![Jupudi Prabhakar Comments On Vallabhaneni Vamsi Arrest](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Jupudi-Prabhakar-Rao.jpg.webp?itok=moKTcVgV)
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టలేరు. వంశీ 24 గంటల్లో బయటకు వస్తారు. కుట్రలతో చేస్తున్న మీ చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నేతలు గూండాల్లా బరి తెగిస్తున్నారు. వైఎస్సార్‌పీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. సత్యవర్థన్ నిజం చెప్పినా తప్పుడు కేసులు పెడుతున్నారు. సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?’’ అంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు.
‘‘తనతో తప్పుడు కేసు పెట్టించారని సత్యవర్ధన్ కోర్టులో జడ్జి ముందే చెప్పాడు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. కోర్టులు, చట్టాలు అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. వంశీ అరెస్టు అన్యాయం, అక్రమం. టీడీపీ ఆఫీసుపై దాడి చేసింది వారి పార్టీ కార్యకర్తలే. కానీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. సత్యవర్ధన్ ఎస్సీ అని ఆయన్ను వేధిస్తున్నారు.
![వంశీ అరెస్టుపై జూపూడి ఫైర్](https://www.sakshi.com/s3fs-public/inline-images/ju.jpg)
ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి వెయ్యి గొంతులు బయటకు వస్తాయి. అరెస్టులతో వైఎస్సార్‌సీపీ భయపెట్టలేరు. పాలకులు చట్టబద్దంగా వ్యవహరిస్తే మంచిది. అధికార దుర్వినియోగం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. చట్టమే ఉరితాడుగా మారి మీ గొంతులకు బిగిస్తుంది జాగ్రత్త. వంశీతో అరెస్టుతో కూటమి ప్రభుత్వం అధ:పాతాళానికి పోయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే కూడా పోలీసులకు లెక్క లేకుండా పోయింది. బాధితుల మీదనే తిరిగి కేసులు పెట్టే దారుణమైన పరిస్థితి ఏర్పడింది
అధికారం లేనందున వైఎస్సార్‌సీపీ నేతలంతా లొంగిపోతారనుకోవటం అవివేకం. అక్రమ కేసులు పెట్టటం నుండి సాక్ష్యం చెప్పించే వరకు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పోలీసులే నిర్ధారిస్తున్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించండి’’ అని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment