దుబ్బాక: పైరసీ చట్టాలకు విరుద్ధంగా దుబ్బాకలో నిర్వహిస్తోన్న ఇంటర్ నెట్, డీటీపీ, ఫొటో స్టూడియో, ఇంటర్ నెట్ కేఫ్, కేబుల్ ఆపరేటర్ కేంద్రాలపై గురువారం అనూ స్ర్కిప్ట్ పైరసీ విభాగం ప్రతినిధులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనూ స్ర్కిప్ట్ సంస్థ అనుమతుల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటున్న పలు కేంద్రాల నిర్వాహకులకు జరిమానా విధించారు.
ఈ సందర్భంగా అనూ స్ర్కిప్ట్ పైరసీ విభాగం ఆపరేషన్ మేనేజర్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ అనుమతి లేకుండా నిర్వహించే కేంద్రాల నిర్వాహకులపై కాపీ రైట్ యాక్ట్ ప్రకారం 67బి, 420 సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. అనూ స్ర్కిప్ట్‌ను ఉపయోగించుకునే కేంద్రాల నిర్వాహకులు సంస్థకు రూ. 13 వేలను చెల్లించి, ఏడాది పాటు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ రమేశ్, కానిస్టేబుల్ చంద్రం తదితరులు పాల్గొన్నారు.