key meeting
-
నేడు శ్రీకాకుళం జిల్లా నేతతో వైఎస్ జగన్ సమావేశం
-
రేపు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రేపు ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం అంశంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాపోరాటం ఎలా చేయాలనే అంశంపైనా రేపటి సమావేశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.తాడేపల్లిలో రేపు జరగబోయే భేటీలో.. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించడం చర్చించననున్నారు. అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో..రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలపైన చర్చించనున్నట్లు భేటీలో సమాచారం. అలాగే ఒక ప్రణాళికను రూపొందించి.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.భేటీలో చర్చించబోయే ప్రధానాంశాలుభారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోంది చంద్రబాబు సర్కార్.ధాన్యం సేకరణ అంశంతో పాటు రైతులను దోచుకుంటున్న దళారులుఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ రూపకల్పనఇదీ చదవండి: కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి! ఈ భేటీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలకు ఆహ్వానం వెళ్లింది. ఇదిలా ఉంటే.. పార్టీ బలోపేతం కోసం సంక్రాంతి తర్వాత వైఎస్సార్సీపీ అధినేత క్షేత్రస్థాయి పర్యటన చేపనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ప్రతీ బుధ, గురు వారాల్లో పూర్తిగా కార్యకర్తలతోనే గడుపుతూ.. వాళ్ల నుంచి సలహాలు స్వీకరించనున్నట్లు ప్రకటించారాయన. -
తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని కీలక భేటీ
-
నవంబర్ నెలాఖరుకల్లా కులగణన పూర్తి చేయాలి: రేవంత్
-
కేటీఆర్ తో TRSV మీటింగ్
-
వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం.. వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
గుంటూరు, సాక్షి: ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్నదానిపై వారితో చర్చలు జరిపారు. దీంతోపాటు రాబోయే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిత్వంపైనా వారి అభిప్రాయాలు తీసుకున్నారు.పార్టీ సూచనల మేరకు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని నియమించారు. అలాగే వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు.వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ సమావేశం జరిగింది. తొలుత వైఎస్సార్సీపీ జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. రేపు(గురువారం)కూడా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆర్నెలలపాటు సమయం ఇవ్వాలని తొలుత జగన్ భావించారు. ఆ తర్వాతే చంద్రబాబు సర్కార్‌ను నిలదీయాలని భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో అరాచకం మొదలైంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో.. బహిరంగంగా రాజకీయ హత్యలను, దాడుల్ని చంద్రబాబు & నారా లోకేష్ ప్రొత్సహిస్తూ వస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు, అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. వైఎస్సార్సీపీపై ప్రతీకార దాడులు, అంతటా నేతల అధికార జులుం, వివిధ విభాగాలు.. వాటి అధిపతులు ఆఖరికి క్షేత్ర స్థాయి ఉద్యోగులపైనా వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంపై తక్షణ పోరును ప్రారంభించారు జగన్. మరోపక్క.. దాడులతో ఆందోళన చెందుతున్న పార్టీ కేడర్‌కు అధైర్య పడొద్దంటూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులపాటు(ఇవాళ, రేపు) పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతుండడం విశేషం. -
విశాఖ జిల్లా నాయకులతో వైయస్ జగన్ కీలక సమావేశం
-
రైతు భరోసాపై రైతులతో కీలక సమావేశం
-
ధైర్యంగా అడుగులు వేయాల్సిందే.. వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వయసుతో పాటు పోరాడే సత్తా నాకుంది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి, ప్రతీ గడపకు మనం చేసిన మంచి ఏమిటో తెలుసు. ఈరోజుకీ వైఎస్ జగన్ అంటే అబద్దాలు చెప్పడు.. మోసం చేయడు అని వారికి తెలుసు. వైఎస్సార్సీపీ అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. ఇదే ప్రజలు 2029 నాటికి చంద్రబాబు మోసాలు, ప్రలోభాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకుంటారు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.గురువారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన వైఎస్సార్సీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల్లో మనకు 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయని మనం మర్చిపోకూడదు. 2019లో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు తగ్గాయి. ఈ పది శాతం ప్రజలు చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారు. ప్రతీ కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసు. విశ్వసనీయతకు మన చిరునామా. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష. మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు... ఈరోజుకీ జగన్ అబద్ధాలు చెప్పడు. జగన్ మోసం చేయడు అని వారికి తెలుసు. చంద్రబాబుకన్నా.. ఎక్కువ హామీలు ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించొచ్చు కూడా. రాజకీయాల్లో ఇంత నిజాయితీగా జగన్ ఉండడం అవసరమా? అనుకునేవాళ్లు కూడా ఉండొచ్చు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం న్యాయం కాదనే జగన్ ఎప్పుడూ చెప్తాడు. 2014లో కూడా ఇదే చెప్పాను. 2019లో అది నిజం అయ్యింది. ప్రజలు మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రజలు అదే చేస్తారు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పోలేదు.జగన్‌కు వయసు, వయసుతోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ, ప్రజలతో కలిసి చేసే పోరాటాల్లో వైఎస్సార్సీపీకి, జగన్‌కు ఎవ్వరూ సాటిరారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటాలు కూడా చేస్తాం. మనకు వచ్చిన సంఖ్యాబలం తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకుపోయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం..జగన్ ఓడిపోయాడు.. చనిపోలేదు అని ఒకరు అంటారు. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయి... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా.. జగన్ డోర్‌డెలివరీ చేశారు. ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదని మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. వారి ఆస్తులను దాడులు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి చూడలేదు. మన ప్రభుత్వంలో మేనిఫెస్టో అన్నది ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించే పాలన అయితే, ఇప్పుడు రెడ్ బుక్స్ అని హోర్డింగులు పెడుతున్నారు. అందులో ఏ అధికారిపై కక్ష సాధించాలి. ఎవరిపై దాడులు చేయాలి, ఎవరిపై కక్షసాధించాలి.. అని రాసుకుంటున్నారు. కొడతాం, చంపుతాం అంటున్నారు... మొట్టమొదటి సారిగా కేంద్రంలో 272 స్థానాలు కావాల్సి ఉండగా, బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది.మరోవైపు చంద్రబాబుకు 16 స్థానాలు ఉన్నాయి. మోదీ పక్కన ఉండి చంద్రబాబు చక్రం తిప్పుతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలాంటి చంద్రబాబు రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెప్తాడు... అదే జగన్ ఉండి ఉంటే.. ఈపాటికే విద్యాదీవెనకు బటన్ నొక్కే వాళ్లం. వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లం.. ఇవి పెండింగులో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్, అమ్మ ఒడి పెండింగ్. చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌లో ఉంది. వైఎస్సార్సీపీ పాలన లేకపోవడంతో వీరికి ఏమీ రావడం లేదు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఏపీలో ఉన్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు. రూ. 1500లు ప్రతీ ఒక్కరికీ ఇస్తానని చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునేవాళ్లని పక్కనిపెట్టినా సరే.. మిగిలిన 1.8 కోట్లమంది ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సహాయంకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అమ్మ ఒడిగా కింద వచ్చే డబ్బులు కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఏవీ కూడా అడుగులు ముందుకుపడని పరిస్థితి. కాలం గడుస్తున్నకొద్దీ.. హనీమూన్ పీరియడ్ ముగిస్తుంది.ఓడిపోయామన్న భావనను మనసులోనుంచి తీసేయండి. మనం ఓడిపోలేదు.. అన్న విషయాన్ని గుర్తించండి. న్యాయంగా, ధర్మంగా మనం ఓడిపోలేదు. ప్రతీ ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతీ ఇంటికీ కూడా మనం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకి గౌరవంగా వెళ్లగలుగుతాం. కాలం గడుస్తున్న కొద్దీ మన పట్ట అభిమానం వ్యక్తమవుతుంది. మళ్లీ మనం రికార్డు మెజార్టీలో గెలుస్తాం. మోసపోతున్నవారికి మనం అండగా నిలవాలి. మనకార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి. ఎప్పుడూ చూడని విధంగా కార్యకర్తలమీద, సానుభూతి పరులమీద దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు చేస్తున్నారు. వీళ్లందరికీ కూడా భరోసా ఇవ్వాలి... మీ నియోజకవర్గంలో కార్యకర్తలకు తోడుగా ఉండండి. వారిని పరామర్శించండి. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇస్తే సహాయాన్ని మీరు స్వయంగా అందించండి. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుసుకుంటాను. నష్టపోయిన ప్రతీ కార్యకర్తనూ కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తాను. మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కేండిడేట్ మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవచ్చు. కార్యకర్తలు కష్టాల్లోనూ మనతోనూ ఉన్నారు. జెండాలు మోసి కష్టాలు పడ్డారు. వారికి తోడుగా నిలవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ భరోసా ఇవ్వండి. వీరిని బెదిరించే కార్యక్రమాలు, జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి మాట్లాడండి... నాలుగేళ్లవరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఈ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే.. చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీకూడా మనవాళ్లకు మనం చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా ధైర్యం వస్తుంది. సోషల్ మీడియా కార్యకర్తలను, మన కోసం నిలబడ్డ వాలంటీర్లను వీరందర్నీ కూడా కాపాడుకోవాలి. మన పార్టీ జెండా పెట్టుకున్న ప్రతి ఒక్కరినీ మనం కాపాడుకోవాలి... మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేల మంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా కూడా నష్టపోతారు.మనలో నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా మనం అడుగులు ముందుకు వేయాల్సిందే. ప్రతీ అభిమానికీ, కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శకుని పాచికలు అనే సబ్జెక్ట్ కేవలం ఇంటర్వెలే. శ్రీకృష్ణుడు తోడు ఉన్నా.. పాండవులు ఓడిపోతారు. ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయి. మనం తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతీ ఒక్కరూ ఒక అర్జునుడు మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. ఎన్నికల ఫలితాలపై చాలామంది ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అవన్నీ నా దృష్టికి తీసుకువస్తున్నారు... ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా జరగాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం. మనం తలెత్తుకునే విధంగా పాలన చేశాం. మేనిఫెస్టోలో 99శాతం హామీలను అమలు చేశాం. అమలుచేసిన మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకెళ్లాం. వారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతీ గడపకూ తిరిగాం. రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్‌గా ఎవ్వరూ ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల్లో మాటలు చెప్పి.. ఆతర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు మనం చూశాం. సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకూ కూడా మేనిఫెస్టోలు పెట్టుకుని ఆ దిశగా పనులు చేశాం.ప్రతీ డిపార్ట్మెంట్లో కూడా మేనిఫెస్టో పెట్టి అదే అజెండాగా పాలన చేశాం. మొట్టమొదటి రోజునుంచీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం. తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. కానీ, ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. క్యాలెండర్ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమచేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు కేవలం రూ.వేయి, దాన్ని రూ.3వేలకు పెంచాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షనర్లు.. దాన్ని 66 పెన్షన్లకు పెంచాం. ఎవ్వరినీ కూడా పక్కనపెట్టలేదు. ఇంటివద్దకే వెళ్లి వారి చేతికే అందించాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు.. వారి ఆప్యాయత, ప్రేమలు ఏమయ్యాయి?.54 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అందించాం. 53 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇచ్చాం. ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. కోటిమందికి పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 79 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు ఆసరా కార్యాక్రమం ఇచ్చాం27 లక్షలమంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా, వసతిదీవెన వారి తల్లులకు ఇచ్చాం31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాంఇలా చాలామందికి చాలా రకాలుగా సహాయపడ్డాం.మరి వారిప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు.కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపలేదు, మంచే చేశాం.ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి అడుగులు పడ్డాయి.క్వాలిటీ చదువులకోసం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం.ఎప్పుడూ ఇలాంటి మార్పులు జరగలేదువైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చాం25 లక్షల వరకూ ఆరోగ్య శ్రీ ఉచితమని చెప్పాంఆరోగ్య ఆసరా నుంచి విలేజ్ క్లినిక్ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం54 వేలమంది వైద్య సిబ్బందిని నియమించాంవ్యవసాయంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాంఆర్బీకేల ద్వారా పేదలకు తోడుగా ఉన్నాంవిద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాంగ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకు వచ్చాంలంచాలు, వివక్షలేని పాలనను అందించాంఇంటివద్దకే పాలన అన్న దానికి అర్థం తీసుకు వచ్చాంమహిళా సాధికారితకు ఏం చేయొచ్చో అన్నీ చేశాం15వేల మంది సర్వేయర్లను పెట్టి.. ల్యాండ్ సంస్కరణలు తీసుకువచ్చాంభూ రికార్డులన్నీ కూడా స్వచ్చీకరణకు చర్యలు తీసుకున్నాంవివాదాల్లేకుండా అడుగులు ముందుకేశాంల్యాండ్ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారెంట్ ఇచ్చే చర్యలు తీసుకున్నాంటైటిల్కు ఇన్సూరెన్స్ కల్పించాంగతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.దిశ యాప్ ద్వారా మహిళల భద్రత దిశగా గట్టి చర్యలు తీసుకున్నాం.గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మార్పులు జరగలేదు.ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకు వచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం అని వ్యాఖ్యలు చేశారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశం
-
రేపు వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశం
-
20న వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి,అమరావతి: ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే జూన్ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. -
ఈ నెల 20న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. టీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపటి (జూన్ 19నాటి) పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. -
YS Jagan: 19న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
గుంటూరు, సాక్షి: ఎన్నికల ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలను సమీక్షిస్తూనే.. పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఈ నెల 19వ తేదీన తన కార్యాలయంలో వైఎస్జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధానాంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఇప్పుడే ఏం అయిపోలేదని.. అధైర్య పడొద్దని, పార్టీ చేసిన మంచిని ప్రజలు అంత సులువుగా మరిచిపోరని, త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లందరికీ ధైర్యం చెప్పారాయన. అలాగే.. ప్రతిపక్షాలకు కాస్త టైం ఇద్దామని, ఆ తర్వాత ప్రజల తరఫున గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. మరోవైపు.. టీడీపీ శ్రేణుల్లో గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని ప్రకటించారు కూడా. -
వైఎస్ఆర్ సీపీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం
-
ఎన్డీఏ కూటమి కీలక సమావేశం..
-
నేడు NDA కీలక సమావేశం..
-
సీఎం జగన్ అధ్యక్షతన ‘మేం సిద్ధం.. మా పోలింగ్ బూత్ సిద్ధం’ మీటింగ్ (ఫొటోలు)
-
సీఎం జగన్ అధ్యక్షతన 27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. ఇదీ చదవండి: జనసేన పరిస్థితి ఇంత హీనమా?.. పవన్‌పై హరిరామజోగయ్య ఫైర్ -
Opposition Meet: కాంగ్రెస్ త్యాగం?
ఢిల్లీ: విపక్ష కూటమి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11.30 సమయంలో వర్చువల్‌గా 26 పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలు అనే అంశం ప్రధానంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కూటమికి కన్వీనర్ ఎవరనేది కూడా రేపే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. ఈసారి మొత్తం 543 లోక్‌సభ సీట్లలో కేవలం 255 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. బీజేపీ ఓటమి లక్ష్యంగా.. కూటమిలోని ఇతర పార్టీల కోసం సీట్లను త్యాగం చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదే జరిగితే స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యల్ప స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. అంతకు ముందు 2004లో కాంగ్రెస్ 417 సీట్లకు పోటీ చేసింది.అయితే.. ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఆధిపత్య ధోరణి ప్రదర్శించే క్రమంలో.. సీట్ల పంపకాల ప్రక్రియను ముందుకు సాగడం లేదు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్‌లో కాంగ్రెస్ వైఫల్యాన్ని సాకుగా చూపించి.. కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్‌కు అక్కడి పార్టీలు అయిష్టత చూపుతున్నాయి. బెంగాల్లో దక్షిణ మాల్దా, బహరాంపూర్ స్థానాల్ని వదులుకునేందుకు టీఎంసీ సుముఖంగా కనిపించడం లేదు. అదే విధంగా బీహార్ నుంచి జేడీయూ-ఆర్జేడీ కూటమి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆప్ సైతం కాంగ్రెస్‌కు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. దీంతో.. రేపటి సమావేశంపై ఆసక్తి నెలకొంది. -
ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన
-
గాంధీభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం