Time Table
-
10 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు రాయనున్నారు. షెడ్యూల్ ఇలా... 10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1(కాంపోజిట్ కోర్సు), 11వ తేదీ సెకండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లిషు, 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2(కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 15న గణితం, 17న భౌతిక శాస్త్రం, 18న జీవ శాస్త్రం, 19న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ), 20న సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనుంది. -
మార్చి 15 నుంచి పది పరీక్షలు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. టైమ్ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మెనేజ్‌మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించాలని.. ఈనెల ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 7న జరిగే పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో దీనిపై చర్చించాలని.. ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసినందుకు ప్రత్యేక సీసీఎల్ మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని.. అభ్యసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సెలవు రోజులను మినహాయించాలి.. పదో తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్లో సెలవు రోజులను మినహాయించాలని విద్యా శాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్–1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలని.. సగటు విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రతి సబ్జెక్టుకూ ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని కోరారు. -
బడి వేళల పెంపునకు కసరత్తు
సాక్షి, అమరావతి/కదిరి: ఉన్నత పాఠశాలల పనివేళల్ని మరో గంట పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్న వీటిని 5 గంటల వరకు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండే పనివేళలను గత ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మార్చింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజుకు 7 పీరియడ్స్ ఉండేవి. ఇకమీదట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు 8 పిరియడ్ల్లో హైస్కూల్ నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలు చేయాలని, ఆ జిల్లాలోని ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను ఎంపిక చేయాలని ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపిక చేసిన పాఠశాలల జాబితాను ఈ నెల 20లోగా తెలియజేయాలని ఆదేశించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 30 వరకు కొత్త టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహిస్తారు. ఇది సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తే వెంటనే ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. కాగా, పాఠశాలల పనివేళల పెంపు తలకు మించిన భారంగా మారుతుందని..విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్) అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల సమయాన్ని మార్చాలన్న నిర్ణయం సరైంది కాదని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (పీఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సమయాలు పిల్లల సైకాలజీకి అనుగుణంగా ఉన్నాయని, మార్చాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతిపాదిత టైం టేబుల్ ఇలా..» ఉదయం 9కి మొదటి గంట, 9.05కు రెండోగంట, 9.05 నుంచి 9.25 వరకు ప్రార్థన. » 9.25–10.15 వరకు మొదటి పీరియడ్, 10.15–11 వరకు రెండో పిరియడ్. » 11–11.15 వరకు విరామం. » 11.15 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడో పిరియడ్, 12–12.45 వరకు నాలుగో పీరియడ్...12.45–1.45 వరకు భోజన విరామం. » 1.45–2.30 వరకు ఐదో పీరియడ్, 2.30–3.15 వరకు ఆరో పీరియడ్. 3.15–3.30 వరకు చిన్న విరామం. » 3.30–4.15 వరకు ఏడో పీరియడ్, 4.15–5 గంటల వరకు 8వ పీరియడ్. -
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్‌లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్‌లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త -
దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా దుర్గా పూజలు వైభవంగా జరుగుతాయి. రాజధాని కోల్‌కతాలో నిర్వహించే దుర్గా పూజలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. కోల్‌కతాలోని మెట్రో ప్రయాణికులు అక్టోబరు ఆరు నుంచి అంటే దుర్గా పూజల సమయంలో మెట్రో నుంచి అదనపు సేవలు అందుకోనున్నారు. దుర్గాపూజల సందర్భంగా మెట్రోలో ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు కోల్‌కతా మెట్రో రైల్వే కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో ప్రత్యేక మెట్రో సేవలను అందించనున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ సేవలు అక్టోబర్ 6 నుంచి ప్రారంభమై, విజయదశమి నాడు అంటే అక్టోబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఉత్తర-దక్షిణ కారిడార్‌లో ప్రతిరోజూ 248 మెట్రో సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.విజయ దశమి నాడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు 174 మెట్రో రైలు సర్వీసులు నడపనున్నారు. అక్టోబర్ 9న కోల్‌కతా మెట్రో ఉదయం 6:50 నుండి అర్ధరాత్రి వరకు 288 సర్వీసులను నడపనుంది. గ్రీన్ లైన్-1లో సప్తమి-అష్టమి- నవమి రోజులలో 64 సర్వీసులు, 'దశమి' నాడు 48, షష్ఠి నాడు 106 సర్వీసులు నడపనుంది. గ్రీన్ లైన్-2లో సప్తమి-అష్టమి-నవమి రోజుల్లో 118 సర్వీసులు, దశమి నాడు 80 సర్వీసులు నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: రేపటి నుంచి దసరా సెలవులు -
పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు!
