని అనుకోవచ్చు! - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
శ్రావణి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్.. ఏమన్నారంటే?
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని అవి భరించలేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామా చేసి మీడియా ఎదుటే శ్రావణి కన్నీరుపెట్టుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. శ్రావణి రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా తన వ్యక్తిగతం. చైర్పర్సన్ వ్యాఖ్యలు చాలా బాధించాయి. నేను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారు. రాజకీయ కారణాలతో రాజీనామా చేశారు. కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదు. అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆమె కామెంట్స్ చేయడం సరికాదు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. సమన్వయ లోపం ఉందని అవిశ్వాసం పెడతామని కౌన్సిలర్లు చెప్పినా వద్దని చెప్పాము. సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్ణయించి చైర్‌పర్సన్‌కు కాల్ చేశాము. ఈలోపే ఆమె ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం బాధించింది. కలిసి పనిచేస్తానంటే కౌన్సిలర్లను సముదాయించేందుకు ప్రయత్నం చేస్తాను. 50% బీసీ మహిళలకు పదవులు ఇచ్చామ’ని వ్యాఖ్యలు చేశారు. -
దొరగారూ.. మీకో దండం!
సాక్షి, కరీంనగర్: ‘దొరగారూ మీకో దండం. మూడేళ్లుగా అడుగడుగునా అవమానాలు, వేధింపులు భరించా. ఇక నా వల్ల కాదు, మీ గడీ సంకెళ్లు తెంపుకుని బయటికి వస్తున్నా..నా కుటుంబాన్ని, పిల్లల్ని కాపాడుకునేందుకే రాజీనామా చేస్తున్నా. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగాను. ఇక ఈ నరకం నా వల్ల కాదు. దొరా మీరే గెలిచారు..’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నీటి పర్యంతమవుతూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బు ధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి.. ‘ఒక మహిళా బీసీ నేతగా జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మూడు నెలల పసిగుడ్డును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. కేటీఆర్, కవిత ఆశీస్సులతో బలహీనవర్గాలకు చెందిన నేను మున్సిపల్ చైర్పర్సన్ పదవి పొందగలిగా. కానీ ప్రమాణ స్వీకారం చేసిన రెండోరోజు నుంచే విషం చిమ్మే కోరలు ఉన్న మనుషుల మధ్య పనిచేయాల్సి వచ్చింది. ‘మున్సిపల్ చైర్పర్సన్ పదవి అంటే ముళ్లకిరీటం’ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చెబితే తన తండ్రిలాంటి వాడు, తన బాగు కోసం సలహాలు ఇస్తున్నాడని భావించానే తప్ప.. ఆయన రాక్షసత్వానికే బలవుతానని అనుకోలేదు..’ అని శ్రావణి అన్నారు. పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్‌ని.. ‘కరీంనగర్ రోడ్లో ఏర్పాటు చేసిన డివైడర్లు ఎందుకు చిన్నగా ఉన్నాయని ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్, కౌన్సిలర్ల ముందే అవమానించారు. పార్కులు అభివృద్ధి చేయాలని కోరితే అమరవీరుల స్తూపం సాక్షిగా తీవ్రంగా అవమానించారు. మున్సిపాలిటీ లో ఎలాంటి పర్యటనలు చేయకూడదు. కనీసం రూ.10 వేల విలువ గల పనికి కూడా కొబ్బరికాయ కొట్టలేని దయనీయస్థితి. పేరుకే మున్సిపల్ చైర్‌పర్సన్‌ని. పెత్తనం ఎమ్మెల్యేదే..’ అని చెప్పారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడానికి బేరం ‘నాలుగేళ్లలోపు అవిశ్వాసాలు పెట్టరాదని తెలిసినా ఎమ్మెల్యే కౌన్సిలర్లను బెదిరించి అవిశ్వాస తీర్మానం డ్రామా ఆడారు. చైర్పర్సన్ పదవిని అమ్ముకోవడా నికి ఓ మహిళా కౌన్సిలర్ భర్తతో బేరం కుదుర్చుకు న్నారు. కర్కశత్వం, మూర్ఖత్వం, క్రూరత్వం కలిపితే ఎమ్మెల్యే సంజయ్. ఆయనతో మాకు ఆపద పొంచి ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మె ల్యేనే కారణం. మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎస్పీగారిదే’ అని శ్రావణి తెలిపారు. శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే నేను చైర్పర్సన్ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్ ఇచ్చిందే నేను. అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో నా ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేను. – ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
భారీ షాక్, జొమాటోకు సీటీవో గుంజన్ గుడ్ బై!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థ కోఫౌండర్, సీటీవో గుంజన్ పటిదార్ తన పదవికి రాజీనామా చేశారు. స్టార్టప్ నుంచి మార్కెట్ కేపిటల్ వేలకోట్ల విలువైన సంస్థగా జొమాటోను తీర్చిదిద్దిన వారిలో పటిదార్ ఒకరంటూ మార్కెట్ రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జొమాటో తెలిపింది. గత పదేళ్లకుపైగా గుంజన్ తన సామర్ధ్యంతో సంస్థ కేపిటల్ వ్యాల్యూని,విలువల్ని పెంచేలా టెక్నాలజీ, మహిళా ఉద్యోగుల్ని నిష్ణాతులైన నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇలా ఆయన సంస్థకు చేసిన సేవలు వెలకట్టలేవని ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే కంపెనీ నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. తలోదారి చూసుకుంటున్నారు సంస్థ పనితీరు, కోవిడ్ భయాలు, ఆర్ధిక మాంద్య ప్రభావం..లేదంటే ఇతర కారణాలు కావొచ్చు. గతేడాది నుంచి జొమాటోలో పనిచేస్తున్న ఉన్నతస్థాయి ఉద్యోగులు ఆ సంస్థ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. తలోదారి చూసుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో గతేడాది నవంబర్‌లో మరో కోఫౌండర్ మోహిత్ గుప్తా జొమాటోకు గుడ్‌బై చెప్పారు. నాలుగున్నరేళ్ల క్రితం జొమాటోలో చేరిన గుప్తా..2020లో దాని ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ పదవి నుంచి సహ వ్యవస్థాపకుడిగా ప్రమోషన్ పొందారు. ఇప్పటికే ఇంటర్సిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సిద్ధార్థ్ ఝవార్,సహ వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తాలు రాజీనామా చేసిన వారిలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
ట్విటర్ సీఈఓగా రాజీనామా చేస్తా.. కానీ అలాంటి వారు దొరకాలి: ఎలాన్ మస్క్
ట్విట్టర్ సీఈవో పదవి నుంచి తప్పుకునే అంశంపై ఎలాన్ మస్క్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఆ పదవిని చేపట్టేంత మూర్ఖత్వం ఉన్నవారెవరైనా దొరికిన వెంటనే నేను తప్పుకుంటా. కేవలం సాఫ్ట్వేర్, సర్వర్ టీమ్‌లను చూసుకుంటా‘ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. తాను ట్విట్టర్ హెడ్‌గా కొనసాగాలా వద్దా చెప్పండంటూ మస్క్ ట్విటర్లో రెండు రోజుల క్రితం పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 57.5% మంది ఆయన తప్పుకోవాలంటూ ఓటు వేశారు. అయితే ఓటింగ్ ఫలితాలపై తక్షణం మాట్లాడనని మస్క్ 2 రోజుల తర్వాత స్పందించారు. అక్టోబర్‌లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేసినప్పట్నుంచి కంపెనీ చీఫ్ బాధ్యతల్లో ఆయనే కొనసాగుతున్నారు. టేకోవర్ తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు సగం పైగా సిబ్బందిని తొలగించడంతో పాటు మస్క్ కంపెనీలో పలు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. I will resign as CEO as soon as I find someone foolish enough to take the job! After that, I will just run the software & servers teams. — Elon Musk (@elonmusk) December 21, 2022 చదవండి: యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్! -
పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం : ఎమ్మెల్యే సీతక్క
-
కాంగ్రెస్‌ను తిట్టిపోసి బయటకొచ్చిన నాయకుడికి బీజేపీ కీలక బాధ్యతలు
గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేసి భారతీయ జనతా పార్టీలోకి చేరిన కాంగ్రెస్ నాయకులకు కీలక భాద్యతలు కట్టబెట్టింది బీజేపీ. ఈ మేరకు పార్టీ నిర్ణయాధికారాలు యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ ఘోరంగా కాంగ్రెస్‌ని ఘోరంగా తిట్టి రాజీనామా చేసి వచ్చిన జైవీర్ షెర్గిల్‌ను బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించింది. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్‌లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం బీజేపీలో యూపీ మంత్రి స్వతంత్రదేవ్ సింగ్, ఉత్తరాఖండ్ బీజేపీ మాజీ మదన్ కౌశిక్, కాంగ్రెస్ మాజీ నాయకుడు రాణా గుర్మిత్‌సింగ్ సోధీ, పంజాబ్ మాజీ మంత్రి మనోరంజన్ కాలియా తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, గతేడాది పంజాబ్‌లో అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఎన్నికల ముందుకు కొత్తపార్టీని స్థాపించి బీజేపీలో విలీనం చేశారు. గత కొన్నేళ్లుగా ఎన్నికల పరాజయాలు, సంస్థాగత ప్రకంపనలతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకులను కోల్పోయింది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, యూపీ మంత్రి జితన్ ప్రసాద్ నిష్క్రమణతో 2020నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కేంద్ర మాజీ మంత్రులు కపిల్ సిబల్, అశ్వనీ కుమార్, ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అలాగే అనుభవజ్ఞులైన గులాం నబీ అజాద్, ఆనంద్ శర్మలు తమ సొంత రాష్ట్రాల్లో పార్టీ పదువులకు ఆగస్టులో రాజీనామా చేశారు. (చదవండి: యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్.. అఖిలేష్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్!) -
