
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో ఆయన చర్చిస్తున్నారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సమాలోచనలు జరిపారు.
తిరుమల లడ్డూ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.

ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment