Vallabhaneni Vamsi
-
చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి: పేర్నినాని
సాక్షి,విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖలు చేశారు. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభేనేని వంశీతో ఆయన సతీమణి పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం పేర్నినాని మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు మా పార్టీ కార్యకర్తల ఫోన్ నెంబర్స్‌ను సేకరించారు. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను భయపడటం లేదు. గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని? అని ప్రశ్నించారు. చంద్రబాబు బంధువే ఫోన్ ట్యాపింగ్ సూత్రదారి చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి అనదికారికంగా విజయవాడలో రమేష్ ఆసుపత్రి దగ్గర ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాప్ చేసి నేతలను బెదిరించాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. ఎన్ని తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.వల్లభనేనీ వంశీ కేసులో దుర్మార్గంగా పోలీసులువల్లభనేనీ వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పటమట పోలీసులు పని చేస్తున్నారు. 10వ తేదిన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారు. నాపైనా కేసులు సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు పెడతారా? వంశీకి రిమాండ్ విధించే సమయంలో ఎస్సీ,ఎస్టీ కేసుల న్యాయస్థానంలో హాజరు పరచకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించే సమయంలో నేను లేను. అయినా నాపై కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవకు మా ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరారు. లోకేష్ ఇస్తే కాసులకు కక్కుర్తి పడే వ్యక్తి. కొడాలి నాని అరెస్టు చేయిస్తా, పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అంటున్నారు. నేనూ ఆరు నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నాను. మీరు ఏం చేయలేరు’అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఫోన్ ట్యాపింగ్‌లకు నేను భయపడను: పేర్నినాని
-
సత్యవర్ధన్‌పై కేసు పెట్టి.. లొంగదీసుకుని
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు, అరెస్టు వెనుక పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు ఆడించిన నాటకం బట్టబయలైంది. వంశీ అరెస్టుకు రెండు రోజుల ముందే సత్యవర్ధన్‌పై టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి, దాని ఆధారంగా కేసు పెట్టి, దాన్నే బూచిగా చూపించి సత్యవర్ధన్‌ను, అతని కుటుంబ సభ్యులను దాదాపుగా బ్లాక్మెయిల్ చేసినట్లు వెల్లడైంది. దీంతో భయపడిన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పినట్లుగా వంశీపై కేసు పెట్టినట్లు, సత్యవర్ధన్ మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లు బయటపడింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే.. ఒకవేళ నిజంగా వంశీనే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి, బెదిరించి ఉంటే అదే పెద్ద కేసు అయి ఉండేది. టీడీపీ వర్గీయులు సత్యవర్ధన్‌పై కేసు పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. వంశీపై అక్రమ కేసు, అరెస్టు వెనుక కుతంత్రం ఇదీ.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిపై పెట్టిన కేసుతో తనకు సంబంధం లేదని, ఆ ఫిర్యాదు తానివ్వలేదంటూ అప్పటివరకు ఫిర్యాదుదారుగా భావించిన సత్యవర్ధన్ 10న మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇవ్వడం చంద్రబాబు కూటమికి శరాఘాతంలా తగిలింది. వంశీని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయించాలన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు కూటమి ఓ కుతంత్రానికి తెరలేపింది. ఆ మరుసటి రోజునే కొందరు టీడీపీ కార్యకర్తలతో ఆయనపైన ఓ తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. సత్యవర్థన్ రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని, లేకపోతే వంశీకి అనుకూలంగా వాంగ్మూలం ఇస్తానంటూ బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ఆధారంగా 11వ తేదీనే క్రైం నంబరు 84/2025తో కేసు పెట్టారు. వెంటనే సత్యవర్ధన్, ఆయన కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా బెదిరించారు. సత్యవర్ధన్‌పై కేసు నమోదైందని, తాము చెప్పినట్లుగా వంశీకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే ఆ కేసులో రాజీ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. లేకపోతే సత్యవర్ధన్తోపాటు కుటంబ సభ్యులనూ నిందితులుగా చేర్చి అరెస్టు చేసి, ఐదారు నెలలు బయటకు రాకుండా చేస్తామంటూ భయపెట్టారు. దీంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సత్యవర్ధన్ మాట మార్చినట్లు తెలుస్తోంది. సత్యవర్ధన్, కుటుంబ సభ్యులను బెదిరించి, వారితో వంశీపై ఫిర్యాదు చేయించారు. వంశీని హైదరాబాద్‌లో 13వ తేదీ తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొన్నారు. అదే రోజు ఉదయం 7 గంటల తర్వాత సత్యవర్ధన్‌ను విశాఖలో ఆదుపులోకి తీసుకున్నారు. అంటే సత్యవర్ధన్‌ను విచారించి, స్టేట్మెంట్ తీసుకోకుండానే వంశీని అరెస్టు చేసినట్లు తేటతెల్లమైంది. ఆరోజు సాయంత్రం వంశీకి వ్యతిరేకంగా సత్యవర్ధన్‌తో వాంగ్మూలం నమోదు చేయించారు. ఇలా సత్యవర్ధన్‌పై ముందే కేసు పెట్టి, బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ కేసు పెట్టించడం, అతన్ని విచారించకుండానే వంశీని అరెస్టు చేయడం ద్వారా ఇదంతా ప్రభుత్వ పెద్దల కుతంత్రమన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోందన్న వాదన వినిపిస్తోంది. -
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై పొన్నవోలు కామెంట్స్..
-
ఓ వీడియో విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
-
వల్లభనేని వంశీ కేసులో అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. సత్యవర్థన్‌ను వంశీ బెదిరించి దాడి చేశారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఓ వీడియో విడుదల చేశారు. సత్యవర్థన్‌ను బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు. అయితే, మంత్రి చూపిస్తున్న వీడియో ఫిబ్రవరి 11వ తేదీ సీసీటీవీ ఫుటేజ్‌గా నిర్థారణ అయ్యింది. గన్నవరం కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం లేదని.. ఫిబ్రవరి 10వ తేదీనే జడ్జి ముందు సత్యవర్థన్ వాంగ్మూలం ఇచ్చాడు. టీడీపీ కార్యాలయం కేంద్రంగానే కుట్రలు జరిగినట్లు మంత్రి ప్రెస్‌మీట్ తేల్చినట్లయింది. దీంతో వంశీని కుట్రపూరితంగా కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.కస్టడీ పిటిషన్‌పై విచారణకాగా, వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటి(గురువారం)కి వాయిదా వేసింది. దర్యాప్తు కోసం మొబైల్ , బ్లాక్ కలర్ క్రెటా కారును స్వాధీన పరచాలని పోలీసులు కోరారు. విచారణ తర్వాత కస్టడీకి ఇవ్వాలో లేదో న్యాయమూర్తి తీర్పునివ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి సంబంధం లేదని ఆయన సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్లో వంశీ పేర్కొన్నారు.వంశీకి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు..వంశీ కేసులో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారని పొన్నవోలు తెలిపారు. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.‘‘సీన్ రీకన స్ట్రక్ట్ కోసం సత్య వర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారు. కారుకి, నాకు సంబంధం లేదని అఫిడవిట్లో వంశీ తెలిపారు. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉంది. కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తే అతనిపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఎవరిని వదలను.. సోషల్ మీడియా ట్రోల్ పై వంశీ భార్య వార్నింగ్
-
టీడీపీ కుట్రలు బట్టబయలు
-
గన్నవరం ఘటనలో పాపం ఎవరిది?
సాక్షి,అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సత్యమేవ జయతే పేరుతో పోస్ట్ చేసింది. ‘గన్నవరం ఘటనలో పాపం ఎవరిది? సీఎం చంద్రబాబు కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ స్టేట్మెంట్’ అంటూ వాంగ్మూలం రిపోర్ట్ కాపీని ట్యాగ్ చేసింది. సత్యవర్థన్ స్టేట్మెంట్లో ఏమున్నదంటే...‘టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వాళ్లు ఎవరో నాకు స్పష్టంగా తెలియదు. కానీ.. ఒక రిపోర్ట్ తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం నన్ను సంతకం చేయమని చెప్పాడు. నేను చేశాను.అందులో ఏముందో, ఎవరి పేర్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు. కేసులు, కోర్టుల చుట్టూ నేను తిరుగుతుండటంతో మా కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు’ అంటూ రాశారు. ఆధారాలతో కూడిన ఈ స్టేట్మెంట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పన్నిన కుట్రలు, గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులకు 2025 ఫిబ్రవరి 10న కోర్టు ముందు సత్యవర్థన్ ఇచ్చిన స్టేట్మెంటే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పేర్కొంది.ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని సత్యవర్థన్ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిపింది. -
అభిమాన నేత కోసం పోటెత్తిన జనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభిమాన నేత వస్తున్నారని తెలిసి విజయవాడ గాంధీనగర్ జనంతో పోటెత్తింది. అక్రమ కేసులో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలుసుకొనేందుకు గాంధీనగర్‌లోని జైలు వద్దకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు బెజవాడ మొత్తం తరలివచ్చిందా అన్నంతగా జనం వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఉదయం 10 గంటలకే గాంధీనగర్ కిక్కిరిసిపోయింది. దీంతో పోలీసులు జైలు ప్రాంగణానికి అన్ని వైపులా 100 మీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు. అయినా అభిమాన నేత వైఎస్ జగన్ వచ్చే వరకు బారికేడ్ల ముందే జనం నిరీక్షించారు. ఆయన జైలు పరిసరాల్లోకి చేరుకోగానే అభిమానులు, మహిళలు జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకురికారు. బారికేడ్లను తోసుకొని జైలు ప్రాంగణానికి నలువైపులా ఉన్న దారుల్లోకి చొచ్చుకొచ్చారు. ఊహించనంతగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, జగన్ అభిమానులు రావడంతో పోలీసులు వారిని నియంత్రించలేక చేతులెత్తేశారు.వైఎస్ జగన్ వాహనంలో నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేయగానే కేరింతలు కొట్టారు. వంశీతో ములాఖత్ అనంతరం తిరిగి వెళ్లే సమయంలోనూ జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు తోసుకురావడంతో వాహనం ముందుకు కదలడం కూడా కష్టంగా మారింది. ఓ దశలో జగన్ సెక్యూరిటీ కూడా వారిని నియంత్రించడానికి తీవ్రంగా కష్ట పడాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వారందరినీ ఓపిగ్గా పలకరిస్తూ ముందుకు కదిలారు. -
వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు కేసులో నిజాలు ఇవిగో..
విజయవాడ: వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త నిజాలను బయటపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రను బహిర్గతం చేస్తూ.. సత్యవర్థన్ వాంగ్మూలాన్ని వైఎస్సార్ సీపీ విడుదల చేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఆధారాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. ‘Truth Bomb’ పేరుతో వంశీ అక్రమ అరెస్టులో నిజాలు ఇవిగో అంటూ వైఎస్సార్ సీపీ ఆధారాలను విడుదల చేసింది. వంశీ అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు చేసిన కుట్రలతో పాటు, గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులకు సంబంధించిన ఆధారాలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్ మెంట్ అందుకు నిదర్శనంగా పేర్కొంది. ఫిబ్రవరి 10 వ తేదీన సత్యవర్థన్ ఏదైతే స్టేట్ మెంట్ ఇచ్చాడో దాన్ని విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని సత్యవర్థన్ కోర్టుకు చెప్పిన స్టేట్ మెంట్ ను వైఎస్సార్ సీపీ బహిర్గతం చేసింది.💣 Truth Bomb 💣వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు- గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు- కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం- చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0— YSR Congress Party (@YSRCParty) February 18, 2025 -
వంశీ కేసులో బట్టబయలైన టీడీపీ పన్నాగం
విజయవాడ: వైఎస్సార్ సీపీ నేత వల్లభనేని వంశీ కేసులో టీడీపీ-పోలీసుల పన్నాగం బట్టబయలైంది. వంశీ కేసులో తప్పుడు సాక్ష్యం ఇచ్చానని కోర్టుకు చెప్పిన సత్యవర్థన్ పై కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర తేటతెల్లమైంది. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని సత్యవర్థన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో టీడీపీ కుట్ర పూరిత రాజకీయం మరొకసారి బట్టబయలైంది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్యవర్థన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్థన్ని బెదిరించేందుకు కేసు నమోదు చేశారు. ఈ నెల 11వ తేదీన వంశీ, సత్యవర్దన్ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ రిజస్టర్ చేశారు పోలీసులు. 84/2025 కేసులో సత్యవర్థన్ ఏ5గా ఉన్నారు. గన్నవరం టీడీపీ నేత మేడేపల్లి రమ ఇచ్చిన ఫిర్యాదుపై కొమ్మాకోట్టు, భీమవరపు రామకృష్ణ, రాజు, సత్యవర్థన్లపై కేసు నమోదు చేశారు. 232, 351(3), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తాజాగా వంశీ బ్యాచ్ బెదిరింపులకు లొంగి 5 లక్షలు తీసుకుని కేసు వాపస్ తీసుకున్నారని రమాదేవి ఫిర్యాదు చేశారు. పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్థన్ వినకుండా కేసు వాపస్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. సత్యవర్థన్ పై కేసు పెట్టి మరుసటి రోజు అన్న తో ఫిర్యాదు చేయించారు పోలీసులు. ఆ ఫిర్యాదు ఆధారంగా వల్లభనేని వంశీ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో వంశీపై కుట్ర పూరితంగా టీడీపీ కేసు పెట్టించిందనే విషయం బహిర్గతమైంది. -
ఇవన్నీ పకోడీ కేసులు.. బాబుపై కొడాలి నాని సెటైర్లు
-
నువ్వు రిటైరైనా సప్త సముద్రాలు దాటినా ఈడ్చుకొస్తాం
-
వంశీకి పరామర్శ.. చంద్రబాబు-లోకేష్‌పై వైఎస్ జగన్ ఫైర్ (ఫొటోలు)
-
ఇదీ బాబు, లోకేష్‌లు మనస్తతత్వం: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం. తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
వంశీ పేరు అసలు లేదు.. పథకం ప్రకారమే ఇరికించారు!
-
వంశీ ఏ తప్పూ చేయలేదు.. ఇది చంద్రబాబు కుట్ర: వైఎస్ జగన్
విజయవాడ, సాక్షి: వల్లభనేని వంశీ అరెస్ట్.. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇదంతా వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారాయన. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు పెట్టిన కేసు ఏంటి?. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్ చెప్పారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్ చేశారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు. దీంతో గన్నవరం టీడీపీ కార్యాలయం(TDP Office Case) తగలబెట్టే ప్రయత్నం చేశారని, ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిందని వంశీపై చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు.. ఆ కార్యాలయం ఎస్సీ,ఎస్టీలకు సంబంధించింది కాదు. వంశీపై చంద్రబాబు కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టించారు. వంశీకి బెయిల్ రాకూడదని చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో నెలల తరబడి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరో 44 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు. వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలుఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతిభద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్లయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది.ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న ఈ వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జ్ గారి సమక్షంలో, జడ్జ్ గారు ఇచ్చిన సమన్లతో, పోలీసుల నుంచి సమన్లు అందుకుని, న్యాయస్థానం ముందుకు వచ్చి జడ్జ్ గారి ముందు హాజరై వాగ్మూలం ఇచ్చారు. ఆ వాగ్మూలంలో ఆయన వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా వంశీపై తప్పుడు కేసును బనాయించారు.ఇదీ కేసు చరిత్ర2023, ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీపై భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తట్టించారు.మర్నాడు ఫిబ్రవరి 20న చంద్రబాబు నేరుగా గన్నవరంకు పట్టాభిని పంపారు. అక్కడ పట్టాభి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని వంశీని తిట్టారు. అ తర్వాత అక్కణ్నుంచి ఒక ప్రదర్శనగా వెళ్లి వైయస్సార్సీపీ కార్యాలయం చేరుకుని అక్కడ, శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా టీడీపీ మూకలు దాడి చేశాయి. పట్టాభి, ఆయన అనుయాయులు సీఐ కనకారావు తల పగలగొట్టారు.ఆ ఘటన తర్వాత పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు మేమే అధికారంలో ఉన్నా ఏకపక్షంగా వ్యవహరించలేదు.పోలీసులు సుమోటోగా తెలుగుదేశం వారితో పాటు వైయస్ఆర్ సీపీ వారిపైనా కూడా కేసులు పెట్టారు. అందులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనా స్థలంలో లేరు.కుట్రపూరితంగా..ఇది జరిగిన రెండు రోజుల తరువాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు మనుషులు పిలిపించారు.అక్కడ సత్యవర్థన్ తో తెల్లకాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఆ ఘటనా స్థలంలో లేరు కాబట్టి.2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ స్టేట్మెంట్ లో కూడా ఎక్కడా వంశీ పేరు లేదు. ఘటన జరిగినప్పుడు తాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని కూడా చెప్పారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసు రీఓపెన్ చేశారు. వంశీపై చంద్రబాబు పెట్టుకున్న ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే, ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా, ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు.అవన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో, ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకూడదని చంద్రబాబు కుట్రను ఇంకా ముందుకు తీసుకువెళ్లారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయినా తప్పుడు కేసు పెట్టారు.ఆ ఆఫీస్ చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. ఆయన ఎస్సీ. అలా వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి, బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ఇది.మొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలలు తరబడి వైయస్ఆర్ సీపీ వారిని వేధించాలని ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు.చంద్రబాబు, లోకేష్ కుట్రఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్థన్ మేజిస్ట్రేట్ ముందు హాజరై వాగ్మూలం ఇస్తే, మిగతా వారికి కూడా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్రపన్నారు.పలు సమన్ల తర్వాత 2025 ఫిబ్రవరి 10న జడ్జిగారి ముందు హాజరైన సత్యవర్థన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో చంద్రబాబుగారు, లోకేష్‌కు మనశ్శాంతి లేకుండా పోయింది. మళ్లీ వీరు పోలీసులకు కలిసి కుట్రపన్నారు.సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ, ఆ మర్నాడే 11న విజయవాడ, పటమట పీఎస్‌లో సత్యవర్థన్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి, దాన్ని వారి కుటుంబ సభ్యులకు చూపించి, బెదిరించారు.ఆ మర్నాడు ఫిబ్రవరి 12న సత్యవర్థన్ అన్నతో సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని, అతడిని కిడ్నాప్ చేశారని, దీనిని ఎవరో చూసి తమకు చెప్పారంటూ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు.ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 13వ తేదీ తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు.ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అదే రోజు 13వ రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేసి, అందులో వంశీపై చెప్పించారు.అంటే కనీసం ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో.. అతడి స్టేట్మెంట్ నమోదు చేయక ముందే, వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది.దొంగ కేసులకు నిదర్శనంఒక మనిషి తప్పు చేస్తే అతడిని శిక్షిస్తే పోలీసులకు ఒక గౌరవం ఉంటుంది. కానీ నేడు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైలులో పెడుతున్నారు.దీనికి వంశీపై పెట్టిన కేసు ఒక నిదర్శనం.దిగజారిన ప్రజాస్వామ్యం:పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్ఠానాలకు గానూ అన్నింటినీ వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశంకు ఒక్క కౌన్సిలర్ కూడా లేరు.కానీ, నిన్న జరిగిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకోవడం చూస్తే చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి నిదర్శనం. తిరుపతి కార్పోరేషన్లో మొత్తం 49 స్థానాలుంటే, అందులో వైయస్ఆర్సీపీ 48 స్థానాలను, తెలుగుదేశం ఒక స్థానంను గెలుచుకుంది. అటువంటి చోట డిప్యూటీ మేయర్ ఎన్నిక పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం వారు కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ ను గెలుచుకున్నామని చెప్పుకున్నారు. అటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలు వైయస్ఆర్ సీపీ గెలుచుకుంది. తెలుగుదేశం ఒక్కటి కూడా గెలుచుకోలేదు.అలాంటి చోట తెలుగుదేశం పార్టీ వైస్ ఛైర్మన్‌ను ఎలా గెల్చుకుంటుంది? ఇక్కడ దౌర్జన్యం చేసి వైయస్ఆర్ సీపీ కౌన్సిలర్లను తీసుకువెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి తెలుగుదేశం పార్టీ వత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల వాతావరణం వచ్చే వరకు ఎన్నిక జరపరు. పాలకొండలో వైయస్ఆర్ సీపీకి 17 స్థానాలు ఉంటే, టీడీపీకి కేవలం మూడు స్థానాలు ఉన్నాయి. అక్కడ వైస్ చైర్మన్ పదవి వైయస్ఆర్ సీపీకే వస్తుందని ఎన్నికను వాయిదా వేయించారు.పోలీసులూ గుర్తుంచుకొండిపోలీసులను ఇష్టానుసారంగా వాడుకుని ప్రజాస్వామ్యంకు తూట్లు పొడుస్తున్నారు. ఈరోజు ప్రతి పోలీస్ కు చెబుతున్నాను, మీ టోపీల కనిపించే ఆ మూడు సింహాలకు సెల్యూట్ కొట్టండి, కానీ తెలుగుదేశం నాయకులకు కాదు. వారు చెప్పినట్లు చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేస్తే ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాను.రేపు మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులను బట్టలు ఊడదీసి నిలబెడతామని తెలియచేస్తున్నాను. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేప్పుడు సీఐ అన్నడంట. నేను ఒకటిన్నర సంవత్సరాల తరువాత రిటైర్ అవుతాను అని. రిటైర్ అయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా, మొత్తం అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందు నిలబెడతాం. బట్టలు ఊడదీస్తాం.– న్యాయం జరిగేట్టుగా చేస్తామని ప్రతి ఒక్కరికీ తెలియచేస్తున్నాను. ఈ మాదిరిగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రజలు, దేవుడు వీరిని శిక్షించే కార్యక్రమం జరుగుతుందని మరోసారి చెబుతున్నాం. – అన్యాయంలో భాగస్వాములు కావొద్దు. మీ టోపీలపై ఉన్న సింహాలను గౌరవించండి. వాటికి సెల్యూట్ కొట్టండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి అధికారికి తెలియచేస్తున్నాం.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..ప్రతి కేసూ ఇల్లీగల్ప్రజాస్వామ్యం కూలిపోతోందనేందు ఇవ్వన్నీ నిదర్శనం. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తున్నారు. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.అసలు ఎవరు, ఎవరిని బెదరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ వీరే. పారిశ్రామికవేత్తలను, రాజకీయనేతలను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదరించి, అవతలి వారు బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు.ఇవ్వన్నీ ఊరికే పోవు. ఇవ్వన్నీ కూడా వీరికి చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్తితి అతి దారుణంగా తయారవుతుంది.వంశీ ఎందుకు టార్గెట్ అంటే..తన సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తి (వంశీ) ఎదుగుతున్నాడని.. అతడు తన కంటే, లోకేష్ కంటే గ్లామరస్‌గా ఉన్నాడని చంద్రబాబుకు కోపం. అలాగే కొడాలి నానిపైనా చంద్రబాబుకు జీర్ణించుకోలేని ఆక్రోశం. ఇంకా అవినాశ్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు. ఇదీ చంద్రబాబు మనస్తత్వం.కేవలం తాను, తన కుమారుడు మాత్రమే ఆ సామాజికవర్గంలో లీడర్లుగా ఉండాలని చంద్రబాబు మాట. అందుకే వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలేస్తారు.అదో మాఫియా రాజ్యంచంద్రబాబు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి చేసేది. ఇది ఒక మాఫియా సామ్రాజ్యం.చంద్రబాబును సీఎంను చేయడం కోసం, ఆయనకు ఓట్లు వేయించడం కోసం ఆ మాఫియా సామ్రాజ్యం తయారైంది.వారి సామాజికవర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్. వారిపై బురద చల్లడం. వారిపై ట్రోలింగ్ చేయించడం చేస్తున్నారు. ఇవ్వన్నీ చంద్రబాబు, లోకేష్ నైజానికి అద్దం పడుతున్నాయి. -
LIVE:వంశీ అరెస్ట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 18న (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు.కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో అరెస్టయి విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ పరామర్శిస్తారు. -
వంశీ అరెస్ట్ ముందస్తు వ్యూహమే
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను అరెస్ట్ ముందస్తు వ్యూహమే. ఆయన్ని∙అరెస్టు చేయాలని, జైల్లో పెట్టాలని ముందుగానే కొందరు తీసుకున్న నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయకుండానే కేసులు పెట్టారు. ఇదంతా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా కేసుల్లో ఇరికించేందుకు పన్నిన కుట్ర మాత్రమే.వీటన్నింటినీ పరిశీలించి బెయిల్ మంజూరు చేయండి’ అని వంశీ తరపున దాఖలు చేసిన బెయిల్పిటిషన్లో న్యాయవాది తానికొండ చిరంజీవి కోరారు. ‘రెండేళ్ల క్రితం గన్నవరంలో జరిగిన ఓ ఘటనపై సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీమోహన్, మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదును ఈ నెల పదో తేదీన న్యాయమూర్తి ఎదుట వాపసు తీసుకున్నాడు. అతన్ని వంశీ బెదిరించి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేశాడంటూ అతని సోదరుడు కిరణ్ ఈ నెల 12న పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు చేసిన కిరణ్‌ను, బాధితుడిగా అందులో పేర్కొన్న సత్యవర్ధన్‌ను విచారించకుండానే అదే రోజు హడావుడిగా కిడ్నాప్, ఎక్స్ట్రాక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం విజయవాడ పోలీసులకే చెల్లింది. అదే రోజు (12వ తేదీ) రాత్రే విజయవాడ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ ఇంటి వద్ద రాత్రంతా పహారా కాసి 13వ తేదీ తెల్లవారుజామునే బెడ్రూంలో ఉన్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్‌కు తెచ్చారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి రాత్రి 9 గంటల వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టారు. ఆ తరువాత న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇదంతా కొందరు పెద్దల మెప్పు కోసం పోలీసులు పడిన ఆరాటం మాత్రమే.పోలీసుల అభియోగంలో ఎలాంటి వాస్తవం లేదు. సత్యవర్థన్‌తో పోలీసులు బలవంతంగా సెకండ్ ఏసీఎంఎం కోర్టులో వాంగ్మూలం చెప్పించినట్లు అనుమానాలు ఉన్నాయి. సత్యవర్ధన్‌ను బెదిరించేందుకు వంశీ, అతని అనుచరులు ఓ వ్యక్తిని పురమాయించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే నిజమైతే అసలైన ఆ నిందితుడు ఎక్కడున్నాడు? ఈ కేసు పూర్తిగా కల్పితమనడానికి ఇదే నిదర్శనం. కొన్నేళ్లుగా వంశీ అనారోగ్యంతో, టెయిల్ బోన్ గాయంతో బాధపడుతున్నారు.కరోనా సమయం నుంచి బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయి. నేలపై కూర్చోవడం, పడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందువల్ల ఆయనకు వెంటనే బెయిల్ ఇవ్వండి’ అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈలోగా ఆయనకు టాయిలెట్, బెడ్, ఇంటి నుంచి ఆహారం, మందుల సౌకర్యం కల్పించాలని కోరారు. జైల్లోని బ్యారక్‌లో వంశీని ఒంటరిగా ఉంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, రూమ్‌లో అసిస్టెంట్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ జ్యుడిíÙయల్ రిమాండ్‌లో ఉన్న వల్లభనేని వంశీమోహన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ పోలీసులు కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వంశీ, అతని అనుచరుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, పది రోజులు కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. -
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కీలక అంశాలు
-
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయం కల్పించాలని కోరారు. మరోవైపు.. ఇప్పటికే వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.తన బెయిల్ పిటిషన్లో వంశీ కీలక అంశాలను వెల్లడించారు. బెయిల్ పిటిషన్లో భాగంగా వంశీ..‘తనపై రాజకీయ, వ్యక్తిగత కక్షతో కేసులు నమోదు చేశారు. సత్య వర్ధన్‌ను తాను కిడ్నాప్ చేశాననేది అక్రమంగా పెట్టిన కేసు. తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకి వచ్చినట్టు సత్య వర్ధన్ కోర్టుకు తెలిపాడు. గతంలో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు కోర్టు ఇస్తే సత్య వర్ధన్ వచ్చారు. కేసుతో తనకు సంబంధం లేదని తనను ఎవరూ తిట్టలేదని పోలీసులకు కూడా గతంలోనే సత్య వర్ధన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అదే విషయాన్ని మళ్లీ కోర్టుకు సత్య వర్ధన్ తెలిపారు తప్ప నా ప్రమేయం లేదు’ అని తెలిపారు.ఇక, మెడికల్ గ్రౌండ్స్‌లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మరో పిటిషన్ దాఖలు చేశారు. వెన్నుపూస నొప్పి కారణంగా జైలులో తనకు బెడ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని, ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే జైలు అధికారులతో తనకు వెన్నుపూస నొప్పి ఉందని మంచం కావాలని జైలు అధికారులను కోరారు. జైలు అధికారులు కోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించడంతో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. -
వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాగోలేకుంటే కనీసం మందులు కూడా ఇవ్వరా..?
