బుధవారం ఏఎన్‌యూలో వీసీల సమావేశం | VCs meeting at ANU | Sakshi
Sakshi News home page

బుధవారం ఏఎన్‌యూలో వీసీల సమావేశం

Published Tue, Jan 24 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

VCs meeting at ANU

ఏఎన్‌యూ (పొన్నూరు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలు, డీన్‌ల సమావేశం బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనుంది. ఫిబ్రవరిలో ఏపీ రాజధానిలో జరగనున్న మహిళా పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణలో యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను భాగస్వామ్యం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏపీ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు నిర్వహిస్తున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఎస్‌.విజయరాజు, వైస్‌ చైర్మన్‌ ఆచార్య పి.నరసింహారావు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, డీన్‌లు పాల్గొననున్నారు. సమావేశం ఉదయం 10 గంటలకు డైక్‌మెన్‌ ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement