VCs
-
ఆధారాలు ఇచ్చాం.. ‘కూటమి’ తోక ముడిచింది: బొత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై విచారణకు సవాల్ చేసిన ప్రభుత్వం తీరా మండలిలో ఆధారాలు చూపగానే తోకముడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ వీసీలతో బలవతంగా రాజీనామాలు చేయించారనే ఆరోపణలపై విచారణకు సిద్దమంటూ సవాల్ చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపగానే ఎందుకు వెనక్కివెళ్ళారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఎక్కడా, ఎప్పుడూ ఇలా వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించిన ఘటనలు లేవని అన్నారు.బొత్స ఇంకా ఆయన ఏమన్నారంటే..గవర్నర్ నియమించిన విసిలని ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్, కార్యదర్శులు ఏ విధంగా రాజీనామాలు చేయమని ఆదేశిస్తారు? ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడంపై జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరాం. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధారాలు చూపాలంటూ సవాల్ విసిరారు. తీరా సభలో అన్ని వివరాలను ముందుంచడంతో, దానిపై సమాధానం చెప్పలేక దబాయింపులు, బుకాయింపులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలకు తెగబడ్డారు. వీసీలు తప్పు చేస్తే విచారించండి, వారిపై చర్యలు తీసుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మారగానే వైస్ ఛాన్సలర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం దారుణం. ఇది మొత్తం విద్యా వ్యవస్థకే కళంకంపోలవరం ఎత్తు తగ్గింపుపై వివరణ ఇవ్వాలిపోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. ఈ ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్లతో నిర్మించిప్పుడే విద్యుత్ ఉత్పత్తి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు, ఉత్తరాంధ్రకు తాగునీరు అందుతాయి. కానీ ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. కానీ చంద్రబాబు మాత్రం తన స్వలాభం కోసం కాంట్రాక్టర్ల కోసం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. చివరికి పోలవరం ఎత్తుపైన కూడా చంద్రబాబు రాజీ పడుతున్నారు. రికార్డులను పరిశీలిస్తే ఇందులో వాస్తవాలు బయటపడతాయి. దీనిపై వివరణ ఇవ్వాలని మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సూటిగా సమాధానం రాలేదు. పోలవరం ఎత్తును తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అర్థమవుతోంది. వైఎస్సార్సీపీగా దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.చేనేత కార్మికులను మోసం చేస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేనేత కార్మికులను గాలికి వదిలేసింది. దీనిపై మండలిలో ప్రశ్నిస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారంటూ మాపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. బీసీల గురించి మాట్లాడితే ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? చేనేత కార్మికుల కోసం రూ.వెయ్యి కోట్ల నిధిని పెడతానని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. 2019-24 మధ్య వైయస్ఆర్ నేతన్న నేస్తం కింద రూ.960 కోట్లు నేతన్నలకు ఇచ్చాం. రూ.1396 కోట్లు వారి పెన్షన్ల కోసం ఖర్చు చేశాం. కానీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అంటూ అంకెల గారడీతో ప్రచారం చేసుకుంటోంది. తమకు అనుకూలమైన మాధ్యమాల్లో లేనిది ఉన్నట్లుగా చాటుకుంటోంది. బలహీనవర్గాల విషయంలో న్యాయం చేయకపోగా వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు.మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..సంక్షోభంలో ఉన్న విద్యుత్ డిస్కామ్ లు వాటిని కాపాడటానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 47వేల కోట్లు ఖర్చు పెట్టింది. ట్రూఅప్ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై వేసిన రూ.15 వేల కోట్ల ప్రభారాన్ని ప్రభుత్వమే భరించాలి. 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పుల్లో కనీసం మూడోవంతు కూడా మా హయాంలో చేయలేదు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా మా పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు మేం వ్యతిరేకమని మాత్రమే చెప్పాం. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. రిగ్గింగ్‌లు, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగంతో కూటమి అభ్యర్ధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. ఉత్తరాంధ్రలో రఘువర్మ తమ అభ్యర్థి అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయనక బదులు గెలిచిన శ్రీనివాసులు నాయుడిని తమ అభ్యర్థి అంటూ చెప్పుకోవడం దారుణం. ఎవరికో పుట్టిన పిల్లవాడిని తమ కొడుకు అని చెప్పుకుంటున్నట్లుగా ఉంది. -
మీ ఒత్తిడితోనే వీసీల రాజీనామా
సాక్షి, అమరావతి: ‘మీ ఒత్తిడితోనే యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు రాజీనామా చేశారు.. ఆధారాలు ఇవిగో.. ఏమాత్రం నిజాయితీ ఉన్నా న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి’ అంటూ ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ రాజీనామా లేఖను ట్యాగ్ చేస్తూ మంగళవారం ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేసింది.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ద్వారా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలివిగో.. నారా లోకేశ్ ఆదేశాలతో చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఒక వీసీ తన రాజీనామా లేఖలో మంత్రి లోకేశ్ బెదిరించినట్లు స్పష్టంగా రాశారు’ అంటూ వైఎస్సార్సీపీ ఎత్తి చూపింది. ‘వీసీలపై రాజీనామా చేయాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారని మంత్రి నారా లోకేశ్‌ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.వీసీలను బెదిరించినట్లు ఆధారాలు చూపితే విచారణకు ఆదేశిస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్లు గవర్నర్ అధికారం కిందకు వస్తారని లోకేశ్ బుకాయించారు. ‘ఇదిగో.. ఇప్పుడు నారా లోకేశ్ ఒత్తిడితోనే వీసీలు రాజీనామా చేసినట్లు ఆధారాలను బయట పెడుతున్నాం. ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఈ విషయమై న్యాయబద్ధంగా విచారణ చేయించాలి. లేదా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది. అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయని, న్యాయం గెలుస్తుందని స్పష్టం చేసింది. -
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పూర్తిస్థాయి వీసీలను నియమిస్తాం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లో పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్ల (వీసీ) ను నియమిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలి పారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో వీసీల నియామకం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. కేంద్రమంత్రికి లేఖ రాశా రు. ఈ లేఖకు స్పందించి ఆయన ప్రత్యుత్తరం రాశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, హైదరాబాద్ ఐఐటీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో బోధన సిబ్బంది నియామకాల్లో ఓబీసీ రిజ ర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని మ రో లేఖలో ఎంపీ చామల కోరగా.. శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రత్యుత్తరంలో వెల్లడించారు. -
కొత్త వీసీల నియామకం
-
బెదిరింపులు తట్టుకోలేక వీసీల రాజీనామా
వెంకటాచలం/గుంటూరు (ఏఎన్‌యూ)/కడప (వైవీయూ): కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శ్రుతిమించాయి. చివరకు ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలపైనా కర్రపెత్తనం ప్రారంభించింది. వర్సిటీల వీసీలను తప్పుకోవాలంటూ బెదిరింపులకు దిగడమేగాక తీవ్ర వేధింపులకు గురిచేస్తుండడంతో తట్టుకోలేక వారు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పలు వర్సిటీల వీసీలు రాజీనామా చేయగా.. తాజాగా మరికొందరు అదే బాటపట్టారు.టీడీపీ నేతల వేధింపులను తట్టుకోలేక నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ పి.రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి శుక్రవారం పంపించారు. ఈ నెల 5న టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు విశ్వవిద్యాలయంలోకి చొరబడి వీసీ, రిజిస్ట్రార్లతో పాటు అధ్యాపక బృందాలపై దాడి చేశారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కాగా.. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని విద్యాశాఖ మంత్రి పీఏ ఫోన్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారిద్దరూ రాజీనామాలు సమర్పించారు.అదే బాటలో వైవీయూ వీసీకడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ చింతా సుధాకర్ గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించారు. కాగా.. రిజిస్ట్రార్ వైసీ వెంకట సుబ్బయ్య రాజీనామాను వీసీ ఆమోదించారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి విద్యాశాఖ మంత్రి ఓఎస్డీగా తాను చేరబోతున్నానని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామాలు సమర్పించాలంటూ ఫోన్లు చేశారు. అనధికార ఓఎస్డీ ఫోన్‌కాల్స్ పట్టించుకోవాల్సిన పనిలేదని భావించారు. అయితే, తర్వాత రోజు వీసీల వాట్సా‹³ గ్రూపుల్లో సైతం అందరూ రాజీనామాలు సమర్పించాలని వీసీలు, రిజిస్ట్రార్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి తోడు అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలను విశ్వవిద్యాలయాలపైకి ఉసిగొల్పి అనవసర రాద్ధాంతం చేస్తూ వచ్చారు. వైఎస్సార్ వర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామాకడప నగరంలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (వైఎస్సార్ ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి జూన్ 5న పదవికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీప బంధువు కావడంతో ఈయనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులను ఉసిగొల్పారు. తాజాగా శనివారం ఆయన రాజీనామాను ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ బానోతు ఆంజనేయప్రసాద్ ఆమోదించారు. దీంతో ఆయన తిరిగి మాతృవిశ్వవిద్యాలయం వైవీయూలో బయో టెక్నాలజీ ఆచార్యులుగా చేరారు. కాగా.. వైఎస్సార్ ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ బానోతు ఆంజనేయప్రసాద్ సైతం సోమవారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం.ఏఎన్‌యూ వీసీ రాజీనామాకు నిర్ణయంరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వీసీ పి.రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు రాజీనామా చేస్తున్న తరుణంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు శనివారం పేర్కొన్నారు. -
ప్రభుత్వం మారితే వీసీలు మారాలా?: మేరుగు నాగార్జున
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం....గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదు....గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్ చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి....వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. -
విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వీసీలతో సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం చేపట్టారు. విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు చేశారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి సారించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హేమచంద్రారెడ్డి, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ రాష్ట్రానికి, విద్యావ్యవస్థకు ,యువకులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య అందించాలన్నది సీఎం ఆరాటం దేశం యావత్తు దృష్టి ఆకర్షించేలా రాష్ట్రంలో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యనస్థను ప్రవేశపెట్టి విద్యార్థులకు అందివ్వాలని సీఎం ఆదేశించారు రొటీన్ విద్యావిధానం కాకుండా విద్యార్థుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలని సీఎం ఆదేశించారు వీసీలు నాలుగు గ్రూపులుగా విడిపోయి నాలుగు టాపిక్ లపై చర్చించాలని సీఎం ఆదేశించారు చర్చించిన అంశాలు సిఫార్సులపై సాయంత్రం తనకుకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు టెక్నాలజీ ప్రవేశం సహా అంతర్జాతీయ స్థాయి లో పలు అంశాలను కరిక్యులమ్ లో జోడించాలని సీఎం ఆదేశించారు వీసీలంతా కలసి కరిక్యులమ్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు మా ఆలోచనలతో సీఎంకు నివేదిక అందిస్తాం గడచిన నాలుగేళ్లుగా యూనివర్సిటీల్లో ఎక్కడా రాజకీయాలు ఏవీ లేవు రాష్ట్రంలో విద్యావిధానం నాణ్యంగా,ఆదర్శంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రసాదరెడ్డి,ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై సీఎం మాకు దిశానిర్దేశం చేశారు అంతర్జాతీయంగా పరీక్షా విధానం వేరుగా ఉంటుందని తెలిపారు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షా విధానం అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో అమలవుతోన్న ఒపెన్ బుక్ పరీక్షా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు రానున్న 5 ఏళ్లలో లీడ్ రోల్ విధానం అమలు చేసేలా నూతన విద్యా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూసేలా నూతన విద్యా విధానం ఉండాలన్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో స్టూడెంట్ కు కావాల్సిన కోర్సులు ,లెర్నింగ్ ఆప్షన్లపై చర్చించాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన విద్యావిధానం, పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయలని సీఎం సూచించారు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను తీసుకురావడంపై సమగ్రంగా చర్చించాలని సీఎం ఆదేశించారు గ్లోబల్ గా ఎడ్యుకేషన్ మాప్స్ లో ఎపీ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలన్నారు ఇంటర్నేషనల్ ప్రొఫెసర్లను పిలచి విద్యావిధానంలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చించాలని నిర్దేశించారు విష్ణువర్దన్ రెడ్డి ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ వ్యవసాయరంగంలో అభివృద్ది జరగాలని సీఎం ఆదేశించారు వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యావ్యవస్థలో మార్పు జరగాలని సీఎం ఆదేశించారు లోయర్ ,హయ్యర్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ వినియోగించి మార్పులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ప్రొఫెసర్ భారతి, పద్మావతి విశ్వ విద్యాలయం వీసీ అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలని సీఎం ఆదేశించారు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యావిధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు బాబ్జి, వైఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలుంటాయి పేషంట్లకు అధునాతన పద్దతుల్లో మెరుగైన వైద్యం అందించేలా మెడికల్ స్టూడెంట్స్ కు విద్యా బోధన అందించాలని సీఎం ఆదేశించారు ప్రసాదరాజు, జెఎన్ టీయూ వీసీ మన విద్యార్థులు క్రియేటప్లుగా ఉండాలికానీ ఫాలోవర్లుగా ఉండకూడడదని సీఎం ఆదేశించారు ఉన్నత వుద్యలో నాలెడ్జ్ క్రియేటర్లుగా ఉండాలని సీఎం ఆదేశించారు రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉంది చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
జీ–20 భారత్ వేడుకల్లో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జీ–20కి భారత్ అధ్యక్షత వహించే అంశానికి సంబంధించిన వేడుకల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా చూడాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైఎస్ చాన్సలర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. ఇందుకు సంబంధించిన అనేక కార్యక్రమాలు విద్యార్థులతో నిర్వహించాలని సూచించారు. వీసీలతో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, జీ–20 అధ్యక్ష సావనీర్‌ను తీసుకొచ్చేందుకు వివిధ పోటీలు నిర్వహించా లని కోరారు. ఇందులో మూడింటికి బహు మతి ఉంటుందని ప్రకటించారు. జి–20 వా రోత్సవాలు చేపట్టి, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, క్విజ్, పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ వంటి పోటీలు నిర్వహించాలని కోరార -
బుధవారం ఏఎన్‌యూలో వీసీల సమావేశం
ఏఎన్‌యూ (పొన్నూరు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలు, డీన్ల సమావేశం బుధవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగనుంది. ఫిబ్రవరిలో ఏపీ రాజధానిలో జరగనున్న మహిళా పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలను భాగస్వామ్యం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏపీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు నిర్వహిస్తున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎస్.విజయరాజు, వైస్ చైర్మన్ ఆచార్య పి.నరసింహారావు, ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ విశ్వవిద్యాలయాల వీసీలు, డీన్లు పాల్గొననున్నారు. సమావేశం ఉదయం 10 గంటలకు డైక్మెన్ ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. -
ఏఎన్‌యూలో వీసీల బృందం పర్యటన
పలు విభాగాల పనితీరుపై అసంతృప్తి ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముగ్గురు సభ్యుల వీసీల బృందం మంగళవారం పర్యటించింది. డిసెంబర్ మొదటి వారంలో నాక్ బృందం ఏఎన్‌యూ పర్యటనకు రానున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను ఈ బృందం పరిశీలించింది. ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్, నెల్లూరు విక్రమశింహపురి యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వీరయ్య, కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.రామకృష్ణారావు ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో వివిధ విభాగాలను సందర్శించారు. విభాగాల్లో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, అధ్యాపకుల గదుల్లో జరుగుతున్న మరమ్మతులు, ఆయా విభాగాల్లోని విద్య, పరిశోధన పరమైన అంశాలు , వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పలు అంశాలపై వీసీల బృందం సూచనలు చేసింది. పలు విభాగాల్లో పనులు కాకపోవటంపై వీసీల బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన నాక్ పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యూనివర్సిటీ వ్యవస్థ మొత్తం నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించింది. వివిధ విభాగాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి కాకపోవటం, కొన్ని విభాగాల్లో గదులు శుభ్రంగా లేకపోవంపై బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు సరిగా పనిచేయకపోతే సహించేదిలేదని హెచ్చరించింది. చివరి నిమిషం వరకు పనులు పెండింగ్ పెట్టుకోవద్దని, రెండు రోజుల్లో అన్ని విభాగాలు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. -