-
వంశీ అరెస్ట్ పై మనోహర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
-
తప్పుడు కేసులతో పోలీసులు వంశీని వేధిస్తున్నారు
-
సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన భార్య...
-
Jr NTRపై పగ.. వల్లభనేని వంశీ అరెస్ట్.. నెక్స్ట్
-
సత్యవర్ధన్ ఎక్కడ..?
-
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది: భూమన
-
వంశీ అక్రమ అరెస్ట్ బరితెగింపు.. దర్యాప్తు మార్గదర్శకాల ఉల్లంఘన
-
వల్లభనేని వంశీపై కేసులో కుట్రకోణం: మనోహర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో కచ్చితంగా కుట్ర కోణం ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు వెనుకుండి నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. సాంకేతికంగా చూస్తే హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్‌ను విచారించలేదని పేర్కొన్నారు. టీడీపీ కక్షసాధింపులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దాదాపు 90 మందిని అక్రమంగా ఇరికించారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తారీఖున కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చారు.కేసు వెనక్కి తీసుకోవాలని నిన్ను ఎవరైనా బెదిరించారా అని జడ్జి ప్రశ్నించినప్పుడు కూడా నా అంతట నేనే ఇష్టపూర్వకంగానే వచ్చానని సత్యవర్ధన్ చెప్పిన మాటలను జడ్జి రికార్డు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలని భావించిన తెలుగుదేశం నేతలు సత్యవర్ధన్ వాగ్మూలంతో ఉలిక్కిపడ్డారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రలోభాలు పెట్టారు. ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ సోదరుడితో నా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయించి మరో కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ వెళ్లి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ అడిగితే చిత్తు పేపర్ మీద అక్కడిక్కడే పెన్నుతో రాసి ఒక నోటీస్ ఆయన చేతుల్లో పెట్టారు.విశాఖలో సత్యవర్థన్‌ను కాపాడామంటూ కొత్త డ్రామాఫిబ్రవరి 13వ తేదీన సత్యవర్ధన్‌ను విశాఖలో కాపాడామని పోలీసులు కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ సీసీ టీవీ వీడియో చూస్తే సత్యవర్ధన్‌ను బెదిరించి పోలీసులే లాక్కుని వెళ్తున్నట్టు ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే సత్యవర్ధన్‌ను పోలీసులు విశాఖ నుంచి తీసుకొచ్చారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయాలి. కానీ సాంకేతికంగా చూస్తే సత్యవర్ధన్‌ను విచారించకుండానే వంశీకి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇదీ చదవండి: అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే పోలీసులు విశాఖలో సత్యవర్ధన్‌ను పట్టుకొచ్చారని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్‌గా వంశీని కేసులో ఇరికించడానికే టీడీపీ పన్నాగం పన్నింది. ముందుగా అనుకున్నట్టుగా నాన్ బెయిలబుల్, జీవితఖైదుకు సంబంధించిన సెక్షన్లతో పోలీసులు కేసులు సిద్దం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వంశీని విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు, నోటీస్ ఇవ్వడం తప్ప.. ఏ కేసులో, ఎందుకు తీసుకొచ్చింది, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. నాలుగైదు స్టేషన్లలో తిప్పి రాత్రి 11.45గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చి, 12 గంటలకు ఎఫ్ఐఆర్ రాశారు. ఈ మధ్యలో వంశీని ఎలా ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు, లోకేష్, డీజీపీ చర్చించుకున్నట్టుగా అర్థం అవుతోంది.చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే..ఈ తతంగమంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగానే పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అధికారులుగా ఎవరుండాలి, దర్యాప్తు చేసి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరెవర్ని సాక్ష్యులుగా తీసుకోవాలి, ఎవర్ని కేసుల్లో ఇరికించాలి, ఇలాంటివన్నీ కూటమి నాయకులే చెప్పడం దానిని పోలీసులు తుచ తప్పకుండా అమలు పరచడం కనిపిస్తోంది.ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పోలీసులకు ఇదే పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతి పరులను అక్రమ కేసులతో వేధించి జైలు పాలు చేయడం, వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేస్తున్నారు. న్యాయస్థానాలంటే గౌరవం లేదుచట్టాలన్నా, న్యాయస్థానాలన్నా కూటమి ప్రభుత్వానికి భయం కానీ, గౌరవం కానీ లేదని ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో పోలీస్ స్టేషన్లకు చెందిన సీసీ టీవీ ఫుటేజ్‌లు అడిగితే ఇవ్వనందుకు సాక్షాత్తు హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఎప్పుడడిగినా ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని, మా ఆదేశాలను ధిక్కరిస్తే డీజీపీనే కోర్టుకు రప్పిస్తామని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం లెక్క చేయడం లేదంటే న్యాయస్థానాల మీద వారికున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దెందులూరులో ఒక పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన కారుకు అడ్డం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోపాటు ఆయన డ్రైవర్, ఇతర అనుచరుల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. ఎమ్మెల్యేనే దారుణంగా దుర్భాషలాడి తిరిగి ఆతనే వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టించాడు. నిందితులే బాధితులపై కేసులు పెడుతున్న దారుణాలు నిత్యం జరుగుతున్నాయి.తాము అనుసరిస్తున్న విధానాలు కరెక్టో కాదో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మేం చేయబోయే పోరాటంలో పోలీసులే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. డీజీపీ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు తప్పు చేసింది ఎవరైనా వదిలే ప్రసక్తే ఉండదు. చీఫ్ సెక్రటరీ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందర్నీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం. -
వంశీ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ జగన్ ఫైర్
-
అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi ) అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై తాజాగా ఆయన స్పందించారు. .. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్(Kutami Prabhutvam) వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా?. మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ‘నాకు వీళ్ల నుంచి ప్రాణ హాని ఉంది..’ జడ్జితో వల్లభనేని వంశీ.. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి(Kotaru Abbaya Chowdary)పై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి.. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి?. తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? చంద్రబాబుగారూ! .. ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు(Illegal Arrests) దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం అని ఎక్స్‌లో వైఎస్ జగన్(YS Jagan) పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం -
పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉంది: వల్లభనేని వంశీ
-
రెడ్ బుక్‌తో రాక్షస పాలన.. వల్లభనేని వంశీ అరెస్ట్ పై కొండా రాజీవ్ కామెంట్స్
-
పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది : వల్లభనేని వంశీ
సాక్షి,విజయవాడ: పోలీసుల (Andhra Pradesh Police) నుంచి తనకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్ విషయంలో పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతీక్షణం అడ్డుకున్నారు. అరెస్ట్ నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు’అంటూ న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా, విజయవాడ (Vijayawada) జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు, వల్లభనేని వంశీ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదని వాపోయారు. గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్‌పై ఆయన సతీమణి పంకజశ్రీ స్పందించారు.‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు. -
వల్లభనేని వంశీకి 14రోజుల రిమాండ్.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రియాక్షన్
-
వల్లభనేని వంశీకి రిమాండ్.. భార్య పంకజశ్రీ రియాక్షన్
-
లోకేష్ ప్లాన్ పల్టీ కొట్టిందా?.. రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పేజీ ఓపెన్..
