Metro Rail
-
అబ్బురపడేలా.. జేబీఎస్ మెట్రో హబ్
సాక్షి, హైదరాబాద్: జేబీఎస్ మెట్రో స్టేషన్ ప్రపంచస్థాయి మెట్రో హబ్‌గా అవతరించనుంది. సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల్లోని మెట్రో హబ్‌లకు దీటుగా జేబీఎస్ మెట్రో హబ్‌కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడ బస్ స్టేషన్లు, పార్కింగ్ సదుపాయం, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మాల్స్, కార్యాలయాలు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం మెట్రో రైళ్ల రాకపోకలకే పరిమితం కాకుండా చక్కటి షాపింగ్, డైనింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జేబీఎస్ హబ్‌పై దిశానిర్దేశం చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జేబీఎస్ మెట్రో హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. మెట్రో రెండో దశలో భాగంగానే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఈ రెండు కారిడార్లపైనా సీఎం తాజాగా సమీక్షించారు. అతిపెద్ద ప్రాంగణంగా విస్తరణ.. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో జేబీఎస్ మెట్రో హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం మెట్రోకు జేబీఎస్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంతో పాటు రక్షణ శాఖకు చెందిన భూములను కూడా సేకరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని మెట్రోస్టేషన్ల పార్కింగ్ సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. దీంతో మెట్రోల్లో ప్రయాణం చేయాలని భావించినప్పటికీ.. పార్కింగ్ వసతులు లేకపోవడంతో చాలామంది సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నిర్మించనున్న మెట్రో స్టేషన్లను పార్కింగ్ సదుపాయాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జేబీఎస్ మెట్రో హబ్ వద్ద సెల్లార్లో అతిపెద్ద పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం రెండంతస్తుల్లో నిర్మించే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో బస్‌స్టేషన్ ఉంటుంది. ప్రయాణికులు బస్సు దిగి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లవచ్చు. దీంతో సీమ్‌లెస్ జర్నీ సదుపాయం లభించనుంది. వివిధ ప్రాంతాల మధ్య లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్ కనెక్టివిటీకి కూడా పార్కింగ్, బస్‌స్టేషన్ సదుపాయాలు దోహదం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం.. ⇒ ప్రతిపాదిత జేబీఎస్ నుంచి మేడ్చల్ (23కి.మీ.), జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) కారిడార్లలో లక్షలాది మంది రాకపోకలు సాగించనున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీలో జేబీఎస్ కీలకం కానుంది. ⇒ రెండు రూట్లలో హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై మెట్రో కారిడార్లు రానున్నాయి. కానీ.. బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంట ప్యారడైజ్ నుంచి బోయినపల్లి మధ్య 600 మీటర్ల వరకు భూగర్భ మార్గం రానుంది. దీంతో డబుల్ ఎలివేటెడ్ సాధ్యం కాదు. దీంతో బోయిన్పల్లి వద్ద ఎలివేటెడ్ మెట్రో రానుంది. ⇒ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితోపాటు, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఈ కారిడార్లు కీలకం కానున్నాయి. స్కైవాక్ కనెక్టివిటీ... జేబీఎస్ మెట్రో హబ్ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్యారడైజ్, జేబీఎస్ స్టేషన్లతో పాటు కొత్తగా మేడ్చల్ కారిడార్ కోసం నిర్మించనున్న స్టేషన్ల మధ్య స్కైవాక్ ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులు అన్ని వైపులా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. మేడ్చల్, శామీర్‌పేట్‌ల నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణ సదుపాయం లభించనుంది. ఈ హబ్ వల్ల నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. అన్ని సదుపాయాలతో కూడిన ‘అర్బన్ యాక్టివిటీ సెంటర్’గా జేబీఎస్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. హైదరాబాద్ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని పేర్కొన్నారు. రెస్టారెంట్లు, మలీ్టప్లెక్స్లతో పాటు కో– వర్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని ఐటీ సంస్థలు మెట్రో స్టేషన్లలో ఇలాంటి సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. కార్యాలయాల నిర్వహణ భారం దృష్ట్యా కో–వర్కింగ్ ప్లేస్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర బడ్జెట్ ఆర్థిక సర్వే(Union Budget Economic Survey 2025) 2025 సందర్భంగా కీలక ప్రకటన చేశారు. భారతదేశ మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని ప్రకటించారు. దాంతో చైనా, యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలో ఈ విజయం సాధించిన మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా భారత్ నిలిచింది.భారతదేశం మెట్రో రైలు నెట్వర్క్ 1,000 కిలోమీటర్లకు చేరడం వల్ల ఎంతో మేలు జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణ పట్టణ రవాణాను పెంచడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రద్దీని తగ్గించడానికి వీలైంది. వచ్చే ఐదేళ్లలో ప్రస్తుత నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసే ప్రణాళికలతో మెట్రో, రాపిడ్ రైల్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే గణనీయమైన బడ్జెట్‌ను కేటాయించింది.ఇదీ చదవండి: మిషన్ మౌసమ్తో వాతావరణ సమాచారంకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం ఏర్పాటు చేసే ప్రయాత్నాల్లో భాగంగా చాలా సవాళ్లు ఎదురయ్యాయని రాష్ట్రపతి తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని ముర్ము ప్రస్తావించారు. 272 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్లిష్టమైన భూభాగం కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొందన్నారు. అయినా దీన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి పెరుగుతుందని, వస్తువులు, ప్రయాణీకుల రవాణా మెరుగవుతుందని భావిస్తున్నారు. -
HYD: అంతరాయం తర్వాత యథావిధిగా మెట్రో రైళ్లు
సాక్షి,హైదరాబాద్: నగరంలో మెట్రోరైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. బుధవారం(జనవరి29) ఉదయం అమీర్‌పేట్- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్లు గంటకుపైగా ఆలస్యంగా నడిచాయి.ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట్ వైపునకు మెట్రో రైళ్లు రాలేదు. మరోవైపు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో ఒక రైలు ఆగిపోయింది. అయితే గంట తర్వాత రైళ్లను మెట్రో అధికారులు పునరుద్ధరించారు. తర్వాత రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.ఆఫీసులకు వెళ్లే వేళలు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.సాంకేతిక సమస్యల కారణంగా రైళ్లు ఆలస్యం అవుతున్నాయని మెట్రో రైలు అధికారులు ప్రకటించారు.కాగా, గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం ఆఫీసు వేళల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీ వైపు రూట్లో రైళ్లు ఆలస్యమవుతుండడంతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అలనాటి స్మృతుల్లో.. అలా సాగిపోతూ..
శతాబ్దాల చారిత్రక అస్తిత్వం.. హైదరాబాద్ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిరూపం. విభిన్న జీవన సంస్కృతుల సమాహారం పాతబస్తీ.. కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల వరకు 400 ఏళ్ల నాటి చార్మినార్ మొదలుకొని ఎన్నెన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, మరెన్నో అందమైన ప్యాలెస్‌లు, మహళ్లు, దర్వాజాలు, దేవిడీలు, బౌలీలు, నవాబుల సమాధులు, పార్కులు ప్రపంచ చిత్రపటంలో పాతబస్తీ ఉనికిని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు పాతబస్తీని సందర్శిస్తేనే ఆ పర్యటన పరిపూర్ణం అవుతుంది. అలాంటి పాతబస్తీలో ఇప్పుడు మెట్రో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏ ఒక్క చారిత్రక కట్టడానికి విఘాతం కలిగించకుండా, వాటి ఔన్నత్యాన్ని చాటే విధంగా మెట్రో మెలికలు తిరగనుంది. చారిత్రక కట్టడాలను చుట్టేస్తూ మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కొన్ని చోట్ల వందేళ్లకు పైబడిన ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు, స్కూళ్లు తదితర భవనాలు పాక్షికంగానో, పూర్తిగానో నేలమట్టం కానున్నాయి. సుమారు 1100 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ గుర్తించింది. ఇప్పటి వరకు 270 మంది తమ ఆస్తులు అప్పగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ⇒ చదరపు గజానికి రూ.81 వేల చొప్పున ఆస్తులు కోల్పోనున్న వారిలో 170 మందికి సుమారు రూ.80 కోట్లు ఇప్పటి వరకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులను కోల్పోతున్న ఎంతోమంది పాతబస్తీవాసులుపూర్వీకుల నాటి భవనాలను కోల్పోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. మెట్రో వల్ల తరతరాలుగా వారసత్వంగా వచ్చే భవనాలను కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో పాతబస్తీలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆ వివరాలతో ప్రత్యేక కథనం..చారిత్రక రహదారులపై మెట్రో కారిడార్.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మీరాలంమండి రోడ్డు మీదుగా దారుల్షిఫా, పురానీహవేలి, ఎతెబార్చౌక్, అలీజాకోట్ల, బీబీబజార్, సుల్తాన్‌షాహీ, హరి»ౌలి, శాలిబండ, అలియాబాద్, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వంటి చారిత్రక రహదారిపైన మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. ⇒ ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మెట్రోనూ మళ్లించారు. చారి్మనార్‌కు 500 మీటర్ల దూరంలో మెట్రో రానుంది. ఇలా చారిత్రకకట్టడాలు ఉన్న చోట ఇంజినీరింగ్ పరిష్కారాలు, మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు వంటి చర్యలు చేపట్టారు. కానీ ఇదే రూట్లో ఎంతోమంది పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా దుకాణాలు, హోటళ్లు, పలు చోట్ల స్కూల్ భవనాలు ప్రభావితం కానున్నాయి. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపుతో ఎంతో సందడిగా ఉండే దారుల్ఫా స్వరూపం మారనుంది.⇒ ‘ఒకప్పుడు మా ఇల్లు 1200 గజాల్లో ఉండేది. 2002లో రోడ్డు విస్తరణ కోసం 131 గజాలు తీసుకున్నారు. ఇప్పుడు మెట్రో కోసం 700 గజాలు ప్రభావితమవుతోంది. పూరీ్వకుల నుంచి ఉన్న మా ఇంటి ఉనికిని కోల్పోతున్నాం.’ అని దారుల్íÙఫాకు చెందిన ఆబిద్ హుస్సేన్ తెలిపారు. మొహర్రం బీబీకాలం ఆలం సందర్భంగా ఏనుగు మా ఇంటికి వస్తుంది. రేపు మెట్రో వచి్చన తర్వాత అది సాధ్యం కాదు కదా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్ రోడ్లపై నుంచి కాకుండా ఇతర మార్గాల్లో మెట్రో నిర్మించాలన్నారు. ⇒ పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. నిజాం కాలం నాటి భవనాలు కోల్పోవడం బాధగా ఉంది. మాపూర్వీకులు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో మా తాత, మా నాన్న, ఇప్పుడు మేము కిరాణ జనరల్ స్టోర్ నడుపుతున్నాం. 280 చదరపు గజాలు ఉన్న మా ఇంటి నుంచి మెట్రో కోసం 65 చదరపు గజాల స్థలాన్ని కోల్పోతున్నాం. పాతబస్తీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచి్చంది. – సయీద్ బిన్ అహ్మద్ మహపూజ్, వ్యాపారిపాతకాలం నాటి ఇల్లు పోతోంది ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా మెట్రోరైల్ ఎంతో అవసరం, పాతబస్తీ ప్రజలకు మెట్రో సదుపాయం రావడం ఆహ్వానించదగ్గదే.. కానీ పూరీ్వకుల నాటి ఇంటిని కోల్పోవాల్సి రావడం కష్టంగానే ఉంది. మా కళ్ల ముందే మా ఇంటిని కూల్చివేస్తుంటే చూడలేకపోతున్నాం. ఎంతో బాధగా ఉంది. – మహ్మద్ బీన్ అహ్మద్, ఇంటి యజమానిపరిహారం అవసరం లేదు హెరిటేజ్ రోడ్లపై నుంచి మెట్రో నిర్మించడం సరైంది కాదు.. దీనివల్ల మా ఇల్లు 700 గజాలు కోల్పోవాల్సి వస్తుంది. పరిహారం కోరుకోవడం లేదు. త్వరలో న్యాయం కోసం కోర్టుకు వెళ్తాను. ఎట్టిపరిస్థితుల్లోనూ మెట్రోకు స్థలం ఇవ్వను. – ఆబిద్‌హుస్సేన్, దారుల్ఫా జిగ్‌జాగ్ మెట్రో ఉంటుందా ప్రపంచంలో ఎక్కడైనా మెట్రో ప్రధానమైన మార్గాల్లో కట్టారు. కానీ పాతబస్తీ అందుకు విరుద్దం. ఇలాంటి జిగ్‌జాగ్ మెట్రో ఎక్కడా చూడలేదు. చాలావరకు చారిత్రక భవనాలను కాపాడుతున్నామంటున్నారు. కానీ స్పష్టత లేదు. – అనురాధారెడ్డి, ఇంటాక్ ఆ ఘుమఘుమలు మాయమేనా..? పాతబస్తీ పేరు వింటేనే కమ్మటి ఇరానీచాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసా, బన్‌మస్కా, పసందైన బిర్యానీ రుచులు ఘుమఘుమలాడుతాయి. ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే జనజీవనంతో బీబీబజార్, మొగల్పురా, షాలిబండ తదితర ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి. మెట్రో రాక వల్ల అనేక మార్పులు రానున్నాయి. బీబీబజార్‌లోని విక్టోరియా హోటల్ కనుమరుగవుతోంది. అలాగే ఎతేబార్‌చౌక్‌లోని ఏళ్ల నాటి ముఫీద్–ఉల్–ఆనమ్ స్కూల్, పురానీహవేలీలోని ప్రిన్సెస్ ఎస్సేన్ గరŠల్స్ హైసూ్కల్ తదితర విద్యాసంస్థలు ప్రభావితం కానున్నాయి. కొన్ని స్కూళ్లు పాక్షికంగా దెబ్బతింటాయి. పాతబస్తీ మెట్రోపైన మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలోనే మార్గం సుగమమైంది. ‘అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. కానీ పాతబస్తీ రూపురేఖలు, చిహ్నాలు మారిపోతాయనే బాధ మాత్రం తీవ్రంగా ఉంది.’ అని మీర్ యూసుఫ్ అలీ అభిప్రాయపడ్డారు. -
Metro Rail: హైదరాబాద్‌లో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణతో హైదరాబాద్ ప్రజారవాణా ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన నార్త్‌సిటీ మెట్రో కారిడార్లతో ఉత్తర, దక్షిణాలను కలిపే అతిపెద్ద మెట్రో కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. శామీర్‌పేట్, మేడ్చల్ నుంచి నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రాకపోకలు సాగించవచ్చు. రెండో దశలో ప్రతిపాదించిన అన్ని కారిడార్లు పూర్తయితే హైదరాబాద్ మెట్రో 230.4 కిలో మీటర్ల వరకు విస్తరించనుంది. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు మెట్రో సదుపాయం ఉంది. రెండో దశలో 190.4 కిలోమీటర్ల కారిడార్లు విస్తరించనున్నారు. వీటితో పాటు ఫోర్త్‌సిటీకి ప్రతిపాదించిన మరో 40 కిలోమీటర్లు కూడా పూర్తయితే మొత్తం 230 కిలోమీటర్లతో చెన్నై, బెంగళూర్ నగరాల మెట్రోల సరసన చేరే అవకాశం ఉంది. రెండో దశలో మొదట 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘బి’ విభాగంగా నార్త్‌సిటీకి రెండు కారిడార్లలో 45 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలను రూపొందించారు. వీటితో పాటు ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మరో 40 కిలోమీటర్లు కూడా ఈ రెండో దశలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వైపులా మెట్రో కారిడార్లు వినియోగంలోకి వస్తే లక్షలాది మంది ప్రయాణికులు అతిపెద్ద కారిడార్లలో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. మొదట విస్తరించనున్న 5 కారిడార్లలో 2028 నాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా. నార్త్‌సిటీ రెండు కారిడార్లతో కలిపి సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది పయనించవచ్చని అంచనా. 2030 నాటికి 15 లక్షలు దాటనుంది. శామీర్‌పేట్ టూ ఎయిర్‌పోర్టు.. శామీర్‌పేట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి దేశవిదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శామీర్‌పేట్ నుంచి ప్యారడైజ్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు సుమారు 62 కిలోమీటర్ల కారిడార్ వినియోగంలోకి రానుంది. మేడ్చల్ నుంచి కూడా ఎయిర్‌పోర్టు వరకు ఇంచుమించు 63 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, నాగోల్ మీదుగా కూడా రాకపోకలు సాగించవచ్చు. దీంతో మొదటి, రెండో కారిడార్లలో మెట్రోలు మారాల్సి ఉంటుంది. మరోవైపు మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల నుంచి నేరుగా కోకాపేట్, రాయదుర్గం, హైటెక్‌సిటీ ఐటీ సంస్థలకు కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా.. మరోవైపు ఇప్పుడు ఉన్న మూడు కారిడార్లలో కేవలం 69 కిలోమీటర్ల వరకు మెట్రో సదుపాయం ఉంది. దీంతో ప్రయాణికులు ఎక్కడో ఒక చోట మెట్రో నుంచి ప్రత్యామ్నాయ రవాణా సదుపాయంలోకి మారాల్సి వస్తుంది. రెండో దశలో ‘ఏ’ ‘బి’ కారిడార్లు, స్కిల్యూనివర్సిటీ కారిడార్ కూడా పూర్తయితే నలువైపులా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రో ప్రయాణ సదుపాయం లభించనుంది. హయత్‌నగర్ నుంచి పటాన్చెరు.. హయత్‌నగర్ నుంచి పటాన్చెరు వరకు నగరంలో మరో అతిపెద్ద కారిడార్‌లో కూడా మెట్రో పరుగులు తీయనుంది. దీంతో తూర్పు, పడమరల మధ్య సుమారు 50 కిలోమీటర్ల వరకు మెట్రో కనెక్టివిటీ ఏర్పడనుంది. ప్రస్తుతం ఈ రూట్లో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్లు మెట్రో అందుబాటులో ఉంది. కొత్తగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్లు కొత్తగా నిర్మించడం వల్ల మొత్తం 50 కిలోమీటర్లు నిరాటంకమైన రవాణా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఈ రూట్లో లక్షలాది మంది ప్రయాణికులు సిటీ బస్సులు, సొంత వాహనాలపై ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఒక్క కారిడార్లోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. -
పాతబస్తీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు రేపు(సోమవారం) చెక్కుల పంపిణీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పాత నగరంలో రెండో దశ మెట్రో పనుల ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది.కారిడార్-6లో ఎంజీబీఎస్- చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.వారికి నష్టపరిహారాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రు. 81,000/- ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని.. దీంతో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లేదెలా?భూ సేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పరిహారాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. లక్డీకాపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరిత గతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీనిలో భాగంగా తొలుత 40 కి పైగా ఆస్తుల యజమానులకు ఇప్పుడు చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారుల తరఫున మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. -
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
నిద్రించడానికి స్థలం లేదని వాహనాలకు నిప్పంటించాడు
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం చాదర్‌ఘాట్ మెట్రోస్టేషన్ పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు దగ్ధం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహా రాష్ట్రకు చెందిన జాకీర్ మహ్మద్ (32) ఎనిదేళ్ల క్రితం నగరానికి వచ్చి కూలీ పనులు చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నాడు. తాను నిద్రించడానికి పార్కింగ్ వాహనాలు ఇబ్బందిగా మారాయని వాటికి నిప్పంటించాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆదివారం అక్బర్‌బాగ్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మెట్రో స్టేషన్.. మెరిసెన్..ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు. ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్‌లోని మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ‘తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ప్రధానం మెట్రో మార్గాలు నగరవాసులను విశేషంగా అలరిస్తున్నాయి. -
మెట్రోకు బెల్ట్ కనెక్టివిటీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో జంక్షన్ల మధ్య అనుసంధానం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) వివిధ రకాల ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తోంది. ఆయా మార్గాల్లోంచి బయలుదేరే ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు జంక్షన్ల వద్ద ట్రెయిన్ మారాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు నుంచి నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా జంక్షన్ల వద్ద మార్పు తప్పనిసరి. దీంతో లగేజీ తరలింపు సమస్యగా మారనుంది. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు లగేజీ తీసుకెళ్లడం ఎంతో కష్టం. ఈ క్రమంలో లగేజీ తరలింపుతో పాటు ప్రయాణికులు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా స్టేషన్లు మారేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. లగేజీ తరలింపునకు బెల్ట్.. నగరంలోని అన్ని వైపుల నుంచి ప్రతిరోజూ కనీసం సుమారు లక్ష మందికి పైగా ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో పాటు, వారి కోసం వెళ్లే బంధుమిత్రులు, జీఎమ్మార్ ఉద్యోగులు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులతో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం 75 వేల మంది ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తుండగా 2028లో ఎయిర్‌పోర్టు మెట్రో సేవలు ప్రారంభమయ్యే నాటికి లక్ష దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లక్ష మంది ప్రయాణికులు నిరంతరం రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా మెట్రో జంక్షన్ల మధ్య లగేజీ కోసం పెద్ద ఎత్తున బెల్ట్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ప్రయాణికుల కోసం వాక్‌వేలు ఉంటాయి. ఎల్బీనగర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. నాగోల్ మెట్రోస్టేషన్ నుంచి నాగోల్ ఎయిర్పోర్ట్ మెట్రోస్టేషన్‌కు మధ్య వాక్‌వే ఉంటుంది. ఎయిర్పోర్ట్ మెట్రో స్పెషల్.. మెట్రో రెండో దశలో ఎయిర్‌పోర్టు మెట్రో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మిగతా మార్గాల్లో కంటే ఈ రూట్లో మెట్రో రైళ్ల వేగం కూడా ఎక్కువే ఉండనుంది. ప్రస్తుతం గంటకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, ఎయిర్పోర్ట్ రూట్లో 45 కిలోమీటర్ల వరకు వేగం పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసినవిధంగా 1.6 కిలోమీటర్లు భూగర్భ మెట్రో నిర్మించనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ భూగర్భంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు ఎస్కలేటర్లు, లిఫ్టులను వినియోగించి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్‌కు చేరుకుంటారు. మరోవైపు ఫోర్త్ సిటీకి మెట్రో అందుబాటులోకి వచ్చేనాటికి హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు మీదుగా ఫోర్త్‌సిటీకి రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికుల సంఖ్య 7 లక్షలు దాటవచ్చని భావిస్తున్నారు. -
మెట్రో రెండో దశతో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టు భాగ్యనగర అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ సంస్థల ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా, అద్భుతమైన గ్లోబల్ సిటీగా అవతరించనుందని చెప్పారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఆధ్వర్యంలో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో గురువారం 7వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎనీ్వఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రెండో దశకు ఇప్పటికే భూసేకరణ ప్రారంభమైందని.. త్వరలోనే ప్రాథమిక పనులను ప్రారంభిస్తామని చెప్పారు. రెండో దశ ప్రాజెక్టుకు నిధుల లభ్యత పుష్కలంగా ఉందని.. కేంద్రం అనుమతి లభించగానే పెట్టుబడి పెట్టేందుకు మల్టీ లేటరల్ డెవలప్మెంట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. అదనపు కోచ్‌ల కోసం సన్నాహాలు... ప్రస్తుతం రూ. 6 వేల కోట్లకుపైగా నష్టాలతో మెట్రో నడుస్తున్నప్పటికీ వచ్చే మూడు, నాలుగేళ్లలో నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్ల ఆపరేషన్‌ను మరింత సమర్థంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కొత్త కోచ్‌లను తెప్పించేందుకు సన్నాహాలు చేపట్టామని.. మరో 3 నెలల్లో అదనపు కోచ్‌లకు పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. అయితే భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు 12–15 నెలలు పట్టొచ్చన్నారు. 10 లక్షల మంది ప్రయాణించేలా అదనపు కోచ్‌లు, రైళ్ల నిర్వహణ ఉంటుందని వివరించారు. కాగా, ఈ ఏడేళ్లలో మెట్రో రైళ్లలో 63.40 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
Old City Metro Rail: అనగనగా మెట్రో..
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు తక్కువ వడ్డీ రేటుకు నిధులు అందజేసేందుకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 2028లో రెండో దశ పూర్తయ్యేనాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని.. 2030 నాటికి 10 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. రెండో దశ కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్‌పై లీ అసోసియేషన్ సంస్థ రూపొందించిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ నివేదిక (సీఎంపీ) ప్రకారం ప్రతిపాదించిన అయిదు కారిడార్లలో ప్రయాణికుల డిమాండ్ అత్యధికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ మొదట దశ ప్రాజెక్టుకు 7 ఏళ్లు పూర్తయిన (ఈ నెల 28) సందర్భంగా మంగళవారం బేగంపేట్ మెట్రో భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్వీఎస్ రెడ్డి ఏం చెప్పారంటే.. ఏడేళ్లలో 63.40 కోట్ల ప్రయాణికులు.. గత ఏడేళ్లలో నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జూబ్లీ బస్టేషన్–ఎంజీబీఎస్ మూడు కారిడార్లలో 63.40 కోట్ల మంది ప్రయాణం చేశారు. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. ఈ ఏడాది ఆగస్టు 14న అత్యధికంగా 5.63 లక్షల మంది ప్రయాణం చేశారు. రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటు లోకి వస్తే మొదటి, రెండు దశల్లో కలిపి సుమారు 15 లక్షల నుంచి క్రమంగా 20 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వచ్చే డిసెంబరు నెలాఖరుకు పాతబస్తీలో రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నాం. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో రెండో దశ పనులు ప్రారంభమవుతాయి. జాయింట్ వెంచర్.. ⇒సమాజంలోని అన్ని వర్గాల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రెండో దశ రూట్లను ఎంపిక చేశాం. ఇది మొత్తం 6 కారిడార్లలో 116.4 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్‌సిటీ మెట్రోకు సర్వే పనులు ప్రారంభించాం. రెండో దశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (50: 50) జాయింట్ వెంచర్. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఈ నెల 4న కేంద్రానికి అందజేశారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు మొదలవుతాయి. ప్రస్తుతం 5 కారిడార్లలో చేపట్టనున్న 76.4 కి.మీ. కారిడార్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,313 కోట్లు (30 శాతం), కేంద్రం రూ.4,230 కోట్లు (18 శాతం) చొప్పున అందజేయనున్నాయి. మిగతా 48 శాతం నిధు లు రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే సావరిన్ గ్యా రంటీతో జైకా, ఏడీబీ, ఎన్డీపీ వంటి మల్టీ లేటరల్ సంస్థల నుంచి సేకరించనున్నారు. మరో 4 శాతం నిధులు రూ.1,033 కోట్లను మాత్రం పీపీపీ విధానంలో సమకూర్చుకుంటారు. రెండోదశలో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. భూసేకరణ వేగవంతం... ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. రోడ్డు విస్తరణతో 1100 పైగా ఆస్తులు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు అందజేశాం. వాటిలో 200 కట్టడాల తొలగింపునకు ఆయన చర్యలు చేపట్టారు. డిసెంబర్లో పరిహారం చెల్లింపుతో పాటు కూలి్చవేతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం అక్కడ గజానికి రూ.23,000 చొప్పున ఉంది. దానికి రెట్టింపుగా ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా గజానికి రూ.65,000 చొప్పున చెల్లించనున్నారు. మొత్తం ఆస్తుల సేకరణకు సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. 3 కోచ్‌లు.. 35 కి.మీ వేగం.. ప్రస్తుతం మొదటి దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ మెట్రో రైల్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. గంటకు 35 కిలోమీటర్ల సగటు వేగంతో రైళ్లు నడుస్తాయి. ప్లాట్‌ఫాంలు మాత్రం 6 కోచ్‌లు నిలిపేందుకు వీలుగా నిర్మిస్తారు. -
పాతబస్తీ మెట్రో పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణకు క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో కారిడార్‌లో భూసేకరణ పనులు చేపట్టారు.ఈ కారిడార్‌లో రోడ్ల విస్తరణ, మెట్రో అలైన్మెంట్ కోసం తొలగించవలసిన నిర్మాణాలను ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 200 ఆస్తుల డిక్లరేషన్‌కు (100 ఎల్హెచ్ఎస్, 100 ఆర్హెచ్ఎస్) హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఆమోదం తెలిపారు. ఈ డిక్లరేషన్‌కు అనుగుణంగా అవార్డు డిసెంబర్ నెలాఖరు నాటికి ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.2 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్లో భాగంగా కూలి్చవేతలను తొలగించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహా్వనించింది. ఈ మేరకు తాజాగా టెండర్ నోటిఫికేషన్ వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ.1.3 కోట్లు వెచి్చంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మెట్రో కోసం ఆస్తులు కోల్పోయిన వారికి జనవరి నుంచి పరిహారం చెల్లించే అవకాశం ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆమోదం అనంతరం మెట్రో రెండో దశకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయి. అలాగే కేంద్రం ఆమోదం కోసం కూడా రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను అందజేశారు. సుమారు రూ.24 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయనున్న నిధులతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా మెట్రో మొదటి దశలోనే జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచవలసి ఉండగా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఎంజీబీఎస్ వరకే అది పరిమితమైంది. దీంతో ఈ కారిడార్‌ను రెండో దశలో చేర్చి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.ఈ మేరకు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలక్‌నుమా వద్ద శంకుస్థాపన కూడా చేశారు. -
విపరీతమైన ట్రాఫిక్ సమస్య.. మెట్రో ఒకటే పరిష్కారం..
-
HYD: మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: మెట్రోరైలులో సోమవారం(నవంబర్ 4) ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. కీలకమైన ఐటీ కారిడార్‌ను కనెక్ట్ చేసే నాగోల్-రాయదుర్గం లైన్‌లోని బేగంపేట-రాయదుర్గం మధ్య సాంకేతిక సమస్య కారణంగా రైళ్లు 13 నిమిషాల పాటు ఆగిపోయాయి. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ ఫీడర్లో సమస్య కారణంగా మెట్రో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసు సమయం మించిపోతోందని ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిథిగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.కాగా, గతంలోనూ పలుమార్లు మెట్రో రైలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురై గంటలకొద్దీ నిలిచిపోయిన సందర్భాలున్నాయి. ఈ సందర్భాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇదీ చదవండి: సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్‌జామ్ -
పూణె మెట్రో స్టేషన్లో మంటలు
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. पुणे के मेट्रो स्टेशन में लगी आगमहाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024ఇది కూడా చదవండి: పిరమిడ్‌పై పక్షుల వేట -
ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?
కోల్‌కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్‌గా 'కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు -
నేటి నుంచి ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నేడు(శనివారం) అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలోని ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.ఈ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొననున్నారు.నేడు అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించనున్న ప్రధాని మోదీ తన ప్రయాణంలో లాడ్లీ బహిన్ లబ్ధిదారులు, విద్యార్థులు, కార్మికులతో సంభాషించనున్నారు. ఆధునిక ఫీచర్లతో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించిన మొబైల్ యాప్ మెట్రో కనెక్ట్-3ని కూడా ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.ఎంఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భిడే మాట్లాడుతూ 'నేడు ముంబై ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. మెట్రో లైన్-3ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ముంబై మెట్రోలో ప్రయాణించే వారికి ఈ కొత్త మెట్రో ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఈ భూగర్భ మెట్రో నగర రూపురేఖలను మార్చనుందని’ అన్నారు. ఇది కూడా చదవండి: అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్ -
కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్రం రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్(ఎన్ఎంఈఓ)’ ఏర్పాటు కోసం రూ.10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘అన్నదాతల ఆదాయం పెంచేందుకు, దేశంలో ఆహార భద్రతను వృద్ధి చేసేందుకు పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం-ఆర్కేవీవై), కృషోన్నతి యోజన పథకాలను ప్రారంభిస్తున్నాం. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయిస్తున్నాం. పీఎం-ఆర్‌కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ.. వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం. దేశంలో వంట నూనె అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ సీడ్స్(ఎన్ఎంఈఓ)ను ఏర్పాటు చేస్తున్నాం. అందుకు రూ.10,103 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం. 2022-23 సంవత్సరానికిగాను నూనె గింజల ఉత్పత్తి 39 మిలియన్ టన్నులుగా ఉంది. దీన్ని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ మిషన్‌లో భాగంగా నూనెగింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం. ఆవాలు, వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి కీలక నూనెగింజ పంటల ఉత్పత్తిని మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కాటన్ సీడ్, రైస్ బ్రాన్..నుంచి నూనె తీసే ప్రక్రియను వేగవంతం చేయబోతున్నాం. రూ.63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దశలో 118.9 కిలోమీటర్లమేర మూడు కారిడార్లు, 128 స్టేషన్లు ఉంటాయి’ అని చెప్పారు.ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుభారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. -
దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా దుర్గా పూజలు వైభవంగా జరుగుతాయి. రాజధాని కోల్‌కతాలో నిర్వహించే దుర్గా పూజలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. కోల్‌కతాలోని మెట్రో ప్రయాణికులు అక్టోబరు ఆరు నుంచి అంటే దుర్గా పూజల సమయంలో మెట్రో నుంచి అదనపు సేవలు అందుకోనున్నారు. దుర్గాపూజల సందర్భంగా మెట్రోలో ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు కోల్‌కతా మెట్రో రైల్వే కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక మెట్రో సేవలను అందించనున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ సేవలు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమై, విజయదశమి నాడు అంటే అక్టోబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఉత్తర-దక్షిణ కారిడార్‌లో ప్రతిరోజూ 248 మెట్రో సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.విజయ దశమి నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు 174 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. అక్టోబర్ 9న కోల్‌కతా మెట్రో ఉదయం 6:50 నుండి అర్ధరాత్రి వరకు 288 సర్వీసులను నడపనుంది. గ్రీన్ లైన్-1లో సప్తమి-అష్టమి- నవమి రోజులలో 64 సర్వీసులు, 'దశమి' నాడు 48, షష్ఠి నాడు 106 సర్వీసులు నడపనుంది. గ్రీన్ లైన్-2లో సప్తమి-అష్టమి-నవమి రోజుల్లో 118 సర్వీసులు, దశమి నాడు 80 సర్వీసులు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: రేపటి నుంచి దసరా సెలవులు -
116 కి.మీ. 80స్టేషన్లు..