సోషల్ మీడియాలో చిన్న పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ, నెటిజన్లను అమితంగా అలరిస్తుంటాయి. వీటిని చూసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి క్షణాల్లో మాయం అవుతుంటుంది. సాధారణంగా చిన్నారులకు అంత త్వరగా చదువుపై మనసు లగ్నం కాదు. అయితే కొందరు పిల్లలు అటు టీచర్లు చెప్పారనో లేదా తల్లిదండ్రులు చెప్పారనో సొంత టైమ్ టేబుల్ తయారు చేసుకుంటుంటారు. వీటిలో రోజువారీ దినచర్య రాసుకుంటారు. ఈ కోవలో ఒక కుర్రాడు తయారు చేసుకున్న టైమ్ టేబుల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. క్రమశిక్షణ కోసం టైమ్ టేబుల్ ట్విట్టర్ యూజర్ @Laiiiibaaaa ఒక పోస్టు షేర్ చేశారు. దీనిని చూసినవారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆరేళ్ల పిల్లాడు తనను తాను క్రమశిక్షణతో ఉంచుకునే ఉద్దేశంతో తన 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ రూపొందించుకున్నాడు. ఈ పిల్లాడు తాను చేయాల్సిన అన్ని పనులకు అధిక సమయం కేటాయిస్తూ, చదువుకునేందుకు కేవలం 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇదే నెటిజన్లను తెగ నవ్విస్తోంది. My 6 year old cousin made this timetable...Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI — Laiba (@Laiiiibaaaa) June 22, 2023 ఏమేమి రాశాడంటే.. ఆ పిల్లాడు తన టైమ్ టేబుల్లో నిద్ర నుంచి లేచే సమయం, వాష్‌రూమ్, బ్రేక్‌ఫాస్ట్, టీవీ టైమ్, స్నానం చేసే సమయం, లంచ్, నిద్రించే సమయం. ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం.. ఇలా అన్నింటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించాడు. అయితే చదువుకునేందుకు కేవలం 15 నిముషాల సమయం మాత్రమే కేటాయించాడు. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 12 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఇది కూడా చదవండి: దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే..జీనియస్! -
ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది టెన్త్ బోర్డు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం టైం టేబుల్‌ను ప్రకటించింది. ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది. అలాగే.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.45 వరకు పరీక్షా సమయంగా నిర్ణయించారు. సిబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1. ఏప్రిల్ ఆరున సెకండ్ లాంగ్వేజ్. 8వ తేదీన ఇంగ్లీష్, 10వ తేదీ లెక్కలు, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 17వ తేదీన మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 నిర్వహిస్తారు. 18వ తేదీన ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉండనుంది. -
ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది. 2023, మార్చ్ 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే.. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ నుంచి మే రెండో వారం దాకా ప్రాక్టికల్స్ కొనసాగనున్నాయి. -
ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని సోమవారం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీనగేష్ తెలిపారు. ఈ నెల 26న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్ కోర్సుల 3, 5 సెమిస్టర్ పరీక్షలు, 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. (క్లిక్: త్వరలోనే విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ) కోవిడ్ కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన సమయాన్ని ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. త్వరలో డిగ్రీ పరీక్షల టైం టేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. (క్లిక్: 25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం) -
ఇంటర్ ఫస్టియర్: టైంటేబుల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు. 29, 30 తేదీల్లో పరీక్షలను రద్దు చేశారు. ఈ తేదీల్లో జరిగే పరీక్షలు 31 నుంచి జరుగుతాయి. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఇంటర్ బోర్డు శక్రవారం ఓ ప్రకటనలతో తెలిపింది. దీంతో నవంబర్ 2తో ముగియాల్సిన పరీక్షలను ఇంకోరోజు పొడిగించారు. సవరించిన టైం టేబుల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. -
ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూలు మారింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్స్ కన్వీనర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్‌ను ఈ ఏడాది మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఎంసెట్‌ను (ఇంజనీరింగ్) మే 4వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. 4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్‌గా, 7వ తేదీన రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును సవరించారు. 8వ తేదీ కూడా ఎంసెట్ నిర్వహణ కోసమే రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటే 8వ తేదీన కూడా ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 27 నుంచి నిర్వహించాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలను సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్ష, ఈసెట్, పీఈ సెట్, ఐసెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాలు, రంజాన్ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలు అయినందునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వికలాంగులకు ఫీజు రాయితీపై ఆయా సెట్స్ కమిటీల సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులను పెంచబోమని స్పష్టం చేశారు. ఫేసియల్ రికగ్నైషన్.. ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైష న్ విధానం అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. దాని ద్వారా పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే విధానాన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమయంలో విద్యార్థుల ముఖం, కళ్లు స్కాన్ చేసి, వాటి ఆధారంగానే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టాలని భావి స్తున్నట్లు చెప్పారు. దీనిపై త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీఎస్టీఎస్)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
విద్యార్థులకు శుభవార్త
తమిళనాడు, టీ.నగర్: రాష్ట్రంలో పది, ప్లస్ వన్, ప్లస్‌టూ విద్యార్థులకు పరీక్షా సమయాన్ని 2.30 గంటల నుంచి 3 గంటలకు పెంచుతూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసే సమయంలో సమయం సరిపోక అవస్థలు పడుతూ వచ్చారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ పరీక్షా సమయాన్ని అరగంట పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. మార్చి నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 31న పర్యావరణం, జనవరి 29న ఎథిక్స్.. హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి. -
5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్ రూపకల్పన
ముంబై: 5 నిమిషాల్లోనే లోకల్ రైళ్లకు టైం టేబుల్ రూపొందించగల సాఫ్ట్‌వేర్‌ను బాంబే ఐఐటీ అధ్యాపకులు రూపొందించారు. రైలు చేరుకునే సమయానికి పలు స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం తదితర ఇతర సమస్యలకూ ఈ సాఫ్ట్వేర్ పరిష్కారం చూపగలదు. టైం టేబుళ్లను రూపొందించే విధానాన్ని సరళీకరించేందుకు ఐఐటీ అధ్యాపకులు నారాయణ్ రంగరాజ్, మధు బేలూర్లు గత రెండేళ్లుగా కృషి చేసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి గురువారం ప్రదర్శించారు. ముంబై లోకల్ రైళ్ల కోసం దీనిని రూపొందించినా, చిన్న మార్పులతో దేశంలోని అన్ని లోకల్ రైల్ నెట్‌వర్క్‌లకు అన్వయించుకోవచ్చని తెలిపారు. -
మార్చి 28న టెన్త్ సోషల్ పేపరు–1 పరీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 28న పదో తరగతి సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి 30 వరకు నిర్వహించేందుకు టైం టేబుల్ జారీ చేసినట్లు గురువారం పేర్కొన్నారు. అందులో మార్చి 29న సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్ష నిర్వహించేలా ఉందని, అయితే 29న ఉగాది పండుగ ఉన్నందున, ఆ పరీక్షను ఒకరోజు ముందుగా, 28న నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. 30న సోషల్ స్టడీస్ పేపర్–2 పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
వాటర్ బోర్డు నియామక పరీక్ష తేదీ విడుదల
హైదరాబాద్: గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంటులోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో విడుదల చేసింది. అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, అసిస్టెంట్ హైడ్రో జియోలజిస్ట్ పరీక్షలకు జూన్ 28 న పేపర్-1(జనరల్ స్టడీస్) పరీక్షను ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు. టెక్నికల్ అసిస్టెంట్(జియోగ్రాఫికల్),టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రోజియాలజీ), టెక్నికల్ అసిస్టెంట్(హైడ్రాలజీ) పరీక్ష పేపర్-2 ను జూన్29 న మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకి అరగంట ముందే చేరుకోవాలని తమ వెంట గుర్తింపు కార్డును, పాస్ పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాని టీఎస్ పీఎస్ సీ ప్రకటనలో తెలిపింది. -
టెన్త్ పరీక్షల టైంటేబుల్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 21వ తేదీ నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టైంటేబుల్ జారీ చేసింది. ఈ షెడ్యూల్‌కు గతంలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదం తెలిపినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విద్యాశాఖ దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం పంపింది. ఎట్టకేలకు ఈసీ నుంచి ఆమోదం లభించడంతో టైంటేబుల్‌ను ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి, ఓఎస్సెస్సీ(ఓరియంటల్ ఎస్సెస్సీ), వొకేషనల్ రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు (న్యూ సిలబస్) ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు. ద్వితీయ భాష పరీక్ష ఉదయం 9.30 నుంచి.. ఈసారి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక పేపరే ఉంటుంది. మిగతా సబ్జెక్టులు రెండు పేపర్ల చొప్పున ఉంటాయి. ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయి. ఎస్సెస్సీ వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉంటుంది. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ పరీక్షలకు ఒకే సిలబస్, ఒకే ప్రశ్నపత్రాన్ని ఉపయోగిస్తారు. విద్యార్థులు తమ కోర్సుతో సంబంధం లేని ప్రశ్నలకు సమాధానమిస్తే వారి సమాధానాలను పరిగణనలోకి తీసుకోరు. సరైన ప్రశ్నపత్రాలను అడిగి తీసుకునే బాధ్యత వారిదే. -
ఏపీ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్ : పలు రైళ్ల వేళలు, స్టాపేజ్‌లు, వాటి నెంబర్లు, నడిచే రోజులు తదితరాల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేసిన మార్పుల వివరాలను బుధవారం అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలతో కూడిన టైంటేబుల్ పుస్తకాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. దురంతో రైళ్లకు కొత్త స్టాపులను, 4 ఎక్స్‌ప్రెస్, 2 ప్యాసింజర్ రైళ్లను మరిన్ని స్టేషన్లకు పొడిగించగా మూడు రైళ్ల మార్గాన్ని మళ్లించారు. 30 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించారు. 12 రైళ్ల నెంబర్లను మార్చగా, 59 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. మళ్లింపు/పొడిగింపు.. మేడ్చల్-సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్ ఫలక్‌నుమా వరకు సికింద్రాబాద్‌తో సంబంధం లేకుండద మల్కాజ్గిరి, సీతాఫల్మండి మీదుగా ఫలక్‌నుమాకు చేరుకుంటుంది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ మిర్జాపల్లి వరకు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా సీతాఫల్మండి, మల్కాజ్గిరి మీదుగా నడుస్తుంది. తిరుపతి- హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌తో సంబంధం లేకుండా కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది. దురంతో ైరె ళ్లకు కొత్త స్టాప్‌లు... సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ ఇకపై విజయవాడలో నుంచి విజయవాడలో ఆగుతుంది. సికింద్రాబాద్-ముంబై దురంతో పుణేలో ఆగుతుంది. యశ్వంత్‌పూర్-ఢిల్లీ సరాయి రోహిల్లా దురంతో గుంతకల్, సికింద్రాబాద్‌లో, హౌరా-యశ్వంత్‌పూర్ విజయవాడ, రేణిగుంటలో, చెన్నై-హజ్రత్ నిజాముద్దీన్ విజయవాడలో ఆగుతాయి. -
జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలను వచే ్చ నెల 18 నుం చి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల విభా గం డెరైక్టర్ శేషుకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30లోగా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుము తో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా ఫీజులను సంబంధిత ప్రధానోపాధ్యాయునికి చెల్లించి హాల్ టికెట్ పొందవచ్చని వెల్లడించారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ద్వితీయభాష పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పాత సిలబస్వారికి ఉద యం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. -
పరీక్షల టెన్షన్
విద్యార్థులకు టెన్షన్ పట్టుకుంది. పదోతరగతి.. ఇంటర్మీడియెట్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అయినా ఇంత వరకు సెలబస్ పూర్తికాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు వరకు సెలబస్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. జిల్లాలో చాలా చోట్ల 80 శాతం సెలబస్యే పూర్తయింది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 31 తేదీలోగా టెన్త్, ఇంటర్ రెండో సంవ త్సరం, వచ్చే నెలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సెలబస్ రివైజ్ చేయాల్సి ఉంది. పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా విద్యాబోధన సాగాల్సి ఉండగా.. నిలువెల్లా నిర్లక్ష్యంతో అధికారులు ఆచరణ సాధ్యంలో విఫలమయ్యారు. పర్యవేక్షణ లోపం.. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఖాళీలు విద్యార్థులను టెన్షన్‌కు గురిచేస్తున్నాయి. - కరీంనగర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు మార్కులెలా? పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయులకు సైతం ప్రహసనంగా మారాయి. ప్రధానంగా ప్రాజెక్టు మార్కులు ఎలావేసేదని తలలు పట్టుకుంటున్నారు. కొత్తగా చేపట్టిన విధాన ంతో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు మార్కులు కేటాయించారు. ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులు ఉపాధ్యాయులే వేయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్టుల వారీగా ప్రాజెక్టు పని పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాజెక్టు మార్కులు వేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలోని చాలా ఉన్నత పాఠశాలల్లో ప్రాజెక్టులు తయారు చేసేందుకు అనుకూల వాతావరణం లేదు. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టు విషయానికొస్తే ల్యాబ్ తప్పనిసరి. ఈ సౌకర్యం పాత ఉన్నత పాఠశాలల్లో తప్ప మరెక్కడా లేదు. కేవలం 20 శాతం పాఠశాలలకే ల్యాబ్ సౌకర్యం ఉంది. ప్రాజెక్టు ఇచ్చినా, వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి వారూ లేరు. ఖాళీల కొరత... జిల్లా విద్యాశాఖను ఖాళీలు వేధిస్తున్నాయి. 57 మండలాలకు గాను 51 మండలాల్లో ఇన్చార్జీ ఎంఈవోలు ఉన్నారు. హెచ్ఎంలే ఎంఈవోలుగా వ్యవహరించడంతో ఉపాధ్యాయులు ఎవరూ పట్టించుకున్న పాపానా పోలేదనే ఆరోపణలున్నాయి. డెప్యూటీఈవోల పరిస్థితి అంతే. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ డివిజన్లలో ఇన్చార్జి డెప్యూటీ ఈవోలే ఉన్నారు. ఎంఈవో కార్యాలయాల్లో ఎమ్మార్పీలు లేకపోవడంతో ఆ విధులూ ఉపాధ్యాయులే నిర్వర్తిస్తున్నారు. దీంతో చాలామంది సార్లు పాఠశాలలకు వెళ్లడంలేదు. పదోతరగతి ఫలితాల్లో 2011, 2012లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2013లో ఐదో స్థానం, 2014లో 14వ స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగించింది. ఈ ఏడాది ఉపాధ్యాయుల కొరత, విద్యావాలంటీర్ల నియామక ప్రక్రియ ఆలస్యం.. నామమాత్రంగా ప్రత్యేకాధికారుల తనిఖీ కారణాలు పదోతరగతి ఫలితాలపై పడే అవకాశం లేకపోలేదు. సబ్జెక్ట్ టీచర్ల కొరత ప్రభుత్వ హైస్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ విద్యాసంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణలు లేకపోవడం..పరీక్ష పేపర్ల విషయంలో మొన్నటివరకు సందిగ్దత ఉండడం, ఒక్కో సబ్జెక్ట్‌కు ఉపాధ్యాయుడే ఇరవై మార్కులు వేయాల్సి ఉండడం లాంటి విషయాలతో తలనొప్పిగా ఉంటే కొన్ని పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల లేమికారణంగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఉదాహరణకు బెజ్జంకి మండలం బేగంపేట హైస్కూల్లో సోషల్ టీచర్ వేరే సబ్జెక్ట్ బోధించడం, చిగురుమామిడి లో పలు పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో ఒక్కొక్కరు రెండు సబ్జెక్ట్‌లు చెప్పడం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కుపైగా పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నట్లు తెలిసింది. అయినా సబ్జెక్టు టీచర్ల కొరత అంతగా లేదని మాట్లాడడం గమనార్హం. -
పదో తరగతి పరీక్షా టైమ్ టేబుల్ విడుదల
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : మార్చి 2015లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. -
బడి పిల్లలు..పని మనుషులు..