-
వల్లభనేని వంశీ అరెస్టు.. 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్/పటమట/కృష్ణలంక (విజయవాడ తూర్పు)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం): కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఉదయం ఏడు గంటలకు అయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతకుముందు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడీసీపీ రామకృష్ణ తన బృందంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వంశీ కోసం గాలింపు చేపట్టారు. రాయదుర్గం మైహోం భుజాలోని తన ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకెళ్లి వంశీకి బీఎన్ఎస్ 47 (1) నోటీసును అందించి ఉన్నపళంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఉంచి, అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె. దామోదరరావుతోపాటు లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ జి. రామకృష్ణ రాత్రి తొమ్మిది గంటల వరకు వంశీని ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్ (35), కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నిమ్మ లక్ష్మీపతి (35)లను కూడా పటమట పోలీసులు గురువారం రాత్రి అరెస్టుచేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం.. వంశీని కోర్టులో హాజరుపరచగా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా..ఇక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరితెగిస్తోందనడానికి వంశీ అరెస్టే ఉదాహరణ. ఎందుకంటే.. ఏకంగా న్యాయమూర్తి ఎదుట స్వచ్ఛందంగా 164 సీఆర్పీసీ కింద నమోదుచేసిన వాంగ్మూలాన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్రమ కేసులకు టీడీపీ కూటమి సర్కారు తెగిస్తోంది. అసలు వంశీపై అక్రమ కేసుకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్న గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ఫిర్యాదే అబద్ధమని కోర్టు సాక్షిగా ఇటీవల తేలిపోయింది. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని ఫిర్యాదు చేశారని.. అసలు ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని సత్యవర్థన్ సాక్షాత్తూ న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. వంశీ తనను బెదిరించనేలేదని.. తనపై దౌర్జన్యం చేయలేదని స్వచ్ఛందంగా వెల్లడించి తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇది అవమానంగా భావించి ఎలాగైనా వంశీని అరెస్టుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సుదీర్ఘ చర్చల అనంతరం సత్యవర్థన్ కిడ్నాప్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పోలీసులు సైతం కోర్టులోని పరిణామాలన్నింటినీ బేఖాతరు చేస్తూ రెడ్‌బుక్ కుట్రనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సత్యవర్థన్ తమ్ముడు కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలతో మరో అబద్ధపు ఫిర్యాదును ఈ నెల 12న ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు తదితరులు తన సోదరుడిని కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకునేలా బెదిరించి, భయపెట్టారని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పటమట పోలీసులు వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. అంటే.. తమకు అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది వంశీ అరెస్టు ద్వారా స్పష్టమవుతోంది.కాగా, వంశీ అరెస్టుపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో గురువారం హైడ్రామా నడిచింది. హైదరాబాదు నుంచి వంశీని పటమట స్టేషన్‌కు తీసుకొస్తారని పోలీసులు లీకులు ఇవ్వడంతో మీడియా అంతా అక్కడికి చేరుకుంది. చివరికి భవానీపురం స్టేషన్‌కు, అక్కడ వంశీని కారుమార్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రైటర్, ఇతర సిబ్బంది కేసుకు సంబంధించిన పత్రాలను రహస్యంగా తరలించారు. వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు వల్లభనేని వంశీకి రిమాండ్..14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారి చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్ స్టేట్మెంట్ రికార్డు..మరోవైపు ముదునూరు సత్యవర్థన్ గురువారం సాయంత్రం పటమట పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను పోలీసులు రహస్యంగా స్టేషన్లో ఉంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో సత్యవర్థన్ స్టేట్మెంట్ను రికార్డు చేయటం చర్చనీయాంశంగా మారింది.మాజీమంత్రి పేర్ని నాని హౌస్ అరెస్టు..వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని పోలీసులు గురువారం హౌస్ అరెస్టుచేశారు. తెల్లవారుజామున ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుని బయటికెళ్లేందుకు వీల్లేదని నోటీసులిచ్చారు.ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్‌గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్‌పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను. – పంకజశ్రీ, వంశీ సతీమణిచంద్రబాబు ఒత్తిడితోనే వంశీ అక్రమ అరెస్టుమాజీ మంత్రి అంబటిసీఎం చంద్రబాబు ఒత్తిడితోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వంశీ అక్రమ అరెస్టు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు అంబటి రాంబాబు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కూడిన వైఎస్సార్సీపీ బృందం గురువారం అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. అయినా డీజీపీ కలవలేదు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ తాను ఆ ఫిర్యాదు చేయలేదని, సాక్షి సంతకం తీసుకొని, దానితో వంశీపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారంటూ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ కుతంత్రాలు బట్టబయలయ్యాయని చెప్పారు. సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ అతని సోదరుడితో ఫిర్యాదు చేయించారని తెలిపారు. వంశీని పోలీసులు క్షణాల్లో అరెస్ట్ చేశారన్నారు. బుధవారం ఓ వివాహ వేడుకలో దెంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన రచ్చలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పైనా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.తప్పుడు కేసులతో వంశీపై కక్షసాధింపువల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలి. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదుచేశారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం ఒక నిదర్శనం. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి. – మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేఅరెస్టు చేయొద్దని కోర్టు చెప్పినా..వల్లభనేని వంశీని అరెస్టుచెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా, పోలీసులు వాటిని ధిక్కరించి మరీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పిచ్చి భ్రమల్లో నుంచి కూటమి నాయకులు బయటకు రావాలి. నియంత పాలన ఎంతోకాలం సాగదు. అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. – జూపూడి ప్రభాకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితప్పుడు ఫిర్యాదు చేయించి..ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోంది. వంశీపై రాజకీయ కక్ష సాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వంశీ కేసు పూర్తిగా నీరుగారిపోతోందని చంద్రబాబు, లోకేశ్ కక్షపూరితంగా సత్యవర్థన్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి వారితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఇలాంటి దుర్మార్గ విధానాలకు ప్రభుత్వ పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? – వేల్పుల రవికుమార్,వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
‘డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చారు.. కానీ వచ్చాక కలవలేదు’
మంగళగిరి: వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు. -
రూల్స్ కూడా తెలియకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా అరెస్ట్
-
వల్లభనేని వంశీ అరెస్ట్ పై భార్య పంకజశ్రీ ఫస్ట్ రియాక్షన్
-
వంశీ అరెస్టుపై జూపూడి ఫైర్
-
నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదు: వంశీ భార్య
సాక్షి, విజయవాడ: తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. పోలీసులు వివరాలు ఏమీ చెప్పడంలేదని.. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పడం లేదని.. ఎఫ్ఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుతో కలిసి వల్లభనేని వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో వంశీ భార్య, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. తమను పోలీస్‌స్టేషన్ లోపలికి రానివ్వడం లేదని.. తన భర్తను చూసేందుకు లోపలికి పంపాలని పంకజశ్రీ కోరారు. చివరికి వంశీ భార్యను మాత్రమే స్టేషన్ లోపలికి పోలీసులు పంపించారు.వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు: జగన్మోహన్రావువైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారని మండిపడ్డారు. లోకేష్ చెప్పడం వల్లే అక్రమ కేసులు బనాయించారని.. ఇలాంటి విష సంస్కృతిని అందరూ ఖండించాల్సిందేనన్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టులన్నారు. రాజ్యాంగ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని జగన్మోహన్రావు అన్నారు.వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదు: లాయర్ చిరంజీవిసుప్రీంకోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని వంశీ తరఫు లాయర్ చిరంజీవి అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ చెల్లదని.. ఆయనను కావాలనే అరెస్ట్ చేశారన్నారు. ఏం కేసులు పెట్టారో తెలీదు. పోలీస్ స్టేషన్లో వంశీ లేరని అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు ఫిర్యాదు చేశారు? కేసు ఎందుకు పెట్టారో చెప్పడం లేదు. వంశీ లాయర్నని చెప్పినా లోపలకి అనుమతించడం లేదు. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో నడుస్తోంది. వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పుడు కేసులతో వంశీని ఎవరూ ఏం చేయలేరు’’ అని అడ్వకేట్ చిరంజీవి అన్నారు. -
ఏపీలోకి ఎంటరైన పోలీసు వాహనాలు
-
లోకేష్ ఆదేశాలతో వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు
-
సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?: జూపూడి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేరు. వంశీ 24 గంటల్లో బయటకు వస్తారు. కుట్రలతో చేస్తున్న మీ చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నేతలు గూండాల్లా బరి తెగిస్తున్నారు. వైఎస్సార్పీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారు. సత్యవర్థన్ నిజం చెప్పినా తప్పుడు కేసులు పెడుతున్నారు. సత్యవర్థన్ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్ ఏంటి?’’ అంటూ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు.‘‘తనతో తప్పుడు కేసు పెట్టించారని సత్యవర్ధన్ కోర్టులో జడ్జి ముందే చెప్పాడు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. కోర్టులు, చట్టాలు అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. వంశీ అరెస్టు అన్యాయం, అక్రమం. టీడీపీ ఆఫీసుపై దాడి చేసింది వారి పార్టీ కార్యకర్తలే. కానీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. సత్యవర్ధన్ ఎస్సీ అని ఆయన్ను వేధిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి వెయ్యి గొంతులు బయటకు వస్తాయి. అరెస్టులతో వైఎస్సార్సీపీ భయపెట్టలేరు. పాలకులు చట్టబద్దంగా వ్యవహరిస్తే మంచిది. అధికార దుర్వినియోగం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. చట్టమే ఉరితాడుగా మారి మీ గొంతులకు బిగిస్తుంది జాగ్రత్త. వంశీతో అరెస్టుతో కూటమి ప్రభుత్వం అధ:పాతాళానికి పోయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసు అంటే కూడా పోలీసులకు లెక్క లేకుండా పోయింది. బాధితుల మీదనే తిరిగి కేసులు పెట్టే దారుణమైన పరిస్థితి ఏర్పడిందిఅధికారం లేనందున వైఎస్సార్సీపీ నేతలంతా లొంగిపోతారనుకోవటం అవివేకం. అక్రమ కేసులు పెట్టటం నుండి సాక్ష్యం చెప్పించే వరకు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పోలీసులే నిర్ధారిస్తున్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించండి’’ అని జూపూడి ప్రభాకర్ హితవు పలికారు. -
ప్రతీకారంతో అరెస్టులు.. వల్లభనేని వంశీ అరెస్ట్ పై భూమన రియాక్షన్
-
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పోలీసులు
-
వంశీ అరెస్ట్ వెనుక కుట్రకోణం?
-
వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
-
వల్లభనేని వంశీ పీఏ రాజు అరెస్ట్
-
టార్గెట్ వంశీ.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపులు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో సమాధానం మాత్రం చెప్పడం లేదు.గన్నవరం వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ మండిపడింది. కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పీఎస్ వద్ద పోలీస్ అంక్షలు విధించారు. స్టేషనలోకి ఎవరూ వెళ్లకుకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు కోసమే అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గన్నవరానికి చెందిన 10 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మీరు కేసులు పెట్టినంత మాత్రాన బెదిరిపోమని లోకేష్ గుర్తుంచుకోవాలి. రెడ్ బ్యాంక్ రాజ్యాంగాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మీకు ప్రజలు చరమగీతం పలుకుతారు. మీకు చేతనైంది.. చేసుకోండి. దానికి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదు’’ అంటూ దేవభక్తుని చక్రవర్తి హెచ్చరించారు.తెల్లవారుజామున 5 గంటలకు మా నాన్నను అరెస్ట్ చేశారు. ఏదో గ్యాంగ్ స్టర్‌ను అరెస్ట్ చేసినట్లు ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎంపీపీ అనగాని రవి కుమారుడు ధ్వజమెత్తారు. 45 ఏళ్లుగా మా తాత, మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోలేదు. ఇంత కక్షపూరిత.. దౌర్జన్య వైఖరి ఎప్పుడూ లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంపై కంటే అభివృద్దిపై దృష్టి పెడితే బాగుంటుంది. ఏ కేసు పెట్టారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడం కోసం కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్టులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను భయపెట్టలేరని ఆయన అన్నారు.కనీస సమాచారం లేకుండా తెల్లవారు జామున అక్రమంగా అరెస్ట్ చేశారని.. అనగాని రవికి ఆరోగ్యసమస్యలున్నాయని అనగాని రవి మేనకోడలు అన్నారు. మందులు ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోవడం లేదు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైకోర్టులో వంశీకి ఊరట
-
మళ్లీ అదే పచ్చ ఉత్సాహం!