నైకా సీఎఫ్‌వో అరవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్ అమెజాన్ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు. -
చాలా బాధతో కాంగ్రెస్‌తో బంధాన్ని తెంచుకుంటున్నాను: మర్రి శశిధర్‌రెడ్డి
-
కాంగ్రెస్‌కు గుడ్‌బై.. మర్రి శశిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణ బాగు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా.. కాంగ్రెస్‌కు కేన్సర్ సోకిందని ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆయనను పార్టీ అధిష్ఠానం ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. 25 లేదా 26న బీజేపీలోకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోయిందని, సరైన నాయకత్వం లేకనే ఈ పరిస్థితి దాపురించిందని శశిధర్‌రెడ్డి సోమవారమే అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని పట్టించుకోకపోవడం వల్లే తాను బయటకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన శశిధర్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్లు, మైనారిటీ నేతలతో బేగంపేటలోని తన కార్యాలయంలో సోమవారం సమా వేశమయ్యారు. తాను బీజేపీలో చేరాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదని, బీజేపీ మాత్రమే మైనార్టీల అభివృద్ధికి పాటుపడుతోందని, తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఈ నెల 25 లేదా 26వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలతో జాగ్రత్త.. కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం -
జొమాటోకు భారీ షాక్, కో-ఫౌండర్ రాజీనామా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కో ఫౌండర్ మోహిత్ గుప్తా ఆ సంస్థకు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రిజైన్‌పై నోట్‌ను విడుదల చేసిన గుప్తా.. అందులో జొమాటో సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ‘సంవత్సరాల తరబడి మేము నేర్చుకున్న ప్రతిదానిని మీరు కొనసాగించడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కనికరం లేకుండా ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ప్రపంచానికి రోల్ మోడల్‌గా ఉండేలా సంస్థను నిర్మించండని’ అని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ జొమాటోను లాభదాయకమైన వ్యాపారం గా మార్చేందుకు ఫౌండర్ దీపిందర్ గోయల్, ఉద్యోగుల్ని కృషి చేశారని గుప్తా ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా దీపిందర్ గోయల్ మరింత పరిణతి చెందిన, నమ్మకమైన లీడర్‌గా మారడం నేను చూశాను. అతను ఇప్పుడు మీ అందరితో కలిసి వ్యాపారాన్ని ఉజ్వలమైన భవిష్యత్తుకు నడిపించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు’ అని చెప్పారు. -
ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత
-
కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాజస్థాన్ ఇన్ఛార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అజయ్ మాకెన్ రాజీనామాతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడినట్లయింది. అయితే మాకెన్ రాజీనామాకు బలమైన కారణమే ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. సెప్టెంబర్‌లో సీఎం అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు కొందరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే అంగీకరించే ప్రసక్తే లేదని వారు తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని స్పీకర్ దగ్గరకు వెళ్లడం అప్పట్లో కలకలం రేపింది. వీరి కారణంగానే అశోక్ గహ్లోత్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు వ్యవహారంలో ముఖ్యంగా ముగ్గురు నేతలు శాంతి ధరివాల్, మహేశ్ జోషి, ధర్మేంద్ర రాఠోడ్ కీలకంగా వ్యవహరించారు. వీరే సెప్టెంబర్ 25న కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి డుమ్మాకొట్టి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయంపైనే కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి నోటీసులు కూడా పంపింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజయ్ మాకెన్ కూడా పార్టీ అధిష్ఠానికి ఇప్పటికే స్పష్టం చేశారు. చర్యలు లేకపోవడంతో.. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఆ ముగ్గురు నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అజయ్‌మాకెన్ కలత చెందారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండి ఏం ప్రయోజనం అని భావించి రాజీనామా చేసినట్లు చెప్పారు. నవంబర్ 8నే రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారని వెల్లడించారు. అయితే ఖర్గే ఆయన రాజీనామాను అమోదించలేదని, పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం అజయ్ మాకెన్ వారం రోజులు వేచిచూసినప్పటికీ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సచిన్ పైలట్ కూడా రెండు వారాల క్రితమే రాజస్థాన్ కాంగ్రెస్‌లో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అధిష్ఠానం నుంచి ఆ దిశగా ఎలాంటి అడుగు పడకపోవడంతోనే అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ కారణంగానే ఆయన రాహుల్ భారత్ జోడో యాత్రకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గుజరాత్లో ట్విస్ట్.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థి కిడ్నాప్.. ఆ తర్వాత.. -
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...!
అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని...! -
మంత్రి కొప్పుల ఈశ్వర్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
-
ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు! వచ్చే 12 నెలల్లో..
ముంబై: ఐటీ రంగంలో సగం మంది నిపుణులు (53 శాతం మంది) వచ్చే ఏడాది కాలంలో నూతన ఉద్యోగంలో చేరిపోవచ్చని ‘స్కిల్‌సాఫ్ట్ 2022 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ’ నివేదిక తెలిపింది. మెరుగైన పారితోషికంతోపాటు, ప్రస్తుత ఉద్యోగంలో శిక్షణ, పురోగతి లేకపోవడం, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపించడం కారణాలుగా పేర్కొంది. ఐటీల్లో టీమ్ లీడర్లు, ఆపై స్థాయి ఉన్న వారు తమ బృందంలో నైపుణ్యాల లోటును ఎదుర్కొంటున్నట్టు స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. నిపుణుల వలస, తిరిగి నిపుణులను ఆకర్షించడం అనే రెండు పెద్ద సవాళ్లను ఐటీ రంగం ఎదుర్కొంటున్నట్టు నివేదిక ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది వచ్చే 12 నెలల్లో తాము కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చని చెప్పారు. సుమారు 8,000 మంది స్కిల్‌సాఫ్ట్ సర్వేలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీకి మారే విషయంలో ఉన్న వేగం, తగినన్ని సాంకేతిక వనరులు లేకపోవడం ఐటీ నిపుణులను కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. ‘‘అధ్యయనం అన్నది ఉద్యోగులు, సంస్థల పరస్పర అభివృద్ధికి ప్రేరణనిస్తుంది. ముఖ్యంగా నిపుణులను కాపాడుకోవడంలో ఉన్న ఇబ్బందులు, ఆవిష్కరణల వేగం దృష్ట్యా సంస్థలకు శిక్షణ ఎంతో సాయపడుతుంది’’అని స్కిల్‌సాఫ్ట్ జనరల్ మేనేజర్ జాచ్ సిమ్స్ పేర్కొన్నారు. నేర్చుకునే సంస్కృతి ఏర్పాటు చేయడం, నైపుణ్యాల అభివృద్ధి అన్నవి విజయానికి కీలకమన్నారు. నైపుణ్యాలు కలిగిన ఆశావహల నియామకం, వారిని కాపాడుకునే విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చదవండి: జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్వర్క్ పొందండిలా! -
బీజేపీకి మరో షాక్.. స్వామిగౌడ్ రాజీనామా.. టీఆర్ఎస్లో చేరిక
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యా గౌడ్, దాసోజ్ శ్రవణ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు మరో కీలక నేత తిరిగి టీఆర్ఎస్లో గూటికి చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బండి సంజయ్‌కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే దాసోజు శ్రవణ్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని, అది తనకు బాధ కల్గించిందని స్వామిగౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా బీసీల పట్ల ఆ పార్టీ తీరు ఆక్షేపణీయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న స్వామిగౌడ్.. 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే 2020లో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక రెండేళ్లకే బయటకు వచ్చారు. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు -
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా...
-
వీరప్పన్‌ను మట్టుబెట్టిన పోలీసు అధికారి రాజీనామా
న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్, కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్‌ను పక్కా ప్రణాళికలతో మట్టుబెట్టిన ఐపీఎస్ మాజీ అధికారి కే విజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత హోంశాఖ అధికారులకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన విజయ్ కుమార్.. ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని చెన్నైకి మార్చుకున్నట్లు వెల్లడించారు. ‘వ్యక్తిగత కారణాలతో హోంశాఖలో నిర్వర్తిస్తున్న నా బాధ్యతలకు స్వస్తి చెప్పి.. ప్రస్తుతం చెన్నైకి మారాను.’ అని విజయ్ కుమార్ తెలిపారు. మరోవైపు.. హోంశాఖ భద్రతా సలహాదారుగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సహకారం అందించిన హోంశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కశ్మీర్ లోయలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ఆయన సలహాలు కేంద్ర ప్రభుత్వానికి ఎంతగానే ఉపయోగపడ్డాయని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 1975 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ హోదాలో 2012లో పదవీ విరమణ చేశారు. అనంతరం హోంశాఖ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గవర్నర్‌కు భద్రతా సలహాదారుగా విజయ్‌కుమార్‌ను కేంద్రం నియమించింది. అంతకుముందు తమిళనాడులో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలోనే 2004లో పక్కా ప్రణాళికతో కిల్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టారు. చెన్నై పోలీస్ కమిషనర్‌గానూ, జమ్ముకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ ఐజీగానూ విజయ్‌కుమార్ విధులు నిర్వర్తించారు. ఇదీ చదవండి: పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి.. -
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి
పాట్నా: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయం రంగంలో అవినీతిపై ప్రశ్నించారు. బీజేపీ-జేడీయూ పాలనలో జరిగినట్లే ఇప్పుడూ జరిగితే తాను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ లక్ష్యాలను దారిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామని సుధాకర్ అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే రాజీనామా చేశారు. సుధాకర్ సింగ్ రాజీనామాను ఆయన తండ్రి, బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ధ్రువీకరించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాళ్ల పక్షాన ఒకరు నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. 2006లో ఎన్డీఏ హయాంలో సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నప్పుడే ఈ చట్టాన్ని రద్దు చేయడం గమనార్హం. సుధాకర్ సింగ్ తరచూ తన శాఖలో జరుగుతున్న అవినీతిని బహిరంగంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతు సమస్యలను తీర్చలేకపోతే ఈ పదవి ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా -
శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిపక్ష నేత పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆయన శుక్రవారమే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు కట్టుబడి ఒక్కరికి ఒకే పదవి అనే నిబంధనను పాటిస్తూ ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపినట్లు సమాచారం. ఖర్గే రాజీనామాతో రాజ్యసభ ప్రతిపక్షనేతగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్‌లలో ఒకరు ఎంపికయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ శుక్రవారంతో(సెప్టెంబర్ 30) ముగిసింది. ఖర్గేతో పాటు శశిథరూర్, ఆర్ఎన్ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. థరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా 25ఏళ్ల తర్వాత కాంగ్రెస్ చీఫ్‌గా ఓ దక్షిణాది నాయకుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడి నుంచి చివరిసారి 1994లో పీవీ నరసింహారావు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. గాంధీ కుటుంబం విధేయుడు కావడం, సుదీర్ఘ అనుభవం, దళిత నేత వంటి కారణాలు ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. పోటీ నుంచి తప్పుకున్న అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్ సహా కాంగ్రెస్ జీ-23నేతలు కూడా ఖర్గేకే మద్దతు తెలిపారు. దీంతో ఆయన విజయం నల్లేరుపై నడకే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. చదవండి: చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన మోదీ -
Kona Raghupathi: డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. సోమవారం కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. చదవండి: (అశ్వనీదత్, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని) -
రాహుల్ పర్యటన వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కీలక నేత రాజీనామా
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హస్తం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. వివరాల ప్రకారం.. గుజరాత్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం అధిష్టానానికి లేఖ రాశారు. ఆ లేఖలో తాను కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే విశ్వనాథ్‌సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా మాత్రం చెప్పలేదు. మరోవైపు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సోమవారం(సెప్టెంబర్ 5న) గుజరాత్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ చీఫ్ వాఘేలా పార్టీని వీడటం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. కాగా, కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్ పాల్గొంటారు. అలాగే సెప్టెంబర్ 5న అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్‌లో బూత్ స్థాయి కార్యకర్తల ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఇక, వాఘేలా రాజీనామాపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ‘రాహుల్ గాంధీ రేపు గుజరాత్‌కు వస్తున్నారు. ‘కాంగ్రెస్‌లో చేరండి’ అనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే గుజరాత్లో ‘క్విట్ కాంగ్రెస్ ప్రచారం’ కొనసాగుతోంది’ అని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, గుజరాత్ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అలాగే, ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గుజరాతీలను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సర్వేలు సైతం ఆప్ గెలుస్తుందని చెబుతున్నాయని కేజ్రీవాల్ వ్యాఖ్యలు కూడా చేశారు. Ahead of @RahulGandhi 's Gujarat Visit, a Big blow for #Gujarat #Congress , @IYCGujarat President Vishwanath Singh Vaghela resigned from the Primary member Ship of @INCGujarat , he may join @BJP4Gujarat soon.@NewIndianXpress@TheMornStandard@santwana99 pic.twitter.com/80niFKbvbI — Dilip Singh Kshatriya (@Kshatriyadilip) September 4, 2022 -
చేరుతారట కానీ! మళ్లీ పార్టీ వీడరని గ్యారంటీ ఏంటని అడుగుతున్నార్సార్!
చేరుతారట కానీ! మళ్లీ పార్టీ వీడరని గ్యారంటీ ఏంటని అడుగుతున్నార్సార్! -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్
అగర్తలా: దేశవ్యాప్తంగా పాలిటిక్స్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఉద్ధండులు తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, గుర్తింపు తెచ్చుకుని ఉన్నఫలానా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా త్రిపురలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. టీఎంసీకి ఆ పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ రాష్ట్ర ఇన్ఛార్జ్కు అందించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో.. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్‌ని తొలగించిన కొద్ది రోజులకే ఇలా.. బాసిత్ ఖాన్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సుబల్ భౌమిక్‌ను పార్టీ అత్యున్నత స్థానం నుంచి తొలగించడంపై పార్టీ అధిష్టానం ఎటువంటి కారణం చెప్పకుండానే బాధత్యల నుంచి తొలగించింది. మరోవైపు.. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. టీఎంసీకి, మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. The vice-president of the #Tripura unit of TMC, Abdul Basit Khan, resigned from the party. (@RittickMondal)https://t.co/rYeBLZiYWp — IndiaToday (@IndiaToday) August 28, 2022 -
Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా ప్రభావం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపైనా పడింది. ఆయన పార్టీని వీడిన మరుసటి రోజే ఆజాద్ అనుచరుడిగా గుర్తింపు పొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.ఎ. ఖాన్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను శనివారం ఆయన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆలోచనల నుంచి దూరమైపోయిందని, మూలాలను కోల్పోయిందని లేఖలో ఖాన్ పేర్కొన్నారు. పార్టీకి పునర్వైభవం వచ్చే పరిస్థితులు కూడా లేవన్నారు. సోనియా అధ్యక్షురాలిగా ఉన్నంతకాలం సంప్రదింపులు జరిగేవని, ఆ తర్వాత అలాంటి సంప్రదాయం లేకుండా పోయిందని, ఏఐసీసీ కార్యాలయంలో, 10 జన్‌పథ్‌లో కోటరీ తయారైందని విమర్శించారు. జీ–23 పేరుతో సీనియర్లు గతంలో ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకొని ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. చదవండి: (14 రోజుల్లో ఆజాద్ కొత్త పార్టీ ప్రారంభం... ఊహించని ఝలక్) -
ఆజాద్ నిష్క్రమణ చెప్పేదేమిటి?
ఎన్నికల్లో ఓటమి పొందినప్పుడూ, జీ–23 నేతలు లేఖలు రాసినప్పుడూ మాత్రమే ఉనికి చాటుకునే కాంగ్రెస్ ఈమధ్యకాలంలో నేతలు పార్టీనుంచి తప్పుకున్నప్పుడు సైతం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా శుక్రవారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ నిష్క్రమించారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రులు కపిల్ సిబల్, అశ్వినీకుమార్ లతోపాటు జైవీర్ షేర్గిల్, హార్దిక్ పటేల్, సునీల్ జాఖడ్లున్నారు. మరో నేత ఆనంద్ శర్మ పార్టీ నుంచి తప్పుకోనంటూనే అధినేతలపై విమర్శలు చేశారు. హిమాచల్ ప్రచార సారథ్యం బాధ్యతలు తీసుకోదల్చుకోలేదని ప్రకటించారు. పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపైనా, ఆయన్ను పల్లెత్తు మాట అనని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపైనా ఆజాద్ పోతూ పోతూ పదునైన విమర్శలే చేశారు. అయితే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అవన్నీ గత పది పన్నెండేళ్లుగా పార్టీని వీడి పోతున్నవారంతా చెబుతున్నవే. వానాకాలం వచ్చిందంటే జనావాస ప్రాంతాల్లో శిథిల భవంతు లపై స్థానిక సంస్థల అధికారులు ఆరా తీస్తారు. అక్కడ ఎవరైనా నివసిస్తుంటే ఖాళీ చేయిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ అలాంటి శిథిలావస్థలోనే ఉంది. అందులో ఉండటం రాజకీయంగా ముప్పు కలిగిస్తుందన్న భయంతో కొందరు నిష్క్రమిస్తుంటే... వేరేచోట అవకాశం దొరక్క తప్పనిసరై ఉండి పోతున్నవారు మరికొందరు. నిష్క్రమిస్తున్నవారు అధికార వ్యామోహంతోనే ఆ పని చేస్తున్నారని రాహుల్, సోనియా విధేయులు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. జనాగ్రహం సెగ తగిలి అధికారానికి దూరం కావటం పార్టీకి కొత్తేమీ కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించిన చరిత్ర ఆ పార్టీకుంది. కానీ ఇప్పటి స్థితి వేరు. కాంగ్రెస్ జవసత్వాలతో ఉన్నదనీ, చిత్తశుద్ధితో, కలిసికట్టుగా ప్రయత్నిస్తే గత వైభవం ఖాయమనీ పార్టీ శ్రేణులు నమ్మడానికి తగిన పరిస్థితులు లేవు. కోటరీలే అక్కడ కొలువు దీరాయి. భజన బృందాలదే అక్కడ పైచేయి అయింది. జనాదరణ ఉన్న నేతలపై చాడీలు చెప్పేవారే ఎక్కువయ్యారు. వారికే పార్టీలో పెద్ద పీట. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమి తప్పకపోవటం, నెగ్గిన చోట్ల సైతం అధికార భ్రష్ఠత సంప్రాప్తించటం స్వీయ వైఫల్యాలు, ముఠా కుమ్ములాటల పర్యవ సానమే. కనీసం వీటిపై సక్రమంగా సమీక్షలు జరిగితే, ఏం చేయాలన్న అంశంలో అందరి అభి ప్రాయాలూ తెలుసుకుంటే మున్ముందు నష్టాలు రాకుండా చూసుకునే వీలుండేది. కానీ ఆ సమీక్షల జాడ లేదు. ఇలాంటి దుస్థితిలో ఆజాద్ పార్టీని వీడారంటే ఆశ్చర్యపడాల్సిందేముంది? అయితే పార్టీ వర్తమాన దుస్థితికి తనను మినహాయించుకుని కారణాలు వెదకటం ఆజాద్‌కు తగదు. పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేయడంతోపాటు సంతోష, సంక్షోభ సమయాల్లో అధిష్ఠాన వర్గం దూతగా, పార్టీ పరిశీలకుడిగా, రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఎన్నో అవతారాలెత్తి పెత్తనం చెలాయించిన ఆజాద్‌కు ఇన్ని దశాబ్దాలుగా పార్టీలో పైనుంచి కిందివరకూ ఏం జరుగు తున్నదో తెలియలేదని ఎవరైనా అనుకుంటే వారి అమాయకత్వం. కాంగ్రెస్ సంస్కృతిగా స్థిరపడిన అనేక అవలక్షణాలకు ఆజాద్ కూడా బాధ్యుడే. అందులో తనకు కర్తృత్వం లేదని ఆయన వాదించ వచ్చు. అలా చూసినా సీనియర్ నేతగా ఆ అవలక్షణాలను అడ్డుకున్నదెక్కడ? రాహుల్ పార్టీలోకి ప్రవేశించాక, ముఖ్యంగా 2013లో పార్టీ ఉపాధ్యక్షుడయ్యాక సంస్థాగత సలహాసంప్రదింపుల వ్యవస్థ ధ్వంసమైందన్న ఆయన ఆరోపణలో అబద్ధమేమీ లేదు. కానీ అంతక్రితం ఏమంత సవ్యంగా ఉన్నదని! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చని పోయాక ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోనియా గాంధీ కక్షగట్టి అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బందులపాలు చేసినప్పుడు ఆజాద్ సీనియర్ నేతగా నిర్వహించిన పాత్రేమిటి? అదేమీ లేకపోగా హైదరాబాద్కొచ్చినప్పుడు ‘మా మాట వింటే జగన్ కేంద్ర మంత్రి అయ్యేవారు, ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు...’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి మరిచారా? అధికారంలో ఉండగా అధినేతలకు పరమ విధేయత నటించడం, అది కోల్పోయాక రాళ్లు రువ్వడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. తప్పును తప్పని సూటిగా చెప్పలేకపోతే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కనీసం అలా చెప్పేవారికైనా అండగా నిలవాలనీ, వారు లేవనెత్తే అంశాల్లో హేతుబద్ధత ఉన్నదనీ అధిష్ఠానానికి చెప్పాలని అనిపించని సీనియారిటీకి విలువేముంటుంది? ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ఏలుబడి సాగుతోంది. తమిళనాడు, జార్ఖండ్‌లలో అధికార కూటముల్లో భాగస్వామిగా ఉంది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్‌కు అధికారయోగం అసాధ్యం. అక్కడ కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేసిందని సర్వేలు చెబుతున్నాయి. మరో రాష్ట్రం మేఘాలయాలో మహా అయితే అధికార కూటమిలో మైనారిటీ పక్షంగా కొనసాగే చాన్సుంది. దేశంలో మరెక్కడా ఆ పార్టీకి ఆశాజనకమైన స్థితి లేదు. అంతర్గతంగా చూస్తే నాయకత్వం నిస్తేజంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో జరగాల్సిన ఎన్నికలు కాస్తా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. మంచి రోజుల్లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు అంటున్నాయి. సుముహూర్తాలు చూసుకుంటే సరిపోదు. ఎదురయ్యే వైఫల్యాలపై ఆత్మవిమర్శ ఉండాలి. స్వీయలోపాలపై దృష్టి సారించాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు విలువివ్వాలి. ముఠా సంస్కృతిని ప్రోత్సహించడం ఆపాలి. అంతవరకూ కాంగ్రెస్‌కు మంచి రోజులు రావు. ఉండవు. -
బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా
పాట్నా: బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన.. చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు. ఇదీ చదవండి: బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్ -
కోమరంభీం జిల్లాలో టీఆర్ఎస్కు షాకిచ్చిన నేతలు... లేఖలో ఆవేదన
సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇచ్చిన హమీలు నేరవేయడం లేదని ముగ్గురు సర్పంచ్‌లు, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీతో పాటు కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బెజ్జూర్ సహాకర సంఘం డైరెక్టర్ రాజీనామా చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోడవం వల్లే రాజీనామా చేశామని సదరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి లేఖ రాశారు. -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్
Pavan Varma.. దేశవ్యాప్తంగా రాజీకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీహార్‌లో బీజేపీకి హ్యాండ్ ఇస్తూ నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఇంతకు ముందు బీజేపీతో కలిసి ఉండటాన్ని ఇష్టపడని కొందరు నేతల జేడీయూను వీడారు. తాజాగా బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవడంతో నేతలు మళ్లీ నితీష్ చెంతకు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎంపీ పవన్ వర్మ శుక్రవారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ‘మమతా జీ, ఏఐటీసీ కార్యాలయానికి పంపిన నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. మీ ఆప్యాయత, మర్యాదలకు ధన్యవాదాలు చెబుతున్నాను. మీతో సంప్రదింపులు జరిపేందుకు నేను ఎదురుచూస్తున్నాను. మీకు అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, గతంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని పవన్ కుమార్ తప్పుపట్టారు. ఈ సందర్భంలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీశ్ కుమార్ సమర్థించడాన్ని పవన్ వర్మ వ్యతిరేకించారు. . బీజేపీ-ఆర్ఎస్ఎస్పై నితీశ్ కుమార్ కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో, పవన్ వర్మను జేడీయూ సస్పెండ్ చేసింది. అనంతరం, ఆయన మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా, తాజాగా నితీష్ కుమార్.. బీజేపీకి గుడ్ బై చెప్పడంతో పవన్ వర్మ టీఎంసీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మళ్లీ పవన్ వర్మ.. నితీష్ గూటికి చేరుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పవన్ వర్మ టీఎంసీలో చేరి ఏడాది కూడా కాకపోవడం విశేషం. Pavan Varma joined TMC in November 2021. In January 2020, he was expelled from JD(U) over his open criticism of Nitish Kumar's support for the controversial Citizenship Amendment Act. https://t.co/oa1arCypqc — The Wire (@thewire_in) August 12, 2022 ఇది కూడా చదవండి: శశిథరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం -
వారితో రాజీనామా చేయించు.. కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, యాదాద్రి/హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యముంటే టీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. 9వ రోజు ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఆయన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చేరు కున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘మీరు రాముడి వారసులైతే బీజేపీకీ ఓటేయాలి. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు అధికా రం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి’ అని కోరారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కేసీఆర్ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 200 కి.మీ. దూరంలో ఉన్న తన ఫాంహౌస్ నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కనీసం రూ.700 కోట్లు వెచ్చించలేకపోతున్నారని విమర్శించారు. నిధుల్లేకనే ధర్మారెడ్డిపల్లె, బునాదిగాని, పిలాయిపల్లి కాలువలు పూర్తి కావడంలేదని అన్నారు. కేసీఆర్‌కు వయసు మీదపడి డిప్రెషన్లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రామన్నపేటలో రైళ్లు నిలిచేవిధంగా కేంద్రంతో మాట్లాడతానని ఆయన స్థానికులకు హామీనిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయని అన్నారు. సంజయ్ 9వ రోజు 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చదవండి: కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం! -
వరంగల్: టీఆర్ఎస్కు రాజయ్య షాక్
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ ఇచ్చారు సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజయ్య యాదవ్.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పరిస్థితులపై, సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమ టైంలో కేసీఆర్ వెంట నడిచిన రాజయ్య యాదవ్.. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకంగా వ్యహరించారు. కేసీఆర్‌తో పాటు ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురు సీనియర్ నేతలతో రాజయ్య యాదవ్ ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టై ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు జైల్లోనూ గడిపారు రాజయ్య యాదవ్. గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పని చేశారు కూడా. ఇవాళ పార్టీకి రాజీనామా ప్రకటించిన సందర్భంలో ఇవాళ ఆయన హాట్ కామెంట్లు చేశారు. ► 22 సంవత్సరాలపాటు పార్టీలో కొనసాగానని, కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగానని, ఇప్పుడు చాలా కష్టంగా పార్టీని వీడుతున్నానని రాజయ్య యాదవ్ తెలిపారు. ► ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో చాలా మార్పు వచ్చిందని, మునుపటిలా పార్టీ సీనియర్లను గౌరవించడం లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తనయుడు కేటీఆర్ కోసం పార్టీ సీనియర్లను కేసీఆర్ తొక్కిపడేశారని, పార్టీతో సంబంధలేని వాళ్లు, బయటివాళ్లదే టీఆర్ఎస్ రాజ్యమయ్యిందని రాజయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ► రాష్ట్రం కోసం పోరాడామని, సాధించిన రాష్ట్రంలో ఉద్యమకారులకే స్థానం లేకుండా పోయిందని, కొంతమంది బాధలో ఉన్నారని, తాను మాత్రం ఆ బాధ నుంచి విముక్తి చెందుతున్నానని పేర్కొన్నారు. ► తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని.. తన, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడాల్సి వస్తోందని కామెంట్లు చేశారు. ► టీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఉదమ్యకారులకు బాధే మిగులుతుంది. టీఆర్ఎస్ కోసం పని చేసినవాళ్లను అవమానకరంగా చూస్తున్నారు. నాకు కాళ్లు మొక్కడం అలవాటు లేదు. ఏదైనా తప్పు చేశానని పార్టీ నుంచి తొలగించినా బాగుండేది. ఏదీ జరగడం లేదు. ► పార్టీలో కొందరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని రాజయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల టైం నడుస్తోందని, కానీ, ఇలా ప్రవర్తించిన పార్టీలు రాజకీయ చరిత్రలో కనుమరుగైన సందర్భాలున్నాయని గుర్తించాలని హితవు పలికారాయన. ► ఆత్మ గౌరవం లేనిచోట ఎవరూ ఉండరు. రేపో మాపో మరికొందరు పార్టీని వీడతారు. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కానీ, ఆ పార్టీ బలహీనంగా ఉండడంతో బీజేపీ వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. బీజేపీ నేతలు నాతో కూడా టచ్ లో ఉన్నారు అని రాజయ్య యాదవ్ తెలిపారు. -
ఇటలీ ప్రధాని రాజీనామా
రోమ్: ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పక్షం 5–స్టార్స్ మరో రెండు పార్టీలు బహిష్కరించాయి. దీంతో ద్రాఘి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు 5–స్టార్స్ పార్టీ ప్రకటించడంతో గత వారమే ఆయన రాజీనామా చేసినా అధ్యక్షుడు ఆమోదించలేదు. తాజా పరిణామాలతో మరో సారి అందజేసిన రాజీనామా లేఖను మట్టరెల్లా ఆమోదించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని ద్రాఘిని కోరారు. దీంతో, అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశముందని భావిస్తున్నారు. -
అనూహ్యం.. అధ్యక్ష పదవికి గోటబయ రాజీనామా!
సింగపూర్: ప్రజాందోళనలకు తలొగ్గిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా దేశం విడిచిపారిపోయిన ఆయన.. మాల్దీవులు అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య ఇవాళ సింగపూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌జెట్‌లో సింగపూర్ చేరుకున్న వెంటనే.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. జులై 13నే రాజీనామా చేస్తానని ప్రకటించిన రాజపక్స.. చెప్పాపెట్టకుండా మాల్దీవులకు పారిపోయాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రధాని నివాసం, ఆపై స్పీకర్ నివాసాలపై దాడులకు దిగారు నిరసనకారులు. ఈ క్రమంలో లంకలో అత్యవసర పరిస్థితి, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, మిలిటరీ పహారా నడుమ శాంతి భద్రతలను రక్షిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. ప్రజల నిరసనలు తారాస్థాయికి చేరిన క్రమంలో రాజీనామా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. #SriLankaCrisis pic.twitter.com/Ye0V2uOSYT — NDTV (@ndtv) July 14, 2022 #WATCH Colombo | People celebrate at Galle Face Park following the resignation of Sri Lankan President Gotabaya Rajapaksa pic.twitter.com/cfWNYrpIdJ — ANI (@ANI) July 14, 2022 -
రాజ్యాంగంపై విమర్శలు: ఎట్టకేలకు మంత్రి సాజీ రాజీనామా
తిరువనంతపురం: భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన.. కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు. మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ఈ వ్యవహారంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ రూపకర్తలను చెరియన్ అవమానించారంటూ వ్యతిరేక నినాదాలు చేశాయి విపక్షాలు. ఈ క్రమంలో చర్చ జరగకుండానే.. స్పీకర్ ఎంబి రాజేష్ సభను వాయిదా వేశారు. ఈ చర్యపై నిరసన వ్యక్తం చేస్తూ.. స్పీకర్ కార్యాలయంలో విపక్షాలు నిరసన చేపట్టాయి. చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు ఆయనే రాజీనామా చేశారు. -
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిల్చునే అవకాశాలు ఉన్నట్లు చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు
లండన్: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కలకలం రేపుతోంది. పార్టీ గేట్ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్ పనితీరు దారుణమంటూ లేఖలో సునక్ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్‌గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రధాని నాయకత్వంలో పని చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని సాజిద్ కూడా లేఖలో పేర్కొన్నారు. తానిక మళ్లీ మంత్రి చేపట్టకపోవచ్చని సునక్ చెప్పగా, జాతీయ ప్రయోజనాలను కన్జర్వేటివ్ పార్టీ సమర్థంగా కాపాడుతుందన్న ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయామంటూ సాజిద్ తన లేఖలో పదునైన విమర్శలు చేశారు. జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని తేల్చేశారు. వారి రాజీనామాకు ముందు మంగళవారం రోజంతా భారీ పొలిటికల్ డ్రామా నడిచింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా కీలక పదవిలో నియమించడం పొరపాటేనంటూ జాన్సన్ ప్రకటన చేశారు. అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ వెంటనే జాన్సన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఆయనకు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. -
TS: బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్
Badangpet Mayor Chigirintha Parijatha Narasimha Reddy: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో గులాబీ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
దేనికైనా రెడీ.. ఉద్దవ్ థాకరే సంచలన ప్రకటన
-
రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్‌కు టీఆర్ఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తక్షణం వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు ఘటనలో వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్ కుమారుడు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. వక్ఫ్‌బోర్డు కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు రావడంపై పార్టీ సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకునే బాధ్యతను హోంమంత్రి మహమూద్ అలీకి పార్టీ అప్పగించింది. పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాకు హోంమంత్రి సూచించారు. చదవండి: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు.. బాలిక రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు కాగా, బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు.. అధికారిక వాహనమా, లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్న వాహనమా అనే దానిపై స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. 2019లో ఖరీదు చేసిన ఆ వాహనం సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన దినాజ్ జహాన్ పేరుతో ఉంది. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ కేసులో నిందితుడైన ఓ బాలుడి తండ్రి దాన్ని లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కారు టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్టీఏ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. మరోవైపు వాహనం వివరాలు కోరుతూ దినాజ్ జహాన్‌తో పాటు వక్ఫ్ బోర్డుకు నోటీసులు ఇవ్వాలని, లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సమాధానాలు వస్తే.. అది వక్ఫ్‌బోర్డు లీజుకు తీసుకుని చైర్మన్‌కు కేటాయించిన అధికారిక వాహనమా? లేక చైర్మన్ వ్యక్తిగతంగా తీసుకున్నదా? అనేది స్పష్టం కానుంది. ఇక బెంజ్ కారు మాత్రం కేసులో నిందితుడైన ఓ బాలుడి తల్లి పేరుతో ఉందని, దాన్ని అతడే వినియోగిస్తున్నాడని తేల్చారు. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో ఆమెకూ నోటీసులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
టీడీపీ నన్ను మోసం చేసింది: దివ్య వాణి
-
నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు స్వరూపాన్ని బయటపెడుతూ.. ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నటి దివ్యవాణి. టీడీపీలో జరిగిన అవమానాలను ఏకరువు పెట్టిన ఆమె.. పార్టీ కోసం ఎంతో చేసినా తీవ్రంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్లో రాజీనామా ప్రకటన చేశారామె. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు దివ్యవాణి. ‘‘నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటారేమో. ఒక అర్టిస్టుగా పార్టీ కోసం వస్తే అన్ని రకాలుగా అణిచివేశారు. ఒక కళాకారుడు(స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ..) పెట్టిన పార్టీలో కళాకారులకు చోటు లేదు. మురళీమోహన్‌కు వ్యాపారాలు వేరే ఉన్నాయి కాబట్టి కొనసాగుతున్నారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా నన్ను మిగిల్చారు. మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే.. కనీసం గుర్తింపు కూడా లేకపోయిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిస్టుగా ఉన్న తాను టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఫైర్ బ్రాండ్‌గా ఎంతో సమయం వెచ్చించానని అయినా.. పార్టీ అధిష్టానం తనను మహానాడు వేదికగా అవమానించి పంపించిందని దివ్యవాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ లైన్ అంటే ఏంటో తెలుసుకుని ఎంతో కష్టపడ్డానని, అయినా కనీస న్యాయం ఏనాడు చేయలేదన్నారు దివ్యవాణి. ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారన్నారు దివ్యవాణి. @JaiTDPలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను.. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏 — DivyaVani (@DivyaVaniTDP) May 31, 2022 -
‘ముఖ్యమంత్రి’ అలక!.. కాంగ్రెస్‌కు రాజీనామా
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్ణాటక సీనియర్ నేత హెచ్ఎన్ చంద్రశేఖర్ అలియాస్ ముఖ్యమంత్రి చంద్రూ, పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్‌కు పంపాడు. కాంగ్రెస్‌కు ఉన్న చారిత్రక నేపథ్యం చూసి పార్టీలో చేరానని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని ఆయన రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. హెచ్ ఎన్ చంద్రశేఖర్.. కన్నడ నటుడు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించారు. ఎక్కువగా ఆయన సీఎం పాత్ర పోషించడంతో ‘ముఖ్యమంత్రి చంద్రూ’గానే ఆయన పాపులర్ అయ్యాడు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. జనతా పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గౌరీబిదానర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 1998 నుంచి 2004 దాకా ఎమ్మెల్సీగా కొనసాగారు. అటుపై 2013 వరకు కన్నడ డెవలప్మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీలో చేరారు. HN Chandrashekar కర్ణాటక తరపున రాజ్యసభ సీటు ఆశించారు. అయితే నిరాశ ఎదురుకావడంతోనే ఆయన పార్టీ వీడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రు అలకను కాంగ్రెస్ నేతలు కొందరు ధృవీకరించారు కూడా. అయితే ఆయన మాత్రం వ్యక్తిగత కారణం అని మాత్రమే చెబుతున్నారు. -
టీఆర్ఎస్కు గుడ్ బై.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గురువారం పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిద్దరికీ పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అయితే, భాగ్యలక్ష్మికి జడ్పీ చైర్‌పర్సన్‌గా మరో రెండేళ్ల కాలం ఉండటం విశేషం. ఇక, నల్లాల ఓదెలు 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ప్రభుత్వ విప్‌గా కూడా ఓదెలు పనిచేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణకు ప్రధాని మోదీ.. బీజేపీలో జోష్ Ex MLA Nallala Odelu garu & his wife Mancherial ZP chairperson Bhagyalakshmi garu joined Congress today in Delhi in presence of AICC Gen sec, Smt @priyankagandhi and TPCC president shri @revanth_anumula. pic.twitter.com/pUlSvcdgFk — Telangana Congress (@INCTelangana) May 19, 2022 -
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారాయన. 2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ ఎల్జీగా కొనసాగుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయనకు విబేధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, కీలక నిర్ణయాలకు సైతం ఎల్జీ హోదాలో అనిల్ బైజల్ బీజేపీ పర్యవేక్షణతోనే అడ్డుపుల్లలు వేస్తున్నారనే విమర్శలు చేసింది ఆప్ సర్కార్. -
త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్ రాజీనామా
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్‌దేవ్ రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిప్లవ్‌దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిన్ ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, బిప్లవ్‌దేవ్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత రోజే నేడు(శనివారం) రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రమే కొత్త సీఎంను అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు.. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్ -
Sri Lanka: లంక ప్రధాని రాజపక్స రాజీనామా
కొలంబో: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలు, లంకేయులు.. అధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. Sri Lanka Prime Minister Mahinda Rajapaksa has resigned - @news_cutter https://t.co/LXw10q0Vd9 #LKA #SriLanka #SriLankaCrisis — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) May 9, 2022 -
అనూహ్య పరిణామం.. కీలక పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హఠాత్తుగా ఆయన అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు కూడా పంపించారు. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్ రాజీనామాను ఆమోదించడంతో పాటు డాక్టర్ గోవింద్ సింగ్‌ను తదుపరి సీఎల్పీ నాయకుడిగా నియమించింది. కాగా కమల్‌నాథ్ సడన్‌గా తన పదవికి రాజీనామా ఎందుకు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏప్రిల్ 28న కమల్‌నాథ్‌కు రాసిన లేఖలో.. కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రతి పక్షనాయకుడి పదవికి మీరు చేసిన రాజీనామాను తక్షణమే ఆమోదించింది. సీఎల్పీ నాయకుడిగా మీరందించిన సహాయ సహకారాన్ని పార్టీ ధన్యవాదాలు తెలుపుతోందని అన్నారు. ఇకపై మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోవింద్ సింగ్ కొనసాగనున్నారు. చదవండి: BSP Mayawati: దేశానికి ప్రధాని కావాలన్నదే నా డ్రీమ్.. -
కర్ణాటక కాంట్రాక్టర్ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది?
బెంగళూరు: కాంట్రాక్టర్ సంతోష్‌పాటిల్ ఆత్మహత్య చేసుకోవడానికి పంటల తెగుళ్ల నివారణకు వాడే క్రిమిసంహారక మందు మోనోక్రోటోఫాస్ తాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సంతోష్‌పాటిల్ చిక్కమగళూరు వద్ద కైమర అనే గ్రామంలో 4 రోజుల పాటు ఒక హోంస్టేలో మకాం వేశాడు. ఆ తరువాత ఉడుపిలో లాడ్జి గది తీసుకున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. హోం స్టేలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ హుషారుగా ఉన్నాడని, వెళ్లేటప్పుడు అక్కడ కుక్కలకు బిస్కెట్లు వేశాడని తెలిసింది. హోం స్టే, లాడ్జి వద్ద సీసీ కెమెరాల చిత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వెంట వచ్చిన ముగ్గురు ఎవరని ఆరా తీశారు. ఈశ్వరప్ప అరెస్ట్‌కు కాంగ్రెస్ ధర్నాలు.. శివాజీనగర: కాంట్రాక్టర్ కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పను అరెస్టు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శనివారం నుంచి వారంరోజుల ఆందోళన ప్రారంభించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల 9 బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లా, తాలూకా కేంద్రాల్లో ధర్నాలు చేశారు. పాటిల్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఈశ్వరప్పను అరెస్టు చేసి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర జిల్లా వ్యాప్తిలో ధర్నా నిర్వహించారు. మంత్రిమండలి నుంచి తొలగింపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనతో మంత్రి పదవికి కే.ఎస్.ఈశ్వరప్ప రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన ఆ లేఖను సీఎం బొమ్మైకి ఇవ్వగా, అటు నుంచి గవర్నర్ గెహ్లాట్‌కు పంపారు. ఆ మేరకు ఈశ్వరప్పను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలిచ్చారు. -
కాంట్రాక్టర్ మృతి కేసు.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా!
కాంట్రాక్టర్ ఆత్మహత్యతో వివాదంలో చిక్కుకున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించిన ఈశ్వరప్ప.. గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశాడు. తనుకు మద్ధతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక రాజీనామా లేఖను ఈశ్వరప్ప శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి బసవరావ్ బొమ్మైకి సమర్పించనున్నట్లు తెలిపారు. ఈశ్వరప్ప దిగిపోవాలంటూ విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈశ్వరప్ప దిగిపోవాల్సిందేనని సీఎం బొమ్మై ఆదేశించినట్లు తెలుస్తోంది. Karnataka Minister KS Eshwarappa, whose name appeared in alleged suicide case of contractor Santosh Patil, says that he will handover his resignation to the Chief Minister tomorrow. Says, "Tomorrow I'm handing over the resignation letter to CM. I thank you all for co-operation." pic.twitter.com/vZFVrP4diI — ANI (@ANI) April 14, 2022 బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, బీజేపీ నేత సంతోష్ పాటిల్.. తన చావుకు మంత్రి ఈశ్వరప్ప కారణమని లేఖ రాసి ఉడిపిలోని ఓ లాడ్జీలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు కోట్ల రూపాయల రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి పేమెంట్ క్లియర్ చేయడానికి.. 40 శాతం కమీషన్ కోసం తన పీఏ ద్వారా మంత్రి ఈశ్వరప్ప వేధించాడంటూ సదరు కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతోపాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. ఈశ్వరప్పను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ భారీ ఆందోళనకు దిగింది. ఈశ్వరప్ప, ఆయన సన్నిహితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో మంత్రికి సీఎం బసవరాజు బొమ్మై సమన్లు జారీ చేశారు. అయితే దర్యాప్తు పూర్తయ్యేదాకా ఆయనపై చర్యలు ఉండబోవని సీఎం బొమ్మై చెప్పారు. ఈ లోపు కాంగ్రెస్ ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఇక.. తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని ఈశ్వరప్ప ఇదివరకే ఓ ప్రకటన చేశాడు కూడా. -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా
Sri Lanka finance minister Ali Sabry resigned: శ్రీలంక అప్పుల ఊబిలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం శ్రీలంకకి సుమారు రూ. 3 లక్షల కోట్ల విదేశీ అప్పు ఉంది. అందులో సుమారు 400 కోట్లు ఈ ఏడాది చెల్లించవలసి ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న తరుణంలో ఆర్థిక మంత్రి అలీ సబ్రీ ప్రమాణస్వీకారం చేసిన తదుపరి రోజే రాజీనామ చేశారు. ఆయన తన సోదరుడు బాసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రిగా తొలగించి న్యాయ మంత్రిగా ఉన్న అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్సే నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సబ్రీ మాట్లాడుతూ...నేను ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పనిచేశానని నమ్ముతున్నాను. దేశ సమస్యలను పరిష్కరించడానికి సత్వర చర్యలు అవసరం అని ఆయన అన్నారు. నిజానికి సబ్రీ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చర్చించేందుకు ఈ నెలాఖరులో అమెరికాను సందర్శించాల్సి ఉంది. అయితే అధ్యక్షుడు గోటబయట రాజపక్సే పిలుపునిచ్చిన ఐక్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షం తిరస్కరించడంతో పాలక సంకీర్ణం మెజారిటీని కోల్పోయింది. దీంతో సబ్రీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రీడమ్ పార్టీ అధినేత మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ..‘మా పార్టీ ప్రజల పక్షాన ఉంది. స్వతంత్ర చట్టసభ సభ్యుల సహాయంతో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ పనిచేయగలదు. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దాని సామర్థ్యం మరింత బలహీనపడింది.అని అన్నారు. అంతేగాక ప్రధాన మంత్రి మహింద్ర రాజపక్స క్యాబినెట్‌లోని మొత్తం 26 మంది మంత్రులు రాజీనామా చేశారు. అదీగాక శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న రాజపక్స కుటుంబంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. ఈ క్రమంలో గత వారం శ్రీలంక అధ్యక్షుడు గోటబయట రాజపక్స ఇంటిని ముట్టడించేందుకు వందలాది మంది ప్రయత్నించారు కూడా. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య జరిగిన హింస కారణంగా డజనుకు పైగా జనాలు గాయపడ్డారు. తప్పనిసరై రాజపక్స జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కాకుండా సైన్యానికి అరెస్టు చేసే అధికారాన్ని ఆదేశించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కూడా విధించారు. ఇప్పటికే భారత్ సుమారు రూ. 200 కోట్ల క్రెడిట్ లైన్లు, దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఇంధన సాయాన్ని అందించింది. (చదవండి: లంకలో కల్లోలం) -
మరో మలుపు తిరిగిన శ్రీలంక సంక్షోభం..
-
సిబ్బంది ప్రవర్తన.. అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా
సూర్యాపేట: ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తన ఆ వైద్యురాలికి ఆవేదన కలిగించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలత చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా వైద్యాధికారికి అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఉషారాణి పట్ల అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్(సీవో) ఉపేందర్ దురుసుగా ప్రవర్తించాడు. విధులకు సక్రమంగా రానందుకు సీవోను తాను మందలించానని, అందుకు సీఓ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని వైద్యురాలు ఉషారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు చేసే సమయంలో డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో సీసీ.. అర్బన్ హెల్త్ సెంటర్‌కు వచ్చి కలెక్టర్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ ప్రశ్నిస్తూ తనకు సంబంధం లేని విషయాలపై వేధింపులకు గురిచేశాడని సదరు వైద్యురాలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశానని, విచారణ చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే విలువ మెడికల్ ఆఫీసర్‌కు ఇవ్వడం లేదని కలత చెందిన వైద్యురాలు ఉషారాణి తన విధులకు రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ విషయమై డీఎంహెచ్ఓ వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
లోక్‌సభ సభ్యత్వానికి అఖిలేశ్ రాజీనామా
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలవడం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఖిలేశ్ చెప్పారు. ఎస్పీకి అఖిలేశ్ తండ్రి ములాయం సహా లోక్‌సభలో నలుగురు సభ్యులున్నారు. చదవండి: (చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్) -
ఆ రెండూ కలిసే వడ్ల నాటకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేస్తున్న మాదిరిగా ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుబంధుతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదని, పంటలకు అందించే మద్దతు ధరకు అదనంగా అందించే బోనస్‌తోనే లబ్ధి జరు గుతుందన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. దొంగ సొమ్ము పంచుకోవడానికి ఇద్దరూ ఒక్కటే రాష్ట్రంలో దొంగ సొమ్ము పంచుకోవడానికి టీఆర్ ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టడానికి.. వడ్ల కోసం కొట్లాడుతున్నానని ఒకరు చెబుతుంటే, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని మరొకరు అంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి సింగరేణి సంస్థకు నైని బొగ్గు గని కేటాయింపు విషయంలో జరుగుతున్న అవకతవకల విషయంలో ప్రధానికి ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవట్లేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా, సింగరేణి సీఎండీ శ్రీధర్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకో వట్లేదని, ఆయనను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు కావడం వల్లే సింగరేణి కుంభకోణంపై విచారణ ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌లోనే: కోమటిరెడ్డి తాను పార్టీ మారుతున్నాననే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎన్నో గొడవలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాగే కాంగ్రెస్ పార్టీలో గొడవలు సహజమని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్నారు. -
‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికారంలోకి రాకపోవడంతో.. ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఎంపీగానే కొనసాగుతాడంటూ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓ పుకారు వినిపించింది. అయితే ఆ ఊహాగానాల్ని పటాపంచల్ చేస్తూ.. ఎంపీ పదవికే రాజీనామా చేశారాయన. మంగళవారం మధ్యాహ్నాం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయానికి వెళ్లిన అఖిలేష్.. తన సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు. యూపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కార్హల్ నిజయోకవర్గం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి రాకపోయినా.. ప్రజా తీర్పును శిరసావహిస్తానని, ప్రతిపక్ష హోదా దక్కడంతో ఇకపై యోగి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటానని అన్నారాయన. అసెంబ్లీలో యోగి సర్కార్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. #WATCH | Delhi: Samajwadi Party (SP) chief Akhilesh Yadav going to Lok Sabha Speaker Om Birla's office to resign from his membership of the House. In the recently held Uttar Pradesh elections, he was elected as an MLA from the Karhal seat. pic.twitter.com/IBjc4jqr8t — ANI (@ANI) March 22, 2022 బీజేపీ అభ్యర్థి సింగ్ బాఘెల్‌పై ఆయన 67 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు అఖిలేష్. యూపీ మాజీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అజాంఘడ్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. -
ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం..! పూర్తి రాజీనామాకు సిద్దం..!
టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ సంస్థ డైరక్టర్ల బోర్డుకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ది హాలీవుడ్ రిపోర్టర్ కథనం ప్రకారం.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ)కు కంపెనీ నుంచి ఎలన్ మస్క్ నిష్క్రమణ గురించి ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. మస్క్ రాజీనామా జూన్ 30, 2022 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కంపెనీకి ఎలన్ అందించిన సేవలను కంపెనీ కొనియాడింది. స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కంపెనీకి అందించిన సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఎండీవర్ పేర్కొంది. తక్కువ సమయంలో కూడా కంపెనీపై శ్రద్ధ వహించినందుకు ఎండీవర్ ప్రతినిధులు మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్వతహాగానే ఎలన్ మస్క్ తన రాజీనామాను మార్చి 12న తెలియజేసినట్లు కంపెనీ పేర్కొంది. మీడియా, మార్కెటింగ్‌లో భారీ ఆదరణ..! అమెరికన్ సంస్థ ఎండీవర్ గ్రూప్స్ హోల్డింగ్స్ మీడియా, హాలీవుడ్, మార్కెటింగ్ విభాగాల్లో భారీ ఆదరణను పొందింది. ఈ సంస్థ దాని అనుబంధ సంస్థల ద్వారా వినోద కంటెంట్‌ను అందిస్తుంది.అలాగే మార్కెటింగ్, లైసెన్సింగ్, ప్రాతినిధ్యం, ఈవెంట్ మేనేజ్మెంట్లో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ కంపెనీలో విలియం మోరిస్ టాలెంట్ ఏజెన్సీ , అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ కంపెనీలను సబ్సీడరీ సంస్థలుగా కల్గి ఉంది. చదవండి: బెజోస్ మస్క్ అదానీ ముందు దిగదుడుపే! -
అదనపు సోలిసిటర్ జనరల్ అమన్ లేఖి రాజీనామా
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అమన్ లేఖి, అదనపు సోలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హడావిడిగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజ్జూకి పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అదనపు సోలిసిటర్ జనరల్ పదవి రాజీనామాకు గల కారణాల్ని ఆయన లేఖలో తెలియజేయలేదు. కేవలం రెండు లైన్ల సందేశంతో ఆయన లెటర్ సమర్పించడం విశేషం. ఆయన తిరిగి ప్రైవేట్ ప్రాక్టీస్ వైపే వెళ్లొచ్చని సన్నిహితులు చెప్తున్నారు. సుప్రీం కోర్టు అదనపు సోలిసిటర్ జనరల్‌గా లేఖి మార్చి, 2018లో నియమించబడ్డారు. జులై 1, 2020న ఆయన్ని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన పదవీకాలం 2023, జూన్ 30న ముగియాల్సి ఉంది. ఈలోపే ఆయన కారణం చెప్పుకుండా రాజీనామా చేయడం గమనార్హం. అమన్ లేఖి ఏఎస్జీ హోదాలో బోగ్గు కేటాయింపుల స్కామ్, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్‌లో హాజరయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈయన భార్యే.