software industry
-
‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’
సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు. -
టెక్కీ.. వెయిటెక్కీ
ఎక్కువ పనివేళలు టెకీలను ఊబకాయులుగా మారుస్తున్నాయా?! అనే సందేహానికి ‘అవును’ అనే సమాధానం సాఫ్ట్వేర్ రంగం నుంచి వస్తోంది. ఈ విషయంపైన ‘చైనీస్ ఇన్స్టాగ్రామ్ జియాహోంగ్షులో వా΄ోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద’ని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడి చేసింది. టెకీ ఉద్యోగçస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచన లు ΄ాటిద్దాం..చైనాలోని ఓయాంగ్ వెన్జింగ్ అనే 24 ఏళ్ల యువతి ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గత ఏడాది కాలంలో 20 కేజీల బరువు పెరిగిందని సౌత్ చైనా మార్నింగ్ ΄ోస్ట్ వెల్లడించింది. ‘నా శారీరక, మానసిక ఆరోగ్యానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక విపత్తుగా మారింది. ఎక్కువ పని గంటలు, మారుతూ ఉండే షిప్ట్ వేళల కారణంగా ఆహారం తీసుకోవడంలో అపసవ్యత చోటు చేసుకునేది. దీంతో ఏడాది కాలంలో 60 కేజీల నుంచి 80 కేజీల బరువు పెరిగాను. ఇలా అయితే నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో అని జూన్‌లో ఉద్యోగం మానేశాను. అప్పటి నుంచి నా ఆరోగ్యంలో మెరుగైన మార్పులు వచ్చాయి’ అని ఇన్‌స్టాలో ΄ోస్ట్ చేసింది ఓయాంగ్. ఆమె ఇప్పుడు ఫ్రీలాన్స్ వెయిట్‌లాస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. తన ఆహారంలో కూరగాయలు, ధాన్యాలు, ్ర΄ోటీన్లను చేర్చుతూ 6 కిలోల బరువు తగ్గానని తెలిపింది. ఓయాంగ్ అనుభవం చెప్పడంతో ఆమెలాంటి వ్యక్తులు తమ పని కష్టాలను పంచుకోవడానికి ముందుకు వచ్చారు. చైనాలోనే కాదు ఏ దేశంలోనైనా సాఫ్ట్వేర్ ప్రపంచంలో పనిచేసే టెకీలందరికీ ఇది వర్తిస్తుంది. మానసికమైన అలసట ‘పని ఒత్తిడి కారణంగా డిజర్ట్‌లను అతిగా తినడం వల్ల నెల రోజుల్లోనే 3 కిలోల బరువు పెరిగాను’ అని తన అనుభవాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకుంది మరో టెక్ ఉద్యోగిని 33 ఏళ్ల షాంఘై.. అతిగా ఆకలిఎక్కువ గంటలు పనిచేయడం అనేది పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి. ఈ పరిస్థితి సందడిగా ఉండే నగరాల్లో ఆందోళనకరమైన ధోరణిగా మారుతోంది. వర్క్ షిప్ట్ వల్ల సరైన నిద్ర వేళలు ఉండవు. దీంతో కార్టిజోల్ హార్మోన్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మెలటోనిన్ తగ్గి΄ోతుంది. లేట్‌నైట్స్ మేల్కొని ఉండటం వల్ల ఆకలి పెరగడంతో ఫుడ్ తెప్పించుకుని తింటారు. దీంతో కదలికలు ఉండవు. ఇక వర్క్‌ఫ్రమ్ హోమ్ వచ్చాక పడుకొని వర్క్ చేసే వారున్నారు. దీంతో వారి శరీరంలో ఏ ఆర్గాన్ అయితే బలహీనంగా ఉంటుందో దానిపైన త్వరగా ప్రభావం పడుతుంది. తినే వేళలు సరి చేసుకోవాలిచైనాలో పని సంస్కృతి ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వారానికి ఆరు రోజుల ΄ాటు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. న్యూట్రిషన్ విభాగానికి చెందిన డాక్టర్ జువో జియోక్సియా హెల్త్ టైమ్స్‌తో మాట్లాడుతూ ‘ఆలస్యంగా భోజనం చేయడం, అతిగా తినడం, నిద్రలేమి, ‘అధిక పని ఊబకాయానికి దారితీస్తుందని చె΄్పారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కువ కూరగాయలు, తక్కువ మాంసాహారం తీసుకోవాలి. అంతేకాదు, తినే వేళలను సక్రమంగా ΄ాటించాలి. ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి’ అని సూచిస్తోంది. ఈ సమాచారం టెకీలందరికీ వర్తిస్తుంది.అరకేజీ ఫ్రూట్ –వెజ్ సలాడ్వయసులో ఉన్నప్పుడు పని, జీతం అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే, సరైన జీవన శైలి ΄ాటించక΄ోతే నలభై దాటిన దగ్గర నుంచి ప్రతి ఐదేళ్లకు ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ చూస్తుంటాం. లుక్ కోసం అవసరం లేని కాస్మటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. లుక్ కాదు ఆరోగ్యమే ప్రధానమని గుర్తించాలి. పని ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ ఔషధంలా పనిచేస్తుంది. ∙నిద్ర వేళలు సరిగ్గా చూసుకోవాలి. 6–8 గంటలు నిద్రకు కేటాయించుకోవాలి. ∙వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. ∙టైమ్‌కి ఆహారం తీసుకోవాలి. దీంతో΄ాటు ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్ రోజు వారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల కొవ్వు పెరగదు. అతిగా ఆకలి అవడం ఉండదు. – డాక్టర్ జానకి, ΄ోషకాహార నిపుణులు -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్‌లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
కృత్రిమ మేధ కబ్జాపర్వం!
దొడ్డ శ్రీనివాస రెడ్డి : కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా మన జీవితాల్ని కబ్జా చేస్తోంది. కంప్యూటర్ నిపుణుడు క్రిస్టఫర్ స్ట్రాచె 1951లో మాంచెస్టర్ యూనివర్సిటీలో కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన కంప్యూటర్ ప్రోగ్రాంతో మొదలైన ఏఐ శకం నేడు అన్ని రంగాల్లోకి శరవేగంగా చొరబడుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలకు కోతపెడుతూ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ‘కృత్రిమ మేధ మనిషి మేదస్సును చేరుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు, లక్ష్యాలను సాధించాల్సి ఉంది. ఈ లక్ష్యసాధనకు ఎంత సమయం పడుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం’అని అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ఏఐ నిపుణుడు స్టువర్ట్ రసెల్ నాలుగేళ్ల క్రితం అన్న మాటలివి. అయితే మనిషి మేదస్సును అందుకోవడంలో కృత్రిమ మేధకు ఇంకా ఎక్కువ సమయం పట్టకపోవచ్చనిపిస్తోంది. కోడ్ రాస్తుంది... చాట్‌జీపీటీ ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ ప్రోగ్రాం కోడ్ రాయగలుగుతుంది. అయితే కృత్రిమ మేధపై పెరుగుతున్న పరిశోధనలను పరిశీలిస్తే ఈ ఏడాదిలోనే సంక్లిష్టమైన కోడింగ్‌లను రాయగల సత్తా ఏఐ సమకూర్చుకోగలుగుతుందని అర్థమవుతోంది. మనిషి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించడానికి రెండేళ్ల క్రితమే ఏఐ ఆధారిత ‘టురింగ్ బోట్స్’అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టురింగ్ బోట్స్ స్వయంగా సాఫ్ట్వేర్లను రూపొందించే దిశగా అవతరిస్తున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ అంచనా ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్లలో 10 శాతానికిపైగా టురింగ్ బోట్స్ కోడ్లను, టెస్ట్‌లను రాయగలుగుతాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలను ఇవి ఆక్రమించబోతున్నాయని, ఆ ఉద్యోగులు ఇక పర్యవేక్షణ, నిర్వహణ ఉద్యోగులుగా మారబోతున్నారనేది ఫోరెస్టర్ అభిప్రాయం. వచ్చే ఏడాదికల్లా చాలావరకు వ్యాపార సంస్థలు కోడింగ్‌కు సంబంధించి 30 శాతం వరకు కృత్రిమ మేధపై ఆధారపడబోతున్నాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక నిర్ధారణకు వ చ్చింది. ఈ ఏడాది ఫార్చూన్–500 కంపెనీల ద్వారా వెళ్లే అన్ని రకాల సమాచారాల్లో 10 శాతానికిపైగా ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్లే సృష్టించబోతున్నాయని ఫోరెస్టర్ చెబుతోంది. అదే 2025 నాటికి అన్ని వ్యాపార సంస్థల నుండి వెలువడే సమాచారంలో 30 శాతానికిపైగా కృత్రిమ మేధ ఆధారిత కంప్యూటర్లే సృష్టించబోతున్నాయని వ్యాపార పరిశోధనా సంస్థ గార్ట్నర్ అంచనా. అలాగే 2026 నాటికి వ్యాపార సంస్థల మధ్య లావాదేవీల్లో సగానికి పైగా ఏఐ ద్వారానే సాగబోతున్నాయని, 2030 నాటికి మొత్తంగా కృత్రిమ మేధ ఆధారంగా ఐదో వంతు వ్యాపార లావాదేవీలు సాగుబోతున్నాయని కూడా గార్ట్నర్ అభిప్రాయం. 2026 నాటికి 75 శాతం బడా కంపెనీల ఉత్పత్తుల నాణ్యత, సామర్థ్యం, సప్లయ్ చెయిన్, అభివృద్ధి కార్యక్రమాలను కృత్రిమ మేధే నిర్వహించబోతోందని డేటా కార్పొరేషన్ ఐడీసీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 1.7 కోట్ల మంది కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్లు పనిచేస్తుండగా 2026 నాటికి వాళ్ల మధ్య జరిగే లావాదేవీల్లో 10 శాతం ఏఐ ద్వారా ఆటోమేట్ కాబోతున్నాయని గార్ట్నర్ చెబుతోంది. దీనివల్ల మొత్తంగా 8,000 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని కూడాఈ సంస్థ వెల్లడించింది. మనిషి అవసరం లేదు.. మనిషి రోజువారీ పనులన్నింటినీ అతిత్వరలో కృత్రిమ మేధ హస్తగతం చేసుకోబోతోందని ఏఐ నిపుణుడు కామ్ ఫులీ హెచ్చరిస్తున్నారు. ఆదాయం, చదువు విషయంలో సమాజంలో చివరన ఉన్న అత్యధిక జనాభాను ఏఐ తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని ఆయన అంటున్నారు. ‘ఒకçప్పుడు కంపెనీలు ఆదాయం కోసం ఉద్యోగుల సంఖ్యను 5–10 శాతం తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు చేసేవి, కానీ ఇప్పుడు అందుబాటులోకి వ చ్చిన ఏఐతో ఒక శాతం ఉద్యోగులతో మొత్తం పని ఎలా చేయించవచ్చో ఆలోచిస్తున్నాయి’అని ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహన్ జోషి ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపబోతోందని దాని స్థాపిత సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ హెచ్చరిస్తున్నారు. మనిషి మాదిరి అనేక లక్ష్యాలను పూర్తిచేయగల ఏఐ చాట్‌బోట్ వల్ల మనుషులు నిర్వహించే అనేక ఉద్యోగాలకు ఎసరుపెట్టబోతోందని, అయితే మనిషికున్న సృజనాత్మకశక్తి కారణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆల్డ్మన్ అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ సమాచారం అందించే రెస్యూమ్బిల్డర్.కామ్ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాకు చెందిన వెయ్యి కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల స్థానంలో ఇప్పటికే చాట్‌జీపీటీ లేదా ఇతర చాట్బోట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. మరో సర్వేలో 44 శాతం కంపెనీలు కృత్రిమ మేధను తమ కంపెనీ వ్యవహారాల్లో ఉపయోగించుకొనేందుకు వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిసింది. గతేడాది ఐబీఎం సంస్థ సంపాదించుకున్న మొత్తం 9,130 పేటెంట్లలో 2,300 కృత్రిమ మేధతో సంబంధం ఉన్నవే కావడం రానున్న కాలంలో ఏఐ విస్తృతిని చెప్పకనే చెబుతోంది. నియంత్రణ ఎలా? ఇందుకలడందుగలడు అన్నట్లుగా అన్ని రంగాల్లోకి, అన్ని విభాగాల్లోకి చోచ్చుకుపోతున్న కృత్రిమ మేధ నియంత్రణ సాధ్యమా? దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన పద్ధతులేమిటన్నది ఇప్పుడు కంపెనీ అధిపతుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు వేధిస్తున్న ప్రశ్న. కృత్రిమ మేధ నిర్వహించే కార్యకలాపాలను, తప్పొప్పులను న్యాయపరంగా ఎలా ఎదురుకోవాలి, సైబర్ సెక్యూరిటీని ఎలా సాధించాలన్న చర్చ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే ఏఐ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రతి కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఓ) లేదా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)ను నియమించుకుంటోంది. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ ద్వారా జరిగే కార్యకలాపాల నియంత్రణ అన్నది ప్రతి వ్యాపార సంస్థకు పెద్ద బాధ్యత కాబోతోందని ఫోరెస్టర్ చెబుతోంది. ఇటీవల జరిగిన డేటా రోబో సర్వేలో ఏఐపై ప్రభుత్వ నియంత్రణలకు 81 శాతం మంది టెక్ కంపెనీల అధిపతులు సానుకూలంగా స్పందించారు. కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ ప్రజల సంరక్షణార్థం అమెరికా ఇటీవల ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ పేరిట ఒక ముసాయిదా బిల్లును రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ కోసం కంపెనీలు పాటిస్తున్న మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వ నిబంధనలుగా మార్చడంపై చాలా వరకు వ్యాపార సంస్థలు సుముఖంగా ఉన్నాయి. -
మతాచారాల్లో రోబోలు.. జీవితం క్షణ భంగురం నాయనా!
(కంచర్ల యాదగిరిరెడ్డి) : చాట్‌జీపీటీ...ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంసృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాఫ్ట్వేర్. మనం లిఖితపూర్వకంగా అడిగే ప్రశ్నలకు అదే రీతిలో ఠక్కున బదులిచ్చే చాట్‌జీపీటీ తెలివితేటలకు నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే కోట్ల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకొనిఉపయోగిస్తున్నారు. వ్యాపార కిటుకుల మొదలుచదువులు, ఇంటర్వ్యూల్లో విజయ మార్గాల వరకు రకరకాల ప్రశ్నలకు సంతృప్తికరసమాధానాలుపొందుతున్నారు. కానీ పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్లు కొందరు కృత్రిమ మేధస్సునుమతానికీ వాడేసుకుంటున్నారు. పెప్పర్, మిందార్, బ్లెస్ యూ, శాంటోలే అందుకుతార్కాణాలు. అవి ఏమిటని అనుకుంటున్నారా?మతానికి, టెక్నాలజీకి లింకేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. జపాన్‌లో పెప్పర్ అనే హ్యమనాయిడ్ రోబో ఉంది. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా? ముందే నిర్దేశించిన యెన్లు (జపాన్ కరెన్సీ) చెల్లిస్తే బౌద్ధ ధర్మం ప్రకారం అంత్యక్రియల మంత్రాలు వల్లెవేస్తుంది! చావు డప్పులు సైతం కొడుతుంది!! అదే దేశంలోని క్యోటో నగరంలో ఉన్న ఓ బౌద్ధ ఆలయంలో 6 అడుగుల 4 అంగుళాల పొడవైన మిందార్ అనే రోబో ఏకంగా భక్తులకు ధర్మ సూక్తులను ప్రవచిస్తుంది!! జర్మనీలోని బ్లెస్ యూ అనే ఇంకో రోబో మంత్రాలు చదవడంతోపాటు భారతీయ సంప్రదాయాల ప్రకారం దేవుళ్లకు హారతులు సైతం ఇస్తుంది!! అమెరికాలోని ఓ చర్చిలో శాంటో అనే 17 అంగుళాల కేథలిక్ రోబో ఉంది. బైబిల్‌ను కంఠస్థం చేసిన ఈ రోబో ముందు నిలబడి మీ బాధను చెప్పుకుంటే చాలు.. వెంటనే బైబిల్ సూక్తులు వినిపిస్తుంది!! అయితే ఈ తరహా మత రోబోల వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం వాడకం ఇలాగే కొనసాగితే 2–3 దశాబ్దాల తరువాత టెక్నాలజీ, కృత్రిమ మేధలను ఆరాధించే కొత్త మతం ఒకటి పుట్టుకొస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అవసరం నేర్పిన విషయమే... అవసరమే అన్నీ నేర్పిస్తుందన్నది నానుడి. మతం కోసం చాట్‌జీపీటీ, ఏఐల వాడకం కూడా ఆ అవసరం నుంచే పుట్టింది. జపాన్‌లో బౌద్ధ భిక్షువులో లేదా ఇంకొకరిచేతనో అంత్యక్రియలు జరిపించడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దానికి బదులుగా ‘పెప్పర్’ను వాడితే తక్కువ ఖర్చుతో ఆ కార్యక్రమాలు జరిపించవచ్చు. ‘శాంటో’విషయంలోనూ ఇలాంటి అవసరమే కనిపిస్తుంది. చర్చికి రాలేని వాళ్లు, మంచాలకు పరిమితమైన వారు, ఒంటరిగా ఉన్న వారు, ప్రార్థనా స్థలాలు లేని ప్రాంతాల్లోని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని దీని సృష్టికర్త గాబ్రియెల్ ట్రోవాటో చెపుతున్నారు. రోజుకో సూక్తి వినిపించే అప్లికేషన్లు ఇప్పటికే బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. అలాగే మతాచారాలను (నమాజు వేళలు, రంజాన్ సమయంలో నిరాహారంగా ఉండాల్సిన సమయం, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముహూర్తాలు, పంచాంగం, జ్యోతిషం) తు.చ. తప్పకుండా ఆచరించేందుకు సహకరించే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లూ ఉన్నాయి. ఏదీ మరచిపోకుండా ఉండేందుకు ఇవి తోడ్పడతాయి. వీటికి చాట్‌జీపీటీ వంటివి తోడైతే? ప్రజల మతి పోగొడుతున్న చాట్‌జీపీటీ.. చాట్‌జీపీటీ విడుదలై నాలుగు నెలలవుతోంది. అణువు నుంచి అణ్వాస్త్రం వరకూ ఏ అంశంపైనైనా అనర్గళంగా సంభాషించగలదు. పాఠాలు చెబుతుంది. సినిమా స్క్రిప్‌్టలు రాస్తుంది. సాఫ్ట్వేర్ కోడ్ రాయగలదు. అందులోని తప్పులూ వెతకగలదు. ఈ మధ్యే విడుదలైన చాట్‌జీపీటీ–4 మునుపటి వెర్షన్కంటే మరింత శక్తిమంతమైంది. తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం తక్కువ. పైగా ఫొటోలను కూడా అర్థం చేసుకోగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే అది చేయలేని పని లేదనే అనాలి. అచ్చం మన మతాల్లోని సర్వశక్తిమంతుడైన దేవుడి మాదిరిగా!!! ఇప్పుడు చాట్‌జీపీటీని వాడుతున్నది సుమారు 15 కోట్ల మంది. వ్యాపారం, వినోదం, విజ్ఞానం వంటి అనేక విషయాల్లో దీనిని వాడేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణంగా సమీప భవిష్యత్తులో భూమ్మీద అత్యధికులు చాట్‌జీపీటీని ఉపయోగించే అవకాశమూ ఉంది. కృత్రిమ మేధతో పనిచేసే చాట్‌జీపీటీ భవిష్యత్తులో కొత్తకొత్త కాల్పనిక పాత్రలను సృష్టించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే దీని మేధస్సు అన్ని వర్గాల ప్రజల మతి పోగొడుతోంది. పాటలు రాయడం, సంగీతం కూర్చడం, బొమ్మలేయడం సరేసరి. దీనికి నొప్పి తెలియదు.. ఆకలి, దప్పు లుండవు... ఇప్పటివరకూ ఇలాంటివి దేవుడికే సాధ్యమనుకొనే వాళ్లం. అంతరాల్లేని మతం... కృత్రిమ మేధ ఆధారంగా ఓ మతం అంటూ పుట్టుకొస్తే అది అంతరాల్లేనిదవుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇందులో దేవుడి (చాట్‌జీపీటీ లేదా అంతకంటే మెరుగైన మేధ)తో రోజూ నేరుగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి దైవదూతల అవసరముండదు. ఈ మతాన్ని పాటించే వారు అందరూ ఆన్లైన్లోనే ఉంటారు కాబట్టి వారి వారి అనుభవాలను చెప్పుకునేందుకు ఓ వేదిక ఉంటుంది. చాట్‌జీపీటీ వంటివి మరిన్ని అందుబాటులోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరి అనుభవం మారిపోతూంటుంది. దీనిద్వారా కొత్త మతంలో వైవిధ్యత కూడా ఏర్పడుతుంది. అయితే ఈ కొత్త మతం వల్ల కొన్ని ప్రమాదాలూ లేకపోలేదు. ప్రస్తుతం మనం నైతికంగా తప్పు అనుకొనే కొన్ని పనులను భవిష్యత్తులో చాట్బోట్ల ఆదేశాలతో చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ చాట్బోట్లు విధ్వంసకరమైన లేదా ప్రమాదకరమైన పనులు చేసేందుకు ఉసిగొల్పవచ్చు. వేర్వేరు చాట్బోట్లతో ఏర్పడ్డ వైవిధ్యత కారణంగా వైరుధ్యాలూ వచ్చే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చేయాలని అడిగితే చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం... 1. ప్రార్థన, 2. బైబిల్ చదవడం, 3. ఆరాధన 4. విశ్వాసులతో అనుబంధం, 5. ఇతరులకు సేవ 6. దైవచిత్తానికి కట్టుబడి ఉండటం, 7. ఉపవాసం 8. దానాలు, 9. తప్పిదాలను అంగీకరించడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం 10. దేవుడి మాట, వ్యక్తిత్వాలను ధ్యానం చేయడం బోలెడన్ని ఆప్లికేషన్లు... ♦ మీ కోసం ట్వీట్లు చేయగల చాట్‌జీపీటీ ఆధారిత అప్లికేషన్ ఇప్పుడు క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌గా లభిస్తోంది. ♦ యూట్యూబ్ సమ్మరి విత్ చాట్‌జీపీటీ యూట్యూబ్ వీడియోల సంభాషణల టెక్ట్స్ సారాంశాన్ని అందిస్తుంది. ♦ ఎంగేజ్ ఏఐ అనేది చాట్‌జీపీటీ ఆధారంగా లింక్డ్ఇన్ పోస్టులు చదివి మీ తరఫున సమాధానాలిస్తుంది. ♦ ఈ–కామర్స్ కార్యకలాపాల కోసం భారత్‌లో ఏఐ ఆధారిత చాట్‌బోట్ ‘లెక్సి’ని వాడుతున్నారు. ♦ విద్యార్థులకు అండగా ఉండేందుకు చదువుల్లో చాట్‌జీపీటీని ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ♦ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు కూడా చాట్‌జీపీటీ ఆధారిత అప్లికేషన్‌ను జోడించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఐటీ కంపెనీల ముందు పెను సవాళ్లు! వచ్చే 12 నెలల్లో..
ముంబై: ఐటీ రంగంలో సగం మంది నిపుణులు (53 శాతం మంది) వచ్చే ఏడాది కాలంలో నూతన ఉద్యోగంలో చేరిపోవచ్చని ‘స్కిల్‌సాఫ్ట్ 2022 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ’ నివేదిక తెలిపింది. మెరుగైన పారితోషికంతోపాటు, ప్రస్తుత ఉద్యోగంలో శిక్షణ, పురోగతి లేకపోవడం, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లోపించడం కారణాలుగా పేర్కొంది. ఐటీల్లో టీమ్ లీడర్లు, ఆపై స్థాయి ఉన్న వారు తమ బృందంలో నైపుణ్యాల లోటును ఎదుర్కొంటున్నట్టు స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. నిపుణుల వలస, తిరిగి నిపుణులను ఆకర్షించడం అనే రెండు పెద్ద సవాళ్లను ఐటీ రంగం ఎదుర్కొంటున్నట్టు నివేదిక ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది వచ్చే 12 నెలల్లో తాము కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చని చెప్పారు. సుమారు 8,000 మంది స్కిల్‌సాఫ్ట్ సర్వేలో తమ అభిప్రాయాలు వెల్లడించారు. డిజిటల్ టెక్నాలజీకి మారే విషయంలో ఉన్న వేగం, తగినన్ని సాంకేతిక వనరులు లేకపోవడం ఐటీ నిపుణులను కఠిన నిర్ణయం తీసుకునేలా చేస్తున్నట్టు ఈ సర్వే పేర్కొంది. ‘‘అధ్యయనం అన్నది ఉద్యోగులు, సంస్థల పరస్పర అభివృద్ధికి ప్రేరణనిస్తుంది. ముఖ్యంగా నిపుణులను కాపాడుకోవడంలో ఉన్న ఇబ్బందులు, ఆవిష్కరణల వేగం దృష్ట్యా సంస్థలకు శిక్షణ ఎంతో సాయపడుతుంది’’అని స్కిల్‌సాఫ్ట్ జనరల్ మేనేజర్ జాచ్ సిమ్స్ పేర్కొన్నారు. నేర్చుకునే సంస్కృతి ఏర్పాటు చేయడం, నైపుణ్యాల అభివృద్ధి అన్నవి విజయానికి కీలకమన్నారు. నైపుణ్యాలు కలిగిన ఆశావహల నియామకం, వారిని కాపాడుకునే విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చదవండి: జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్వర్క్ పొందండిలా! -
టెకీలకు గుడ్ న్యూస్: 2 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: సాఫ్ట్ వేర్ సేవల సంస్థ జోహో కార్పొరేషన్ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కార్య కలాపాలను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా త్వరలో 2వేల మంది ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్టు వెల్లడించింది. ఇంజనీరింగ్, డిజైన్, కంటెంట్ సేల్స్‌లో విభాగంలో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అనేక దిగ్గజ టెక్ సంస్థలు సహా, అనేక స్టార్టప్‌లు సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో, సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) స్టార్టప్ జోహా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలపై దృష్టిపెట్టింది. ఇంజనీరింగ్, వెబ్ డెవలపర్లు, డిజైనర్లు, ఉత్పత్తి విక్రయదారులు, రైటర్లు, సపోర్ట్ ఇంజనీర్ విభాగం కనీసం 2,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అకౌంటింగ్, పేరోల్ హెడ్ ప్రశాంత్ గంటి నేషనల్ మీడియాకు వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే స్థానికంగా నియామకాలను ప్రారంభించామని, స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ వంటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు కాగా ప్రపంచవ్యాప్తంగాసుమారు 10వేల 800 ఉద్యోగులతో, జోహో ఇండియా, అమెరికాలో విస్తృత సేవలు అందిస్తోంది. ఇటీవల ఈజిప్ట్, జెడ్డా, సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్ లాంటి ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ భారతదేశంలోని టాలెంట్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తోందట. -
గురి కుదిరేనా! మరో రంగంపై ముఖేష్ అంబానీ కన్ను!
ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఏవియేషన్ రంగంపై కన్నేశారు. బెంగళూరు కేంద్రంగా రిలయన్స్ సబ్సిడరీ సంస్థ 'సాంఖ్యసూత్ర ల్యాబ్స్' ఆధ్వర్యంలో విమానాల డిజైన్లను తయారు చేస్తున్నారు. 2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216కోట్ల పెట్టుబడితో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ సంస్థకు చెందిన 83శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ఈ కంపెనీ హై ఫిడిలిటీ ఏరోడైనమిక్స్, మల్టీఫిజిక్స్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తోంది. అంటే సులభంగా తక్కువ బడ్జెట్లో ఎయిర్ క్ట్రాఫ్ట్లను డిజైన్ చేస్తుంది. డిజైన్లు రక్షణ రంగానికి ఉపయోగపడనున్నాయి. ఈనేపథ్యంలో బెంగళూరులో హాల్ మేనేజ్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏరో కాన్-2022 జరిగిన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏరో స్పేస్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫిరెన్స్‌లో పైలెట్ల అవసరం లేకుండా ఆటోమెటిక్ సిస్టమ్ (అటానమస్ ఎయిర్ బర్న్ సిస్టమ్) ద్వారా విమానాల్ని ఎలా నియంత్రించాలి. ఆ రంగానికి ఎదురయ్యే సవాళ్లు, అందులో అవకాశాల వంటి అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ప్రదర్శించింది. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్ విడుదల కానున్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ఆ ప్రొడక్ట్ ఏంటనేది బహిర్గతం కాలేదు. "ఖచ్చితమైన, నమ్మకమైన విమాన డిజైన్ల రూప కల్పన కోసం ఉపయోగించే విండ్ టన్నెల్ వంటి ఖరీదైన ప్రయోగాలు ఎక్కువ సమయం తీసుకునే ప్రయోగాల అవసరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాదు తాము డిజైనింగ్ టూల్స్ కోసం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు కాన్ఫరెన్స్‌లో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ కరివాలా అన్నారు. -
బైబ్యాక్‌కు టీసీ‘ఎస్’
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పీడిస్తున్నప్పటికీ దేశీ దిగ్గజాల సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ కొనసాగుతోంది. కోవిడ్–19 ప్రభావంతో ఇటీవల ఆన్లైన్ సర్వీసులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. ఇది దేశీ ఐటీ దిగ్గజాలకు కలసి వస్తున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌కు ఐటీ కంపెనీలు మొగ్గు చూపినప్పటికీ ఫ్రెషర్స్ నియామకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల డిజిటల్ సేవలు విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా పలు కంపెనీలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం భారీ నిధులను కేటాయిస్తున్నాయి. దీంతో దేశీ కంపెనీలు భారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంటున్నాయి. వెరసి ఈ ఏడాది క్యూ3లో ఐటీ దిగ్గజాలు మరోసారి ఆకర్షణీయ పనితీరును ప్రదర్శించాయి. టీసీఎస్ అయితే మరోసారి సొంత ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు అగ్రస్థానంలో నిలుస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. అంతేకాకుండా రూ. 18,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతంపైగా ఎగసింది. రూ. 9,769 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 8,701 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం వృద్ధితో రూ. 48,885 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 42,015 కోట్ల టర్నోవర్ నమోదైంది. షేరుకి రూ. 4,500 షేరుకి రూ. 4,500 ధర మించకుండా 4 కోట్ల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టీసీఎస్ వెల్లడించింది. 1.08 శాతం ఈక్విటీకి ఇవి సమానంకాగా.. ఇందుకు రూ. 18,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత కేలండర్ ఏడాది(2021)లో కంపెనీ కీలకమైన 25 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని అందుకున్నట్లు సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం తెలియజేశారు. నైపుణ్యాలపై వెచ్చిస్తున్న పెట్టుబడులతో సరఫరాల సవాళ్లలోనూ పటిష్ట పురోగతిని సాధించగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ సేక్సారియా పేర్కొన్నారు. 2021–22 తొలి అర్ధభాగంలో తీసుకున్న 43,000 మంది ఫ్రెషర్స్ కాకుండా తాజా త్రైమాసికంలో 34,000 మందిని ఎంపిక చేసినట్లు సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఇతర హైలైట్స్ ► వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్. ఇందుకు రికార్డ్ డేట్ ఫిబ్రవరి 7. ► క్యూ3లో నికరంగా 28,238 మందికి ఉపాధిని కల్పించింది. ► డిసెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 5,56,986కు చేరింది. ► ఉద్యోగ వలసల రేటు 15.3%గా నమోదైంది. ► డిసెంబర్‌కల్లా నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 59,920 కోట్లుగా నమోదు. ► కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్ల వాటా 72.19%. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి. షేరు 1.5% నీరసించి రూ. 3,857 వద్ద ముగిసింది. కస్టమర్ల బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ అవసరాలకు అనుగుణమైన సర్వీసులు అందించడంలో కంపెనీకున్న సామర్థ్యాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎండ్టుఎండ్ నైపుణ్యాలు, సవాళ్ల పరిష్కారంలో కంపెనీ చూపుతున్న చొరవ తదితర అంశాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితాలలో వృద్ధి కొనసాగడమే ఇందుకు నిదర్శనం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. -
ఐటీ కంపెనీల పనితీరు భేష్!
ముంబై: ఎగుమతుల ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని సాధించనున్నాయి. సీజనల్‌గా చూస్తే నిజానికి సాఫ్ట్వేర్ పరిశ్రమలో అక్టోబర్–డిసెంబర్(క్యూ3) బలహీన కాలంగా విశ్లేషకులు పేర్కొంటుంటారు. అయితే క్యూ3లో త్రైమాసికవారీగా ఆదాయాలు సగటున 2.6–6 శాతం మధ్య పుంజుకునే వీలున్నట్లు కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక అంచనా వేసింది. ట్రాన్స్‌ఫార్మేషన్‌పై వ్యయాలు పెరగడం ఇందుకు సహకరించనున్నట్లు పేర్కొంది. ఈ వారాంతం లేదా వచ్చే వారం నుంచీ ఐటీ దిగ్గజాల క్యూ3 ఫలితాల విడుదల ప్రారంభంకానుంది. బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తొలుత ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. వార్షిక ప్రాతిపదికన క్యూ3 ఆదాయ అంచనాలను కొటక్ నివేదిక వెల్లడించనప్పటికీ షేరువారీ ఆర్జన(ఈపీఎస్)పై మిశ్రమంగా స్పందించింది. కొన్ని కంపెనీల ఈపీఎస్‌లో 15 శాతం క్షీణతకు అవకాశముంటే.. మరికొన్ని దిగ్గజాలు 11 శాతంవరకూ వృద్ధిని అందుకోవచ్చని అభిప్రాయపడింది. సాఫ్ట్వేర్ రంగం ఎగుమతుల ఆధారితంకావడంతో డాలరు బలపడటం లాభించనున్నట్లు పేర్కొంది. ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడంతో 20–90 బేసిస్ పాయింట్లమేర మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు తెలియజేసింది. వృద్ధి బాటలో... కొటక్ నివేదిక ప్రకారం లార్జ్ క్యాప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా.. మిడ్ క్యాప్స్‌లో ఎల్టీ ఇన్ఫోటెక్ ముందుండే అవకాశముంది. ఆయా కంపెనీలు ఇటీవల సిబ్బందిని పెంచుకోవడం, ఫ్రెషర్లకు అవకాశాలు ఇవ్వడం వంటి అంశాలను ఇందుకు ప్రస్తావించింది. ఉద్యోగ వలసలు(ఎట్రిషన్) వేధిస్తున్నప్పటికీ డీల్స్ కుదుర్చుకోవడంలో సఫలంకావడం సానుకూలతలుగా పేర్కొంది. స్థిరకరెన్సీ ప్రాతిపదికన విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ 4.5 శాతం పురోగతి సాధించనుండగా.. ఇన్ఫోసిస్ 3.7 శాతం, టీసీఎస్ 2.6 శాతం చొప్పున వృద్ధి చూపవచ్చని బ్రోకింగ్ సంస్థ కొటక్ అంచనా వేసింది. మధ్యస్థాయి కంపెనీలు 5–6 శాతం పుంజుకోవచ్చని, వార్షికంగా చూస్తే మరింత అధికంగా సగటున 20–34 శాతం మధ్య ఆదాయాల్లో వృద్ధి నమోదుకావచ్చని విశ్లేషించింది. అయితే ఈపీఎస్ వృద్ధిలో విప్రో యథాతథంగా, ఇన్ఫోసిస్ 6 శాతం, టీసీఎస్, టెక్ మహీంద్రా 13–14 శాతం చొప్పున సాధించే వీలుండగా.. హెచ్‌సీఎల్ క్షీణతను చవిచూడవచ్చని పేర్కొంది. ఇబిట్ నీరసం... క్యూ3లో వార్షికంగా సగటున అన్ని కంపెనీల నిర్వహణ (ఇబిట్) మార్జిన్లు మందగించవచ్చని కొటక్ నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం ఇందుకు ఎట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు, సీనియర్ల నియామకాలు, యుటిలైజేషన్ తగ్గడం, వ్యయాలు పెరగడం వంటివి ప్రభావం చూపనున్నాయి. కాగా.. ఇన్ఫోసిస్ గైడెన్స్‌ను 1 శాతంమేర పెంచి 17–17.5 శాతంగా ప్రకటించవచ్చు. తొలుత 12–14 శాతం వృద్ధి అంచనాలతో ఏడాదిని ప్రారంభించడం గమనార్హం. ఇక హెచ్‌సీఎల్ రెండంకెల ఆదాయ వృద్ధిని అంచనా వేసింది. 12 శాతం పురోగతిని అందుకునే వీలుంది. -
రూ.60 వేల కోట్లను దాటనున్న సాఫ్ట్వేర్ ఆదాయం
న్యూఢిల్లీ: భారత సాఫ్ట్వేర్ మార్కెట్ ఆదాయం 2021 చివరికి 8.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 60 వేల కోట్లు) ను అధిగమిస్తుందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంచనా వేసింది. ‘‘భారత సాఫ్ట్వేర్ మార్కెట్ ఆదాయం 2021 మొదటి ఆరు నెలల్లో 4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది వార్షికంగా చూస్తే 15.9 శాతం వృద్ధి’’ అని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్, చైనా మినహాయించి చూస్తే భారత్ వాటా 18.3 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2021 మొదటి ఆరు నెలల్లో భారత మార్కెట్లో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఎస్ఏపీ అగ్రపథంలో కొనసాగినట్టు వెల్లడించింది. భారత కంపెనీలు మరింత విస్తరించే లక్ష్యంతో డిజిటల్‌కు మారిపోతున్నట్టు, క్లౌడ్, ఏఐపై పెట్టుబడులు పెంచుతున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ మార్కెట్‌ను అప్లికేషన్స్, అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్ (ఏడీ అండ్‌డీ), సిస్టమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ (ఎస్ఐ) అనే మూడు భాగాలు ఐడీసీ వర్గీరించింది. మొత్తం పరిశ్రమ ఆదాయంలో అప్లికేషన్స్ నుంచే 61 శాతం వస్తోందని, ఆ తర్వాత ఏడీ అండ్‌డీ నుంచి 21 శాతం, ఎస్ఐ సాఫ్ట్వేర్ నుంచి 18 శాతం చొప్పున ఆదాయం వస్తున్నట్టు వివరించింది. -
ఇక్కడ ఉంటే జాబ్ చేస్తున్నట్లే లేదు..!
సాక్షి నెట్వర్క్: ఆరు నెలలు, సంవత్సరానికి తల్లిదండ్రులను చూసేందుకు పల్లెలకు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఇంటిపట్టునే ఉండి పనిచేసుకుంటున్నారు. కరోనా కారణంగా దాదాపు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ఇవ్వడంతో ఉద్యోగులు పట్టణం వీడి పల్లెబాట పట్టారు. మార్చి 2020 నుంచి సుమారు 10 నెలలుగా గ్రామీణ ప్రాంతాల నుంచే వందలాది మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటు వ్యవసాయ పనులు చూసుకుంటూ, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ అటు పిల్లలతో కలసిమెలసి పని చేసుకుంటున్నారు. పట్టణాల్లో ప్రయాణానికే గంటల తరబడి సమయం పట్టేదని, ఇప్పుడు ప్రయాణం అవసరం లేకపోవడంతో ఒత్తిడి లేకుండా ప్రశంతంగా ఉందని పలువురు ఐటీ ఉద్యోగులు అంటున్నారు. ఆఫీసులో కంటే ఎక్కువ ఉత్సాహంతో ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్క్‌ఫ్రం హోం చేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులను ‘సాక్షి’పలకరించింది. జాబ్ చేస్తున్నట్లే లేదు.. నేను టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. గతంలో కేరళ, కర్ణాటకలో పనిచేశాను. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తున్నాను. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ఉంటూ జాబ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. దూర ప్రాంతాల్లో పని చేస్తూ కుటుంబసభ్యులతో ఫోన్లలో మాత్రమే మాట్లాడుకునేవారం. వర్క్ ఫ్రంహోం చేయడంతో అసలు జాబ్ చేస్తున్నట్లే లేదు. –అఖిల, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా పల్లె అందాలను ఆస్వాదిస్తూ.. నేను హైదరాబాద్‌లోని విప్రోలో టెక్నాలజీ లీడ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నగరంలో పని ఒత్తిడితో ఉద్యోగం బిజీబిజీగా ఉండేది. ఇప్పుడు సొంతూరిలో ప్రశాంతంగా పనిచేస్తూ కుటుంబ సభ్యుల మధ్య పండుగలను జరుపుకుంటూ పల్లె అందాలను ఆస్వాదిస్తున్నాను. – నూతి సందీప్, నెన్నెల, మంచిర్యాల -
ఐటీ అదుర్స్- సెన్సెక్స్@ 40,000
దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ హవా చూపుతోంది. వరుసగా ఐదో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 40,000 పాయింట్ల మైలురాయిని సులభంగా అధిగమించింది. ప్రస్తుతం 434 పాయింట్లు పెరిగి 10,313ను తాకింది. నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 11,866 వద్ద ట్రేడవుతోంది. సహాయక ప్యాకేజీపై తిరిగి అంచనాలు పెరగడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. దీంతో సెంటిమెంటుకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో అప్ ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఐటీ 4.25 శాతం జంప్‌చేయగా.. మెటల్, రియల్టీ, ఆటో 1.6-0.6 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హిందాల్కో, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఎస్బీఐ, మారుతీ, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, యాక్సిస్ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, శ్రీ సిమెంట్, టైటన్, కోల్ ఇండియా, టైటన్, ఐటీసీ, ఐవోసీ 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. ఐటీ జోరు డెరివేటివ్ కౌంటర్లలో మైండ్‌ట్రీ, కోఫోర్జ్, బంధన్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎంఅండ్ఎం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్, సెయిల్, ఐబీ హౌసింగ్, ఎన్ఎండీసీ, ఎల్అండ్టీ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐడియా 5.3-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. అదానీ ఎంటర్, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ ప్రు, టాటా పవర్, ఎంజీఎల్, ఏసీసీ, పేజ్ 1.6-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,111 షేర్లు లాభపడగా.. 593 నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
ఐటీ షేర్లు.. ధూమ్‌ధామ్- సరికొత్త రికార్డ్స్
వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 407 పాయింట్లు జంప్‌చేసి 39,104ను తాకింది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 11,537 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఐటీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 3 శాతం ఎగసింది. ఇంట్రాడేలో 20,748ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని చేరింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా పలు కౌంటర్లు బుల్ దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జాబితా ఇలా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను ప్రకటించింది. ఇది ఐటీ పరిశ్రమకు బూస్ట్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఐటీ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించవచ్చన్న అంచనాలు పెరగడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. దీంతో టీసీఎస్తోపాటు.. ఇన్ఫోసిస్, మైండ్‌ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్, కోఫోర్జ్, బిర్లాసాఫ్ట్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో టీసీఎస్ షేరు తొలుత 6 శాతం ఎగసింది. రూ. 2,679 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా ఇన్ఫోసిస్ రూ. 1,055 వద్ద, మైండ్‌ట్రీ రూ. 1,374 వద్ద, బిర్లాసాఫ్ట్ రూ. 210 వద్ద, కేపీఐటీ టెక్నాలజీస్ రూ. 130 వద్ద, కోఫోర్జ్ రూ. 2,439 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఇక విప్రో 6 శాతం జంప్‌చేసి రూ. 331కు చేరింది. ఇది రెండు దశాబ్దాల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2000 ఫిబ్రవరి 22న రూ. 388 వద్ద ఆల్‌టైమ్ హై'ని తాకింది. ఇతర కౌంటర్లలో మాస్టెక్, రామ్‌కో సిస్టమ్స్, స్యుబెక్స్, ఇంటెలెక్ట్ డిజైన్, టాటా ఎలక్సీ, ఈక్లెర్క్స్, న్యూక్లియస్ తదితరాలు 5-3 శాతం మధ్య లాభపడి ట్రేడవుతున్నాయి. -
పుణేలో కోరుట్ల యువతి ఆత్మహత్య
కోరుట్ల: పుణేలో కోరుట్ల యువతి పిట్ల మౌనిక(23) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. కోరుట్లలో నివాసముంటున్న పిట్ల శేషు–జ్యోతి దంపతుల కుమార్తె మౌనిక హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. తండ్రి శేషు ఉపాధికోసం దుబాయ్ వెళ్లగా తల్లి జ్యోతితో కలిసి మౌనిక కోరుట్లలో ఉంటోంది. రెండేళ్ల క్రితం పుణేలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. వారంక్రితం ఆ కంపెనీలో తక్కువ జీతం ఉండడంతో పని మానేసి వేరే కంపెనీలో ఉద్యోగంకోసం ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం. ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేదనే తీవ్ర ఒత్తిడిలో బుధవారం సాయంత్రం తల్లికి ఈ విషయం ఫోన్లో చెప్పి బాధపడినట్లు సమాచారం. అనంతరం సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆందోళన చెందిన తల్లి జ్యోతి వివరాలు తెలుసుకునేందుకు యత్నించగా మౌనిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం అందింది. ఈ విషయంపై పుణేలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. తల్లి జ్యోతి, బంధువులు మౌనిక ఆత్మహత్యతో తీవ్ర విషాదంలో మునిగి పోయారు. మౌనిక తండ్రి శేషు దుబాయ్ నుంచి వచ్చినట్లు సమాచారం. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
-
రచ్చకెక్కిన ఇంటి గొడవ
చిలకలగూడ : న్యాయస్థానంలో పెండింగ్‌లో భార్యభర్తల వివాదం రచ్చకెక్కింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు భార్యభర్తలు ఇద్దరిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌కు చెందిన నికిల్‌కుమార్‌కు వరంగల్ గిర్మాజీపేటకు చెందిన అపర్ణతో 2016 ఆగస్టులో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. నికిల్‌కుమార్‌తోపాటు అతని కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధిస్తున్నారని అపర్ణ తల్లితండ్రులు వరంగల్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో అత్తవారింట్లో ఉన్న తన వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని అపర్ణ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆదివారం న్యాయవాది, తల్లితండ్రులతో కలిసి పద్మారావునగర్‌లోని నికిల్‌కుమార్ ఇంటికి వచ్చింది. అత్తింటివారు ఆమె అల్మారా, ఇతర వస్తువులు ఇంటి బయట ఉంచారు. అల్మారాలోని బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు లేవని అపర్ణతోపాటు వారి బంధువులు నికిల్‌కుమార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నికిల్‌కుమార్, అపర్ణలను స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో నూ వారు వాగ్వాదానికి దిగడంతో ఇరువురిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. -
వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్ : ప్రేమగా నటించి పెళ్లి చేసుకొని, ఆపై ఆస్తిలో సగం వాటా కావాలంటూ తల్లితో కలిసి వేధింపులకు దిగాడు. అత్తింటి వేధింపులు తాళలేని మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనువు చాలించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రాంబాబు, మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దక్షణపు వీధి మార్కండేయస్వామి దేవాలయం సమీపంలో నివాసముండే పసుపులేటి రూపిణి (25) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఏలూరుకు చెందిన చండ్రల సందీప్రాజ మణికొండ సోలిటెయిర్ జిమ్‌లో కోచ్‌గా పని చేస్తున్నాడు. సందీప్, రూపిణి రెండు నెలల పాటు ప్రేమించుకున్నారు. దూరపు బంధువైన సందీప్‌ను పెళ్లి చేసుకుంటానని తండ్రి సత్యనారాయణతో చెప్పగా అందుకు నిరాకరించారు. పట్టువదలకుండా రూపిణి తల్లిదండ్రులను ఒప్పించింది. ఈ ఏడాది మార్చి 4న వివాహం జరిపించారు. ఏప్రిల్ నుంచి మణికొండ చిత్రపురి కాలనీలో ఎల్–4 ఫ్లాట్ నెంబర్ 111లో నివాసం ఉంటున్నారు. గతనెలలో సందీప్ తల్లి లలిత కొడుకు వద్దకు వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆస్తిలో సగం వాటా తీసుకురావాలని రూపిణిని వేధించసాగారు. రూపిణి తండ్రికి ఫోన్ చేయడంతో బుధవారం హైదరాబాద్ వచ్చాడు. అల్లుడు, అతని తల్లికి సర్ది చెప్పి వెళ్లాడు. ఏలూరులో బస్సు దిగుతుండగానే మళ్లీ కూతురు ఫోన్ చేసి భర్త, అత్త గొడవ పడుతున్నారని కన్నీరుమున్నీరైంది. వెంటనే శనివారం రాత్రి మళ్లీ కూతురు వద్దకు వచ్చి వారితో మాట్లాడాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు భర్త సందీప్, అత్త లలిత గుడికి వెళ్లగా టిఫిన్ తీసుకొస్తానని చెప్పి తండ్రి బయటకు వెళ్లాడు. సత్యనారాయణ తిరిగి వచ్చేసరికి డోర్ వెనక నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచిన స్పందించకపోవడంతో తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆస్తి కోసమే ప్రేమగా నటించి, తరువాత వేధింపులకు పాల్పడ్డారని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. తన కూతురు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పడంతో వచ్చి సర్ది చెప్పానని, ఈలోపే ఘోరం జరిగిపోయిందని కన్నీళ్ల పర్వంతమయ్యారు. భర్త, అత్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘టెక్’ ఎలక్షన్స్!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ఐటీ పరి జ్ఞానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా వినియోగించుకోబోతోంది. పారదర్శకత కోసం పది రకాల ఐటీ అప్లికేషన్స్‌ను వాడనుంది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్న జిల్లా కలెక్టర్లకు ఈ అప్లికేషన్ల వినియోగంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఐటీ అప్లికేషన్ల వినియోగంపై కలెక్టర్లకు తర్ఫీదునిచ్చింది. వారంపాటు బ్యాచుల వారీగా కలె క్టర్లకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీలతో పాటు పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి కోరితే.. ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి ముం దు అనుమతులు జారీ చేసేందుకు ‘సువిధ’ పేరుతో యాప్‌ను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. ఎన్ని కల సమయంలో ఎక్కడైనా అక్రమాలు, అవినీతి, డబ్బుల పంపిణీ చోటు చేసుకున్నా.. ఎన్నికల ప్రవ ర్తన నియమావళిని ఉల్లంఘించినా సామాన్య ప్రజ లు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమా చారం అందించే వీలుగా ‘సీ–విజిల్’పేరుతో మరో మొబైల్ యాప్ రూపొందించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనల ఫొటోలు, వీడియోలను తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకుంటారు. ఎన్నికల సంఘం ఈ యాప్ ఫిర్యాదులపై సమీక్ష జరుపుతుంది. వీవీప్యాట్లపై అవగాహన అత్యంత పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్పారు. యాప్‌ల వినియోగంపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రజత్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఉప ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్న జాయింట్ కలెక్టర్లు, వారి బృందంలోని ఐటీ అధికారులకు ఐటీ అప్లికేషన్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలిసారిగా వినియోగించబోతున్న వీవీప్యాట్ యంత్రాల పట్ల అధికారులకు అవగాహన లేదని, శిక్షణలో భాగంగా వాటిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా మన్నారు. ఓటర్ల నమోదు కోసం ఈ నెల 15, 16వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారోద్యమ కార్యాక్రమా నికి వచ్చిన స్పందనపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో డూప్ ఓట్ల గుర్తింపు ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లును గుర్తిం చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు. ప్రధానంగా ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, వయసు, ఫొటోలు, చిరు నామాల్లో పోలికల ఆధారంగా ఈ సాఫ్ట్వేర్ డూప్లి కేట్ ఓటర్లను గుర్తిస్తుందన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించడంలో చట్టబద్ధంగా వ్యవహ రిస్తామని, 7 రోజుల ముందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేస్తామన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లను మాత్రమే సుమోటోగా తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు, వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. బలంవతపు తీర్మానాలపై కఠిన చర్యలు.. ఫలానా పార్టీ లేదా అభ్యర్థికే ఓటేయాలని గ్రామాల్లో ప్రజలతో చేయిస్తున్న ప్రతిజ్ఞలు, తీర్మానాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యా దులు అందలేదని రజత్‌కుమార్ తెలి పారు. తీర్మానాలు, ప్రతిజ్ఞలు ఓటర్ల వ్యక్తిగత విషయాలని, అయితే, బలవంతంగా తీర్మా నాలు, ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్లు తమ దృష్టి కొస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వ హణ తేదీలపై సమాచారం లేదని, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తమను సంప్రదించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయితే కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుందని స్పష్టం చేశారు. -
ఆధార్ సాఫ్ట్‌వేర్‌పై షాకింగ్ రిపోర్టు
న్యూఢిల్లీ : ఆధార్ ఫ్రేమ్‌వర్క్ ప్రవేశపెట్టినప్పటి నుంచీ.. దాని డేటా సెక్యురిటీ ఓ హాట్‌టాఫిక్‌గా మారిపోయింది. ఆధార్ నెట్వర్క్ సురక్షితంగా కాదంటూ ఇప్పటికే పలు రిపోర్టులు తేల్చాయి. ఈ రిపోర్టులను యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొట్టిపారేస్తూ వస్తోంది. వందల వేల సార్లు ప్రయత్నించినా ఆధార్ డేటాను బ్రేక్ చేయలేరని యూఐడీఏఐ చెబుతూ వస్తోంది. కానీ మూడు నెలల పాటు జరిగిన ఓ ఇన్వెస్టిగేషన్లో ఆధార్ సాఫ్ట్వేర్ హ్యాక్ చేయొచ్చని వెల్లడైంది. సాఫ్ట్వేర్ ప్యాచ్ ద్వారా కొత్త ఆధార్ యూజర్లు ఎన్రోల్మెంట్ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లోని క్లిష్టమైన భద్రతా ఫీచర్లను డిసేబుల్ చేమొచ్చని హుఫ్‌పోస్ట్ ఇండియా బహిర్గతం చేసింది. ఈ ప్యాచ్ కేవలం రూ.2500కే లభ్యమవుతుందని, అనధికారిక వ్యక్తులు ఆధార్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసేలా ఇది అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది. ప్రపంచంలో ఏమూల నుంచైనా.. ఆధార్ నెంబర్లను జనరేట్ చేసేలా వారికి అనుమతి ఇస్తుందని రిపోర్టు తెలిపింది. దీన్ని విస్తృతంగా వాడుతున్నట్టు కూడా పేర్కొంది. మూడు విభిన్న ప్రదేశాల నుంచి గ్లోబల్ సెక్యురిటీ నిపుణుల ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేయించినట్టు హుఫ్పోస్టు ఇండియా వెల్లడించింది. ఈ ముగ్గురు కూడా హ్యాక్‌ను ధృవీకరించినట్టు తెలిపింది. ప్యాచ్ ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్ ఇన్-బిల్ట్ జీపీఎస్ సెక్యురిటీ ఫీచర్‌ను డిసేబుల్ చేస్తుందని రిపోర్టు వెల్లడించింది. యూజర్లను ఎన్రోల్ చేయడానికి ప్రపంచంలోనే ఏ మూల నుంచైనా ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడేలా అనధికారిక వ్యక్తులకు అనుమతిస్తుందని పేర్కొంది. -
సాఫ్ట్వేర్ మొగుడు కాదు.. శాడిస్ట్ మొగుడు..
-
సాఫ్ట్వేర్ భర్త శాడిజం
సాక్షి, కర్నూలు : తన లోపాన్ని ఎవరికైనా చెబితే నగ్న చిత్రాలు బయటపెడతానని కట్టుకున్న భార్యను బెదిరించాడు ఓ సాఫ్ట్వేర్ భర్త. తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి భార్యకు టీబీ రోగం ఉందని ప్రచారం చేశాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాచాని రాజేంద్రప్రసాద్‌తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేంద్రప్రసాద్ తేడాగా వ్యవహరించాడు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. తాను నపుంసకుడినని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అతడి అమ్మమ్మకు తెలుపగా ఆమె కూడా తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించింది. దీంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక కుంగిపోయానంటూ బాధితురాలు మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. టీబీ రోగం ఉందని ప్రచారం అత్తింటి వారి ఆగడాలు భరించలేక బయటకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలికి టీబీ రోగం ఉందని రాజేంద్రప్రసాద్ ప్రచారం చేశాడు. ‘ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడికి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారు. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయారు’అని ఆమె అవేదన వ్యక్తం చేశారు. మరో పెళ్లికి రెడీ ఇదిలా ఉండగా మాచాని రాజేంద్రప్రసాద్ మరో పెళ్లికి రెడీ అయ్యారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం మరో అమ్మాయికి జరగకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లను వద్దలొద్దు అంటూ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి శిక్ష పడిన తర్వాతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అని పెళ్లి చేశాం : బాధితురాలి తండ్రి మంచి సంబంధం, సాఫ్ట్వేర్ ఉద్యోగమని తమ కూతురుకి డిగ్రీ సెకండియర్లోనే వివాహం చేశామని బాధితురాలి తండ్రి తెలిపారు. 45 లక్షలు కట్నంగా, మరో 10లక్షలు అదనంగా ఇచ్చామన్నారు. కానీ అబ్బాయి ఇలాంటివాడు అనుకోలేదని మీడియా ముందు వాపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు వారి ఇంటికెళ్లిన తన తమ్ముడిని తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీంతో విధిలేక పోలీసులను ఆశ్రయించామన్నారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన రాజేంద్రప్రసాద్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
2 నెలల్లో 200 మంది నియామకం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెంటరీ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ మార్గ్ ఈఆర్పీ వచ్చే రెండు నెలల్లో 200 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లకి‡్ష్యంచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొత్తగా పది మంది ఉద్యోగులొస్తారని మార్గ్ ఈఆర్పీ నేషనల్ హెడ్ ప్రితేష్ ప్రభాకర్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మార్గ్ ఈఆర్పీకి 650 మంది ఉద్యోగులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లో కార్యాలయం ఉందని... ఈ ఏడాది చివరి నాటికి విజయవాడలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. ‘‘జీఎస్టీ కంటే ముందు దేశంలో 9 లక్షల మంది కస్టమర్లుండేవారు. జీఎస్టీ తర్వాత 2 లక్షల మంది అదనంగా జతయ్యారు. జీఎస్టీ కంటే ముందు తెలంగాణ, ఏపీల్లో 16 వేలుగా ఉన్న కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 24 వేలను దాటింది. ఏడాదిలో ఈ సంఖ్యను 48 వేలకు చేర్చాలని లకి‡్ష్యంచాం’’ అని ఆయన వివరించారు. దేశంలో ఏటా 12 వేల అకౌంటింగ్ లైసెన్స్‌లను విక్రయిస్తున్నామని.. ఇందులో 450–500 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని చెప్పారు. ఒక్క లైసెన్స్ రూ.7,200–25,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఏడాదిలో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్.. ప్రస్తుతం క్లౌడ్ ఆధారిత అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అభివృద్ధిపై పరిశోదన చేస్తున్నామని.. ఏడాదిలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని పాటిల్ చెప్పారు. మొబైల్, ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్ ఏ ఎలక్ట్రానిక్ ఉపకరణంలోనైనా వినియోగించుకునే వీలుండటమే దీని ప్రత్యేకత అని చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.125 కోట్ల టర్నోవర్ నమోదు చేశామని, ఇందులో రూ.6.5 కోట్లు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుందని తెలిపారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.180 కోట్లు లకి‡్ష్యంచామని తెలిపారు. -
కోడింగ్ రాకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కలే..
-
క్యాంపస్ కొలువు కష్టమే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ఓ మోస్తరు కాలేజీలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం గ్యారంటీ.. టాప్ 10 కాలేజీల్లో సీటు వచ్చిందంటే ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే.. – రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన ఇది! కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి 250 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉద్యోగ ఆఫర్ లెటర్లు ఇచ్చిన దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఏటా 10 నుంచి 12 వేల మందిని నియమించుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇప్పుడు ‘ఏ’కేటగిరి ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అది కూడా టాలెంట్ టెస్ట్‌ల పేరుతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి మూడు నుంచి ఆరు మాసాలపాటు శిక్షణ ఇచ్చే ఈ సంస్థలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన విద్యార్థులను మాత్రమే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరి ఆయా కాలేజీలకు వెళ్లి వేల మందికి ఒక రోజు పరీక్ష నిర్వహించి, మరో రోజు మౌఖిక పరీక్ష నిర్వహించి వందల మందిని ఎంపిక చేసుకునే ప్రక్రియకు ఫుల్స్టాప్ పెట్టేశాయి. ఇన్ఫోసిస్ ‘హ్యాక్ విత్ ఇన్ఫీ’, కాగ్నిజెంట్ ‘టెక్నాలజీ హైరింగ్’పేరుతో విద్యార్థులకు కఠిన పరీక్షలు నిర్వహించి ఎక్కువ వేతనంతో నియమించుకుంటున్నాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ విద్యా రంగంలో టాప్ కాలేజీలుగా పేర్కొంటున్న సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, ఎంవీఎస్ఆర్ కాలేజీల్లో సైతం 2018 పాస్డ్ అవుట్ విద్యార్థులకు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువ ఆఫర్లు వచ్చాయి. కోడింగ్ వస్తేనే.. దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు అమెరికన్ కంపెనీలు కాగ్నిజెంట్, యాక్సెంచర్ ఉద్యోగాలు ఆఫర్ చేయడానికి గతంలో మాదిరి ఒకరోజు రిక్రూట్మెంట్కు పరిమితం కావడం లేదు. కోడింగ్ బాగా తెలిసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, డెలాయెట్, అమెజాన్, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించి.. వారిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ కారణంగా ప్రైవేట్ టాప్ కాలేజీల్లో ఐటీ సంబంధిత కోర్సుల్లో సీటు కోసం రూ.12 నుంచి రూ.15 లక్షల మేర డొనేషన్ చెల్లించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. బీ, సీ కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు కూడా ఉండటం లేదని తెలియడంతో టాప్ కాలేజీల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నాలుగు కాలేజీలకే పరిమితమైన కాగ్నిజెంట్ అమెరికన్ కంపెనీ కాగ్నిజెంట్ దేశవ్యాప్తంగా ఎనిమిది కాలేజీల్లో మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టింది. వాటిలో హైదరాబాద్ కాలేజీలే నాలుగు ఉన్నాయి. సీబీఐటీ, వాసవి, ఎంవీఎస్ఆర్, శ్రీనిధి కాలేజీల్లో మాత్రమే టెక్నాలజీ హైరింగ్ పేరుతో నియామకాలు చేపట్టి కేవలం 12 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సంస్థ సీబీఐటీ కాలేజీ నుంచి 201 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేయగా ఈ ఏడాది ఐదుగురికి ఉద్యోగాలు ఆఫర్ చేసింది. వాసవీ కాలేజీలో 2017లో 121 మందికి ఆఫర్ చేసి.. ఈ ఏడాది పాసైన నలుగురు విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంవీఎస్ఆర్ నుంచి ముగ్గురికి ఉద్యోగాలు ఆఫర్ చేయగా.. శ్రీనిధి కాలేజీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదీ అదే దారి దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్.. కాగ్నిజెంట్ దారిలోనే నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వందల సంఖ్యలో టాప్ కాలేజీల విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చిన ఈ సంస్థలు 2017లో పరిమిత సంఖ్యలో నియమించుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని, గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ కంపెనీలకు వస్తున్న ఆర్టర్లు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో పని చేయడానికి అర్హులైన వారు లభించకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2016లో నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 753 మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసిన ఇన్ఫోసిస్.. 2017కు వచ్చేసరికి ఆ సంఖ్యను 132కి తగ్గించింది. ఈ ఏడాది రెగ్యులర్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఆ కంపెనీ విధానమేమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఇక టీసీఎస్ హైదరాబాద్‌లో పరిమితంగా రెండు లేదా 3 కాలేజీల్లో మాత్రమే నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. కోడింగ్ రాకుంటే కష్టమే: ప్రొఫెసర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్, సీబీఐటీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్ కచ్చితంగా తెలిసి ఉండాలి. జావా కోడింగ్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా వంటివి కూడా ఇప్పుడు కంపెనీలకు అవసరం. ఐఐటీలు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. మిగిలిన యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ఏదేమైనా గతంలో మాదిరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడు అంత ఈజీ కాదు. -
74 శాతం ఏటీఎంల పరిస్థితి అంతే..!
న్యూఢిల్లీ : ఏటీఎంలలో ఈ మధ్య పెద్ద ఎత్తున్న మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం అవి అవుట్ డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేయడమేనట. దేశంలో కనీసం 74 శాతం ఏటీఎంలు అవుట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నాయని, దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 25 శాతం మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల అసమర్థతపై తలెత్తిన ప్రశ్నలు సందర్భంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. 75 శాతం వరకు ఏటీఎంలు అన్సపోర్టెడ్ సాఫ్ట్‌వేర్‌తో నగదును పంపిణీ చేస్తున్నాయని.. దీంతో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపింది. దేశంలో చాలా వరకు ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే ఉన్నాయని, 89 శాతం వాటికి చెందినవేనని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఏటీఎంలలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు విపరీతంగా అందినట్టు కూడా చెప్పింది. రిజర్వు బ్యాంక్ వద్ద పలు ఫిర్యాదులు దాఖలైనప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఇంకా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం లేదు. గత నెలలో ఆర్బీఐ ఓ అడ్వయిజరీ నోట్‌ను సైతం జారీ చేసింది. నగదును సరఫరా చేసే సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు కాలంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు మోసాలపై అథారిటీల వద్ద 25వేల వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మధ్యన హ్యాకర్లు కొత్త కొత్త పద్ధతులతో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి బ్యాంకులు తమ సిస్టమ్‌లను పూర్తిగా అప్టూడేట్ చేయాల్సి ఉంది. -
11వ అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని 11 అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన శ్రావణి(28) కుటుంబ సభ్యులతో కలసి మదీనాగూడలో ఉంటోంది. ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీస్ కంపెనీలో పనిచేస్తోంది. శ్రావణికి 18 నెలల క్రితం రామకృష్ణతో వివాహం కాగా, 4 నెలల క్రితం బాబుకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమెకు తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్ రావడంతో చాలా ఆస్పత్రులకు వెళ్లినా తగ్గలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9.30 గంటలకి ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి బయలుదేరిన శ్రావణి 10 గంటల సమయంలో ప్రైమ్ ఎరా కంపెనీ ఉన్న మిలాంజ్ టవర్స్ 11వ అంతస్తు ఎక్కి దూకింది. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అనారోగ్యం కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లి ఈశ్వరమ్మ పోలీసులకు తెలిపింది. -
‘మయూరి’ ఉపేంద్రవర్మ కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : మయూరి పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్రవర్మ చేతిలో మోసపోయానంటూ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు (సాఫ్ట్వేర్ ఇంజినీర్) సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిశారు. తనకు జరుగుతున్న అన్యాయంతో పాటు తనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో షికారు చేస్తున్న పుకార్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అదనపు సీపీ (నేరాలు) షికా గోయల్‌ను సైతం బాధితురాలు కలిశారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈమె ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీటిని పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మ సంబంధీకులు బాధితురాలికి వ్యతిరేకంగా మరికొన్ని ఫొటోలు విడుదల చేశారు. దీనిపై ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు: బాధితురాలు ‘ఉపేందర్‌తో గతేడాది సెప్టెంబర్ 13న వివాహం జరిగింది. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. న్యాయం కోసమే వారి ఇంటికి వెళ్లాను. ఆయన భార్యతో ఎలాంటి గొడవ పడలేదు. వారు ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. నేను అనేక మంది నుంచి డబ్బు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావు. నేను రూ. 40 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. వాళ్లు విడుదల చేసిన ఫొటోలు నా కాలేజ్ ఫ్రెండ్‌తో దిగినవి. అతడితో నాకు మొదట్లో అఫైర్ ఉండేది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో విడిపోయాం. కాలేజ్ ఫ్రెండ్ అనే ఉద్దేశంతో అతనితో చనువుగా ఉన్నా’ అని బాధితురాలు పేర్కొన్నారు. -
మళ్లీ పోలీసుల వద్దకు ఉపేంద్ర బాధితురాలు
సాక్షి, హైదరాబాద్: మయూర్ పాన్ షాప్ యజమాని ఉపేంద్ర వర్మ చేతిలో మోసపోయానంటూ ఫిర్యాదు చేసిన బాధితురాలు బుధవారం మరోమారు పోలీసులను ఆశ్రయించారు. తనపై ఉపేంద్ర వర్మ సోదరుడు చేస్తోన్న ఆరోపణల్లో నిజంలేదని, ఆ కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఏసీపీ షికా గోయల్‌కు మొరపెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినందుకే ఉపేంద్రను నమ్మానని చెప్పారు. ‘‘ఉపేంద్ర సోదరుడు ఆరోపిస్తున్నట్లు నేనేమీ ప్రీతి(ఉపేంద్ర భార్య)తో గొడవపడలేదు. బ్లాక్ మెయిల్ అంతకన్నా చేయలేదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు కాబట్టే న్యాయం కోసం ఆ ఇంటికి వెళ్లాను. ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీసి నన్ను బద్నామ్ చేస్తున్నారు. నా కాలేజ్ ఫ్రెండ్ ఒకరితో చనువుగా ఉండేదాన్ని. కానీ మనస్పర్థలు రావడంతో మేం విడిపోయాం. ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసిన ఉపేంద్రపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని బాధితురాలు చెప్పారు. బాధితురాలిపై ఆరోపణలు: మయూర్ పాన్ షాప్ యజమాని ఉపేంద్ర వర్మపై బాధితురాలు ఫిర్యాదు చేసిన కొద్ది గంటలకే ఉపేంద్ర సోదరుడు మీడియా ముందుకొచ్చారు. తమపై ఫిర్యాదు చేసిన అమ్మాయికి ఇంతకుముందే చాలామంది అబ్బాయిలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ, సంబంధిత వీడియోలు బయటపెట్టారు. బ్లాక్ మెయిల్ కూడా చేసినట్లు తెలిపారు. సదరు ఆరోపణల్లో వాస్తవం లేదని, తన ప్రాణాలకు హాని ఉందని బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. (చూడండి: అమ్మాయిలకు స్వీట్‌పాన్ ఇచ్చి..) -
మయూర్ పాన్ హౌస్ యజమాని కోసం వేట
-
అమ్మాయిలకు స్వీట్‌పాన్ ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో కామాంధుడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రఖ్యాత మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేంద్ర వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు వలవేసి, పెళ్లిచేసుకుంటానని నమ్మించడం ఇతని నైజం. అలా దగ్గరైన అమ్మాయిలకు స్వీట్పాన్లో మత్తుమందు కలిపిచ్చి, అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి, వాటిని యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతోపాటు నానారకాలుగా వేధించేవాడు’’ అని పోలీసులు చెప్పారు. ఉచ్చులో చిక్కుకున్న టెకీ: ఉపేంద్ర వర్మ నిజస్వరూపం తెలియని ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనికి దగ్గరయ్యారు. తీరా నమ్మకద్రోహానికి గురయ్యానని తెలుసుకున్న తర్వాత ధైర్యంగా బయటికొచ్చారు. వర్మపై కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉపేంద్ర వర్మ అజ్ఞాతంలోకి పారిపోయాడు. అతనికి సహకరించిన ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఊహించని విషయాలెన్నో బయటపడ్డాయి. పదుల సంఖ్యలో అమ్మాయిలతో ఉపేంద్ర వర్మ చనువుగా ఉన్న ఫొటోలు లభించాయి. మయూర్ పాన్ హౌస్‌కు హిమాయత్ నగర్ సహా నగరంలో పలు చోట్ల శాఖలున్నాయి. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
మేడ్చల్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వాసుదేవారెడ్డి(38) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రస్తుతం తాను ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో ఉన్నానని, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకొమంటూ తన సోదరుడికి మెసేజ్ పంపాడు. సోదరుడు రైల్వే స్టేషన్‌కి వచ్చే సరికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అనంతగిరి : జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లి హైదర్‌నగర్‌కు చెందిన నాగేందర్‌రెడ్డి(22) బెంగుళూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా గత రెండు సంవత్సరాలు క్రితం తల్లి మరణించింది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరిగా మానసికంగా కుంగిపోయిన నాగేందర్‌రెడ్డి ఉద్యోగం చేయడం ఆసక్తి లేదని కొద్దిరోజుల క్రితం ఫోన్ ద్వారా తాతకు సమాచారం అందించాడు. ఈ నెల 9న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సమీప బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీశారు ఎంతకీ ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వికారాబాద్‌లోని లాలాగూడ సమీపంలోని బ్రిడ్జి సమీపంలో చెట్టుకు ఉరేసుకున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా లభించిన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి తాత నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
టెక్కీ అజితాబ్ ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ టెక్కీ కుమార్ అజితాబ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన తన కారును కొనుగోలుదారుడికి అమ్మేందుకు బయటకు వెళ్లిన అజితాబ్ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అజితాబ్ అదృశ్యంపై వైట్‌ఫీల్డ్‌లో కేసు నమోదైంది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అతని తండ్రి అశోక్‌కుమార్ సిన్హా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తునకు నగర కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఎంత విచారించినా, సుదీర్ఘంగా గాలించిన అజితాబ్ ఆచూకీ లభించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా అజితాబ్ ఆచూకీ పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఐడీ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అజితాబ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. అజితాబ్ ఆచూకీ తెలిసిన వారు సీఐడీ కంట్రోల్ రూమ్ 080–2204498, 22942444 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలని సూచించింది. -
వెలుగులోకి తత్కాల్ మోసం
సాక్షి, న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతోన్న ఓ భారీ రాకెట్టును భారత రైల్వే అధికారులు చేధించారు. ఈ ఘటనకు సంబంధించి సల్మాన్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. నిందితుడు సల్మాన్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను తన నియంత్రణలోకి తీసుకుని నిందితుడు తత్కాల్ టికెట్లను బుక్ చేసే విధానం చూసి రైల్వే అధికారులు ఆశ్చర్యపోయారు. సల్మాన్ కేవలం రూ.700 విలువ చేసే సాఫ్ట్ వేర్ సహాయంతో ఐఆర్సీటీసీ సర్వర్‌ను అధీనంలోకి తెచ్చుకుని జిఫ్పీ పద్ధతిలో తత్కాల్ టిక్కెట్లను బుకింగ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సాఫ్ట్వేర్ పనిచేసే విధానం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు ప్రయాణికులందరి వివరాలు కౌంటర్ సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ చేస్తారు. బుకింగ్ 10 గంటలకు ప్రారంభం కాగానే ట్రైన్ నెంబర్, డేట్‌తో కలిపి మొత్తం ప్రయాణికుల వివరాలన్నీ ఆటోమేటిక్‌గా కౌంటర్ సాఫ్ట్వేర్ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలా రైల్వే స్టేషన్లో కౌంటర్ వద్ద తత్కాల్ కోసం క్యూలో నిలబడిన వారి కంటే ముందుగానే ఈ సాఫ్ట్‌వేర్‌తో టికెట్లు బుక్ చేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను సల్మానే సొంతంగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.700 లకు ఒక్కో మధ్యవర్తికి అమ్మేసినట్లు విచారణలో తేలింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆన్లైన్ ద్వారా 2500 కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. -
కర్ణాటక బరిలో సాఫ్ట్వేర్ సీఈవో
సాక్షి, న్యూఢిల్లీ : దర్శన్ పుట్టనయ్య 40 ఏళ్ల యువకుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలోని డెన్వర్‌లో కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ‘క్వినిక్స్ టెక్నాలజీస్’ కంపెనీలో మొన్నటి వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. గత ఫిబ్రవరి నెలలో కర్ణాటక రాజ్య రైత సంఘంలో నాయకుడిగా పనిచేస్తున్న తన తండ్రి కేఎస్ పుట్టనయ్య చనిపోవడంతో దర్శన్ పుట్టనయ్య తండ్రి అంత్యక్రియలకు వచ్చారు. తండ్రిలాగే తన జీవితాన్ని రైతుల సంక్షేమం కోసం అంకితం చేయాలనుకున్నారు. అందుకోసం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెట్టారు. 2013లో తన తండ్రి పోటీ చేసి విజయం సాధించిన మేలుకోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగారు. 1990, 2000 దశకాల్లో పలు రైతు ఉద్యమాల్లో పొల్గొన్న కేఎస్ పుట్టనయ్య తన రైతు సంఘానికి చెందిన రాజకీయ పక్షమైన సర్వోదయ రాజకీయ పక్ష తరఫున పోటీ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అదే సర్వోదయ రాజకీయ పక్ష 2017 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఏర్పాటు చేసిన స్వరాజ్ ఇండియాలో విలీనమైంది. ఈ నేపథ్యంలో దర్శన్ పుట్టనయ్య స్వరాజ్ ఇండియా పార్టీ తరఫునే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మేలుకోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు. అలాగే ఆయనకు మద్దతుగా వీరశైవ లింగాయత్‌లు ఏప్రిల్ 28వ తేదీన హులికెరె గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించారు. లింగాయత్‌లను మైనారిటీ మతంగా గుర్తించాలనే తమ డిమాండ్‌కు మద్దతిస్తారా ? అని ర్యాలీలోనే లింగాయత్ నాయకులు ప్రశ్నించారు. నిర్మొహమాటంగా మాట్లాడే దర్శన్ పుట్టనయ్య ఆ విషయమై ఈ దశలో తానేమి చెప్పలేనని చెప్పారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ఇస్తున్నందున రేపు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తాను మద్దతిస్తానని భావించరాదని కూడా చెప్పారు. ఏదేమైనా తన జీవితాన్ని మాత్రం తన తండ్రిలాగే రైతుల సంక్షేమం కోసమే అంకితం చేస్తానని పునరుద్ఘాటించారు. అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న విషయం తెల్సిందే. -
బిజినెస్ రంగంలో నయా ట్రెండ్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని శివార్లలోని ఆదిభట్ల ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేసే వెంకటేశ్వర్రావు అదనపు ఆదాయం కోసం వ్యాపార మార్గం పట్టాడు. అన్నిరంగాల వారికి అవసరమయ్యే పని అయితే ఆదరణ ఉంటుందని గుర్తించి.. రెస్టారెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలోచనను తన తోటి నలుగురు సహచరులకూ చెప్పాడు. జీతానికి తోడుగా మరింత ఆదాయం సంపాదించవచ్చనే వారూ ముందుకు వచ్చారు. తలా రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి రెస్టారెంట్ ప్రారంభించారు. ఇలా కేవలం వెంకటేశ్వర్రావు, అతడి స్నేహితులు మాత్రమేకాదు.. హైదరాబాద్‌లో ఎంతో మంది ఐటీ ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం బిజినెస్ అడుగులు వేస్తున్నారు. అందులో కొందరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటే.. మరికొందరు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి ప్రారంభిస్తున్నారు. ఇలా ‘అదనపు’ మార్గం పడుతున్నవారిలో సగం మంది వరకు కేవలం తమ వాటా పెట్టుబడి పెట్టి, లాభాలు పంచుకుంటుండగా... మిగతావారు నేరుగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇక బ్యాంకు రుణాలతో ఇళ్లు కొనుగోలు చేసి, అద్దెకివ్వడం.. ఈ అద్దె సొమ్ముతోనే రుణ వాయిదాలు కట్టేసి ఇళ్లు సొంతం చేసుకోవడం వంటివి చేస్తున్నవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సగం మందికిపైగా.. హైదరాబాద్‌లోని ఐటీ సంస్థల్లో సుమారు 6 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నట్టు అంచనా. ఇందులో సగం మందికిపైగా తమ ఉద్యోగానికి తోడు అదనపు సంపాదన మార్గంపై దృష్టి సారించారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇందులో చాలా మంది తమ ఆదాయాన్ని మంచి రాబడులు ఇచ్చే పెట్టుబడులకు, భూములు, ఇళ్ల కొనుగోళ్లకు మళ్లిస్తుండగా.. కొందరు నేరుగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఐదారుగురు టెకీలు కలసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి నెలకొల్పుతున్నారు. ముఖ్యంగా టెకీల్లో సగం మంది వరకు స్టాక్ మార్కెట్లో, పెద్దగా రిస్కు లేని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. మరో 20 శాతం మంది వరకు రియల్ ఎస్టేట్, ఫ్లాట్లు, ఇళ్ల, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఐస్‌క్రీం పార్లర్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు. నలుగురు కలసి.. వరంగల్‌కు చెందిన వెంకటేశ్వర్రావు అనే టెకీ.. ముగ్గురు సహచరులతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. నలుగురు కలసి తలా పది లక్షలు వేసుకుని, బ్యాంకుల నుంచి మరో రూ.24 లక్షలు రుణం తీసుకుని పెట్టుబడి పెట్టారు. రూ.60 లక్షలతో శామీర్‌పేట ప్రాంతంలో ఎకరం భూమిని కొనుగోలు చేసి.. విల్లాల కోసం డెవలప్మెంట్కు ఇచ్చారు. ఏడాది తిరిగేలోపు అక్కడ భూమి విలువ పెరగడంతోపాటు విల్లాల నిర్మాణం కూడా పూర్తయ్యే దశకు వచ్చింది. దానిని విక్రయించడంతో వారికి పెట్టుబడి పోను ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున లాభం వచ్చింది. ఇలా చాలా మంది టెకీలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు సొంతంగా ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నారు. కొందరు తమ వద్ద ఉన్న సొమ్ముతో, బ్యాంకు రుణాలతో ఇళ్లను కొనుగోలు చేసి.. అద్దెకు ఇస్తున్నారు. ఆ అద్దెలనే రుణ వాయిదాలుగా చెల్లిస్తూ.. ఇళ్లను సొంతం చేసేసుకుంటున్నారు. ఇంకొందరు బిల్డర్లకు పెట్టుబడిగా డబ్బులు సమకూర్చి.. లాభాల్లో 10 శాతం వరకు వాటాగా తీసుకుంటున్నారు. ‘ఫుడ్’ వ్యాపారాలే ఎక్కువ.. చాలా మంది టెకీలు.. పెట్టుబడి తక్కువగా ఉండటం, సులభంగా వ్యాపారం చేయగలగడం, నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల వంటి వ్యాపారాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే ఆదిభట్ల, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో.. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, కెఫేల వంటివాటిని ప్రారంభించారు. నలుగురైదుగురు కలసి ఒక్కొక్కరు రూ.రెండు మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టి.. ఈ వ్యాపారాలు పెడుతున్నారు. ఎవరైనా తెలిసినవారిని పెట్టుకుని వాటిని నడిపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి వాటిని చూసుకుంటున్నారు. కొందరు టెకీలు బార్లు, పబ్బుల వంటివాటిల్లోనూ పెట్టుబడులు పెట్టి.. వాటాలు తీసుకుంటున్నారు. ఐస్‌క్రీమ్‌లు.. మిల్క్ షేక్‌లు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టెకీగా పనిచేసిన శివప్రసాద్ కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారంలోకి దిగారు. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడల్లో మిల్క్‌షేక్, షేకెన్ స్లైస్ పేరుతో ఔట్లెట్లు ప్రారంభించారు. ఒక్కోదానికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రోజుకు రూ.30 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. అందులో రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం ఉంటోందని శివప్రసాద్ చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ రెండు ఔట్లెట్లు పెట్టేందుకు శివప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఇక బాగా క్రేజ్ ఉన్న ఐస్‌క్రీమ్ పార్లర్లవైపు కూడా టెకీలు దృష్టి సారించారు. ఖమ్మంకు చెందిన రమేశ్ రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ ఐస్‌క్రీం పార్లర్లో 20శాతం వాటా తీసుకున్నారు. హోం డెలివరీ చేయడానికి ఓ ప్రత్యేకమైన యాప్ సైతం తయారు చేయించారు. ఆయన పదో తరగతి స్నేహితులు వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటంతోనూ.. ఐటీ ఉద్యోగాల్లో భారీగా వేతనాలు అందడం వాస్తవమే అయినా.. కొంతకాలంగా వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉంటోందని కొందరు టెకీలు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల కింద ఏటేటా వేతనాల పెరుగుదల భారీగా ఉండేదని.. ఇప్పుడు ఏటా ఐదు నుంచి పది శాతం మేర మాత్రమే వేతనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దీనికితోడు తమ ఆదాయాన్ని మంచి పెట్టుబడిగా పెట్టి.. మరింత ఆదాయం పొందాలన్న ఆలోచన కారణంగా వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నట్టు చెబుతున్నారు. -
ఈ సైబర్ క్రైమ్.. ఓ మిస్టరీ.!