బడి బయటి పిల్లలను బడిలో చేర్పించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టింది. పిల్లలు పనిలో కాదు.. పాఠశాలల్లో ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపన్యసించారు. ర్యాలీలు నిర్వహించారు. మరి బడిలో ఏం జరుగుతోంది.. ఉపాధ్యాయులు పిల్లలను పని మనుషులుగా మార్చేస్తున్నారు. అడపాదడపా అయితే సర్దుకుపోవచ్చు.. ఏకంగా టైం టేబుల్ వేసి కసువు కొట్టిస్తున్నారు. ప్యాపిలి మండల పరిధిలోని చిన్నపూదెళ్ల ఉన్నత పాఠశాలలో ఈ తంతు నిత్యకృత్యం. తరగతి గది గోడలకు సాధారణంగా ఏ సమయంలో ఏ సబ్జెక్టు బోధిస్తారో నిర్ణయించిన టైం టేబుల్ అతికిస్తారు. ఇక్కడ మాత్రం ఎప్పుడెప్పుడు ఎవరు కసువు కొట్టాలో తెలిపే చార్టు అతికించడం చూసి తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. -
విభజన ప్రక్రియకు టైం టేబుల్ రెడీ
-
విభజన ప్రక్రియకు టైం టేబుల్ రెడీ
60 రోజుల్లో పూర్తి టైం టేబుల్ రెడీ విభజనతో సంబంధం లేని పదోన్నతులూ నిలిపివేత సర్వీసు అంశాల్లో సలహా ఫైళ్లు ఆయా శాఖలకు తిరుగు టపా ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం పటిష్టం {పస్తుతం ఉన్న సెక్షన్‌కు అదనంగా మరో రెండు సెక్షన్లు, సిబ్బంది సచివాలయంలో ఫైళ్ల జిరాక్స్కోసం అద్దెకు జిరాక్స్ యంత్రాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ తరహాలోనే రాష్ట్ర విభజన ప్రకియ పూర్తి చేయడానికి 60 రోజుల సమయాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖలకు టైంటేబుల్‌ను పంపించారు. ఏ శాఖ ఏ తేదీలోగా విభజనకు సంబంధించి ఏ పనిని పూర్తి చేయాలో అందులో వివరించారు. ఈ నెల 15వ తేదీలోగా ఫైళ్ల విభజన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రికార్డు రూమ్స్‌లో ఫైళ్లను కూడా ప్రాంతాల వారీగా విభజించాలని స్పష్టం చేశారు. ఆ తరువాత ఆ ఫైళ్లను జిరాక్స్ తీయాలని, ఒక్కో ఫైలును మూడు సెట్లు చొప్పున జిరాక్స్ తీయాలని స్పష్టం చేశారు. సచివాలయంలో మెజారిటీ శాఖల్లో జిరాక్స్ మిషన్లు పది లేదా పదిహేను కాగితాలను జిరాక్స్ తీసే సామర్థ్యమే ఉంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీటి, సాధారణ పరిపాలన, రహదారులు-భవనాలు వంటి శాఖల్లో లక్షల సంఖ్యలో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో కాగితాలను జిరాక్స్ తీయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని అన్ని భవనాల్లో అంతస్తుకు ఒకటి చొప్పున జిరాక్స్ యంత్రాలను అద్దెకు తీసుకువచ్చి అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. విభజన ప్రక్రియకు స్పష్టమైన టైంటేబుల్‌ను సీఎస్ నిర్ణయించడంతో సాధారణంగా జరగాల్సిన పనులను అన్ని శాఖలు నిలుపుదల చేశాయి. కేవలం విభజన పనిని మాత్రమే చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులకు పదోన్నతులను కూడా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిన్హా నిలుపుదల చేశారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులతో పాటు వాస్తవంగా పదోన్నతి లభించాల్సిన సమయంలో పదోన్నతి రాకపోవడంతో సర్వీసుపై ప్రభావం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు తప్ప మిగతా పోస్టుల్లోని వారికి పదోన్నతి ఇవ్వచ్చని పలువురు ఐఏఎస్‌లు పేర్కొన్నా సిన్హా ససేమిరా అన్నారు. దీంతో విభజనతో సంబంధం లేకపోయినా ఆ కారణంగా తమ సర్వీసుకు భంగం కలిగేలా వ్యవహరించడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించి పలు శాఖలు సలహా కోసం పంపించిన అన్ని ఫైళ్లను ఎటువంటి సలహాను ఇవ్వకుండా సిన్హా ఆయా శాఖలకు తిరుగు టపాలో పంపించాలని నిర్ణయించారు. దీనిపై కూడా పలు శాఖల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలను వేగవంతం చేయడానికి వీలుగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాన్ని పటిష్టం చేశారు. ఈ విభాగంలో తెలంగాణకు, సీమాంధ్రకు చెందిన ఐఏఎస్‌లైన రామకృష్ణారావు, బి.వెంకటేశంతో పాటు ఇతర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్‌ను నియమించారు. అలాగే ప్రస్తుతం ఈ విభాగంలో ఒక సెక్షన్ మాత్రమే ఉండగా అదనంగా మరో రెండు సెక్షన్లను, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.