సాక్షి, హైదరాబాద్: రెండోదశలో భాగంగా మొత్తం ఆరు కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర 80కు పైగా స్టేషన్లతో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు, కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీతో సహా నగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి వెల్లడించారు. 40 కి.మీ పొడవుతో కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మినహా మిగతా ఐదు కారిడార్ల డీపీఆర్‌లను త్వరలోనే కేంద్రానికి సమరి్పంచనున్నట్లు తెలిపారు.ఎయిర్పోర్ట్ టూ ఫోర్త్ సిటీ డీపీఆర్ ఆకర్షణీయమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటోందని, మరికొద్ది నెలల్లో దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపుతామని చెప్పారు. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్లో మార్పు చేస్తూ కొత్తగా డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. మెట్రో రైలు రెండోదశపై ఆదివారం బేగంపేట్ మెట్రో భవన్లో ఆయన సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ట్రాఫిక్ అధ్యయనం ‘రెండోదశకు సంబంధించి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోప్రస్తుతం ట్రాఫిక్ అధ్యయనం కొనసాగుతోంది. త్వరలో రూపొందించనున్న ట్రాఫిక్ అధ్యయన నివేదికను (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కూడా పరిగణనలోకి తీసుకోనున్నాం. రెండోదశ మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్‌చెక్ చేయనున్నాం. రెండో దశ డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు ఇది తప్పనిసరి. ఎయిర్పోర్ట్ రూట్‌కు సంబంధించి అలైన్మెంట్లో కొంత మార్పు చేశాం. గతంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించగా, ప్రస్తుతం దాన్ని ఆరాంఘర్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా డీపీఆర్‌ను ఖరారు చేస్తున్నాం..’అని ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భూగర్భంలో మెట్రో రైల్ నాగోల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు 36 కిలోమీటర్ల మార్గంలో నిర్మించనున్న నాలుగో కారిడార్ ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ జంక్షన్ నుంచి సాగుతుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు, మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న కారిడార్లు.. ఎయిర్‌పోర్టు మార్గంలో నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్ల వద్ద అనుసంధానమవుతాయి. మొత్తం 36.6 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో రూట్లో 35 కిలోమీటర్లు ఎలివేట్ చేయనున్నారు. 1.6 కిలోమీటర్ల వరకు మెట్రోలైన్ భూగర్భంలో నిర్మిస్తారు. ఎయిర్పోర్ట్ స్టేషన్ కూడా భూగర్భంలోనే ఉంటుంది. ఈ రూట్లో 24 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఐదవ కారిడార్‌లో ఇప్పుడు ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు కొత్తగా లైన్ నిర్మించనున్నారు. ఇది బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ 11.6 కిలోమీటర్ల మార్గంలో 8 స్టేషన్లు నిర్మించే అవకాశం ఉంది.⇒ ఆరో కారిడార్‌లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రూట్‌ను గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్íÙఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్లు ఈ కారిడార్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ నిర్మించే స్టేషన్లకు ఆ పేర్లే పెట్టనున్నారు. రోడ్ల విస్తరణ ⇒ ప్రస్తుతం దారుల్íÙఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఉన్న 60 అడుగుల రోడ్డు, శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరించనున్నారు. స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో మాత్రం 120 అడుగులకు విస్తరిస్తారు. పాతబస్తీ మెట్రో అలైన్మెంట్, రోడ్డు విస్తరణ నేపథ్యంలో సుమారు 1,100 నిర్మాణాలను తొలగించే అవకాశంఉంది. ఆరో కారిడార్‌లో 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలతో, మెట్రో పిల్లర్ స్థానాలను సర్దుబాటు చేయనున్నారు. ఈ రూట్లో మొత్తం 6 స్టేషన్లు ఉంటాయి. ⇒ ఏడవ కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించనున్నారు. మియాపూర్ నుంచి ఆలి్వన్ క్రాస్‌రోడ్స్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా ఇది వెళుతుంది. ఈ రూట్లో సుమారు 10 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ⇒ ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు నిర్మించనున్న 8వ కారిడార్ 7.1 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీల మీదుగా హయత్‌నగర్ వరకు నిర్మిస్తారు. సుమారు 6 స్టేషన్లు ఉంటాయి. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. 9వ కారిడార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్‌సిటీలోని స్కిల్స్ యూనివర్సిటీ వరకు ఉంటుంది. ⇒ రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ..32,237 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో 40 కిలోమీటర్ల ఫోర్త్‌సిటీ మెట్రోకే రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ చేపట్టనున్నారు.రెండో దశ కారిడార్లు ఇవీ (కిలో మీటర్లలో)కారిడార్ – 4 నాగోల్ – ఎయిర్పోర్ట్ 36.6కారిడార్ – 5 రాయదుర్గం–కోకాపేట్ నియోపొలిస్ 11.6కారిడార్ – 6 ఎంజీబీఎస్ –చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5కారిడార్ – 7 మియాపూర్ – పటాన్చెరు 13.4కారిడార్ – 8 ఎల్బీనగర్–హయత్ నగర్ 7.1కారిడార్ – 9 ఎయిర్పోర్ట్– ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) 40 -
మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరబాద్ : మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కి.మీ. మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మార్పులు చేశారు. ఆరాంఘర్ – బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో ఖరారు చేశారు. నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపారు. ఎయిర్పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో వెళ్లనుంది.రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫోర్త్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం త్వరలోనే మెట్రో రెండో దశ డీపీఆర్‌లు పంపనున్నారు. మొదటి దశలో 3 కారిడార్లలో 69 కి.మీ. మేర మెట్రో నడుస్తుంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కి.మీ. మేర మెట్రో ప్రయాణించనుంది. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కి.మీ. మెట్రో పరుగులు తీయనుంది. -
మెట్రో.. అవుతోందా సూసైడ్ స్పాట్?
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా ఉన్న మెట్రో రైలు వ్యవస్థ ఆధునికతగా ప్రతిరూపంగా ఆకర్షిస్తోంది. కానీ ఇలాంటి నమ్మ మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్‌గా మారడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాదిలో 9 నెలల్లో 7 ఆత్మహత్యాయత్నాలు జరగడం గమనార్హం. చనిపోతామంటూ మెట్రో రైలు పట్టాలపై దూకుతున్న ఘటనలు తలనొప్పిగా మారాయి. ఫలితంగా మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారు.గ్లాస్ డోర్లు ఎక్కడ?ఈ ప్రమాదాల నివారణ కోసం పీఎస్డీ (ఫ్లాట్‌ఫారం స్క్రీనింగ్ డోర్)ని ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నా ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోలో ఈ పీఎస్డీ డోర్లను ఏర్పాటు చేశారు. అయితే నమ్మ మెట్రోలో మాత్రం ఇంకా ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. ఈ డోర్లను అమర్చితే ట్రాక్‌పైకి ప్రయాణికులు పడిపోయే, దూకే ఘటనలు తప్పిపోతాయని నిపుణులు తెలిపారు. మెట్రో స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీనింగ్ డోర్లు తెరుచుకుంటాయి. ప్రయాణికులు రైల్లోకి ఎక్కిన తర్వాత తిరిగి మూసుకుపోతాయి. ఇలా ప్రయాణికుల భద్రతలో ఎంతో కీలకమైన పీఎస్డీ డోర్లను వెంటనే బెంగళూరు మెట్రో స్టేషన్లలో కూడా అమర్చాలని చెబుతున్నారు. నమ్మ మెట్రో ప్రారంభమై 13 ఏళ్లు పూర్తి అయింది. ఇంతవరకు రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యకరమని విమర్శలున్నాయి.ఈ ఏడాది జరిగిన కొన్ని సంఘటనలు జనవరి 01– మొబైల్ పడిపోయిందని..ఇందిరా నగర మెట్రో రైల్వే స్టేషన్లో ట్రాక్‌పై పడిన మొబైల్‌ను తీసేందుకు ఒక మహిళ ట్రాక్‌పైకి దిగింది. సిబ్బంది వెంటనే ఆ మహిళను గుర్తించి బయటకు లాగి ప్రాణాన్ని కాపాడారు. పట్టాలకు హై ఓల్టేజ్ కరెంటు అనుసంధానమై ఉంటుంది. తగిలితే ప్రాణాలు పోవచ్చు. ఈ ఘటనతో 15 నిమిషాలు రైలు సేవలు నిలిచిపోయాయి. జనవరి 5 – యువకుడు దూకి..కేరళకు చెందిన షారోన్ (23) అనే యువకుడు జాలహళ్లి మెట్రో స్టేషన్లో ఆత్మహత్య చేసుకోవాలని రైలు వస్తుండగా పట్టాల మీదకు దూకాడు. ఆ వ్యక్తిని చూసిన లోకోపైలట్ వెంటనే అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైలు నిలిచిపోయేలా చేయడంతో ప్రాణాపాయం తప్పింది. జనవరి 6 – నల్ల పిల్లి ఆటంకంజేపీ నగర మెట్రో రైల్వే స్టేషన్లో పట్టాలపై నల్లటి పిల్లి ఒకటి కనిపించింది. మెట్రో రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ పిల్లిని అక్కడి నుంచి తరిమేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. మార్చి 12– పట్టాలపై నడకజ్ఞానభారతి మెట్రో స్టేషన్–పట్టణగెరె మెట్రో స్టేషన్ మధ్య వయడక్ట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. మెట్రో పట్టాలపై ఉన్న వయడక్ట్‌పై నడుచుకుంటూ వెళుతున్నాడు. దీంతో కూడా మెట్రో సేవలు కొంత సమయం నిలిచిపోయాయి. మార్చి 21– లా విద్యార్థి ఆత్మహత్యఅత్తిగుప్పే మెట్రోస్టేషన్లో 19 ఏళ్ల ధ్రువ్ టక్కర్ అనే లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌కు రైలు వస్తుండగా నేరుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు మానసిక ఒత్తిడి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆగస్టు 3 – మరో ఆత్మహత్యదొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్లో ట్రైన్ రావడాన్ని గమనించిన 35 ఏళ్ల వ్యక్తి ట్రాక్ మీదకు దూకాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంతో చాలా సమయం వరకు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి.సెప్టెంబర్ 17 – మరో ఆత్మహత్యాయత్నం..జ్ఞానభారతి మెట్రో స్టేషన్లో రైలు రావడాన్ని గమనించి ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ మీదకు దూకాడు. ఈసందర్భంలో మెట్రో సెక్యురిటీ సిబ్బంది సిద్ధార్థ జైన్ అతని ప్రాణాలను కాపాడారు. బ్యాంకులో రూ. 3 లక్షల అప్పు చేసి తీర్చలేకనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెట్రో రైళ్లు, స్టేషన్లకు వెళ్లడం ఒక మంచి అనుభూతిగా ఉంటుంది. అందుకే ఎంతోమంది అవసరం లేకపోయినా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారు. అనేక ఊర్ల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో ఔత్సాహికులు మెట్రో సేవల కోసం వస్తుంటారు. కానీ కొందరికి మాత్రం అది ఆత్మహత్యకు అనువైన ప్రాంతంగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి మెట్రో పట్టాలపైకి దూకాలని వస్తారు. ఈ సమస్యను నివారించడం మెట్రోకు చిక్కుముడిగా మారింది. -
ఫ్రీ పార్కింగ్ కోసం ధర్నా
-
రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు. -
పాతబస్తీ మెట్రోకు భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో మార్గంలో భూసేకరణపై హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న ఓల్డ్‌సిటీ మెట్రో మార్గాన్ని రెండోదశలో భాగంగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కొత్త అలైన్మెంట్ కోసం భూసేకరణకు హెచ్ఎంఆర్ఎల్ నోటిఫికేషన్ వెల్లడించింది. కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో సేకరించనున్న స్థలాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం 60 రోజుల గడువు విధించారు. మరోవైపు అభ్యంతరాలను స్వయంగా తెలియజేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అవకాశం కలి్పంచింది. భూ సేకరణలో భాగంగా ఆస్తులను కోల్పోయే బాధితులు అభ్యంతరాలను, ప్రతిపాదనలను బేగంపేట్‌లోని మెట్రో భవన్ కార్యాలయంలో స్పెషల్ కలెక్టర్‌కు స్వయంగా తెలియజేయవచ్చు. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్షంగా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. దారుషిఫా నుంచి శాలిబండ వరకు.. మొదటి దశలోని మూడో కారిడార్‌లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ వరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో భాగంగా ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. కానీ.. ఈ రూట్లో దారుíÙఫా జంక్షన్ నుంచి షాలిబండ జంక్షన్ వరకు మొత్తం 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషుర్ ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు మరో 6 చిల్లాలు సహా మొత్తం 103 నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే గుర్తించారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను సైతం 80 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో ఆస్తులను కోల్పోనున్న వివిధ వర్గాలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి నుంచి అభ్యంతరాలు, ఆస్తుల అంచనాలను స్వీకరించనున్నారు. ⇒ 2012లోనే చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు పనులను 2023 వరకు కాలయాపన చేయడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగి ప్రస్తుతం రూ.2500 కోట్లకు చేరింది. కిలోమీటర్‌కు సుమారు రూ.250 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు అంచనా. 5.5 కిలోమీటర్ల కారిడార్‌తో పాటు భూములు, ఆస్తులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. దారుíÙఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరి»ౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఈ అలైన్మెంట్ ఉంటుంది. ⇒ మెట్రో రైల్ మార్గంలో ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం, చారి్మనార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచి్చన తర్వాత మెట్రో రెండోదశ డీపీఆర్‌ను వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024 -
TG: కేటీఆర్‌పై అక్బరుద్దీన్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: గతంలో నోట్ల రద్దు జరిగినపుడు క్యూలైన్లు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ ఆరు పథకాల కోసం ప్రజలు అలానే క్యూలైన్లను నిలబడుతున్నారని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. శనివారం(జులై 27)అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగిన సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టారు ఓకే.. కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి నేను కృషి చేశాను. ఆనాడు దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సహాయంతో హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకువచ్చాం. కానీ ఓల్డ్ సిటీకి మాత్రం మెట్రో ఇప్పటికీ రావడం లేదు. అక్బర్‌సాబ్ త్వరలో చుక్‌చుక్ రైలు పాతబస్తీకి వస్తుంది అని కేటీఆర్ మాటలు చెప్పారు. అవేవీ జరగలేదని అక్బరుద్దీన్ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. -
మెట్రో రైల్లో రీల్స్ : తస్మాత్ జాగ్రత్త!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతరకరంగా, విచక్షణ లేకుండా ఢిల్లీ మెట్రో రైలులో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన సోషల్ మీడియా యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు రీల్స్ చేసిన 1,600 మందిపై కేసులు నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మూడు శాతం పెరిగిందని డీఎంఆర్సీ సీనియర్ అధికారులు గురువారం తెలిపారు.రైలులో తినడం, కింద కూర్చుని న్యూసెన్స్ చేయడం వంటి నేరాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం 1,647 మందిపై కేసులు నమోదైనట్టు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1600. ఏప్రిల్‌లో 610 మంది,మే నెలలో 518, జూన్‌లో 519 మందిపై జరిమానాలు విధించినట్టు తెలిపింది. మెట్రో ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టినట్టు చెప్పారు. మెట్రో రైలు పరిసరాల్లో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.. కేటాయింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను రూ. 2,91,159 కోట్లుగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 35,118 కోట్ల అప్పు తీసుకోగా , రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మెట్రో వాటర్ వర్స్ కోసం రూ. 3,385 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 3,065కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్ఎండీేఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్ రూ. 50 కోట్లు కేటాయించారు.ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని, అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టామని అన్నారు. -
Musi Metro Project: ఈ భారం మోసేదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. దీంతో మొత్తం భారమంతా రాష్ట్రంపైనే పడనుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కోసం కేంద్రం సుమారు రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించాలని రాష్ట్రం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు స్వయంగా కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో మూసీ భారాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించవలసిన వచి్చంది. ⇒ ఇక మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపైన డీపీఆర్‌లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టును కేంద్రానికి సమరి్పంచడంలో ఆలస్యం జరిగింది. బడ్జెట్ కంటే ముందే ఈ ప్రాజెక్టుపైన కేంద్రానికి డీపీఆర్‌ను సమరి్పంచి ఉంటే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మెట్రో రెండో దశను కూడా ప్రస్తుతానికి రాష్ట్ర నిధులతోనే ప్రారంభించవలసిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండు ముఖ్యమైన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ⇒ సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్, మేడ్చల్ రూట్లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలను సైతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పనులకు శంకుస్థాపన చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో సిటీ ప్రాజెక్టులే అత్యంత కీలకం కానున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పాతబస్తీ మెట్రో కోసం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. మూసీకి రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్లు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సర్వే పనులు కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిరి్మంచనున్న 70 కిలోమీటర్ల మెట్రో రెండో దశకు సుమారు రూ.20 వేల కోట్లకు పైగా వ్యయం కానున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మెట్రో మొదటి దశను పీపీపీ పద్ధతిలో నిరి్మంచగా, రెండో దశ ప్రాజెక్టును మాత్రం ప్రభుత్వమే చేపట్టింది. ఇదీ రెండో దశ మెట్రో... ⇒ నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు అక్కడి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో చేపట్టనున్నారు. ⇒ అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు రెండో దశలోనే పూర్తికావలసి ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ రూట్లోనే మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు మరో లైన్‌ను నిర్మించనున్నారు. ⇒ ఎయిర్పోర్ట్ కారిడార్, హయత్‌నగర్ కారిడార్లలో అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్లు, స్టేషన్లను ఖరారు చేశారు. ⇒ రెండో దశ డీపీఆర్‌ను సిస్టా కన్సల్టెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది. నిధులిస్తే పనులు ప్రారంభం... ⇒ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు సుమారు రూ.2232 కోట్ల అంచనాలతో 18.10 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ⇒ ఈ ప్రాజెక్టు కోసం వివిధ చోట్ల సుమారు 197 ఎకరాలకు పైగా భూములను సేకరించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందులో రక్షణ శాఖకు చెందిన భూములే 113 ఎకరాల వరకు ఉన్నాయి. ⇒ ఈ మార్గంలో తొలగించవలసిన కట్టడాలు, సేకరించాల్సిన భూములపైన కూడా క్షేత్రస్థాయి సర్వేలు పూర్తయ్యాయి. ⇒ ప్రభుత్వం నిధులను విడుదల చేసిన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ బడ్జెట్లో మురిపిస్తారా... ⇒ మూసీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సామాజిక, ఆరి్థక సర్వే కొనసాగుతోంది. ⇒ గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు సుమారు 55 కిలోమీటర్ల మార్గంలో ఉన్న మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయనున్నారు. ⇒ నదికి రెండు వైపులా 50 మీటర్ల పరిధిలో సుమారు 12,500 నిర్మాణాలను తొలగించవలసి ఉంటుందని అధికారులు గుర్తించారు. ⇒ ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. ⇒ అలాగే ఎస్టీపీలు, నదికి ఇరువైపులా రహదారులు, ఐటీ టవర్లు, మెట్రో రైలు వంటి భారీ నిర్మాణాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
దేశంలో మొదటి భూగర్భ మెట్రో.. వచ్చే నెల నుంచే..
ఎంతగానో ఎదురు చూస్తున్న దేశంలో మొట్టమొదటి అండర్‌గ్రౌండ్ మెట్రో లైన్ ముంబైలో వచ్చే నెలలో ప్రారంభం కానుంది. పూర్తి భూగర్భ కారిడార్ అయిన కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ప్రారంభంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.ముంబై నగరంలోని ఆరే కాలనీని ప్రధాన వ్యాపార జిల్లా అయిన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) తో కలిపే మెట్రో లైన్ ఫేజ్ 1ను జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరే కాలనీ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు సుమారు 9.63 కిలోమీటర్ల దూరాన్ని ఫేజ్ 1 కవర్ చేస్తుంది.మెట్రో లైన్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే 33.5 కిలోమీటర్ల మేర 27 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. మెట్రోలో ప్రతిరోజూ 260 సర్వీసులు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు వీటిని నడిపేలా నిర్ణయించారు.ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీ) రూ.37,000 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. కొలాబా-బాంద్రా-ఎస్ఈఈపీజెడ్ మెట్రో లైన్ 3 ఆపరేషన్, నిర్వహణ కాంట్రాక్టును ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎంఎంఆర్‌సీ ఇచ్చింది. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఎంఎంఆర్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది.#MMRC has successfully completed Research Designs and Standards Organisation #RDSO trials of Rolling Stock for #MetroLine3. Testing of other electrical systems and integrated testing of Rolling Stock with signaling is in progress. After completion of testing, the Commissioner of… pic.twitter.com/GnH51CfQIU— MumbaiMetro3 (@MumbaiMetro3) June 24, 2024 -
వాట్సాప్‌లో మెట్రో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఈజీగా..!
వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని నాగపూర్‌కు విస్తరిస్తోంది. ప్రయాణికులకు మెట్రో టికెట్లను ఎక్కడి నుంచైనా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని ఇస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణేలోని మెట్రోలకు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది.వాట్సప్‌లో మెట్రో టికెట్ బుక్ చేసుకోండిలా..వాట్సప్‌లో మెట్రో టికెట్ బుకింగ్ సేవలు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు 8624888568 (నాగపూర్ మెట్రో), 8341146468 (హైదరాబాద్ మెట్రో) నంబర్‌కు 'Hi' అని పంపాలి లేదా ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ సులభమైన చాట్‌బాట్ టికెట్ బుకింగ్‌ను సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తుంది. అవసరమైన ప్రయాణ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ ఇంటర్ఫేస్ ద్వారా అందిస్తుంది.ఇందులో క్విక్ పర్చేజ్ ఆప్షన్ కూడా ఉంది. తరచుగా ప్రయాణం చేసేవారి కోసం దీన్ని రూపొందించారు. ఈ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే రూట్లను సేవ్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను ఎంచుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. -
దరి చేర్చని దారి!.. గ్రేటర్లో 80లక్షలు దాటిపోయిన వాహనాల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ మెట్రోరైల్‌స్టేషన్‌కు 2 కిలోమీటర్ల దూరంలో సుమారు 1500కుపైగా కాలనీలు ఉంటాయి. ఆ కాలనీల నుంచి ప్రతి రోజూ వేలాది మంది నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మెట్రో ఉన్నా వినియోగించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంటే కాలనీ నుంచి మెట్రో స్టేషన్‌కు.. రైలు దిగాక మెట్రోస్టేషన్ నుంచి ఆఫీసుకో, మరేదైనా చోటికో వెళ్లడానికి సరైన ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడమే. మెట్రోలో అయితే త్వరగా వెళ్లగలిగినా.. ఇంటి నుంచి స్టేషన్‌కు, స్టేషన్ నుంచి ఆఫీసుకు వెళ్లడానికి ఆటో ఎక్కితే ఖర్చు అడ్డగోలుగా పెరిగిపోతోంది. దీంతో జనం సొంత వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇది నగరంలో భారీగా ట్రాఫిక్, పొల్యూషన్ పెరిగిపోవడానికి కారణమవుతోంది.ఉదాహరణకు..: ఉప్పల్ సమీపంలోని కాలనీ వ్యక్తి రాయదుర్గంలోని ఆఫీసుకు వెళ్లాలంటే.. కాలనీ నుంచి మెట్రోస్టేషన్‌కు వెళ్లేందుకు రూ.75 నుంచి రూ.100 చార్జీతో ఆటోలో ప్రయాణించాలి. అక్కడి నుంచి మెట్రోలో రాయదుర్గం వరకు రూ.55 చార్జీ ఉంటుంది. రైలు దిగి ఆఫీసుకు చేరేందుకు మరో రూ.50 వెచ్చించాలి. తిరిగి ఇంటికి వెళ్లడానికి మళ్లీ ఖర్చు తప్పదు. ఉప్పల్ మెట్రోస్టేషన్‌కు ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల వచి్చన దుస్థితి ఇది. ఒక్క ఉప్పల్ మెట్రోస్టేషన్ మాత్రమే కాదు. మూడు మెట్రో కారిడార్లలోని అన్ని మెట్రో స్టేషన్లు, ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లకు సరైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రయాణం భారంగా మారుతోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాల వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.సవాల్‌గా మారిన సమన్వయం..గ్రేటర్లో మొదటి నుంచీ ప్రజారవాణా సదుపాయాల మధ్య సమన్వయం లేదు. సిటీబస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్ల సేవలు ఇప్పటికీ విడివిడిగానే ఉన్నాయి. 2017లో మెట్రో సేవలను ప్రారంభించినప్పుడు అన్ని స్టేషన్లకు చేరేందుకు బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. చుట్టుపక్కల కాలనీలకు చెందిన ప్రయాణికులను స్టేషన్లకు చేరవేసేందుకు ఆర్టీసీ మినీ బస్సులను ప్రతిపాదించింది. ఫీడర్ చానళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అవేవీ అమల్లోకి రాలేదు. గతంలో ఎంఎంటీఎస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రత్యేకంగా సిటీబస్సులను ప్రవేశపెట్టినా ఎంతో కాలం కొనసాగలేదు. దీంతో ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సమస్య అలాగే ఉండిపోయింది.మెట్రోకు అనుసంధానం లేక..నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ మధ్య ప్రస్తుతం ప్రతిరోజూ 5 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రోజుకు 1,000 ట్రిప్పులకుపైగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేక ఇంకా లక్షలాదిమంది మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. మెట్రోస్టేషన్‌కు కనీసం 5 కిలోమీటర్ల పరిధిలో ఫీడర్ చానల్స్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.ఓలా, ఉబర్, ర్యాపిడో,యారీ వంటి యాప్ ఆధారిత క్యాబ్‌లు, ఆటోలు మినహాయిస్తే మెట్రోస్టేషన్ల నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ చాలా తక్కువ. 16 ఆర్టీసీ సైబర్ లైనర్ బస్సులు, 135 మెట్రో సువిధ (12 సీట్లవి) వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైటెక్‌సిటీ, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలకు వెళ్లే సైబర్ లైనర్లు, సువిధ వాహనాలకు డిమాండ్ ఉంది.జనాభా పెరుగుతున్నా.. సదుపాయాలు అంతే! గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 2 కోట్లకు చేరువైంది. ఏటా లక్షలాది మంది నగరానికి వచ్చి స్థిరపడుతున్నారు. అన్ని వైపులా పెద్ద సంఖ్యలో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. కానీ ఇందుకు తగినట్టుగా ప్రజారవాణా సదుపాయాలు పెరగడం లేదు. బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 6,000 బస్సులు అందుబాటులో ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌లో 2,550 బస్సులే ఉన్నాయి. ఇక 70 ఎంఎంటీఎస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. నగర అవసరాల మేరకు మరో 100 ఎంఎంటీఎస్ రైళ్లను నడపాల్సి ఉంది. మెట్రో రైళ్లు కూడా మూడు కోచ్‌లతోనే నడుస్తున్నాయి. అన్ని సర్వీసులు కిటకిటలాడుతున్నాయి.‘వాహన విస్ఫోటనం’!హైదరాబాద్ నగరంలో వాహన విస్ఫోటనం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 2 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రస్తుతం వాహనాల సంఖ్య 80 లక్షలకుపైనే ఉంది. వీటిలో 70 శాతానికిపైగా వ్యక్తిగత వాహనాలే కావడం గమనార్హం.కోవిడ్ అనంతరం 2022 నుంచి ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరం బాగా పెరిగింది. మొదట 15 రూట్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 58 స్టేషన్లకు విస్తరించినట్లు అధికారులు చెప్తున్నారు. మెట్రో రైడ్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఐ), ఈవీ ఆటోలు నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. కానీ ఫస్ట్‌మైల్, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం ఉన్న మెట్రో స్టేషన్లు చాలా తక్కువ. కనెక్టివిటీ పెరిగితే మరో 5 లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది.నగరంలో ప్రతి కిలోమీటర్‌కు 1,732 ద్విచక్రవాహనాలు, మరో 1,000 కార్లు ప్రయాణిస్తున్నాయి. అన్ని మార్గాల్లో కలిపి ఒకే సమయంలో సుమారు 55,000 బైకులు, మరో 30,000 కార్లు వెళ్తున్నాయి. రవాణా నిపుణుల అంచనా మేరకు రోడ్లపై వాహనాల సంఖ్య 25,000 దాటితే అత్యధిక వాహన సాంద్రత ఉన్నట్లుగా పరిగణించాలి. సొంత బండితోనూ.. తప్పని కష్టాలుమెట్రోలు, ఎంఎంటీఎస్లలో ప్రయాణించలేక.. చాలా మంది సొంత కారు, ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. దీనితో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో నాగోల్ నుంచి రాయదుర్గం చేరుకొనేందుకు 45 నిమిషాల సమయం పడితే.. బైక్ జర్నీకి గంటన్నర, కారులో అయితే 2 గంటలకుపైగా సమయం పడుతుంది. పైగా మానసిక ఒత్తిడి, పొల్యూషన్ సమస్య. ముంబైలో కనెక్టివిటి బాగుండటంతో.. ఎక్కువ దూరం ప్రయాణించేవారిలో చాలా మంది రైళ్లలోనే వెళ్తారు.కామన్ మొబిలిటీ టికెట్ ప్రవేశపెట్టాలి ప్రజారవాణా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేషనల్ కామన్ మొబిలిటీ టికెట్ (ఎన్‌సీఎంటీ)ను ప్రవేశపెట్టాలి. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు తదితర అన్ని రవాణా సదుపాయాలను ఒకే కార్డుతో వినియోగించుకొనే అవకాశం ఉండాలి. దాని వల్ల ప్రయాణికులు ఒక రవాణా సదుపాయం నుంచి మరో రవాణా సదుపాయానికి ఈజీగా మారుతారు. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ లేని ఎల్బీనగర్– నాగోల్ వంటి రూట్లలో ఆర్టీసీ ఉచిత బస్సులను ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. – మురళి వరదరాజన్, ఎల్అండ్టీ మెట్రో చీఫ్ స్ట్రాటజీ అధికారి రవాణా అవసరాలు తేల్చేందుకు ఇంటింటి సర్వే.. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజారవాణా అవసరాలపై హుమ్టా సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. లీ అసోసియేషన్ ద్వారా ఈనెల 18 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నాం. ప్రతి ఇంటి రవాణా అవసరాలు, వినియోగిస్తున్న వాహనాలపై ఈ అధ్యయనం ఉంటుంది. అలాగే ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన ట్రాఫిక్ రద్దీ ఉత్పన్నమవుతోందనేది కూడా పరిశీలిస్తాం. లీ అసోసియేషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ రకమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందనేదానిపై స్పష్టత వస్తుంది. తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 3 నెలల్లో లీ అసోసియేషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. – జీవన్‌బాబు, హుమ్టా ఎండీ ప్రజా రవాణా విస్తరించకపోవడం వల్లే.. ప్రజారవాణా విస్తరించకపోవడం వల్ల కూడా సొంత వాహనాల వినియోగం పెరిగింది. బ్యాంకుల నుంచి తేలిగ్గా రుణాలు లభించడం, వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు పెరిగాయి. సొంత కారు, సొంత బైక్ సిటీ కల్చర్‌లో ఒక భాగంగా మారింది. ఒకప్పుడు సైకిళ్ల నగరంగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు బైక్‌ల నగరంగా మారింది. – ఎం.చంద్రశేఖర్‌గౌడ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, రంగారెడ్డి -
సూసైడ్ స్పాట్స్‌గా మెట్రో రైల్వే స్టేషన్లు !
సాక్షి బెంగళూరు: నమ్మ మెట్రో రైల్వే స్టేషన్లు సూసైడ్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో మెట్రో రైల్వే స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పదేపదే మెట్రో ట్రాక్‌లపైకి దిగే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయినప్పటికీ మెట్రో అధికారులు మాత్రం అవసరమైన భద్రత వ్యవస్థ కలి్పంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజిస్టిక్ మెట్రో స్టేషన్లో మాత్రమే బీఎంఆర్సీఎల్ సెక్యురిటీలు అలర్ట్ అవుతున్నారు. మిగిలిన చోట్ల భద్రత సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా నిర్లక్ష్యం కారణంగా మెట్రో రైల్వే పట్టాలపై ఆత్మహత్య కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, చెన్నై మెట్రోలల్లో పీఎస్డీ (ప్లాట్ఫారం స్క్రీన్ డోర్లు) అమర్చడం వల్ల అక్కడ అలాంటి ఘటనలకు తావులేకుండా ఉంది. అయితే నమ్మ మెట్రోలో అలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టకపోవడం దురదృష్టకరం. దీంతో ప్రమాదాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరులో నమ్మ మెట్రో సేవలు ప్రారంభమై సుమారు 13 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు పట్టాలపై ఎలాంటి రక్షణ లేకపోవడంతో ప్రయాణికుల రక్షణకు భద్రత కరువైంది. కొంతమంది ఉదాసీనంగా పట్టాలపై పడిపోతుండడం, మరికొంత మంది ఉద్ధేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకునేందుకు నమ్మ మెట్రో పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో ఆరుగురు మెట్రో రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. -
బెంగళూరుకు డ్రైవర్‌లెస్ మెట్రో..
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. కాగా త్వరలోనే డ్రైవర్‌లెస్ మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఈ సేవలు మొదటిసారి బెంగళూరులో ప్రారంభం కానుంది.ఇప్పటికే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైనా నుంచి ఆరు కోచ్‌లను దిగుమతి చేసుకుంది. దీనిని టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎల్లో లైన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సిగ్నలింగ్ టెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) ఆసిలేషన్ ట్రయల్స్‌తో సేఫ్టీ టెస్ట్ వంటివి నిర్వహించడం కూడా జరుగుతుంది.బెంగళూరులో డ్రైవర్‌లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభించడానికి బొమ్మసంద్ర నుంచి ఆర్వీ రోడ్ వరకు ఎల్లో లైన్ సిద్ధం చేశారు. ఇది జయదేవ హాస్పిటల్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కలుపుతూ వెళుతుంది. ఇది మొత్తం 18.82 కిలోమీటర్ల విస్తరణలో ఉందని అధికారులు పేర్కొన్నారు.అన్ని విధాలా టెస్టింగ్ పూర్తయిన తరువాత.. 2024 డిసెంబర్ చివరి నాటికి డ్రైవర్‌లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది 16 స్టేషన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ మెట్రో సర్వీస్ ప్రారంభమైన తరువాత సిల్క్ బోర్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీలలో ఉద్యోగం చేసే ఐటీ ఎంప్లాయిస్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
కేజ్రీవాల్‌కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరిస్తూ ఢిల్లీ మెట్రో రైళ్లలో వెలిసిన బెదిరింపు రాతలు బీజేపీ పనేనని ఆప్ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లలో ఓడిపోతున్నామని తెలిసే బీజేపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తోందని సోమవారం(మే20) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి ఆతిషి ఫైర్ అయ్యారు.‘తొలుత మా అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. తర్వాత జైలులో ఆయనకు ఇన్సులిన్‌ను ఆపేశారు. మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ బయటికి వచ్చిన తర్వాత స్వాతి మలివాల్‌తో కలిసి ఆయనపై కుట్ర చేశారు. ఇప్పుడేమో ఆయన ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు’అని ఆతిషి అన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇస్తూ రాసిన రాతలు ఢిల్లీ మెట్రో రైలు బోగీల గోడలపై ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిని తొలుత ఎవరు షేర్ చేశారన్నది తెలియరాలేదు. బెదిరింపు రాతలపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉందిప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది. -
ఇంటర్సిటీల మధ్య వందే మెట్రోలు!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మార్గాల్లోనే!హైదరాబాద్ నుంచి నల్లగొండ మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కరీంనగర్, సికింద్రాబాద్–కర్నూలు, కాచిగూడ–కర్నూలు, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా రాయచూర్ తదితర ప్రాంతాలకు ఈ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొదట ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉన్న సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–విజయవాడ వంటి రూట్లలో వందే మెట్రోలను ప్రవేశపెట్టొచ్చు. అనంతరం దశలవారీగా ఇతర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన స్టేషన్లలోనే హాల్టింగ్.. వందే మెట్రో రైళ్లు ప్రస్తుతం హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రో రైళ్ల తరహాలోనే ఉంటాయి. మొదట 12 కోచ్‌లతో ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఆ తరువాత 16 కోచ్‌ల వరకు పెంచనున్నారు. మెట్రో రైళ్ల తరహాలోనే పూర్తిగా ఏసీ సదుపాయం, ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకొని మూసుకొనే ఏర్పాటు ఉంటుంది. ప్రారంభ స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు ముఖ్యమైన స్టేషన్లలోనే ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం ఉండనుంది. ప్రస్తుతం పుష్పుల్ రైళ్లకు ఉన్నట్లుగానే ముందు, వెనుక రెండు ఇంజన్లు ఉంటాయి. దీంతో ఈ రైళ్లను ప్రత్యేకంగా పిట్ లైన్లకు తరలించాల్సిన అవసరంలేదు. తక్కువ సమయంలోనే తిరుగు ప్రయాణ సేవలను అందించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఉండవు... ఈ రైళ్లన్నీ సాధారణ రైళ్ల తరహాలోనే సేవలు అందిస్తాయి. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు కొనుక్కొని బయలుదేరొచ్చు. కూర్చొని ప్రయాణం చేసేందుకు వీలుగా సీట్లు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో కొద్దిగా టికెట్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలనుకొనే వారికి ఈ రైళ్లలో ప్రయాణం లాభదాయకం. వివిధ మార్గాల్లో నడిచే ఇంటర్ సిటీ రైళ్ల స్థానంలోనే వందే మెట్రోలు రానున్నాయి. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడుస్తున్న ఇంటర్సిటీ ట్రైన్ యథాతథంగా సేవలను కొనసాగించనుంది. -
SRH Vs RCB: ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో అదనపు సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో అదనపు సరీ్వసులు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మూడు కారిడార్లలో ఆఖరి మెట్రో సరీ్వసులు గురువారం రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రం ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తెరిచి ఉంచుతారు. మిగతా స్టేషన్లలో కేవలం ని్రష్కమణ ద్వారాలు మాత్రమే తెరిచి ఉంటాయి. 60 అదనపు బస్సులు.... ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉప్పల్ స్టేడియం వరకు 60 బస్సులను అదనంగా నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సరీ్వసులను ఏర్పాటు చేయనున్నారు. -
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు
తైవాన్‌లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్‌తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
SRH Vs MI: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు. -
#SRHVsMI: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భాగ్యనగరానికి మళ్లీ వచ్చేసింది. ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన ఈ రెండు టీమ్‌లూ సీజన్లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా ముంబైలాంటి పెద్ద జట్టు ఆడుతుండటంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. ఉప్పల్/సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ చక్రపాణిలతో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3 గంటల ముందుగానే రావచ్చు.. ► 2,800కు పైగా వివిధ విభాగాల పోలీస్ బలగాలు 360 సీసీ కెమెరాలతో బందోబస్తును ఏర్పాటు చేశాం. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందే ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతిస్తాం. ► స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. సిగరెట్, లైటర్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్‌లు, బ్యాటరీలు, ఫర్ఫ్యూమ్స్, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టె, కెమెరాలు, ఎల్రక్టానిక్ పరికరాలు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, బయటి తిను భండారాలకు స్టేడియంలోకి తీసుకురావద్దు. కారు పాస్ ఉన్నవారు రామంతాపూర్ నుంచి రావాలి. ఫిజికల్ చాలెంజెస్ వ్యక్తులు గేట్–3 ద్వారా వెళ్లాలి. ► క్రికెట్ అభిమానులకు వెసులుబాటుగా మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల అదనపు ట్రిప్పులు. ట్రాఫిక్ దారి మళ్లింపు ఇలా.. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐవోసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాలి. టికెట్లకు తప్పని ఇక్కట్లు ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను ఈసారి పేటీఎం ఇన్సైడర్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే విక్రయించారు. ప్రకటించిన కొద్ది సమయంలోనే ‘సోల్డ్ ఔట్’ అని చూపించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఇంత తక్కువ సమయంలో వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయని ఆందోళన చెందుతున్నారు. -
మెట్రోపై ‘మహాలక్ష్మి’ఎఫెక్ట్!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైళ్లపైన ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్ పడింది. ప్రతిరోజు కిక్కిరిసి పరుగులు తీసే మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మధ్యతరగతి మహిళలు, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు కొంతమేరకు సిటీ బస్సుల్లోకి మారారు. దీంతో గతేడాది 5.10 లక్షలు దాటిన మెట్రో ప్రయాణికులు ప్రస్తుతం 4.8 లక్షల నుంచి 4.9 లక్షల మధ్య నమోదవుతున్నట్లు ఎల్అండ్టీ అధికావర్గాలు పేర్కొన్నాయి. ఏటేటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా మహాలక్ష్మి పథకం కారణంగా ఈ ఏడాది మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నాయి. నగరంలోని మూడు ప్రధాన కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రతి రోజు 1034 ట్రిప్పులు తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో అందుబాటులో ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో మాత్రం ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండడంతో ఈ రూట్లో ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి వచి్చన తరువాత మహిళా ప్రయాణికులు తగ్గారు. ఈ ఏడాదిలో ఆరున్నర లక్షలు దాటవచ్చునని అధికారులు అంచనా వేయగా, అందుకు భిన్నంగా మహాలక్ష్మి కారణంగా సుమారు 5 నుంచి 10 శాతం ప్రయాణికులు తగ్గడం గమనార్హం. గతేడాది రికార్డు స్థాయిలో రద్దీ... గత సంవత్సరం జూలై మొదటి వారంలో రికార్డుస్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రహదారులపైన వాహనాల రద్దీ, కాలుష్యం తదితర కారణాల దృష్ట్యా నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేనివిధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణాన్ని అందజేయడంతో కూడా ఇందుకు మరో కారణం. నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనులపైన హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లు సైత మెట్రోల్లోనే ఎక్కువగా పయనిస్తున్నారు. గతేడాది లెక్కల ప్రకారం మియాపూర్–ఎల్బీనగర్ కారిడార్‌లో ప్రతిరోజు 2.60 లక్షల మంది పయనించగా, నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీస్ బస్‌స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్లలో కలిపి 30 వేల మందికి పైగా మహిళలు సిటీబస్సుల్లోకి మారినట్లు అంచనా. ప్రత్యేకంగా ఈ రెండు నెలల్లోనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అని ఎల్అండ్టీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కారణం కావచ్చునన్నారు. మరోవైపు మెట్రోస్టేషన్లలో రాయదుర్గం, ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్ల నుంచి అత్యధిక మంది రాకపోకలు సాగిస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ కూడా... నగరంలో మెట్రో రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో సేవలను గణనీయంగా వినియోగించుకున్నారు. క్రమంగా విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు మెట్రో శాశ్వత ప్రయాణికులుగా మారారు. ప్రస్తుతం ప్రతి రోజు 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ కొన్ని సంస్థలు ఇంకా ‘వర్క్‌ప్రమ్ హోమ్’ను కొనసాగిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా మెట్రోల్లో ప్రయాణం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి సుమారు మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.7 లక్షలకు చేరుకోవచ్చునని అంచనాలు వేయగా వివిధ కారణాల వల్ల అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. -
అండర్ వాటర్ మెట్రోకు అనూహ్య ఆదరణ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మెట్రోలో తాజాగా సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్‌వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘వందే భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. #CommercialServices on #KaviSubhash-#HemantaMukhopadhyay stretch begins this morning.... pic.twitter.com/6bCxoz5oO9 — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 కోల్‌కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌లోని హౌరా మైదాన్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 7 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి మరో మెట్రో బయలుదేరింది. కోల్‌కతా మెట్రోపాలిటన్ రవాణా నెట్‌వర్క్‌లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నదికి దిగువన ఉంది. నది కింద ఉన్న ఈ సొరంగం పొడవు 520 మీటర్లు. Regular service on Howrah Maidan - Esplanade, Kolkata Metro started today! pic.twitter.com/Rp2ofTHFS9 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 15, 2024 కోల్‌కతా మెట్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు ఫొటోలలో ప్రయాణికులు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. ప్రయాణ సమయంలో, ఒక ప్రయాణికుడు ప్లకార్డుపై ‘భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మోడీ జీ’ అని రాశారు. కాగా హుగ్లీ నది దిగువ భాగాన్ని గుర్తించే సొరంగ భాగాన్ని నీలిరంగు ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ వాటర్ మెట్రో మార్గంలో ప్రతి 12 నుండి 15 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి. #Metro passengers queuing up at #Esplanade Metro station this morning to be a part of the history..... pic.twitter.com/smVgUQX9uJ — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 -
ఆకర్షిస్తున్న ఆగ్రా మెట్రో.. 4 రోజుల్లో 1.22 లక్షల మంది ప్రయాణం!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు. 2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. -
హైదరాబాద్ మెట్రో రైల్ సక్సెస్.. ఒక కేస్‌స్టడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజె క్టుపై ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ప్రశంసలు కురిపించింది. విశ్వవిద్యా లయానికి చెందిన మేనేజ్ మెంట్ విద్యార్థులకు, ప్రాక్టీ షనర్లకు మెట్రో ప్రాజెక్టు విజయగాథ ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే స్టాన్ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్ఎస్ఐఆర్) తాజా సంచికలో (స్ప్రింగ్–2024) ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవం అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్ అందజేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల్లోని పలు ప్రాజెక్టులపైన విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఐఎస్బీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రామ్ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపైన క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్ ఫోర్డ్ వర్సిటీ ఒక కేస్ స్టడీగా ఎంపిక చేసుకొని ప్రచురించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సంస్థ ఎండీ ఎన్వీఎస్రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఒకదశలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి దాన్ని సుసాధ్యం చేశారని జర్నల్‌లో ప్రశంసించారు. ప్రాజెక్టును విజయపథంలో నడిపించారని, ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని ఈ కేస్ స్టడీ తెలియజేసింది. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల్లో సమర్ధవంతమైన నాయకత్వ ప్రతిభను ఎన్వీఎస్ కనబరిచినట్లు జర్నల్‌లో ప్రచురితమైంది. -
పాతబస్తీపై ఫోకస్!
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీతో కలసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం పాతబస్తీ మెట్రోరైల్ నిర్మాణ పనులకు ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘హైదరాబాద్‌లో రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం. కంటోన్మెంట్లో రోడ్ల విస్తరణ చేపట్టాం. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో మెట్రోరైల్ విస్తరిస్తే సామాన్య ప్రజలకు వెసులుబాటుగా ఉంటుంది. 2050 విజన్‌తో పాతబస్తీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. అందరూ ఈ ప్రాంతాన్ని ఓల్డ్ సిటీ అని చిన్నచూపు చూస్తుంటారు. కానీ ఈ ప్రాంతమే ఒరిజినల్ సిటీ. ఓల్డ్ సిటీపై నాకు అవగాహన ఉంది. మా ఊరు(కల్వకుర్తి)కు చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్ మీదుగానే వెళతాం. పాతబస్తీలో రోడ్ల నిర్మాణం కోసం ఎంపీ అసదుద్దీన్ కోరిన వెంటనే రూ.200 కోట్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడో మెట్రోరైల్‌ను ప్లాన్ చేసిన గత పాలకులు పాతబస్తీ మెట్రోను విస్మరించారు. మేం నాగోల్ నుంచి ఎల్బీనగర్కు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రోను అనుసంధానం చేస్తాం. దీంతోపాటు రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న హైకోర్టు వరకు, రాయదుర్గం–ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మియాపూర్–ఆర్సీపురం వరకు మెట్రోను విస్తరిస్తాం. మీరాలం ట్యాంక్ వద్ద రూ.363 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే.. మెట్రోరైల్, ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ అన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించాం. 2004 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి తాగునీటిని తీసుకొచి్చన ఘనత కాంగ్రెస్‌దే. మూసీ నదిని సుందరీకరించి, దేశంలోనే చక్కటి టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తాం. ఇందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీతో కలసి లండన్‌లో థేమ్స్ నదిపై అధ్యయనం చేశాం. గుజరాత్లో సబర్మతీ నదిని అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ.. ఇక్కడ గండిపేట నుంచి 55 కిలోమీటర్ల పొడవునా మూసీ సుందరీకరణకు కూడా కేంద్ర నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచి్చనది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే. నేను కూడా మైనారీ్టల అభ్యున్నతికి కృషి చేస్తా. అందుకే మైనార్టీ శాఖ, మున్సిపల్ శాఖలను నా వద్దే ఉంచుకున్నా. చంచల్‌గూడ జైలును తరలిస్తాం చంచల్‌గూడ జైలును హైదరాబాద్ నగరం వెలుపలకు తరలిస్తాం. ఆ స్థలంలో కేజీ, పీజీ క్యాంపస్ ద్వారా విద్యను అందిస్తాం. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మిస్తాం. 1994–2004 మధ్య టీడీపీ, 2004–2014 కాంగ్రెస్, 2014–2023 వరకు బీఆర్ఎస్ పాలించాయి. నేను 2024 నుంచి 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా..’’అని సీఎం రేవంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ముబీన్, మీర్ జులీ్ఫకర్ అలీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీ రియాజుల్ హఫెండీ, ప్రభుత్వ సలహారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీకి మెట్రో సంతోషకరం: అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీకి మెట్రో రైల్ వస్తుండటం సంతోషకరమని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి నిత్యం 10–15వేల మంది హైటెక్ సిటీకి వెళతారని చెప్పారు. సీఎం రేవంత్ పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి సారించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరారు. డీఎస్సీని ఉర్దూ మాధ్యమంలో కూడా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ సుందరీకరణకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని నింపుతున్న వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్‌నుమాలోని ఫరూక్నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు. ‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం. మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం. మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి. చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది. చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం. రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు. 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
జలాంతర మెట్రో.. హూగ్లీ నదిపై నేడే ప్రారంభం
ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్ వాటర్ మెట్రో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు కోల్‌కతాలోని ఈస్ట్–కోస్ట్ మెట్రో కారిడార్ వేదికగా మారనుంది. ఈ కారిడార్‌లోని హౌరా మైదాన్– ఎస్ప్లానేడ్ సెక్షన్లో ఈ అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అండర్‌వాటర్ మెట్రో సేవలను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హూగ్లీ నది జలాల కింద ఈ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. విశేషాలు ఇవే... ► ఈస్ట్–వెస్ట్ మెట్రో మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా అందులో 10.8 కిలోమీటర్లమేర విస్తరించిన కారిడార్‌లో రైలు భూగర్భంలో ప్రయాణించనుంది. ► ఇందులో పూర్తిగా నదీజలాల కింద నుంచి 520 మీటర్లమేర రైలు పరుగులుపెట్టనుంది. 45 సెకన్లపాటు సాగే ఈ నదీగర్భ ప్రయాణం మెట్రో రైలు ప్రయాణికులకు అనిర్వచనీయ అనుభూతి ఇవ్వనుంది ► దేశంలో తొలిసారిగా నది అడుగున నిర్మించిన తొలి రవాణా టన్నెల్ కూడా ఇదే కావడం విశేషం. ► కోల్‌కతా పరిధిలోని జంట నగరాలుగా పేరొందిన హౌరా, సాల్ట్ లేక్‌లను కలుపుతూ ఈ మెట్రో రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ► 16.6 కిలోమీటర్లలో 4.8 కిలోమీటర్ల మార్గం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సిటీ ఐదో సెక్టార్, సెల్డాలోని కీలకమైన ఐటీ హబ్‌కు ఎంతో దోహదపడనుంది. ► హూగ్లీ నది అడుగున నిర్మించిన తొలి మెట్రో సొరంగ మార్గంగా ఇది రికార్డులకెక్కనుంది. ► ‘కోల్‌కతా మెట్రో’కు సంబంధించి 2023 ఏప్రిల్ నెల ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ నెలలో నదీ అడుగున 32 మీటర్ల మేర ప్రయోగాత్మక మెట్రో రైలును విజయవంతంగా నడిపి చూశారు. ► నేడు ( బుధవారం) ప్రధాని మోదీ ఈ రైల్వే సేవలను లాంఛనంగా ప్రారంభించాక గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణాలకు అనుమతిస్తామని కోల్‌కతా మెట్రో అధికారి కౌశిక్ మిత్రా చెప్పారు. కవి సుభాష్ –హిమంత ముఖోపాధ్యాయ్, తారాతలా–మాజెర్హాట్ మెట్రో సెక్షన్లను మోదీ ప్రారంభిస్తారు. ► ఈ మెట్రో సెక్షన్లో మొత్తంగా ఆరు స్టేషన్లు ఉంటాయి. వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు. అయినా సరే ప్రయాణికులు భూగర్భం లోపలికి, బయటకు వేగంగా వచి్చపోయేందుకు వీలుగా నిర్మించారు. ► అత్యంత రద్దీ, కాలుష్యమయ కోల్‌కతాలో పర్యావరణ అనుకూల ప్రయాణానికి భరోసానిస్తూ ఈ మెట్రోను ఇలా భూగర్భంలో డిజైన్‌చేశారు. దీంతో కాలుష్య తగ్గడంతోపాటు ప్రయాణికులకు ప్రయాణసమయమూ కలిసిరానుంది. ► ఈస్ట్–వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లోనే మొదలయ్యాయి. హూగ్లీ నది అంతర్భాగ పనులు మాత్రం 2017లో ఊపందుకున్నాయి ► 2019 ఆగస్ట్‌లో భూగర్భంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఉబికిరావడం, భూమి కుంగడం వంటి ఘటనలతో అండర్‌వాటర్ మెట్రో పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. 2022లో వాటర్ లీకేజీ ఘటనలూ ఎదురైనా అన్ని బాలారిష్టాలను దాటుకుంటూ ఎట్టకేలకు ఈ మెట్రో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో ఎన్నెన్నో 19వ శతాబ్దిలోనే ఇంగ్లిష్ ఇంజనీర్లు భూగర్భ రైల్వే సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే పురాతన భూగర్భ రైల్వే నెట్‌వర్క్‌గా థేమ్స్ టన్నెల్‌ను చెప్పుకోవచ్చు. 1843లోనే రోథర్‌హీట్, ర్యాపింగ్ పట్టణాల మధ్య ఈ మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడిది లండన్‌లో కీలక రైలు మార్గాల్లో ఒకటి. దీని పొడవు కేవలం 400 మీటర్లు. జపాన్‌లోని సీకెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్‌వాటర్ రైల్వే టన్నెల్‌గా పేరొందింది. దీని పొడవు ఏకంగా 53.85 కిలోమీటర్లు. హోన్షూ, హోకైడో ద్వీపాల మధ్య సుగారు జలసంధి కింద దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే లోతైన, పొడవైన రైల్వే టన్నెల్‌గా రికార్డుసృష్టించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో బోస్ఫోరస్ జలసంధి కింద అండర్‌వాటర్ టన్నెల్ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్‌లోని ఆసియా, యూరప్ భూభాగాలను కలుపుతుంది. ఈ రైల్వే టన్నెల్ పొడవు దాదాపు 14 కి.మీ.లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కడే ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం!
ఢిల్లీ: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) మెట్రో వేదిక కానుంది. బుధవారం పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి దీని ప్రత్యేకలు ఓసారి చూద్దాం.. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌లో.. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్ అండర్ గ్రౌండ్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్ (మహాకరణ్). హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. ఈ ఫీట్‌ను మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. ఏడు నెలలపాటు ట్రయల్ రన్స్ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. తాజా అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుతో.. రోజూ ఈ మార్గంలో ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని కోల్‌కతా మెట్రో రైల్ సీపీఆర్వో అంచనా వేస్తున్నారు ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్‌కతా. హౌరా మెట్రో స్టేషన్.. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. దేశంలో తొలిసారి 1984 అక్టోబర్ 24వ తేదీన కోల్‌కతాలోనే మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో ఐదు స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది నాడు. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతా ఈస్ట్‌వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా భూ ఉపరితలంపైనే. సొరంగం లోపల అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్ప్యారిస్ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది. ఈ తరహా మెట్రో రూట్ ద్వారా.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించినట్లు అవుతుందని మెట్రో అధికారులు అంటున్నారు. India's first underwater metro rail service - Howrah Maidan to Esplanade Metro Station will be inaugurated by PM Modi in Kolkata tomorrow. This will be the Deepest Metro Station and Metro line in India. pic.twitter.com/jRooRVvLMg — Rishi Bagree (@rishibagree) March 5, 2024 -
7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో రైల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చుకానున్నట్లు అంచనా. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, నిర్మాణాల కూల్చివేతలకు ఆటంకం వంటి కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే అడ్డంకులన్నీ తొలగిపోయి డీపీఆర్ సహా అన్ని పనులు పూర్తయినప్పటికీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా నిర్లక్ష్యం చేసింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించి, బడ్జెట్లోనూ నిధులు కేటాయించింది. డ్రోన్ సర్వే... ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ. మార్గంలోని ఆధ్యాత్మిక స్థలాల పరిరక్షణ కోసం గత ఆగస్టులో డ్రోన్ సర్వే నిర్వహించారు. దారుల్షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 103 మతపరమైన, ఇతర సున్నితమైన కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్లలో తగిన మార్పు లు తదితర ఇంజనీరింగ్ పరిష్కారాల కోసం డ్రోన్ ద్వారా సేకరించిన డేటా దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు రోడ్డు విస్తరణను కూడా 80 అడుగులకే పరిమితం చేశారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్‌నుమా వరకు మె ట్రో రైలు అందుబాటులోకి వస్తే నాలుగు వందల ఏళ్ల నాటి చారిత్రాత్మక చార్మినార్ కట్టడాన్ని మెట్రో రైల్లో వెళ్లి సందర్శించవచ్చు. అలాగే, సాలార్జంగ్ మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్ వంటి చారిత్రక కట్టడాలనూ వీక్షించే అవకాశం ఉంటుంది. ఐదు స్టేషన్లు: ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడి నుంచి దారు షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలి, శాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్ను మా వరకు ఈ 5.5 కి.మీ. అలైన్మెంట్ ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రానున్నాయి. ఎంజీబీఎస్ తరువాత సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉంటాయి. -
హ్యాట్సాఫ్ బ్రదర్.. మెట్రో సిబ్బందిని కడిగిపారేశాడు
Viral Video: మన దేశంలో రైతులకు దక్కే గౌరవం ఇదేనా? అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ పెద్దాయన వేసుకున్న దుస్తులు గలీజుగా ఉన్నాయంటూ.. మెట్రో రైలు ఎక్కనివ్వకుండా అడ్డుకోబోయారు సిబ్బంది. అయితే ఓ వ్యక్తి నిలదీతతో చివరకు అనుమతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సిలికాన్ వ్యాలీ సిటీగా చెప్పుకునే బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఓ రైతు తన బ్యాగ్‌తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ఎక్కడానికి వచ్చాడు. టికెట్ తీసుకున్నాక సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు రాగానే రైతును మెట్రో సిబ్బంది నిలిపేశారు. దుస్తులు బాగోలేవంటూ మెట్రో ఎక్కడానికి ఆయన్ని అనుమతించలేదు. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు. ఈలోపు వెనకాలే వస్తున్న మరో ప్రయాణికుడు.. మెట్రో సిబ్బంది తీరుపై పశ్నించాడు. అతని వాగ్వాదం తర్వాతే.. చివరికి రైతు మెట్రో ఎక్కడానికి అనుమతించారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పేరు కార్తీక్‌గా తెలుస్తోంది. చివరకు నెట్టింట దీనిపై చర్చ జరగడంతో.. సదరు సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించి మరీ దర్యాప్తునకు ఆదేశించినట్లు బెంగళూరు మెట్రో ప్రకటించింది. #Bengaluru metro refuses to allow farmer inside train cuz he wasn't dressed "Appropriately" despite purchasing a ticket Passengers had to step up, argue on behalf of him with security officers & ensured passage for the farmer BMRCL suspends the security supervisor, regretting… pic.twitter.com/FYWEF0NClH — Nabila Jamal (@nabilajamal_) February 26, 2024 -
ఢిల్లీ మెట్రోలో గోల్డెన్ లైన్.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తాజాగా మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్‌లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్‌లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్‌ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్‌ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మెట్రో కోచ్‌లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్‌గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. ఫేజ్-4లో గోల్డెన్ లైన్‌తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్‌పురి వెస్ట్ నుండి ఆర్కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్‌ను పొడిగించడం, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్‌పూర్ వరకు పింక్ లైన్‌ను పొడిగించడం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని ఒక్కో కారిడార్‌ను ఒక్కో రంగుతో గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో లైన్ సమయపూర్ బద్లీ నుండి గుర్గావ్ వరకు, బ్లూ లైన్ వైశాలి నుండి ద్వారక వరకు, రెడ్ లైన్ కొత్త బస్టాండ్ నుండి రితాలా వరకు నడుస్తుంది. -
HYD: డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగు.. మెట్రో ప్రయాణికుడికి చేదు అనుభవం
చాక్లెట్స్ .. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. ఏషాప్కు అయినా వెళితే ఏదో ఒక చాక్లెట్ కొనితీరాల్సిందే. దాదాపు అందరి ఇళ్లల్లోనూ చాక్లెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక మరో రెండో రెండు రోజుల్లో వాలంటైన్స్ డే(ఫిబ్రవరి 14) వస్తుండటంతో చాకెట్లకు డిమాండ్ మరింత పెరిగిపోయింది. చాలామంది ప్రేమికులు తమ ప్రేమసి, ప్రియుడికి చాక్లెట్‌ను ఇచ్చి తమ ప్రేమను వ్యక్త పరుస్తుంటారు.. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ చేదువార్త.. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు కనిపించింది. చాక్లెట్ కవర్ తీయడంతో అందులో సజీవంగా ఉన్న పురుగు కనిపించడంతో సదరు వ్యక్తి కంగు తిన్నాడు. .. తనకు ఎదురైన అనుభవాన్ని బిల్‌తోపాటు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ రిటైల్ స్టోర్ నుంచి రూ. 45 చెల్లించి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్ చేయడంతో అందులో పురుగు పాకుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతను చాక్లెట్‌ను వీడియో, ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. చదవండి: Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు] Found a worm crawling in Cadbury chocolate purchased at Ratnadeep Metro Ameerpet today.. Is there a quality check for these near to expiry products? Who is responsible for public health hazards? @DairyMilkIn @ltmhyd @Ratnadeepretail @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/7piYCPixOx — Robin Zaccheus (@RobinZaccheus) February 9, 2024 ‘అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ షాప్‌లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో ఒక పురుగు పాకుతున్నట్లు కనిపించింది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ చేస్తున్నారా? ప్రజలు అనారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. సంబంధిత ఆహార భద్రత అధికారులను అప్రమత్తం చేశామని.. సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని తెలిపింది. అదే విధంగా క్యాడ్బెరీ డెయిరీ మిల్క్ సైతం స్పందిస్తూ... ‘హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాం. మీ ఫిర్యాదును పరిష్కరించేందుకు దయచేసి మీ పూర్తి పేరు, అడ్రెస్, ఫోన్ నెంబరు, కొనుగోలు వివరాలను Suggestions@mdlzindia.com ద్వారా మాకు అందించండి.’’ అని పేర్కొంది. -
పట్నాలో మెట్రో పరుగులు.. ఎప్పుడంటే..
బీహార్ రాజధాని పట్నాలో ‘మెట్రో’ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2027 నాటికి ఈ పనులు పూర్తవుతాయనే అంచనాలున్నాయి. మొదటి దశలో మొత్తం 26 మెట్రో స్టేషన్లను నిర్మిస్తున్నారు. వీటిలో 13 భూగర్భ, 13 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు. ఫేజ్-1 కింద రెండు కారిడార్లను నిర్మిస్తున్నారు. మొదటి కారిడార్ దానాపూర్ నుండి ఖేమిన్‌చాక్ వరకు వెళుతుంది. దీని పొడవు 18 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ పట్నా జంక్షన్ నుండి పాటలీపుత్ర బస్ టెర్మినల్ వరకు ఉంటుంది. రెండో కారిడార్ పొడవు 14 కిలోమీటర్లు. మీడియాకు అందిన వివరాల ప్రకారం కారిడార్-1లో మొత్తం 14 మెట్రో స్టేషన్లు ఉంటాయి. వాటిలో 8 ఎలివేటెడ్, ఆరు భూగర్భ మెట్రో స్టేషన్లు. రెండో కారిడార్‌లో మొత్తం 12 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఐదు ఎలివేటెడ్, ఆరు భూగర్భంలో ఉంటాయి. డీఆర్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కారిడార్-2 జనవరి 2027 నాటికి ప్రారంభంకానుంది. ప్రస్తుతం భూగర్భ సొరంగాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 1.2 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. కాగా ఢిల్లీ-నోయిడా మధ్య కనెక్టివిటీని పెంచేందుకు నోయిడాలో కొత్త మెట్రో మార్గాలను నిర్మించాలని అధికారులు గతంలో నిర్ణయించారు. గత ఏడాది నూతన మెట్రో మార్గానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూపొందించింది. నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. -
పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..
‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది. దీంతో బ్రైడల్ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్ హాల్‌కు చేరుకుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ ‘స్మార్ట్ థింకింగ్’... ఇలాంటి రకరకాల కామెంట్స్ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి. -
హైదరాబాద్ మెట్రో విస్తరణ: ఏయే రూట్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ... హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు. కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది. కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.) కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ.) కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
Visakhapatnam: 76 కిమీ.. రూ.14వేల కోట్లు..
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్‌మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. 76.90 కి.మీ. మేర ప్రాజెక్టు.. విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్‌మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు. ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్‌లో తెలిపారు. 17న కేంద్రానికి డీపీఆర్ ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించినందున లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్‌కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
హైదరాబాద్ చుట్టూ ‘మెట్రో’
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం నలువైపులా మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఐదు కారిడార్లలో మెట్రో విస్తరణకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఎండీఏలు సమన్వయంతో హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో దశ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మెట్రో రైల్పై సమీక్షా సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు, అత్యధిక జనాభాకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణం కోసం దారుల్షిఫా నుంచి షాలిబండ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలపగా షాలిబండ వరకే కాకుండా ఫలక్‌నుమా వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ వర్గాలను సంప్రదించాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దీటుగా పాతబస్తీని అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రోడ్డు విస్తరణ, మెట్రోరైల్ ని ర్మాణం అవసరమన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెట్రోరైల్ పొడిగింపు కోసం 103 చోట్ల మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు, స్థానికులతో సంప్రదింపులు జరిపేందుకు తాను సైతం వస్తానని సీఎం పేర్కొన్నారు. పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో... పాతబస్తీ మీదుగానే ఎయిర్‌పోర్టు మెట్రో చేపట్టాలని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం సుమారు రూ. 6,250 కోట్లతో ప్రతిపాదించిన 31 కి.మీ. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గాన్ని నిలిపేయాలన్నారు. ఈ మార్గంలో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ మీదుగా అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రో మూడో దశ విస్తరణ చేపట్టాలన్నారు. రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, ఎల్బీనగర్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని సూచించారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్–నాగోల్ మధ్య 5కి.మీ. మేర మెట్రో చేపట్టాలని సీఎం చెప్పా రు. ఎయిర్‌పోర్టు మెట్రోపై తక్షణమే ట్రాఫిక్ స్టడీస్‌ను పూర్తి చేసి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని మెట్రోరైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డిని ఆదేశించారు. మెట్రోరైల్ నిర్మాణంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా లక్ష్మీగూడ–జల్పల్లి–మామిడిపల్లి రూట్ ను పరిశీలించాలన్నారు. ఈ మార్గంలో 40 అడుగుల సెంట్రల్ మీడియన్ ఉందని, మెట్రో నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రేవంత్ చెప్పారు. ఈ రూట్‌ను ఎంపిక చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ రూట్లో రవాణా ఆధారిత అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్, సీఎంఓ పర్సనల్ సెక్రటరీ శేషాద్రిని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ బి.శివధర్‌రెడ్డి, సీఎంఓ సెక్రటరీ షానవాజ్ ఖాసిం, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్.... నగర అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని, ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రోత్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీకి కూడా ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందువల్లే మెట్రో కనెక్టివిటీ అవసరమన్నారు. జేబీఎస్ మెట్రోస్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ చేపట్టాలని సూచించారు. రెండో దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదించిన 5 కారిడార్లపై వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరికి ముసాయిదా లేఖ పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 40 కి.మీ. మేర మూసీ రివర్‌ఫ్రంట్ ఈస్ట్–వెస్ట్ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సింగి వరకు నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా మూసీ మెట్రో చేపట్టాలన్నారు. సీఎం ప్రతిపాదించిన 5 కారిడార్లు ఇలా... ► మియాపూర్–చందానగర్–బీహెచ్ఈఎల్–పటాన్చెరు (14 కి.మీ.) ► ఎంజీబీఎస్–ఫలక్‌నుమా–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–పీ7 రోడ్డు–ఎయిర్‌పోర్టు (23 కి.మీ.) ► నాగోల్–ఎల్బీనగర్–ఒవైసీ హాస్పిటల్–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–ఆరాంఘర్–న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కి.మీ.) ► కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షి యల్ డి్రస్టిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుంచి/అమెరికన్ కాన్సులేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్బీ రోడ్డు (12 కి.మీ.) ► ఎల్బీనగర్–వనస్థలిపురం–హయత్‌నగర్ (8 కి.మీ.) -
రద్దు చేయం.. సరిచేస్తాం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమ ప్రభుత్వం మెట్రో మార్గం, ఫార్మాసిటీ సహా దేనినీ రద్దు చేయడం లేదని.. ప్రజోపయోగకరంగా మార్పులు మాత్రమే చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తుందే తప్ప.. రాష్ట్రానికి భారమయ్యే ఏ పనీ చేయబోదని వివరించారు. ఫార్మాసిటీ స్థానంలో ఫార్మా విలేజీలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, తక్కువ ఖర్చుతోనే శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్‌ను అనుసంధానిస్తామని తెలిపారు. చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలు శాచురేషన్కు వచ్చాయని.. రాష్ట్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా, ఎయిర్‌పోర్టుకు అవతలివైపు కోటిన్నర ప్రజలతో కొత్త సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఆధ్వర్యంలోనే మెట్రో విస్తరణ చేపడతాం. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు విస్తరిస్తాం. అవసరమైతే రామచంద్రాపురం వరకు పొడిగిస్తాం. నాగోల్–ఎల్బీనగర్–ఒవైసీ ఆస్పత్రి మీదుగా ఫలక్‌నుమా–శంషాబాద్ వరకు.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైల్ విస్తరిస్తాం. అలాగే మైండ్‌స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరించి పూర్తిస్థాయిలో వినియోగిస్తాం. గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరణ కోసం రూ.9వేల కోట్లు వ్యయం చేయడానికి సిద్ధమైంది. అలాగే బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మరోలైన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు విస్తరించకుండా కొత్తగా చేపట్టడం అనవసర వ్యయమే. అక్కడి నుంచి మెట్రో ఎక్కేవారు ఎవరూ ఉండరు. అది నిర్మించి ఉంటే.. కాళేశ్వరం తరహాలో రాష్ట్రానికి భారంగా మారేది. మేం చేసిన మార్పులతో నగరంపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీనికి కేంద్రం పూర్తిగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. ప్రస్తుత మెట్రోకు అనుసంధానం చేయడం వల్ల వ్యయం కూడా తగ్గుతుంది. ఫార్మాసిటీకి బదులు ఫార్మా విలేజ్‌లు 25వేల ఎకరాల్లో ఒకే చోట ఫార్మాసిటీ నిర్మిస్తే.. చివరికి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పనికిరాకుండా పోతుంది. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు మాదిరిగా అవుతుంది. అందుకే ఔటర్ రింగ్‌రోడ్డు– రీజనల్ రింగ్‌రోడ్డు మధ్య పది ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. నిరుపయోగంగా భూములు తీసుకుని ఒక్కో క్లస్టర్లో వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల్లో జీరో పొలుష్యన్ ఉండేలా ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తాం. ఒక్కోదానిలో పది పరిశ్రమలు ఉండేలా చూస్తాం. అక్కడ పనిచేసే వారికి అదే క్లస్టర్లో గృహాలతోపాటు అన్ని సౌకర్యాలతో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతిపాదిత ఫార్మాసిటీ ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు, టౌన్íÙప్లు, విద్యాలయాలు, ఆస్పత్రులు, వాణిజ్య భవన సముదాయాలు, వినోద సంబంధిత మల్టీప్లెక్స్‌లు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. బీవైడీ వంటి ఎల్రక్టానిక్ కార్ల కంపెనీలు సహా రాష్ట్రానికి వచ్చే ఎలాంటి పరిశ్రమలనూ వదులుకోబోం. వారికి అవసరమైన రాయితీలు కల్పిస్తాం. ప్రఖ్యాత కంపెనీల ఆధ్వర్యంలో వర్సిటీలు.. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం అగ్రశ్రేణి కంపెనీలను ఆహా్వనించాం. టాటా, మహీంద్రా, సెంచురీ సంస్థల ఆధ్వర్యంలో అవి ఏర్పాటవుతాయి. ఒక్కో పరిశ్రమ ఐదు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తుంది. ఇంటర్ పూర్తిచేసిన వారికి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. విద్యాశాఖ పర్యవేక్షణలోనే ఈ వర్సిటీలు ఉంటాయి. వీటిలో అభ్యసించే వారికి ఆ సంస్థలే ఉపాధి కల్పించడం, క్యాంపస్ రిక్రూట్మెంట్లు వంటి చర్యలు చేపడతాయి. నైపుణ్యంతో కూడిన డిగ్రీ ఉంటే వారికి ఉపాధి గ్యారంటీ అవుతుంది. ఒక్కో యూనివర్సిటీకి ప్రభుత్వం రెండు వందల ఎకరాల వరకు భూమి ఇస్తుంది. ప్రస్తుతం టాటా సంస్థ రూ.1,400 కోట్లు ఐటీఐలపై వెచ్చిస్తే.. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు వెచ్చిస్తుంది. రాష్ట్ర అతిథి గృహంగా.. వైఎస్సార్ క్యాంప్ ఆఫీసు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని రాష్ట్ర అతిథిగా గృహంగా మారుస్తున్నాం. నివాస భవనాన్ని మంత్రి నివాసంగా కేటాయించాం. కేసీఆర్ క్యాంపు కార్యాలయంగా వినియోగించిన భవనాన్ని కొత్తగా ప్రారంభించనున్న ‘మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్’ కోసం వినియోగిస్తాం. వంద పడకల ప్రతి ఆస్పత్రికి నర్సింగ్ కళాశాల రాష్ట్రంలో వంద పడకలున్న ప్రతీ ఆస్పత్రికి అనుబంధంగా ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం. నర్సులకు విదేశాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. మధ్య తరగతిలో వృద్ధులను చూసుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. వారికి చేదోడువాదోడుగా ఉండే నర్సులకు స్థానికంగానూ ఉపాధి లభిస్తుంది. విదేశాల్లో పనిచేసే నైపుణ్యం ఉన్న, లేనివారికి కూడా ఓరియంటేషన్ ఇప్పిస్తాం. విదేశాల్లోని పరిశ్రమలతో ప్రభుత్వమే సంప్రదింపులు జరిపి ఉద్యోగాలు కల్పిస్తాం. వేతనాలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వారికి ఏ ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది..’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజల ప్రభుత్వం మాది మాది ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం. ప్రజావాణి కోసం ప్రజలంతా రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోంది. మంత్రులందరినీ కూడా ప్రజల దగ్గరకే వెళ్లాలని కోరాను. 80శాతం సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం అవుతాయి. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటమే ప్రజా ప్రభుత్వం. మంత్రులు పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. గతంలో ఒక్కరే పనిచేసేవారు. ఆయనే ఫోటోలో, ప్రచారంలో ఉండేవారు. ఇప్పుడు మంత్రులంతా ప్రజల్లోనే ఉంటున్నారు. మా పాలనలో పరిపాలన వికేంద్రీకరణ చేశాం. వందరోజులు టార్గెట్‌గా పనిచేస్తున్నాం. -
మెట్రో రెండో దశకు ఐదేళ్లయినా రెడ్ సిగ్నలే!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ పనులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైలుకు రెండోదశ కింద చేపట్టే 26 కి.మీ. కారిడార్‌తోపాటు మరో 5 కి.మీ. పొడిగింపు పనులకే ఇంకా అనుమతి ఇవ్వకుండా కేంద్రం ఐదేళ్లుగా నాన్చు తోంది. కేంద్రం కొర్రీలకు బదులివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అలసత్వం కూడా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో తెలియని పరిస్థితి. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో ఓ వైపు మెట్రో అలైన్‌మెంట్‌ను పొడిగించాలనే డిమాండ్లు పెద్దఎత్తున వస్తుండగా, ప్రతిపాదిత అలైన్‌మెంట్లకే అనుమతి రాకపోవడంతో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ తల పట్టుకుంటోంది. రెండో దశ కింద లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ (26 కి.మీ) వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ (5 కి.మీ)కు ప్రతిపాదించిన పొడిగింపు పనుల డీపీఆర్‌ను 2018 నవంబర్లోనే కేంద్రం ఆమోదానికి పంపగా, ఐదేళ్లయినా అతీగతీ లేదు. దీంతో రూ. 8,453 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు అంచనా రెండింతలు పెరిగిందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు. రూ. 8,453 కోట్ల ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరిస్తే, 60% మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై ఇటీవల సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచారం కోరితే.. ఇంకా మదింపు దశలోనే ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ వెల్లడించడం గమనార్హం. ఆది నుంచీ కొర్రీలే 2018 నవంబర్‌లో ఈ రెండోదశ పనులకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. 2021 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఈ ఫైల్ ఏమాత్రం ముందుకు కదల్లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాయగా.. కేంద్రం ఫీజబిలిటీ, రైడర్‌షిప్‌లను సరిచేసేందుకు 15 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి వివరణ ఇవ్వాలంటూ 2022 డిసెంబర్ 1న లేఖ రాసింది. ఈ వివరాలు పంపితేనే డీపీఆర్‌ను ఆమోదిస్తామని తేల్చిచెప్పింది. కేంద్రం అడిగిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2023, ఫిబ్రవరి 28న కేంద్రానికి పంపింది. ఎస్పీవీ ఏర్పాటు, మినిమమ్ లోకల్ కంటెంట్, సమగ్ర రవాణా సర్వే, సవరించిన డీపీఆర్ అంచనాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బెంచ్ మార్క్ ప్రకారం పూర్తి చేసి నివేదించారు. కానీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం, దాని తీర్మానం కాపీని మాత్రం ఈ ఏడాది ఆగస్టు 8న అంటే కేంద్రం అడిగిన 9 నెలలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఇప్పటికీ కదలని ఫైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించి 2023–24 బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని, 60 శాతం రుణం కోసం ఏజెన్సీని కూడా ఎంపిక చేయలేదని ఆర్టీఐ కింద కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికైనా రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుందో లేదో తెలియడం లేదని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమోదం లభించాక టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు ఇంకెన్నేళ్లు పడుతుందోనని అంటున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఇప్పట్లో లేనట్లే.. రెండో దశ డీపీఆర్‌కు ఇప్పటివరకు ఆమోదం లభించకపోవడంతో కొత్త మెట్రో ప్రతిపాదనలు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రూ. 6,250 కోట్ల నిధులతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిత అలైన్‌మెంటును మార్చనున్నట్లు ప్రకటించారు. రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్‌సిటీ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు కొత్త అలైన్మెంట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మొదటిదశలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు పనులు చేపట్టని నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు అలైన్మెంట్ ఎలా రూపొందిస్తారో వేచిచూడాల్సిందే. -
TS: మెట్రో రైలెక్కిన హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఎల్బీనరగ్ స్టేషన్ నుంచి లక్డీకపూల్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తూ సరదాగా ప్రయాణికులతో ముచ్చటించారు. నాగోల్ శిల్పారామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని రవీంద్రభారతిలో మరో కార్యక్రమానికి వెళ్లేందుకు హరీశ్‌రావు మెట్రో రైలెక్కారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా మెట్రో రైలులో ప్రయాణించి ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..కొండా సురేఖ, పల్లా వాగ్వాదం ఎందుకంటే -
మెట్రో రైలు డోర్లో చీర ఇరుక్కుని.. మహిళ మృతి
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మెట్రో రైలు డోర్లో చీర ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీలోని ఇంద్రలోక్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలపాలైన మహిళను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి బాధిత మహిళ మరణించిటు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రీనా(35) అనే మహిళ ఇంద్రలోక్ రైల్వే స్టేషన్లో మెట్రో రైలు దిగే క్రమంలో ఆమె చీర డోర్లో ఇరుక్కుంది. కానీ రైలు ముందుకు వెళ్లడంతో మహిళ రైలు కింద పడిపోయింది. ఈ ఘటనలో బాధిత మహిళ తీవ్ర గాయాలపాలైంది. తీవ్ర గాయాలపాలైన రీనాను ఢిల్లీలోని సఫ్జర్‌జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మహిళ బంధువు విక్కీ తెలిపారు. రీనా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని విక్కీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని మెట్రో రైల్వే సేఫ్టీ కమిషనర్ దయాళ్ తెలిపారు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్‌గా కైలాష్ చౌదరి -
కొత్త మెట్రోరూట్‌తో డిస్టెన్స్ తక్కువ, వయబులిటీ ఎక్కువ?
ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి 'రేవంత్ రెడ్డి' కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో అలైన్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డుగుండా వెలుతుందని, దీని ద్వారా ఇప్పటికే ఔటర్‌రింగ్ రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేని రూట్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ఉండేలా డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు. కొత్త ప్రణాళికల ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి సమానంగా జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైదారాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్‌కు సూచించారు. దీన్ని బట్టి ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు మార్గాన్ని ఎంచుకోవడం లేదా.. ఇప్పటికే ఎల్బీనగర్ రూట్లలో మెట్రో ఉంది కాబట్టి, చాంద్రాయణగుట్ట రూట్ ద్వారా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టేలా చూడాలని HMRL ఎమ్‌డిని కోరారు. దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలు మెట్రోను వినియోగించుకునే అవకాశంతో పాటు అటు మెట్రోరైల్‌కు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా మైండ్ స్సేస్ రూట్ ద్వారా మెట్రో నిర్మిస్తే దాదాపుగా 31 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. అదే ఎల్బినగర్ రూట్ ద్వారా నిర్మిస్తే ఈ డిస్టెన్స్ మరో 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ రూట్లో పెద్దగా మలుపులు ఉండే అవకాశం లేదు. ఈ మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం కూడా తగ్గుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డు నుంచి తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. మొదటి ఫేజ్‌లో నిర్మించకుండా మిగిలిపోయిన పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రూట్ పూర్తైతే పాతబస్తీ అభివృద్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్స్‌ప్రెస్ ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి 6 వేల 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తొలత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా కిలోమీటర్ మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. విమానాశ్రయంలో రెండు మెట్రో స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన సమీక్షలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేల రూట్ మార్చాల్సి వస్తే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేయాల్సి వస్తే జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉంది, భవిష్యత్తులో ఈ సంఖ్య 3 కోట్లకు చేరే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను, తూర్పు నుంచి పడమర వరకు.. మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయనుంది. -
శ్రీరామ భక్తులకు యోగి సర్కార్ మరో కానుక!
అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో యూపీలోని యోగి సర్కారు శ్రీరామభక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ వాటర్ మెట్రో అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకు ప్రయాణిస్తూ, పర్యాటకులకు అయోధ్య సంస్కృతిని పరిచయం చేయనుంది. దేశంలో ఇది మొట్టమొదటి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందనుంది. ఈ వాటర్ మెట్రో 2024, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఇటీవల అయోధ్యలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర జలమార్గాలను ప్రోత్సహించడానికి సన్నాహాలు చేశారు. ఈ వాటర్ మెట్రో సరయూ నదిలో ముందుకు సాగనుంది. ఇది పర్యాటకులను అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకూ.. గుప్తర్ ఘాట్ నుండి అయోధ్యకు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటుంది. వాటర్ మెట్రోలో 50 అత్యాధునిక సీట్లు ఉండనున్నాయి. దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఘాట్ నుండి మెట్రో వరకు పర్యాటకులు వంతెనగా ఉపయోగించేందుకు రెండు జెట్టీలు కూడా నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి! -
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రోడ్డు షోలో పాల్గొన్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని వెంట వాహనంపై కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్‌లు ఉన్నారు. వారితో ర్యాలీలో 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా ప్రధాని మోదీ రోడ్ షో సాగింది. రోడ్ షోలో ప్రజాలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్ షో అనంతరం అమీర్‌పేట్ గురుద్వార్‌ను మోదీ సందర్శించారు. ఆపై కోటి దీపోత్సవం కార్యక్రమానికి మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్లను ఈ రోజు( సోమవారం ) సాయంత్రం మూసివేశారు. రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా నగరంలో భారీగా బలగాలను మోహరించారు. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 🚨 Important Update, Hyderabad! 🚨 For security reasons, in light of PM Shri Narendra Modi's Roadshow today (27/11/2023), Chikkadpally and Narayanaguda stations will be closed 15 minutes before and after the event, tentatively from 16:30 to 18:30 hrs. Arm-B of RTC X Roads… pic.twitter.com/3dps74NQvC — L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 27, 2023 హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి రోడ్ షో.. 2 కి.మీ మేర రోడ్ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం.. ర్యాలీలో పాల్గొననున్న గ్రేటర్ లోని 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బేగంపేట్, గ్రీన్లాండ్స్, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్.. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో ఉంటుంది. -
మెట్రోలో అరణ్య రోదన
కర్ణాటక: సిలికాన్ సిటీలో నిత్యం ఏదో ఒకచోట అబలలపై వేధింపులు జరుగుతున్నాయి. మాల్స్, రోడ్డు, మెట్రో రైలు.. ఇలా ఎక్కడైనా భద్రత లేకుండా పోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసందడితో ఉన్న మెట్రోలో యువతిని అసభ్యంగా తాకిన పోకిరీ వీడియో బయటకు వచ్చింది. అంత రద్దీ ఉన్నా అడ్డుకోలేదు సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో మెజిస్టిక్ మెట్రోలో ఘటన జరిగింది. బాధిత యువతి రోజూ మాదిరిగానే కాలేజీకి వెళ్లడానికి మెట్రో రైలులో ఎక్కింది. బోగీలో రద్దీగా ఉండగా, ఎర్ర చొక్కా ధరించిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమెను తాకసాగాడు. ఇది గ్రహించిన యువతి సహాయం చేయాలని కోరితే తోటి ప్రయాణికులు ఎవరూ స్పందించలేదు. ఆమె ఏడ్చినా కూడా ఎవరిలో కనికరం కలగలేదు. యువతి స్నేహితులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఘాటుగా వ్యాఖ్యానం పెట్టారు. ఇది బుధవారం చర్చనీయాంశమైంది. సదరు దుండగున్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఫిర్యాదు రాలేదు: మెట్రో మెట్రో అధికారి యశ్వంత్ చౌహాన్ దీనిపై స్పందించగా, ఏ టైం, ఏ ట్రైన్ అని తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు, అయినా కూడా మేం చర్యలు తీసుకొంటామని తెలిపారు. -
మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు!
ఐటీ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్ మీడియా ప్లాట్ఫారం రెడ్డిట్‌లో షేర్ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన స్నేహితురాలు కళాశాలకు రోజూ బస్సులో వెళతారని, అయితే ఆమె సోమవారం (నవంబర్ 20) మెట్రోలో ప్రయాణించారన్నారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లోని మెట్రోలో జనం ఎక్కువగా ఉన్నారని, దీంతో తోపులాటలు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత, నా స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించింది. ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. అతను ఆమెను అసభ్యంతా తాకడంతోపాటు గోర్లతో ఆమెను గుచ్చాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అయినా తోటి ప్రయాణికులెవరూ పట్టించుకోలేదు. ఇంతలో అతను పారిపోయాడని ఆ ఫ్రెండ్ పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు యూజర్స్ స్పందిస్తూ , తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఒక యూజర్ తాను మెట్రోలోనే పనిచేస్తున్నానని, మెట్రో అంతటా సీసీటీవీ నిఘాలో ఉన్నందున చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారన్నారు. ఈ వేధింపుల విషయమై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా అతను సహాయం అందిస్తాడని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు -
మెట్రోలో ఇకపై పిచ్చిపిచ్చి వీడియోలు కుదరవ్!
ఢిల్లీ మెట్రోకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ప్రేమికుల రొమాన్స్, మరోసారి యువకుల ఫైట్స్, ఇంకొన్నిసార్లు యువతీయువకుల డ్యాన్స్.. ఇలాంటి వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీటిని గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) చీఫ్ వికాస్ కుమార్ ఇలా వీడియోలు తీసేవారిని హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు మెట్రో అధికారులు పలు కఠిన చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వీడియో మేకింగ్ ఘటనలను నివారించేందుకు ఒక బృందం మెట్రోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. అభ్యంతరకర వీడియోలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా ఫేమస్ అయ్యేందుకు చాలామంది మెట్రో లోపల వీడియోలు షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కురచ దుస్తులు ధరించి యువతులు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటువంటి ఘటనలను నియంత్రించేందుకు మెట్రో లోపల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తోటి ప్రయాణికులు మెట్రో అధికారులకు తెలియజేయాలని డీఎంఆర్సీ చీఫ్ వికాస్ కుమార్ కోరారు. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
విద్యార్థినులకు మెట్రో ప్రయాణం ఉచితం!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, ల్యాప్‌టాప్‌లిస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వర్గానికే మరో కీలక హామీ ఇవ్వబోతోంది. 14 ఏళ్లు నిండి, చదువుకుంటున్న బాలికలందరికీ మెట్రో ప్రయాణాన్ని ఉచితం చేస్తామని చెప్పబోతోంది. పదో తరగతి చదువుకుంటున్న బాలికల నుంచి పీహెచ్‌డీలు చేసే విద్యార్థినుల వరకు అన్ని స్థాయిల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదివే వారికి ఈ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెపుతోంది. ఈ మేరకు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను పొందుపర్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ‘ప్రజా మేనిఫెస్టో’పేరుతో తయారవుతున్న ఈ ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీ తన కసరత్తును పూర్తి చేసింది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై అనేక అంశాలకు తుది రూపు తీసుకువచ్చింది. కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పరిశీలనకు పంపారని, ఈనెల 14న పార్టీ మేనిఫెస్టో అధికారికంగా విడుదలవుతుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఒక రోజు ఆలస్యమవుతుందని అంటున్నాయి. ప్రజాకర్షకంగా రూపకల్పన.. ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించే పథకాలకు కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఆరుగ్యారంటీల పేరుతో మహిళలు, వృద్ధులు, పేద వర్గాలకు చెందిన ఓట్లను రాబట్టుకునే పనిలో పడిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో కూడా అన్ని వర్గాల ఓట్లు సంపాదించేలా పథకాలను ప్రతిపాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న అమ్మ ఒడి తరహా పథకాన్ని ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ తరహాలో పెద్ద మొత్తంలో కాకుండా రూ.1,000 ఆర్థిక సాయం చేయాలనే ప్రతిపాదనపై మేనిఫెస్టో కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. ఎంత మొత్తం ప్రతిపాదించాలన్న దానిపై తర్జనభర్జనలు ఓ కొలిక్కి రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పరిశీలనకు ఈ ప్రతిపాదనను పంపినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవవేతనం ఇస్తామనే హామీని కూడా కాంగ్రెస్ ఇవ్వబోతోంది. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి.. ఇక, విశ్వనగరం హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తోంది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాâళిక రూపొందిస్తోంది. ఇటు హైదరాబాద్‌తో పాటు అటు రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆకర్షణీయంగా ఉండేలా వాహన చలాన్లను ఏకకాలంలో రద్దు చేస్తామని ప్రకటించనుంది. హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా కార్పొరేట్ ఆసుపత్రులు, వరదల తాకిడి నుంచి బయటపడేందుకు లోతట్టు ప్రాంతాల్లో నిలిచే నీరు త్వరగా వెళ్లిపోవడం కోసం లింక్డ్ కెనాల్స్ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో పాటు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనుంది. మూసీ చుట్టూ రేడియల్ రోడ్ల నిర్మాణం, నల్లగొండ జిల్లా వరకు మూసీ కనెక్టివిటీ కారిడార్ ఏర్పాటు లాంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించనుందని తెలుస్తోంది. -
‘నమో భారత్’ అదిరెన్.. హైదరాబాద్‌లోనే డిజైన్!
సాక్షి, హైదరాబాద్: వందే భారత్ రైలు తర్వాత మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రైలు సర్వీసు ‘నమో భారత్’. మెట్రో రైళ్ల కంటే చాలా ఎక్కువ వేగంతో దూసుకుపోయే ఈ రైళ్లు.. వసతుల్లోనూ వాటికంటే మెరుగ్గా ఉంటాయి. బుల్లెట్ రైలు మాదిరిగా ముందు భాగం ఏరోడైనమిక్ డిజైన్‌తో ఉండటం దీని ప్రత్యేకత. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే.. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. సాహిబాబాద్–దుహై స్టేషన్ల మధ్య ఈ సేవలు మొదలయ్యాయి. దాదాపు 160 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ రైళ్లు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భాగ్యనగరంతో బంధం... ఎన్నో ప్రత్యేకతలతో పట్టాలెక్కిన ఈ రైళ్లకు భాగ్యనగరంతోనూ ఓ బంధం ముడిపడి ఉంది. చూడగానే ఆకట్టుకునే రూపం, అత్యధిక వేగం, మెట్రో రైళ్లకంటే వెడల్పు, ఎత్తుగా ఉండటంతో విశాలమైన కోచ్‌లు.. ఇలా పలు ప్రత్యేకలతో ఉన్న ఈ రైలును డిజైన్ చేసింది ఆల్స్టోమ్ అనుబంధ విభాగం ఉన్న హైదరాబాద్‌లోనే కావటం విశేషం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి కంపెనీ ఆల్స్టోమ్ ప్రపంచ వ్యాప్తంగా రైలు రోలింగ్‌స్టాక్ తయారీలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ బెంగళూరు కేంద్రంగా మన దేశంలో ఆల్స్టోమ్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్ పేరుతో ఏర్పాటై, మెట్రో రైళ్లను తయారు చేస్తోంది. దీనికి హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం నమో భారత్ రైలును డిజైన్ చేసింది. ఎరోడైనమిక్ నోస్ మోడల్‌తో రూపొందించిన ఈ డిజైన్ టెండర్ ద్వారా అమోదం పొందింది. ఎన్నో ప్రత్యేకతలు... గంటకు దాదాపు 180 కి.మీ. వేగంతో దూసుకుపోయే సామర్ధ్యంతో దీన్ని రూపొందించారు. అంత వేగంతో వెళ్లేప్పుడు గాలి ఒత్తిడిని తట్టుకునేందుకు బుల్లెట్ రైలు తరహాలో ఎరోడైనమిక్ నోస్ మోడల్‌ను రూపొందించారు. దేశంలో సాధారణ మెట్రో రైళ్లు 2.8 మీటర్ల నుంచి 3 మీటర్ల వెడల్పు ఉంటాయి. కానీ నమో భారత్ ఏకంగా 3.2 మీటర్ల వెడల్పుతో ఉంది. మెట్రో రైళ్లలో బెంచీల తరహాలో సీటింగ్ సిస్టం ఉండగా, ఇందులో వందేభారత్ చైర్ కార్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నవారిని వేగంగా ఢిల్లీ నగరంలోని అసుపత్రులకు తరలించేందుకు కూడా అనుకూలంగా వీటిని డిజైన్ చేశారు. రోడ్డు మార్గాన రెండు గంటల్లో వెళ్లే దూరాన్ని ఈ రైలు కేవలం అరగంటలో చేరుతుంది. స్ట్రెచర్‌తో సహా రోగిని రైలు కోచ్‌లో ఉంచేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్ట్రెచర్‌ను అటాచ్ చేసే సిస్టమ్ ఉంది. ఆ కంపెనీ టేకోవర్.. నమో భారత్ రైలు డిజైన్‌ను హైదరాబాద్‌లో రూపొందించగా, గుజరాత్‌లోని సావ్లీ గ్రామంలో ఉన్న బాంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే మరో బహుళజాతి కంపెనీకి చెందిన యూనిట్లో ఈ రైళ్లను తయారు చేశారు. 2021లో ఈ కంపెనీని కూడా ఆల్స్టోమ్ కంపెనీ టేకోవర్ చేయటం విశేషం. త్వరలో చేపట్టనున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కూడా ఈ సంస్థ బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుతం నగరంలో 90 కి.మీ. వేగంతో తిరుగుతున్న మెట్రో రైళ్ల కంటే ఎయిర్‌పోర్టు మెట్రో రైళ్లు కనీసం 30 కి.మీ. అధిక వేగంతో తిరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కాస్త ఎరో డైనమిక్ లుక్‌తో ఉండనున్న ఈ రైళ్ల తయారు కోసం ఈ కంపెనీ సిద్ధమవుతోందని తెలుస్తోంది. -
మెట్రోలో కోతి చేష్టలు
శివాజీనగర: కొన్ని రోజుల క్రితం మెట్రో రైలులో గోబి మంచూరి తిన్న ఓ వ్యక్తికి పోలీసులు రూ.500 జరిమానా విధించారు. అలాగే కొత్తగా గ్రీన్ లైన్ మెట్రో రైలు మంగళవారం రాత్రి యలచేనహళ్లికి వెళుతున్నపుడు కొందరు విద్యార్థులు పోకిరీ చేష్టలు చేశారు. హ్యాండిళ్లకు వేలాడుతూ, తలకిందులుగా ఊగుతూ విన్యాసాలు చేస్తూ మిగతా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. మీత్ పటేల్, మరో ముగ్గురు ఆకతాయి విద్యార్థుల ప్రవర్తనపై ప్రయాణికులు వీడియోలు తీసి యలచేనహళ్లి మెట్రో స్టేషన్‌లోని భద్రతా సిబ్బందికి ఇచ్చారు. దీంతో వారు విద్యార్థులను పట్టుకుని మందలించి, తలా రూ. రూ.500 జరిమానా విధించారు. కాగా మెట్రోలో ఫోటోషూట్లు, వీడియోలు తీస్తూ హల్చల్ చేయడం పెరిగిపోయింది. -
బాబోయ్... ట్రాఫిక్ పద్మవ్యూహం
సాక్షి బెంగళూరు: పద్మవ్యూహంలో చిక్కుకుని బయటపడొచ్చు, కానీ బెంగళూరు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుంటే బయటపడడం అంత సులభం కాదని ఐటీ నగర వాసులు చెప్పుకుంటారు. నిదానంగా సాగే వాహనాలు ఒకపక్క, రోడ్డు దాటేందుకు శ్రమించే సామాన్య ప్రజలు, అలాగే కిలోమీటర్ల కొద్ధీ నిలిచిపోయే వాహనాలు.. ఇది గత సంవత్సర కాలంలో బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్డులోని పరిస్థితి. వందలాది ఐటీబీటీ కంపెనీలు ఈ ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంగా ఉండడంతో ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు నిత్యం నగర రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు. మరోవైపు మెట్రో రైల్వే నిర్మాణ పనులు కూడా జరుగుతుండడం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోంది. సోమవారం కాగానే షురూ సోమవారం ఉదయం 8 గంటలకు వాహనాల రద్దీ మొదలవుతుంది. మధ్యాహ్నం వరకు ఈ ట్రాఫిక్ ఒత్తిడి కొనసాగుతోంది. మంగళవారం, బుధవారం, గురువారాల్లో లక్షలాది వాహనాలతో కూడిన వాహన గజిబిజిని నియంత్రించడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారుతోంది. వీకెండ్ మొదలయ్యే శుక్ర, శని, ఆదివారాల్లో కొంత రద్దీ తగ్గి ఉపశమనం కలుగుతుంది. మెట్రో బ్లూ మార్గం రావాలి 2025 నాటికి మెట్రో బ్లూ మార్గం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో రైల్వే ఈ మార్గంలో ప్రారంభం అయితే 50 శాతం ట్రాఫిక్ తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. మారతహళ్లి వంతెన వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీ వల్ల చుట్టుపక్కల రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ వంతెనకు ఒకవైపు మాత్రమే ఫుట్ఓవర్ బ్రిడ్జి ఉంది. మరోవైపు లేకపోవడంతో బారులు తీరిన ఆ వాహనాల మధ్య ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాపుల వద్ద ఇబ్బంది అలాగే సిటీ బస్సులు ఆయా బస్టాప్‌ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని, దించుకునే కొద్ది సమయం వల్ల కూడా వెనుక వచ్చే వాహనాలు రద్దీలో చిక్కుకుంటున్నాయి. టిన్ ఫ్యాక్టరీ వద్ద బీఎంటీసీ బస్సులు రోడ్డు నుంచి కొంచెం ఎడంగా వచ్చి నిలిచేలా బస్‌బేలను నిర్మించారు. అదేవిధంగా మారతహళ్లితో ఇతర ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంపై కూడా బస్‌బేలను నిర్మిస్తే రద్దీ గొడవ తగ్గుతుందని డిమాండ్లు ఉన్నాయి. బెంగళూరు నగరం లోపలకి ట్రాక్టర్లకు అనుమతి లేదు, అయితే కొన్ని ప్రభుత్వ శాఖల ట్రాక్టర్లు బయట నుంచి నగరంలోకి వస్తుండడం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. అలాగే నిషేధం ఉన్నా పగటి వేళ లారీలు తిరగడం గమనార్హం. ట్రాఫిక్ రద్దీకి కొన్ని కారణాలు ఐటీబీటీ కంపెనీల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంను వదిలేసి ఆఫీసులకు రాకపోకలు సాగిస్తున్నారు. నమ్మ మెట్రో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు జరిగే రోడ్లను అక్కడక్కడ మూసివేయడం లేదా పాక్షికంగా కొద్ది భాగం మూసివేశారు. నగర రోడ్లపై అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయడం లేదు. దీంతో వాహనదారులు ఇష్టానురీతిగా వాహనాలను నడుపుతుంటారు పార్కింగ్ వసతి లేదని పలు రద్దీ రోడ్లలో వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. -
హైదరాబాద్ మెట్రోలో టీడీపీ ఓవరాక్షన్
-
ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. ఒలింపిక్ ఆటగాళ్ల ఒళ్లు గుల్లే?
నల్లులు జాతీయ సమస్యగా మారనున్నాయా? అని ఫ్రెంచి వారిని అడిగితే ‘అవును’ అనే సమాధానం ఇవ్వనున్నారు. ప్రస్తుతం పారిస్ బెడ్‌బగ్స్ (నల్లులు)తో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇక్కడి మెట్రో, విమానాశ్రయం, సినిమా హాళ్లు, హోటళ్లు ఇలా ప్రతిచోటా నల్లులు నక్కి ఉంటున్నాయి. పారిస్‌లో నల్లుల సమస్య తీవ్రంగా మారడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నల్లులను ప్రజలంతా తరిమికొట్టాలంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రులంతా దీనిపై హడావుడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఫ్రాన్స్ 2024లో ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో విదేశీ ఆటగాళ్లు నల్లులకు బలికాకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. రాజధాని ప్యారిస్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా నల్లుల బెడద సోకింది. పొంచివున్న ప్రమాదం నుంచి ఇక్కడివారు ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు. ఆయన ఒక పత్రికా ప్రకటనలో ప్రజలనుఉద్దేశించి ‘మీరు ఎప్పుడైనా నల్లుల బారిన పడవచ్చు. అవి మిమ్మల్ని తాకినప్పుడు, అవి మీతో పాటు మీ ఇంటికి వస్తాయి’ అని హెచ్చరించారు. అలాగే గ్రెగోయిర్ ఫ్రాన్స్ స్టేట్ రేడియో సర్వీస్ ‘ఫ్రాన్స్ ఇన్ఫో’తో మాట్లాడుతూ ‘నల్లుల వల్ల వచ్చే వ్యాధుల చికిత్సను బీమా పాలసీలో చేర్చాలి. ఇది బెడ్‌బగ్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్న వారికి ఉపశమనం కల్పిస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని’ ఆయన మీడియాకు తెలిపారు. మూడేళ్ల కిందట కూడా ఇదేవిధంగా నలుల్ల బెడద దాపురించింది. వెంటనే స్పందించిన ఫ్రెంచ్ ప్రభుత్వం తన ప్రత్యేక వెబ్సైట్, సమాచార హాట్‌లైన్ సాయంతో యాంటీ-బెడ్‌బగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల మెట్రోలో బెడ్‌బగ్‌లు కనిపించిన నేపధ్యంలో ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం మానేశారు. పారిస్ సిటీ హాల్ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు లేఖ కూడా రాశారు. 1950లో ఫ్రాన్స్‌లో ఇదే విధమైన నల్లుల సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నల్లులు మాయమయ్యాయి. అయితే ఇప్పుడు హఠాత్తుగా నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నల్లులు కుట్టడం వలన డిప్రెషన్, యాంగ్జయిటీ తదితర వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. -
మెట్రో రైలులో యూట్యూబర్ హల్చల్.. ప్రయాణికులను షాక్
కర్ణాటక: మెట్రో రైలులో కొందరు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు పెడుతున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరు మెట్రోలో అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది. విజయనగర నుంచి మెజిస్టిక్‌కు ప్రయాణించే సమయంలో ఓ యూట్యూబర్ తొలుత ఎస్కలేటర్‌పై వస్తూ మూర్ఛ వచ్చినట్లు ప్రాంక్ వీడియో చేసి ప్రయాణికులను గాభరా పెట్టాడు. అనంతరం మెట్రోలో ప్రయాణిస్తూ మూర్ఛవచ్చినట్లు నటించి ప్రయాణికులను షాక్‌కు గురిచేశాడు. అనంతరం ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ ఘటనను బీఎంఆర్సీఎల్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రయాణికులను కంగారుపెట్టిన యువకుడి సమాచారం సేకరిస్తున్నారు. అతడి పేరు ప్రాంక్ ప్రజ్ఞు అని తెలిసింది. ముంబై, న్యూఢిల్లీ మెట్రోలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగుచూడగా ప్రస్తుతం బెంగళూరులో జరిగింది. మెట్రో ప్రయాణికుడిపై కేసు నమ్మ మెట్రోరైలులో గోబిమంచూరి తిన్న ప్రయాణికుడిపై బీఎంఆర్సీఎల్ కేసు నమోదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.500 జరిమానా విధించింది. బీఎంఆర్‌సీఎల్‌లో ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. కేసు నమోదైన వ్యక్తి నమ్మమెట్రోలో జయనగర నుంచి సంపిగే రోడ్డు మధ్య నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి గోబిమంచూరి తీసుకువచ్చి అక్కడే తిన్నాడు. తోటి స్నేహితులు వారించారు. ఈ వీడియోను ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. బీఎంఆర్సీఎల్ కేఆర్.మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. -
కిందపడ్డ మెట్రో రీరైల్
కర్ణాటక: రాజధానిలో నమ్మ మెట్రో గ్రీన్ మార్గంలో రీ రైలు అనే తనిఖీ వాహనం పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలు మార్గంలో మెట్రో రైళ్ల సంచారానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున రాజాజీ నగర మెట్రోస్టేషన్ – మహాకవి కువెంపు స్టేషన్ మధ్య మెట్రో వంతెన పట్టాలపై వెళ్తున్న రీ రైల్ పట్టాలు తప్పి పై నుంచి కిందకు పడిపోయింది. మామూలుగా మెట్రో సిబ్బంది పట్టాలు తనిఖీలు, మరమ్మతులు చేయడానికి రీ రైల్లో వెళ్తూ ఉంటారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియే, అయితే వాహన డ్రైవర్ అలసత్వం వల్ల అది కిందపడిపోగా అదృష్టవశాత్తు ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పలు సర్వీసులకు బ్రేక్ ఈ సంఘటనతో గ్రీన్లైన్లో మెట్రో రైళ్ల సంచారాన్ని అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది. ఉదయం విధులకు వెళ్లే ఉద్యోగులు రైళ్లు లేక ఇబ్బంది పడ్డారు. నాగసంద్ర నుంచి యశవంతపుర, సెంట్రల్ సిల్క్‌బోర్డ్ నుంచి మంత్రి మాల్ మాత్రమే మెట్రో రైళ్లు సంచరించాయి. టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రైళ్లు రాకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. ఇతర వాహనాల్లో ఆఫీసులకు పరుగులు తీశారు. దీంతో బీఎంటీసీ అధికారులు యశవంతపుర నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక బస్సులను తిప్పారు. సాయంత్రం నుంచి రైళ్లు మళ్లీ మామూలుగా తిరిగాయి. మరోవైపు కిందపడిపోయిన రీ రైలును తిరిగి పట్టాలపైకి తెచ్చేందుకు భారీ క్రేన్‌ను తెప్పించారు. ఎంతో ప్రయత్నం చేయగా మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మెట్రో ట్రాక్ మీదకు తెచ్చి తీసుకెళ్లారు. ఈ ఘటనలో అందులోని సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. -
పుట్టినరోజు నాడు ఢిల్లీ మెట్రోలో సందడి చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వాటిలో భాగంగా ఆయన మొదట ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్టెన్షన్ లైన్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన యశోభూమిని ప్రారంభించడానికి ఇదే మెట్రో రైలులో ప్రయాణించారు. #WATCH | Prime Minister Narendra Modi inaugurates the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/8qXxhwtp9i — ANI (@ANI) September 17, 2023 మెట్రో ప్రయాణం.. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వరకు పొడిగించిన మెట్రో ఎక్స్టెన్షన్ లైన్‌ను ప్రారంభించి అనంతరం అదే మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్బంగా సహచర ప్రయాణికులతో ఆయన కొంతసేపు మాటామంతీ జరిపారు. ఇదే క్రమంలో అనేక అంశాలను ప్రసావించిన ఆయన వాటిపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఆప్యాయంగా సంభాషించారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi travels in Delhi Metro ahead of inaugurating the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/O3sKCNDcTK — ANI (@ANI) September 17, 2023 #WATCH | Prime Minister Narendra Modi interacts with employees of the Delhi Metro after inaugurating the extension of the Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/g8D1UbESfh — ANI (@ANI) September 17, 2023 PM Modi shared a Delhi metro ride with students of Delhi University and had a lively, close, and personal interaction. pic.twitter.com/C0t8zWW7xn — BALA (@erbmjha) June 30, 2023 చారిత్రాత్మక కట్టడం.. ఇదే మెట్రో మార్గం కొత్తగా నిర్మించిన అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ద్వారక సెక్టార్ 21 మెట్రో స్టేషన్ ను అనుసంధానిస్తుంది. ఇదే రైలులో యశోభూమికి చేరుకుని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ మొదటి దశను ప్రారంభిస్తారు. ఇక ఆయన ప్రారంభించిన ఈ మెట్రో సేవలు మధ్యాహ్నం మూడు గంటల నుంచే అందుబాటులోకి రానున్నాయి. भारत मंडपम के बाद यशो भूमि देखिये। #yashobhumi pic.twitter.com/8UxxljsFxO — Prakash lalit (@PrakashLalit3) September 16, 2023 పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇక ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, శరద్ పవార్, అభిషేక్ బెనర్జీ, పినరాయి విజయన్ తదితరులు ఉన్నారు. Wishing PM Narendra Modi a happy birthday. — Rahul Gandhi (@RahulGandhi) September 17, 2023 Birthday greetings to Hon’ble PM Shri @narendramodi ji. I pray for your good health and long life. — Arvind Kejriwal (@ArvindKejriwal) September 17, 2023 माँ भारती के परम उपासक, 'नए भारत' के शिल्पकार, 'विकसित भारत' के स्वप्नद्रष्टा, 'एक भारत-श्रेष्ठ भारत' के प्रति संकल्पित, विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता, देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई! 'विकसित भारत' के निर्माण के लिए आपका समर्पण… pic.twitter.com/dpr63NDgVn — Yogi Adityanath (@myogiadityanath) September 16, 2023 ప్రెసిడెంట్ విషెస్.. రాష్ట్రపతి ముర్ము రాస్తూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు సందర్భంగా మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దూరదృష్టి, సంకల్పబలం తోపాటు మీ బలమైన నాయకత్వంతో మీరు 'అమృత్ కాల్'లో భారతదేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండాలని కోరుకుంటూ మీ అద్భుతమైన నాయకత్వంలో దేశప్రజలకు అన్నివిధాలా ప్రయోజనాలు చేకూర్చాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని నవ భారత రూపశిల్పిగా అభివర్ణించారు. भारत के प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। मेरी शुभेच्छा है कि अपनी दूरगामी दृष्टि तथा सुदृढ़ नेतृत्व से आप ‘अमृत काल’ में भारत के समग्र विकास का मार्ग प्रशस्त करें। मेरी ईश्वर से प्रार्थना है कि आप सदा स्वस्थ और सानंद रहें तथा देशवासियों… — President of India (@rashtrapatibhvn) September 17, 2023 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ వివాదాస్పద భారత మ్యాప్.. బీజేపీ ఫైర్