సాక్షి, హైదరాబాద్: ఇదో మిస్టరీ సైబర్ క్రైమ్.. నేరం జరిగింది.. కానీ అది ఎలా జరిగిందనే దానిపై పోలీసులకే స్పష్టత లేదు. రూమ్ అద్దెకు కావాలంటూ వచ్చిన నేరగాడు తన డెబిట్‌కార్డు తస్కరించాడని, ఫోన్లో సాఫ్ట్వేర్ బగ్ ఇన్స్టాల్ చేశాడని బాధితుడు చెప్తున్నాడు. ఇలా తన ఖాతాలోని రూ.49,900 కాజేశాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బగ్గింగ్ లేదని, కేవలం తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించాడని పోలీసులు అంటుంటే.. టెంపరరీ పిన్ సృష్టించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ మిస్టరీ సైబర్ క్రైమ్‌ను ఛేదించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. గది అద్దెకు కావాలంటూ వచ్చి.. ఉత్తరాదికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న హర్ష్ కరీవాల, వన్ష్ దత్తా, ఆకాశ్ గార్గ్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని హ్యాపీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒక్కో బెడ్రూమ్లో ఒకరు ఉండేవారు. ఇటీవల ఆకాశ్ వెళ్లిపోవడంతో ఓ బెడ్రూమ్ ఖాళీ అయింది. ఎవరికైనా ఈ రూమ్‌లోకి రావడానికి ఆసక్తి ఉంటే సంప్రదించాలంటూ హర్ష్, వన్ష్ ‘హైదరాబాద్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మేట్స్’అనే ఫేస్బుక్ పేజ్‌లో గత శనివారం పోస్ట్ చేశారు. అది చూసిన ఓ వ్యక్తి అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో వన్ష్కు ఫోన్ చేశాడు. రమ్మని చెప్పడంతో పది నిమిషాల్లో ఫ్లాట్‌కు చేరుకున్నాడు. తన పేరు శ్రీనివాసరెడ్డి అని, తిరుపతికి చెందిన తాను ఢిల్లీ, పుణేల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశానని, పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని గూగుల్ కార్యాలయంలో యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్‌గా ఉద్యోగం వచ్చిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్ నచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో వచ్చి చేరుతానంటూ అడ్వాన్స్, అద్దె వివరాలు సైతం ఖరారు చేసుకున్నాడు. కార్డ్ కొట్టేసి.. ఫోన్ తీసుకుని.. వీరి ఫ్లాట్‌కు వస్తూనే తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందంటూ చార్జర్ తీసి చార్జింగ్ పెట్టాడు శ్రీనివాసరెడ్డి. అద్దెకు రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలని హర్ష్‌కు చెందిన రూమ్‌లోకి వెళ్లాడు. హర్ష్, వన్ష్ హాల్లోనే ఉండటంతో అక్కడి వార్డ్‌రోబ్‌లో ఉన్న హర్ష్ పర్సు నుంచి అతడి డెబిట్ కార్డు తస్కరించాడు. ఏమీ ఎరుగనట్లు బయటకొచ్చి అతను ఫ్లాట్‌లోకి అద్దెకు వస్తున్న విషయం తన తల్లిదండ్రులకు చెప్పాలంటూ హర్ష్ నుంచి సెల్‌ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ కలవట్లేదంటూ కాస్త దూరం వెళ్లిన అతడు.. వారికి ఎస్సెమ్మెస్ పంపిస్తున్నానంటూ మెసేజ్ టైప్ చేస్తున్నట్లు నటిస్తూ ఓ బగ్గింగ్ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేశాడు. ‘పని’పూర్తయిన తర్వాత ఫోన్ ఇచ్చేసి రెండు రోజుల్లో ఫ్లాట్‌లో చేరతానంటూ చెప్పి వెళ్లిపోయాడు. ఏటీఎం నుంచి డబ్బు డ్రా.. హర్ష్ డెబిట్‌కార్డును తీసుకుని శ్రీనివాసరెడ్డి నేరుగా హైటెక్ సిటీలో ఉన్న ఓ ఏటీఎం వద్దకు వెళ్లాడు. డెబిట్ కార్డుతో డబ్బు డ్రా చేయాలంటే పిన్ నంబర్ కావాల్సిందే. దీనికోసం అతడు హర్ష్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన బగ్గింగ్ యాప్‌ను వాడుకున్నాడు. డెబిట్‌కార్డును ఏటీఎంలో పెట్టి పిన్ నంబర్ మార్చాలనే ఆప్షన్ ఎంచుకున్నాడు. సాధారణంగా ఇలా చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అయితే హర్ష్ ఫోన్లోని బగ్గింగ్ సాఫ్ట్వేర్ కారణంగా ఈ సందేశం దుండగుడి ఫోన్‌కే వచ్చింది. అంతే పిన్ నంబర్ మార్చేసి మూడు విడతల్లో హర్ష్ ఖాతాలోని రూ.49,900 కాజేశాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో డబ్బు డ్రాకు సంబంధించిన సందేశాలు ఫోన్‌కు రావడంతో హర్ష్ కార్డు కోసం చూడగా అది కనిపించలేదు. ఫోన్‌ను సరిచూసుకోగా బగ్గింగ్ యాప్ ఇన్స్టాల్ అయినట్లు ఉంది. దీంతో శ్రీనివాసరెడ్డిగా చెప్పుకుని వచ్చిన వ్యక్తే బాధ్యడని అనుమానించిన హర్ష్, వన్ష్ మరుసటి రోజు(ఆదివారం) గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అదుపులో వరంగల్ వాసి.. గచ్చిబౌలి పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని గుర్తించారు. వరంగల్‌కు చెందిన అతడిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఎలాంటి బగ్గింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయలేదని, హర్ష్‌కు చెందిన ఫోన్ ద్వారా తాత్కాలిక పిన్ నంబర్ సృష్టించానని, ఈ నంబర్ వ్యాలిడిటీ కొన్ని గంటలు ఉంటుందని, దాని ఆధారంగానే డబ్బు డ్రా చేసినట్లు అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు. విషయాన్ని బాధితుడు బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. టెంపరరీ పిన్ నంబర్ జనరేషన్ సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. అయితే బగ్గింగ్ యాప్ విషయాన్ని పోలీసులు అంగీకరించట్లేదు. దీంతో ఈ కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఈ పంథాలో అనేక మందిని ముంచి ఉంటాడనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
భార్యభర్తలు కలిసి ఆన్లైన్ చాటింగ్‌తో
భాగ్యనగర్‌కాలనీ: మింగిల్ ఆన్లైన్ ద్వారా చాటింగ్ చేస్తూ ఓ వ్యక్తిని లోబర్చుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలపై కేసు నమోదైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సిఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న కె.రమాకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మింగిల్ ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా కవిత అలియాస్ స్వాతితో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ చాటింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అయితే కవిత అలియాస్ స్వాతి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నాలుగు లక్షల రూపాయలు అవసరముందని రమాకాంత్‌ను వేడుకుంది. దీంతో రమాకాంత్ తన వద్ద అంత డబ్బు లేదని ఈ నెల 9వ తేదీన 5 వేల రూపాయలు నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తిరిగి మళ్లీ అడగడంతో 14వ తేదీన మరో 10 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయగా ఇంతటితో ఆగకుండా అతని వద్ద నుంచి ఎలాగైనా డబ్బులు లాగాలని పథకం వేసిన భార్యభర్తలు సతీష్, స్వాతి చాటింగ్‌లో లక్ష రూపాయలు కావాలని మరోసారి అతనిని వేడుకున్నారు. దీంతో తాను ఇవ్వలేనంటూ తేల్చి చెప్పడంతో ఆన్లైన్ మెసేజ్‌ల ద్వారా అతడిని ప్రేమలోకి దించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ ద్వారా ఒకరికొకరు మెసేజ్‌లు పంపుకున్నారు. ఇంతటితో ఆగకుండా స్వాతి బాండ్ పేపర్లు తీసుకుని మీ ఇంటికి వస్తానని లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరింది. దీంతో అతడు నిరాకరించాడు. అయితే స్వాతి తన భర్తతో డబ్బులు ఇవ్వాలని రమాకాంత్‌తో ఫోన్లో మాట్లాడించింది. దీంతో రమాకాంత్ తాను ఇవ్వలేనని చెప్పడంతో చాటింగ్ ద్వారా మరింత ఒత్తిడి తీసుకువచ్చింది. సెల్ఫోన్లో వారు ఇద్దరు మాట్లాడుకున్న మెసేజ్‌లను భర్త సతీష్ రమాకాంత్ ఇంటికి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే మెసేజ్‌లు బయటపెడితే ఇబ్బందికరంగా ఉంటుందని బెదిరించటమే కాకుండా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో వారి నుంచి వేధింపులు తాళలేక రమాకాంత్ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐటీపై మరింతగా ఖర్చు
ముంబై: ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లపై దేశీ కంపెనీలు ఈ ఏడాది చైనాను మించి ఖర్చు చేయనున్నాయి. ఈ వ్యయాల విషయంలో చైనా వృద్ధి 18.9 శాతం ఉండనుండగా.. భారతీయ ఐటీ కంపెనీల వృద్ధి 19.8 శాతం మేర ఉండనుంది. అయితే, విలువపరంగా చూస్తే మాత్రం చైనా పరిమాణం భారీగా ఉండనుంది. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌పై భారత కంపెనీల వ్యయాలు 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే.. చైనా సంస్థల వ్యయాలు ఏకంగా 5.1 బిలియన్ డాలర్ల మేర ఉంటాయని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ ఒక నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత స్థాయిలో కాకుండా.. కంపెనీల స్థాయిలో ఉపయోగించే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌పై ఇరు దేశాల వ్యయాలు చాన్నాళ్లుగా రెండంకెల స్థాయిలోనే ఉంటోందని, ఇకపైనా ఈ ధోరణి కొనసాగనుందని గార్ట్నర్ రీసెర్చ్ డైరెక్టర్ కీత్ గట్రిడ్జ్ తెలిపారు. -
అలరించిన డెమో షో..
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని క్రికెట్ ఆట శాసిస్తుందంటే అతిశయోక్తి కాదు. నేడు చిన్న పిల్లల నుంచి వృద్ధులకు వరకు టీవీల్లో క్రికెట్ వస్తుందంటే బయట అడుగుపెట్టకుండా టీవీలకే అత్తుకుపోతారు. అంతటి క్రేజ్ గల క్రికెట్ ఆటకు నూతన ఓరవడినందిస్తూ సరికొత్తగా వర్చువల్ రియాల్టీ (కాల్పనిక) క్రికెట్‌కు రూపకల్పన చేశారు. ఐఐటీ ఢీల్లీలో విద్యను పూర్తి చేసిన సిద్దిపేటకు చెందిన త్రివిక్రం, హైదరాబాద్‌కు చెందిన వసంతసాయి సాంకేతిక విద్యనభ్యసించి ప్రోయుగా అనే సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ప్రోయుగా కంపెనీకి సీఈఓగా భాద్యతలు నిర్వర్తిస్తున్న త్రివిక్రం రూ.కోటి జీతాన్ని అందించే కొలువును సైతం వదులుకుని ప్రపంచానికి తన మేధా శక్తి అందించాలనే తపనతో తొమ్మిది నెలలు శ్రమించి ‘ఇంపాక్ట్ బిలియన్’ అనే సందేశంతో వర్చువల్ రియాల్టీ క్రికెట్‌ను ఆవిష్కరించాడు. ఆడుతున్న అనుభూతి... ప్రోయుగా కంపెనీ ద్వారా రూపొందించిన స్టార్టప్ ఐబీ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో ఆహ్లాదకరమైన మైదానంలో చుట్టూ ప్రేక్షకులు, బరిలో క్రీడాకారులు, బంతిని విసురుతున్న బౌలర్‌ను తలపిస్తూ బ్యాటింగ్ చేస్తున్న అనుభూతిని అందిస్తుంది. కళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెడ్సెట్, కస్టమ్ బ్యాట్, సెన్సార్లను ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సాప్ట్వేర్ల అనుసందానంతో హెడ్‌సెట్‌ను ధరించినప్పుడు దానికి అనుసంధానంగా ఉన్న మానీటర్లో కనిపించే అంతర్జాతీయ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న అనుభూతితో క్రికెట్లో లోకంలో విహరిస్తారు. నిజంగా బౌలింగ్‌కు ఎదురొడ్డి బ్యాటింగ్ చేస్తున్నట్లుగా సిక్సర్లు కొడుతారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ప్రోయుగా తన స్టార్టప్ వీఆర్ క్రికెట్ విశేషంగా అలరించింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆసక్తిగా ఐబీ క్రికెట్‌ను ఆడేందుకు ఉత్సాహాన్ని చూపారు. వీస్పోర్ట్గా ప్రపంచానికి వర్చుయల్ క్రికెట్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు గాను ఏప్రిల్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాబోవు రోజుల్లో ప్రస్తుతం ఆదరణ పొందుతున్న క్రీడల మాదిరిగా వర్చుయల్ క్రికెట్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రోయుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం... ఫిబ్రవరి 22న లక్నోలో నిర్వహించిన ఐటీ ఇన్వెస్టర్స్ సమీట్లో భాగంగా ప్రోయుగా రూపొందించిన ఐబీ క్రికెట్‌ను రాష్ట్రపతి రాంనా«థ్ కోవింద్ తొలి బ్యాటింగ్‌తో ప్రారంభించారు. యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, యూనియన్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ బ్యాట్‌పై తొలి సంతకం చేశారు. వీస్పోర్ట్స్‌గా ప్రపంచానికి... ప్రోయుగా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన ఐబీ క్రికెట్‌ను వీస్పోర్ట్స్‌గా ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు కృషిచేస్తున్నాం. ప్రఖ్యాత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంచి ఆదరణ సాధిస్తుందని అభినందించా రు. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వీస్పోర్ట్స్‌గా ఐబీ క్రికెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఏప్రిల్‌లో 25 వేల ఐబీ క్రికెట్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. – నీరధ్, వినోద్కర్, పంకజ్,ఐబీ క్రికెట్ నిర్వాహకులు -
మద్యం మత్తులో డ్రైవింగ్..ఒకరి మృతి
-
ఇక హిందీలోనూ ‘గూగుల్ అసిస్టెంట్’
శాన్ఫ్రాన్సిస్కో: 2018 చివరికల్లా హిందీ సహా 30కిపైగా భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం హిందీ సహా డానిష్, డచ్, ఇండోనేషియన్, నార్వేజియన్, స్వీడిష్, థాయ్ భాషల్లో గూగుల్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఒకే వ్యక్తి వేర్వేరు భాషల్లో ఇచ్చే ఆదేశాలను పాటించేలా ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు. ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా హోమ్‌పేజ్ బటన్‌ను కొద్దిసేపు నొక్కిపట్టుకోవడం లేదా ‘ఓకే గూగుల్’ అని చెప్పడం ద్వారా ‘గూగుల్ అసిస్టెంట్’ను యాక్టివేట్ చేయవచ్చు. -
కోర్సుల కోట అమీర్‌పేట
-
భార్యను చంపి.. అడవిలో దహనం
సాక్షి, కర్ణాటక(జయనగర) : కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ ఇంజినీరు భార్యని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భర్త చంద్రకాంత్, అతని స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ను శనివారం సంపంగి రామనగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.... శాంతినగరలో సి ల్వర్‌స్టోన్ హోటల్ నిర్వహిస్తున్న చంద్రకాంత్ అనే వ్యక్తి, అక్షిత (30)ను పదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమె ఉద్యోగం మానేసింది. హెబ్బాల సమీపంలోని అపార్టుమెంటులో నివాసముంటున్నారు. వీరికి నాలుగేళ్ల కొడుకు. దంపతులు అప్పుడప్పుడు గొడవపడుతుండేవారు. జనవరి 6వ తేదీన ఇలాగే గొడవ పడగా, చంద్రకాంత్ భార్య గొంతు పిసికి చంపేశాడు. స్నేహితుడు రాజ్‌వీర్‌సింగ్‌ను పిలిపించి రాత్రివేళ ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని తమిళనాడు సరిహద్దులో సూలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామనదొడ్డి అటవీప్రాంతంలో మృతదేహాన్ని పడేసి డీజిల్ పోసి దహనం చేశారు. ఆమె ఫోన్‌ను తీసుకుని చంద్రకాంత్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు వెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కదిలిన డొంక గత కొద్దిరోజులుగా కుమార్తె అక్షితకు ఆమె తల్లిదండ్రులు పలుమార్లు పోన్ చేసినప్పటికీ రీచ్ కాకపోవడంతో అనుమానం వచ్చి జనవరి 23 తేదీన సంపంగిరామనగర పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తె అదృశ్యమైనట్లు పిర్యాదు చేశారు. అక్షిత, చంద్రకాంత్ ఇద్దరూ అప్పుడప్పుడు గొడవపడే విషయాన్ని పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు ఆమె ఫోన్ ఎక్కడ ఉందోనని చూడగా పంజాబ్, యూపీ, రాజస్థాన్‌లలో సంచరించినట్లు తేలింది. చంద్రకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉండేదని, ఆమె విపరీతంగా మద్యం సేవించేదని, భరించలేక తాను ఆమె ను హత్యచేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. అతని మిత్రుడు రాజ్‌వీర్‌సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. -
ఈ–ప్రగతి ప్రాజెక్టుకు పెగా సాఫ్ట్వేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్ ‘ఈ–ప్రగతి’కి సాంకేతిక సేవలందించే ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ–ప్రగతి పోర్టల్ ద్వారా 33 ప్రభుత్వ విభాగాలు, 315 ఏజెన్సీలు, 745 పౌర సేవల్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,398 కోట్లు. ఒకే పోర్టల్ ద్వారా ఆన్లైన్లో పౌర సేవల్ని అందించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఈ–ప్రగతి సీఈవో ఎన్.బాలసుబ్రమణ్యం చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ కావడంతో ఏపీలో డిజిటైజేషన్‌కు ఇది ఊతమిస్తుందని, అన్ని విభాగాలపై నియంత్రణ ఉంటుందని తెలియజేశారు. కాగా, భారత్‌లో పెగాసిస్టమ్స్‌కు ఇదే తొలి ప్రాజెక్టు కావడం విశేషం. భారత మార్కెట్‌పై ఇప్పుడు ఫోకస్ చేశామని, ఇటీవలే ముంబైలో సేల్స్ కార్యాలయాన్ని ప్రారంభించామని పెగాసిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3,000 పైగా కంపెనీలకు సాఫ్ట్వేర్ సర్వీసులందిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో 1,500 మంది పనిచేస్తున్నారు. నియామకాలు నిరంతర ప్రక్రియ అని ఆయన తెలియజేశారు. -
ఫోన్ దొంగలు దొరికిపోయారు..
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): దొంగలకు కొత్త టెక్నాలజీ చెక్ పెట్టింది.. ఫోన్ దొంగలు దొరికిపోతున్నారు.. సిగ్నల్ లోకేషన్ సాఫ్ట్వేర్ రాకతో ఇట్టే దొరికిపోతున్నారు. ఫోన్ దొంగిలించి పరిపోతుండగా టెక్నాలజీ ఆధారంగా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన సోమవారం రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. సత్యనారాయణపురానికి చెందిన పాతనేని పృధ్వీ సోమవారం తెల్లవారుజామున చైన్నె నుంచి రైలులో విజయవాడ స్టేషన్లో దిగాడు. స్టేషన్ బయటికి వచ్చిన తరువాత ఇంటికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇది గమనించిన ముగ్గురు వెనుక నుంచి బైక్‌పై వచ్చి ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. పోలీసులకు సమాచారం.. తేరుకున్న పృధ్వీ ఇంటి చేరుకోగానే తన వద్ద నుంచి సెల్ఫోన్లో ఏర్పాటు చేసుకున్న సిగ్నల్ లోకేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ముగ్గురు యువకులు కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆంజనేయ వాగు, జోడు బొమ్మల సెంటర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఫోన్ లాక్కుని వెళ్లిన యువకులతో పాటు వారు ఉపయోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
ఘోర ప్రమాదం.. ఫేస్బుక్ ఉద్యోగుల మృతి
-
ఘోర ప్రమాదం.. ఫేస్బుక్ ఉద్యోగుల మృతి
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో ఘోర ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఓ కారు చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఆదివారం వేకువజామున చేవెళ్ల మండలం మీర్జాగూడా మలుపు వద్ద ఆల్టో కారు మర్రిచెట్టును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతులను ప్రవీణ్, డేవిడ్, అర్జున్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి పేరు శ్రావణ్ అని.. అతని రెండు కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తోంది. వీరంతా ఫేస్బుక్ సంస్థలో పనిచేసే ఉద్యోగులని పోలీసులు నిర్ధారించారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్‌గా బిజినెస్..
సాక్షి, హైదరాబాద్ : పెద్దమొత్తంలో జీతాలు పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టైంది. ముఠాలో ప్రధాన సూత్రధారితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులు పట్టుబడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్ ప్రాంతంలో గల ఓ ఖరీదైన అపార్ట్మెంట్లో కొన్నేళ్లుగా వ్యభిచారకలాపాలు జరుగుతున్నాయి. పక్కా సమాచారంతో పోలీసులు మంగళవారం ఆ అపార్ట్‌మెంట్‌పై దాడిచేశారు. దందా నిర్వాహకుడితోపాటు ముంబై, కోల్‌కతా, గోవా రాష్ట్రాలకు చెందిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, గడిచిన రెండేళ్లుగా బిజినెస్ నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. అరెస్టైన వ్యక్తి పేరు షేక్ ఫహద్ అని, ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో ఏడుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సదరు అపార్ట్మెంట్ యజమాని ముంబైలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మిగతావారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. -
ఐటీ హబ్‌గా తిరుపతి
రేణిగుంట: తిరుపతిని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ జోహో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నలుగురు భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒకరు ఏపీకి చెందిన వారన్నారు. రాష్ట్రంలో తాము ఐటీ కంపెనీలతో పోటీపడుతూ టైం గవర్నెన్స్ చేస్తూ మార్చి నెలాఖరుకల్లా పేపర్‌లెస్ కార్యాలయాలను తయారు చేస్తామన్నారు. జోహో కంపెనీ తిరుపతిలో నెలకొల్పడం సంతోషకరమన్నారు. మౌళిక వసతులను అభివృద్ధి చేసుకునేందుకు ఎంతభూమి, ఎక్కడ అవసరమో చెప్పాలని, ఆ మేరకు వెంటనే ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. విశాఖ, అమరావతి, తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వివరించారు. అమెరికాలో సిలికాన్‌వ్యాలీ లాగా విశాఖ నుంచి అనంతపురం వరకు ఆంధ్రావ్యాలీగా అభివృద్ధి చేస్తామన్నారు. తర్వాత సీఎం తిరుపతి మంగళం వద్ద ఐటీ టెక్‌హబ్ ఏజీఎస్ హెల్త్ ఐటీ కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రులు లోకేశ్, అమర్నాథ్రెడ్డి, ఎంపీ శివప్రసాద్, ఐటీశాఖ రాష్ట్ర కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జోహో కంపెనీ సీఈవో శ్రీధర్ వెంబు, చీఫ్ ఎవాంజలిస్ట్ రాజు వేగ్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని అమీన్‌పుర్ పీఎస్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దొంగలు భారీ చోరీ చేశారు. స్థానికంగా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంటి గోడకు కన్నం పెట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ మొత్తంలో నగదు అపహరించుకుపోయారు. చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలిని పరిశీలించిన క్లూస్‌టీం ఆధారాలు సేకరిస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భూమి @ కొత్త సాఫ్ట్వేర్!
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం సరిచేసిన రికార్డులను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. భవిష్యత్తులో భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పారదర్శకంగా జరిపేం దుకు వీలుగా వెబ్‌ల్యాండ్ స్థానంలో ఈ సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను అందుబాటులోకి తేవా లని నిర్ణయించింది. ఇందుకు సీఎం కార్యాలయ అధికారులు ఇటీవల పలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వారం రోజుల్లో పోర్టల్ తయారీకి సాఫ్ట్వేర్ సంస్థల నుంచి టెండర్లు పిలవాలని, 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వెబ్‌ల్యాండ్.. ఇక పాత ముచ్చటే ప్రస్తుతం రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్ అనే పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ డేటా ఆధారంగానే భూముల మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వల్ల మ్యుటేషన్ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూడిన పోర్టల్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం కార్యాలయంలో సీనియర్ అధికారి టి.నర్సింగరావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, వాకాటి కరుణతో పాటు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు రఘునందన్‌రావు, వెంకట్రామిరెడ్డి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, జి.రవితో సమావేశం నిర్వహించారు. అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈ పోర్ట ల్ తయారీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్లాంటి కంపెనీలే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు. దీనినే భవిష్యత్తులో భూరికార్డుల నిర్వహణకు ఉపయోగించనున్నారు. బ్యాంకులకు, జనబాహుళ్యానికి కూడా ఈ పోర్టల్‌ను రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించే తహశీల్దార్ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులు, జాతీయ బ్యాం కులకు కూడా అనుసంధానం చేయనున్నారు. పంట రుణాలిచ్చే విషయంలో బ్యాంకులకు ఈ పోర్టల్‌లోని డేటానే ఆధారమయ్యేలా తయారు చేయనున్నారు. మ్యుటేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులో ముగిసేలా పోర్టల్‌ను రూపొందించడంతో పాటు జన బాహుళ్యానికి కూడా సులువుగా రికార్డుల వివరాలు అందుబాటులోకి వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇప్పటికే దాదాపు భూరికార్డుల ప్రక్షాళన పూర్తి కాగా, ఈ వివరాలను ఎల్‌ఆర్‌యూపీ వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇందులోని వివరాలను కొత్త పోర్టల్‌లోకి మార్చనున్నారు. ఈ పోర్టల్ తయారీకి కనీసం మరో 2 నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో జనవరి 26 నుంచి చేపట్టనున్న కొత్త పాస్ పుస్తకాల జారీకి మాత్రం ఎల్‌ఆర్‌యూపీలో నమోదైన డేటానే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయాన్ని కొత్త పోర్టల్‌లోని డేటా ఆధారంగానే అందించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
200 మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు
-
ఇన్ఫీ కొత్త సీఈవో జీతమెంతంటే...
-
భర్తనే కడతేర్చిన భార్య
-
‘తత్కాల్’ సాఫ్ట్వేర్లపై సీబీఐ దృష్టి
న్యూఢిల్లీ: అక్రమ సాఫ్ట్‌వేర్‌తో రైల్వే తత్కాల్ టికెట్ల కుంభకోణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ తరహా సాఫ్ట్వేర్లపై సీబీఐ దృష్టి సారించింది. సీబీఐలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ ‘నియో’ పేరిట అక్రమ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన అజయ్ గార్గ్ అనే వ్యక్తిని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాఫ్ట్వేర్లతో పీఎన్ఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఒకేసారి పలు యూజర్ ఐడీలతో పెద్దమొత్తంలో టికెట్లు పొందే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆటో ఫిల్ విధానంలో ఈ సాఫ్ట్వేర్లు పనిచేయడంతో తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు టికెట్లను పొందుతున్నారని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. ఈ తరహా సాఫ్ట్వేర్లపై దృష్టి సారించామని, ఎవరైనా తప్పుచేశారని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అక్రమ సాఫ్ట్వేర్ వినియోగించడం నేరమని, సాఫ్ట్వేర్ల ద్వారా పొందిన టికెట్లను ఏజెంట్లు అధిక ధరకు విక్ర యిస్తూ పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. -
పెట్రోల్ బంకుల్లో చేతివాటం!
పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ సవరణలో ‘పాయింట్ల’ గోల్‌మాల్‌తో వాహనదారులు దోపిడీకి గురవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పుల వెసులుబాటు డీలర్లకు కాసులు కురిపిస్తోంది. ఇంధనం పాయింట్ల రూపంలో తక్కువగా పంపింగ్ జరుగుతుండటంతో వినియోగదారులు రూ.100కు సగటున రూ.2 నష్టపోతున్నారు. జూన్ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి పెట్రో ధరలు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ధరల పెంపు కొనసాగుతోంది. కేవలం ఎప్పు డో ఒకసారి ధరలు తగ్గినా అది నామమాత్రమే. గతంలో 15 రోజులకు ఒకసారి ధరలు పెరిగినప్పుడు వాటి ప్రభావం స్పష్టంగా కనిపించేది. ప్రస్తుతం రోజువారీ సవరణలతో పైసాపైసా పెరిగి వినియోగదారులపై కనిపించని భారం పడుతోంది. అంతా సాఫ్ట్వేర్ మహిమ.. పెట్రోల్ పంపింగ్ మెషిన్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులచేర్పుల వెసులుబాటే డీలర్లు అక్రమాలు చేసేందుకు ఊతమిస్తోంది. రోజువారీ ధరల పెంపు విధానం అమలు చేసినప్పటి నుంచి పెట్రోల్ బంకుల ఆధునీకరణ జరగలేదు. అత్యధిక బంకులు మాన్యువల్‌గానే ధరలు మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలోని చాలా బంకుల్లో ఉన్న మెషిన్లు పాతవే. రోజువారీ ధరల సవరణ ప్రకారం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రో ధరల సవరణ జరుగుతుంది. చమురు సంస్థలు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ముంబైలో ధరలు మార్చగానే, ఇక్కడ ఆధునీకరించిన బంకుల్లో యథాతథంగా ధరలు మారుతాయి. సాధారణ (మాన్యువల్) బంకుల్లో మాత్రం డీలర్లకు సవరణ ధర మొబైల్ సంక్షిప్త సమాచారం, ఆన్లైన్ పోర్టల్ ద్వారా చేరుతోంది. వీరు ధరలు మార్చాల్సి ఉంటుంది. ధరలు పెరిగినప్పుడు వెంటనే మార్చుతున్న డీలర్లు... తగ్గినప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దోపిడీ ఇలా.. వాహనదారులు పెట్రోల్, డీజిల్ సాధారణంగా రూపాయల్లో పోయించుకుంటారు. కానీ చమురు సంస్థలు లీటర్లలో లెక్క కట్టే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. దీంతో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. బంకుల్లో లీటర్ల చొప్పున కాకుండా రూ.100–రూ.500 వరకు పోయించుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకు తగ్గట్టు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉంది. సాఫ్ట్వేర్ రూపొందించే క్రమంలో రూపాయికి సమీపం(నియరెస్ట్ టు రుపీ)గా తీర్చిదిద్దారు. ఇదే డీలర్లకు కలిసి వస్తోంది. పంపింగ్‌లో పాయింట్లు తగ్గి వాహనదారులకు నష్టం తప్పడం లేదు. దీంతో రూ.100కు కనీసం రూ.2 నష్టపోతున్నారు. -
కోర్టుకు హాజరై వెళుతుండగా..
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న ఉద్యోగిపై పదునైన కత్తులతో దుండగులు దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. హత్య అనంతరం దుండగులు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. నేరేడ్మెట్లోని మల్కాజిగిరి కోర్టు, డీసీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో వినోభానగర్ మార్గంలో శుక్రవారం జరిగిన ఈ దారుణహత్య స్థానికం గా కలకలం సృష్టించింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలే ఈ హత్యకు దారితీసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దంపతుల మధ్య మనస్పర్థలు: మృతుని తల్లిదండ్రులు, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి కథనం ప్రకారం.. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం సమీపంలో రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్ఐ ఎంజాల శ్రీధర్, భార్య సంధ్య, కొడుకు ఎంజాల చందర్(32)తో కలసి నివసి స్తున్నారు. చందర్ గచ్చిబౌలిలోని ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన సుహాసినితో 2010లో అతనికి వివాహం జరిగింది. అయితే కొంతకాలానికే దంపతుల మధ్యలో గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. హత్య జరిగిందిలా.. మనస్పర్థలతో చందర్, సుహాసిని విడిపోయా రు. 2012 నుంచి వీరి మధ్య మల్కాజిగిరి కోర్టులో విడాకుల కేసు, సిటీ సివిల్, ఎస్సీ, ఎస్టీ కోర్టుల్లో మూడు కేసులు కొనసాగుతున్నాయి. శుక్రవారం చందర్ తల్లిదండ్రులతో కలసి మల్కాజిగిరి కోర్టు కేసు విచారణ కోసం శుక్రవారం ఉదయం వచ్చారు. కోర్టు సమీపం లోని వినోభానగర్ నుంచి కాకతీయ నగర్‌కు వెళ్లే మార్గం(కల్లు దుకాణం సమీపం)లో తమ కారును పార్క్ చేసి కోర్టుకు వెళ్లారు. 11.30 గంటల సమయంలో తిరిగి వెళ్లేందుకు చందర్ తల్లిదండ్రులతో కలసి కారు వద్దకు వచ్చారు. తల్లిదండ్రులు కారులో కూర్చున్నారు. బావా.. బావా అంటూ వచ్చి.. అదే సమయంలో వెనుక నుంచి బావా.. బావా అంటూ కొందరు పిలుస్తూ కారు వద్దకు వచ్చారు. వచ్చిన వ్యక్తులు ఏదో మాట్లాడుతుం డగా చందర్ పట్టించుకోకుండా కారు ఎక్కేందు కు డోర్ తీస్తుండగా వెనుక నుంచి కత్తితో దాడి జరిగింది. చందర్ వారిని ప్రతిఘటించే ప్రయ త్నం చేశాడు. మరికొందరు దుండగులు కత్తుల తో అతనిపై దాడికి తెగబడ్డారు. కారులో ఉన్న తల్లిదండ్రులు కేకలు వేస్తూ కిందకు దిగారు. తమ కుమారునిపై దాడి చేయొద్దని ప్రాధేయ పడినా దుండగులు జాలి చూపలేదు. మెడ కింది భాగం, గొంతు పక్కన, తలపై కత్తులతో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై చందర్ కుప్ప కూలి అక్కడికక్కడే కన్నుమూశాడు. అనంత రం నిందితులు కాకతీయనగర్ వైపు దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఒక సంచిలో నిందితులు వాడిన కత్తులను గుర్తించింది. ప్రధాన నిందితునిగా అనుమాని స్తున్న వినయ్ మినహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రాధేయ పడినా వినలేదు: చందర్ తల్లిదండ్రులు తమ ఎదుటే కన్నకొడుకు విగతజీవిగా మారడంతో చందర్ తల్లిదండ్రులు శ్రీధర్, సంధ్య గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. తమ కొడుకు చందర్‌పై మల్కాజిగిరికి చెందిన వినయ్(బావమరిది)తోపాటు నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారని వారు పోలీసులకు వివరించారు. కోర్టు పరిసరాల నుంచి కారు వరకు తమను అనుసరిస్తూ వచ్చిన దుండగులు తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని, ఎంత ప్రాధేయపడినా వినలేదని కన్నీరుమున్నీరయ్యారు. నిందితుల కోసం గాలింపు: ఏసీపీ చందర్ హత్య కేసులో అతని భార్య సోదరుడు వినయ్, మరికొంత మంది ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ కృష్ణమూర్తి విలేకరులకు వివరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు. -
చివరికి మిగిలింది!
ఎన్ఆర్ఐ చిన్నారావుకి మళ్లీ వెనక్కి వెళ్లాలనిపించలేదు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనిపించనూ లేదు. సెలవులు గడపడానికి హైదరాబాద్‌కు వచ్చిన చిన్నారావు మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు ఎన్నో తెలుగు సినిమాలు చూశాడు. ఆ జోష్‌లో ‘నేనెందుకు డైరెక్టర్ కాకూడదు?’ అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం రంగంలోకి దిగాడు. నిర్మాత మరియు దర్శకుడి అవతారం ఎత్తాడు. తన తొలి ప్రెస్మీట్లో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు...‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ఇది. కథ విషయానికి వస్తే పూజా అనే అమ్మాయిని కూజ అనే అబ్బాయి ప్రేమిస్తాడు. హీరో పేరు కూజ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? హీరో పూర్తి పేరు కూరపాటి జయంత్. షార్ట్‌కట్‌లో కూజ అని పిలుస్తుంటారు. పూజా వాళ్ల డాడీ పేరు బాడి...అతని పూర్తి పేరు బాపయ్య డింగరి...షార్ట్ కట్లో ‘బాడి’ అని పిలుస్తుంటారు. తన కూతురును కూజ ప్రేమించడం ఈ ‘బాడి’కి నచ్చదు. ఈ కోపంతో ‘కూజ’ డెడ్‌బాడీని తీసుకురమ్మని గూండాలను టాటా సుమోల్లో పంపుతాడు. ఇలా ఎన్నో కుట్రలను తట్టుకొని పూజా–కూజ ఒక్కటవుతారు. ప్రేమ గెలుస్తుంది. వారికి మానసిక సంతృప్తి మిగులుతుంది. అందుకే సినిమా పేరు ‘చివరకు మిగిలింది’ అని పెట్టాను’’ మరుసటి రోజు అబ్బులు అనే యువకుడు ఫిలింఛాంబర్ ముందు ధర్నాకు దిగాడు. చిన్నారావుపై నిప్పులు చెరుగుతూ ప్రసంగించడం మొదలుపెట్టాడు... ‘‘నిన్న చిన్నారావు అనే డైరెక్టర్ ప్రెస్మీట్లో చెప్పిన కథ నాదే. నా కథను కాపీ కొట్టి చివరికి మిగిలింది అనే సినిమా తీస్తున్నాడు. ఇది అన్యాయం, అక్రమం. ఇలా నాలాంటి కొత్త రచయితలను అణగదొక్కవచ్చా అని ప్రశ్నిస్తున్నాను’’ ‘‘ఇంతకీ నీ కథ ఏమిటి?’’ అని అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి. ‘‘నా కథలో రోజా అనే అమ్మాయిని రాజా అనే అబ్బాయి ప్రేమిస్తాడు. హీరోయిన్ తండ్రికి వీరి లవ్ ఎఫైర్ నచ్చక పది ట్రాక్టర్లలో గూండాలను పంపి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు... అయినా సరే వారు ఒక్కటవుతారు. వారి ప్రేమ జయిస్తుంది. సదరు చిన్నారావు రోజాకు బదులు పూజ అని, రాజాకు బదులు కూజ అని పేర్లు మార్చుకున్నాడు. గూండాలు ట్రాక్టర్లలో వెళ్లి హీరోపై ఎటాక్ చేస్తారు అని నేను రాసుకుంటే, దాన్ని టాటాసుమోలుగా మార్చాడు. ఇంతకంటే పచ్చి కాపీ మరొకటి ఉంటుందా!’’అబ్బులు గోల భరించలేక ఈ వివాదంపై ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు సినీ పెద్దలు. రెండు రోజుల తరువాత ఆ కమిటీ చీఫ్ ఇలా తీర్పు చెప్పాడు...‘‘రెండు కథల్ని క్షుణ్ణంగా పరిశీలించాము. రెండు కథలు ఒకేలా ఉన్నాయి. అసలు ఈ రెండు కథలని ఏమిటి? మన సినిమా కథలన్నీ ఇలాగే ఉంటాయి. ఒక విలన్ తప్పనిసరిగా ఉంటాడు. అతనికొక కూతురు తప్పనిసరిగా ఉంటుంది. ఆ కూతురును బీదింటి కుర్రాడొకడు తప్పనిసరిగా లవ్ చేస్తాడు. ఈ కుర్రాడి మీద ఆ విలన్ తప్పనిసరిగా దాడి చేస్తాడు. అయినా సరే... ఆ జంట తప్పనిసరిగా ఒక్కటవుతుంది.... ఈ తప్పనిసరి ఫార్ములా ఉన్నంత వరకు ఏ కథ దేనికి కాపీ కాదు...అన్నీ ఒకేలా అనిపిస్తాయి’’మొదటి గండం నుంచి బయట పడ్డాడు చిన్నారావు. ఊపిరి పిల్చుకునే లోపే మరో ఉపద్రవం ముంచుకొచ్చింది.‘చివరకు మిగిలింది’ టైటిల్ నాదే అంటూ రాబోయే కాలంలో కాబోయే నిర్మాత కామేశ్ కోర్టుకెక్కాడు. ‘‘చివరకు మిగిలింది అనే టైటిల్ నాకు తెగ నచ్చేసింది. కానీ ఇంతకుముందే ఎవరో టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్నారట. ఏమిటి పరిష్కారం?’’ అని సినిమా ఫీల్డ్‌లో తలపండిన సీనియర్ నిర్మాతను సలహా అడిగాడు చిన్నారావు.‘‘చాలా సింపుల్. టైటిల్‌కు ముందు నీ పేరు చేర్చితే సరిపోతుంది. అయితే నీ పేరు టైటిల్ మీద కనిపించీ కనిపించనట్లు ఉండాలి. నీ పేరు పుణ్యమా అని టైటిల్ కొత్తది అవుతుంది. అది నీదే అవుతుంది. ఒక డైరెక్టర్‌గా ఈ సినిమా వల్ల నీకు గొప్పతృప్తి మిగులుతుంది కాబట్టి ఇక నీ సినిమా పేరు ‘చిన్నారావుకి చివరికి మిగిలింది’ అని పెట్టు’’ అని సలహా ఇచ్చాడు. అలాగే చేశాడు చిన్నారావు.ఆరేడు నెలల్లో సినిమా పూరై్త... ఒక శుక్రవారం రోజు విడుదల కూడా అయింది. చిన్నారావుకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.కొంతమంది వ్యక్తులు ప్రెస్‌మీట్ పెట్టి ‘చివరకు మిగిలింది’ డైరెక్టర్ మీద విరుచుకుపడుతున్నారు. ఒకవ్యక్తి కోపంగా మైక్ అందుకొని...‘‘ఈ సినిమాలో ‘తాట తీస్తా నా కొడుకా’ అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ మా మనోభావాలను భయంకరంగా దెబ్బతీసింది. తాట అంటే మీకు అంత చిన్నచూపా? అదేమన్నా చెప్పులో ముళ్లా, చెవులో పువ్వా తీయడానికి... గుర్తుంచుకోండి తాట అంటే గుండ్రాయి కాదు... అంతెత్తు కొండ. ఎవడు కదలించలేడు. ఆకాశంలో తారలు ఉన్నంత వరకు ఈ భూమి మీద తాట ఉంటుంది...తాటను టచ్ చేయాలనుకోకండి... తట్టుకోలేరు’’ అంటూ ఆవేశంగా ప్రసంగించాడు. ఈలోపు ఒక టీవీ రిపోర్టర్ బుర్ర గోక్కుంటూ... ‘‘అయ్యా... తాట తీస్తా అనే డైలాగ్‌కు మీ మనోభావాలు దెబ్బతినడానికి సంబంధం ఏమిటో అప్పటి నుంచి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు’’ అన్నాడు.అప్పుడు ఆ గుంపులో ఒకరు ఇలా బదులిచ్చారు...‘‘తాట అనేది మా అప్పడాల కంపెనీ పేరు’’‘‘అప్పడాల కంపెనీకి తాట అని పేరు పెట్టడం ఏమిటండీ?’’ మరోసారి ఆశ్చర్యంగా అడిగాడు టీవీ రిపోర్టర్.అప్పుడు ఆ గుంపులో మరొకరు ఇలా బదులు ఇచ్చారు...‘‘మా కంపెనీ పేరు ‘టేస్టీ హాట్ అమెజింగ్ ట్రెమండస్ అప్పడాలు’ షార్ట్‌కట్‌గా తాట అయింది. ఈ పేరుతోనే ఫేమస్ అయింది. ఎన్నో సంవత్సరాలుగా భోజనప్రియులను అలరిస్తున్న మా తాటను తీస్తాననడం ఎంత వరకు సమంజసం? ఇది మా మనోభావాలను దెబ్బతీసినట్లు కాదా?’’ తాట కంపెనీ వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ‘తాట తీస్తా’ డైలాగును సినిమా నుంచి తీసేశారు.ప్రేక్షకుల ఆరోగ్యం మీద ప్రేమతో ‘చివరకు మిగిలింది’ వారం తిరిగేలోపే థియేటర్ల నుంచి తిరుగుపయనమైంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి రావడంతో...మళ్లీ అమెరికాకు ప్రయాణమయ్యాడు చిన్నారావు. వెళ్లేముందు ఒకసారి తన సినిమా పోస్టర్ చూసుకోవాలనిపించింది. ఇంట్లో గోడకు అతికించిన ఆ పోస్టర్ వైపు ఒకసారి చూశాడు.పోస్టర్లో ‘చిన్నారావుకు చివరికి మిగిలింది’ అనే టైటిల్ కింద ‘చిప్ప’ అని రాసి విషాదంగా నవ్వుకున్నాడు చిన్నారావు. – యాకుబ్ పాషా -
ప్రేమ విఫలమై సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని రాంనగర్ ప్రేమ విఫలమై శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే బాలాజీ ప్రతాప్ అనే యువకుడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి అంగీకరించక పోవడంతో మనస్థాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాలాజీ ఆత్మహత్యపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హెల్త్‌కేర్–సాఫ్ట్వేర్ రెండూ ప్రధానమే!
హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో: ఇటు హెల్త్‌కేర్‌తో పాటు అటు సాఫ్ట్వేర్ రంగంలోనూ దేశీయంగా మంచి వృద్ధి కనబరుస్తామని హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న ‘విరించి లిమిటెడ్’ స్పష్టంచేసింది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి తమ సంస్థ అభివృద్ధి చేసిన ఫిన్ టెక్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో రాణిస్తున్నాయంటూ.. డిజిటల్ పేమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగానూ వీటిని ప్రవేశపెడతామని సంస్థ ఛైర్మన్ విశ్వనాథ్ కొంపెల్ల చెప్పారు. వచ్చే మూడు నాలుగేళ్లలో దేశీయంగా వీటిద్వారా మెరుగైన వృద్ధిని ఆశిస్తున్నట్లు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలియజేశారు. సంస్థ విస్తరణ ప్రణాళికలతో పాటు పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... హెల్త్కేర్లోకి కొత్తగా వచ్చారు కదా? ఎలా ఉంది? మాకు బర్కత్‌పురాలో 60 పడకలు, హయత్‌నగర్‌లో 140 పడకల ఆసుపత్రులు ఇప్పటికే ఉన్నాయి. ఇక బంజారా హిల్స్‌లో 350 పడకల (తొలిదశ) ఆసుపత్రిని గతేడాదే ఆరంభించాం. కాకపోతే ఆ రెండు ఆసుపత్రులనూ విరించిలో ఇప్పుడు విలీనం చేశాం. ప్రస్తుతానికి ఈ విభాగం నుంచి ‘ఎబిటా’ సానుకూలంగా ఉంది. అంటే నిర్వహణ లాభాల్లోనే ఉన్నట్లు చెప్పొచ్చు. ఈ విభాగం నికరలాభం ఆర్జించడానికి మాత్రం కొంత సమయం పట్టొచ్చు. ఈ రంగం నుంచి ఆదాయం ఎంతొస్తోంది? రెండో త్రైమాసికంలో ఈ రంగం రూ.85 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఇక కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే ఎబిటా రూ.140 కోట్లుగా ఉంది. మొత్తంగా చూసినపుడు రెండో త్రైమాసికంలో రూ.8 కోట్లు లాభం ఆర్జించాం. మీది మొదట సాఫ్ట్వేర్ కంపెనీ కదా!! ఆ విభాగం ఎలా ఉంది? మాకు హకీంపేటలో 10 ఎకరాల క్యాంపస్ ఉంది. అందులో ప్రధానంగా ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మా చేతిలో ఫిన్‌టెక్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులున్నాయి. అవి అమెరికాలో చక్కని పనితీరు కనబరుస్తున్నాయి. ఫిన్‌టెక్ అంటే... మీరు సాఫ్ట్వేర్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారా? అదేం లేదు. మా ఉత్పత్తుల ద్వారా ఫైనాన్షియల్ సేవలందిస్తున్నాం. ఉదాహరణకు మా ఉత్పత్తుల్లో ‘క్యూఫండ్’ ఒకటి. అంటే క్విక్ ఫండ్ అన్నమాట. అమెరికాలో సబ్‌ప్రైమ్ ఖాతాదారులు మెక్‌డోనాల్డ్స్, స్టార్‌బక్స్ వంటి షాపుల్లో క్యూలో నిల్చుని కూడా క్యూఫండ్ ద్వారా రుణం తీసుకోవచ్చు. చెల్లింపులూ చేయొచ్చు. వారి తాలూకు వివరాలు, చెల్లించే స్తోమత ఇలాంటి వివరాలన్నిటినీ రియల్‌టైమ్‌లో మా ప్రొడక్ట్ ద్వారా చెక్ చేసి... సదరు షాపులోనే రుణం మంజూరు చేస్తారన్న మాట. ఈ ఉత్పత్తికి పెద్ద పెద్ద క్లయింట్లు ఎవరైనా ఉన్నారా? అక్కడ దాదాపు 15 మంది క్లయింట్లున్నారు. వీరిలో టాప్–5 ఫైనాన్షియల్ సంస్థలూ ఉన్నాయి. అంటే ఇవి రుణాలివ్వటానికి మా ఉత్పత్తిని వినియోగిస్తాయన్న మాట. ఇంకా ‘పే డే’ లోన్స్... ఆటో ఈక్విటీ లోన్స్ ... లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉత్పత్తులు... అప్పటికే చెల్లించేసిన వాయిదాలపై రుణమిచ్చే ఉత్పత్తులు... ఇలా చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఆటో ఈక్విటీనే తీసుకుంటే... కారు కొన్న వారు వాయిదాలు చెల్లిస్తారు కదా!!. ఓ రెండేళ్లు గడిచాక ఆ కారు విలువెంతో చూసి... తను ఇంకా ఎంత రుణం చెల్లించాలో చూసి... మిగిలింది యజమాని వాటాగా లెక్కిస్తారు. దానిపై కూడా రుణమిస్తారు. అమెరికాలో మా ద్వారా ఇప్పటికి 10 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరయ్యాయి. మరి ఇవన్నీ ఇండియాలో పనిచేస్తాయనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఇవి ఇండియాకు కొత్త కాన్సెప్ట్‌లు. కాకపోతే ఆధార్ వచ్చింది. అది బ్యాంకు ఖాతాలకు అనుసంధానమవుతోం ది. పేమెంట్లకు భీమ్ యాప్ వచ్చింది. రుణాలిచ్చే సంస్థలూ ఉ న్నాయి. వీటన్నిటినీ కలిపే టెక్నాలజీని మేం అందిస్తున్నాం. అమెరికాలో మా క్యూఫండ్ డేటా బేస్‌లో 2.5కోట్ల వ్యక్తిగత రికార్డులున్నాయి. రోజుకు 15కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇదంతా ఎందుకంటే ఈ రంగంలోని అనుభవం మాకు అక్కరకొస్తుంది. మరి హెల్త్కేర్లోకి ఎందుకొచ్చారు? సాఫ్ట్వేర్–హెల్త్‌కేర్ రెండూ వేరు కదా? హెల్త్‌కేర్‌లో ఐటీని కలిపితే అద్భుతమైన ఫలితాలొస్తాయన్నది మా ఉద్దేశం. అందుకే ఈ రంగంలోకి వచ్చాం. ఉదాహరణకు మా ఆసుపత్రిలోకి వచ్చేవారు యాప్ ద్వారానే చాలా పనులు చేసుకోగలుగుతారు. డాక్టర్ల వీడియో కన్సల్టేషన్ , వారి పాత రికార్డులను వారే ఫోటో తీసి అప్లోడ్ చేయటం, ఆ రికార్డులు వారు డాక్టర్‌తో మాట్లాడుతున్నపుడు ఆటోమేటిక్‌గా కనిపించటం వంటివన్నీ ఉంటాయి. ప్రాసెసింగ్‌లో టెక్నాలజీ వాడటం ద్వారా చికిత్స వ్యయం తగ్గించాలన్నది మా ఉద్దేశం. బెంగళూరు కంపెనీ మెడ్–జినోమ్తో డీల్ కుదుర్చుకున్నట్లున్నారు? అవును! ప్రస్తుతం జన్యు ఆధారిత డయాగ్నస్టిక్ పరీక్షలకు నియంత్రణ పరమైన అనుమతులున్నాయి. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుతున్నాం కనక మెడ్జినోమ్ మాతో ఒప్పందం చేసుకుంది. కాకపోతే జన్యు చికిత్సలకు ఇంకా అనుమతుల్లేవు. అనుమతుల్లేనివి చెయ్యటం లేదు. కణ ఆధారిత చికిత్సలూ ఇలాం టివే. ఇంకా గుండెకు వేరబుల్ డివైజ్‌ను అమర్చి ట్రాక్ చెయ్యటం వంటివన్నీ చేస్తున్నాం. దీంతో అనవసర చికిత్స ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. మా హెల్త్‌కేర్ యాప్‌ను దేశమంతటా లాంఛ్ చేస్తున్నాం. యూపీ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నాం. మీ హెల్త్‌కేర్ టార్గెట్ ఏంటి? వచ్చే ఐదేళ్లలో హెల్త్‌కేర్ విఆగాన్ని 5వేల పడకలకు చేర్చాలన్నది మా ప్రధాన లక్ష్యం. ఆ దిశగానే పనిచేస్తున్నాం. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన సిలివేరు గ్రీష్మ నందిని (24) మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. మూడేళ్ల క్రితం నగరంలోని రామంతాపూర్ నివాసి దీపక్ (29)తో వివాహం జరిగింది. పెళ్లై మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో అదనపు కట్నం కోసం అత్తింటి వారు సూటిపోటి మాటలతో వేధింపులు ప్రారంభించారు. ఈ మధ్యనే గ్రీష్మ నందిని తండ్రి ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందడంతో ఆ డబ్బులు కూడా కావాలని అత్తింటివారు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో వేధింపుల తట్టుకోలేని గ్రీష్మ నందిని బాత్రూమ్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే, గ్రీష్మ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అత్తింటి వారు చెబుతుండగా..ఆమె బంధువులు మాత్రం భర్త, అత్తమామలు కలసి గ్రీష్మను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉప్పల్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న గ్రీష్మ బంధువులు తమకు ఎలాంటి సమాచారం లేకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి అక్కడి నుంచి నేరుగా మార్చురీకి ఎలా తరలి స్తారని..ఆమెది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గణేష్ నగర్లో గ్రీష్మ నందిని అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతిచెంది ఉంది. కాగా, ఆమెను అత్తమామలే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు నందిని బంధువులు భారీగా చేరుకున్నారు. -
బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో టెకీ మృతి
-
ఆర్టీసీ బస్ ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని (25) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు స్పిన్స్‌సై సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని శిరీషగా గుర్తించారు. ఆమెకు ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ నుంచి కార్యాలయానికి వెళ్లే సమయంలో శిరీష రోడ్డు ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఐ ఫోన్10 మొండికేస్తోందట? ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఖరీదులో లాంచ్ చేసిన ఐఫోన్ 10పై మరొకటి వార్త వెలుగు చూసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి టెస్ట్‌లో కింద పడినపుడు పగిలిందన్న వార్తలకు తోడు ఇపుడు ఐ ఫోన్ అతి చల్లటి వాతావరణంలో పనిచేయడంలేదన్న వార్త ఐ ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూసే. ఎలాంటి వాతావారణంలోనైనా పనిచేయాల్సిన స్మార్ట్‌ఫోన్ తీవ్రమైన శీతల పరిస్థితుల్లో పనిచేయనని మొండికేస్తోందట. ఈ సమస్యపై ఆపిల్ కూడా స్పందించింది. త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని చెప్పింది. అత్యంత ఖరీదు పెట్టి కొన్న ఐఫోన్10 అతి చల్లటి వాతావరణంలో పనిచేయడం లేదని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. చల్లటి వాతావరణంలోకి వెళ్లిన తరువాత రెండు సెకన్లకే టచ్ స్క్రీన్ పనిచేయలేదని ఒక వినియోగాదారుడు వాపోయాడు. అయితే ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని,కానీ, కొద్ది సెకన్ల తరువాత పూర్తిగా యథావిధిగా ఉంటోందని ఆపిల్ పేర్కొంది. రాబోయే సాఫ్ట్వేర్ అపడేట్లో దీన్ని సవరించనున్నట్టు తెలిపింది. అంతేకాదు 0-35 డిగ్రీల సెల్సియస్ మధ్య వాడాలని కూడా సూచించింది. అతిశీతల, అతి ఉష్ణ వాతావరణంలో ఈ డివైస్ బ్యాటరీ కూడా తాత్కాలికంగా బలహీనపడే అవకాశం ఉందని, అయితే సాధారణ వాతావరణంలోకి వచ్చిన తరువాత మళ్లీ మామూలు స్థితికి వస్తుందని చెప్పింది -
సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
సాక్షి, జగిత్యాల: అకారణంగా తన తండ్రిని పోలీసులు వేధిస్తున్నారని మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం ఆరపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రాజారెడ్డిని మెట్పల్లి ఎస్సై అశోక్ ఓ కేసు విచారణ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండటంతో.. ఆయన కుమారుడు దశరథ్ రెడ్డి(25) మనస్తాపానికి గురై ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ భూ వివాదం నేపథ్యంలో ఎస్సై అశోక్ వేధింపులకు గురి చేస్తుండటంతో.. ఆ కుటుంబంలో గత కొన్ని రోజులు మనశ్శాంతి కురువైంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దశరథ్ రెడ్డి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దశరథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆగ్రహించిన అతని బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో మెట్పల్లి-కోరుట్ల మధ్య గల 63వ నెంబర్ జాతీయ రహదరిపై రాస్తారోకో నిర్వహించారు. దీనికి కారణమైన ఎస్సైని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రంజిత్‌సింగ్ తాను ఉంటున్న శిల్పా పార్క్ కాలనీలోని శిల్పా నివాస్ అపార్టుమెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
వేధింపులతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
మల్కాజిగిరి(హైదరాబాద్): మెట్టినింటి వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం..వెంకటేశ్వరనగర్‌కు చెందిన బాలరాజ్ గౌడ్ కుమార్తె రోజా(30) టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 2012లో మల్కాజిగిరి జ్యోతినగర్‌కు చెందిన రంగ శ్రీకాంత్‌తో వివాహమైంది. లాంకోహిల్స్‌లోని సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్ధలో సాప్ట్వేర్ ఉద్యోగిగా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. వీరికి రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.పెళ్లి అయిన కొద్ది రోజులు కాపురం సజావుగా జరిగినా చీటికిమాటికి రోజాను భర్త శ్రీకాంత్ అత్త మామలు ధనలక్ష్మి, రాములు వేధించేవారు. గురువారం ఉదయం బాలరాజ్గౌడ్కు శ్రీకాంత్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన బాలరాజ్‌కు రోజా ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు శ్రీకాంత్ ఇంటి ఇరుగుపొరుగు వారు చెప్పారు. వెంటనే స్టోరూమ్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రోజాను తలుపు పగులగొట్టి బయటకు తీసుకు వచ్చారు. రోజాను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కూతురు మృతికి భర్త అత్తమామలే కారణమని కట్నకానుకల క్రింద పెళ్లి సమయంలో రూ.20 లక్షలు అప్పచెప్పామని బాలరాజ్‌గౌడ్ తెలిపారు. తరచూ వేధించేవారని కొడుకు పుట్టిన తర్వాత కూడా మారలేదని అల్లారుముద్గుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు దూరమైందని ముగ్గురిని కఠినంగా శిక్షించాలని బాలరాజ్‌గౌడ్ డిమాండ్ చేశారు. -
నమ్మిన కంపెనీనే నట్టేట ముంచేశారు
-
రాష్ట్రంలో ‘నైపుణ్యం’ పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైపుణ్య కొలువుల శాతం తగ్గిపోతోంది. ఐటీ, మేనేజ్మెంట్, బీపీవో, కేపీవో వంటి రంగాల్లో నైపుణ్యం గల ఉద్యోగాల సాధన కత్తిమీద సాములానే మారుతోంది. రాష్ట్రంలో ఈ తరహా ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో తేలింది. నైపుణ్యం గల ఉద్యోగాల కల్పన, డిమాండ్‌లో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కళాశాలల్లో నాసిరకం బోధన, ఆంగ్ల భాషపై పట్టులేకపోవడం, నైపుణ్య అంశాల్లో తగిన శిక్షణ లభించకపోవడం వంటివి ఈ పరిస్థితికి కారణమని యాస్పైరింగ్ మైండ్స్ సర్వే నివేదికలో వెల్లడించింది. మహారాష్ట్ర టాప్: యాస్పైరింగ్ మైండ్స్ సంస్థ నైపుణ్య ఉద్యోగాల అంశంపై ఇటీవల దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాలతో ‘స్కిల్ డెవలప్మెంట్–2017’పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలో (ఓపెన్ జాబ్ ఆపర్చునిటీస్) దేశంలో మహారాష్ట్ర అగ్రభాగాన నిలిచింది. ఆ రాష్ట్రంలో 19.72 శాతం నైపుణ్య కొలువుల అవకాశాలున్నట్లు నివేదికలో వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో నిలవగా.. తెలంగాణ కేవలం 3.47 శాతం నైపుణ్య కొలువులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ‘సాఫ్ట్వేర్’లో బోలెడు అవకాశాలు నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలో ఆయా రంగాల వారీగా పరిశీలిస్తే.. నైపుణ్యం గల సాఫ్ట్వేర్ డెవలపర్స్ కొలువులకు పలు రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉన్నట్లు సర్వే తేల్చింది. తర్వాతి స్థానంలో అమ్మకాల పరిస్థితిని గమనించే (సేల్స్ సిచ్యువేషన్) రంగం నిలిచింది. కస్టమర్ సర్వీస (సేవా రంగం) మూడో స్థానంలో నిలవగా.. హార్డ్‌వేర్ రంగం నాలుగో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలిస్తే ఇదే విషయం సుస్పష్టమైందని పేర్కొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పనలో టాప్ ఐదు రాష్ట్రాలు రాష్ట్రం ర్యాంకు సాఫ్ట్వేర్ కొలువుల శాతం కర్నాటక 1 17.47 మహారాష్ట్ర 2 17.23 తమిళనాడు 3 12.12 ఢిల్లీ 4 11.11 గుజరాత్ 5 8.08 (మొత్తం నైపుణ్య ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల శాతం) ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో అధిక జనాభాకు అనుగుణంగా నైపుణ్య ఉద్యోగాల కల్పన జరగడం లేదని సర్వే తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్‌లలో మాత్రం ప్రతి లక్ష మందికి ఉద్యోగాల కల్పన విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులు మాత్రం అత్యధిక ఉద్యోగాల కల్పనతో అగ్రభాగాన నిలిచినట్లు తెలిపింది. రాష్ట్రంలో నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణాలివే.. – ఆంగ్లభాషపై పట్టు సాధించకపోవడం: ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, వివిధ రకాల డాక్యుమెంట్లు రాయడంలో అనుభవం లేకపోవడం – డిడక్టివ్ రీజనింగ్ లోపం: వివిధ రకాల డేటాను విశ్లేషించి సులభతరంగా మార్చే నైపుణ్యం కొరవడడం – ఇండక్టివ్ రీజనింగ్‌లో లోపం: వివిధ రకాల అప్లికేషన్స్‌ను విశదీకరించి క్రోడీకరించే సామర్థ్యం లేకపోవడం – ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ సింథసిస్ లోపం: సమాచార సేకరణ, దానిని విశ్లేషించే సామర్థ్య లోపం – క్వాంటిటేటివ్ ఏబిలిటీ: అర్థ గణాంకాల విశ్లేషణ, సమస్యా పరిష్కారం విషయంలో వెనుకబడడం – మౌఖిక పరీక్షలు, బృంద చర్చల్లో విఫలం కావడం – కళాశాలల్లో విద్యార్థులకు మల్టీ టాస్కింగ్, నైపుణ్య అంశాల్లో సరైన శిక్షణ లభించకపోవడం వంటివి రాష్ట్రంలో నిరుద్యోగులకు నైపుణ్య కొలువులు దక్కకపోవడానికి కారణమని యాస్పైరింగ్ మైండ్స్ నివేదికలో వెల్లడైంది. -
‘వల’ వేసి వంచిస్తారు !
టెక్కీలను దోచుకుంటున్న ముఠా అరెస్ట్ బనశంకరి: టెక్కీలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కబేగూరు నివాసి లత, పవన్, రూపేన అగ్రహార నివాసి రాఘవేంద్ర, విరాట్‌నగర కిరణ్, శాంత ఐదుగురు ముఠాగా ఏర్పడి సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా వారితో చనువుగా మాట్లాడి వారిని నిలువు దోపిడీ చేస్తోంది ఈ ముఠా. వివరాలు... ఈ గ్యాంగ్‌లో కీలకంగా ఉండే లత సాఫ్ట్వేర్ ఉద్యోగులు తరచూ తిరిగే ప్రాంతాల్లో చక్కగా ముస్తాబు చేసుకుని వారితో మాటలు కలుపుతారు. వారితో పరిచయం పెరిగి వారిని ముందే ఏర్పాటు చేసుకున్న గదికి తీసుకెళ్లేది. అప్పటికే ఆ గదిలో ఉన్న యువతితో సెక్స్‌లో పాల్గొనమని అక్కడిని నుంచి వెళ్లిపోయేది. పక్కా ప్లాన్ ప్రకారం కొద్ది నిముషాల లత గ్యాంగ్ గదిలోకి వచ్చి బాధితుడిని బెదిరించి అతడిని వ్యవహారాన్ని వీడియో తీసి, అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, నగదు తీసుకుని ఉడాయిస్తారు. తాజాగా ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాఘవేంద్ర వీరి వలలో పడ్డాడు. అతనిని అర్దన్నగంగా వీడియో తీసి, అతని వద్ద ఉన్న రూ. 2 వేల నగదు, రెండు సెల్ఫోన్లు లాక్కున్నారు. రెండు రోజుల క్రితం హొంగసంద్ర రోడ్డులో కారులో వస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి శివకుమార్‌ను ఇలాగే దోచుకున్నారు. రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రగంలోకి దిగిన జాయింట్ పోలీస్‌కమిషన్ సతీశ్ కుమార్ సీఐ కులకర్ణి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు ఇక్కడి సిల్క్‌బోర్డు వద్ద ముఠా సభ్యుడు కిరణ్‌తో పాటు మరో నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. మరోకరి కోసం గాలిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం.. పోకిరి వేషం
ఫేస్బుక్, వాట్సప్‌ల్లో యువతిని వేధిస్తున్న వైనం లైంగిక వాంఛ తీర్చాలంటూ బెదిరింపులు వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం పోలీసుల అదుపులో నిందితుడు నిర్భయతో సహా 18 సెక్షన్లతో కేసు నమోదు స్నేహం.. ప్రేమ.. పేరుతో చదువుకునే రోజుల్లో ఓ యువతితో చనువుగా మెలిగాడు. అప్పటి ఫొటోలను భద్రపరుచుకుని ఇప్పుడు ఆమెను వేధిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా పోకిరీ వేషాలు వీడలేదు. అక్కడితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను యువతి బంధువులకు పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. ఇందుకు సోషల్ మీడియాను వారధిగా చేసుకున్నాడు. ఈ ప్రబుద్ధుడి ఆగడాలు తాళలేక యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. నరసాపురం నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు మంగళవారం రాత్రి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక పంజా సెంటర్‌కు చెందిన షేక్ అబ్దుల్రహీమ్ పట్టణంలోని ఓ కళాశాలలో పీజీ చేస్తుండగా తనతో పాటే చదువుకున్న పట్టణంలోని కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతితో స్నేహంగా మెలిగాడు. ఫేస్బుక్, వాట్సప్‌ల్లో వీరు చాటింగ్ చేస్తూ చనువు పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. రహీమ్ శృతి మించడంతో పాటు ఇద్దరు కులాలు వేరు కావడంతో ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది. డబ్బులు గుంజినా ఆగని వేధింపులు చదువు పూర్తయిన తరువాత అబ్ధుల్రహీమ్కు బెంగళూరులోని ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం మరో యువతితో పెళ్లి కూడా అయ్యింది. అయినా రహీమ్ బుద్ధి మారలేదు. పాత ఫొటోలు, బూతు బొమ్మలను ఫేస్బుక్, వాట్సప్‌ల్లో కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతికి పంపుతూ వేధిస్తున్నాడు. యువతిని పెళ్లి చేసుకోవద్దని, తాను చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నాడు. మరీ బరి తెగించి యువతి తల్లితండ్రులతో పాటు బంధువులకు పాత ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. తన లైంగిక వాంచలు తీర్చకపోతే మొత్తం ఫొటోలు ఆన్లైన్లో పెడతానని హెచ్చరించాడు. దీంతో భయపడిన యువతి తల్లిదండ్రులు రహీమ్‌కు భారీగా నగదు కూడా ముట్టచెప్పారు. అయినా రహీమ్ వేధింపులు ఆగలేదు. యువతి ఆత్యహత్యాయత్నం రహీమ్ వేధింపులు భరించలేక యువతి సోమవారం పట్టణంలో గోదావరిలో దూకి ఆత్యహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను కాపాడి ఇంటికి చేర్చారు. దీంతో యువతి తల్లితండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. రహీమ్ వద్ద ల్యాప్‌టాప్‌తో పాటుగా రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్భయ యాక్ట్, ఐటీయాక్ట్, సైబర్ క్రైమ్ యాక్ట్‌లతో పాటుగా ఐపీసీలోని 18 సెక్షన్లతో రహీమ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈతరహా ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం.. పోకిరి వేషం
ఫేస్బుక్, వాట్సప్‌ల్లో యువతిని వేధిస్తున్న వైనం లైంగిక వాంఛ తీర్చాలంటూ బెదిరింపులు వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం పోలీసుల అదుపులో నిందితుడు నిర్భయతో సహా 18 సెక్షన్లతో కేసు నమోదు స్నేహం.. ప్రేమ.. పేరుతో చదువుకునే రోజుల్లో ఓ యువతితో చనువుగా మెలిగాడు. అప్పటి ఫొటోలను భద్రపరుచుకుని ఇప్పుడు ఆమెను వేధిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా పోకిరీ వేషాలు వీడలేదు. అక్కడితో ఆగకుండా ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను యువతి బంధువులకు పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. ఇందుకు సోషల్ మీడియాను వారధిగా చేసుకున్నాడు. ఈ ప్రబుద్ధుడి ఆగడాలు తాళలేక యువతి గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. నరసాపురం నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు మంగళవారం రాత్రి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక పంజా సెంటర్‌కు చెందిన షేక్ అబ్దుల్రహీమ్ పట్టణంలోని ఓ కళాశాలలో పీజీ చేస్తుండగా తనతో పాటే చదువుకున్న పట్టణంలోని కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతితో స్నేహంగా మెలిగాడు. ఫేస్బుక్, వాట్సప్‌ల్లో వీరు చాటింగ్ చేస్తూ చనువు పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. రహీమ్ శృతి మించడంతో పాటు ఇద్దరు కులాలు వేరు కావడంతో ఆమె అతడిని దూరం పెడుతూ వచ్చింది. డబ్బులు గుంజినా ఆగని వేధింపులు చదువు పూర్తయిన తరువాత అబ్ధుల్రహీమ్కు బెంగళూరులోని ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం మరో యువతితో పెళ్లి కూడా అయ్యింది. అయినా రహీమ్ బుద్ధి మారలేదు. పాత ఫొటోలు, బూతు బొమ్మలను ఫేస్బుక్, వాట్సప్‌ల్లో కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతికి పంపుతూ వేధిస్తున్నాడు. యువతిని పెళ్లి చేసుకోవద్దని, తాను చెప్పినట్టు వినాలని బెదిరిస్తున్నాడు. మరీ బరి తెగించి యువతి తల్లితండ్రులతో పాటు బంధువులకు పాత ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. తన లైంగిక వాంచలు తీర్చకపోతే మొత్తం ఫొటోలు ఆన్లైన్లో పెడతానని హెచ్చరించాడు. దీంతో భయపడిన యువతి తల్లిదండ్రులు రహీమ్‌కు భారీగా నగదు కూడా ముట్టచెప్పారు. అయినా రహీమ్ వేధింపులు ఆగలేదు. యువతి ఆత్యహత్యాయత్నం రహీమ్ వేధింపులు భరించలేక యువతి సోమవారం పట్టణంలో గోదావరిలో దూకి ఆత్యహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను కాపాడి ఇంటికి చేర్చారు. దీంతో యువతి తల్లితండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపి మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. రహీమ్ వద్ద ల్యాప్‌టాప్‌తో పాటుగా రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్భయ యాక్ట్, ఐటీయాక్ట్, సైబర్ క్రైమ్ యాక్ట్‌లతో పాటుగా ఐపీసీలోని 18 సెక్షన్లతో రహీమ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈతరహా ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. -
కదులుతున్న గుప్తనిధుల డొంక
- నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు న్యాయవాది – కొనసాగుతున్న పోలీసుల విచారణ మడకశిర : గుప్తనిధుల వ్యవహారంలో డొంక కదులుతోంది. మడకశిర పోలీసుల అదుపులో ఉన్న గుప్తనిధుల ముఠా సభ్యులను పోలీసులు బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పూర్తి స్థాయిలో విచారించారు. అమరాపురం మండలం హేమావతి శ్రీ సిద్ధేశ్వరస్వామి దేవాలయంలో గుప్తనిధుల తవ్వకాల కోసం వచ్చిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా బుధవారం పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ ముఠా సభ్యులను అమరాపురం ఎస్ఐ వెంకటస్వామి అదుపులోకి తీసుకుని వెంటనే మడకశిరకు తరలించారు. స్థానిక సీఐ శుభకుమార్ ఎదుట హాజరు పర్చారు. ఈ ముఠా సభ్యులు బెంగళూరు, అనంతపురం, ఉరవకొండ ప్రాంతాలకు చెందినవారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా సభ్యుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజినీరు, మరొకరు న్యాయవాది. ఈ సభ్యులు గత కొన్ని రోజుల నుండి శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలకు పథకం వేసుకున్నట్లు బయటపడింది. ఈ పథకంలో భాగంగానే 15 రోజుల క్రితం ఈ దేవాలయానికి ఈ ముఠా సభ్యులు వచ్చి పరిశీలించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ దేవాలయానికి ఈ ముఠా సభ్యులందరూ మూడు, నాలుగు సార్లు వచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ముఠా సభ్యులు పథకం ప్రకారం ఆలయ కమిటీ వారిని, అర్చకులను లోబర్చుకుని ఈ ఆలయంలో గుప్తనిధులను తవ్వడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఈ ముఠా సభ్యులు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. రెండు వాహనాల్లో ఈ ముఠా సభ్యులు వచ్చినట్లు తెలిసింది. ఈ వాహనాలను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని లోతుగా విచారిస్తున్నారు. గతంలో ఎక్కడైనా ఈ ముఠా సభ్యులు గుప్త నిధులను తవ్వారో లేదో కూడా విచారించారు. అయితే ఇదే మొదటి సారిగా గుప్తనిధుల కోసం వచ్చినట్లు పోలీసుల విచారణలో వీరు చెప్పినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేస్తాం – శుభకుమార్, సీఐ, మడకశిర గుప్తనిధుల ముఠా సభ్యులపై కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం ఈ ముఠా సభ్యులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. నియోజకవర్గంలో గుప్తనిధుల తవ్వకాలపై నిఘా పెంచుతాం. అనుమానితులపై ప్రజలు సమాచారం అందించాలి. -
వ్యాయామం చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: వ్యాయమం చేస్తూ ఓ సాప్ట్వేర్ ఉద్యోగి అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరుణ్‌కుమార్ (22) నగరంలోని మియాపూర్ మాతృశ్రీనగర్‌లో గత కొన్నిరోజులుగా నివాసం ఉంటున్నాడు. వరుణ్‌కుమార్ మాదాపూర్‌లోని డెల్ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అతను కంపెనీ జిమ్‌లో వ్యాయమం చేస్తూ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కంపెనీ సిబ్బంది ఉద్యోగి వరుణ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
జీఎస్టీ... బిజినెస్ షురూ!
♦ ఇన్వాయిస్లు, రిటర్న్లకే ఏటా రూ.20వేల కోట్లు ♦ ఐటీ సంస్థలు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు కొత్త అవకాశాలు ♦ సొల్యూషన్లతో రంగంలోకి 34 మంది సువిధ ప్రొవైడర్లు ♦ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఐటీ; శాప్, ఒరాకిల్ నిపుణులకు గిరాకీ ♦ 3 నెలల్లో లక్షకు పైగా ఉద్యోగుల అవసరముంటుందని అంచనా ♦ జీఎస్టీ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులతో స్టార్టప్స్ రంగంలోకి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్టీగా పిలుస్తున్న వస్తు సేవల పన్ను శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతోంది. కొన్నింటి ధరలు పెరుగుతున్నాయి.. మరిక్నొం టివి తగ్గుతున్నాయి. రోజువారీ అవసరమయ్యే సేవలు, వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో మొత్తమ్మీద జీఎస్టీతో సామాన్యులకు భారమేనన్నది అత్యధికుల మాట. సామాన్యులకే కాదు!! చిన్న చిన్న వ్యాపారాలకు, మధ్య స్థాయి కంపెనీలక్కూడా ఇది భారమే. ఎందుకంటే పన్నుల నిర్వహణకు, ఐటీకి వారు పెట్టాల్సిన ఖర్చు పెరగబోతోంది. ఈ ఖర్చు... రూ.20వేల కోట్ల వ్యాపారాన్ని కూడా సృష్టిస్తోంది మరి!!: జీఎస్టీ సాఫ్ట్వేర్ విక్రయించడానికి, ఐటీ సేవలందించడానికి 34 సంస్థలు సిద్ధమయ్యాయి. జీఎస్టీ లావాదేవీలు, పన్ను చెల్లింపుల నిర్వహణ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమయ్యాయి. గ్రామాల్లోని చిన్న చిన్న వ్యాపారాలూ జీఎస్టీ పరిధిలోకి వస్తుండటంతో వాటికి సేవలందించటానికి స్థానిక యువత శిక్షణకు వెళుతున్నారు. పలు సంస్థలు ఇప్పటికే జీఎస్టీ శిక్షణ కోర్సులు మొదలెట్టగా... ఇంకొన్ని ఆన్లైన్ కోర్సులు కూడా ఆరంభించేశాయి. ఇదీ... జీఎస్టీ చుట్టూ అల్లుకున్న కొత్త వ్యాపార ప్రపంచం. అసలు జీఎస్‌పీలు ఏం చేస్తాయి? జీఎస్పీ... అంటే జీఎస్టీ సువిధ ప్రొవైడర్లు. ఇవి పన్ను రిజిస్ట్రేషన్, చెల్లింపులకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, దాన్ని థర్డ్ పార్టీ పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్ కన్సల్టెంట్లకు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు విక్రయిస్తాయి. వ్యాపారుల నమోదు, క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ పొందుపర్చడం, ప్రతి నెలా, వార్షిక పన్ను రిటర్ను దాఖలు చేయటం కూడా వీటిపని. సువిధ ప్రొవైడర్లలో ఒకటైన టాలీ సొల్యూషన్స్.. ‘టాలీ.ఈఆర్పీ9 రీలీజ్ 6’ జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది. జీఎస్టీ కన్నా ముందు 11 లక్షల మంది యూజర్లున్న తమకు.. జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌తో సబ్స్క్రిప్షన్ 6 రెట్లు పెరిగినట్లు కంపెనీ చెబుతోంది. మరో సువిధ ప్రొవైడర్ జోహో.. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ‘జోహో ఫైనాన్స్ ప్లస్’ను విడుదల చేసింది. 10 వేల మంది వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నామని కంపెనీ చెబుతోంది. మరో జీఎస్పీ ట్యాక్స్‌మాన్..‘‘వన్ సొల్యూషన్’’ పేరిట సాఫ్ట్‌వేర్‌ను తెచ్చింది. అప్లికేషన్ సేవలందించేవారు కూడా... జీఎస్పీలే కాకుండా క్లియర్ ట్యాక్స్, జెనిసిస్ వంటి అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్లూ (ఏఎస్పీ) జీఎస్టీ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇవి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) సాఫ్ట్వేర్లను ఆధారం చేసుకొని పన్ను చెల్లింపుదారుల క్రయ విక్రయాల డేటాను సేకరించి... జీఎస్టీ రిటర్న్‌కు బదలాయించి పన్నులు దాఖలు చేస్తాయి. వీటి ధరలు రూ.2,700 నుంచి ఉన్నాయి. జీఎస్టీ సాఫ్ట్వేర్ ధర రూ.18–54 వేలు! జీఎస్టీ సాఫ్ట్వేర్ ధరలు సేవలను బట్టి మారుతున్నాయి. ‘‘ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్), ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్), ఆడిట్ రిపోర్ట్, జీఎస్టీ వంటివన్నీ ఉంటే ఏడాదికి రూ.19 వేలు చార్జీ ఉంటుంది. కేవలం వన్ సొల్యూషన్కైతే ఏడాదికి రూ.8,500’’ అని ట్యాక్స్‌మాన్ సీఈఓ పీయూష్ కుమార్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. 125 మంది ఐటీ నిపుణులు, 9 నెలలు శ్రమించి ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారని.. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, బీమా సంస్థలు కొనుగోలు చేశాయని చెప్పారు. జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఉత్పత్తుల క్రయ విక్రయాల బిల్లింగ్ సాఫ్ట్వేర్, చెల్లింపుల సాఫ్ట్వేర్, పరిష్కారాలు, ఈ–సంతకాల వంటి వాటికైతే రూ.54 వేల వరకూ చార్జీ ఉంటుందని ఓ ఐటీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. అలా కాకుండా ఒక యూజర్‌కు వార్షిక సబ్‌స్క్రిప్షన్‌కు రూ.3,600, అంతకంటే ఎక్కువ యూజర్లకైతే రూ.10,800 అని చెప్పారు. ఒక్క ఇన్వాయిస్కు 49 పైసలు నుంచి రూపాయి వరకు చార్జీ, నెలకు ఒక్క రిటర్న్ దాఖలుకు రూ.100–200 చార్జీలున్నాయి. ఎంపికైన జీఎస్పీ సంస్థలివే..: అలంకిత్, బోధ్‌ట్రీ, సీడీఎస్ఎల్ ఇండియా, బో«ద్ట్రీ, సీఏఎంఎస్ ఆన్లైన్, సైజెంట్ ఇన్ఫోటెక్, డెలాయిట్, ఈవై, ఎక్సెలాన్ సాఫ్ట్వేర్, గోఫ్రూగల్, ఐరిస్, కార్వీ, మాస్టెక్, మాస్టర్స్ ఇండియా, మైండ్ ఇన్ఫోటెక్, ఎన్ఎస్డీఎల్, రామ్‌కో, శేషసాయి, ఎస్ఐఎస్ఎల్ ఇన్ఫోటెక్, స్కిల్రాక్, స్పేస్ డిజిటల్, టాలీ సొల్యూషన్స్, టీసీఎస్, ట్యాక్స్‌మాన్, టెరా సాఫ్ట్వేర్, ట్రస్ట్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, వయానా, వెలోసిస్, వెర్టెక్స్ గ్రూప్, వెప్ ఇండియా. ఆన్లైన్లో జీఎస్టీ కోర్సులు.. ఆన్లైన్పన్ను చెల్లింపు సేవలు, సీఏ శిక్షణ సంస్థలు కొన్ని జీఎస్టీ వేదికగా సర్టిఫికెట్ కోర్సులను తెచ్చాయి. బెంగళూరుకు చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్ రిటర్న్స్, ఎంటర్ప్రైజ్ సర్వీస్ ప్రొవైడర్ క్లియర్ ట్యాక్స్, సీఏ శిక్షణ సంస్థ హైర్గ్యాంగీ అకాడమీతో కలిసి జీఎస్టీ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఈ–లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ట్యాక్స్మంత్ర, సీఏక్లబ్ఇండియా.కామ్‌తో కలిసి బిజినెస్, ప్రొఫెషనల్స్ కోసం జీఎస్టీ సర్టిఫికేషన్ కోర్సును రూపొందించింది. ‘‘ఈ–లెర్నింగ్ కోర్సులు తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి 20 ప్రాంతీయ భాషల్లోనూ లభిస్తాయి. కోర్సుల ధర రూ.3 వేలు’’ అని సంస్థ సీఈఓ అర్చిత్ గుప్తా తెలిపారు. ఇప్పటికే లాంగ్ టర్మ్ కోర్సులో 20 వేల మంది సీఏలు, ట్యాక్స్ కన్సల్టెంట్లు నమోదయ్యారని తెలిపారు. కళ్లు తిరిగే గణాంకాలు... ప్రస్తుతం దేశంలో నెలకు 300 కోట్ల ఇన్వాయిస్లు అప్లోడ్ అవుతున్నాయి. ఒక్క ఇన్వాయిస్కు రూ.1 చార్జీ చేసినా.. నెలకు రూ.300 కోట్లు! ఏటా రూ.3,600 కోట్లు. ఇక రిటర్న్‌లు చూస్తే.. ఒక రాష్ట్రంలో ఒక్కో సంస్థ నెలవారీ 3, వార్షికంగా 1 చొప్పున ఏటా 37 రిటన్స్ వేయాలి. జీఎస్టీలో నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 80 లక్షలు. ప్రతి సంస్థా సగటున 5 రాష్ట్రాల్లో సేవలందిస్తుందనుకుంటే... 80 లక్షలు (ఇంటు) 5=4 కోట్లు. అంటే ఏడాదికి 148 కోట్ల రిటర్న్‌లు. ఒకో రిటర్న్‌కు రూ.100 చార్జీ చేసినా.. రూ.14,800 కోట్ల వ్యాపారం. జోరుగా కొత్త ఉద్యోగాలు! జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనేది నిపుణుల అంచనా. ‘‘మొదటి త్రైమాసికంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగుల అవసరం ఉంటుంది. తర్వాత మరో 50–60 వేల ఉద్యోగాలు కూడా వస్తాయి’’ అని గ్లోబల్ ఓసియన్ గ్రూప్ ఎండీ బ్రిజేశ్ లోహియా చెప్పారు. ట్యాక్స్ కన్సల్టింగ్, అకౌంటింగ్, డేటా అనాలిసిస్, కంపెనీ అకౌంట్స్, ట్యాక్సేషన్ విభాగాల్లో వీరి అవసరముంటుందని.. ఆయా విభాగాల్లో 10–13 శాతం వార్షిక వృద్ధి రేటు కూడా ఉంటుందని చెప్పారాయన. ♦ జీఎస్టీకి సంబంధించి వివిధ సాఫ్ట్వేర్ల తయారీలో కంపెనీలు నిమగ్నమవటంతో ఐటీ సంస్థల్లో ఉద్యోగుల అవసరం ఏర్పడిందని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పా రు. ముఖ్యంగా ఎస్ఏపీ, ఒరాకిల్ వంటి టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలున్నాయని చెప్పారాయ న. త్వరలోనే డెలాయిట్ 250 మంది పరోక్ష పన్ను కన్సల్టెంట్లను, పీడబ్ల్యూసీ 200–250 సీఏ, సిస్టమ్ ఎగ్జిక్యూటివ్‌లనూ నియమించుకోనుందని తెలిపారు. ♦ జీఎస్టీ పరిధిలోకి వచ్చిన 80లక్షల మందిలో 80 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలే(ఎస్ఎంఈ). ‘‘నిరక్షరాస్యత, ఆన్లైన్ అలవాటు లేకపోవటం వంటి కారణాల వల్ల స్థానికంగా ఉండే యువతకు, కంప్యూటర్ మీద పట్టు, పన్ను చెల్లింపుల్లో అవగాహన ఉన్న వారికి ఉపాధి దొరుకుతుంది’’ అని పీయూష్ కుమార్ చెప్పా రు. చాలా కంపెనీలు జీఎస్టీ నిర్వహణ కోసం థర్డ్‌పార్టీ మీద ఆధారపడతాయి. దీంతో ఆయా సంస్థల్లోనూ డేటాఎంట్రీ, పన్ను చెల్లింపుల నిర్వహణకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలుంటాయని తెలియజేశారు. -
దమ్ మారో దమ్
టెక్కీల గం‘జాయ్’ నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే సాప్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్‌కు బానిసలయ్యారా? లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాస జీవితాలు అనుభవించే టెక్కీలు మత్తులో జోగుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ దందా సాగిస్తున్న ఇద్దరు సోమాలియా దేశ విద్యార్థులను ఆబ్కారీశాఖ ఇటీవల అరెస్టు చేసి విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా, విశాఖ ఏజెన్సీల నుంచి కిలో కేవలం రూ. 3 వేల చొప్పున 20–25 కిలోల గంజాయిని కొనుగోలు చేస్తున్న డ్రగ్స్ ముఠాలు దాన్ని రైళ్లలో తొలుత వరంగల్‌కు తరలిస్తున్నాయి. అక్కడి నుంచి ట్రాలీ ఆటోల అడుగున గంజాయిని ప్యాకెట్ల రూపంలో దాచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ కాలేజీ విద్యార్థులు,సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయం రవాణా చేసిన గంజాయిని కాలేజీ విద్యార్థులతోపాటు శివారు ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ ముఠాలు విక్రయిస్తున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒక గ్రాము, రెండు గ్రాముల చొప్పున గంజాయిని సిగరెట్లలో పెట్టి ఒక్కో సిగరేట్‌ను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక్కడ అమ్మగా మిగిలిన గంజాయిని గోవాకు తరలించి కిలోకు రూ. 45 వేల నుంచి రూ. 50 వేల చొప్పున తాజా పట్టుబడిన సోమాలియన్లు విక్రయిస్తున్నట్లు తేలింది. సర్జికల్ డ్రగ్‌నూ మత్తు కోసం హాస్పిటళ్లలో ఆపరేషన్ల సమయంలో ఉపయోగించే పెంటాజోకిన్ కెమికల్ ఉన్న పార్ట్విన్ ఇంజక్షన్‌ను కూడా సాప్ట్వేర్ ఇంజనీర్లు మత్తు పదార్థంగా ఉపయోగిస్తున్నారు. కేవలం హాస్పిటళ్లు, లైసెన్స్డ్ డ్రగ్ సెంటర్లలో డాక్టర్ ప్రిస్కిప్షన్ ఉంటేనే ఈ డ్రగ్‌ను విక్రయించాలని ఆదేశాలున్నా ఏపీలోని తిరుపతి, విశాఖ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ రవాణా గుట్టురట్టవుతున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు ఇలాంటి సర్జికల్ డ్రగ్స్‌ను వాడుతున్నారు. ఉన్మాదిగా మారే ప్రమాదం సాధారణంగా పెంటాజోకిన్ కెమికల్‌ను పెయిన్ రిలీఫ్‌కు వాడుతుంటారు. అది కూడా డాక్టర్ సిఫారసు చేస్తేనే ఇస్తారు. కానీ ఈ డ్రగ్‌కు బానిసలైన వారు రోజుకు రెండు నుంచి మూడు డోసుల చొప్పున (అంటే తీసుకున్నప్పుడల్లా 3 ఎంఎల్.. రోజుకు 9ఎంఎల్ చొప్పున) వాడుతున్నారు. దీనివల్ల అధిక రక్తపోటు, గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెదడు, నాడీకణాల పనితీరు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు తెలిపారు. దీన్ని అధిక మోతాదులో తీసుకున్న సందర్భంలో ఆ వ్యక్తి ఉన్మాదిలా వ్యవహరించే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దర్యాప్తు చేస్తున్నాం తాజాగా అరెస్టయిన సోమాలియా విద్యార్థులు ఈ దందాను ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై తమ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. అలాగే నిత్యం 250 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు పెంటాజోకిన్ను దిగుమతి చేసుకొని 2 ఎంఎల్‌కు రూ. 500 చొప్పున సాప్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్న ఇద్దరిని తాము అరెస్ట్ చేశామన్నారు. -
డిప్రెషన్‌తో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సిఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన కోమలికి భాస్కరరావుతో అయిదు సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ కాలనీ మూడవ ఫేజ్, ఎంఐజి 515 లో నివాసముంటున్నారు. కోమలి (30) సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తుండగా, భాస్కరరావు కూడా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన భాస్కరరావు తలుపులు తెరిచేందుకు యత్నించగా లోపలనుంచి గడియపెట్టి ఉండటంతో పాటు ఎంతకీ తలుపులు తెరవకపోవటంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా కోమలి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూడగా బెడ్ రూమ్‌లో సూసైడ్ నోట్ లభించినట్లు సిఐ కుషాల్కర్ తెలిపారు. సూసైడ్ నోట్లో తన చావుకు ఎవరూ కారణం కాదని తానే డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వ్రాసి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీసు స్టేషన్ ప్రారంభానికి ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని టీసీఎస్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థల, వాటిల్లోని ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.5 కోట్లతో ఈ మోడల్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. ఈనెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడంతస్తుల భవనంలో అన్ని హంగులతో నిర్మించారు. ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో రక్షణ ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే ఇబ్రహీంపట్నం వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. భవిష్యత్తులో ఆదిబట్ల ప్రాంతానికి మరిన్ని ఐటీ సంస్థలు రానుండటంతో భద్రత విషయంలో ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటూ ఈ స్టేషన్‌ను నిర్మించారు. -
పెళ్లి చూపుల ఫొటోకు వెళ్లి టెక్కీ..
కర్నూలు: బెంగుళూరులోని ఓరాకిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జగన్మోహన్రెడ్డి (31) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని సొంత ఊరు వేంపెంట. బావ లక్ష్మన్న కర్నూలులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ టెలికాం నగర్లో నివాసముంటున్నాడు. శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి జగన్మోహన్రెడ్డి.. బావ ఇంటికి వచ్చాడు. పెళ్లి చూపులకు సంబంధించిన ఫొటోలు దిగేందుకు సాయంత్రం బావ లక్ష్మన్నతో కలసి ఏపీ21 బీసీ 6992 ప్యాషన్ ప్రో వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లక్ష్మన్న వాహనం నడుపుతుండగా జగన్మోహన్రెడ్డి వెనక కూర్చున్నాడు. పాత ఆర్టీఓ కార్యాలయం దగ్గరకు వెళ్లగానే లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రోడ్డుపై పడ్డారు. జగన్మోహన్రెడ్డి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మూడో పట్టణ ఎస్ఐ మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
మేడమ్ మీ పేరు మీద యూకే పౌండ్లు పార్శిల్..
–రాచకొండ యువతికి రూ.14 లక్షల కుచ్చుటోపీ –ప్రధాన నిందితుడు పరారీలో –డబ్బులు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాదారుడి అరెస్టు హైదరాబాద్ సిటీ : ‘యూకేలో డాక్టర్‌ను. నెలకు లక్షల్లో జీతమంటూ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌తో రాచకొండకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో పరిచయం. వాట్సాప్ నంబర్ ద్వారా చాటింగ్‌తో మరింత దగ్గరై నమ్మకం పెరిగాక యువతి పెళ్లికి ఓకే అంది. వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజెంట్‌కు ఇవ్వాలంటూ మొదలెట్టిన మోసంతో యూకే పౌండ్ల పార్శిల్‌తో రూ.14 లక్షల వరకు కుచ్చుటోపీ పెట్టాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం...గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతి పలు మ్యాట్రిమోని వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకుంది. ఫిబ్రవరి 7న డాక్టర్ సుమంత్ భరత్ పేరుతో ఆమె భారత మ్యాట్రిమోనీ ఖాతాకు ఓ సందేశం వచ్చింది. తాను యూకేలో డాక్టర్ కొలువు చేస్తానని నెలకు లక్షల్లో జీతం ఉంటుందని, పెళ్లికి చేసుకుంటానని నమ్మించాడు. ఏప్రిల్ తొలివారంలో తన కుటుంబ సభ్యులతో ఇండియాకు వస్తున్నామని చెప్పాడు. వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజెంట్‌కు పంపించాలని, ఆ తర్వాత ఒక మిలియన్ పౌండ్లను పంపిస్తానని నమ్మించాడు. ఇది నమ్మిన యువతి కొంత డబ్బును ఏజెంట్ ఖాతాలో జమచేశారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ కస్టమ్స్ అధికారినంటూ ...‘మేడం మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చింది. అందులో యూకే పౌండ్లు ఉన్నాయి. అది మీ దగ్గరికి రావాలంటే యాంటీ టెర్రరిజం సర్టిఫికెట్, కస్టమ్స్ క్లియరెన్స్ చార్జీలు చెల్లించాలం’టూ యూకే పౌండ్లు ఉన్న పార్శిల్ ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేశాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు ఏమాత్రం ఆలోచించకుండా రూ.14 లక్షలు వారు చూపిన బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసింది. అయితే రోజులు గడుస్తున్నా యూకే పౌండ్ల పార్శిల్ రాకపోవడంతో మోసపోయానని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ ప్రారంభించి ఢిల్లీ కేంద్రంగా మోసం జరిగినట్టు గుర్తించారు. ‘సైబర్ ఛీటర్ ఇండియాలో ఓ మధ్యవర్తి ద్వారా ఒక నైజీరియన్ ఈ మోసం చేసినట్లు గుర్తించారు. బాధితురాలు 11 బ్యాంక్ ఖాతాల్లో జమచేసిన రూ.14 లక్షల్లో పది శాతం కమిషన్‌ను ఆయా బ్యాంక్ ఖాతాదారులకు నిందితుడు ఇచ్చాడు. ఈ కేసుల్లో ఈ బ్యాంక్ ఖాతాదారుల్లో ఒకడైన ఢిల్లీకి చెందిన రషీద్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు నైజీరియన్‌ను, అతడికి సహకరించిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఇంటర్నెట్లో ‘అధో’ జగత్తు!!
- సెర్చింజన్ల ద్వారా చూడగలిగే సమాచారం 5 శాతమే - మిగిలిందంతా మరో ప్రపంచం.. అదో వ్యాపార సామ్రాజ్యం - మాదక ద్రవ్యాలు మొదలుకొని హత్యల వరకు.. - దొరకని వస్తువు లేదు.. జరగని పని లేదు..! - చూడాలంటే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు, టెక్నిక్‌లు అవసరం అమెరికాలో రాస్ ఉల్‌బ్రిట్ అనే వ్యక్తికి జీవిత ఖైదు పడింది! చేసిన తప్పేంటి..? సిల్క్ రోడ్ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూంటాడు అక్కడ కూడా ఇంటర్నెట్పై ఆంక్షలున్నాయా? కాదులెండి.. ఈ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ అమ్మేవాడట! మాదకద్రవ్యాలు అమ్మితే శిక్ష వేయకుండా ముద్దుపెట్టుకుంటారా? అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్! గూగుల్లోగానీ.. మరే ఇతర సెర్చింజన్ లోనైనా ఈ వెబ్‌సైట్‌ను వెతకండి కనిపించలేదు కదా! కనిపించదు కూడా! ఎందుకంటే.. మన కంటికి కనిపించే ఇంటర్నెట్లో ఈ వెబ్సైట్ ఉండదు! మరెక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అంటే.. ఈ వార్త చదివేయండి మరి!! ఇంటర్నెట్లో బోలెడంత సమాచారం ఉంటుందని.. అది అందరికీ అందుబాటులో ఉంటుందనుకుంటాం.. అయితే వాస్తవం దీనికి పూర్తిగా భిన్నం. ఇంటర్నెట్లో ఉన్న మొత్తం సమాచారంలో మనకు కనిపించేది పది శాతం మాత్రమేనట. మిగిలినదంతా మరో ప్రపంచమట!! దీంట్లో అడుగుపెట్టాలంటే కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు, టెక్నిక్‌లు అవసరం. డార్క్‌నెట్ అని పిలుచుకునే ఈ ‘అధో’జగత్తులో రెండు భాగాలున్నాయి. ఒకటేమో.. విశ్వవిద్యాలయాలు.. పరిశోధన సంస్థలు, ఇతరులెవరికీ తెలియకుండా సమాచారం ఇచ్చిపుచ్చుకునేది. దీంతో పెద్దగా ప్రమాదం లేదు గానీ.. రెండో భాగమే చాలా ప్రమాదకారి. ఇక్కడ బిట్‌కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీ ఉండాలే గానీ.. కాంట్రాక్టు హత్యలు మొదలుకొని.. అన్ని రకాల మాదకద్రవ్యాల వరకు ఇక్కడ దొరకని వస్తువు లేదు.. చేయలేని పని కూడా లేదు. ఈ బ్లాక్మార్కెట్లో ఓ చిన్న పావు రాస్ ఉల్‌బ్రిట్.. అతడి సిల్క్ రోడ్ వెబ్సైట్! ఇదీ రాస్ కథ..! టెక్సస్‌లోని ఆస్టిన్ నగరంలో పుట్టిన రాస్ విలియం ఉల్‌బ్రిట్ 2011లో సిల్క్‌రోడ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు అంచనా. ‘డ్రెడ్ పైరేట్స్ రాబర్ట్స్’పేరుతో చెలామణి అయిన రాస్ ఈ వెబ్సైట్ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు పదివేల రకాల మాదక ద్రవ్యాలను అమ్మేవాడు. దీంతోపాటే అశ్లీల చిత్రాలు, ప్రొఫెషనల్ హంతకులు కూడా అందుబాటులో ఉండేవారు. ఏడాది తిరక్కుండానే రాస్ ఆనుపానులను డ్రగ్ డీలర్లుగా నటించి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) పోలీసులు గుర్తించారు. సిల్క్రోడ్ను మూసేశారు. అయితే రాస్ కొద్ది కాలానికే సిల్క్‌రోడ్ 2.0 అవతారమెత్తి మళ్లీ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈసారి.. అంటే 2013లో మరింత పకడ్బందీ ప్లాన్ వేసి అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ ఏజెంట్లు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. అరెస్ట్ అయ్యేనాటికి సిల్క్‌రోడ్ 2.0లో జరిగిన లావాదేవీలు.. ఏడాదికి దాదాపు 15 లక్షల డాలర్లు! చేతులు మారిన మొత్తం 120 కోట్ల డాలర్లు.. అంటే దాదాపు 8,400 కోట్ల రూపాయలన్నమాట! డార్క్నెట్లోకి చేరడం ఆషామాషీ కాదు.. ఇంటర్నెట్లో దాదాపు 60 లక్షల కోట్ల వెబ్‌పేజీలు ఉన్నాయని గూగుల్ అంచనా. ఇందులో గూగుల్ సెర్చింజన్ చూడగలిగేది 5 శాతం మాత్రమే. ఇంకోలా చెప్పాలంటే ప్రతి మూడు వేల వెబ్ పేజీలకు గూగుల్ సెర్చింజన్ ఒక పేజీని మాత్రమే గుర్తించగలదు. మిగిలిందంతా డార్క్‌నెట్ లేదా డార్క్‌వెబ్ అంటారు. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైన రూటర్లు, ఏవైనా కొనుక్కోవాలంటే బిట్‌కాయిన్స్ ఉండాల్సిందే. తొలిరోజుల్లో అమెరికా రక్షణ శాఖ ఆర్పానెట్ పేరుతో ప్రారంభించిన సమాచార వ్యవస్థే ఇప్పుడు ఇంటర్నెట్గా రూపాంతరం చెందింది. ఈ ఆర్పానెట్ పరిధిలో లేకుండా రహస్యంగా ఇంకో నెట్వర్క్ ఉండేది. దీన్నే డార్క్‌నెట్ అని పిలిచేవారు. 2000 సంవత్సరంలో అమెరికా నావికాదళం టార్ పేరుతో అభివృద్ధి చేసిన రహస్య నెట్వర్క్, ఫ్రీనెట్ నెట్వర్క్ వంటివి అందుబాటులోకి రావడంతో డార్క్‌నెట్ మరింత విస్తరించింది. 2006 నాటికి టార్ నెట్వర్క్ నావికాదళం చేతుల్లోంచి మారిపోయి ఒక నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా మారిపోయింది. సాధారణ నెట్‌వర్క్‌లలోని సెర్చింజన్లకు దొరక్కుండా డార్క్‌నెట్‌లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఇదీ డార్క్‌నెట్ మెనూ.. ఫేస్బుక్లో 15 మంది ఫ్రెండ్స్‌తో ఫేక్ అకౌంట్ సృష్టించాలంటే ఒక డాలర్ మాదక ద్రవ్యాలు 2 నుంచి 900 డాలర్లు ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలంటే 7 డాలర్లు(గంటకు) స్పామ్ మెయిళ్ల వ్యాప్తికి (5 లక్షల మెయిళ్లు) 50 డాలర్లు వాన్నా క్రై వంటి మాల్వేర్ కావాలంటే.. 150 డాలర్లు బ్యాంక్, క్రెడిట్ కార్డు వివరాలు 1,000 డాలర్ల పైమాటే కాంట్రాక్ట్ హత్యలు 25,000 1,00,000 డాలర్లు అణ్వాయుధాలు లక్షల డాలర్ల నుంచి కోట్ల డాలర్లలో -
అమెరికా నుంచి తస్కరించి..
ఇతర దేశాలు, సంస్థలు, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచే అగ్రరాజ్యం అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారానే ఈ భారీ సైబర్ దాడికి బీజం పడిందని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు, వ్యక్తులు, సంస్థల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఎన్ఎస్ ఏ ఓ మాల్వేర్ను అభివృద్ధి చేసింది. ఎటర్నల్ బ్లూ అని పేరు పెట్టింది. విండోస్ అపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని లోపాల ఆధారంగా దీన్ని తయారు చేశా రు. ‘షాడో బ్రోకర్స్’అనే హ్యాకర్ల బృందం తాము ఎన్ఎస్ఏ నుంచి ‘సైబర్ ఆయుధాల’ను దొంగిలించామని గతేడాదే ప్రకటించింది. కానీ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ బృందం తాము తస్కరించిన ఆయుధాలను ఏప్రిల్ 14న ఇంటర్నెట్లో డంప్ చేసింది. అందులోని ఎటర్నల్ బ్లూ మాల్‌వేర్‌నే ఇప్పుడు సైబర్ దొంగలు వనా క్రై/వనాక్రిప్టర్ పేరుతో తమ దాడులకు ఉపయోగించుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. ‘ప్రమాదమని హెచ్చరించినా పశ్చిమదేశాల సాఫ్ట్వేర్ మీద దాడి చేయగల ప్రమాదకర సైబర్ ఆయుధాలను ఎన్ఎస్ఏ తయారు చేసింది. ఎన్ఎస్ఏ తన ఆయుధాలను పోగొట్టుకున్న తర్వాత కాకుండా.. సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని మొదట గుర్తించినప్పుడే వెల్లడిస్తే ఈ దాడి జరిగేది కాదేమో’అని సైబర్ ఉద్యమకారుడు ఎడ్వర్డ్ స్నోడెన్ తప్పుపట్టారు. రెండు నెలల కింద మైక్రోసాఫ్ట్ ఈ లోపాలను సరిదిద్దుతూ అప్డేట్ ప్యాచ్‌లను విడుదల చేసింది. చాలామంది ఈ అప్డేట్ను తమ పీసీల్లో, నెట్‌వర్క్‌లలో ఇన్స్టాల్ చేసుకోలేదు. ఇలా అప్డేట్ చేసుకోని కంప్యూటర్లు తాజా సైబర్ దాడి బారిన పడ్డాయని చెబుతున్నారు. -
వనా క్రై.. వర్రీ!
- ఇదో కొత్త రకం ర్యాన్సమ్వేర్ - కీలక సమాచారాన్ని బ్లాక్ చేసే సాఫ్ట్వేర్ ఒక్కసారిగా మీ కంప్యూటర్లో ఉన్న ఫైళ్లేవీ తెరుచుకోకపోతే.. ఎర్రటి స్క్రీన్ వచ్చి మూడు రోజుల్లో 300 డాలర్లు కడితేనే మీఫైళ్లు మీరు చూసుకోగలరన్న హెచ్చరిక కనిపిస్తే.. గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లక్షలాది మంది పరిస్థితి ఇదే. ‘వనా క్రై’ అనే ర్యాన్సమ్వేర్ వైరస్ దాడే దీనికి కారణం. దాదాపు వందకుపైగా దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడ్డాయి. అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్‌ను తస్కరించిన సైబర్ దొంగలు.. దాని సహాయంతో ఈ ‘వనా క్రై’ ర్యాన్సమ్వేర్ వైరస్‌ను రూపొందించడం గమనార్హం. ఈ వైరస్ కారణంగా కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు స్తంభించిపోవడంతో చాలా దేశాల్లోని ఆస్పత్రులు, టెలీకమ్యూనికేషన్లు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ వ్యవస్థల్లో సేవలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పోలీస్స్టేషన్లలో కంప్యూటర్లూ దీని బారినపడ్డాయి. మరి ఏమిటీ ‘వనా క్రై’ ర్యాన్సమ్వేర్ వైరస్? దానితో ప్రమాదం, జరిగే నష్టాలు ఏమిటి? హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బు చెల్లిస్తే సరిపోతుందా.. వంటి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనా క్రై’ దాడి, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై సాక్షి ఫోకస్.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ వ్యాపించేది ఇలా.. ఇంటర్నెట్లో ర్యాన్సమ్వేర్ వ్యాపించేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వచ్చే ఈ–మెయిళ్లు.. వాటిల్లో ఉన్న లింక్‌లను క్లిక్ చేస్తే ముందుగా మీ పీసీలోకి ఆ తర్వాత దశలవారీగా మీ కాంటాక్ట్స్‌లో ఉన్న మెయిల్ అడ్రస్‌లకు విస్తరిస్తుంది. కొన్నిసార్లు మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర సాఫ్ట్వేర్లలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ర్యాన్సమ్వేర్లను పీసీలు, నెట్‌వర్క్‌లలోకి ప్రవేశపెడతారు. స్మార్ట్ఫోన్లలోనైతే ఎస్ఎంఎస్ లింకుల ద్వారా ర్యాన్సమ్వేర్ విస్తరించే అవకాశముంది. ర్యాన్సమ్వేర్ దాడులను యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా గుర్తుపట్టలేవు. ఒకసారి కంప్యూటర్లోకి చొరబడ్డాక వైరస్ల మాదిరి ర్యాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకునేలా హ్యాకర్లు వీటిని తీర్చిదిద్దుతారు. 1989లో తొలి అటాక్.. ప్రపంచం మొత్తమ్మీద తొలి ర్యాన్సమ్వేర్ అటాక్ 1989లో జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. జోసెఫ్ పాప్ అనే ఎయిడ్స్ పరిశోధకుడు ఈ దాడికి బాధ్యుడని గుర్తించారు. ఎయిడ్స్ ఎవరికి వచ్చే అవకాశముందో తెలుసుకునే సాఫ్ట్వేర్ ఉందంటూ జోసెఫ్ దాదాపు 90 దేశాల్లోని ఎయిడ్స్ పరిశోధకులకు 20 వేల ఫ్లాపీ డిస్క్‌లను పంపించాడు. దీంట్లోనే రహస్యంగా ఒక మాల్వేర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న ఈ మాల్వేర్.. కంప్యూటర్ను 90 సార్లు ఆన్/ఆఫ్ చేసిన తర్వాత మేల్కొంది. పీసీలన్నీ బ్లాక్ అయిపోయాయి. 189 డాలర్లు కట్టాలని కొన్ని పీసీలపై.. 378 డాలర్లు చెల్లించాలని మరికొన్ని పీసీలపై సందేశాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ర్యాన్సమ్వేర్ అటాక్‌ను ఎయిడ్స్ ట్రోజాన్ లేదా పీసీ సైబోర్గ్ అటాక్‌గా పిలుస్తారు. గత ఏడాది ర్యాన్సమ్వేర్ దాడులివీ.. ► మార్చిలో లాస్ఏంజెలెస్లోని హాలీవుడ్ ప్రెస్బైటీరియన్ హాస్పిటల్ కంప్యూటర్ నెట్‌వర్క్‌పై ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. సమాచారాన్ని తిరిగి పొందేం దుకు ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ.10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఇది జరిగిన కొన్ని వారాలకే జర్మనీతో పాటు యూకేలోని 28 నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్‌లు కూడా ఇలాటి దాడులకు గురయ్యాయి. ► ఏప్రిల్‌లో రేస్ కార్ల టీమ్ నాస్కార్ మిలియన్ డాలర్ల విలువైన సమాచారాన్ని టెస్లాక్రిప్ట్ అటాక్ కారణంగా కోల్పోయింది. ► మసాచూసెట్స్‌లోని ఓ చిన్న పోలీస్ స్టేషన్ కేసుల వివరాలు తిరిగి పొందేందుకు 500 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ► సెప్టెంబర్‌లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గెరీ వారం రోజులపాటు ఎన్‌క్రిప్ట్ అయిన తమ ఈ–మెయిళ్లను తిరిగి పొందేందుకు దాదాపు రూ.15 లక్షలు చెల్లించామని అంగీకరించింది. తప్పించుకునే మార్గం... జాగ్రత్తగా ఉండటమే.. మూడు ముక్కల్లో చెప్పాలంటే.. ► గుర్తు తెలియని ఈ–మెయిళ్లు, వాటిల్లోని అటాచ్మెంట్లను ఓపెన్ చేయొద్దు ► కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా విండోస్‌లో ఎంఎస్17–010ను ఇన్స్టాల్ చేసుకోవాలి.. మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలు ఎప్పటికప్పుడు విడుదల చేసే సెక్యూరిటీ ప్యాచ్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ► ముఖ్యమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు పీసీతోపాటు కొన్ని ఇతర పరికరాల్లో బ్యాకప్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్, లేదా పెన్‌డ్రైవ్‌లలో బ్యాకప్ చేసుకోవడం ద్వారా ర్యాన్సమ్వేర్ అటాక్లలో నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ర్యాన్సమ్వేర్ దాడుల్లో భారత్ ర్యాంకు 5 తొలి మూడు స్థానాల్లో..అమెరికా, జపాన్, ఇటలీ సగటున హ్యాకర్లు డిమాండ్ చేసే మొత్తం 2015లో 294 డాలర్లు సగటున హ్యాకర్లు డిమాండ్ చేసే మొత్తం 2016లో 1077 డాలర్లు అనుకోకుండా అడ్డుకున్నాడు వనా క్రై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత విధ్వంసం సృష్టించినప్పటికీ బ్రిటన్‌కు చెందిన ఓ టెకీ అనుకోకుండా దీని వ్యాప్తిని అడ్డుకున్నాడు. వనా క్రై ర్యాన్సమ్వేర్ ఓ డొమైన్ (వెబ్సైట్)కు కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తోందని గుర్తించిన అతడు ఆ డొమైన్‌ను ఆన్లైన్లో కొనేశాడు. దీంతో వనా క్రైకు ఈ డొమైన్‌కు ఉన్న లింక్ తెగిపోయింది. ఫలితంగా దాని వేగం తగ్గిపోయిందని అతడు రాయిటర్స్ సంస్థకు వెల్ల డించాడు. అయితే హ్యాకర్లు తమ కోడ్‌ను మార్చేసి మళ్లీ దాడి చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు. భారత్‌లో వ్యాప్తి తక్కువే.. ‘యూరప్‌లో ఈ ర్యాన్సమ్వేర్ శుక్రవారం వ్యాపించడం మొదలైంది. ఆ సమయానికి ఆసియా దేశాల్లో శనివారం సాయంత్రం అయి ఉంది. కాబట్టి భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల్లో దీని వ్యాప్తి కొంత పరిమితంగానే ఉంది. అంతేకాకుండా ఈ ర్యాన్సమ్వేర్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే నెట్‌వర్క్‌ల ద్వారా ఎక్కువ వేగంగా వ్యాపించగలదు. జపాన్‌లో పరిస్థితి ఏమిటన్నది సోమవారం ఉదయానికి గానీ తెలియదు. వారు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముంది’ – విక్రమ్ ఠాకూర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ మేనేజర్,నార్టన్ బై సైమాంటిక్ (యాంటీవైరస్ సాఫ్ట్వేర్సంస్థ) -
బ్లాక్‌మెయిలింగ్‌కు కొత్త రూపం
గతేడాది పెరిగిన ర్యాన్సమ్వేర్ దాడుల మోతాదు కంప్యూటర్ ప్రపంచంలో బ్లాక్‌మెయిలింగ్‌కు కొత్త రూపం ఈ ర్యాన్సమ్వేర్. మీ పీసీలు, ఐటీ వ్యవస్థల్లోని కీలకమైన సమాచారాన్ని (ఫొటోలు, వీడియోలు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు) ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా మీకు అందుబాటులో లేకుండా చేయడం.. సమాచారం కోసం డబ్బు చెల్లించాలన్న డిమాండ్ పెట్టడం ర్యాన్సమ్వేర్ అటాక్లలో సాధారణ ప్రక్రియ. ర్యాన్సమ్వేర్లో రెండు రకాలున్నాయి. ఎన్క్రిప్టింగ్ ర్యాన్సమ్వేర్లో మీ ఫైల్స్ అన్నీ రహస్యమైన సంకేత భాషలోకి మారుతాయి. దీన్నే ఎన్క్రిప్షన్ అంటారు. దీంతో మీరు ఆ ఫైళ్లను చూసేందుకు వీలుండదు. ప్రత్యేకమైన కోడ్ లేదా సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే ఫైళ్లను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. వనా క్రై ఇలాంటిదే. ఇక రెండో రకం ర్యాన్సమ్వేర్ అటాక్‌లో పీసీ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ ఎంతసేపటికీ ఆన్ కాదు. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసే బూట్ రికార్డ్స్ హ్యాకర్ల సాఫ్ట్వేర్ బారిన పడినప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ర్యాన్సమ్ చెల్లించాక ఫైళ్లు, సమాచారం మనకు మళ్లీ దక్కుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ర్యాన్సమ్వేర్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాల కారణంగా సమాచారం మొత్తం కోల్పోయే అవకాశాలే ఎక్కువన్నది తాజా అంచనా. మాల్వేర్ల కంటే భిన్నం.. కొన్ని లింక్‌లు క్లిక్ చేయగానే.. తమ కంపెనీల వెబ్సైట్లు ఓపెన్‌కావడం.. లేదంటే అసభ్యకరమైన సైట్లు తెరుచుకోవడం.. వంటి పనులు మాల్వేర్ల ద్వారా జరుగుతుంటాయి. అయితే ర్యాన్సమ్వేర్ దీనికి భిన్నం. మీకు మీరుగా ఎన్క్రిప్షన్ను తొలగించడం దాదాపు అసాధ్యం. మీ పీసీలోని అన్ని రకాల ఫైళ్లను ఎన్‌క్రిప్ట్ చేసేందుకు హ్యాకర్లు ప్రత్యేకమైన అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తారు. విరుగుడు వారి దగ్గర మాత్రమే ఉంటుంది. ఫైళ్ల పేర్లు, ఎక్స్టెన్షన్లు అన్నీ మారిపోతాయి. ఏ ఫైల్లో వర్డ్ డాక్యుమెంట్ ఉందో? ఆడియో, వీడియోల ఫైల్స్ ఏవో కూడా గుర్తించలేరు. సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేశామని.. బిట్కాయిన్ల (సైబర్ ప్రపంచంలో చెలామణీ అవుతున్న కరెన్సీ) రూపంలో డబ్బు చెల్లించాలన్న సందేశం మాత్రం తెరపై ప్రత్యక్షమవుతుంది. వనా క్రై విషయాన్ని తీసుకుంటే.. మూడు రోజుల్లోపు 300 డాలర్ల విలువకు సరిపడా బిట్కాయిన్లు ఫలానా అడ్రస్‌కు పంపాలన్న సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ అడ్రస్ భౌతికమైంది కానేకాదు.. బ్యాంక్ అకౌంట్ కూడా కాదు. దీన్ని తెలుసుకోవడం సైబర్ సెక్యూరిటీ నిపుణులకూ చాలా కష్టం. -
ప్రేమ, పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్..
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలంటూ తోటి ఉద్యోగిని వేధిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన చరణ్ చౌదరి ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తోటి ఉద్యోగిని ఒకరిని ప్రేమ, పెళ్లి పేరుతో వెంటపడి అల్లరి చేస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలో గురువారం సాయంత్రం చరణ్ ఆ యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి ఆమెను కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆమె పదేపదే నిరాకరించడంతో విసుగు చెందిన చరణ్ ఆమెపై దాడికి దిగాడు. ఆ యువతిని కొట్టి, గోడకేసి బలంగా గుద్దాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చరణ్ చౌదరిని అరెస్ట్ చేశారు. -
పనికిరారని ముద్ర వేసి.. టెకీలను పంపేస్తున్నారు
ఎవరిదైనా ఉద్యోగం తీసేయాలంటే వాళ్లను పనికి రారని ముద్ర వేయాలి. దేశంలో చాలావరకు ఐటీ కంపెనీలు ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తున్నాయి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను 'నాన్ పెర్ఫార్మర్స్'గా ముద్ర వేసి వాళ్లను ఇంటికి పంపేస్తున్నాయి. ఆటోమేషన్ పెరగడం, లాభాలు గణనీయంగా తగ్గడం, ట్రంప్ ప్రభావంతో అంతర్జాతీయంగా కొత్త కాంట్రాక్టుటు రాకపోవడానికి తోడు ఉన్న కాంట్రాక్టులు కూడా రెన్యువల్ కాకపోవడం లాంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్యను చాలావరకు తగ్గిస్తున్నాయి. ప్రధానంగా మిడ్, సీనియర్ లెవెల్స్‌లో ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా కనపడుతోంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా.. ఇలా అనేక కంపెనీలు ఇటీవలి కాలంలో కొంతమందిని నాన్ పెర్ఫార్మర్లు అనే ముద్ర వేసి ఉద్యోగాలు ఊడగొట్టి పంపించాయి. ఉద్యోగుల జీతాల మీదే తాము దాదాపు 60-70 శాతం ఖర్చుపెట్టాల్సి వస్తోందని, దాన్ని తగ్గించుకోవడం తప్ప తమకు వేరే మార్గం ఉండబోదని కంపెనీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. పేరుకు నాన్ పెర్ఫార్మర్లు అని చూపించి పంపేస్తున్నారని, ఇలా పంపేసేవారిలో చాలామందికి ఇంతకుముందు సంవత్సరం లేదా ఈ సంవత్సరం రేటింగులు బ్రహ్మాండంగా వచ్చిన దాఖలాలు ఉన్నాయని, కేవలం అతి తక్కువ కాలంలో ఒక 'ఎ'గ్రేడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నట్టుండి నాన్ పెర్ఫార్మర్గా ఎలా మారిపోతాడని ఇటీవలే ఉద్వాసనకు గురైన ఒక ఉద్యోగి వాపోయారు. క్వాలిటీ ఎష్యూరెన్స్ విభాగంలో సాధారణంగా నాన్ పెర్ఫార్మెన్స్ అనేదే ఉండదని, కానీ అదే కారణం చూపించి పైగా తనకేదో మేలు చేస్తున్నట్లుగా నాలుగు నెలల జీతం ఇస్తున్నామని చెప్పి, తనచేత బలవంతంగా రిజైన్ చేయించారని, తనను ఏదో మీటింగ్ ఉందని పిలిపించి అటు నుంచి అటే పంపేశారని మరో ఉద్యోగి చెప్పారు. సాధారణంగా లే ఆఫ్‌లు ప్రతియేటా ఉంటాయి గానీ ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఒక హైరింగ్ సంస్థ నిర్వాహకుడు చెప్పారు. సీనియర్ పొజిషన్ల నుంచి బయటకు వచ్చినవారికి కూడా కొత్త సంస్థల్లో ఓపెనింగ్స్ పెద్దగా కనిపించడం లేదని, ఒకటీ అరా ఇంటర్వ్యూలు వస్తున్నా.. మళ్లీ యాజమాన్యం ఆలోచనలు మారడంతో చివరకు వాళ్లకు ఆఫర్ లెటర్లు రిలీజ్ కావడం లేదని వివరించారు. కొత్తగా తీసుకుంటాం: టీసీఎస్ ఒకవైపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంతా ఉద్యోగులను బయటకు పంపేస్తున్న ట్రెండ్ కనిపిస్తుంటే మరోవైపు టీసీఎస్ మాత్రం తమ దగ్గర అలాంటిదేమీ లేదని, పైపెచ్చు ఈసారి కొత్తగా మరింతమందిని తీసుకుంటామని ప్రకటించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. బిహార్‌లో తమ రెండో క్యాంపస్‌ను ప్రారంభించిన టీసీఎస్.. తన ప్రకటనతో నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించింది. -
మమ్మీ.. నన్ను క్షమించు..
♦ అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య? ♦ భువనగిరిలో విషాదఛాయలు నల్లగొండ : కుటుంబ కలహాలో.. మరో సమస్యో కారణాలైతే తెలియవు కానీ అమెరికాలో స్థిరపడిన ఓ సాఫ్ట్ ఉద్యోగి అమెరికాలో బలవన్మరణానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చాడు. దీంతో యాదాద్రిభువనగిరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామానికి చెందిన గూడూరు బాల్‌రెడ్డి, సుగుణ దంపతులు చాలా ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు. స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ప్రతిరోజు భువనగిరి నుంచి సొంత వాహనంపై వెళ్లి వస్తుండేవారు. బాల్రెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు మధుకర్‌రెడ్డి(37) 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. తదనంతరం అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు. ఏడేళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్వాతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈయన కుటుంబ సభ్యులతో కాలిఫోర్నియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుకర్‌రెడ్డి భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8గంటలకు మృతిచెందినట్లు తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అం దించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతికి గల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మృతిచెందిన సమాచారం అందిన వెం టనే తల్లి సుగుణ మొబైల్‌కు మధుకర్రె డ్డి పెట్టిన మమ్మీ నన్ను క్షమించు మే సే జ్ను చూసుకున్నారు. అమెరికా కాలమా నం ప్రకారం పగలు సమయంలో పె ట్టి న మేసేజ్ తల్లికి భారత కాలమాన ప్రకా రం అర్ధరాత్రి సమయంలో వచ్చింది. వారం రోజుల క్రితమే.. మధుకర్‌రెడ్డి ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన తండ్రి బాల్‌రెడ్డి వారంరోజుల క్రితమే తన కుమారుడితో ఫోన్లో మాట్లాడి డబ్బులు కూడా పంపించాడు. తమ కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు లేవని రోదిస్తూ తం డ్రి బాల్‌రెడ్డి చెప్పాడు. తల్లి కి రాత్రి మమ్మీ తనను క్షమించమని రెం డుసార్లు మేసేజ్ పెట్టాడని ఆ మేసేజ్‌ను ఉదయం చూసుకున్నామని చెప్పాడు. కుటుంబ కలహాతోనేనా? భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్న అనంతరం మధుకర్‌రెడ్డి కాలిఫోర్నియాకు వెళ్లిపోయాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మధుకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు ఉన్న భువనగిరి పట్టణంలోని నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరును చూసి బంధుమిత్రులు కంటతడిపెట్టారు. కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి మృతదేహం గురువారం భువనగిరికి చేరుకునే అవకాశం ఉంది. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం
గచ్చిబౌలి: మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ బాల్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పోచమ్మ బస్తీకి చెందిన ప్రియాంక గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 27న ఆఫీసుకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. భర్త శ్రవణ్‌కుమార్ మంగళవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
భాగ్యనగర్ కాలనీ: కుటుంబ కలహాల కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు యాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..వరంగల్ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన బండా అశోక్ (29) హెచ్ఎంటి హిల్స్‌లో ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య స్వప్న, కుమారుడు ఉన్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య విబేధాలు, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అతని భార్య స్వప్న 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికిలోనైన అశోక్ మంగళవారం రాత్రి బ్యాగుతో సహా ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్వాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడేముందుకు అతను అమెరికాలో ఉంటున్న తన సోదరుడికి ’తన కుమారుడు మిట్టును జాగ్రత్తగా చూసుకోవాలని..తన భార్య స్వప్న మరో వివాహం చేసుకోవాలని మెసేజ్ పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
అరకోటి అప్పులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి చోరీలు!
నల్గొండ: గత కొన్ని నెలలుగా చోరీలకు పాల్పడుతోన్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన వినయ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత 2005లో హైదరాబాద్‌లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. అందులో నష్టం రావడంతో కంపెనీ మూసేశాడు. ఈ క్రమంలో సుమారు రూ.60 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేయడమే మార్గమని భావించాడు. విజయవాడ, రాజమండ్రిలలో కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, కార్లు, బంగారం చోరీచేస్తూ గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. శిక్ష అనుభవించిన వినయ్ రెండు నెలల క్రితమే విజయవాడ జైలు నుంచి విడుదలయ్యాడు. జైలుకు వెళ్లి వచ్చినా అతని బుద్ధి మాత్రం మారలేదు. అక్కడ ఉంటే కష్టమేనని భావించి మకాం మార్చిన అతడు నల్గొండ జిల్లాపై కన్నేశాడు. నెంబర్‌ప్లేట్ లేని కారులో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఇప్పటికే నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఓ ఇంట్లో చోరీ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
ఘట్కేసర్: భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇన్ఫోసిస్ ఉద్యోగి అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అజీజ్, సనా భార్యాభర్తలు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్, అన్నోజిగూడలో వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అజీజ్ ఇన్ఫోసిస్ సాప్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 4 న భార్యాభర్తలు ఏదో విషయమై గొడవపడ్డారు. దీంతో అజిజ్ తన సెల్‌ఫోన్, వాలెట్ తీసుకోకుండానే మనస్తాపంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు అజీజ్ ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందుతున్న ఆయన భార్య సనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజీజ్ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్1 బి వీసాలపై స్పందించిన మోదీ
నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో కాస్త విశాల హృదయంతో ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాను కోరారు. 'అమెరికా ఫస్ట్' అన్న డోనాల్డ్ ట్రంప్ విధానాలు, హెచ్1బి వీసాల సంఖ్యపై వేటు.. తదితర పరిణామాల నేపథ్యంలో మోదీ ఈ అంశంపై స్పందించారు. హెచ్1బి వీసాలను తగ్గిస్తే.. 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ సేవల పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ప్రధానంగా అమెరికాకు సాఫ్ట్వేర్ ఎగుమతుల మీదే ఈ పరిశ్రమ ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని పరిపుష్ఠం చేయడంలో నిపుణులైన భారతీయుల పాత్రను మోదీ ప్రస్తావించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కాంగ్రెస్ నుంచి వచ్చిన 26 మంది సభ్యుల బృందాన్ని కలిసిన సందర్భంగా మోదీ ఈ విషయం వారికి తెలిపారు. సమతుల్యతతో కూడిన, దూరదృష్టి కలిగిన కోణంలో వృత్తినిపుణుల విషయంలో ఆలోచించాలని ప్రధాని కోరినట్లు పీఎంఓ తెలిపింది. -
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
ప్రేమ మందిరంలో వైభవంగా దాక్షాయణి, ఉమామహేశ్వరావుల వివాహం ఆదర్శ వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు కన్యాదానం చేసిన అరబిందో మార్కెటింగ్ వైస్ చైర్మన్ ప్రసాద్ దంపతులు అమలాపురం టౌన్:అక్కడ ఆదర్శం ఆవిష్కృతమైంది. పెద్దాపురానికి చెందిన చెన్నైలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పేరి ఉమామహేశ్వరరావు అమలాపురం కామాక్షీపీఠం ప్రేమమందిరంలో పెరిగిన దాక్షాయణిని వివాహమాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. కామాక్షీ పీఠం ప్రేమ మందిరంలో అనాథగా పెరిగిన దాక్షాయణిని ఆదివారం తెల్లవారు జామున ఉమామహేశ్వరరావు వివాహమాడారు. పీఠాధిపతి కామేశమహర్షి ఆధ్వర్యంలో కామాక్షీ పీఠం ప్రేమ మందిరంలో ఈ ఆదర్శ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదుటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్థి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు తదితర ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. కామాక్షీ పీఠానికి వచ్చే భక్తులందరూ ఈ వేడుకకు తరలి రావటంతో పీఠం కిక్కిరిసిపోయింది. ప్రేమ మందిరింలోని మిగిలిన పిల్లలందరూ తమ అక్క దాక్షాయణి వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కకు చిరు కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి తన సొంత ఆడపిల్లకు పెళ్లి చేసినట్టే అన్నీ తానై చక్కబెట్టింది. శనివారం మధ్యాహ్నానికే పెద్దాపురం నుంచి వరుడు ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులు, బంధువులు పీఠానికి చేరుకున్నారు. సాయంత్రం నుంచి పెళ్లి వేడుకులు మొదలయ్యాయి. మాకు ఆడపిల్ల లేని లోటు తీరింది నేను హైదరాబాద్ అరబిందో ఫార్మా లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నాను. మా స్వగ్రామం అమలాపురంలో కామాక్షీ పీఠం ఉన్న కృష్ణారావు వీధే. చిన్నతనం నుంచి పీఠంతో నాకు అనుబంధం ఉంది. మా కుంటుంబంలో అందరి పుట్టిన రోజులు పీఠంలోనే జరుపుకుంటాం. నా భార్య సుజాత, నేను పీఠంలోని ప్రేమ మందిరంలో పెరిగే అనాథ పిల్లలతో అనుబంధం పెంచుకున్నాం. మాకు ఆడపిల్లలు లేరు. అందుకే దాక్షాయణిని తమ కూతురుగా భావించి ఆమె పెళ్లి ఖర్చు అంతా భరించాం. వరుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేశాం. మాకు ఆడపిల్ల లేదన్న లోటు తీరింది. – పెమ్మరాజు ప్రసాదరావు, సుజాత దంపతులు సంగీతమే ఇద్దర్నీ కలిపింది గత సంవత్సరం ఇదే పీఠం ప్రేమ మందిరంలో ఓ అనాథ యువతిని నా స్నేహితుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి నేనూ వచ్చాను. అప్పుడే నాకూ ఓ అనాథ యువతిని పెళ్ల ఆలోచన చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. అప్పుడే దాక్షాయణిని చూశాను. ఆమె నాకు నచ్చటానికి ప్రధాన కారణం ఆమె ఓ గాయకురాలు, సంగీతం వచ్చు. నాకు సంగీతమన్నా... గానమన్నా ఇష్టం. ఇవే ఆమెను ఇష్టపడటానికి అసలు కారణాలయ్యాయి. అవే నన్ను ఆమె మెడలో మూడు ముళ్లు వేసేలా... ఏడు అడుగులు నడిచేలా చేశాయి. – పేరి ఉమా మహేశ్వరరావు, వరుడు, సాప్ట్ వేర్ ఉద్యోగి, చెన్నై -
5 నిమిషాల్లో రైల్వే టైంటేబుల్ రూపకల్పన
ముంబై: 5 నిమిషాల్లోనే లోకల్ రైళ్లకు టైం టేబుల్ రూపొందించగల సాఫ్ట్‌వేర్‌ను బాంబే ఐఐటీ అధ్యాపకులు రూపొందించారు. రైలు చేరుకునే సమయానికి పలు స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు ఖాళీ లేకపోవడం తదితర ఇతర సమస్యలకూ ఈ సాఫ్ట్వేర్ పరిష్కారం చూపగలదు. టైం టేబుళ్లను రూపొందించే విధానాన్ని సరళీకరించేందుకు ఐఐటీ అధ్యాపకులు నారాయణ్ రంగరాజ్, మధు బేలూర్లు గత రెండేళ్లుగా కృషి చేసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి గురువారం ప్రదర్శించారు. ముంబై లోకల్ రైళ్ల కోసం దీనిని రూపొందించినా, చిన్న మార్పులతో దేశంలోని అన్ని లోకల్ రైల్ నెట్‌వర్క్‌లకు అన్వయించుకోవచ్చని తెలిపారు. -
బాబు బంగారం
- అనాథ యువతిని పెళ్లి చేసుకోనున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి - అమలాపురం కామాక్షి పీఠం ప్రేమ మందిరంలో పెరిగిన అనాథ ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.. ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని.. నేనున్నానని.. నీ తోడవుతానని, నేనున్నానని.. నిను మనువాడతానని’’ అంటూ ఓ అనాథ యువతితో ఏడడుగులు నడిచేందుకు.. మూడుముళ్ల బంధంతో జీవిత పయనం సాగించేందుకు సిద్ధమయ్యాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. దీంతో అమలాపురం కామాక్షీ పీఠంలోని ప్రేమమందిరంలో ‘పెళ్లి’సందడి నెలకొంది. అమలాపురంలోని కామాక్షీ పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమమందిరానికి చెందిన అనాథ యువతి దాక్షాయణిని పెద్దాపురానికి చెందిన, చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగి పేరి ఉమామహేశ్వరరావు వివాహం చేసుకునేందుకు నిశ్చయించాడు. వీరికి శనివారం రాత్రి 5.10 గంటలకు (తెల్లవారితే ఆదివారం) వివాహం జరిపేందుకు పీఠాధిపతి కామేశ మహర్షి ముహూర్తం నిర్ణయించారు. దాక్షాయణికి రక్తసంబంధీకులు ఎవరూ లేకపోయినా పీఠం ఉన్న వీధికి చెందిన పెమ్మరాజు ప్రసాదరావు, సుజాత దంపతులు కన్యాదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ప్రేమ మందిరంలో పెళ్లి సందడి నెలకొంది. తమ అక్క పెళ్లికూతరు కాబోతోందనే ఆనందంలో మిగతా అనాథపిల్లలు ఆనందంలో ఉన్నారు. కామాక్షీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆదర్శ వివాహం జరగనుంది. ఆ ఆలోచన వచ్చిందిలా.. గత ఏడాది పీఠం ప్రేమ మందిరంలోని జరిగిన ఓ అనాథ యువతి వివాహ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఆ వివాహ సమయంలో దాక్షాయణిని చూసిన ఆయన తానూ అనాథను పెళ్లిచేసుకోవాలన్న ఆదర్శమైన ఆలోచనకు వచ్చారు. దాని ఫలితమే వారి వివాహం నేడు కార్యరూపం దాల్చుతోంది. ఎక్కడో పుట్టి.. ప్రేమ మందిరంలో పెరిగి.. ఐదేళ్ల ప్రాయంలో దాక్షాయణి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం వచ్చే ఆర్టీసీ బస్సులో రాజమహేంద్రవరం చేరుకుంది. అక్కడ బస్ స్టేషన్లో ఏడుస్తున్న ఆ చిన్నారిని కొందరు చేరదీసి పోలీసుల సహకారంతో అమలాపురం కామాక్షీపీఠంలోని ప్రేమ మందిరంలో చేర్చారు. సుమారు ఇరవై ఏళ్ల నుంచి పీఠంలోనే పెరిగింది. ఇంటర్మీడియట్ వరకూ చదివింది. సంగీతం నేర్చుకుంది. గాయకురాలిగా ఎన్నో మధుర గీతాలు ఆలపించి మరెన్నో బహుమతులు పొందింది. అమలాపురంలోని పలు పాఠశాలల్లో సంగీతం ఉపాధ్యాయినిగా పనిచేసి తన వంతు ఉపాధికి బాటలు వేసుకుంది. వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది నా అన్న వాళ్లు లేకపోయినా అమ్మ, నాన్న కమ్మని పిలుపులకు దూరమైనా ఆ లోటు ప్రేమమందిరంలో ఏనాడు అనిపించలేదు, కనిపించలేదు. 60 మంది పిల్లల మధ్య తానూ ఓ అనాథగా పెరిగినా ఆ భావన ఏ రోజూ కలగకుండా పీఠాధిపతి కామేశ మహర్షి, ప్రేమ మందిరం అమ్మ వాణి తమను పెంచారు. తమ ప్రేమ మందిరం కుటుంబం నుంచి వెళ్లిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. - దాక్షాయణి -
వరకట్న వేధింపులు తాళలేక...
అమీర్‌పేట: వరకట్న వేధింపులు భరించలేక నవవధువు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్సపెక్టర్ వహీదుద్దీన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంకు చెందిన బ్రహ్మయ్య కూతురు భార్గవి(25)కి విజయవాడకు చెందిన నరేంద్రతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నరేంద్రకు రూ.25 లక్షల నగదు, 20 తులాల బంగారం ఆధిబట్లలో ఓ ప్లాట్ కానుకగా ఇచ్చారు. భార్గవి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుండగా, నరేంద్ర మధురానగర్‌లోని వామన కన్సల్టెన్సీలో హెచ్ఆర్గా పనిచేస్తూ..రాజీవ్‌నగర్ స్వర్ణపురి కాలనీలో ఉంటున్నారు. అదనపు కట్నం కోసం నరేంద్ర భార్గవిని వేధిస్తూ రావడంతో ఆమె తల్లిదండ్రులు నెలరోజుల క్రితమే మరో రూ.5 లక్షలు ఇచ్చారు. అయినా అతను వేధింపులు మానకపోవడంతో మనస్థాపం చెందిన భార్గవి సోమవారం ఉదయం చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమీపంలోనే ఉంటున్న బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తట్టగా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త నరేంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తొలి ప్రయత్నంలోనే జాబ్ సొంతం చేసుకోండిలా..
► జనవరి 21 నుంచి సాక్షి ఎడ్జ్ ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణ కోర్సు ► పట్టభద్రులైన యువత కోసం 20 రోజుల పాటు శిక్షణ ► ఆసక్తిగల వారు 9603533300ను సంప్రదించవచ్చు హైదరాబాద్: తల్లిదండ్రులేమో మావాడు గొప్ప ఉద్యోగం సంపాదిస్తాడని కలలు కంటూ ఉంటారు. కాలేజీలో చూస్తే ఆ విద్యార్థికి మంచి మార్కులే ఉంటాయి. కానీ ఉద్యోగ సాధనలో భాగంగా హాజరైన తొలి ఇంటర్వ్యూలోనే విఫలమై వెనుదిరుగుతాడు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు... ఇలా పెద్ద చదువు చదివిన చాలా మంది విద్యార్థుల బాధ ఇలాంటిదే. అలాగని వీరందరికి సత్తా లేదని కాదు.. ఉద్యోగం సంపాదించుకోవడం కోసం కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడమే కారణం. అలాంటి విద్యార్థులకు ఇంటర్వ్యూలలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి అవలీలగా జాబ్ సొంతం చేసుకునే మెళకువలను అందించేందుకు సాక్షి ఎడ్జ్ ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణ కోర్సును పరిచయం చేస్తోంది. 20 రోజుల వ్యవధిగల ఈ కోర్సు... విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, బృంద చర్చలు, నాయకత్వ లక్షణాలు, విషయాన్ని వివరించే తీరు, బృంద నిర్మాణంలో శిక్షణార్థుల సామర్థ్యాన్ని పెంచే దిశగా ఉండనుంది. పలు రంగాల్లో మానవ వనరుల విభాగంలో విస్తృత అనుభవమున్న నిపుణులతో రూపొందించిన ఈ కోర్సు ఉద్యోగ, జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని మీకిస్తుంది. జనవరి 21న ప్రారంభం కానున్న ఈ కోర్సు ఫీజు రూ.4,600 మాత్రమే. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న ‘సాక్షి జర్నలిజం స్కూల్’ప్రాంగణంలో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య తరగతులు ఉంటాయి. రిజిస్ట్రేషన్: సాక్షి టీవీ, 6–3–248/3, సాక్షి టవర్స్, రోడ్డు నంబర్ 1, బంజా రాహిల్స్. ఈ చిరునామాలో ఔత్సాహిక అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసు కోవచ్చు. మరిన్ని వివరాలను 9603533300 నంబర్‌కు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆంగ్లంపై మంచి పట్టు ఉన్నవారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది. ఒకవేళ ఆంగ్లంపై అంత గా పట్టులేకపోతే సాక్షి ఎడ్జ్ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును ఎంచుకుంటే మంచిది. -
నేటినుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్
– రోజుకు 1000 మందికి ఆహ్వానం – ఈనెల 20 వరకు దేహదారుఢ్య పరీక్షలు – అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలి: ఎస్పీ కర్నూలు: పోలీసు శాఖలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో గురువారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గత నెలలో ప్రాథమిక పరీక్ష రాసి 11,762 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిని రోజుకు 1000 మంది చొప్పున హాజరు కావలసిందిగా ఆహ్వానాలు పంపారు. బరువు, ఛాతీ, ఎత్తు కొలతల్లో అర్హత సాధించినవారికి లాంగ్‌జంప్ 100 మీటర్లు, 1600 మీటర్లు పరుగు పోటీలు నిర్వహించనున్నారు. గతంలో పోలీసు అధికారులు దగ్గరుండి వారి కనుసన్నల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేవారు. అలా కాకుండా ఈసారి కానిస్టేబుళ్ల ఎంపిక పోటీలు సాంకేతిక పద్ధతిలో నిర్వహించనున్నారు. ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు పరుగుపందెం కూడా అధికారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పద్ధతి ద్వారానే ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం రెండు సాఫ్ట్వేర్ కంపెనీల సిబ్బందికి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ నెల 20 వరకు ప్రతిరోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్రీడామైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. అభ్యర్థులకు కేటాయించిన సమయాల్లోనే దేహదారుఢ్య పరీక్షలకు అందుబాటులో ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో అభ్యర్థులు హాజరుకావలసి ఉంటుంది. అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించండి : ఎస్పీ ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు ఏర్పాట్లను ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. దేహదారుఢ్య పరీక్షల వద్ద విధులు నిర్వహించే సిబ్బందితో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డిగ్రీలు, పీజీలు, ఆపై చదువులు చదివిన అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు హాజరవుతున్నారని వారి పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అసభ్యకర పదజాలాన్ని వాడకూడదని ఆదేశించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే పైఅధికారులకు 'సెట్' ద్వారా అందించాలని ఆదేశించారు. -
ఎన్నికల వివరాలతో కొత్త సాఫ్ట్వేర్
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో ఎన్నికల వివరాలు, ఓటర్లు, అభ్యర్థుల సమాచారంతో కొత్తగా ఎలక్టోరల్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. ఎన్నికలు, ఏర్పాట్ల గురించి సమీక్షించారు. జిల్లాలో జరిగిన సాధారణ, మున్సిపల్ జనరల్ బాడీ ఎన్నికల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఎలక్టోరల్ సాఫ్ట్‌వేర్‌తో ఏ ఎన్నికలు నిర్వహించినా అత్యంత సులువుగా, వేగంగా ఎన్నికల వివరాలన్నీ తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల ఓటర్ల జాబితాను సరళీకృతం చేసి, దానిని ఈ సాఫ్ట్‌వేర్‌లో తెలుసుకోవచ్చని వివరించారు. ఈ వెబ్సైట్లో ఎన్నికల నియమ నిబంధనలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు. అఫిడవిట్ తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. -
అదనపు ‘ఉపాధి’కి సాఫ్ట్వేర్
అనంతపురం టౌన్ : ఉపాధి పనులను వంద రోజుల నుంచి 150 రోజులకు పెంచిన ప్రభుత్వం దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు కల్పించనున్నారు. జిల్లాలోని 63 మండలాలూ కరువు మండలాల జాబితాలో చేరినందున వలసల నివారణకు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు పనిదినాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులో లేకపోవడంతో అధికారులు పనులు కల్పించలేకపోయారు. ప్రస్తుతం జిల్లాలో 7,87,727 జాబ్‌కార్డులు జారీ చేయగా 7,79,510 మంది కూలీలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 22 వేలకు పైగా కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. ఆదివారం సాఫ్ట్వేర్ సిద్ధం కావడంతో వీరితోపాటు పనులు కావాలనే వారందరికీ 150 రోజులు పని కల్పించనున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. -
జీఎస్టీ పోర్టల్ రడీ
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమలు కోసం సాఫ్ట్వేర్ దాదాపు సిద్ధంగా ఉందని జీఎస్టీఎన్ ఛైర్మన్ నవీన్ కుమార్ వెల్లడించారు. క్రెడిట్ / డెబిట్ కార్డులు ద్వారా సులభంగా పన్ను చెల్లింపులు, రిటర్న్స్ కోసం ఉద్దేశించిన జీఎస్టీ పోర్టల్ ను మంగళవారం ప్రారంభించినట్టు తెలిపారు. www.gst.gov.in పేరుతో దీన్ని లాంచ్ చేసినట్టు చెప్పారు. ఈ పోర్టల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పని దాదాపు 60 శాతం పూర్తయిందని డిసెంబర్ నాటికి హార్డ్‌వేర్ పని పూర్తి కానుందని వివరించారు. అనంతరం ఈ సాఫ్ట్వేర్ ను డాటా సెంటర్లకు అందించి టెస్టింగ్ కోసం ఉంచుతామన్నారు. కేంద్ర రాష్త్ర ప్రభుత్వాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లోకి రానున్న విధానానికిగాను సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రారంభమైనట్టు వెల్లడించారు. 2015 నవంబరులో పని ప్రారంభించిన తాము ఈ మేరకు పని పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. డాటా భద్రత కోసం న్యూఢిల్లీ, బెంగళూరులలో డాటా సెంటర్లను నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. 65 లక్షల వ్యాట్ చెల్లింపుదారుల, సుమారు 20 లక్షల సేవా పన్ను చెల్లింపుదారులు, 3-4 లక్షల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపుదారులను ఈ కొత్త పోర్టల్‌కు బదిలీచేసే ప్రక్రియ ప్రారంభమైందని నవీన కుమార్ పీటీఐకి తెలిపారు. జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్) పిలిచే తాత్కాలిక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ కింద కింద కొత్త రిజిస్ట్రేషన్ల ఏప్రిల్ 2017 నుంచి ప్రారంభంకానున్నాయి. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నల్లగొండ (నల్లగొండ క్రైం): నల్లగొండ జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ కానిస్టేబుల్ యాదగిరి చిన్న కుమారుడు శ్యాంప్రసాద్(22) మంగళవారం రాత్రి చెన్నై అడయార్‌లోని ఓ లాడ్జిలో ఉరేసుకోగా... బుధవారం అర్ధరాత్రి తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చెన్నైకి హుటాహుటిన వెళ్లారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని పాలెం గ్రామానికి సంబంధించిన చౌగోని యాదయ్య ఏసీబీలో కానిస్టేబుల్. ఆయన పెద్ద కుమారుడు శ్రీకాంత్ మూడేళ్లుగా అమెరి కాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండో కుమారుడు శ్యాంప్రసాద్(22) చెన్నైలోని ర్యాంకీ సిస్టమ్స్ (ఎరోప్లేన్) కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. శ్యాంప్రసాద్ నలుగురు స్నేహితులతో కలసి చెన్నైలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం అమెరికా నుంచి సోదరుడు శ్రీకాంత్ ఫోన్ చేయగా.. శ్యాంప్రసాద్ లిఫ్ట్ చేయలేదు. మళ్లీ ఫోన్ చేస్తానని ఎస్ఎంఎస్ చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మళ్లీ ఫోన్‌చేయగా స్విచ్ ఆఫ్ అయింది. అయితే, శ్యాంప్రసాద్.. తాను ఇంటికి వెళుతున్నానని అతడి స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని కుటుంబసభ్యులు తెలిపారు. లాడ్జిలో ఉరివేసుకోవడానికి ముందు ఓ స్నేహితుడికి తాను రూమ్‌కు వస్తున్నానని శ్యాంప్రసాద్ మేసేజ్ చేసినట్లు స్నేహితులు చెప్పారన్నారు. ఆ తర్వాత స్నేహితులు ఫోన్ చేసినా కలవకపోవడంతో వారు పట్టించుకోలేదని చెప్పారు. ఆత్మహత్యపై అనుమానాలు మృతుడి వద్ద ఫోన్ ఉన్నప్పటికీ సిమ్‌కార్డు లేకపోవడంతో ఆత్మహత్య మిస్టరీగా మారింది. లాడ్జిలో ఉన్న సీసీ కెమెరాల్లో శ్యాం ప్రసాద్ ఒక్కడే బ్యాగ్ వేసుకుని లాడ్జిలోకి వచ్చి అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలున్నాయని చెన్నైకి వెళ్లిన అతడి బంధువులు చెప్పారు. బుధవారం ఉదయం శ్యాంప్రసాద్ బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్ తట్టగా.. ఉరేసుకున్న దృశ్యం కనిపించిందని చెప్పారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేందుకు వీసా సిద్ధమైన క్రమంలో ఈ ఘటన జరగడం అతడి కుటుంబ సభ్యులు, బంధువులను కలిచివేసింది. కాగా, మృతదేహాన్ని శుక్రవారం నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలోని సొంత నివాసానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని పై అత్యాచార యత్నం
హైదరాబాద్: విధులు ముగించుకుని క్యాబ్‌లో వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆల్వాల్ పీఎస్ పరిధిలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా.. అదే సమయంలో కారులో ఉన్న క్యాబ్ సూపర్‌వైజర్‌తోపాటు డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో ఇద్దరు నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆల్వాల్ పీఎస్‌కు తరలించారు. అనంతరం కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపనున్నట్టు సమాచారం. -
తొలిరోజు వాహన రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు
• రవాణా శాఖ సాఫ్ట్వేర్ అనుసంధానంలో లోపాలు • కొత్త జిల్లాల్లో మొరాయించిన వ్యవస్థ • ఐటీ సిబ్బందితో రెండు బృందాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయి. కొత్త జిల్లాల పరిధిలో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ అనుసంధానం చేశారు. ఆయా జిల్లాల స్వరూపం, మండలాలు, వాటి పరిధిలోని గ్రామాల పేర్లను జిల్లాల వారీగా సాఫ్ట్‌వేర్‌తో జతచేశారు. అయితే ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని పేర్లు, సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన పేర్లతో మ్యాచ్ కాకపోవడంతో కంప్యూటర్లు మొరాయించాయి. కొన్ని చోట్ల సర్వర్లు ఇబ్బంది పెట్టాయి. తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వనపర్తి, నాగర్‌కర్నూలు, భూపాలపల్లి, వికారాబాద్‌లలో సమస్య తీవ్రమైంది. దీంతో కొత్త జిల్లాల తొలిరోజు వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర పనులు ఆగిపోయాయి. దీంతో రవాణా శాఖ వెంటనే ఐటీ సిబ్బందితో కూడిన రెండు బృందాల ద్వారా సమస్యను పరిష్కరించింది. దసరా ముందు రోజు రాత్రి పొద్దు పోయే వరకు కొత్త జిల్లాల స్వరూపంలో మార్పులు జరగడంతో సాఫ్ట్వేర్ అనుసంధానంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. పాత నంబర్లు అలాగే.. కొత్త జిల్లాలకు రవాణా శాఖ కొత్త కోడ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు కోడ్లు మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంగారెడ్డి టీఎస్7, మేడ్చల్ టీఎస్8, కామారెడ్డి టీఎస్17, నిర్మల్ టీఎస్18, మంచిర్యాల టీఎస్19, కొమురంభీమ్ టీఎస్ 20, జగిత్యాల టీఎస్ 21, పెద్దపల్లి టీఎస్ 22, రాజన్న సిరిసిల్ల టీఎస్ 23, వరంగల్ రూరల్ టీఎస్ 24, జయశంకర్ భూపాలపల్లి టీఎస్ 25, మహబూబాబాద్ టీఎస్ 26, జనగాం టీఎస్ 27, భద్రాద్రి టీఎస్ 28, సూర్యాపేట టీఎస్ 29, యాదాద్రి టీఎస్ 30, నాగర్‌కర్నూలు టీఎస్ 31, వనపర్తి టీఎస్ 32, జోగులాంబ గద్వాల టీఎస్ 33, వికారాబాద్ టీఎస్ 34, మెదక్ టీఎస్ 35, సిద్దిపేట టీఎస్ 36 నంబర్లను రవాణా శాఖ కేటాయించింది. -
ట్యాంకర్‌ను ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
కోదాడ అర్బన్ : మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్ వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ హన్మకొండకు చెందిన వద్దిరాజు శ్రీనా«థ్ (38) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం గురువారం రాత్రి కోదాడ మీదుగా విజయవాడకు వెళ్లేందుకు తన కారులో బయలుదేరాడు. మండల పరిధిలోని నల్లబండగూడెంలోని రామాపురం క్రాస్‌రోడ్ సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపి ఉంచిన ట్యాంకర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనాథ్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయంపై తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనా«థ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా, మృతుడి భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. -
సాప్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
తాళం వేసి రాత్రి డ్యూటీకి వెళ్లిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగి ఇంటి తాళాలు పగుల కొట్టి 25 తులాలు బంగారు ఆభరణాలు, 25 తులాలు వెండి వస్తువులు దోచుకెళ్లారు. ఈ సంఘటన గురువారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నవీన్‌కుమార్, బాధితుడు తెలిపిన వివరాలు.. జమ్మూకు చెందిన హనిత్సింగ్ కొంత కాలంగా కుటుంబ సభ్యులతో కలిసి బోడుప్పల్ అంజయ్య ఎన్‌క్లేవ్‌లో వుంటున్నాడు. హబ్సిగూడలోని జెన్‌ప్యాక్ లో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం భార్య డెలివరీ కోసం జమ్మూకు వెళ్లింది. అప్పటి నుంచి హనిత్సింగ్ ఒక్కడే ఉంటూ డ్యూటీకి వెళుతున్నాడు. ఈక్రమంలో రోజు మాదిరిగా బుధవారం రాత్రి హనిత్సింగ్ డ్యూటీకి వెళ్లాడు. తెల్లవారి వచ్చేసరికి ఇంటి సెంటర్ లాక్ పగులకొట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా బట్టలు, వస్తువులు అన్ని చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 25 తులాలు బంగారు ఆభరణాలు, 25 తులాలు వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్, మేడిపల్లి ఇన్స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డి, ఎస్ఐ నవీన్‌బాబు, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. హనిత్సింగ్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి గల్లంతు..
సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతు గజ ఈతగాళ్ళతో ఎన్నెస్పీ కాలువలో గాలింపు సత్తెనపల్లి: ఈతకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గల్లంతైన సంఘటన సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్కరాజుగార్లపాడ్డు రోడ్డులో నివశిస్తున్న ఆర్టీసీ డ్రై వర్ కె.భజంగరావు, పద్మావతి కుమారుడు కన్నెగంటి చక్రధర్ (27) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర కిందట వివాహమైంది. కృష్ణా పుష్కరాలకు బెంగళూరు నుంచి సత్తెనపల్లి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇద్దరు స్నేహితులతో కలిసి సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సమీపంలోని విద్యుత్ ప్లాంట్ వద్ద గల ఎన్నెస్పీ కాలువలో లాకుల వద్ద ఈత కొట్టేందుకు వెళ్లాడు. లాకుల వద్ద 20 అడుగుల పై నే లోతు ఉండే అవకాశం ఉందని భావించిన ఇద్దరు స్నేహితులు దిగేందుకు వెను కాడగా చక్రధర్ ఒక్క సారిగా ఈత కొట్టేందుకు కాలువలోకి దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో చక్రధర్ గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో హుటాహుటీన తండ్రి భుజంగరావు, బంధువులు, ఆర్టీసీ ఉద్యోగులు సమీప ప్రజలు పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకున్నారు. ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి సరఫరాను కొంత ఆపించారు. గజ ఈతగాళంల ద్వారా వెతుకులాటను ప్రారంభించారు. ఒక్కగానొక్క కుమారుడు...అల్లారు ముద్దుగా పెంచుకున్నాం... చేతికి వచ్చే తరణంలో మాకు దేవుడు తీరని వేదన పెట్టాడు అంటూ చక్రధర్ తల్లిదండ్రులు భుజంగరావు, పద్మావతి, భార్య సువర్ణ కన్నీరు మున్నీరయ్యారు. -
ఇంటర్నెట్ కేంద్రాలపై దాడులు
దుబ్బాక: పైరసీ చట్టాలకు విరుద్ధంగా దుబ్బాకలో నిర్వహిస్తోన్న ఇంటర్ నెట్, డీటీపీ, ఫొటో స్టూడియో, ఇంటర్ నెట్ కేఫ్, కేబుల్ ఆపరేటర్ కేంద్రాలపై గురువారం అనూ స్ర్కిప్ట్ పైరసీ విభాగం ప్రతినిధులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనూ స్ర్కిప్ట్ సంస్థ అనుమతుల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటున్న పలు కేంద్రాల నిర్వాహకులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా అనూ స్ర్కిప్ట్ పైరసీ విభాగం ఆపరేషన్ మేనేజర్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ అనుమతి లేకుండా నిర్వహించే కేంద్రాల నిర్వాహకులపై కాపీ రైట్ యాక్ట్ ప్రకారం 67బి, 420 సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. అనూ స్ర్కిప్ట్‌ను ఉపయోగించుకునే కేంద్రాల నిర్వాహకులు సంస్థకు రూ. 13 వేలను చెల్లించి, ఏడాది పాటు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ రమేశ్, కానిస్టేబుల్ చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో చోరీ
నగరంలోని బోడుప్పల్ చెంగిచర్ల క్రాంతి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులకొట్టి నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి దోచు కెళ్లారు. ఎస్ఐ నవీన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని చెంగిచర్ల క్రాంతి కాలనీలో సాంబయ్య కుమారుడు కృష్ణకుమార్ హైటెక్ సిటీలో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం కృష్ణకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. మరసటి రోజు వారు ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న 4 తులాలు బంగారం, 30 తులాల వెండి చోరీకి గురైంది. వెంటనే మేడిపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కృష్ణకుమార్ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత...
-
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో సాప్ట్ స్కిల్స్‌లో శిక్షణ
-
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో సాప్ట్ స్కిల్స్‌లో శిక్షణ
లక్ష్యం ఏదైనా.. ఎలాంటిదైనా.. దానిని సాధించడంలో ఆత్మవిశ్వాసమే కీలకం. అలాంటి నిండైన ఆత్మవిశ్వాసాన్ని, చక్కని కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెం పొందించే ‘సాఫ్ట్‌స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్’ కోర్సును ‘సాక్షి ఎడ్జ్’ అందిస్తోంది. ఈ కోర్సులో వెర్బల్-నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, మిర్రర్ ఇన్ ది మైండ్-స్ట్రెంత్ మరియు వీక్నెసెస్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, గ్రూప్ డిస్కషన్ తదితర అంశాలపై ఉత్తమ శిక్షణ ఇస్తారు. వినూత్నమైన టీచింగ్ మెథడాలజీ, ముఖాముఖి ఇంటరాక్టికల్ సెషన్లతో ప్రతి అంశాన్నీ సులభంగా నేర్చుకునే అవకాశం. ఆగస్టు 17 నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. కోర్సు వ్యవధి 30 రోజులు. ఫీజు రూ.5,750. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న సాక్షి జర్నలిజం స్కూల్లో ఈ శిక్షణ ఉంటుంది. పరిమిత సంఖ్యలో ఉన్న సీట్లకు రిజిస్ట్రేషన్లు ప్రారంభయ్యాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.1లో ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాల కోసం 9603533300 నంబర్లో సంప్రదించవచ్చు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట మోసం
► 20 మంది దగ్గర రూ.లక్షలు వసూలు చేసిన ఉద్యోగి ► ఎవరికి చెప్పుకున్నా నాకేం కాదంటూ బెదిరింపులు పోచమ్మమైదాన్ (వరంగల్): సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు... పెద్దమెుత్తంలో వేతనం.. దీనికోసం చేయాల్సిందల్లా రూ.లక్ష చెల్లించడమే! అంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి చెప్పిన మాటలతో పలువురు నిరుద్యోగులు అప్పులు తెచ్చి మరీ డబ్బు చెల్లించారు. ఇప్పుడు ఉద్యోగాలు లేకపోగా.. డబ్బులు సైతం ఇవ్వకుండా బెదిరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక వారు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లా ములుగు వెంకటపూర్ మండల విద్యాశాఖ అధికారి ఐలయ్య కుమారుడు చాగర్ల వేణుమాధవ్ హైదరాబాద్‌లోని ప్రమతి టెక్నాలజీలో గ్లోబల్ అనాలసిస్ట్‌గా పని చేస్తున్నాడు. పదో తరగతి నుంచి ఎంటెక్ వరకు చదివితే చాలు.. తమ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు. దీంతో జిల్లాలోని పస్రా, రేగొండ, శాయంపేట, నర్సంపేటకు చెందిన సుమారు 20 మంది గత ఏడాది డబ్బు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో అకౌంట్‌నంబర్ చెప్పిన వేణుమాధవ్ అందులో జమ చేయాలని సూచించగా నిరుద్యోగులు డబ్బు వేశారు. అప్పటి నుంచి రేపు, మాపు అంటూ సంవత్సర కాలంగా వేణుమాధవ్ గడుపుతుండడంతో సదరు నిరుద్యోగులు ఇటీవల నిలదీశారు. అయితే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. నాకేం కాదంటూ బెదిరించడంతో పాటు ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో వారు వేణుమాధవ్ తండ్రి, ఎంఈఓ ఐలయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన పట్టించుకోలేదు. దీంతో రూ.20లక్షలకుపైగా ఇచ్చిన నిరుద్యోగులు తమకు జరిగిన మోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం ఉందని తీసుకువెళ్లాడు.. నేను డిగ్రీ పాస్ అయ్యాను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ పెట్టిస్తా అంటే రూ.లక్ష ఇచ్చాను. అయితే, మరో రూ.1.3లక్షలు ఇస్తే దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అవి కూడా ఇచ్చాను. అయతే, నన్ను దుబాయ్ తీసుకువెళ్లి హోటల్ ఉంచిన వేణుమాధవ్ ఉద్యోగం ఇప్పించలేదు. – గుర్రల రమేష్, పస్రా మాది రేగొండ. నీకు తప్పక జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికిన వేణుమాధవ్ తన అకౌంట్లో రూ.లక్ష జమ చేయాలని సూచిస్తే వేశాను. నన్ను నమ్ము, తప్పక జాబ్ ఇప్పిస్తాను.. అక్కడ వచ్చే వేతనంతో నీ రూ.లక్ష మూడు నెలల్లో చేతికి అందుతుంది అని చెప్పాడు. ఇప్పుడు సంవత్సరం దాటినా ఉద్యోగం ఇప్పించలేదు. పైగా ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని సమాధానం వస్తోంది. – రాజేందర్, రేగొండ -
సాఫ్ట్వేర్.. సమస్యలతో బేజార్
సాంకేతిక లోపాలతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ * పరిష్కారం కనుగొనని ఉన్నతాధికారులు * ఇలాగైతే కష్టమంటున్న తహసీల్దార్లు * ‘క్రమబద్ధీకరణ’ అమలులో వైఫల్యం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వివిధ పథకాల అమలు నిమిత్తం భూపరిపాలన కార్యాలయం ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ ఎందుకూ కొరగాకుండా పోతోంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఉన్నతాధికారులు సమకూర్చిన ఆన్లైన్ విధానాలతో పారదర్శకత సంగతేమో గానీ, గత రెండేళ్లుగా ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. 2014 డిసెంబర్లో ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నుంచి నిన్నమొన్నటి సాదా బైనామాల క్రమబద్ధీకరణ వరకు సాంకేతిక సమస్యలతో రెవెన్యూ యంత్రాంగమంతా సతమతమవుతోంది. సమస్యలు పరిష్కరించకపోగా పథకాల అమలు విషయంలో వైఫల్యాలకు తహసీల్దార్లనే బాధ్యులను చేస్తూ చార్జిమెమోలు, ఇంక్రిమెంట్లలో కోతలు విధిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సబబని తెలంగాణ తహ సీల్దార్ల సంఘం ప్రశ్నిస్తోంది. టీజీటీఏ ఆధ్వర్యంలో తహసీల్దార్లంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగడంతో మేల్కొన్న సర్కారు త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చింది. కొలిక్కిరాని క్రమబద్ధీకరణ ప్రక్రియ రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావస్తున్నా, ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. సాంకేతిక సమస్యల కార ణంగా పక్కన బెట్టిన దరఖాస్తులను అధికారులు ఇంతవరకు పరిష్కరించలేదు. జీవో 58 ప్రకారం పేదలు నివాసముంటున్న స్థలాలను ఉచితంగా వారికి క్రమబద్ధీకరించాలి. ఈ విషయంలో ఎంతోమందికి ఆధార్ కార్డు లేదని, కార్డు ఉన్నా ఇన్వాలిడ్ అని రావడంతో నేటి వరకు ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అలాగే జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా ఆ భూములనూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మొత్తం 49,211 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉంటే.. ఇప్పటివరకు ఆయా దరఖాస్తుల్లో అధికారులు క్లియర్ చేసింది 7,451 దరఖాస్తులే (15శాతం) కావడం గమనార్హం. ఈ ప్రక్రియ నిమిత్తం భూపరిపాలన అధికారులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌లో రోజుకో రకమైన సమస్యలు తలెత్తుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇతర పథకాల అమలు తీరూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని తెలుస్తోంది. -
విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
దుండిగల్: విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బహదూర్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్ వాహెద్ కుమారుడు సయ్యద్ ఇస్మాయిల్ (26) స్థానికంగా ఉన్న టెక్ మహేంద్రాలో క్యాడ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 27న ఉదయం 6 గంటలకు మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకు వచ్చాడు. ఆ సమయంలో అక్కడ తెగి పడి ఉన్న విద్యుత్ వైర్‌ను గమనించకుండా తాకడంతో షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్‌ను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగ భాగ్యం..
• ఉద్యోగం చేయడానికి యువత ప్రాధాన్యమిచ్చే టాప్-10లో భాగ్యనగరానికి చోటు • సాఫ్ట్వేర్, ఐటీ, బీపీవో, ఇంజనీరింగ్ ఏదైనా ఇక్కడే ‘వెస్ట్’ అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ఎక్కడైనా సరే ఉద్యోగం వస్తే చాలు.. అనే పరిస్థితి ఇప్పుడు లేదు. చేసే ఉద్యోగంతోపాటు పని చేయాల్సిన ప్రాంతానికీ యువత ప్రాధాన్యం ఇస్తోంది. సాఫ్ట్వేర్, ఐటీ, ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఇలా ఏ రంగమైనా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలా యువత ప్రాధాన్యమిచ్చే టాప్-10 నగరాల్లో మన హైదరాబాద్ చోటు సంపాదించింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు-2016 ఈ విషయాన్ని వెల్లడించింది. పీపుల్ స్ట్రాంగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్, లింక్డ్ఇన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ‘వీబాక్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్ టెస్టు (వెస్ట్)’ పేరుతో దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.2 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. 2014, 2015, 2016 సంవత్సరాల్లో ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలోని మరిన్ని అంశాలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఎక్కువ మందికి 22 -25 ఏళ్ల వయసులోనే ఉద్యోగాలు లభిస్తున్నట్లు వెస్ట్ అధ్యయనంలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 31.59 శాతం మంది ఆ వయసులోనే ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పారు. ⇒ చండీగఢ్, జార్ఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో, ఉత్తరాంచల్, హరియాణా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల వారికి 26 -29 ఏళ్లలో ఉద్యోగాలు లభిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ⇒ ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో 18-21 ఏళ్ల వయసు వారికి కూడా ఉద్యోగాలు లభిస్తున్నట్లు వెల్లడించింది. ⇒ కార్పొరేట్ సంస్థలు తమ సంస్థల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే ఎక్కువ శాతం మహిళలను తీసుకుంటున్నాయి. ⇒ సర్వేలో పాల్గొన్న వారిలో 69 శాతం మంది అప్రెంటిస్‌షిప్ విధానం ఉండాలని కోరుకుంటున్నారు. ⇒ తక్కువ వేతనం అయినా ఫరవాలేదు.. ఉద్యోగం కావాలని కోరుకుంటున్న వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. మొదటి ప్రాధాన్యం ఢిల్లీకి బీటెక్, ఫార్మా వంటి వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఉద్యోగం కోసం ఢిల్లీకి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ చుట్టూ ఉన్న దేశ రాజధాని ప్రాంతం, బెంగళూరు, చెన్నై, లక్నో నిలిచాయి. హైదరాబాద్ పదో స్థానంలో నిలిచింది. అయితే మహిళలు ఉద్యోగం కోరుకుంటున్న టాప్-10 నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం లభించలేదు. ఈ సర్వేలో పాల్గొన్న 5.2 లక్షల మందిలో 38.12 శాతం మంది ఇటీవలే ఉద్యోగాలు పొందిన వారున్నారు. 2014, 2015 సంవత్సరాలతో పోల్చితే 2016లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించాయి. 2014లో 33.95 శాతం మందికి ఉద్యోగాలు లభించగా, 2015లో 37.22 శాతం మందికి, 2016లో 38.12 శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి. -
అందని పల్స్
ప్రజాసాధికార సర్వేకు తప్పని ఇక్కట్లు సాఫ్ట్వేర్ మార్చినా పనిచేయని సర్వర్ ఎన్యూమరేటర్లకు పూర్తిగా అందని ట్యాబ్‌లు వ్యక్తిగత వివరాలు అడగడంపై ప్రజల్లోనూ ఆందోళన జిల్లాలో ప్రజాసాధికార (పల్స్) సర్వేకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వర్ మొరాయించడం.. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలు అప్లోడ్ కాకపోవడంతో ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన సర్వే నత్తలా సాగుతోంది. కొన్నిచోట్ల ఎన్యూమరేటర్లకు ట్యాబ్‌లు, ఐరిస్ తీసే పరికరాలు ఇవ్వకపోవడంతో సర్వే గందరగోళంగా తయారైంది. ఇంకొన్ని చోట్ల ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. వెరసి పల్స్ సరిగా అందడం లేదు. మచిలీపట్నం/విజయవాడ సెంట్రల్ : పల్స్ సర్వేతో సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సర్వే బృందాలు ప్రజల నుంచి వివరాలను కూపీ లాగుతున్నాయి. ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు, ఆస్తిపన్ను, ఐడీ, కరెంట్ బిల్లు, డ్రైవింగ్ లెసైన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, ఎల్పీజీ గ్యాస్ బుక్, బ్యాంక్ పాస్‌బుక్, వాటర్ బిల్లు, క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లు, కిసాన్‌కార్డు, పెన్షన్ సర్టిఫికెట్, డ్వాక్రా కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ (5 సంవత్సరాలలోపు) పోస్ట్ లేదా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కార్డులు వివరాలను సర్వే బృందాలు సేకరిస్తున్నాయి. మొత్తం 75 అంశాలకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిచేయని వర్షన్లు స్మార్ట్ పల్స్ సర్వే చేసే నిమిత్తం ఎన్యూమరేటర్లకు ఇచ్చిన ట్యాబ్‌లలో తొలుత 2.0 వర్షన్‌ను ఆప్‌లోడ్ చేశారు. ట్యాబ్‌లో ఉన్న సిమ్‌కు 2జీ సేవలను అందుబాటులో ఉంచారు. 2.0 వర్షన్ పనిచేయకపోవటంతో 2.1 వర్షన్, అదికూడా పని చేయకపోవటంతో 2.2, తిరిగి 2.1, 2.3 వర్షన్లను ఆప్‌లోడ్ చేశారు. వీటిలో ఏదీ పని చేయలేదు. దీంతో కొద్ది పాటి మార్పులు చేసి మంగళవారం 2.3.1 వర్షన్‌ను ఆప్‌లోడ్ చేశారు. ఇదీ పని చేయకపోవడంతో బుధవారం 2.4 వర్షన్‌ను ఆప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం 3జీ, 4జీ సేవలు అందుబాటులో ఉన్నా ఎన్యూమరేటర్లకు 2జీ సేవలు అందించే సిమ్‌లను ఇవ్వడంతో సర్వర్ సిగ్నల్స్ సక్రమంగా అందక ట్యాబ్‌లో నింపిన వివరాలు ఆప్‌లోడ్ కావటం లేదు. కొన్ని ట్యాబ్‌లలో బ్యాటరీలు సక్రమంగా పని చేయకపోవటం మరో సమస్యగా మారింది. మరి కొన్ని ట్యాబ్‌ల్లో కుటుంబ సభ్యుల వేలిముద్రలను సక్రమంగా స్వీకరించని పరిస్థితి ఉంది. ఏ పని చేయాలి ? పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది స్మార్ట్ పల్స్ సర్వేలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పాల్గొనాలనే నిబంధన విధించారు. ఓ వైపు పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా వంటి పనులు చేయాలో.. పల్స్ సర్వేలో పాల్గొనాలో అర్ధంకాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి తోడు ఈ నెల 15వ తేదీ నుంచి పంచాయతీ కార్యదర్శులు పుష్కర విధుల్లో తప్పనిసరిగా ఉండాలని షరతులు పెట్టారు. ఒక మండలం నుంచి వేరే మండలానికి కొంత మందిని నియమించారు. ఒక ఉద్యోగి రెండు చోట్ల ఎలా పని చేయాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది, వీఆర్వో, వీఆర్ఏలను స్మార్ట్ పల్స్ సర్వేలో ఎన్యూమరేటర్లుగా నియమించినా ఇప్పటివరకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదు. కోతల కోసమే గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు సామాజిక పింఛన్లను రూ.200 నుంచి రూ.1,000, 1,500కు పెంచుతానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలను కేటాయిస్తామన్నారు. పేద,మధ్య తరగతి వర్గాలను ఆకర్షించే ఇలాంటి హామీలు ఎన్నో. తెల్లరేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొనే వీలుంటుందనేది బహిరంగ రహస్యం. కుటుంబ ఖర్చుల్ని లెక్కగట్టి ఆదాయంగా చూపినట్లైతే ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్ కార్డుల్లో 60 శాతం మేర తొలగించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కుటుంబ, వ్యక్తిగత సమాచారాన్ని సర్వే ముసుగులో రాబడుతున్నారు. పల్స్ సర్వే బృందాలు వస్తున్నాయంటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. అధికారపార్టీ నేతలు మాత్రం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే సర్వే నిర్వహిస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అన్నింటికీ ‘ఆధార్’ ఉండగా పల్స్‌సర్వే దేనికన్నది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య కేసులో పురోగతి
చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి హత్య కేసులో పురోగతి లభించింది. నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ ను రైల్వే పోలీసులు విడుదల చేశారు. అందరూ చూస్తుండగానే స్వాతి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని చెన్నై నుంగంబక్కమ్ రైల్వేస్టేషన్లో శుక్రవారం దారుణ హత్యకు గురైంది. సూలైమేడుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి(24) రోజూ మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లడానికి రైలు కోసం ఎదురుస్తుండగా ఒక వ్యక్తి గొడవపడ్డాడు. ఉన్నట్టుండి కత్తితీసి ఆమెను పొడిచి చంపాడు. ముఖం, మెడపై మీద తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. -
హత్యాకాండ!
మానవత్వం మంటగలిసి పోతోందనేందుకు రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు సాక్షి భూతంగా నిలిచాయి. కన్నతల్లి, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు అనే విచక్షణ లేకుండా ప్రాణాలు తీస్తూ మనిషి రాక్షసుడిగా మారిపోతున్నాడు. శుక్రవారం నాటి దుర్ఘటనలతో రక్తాక్షరాలతో లిఖించదగిన రాష్ట్రంగా మారింది. మృతులంతా మహిళలే కావడం మరింత విషాదకరంగా మారింది. ♦ హత్యలతో అట్టుడికిన రాష్ట్రం ♦ మృతుల్లో ఆరుగురు మహిళలు ♦ తాళం వేసిన ఇంట్లో మృతదేహాలు ♦ భార్య, ముగ్గురు కుమార్తెల హతం ♦ మహిళా ఇంజనీర్ హత్య ♦ తల్లిని కడతేర్చిన తనయుడు సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ కిరాతకుడు సహజీవనం సాగిస్తున్న మహిళను, ఆమె ముగ్గురు కుమార్తెలను హతమార్చి తనలోని రాక్షసత్వాన్ని బైటపెట్టుకున్నాడు. చెన్నై రాయపేట పాత పోలీస్ స్టేషన్ వెనుకవైపున ఉన్న ఒక అపార్టుమెంటులో చిన్నరాజ్ (42) కాపురం ఉంటున్నాడు. స్వీట్‌షాపులో మాస్టర్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సదరు చిన్నరాజ్ 2012 నుంచి పాండియమ్మాల్ (38) అనే మహిళతో సహజీవనం చేస్తూ సమాజంలో భార్యభర్తలుగా చలామణి అవుతున్నారు. వీరికి పవిత్ర (19), పరిమళ (18) స్నేహ (16) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పరిమళ పనిమలర్ పాలిటెక్నిక్లోను, మూడో కుమార్తె స్నేహ ప్లస్‌టూ చదువుతూ వచ్చారు. రెండో కుమార్తె పరిమళ పారామెడికల్ కోర్సులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని వారాల క్రితం చిన్నరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంతూరైన కారక్కుడికి వెళ్లి ఈనెల 20వ తేదీనే చెన్నైకి వచ్చారు. ఆ రోజు నుండి ఇల్లు తాళం వేసిన స్థితిలోనే ఉండింది. అప్పుడప్పుడూ చిన్నరాజ్ వస్తూ పోతుండగా, భార్యా పిల్లలు ఎక్కడని ఇరుగు పొరుగు ప్రశ్నించగా, వారంతా ఊర్లో ఉన్నారని చెప్పుకుంటూ వచ్చాడు. రూమ్ స్ప్రే తీసుకుని వెళుతున్న చిన్నరాజ్‌ను మీ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని మళ్లీ ప్రశ్నించడంతో ఎలుకలు చనిపోయాయి, అందుకే స్ప్రే చేస్తున్నానని బుకాయించాడు. ఈ దశలో తాళం వేసి ఉన్న వారింట్లో నుంచి దుర్వాసనలు మరింత పెరిగిపోవడంతో ఇంటి యజమాని రాజాబహదూర్ (73) రాయపేట పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నరాజ్ ఇంటి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా పాండియమ్మాల్, ఆమె ముగ్గురు కుమార్తెల మృతదేహాలు కుళ్లిన స్థితిలో పడిఉన్నాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వాసుపత్రికి పంపారు. దీనికి సంబంధించి రాయపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో నలుగురు మహిళలను చిన్నరాజ్ హత్యచేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అడిషనల్ పోలీసు కమిషనర్ (సౌత్) కె. శంకర్ నేతృత్వంలోని జాయింట్ కమిషనర్ ఎస్ మనోహరన్, రాయపేట పోలీసు ఇన్స్పెక్టర్ గోపాలగురు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం శుక్రవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్లోవున్న చిన్నరాజ్‌ను అరెస్టు చేసింది. మనస్పర్థలతోనే హత్యలు: భార్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే అందరినీ హతమార్చినట్లు నిందితుడు చిన్నరాజ్ అంగీకరించాడు. కృష్ణగిరి జిల్లా బర్గూర్‌కు చెందిన తాను 2012లో దిండుగల్ జిల్లా, పళనిలో ఒక స్వీట్‌షాపులో పనిచేస్తుండగా శివగంగై జిల్లా, తిరుపత్తూరు తాలూకా, కట్టయంపట్టికి చెందిన పాండియమ్మాల్తో పరిచయం ఏర్పడిందని తెలిపాడు. ఆమెకు అంతకు ముందే వివాహమై ముగ్గురు కుమార్తెలతో విడిగా జీవిస్తూ వచ్చినట్లు తెలిపాడు. తర్వాత ఆమెను వివాహం చేసుకుని ముగ్గురి కుమార్తెలతో చెన్నై చేరుకున్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా పాండియమ్మాల్, తనకు మధ్య తరచుగా గొడవలు ఏర్పడేవని, అనేక సార్లు మద్యం తాగి ఇంటి బయటే పడుకునేవాడిన ని తెలిపాడు. దీంతో తనపై పాండియమ్మాల్ ఆగ్రహం వ్యక్తం చేసేదని అన్నాడు. హత్యలు చేసిన రోజైన ఈనెల 20వ తేదీన సైతం తమ మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత తాను పనికి వెళ్లినట్లు తెలిపాడు. రాత్రి మద్యం తాగి వచ్చిన తనను పాండియమ్మాల్ లోనికి అనుమతించలేదని, దీంతో తెల్లవారుజాము మూడు గంటల సమయంలో పాండియమ్మాల్ను ఇనుపరాడ్‌తో మోది హత్య చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత బెడ్రూంలో నిద్రిస్తున్న పవిత్ర, పరిమళపై అదే ఇనుపరాడ్ తో దాడి చేసి చంపానని అన్నాడు. మూడవ కుమార్తె స్నేహను ఇస్త్రీపెట్టె వైరుతో గొంతు నులిమి హత్య చేసి పరారైనట్లు తెలిపాడు. పోలీసులు అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.మహిళా ఇంజనీర్ హత్య: చెన్నై నగరం నుంగంబాక్కం రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం పట్టపగలే చోటుచేసుకున్న హత్యతో నెత్తురోడింది. గుర్తుతెలియని యువకుడి చేతిలో మహిళా యువ ఇంజనీరు స్వాతి (24) దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో నుంగంబాక్కం లోకల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై కూర్చుని ఉన్న స్వాతి వద్దకు ఓ యువకుడు రాగా, ఇద్దరు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. యువకుడి మాటలకు విసుగుచెందిన స్వాతి అక్కడి నుండి లేచి వెళ్లిపోతుండగా తన వద్ద దాచుకుని ఉన్న వేట కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. ప్లాట్‌ఫారంపై పరిమిత సంఖ్యలో ప్రయాణికులు ఉన్నా యువకుడు కత్తితో సాగిస్తున్న స్వైర విహారంతో భయపడి దాక్కుకున్నారు. రక్తప్రవాహంలో విలవిల కొట్టుకుంటూ స్వాతి ప్రాణాలు విడిచింది. హత్యకు పాల్పడిన యువకుడు పారిపోయాడు. చెన్నై చూలైమేడులో తల్లిదండ్రులతో కలిసి నివసించే స్వాతి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకుని చెంగల్పట్టు పానూరులోని మహేంద్రసిటీ ప్రాంగణంలోని ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో స్వాతి ఉద్యోగం చేస్తోంది. ఏకపక్ష ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసి ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. తల్లిని బావిలోకి తోసి..: కన్నతల్లిని బావిలోకి తోసి వదిలించుకున్న కిరాతక కుమారుని వివరాలు ఇలా ఉన్నాయి. జేజే నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీవీఎస్ అవెన్యూలో జ్యోతిప్రియ (60) తన కుమారుడు సత్యకుమార్, తన భర్త మొదటి భార్య కుమార్తె ఉషారాణి, ఇద్దరు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. ఇంజినీరింగ్ చదివి కెనడాలో ఉద్యోగం చేస్తున్న సత్యకుమార్ మూడేళ్ల క్రితం తిరిగి చెన్నైకి వచ్చి ఖాళీగా ఉన్నాడు. గురువారం అర్ధరాత్రి తన తల్లిని మోసుకువెళ్లి ఇంటి సమీపంలోని పాడుబడిన బావిలో పడవేశాడు. ఆ బావిలో మూడు అడుగుల నీరు మాత్రమే ఉండడంతో తాను కూడా తల్లిపైకి దూకి ఆమె ప్రాణాలు విడిచేవరకు అలానే నిలుచున్నాడు. బావి నుండి వచ్చిన కేకలతో బైటకు వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని పట్టించారు. ఉద్యోగం లేదన్న విరక్తితో తల్లిని హతమార్చినట్లు విచారణలో తేలింది. -
రైల్వే స్టేషన్లో మహిళా టెకీ హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒకరు చెన్నై నుంగంబక్కమ్ రైల్వేస్టేషన్లో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. సూలైమేడుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి(24) రోజూ మాదిరిగానే ఆఫీస్‌కు వెళ్లడానికి రైలు కోసం ఎదురుస్తుండగా ఒక వ్యక్తి గొడవపడ్డాడు. ఉన్నట్టుండి కత్తితీసి ఆమెను పొడిచి చంపాడు. ముఖం, మెడపై మీద తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. మరోవైపు.. కోయంబత్తూర్‌లో తన భర్తను హత్య చేసిన వ్యక్తిని సుకందామణి అనే మహిళ శుక్రవారం రాయితో మోది చంపేసింది. -
ఢిల్లీలో అదృశ్యం.. భువనేశ్వర్‌లో ఆత్మహత్య
కంపెనీ వేధింపులే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ పెందుర్రు(బంటుమిల్లి) : ఢిల్లీలో అదృశ్యమైన మండల పరిధిలోని పెందుర్రు గ్రామానికి చెందిన ప్రత్తి రవీం ద్రబాబు(35) వారం రోజుల అనంతరం ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శవమై కనిపించాడు. బంటుమిల్లి, ఒరిస్సా పోలీసుల సహకారంతో కుటుంబసభ్యులు రవీంద్ర మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. పోలీ సులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ప్రత్తి వీరబాబు కుమారుడు రవీంద్రబాబు పదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిందట త న సమీప బంధువు నెలకొల్పిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ డివిజన్‌కు డెరైక్టర్‌గా చేరాడు. ఈ క్రమంలో గత నెల 22వ తేదీన స్వగ్రామం వచ్చిన రవి కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేశారంటూ హైదరాబాద్ వెళ్లాడు. ఆ తర్వాత ఢిల్లీ వెళుతున్నానని తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. కంపెనీ ప్రతినిధులతో కలసి ఢిల్లీ వెళ్లాడు. దాదాపు 26వ తేదీ నుంచి కుటుంబసభ్యులకు అందుబాటులో లేడు. జూన్ ఒక టో తేదీన వీరబాబు తన కుమారుడు కనిపించడంలేదంటూ బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభిం చారు. ఈనెల 2వ తేదీన భువనేశ్వర్ లాడ్జిలో దిగిన రవీంద్రబాబు రెండు రోజులు తలుపులు తీయకపోవడంతో అనుమానించి 4వ తేదీన అక్కడి న్యాయమూర్తి సమక్షంలో తలుపులు పగులకొట్టి చూడగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. రవీంద్రబాబు వద్ద ఉన్న అడ్రస్సు ఆధారంగా భువనేశ్వర్ పోలీసులు ఈనెల 5వ తేదీన బంటుమిల్లి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. బంటుమిల్లి పోలీసులు, కుటుంబసభ్యులు భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు రవీంద్ర మృతదేహాన్ని వారికి అప్పగించారు. స్వగ్రామానికి చేరుకోగానే మృతుడి భార్య రేణుక, తల్లి రాజ్యలక్ష్మి స్పృహ కోల్పోయారు. మృతుడికి మూడేళ్ల కిందట దగ్గర బంధువు కాత్యాయని రేణుకతో వివాహం కాగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలే తన కుమారుడు ఆత్మహత్యకు ప్రేరేపించాయని మృతుడి తండ్రి వీరబాబు ఆరోపిస్తూ బుధవారం బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధు లు డబ్బుల కోసం తమతో అగ్రిమెంట్లపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. మానసిక వేదనకు గురిచేశారని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
విప్రో ఉద్యోగులకు భారీ హైక్!
న్యూఢిల్లీః దేశంలోనే మూడో అతి పెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసెస్ సంస్థ విప్రో... తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశంలో పనిచేసే ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతన పెంపును జూన్ 1వ తేదీనుంచి అమల్లోకి తేనుంది. అంతేకాక అత్యుత్తమ పనితీరును ప్రదర్శించిన వారికి అదనపు మొత్తాలను కూడ అందజేసింది. తమ కంపెనీలో పనిచేసే ఆఫ్ షోర్ ఉద్యోగులు వేతనంలో సుమారు 9.5 శాతం పెంపును పొందనున్నారని, ఆన్ సైట్ ఉద్యోగులకు కనీసం 2 శాతం వరకూ పెంపు ఉంటుందని విప్రో ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే పనిలో ప్రత్యేకతను ప్రదర్శించిన వారికి, మంచి నైపుణ్యం ఉన్నవారికి ప్రత్యేక హైక్ కూడ ఇవ్వనున్నట్లు విప్రో తెలిపింది. మార్చి 31 నాటికి తమ పే రోల్ కింద 1,72,912 ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. విప్రోకు ప్రధాన పోటీదారులైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు 6 నుంచి 12 శాతం పెంపును ప్రకటించింది. అలాగే దేశంలో మరో పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడ తమ ఉద్యోగులకు ఈ సంవత్సరంలో 8 నుంచి 12 శాతం వేతన పెంపును ప్రకటించింది. -
ఘొల్లుమన్న గద్వాల
► సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మీ హత్యోదంతం ► అలుముకున్న విషాదఛాయలు శోకసంద్రంలో కుటుంబసభ్యులు ► పరామర్శించిన నాయకులు కంటతడి పెట్టిన స్నేహితులు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు.. అల్లారుముద్దుగా పెంచి.. ఉన్నత చదువులు చదివించారు. ఆ యువకుడు అమ్మానాన్న కలలు కన్నట్టుగానే ఉన్నతోద్యోగం సంపాదించాడు. హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఇంటికి ఫోన్చేయకుండా ఏరోజూ ఉండలేదు. ఉన్నట్టుండి రెండు రోజులుగా ఫోన్ మూగబోయింది. ఇంతలో కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రుల్లో కలవరం. బంధువులు, అతడి స్నేహితుల వద్ద ఆరాతీసే క్రమంలో ఓ చేదునిజం.. తమ కుమారుడు ఇక లేడని.. హైదరాబాద్‌లో దారుణహత్యకు గురయ్యాడని తెలుసుకుని తల్లడిల్లిపోయారు. ఇదీ గద్వాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మీ విషాదాంతం.. గద్వాల : సాఫ్ట్వేర్ ఉద్యోగి హష్మీ (24) అదృశ్యం విషాదాంతంగా ముగి సింది. ఈ యువకుడు హత్యకు గురయ్యాడని తెలియగానే గద్వాల పట్ట ణం ఘొల్లుమంది. తోటి స్నేహితులు ఉద్వేగానికి లోనయ్యారు. స్థానిక లిం గంబాగ్కాలనీలో నివాసముంటున్న పద్మశ్రీ, గగారిన్ దంపతుల ఏకైక కుమారుడు హష్మీ హైదరాబాద్ నగరంలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇక తల్లిదండ్రులు గద్వాల పట్టణంలో షూమార్ట్ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నివాళులర్పించిన నాయకులు అనంతరం బాధిత కుటుంబ సభ్యులను వివిధ రాజకీయ నాయకులు పరామర్శించారు. మొదట హష్మీ మృతదేహంపై మేనమామ, సీపీఎం నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు మధుపూలమాలలు వేసి నివాళులర్పిం చా రు. జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి, సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ప్రభాకర్, వెంకటస్వామి, రామన్‌గౌడ్, స్వామిరెడ్డి పూలమాలలు వేశారు. రాత్రి కృష్ణానది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న స్థానికులు హష్మీ మరణ వార్త విన్న వెంటనే స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో లింగంబాగ్కాలనీకి చేరుకున్నారు. సౌమ్యుడిగా అందరితో కలగలుపుగా ఉండేవాడని, వారు తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం హష్మీ మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రు లతోపాటు కుటుంబ సభ్యులు గద్వాలకు చేరుకున్నారు. ‘ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడమ్మా.. అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారంరోజుల క్రితమే సీసీఎల్ కంపెనీ నుంచి మారి టీసీఎస్‌లో ఉద్యోగం చేరాడన్నారు. ఈ సంఘటన స్థానికులను కలచి వేసింది. -
25 శాతం ఉద్యోగాలు రోబోట్స్ చేస్తాయ్!
ముంబైః మరో పదేళ్ళలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఉద్యోగాల్లో నాలుగో వంతు ఉద్యోగాలు రోబోట్స్, స్మార్ట్ సాఫ్టవేర్లతో నిర్వహించే అవకాశం కనిపిస్తోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తోంది. మరోవైపు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ.. 'ఎమోజీ'ల రూపకల్పన కూడ మరో దశాబ్ద కాలంలో అతి పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ వెనుక బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషించనుంది. రోబోట్స్, స్మార్ట్ సాఫ్ట్ వేర్ లు.. పావుశాతం ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. దీంతో కేవలం జాబ్స్ స్వభావం మారడమే కాక, సంస్థల పనితీరులో కూడ ప్రధాన మార్పు సంభవించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ప్రతి విషయంలోనూ బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ కీలకాంశమైపోయింది. దీంతో ప్రఖ్యాత విద్యా సంస్థలు సైతం డేటా సైన్స్, బిగ్ డేటా ను అందుబాటులోకి తెస్తున్నాయి. యువ శ్రామికులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో 'బిగ్ డేటా' కీలకంగా మారింది. ప్రస్తుతం నగరాల్లో బిగ్ డేటా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోందని బిగ్ డేటా ను బోధించే మహేంద్రా మెహతా చెప్తున్నారు. ఒకప్పుడు బిగ్ డేటా విశ్లేషణలను అభివృద్ధి పరిచేందుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితిలో తీవ్ర మార్పు సంభవించినట్లు ఆయన చెప్తున్నారు. చిన్న పెట్టుబడితో కూడ అభివృద్ధి చేసే అవకాశం రావడంతో ఇప్పుడు చిన్నపాటి కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడ సాఫ్ట్ వేర్ జోలికి పోకుండా బిగ్ డేటాను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పరిశోధనాత్మక విధానాలకు, సంస్థల్లో ప్రావీణ్యతను అభివృద్ధి పరిచేందుకు బిగ్ డేటా ఎనలటిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి అత్యాధునిక విషయాలను అందుబాటులోకి తెచ్చే బిగ్ డేటా ప్రయోజనాలను వినియోగించుకోలేని సంస్థలు.. వారి పోటీతత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ డేటా లో శిక్షణ, తర్ఫీదుపొందడం కూడ..భవిష్యత్తు కెరీర్ కు భారీ ప్రయోజనాలను కల్పిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విప్లవాత్మక డేటా సైన్స్ పావు వంతు ఉద్యోగాలను తన పేరులో వేసుకునే అవకాశం కూడ ఉంది. -
హైటెక్ కాపీయింగ్: బీటెక్ విద్యార్థి పట్టివేత
చాంద్రాయణగుట్ట: హైటెక్ పద్ధతిలో పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని కళాశాల యజమాన్యం పట్టుకొని పోలీసులకు అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం... మాసబ్‌ట్యాంక్‌కు చెందిన షేక్ వసీం అహ్మద్ మలక్‌పేటలోని నవాబ్ షా ఆలం ఖాన్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెకండ్ ఇయర్‌కు సంబంధించి కొన్ని సబ్జెక్ట్‌లు బ్యాక్లాగ్ ఉండటంతో ఆ పరీక్షల కేంద్రం చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో పడింది. శుక్రవారం మధ్యాహ్నం థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభమైంది. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పాఠశాల డెరైక్టర్ చేపూరి శ్రీలత తన బృందంతో కలిసి విద్యార్థులందరినీ పరిశీలిస్తున్నారు. వీరిని చూసి పరీక్ష రాస్తున్న షేక్ వసీం అహ్మద్ ఒక్కసారిగా తన పేపర్ అక్కడే వదిలేసి బయటికి పరుగు తీశాడు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని వెంబడించి పట్టుకుని క్షణ్ణంగా తనిఖీ చేయగా... దిమ్మె తిరిగే విషయం బయటపడింది. వసీం అండర్ వేర్లో సెల్‌ఫోన్, బనియన్ అంచులలో కుట్టిన ట్రాన్స్‌మీటర్ కేబుల్, చెవిలో సూక్ష్మమైన బ్లూటూత్ పరికరం బయటపడ్డాయి. బయటి నుంచి కాల్ వచ్చిన వెంటనే నాలుగైదు రింగ్‌లకు ఆటోమెటిక్‌గా ఫోన్ రిసీవ్ కావడం... రిసీవ్ అయిన వెంటనే వైర్లెస్ ట్రాన్స్ మీటర్ స్వీకరించడం... దాని నుంచి బ్లూటూత్‌కు ఆడియో రిసీవింగ్ అవుతున్నట్లు కనిపెట్టారు. దీంతో పాటు ఫోన్ చేసిన వారి వివరాలు, సమయం లభ్యం కాకుండా ఫోన్లో సాఫ్ట్వేర్ మార్చినట్టు అధికారులు గుర్తించారు. తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే స్నేహితుడి ద్వారా ఈ మాస్ కాపీయింగ్ చేస్తున్నానని నిందితుడు వసీం అహ్మద్ విలేకరులకు తెలిపాడు. ఇతను నాలుగు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇప్పటికే ఒకటి రాశాడు. రెండో పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. కళాశాల డెరైక్టర్ ఫిర్యాదు మేరకు వసీంను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ట్రెక్కింగ్ బృందంపై తేనెటీగల దాడి
నలుగురికి తీవ్ర గాయాలు కొండపైనే ప్రాథమిక చికిత్స {పాణాలతో బయటపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాకళి కొండపై ఘటన దొడ్డబళ్లాపురం : తాలూకాలోని మాకళి కొండపై ట్రక్కింగ్ వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం బెంగళూరుకు చెందిన 13 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాకళి కొండకు ట్రెక్కింగ్ వెళ్లారు. సగభాగం వెళ్లగానే ఉద్యోగుల అలజడికి సమీపంలోనే ఉన్న కొండ తేనేటీగలు మూకుమ్మడిగా దాడిచేశాయి. దీంతో బెంబెలెత్తి పోయిన ఉద్యోగులు పరుగులు తీస్తూ కొండకిందకు వచ్చి స్థానికుల సాయంతో బయటపడ్డారు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్ర అస్వస్థులైన వారికి కొండ మీదే సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ఇక్కడి నంది ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన వారిని హర్షిత్, మహేశ్, విశ్వనాథ్, చౌడప్పలుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి ఘాటీ పీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ... బెంగళూరు నుంచి వచ్చే విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కనీసం ముందస్తు అనుమతి లేకుండా కొండపైకి వెళ్తున్నారని, దీంతో కొండపై అసంఖ్యాంగా ఉన్న తేనెటీగల స్వల్ప అలజడి ఏర్పడినా తట్టుకోలేవని అన్నారు. అదే విధంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారు, మరికొంత మంది ఆకతాయిలు అడవికి నిప్పటించి వెళ్తున్నారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గాయాలు
కీసర : రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో 8 మంది సాఫ్టవేర్ ఉద్యోగులు గాయపడ్డారు. సాఫ్ట్ వేర్ ట్రావెల్ లో ఉద్యోగం చేస్తున్న యువకులు భోగారం నుంచి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని కీసర ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సాఫ్ట్ వేరో్ ఉద్యోగులు ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. -
భవనంపై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
రంగారెడ్డి: సింగపూర్ టౌన్ షిప్లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నివాస ప్రాంగణంలోనే పదో అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన ఈ ఉద్యోగి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటాయి. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలోని సింగపూర్ టౌన్ షిప్ ఉంది. ఇక్కడ ఉన్న జెన్ ప్యాక్ట్ సాఫ్ట్ వేర్ సంస్థలో ఈ ఉద్యోగి పని చేస్తున్నాడు. అయితే, ఆత్మహత్యకు పాల్పడిన ఈ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. -
‘టిమ్స్’తో ట్రిప్పుల లెక్కలు
► సర్వేకు గ్రేటర్ ఆర్టీసీ సన్నద్ధం ► ప్రతి రూట్లో ప్రయాణికుల రద్దీపై శాస్త్రీయమైన అంచనాలు ► నష్టాల నుంచి గట్టెక్కేందుకు మరో కసరత్తు సాక్షి,సిటీబ్యూరో: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తోంది. ఎండలు మండుతున్నా.. ఆదరణ లేక నష్టాల్లో నడుస్తున్న ఏసీ బస్సులపై ఇటీవల వివిధ రూటుల్లో సర్వే నిర్వహించినట్టే.. టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల (టిమ్స్) ఆధారంగా మరో సర్వేకు సన్నద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 1050కి పైగా రూటు ల్లో 42 వేల ట్రిప్పులపై శాస్త్రీయమైన సర్వే జరపాలని నిర్ణయించింది. తద్వారా ఏ రూట్లో, ఏ ట్రిప్పులో, ఏ సమయంలో ప్రయాణికుల డిమాండ్ ఎక్కువ ఉంది? ఏ ట్రిప్పులో తక్కువ ఉందనే అంచనాల ఆధారంగా బస్సు లు నడుపుతారు. తద్వారా బస్సుల నిర్వహణకు అయ్యే ఇంధనం, ఇతర ఖర్చులను ఆదా చేయడమే కాకుండా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపి ఆదా యం పెంచుకునేందుకు ఈ సర్వే దోహదం చేస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 3850 బస్సులు ప్రతి రోజు 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయం అందిస్తున్నాయి. అయినప్పటికీ రోజుకు రూ.96 లక్షల చొప్పున నష్టాలు వస్తున్నాయి. ఈ ఏడాది సుమారు రూ.289 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఒకవైపు భారీ సంఖ్యలో ప్రయాణికులకు సేవలందజేస్తూ అతి పెద్ద ప్రజా రవాణా సంస్థగా కొనసాగుతున్నా... కనీసం లాభనష్టాలు లేని పరిస్థితుల్లో కూడా బస్సులు తిప్పలేని పరిస్థితి నెలకొనడంతో గ్రేటర్ ఆర్టీసీ ఈ కసరత్తు చేపట్టింది. 5200 టిమ్స్ యంత్రాల క్రోడీకరణ... ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని 28 డిపోల్లో వినియోగిస్తున్న 5200 టిమ్స్ యంత్రాల్లో ప్రతి రోజు నిక్షిప్తమ య్యే సమాచారం ఆధారంగా ఈ అంచనాలను రూపొం దిస్తారు. ప్రతీ డిపో నుంచి బయలుదేరే బస్సులు, ట్రిప్పులు, రూట్లు, ప్రయాణికుల సంఖ్యను నిర్ధారిస్తా రు. ఆతర్వాత ప్రతి రెండు డిపోల మధ్య రూట్లు, ట్రిప్పు లు, ప్రయాణికులను అంచనా వేస్తూ ఏ ట్రిప్పులో, ఏ బస్టాపు నుంచి ఎంతమంది ప్రయాణికులు బయలుదేరుతున్నారు. ఆ సమయంలో ఎన్ని బస్సులు ఆ మార్గం లో వెళ్తున్నాయనేది తేలుస్తారు. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ట్రిప్పుల సంఖ్య తగ్గించడం..., ఎక్కువగా ఉంటే పెంచడం వంటివి చేస్తారు. ఫలితంగా ప్రయాణికుల అవసరాల మేరకు శాస్త్రీయ పద్ధతిలో బస్సులు నడపడం సాధ్యవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. దీనివల్ల అనవసర ఖర్చు లు తగ్గి, ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థల సహాయం... ఇప్పటి వరకు ఎక్కడా ఇలా ప్రతి ప్రయాణికుడిని గుర్తించే విధంగా సమగ్రమైన శాస్త్రీయమైన సర్వేలు జరగలేదు. అంచనాలనూ రూపొందించలేదు. గ్రేటర్ ఆర్టీసీలో తలపెట్టిన ఈ సర్వే కోసం సాఫ్ట్వేర్ సంస్థల సహాయం తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రతిభావంతులైన నిపుణుల ద్వారా ఈ సర్వే నిర్వహిస్తే కచ్చితమైన అంచనాలు రాగలవంటున్నారు. ఈ క్రమంలో టిమ్ యంత్రాలతో పాటు, అవసరమైతే ప్రత్యేక డివైజ్‌లను ఏర్పాటు చేసి బస్సులోకి ఎక్కేవారిని, దిగేవారిని లెక్కించే పద్ధతిని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. -
పెట్టుబడుల సాధనలో తెలంగాణ ఫస్ట్: కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణలోని అర్బన్ ప్రాంతాల్లోని పెట్టుబడి అవకాశాలపై దేశంలోని ప్రముఖ మౌళిక వసతుల, నిర్మాణ కంపెనీలతో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం సమావేశం అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్టుల ప్రణాళికలను మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖల వారీగా మంత్రి అయా కంపెనీల ప్రతినిధులకి వివరించారు. దేశంలోని సూమారు 25 ప్రముఖ నిర్మాణరంగ కంపెనీలు ఈ సమావేశానికి హజయ్యాయి. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ లో పెట్టిన పలు ప్రాజెక్టుల తాలుకు వివరాలతోపాటు ప్రభుత్వం అయా ప్రాజెక్టుల పై పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పారదర్శక విధానాలను వివరించి పెట్టుబడులతో ముందుకు వచ్చే కంపెనీలకి ప్రభుత్వం తరపున పూర్తి స్ధాయి సహకారం ఉంటుందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందన్నారు. పరిశ్రమలకి కావాల్సిన స్ధలం, సహకారం విషయంలో ఎలాంటి కొరత లేదని, వేగంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధాన తోడ్పడుతుందన్నారు. ఇక పరిశ్రమల స్ధాపనకి ముందుకు వచ్చే వారికోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాలు కల్పిస్తున్నదని మంత్రి తెలిపారు. ఐటి రంగంలో హైదరాబాద్ త్వరలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. దేశంలో సాఫ్ట్వేర్ పరిశ్రమ పెరుగుదల రేటు 13 శాతం ఉంటే తెలంగాణలో మాత్రం 16 శాతంగా ఉన్నదన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు గూగుల్, మైక్రోసాస్ట్, యాపిల్ , అమెజాన్ వంటి కంపెనీలు అతిపెద్ద క్యాంపస్‌లను నగరంలో నిర్మించేందుకు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. నగరం చుట్టుపక్కలా ఐటి పార్కులు, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పలు మెబైల్, టివి, ఎల్ఈడీ తయారీదారులు ముందుకు వచ్చారన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి నగరంలో నిర్మించబోయే రోడ్లు (SRDP), మూసీ ప్రక్షాళన వంటి ప్రణాళికలను పరిశ్రమల ప్రతినిధులకి పరిచయం చేశారు. తాము పరిచయం చేసిన ప్రభుత్వ ప్రాజెక్టు ప్రణాళికలపై ఆసక్తి ఉన్న కంపెనీలతో తమ అధికారులు ప్రత్యేకంగా చర్చిస్తారని, అవసరమైతే ముఖ్యమంత్రిని సైతం వారికి కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో కలిసి రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆయా సంస్ధలను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీప్ సెక్రటరీ యంజి గోపాల్, ఇందన, ఐటి శాఖల కార్యదర్శులు యచ్ యండిఏ, జియచ్ యంసి కమిషనర్లు, మున్సిపల్ శాఖ కమిషనర్, నగర మేయర్ బొంతు రామ్మెహన్ పాల్గొన్నారు. -
అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా...
హైదరాబాద్: తప్పతాగి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి వేళ అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. సోమవారం అంబర్‌పేట ఎస్ఐ మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శంకర్‌నగర్‌కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి 11.30 ప్రాంతంలో తప్పతాగి ఉన్న నిషాంత్ అమ్మాయిల గదిలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు. అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలించారు. వారు నిషాంత్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిషాంత్‌పై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. విద్యార్థినిపై అఘాయిత్యం.. జీడిమెట్ల: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీకి చెందిన బాలిక(14) చింతల్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై స్థానికుడు రమేష్ (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా...
అంబర్‌పేట: తప్పతాగి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి వేళ అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. సోమవారం అంబర్‌పేట ఎస్ఐ మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శంకర్‌నగర్‌కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి 11.30 ప్రాంతంలో తప్పతాగి ఉన్న నిషాంత్ అమ్మాయిల గదిలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు. అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలించారు. వారు నిషాంత్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిషాంత్‌పై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
పేదింట్లో వెన్నెల వెలుగు
♦ కష్టాలు దాటి.. కన్నీళ్లు దిగమింగి.. ♦ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ♦ సంపాదించిన నిరుపేద విద్యార్థిని ♦ గూడూరు నుంచి విదేశాలకు పయనం ♦ పేదరికాన్ని జరుుంచిన దళిత బిడ్డ ♦ నేటితరం యువతకు ఆదర్శం తండ్రి సంపాదనతోనే ఇల్లు గడవాలి.. తల్లి కూలీ పనులకు వెళ్తేనే పిల్లల చదువు సాగుతుంది.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఆమెను కదిలించారుు.. నిరుపేద కుటుంబంలో పుట్టినా ‘పట్టుదలే’ పెట్టుబడిగా ముందుకు సాగింది.. ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకుని తనకు ఇష్టమైన సాంకేతిక రంగంలో ఆరు అంకె ల జీతంతో ఉద్యోగం సంపాదించింది.. కష్టపడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నేటి తరానికి చాటి చెప్పింది. మారుమూల గ్రామం నుంచి విదేశాలకు వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న దళిత విద్యార్థిని ఓరుగంటి వెన్నెల సక్సెస్ స్టోరీ ఈ వారం ప్రత్యేకం. - పాలకుర్తి పాలకుర్తి : పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకటయ్య-అయిలమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడ పిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. అరుుతే వెంకటయ్యకు తగినంత ఆస్తిపాస్తులు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన వ్యవసాయ బావులపై క్రేన్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య అరుులమ్మ కూడా భర్తతోపాటు పనులకు వెళ్లి కుటుంబపోషణకు సహకరించేది. కాగా, వెంకటయ్య పెద్ద కూతురు వెన్నెలకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ రంగంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాలని ఎన్నో కలలు గని ఆ దిశగా విద్యనభ్యసించింది. ఆదుకున్న ‘పుల్లారెడ్డి’.. భోజనం సమస్య తీవ్రతరం కావడంతో వెన్నెల తాను చదివే ఇంజినీరింగ్ కళాశాల యజమాని పుల్లారెడ్డి (పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత) ఇంటికి వె ళ్లి బాధను వివరించింది. దీంతో ఆయన హాస్టల్లో ఫీజు కట్టి చ దువుకోమని సూచించారు. వాస్తవంగా హాస్టల్లో 6 నెలలకు రూ.45,000 ఫీజు ఉంటుం ది. తన దగ్గర అంత స్థోమత లేకపోవడంతో ఒక్కసారిగా ఆమె మానసిక ఆందోళనకు గురైంది. దీంతో వెన్నెల మరోసారి పుల్లారెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన హాస్టల్లో సగం ఫీజు అరుునా చెల్లించమన్నారు. అరుుతే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆమె చెప్పింది. చివరగా మరోసారి ఉదయం పూట వెళ్లి పుల్లారెడ్డి ఇంటి గేటు ఎదు ట కూర్చుంది. ఈ సందర్భంగా మార్నింగ్ వాక్కు బయలు దేరిన ఆయన వెన్నెలను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగారు. దీంతో ఆమె హాస్టల్ సమస్యను వివరించి తనను ఎలాగైనా ఆదుకోవాలని.. చదువు పూర్తరుున తర్వాత ఉద్యోగంలో చేరి ఫీజు చెల్లిస్తానని చెప్పడంతో పుల్లారెడ్డి కనికరిం చారు. ఈ మేరకు ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి స్వీట్లు ఇచ్చి హాస్టల్లో చదువుకోమని భరోసా ఇచ్చి పంపారు. పదో తరగతి వరకు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో.. గూడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వెన్నెల 1వ తరగతి నుంచి 7 వరకు చదివింది. అనంతరం 8 నుంచి 10వ తరగతి వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించింది. తర్వాత మెదక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ డిప్లొమా కోర్సులో సీటు సంపాదించింది. సీనియర్ల సహకారంతో డిప్లొమా పూర్తి.. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివిన వెన్నెలకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఇంగ్లిష్ మీడియంలో ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. దీంతో తాను కోర్సు చదవలేనని తండ్రి వీరయ్యకు లేఖ రాసింది. దీంతో ఆయన కళాశాలకు వచ్చి కూతురుకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. ఇటు తండ్రి.. అటు సీనియర్ల సహకారంతో వెన్నెల రెండేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఎన్జేసీపీలో బీటెక్‌లో చేరిక.. పాలిటెక్నిక్ కోర్సు పూర్తరుున తర్వాత వెన్నెల.. ఉస్మానియూ యూనివర్సిటీ పరిధిలోని హైదరాబాద్ ఎన్జేసీపీ కళాశాలలో బీటెక్ కంప్యూటర్స్‌లో చేరింది. అరుుతే జేఎన్టీయూకి సంబంధించిన కళాశాలలో చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని తోటి స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఆమె వెంటనే నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు మారింది. అరుుతే ఈ సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భోజనంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటానని ఆమె తండ్రికి చెప్పింది. క్రమశిక్షణతో చదువుకోవాలి.. పేదరికంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి నేను క్రమశిక్షణతో చదువుకున్నా. తల్లిదండ్రులు, స్నేహితులతోపాటు చుక్కా రామయ్య, పుల్లారెడ్డి సార్లు అందించిన సహకారంతో బీటెక్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. దళిత కుటుంబంలో పుట్టిన నేను విదేశాల్లో ఉద్యోగం చేయడం ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి మంచి భవిష్యత్ ఉంటుంది. - వెన్నెల వెన్నెల పెద్ద కొడుకుగా తోడుంటుంది.. నేను, నా భార్య గ్రామాల్లో వ్యవసాయ బావుల పూడిక తీసే వృత్తి చేస్తూనే నలుగురు పిల్లలను చదివించాం. మేము ఊహించిన దాని కంటే పిల్లలు మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వెన్నెలకు ఉద్యోగం రాగానే చెల్లెళ్లు, తమ్ముడి చదువుతోపాటు కుటుంబ పోషణ భారం తన భుజాలపై వేసుకుంది. వెన్నెల ఇంటికి పెద్ద కొడుకుగా మాకు తోడుంటుంది. తమిళనాడుకు చెందిన వ్యక్తితో ఇటీవలనే ఆమెకు పెళ్లి జరిపించాం. మా పిల్లల భవిష్యత్‌కు దోహదపడిన క్రేన్ నడుపుకునే వృత్తిని ఎన్నటికీ మరిచిపోం. ఇప్పటికీ పరిసర గ్రామాల్లో బావుల పూడిక తీసే పనులు చేస్తున్నాం. - ఓరుగంటి వెంకటయ్య తొలుత కిరిటీ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం.. హాస్టల్లో ఉండి చదువుకుంటూనే వెన్నెల లీడ్ ఇండియా 20-20 ఫౌండేషన్ బాలభారతి కార్యక్రమంలో వలంటీర్‌గా పనిచేసింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో పనిచేస్తున్న సంస్థ కాన్సెప్ట్‌నకు ఆమె ఆకర్షితురాలై అందులో చేరింది. అలా అందులో పనిచేస్తూనే బీటెక్ పూర్తి చేసింది. తొలుత కిరీటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. చుక్కా రామయ్య సార్ సహకారం.. హాస్టల్ సమస్యను వెన్నెల.. తండ్రికి వివరించడంతో ఆయన గ్రామంలోని గాండ్ల విశ్వనాథం అనే వ్యక్తి వద్దకు వెళ్లి చెప్పా రు. దీంతో ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు ఉత్తరం రాసి ఇచ్చి కలువమని వెన్నెలకు చెప్పారు. ఈ మేరకు ఆమె చుక్కా రామయ్యను కలిసి తనకు అకామిడేషన్, మంచి భోజన సౌకర్యం ఉండే హాస్టల్ కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఆయన లీడ్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ ఎన్బీ సుదర్శన్ ఆచార్యను కలవమని సూచించారు. దీంతో వెన్నెల అక్కడికి వెళ్లగా లీడ్ ఇండియూ ఫౌండేషన్ స్కూల్ నిర్వాహకులు ఆమెకు అకామిడేషన్‌తో పాటు ఉచిత భోజనం సౌకర్యం కల్పించారు. అరుుతే ఏడాది తర్వాత స్కూల్‌ను కళాశాలకు అనుసంధానం చేయడంతో నిర్వహణ బాధ్యతలు మారాయి. దీంతో వెన్నెలకు మళ్లీ అకామిడేషన్, భోజనం సమస్య ఎదురైంది. అమెరికాలో 4 వేల డాలర్ల వేతనం.. కిరీటిలో పనిచేసిన కొద్దికాలం తర్వాత వెన్నెల.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరింది. అనంతరం హెచ్ వన్ బీ వీసా ప్రాసెస్‌లో టాటా కన్సల్టెన్సీ తరపున అమెరికాలోని డలవేర్ కంపెనీలో 16 నెలల క్రితం ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆమె నెలకు 4 వేల డాలర్ల (సుమారు రూ. 2 లక్షల) వేతనం పొందుతోంది. వెన్నెల ఒక చెల్లెలు రజిత ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. మరో చెల్లెలు డిగ్రీ, తమ్ముడు బీటెక్ చదువుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
మాదాపూర్: హైదరాబాద్ కొండాపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. యూపీకి చెందిన లిపిమిశ్రా(26) డీఎల్ఎఫ్ టవర్స్‌లోని టిప్కో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఇంద్రానగర్‌లోని ఉదయ్వెండ్ స్టార్ అపార్ట్‌మెంట్స్‌లో తాను ఉంటున్న ఫ్లాట్‌లో లిపిమిశ్రా రసాయనిక పొగ పెట్టుకుని ఊపిరాడక మృతి చెందింది. పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
అనంతలో ఆటవిక రాజ్యం
-
360 డిగ్రీస్ ‘వ్యూ’
నేరగాళ్లు పేరు మార్చినా పట్టేసే పరిజ్ఞానం సిద్ధం చేస్తున్న అధికారులు నాలుగు నెలల్లో అందుబాటులోకి: నాగిరెడ్డి సిటీబ్యూరో: నేరగాళ్లను కట్టడి చేయడానికి వారి గత చరిత్రను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ పక్కాగా చేయడానికి నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ‘360 డిగ్రీస్ వ్యూ’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనకు సన్నాహాలు చేస్తోంది. ఐదు జోన్లు... వేల కేసులు ఏటా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యే సిటీ కమిషనరేట్‌లో... నిందితులందరినీ పోలీసు అధికారులు గుర్తుంచుకోవడం కష్టం. దీనికి తోడు నగరంలో ఉన్న ఐదు జోన్లలో ఓ జోన్ పరిధిలో అరెస్టయిన వ్యక్తి పూర్తి సమాచారం మరో జోన్ అధికారుల వద్ద అందుబాటులో ఉండదు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఇది కొంత వరకు అమలవుతున్నా... పాస్‌పోర్టుల వెరిఫికేషన్ లో పూర్తి స్థాయిలో ఫలితాలు ఉండడం లేదు. దీనికితోడు నేరగాళ్ల ఎత్తులు అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పేర్లు మారుస్తూ తప్పుదారి... నగర పోలీసులు గడిచిన ఏడాది కాలంగా ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. పదేపదే నేరాలు చేసే వారిని గుర్తిస్తూ... ఏకకాలంలో మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై దీన్ని ప్రయోగిస్తున్నారు. ఈ భయానికి తోడు వరుసగా నేరాలు చేసే వారిలో కొందరు తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు ప్రారంభించారు. ఓసారి అరెస్టయినప్పుడు ఇంటి పేరు ముందు... అసలు పేరు వెనుక చెబుతూ... మరోసారి తన పేరు ముందు... ఇంటి పేరు వెనుక చెప్పడంతో పాటు పేర్లలో కొన్ని మార్పులు చేస్తున్నారు. మార్పుచేర్పులు చేస్తూ... ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టయిన ప్రతిసారీ బెయిల్ కోసం న్యాయస్థానంలో ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెబితే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఉదాహరణకు చివరలో ‘అయ్య’ అని వచ్చే పేరునే తీసుకుంటే ఓసారి అరెస్టయినప్పుడు చివరి అక్షరాలు ‘డడ్చ’గా... మరోసారి చిక్కినప్పుడు దీన్ని ‘జ్చీజి’గా రాస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఈ తరహా కేటుగాళ్ల సంఖ్య పెరిగినట్లు పోలీసు విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ‘360 డిగ్రీస్ వ్యూ’కు సన్నాహాలు చేస్తోంది. ఏకతాటిపైకి పబ్లిక్ డేటాబేస్లు ఈ సాఫ్ట్‌వేర్‌లో నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి అరె స్టయిన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. తమ కు కావాల్సిన వ్యక్తి పేరుతో పాటు ఇతర వివరాలు ‘సెర్చ్’ చేయడానికి ఉపక్రమిస్తే... అందుబాటులో ఉన్న సమాచారం పొందుపరిస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి ఆ వ్యక్తి పేర్లు మార్చుకున్నా వివరాలన్నింటినీ అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా లు, కమిషనరేట్ల నేరగాళ్ల వివరాలనూ ఈ డేటాబేస్‌లో పొందుపరచాలని అధికారులు నిర్ణయించారు. ‘వెరిఫై’కి భిన్నంగా ‘360’ నగర పోలీసు విభాగం ఇప్పటికే ‘వెరిఫై 24/7’ పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో దేశంలోని 19 వేల కోర్టుల్లో ఉన్న డేటాను అనుసంధానించింది. దీనిలో కేవలం కేసుల దర్యాప్తు పూర్త యి, చార్జ్షీట్లు దాఖలైన వారి వివరాలే ఉంటాయి. ‘360’లో ఎఫ్ఐఆర్ జారీ అయితే చాలు. వారం రోజుల్లో టెండర్లు పిలవాలని భావిస్తున్నాం. నాలుగు నెలల్లోగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పోలీసు విభాగం కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్ఫోన్ల నుంచీ ‘సెర్చ్’ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పాస్‌పోర్టుల వెరిఫికేషన్‌కు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. - వై.నాగిరెడ్డి, అదనపు పోలీసు కమిషనర్, ఎస్బీ -
ప్రీ లాంచ్ బెటరే!
► సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ ఆఫర్లతో మేలంటున్న నిపుణులు ► అభివృద్ధి చెందే ప్రాంతంలో తక్కువ ధరకు స్థిరాస్తి సొంతం ► పేరున్న బిల్డర్.. నాణ్యమైన నిర్మాణాలనే ఎంచుకోవాలని సూచన ‘తక్కువ ధర.. అభివృద్ధి చెందే ప్రాంతం.. రెండేళ్లలో గృహ ప్రవేశం గ్యారంటీ’.. ఇవీ ప్రీ లాంచ్, సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల పేరిట నిర్మాణ సంస్థలు చెప్పే మాటలు. కొన్ని సంస్థలు బహుమతులందిస్తే.. ఇంకొన్ని ప్రత్యేక రాయితీలందిస్తే.. మరికొన్ని చ.అ.కు రూ.200 వరకు తగ్గింపు చేస్తుంటాయి. పేరేదైనా.. ఆఫరేదైనా.. కొనుగోలుదారులకు ఇవి లాభసాటేనంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. సాక్షి, హైదరాబాద్: ఏ బిల్డర్‌ను కదిలించినా చెప్పే కామన్ మాట.. ‘ఎంక్వైరీలు జరుగుతున్నాయి కానీ, బుకింగ్స్ కావట్లేదని’! మరి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మాణ సంస్థలేం చేస్తున్నాయంటే.. సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్, ఇనాగ్రల్, లాంచింగ్ ఆఫర్ వంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షించేస్తున్నాయి. నిర్మాణ సంస్థల సంగతి పక్కన పెడితే అసలీ ఆఫర్లతో కొనుగోలుదారులకు నిజంగా లాభమేనా అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో సాఫ్ట్ లాంచ్ ఆఫర్ కింద చ.అ.కు రూ.200 వరకు తగ్గించారనుకుంటే.. 1,000 చ.అ. ఫ్లాట్ రూ.2 లక్షలు తగ్గుతుంది. అదే ఫ్లాట్ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపు (కనీసం రెండేళ్లు అనుకుంటే) గృహ ప్రవేశం సమయానికి ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.200 వరకు ధర పెరుగుతుంది. అంటే మొత్తంమీద సొంతింట్లో కాలు పెట్టకముందే రూ.4 లక్షలు ఆదా చేసినట్టేగా!! రేటెప్పుడూ ఒకేలా ఉండదు.. ‘నిన్నటి ధర నేడుండదు.. నేటి ధర రేపుండదు..’ హైదరాబాద్ రియల్టీ మార్కెట్ తీరిదే. నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నూతన పారిశ్రామిక విధానంతో నగరానికొస్తున్న కంపెనీలు, పెట్టుబడులు వంటి వాటితో సమీప భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ పూర్వ వైభవానికి ఢోకా లేదని నిపుణుల అభిప్రాయం. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ని చూసిన వారెవ్వరైనా ఇప్పుడు నగరాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఐదేళ్లలో ఇంత మార్పులు చోటుచేసుకున్నాయా అని అనిపిస్తుంది. అదే ఉత్తరాది నగరాల్ని పరిశీలించండి. పదిహేనేళ్ల క్రితం అక్కడి మౌలిక సదుపాయాలు ఎలాగుండేవో ప్రస్తుతమూ అదే విధంగా ఉన్నాయి. మన నగరానికి.. కొన్ని ఇతర నగరాలకు గల తేడా ఇదే. గత కొన్నేళ్లుగా వివిధ నగరాల్లో ఉద్యోగం చేసి నగరంలో స్థిరపడ్డ ఒక నిపుణుడి అభిప్రాయమిది. ఇక్కడి అభివృద్ధిని గమనించే వారంతా సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల వైపు దృష్టి పెట్టి.. చౌక ధరలో ఫ్లాట్లను సొంతం చేసుకుంటున్నారు. అత్తారింట్లో అల్లుడి మర్యాద.. ప్రాజెక్ట్ ఏదైనా.. నిర్మాణ సంస్థ ఏదైనా.. మొదటి కొనుగోలుదారులకు పండక్కి అత్తారింటికెళ్లే అల్లుడికిచ్చినంత మర్యాద కంపెనీ మీకిస్తుంది. కంపెనీ స్పెసిఫికేషన్స్ నచ్చకపోతే మార్పులు చేయమంటే విసుక్కోకుండా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి. నిర్మాణ సంస్థలకూ లాభమే.. కేవలం కొనుగోలుదారులకే కాదు.. బిల్డర్లకు, నిర్మాణ సంస్థలకూ ఈ విధానం ద్వారా ప్రయోజనం ఉంది. అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ‘సాఫ్ట్ లాంచ్’ అమ్మకాల్ని కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుంటాయి. అయితే ఇదంతా బిల్డర్‌కు కానీ, నిర్మాణ సంస్థలకు కానీ మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం మంచిదే కానీ, సాఫ్ట్ లాంచ్‌లో కొనేటప్పుడు కేవలం ధర ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. అవసరమైతే న్యాయవాదులు, నిపుణుల సలహా తీసుకోవాలి. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోండి. మీరు కొనబోయే వెంచర్ ఎక్కడుంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశమెంత? వంటి అంశాల్ని గమనించండి. చుట్టుపక్కల ఏమైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయా అనే విషయానికి పెద్దపీట వేయాలి. -
స్టార్ హోటళ్లో ఏదీ సెక్యూరిటీ
సెక్యూరిటీ సిబ్బందికి తర్ఫీదునివ్వాలని సూచన సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ స్థాయిలోనే స్టార్ హోటల్స్ వెలిశాయి. ఆయితే ఆయా హోటళ్లు తీసుకుంటున్న భద్రతా చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో అటువైపుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో సేవలందిస్తున్న దాదాపు 100కు పైగా బడా హోటళ్ల మేనేజర్లతో ఇటీవల మాదాపూర్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. గతంలో టైస్టులు లక్ష్యంగా చేసుకున్న ముంబైలోని తాజ్ హోటళ్ల ప్రస్తావన చెబుతూనే...ఇక్కడి హోటళ్ల యజమానులు భద్రతకు తగిన ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నియమించుకోవాలన్నారు. ఈ సెక్యూరిటీ గార్డులు ఏ ఘటన సంభవిస్తే ఎలా స్పందించాలనే దానిపై తగిన తర్ఫీదునిచ్చేందుకు తమ పోలీసు విభాగం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. హోటల్‌కు వచ్చే విజిటర్స్ జాబితా తప్పకుండా మెయిన్‌టెయిన్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలతో హోటల్ సిబ్బంది జాబితాను దగ్గర ఉంచుకోవాలన్నారు. గన్‌లెసైన్స్‌కు స్పందన కరువు... ఐటీ కంపెనీ నిర్వాహకులతో పాటు స్టార్ హోటల్స్ కూడా కాపలా సిబ్బందిని ఉత్తచేతులతోనే ఉంచుతున్నారు. సిబ్బందికి ఆయుధాలిస్తే, నిర్వహణ, బాధ్యత తమమీద ఎక్కడ పడుతుందేమోనని సంస్థలు వెనకడుగు వేస్తుండటమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యంలో తొలిసారిగా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు హోటళ్ల భద్రత గురించి కూడా చర్చ మొదలైంది. అదే ఏడాది బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటన తర్వాత కాపలా సిబ్బందికి ఆయుధాలివ్వాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. ఐటీసంస్థలు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, పరిశ్రమలే, హోటళ్ల వద్ద ఉండే కాపలాసిబ్బందికి ఆయధాలిచ్చేందుకు సిద్ధమని అప్పట్లోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఆయుధాలకు లెసైన్సులు ఇస్తామన్నా స్పందించరే సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు భద్రతా సిబ్బంది దరఖాస్తు చేసుకుంటే ఆయుధ లెసైన్సులు జారీ చేస్తామని ప్రకటించారు. అయితే దీనికి ఆశించినంత స్పందన లేకపోవడంతో సీవీ ఆనంద్ నిర్ఘాంతపోయారు. అందుకే విడతల వారీగా ఆయా సంస్థలతో సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఐటీ కారిడార్‌లో భద్రతతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్యలు తీసుకుంటున్నా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)లో సభ్యత్వం తీసుకోవాలని సీవీ ఆనంద్ కోరారు. నిర్వాహకుల భయాలకు కారణాలు ప్రస్తుతం స్టార్ హోటళ్ల నిర్వహణ అంతా ప్రైవేటే వ్యక్తుల చేతుల్లోనే ఉంది. వీరికి ఆయుధాలిస్తే కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయన్న భయం నిర్వాహకుల్లో ఉంది.ఆయుధాలు ఉంటే వాటి నిర్వహణపై ఎప్పటికప్పుడు స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇస్తుండాలి. ఆయుధం ఉంటే దుర్వినియోగం అవుతుందన్న భయం నిరంతరం ఉంటుంది. నిజంగానే దుర్వినియోగమైతే మొదటికే మోసం వస్తుందన్నది ప్రధాన ఆందోళన. -
అమెరికా వయా అమీర్‌పేట....
► సాఫ్ట్వేర్ కోర్సులకు చిరునామా ► వందలాది శిక్షణ సంస్థలు ► స్వల్ప ఫీజులతోనే మంచి కోర్సులు ► యువతరం చూపు...ఇటు వైపు అమెరికా... సాఫ్ట్వేర్ ఉద్యోగుల కలల ప్రపంచం. అందమైన భవిష్యత్తును అందించే అద్భుత లోకం. ఆ కలలను సాకారం చేసుకోవాలనుకున్న వారు ముందుగా అమీర్‌పేటలో అడుగు పెట్టాల్సిందే. అవును... అమెరికాకు దగ్గర దారి అమీర్‌పేట అంటే అతిశయోక్తి కాదు. అప్పుడే కళాశాల నుంచి బయటకు వచ్చిన వారితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు సైతం ఇక్కడ తమ సాంకేతిక ప్రతిభకు మెరుగులు దిద్దుకొని... విమానం ఎక్కుతున్నారు. సాఫ్ట్వేర్ కోర్సులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతం... అభ్యర్థులకు శిక్షణ అందించడమే కాదు... పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సనత్ నగర్: అమీర్‌పేట... గేట్ వే ఆఫ్ అమెరికా. అవును... ఏ మారుమూల గ్రామం నుంచైనా... ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’కు పునాది వేసుకుంటేనే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. సాంకేతికత కొత్త అడుగులు వేస్తే... సంబంధిత కోర్సులు మొదటిగా అమీర్‌పేటలోనే ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ లభించే కోర్సులు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సును అందిపుచ్చుకునే లోపే... మరో కోర్సు సాఫ్ట్వేర్ యువతకు పరిచయం అవుతోంది. జావా, సీ ప్లస్, సీ ప్లస్ ప్లస్, క్లౌడ్ ఫర్ కస్టమర్, హనా డెవలప్మెంట్, యూఐ5-ఫ్లోరి, వెబ్ ప్రో అబాప్, సీఆర్ఎం టెక్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, మొబిలిటీ (ఆప్స్ డెవలప్మెంట్), షేర్ పాయింట్ టెక్నాలజీ, ఫోన్ గ్యాప్ శాప్ (సింపుల్ ఫైనాన్స్) ... ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్వేర్ కోర్సులతో పాటు హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్సుల శిక్షణకు అమీర్‌పేట్ పెట్టింది పేరు. ఈ కోర్సులు ఇన్ఫ్రా, మొబైల్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ ట్రాకింగ్, జీఐఎస్ వంటి విభిన్న రంగాల వైపు యువతను అడుగులు వేయిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యువతను సానబెడుతూ సాఫ్ట్వేర్ దిగ్గజాలను తయారు చేసే కేంద్రంగా అమీర్‌పేట్ భాసిల్లుతోంది. రెండున్నర దశాబ్దాల క్రితమే ‘సాఫ్ట్’కు దారులు... అమీర్‌పేట్ కేంద్రంగా రెండున్నర దశాబ్దాల క్రితమే సాఫ్ట్‌వేర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థుల పరిజ్ఞానం సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏమాత్రం సరిపోయేది కాదు. ఇలాంటి వారికి శిక్షణ కేంద్రాలు బాసటగా నిలిచాయి. 1999-2000 మధ్య ఇక్కడ కేవలం నాలుగైదు శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఆ సమయంలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) మైత్రీవనంలోకివచ్చింది. ఎస్టీపీఐ చెంతనే ఉండడంతో అనుమతులు... ఇతర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందన్న భావనతో ఈ ప్రాంతం సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలకు నెలవైంది. ప్రస్తుతం ఇక్కడ 400కు పైగా సంస్థలు సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాయి. అందరి చూపు అమీర్‌పేట వైపే... తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 700 ఇంజినీరింగ్కళాశాలల విద్యార్థులతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, ముంబయి నగరాల నుంచి సైతం సాఫ్ట్వేర్ శిక్షణకు అమీర్‌పేట వస్తుంటారు. వీటితో పాటు ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్లో ప్రాజెక్టు శిక్షణకూ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు లక్షకు పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో వివిధ కోర్సులు, ప్రాజెక్టులకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు. మిగతా నగరాల్లో ఎన్నో శిక్షణ సంస్థలు ఉన్నప్పటికీ... అక్కడి ఫీజులో 10 శాతం మాత్రమే ఇక్కడ ఉండడంతో విద్యార్థులు ఇటువైపుక్యూ కడుతున్నారు. ఉదాహరణకు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్సుకు బెంగళూరులో రూ.40వేలు ఫీజు ఉంటే అమీర్‌పేట్‌లో రూ.నాలుగు వేలకే లభిస్తోంది. తక్కువ ఫీజు ఉంది కదా... క్వాలిటీ ఎలా ఉంటుందోనని భయపడనక్కర్లేదు. నాణ్యతా ప్రమాణాలలోనూ ఇక్కడి సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే శిక్షణతో పాటు ప్లేస్మెంట్స్కూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో పాటు హాస్టళ్లు, భోజన వసతికి కొదువ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వారు సైతం సాఫ్ట్వేర్ కోర్సులు అనగానే అమీర్పేటకే మొగ్గు చూపుతారు. విడిభాగాలకు కేరాఫ్... ఆదిత్య ట్రేడ్ సెంటర్ మదర్ బోర్డు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (ర్యామ్), ఎస్‌ఎంపీఎస్, హార్డ్‌డిస్క్... ఇలా కంప్యూటర్‌కు సంబంధించిన సకల విడి పరికరాలకు ఆదిత్య ట్రేడ్ సెంటర్ కేంద్ర బిందువైంది. చిన్న చిన్న చిప్‌ల నుంచి సీపీయూ, మానిటర్, యూపీఎస్, ప్రింటర్, స్కానర్, డీటీఎస్ స్పీకర్స్ వరకు... ఏది కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. కొత్త వాటిని ఇంటికి ఆహ్వానించాలన్నా... పాత వాటిని వదిలించుకోవాలన్నా (అమ్మాలన్నా) ఇదే అడ్డా. ఇక ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ మొరాయించినా ఆదిత్య ట్రేడ్ సెంటర్ బాట పట్టాల్సిందే. నాణ్యమైన సేవలు యువతను ఇటువైపు నడిపిస్తుంటాయి. ఎందరికో ఉపాధి ఒక్కసారి అమీర్‌పేట మైత్రీవనం-సత్యం టాకీస్ మార్గాన్ని పరిశీలిస్తే ఆ రహదారితో పాటు అక్కడి భవనాలు దాదాపుగా హోర్డింగ్‌లు, బ్యానర్లతో నిండి ఉంటాయి. శిక్షణ సంస్థలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎందరో ఉపాధి పొందుతున్నారు. వెయ్యి కరపత్రాలు పంచితే... రూ.100 వస్తాయి. ఒక్కొక్కరు రోజుకు 5 నుంచి 10 వేల వరకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించుకుంటున్నారు. దాదాపు 500 మందికి కరపత్రాలే ఉపాధినిస్తున్నాయి. ఒక్కో బ్యానర్ కడితే రూ.10 నుంచి రూ.20 చెల్లిస్తారు. దీంతో బ్యానర్ల ద్వారా కూడా చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఇక్కడికి వచ్చే యువతను నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌బండార్, టిఫిన్ సెంటర్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారులు సునాయాసంగా బతుకు బండిని నడిపించేస్తున్నారు. ఇక వీరిని నమ్ముకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల వ్యాపారమైతే మూడు పువ్వులు... ఆరు కాయలే. చెంతనే పాస్‌పోర్టు సేవా కేంద్రం... ట్రావెల్ ఏజెన్సీలు అమెరికా కలలలో బతికే సాఫ్ట్వేర్ యువత కోసమే అన్నట్లుగా పాస్‌పోర్టు సేవా కేంద్రంతో పాటు ఎయిర్ టికెట్ల కోసం ట్రావెల్ ఏజెన్సీలు అమీర్‌పేటలో వెలిశాయి. ఊరు నుంచి అమీర్‌పేట్.... ఇక్కడి నుంచి ఎంచక్కా విదేశాలకు చేరవేసేందుకు వివిధ సంస్థలు యువత కోసం తరచూ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంటాయి. అందుబాటులో కొత్త కోర్సులు నేను 2000వ సంవత్సరంలో నగరానికి వచ్చాను. అప్పుడు కేవలం నాలుగు సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 400 దాటిపోయాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కోర్సులు పుట్టుకురావడం సహజమే. మా సంస్థలోనే దాదాపు వందకు పైగా కోర్సులు సాఫ్ట్వేర్ యువతకు అందిస్తున్నాం. థియరీతో పాటు వారి కోసం ప్రాక్టికల్ చేయించేందుకు ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతోనే డిమాండ్ ఉన్న కోర్సులు లభిస్తాయి. -కోటి, పీర్స్ టెక్నాలజీ ఆపరేషన్ హెడ్, మైత్రీవనం జాబ్ గ్యారెంటీ ఇక్కడ శిక్షణ పొందితే జాబ్ గ్యారెంటీ అన్న నమ్మకం ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వెబ్ డిజైనింగ్‌లో శిక్షణకు వచ్చాను. తక్కువ ఫీజుతోనే శిక్షణ ఇచ్చే సంస్థలు ఇక్కడ ఉండడంతో పేద కుటుంబీకులు సైతం ఉన్నత కోర్సులను ఇక్కడ చేయగలుగుతున్నారు. నాలాంటి వారికి అమీర్‌పేట్ ప్రాంతం ఒక వరం లాంటిదే. - శిరీష, వెబ్ డిజైనింగ్ విద్యార్థిని ఇక్కడ ఫీజులు తక్కువ జేఎన్టీయూలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులో చేరేందుకు ఇక్కడికి వచ్చాను. డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిసి అమీర్‌పేట్ వచ్చాను. నెట్లో అన్వేషిస్తే... బెంగళూరు, ముంబయిలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఫీజు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా అనిపించింది. అందుకే ఇక్కడ శిక్షణకు ఆసక్తి కనబరిచాను. -హసన్ డెరినోజ్, టర్కీ దేశస్తుడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
మల్కాజ్గిరి: నిశ్చితార్థ విందుకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శవమై తేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కథనం.. వెంకటేశ్వరనగర్ సత్య అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న సుబ్బారావు కుమారుడు కె. శ్రీనివాస్(36) సాప్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి సుబ్బారావు స్నేహితుడు మీర్జాలగూడకు చెందిన రమేష్ కూతురు నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీనివాస్ పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారుజామున విందు జరిగిన ప్రాంతంలో శ్రీనివాస్ మృతి చెందిపడి ఉన్న సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. మృతుడి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేవు. పోస్ట్‌మార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. -
కన్నం వేసిన ఇంటికి నిప్పుపెట్టారు..
-
టెకీ ప్రాణం తీసిన అతివేగం
గచ్చిబౌలి : సహచరులు వారించినా వినకుండా మితిమీరిన వేగంతో వెళుతుండగా కారు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదేందర్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని దివ్య శ్రీ ఎన్ఎస్ఎల్ ఎస్ఈజెడ్లోని ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసే నలుగురు యువతులు, టీం లీడర్ రవిచంద్రతో కలిసి ఐస్‌క్రీం తినేందుకు కారులో హైటెక్ సిటీకి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు తిరిగి వస్తుండగా రవిచంద్ర కారును మితిమీరిన వేగంతో నడుపుతున్నాడు. కారులో ఉన్న వారు వారించినా వినలేదు. రాయదుర్గంలోని బయోడైవర్సిటీ జంక్షన్లో అదపు తప్పి కారు పల్టీకొట్టింది. దీంతో కూకట్‌పల్లికి చెందిన ఐ.విజిత(23) అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని గచ్చిబౌలిలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో టోకరా
రాంగోపాల్‌పేట్: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నిరుద్యోగి నుంచి రూ.2లక్షలు కాజేశాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే రేపుమాపు అంటు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుడి తండ్రి మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన కుమారస్వామి ప్రభుత్వ ఉద్యోగి. ఇతని కుమారుడు రాకేష్ బీటెక్ పూర్తి చేసి అమీర్‌పేట్‌లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గత కొద్ది నెలల క్రితం అమీర్‌పేట్‌కు చెందిన చక్రధర్ అనే వ్యక్తి రాకేష్‌కు పరిచయం అయ్యాడు. తాను ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్ష రూపాయలు ఇవ్వాలని రాకేష్‌ను నమ్మించాడు. దీంతో రాకేష్ జూలై 15వ తేదీన చక్రధర్‌కు లక్ష రూపాయలు ఇచ్చాడు. కానీ, ఉద్యోగం మాత్రం రాలేదు. దీంతో రాకేష్ ఒత్తిడి చేయడంతో ఓ ఎంఎన్సీ కంపెనీకి చెందిన అపాయింట్మెంట్ లెటర్‌ను తెచ్చి ఇచ్చాడు. అటు తర్వాత రెండు రోజులకే ఆ కంపెనీ దివాళా తీసిందని మరో లక్ష రూపాయలు ఇస్తే ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. తన స్నేహితుడు ప్రదీప్ అకౌంట్‌కు ఆ డబ్బును బదిలీ చేయాలని చక్రధర్ కోరడంతో రాకేష్ అలాగే చేశాడు. కానీ, మళ్లీ ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత నెల 10వ తేదీన రాకేష్ ఆయన తండ్రి కుమారస్వామిలు చక్రధర్‌ను గట్టిగా నిలదీయడంతో చెక్కును అందించాడు. కానీ, అందులో డబ్బు లేవు. అప్పటి నుంచి చక్రధర్ తప్పించుకుని తిరుగుతూ డబ్బు ఇవ్వకుండా ఉద్యోగం చూపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన కుమార స్వామి శనివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బు లావాదేవీలు అన్నీ సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద జరగడంతో మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డెలాయిట్ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
డెలాయిట్ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో రచ్చ శైలజ భార్గవి(29) అనే సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబకలహాలతోనే శైలజ ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. డెలాయిట్ కంపెనీలో శైలజ ఉద్యోగం చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్నున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటిపక్క కిరాణా కొట్టూ.. ఆన్లైన్లో
కూరగాయల నుంచి కిరాణా సామాను వరకూ.. త్వరలోనే ‘పెప్పర్‌టాప్’లో మాంసాహారం కూడా.. 10 నెలల్లో 47.2 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నెల రోజుల్లో మరో 20 మిలియన్ డాలర్లు కూడా.. మొత్తం వ్యాపారంలో ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవ్‌నీత్ సింగ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ఇపుడు ఆన్లైన్ షాపింగ్‌లో దొరకనిదంటూ ఏదీ లేదు! గుండు సూది నుంచి ఆకాశయానం వరకూ ప్రతి ఒక్కటీ కొనుగోలు చేయొచ్చు. కాకపోతే తమ ఉత్పత్తులను ఆన్లైన్ వేదికగా విక్రయించాలంటేనే మాత్రం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. వెబ్సైట్ డిజైనింగ్.. సాఫ్ట్వేర్ అభివృద్ధి.. పేమెంట్ గేట్ వే.. డెలివరీ వ్యవస్థ.. ఇలా చాంతాడంత పనుంటుంది. ఒక మోస్తరు వ్యాపార సంస్థలకైతే ఇది పెద్ద భారం కాకపోవచ్చు. కానీ, గల్లీలోని చిన్న చిన్న కిరాణా దుకాణాలూ ఆన్లైన్లో తమ ఉత్పత్తులను విక్రయించాలంటే... ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇలాంటి దుకాణాలకు వేదికను సృష్టించింది గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న పెప్పర్‌టాప్. కోడిగుడ్లు, కూరగాయల నుంచి మొదలుపెడితే ఇంట్లోకి అవసరమయ్యే కిరాణా సామాను వరకూ ప్రతి ఒక్కటీ ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేయవచ్చంటున్నారు పెప్పర్‌టాప్ సహ వ్యవస్థాపకుడు నవ్‌నీత్ సింగ్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... గుర్గావ్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐదేళ్లు.. ఆ తర్వాత లాజిస్టిక్ కంపెనీలో ఏడాది కాలం పనిచేశాక.. వ్యాపారం మీద ఉన్న ఇష్టంతో సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆన్లైన్ షాపింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో.. ఫ్యాషన్ వస్తువులో కాకుండా ఇంటి పక్కనే ఉన్న కిరాణా సామాను కూడా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని భావించా. నా ఆలోచన మీద నమ్మకంతో కంపెనీ ప్రారంభించక ముందే 2013 నవంబర్‌లో సెకోయా క్యాపిటల్ 1.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వీటితో కో-ఫౌండర్ మిలింద్ శర్మతో కలసి 2014 డిసెంబర్లో గుర్గావ్ కేంద్రంగా పెప్పర్‌టాప్.కామ్‌ను ప్రారంభించాం. త్వరలోనే మాంసాహార ఉత్పత్తులూ.. ప్రస్తుతం పెప్పర్‌టాప్‌లో కోడిగుడ్ల నుంచి మొదలుపెడితే డ్రైఫ్రూట్స్, సేంద్రియ ఆహార ఉత్పత్తులు, పూజ సామాన్లు, పండ్లు, కూరగాయలు, పెట్ ఉత్పత్తులు, బేబీ కేర్, జుట్టు, చర్మ సౌందర్య ఉత్పత్తుల వంటివి సుమారు 1,500 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇందులో 220 కిరాణా దుకాణాలు, 3 వేల మంది కస్టమర్లు రిజిస్టరయి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి 500-700 దుకాణాలకు, 5-7 వేల మంది కస్టమర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే పెప్పర్‌టాప్‌లో మాంసాహార ఉత్పత్తులనూ విక్రయిస్తాం. 10 నెలల్లో 47.2 మిలియన్ డాలర్ల సమీకరణ... పెప్పర్‌టాప్ ప్రారంభమై 10 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే 47.2 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. సీడ్ రౌండ్లో 1.2 మిలియన్ డాలర్లు, ఆ తర్వాత సిరీస్-ఏలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 మిలియన్ డాలర్లు, సిరీస్-బీలో భాగంగా ఇటీవలే 36 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. ఇందులో స్నాప్‌డీల్, సెకోయా ఇండియా, సైఫ్ పార్టరన్స్ సంస్థలు సమష్టిగా పెట్టుబడులు పెట్టాయి. మరో నెల రోజుల్లో మరో 20 మిలియన్ డాలర్ల పెట్టు బడులను సమీకరించనున్నాం. ఏపీ, తెలంగాణ వాటా 20 శాతం... పెప్పర్‌టాప్ మొత్తం వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా 20 శాతం వరకూ ఉంది. రోజుకు హైదరాబాద్ నుంచి 15 శాతం ఆర్డర్లొస్తున్నాయి. విశాఖపట్నం నుంచి రూ.6-7 వేలొస్తున్నాయి. ఆర్డరిచ్చిన రెండు గంటల్లోపు వస్తువులను డెలివరీ చేస్తాం. ప్రతి ఆర్డర్ మీద 7-8 శాతం చార్జీ కిరాణా దుకాణ యజమానిపై పడుతుంది. ప్రస్తుతం 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న పెప్పర్‌టాప్‌లో ఆరు నెలల్లో 5,000 మందిని నియమించుకుంటాం. 75 నగరాలకు విస్తరణ... ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో సేవలందిస్తున్న పెప్పర్‌టాప్ వచ్చే మార్చి నాటికి దేశంలోని 75 నగరాలకు విస్తరించనుంది. ‘‘కంపెనీని ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు 30-40 ఆర్డర్లొచ్చేవి. కానీ, ఇప్పుడది 1,500-1,700కు చేరింది. వారాంతాల్లో అయితే ఏకంగా 40 వేల ఆర్డర్లొస్తున్నాయి. మొత్తం వ్యాపారంలో మొబైల్ ఆర్లర్లే ఎక్కువ. ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా 85 శాతం, ఐఓఎస్ నుంచి 10 శాతం ఆర్డర్లొస్తున్నాయి. మిగతావి వెబ్సైట్ నుంచి వస్తున్నాయి. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ
కిలోన్నర బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరణ హైదరాబాద్: ఇంట్లో కుటుంబమంతా నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సయ్యద్ షాహన్వాజ్ (42) అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 3న మలక్‌పేట ఆస్మాన్‌ఘడ్ వెంకట్రాది నగర్లో తన నివాసానికి వచ్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో భార్య, పిల్లలతో కలసి శాలిబండలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. తిరిగి రాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి పడుకున్నారు. తెల్లవారుజామున షాహన్వాజ్ లేచేసరికి గదిలో ఉన్న బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న కిలోన్నర బంగారం, రెండు లక్షల నగదు, 5 వేల అమెరికా డాలర్లు కన్పించలేదు. దీంతో వెంటనే వారు మలక్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బాధితులనుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.