
కొన్ని రోజుల క్రితం మెట్రో రైలులో గోబి మంచూరి తిన్న ఓ వ్యక్తికి పోలీసులు రూ.500 జరిమానా విధించారు.
శివాజీనగర: కొన్ని రోజుల క్రితం మెట్రో రైలులో గోబి మంచూరి తిన్న ఓ వ్యక్తికి పోలీసులు రూ.500 జరిమానా విధించారు. అలాగే కొత్తగా గ్రీన్ లైన్ మెట్రో రైలు మంగళవారం రాత్రి యలచేనహళ్లికి వెళుతున్నపుడు కొందరు విద్యార్థులు పోకిరీ చేష్టలు చేశారు. హ్యాండిళ్లకు వేలాడుతూ, తలకిందులుగా ఊగుతూ విన్యాసాలు చేస్తూ మిగతా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు.
మీత్ పటేల్, మరో ముగ్గురు ఆకతాయి విద్యార్థుల ప్రవర్తనపై ప్రయాణికులు వీడియోలు తీసి యలచేనహళ్లి మెట్రో స్టేషన్‌లోని భద్రతా సిబ్బందికి ఇచ్చారు. దీంతో వారు విద్యార్థులను పట్టుకుని మందలించి, తలా రూ. రూ.500 జరిమానా విధించారు. కాగా మెట్రోలో ఫోటోషూట్‌లు, వీడియోలు తీస్తూ హల్‌చల్ చేయడం పెరిగిపోయింది.