గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం అంశంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాపోరాటం ఎలా చేయాలనే అంశంపైనా రేపటి సమావేశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
తాడేపల్లిలో రేపు జరగబోయే భేటీలో.. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించడం చర్చించననున్నారు. అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో..
రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలపైన చర్చించనున్నట్లు భేటీలో సమాచారం. అలాగే ఒక ప్రణాళికను రూపొందించి.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
భేటీలో చర్చించబోయే ప్రధానాంశాలు
భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోంది చంద్రబాబు సర్కార్.
ధాన్యం సేకరణ అంశంతో పాటు రైతులను దోచుకుంటున్న దళారులు
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చ
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ రూపకల్పన
ఇదీ చదవండి: కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి!
ఈ భేటీకి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలకు ఆహ్వానం వెళ్లింది. ఇదిలా ఉంటే..
పార్టీ బలోపేతం కోసం సంక్రాంతి తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత క్షేత్రస్థాయి పర్యటన చేపనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ప్రతీ బుధ, గురు వారాల్లో పూర్తిగా కార్యకర్తలతోనే గడుపుతూ.. వాళ్ల నుంచి సలహాలు స్వీకరించనున్నట్లు ప్రకటించారాయన.
Comments
Please login to add a commentAdd a comment