ఢిల్లీ: ఆప్, బీజేపీ కార్యకర్తల హోరాహోరీ నిరసనలతో ఢిల్లీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చండీగఢ్ ఎన్నికల్లో మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నిరసన చేపట్టింది. అటు.. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ కూడా ఆందోళన నిర్వహించింది. పరిస్థితుల్ని అదుపు చేయడానికి పోలీసులు భారీ భద్రతను మోహరించారు.
బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలో పాల్గొనటానికి వెళుతున్న ఆప్ వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లను పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. 25 మందికి పైగా నాయకులను సింగు సరిహద్దు వద్ద నిర్బంధించారు. వీరిలో హర్యానా ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు భారీ స్థాయిలో చేరారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారిందని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ఢిల్లీ ఆప్ సర్కార్ రోజుకో స్కామ్ బయటపడుతుందని దుయ్యబట్టారు. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. భారీ స్థాయిలో జనం రావడంతో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌కు వెళ్లే అనేక రహదారుల్లో పోలీసులు బారికేడ్లు వేశారు.
ఇదీ చదవండి: హేమంత్ సొరెన్‌కు అండగా నేనున్నా: మమతా బెనర్జీ
Comments
Please login to add a commentAdd a comment