5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్‌ రూపకల్పన | railway timetable design in 5 minutes | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్‌ రూపకల్పన

Published Sat, Feb 18 2017 1:51 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్‌ రూపకల్పన - Sakshi

5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్‌ రూపకల్పన

ముంబై: 5 నిమిషాల్లోనే లోకల్‌ రైళ్లకు టైం టేబుల్‌ రూపొందించగల సాఫ్ట్‌వేర్‌ను బాంబే ఐఐటీ అధ్యాపకులు రూపొందించారు. రైలు చేరుకునే సమయానికి పలు స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం తదితర ఇతర సమస్యలకూ ఈ సాఫ్ట్‌వేర్‌ పరిష్కారం చూపగలదు.

టైం టేబుళ్లను రూపొందించే విధానాన్ని సరళీకరించేందుకు ఐఐటీ అధ్యాపకులు నారాయణ్‌ రంగరాజ్, మధు బేలూర్‌లు గత రెండేళ్లుగా కృషి చేసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి గురువారం ప్రదర్శించారు. ముంబై లోకల్‌ రైళ్ల కోసం దీనిని రూపొందించినా, చిన్న మార్పులతో దేశంలోని అన్ని లోకల్‌ రైల్‌ నెట్‌వర్క్‌లకు అన్వయించుకోవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement