ANU
-
అనుసృజన
అను పెళ్లకూరు.. ఫ్యాషన్ రంగంలో బాగా వినబడే పేరు. ఫ్యాషన్‌పై ఆమెకున్న పిచ్చి పద్దెనిమిదేళ్ల వయసులోనే మిస్ యూఏఈ ఫైనలిస్ట్ కోసం దుస్తులను డిజైన్ చేసే కాంట్రాక్ట్‌ను తెచ్చిపెట్టింది. కేవలం రూ. పదిహేను వేలతో అద్భుతమైన మూడు డిజైన్స్‌ను అందించి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, తన పేరును ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ జాబితాలో చేర్చుకుంది.ఫ్యాషన్‌పై ఉన్న ప్యాషన్‌తో ఇంటర్ అయిపోయిన వెంటనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అను. కానీ, ఆ రంగంలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యమని గ్రహించింది. దాంతో తరగతులకు హాజరవక.. కాలేజ్ డ్రాప్ అవుట్‌గా మిగిలింది. తన అభిరుచిని గైడ్‌గా తలచి, అనుభవాన్ని పాఠాలుగా మలచుకుంది. సోదరుడు సూర్య సహకారంతో ‘ఎస్ అండ్ ఏ (సూర్య అండ్ అను)’ పేరుతో ఓ మల్టీ డిజైనర్ స్టోర్‌ను ప్రారంభించింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తన డిజైన్స్ సెలబ్రిటీల కంట పడేలా చేసుకుంది. అది వర్కవుట్ అయి.. సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసే చాన్స్ కొట్టేసింది. నిహారిక కొణిదెల, రుహానా శర్మ, వితికా షేరు, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య వంటి సెలబ్రిటీలందరికీ అను పెళ్లకూరు ఫేవరిట్ డిజైనర్ అయింది. ఆ ప్రోత్సాహంతోనే ‘తనాషా’ పేరుతో సొంత బ్రాండ్‌ను స్థాపించింది. అంతేకాదు, ఇటీవల ప్రతిష్ఠాత్మక బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ‘స్వర్ణిరహ’ పేరుతో తన లేటెస్ట్ కలెక్షన్స్‌ను ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఆ ఈవెంట్‌కు గ్లామర్‌ను జోడిస్తూ ప్రఖ్యాత నటీమణులు శ్రియా సరన్, మృణాల్ ఠాకూర్ షో స్టాపర్స్‌గా ర్యాంప్ వాక్ చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి రెండింటి మేళవింపుగా ఉండే ఆమె డిజైన్స్‌కు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు లభించింది. దుబాయ్, శ్రీలంక, సింగపూర్ దేశాల్లో జరిగిన పలు ఫ్యాషన్ షోస్‌లో అను తన డిజైన్స్‌ను ప్రదర్శించింది.అనుభవాన్ని మించిన గురువు ఉండరు. అది నాకు చాలా నేర్పింది. మొదట్లో ఎన్నో సవాళ్లను, ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని నమ్మాను. అదే నిజమైంది.– అను పెళ్లకూరు. -
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..
భారతదేశంలో ఎంతో మంది నిష్టాతులైన మహిళలు బిలియన డాలర్ల కంపెనీలకు సీఈవోలుగా పనిచేసి తామేంటో ఫ్రూ చేసుకున్నారు. అంతేగాదు మహిళలు ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని అయినా చాలా సునాయాసంగా నడపగలరని చేసి చూపించారు. అలాంటి కోవకు చెందిందే అను అగా. అను అగా ప్రముఖ ఇంధన పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ అయిన థర్మాక్స్‌కు చైర్‌పర్సన్‌గా సేవలందించారు. ఆమె ఈ పదవిలో 1996 నుంచి 2004 వరకు కంపెనీ చైర్‌పర్సన్‌గా చాలా సమర్థవంతంగా పనిచేశారు. అంతేగాదు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సరిగ్గా 2004లో ఆ పదవి నుంచి వైదొలగినప్పటికీ కంపెనీని పర్యవేక్షిస్తూనే ఉండేవారు. చివరి 2018లో తన కుమార్తె మెహర్ పుదుమ్జీకి పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 4, 2023 నాటికి కంపెనీ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 30,408 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. అను పదవీవిరమణ తర్వాత పూర్తి సమయాన్ని సామాజిక సేవకు అంకితం చేసింది. అందుకుగానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఫోర్బ్స్ భారతీయు సంపన్నుల జాబితా ప్రకారం డిసెంబర్ 4,2023 నాటికి ఆమె సుమారు రూ. 20 వేల కోట్ల సంపదతో ఉన్నట్లు అంచనా వేసింది. అంతేగాదు భారతదేశంలో ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. ఇక ఈ థర్మాక్స్‌లో అను అగ ప్రయాణం 1985 నుంచి ప్రారంభమయ్యింది. ఇక ఆమె భర్త మృతితో 1996 కంపెనీ బాధ్యతలు తీసుకోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కంపెనీని తనదైన చతురతో మంచి లాభాల బాటలోకి తీసుకుపోయింది. అంతేగాదు 2012లో అను రాజ్యసభకు నామినేట్ అయ్యారు కూడా. ఇక విద్యాపరంగా ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుంచి బీఏ ఎకనామిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సెస్(టీఐఎస్ఎస్) నుంచి మెడికల్ అండ్ సైక్రియాట్రిక్ సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. ఆమె కంపెనీ బాధ్యలు తీసుకునే నాటికీ మహిళలు అంతగా ఆ రంగంలో లేరు. అలాంటి సమయంలో ధైర్యంగా కంపెనీ బాధ్యతలు తీసుకోవడమే గాక చైర్‌పర్స్‌గా సమర్థవంతంగా నిర్వహించి బావితరాలకు ప్రేరణగా నిలిచారు అను అగా.! (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!) -
Anu Emmanuel Pics: అను ఇమ్మాన్యుయేల్ టెంప్టింగ్ ఫోజులు (ఫొటోలు)
-
ఏఎన్‌యూలో కొత్త కోర్సులు ప్రారంభం
ఏఎన్‌యూ: విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొత్త కోర్సులను వీసీ ఆచార్య పి.రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ మీడియా మేనేజ్మెంట్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎంఏ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ కోర్సులు ఉన్నాయని చెప్పారు. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన కోర్సులలో ఫ్యాకల్టీ నియామకం, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. డిగ్రీ ఫలితాలు విడుదల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో 61శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఏసీఈ ఆర్.ప్రకాష్‌రావు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 ఆఖరు తేదీగా నిర్ణయించామన్నారు. ఫీజు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. -
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ సదస్సుకు ఏఎన్‌యూ అధ్యాపకులు
ఏఎన్‌యూ: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ దుబాయ్‌లో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీడీసీ డీన్, ఎకనామిక్స్ విభాగాధిపతి, బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఆచార్య కె.మధుబాబు, యూనివర్సిటీ ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్, సోషల్ వర్క్ అధ్యాపకురాలు ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ హాజరుకానున్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘బెస్ట్ డిప్లమాట్స్’ నిర్వహిస్తున్న ఈ సదస్సులో 175 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి చాలా మంది ఆశావహులు తమ అధ్యయన పత్రాలను పంపగా, వారిలో పలు ప్రమాణాల ఆధారంగా నిర్వాహకులు ఎంపిక చేసిన వారినే సదస్సుకు ఆహ్వా నించారు. వీరిలో ఏఎన్‌యూ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆచార్య కె.మధుబాబు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండ్రస్టియల్ సెక్టార్ ఇన్ అండర్ డెవలపింగ్ కంట్రీస్’ అనే అంశంపై, ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ ‘ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఇండస్ట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు వియత్నాం’ అనే అంశంపై అధ్యయన పత్రాలు సమర్పించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ఏఎన్‌యూ అధ్యాపకులకు వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్టార్ ఆచార్య బి.కరుణ, యూనివర్సిటీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
ANUలో 2023 ఉగాది పురస్కారాలు...!
-
ఏఎన్‌యూకి హరిత వర్సిటీ ర్యాంకు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హరిత యూనివర్సిటీ ర్యాంకు పొందింది. యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు సోమవారం రాత్రి ‘యూఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2022’ పేరుతో ర్యాంకులు జారీ చేసింది. వీటిలో ఏఎన్‌యూ ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 6వ, అంతర్జాతీయ స్థాయిలో 246 ర్యాంకును సొంతం చేసుకుంది. ఆయా యూనివర్సిటీలలోని సెట్టింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, వేస్ట్ ట్రీట్మెంట్, వాటర్ రిసోర్స్ యూసేజ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ అంశాలన్నింటిలో 10వేల మార్కులకు గాను ఏఎన్‌యూ 7,325 మార్కులు దక్కించుకుని ఈ ర్యాంకులు సొంతం చేసుకుంది. ఏఎన్‌యూకి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు రావడం అభినందనీయమని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ అన్నారు. యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఎన్‌యూకి ఐదేళ్లలో 150 జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు రావడాన్ని పురస్కరించుకొని వీసీ కేక్ కట్ చేశారు. వర్సిటీ ర్యాంకింగ్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ భవనం నాగకిషోర్‌ను అభినందించారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
-
ప్లీనరీ కోసం వంటలు ఎలా చేస్తున్నారో చూడండి
-
YSRCP Plenary 2022: కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు. అందరికీ ఒకే మెనూ ► ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. ► ఇందుపల్లి, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వంట వాళ్లను రప్పించారు. గురువారం సాయంత్రం నుంచే వారు పని ప్రారంభించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో వేడి వేడిగా టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ అందించనున్నారు. ► ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్ బజ్జీలను శుక్ర, శనివారం ఉదయం టిఫిన్లుగా అందిస్తారు. 25 రకాల వంటకాలతో భోజనాలు అందించనున్నారు. శాఖాహారం, మాంసాహార భోజనాలను వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు. చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే) -
రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీగా వైకే
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసిస్టెంట్ స్పెషల్ పీపీగా మరో ప్రముఖ న్యాయవాది మల్లిఖార్జునరావును నియమించింది. గుంటూరులో కేసు విచారణ జరుగుతున్న పోక్సో కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ఈనెల 15న విచారణ జరగనుంది. కేసులో తమను స్పెషల్ పీపీ, ఏపీపీగా నియమిస్తూ జీవో 364 ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ద్వారా కోర్టుకు, న్యాయవాదులకు చేరుకోవడంలో జాప్యం జరిగినట్లు వైకే సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఏప్రిల్ ఏడోతేదీన విడుదల చేసిన ఉత్తర్వులు ఈఏడాది జూన్ 28న అందజేసినట్లు చెప్పారు. ఈలోగా కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్ సాక్షుల నుంచి కోర్టులో వాంగ్మూలాలను రికార్డు చేయడం పూర్తయిందని, నిందితుల తరఫున డిఫెన్స్ సాక్ష్యం నమోదు దశకు చేరుకుందని తెలిపారు. ఈనెల ఒకటో తేదీన కోర్టు వాయిదాకు హాజరైన స్పెషల్ పీపీ వైకే, ఏపీపీ మల్లిఖార్జునరావు కోర్టుకు హాజరై ప్రాసిక్యూషన్ నిర్వహణకు సంసిద్ధత తెలియజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని న్యాయాధికారికి అందజేశారు. ఇప్పటివరకు కేసులో జరిగిన పురోగతిని, సాక్షుల వాంగ్మూలాన్ని నమోదుచేసిన పత్రాలతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసి ప్రాసిక్యూషన్‌ను చట్టపరమైన పద్ధతిలో నిర్వహిస్తామని కోర్టుకు వైకే విన్నవించారు. నిందితుల తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు కేసును ఈనెల 15కు వాయిదా వేశారని వైకే తెలిపారు. ఈ కేసులో నాటి ఏఎన్‌యూ బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, ముగ్గురు బీఆర్క్ విద్యార్థులు నిందితులని చెప్పారు. (క్లిక్: తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..) -
పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని డాక్టర్ వైఎస్సార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యతోపాటు పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక కేంద్రాల్లో దేశ రక్షణ, సమాచార రంగాలతోపాటు సమాజ హిత పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇక్కడ ఏర్పాటైన కొన్ని కేంద్రాల విశేషాలివీ.. మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ సిమ్యులేటర్ ఈ ప్రాజెక్టును శ్రీహరికోటకు చెందిన షార్ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశించజేసే సమయంలో ఉపగ్రహాల పార్ట్లు టార్గెట్ల వారీగా విడిపోయి భూమిమీద, సముద్రంలో ఏ ప్రాంతలో పడ్డాయనేది గుర్తించేందుకు ఇవి దోహదం చేస్తాయి. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సీడీఎంఏ ట్రాన్స్ రిసీవర్ ఈ ప్రాజెక్టును డీఆర్డీఓ (డిఫెన్స్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కాలేజీకి అప్పగించింది. శత్రు దేశాలు మన దేశానికి సంబంధించిన రక్షణ, రహస్య సంభాషణలు ట్రాప్ చేయకుండా ఈ రిసీవర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది. బిగ్ డేటా ఎనలిటిక్స్ సెంటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సెంటర్లో సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఐఓటీ తదితర అంశాలపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్వా రైతులకు చెరువుల్లో వ్యర్థాల వల్ల తలెత్తే ఉష్ణ సాంద్రతను తెలియజేసే ప్రాజెక్టుతోపాటు గుడ్డి వాళ్ళు రోడ్డుపై నడిచేందుకు ఉపయోగపడే కళ్ళజోడును ఈ సెంటర్లో రూపొందించడం విశేషం. పలు సాంకేతిక అంశాలకు సంబంధించిన మరో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఇక్కడి నుంచి రూసాకు పంపారు. శాటిలైట్ డేటా ఎనాలసిస్ అండ్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో సహకారంతో 2014లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇస్రో(ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సంస్థ మన దేశ సమాచార రంగంలో కీలకమైన ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)కు సంబంధించిన, ఉపగ్రహాల హై ఫ్రీక్వెన్సీ స్ట్రక్చర్డ్ సిమ్యులేటర్ అనే ప్రత్యేక లైసెన్స్డ్ సాఫ్ట్‌వేర్‌పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏఎన్‌యూలోనే అందుబాటులో ఉంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో త్రీడీ ఆటోమేషన్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ సంస్థతో ఉన్న ఎంఓయూలో భాగంగా ఏఎన్‌యూలో రూ.5 కోట్ల వ్యయంతో త్రీడీ ఆటోమేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏపీలోని 62 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులకు త్రీడీ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చేందుకు ఏఎన్‌యూ రాష్ట్ర స్థాయి నోడల్ సెంటర్‌గా కూడా కొనసాగుతోంది. వీఎల్‌ఎస్‌ఐలో పేటెంట్ స్థాయి పరిశోధనలు ఇంజినీరింగ్ కళాశాలలోని వీఎల్ఎస్ఐ(వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌లెన్సీ సెంటర్)ను ఇన్టెల్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో ఏఎన్‌యూలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో జరిగిన పరిశోధననలకు పేటెంట్ కూడా లభించింది. ఈ సెంటర్‌కు సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్, పరికరాలను ఓ కంప్యూటర్ రంగ సంస్థ ఉచితంగా అందజేసింది. -
ఏఎన్‌యూలో ఉర్దూ ప్రత్యేక విభాగం ఏర్పాటు
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేలు బాటలు వేస్తోంది. మైనార్టీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఉర్దూను ద్వితీయ భాషగా గుర్తించింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఉర్దూ కోర్సు విభాగం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి మరో ముందడుగు వేసింది. అంతేగాకుండా అరబిక్ కోర్సును ప్రవేశపెట్టేందుకు పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్‌యూ(గుంటూరు): ముస్లిం మైనార్టీ వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం, యూనివర్సిటీ పెద్దపీట వేస్తోంది. ముస్లిం యువతీయువకులు అధికంగా అరబిక్, ఉర్దూ భాషల్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తారు. రాష్ట్ర విభజన అనంతరం అరబిక్, ఉర్దూ భాషల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ప్రత్యేకంగా విభాగాలు, ఉన్నత విద్యాసంస్థలు లేకపోవడంతో ముస్లిం యువతీయువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా చర్యలు చేపడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. పదేళ్లుగా ముస్లిం సంఘాలు వినతి రాష్ట్రంలో ఏదైనా యూనివర్సిటీలో ఉర్దూ, అరబిక్ విభాగాలను ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం ముస్లిం వర్గాల వినతులను పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సంఘాల వినతులను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. ముస్లిం సంఘాలు డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కలిసి విన్నవించుకోగా ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ముస్లిం సంఘాల వినతులపై ఏఎన్‌యూ ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి కోర్సు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్‌యూలో ఉర్దూ కోర్సు నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. 20 సీట్లతో ఎంఏ ఉర్దూ కోర్సును నిర్వహించేందుకు యూనివర్సిటీ పరంగా కార్యాచరణ పూర్తి చేసింది. పరిశీలనలో అరబిక్ కోర్సు వినతులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కానీ కర్నూలులోని అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ శాఖను గుంటూరులో ఏర్పాటు చేసి అరబిక్ కోర్సు నిర్వహించాలని ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను విన్నవించారు. ఈ వినతికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చింది రాష్ట్రంలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని ముస్లిం సంఘాలు పదేళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఆకాంక్షను నెరవేర్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉర్దూ, అరబిక్ కోర్సులకు మంచి ఆదరణ ఉంది. మన రాష్ట్రంలో ఈ కోర్సులు ప్రవేశ పెట్టడం వల్ల ముస్లిం యువతీయువకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. – డాక్టర్ మస్తాన్ ఆలీ, ముస్లిం సంఘాల జేఏసీ సభ్యుడు ముస్లిం సంఘాల హర్షం ఏఎన్‌యూలో ఉర్దూ విభాగం ప్రారంభించడం, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అరబిక్ విభాగ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, ఉర్దూ భాషను ఐచ్చిక ద్వితీయ భాషగా ప్రవేశ పెడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవడం పట్ల ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మదరసాలలో ధార్మిక విద్యను అభ్యసించే విద్యార్థులతోపాటు, అరబిక్, ఉర్దూ బోధకులుగా స్థిరపడాలనుకునే వారికి, ధార్మిక పండితులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ముస్లిం యువతీయువకులు ఉన్నత విద్యావంతులు అయ్యేందుకు ఈ చర్యలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
YSR Congress Party: వైఎస్సార్సీపీ ప్లీనరీ తేదీలు, వేదిక ఖరారు
సాక్షి, తాడేపల్లి: జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపింది. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. చదవండి: (‘ఏసీబీ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్.. యాప్ ఎలా పనిచేస్తుందంటే?) -
'సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ జాబ్ మేళా'
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరపనున్న జాబ్ మేళా పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. జాబ్‌మేళా పోస్టర్ విడుదల సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ జాబ్ మేళా. సీఎం జగన్ ఆదేశాల మేరకే తిరుపతి, విశాఖలో తొలి రెండు విడతల్లో జాబ్ మేళా నిర్వహించాం. మూడో విడతగా నాగార్జున యూనివర్సిటీలో ఈ జాబ్ మేళా మే 7,8 తేదీల్లో జరుగుతుంది. ఇప్పటివరకు తిరుపతి, విశాఖలో 10వేల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే 30వేల ఉద్యోగాలు వచ్చాయి. విశాఖలో 23వేల మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏఎన్‌యూలో జరిగే మేళాలో 148 కంపెనీలు, 70 వేల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో 4 లక్షల వరకు ఉద్యోగాలిచారు. ఇప్పుడు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. ఎంపికైన విద్యార్థుల ముఖాల్లో కొత్త కాంతులు కనిపించడం ఆనందంగా ఉంది. సంక్షేమ పథకాలతో పాటు పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగంలో సమానంగా అబివృద్ది కోసం కృషి చేస్తున్నాం. రాబోయే రెండేళ్లలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తాం.. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేరుస్తాం' అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి👉🏼 (సీఎం జగన్ అధ్యక్షతన కీలక సమావేశం) -
AP: ఏఎన్‌యూకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకు
ఏఎన్‌యూ: లండన్‌కు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ 2022వ సంవత్సరానికి సబ్జెక్ట్ వారీగా ర్యాంకులు ప్రకటించింది. వీటిలో ఫిజికల్ సైన్సెస్ కేటగిరీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అంతర్జాతీయ స్థాయిలో 1001+ కేటగిరీలో స్థానాన్ని, జాతీయ స్థాయిలో 37వ, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును పొందింది. వర్సిటీలో విద్య, బోధన, పరిశోధనా పత్రాలు, సైటేషన్స్, ఇన్నోవేషన్స్ తదితర అంశాల ప్రామాణికంగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. ఇందులో స్థానం సాధించడంపై వీసీ ఆచార్య రాజశేఖర్, రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ కరుణ, ఆన్లైన్ ర్యాంకుల కోఆరి్డనేటర్ డాక్టర్ నాగకిషోర్ హర్షం వ్యక్తం చేశారు. -
మళయాలం హీరోయిన్ అను సితార అదిరే స్టిల్స్
-
తుక్కుతో మెప్పు
సాక్షి, అమరావతి బ్యూరో / ఏఎన్‌యూ: ఇంట్లో తుప్పుపట్టిన పాత ఇనుప సామాను ఉంటే కేజీల లెక్కన అమ్మేస్తాం. కానీ కాదేది కళారూపాలకు అనర్హం అన్నట్లు ఆ పాత ఇనుముతోనే అద్భుత కళాఖండాలకు ప్రాణం పోస్తున్నారు కొందరు. అలాంటి వారిలో ఏఎన్‌యూ(ఆచార్య నాగార్జున యూనివర్సిటీ) ఆర్కిటెక్చర్ కళాశాల అధ్యాపకుడు పడకండ్ల శ్రీనివాస్ ఒకరు. తనలోని కళాజిజ్ఞాసతో వాహనాల్లోని పాత ఇనుమును కరిగించి, పనికిరాని విడిభాగాలు సేకరించి అందరి మెప్పు పొందేలా అందమైన వస్తువుల్ని సజీవ రూపాలుగా తీర్చిదిద్దుతున్నారు. తనతో పాటు మరో పదిమందిని సమీకరించి చెత్తతో స్క్రాప్ మెటల్ ఆర్ట్‌కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో.. శ్రీనివాస్ బృందం తయారు చేసిన కళాకృతులు గుంటూరు, విజయవాడతో పాటు దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ పట్టణాలు, నగరాల్లో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ దగ్గర, విజయవాడలోని పాత బస్టాండ్ రోడ్డులో, తాడేపల్లి కృష్ణా కెనాల్ రైల్వేస్టేషన్ ఎదుట, విజయవాడ రైల్వేస్టేషన్ ఎదుట, మల్డీ డిసిప్లినరీ శిక్షణా కేంద్రంలో, విజయవాడ రైల్వేస్టేషన్ సెల్ఫీ పాయింట్‌తో పాటు ఏపీలోని అనంతపురం, కర్నూలులో శ్రీనివాస్ బృందం రూపొందించిన కళాకృతులు దర్శనమిస్తాయి. మధురై, తిరునల్వేలి, ట్యుటికొరిన్, తూత్తుకుడి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. చెన్నై అడయార్‌లో కూడా ఈ బృందం పనులు ప్రారంభిస్తోంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిల్పకళపై అనేక మెలకువలు నేర్పుతున్నాను. పాత విద్యార్థులకు స్క్రాప్ మెటల్ ఆర్ట్‌లో శిక్షణ ఇస్తున్నాను. నాలో ఉన్న జిజ్ఞాసతో ఈ రంగం వైపు అడుగులు వేశాను. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా.. ఇప్పుడు నా కళకు ప్రాచుర్యం రావడంతో ఎంతో ఆనందంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. - శ్రీనివాస్, ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ అధ్యాపకుడు ఎలా రూపొందిస్తారు? ఈ ఆర్ట్‌లో మొదట కళాకృతి సైజును నిర్ధారించుకుని.. పేపర్‌పై గీసి ఏ భాగం ఎంత సైజు ఉండాలో కొలతలు రాసుకుంటారు. అనంతరం కరిగించిన పాత ఇనుముతో పునాది (బేస్) తయారు చేస్తారు. ఆ తర్వాత ఇనుప పైపుల్ని వెల్డింగ్ చేస్తూ అనుకున్న రూపానికి తీసుకొస్తారు. దానిపై వాహనాల గేర్ వీల్స్, షాక్ అబ్జర్వర్స్ అమర్చి వెల్డింగ్ చేసి అందంగా మలుస్తారు. ఆ రూపాన్ని డీజిల్, కిరోసిన్‌తో శుభ్రపరుస్తారు. డ్యూకో పెయింట్‌తో అనుకున్న రంగు వచ్చే వరకు రెండు, మూడు సార్లు పెయింట్ వేస్తారు. చివరికి అద్భుత కళాకృతి ఆవిష్కృతమవుతుంది. శ్రీనివాస్ బృందం విజయవాడ కేంద్రంగా వీటిని రూపొందిస్తుంది. పాత బస్టాండ్ సమీపంలోని ఒక కర్మాగారంలో బృందంగా వీటిని తయారుచేస్తున్నారు. ఈ కళారూపాలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు పురస్కారాలు లభించాయి. విద్యార్థి దశ నుంచే ఆసక్తి స్క్రాప్ మెటల్ ఆర్ట్‌పై శ్రీనివాస్‌కు విద్యార్థి దశ నుంచే ఆసక్తి. 1998లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి శిల్పకళలో పీజీ చేశారు. 2010 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో అకడమిక్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. అయితే స్క్రాప్ మెటల్ ఆర్ట్‌పై ఉన్న మక్కువ ఆయన్ను కుదురుగా ఉండనీయలేదు. ఫైన్ ఆర్ట్స్ మాజీ విద్యార్థులు 20 మందితో వర్క్‌షాప్ ఏర్పాటు చేసి పాత ఇనుము, వాహనాల విడిభాగాలతో కళాఖండాలు రూపొందిస్తున్నారు. -
ఆచార్యా.. అయోమయం!
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఆచార్యుల నియామకాలు గందరగోళంగా మారాయి. నియామక ప్రక్రియ, ఉత్తర్వుల జారీ, ఆచార్యుల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలతో సహా పలు అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లోని పలు విభాగాల్లో ఎనిమిది ప్రొఫెసర్ పోస్టులకు నేరుగా నియామకాలు చేపట్టేందుకు గతంలో యూనివర్సిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రొఫెసర్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్లు పాటించాలని కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఏఎన్‌యూలో నియామకాలపై కూడా హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇంటర్వ్యూల ఫలితాల ప్రకటనలో చాలా కాలం జాప్యం జరిగింది. అసలు పోస్టులు భర్తీ చేస్తారా లేదా అనే గందరగోళం నెలకొంది. ఈ అంశం కోర్టులో కొనసాగుతుండగానే గత అక్టోబర్ చివరివారంలో కాస్ (కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్) కింద పలు విభాగాల్లో ఏడుగురు అధ్యాపకులకు ప్రొఫెసర్లుగా యూనివర్సిటీ ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఇది జరిగిన నెలన్నరకే కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యాయంటూ ఈనెల 22న జరిగిన పాలక మండలి సమావేశంలో ప్రొఫెసర్ పోస్టు ఇంటర్వ్యూల్లో జరిగిన నియామకాలకు ఆమోదం తెలిపారు. సర్వీసు పరిగణనలో లోపాలు దీనితోపాటు ప్రొఫెసర్ పోస్టుల ఎంపికలో గత సర్వీసులను పరిగణనలోకి తీసుకోవడంలో లోపాలు జరిగాయని పలువురు «అధ్యాపకులు వాపోతున్నారు. యూనివర్సిటీలో గతంలో పనిచేసిన టీచింగ్ అసిస్టెంట్ సర్వీసులను పరిగణనలోకి తీసుకోకుండా బయట అన్ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేసిన అధ్యాపకుల తాత్కాలిక సర్వీసులను పరిగణనలోకి తీసుకుని ప్రొఫెసర్లుగా నియమించడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. దీనితోపాటు ఏపీఏ స్కోర్ కోసం సమర్పించే సర్టిఫికెట్లలో ఏకకాలంలో రెండు సదస్సులకు హాజరైనట్లు సర్టిఫికెట్లు కూడా కొందరు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఆరోపణలు యూనివర్సిటీలో జరిగిన ప్రొఫెసర్ పోస్టులకు కోర్టు అడ్డంకులు లేవని, అందుకే పాలక మండలిలో నియామకాలకు ఆమోదం తెలిపామని యూనివర్సిటీ ఉన్నతాధికారులు చెబుతుండగా మరో వైపు నియామకాల్లో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను హైకోర్టులో వేసిన పిటీషన్ ఆధారంగా ఏఎన్‌యూలో నియామాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవద్దని అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జి. నరసింహారెడ్డి అనే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలకమండలి సమావేశం ముందు రోజే ఏఎన్‌యూ వీసీ, రిజిస్ట్రార్లకు లేఖ పంపారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండానే పాలకమండలిలో నియామకాలకు ఆమోదం తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అవుతుందని పిటీషనర్ పేర్కొన్నారు. నియామక ఉత్తర్వుల్లో లోపించిన స్పష్టత ప్రొఫెసర్లుగా నియమితులైన ఎనిమిది మందికి అదే రోజున నియామక ఉత్తర్వులు అందజేశారు. అప్పటివరకు న్యాయపరమైన సమస్యలేమీ లేవని చెప్పుకొచ్చిన యూనివర్సిటీ ఉన్నతాధికారులు నియామక ఉత్తర్వుల్లో మాత్రం కోర్టు ఉత్తర్వులకు లోబడే ఈ పోస్టుల్లో కొనసాగింపు ఉంటుందని పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసులేమీ లేనపుడు ఇక న్యాయపరమైన సమస్యలు ఎందుకు వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ పోస్టుల్లో చేరిన వారిలో ఏడుగురు ప్రస్తుతం ఏఎన్‌యూ కళాశాలల్లో పలు హోదాల్లో రెగ్యులర్ అధ్యాపకులుగా ఉన్నారు. ప్రొఫెసర్లుగా చేరితే గత ఉద్యోగాలకు రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ప్రొఫెసర్ ఉద్యోగాల్లో చేరిన తరువాత కోర్టు నిర్ణయం వ్యతిరేకంగా వస్తే ప్రొఫెసర్ ఉద్యోగం పోతుంది. అప్పుడు రెండు ఉద్యోగాలకు అనర్హులవుతారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ఉద్యోగాలకు రిజైన్ చేయకుండా లీన్ (దీర్ఘకాలిక సెలవు) పెట్టి ప్రొఫెసర్ ఉద్యోగాల్లో చేరాలని కూడా ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. ఇతర యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు, విదేశాలకు వెళ్లే వారికే లీన్ ఇస్తారని, ఒకే యూనివర్సిటీలో పనిచేసే వారికి లీన్ నిబంధన ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రొఫెసర్ పోస్టుల్లో నెలకొన్న గందరగోళంతో భవిష్యత్‌లో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
నేటి నుంచి యువజనోత్సవాలు
గుంటూరు, ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల యువజనోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే యువజనోత్సవాలకు ఏఎన్‌యూ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 30కి పైగా కళాశాలల నుంచి 1200 మంది వరకు యువతీ యువకులు పాల్గొంటారని యువజనోత్సవాల కోఆర్డినేటర్ డాక్టర్ మురళీమోహన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఏఎన్‌యూ క్రీడా ప్రాంగణంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నారా రోహిత్ పాల్గొంటారన్నారు. వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్, పలువురు యూనివర్సిటీ అధికారులు పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏఎన్‌యూ క్రీడా ప్రాంగణం, విద్యార్థి కేంద్రం తదితర ప్రాంతాల్లో వేదికలు సిద్ధం చేశామని చెప్పారు. పోటీల షెడ్యూల్ శనివారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మురళీమోహన్ చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు మ్యూజిక్ విభాగంలో క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో(నాన్‌పెర్క్యూషన్), క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో(పెర్క్యూషన్), వెస్ట్రన్ వోకల్(సోలో), గ్రూప్‌సాంగ్(వెస్ట్రన్) అంశాల్లో, థియేటర్ విభాగంలో మిమిక్రీ, మైమ్, ఫైన్ఆర్ట్స్ విభాగంలో ఆన్ద స్పాట్ పెయింటింగ్, క్లేమోడలింగ్, పోస్టర్ మేకింగ్, మెహంది, డాన్స్ విభాగంలో క్లాసికల్ డాన్స్, ఫోక్ ఆర్కెస్ట్రా, క్విజ్ విభాగంలో ప్రిమిలినరీ, ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. 16వ తేదీన ఉదయం 9:30 గంటలకు లిటరరీ ఈవెంట్స్‌లో డిబేట్, ఎలక్యూషన్ అంశాల్లోను, థియేటర్ విభాగంలో వన్ యాక్ట్‌ప్లే, ఫైన్ఆర్ట్స్ విభాగంలో స్పాట్ ఫోటోగ్రఫీ, కొల్లేజ్ అంశాల్లోను, మ«ధ్యహ్నం 12 గంటలకు మ్యూజిక్ విభాగంలో క్లాసికల్ ఓకల్ సోలో( హిందూస్థానీ/కర్నాటక), లైట్ ఓకల్ (సోలో), గ్రూప్‌సాంగ్ ( ఇండియన్) అంశాల్లోను ఫైన్ ఆర్ట్స్‌లో ఇన్స్టాలేషన్ అండ్ కార్టూనింగ్‌లోను పోటీలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ ఉదయం 9:30 గంటలకు డాన్స్ విభాగంలో ఫోక్ డాన్స్/ట్రైబల్ డాన్స్, థియేటర్ విభాగంలో స్కిట్, ఫైన్ ఆర్ట్స్ విభాగంలో రంగోలి అంశాల్లోను పోటీలు జరుగుతాయి. సాయింత్రం 4 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి సినీ నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. -
పీసెట్ ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఏఎన్‌యూ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిజికల్‌ఎడ్యుకేషన్ కళాశాలల్లో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నుంచి నిర్వహిస్తున్న ఏపీపీసెట్–2018కు ఏఎన్‌యూలో అన్ని ఏర్పాట్లు చేశామని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతిరోజు నిపుణులైన 40 మంది టెస్టర్లు ప్రవేశ పరీక్షలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు, వేచి ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రవేశ పరీక్షలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యర్థులు హాజరవుతున్నందున వారిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండు ట్యాంకర్లతో తాగునీరు, యూనివర్సిటీ క్యాంటీన్లో భోజనం, క్రీడా వసతి గృహంలో వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దేహ దారుఢ్య పరీక్షలను సింథటిక్ ట్రాక్‌లో నిర్వహిస్తున్నామన్నారు. గురువారం పురుషుల విభాగంలో 10001 నుంచి 10489 హాల్‌టికెట్ నంబరు వరకు గల అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రవేశ పరీక్షల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షలో 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్/హైజంప్, షాట్‌పుట్, పురుషులకు 800 మీటర్ల పరుగు, మహిళలకు 400 మీటర్ల పరుగు అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడా నైపుణ్య పరీక్షలో భాగంగా అభ్యర్థి ఎంచుకున్న ఏదో ఒక క్రీడలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఏఎన్‌యూలో ఉన్న క్రీడా వసతులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీసెట్ నిర్వహణను 2007 నుంచి వరుసగా ఇప్పటివరకు ఏఎన్‌యూకి అప్పగించిందన్నారు. -
రోశయ్యా..! ఇదేమిటయ్యా?
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) యూజీ పరీక్షల విభాగం ముప్పుతిప్పలు పెడుతోందని విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజీ (అండర్ గ్యాడ్యూయేషన్) పరీక్షల విభాగం పనితీరు అస్తవ్యస్తంగా ఉండటం, యూజీ విభాగం కో–ఆర్డినేటర్ ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ పరిధిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు కనిపిస్తోంది. విద్యార్థుల నుంచి శాస్త్రీయత లేకుండా ఫీజుల వసూళ్లు చేపడుతున్నారని, అధ్యాపకుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో గౌరవ వేతనాల చెల్లింపులు సక్రమంగా లేవని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెళితే ప్రయోజనం ఏంటని ప్రశ్నలు.. ఈ అక్టోబరులో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మూల్యంకనానికి వెళ్తున్న అధ్యాపకుల్లో రెమ్యూనరేషన్ వస్తుందా? లేదా రాదా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. గతంలో విధులు నిర్వహించిన దానికే గౌరవ వేతనం రాలేదని, ఇప్పుడు తిరిగి వెళితే ప్రయోజనం ఏంటని అధ్యాపకుల్లో చర్చ మొదలుకావడం గమనార్హం. సాక్షాత్తూ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ సమక్షంలో రెండు నెలల్లో బకాయిలు విడుదల చేస్తానని ఒప్పుకుని ఇప్పటివరకూ విడుదల చేయకపోవడంపై అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాధితులు గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, చీరాల, ప్రాంతాల్లో వందల మంది ఉన్నారు. వర్సిటీ పరిధిలోని వాల్యూయేషన్ కేంద్రాల పరిధిలో పనిచేసిన వారికి కూడా వేతనాలు అందించడం లేదని తెలిసింది. గతేడాది మార్చిలో చేసిన వాల్యూయేషన్‌కు ఇంకా బకాయిలు ఉన్నాయని వర్సిటీ క్యాంపు అధికారులు చెబుతున్నారు. వర్సిటీ యూజీ విభాగం తప్పిదాలతో అధ్యాపకులు సమ్మె చేసే పరిస్థితి నెలకొందంటున్నారు. వాల్యూయేషన్‌కు హాజరయ్యే అధ్యాపకులకు కూడా 2016 నవంబర్, 2017 మార్చి లో జరిగిన మూల్యాంకనానికి సంబంధించిన గుర్తింపు కార్డులే ఇచ్చారని, తాము కళాశాల మారినప్పటికీ పాత గుర్తింపు కార్డులతో వెళ్లాల్సివస్తోందని అధ్యాపకులు చెబుతున్నారు. రెమ్యునరేషన్లు అందజేస్తాం.. పాత బకాయిలతో కలిపి ప్రస్తుత మూల్యాం కనానికి సంబంధించిన నగదును త్వరలో విడుదల చేస్తాం. ఒకటి, రెండురోజుల్లో దీనికి సంబంధించిన చెక్కులను ఆయా కేంద్రాలకు పంపిస్తాం. గుర్తింపుకార్డుల విషయంలో అధ్యాపకులు సీనియారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. కొత్తగుర్తింపు కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.– జి.రోశయ్య, వర్సిటీ యూజీ కో– ఆర్డినేటర్ ఆయన నిర్ణయాల వల్లే.. యూజీ కో–ఆర్డినేటర్‌గా రోశయ్య బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు యూనివర్సిటీ వర్గాలే భావించడం గమనార్హం. ఏటా మార్చిలో నిర్వహించే పరీక్షలను ఎప్పుడూ లేని విధంగా ప్రకటించిన షెడ్యూలు కంటే ముందుగా పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఒక ఏడాది నష్టపోయేలా చేయడం వీరికే చెల్లిందనే విమర్శలు ఉన్నాయి. ఫీజు వసూళ్లలో ఎలాంటి వెసులుబాటు ఇవ్వకుండా జరిమానాతో సహా వసూలు చేసే విధానానికి ఆయన ఊపిరిలూదారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గౌరవ వేతనాలు రూ.లక్షల్లో పెండింగ్.. డిగ్రీ పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసిన అధ్యాపకులకు అప్పటికప్పుడే వేతనాలను చెల్లించడం ఆనవాయితీగా ఉండేది. రోశయ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధ్యాపకులకు రెమ్యూనరేషన్ చెల్లింపులో మెలిక పెడుతున్నట్లు అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు నరసరావుపేట ఎస్.ఎస్.ఎన్ కళాశాలలో 2016 నవంబరులో సెమిస్టర్ పరీక్ష పత్రాల మూల్యంకనం నగదు ఇప్పవరకూ విడుదల చేయలేదు. అలాగే 2017 మార్చిలో జరిగిన మూల్యాంకన నగదు రూ.11 లక్షలు, గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలకు రూ.4 లక్షలు, ఒంగోలు ప్రభుత్వ కళాశాలకు రూ.10 లక్షలు, చీరాల వై.ఆర్.ఎన్ కళాశాలకు రూ.6 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
భూకంపాల పరిశోధన సంస్థతో ‘నన్నయ’ ఒడంబడిక
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : అహ్మదాబాద్‌లోని భూకంపాల పరిశోధన సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ సహకార పరిశోధనపై అవగాహన ఒడంబడికను కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అంగీకార పత్రాలపై శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఛాంబర్లో భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్, నన్నయ వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు పరస్పరం సంతకాలు చేశారు. భూకంపాలకు సంబంధించి జరిపే పరిశోధనల వల్ల కలిగే ప్రయోజనాలు, భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాలపై ఉభయులు చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోది ప్రోత్సాహంతో ఈ సంస్థ దేశంలో అనేక ప్రాంతాల్లో భూకంపాలకు సంబంధించి పలు అంశాలపై పరిశోధనలు చేస్తుందన్నారు. అనంతరం యూనివర్సిటీలోని జియాలజీ విభాగం అధిపతి డాక్టర్ కేవీ స్వామి, వారి బృందంతో కూడా భూకంపాల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎం.రవికుమార్ చర్చించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ టి.మురళీధర్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ ఎ.మట్టారెడ్డి, ఇంజినీర్ ఏవీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్ష ఫీజు రద్దు ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 29న నిర్వహించనున్న ఎనలిటికల్ స్కిల్స్ అనే ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన నాలుగో సెమిస్టర్ పరీక్షకు విద్యార్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. ఈనెల ఒకటిన జరిగిన ఈ పరీక్ష మోడల్ మారడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల విజ్ఞప్తుల మేరకు పరీక్ష రద్దు చేసి, తిరిగి 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే ఇందుకుగాను ప్రతి విద్యార్థి రూ.250 ఫీజు చెల్లించాలనడంపై ‘తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికి’ అనే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఫీజును రద్దు చేసి, గతంలో ఇచ్చిన హాల్ టికెట్లతో పాత సెంటర్లలోనే నేరుగా పరీక్షకు హాజరుకావొచ్చన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చన్నారు. -
ఏఎన్‌యూలో ఉన్నత విద్యామండలి రాష్ట్ర కార్యాలయం?
భవనాలను పరిశీలించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఏఎన్‌యూ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఏపీ నూనత రాజధాని ప్రాంతానికి తరలించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఏఎన్‌యూలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు సుముఖంగా ఉన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎస్.విజయరాజు, వైస్ చైర్మన్ ఆచార్య పి.నరసింహారావు మంగళవారం ఏఎన్‌యూను సందర్శించారు. కార్యాలయ ఏర్పాటు కోసం యూనివర్సిటీలోని పాత అతిథి గృహం, గతంలో వైస్ చాన్సలర్ పరిపాలన కొనసాగించిన భవనం, పాత ఎస్టాబ్లిష్మెంట్ విభాగ భవనాలను పరిశీలించారు. చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ తదితర అధికారుల ఛాంబర్లు, సిబ్బంది కార్యాలయాలన్నింటికీ సరిపడా విస్తీర్ణం ఉన్న భవనాలను ఎంపిక చేయనున్నారు. అనంతరం ఉన్నత విద్యామండలి అధికారులు ఏఎన్‌యూ ఉన్నతాధికారులకు తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు. -
బుధవారం ఏఎన్‌యూలో వీసీల సమావేశం
ఏఎన్‌యూ (పొన్నూరు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలు, డీన్ల సమావేశం బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనుంది. ఫిబ్రవరిలో ఏపీ రాజధానిలో జరగనున్న మహిళా పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను భాగస్వామ్యం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నిర్వహిస్తున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎస్.విజయరాజు, వైస్ చైర్మన్ ఆచార్య పి.నరసింహారావు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, డీన్లు పాల్గొననున్నారు. సమావేశం ఉదయం 10 గంటలకు డైక్మెన్ ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. -
ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ
గుంటూరు రూరల్ ః తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల చలపతి ఫార్మసీ కళాశాలలో 15 రోజులుగా జరుగుతున్న ఏఎన్‌యూ అంతర్ కళాశాలల్లో ఎంపికయిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్ళే మహిళా కబడ్డీ క్రీడాకారుల శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు మాట్లాడుతూ 15 రోజులపాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల భారతీయ యూనివర్సిటీలో ఈ నెల 14 నుంచి 17వరకూ జరిగే అంతర్ యూనివర్సిటీల (సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ) పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల పిజికల్ డైరెక్టర్ పీ భానుప్రకాష్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. -
అంతటా అటెన్షన్..!
* ఏఎన్‌యూలో నాక్ బృందం పర్యటన * వర్సిటీ బడ్జెట్ రూపకల్పన , ఖాతాల వివరాల సేకరణ * క్రీడా వసతులపై సంతృప్తి * బుధవారంతో ముగియనున్న కమిటీ పర్యటన ఏఎన్‌యూ: యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ ట్రాక్ అత్యున్నత క్రీడా ప్రమాణాల రూపకల్పనకు దోహదం చేస్తుందని నాక్ నిపుణుల బృందం అభిప్రాయపడింది. కమిటీ చైర్మన్ ఆచార్య హెచ్‌పి. ఖించా, పలువురు సభ్యులు మంగళవారం యూనివర్సిటీలోని క్రీడా కళాశాల, వసతి గృహం, భోజనశాలలు, క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం, నిర్మాణంలో ఉన్న ఫిజికల్ సెంటర్లను సందర్శించారు. ఏడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సింథటిక్ ట్రాక్ వివరాలను ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై కిషోర్ కమిటీకి వివరించారు. ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో క్రీడా కారులు సాధించిన పతకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆచార్య ఖించా మాట్లాడుతూ ఏఎన్‌యూలో అత్యున్నత క్రీడా ప్రమాణాలు ఉన్నాయన్నారు. క్రీడారంగ అభివృద్ధికి ఏఎన్‌యూ మంచి చర్యలు చేపడుతుందని కితాబిచ్చారు. ఇవి అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు దోహదం చేస్తాయన్నారు. చైర్మన్‌తోపాటు సభ్యులు ఆచార్య టీఎన్ మాథూర్, ఆచార్య ఎన్‌పి.శుక్లా, ఆచార్య టిæ. శ్రీనివాస్, ఆచార్య విజయ్ జుయాల్‌లు బృందాలుగా ఏర్పడి యూనివర్సిటీలోని పలు కార్యాలయాలను సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీని సందర్శించిన కమిటీ సభ్యులు పుస్తకాలు, జర్నల్స్‌ను పరిశీలించారు. లైబ్రేరియన్ ఆచార్య కె వెంకటరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. అనంతరం రిఫరెన్స్ సెక్షన్లో విద్యార్థులతో మాట్లాడి లైబ్రరీలో అందుబాటులో ఉన్న సేవలపై ఆరా తీశారు. లైబ్రరీలో ఇంకేమైనా సేవలు కావాలని భావిస్తున్నారా అని అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. అనంతరం బృందం సభ్యులు యూనివర్సిటీ బాలుర, పరిశోధకుల వసతి గృహాలను సందర్శించారు. భోజన వసతిపై ఆరా తీశారు. మెస్ స్టోర్‌రూంలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్‌ను సందర్శించారు. పీజీ అడ్మిషన్ల కార్యాలయాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు, పీజీ, పరిశోధన కోర్సుల అడ్మిషన్లలో అమలు చేస్తున్న సంస్కరణలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షాభవన్లోని పరీక్షల కో-ఆర్డినేటర్ కార్యాలయం, రీసెర్చ్ సెల్ సందర్శించి పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, పరిశోధనాపరమైన సేవలను పరిశీలించారు. ఆన్లైన్ సేవలు అందించాలని సూచన.. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో యూజీసీ, అకౌంట్స్, ఎస్టాబ్లిష్మెంట్, అప్లియేషన్, అకడమిక్ సెక్షన్ల అధికారులు, సిబ్బందితో నాక్ బృంద సభ్యులు సమావేశమయ్యారు. యూనివర్సిటీ బడ్జెట్ రూపకల్పన, బిల్లులు, అడ్వాన్సుల చెల్లింపులు తదితర అంశాలను పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆన్లైన్ సేవలు అందించాలని సూచించారు. దీనికి రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ స్పందిస్తూ ఆన్లైన్ అకౌంట్స్ నిర్వహణకు ఏర్పాట్ల ప్రక్రియ సగం పూర్తయిందని తెలిపారు. కళాశాలలకు యూనివర్సిటీ అనుబంధం ఎలా ఇస్తుంది, పర్మినెంట్, టెంపరరీ అనుబంధాల్లో తేడా ఏమిటి, కళాశాలలు ఏ పత్రాలు సమర్పిస్తున్నాయి అనే అంశాలపై ఆరా తీశారు. సిబ్బంది నియామకం, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారి మధ్య తేడా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు ఆచార్య రాజేందర్ సింగ్, ఆచార్య వసంత్ జుగాలే, ఆచార్య అరుణ్‌కుమార్‌ల బృందం ఒంగోలు పీజీ సెంటర్‌ను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, నిర్వహణ కోర్సులు, పరిశోధనాంశాలు, సిబ్బంది వ్యవహారాలను పరిశీలించారు. నివేదిక రూపకల్పనలో కమిటీ.. విభాగాలు, కార్యాలయాల సందర్శన సాయంత్రానికి పూర్తి చేసుకున్న కమిటీ విజయవాడ చేరుకుని పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలతో నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమైంది. బుధవారం మధ్యాహ్నానికి నివేదిక రూపకల్పన ప్రాథమికంగా పూర్తవుతుంది. అనంతరం యూనివర్సిటీకి వచ్చి వీసీతో సమవేశమవుతారు. -
నాక్ బృందం ఏఎన్‌యూ సందర్శన
* ఏఎన్‌యూ అభివృద్ధిపై వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ * అనంతరం విభాగాలను సందర్శించిన బృందం * కీలక అంశాలను లేవనెత్తిన సభ్యులు * కొన్ని చోట్ల తడబడిన విభాగాధిపతులు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాక్( నేషనల్ ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్ ) నిపుణుల బృందం పర్యటన సోమవారం ప్రారంభమయ్యింది. కమిటీలో తొమ్మిది మంది ఉండగా ప్రొఫెసర్ సి బసవరాజు తొలిరోజు పర్యటనకు రాలేదు. నాక్ బృందానికి యూనివర్సిటీ పరిపాలనా భవన్ వద్ద ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్‌ను నాక్ బృందం స్వీకరించింది. నాక్ నిపుణుల బృందానికి వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ గత ఐదేళ్లలో యూనివర్సిటీ సాధించిన సమగ్రాభివృద్ధితో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను సమర్పించారు. వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సుదీర్ఘంగా రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను వీక్షిస్తున్న సమయంలో నాక్ బృందం యూనివర్సిటీలో భవిష్యత్‌లో చేపట్టబోయే చర్యలు ఏంటి, పరిశ్రమలతో కలిసి యూనివర్సిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది.. అనే అంశాలను వీసీని అడిగారు. వీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ఏఎన్‌యూ ఐక్యూఏసీ( ఇంటర్నల్ క్వాలిటీ ఎస్సూరెన్స్ సెల్ ) ప్రజెంటేషన్‌ను కోఆర్డినేటర్ ఆచార్య కె రత్నషీలామణి సమర్పించారు. అనంతరం నిపుణుల బృందం చైర్పర్సన్ ఆచార్య హెచ్‌పీ ఖించా, ఆచార్య టి శ్రీనివాస్, ఆచార్య రాజేంద్రసింగ్‌లు ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలను సందర్శించి విద్య, పరిశోధన, బోధన, పరిశోధనా ప్రాజెక్టులు, ఇస్రో అనుబంధంతో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించారు. ఆచార్య టీఎన్ మాథూర్, ఆచార్య అరుణ్‌కుమార్, ఆచార్య వసంత్ జుగాలేలు ఆర్ట్స్, కామర్స్ కళాశాలలోని పలు విభాగాలను సందర్శించారు. ఆచార్య ఎన్పీ శుక్లా, ఆచార్య విజయ్ జుయాల్‌లు యూనివర్సిటీ సైన్స్ కళాశాలలోని పలు విభాగాలతో పాటు ఆర్ట్స్, లా కళాశాలల్లోని జర్నలిజం, లా విభాగాలను సందర్శించారు. కీలక అంశాలను లేవనెత్తిన సభ్యులు.. విభాగాల సందర్శన, విభాగాధిపతుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా నాక్ నిపుణులు పలు కీలక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి ఎంత, అధ్యాపకుల కొరత ఎందుకు ఉంది, వృత్తివిద్యా కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఎందుకు లేరు.. విద్యార్థులకు నైపుణ్య లక్షణాలు, ఉపాధి కల్పన పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి..? విభాగాల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్యలేంటి..?, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రణాళిక ఏంటి, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కొలాబ్రేషన్స్ ఎలా ఉన్నాయి.. తదితర అంశాలను నిపుణుల బృందం అడిగి విభాగాధిపతులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించే సమయంలో కొన్ని విభాగాధిపతులు తడబడ్డారు. నిపుణులు అడిగిన ప్రశ్నలకు కూడా కొందరు సూటిగా స్పందించలేకపోయారు. నేటి పర్యటన వివరాలు.. నాక్ నిపుణుల బృందంలో మంగళవారం ఆచార్య రాజేందర్‌సింగ్, ఆచార్య వసంత్ జుగాలే, ఆచార్య ఆరుణ్కుమార్లు ఒంగోలు పీజీ సెంటర్‌ను సందర్శిస్తారు. ప్రొఫెసర్ హెచ్‌పీ ఖించా, ఆచార్య టీఎన్ మాథూర్, ప్రొఫెసర్ ఎన్పీ శుక్లా, ప్రొఫెసర్ టి శ్రీనివాస్, పొఫెసర్ అరుణ్‌కుమార్‌లు ఏఎన్‌యూలోని లైబ్రరీ, బాలుర వసతి గృహాల్లో భోజనశాల, ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్, టెప్ సెంటర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, పరిపాలనా భవన్‌లోని వివిధ కార్యాలయాలు, కంప్యూటర్ సెంటర్, పరీక్షా భవన్, ఆక్వాకల్చర్ సెంటర్, లేడీస్ హాస్టల్, స్పోర్ట్స్ హస్టల్, క్రీడామైదాన, సింథటిక్ ట్రాక్‌లను సందర్శిస్తుంది. -
ఏఎన్‌యూలో వీసీల బృందం పర్యటన
పలు విభాగాల పనితీరుపై అసంతృప్తి ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముగ్గురు సభ్యుల వీసీల బృందం మంగళవారం పర్యటించింది. డిసెంబర్ మొదటి వారంలో నాక్ బృందం ఏఎన్‌యూ పర్యటనకు రానున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించింది. ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్, నెల్లూరు విక్రమశింహపురి యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వీరయ్య, కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.రామకృష్ణారావు ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో వివిధ విభాగాలను సందర్శించారు. విభాగాల్లో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, అధ్యాపకుల గదుల్లో జరుగుతున్న మరమ్మతులు, ఆయా విభాగాల్లోని విద్య, పరిశోధన పరమైన అంశాలు , వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పలు అంశాలపై వీసీల బృందం సూచనలు చేసింది. పలు విభాగాల్లో పనులు కాకపోవటంపై వీసీల బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన నాక్ పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యూనివర్సిటీ వ్యవస్థ మొత్తం నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించింది. వివిధ విభాగాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి కాకపోవటం, కొన్ని విభాగాల్లో గదులు శుభ్రంగా లేకపోవంపై బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు సరిగా పనిచేయకపోతే సహించేదిలేదని హెచ్చరించింది. చివరి నిమిషం వరకు పనులు పెండింగ్ పెట్టుకోవద్దని, రెండు రోజుల్లో అన్ని విభాగాలు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. -
అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్ విజేత ఏసీ కళాశాల
ఏఎన్‌యూ: యూనివర్సిటీ క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్ కళాశాలల బాస్కెట్‌బాల్ పురుషుల పోటీలు గురువారంతో ముగిశాయి. ఫైనల్లో తలపడిన ఏసీ కళాశాల, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానాన్ని జేకేసీ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ ము అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఏఎన్‌యూకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి, యోగా కోర్సు కో-ఆర్డినేటర్ డి. సూర్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్సన్, తదితరులు పాల్గొన్నారు. సౌత్‌జోన్ పోటీలకు ఏఎన్‌యూ జట్టు ఎంపిక సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే ఏఎన్‌యూ జట్టును ఎంపిక చేశారు. ఎ.కిషోర్, ఎం.రత్నకుమార్, ఎ.ఆనందకుమార్, ఎస్.కె.మసూద్ (ఏసీ కళాశాల), వి.ఉదయ్, డి.సత్యనారాయణ, పి.శివప్రసాద్ (ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల), ఎల్.బ్రహ్మారెడ్డి, ఎ.పవన్‌కుమార్ (జేకేసీ కళాశాల), ఎం.తేజశ్వి (ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల), ఎ.ఫ్రాంక్లిన్ (ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల), బి.అవినాష్ (ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల) జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. -
సమష్టి కృషితోనే యూనివర్సిటీకి ఉత్తమ గ్రేడ్
వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఏఎన్‌యూ : యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు సమష్టిగా కృషి చేస్తేనే ఏఎస్యూకు ఉత్తమ నాక్ గ్రేడ్‌ను సాధించగలుగుతామని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ అన్నారు. నాక్ బృందం డిసెంబర్ మొదటి వారంలో ఏఎన్‌యూలో జరిపే పర్యటనలో అనుబంధ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌లో బుధవారం యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలలు, యూనివర్సిటీ మధ్య సత్సంబంధాలు, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, విద్యార్థులకు అందించే సేవలు, పరస్పర సహకారం తదితర అంశాలపై నాక్ బృందం అనుబంధ కళాశాలతో సమావేశం కానుందన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు పూర్తి సమాచారం, అవగాహనతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. యూనివర్సిటీ మంచి గ్రేడు సాధిస్తే అనుబంధ కళాశాలలకు కూడా మంచి పేరు వస్తుందని, దానిని దృష్టిలో ఉంచుకుని కళాశాలలు సన్నద్ధం కావాలన్నారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు వివిధ అంశాలపై కళాశాలల యాజమాన్యాలకు సూచనలిచ్చారు. కళాశాలల యాజమాన్యాలు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ఏఎన్‌యూ: రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ 2015–16లో విద్యాపరమైన అంశాల్లో ప్రతిభ కనబరచిన విదార్థులకు ప్రతిభా పురస్కాలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ అమతవల్లి మాట్లాడుతూ ప్రతిభ కనబరచిన 177 మంది విద్యార్థులకు పురస్కారాలు అందించామని తెలిపారు. పురస్కార గ్రహీతకు సర్టిఫికెట్, బంగారు పతకం, ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్, 20 వేల రూపాయల నగదు అందజేస్తున్నామని వెల్లడించారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్, విద్యార్థి వ్యవహారాల కో–ర్డినేటర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్, అంబేద్కర్ చైర్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎన్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
గౌహతి ఐఐటీతో ఏఎన్‌యూ ఎంవోయూ
డ్రాఫ్ట్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసిన అధికారులు ఏఎన్‌యూ: గౌహతి ఐఐటీతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎంవోయూ (అవగాహన ఒప్పందం) ఖరారయ్యింది. గౌహతి ఐఐటీ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ బుధవారం ఏఎన్‌యూని సందర్శించారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల తదితర ప్రాంతాల్లో పర్యటించి వసతులు, విద్య, పరిశోధన అంశాలను పరిశీలించారు. అనంతరం పరిపాలనాభవనంలో వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టార్ట్అప్ కంపెనీ, ఇంక్యుబేసిన్ సెంటర్, మూక్ ప్రోగ్రామ్స్‌లను వీసీ, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు వివరించారు. ఏఎన్‌యూలో వసతులు, ప్రమాణాలను ఏఎన్‌యూ ఉన్నతాధికారులు డాక్టర్ ప్రవీణ్‌కు తెలియజేశారు. స్టార్ట్అప్ కంపెనీ, ఇంక్యుబేసిన్ సెంటర్, మూక్ కోర్సుల అంశాల్లో ఇరు సంస్థలు కలసి పనిచేయాలని నిర్ణయించాయి. దీనికోసం ఎంవోయూ ఖరారు చేశారు. ఎంవోయూకి సంబంధించిన డ్రాప్ట్ అగ్రిమెంట్‌పై ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ సంతకం చేసి ప్రవీణ్‌కు అందజేశారు. గౌతమి ఐఐటీ తరఫున ఆ సంస్థ ఉన్నతాధికారులతో పత్రాలపై సంతకాలు చేసి పంపుతానని ఆయన యూనివర్సిటీ అధికారులకు తెలిపారు. ఏఎన్‌యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, ఏఎన్‌యూ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య జీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ డిగ్రీ పరీక్షల్లో ఇష్టారాజ్యం
* అర్హత, సంబంధంలేని వారికి విధులు అప్పగింత * కమిటీలతో విచారణలు * జరుగుతున్నా పట్టించుకోని వైనం * తొలి రోజు పరీక్షల నిర్వహణపై ఆరోపణలు ఏఎన్‌యూ : యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో అధికారులు, పరీక్ష విధుల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న వారికి అబ్జర్వర్, స్క్వాడ్ విధులను అప్పగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.‡డిగ్రీ పరీక్షలకు సంబంధించిన అబ్జర్వర్స్, స్క్వాడ్ బృందాల్లో యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అనుభవజ్ఞులైన, అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న వారిని నియమించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో నిబంధనలను తుంగలో తొక్కి అర్హతలేని వారికి కీలక బాధ్యతలు అప్పగించటమే దీనికి నిదర్శనం. గుంటూరు జిల్లా వినుకొండలో ఓ అన్ఎయిడెడ్ డిగ్రీ కళాశాల యాజమాన్యానికి చెందిన వ్యక్తిని నరసరావుపేటలోని ఒక పరీక్షా కేంద్రానికి అబ్జర్వర్‌గా నియమించటం వెనుక యూనివర్సిటీకి సంబంధించిన కొందరు అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇతను ఎక్కడా పాఠాలు చెప్పకపోయినప్పటికీ మైక్రో బయాలజీ లెక్చరర్‌గా చూపి మరీ అబ్జర్వర్ విధులు అప్పగించినట్లు సమాచారం. నరసరావుపేటలోని ఒక డీఈడీ కళాశాలలో పనిచేసే నాన్ టీచింగ్ ఎంప్లాయ్(అధ్యాపకేతర ఉద్యోగి)ని నరసరావుపేటలోని ఒక డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి అబ్జర్వర్‌గా నియమించటం పరీక్షల విధుల అప్పగింతలో అక్రమాలకు నిదర్శనం. డిగ్రీ పరీక్షలకు సంబంధించిన విధుల అప్పగింత వెనుక ముడుపుల వ్యవహారం నడిచిందనే విమర్శలు ఉన్నాయి. దశాబ్దాల తరబడి అర్హతలేని వారిని నియమించటం దీనికి బలం చేకూర్చుతోంది. తొలి రోజు పరీక్షలపై ఆరోపణల వెల్లువ.. యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల నిర్వహణపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చాలా కళాశాలల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందని పర్యవేక్షణ అధికారుల దృష్టికి వచ్చినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. దీనిపై వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, సంబంధిత కమిటీలను కూడా నియమించామని చెప్పారు. ఆరోపణలపై పరీక్షల నిర్వహణ అధికారుతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. -
డిసెంబర్లో ఏఎన్‌యూకు ‘నాక్’
సిద్ధంగా ఉండాలని వీసీ రాజేంద్రప్రసాద్ ఆదేశం ఏఎన్‌యూ: వర్సిటీకి నాక్(నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ లక్ష్యంగా అందరూ పని చేయాలని వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ కోరారు. నాక్ ఏర్పాట్లపై సోమవారం వీసీ విభాగాధిపతులు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ తొమ్మిది మందితో కూడిన నాక్ బృందం డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఏఎన్‌యూ సందర్శించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరిగిన, చేపట్టాల్సిన పనులను వీసీ అడిగి తెలుసుకున్నారు. నాక్కు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. వీసీలు, ఉన్నతాధికారులు మారుతుంటారని కానీ యూనివర్సిటీ ఖ్యాతి మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు. అంతర్గత లోపాలను సరిదిద్దుకునేందుకు యూనివర్సిటీ ఎంచుకున్న నిపుణులతో నిర్వహించే నాక్ పీర్టీం సందర్శనలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. నాక్ Sపీర్టీం అన్ని విభాగాల్లోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇస్తుందని చెప్పారు. నాక్ ఏర్పాట్ల కమిటీ సభ్యుడు డాక్టర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
ఉపాధికి దారి ఇది..
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వృతి నైపుణ్యతా శిక్షణా కేంద్రం నిరుద్యోగులకు వరంలా మారింది. రాజధాని పేరుతో పంట భూములన్నీ లాక్కున్న ప్రభుత్వం.. నిరుద్యోగులకు శిక్షణ.. ఆపై ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసగించింది. ఈ నేపథ్యంలో జీవిత గమ్యం తెలియక అయోమయంలో ఉన్న రాజధాని నిరుద్యోగులకు ఈ కేంద్రం పూలబాట వేస్తోంది. ఉచితంగా శిక్షణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని కోసం పంట భూములను ఇచ్చిన రైతు కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. వృత్తి నైపుణ్యతా కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట మరిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి లేక వలసపోతున్న నిరుద్యోగులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండగా నిలుస్తోంది. వృత్తి నైపుణ్యతా కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రాజధాని ప్రాంత నిరుద్యోగ యువతకు పలు కంపెనీల సహకారంతో శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. రాజధాని ప్రాంత నిరుద్యోగుల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రారంభించారు. వర్సిటీలోని వాణిజ్య భవనంలో గదులను ఈ కోర్సులకు కేటాయించారు. బీటెక్, ఎంటెక్ చదివిన విద్యార్థులతో పాటు పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వారి చదువును బట్టి వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు విజయవాడలోని ఎఫ్రా్టనిక్స్ కొలబోరేషన్ కంపెనీతో ఒప్పందం చేసుకుని వారికి శిక్షణ ఇచ్చేలా చేశారు. ఆ కంపెనీకి అవసరమైన టెక్నికల్ కోర్సులు సిగ్నలింగ్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ, పీసీబీ డిసెగ్నేషన్, ఎల్ఈడీ లైట్ టెస్టింగ్, ఇంటర్నెట్ థింగ్స్, సిగ్నలింగ్ టెలికామ్ సెంటర్స్, ఇన్స్టాలేషన్–సర్వీసింగ్ స్కిల్స్, త్రీడీ డెషన్, డిజిటల్ మార్కెటింగ్, యాప్ డెవలప్మెంట్ వంటి కోర్సుల్లో ఆరు నెలలు శిక్షణ ఇచ్చి ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గత ఏడాది 32 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, అందులో 20 మందికి ఉద్యోగం ఇచ్చారు. మిగిలిన వారు సర్టిఫికెట్ తీసుకుని ఇతర కంపెనీల్లో మెరుగైన జీతం కోసం వెళ్లారు. అలాగే, పదో తరగతి, ఇంటర్ చదివిన 10 మందికి అపోలో ఆస్పత్రిలో ఉద్యోగాలు కల్పించారు. లైఫ్ సైన్స్‌లో డిగ్రీ చదివిన 10మంది విద్యార్థులకు ఆక్వా కల్చర్ టెక్నీషియన్స్‌గా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారు. డాన్‌బాస్కో టెక్నికల్ స్కూల్‌తో ఒప్పందం చేసుకుని మహిళలకు కుట్టు మిషన్లు, డీటీపీ, గార్మెంట్ మేకింగ్ కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ఇంజన్ మెకానిక్, హౌస్ వైరింగ్, మోటర్ వైండింగ్ కోర్సుల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రోత్సాహం కరువు.. రాజధాని ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో విఫలమైన చంద్రబాబు సర్కార్... నాగార్జున యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రోత్సహించడంలోనూ విఫలమైంది. ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే సొంతంగా నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభించిన వర్సిటీతో ఇటీవలే ప్రభుత్వ పెద్దలు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. యువతకు ఉపాధి ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. రెండో ఏడాది శిక్షణకు సిద్ధమవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చొరవ చూపలేదు. -
పాలన మెరుగు పడాల్సిందే!
* అభిప్రాయం వ్యక్తం చేసిన త్రిసభ్య కమిటీ * పలు అంశాలపై ఏఎన్‌యూలో ముగిసిన విచారణ * దూరవిద్య నకిలీ చలానాలపైనా సమాచారం సేకరణ ఏఎన్‌యూ: యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉద్యోగులకు పదోన్నతులు, రోజువారీ, ఔట్ సోర్సింగ్ నియామకం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అంశాల్లో వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ శుక్రవారంతో ముగిసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణి, తిరుపతి ఎస్వీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తిలతో కూడిన కమిటీ నాలుగు రోజులపాటు 45 అంశాలపై ఆయా శాఖలు యూనివర్సిటీ అధికారులను విచారించింది. దానికి సంబంధించి ఆయా శాఖలు ఇచ్చిన వివరణను నోట్ చేసుకోవటంతోపాటు వాటా తాలూకా నోట్‌ఫైల్స్ జిరాక్స్ తదితర ఆధారాలను కూడా కమిటీ సేకరించింది. గతంలో ఫోస్ట్ఫ్యాక్టో అప్రూవల్ పేరుతో రోజువారీ ఉద్యోగులlవేతనాల చెల్లింపులపై సమాచారం సేకరించింది. ఫిర్యాదులో లేని అంశాలూ పరిశీలన ఆరోపణలు వచ్చిన 45 అంశాలతోపాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపైనా కమిటీ సమాచారం సేకరించింది. దూరవిద్యా కేంద్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం, రెగ్యులర్ పరీక్షల్లో మార్కుల తారుమారు తదితర అంశాలపై కమిటీ పరిశీలించింది. సంబంధించిన ఆధారాలు, పత్రికల్లో వచ్చిన కథనాలను సేకరించింది. మార్కుల తారుమారు కుంభకోణం, పరీక్షల వ్యవహారాలపై ఏఎన్‌యూ పరీక్షల విభాగం అధికారులను కమిటీ సభ్యులు శుక్రవారం క్షుణ్ణంగా విచారించింది. విచారణలో కోరిన సమాచారంతోపాటు అవసరం అనుకుంటే ఆయా అంశాల్లో యూనివర్సిటీ శాఖాపరమైన అభిప్రాయాన్ని కూడా లిఖితపూర్వకంగా చెప్పవచ్చని కమిటీ తెలిసింది. దర్యాప్తు చేసిన అంశాలపై సీబీసీఐడీ విచారణకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20వ తేదీ తర్వాత మళ్లీ వస్తాం.. పాలనాపరమైన అంశాల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి కీలకాంశాల్లో ఏఎన్యా మెరుగవ్వాల్సి ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. విచారణ అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. 45 అంశాలతోపాటు దూరవిద్య చలానాల కుంభకోణంపై సమాచారం సేకరించామన్నారు. ఇంకా కొంత సమాచారం తీసుకోవాల్సి ఉందని భావిస్తుస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీ తరువాత ఏఎన్‌యూలో మరో విడత పర్యటించనున్నామన్నారు. దీనిపై నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. -
లలిత కళాపీఠం ఏర్పాటు
* విధివిధానాలపై చర్చించిన కమిటీ * సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల నిర్వహణ * కోర్సుల అధ్యయనానికి ఉప సంఘం ఏఎన్‌యూ: యూనివర్సిటీలో తెలుగు కళలు, సాహిత్య వికాసం కోసం ఎన్టీఆర్ పేరుతో లలిత కళాపీఠం ఏర్పాటుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ అంశంపై గతంలో జరిగిన అకడమిక్ సేనేట్‌లో చర్చ జరిగింది. సమావేశంలో దీనికి ఆమోదం తెలపటంతో లలిత కళాపీఠం ఏర్పాటుపై వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ అధ్యక్షునిగా నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ బుధవారం యూనివర్సిటీలోని పరిపాలనా భవన్లో సమావేశమై కళాపీఠం ఏర్పాటుపై విస్తృతంగా చర్చించింది. వీసీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ రంగ ప్రముఖులు దేవదాస్ కనకాల, పత్రికా రంగ నిపుణులు డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు తదితరులు సుదీర్ఘంగా చర్చించారు. కళాపీఠం ఆధ్వర్యంలో రంగస్థల నటన, యాంకరింగ్, న్యూస్ రీడింగ్‌లలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు తెలుగు భాషా వికాసంలో భాగంగా అవధాన ప్రక్రియ అనే కోర్సును ప్రారంభించాలని కమిటీ సూచించింది. కళాపీఠం ఆధ్వర్యంలో ఏఎన్‌యూలో నాలుగో శనివారం నాటకాలు, జానపద కళారూపాల ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని చెప్పింది. నూతన కోర్సుల ప్రారంభానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు దేవదాస్ కనకాల, డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు, ఏఎన్‌యూ తెలుగు విభాగం అధ్యాపకులు ఆచార్య పీ వరప్రసాదమూర్తి, డాక్టర్ ఎన్వీ కృష్ణారావులతో ఉపసంఘాన్ని నియమిస్తూ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య జాన్‌పాల్, నాటక రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఏఎన్‌యూ తెలుగు విభాగ అధ్యాపకులు ఆచార్య పీ వరప్రసాదమూర్తి, డాక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులపై చర్యలు సాధ్యమేనా ?
* ప్రభుత్వం నుంచి ఏఎన్‌యూ దాకా అదే విధానం * ఒక్క అంశంపై మూడుసార్లు కమిటీ నియామకం * ఆనవాయితీగా మారిన కమిటీల విచారణ * దశాబ్ధం నుంచి నివేదికలూ పెండింగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వెలుగులోకి వస్తున్న పలు అవినీతి ఘటనలు, కుంభకోణాలు, అక్రమాలపై నియమిస్తున్న కమిటీలు కేవలం విచారణకే పరిమితమవుతున్నాయేగానీ బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినపుడు దానిపై కమిటీ వేయటం, దర్యాప్తు పేరుతో కాలయాపన చేసి కనుమరుగు చేయటం ఆనవాయితీగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఏఎన్‌యూ: ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. అన్ని అంశాలు పరిశీలించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నెల రోజుల తరువాత కమిటీ ఏఎన్‌యూలో పర్యటించి నాలుగు రోజులు విచారణ చేపట్టింది. ఆ తరువాత కొద్ది రోజులకు కమిటీలో ఒక సభ్యుని పేరులేకుండా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి మరో సర్కుల జారీ చేసి ఆ సభ్యులతో అదే అంశంపై విచారణ జరిపించి హడావుడి చేసింది. అదే అంశంపై గత నెల 30వ తేదీన ముగ్గురు సభ్యులతో మరో కమిటీని నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ జీఓ జారీ చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. పదేళ్ళలో పలు కమిటీలతో హడావుడి... గత పదేళ్ళలో ఏఎన్‌యూలో పలు కుంభకోణాల విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. 2008 వసంవత్సరంలో పరీక్షా భవన్లో డిగ్రీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అవార్డుల్లోమార్కుల తారుమారు కుంభకోణం , ఆతరువాత బీటెక్ జవాబు పత్రాల తారుమారు, మార్కుల తారుమారు కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.తరువాత పోర్జరీ ఓడీల జారీ, నకిలీ చలానాలతో పాటు అనేక అవినీతి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై శాఖా పరమైన దర్యాప్తు కమిటీలను నియమించటంతోపాటు డిగ్రీ అడ్వాన్స్›్డ సప్లిమెంటరీ మార్కుల తారుమారు కేసు సీబీసీఐడీకి , బీటెక్ మార్కుల వ్యవహారం పెదకాకాని పోలీసులకు అప్పగించింది. వీటిలో శాఖా పరమైన దర్యాప్తు ఆధారంగా కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు శూన్యం. దూరవిద్యలో వెలుగులోకి వచ్చిన పరీక్షల కుంభకోణాలు, హైదరాబాద్ పరీక్షా కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్ ఘటనలు, ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షల విధుల్లో ఉద్యోగి అవినీతి వ్యవహారాలు, ఉద్యోగినులపై వేధింపులు వంటి అనేక ఘటనలపై నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు లేవు. త్రిసభ్య కమిటీ విచారణ.. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నియమించిన త్రిసభ్య కమిటీ మంగళవారం నుంచి ఏఎన్‌యూలో పర్యటిస్తుందని వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ తెలిపారు. కమిటీ సభ్యులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ చక్రపాణి, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి ఉదయం 10:30 గంటల నుంచి ఏఎన్‌యూలో అందుబాటులో ఉంటారన్నారు. -
ఏఎన్‌యూ ఖ్యాతి విశ్వవ్యాపితం
గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నిర్వహించాల్సిన 39వ వ్యవస్థాపక దినోత్సవం, ఈ ఏడాది 40వ వ్యవస్థాపక దినోత్సవాలను కలిపి చేశారు. వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఏఎన్‌యూని ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని వీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏడాదిలో సాధించిన అభివద్ధి, రానున్న కాలంలో చేపట్టనున్న చర్యలను వివరించారు. పురస్కారాలు అందుకుంది వీరే.... వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన జి.రాధాకష్ణమూర్తి (సామాజిక సేవ), ఎంవీఆర్‌కే ముత్యాలు (సామాజిక సేవ/ విద్యారంగం), బి.శ్రీనివాసరావు ( వ్యవసాయ రంగం), డాక్టర్ టీవీ రామారావు (సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎంపీ జాన్, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు (సాహిత్యం), సీహెచ్ విన్సెంట్ పాల్ (ఆరోగ్య శాస్త్రం), డాక్టర్ డీఎన్ రావు (యోగా), టి.విజయకాంత్ (మ్యూజిక్/ సింగింగ్), సీహెచ్ వీఎస్ విజయ భాస్కరరావు (ఫొటోగ్రఫీ), సీహెచ్ బీఎస్ఎస్ ప్రసాద్ (వ్యవసాయరంగం), చల్లా బాల త్రిపుర సుందరి (డ్యాన్స్), డాక్టర్ రాజు ఎస్.ఐయ్యర్ (వైద్యరంగం), డాక్టర్ పి.సాంబశివరావు ( విద్య/సాహిత్యం), టి.సత్యనారాయణ రెడ్డి (కళా రంగం), తుర్లపాటి పట్టాభిరామ్ (సాహిత్యం), డాక్టర్ గాలి సుబ్బారావు (సాహిత్యం/ సామాజిక సేవ), డాక్టర్ వి.నాగరాజ్యలక్ష్మి (సాహిత్యం) కాసుల కష్ణం రాజు (మిమిక్రీ), టీవీ కష్ణ సుబ్బారావు (శిల్పకళా రంగం), డి.వసంత కుమారి (పీస్ అండ్ కమ్యూనిటీ సర్వీస్)లకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు వివిధ కేటగిరీల్లో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, మాజీ వీసీ ఆచార్య కె.వియన్నారావు, వ్యవస్థాపక దినోత్సవం కన్వీనర్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ అధ్యాపకుడికి అంతర్జాతీయ అవార్డు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎంహెచ్ఆర్ఎం విభాగాధిపతి, యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ కో–ఆర్డినేటర్ డాక్టర్ నాగరాజుకు అంతర్జాతీయ ఉత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది. ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్ అవార్డును శనివారం అందజేశారు. టాంజానియా దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ముజిమ్బీచిన, యూనివర్సిటీ ఆఫ్ జాన్జిబార్లు సంయుక్తంగా ‘ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఏఎన్‌యూ నుంచి డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. ఆయన ‘ ద రోల్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐఐసీటీస్ ఫర్ ససై ్టనబుల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ యాన్ ఎంపరికల్ స్టడీ) అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. దీనికి ఉత్తమ పరిశోధన పత్రం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజును విభాగ అధ్యాపకులు డాక్టర్ తులసీదాస్, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. -
బాలల హక్కుల్ని ఎలా పరిరక్షిస్తున్నారు?
* సోషియాలజీ విద్యార్థులను ప్రశ్నించిన విదేశీ ప్రతినిధులు * ఏఎన్‌యూను సందర్శించిన బృందం గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాన్ని శుక్రవారం ఆస్ట్రియా, జర్మనీ దేశాల సోషల్ వర్క్ విద్యార్థులు, సామాజిక కార్యకర్తల బృందం సందర్శించింది. విజయవాడలోని నవజీవన్ బాలభవన్ స్వచ్ఛంద సంస్థకు ఇంటెన్షిప్ కోసం వచ్చిన పై దేశాలకు చెందిన బెట్టీనా ఐచ్చింగర్, లూకాస్ హీగల్స్బర్గర్, రెబ్కా హంబర్గ్, మైఖేల్ స్టిచ్, క్రిస్టియన్ వెయిల్గునిలు సోషియాలజీ విద్యార్థులతో చర్చించేందుకు ఏఎన్‌యూకి వచ్చారు. భారతదేశంలోని సామాజిక అంశాలు, చట్టాల గురించి తెలుసుకున్నారు. బాలల హక్కులు, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ వర్కర్ల పాత్రపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమంలో సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగ ఇన్చార్జి కో–ఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, అధ్యాపకులు డాక్టర్ వి.వెంకటేశ్వర్లు, నవజీవన్ బాలభవన్ కో–ఆర్డినేటర్ భాను, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్ సందర్శన అనంతరం ఆస్ట్రియా, జర్మనీ దేశాల ప్రతినిధులు ఏఎన్‌యూలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్ సెల్‌ను సందర్శించారు. ఇక్కడ చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులను కలిసి వారి చదువులు, కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. స్టూడెంట్ సెల్ అడిషనల్ డైరెక్టర్ ఆచార్య ఆంజనేయులు ఏఎన్‌యూలో విదేశీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యాపరమైన చర్యలను బృందానికి వివరించారు. -
వర్సిటీలో ఎస్ఎఫ్ఐ ధర్నా
ఏఎన్‌యూ: యూనివర్సిటీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో గురువారం యూనివర్సిటీ పరిపాలనా భవన్ ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేశారు. పరిపాలనా భవన్ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ఏపీ యూనివర్సిటీల ఎస్ఎఫ్ఐ శాఖ కన్వీనర్ టీ పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయనందున యూజీసీ 2500 కోట్ల రూపాయల నిధులను నిలిపివేసిందన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వ, యూనివర్సిటీల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ శాఖ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ ఏఎన్‌యూలో వసతి గృహాలు, విభాగాల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లైబ్రరీని 24 గంటలు తెరచి ఉంచాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల ద్వారాల వద్ద బస్షెల్టర్లు ఏర్పాటు చేయాలని, వికలాంగ విద్యార్థులకు యూనివర్సిటీలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. వసతి గృహలకు వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం వీసీ అందుబాటులో లేకపోవటంతో వినతిపత్రాన్ని వీసీ కార్యాలయ తలుపునకు అంటించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎన్‌యూ శాఖ కార్యదర్శి పీ ఏసురాజు, మహిళా కన్వీనర్ తులసి, నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీను, గోపి, రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ ‘దూరవిద్య’లో కుంభకోణం
* రూ.5 లక్షల మేర టోపీ పెట్టిన వ్యక్తి * నకిలీ చలనాలతో జగన్మాయ * అనధికారికంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేసిన వైనం ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రంలో నకిలీ చలానాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దూరవిద్యాకేంద్రంలో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులు చెల్లించే ఫీజును వసూలు చేసి చలానాల రూపంలో దూరవిద్యాకేంద్రంలో జమచేసే ఓ వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని ఓ డిగ్రీ కాలేజీలో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి విద్యార్థుల వద్ద నుంచి అడ్మిషన్, పరీక్ష ఫీజులు తీసుకుని ఏఎన్‌యూలో చెల్లిస్తూ ఉండేవాడు. ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రానికి ఏ విధమైన అధ్యయన కేంద్రం (స్టడీ సెంటర్) లేకపోయినప్పటికీ తనకున్న పరిచయాలతో విద్యార్థుల అడ్మిషన్లు సేకరించి అనధికారికంగా ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్రంలో ఫీజులు చెల్లించటం వంటి వ్యవహారాలు కొనసాగించే వాడు. ఈ క్రమంలో ఇటీవల అతను బ్యాంక్‌లో ఒక ఆన్లైన్ చలానా చెల్లించి తరువాత యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఫీజుల నమోదు కేంద్రంలో సమర్పించే సమయానికి అందులో ఉన్న చెల్లింపులకు సంబంధించిన అంకెలు ఎక్కువగా మార్పు చేసినట్లు తెలిసింది. ఈ చలానాలను దూరవిద్యాకేంద్ర సిబ్బంది కంప్యూటర్లో నమోదు చేసిన తరువాత అకౌంట్ల పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతను అంకెలు మార్పు చేసిన చలానాల్లో సుమారు 5 లక్షల రూపాయలు వరకు యూనివర్సిటికి నష్ట వాటిల్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న దూరవిద్యాకేంద్రం అధికారులు కుంభకోణం అంశాన్ని నిగ్గుతేల్చి అతనిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కుంభకోణానికి అతనే పాల్పడ్డాడా? లేక దూరవిద్యాకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వారెవరైనా అతనికి పరోక్షంగా సహకారం అందించారా? అనే అంశాలపై కూడా దూరవిద్యాకేంద్రం అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. దీనిపై వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా నకిలీ చలానాల కుంభకోణం తన దృష్టికి రాలేదన్నారు. -
ఏఎన్‌యూకి ఐఎస్వో సర్టిఫికెట్
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. బుధవారం సాయంత్రం యూనివర్సిటీలో జరిగిన విలేకర్ల సమావేశంలో వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ ఈవిషయం వెల్లడించారు. ఈ ఏడాది జూలైలో ఐఎస్ఓ సర్టిఫికేషన్ గుర్తింపు కమిటీ సభ్యులు ఏఎన్‌యూని సందర్శించి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న ప్రమాణాలను అధ్యయనం చేశారని వీసీ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా సంస్థల నాణ్యతా ప్రమాణాలను అధ్యయనం చేసి సర్టిఫికెట్‌ను జారీ చేసే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల అనుబంధ సంస్థ అయిన భారత దేశపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ అధారిటీ సంస్థ టీఎన్వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్టిఫికెట్‌ను జారీ చేసిందన్నారు. టీఎన్వీ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రగ్యేష్ కుమార్ సింగ్ సర్టిఫికెట్‌ను ఏఎన్‌యూకి జారీ చేశారని తెలిపారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, ఆర్ట్స్, సైన్స్ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎస్ విజయరాజు, ఆచార్య బి విక్టర్‌బాబు తదితరులు ఈసందర్భంగా వీసీకి అభినందనలు తెలిపారు. -
పెట్రేగిన ర్యాగింగ్ రక్కసి
నాగార్జున యూనివర్శిటీలో మరోమారు వెలుగులోకి గురువారం అర్ధరాత్రి హాస్టలులో ఘటన జూనియర్లను వేధించిన సీనియర్లు ఐదుగురి సస్పెన్షన్ సాక్షి, గుంటూరు : మొన్న రిషితేశ్వరి.. నిన్న సునీత, తిరుపతమ్మ.. ఇలా జిల్లాలో అభంశుభం తెలియని ఎంతోమంది విద్యార్థినులు పోకిరీల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. తాజాగా శుక్రవారం నాగార్జున యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థి జయంత్‌ను ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనలో ఐదుగురు సీనియర్ విద్యార్థులను ఏఎన్‌యూ అధికారులు సస్పెండ్ చేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలతో కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు అక్కడ కీచక ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో పెడుతున్న చిత్రహింసలు భరించలేక, లైంగిక వేధింపులు తట్టుకోలేక అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. ఏడాది కాలంలో ముగ్గురు విద్యార్థినులు ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక బలయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిషితేశ్వరి సంఘటన తరువాత ఏఎన్‌యూలో మూడు ర్యాగింగ్ సంఘటనలు జరిగాయి. కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లోని కొందరు ఆకతాయిలు నిత్యం పెడుతున్న చిత్రహింసలు, లైగింక వేధింపులు భరిస్తూ కళాశాలలకు వెళ్లలేక.. ఈ విషయాన్ని ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పి వారిని బాధపెట్టలేక నలిగిపోతున్నారు. ఎంత ఓపిక పట్టినా వీరి వేధింపులు ఆగకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల పొరపాటో, కళాశాలల్లో ఉపాధ్యాయుల పొరపాటో తెలియదు కానీ నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం కాబోతున్న గుంటూరు జిల్లాలో వరుస సంఘటనలు జరగడానికి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమైతే.. పోలీసుల ఉదాసీన వైఖరి కూడా కారణంగా చెప్పవచ్చు. కొన్ని కళాశాలల్లో ఇప్పటికీ యాంటీ ర్యాగింగ్ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఏఎన్‌యూ అక్రమాలపై లోకాయుక్తకు ఫిర్యాదు
* నిధుల వినియోగం, పనుల కేటాయింపులపై ఆరోపణలు * ఫిర్యాదు దాఖలు చేసిన గుంటూరు వాసి * నవంబర్ 22న హాజరు కావాలని ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు లోకాయుక్త సూచన ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థికపరమైన లావాదేవీలు, ఉద్యోగులకు చెల్లింపులు, వివిధ పరికరాల కొనుగోలు, నిర్మాణ పనులకు అధికంగా చెల్లింపులు చేశారనే అంశాలపై గుంటూరుకు చెందిన కేవీఆర్ శివరాంప్రసాద్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీకి ప్రహరీ నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్ రూ.76 లక్షలకు పనులు చేసేందుకు సిద్ధంగా ఉంటే వర్సిటీ అధికారులు మరో కాంట్రాక్టర్‌కు అదే పనిని కోటి రూపాయలకు పైగా ఇచ్చి చేయించారని, దూరవిద్యా కేంద్రంలో కొన్ని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రోజువారీ వేతన ఉద్యోగుల నియామకం ఉన్నతాధికారుల అనుమతులతో జరగలేదని, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులను మూడు నెలల కాల వ్యవధితో నియమించుకుని వారికి నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్ట్రర్‌ను సక్రమంగా నిర్వహించటం లేదని, పీఆర్సీ బకాయిల చెల్లింపులో కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. పర్చేజింగ్ కమిటీ నిబంధనలు, అనుమతులు పొందకుండానే కొన్ని కొనుగోళ్లు చేశారని, టెండర్లు లేకుండానే ఆస్ట్రేలియా నుంచి రూ.25.46 లక్షల విలువ చేసే పరికరం కొనుగోలు చేశారని, 2012–13లో కమ్యూనిటీ రేడియో స్టేషన్‌కు సంబంధించి రూ.18.45 లక్షల పనులకు టెండర్లు పిలవలేదని పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన కొందరు అధ్యాపకులు రూ.4.16 కోట్ల యూజీసీ నిధులను అడ్వాన్స్‌ల రూపంలో తీసుకుని వాటికి లెక్కలు చేపలేదని, కార్ అలవెన్స్‌ల రూపంలో రూ.1.48 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ ఏడాది నవంబర్ 22వ తేదీ∙హైదరాబాద్‌లోని లోకాయుక్త కార్యాలయంలో హాజరుకావాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ పంపింది. -
ఏపీఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
–స్పందన అంతంత మాత్రమే –885 మంది కౌన్సెలింగ్‌కు హాజరు యూనివర్సిటీక్యాంపస్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం ఏపీఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఆంధ్రాయూనివర్సిటీ (వైజాగ్), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు), ఎస్కేయూనివర్సిటీ(అనంతపురం), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), జేఎన్టీ యూనివర్సిటీ(కాకినాడ)లలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గణితం, ఇంగ్లీషు సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిచంగా 885 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. తొలి రోజు స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. తిరుపతిలో 196 మంది, వైజాగ్‌లో 143 మంది, గుంటూరులో 201 మంది, అనంతపురంలో 193 మంది, కాకినాడలో 87 మంది, శ్రీకాకుళంలో 65 మంది కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం ఫిజికల్సైన్స్, బయాలజీ సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. శనివారం కౌన్సెలింగ్‌కు హాజరుకాలేక పోయిన వారిని ఆదివారం కూడా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామన్నారు. -
ఇంటర్నెట్ కేంద్రాలపై దాడులు
దుబ్బాక: పైరసీ చట్టాలకు విరుద్ధంగా దుబ్బాకలో నిర్వహిస్తోన్న ఇంటర్ నెట్, డీటీపీ, ఫొటో స్టూడియో, ఇంటర్ నెట్ కేఫ్, కేబుల్ ఆపరేటర్ కేంద్రాలపై గురువారం అనూ స్ర్కిప్ట్ పైరసీ విభాగం ప్రతినిధులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనూ స్ర్కిప్ట్ సంస్థ అనుమతుల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను వాడుకుంటున్న పలు కేంద్రాల నిర్వాహకులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా అనూ స్ర్కిప్ట్ పైరసీ విభాగం ఆపరేషన్ మేనేజర్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ అనుమతి లేకుండా నిర్వహించే కేంద్రాల నిర్వాహకులపై కాపీ రైట్ యాక్ట్ ప్రకారం 67బి, 420 సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. అనూ స్ర్కిప్ట్‌ను ఉపయోగించుకునే కేంద్రాల నిర్వాహకులు సంస్థకు రూ. 13 వేలను చెల్లించి, ఏడాది పాటు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ రమేశ్, కానిస్టేబుల్ చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూకి పుష్కర సెలవులు
ఏఎన్‌యూ: పుష్కరాలను పురస్కరించుకుని ఏఎన్‌యూకి సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ పరిసరాల నుంచి యూనివర్సిటీకి వచ్చే సిబ్బంది, విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య ఉండటం, పుష్కర విధులకు హాజరయ్యే పోలీసులకు ఏఎన్‌యూ వసతి గృహాల్లో వసతి ఇవ్వాలని పోలీసు అధికారులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు సిబ్బందికి అమరావతి బాలుర వసతి గహంలో వసతి కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు. ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల సెలవులు ఇవ్వాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ సెలవులు సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులకు అందరికా లేక అధ్యాపకేతర సిబ్బంది విధులకు హాజరు కావాలా అనే అంశాన్ని సోమవారం జరిగే ప్రిన్సిపాల్స్ సమావేశంలో ప్రకటించనున్నారు. -
సీఈ పోస్టు ఇవ్వాల్సిందే..
వీసీని ఘోరావ్ చేసిన డిప్యూటీ రిజిస్ట్రార్ శాంతిశ్రీ ఆమెకు మద్దతు పలికిన ఉద్యోగులు ఏఎన్‌యూ: యూనివర్సిటీలో అధ్యాపకేతర సిబ్బంది బదిలీలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం డీఆర్( డిప్యూటీ రిజిస్ట్రార్ )ఎం శాంతిశ్రీకి అవకాశం కల్పించలేదని కొందరు ఉద్యోగులు బుధవారం వీసీ చాంబర్లో ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న నలుగురు డీఆర్‌లను అంతర్గత బదిలీలు చేస్తూ గత నెల 30వ తేదీన రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల్లో పరీక్షా భవన్లో సీఈ (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) గా శాంతిశ్రీని నియమించకుండా ఇంకొకరిని నియమించటంపై నిరసన తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో బదిలీలు జరిగే సమయంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఎం సాయిబాబాకు సీఈగా అవకాశం కల్పించి.. ఆయన పదవీ విరమణ వెంటనే తనకు అవకాశం కల్పిస్తానని అప్పటి వీసీ ఆచార్య వియ్యన్నారావు ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇటీవల అంతర్గత బదిలీల ఉత్తర్వుల్లో గత వీసీ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయటమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు సీఈగా అవకాశం కల్పించాల్సిందేనని, లేకపోతే ఆత్మహత్యకు కూడా వెనకాడనని స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోతే కార్యాలయం నుంచి కదలనిచ్చేది లేదని వీసీని ఘెరావ్ చేశారు. తాను విశాఖపట్నం వెళ్లాల్సి ఉందని వీసీ కోరినా డీఆర్, ఉద్యోగులు శాంతించలేదు. అరగంటపాటు వీసీని కదలనివ్వలేదు. అనంతరం వీసీ కారు వద్దకు రావడంతో.. డీఆర్ శాంతిశ్రీ కారుకు అడ్డంగా పడుకున్నారు. పర్యటన ముగించుకుని తాను ఈ నెల తొమ్మిదో తేదీన యూనివర్సిటీకి వస్తానని, అప్పుడు మాట్లాడతానని వీసీ హామీ ఇవ్వడంతో ఆయనను వెళ్లనిచ్చారు. ఈ సందర్భంగా శాంతిశ్రీ విలేకర్లతో మాట్లాడుతూ సీఈ పదవి విషయంలో దళిత మహిళనైన తనకు అన్యాయం జరిగిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఏసీఈకి ఇన్చార్జి సీఈ బాధ్యతలు.. సీఈగా నియమితులైన ఎం మత్తయ్య ఆరోగ్య కారణాల రీత్యా సెలవు పెట్టటంతో ప్రస్తుతం ఏసీఈ (అడిషినల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్)గా ఉన్న జీ కనకసుందరంకు ఇన్చార్జి సీఈ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కే జాన్‌పాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ముగిసిన కమిటీ విచారణ
వివరణ పత్రాలు, నోట్ ఫైళ్ల జిరాక్స్‌లతో హైదరాబాద్ పయనమైన కమిటీ అన్ని ఆరోపణలపై క్షేత్ర స్థాయిలో విచారణ అవసరమైతే మరోసారి ఏఎన్‌యూని సందర్శించనున్న కమిటీ కమిటీ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో జరిగిన పలు ఆర్థిక, పరిపాలన, కార్యనిర్వహణ, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, వేతనాల చెల్లింపు తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీని నియమించిన విషయం విధితమే. ఈ కమిటీ రెండో విడత పర్యటన ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగింది. సోమవారం మధ్యాహ్నం కమిటీ సభ్యులైన కృష్ణమూర్తి, కన్నమ్దాస్ హైదరాబాద్ వెళ్లారు. ఐదు రోజుల పాటు జరిగిన విచారణలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆరోపణల పాయింట్ల ఆధారంగా ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులను విచారించి కమిటీ సభ్యులు వివరాలు నమోదు చేసుకున్నారు. ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన కొన్ని అంశాలతో ప్రశ్నావళిని ముందుగానే సిద్ధం చేసుకున్న కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి వివరాలు సేకరించారు. ఆయా శాఖల అధికారులు ఇచ్చిన మౌఖిక వివరణను నమోదు చేసుకున్న కమిటీ వాటికి సంబంధించిన పత్రాలు, అధికారిక నిర్ణయాలు, వాటి అమలుకు తీసుకున్న చర్యల నోట్‌ఫైల్స్ తదితర జిరాక్సులను ఫైల్ చేసి వెంట తీసుకెళ్లారు. ప్రధాన ఆరోపణలైన అధికారిక నిర్ణయాలు, పదోన్నతులు, ఉద్యోగ నియామకాలు, దూరవిద్యలో రెగ్యులర్ ఉద్యోగుల విధులు నిర్వహణ, వేతనాల చెల్లింపులు, బ్యాంక్‌ల లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై కమిటీ సభ్యులు పూర్తి సమాచారాన్ని సేకరించారు. రెండో విడత పర్యటనలో ఆన్ని ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని కమిటీ పూర్తి స్థాయిలో సేకరించింది. అన్ని అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించే క్రమంలో పరిశీలన అవసరమైతే మరోసారి కమిటీ యూనివర్సిటీని సందర్శించే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ వ్యవహారాలపై ప్రభుత్వం కమిటీని నియమించడం ఆ కమిటీ రెండుసార్లు యూనివర్సిటీని సందర్శించి పకడ్బందీగా ఆధారాలు తీసుకెళ్లడం, ఈ నెలాఖరుకు నివేదికను సిద్ధం చేస్తామని చెప్పడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. కమిటీ ఏ అంశాలను నివేదికలో పొందుపరుస్తుంది... ఎవరిని దోషులుగా పేర్కొంటుంది... దాని ఆధారంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే అంశాలపై యూనివర్సిటీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చాం : వీసీ కమిటీ రెండో విడత పర్యటన పూర్తయిందని, కమిటీ సభ్యులు అడిగిన అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా శాఖలు అందజేశాయని వీసీ ఎ.రాజేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. అవసరమైతే మరోసారి యూనివర్సిటీకి వస్తామని కమిటీ సభ్యులు చెప్పారన్నారు. -
వెలుగు దివ్వెలు..
-
‘ప్రేమ’ విషాదం
ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిందని మనస్థాపం చెందిన ప్రియుడు రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలుసుకున్న ప్రియురాలు అను సైతం నీవు లేని జీవితం నాకెందుకంటూ బలవన్మరణానికి పాల్పడింది. బెంగళూరు : ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం జరిగిందని మనస్థాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా ఈ విషయం తెల్సిన ప్రియురాలు సైతం బలవన్మరణానికి పాల్పడింది. నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు...హాసన్‌కు చెందిన రాఘవేంద్ర (28) ఏడేళ్ల కిత్రం బెంగళూరుకు చేరుకుని క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయనగర్‌కు చెందిన అను (26) అనే యువతితో రాఘవేంద్రకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అను ఇక్కడి ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే అను తల్లిదండ్రులు వీరి పెళ్లికి వ్యతిరేకించి ప్రశాంత్ అనే వ్యక్తితో అనుకు వివాహం జరిపించారు. అంతకు ముందు తమ ప్రేమ వ్యవహారం గురించి రాఘవేంద్ర ప్రశాంత్‌కు చెప్పినా అతను పెడచెవిన పెట్టి అనును పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రాఘవేంద్ర డెత్‌నోట్ రాసి శుక్రవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు రాత్రి అను రాఘవేంద్ర మొబైల్‌కు ఫోన్ చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు జరిగిన ఘటనను వివరించారు. దీంతో మనో వేదనకు గురైన అను శనివారం ఉదయం తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగులో పరీక్ష .. ఆంగ్ల పదాలు
♦ బిక్కమొగం వేసిన బీఎస్సీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ♦ విద్యార్థులుఏఎన్యులో విపరీత ధోరణులు ♦ విద్యార్థులుడిక్షనరీల బాట పట్టిన అధ్యాపకులు ♦ పది మార్కుల ప్రశ్న అవుటాఫ్ సిలబస్ ఒంగోలు: పరీక్షల నిర్వహణలో నాగార్జున యూనివర్శిటీ అధ్యాపకుల వింత ధోరణితో విద్యార్థులకు దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. శనివారం బిఎస్సీ ప్రథ మ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్ రెండో సెమిస్టర్ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్శటీ నిర్వహించింది. ప్రశ్నను తెలుగు అక్షరాలలో లిఖిస్తూ ఆంగ్ల పదాలను వినియోగించారు. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పరీక్ష హాల్లో విద్యార్థులు బిక్కమొహం వేయడంతోపాటు బయటకు వచ్చిన తరువాత సమస్యను అధ్యాపకులకు వివరించారు. దీంతో వారు తెలుగు మీడియం విద్యార్థులకు ప్రశ్నలను ఇంగ్లిష్ పదజాలం ఉపయోగించడంపై దిగ్భ్రాంతికి గురయ్యారు. మరికొన్నిచోట్ల ఏకంగా ఫిజిక్స్ పాఠ్యాంశాల్లోని తెలుగు పదజాలం వాడారు. అధ్యాపకులనే అయోమయంలో పడేసే రీతిలో ప్రశ్నలను కూర్చడం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ కొనసాగుతున్న వింత ధోరణికి నిదర్శనంగా మారుతుందని అధ్యాపకులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీనికారణంగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులే అధికంగా నష్టపోతారనేది జగమెరిగిన సత్యం. సెక్షన్ -బిలో పదిమార్కుల ప్రశ్న అవుటాఫ్ సిలబస్ అని అధ్యాపకులు పేర్కొంటున్నారు. విద్యార్థులు నష్టపోకుండా యూనివర్శిటీ అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దిగ్భ్రాంతి : అధ్యాపకులు సైతం వీటిని అర్థం చేసుకోవడానికి డిక్షనరీలను పరిశీలించాల్సి వచ్చిందంటే పరీక్ష హాల్లో విద్యార్థులు ఏమాత్రం సమాధానాలు రాసి ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కేవలం విద్యార్థుల సహనాన్ని పరీక్షించడంతోబాటు తెలుగు భాషపై విద్యార్థుల పట్టును పరిశీలించేదిగాను, విద్యార్థులకు ఆంగ్లభాషా పదాలకు తెలుగు ట్రాన్స్లేషన్ చేయగలరా లేదా అనేది పరిశీలిస్తున్నట్లుగా పరీక్ష సాగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించాలి తప్ప సహనాన్ని కాదని, పరోక్షంగా ప్రశ్న అడిగినా అది పాఠ్యాంశంలో తమకు తెలిసిన పదజాలం కాకపోవడం వల్లే తాము పరీక్షను సరిగా రాయలేకపోయామంటూ విద్యార్థులు పేర్కొంటుండడం గమనార్హం. సమస్యల చిట్టా .. ♦ సెక్షన్ ఏలో ఒకటవ ప్రశ్న, సెక్షన్ బిలో 9(ఎ) ప్రశ్నలో సాధారణ హార్మోనిక్ డోలనం అని ఇచ్చారు. తెలుగులో సరళ హరాత్మక డోలనం అని ఉంటుంది. ♦ రెండో ప్రశ్న తేలికపాటి డోలనాలు అని ఇచ్చారు. తెలుగు మీడియం పాఠ్యపుస్తకంలో అవరుద్ధ డోలనాలు అని ఉంది. తేలికపాటి, అవరుద్ధ పర్యాయపదాలు అవుతాయా.. కాదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ♦ 4వ ప్రశ్నలో సిరీస్ అని ఇచ్చారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇది శ్రేణిగా పరిచయం. ♦ 5వ ప్రశ్న అతిస్వరాలు , అనుస్వరాలు అని ఉండాలి. కాని అనుస్వరాలు బదులుగా స్వరాత్మకాలు అని ఇచ్చారు. అనుస్వరాలు , స్వరాత్మకాలు పర్యాయపదాలు అవుతాయా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం.. ♦ 6వ ప్రశ్నలో రేఖాంశకంపనాలు అని ఇచ్చారు. కాని తెలుగు మీడియం విద్యార్థులకు అనుదైర్ఘ్య తరంగ రీతులుగా మాత్రమే తెలుసు. ♦ 7వ ప్రశ్నకు అతిదైర్ఘ్య ధ్వనులు అని అడిగారు. కాని అతిధ్వనులుగా మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులకు అతిధ్వనులు గురించి మాత్రమే తెలుసు. అతిధ్వనులు,. అతిదైర్ఘ్య ధ్వనులు ఒకటా , కాదా అనేది తెలియక బిక్కమొహం వేశారు. ♦ సెక్షన్ బిలో 9(ఎ) ప్రశ్న నిర్థేశిత సిలబస్‌లోనే లేదని, ఇది పది మార్కుల ప్రశ్నగా ప్రశ్నాపత్రంలో వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ 9(బిలో అవరుద్ద హార్మోనిక్ ఓసిలేటర్ యొక్క నాణ్యత కారకం అని ఇచ్చారు. ఇందులో హార్మోనిక్ ఓసిలేటర్ అనేవి ఆంగ్ల పదాలు. తెలుగులో అవరుద్ద హరాత్మక డోలకం యొక్క గుణకారకం అని ఉండాలి ♦ 10 (ఎ)లో నడిచే హార్మోనిక్ ఓసిలేటర్ అని పేర్కొన్నారు. కానీ దాని స్థానంలో బలాత్కృత హరాత్మక డోలకం అని ఉండాలి ♦ 10(బి)లో త్రిభుజాకార తరంగ సిద్ధాంతం అని ఉంటుంది. దీనిని ముక్కోణపు వేవ్ అని పేర్కొనడంతో విద్యార్థులకు సమస్యగా మారింది ♦ 11(ఎ)లో ఒక వర్గ తరంగం యొక్క విశ్లేషణ కోసం ఫోరియర్ సిరీస్ అనువర్తనాన్ని చర్చించండని పేర్కొన్నారు. కాని వాస్తవంగా చతురస్రాకార తరంగం యొక్క విశ్లేషణ అంటనే విద్యార్థులకు అవగతం అవుతుంది. ♦ 12(ఎ)లో ఒక బార్ యొక్క తిర్యక్ కంపన పౌనఃపున్యాలు అని పేర్కొన్నారు. కాని తెలుగులో ఒక కడ్డీ యొక్క తిర్యక్ కంపనాల పౌనఃపున్యాలంటే విద్యార్థులు ప్రశ్నను సులభంగా రాసి ఉండేవారు. 12 (భి)లో కూడా కడ్డీకి బదులుగా బార్ అని పేర్కొనడం జరిగింది. ♦ 12 బిలోని రెండో ప్రశ్నలో స్థిరస్వేచ్చగా ఉండే పట్టీ విలోమ కంపనం అని పేర్కొన్నారు. ఇక్కడ కూడా పట్టీ బదులుగా కడ్డీ అని ఉండి ఉంటే విద్యార్థులు సమాధానం రాసి ఉండేవారు. ♦ 13(ఎ)లో అల్ట్రాసోనిక్పై ఒక వ్యాసం రాసి దాని ఉపయోగాలు తెలపండన్నారు. కాని తెలుగు మీడియం విద్యార్థులకు అల్ట్రాసోనిక్ బదులుగా అతిధ్వనులు అని ఉంటుంది. ♦ 13(బి)లో అతిధ్వని తరంగాల ఉత్పత్తి యొక్క ఏవైనా రెండు పద్ధతులు పేర్కొంటూ అల్ట్రాసోనిక్స్ యొక్క అనువర్తనాలను చర్చించమని ప్రశ్న ఇచ్చారు. కాని ఇక్కడ అతిదైర్ఘ్య తరంగాల స్థానంలో అతిధ్వని తరంగాలని, అల్ట్రాసోనిక్స్ స్థానంలో అతిధ్వనులు అని ఉండాలని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
ఎంఫార్మసీ కోర్సు నిర్వహణకు నూతన నిబంధనలు
ఏఎన్‌యూ (విశాఖపట్నం) : ఎంఫార్మసీ కోర్సు నిర్వహణకు దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలులోకి తెస్తున్నామని పీసీఐ (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎండీ కార్వేకర్ తెలిపారు. ఏఎన్‌యూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి వర్క్‌షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఐపీసీఏ కార్యదర్శి, ఐపీఏ ఎడ్యుకేషన్ డివిజన్ చైర్మన్ ఆచార్య టీవీ నారాయణతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంఫార్మసీ కోర్సుల నిర్వహణకు సంబంధించిన వసతులు, సీట్లకు అనుమతి, అధ్యాపకుల ప్రమాణాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని పీసీఐ గుర్తించిందన్నారు. పీసీఐ నిపుణులు రూపొందించిన ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకురానుందని ఆయన పేర్కొన్నారు. ఎంఫార్మసీలో ఒక్కో బ్రాంచ్‌లో 15 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని, తప్పకుండా ఐదుగురు అధ్యాపకులు ఉండాలనే నిబంధన అమలులోకి రానుందన్నారు. దీనివల్ల ఫార్మసీ విద్యపై ప్రస్తుతం నెలకొన్న అభద్రతాభావం తొలగిపోతుందని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీసీఐ నూతన నిబంధనలు రూపొందించిందని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,500 ఫార్మసీ విద్యాసంస్థలు ఉండగా వాటిలో 15 శాతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నారు. బీఫార్మసీ ప్రాక్టీస్ అనే బ్రిడ్జి కోర్సును కూడా ప్రవేశపెట్టేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చర్యలు తీసుకుంటుందన్నారు. మన దేశం ఉత్పత్తి చేస్తున్న డ్రగ్స్ నాణ్యతపై చైనా వంటి దేశాలు ఆరోపణలు చేస్తున్నాయని దానిపై మన ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వో(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్)కు ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
డిగ్రీ ఫైనలియర్ పరీక్షలో మార్పులు
తేదీలు ముందుకు మారుస్తున్నట్లు ప్రకటించిన ఏఎన్‌యూ ఒంగోలు : డిగ్రీ ఫైనలియర్ పరీక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 12వ తేదీ నిర్వహిస్తామని ప్రకటించిన స్టాటిస్టిక్స్-3 పరీక్షను ఈ నెల 11వ తేదీకి మార్పుచేశారు. ఈ నెల 14వ తేదీ నిర్వహిస్తామని ప్రకటించిన స్టాటిస్టిక్స్-4 పరీక్షను ఈ నెల 12వ తేదీకి మార్చారు. ఈ నెల 21, 22వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించిన కెమిస్ట్రీ పరీక్షలోనూ మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. పరీక్షల మార్పు వివరాలను కేవలం కాలేజీలకు ఆన్లైన్లో పంపి యూనివర్శిటీ అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో దీనికి సంబంధించి అధికారి ఎవరూ లేకపోవడంతో అయోమయం నెలకొంది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు కాలేజీల నుంచి వెళ్లిపోయూరు. వారికి సమాచారం చేరవేయడం కాలేజీ యూజమాన్యాలకు పెద్ద సమస్యగా మారింది. -
దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ (గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వైస్‌చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. ఫలితాలను www.anucde.com, www.anucde.info వెబ్సైట్ల ద్వారా పొందవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీహెచ్ఎం కోర్సుల నుంచి మొత్తం 15,082 మంది పరీక్షలకు హాజరుకాగా, 4,911 మంది (33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్ ఫీజు చెల్లించడానికి మార్చి 23 ఆఖరు తేదీ. రీవాల్యుయేషన్ ఫీజు ఒక్కో సబ్జెక్టుకు 770 రూపాయల వంతున చెల్లించాలి. రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ లోగా దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలి. ఫలితాల విడుదల కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్. దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ ఆచార్య ఎంవీ రాంకుమార్త్న్రం, డిప్యూటీ రిజిస్ట్రార్లు బి.సత్యవతి, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో 2016-17 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్‌ను సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. మార్చి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు మే నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తామని పీజీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ ఎం.రామిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు, ఆన్లైన్ దరఖాస్తుకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఏఎన్‌యూ మాజీ రెక్టార్ ఆచార్య వైపీ రామసుబ్బయ్య, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య వి.చంద్రశేఖర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై.కిషోర్, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రెండు సార్లు తూచ్ .. ఈ 'సారీ' ?
ప్రతిసారీ ఇదే తంతు.. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ పర్యటనలు రాజధాని అమరావతిలో అనువైన భవవనాల పరిశీలన మొదట ఏఎన్‌యూ, రెండోసారి తుళ్లూరు, ఇప్పుడు.. కేఎల్‌యూ భూముల ధరల పెంపు ప్రక్రియకేనని గుసగుసలు రాజధాని పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే పాలకుల ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. మాట ఇవ్వడం.. తప్పడం.. ఆపై ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అన్ని హామీలను తప్పక అమలు చేస్తామని సర్ది చెప్పడం రివాజుగా మారింది. అసెంబ్లీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయనగానే ముందు నవ్యాంధ్ర రాజధానిలోనే శాసనసభ సమావేశాలు అంటూ ప్రకటన ఒకటి విడుదల అవుతుంది. దీనికి అనుగుణంగానే సభాపతి కోడెల శివప్రసాదరావు రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటనలు షురూ చేస్తారు. ఆపై ఏదో ఒక సాకు చెప్పి తూచ్.. అనడం ఇప్పటికే రెండు సార్లు జరిగిపోయింది. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఇదే తంతు కొనసాగుతోంది. ఒకసారి ఏఎన్‌యూ.. రెండోసారి తుళ్లూరు అన్న స్పీకర్.. ఇప్పుడు కేఎన్‌యూ అనువుగా ఉందని చెబుతున్నారు. ఈ తంతును గమనిస్తున్న విద్యావంతులు భూముల ధరల పెంపు ప్రక్రియలో భాగంగానే ఈ వ్యవహారం ఇలా కొనసాగుతోందని గుసగుసలాడడం కొసమెరుపు. విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అమరావతి ప్రాంతంలో జరుగుతాయో? లేదో? తెలియదు గానీ.. ప్రతిసారీ ఈ విషయాన్ని పనిగట్టుకుని చేస్తోన్న ప్రచారంలా కనిపిస్తోంది. గతంలో రెండు సార్లు.. అసెంబ్లీ సమావేశాలు నూతన రాజధాని ప్రాంతంలోనే జరుగుతాయంటూ విస్తృతంగా ప్రచారం చేయడం, చివర్లో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. 2014 ద్వితీయార్థంలో అసెంబ్లీ సమావేశాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. అప్పట్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ క్యాంపస్‌లోని డైక్మెన్ హాలును పరిశీలించి వెళ్లారు. సమావేశాల నిర్వహణకు అన్ని విధాలా అనువైన ప్రాంతంగా నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం సమావేశాలు జరిగే వారం ముందే నిర్ణయాన్ని మార్చుకుంది. హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత 2015 డిసెంబరు 17 నుంచి జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కూడా తుళ్లూరులో నిర్వహించాలని భావించారు. స్పీకర్ కోడెల స్వయంగా తుళ్లూరు ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం అప్పట్లో నిధులను కూడా విడుదల చేసింది. అయితే ఏర్పాట్లకు సమయం సరిపోదన్న కారణంతో చివర్లో నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విజయవాడకు సమీపంలోని కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. మంగళవారం కళాశాలకు చేరుకున్న స్పీకర్ కోడెల, జిల్లా అధికారులు కేఎల్‌యూ ప్రాంగణంలోని అనువైన భవనాలను పరిశీలించారు. సమావేశాల నిర్వహణకు అనుకూలమైన భవన సముదాయాలు ఉన్నాయని స్పీకర్ పేర్కొన్నారు. ఈ విధంగా సమావేశాలు జరిగే నెల రోజుల ముందు రాజధాని ప్రాంతంలో పర్యటించడం, సమావేశాలు ఇక్కడేనని ప్రకటనలు చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ప్రజాభిప్రాయం మేరకే రాజధానిలో సమావేశాలు పెట్టాలనుకుంటున్నామని సర్కారు చెబుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే ప్రక్రియలో భాగంగానే ఈ తంతు కొనసాగుతోందని కొందరు విద్యావంతులు గుసగుసలాడుతున్నారు. -
విధులకు హాజరైన ఏఎన్‌యూ నూతన వీసీ
ఏఎన్‌యూ (గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 16వ వైస్ చాన్సలర్‌గా నియమితులైన ఆచార్య బి.రాజేంద్రప్రసాద్ మంగళవారం తొలిసారిగా విధులకు హాజరయ్యారు. ఏఎన్‌యూ వీసీగా ఈనెల 13న నియమితులైన ఆచార్య రాజేంద్రప్రసాద్ అదే రోజు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌కు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. మంగళవారం క్యాంపస్‌కు వెళ్లిన ఆయన తొలుత వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఆచార్య నాగార్జునుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరిపాలనాభవన్కు వచ్చిన వైస్ చాన్సలర్ ఆచార్య రాజేంద్రప్రసాద్‌కు రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, వర్సిటీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. యూనివర్సిటీలో యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ సెల్ (మహిళలపై లైంగిక వేధింపుల వ్యతిరేక సెల్) ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌పై వైస్‌చాన్సలర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ సతీమణి శకుంతల, పలువురు ఏఎన్‌యూ అధికారులు, ఉద్యోగ, పరిశోధక, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంఏ, ఎంఎస్డబ్ల్యు( మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) , ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ కోర్సుల పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేశామని దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సి రమేష్‌బాబు తెలిపారు. ఫలితాలను http://www.anucde.info/www.anucde.com వెబ్సైట్ల ద్వారా పొందవచ్చు. -
రిషితేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు
-
ఇదేనా ప్రక్షాళన?
- ఏఎన్‌యూలో మరో వేధింపుల ఘటన - సీసీ కెమెరాలు, ర్యాగింగ్ బోర్డులతో ఫలితం శూన్యం - రిషితేశ్వరి మృతి కళ్లముందు కదలాడుతుండగానే మరో ర్యాగింగ్ కలకలం ఏఎన్‌యూ: ‘ఏఎన్‌యూను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.. మరోమారు ఇటువంటి ఘటనలు జరగనివ్వబోం.. రిషితేశ్వరి మృతికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..’ అంటూ అధికారులు, పాలకులు చెప్పిన మాటలు ఆచరణలో అమలు కాలేదు. రిషితేశ్వరి ఘటన మరువకముందే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మరో వేధింపుల పర్వం చోటుచేసుకుంది. వర్సిటీ సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ బోటనీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎస్.రత్నమంజరి తనను ఎమ్మెస్సీ ఆక్వాకల్చర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి బాలయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని చేసిన ఫిర్యాదు ఏఎన్‌యూలో కలకలం రేపింది. దీంతో ఏఎన్‌యూ, పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. బాలయ్యను రెండువారాలు సస్పెండ్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ గురువారం ఉదయం ప్రకటించగా, సుధీర్ఘ విచారణ అనంతరం బాలయ్యను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంటితుడుపు సంస్కరణలు.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనతో నెలరోజులపాటు ఏఎన్‌యూలో నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని, ఏఎన్‌యూ ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ కమిటీలు నానా హడావుడి చేసి పలువురిని విచారించి నివేదికలు సమర్పించాయి. కానీ ఈ నివేదికలు బహిర్గతం కాలేదు. దీంతోపాటు ఏఎన్‌యూలో ప్రక్షాళన పేరుతో అధికారులు అనేక చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ ప్రధానద్వారం వద్ద పోలీసు ఔట్‌పోస్ట్, అన్ని ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గుర్తింపుకార్డులు ఉన్న వారికే ఏఎన్యూలోకి ప్రవేశమనే నిబంధన విధించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీలో పోస్టర్లు, కరపత్రాలు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారు. ఏఎన్‌యూలో పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్‌పై ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరులో ఒక ఫిర్యాదు, పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో గతంలో నమోదయ్యాయి . ఏఎన్‌యూలో మరలా ఇలాంటి ఘటన జరగనివ్వమని, రిషితేశ్వరి ఘటనకు కారణమైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. కానీ అధికారుల ప్రకటనలు, ఏఎన్‌యూలో చేపట్టిన కంటితుడుపు సంస్కరణలు ఫలితానివ్వలేదు. శాశ్వత పరిష్కారం ఏదీ..? వరుసగా చోటుచేసుకుంటున్న ర్యాగింగ్, వేధింపుల ఘటనలతో ఏఎన్‌యూ ప్రక్షాళన సవాలుగా మారింది. నవ్యాంధ్ర రాజధానిలో ఉన్న ఏఎన్‌యూని దేశంలో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న ఏఎన్‌యూ, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడితేనే పూర్తిస్థాయి ఫలితం ఉంటుందనే విషయం గురువారం చోటుచేసుకున్న ఘటనలతో తేటతెల్లమయింది. పబ్లిసిటీ, కంటితుడుపు చర్యలను పక్కనపెట్టి వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
-
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
గుంటూరు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల బెయిల్ పిటిషన్ పై కోర్టు లో గురువారం వాదనలు జరిగాయి. అయితే వీరి బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. గత రెండు నెలల క్రితం ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విచారించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగ్ కే ప్రధాన కారణమని తన నివేదికలో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సదరు విద్యార్థులు గత 49 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. -
'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'
-
'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'
హైదరాబాద్:ఇటీవల ఆచార్య నాగార్జన యూనివర్శిటీ(ఏఎన్ యూ)లో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసులో విచారణ నివేదికను ఇంకా బహిర్గత పరచలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి ఏం చేయాలో అనేది దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా, ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు పెట్టారా?అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం గంటా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. బాబురావుపై కేసు పెట్టాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తమకు సూచించలేదన్నారు. -
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ వాయిదా
గుంటూరు లీగల్: రిషితేశ్వరి కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ వాదనలు వినేందుకు న్యాయమూర్తి జి.గోపీచంద్ గురువారానికి వాయిదా వేశారు. ఏపీపీ రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అడగడంతో న్యాయమూర్తి గోపీచంద్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
ఉమెన్స్ హాస్టల్లో యువకులా?
గుంటూరు: ఉమెన్స్ హాస్టల్లో యువకులు పనిచేయటమా? ఇక్కడ పనిచేసేందుకు మహిళలు దొరకలేదా.. అసలు వీరిని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు అంటూ ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి మండిపడ్డారు. వెంటనే ఇక్కడి నుంచి వీరిని మార్చండి అని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌ను ఆదేశించారు. ఇన్చార్జి వీసీగా హోదాలో యూనివర్సిటీకి వచ్చిన ఉదయలక్ష్మి ఉమెన్స్ హాస్టల్‌ను సందర్శించారు. భోజనశాలలో భోజనం చేస్తున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వసతులెలా ఉన్నాయి, భోజనాలు బాగుంటున్నాయా అని అడిగారు. విద్యార్థినులు సమాధానమిస్తూ భోజనం బాగోడం లేదని, తమకంటే సిబ్బంది ముందుగా తింటున్నారని తమకు సరిగా పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు చెప్పేది నిజమేనని సిబ్బంది పనితీరు బాగోలేదని చీఫ్ వార్టెన్ జయశ్రీ కూడా ఇన్చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని పిలిచిన ఇన్చార్జి వీసీ ఇంతకు ముందులా ఉండదని, సరిగా చేయకపోతే సస్సెండ్ చేస్తానని హెచ్చరించారు. భోజనం, శుభ్రతపై ప్రశ్నిస్తున్నందుకు తనను సిబ్బంది అందరూ కలిసి బెదిరించారని తాను ఎంతో వేదన చెందానని ఎల్ఎల్ఎం విద్యార్థిని కిరణ్ విలపిస్తూ ఇన్చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే హాస్టల్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బందిని పిలిపించిన ఉదయలక్ష్మి విద్యార్థినిని ఎందుకు బెదిరించారని వారిని ప్రశ్నించారు. మరొకసారి ఇలా జరిగితే ఊరుకోనని స్పష్టం చేశారు. విద్యార్థిని పిర్యాదు చేస్తుండగా సూపర్ వైజర్ కలుగజేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికందరికీ నోటీసులు జారీ చేసి వివరణ అడగాలని, సూపర్వైజర్లు ఇద్దరినీ మార్చాలని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌కు సూచించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రత్యేకంగా డ్రస్ వేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జంట్స్ హాస్టల్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. అందులో పనిచేస్తున్న పెద్దవయసున్న పురుషులను ఉమెన్స హాస్టల్‌కు మార్చాలని అధికారులకు సూచించారు. వసతి గృహ వ్యవహారాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఇన్చార్జి వీసీ వెంట పలువురు యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. సిబ్బంది బదిలీకి రంగం సిద్ధం ఇన్చార్జి వీసీ ఆదేశాలతో వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసేందుకు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమెన్స హాస్టల్లోని ఇన్చార్జిలతోపాటు అక్కడ పనిచేసే సిబ్బందిని మారుస్తున్నారు. ఉమెన్స హాస్టల్స్ చీఫ్ వార్డెన్ జయశ్రీ గురువారం రాత్రి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌తో సమావేశమై దీనిపై చర్చించారు. -
ఎఎన్ యూలో మద్యం బాటిళ్ల కలకలం
నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో కొంతమంది సీనియర్ విద్యార్థులు మద్యం బాటిళ్లతో హల్ చల్ చేశారు. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ, సాయి చరణ్, అబ్బాస్ లు బుధవారం రాత్రి క్యాంపస్ హాస్టల్లోకి మద్యం సీసాలు తెచ్చేందుకు యత్నించారు. అయితే వీరిని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు.. గురువారం ఉదయం వర్సిటీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థుల సంజాయిషీ, తల్లిదండ్రుల హామీ ఉంటేనే వారిని తిరిగి కళాశాలలోకి అనుమతించే విషయం పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. -
ఈ నెల 25 నుంచి ఏఎన్‌యూ పీజీ కౌన్సిలింగ్
గుంటూరు (ఏఎన్‌యూ) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ కౌన్సెలింగ్ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్ వివరాలు, ఫీజుల వివరాలు, కళాశాలల జాబితాలను www.anudoa.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఏఎన్‌యూ పరిధిలోని కళాశాలల్లో ఆయా కోర్సుల్లో మొత్తం 6 వేలకు పైగా సీట్లు ఉండగా ఏఎన్‌యూ పీజీ సెట్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి 7,560 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పీజీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఎం. రామిరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఏఎన్‌యూను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం
ఏఎన్‌యూ: నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్య, పరిశోధన, శాస్త్ర సాంకేతిక, మౌలిక వసతుల అంశాల్లో నాగార్జున యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా తన పరిధిలో కృషి చేస్తానని ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు (కొత్తపల్లి రాజ సూర్య సాంబశివరావు) అన్నారు. ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీగా నియమితులైన సాంబశివరావు సోమవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్య, శాస్త్ర రంగాల్లో యూనివర్సిటీని సమర్ధంగా తీర్చిదిద్దుతానన్నారు. యూనివర్సిటీ వ్యవస్థలో జాతీయ స్థాయిలో కీలకమైన నాక్‌లో ఏఎన్‌యూకి ఏ గ్రేడ్ తేచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. నాక్ పనుల పర్యవే క్షణ బాధ్యతలను ఓఎస్డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావుకు అప్పగిస్తామని తెలిపారు. ఏఎన్‌యూను సెంట్రల్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. యూనివర్సిటీలోని అభివృద్ధి పనుల ప్రతిపాదన, పర్యవే క్షణకు నలుగురు సీనియర్ అధ్యాపకులతో మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీని కొద్ది రోజుల్లో ఏర్పాటు చేస్తానని తెలిపారు. వీసీతో సహా అధికారులు, సిబ్బంది విధుల హాజరులో పారదర్శకత కోసం యూనివర్సిటీలోని కార్యాలయాలు, విభాగాల్లో 28 చోట్ల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపా రు. జాతీయ స్థాయిలో వివిధ సంస్థల నుంచి ప్రాజెక్టులు సొంతం చేసుకునే విధంగా విభాగాలను సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను ఇప్పటికే రూపొందించానన్నారు. విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ రాజశేఖర్ పాల్గొన్నారు. పరీక్షా భవన్ అధికారులతో సమావేశం విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం పరీక్షా భవన్ అధికారులతో ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, విద్యార్థులకు అందించే సేవలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాకు ఇది చారిత్రక ఘట్టం
సాక్షి, గుంటూరు :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేస్తున్నందున, తగిన ఏర్పాట్లన్నీ 6వ తేదీ లోగానే పూర్తి చేయాలని, ఏ శాఖకు అప్పగించిన పనులు ఆ శాఖ సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్‌తో కలిసి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 6వ తేదీ సాయంత్రంలోగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే భద్రతా సిబ్బంది ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంటారన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు జిల్లాకు చారిత్రక ఘట్టంగా మిగిలిపోతుందని, జిల్లా అధికార యంత్రాంగం ఓ ఛాలెంజింగ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 3 వేలమంది ప్రతినిధులు పలు హోదాల్లో హాజరవుతారని, సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేసినట్టు చెప్పారు. ఆ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 8వ తేదీ రాత్రి 7.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని, 7వ తేదీ సాయంత్రం నుంచి జాతీయ రహదారిపై మద్యం దుకాణాలు మూయించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా క్రమబద్ధీకరించాలన్నారు. బారికేడ్లు, హెలిప్యాడ్ల ఏర్పాటు, రహదారుల అనుసంధానం తదితరాలు ఆర్ అండ్ బీ చేపట్టాలని, తుమ్మ చెట్ల తొలగింపు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చూడాలని సూచించారు. సభా ప్రాంగణంతోపాటు గుర్తించిన ప్రదేశాల్లో వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకారం రాత్రి వేళ జరుగుతున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలుగకుండా తగినన్ని జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఏ చిన్న పొరపాటుకు తావులేకుండా అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ శాఖల వాహనాల పార్కింగ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వివరించారు. సమీక్షలో జేసీ వివేక్ యాదవ్, అదనపు జేసీ నాగేశ్వరరావు, డీఆర్వో నాగబాబు, రూరల్ అదనపు ఎస్పీ కోటేశ్వరరావు పాల్గొన్నారు. హోటళ్లలో 50 శాతం గదులు రిజర్వ్.: గుంటూరు నగర పరిధిలోని కార్పొరేట్ స్థాయి హోటల్స్, రిసార్టుల్లో 50 శాతం గదులు జిల్లా కలెక్టర్ పేరిట రిజర్వ్ చేయాలని జేసీ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో హోటల్స్, రిసార్ట్స్, ప్రైవేటు అతిథిగృహాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ గదులు 6వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ వరకు జిల్లా యంత్రాంగం ఆధీనంలో ఉంటాయని ఆయన చెప్పారు. వీటిపై పర్యవేక్షణ బాధ్యతలు డీఎస్వో, గుంటూరు ఆర్డీవో, తహశీల్దార్లకు అప్పగించారు. -
ముహూర్తం ఖరారు!
- 8వ తేదీ ఉదయం 11.35 గంటలు.. - సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం - ఏఎన్‌యూ ఎదుట స్థలమే వేదిక - మహానాడులో అధికారిక ప్రకటన - మంత్రివర్గ ప్రమాణస్వీకారం ఇక్కడేనా? సాక్షి, గుంటూరు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకరం చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక నిర్మించనున్నారు. 2009 ఎన్నికలకు ముందు ఇదేస్థలంలో టీడీపీ యువగర్జనను నిర్వహించిన విషయం విదితమే. చంద్రబాబునాయుడుసీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు జూన్ 8వ తేదీ ఉదయం 11.35 గంటలకు ముహూర్తం ఖరారు చేస్తూ మహానాడు వేదికపై అధికారిక ప్రకటన చేశారు. ఇదే వేదికపై రాష్ట్రమంత్రి వర్గం చేత కూడా ప్రమాణస్వీకారం చేయిస్తారా లేక మరోసారి వేరేచోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే దాదాపుగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం కూడా ఇక్కడే నిర్వహించాలనే తలంపులో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. దీంతో మంత్రి పదవుల కోసం జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు పది రోజులుగా హైదరాబాద్‌లో మకాం పెట్టి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని వారంలో మూడు రోజుల పాటు పాలన సాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గుంటూరు-విజయవాడ మధ్య ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలాన్ని రెండు రోజుల క్రితం గుంటూరు రేంజి ఐజీ పీవీ సునీల్‌కుమార్, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి, రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ పరిశీలించిన సంగతి తెలిసిందే. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. సీఎం హెలిప్యాడ్, వసతికీ ఏర్పాట్లు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార వేదిక యూనివర్సిటీ ఎదురుగా ఉన్నందున ఇక్కడి క్రీడాప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు క్రీడామైదానం, పరిసరాలను పరిశీలించారు. చంద్రబాబునాయుడు విశ్రాంతి తీసుకొనేందుకు అవసరమైన వసతి గృహాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రజలు ఇక విజయవాడ- గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నారు. వేదిక ఏర్పాట్లపై టీడీపీ నేతల దృష్టి .. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సభా వేదిక ఏర్పాటు విషయంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులను ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తరలించాలని నిర్ణయించారు. -
బ్యాక్లాగ్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
ఏఎన్‌యూ, యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బందిలో అర్హులైన వారితో పాటు బయటనుంచి కూడా అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. మొత్తం 24 పోస్టులకు ఇప్పటివరకు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. మార్చి 3వ తేదీ చివరితేదీ కావటంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. 3న జాతీయసదస్సు.. యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘ద చేంజింగ్ డెమైన్షన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని సదస్సు డెరైక్టర్, విభాగాధిపతి డాక్టర్ జి.అనిత ఓ ప్రకటనలో తెలిపారు. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సు ఈనెల 3వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. గౌరవ అతిథులుగా భోపాల్ ఉపక్రమ్ ఎడిటర్ ఆచార్య సీకే సారధి, ఆంధ్రప్రదేశ్ ఐ అండ్ పీఆర్ మాజీ డెరైక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి పాల్గొంటారన్నారు. ఐ అండ్ పీఆర్ రీజినల్ జేడీ జో న్సన్ చోరగుడి కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. పరీక్షలు నిర్వహణ తేదీలు ఖరారు సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఫిబ్రవరిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన వివిధ కోర్సుల పరీక్షల ను వర్సిటీ వాయిదా వేసింది. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను ఖరారు చేశామని సీఈ డి.సత్యన్నారాయణ శుక్రవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వు లు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు పంపామన్నారు. -
బోధన లేదు..శోధనా లేదు !
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిధిలోని కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్‌కు మంజూరైన శాశ్వత అధ్యాపకుల పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతోంది. యూనివర్సిటీ స్థాయిలో నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధనలు జరగటానికి అధ్యాపకులు కీలకం. ఇక్కడ రెగ్యులర్ అధ్యాపకులు సరిపడా లేరని వర్సిటీ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏఎన్‌యూ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, సైన్స్ కళాశాలల్లో ఏడు ప్రొఫెసర్, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 30న అనుమతినిచ్చింది. వీటితో పాటు ఏఎన్‌యూ ఆర్ట్స్ , సైన్స్ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 20 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం 2011లోనే అనుమతినిచ్చింది. అయితే అప్పట్లో ఈ పోస్టులు భర్తీ చేయలేదు. వీటితోపాటు మరికొన్ని బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి మేరకు పోస్టుల భర్తీకోసం రిజర్వేషన్ ఖరారు చేసేందుకు గత ఏడాది నవంబర్ 14న వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు రోస్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్ మూడో తేదీన జరిగిన యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో మొత్తం 88 శాశ్వత రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. వెంటనే భర్తీకి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు ప్రకటించారు. అయితే నేటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. సమీపిస్తున్న ఎన్నికల గడువు సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరు తరువాత ఏ నిమిషమైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అధ్యాపక పోస్టుల భర్తీకి అడ్డంకి కాగలదు. అధ్యాపక పోస్టుల భర్తీలో తాత్సారం చోటుచేసుకోవడంతో అభ్యర్థుల్లో నిరుత్సాహం నెలకొంటుంది. ఇటీవల ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని యూనివర్సిటీలకు కూడా ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేసింది. ఆ యూనివర్సిటీల కంటే పోస్టుల భర్తీలో ఏఎన్‌యూ వెనుకబడింది. ఒత్తిళ్ళు రావడమే కారణమా .. యూనివర్సిటీ అధికారులపై వస్తున్న తీవ్ర ఒత్తిళ్ళు, సిఫార్సులే పోస్టుల భర్తీలో జాప్యం జరగటానికి కారణాలనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం పోస్టులకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో సిఫార్సులు చేయించటం అధికారులకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. మరోపక్క పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అంతర్గతంగా కూడా తీవ్ర ఒత్తిళ్ళు వస్తుండటంతో అధికారులు కొంతకాలం తరువాత పోస్టుల భర్తీ చేపడితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై వీసీ ఆచార్య కె. వియ్యన్నారావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తరువాత మిగిలిన అధ్యాపక పోస్టులకు రోస్టర్ రూపొందించి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. -
సర్టిఫికెట్ల పరిశీలనలో జాప్యం వద్దు
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :వీసాకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్ల జెన్యునిటీ( నిజనిర్ధారణ) కోసం ఏఎన్‌యూకి పంపితే వాటి పరిశీలనలో జాప్యం జరుగుతోందని.. అటువంటి జాప్యం జరగకుండా చూడాలని అమెరికన్ కాన్సులేట్ ఫ్రాడ్ డివెన్షన్ మేనేజర్ అన్నా జెడ్ కేఫార్డ్ వర్సిటీ ఉన్నతాధికారులకు సూచించారు. అమెరికన్ కాన్సులేట్ అధికారుల బృందం సోమవారం వర్సిటీని సందర్శించింది. అమెరికన్ కాన్సులేట్ నుంచి జన్యునిటీ కోసం ఏఎన్‌యూకి పంపిన సర్టిఫికెట్లపై ఆమె వీసీ ఆచార్య కె.వియ్యన్నారావుతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జన్యునిటీ కోసం కాన్సులేట్ పంపిన సర్టిఫికెట్ల ప్రక్రియ వారంలోగా పూర్తి చేయాలని వీసీ, యూనివర్సిటీ సీఈకి సూచించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ కాంతం, సీడీసీ డీన్ ఆచార్య చలం, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆచార్య ఏవీఏ దత్తాత్రేయరావు, డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్, ఆచార్య ఈ.శ్రీనివాసరెడ్డి, ఆచార్య ఎ.ప్రమీలారాణి, సీఈ డి.సత్యన్నారాయణ, ఏసీఈ ఎం.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు వర్సిటీ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు వర్సిటీ డైక్మెన్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం జరుగుతుందని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు తెలిపారు.