సాక్షి, తాడేపల్లి: పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం కీలక సమావేశం చేపట్టారు.
విద్యారంగంలో కీలక మార్పులపై సమాలోచనలు చేశారు. బోధనలో, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి సారించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్‌మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హేమచంద్రారెడ్డి, స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఛైర్మన్
రాష్ట్రానికి, విద్యావ్యవస్థకు ,యువకులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య అందించాలన్నది సీఎం ఆరాటం
దేశం యావత్తు దృష్టి ఆకర్షించేలా రాష్ట్రంలో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వ్యనస్థను ప్రవేశపెట్టి విద్యార్థులకు అందివ్వాలని సీఎం ఆదేశించారు
రొటీన్ విద్యావిధానం కాకుండా విద్యార్థుల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలని సీఎం ఆదేశించారు
వీసీలు నాలుగు గ్రూపులుగా విడిపోయి నాలుగు టాపిక్ లపై చర్చించాలని సీఎం ఆదేశించారు
చర్చించిన అంశాలు సిఫార్సులపై సాయంత్రం తనకుకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యావిధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు
టెక్నాలజీ ప్రవేశం సహా అంతర్జాతీయ స్థాయి లో పలు అంశాలను కరిక్యులమ్ లో జోడించాలని సీఎం ఆదేశించారు
వీసీలంతా కలసి కరిక్యులమ్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు
మా ఆలోచనలతో సీఎంకు నివేదిక అందిస్తాం
గడచిన నాలుగేళ్లుగా యూనివర్సిటీల్లో ఎక్కడా రాజకీయాలు ఏవీ లేవు
రాష్ట్రంలో విద్యావిధానం నాణ్యంగా,ఆదర్శంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు
ప్రసాదరెడ్డి,ఆంధ్రా యూనివర్సిటీ వీసీ
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై సీఎం మాకు దిశానిర్దేశం చేశారు
అంతర్జాతీయంగా పరీక్షా విధానం వేరుగా ఉంటుందని తెలిపారు
ఓపెన్ బుక్ విధానంలో పరీక్షా విధానం అమలును పరిశీలించాలని సీఎం ఆదేశించారు
అంతర్జాతీయ స్థాయిలో అమలవుతోన్న ఒపెన్ బుక్ పరీక్షా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు
రానున్న 5 ఏళ్లలో లీడ్ రోల్ విధానం అమలు చేసేలా నూతన విద్యా విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు
యావత్ దేశం మన రాష్ట్రం వైపు చూసేలా నూతన విద్యా విధానం ఉండాలన్నారు
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో స్టూడెంట్ కు కావాల్సిన కోర్సులు ,లెర్నింగ్ ఆప్షన్లపై చర్చించాలన్నారు
అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన విద్యావిధానం, పరీక్షా విధానంలో సంస్కరణలు అమలు చేయలని సీఎం సూచించారు
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను తీసుకురావడంపై సమగ్రంగా చర్చించాలని సీఎం ఆదేశించారు
గ్లోబల్ గా ఎడ్యుకేషన్ మాప్స్ లో ఎపీ ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలన్నారు
ఇంటర్నేషనల్ ప్రొఫెసర్లను పిలచి విద్యావిధానంలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చించాలని నిర్దేశించారు
విష్ణువర్దన్ రెడ్డి ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వీసీ
వ్యవసాయరంగంలో అభివృద్ది జరగాలని సీఎం ఆదేశించారు
వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యావ్యవస్థలో మార్పు జరగాలని సీఎం ఆదేశించారు
లోయర్ ,హయ్యర్ ఎడ్యుకేషన్ లో టెక్నాలజీ వినియోగించి మార్పులు తీసుకోవాలని సీఎం ఆదేశించారు
ప్రొఫెసర్ భారతి, పద్మావతి విశ్వ విద్యాలయం వీసీ
అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలని సీఎం ఆదేశించారు
అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన విద్యావిధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారు
బాబ్జి, వైఎస్ఆర్ యూనివర్సిటీ వీసీ
వైద్య విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మెరుగైన ఫలితాలుంటాయి
పేషంట్లకు అధునాతన పద్దతుల్లో మెరుగైన వైద్యం అందించేలా మెడికల్ స్టూడెంట్స్ కు విద్యా బోధన అందించాలని సీఎం ఆదేశించారు
ప్రసాదరాజు, జెఎన్ టీయూ వీసీ
మన విద్యార్థులు క్రియేటప్లుగా ఉండాలికానీ ఫాలోవర్లుగా ఉండకూడడదని సీఎం ఆదేశించారు
ఉన్నత వుద్యలో నాలెడ్జ్ క్రియేటర్లుగా ఉండాలని సీఎం ఆదేశించారు
రానున్న రోజుల్లో సిలబస్, పరీక్షా విధానం సమూలంగా మార్చే అవకాశం ఉంది
చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే..
Comments
Please login to add a commentAdd a comment