దిక్కులేని ఉన్నత విద్య!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ వీసీలు కరువు సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో యూనివర్సిటీలు అనాథలవుతున్నాయి. దిక్కూమొక్కూ లేకుండా కుంటుతూ నడుస్తున్నాయి. వాటి ఆలనాపాలనా చూసే వారే కరువయ్యారు. విశ్వవిద్యాలయాలను పట్టించుకునే తీరికే రాష్ర్ట ప్రభుత్వానికి లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలోని ఏ ఒక్క యూనివర్సిటీకి వైస్చాన్స్లర్లు లేని పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి మరో మూడు వర్సిటీల వీసీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే మిగతా వర్సిటీలకు వీసీలు లేరు. దీంతో ఇకపై రాష్ర్టంలోని పది విశ్వవిద్యాలయాలూ ఇన్చార్జుల పాలనలోనే నడవనున్నాయి. వారెప్పుడూ యూనివర్సిటీ దరిదాపుల్లోకి రారు. అక్కడి సమస్యలు, ప్రాధాన్యతలను పట్టించుకోరు. ఇన్చార్జి వీసీలు విధులు నిర్వహిస్తున్నా సచివాలయం లేదా ఉన్నత విద్యా శాఖ కార్యాలయానికే ఫైళ్లు వస్తాయి. అక్కడే చూసి ఆమోదిస్తారు. అదీ ఆయా వర్సిటీల సిబ్బంది రోజుల తరబడి ఫైళ్లు పట్టుకుని తిరిగిన తర్వాతే! ఇంత దారుణమైన పరిస్థితులు దేశంలో మరెక్కడా కనిపించవని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విశ్వవిద్యాలయం ఉస్మానియాకు వీసీ లేక తొమ్మిది నెలలవుతోంది. ఉత్తర తెలంగాణకు విద్యా కేంద్రంగా భాసిల్లుతున్న కాకతీయ వర్సిటీకి ఏడాది దాటింది. శాతవాహన వర్సిటీ వీసీ వీరారెడ్డి శుక్రవారమే పదవీ విరమణ చేయగా, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ శివారెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీ భాగ్యనారాయణ శనివారం రిటైర్ అవుతున్నారు. ఆదివారం నుంచి రాష్ర్టంలోని పది విశ్వవిద్యాలయాలకూ వీసీలు ఉండరు. వీసీలు లేక విలవిల్లాడుతున్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు ఇప్పటికీ సెర్చ్ కమిటీలు వేయకపోవడం విస్తుగొలుపుతోంది. ప్రస్తుతం ఈ వర్సిటీల్లో పరిపాలన పూర్తిగా స్తంభించింది. నియామకాలు ఆగిపోయాయి. కీలకమైన వర్సిటీ కాలేజీల్లో ఫ్యాకల్టీ లేదు. దీంతో బోధన, పరిశోధన రెండూ అటకెక్కాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలోనూ ఎడతెగని జాప్యం జరుగుతోంది. సిబ్బంది కొరత:యూనివర్సిటీ కాలేజీల్లో బోధన సిబ్బంది పోస్టులు సగానికిపైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఎంతో ఘనకీర్తి కలిగిన ఉస్మానియాలోనూ ఇదే దుస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్నత విద్య నిర్వీర్యమవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓయూలో 1,230 బోధనా సిబ్బంది పోస్టుల్లో 630 ఖాళీలున్నాయి. పదవీ విరమణ చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించడం లేదు. ఫలితంగా నాలుగే ళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఇక పాలమూరు వర్సిటీలో ఆరుగురు బోధనా సిబ్బంది, ఇద్దరు బోధనేతర సిబ్బందితో పాలన సాగుతోంది. అన్నీ సమస్యలే..: వీసీలు లేని వర్సిటీలకు విద్యా శాఖలో సీనియర్ అధికారులను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు. ఉస్మానియా, అంబేద్కర్ వర్సిటీలకు ఇన్చార్జ్గా ఉన్న విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఆపాయింట్మెంట్ దొరకడమే వర్సిటీ అధికారులకు గగనమైపోయింది. ఒక వృత్తి విద్యా కోర్సు పరీక్ష ఫలితాలకు అన్నీ సిద్ధం చేసినా సంబంధిత ఫైల్‌ను రంజీవ్ఆచార్య ఆమోదించకపోవడంతో ఫలి తాలను వారం రోజుల తర్వాత ప్రకటించాల్సి వచ్చింది. ‘మాకు నెలనెలా జీతాలు ఇవ్వడం తప్పితే వర్సిటీలో ఏ పనీ సవ్యంగా లేదు.’ అని ఉస్మానియా ప్రొఫెసర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా వ్యవస్థతోనే మనుగడ ప్రస్తుతం వర్సిటీల్లో విద్యార్థులు తగ్గిపోతున్నారు. పర్యవేక్షణ లేకుండా పో తోంది. ఫ్యాకల్టీ, వీసీలను నియమించి గాడిలో పెట్టాలి. ఇప్పుడు నియమించినా వర్సిటీలను గాడిలో పెట్టేందుకే ఏడాది పడుతుంది. లేకపోతే అవి ఎందుకూ పనికిరానివిగా తయారవుతాయి. అంతేకాదు కొత్త రాష్ట్రంలో పక్కా పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ అవసరం. యూనివర్సిటీ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. - అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వీసీ వీసీలు లేకపోతే ఎలా? జ్ఞానాన్ని పంచాల్సిన కేంద్రాలు మూలనపడ్డాయి. స్కూళ్లలోలా పుస్తకంలో ఉన్నది చెప్పడం కాదు.. పరిశోధనలను విస్తరించేందుకు ప్రొఫెసర్లు మార్గదర్శనం చేస్తారు. కానీ ప్రొఫెసర్లే లేకపోతే ఇక బోధించేదెవరు? ఇప్పటికైనా ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలి. లేకపోతే నేర్చుకునేది ఏమీ ఉండదు. ముఖ్యంగా వీసీలు లేకపోతే వర్సిటీల మనుగడకు ప్రమాదం తప్పదు. - చుక్కా రామయ్య, విద్యావేత్త