
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.
టీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరుకానున్నారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపటి (జూన్ 19నాటి) పులివెందుల పర్యటనను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment