న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరిస్తూ ఢిల్లీ మెట్రో రైళ్లలో వెలిసిన బెదిరింపు రాతలు బీజేపీ పనేనని ఆప్ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లలో ఓడిపోతున్నామని తెలిసే బీజేపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తోందని సోమవారం(మే20) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి ఆతిషి ఫైర్ అయ్యారు.
‘తొలుత మా అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. తర్వాత జైలులో ఆయనకు ఇన్సులిన్‌ను ఆపేశారు. మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ బయటికి వచ్చిన తర్వాత స్వాతి మలివాల్‌తో కలిసి ఆయనపై కుట్ర చేశారు. ఇప్పుడేమో ఆయన ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు’అని ఆతిషి అన్నారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇస్తూ రాసిన రాతలు ఢిల్లీ మెట్రో రైలు బోగీల గోడలపై ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిని తొలుత ఎవరు షేర్ చేశారన్నది తెలియరాలేదు. బెదిరింపు రాతలపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment