కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దసరా సందర్భంగా దుర్గా పూజలు వైభవంగా జరుగుతాయి. రాజధాని కోల్‌కతాలో నిర్వహించే దుర్గా పూజలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. కోల్‌కతాలోని మెట్రో ప్రయాణికులు అక్టోబరు ఆరు నుంచి అంటే దుర్గా పూజల సమయంలో మెట్రో నుంచి అదనపు సేవలు అందుకోనున్నారు.
దుర్గాపూజల సందర్భంగా మెట్రోలో ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు కోల్‌కతా మెట్రో రైల్వే కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక మెట్రో సేవలను అందించనున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ సేవలు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమై, విజయదశమి నాడు అంటే అక్టోబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఉత్తర-దక్షిణ కారిడార్‌లో ప్రతిరోజూ 248 మెట్రో సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
విజయ దశమి నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు 174 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. అక్టోబర్ 9న కోల్‌కతా మెట్రో ఉదయం 6:50 నుండి అర్ధరాత్రి వరకు 288 సర్వీసులను నడపనుంది. గ్రీన్ లైన్-1లో సప్తమి-అష్టమి- నవమి రోజులలో 64 సర్వీసులు, 'దశమి' నాడు 48, షష్ఠి నాడు 106 సర్వీసులు నడపనుంది. గ్రీన్ లైన్-2లో సప్తమి-అష్టమి-నవమి రోజుల్లో 118 సర్వీసులు, దశమి నాడు 80 సర్వీసులు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: రేపటి నుంచి దసరా సెలవులు
Comments
Please login to add a commentAdd a comment