అమరావతి, సాక్షి: టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయం హత్యలు, దాడులతోనే ఆగిపోవడం లేదు. అక్రమ కేసులు పెట్టైనా సరే వైఎస్సార్సీపీ నేతల్ని కటకటాలపాలు జేయాలని ప్రయత్నిస్తోంది. తాజాగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు దుష్ట రాజకీయానికి ఎల్లో మీడియా తోడైంది.వల్లభనేని వంశీ షయంలో టీడీపీ అనుకూల మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ పేరును పోలీసులు ఏ-71 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. ఎల్లో మీడియా ఛానెల్స్, వెబ్‌సైట్స్ మాత్రం రెండ్రోజులుగా మరోలా హడావిడి చేస్తున్నాయి. ఒకానొక దశలో వంశీపై తప్పుడు ప్రచారానికి సైతం దిగాయి. ఇంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రమంతా చూసింది. ఈవీఎం కేసులో ఆయనకు న్యాయస్థానం ఊరట ఇచ్చినప్పటికీ.. అక్రమ కేసులు బనాయించి మరీ ఆయన్ని జైలుకు పంపేదాకా వదల్లేదు. అయితే.. ఆ టైంలోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదీ చదవండి: ఇంతకీ మంత్రి లోకేష్ ఎక్కడ?ఇక ఇప్పుడు వంశీ.. హైదరాబాద్‌లో ఉన్నారని ఓసారి, అమెరికా వెళ్లిపోయారని మరోసారి, ఏకంగా అరెస్ట్ అయ్యారంటూ ఇంకోసారి.. కథనాలు ఇచ్చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఆ వార్తలన్నింటినీ ఖండించారు. దీంతో ప్రత్యేక బృందాలతో ఆయన కోసం గాలింపు కొనసాగుతోందంటూ మళ్లీ కథనాలు మొదలుపెట్టాయి. అంతేకాదు.. ఏ 71గా ఉన్న ఆయన్ని ఈ కేసులో ఏ1గా మార్చేయబోతున్నారంటూ పోలీసుల తరఫున నిర్ణయాల్ని కూడా భవిష్యవాణి తరహాలో ప్రచురిస్తున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగిలేదు. వంశీ కుటుంబ సభ్యులు, అనుచరులను సైతం ఇందులోకి లాగుతూ అడ్డగోలు రాతలు రాస్తున్నాయి. -
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. గత రాత్రి సర్నాల రమేష్, ఈ రోజు ఉదయం యూసఫ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. వంశీ అరెస్ట్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. -
ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన
-
సీసీటీవీలో బయటపడ్డ టీడీపీ రౌడీలు దాడి..
-
టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
సాక్షి, కృష్ణా: ఏపీలో ఎన్నికల సందర్భంగా పచ్చ బ్యాచ్ రెచ్చిపోయింది. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై భౌతిక దాడులకు దిగారు. కాగా, ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు ఏడుకొండలు అరాచకం సృష్టించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిందన్న కారణంగా వేముల సంధ్యా రాణి అనే ఓటర్ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో సంధ్యా రాణి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న పిన్నమనేని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యా రాణిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ పరామర్శించారు. ఆమెను కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. ఆ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
-
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
-
ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
-
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
-
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
-
యార్లగడ్డకు ఎదురుగాలి!
సాక్షి ప్రతినిధి,విజయవాడ: గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది. ఆయన నోటి దురుసుతనం, అహంకారం కొంపముంచుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరికూడ చేరనీయడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన వర్గాలు కనీస గౌరవంకూడా దక్కటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పెరిగిన అంతరం ఇటీవల హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించ లేదు. దీంతో కాపులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జనసేన, కాపు సామాజిక వర్గాలు యార్లగడ్డకు మధ్య అంతరం మరింత పెరిగింది. బీసీ, ఎస్సీ వర్గాలను పట్టించుకోక పోవడంతో వారూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు తమ కుటుంబ సభ్యులను పంపి మమ అనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాలను చిన్న చూపుచూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్గాల వారు షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతిని సబ్బుతో కడిగి, శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారని ఆపార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. దీంతో ఆయన ఎస్సీలపై ఎంత సామాజిక వివక్ష చూపుతున్నారో అర్థమవుతోందని తెలుస్తోంది. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు కాకుండా ఇతరులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.బీజేపీ సహకారం అంతంతమాత్రం నియోజకవర్గంలో బీజేపీ మాత్రం ఆయన అభ్యర్థత్వాన్ని బలపరచటం లేదు. నియోజక వర్గంలో బీజేపీలో కీలకంగా ఉండే కొర్రపోలు శ్రీనివాస్, సర్నాల విజయదుర్గ, రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి పూర్తిగా సహకారం లభించడంలేదు. పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ టీడీపీలోని వారికే తాయిలాలు ఇచ్చి, ప్రలోభపెట్టి వారికే కండువాలు కప్పి, పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు అంటూ, పచ్చ మీడియాలో ఉదరగొడుతున్నారు. యార్లగడ్డ సమక్షంలో డబ్బుకోసం ఆయన పక్షాన చేరినవారంతా, ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా బస్సుయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ప్రచారం, హడావుడి అంతా పాలపొంగు లాంటిదేనని, ఆయనకు ఈసారీ ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజక వర్గ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వంశీ ప్రచార జోష్ ఇప్పటికే గన్నవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హాట్రిక్ సాధించేందుకు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 58 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ సీపీకి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజక వర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలనుంచి అనూహ్య స్పందన లభించింది. నామినేషన్ కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు. ఈ పరిణామాలన్నీ నియోజక వర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి. అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి కష్టాల్లో పలు పంచుకుంటున్న వైనం నియోజక వర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రచారానికి జనాలు అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు. నియోజక వర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది, ఇవన్నీ ఈ విజయానికి కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
దుమ్ములేపుతున్న వల్లభనేని వంశీ ప్రచారం..
-
ఎన్నికల ప్రచారంలో దుమ్ములేపుతున్న వల్లభనేని వంశీ
-
గన్నవరం YSRCP అభ్యర్థి గా వంశీ..!
-
గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం
గన్నవరం: ఎంతో కాలంగా కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల కల సాకారం కానుంది. విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను గత టీడీపీ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేయగా.. ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. కనీసం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కూడా నిర్దిష్టమైన విధి విధానాలను రూపొందించలేదు. దీంతో చిక్కుముడిగా మారిన నిర్వాసితుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ గృహ నిర్మాణాలను సాకారం చేసే దిశగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నిర్వాసిసితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వారి సమస్యల పరిష్కారానికి, నిధులు మంజూరుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హామీలు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విస్తరణలో దావాజీగూడెం, అల్లాపురం, బుద్ధవరంలో ఇళ్లు, స్థలాలు పోతున్న 423 కుటుంబాలకు గృహాలు నిర్మించేందుకు 2015లో టీడీపీ ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ తీసుకొచి్చంది. ఈ ప్యాకేజీలో భాగంగా గృహ నిర్మాణాలకు చిన్నఆవుటపల్లి పరిధిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సుమారు 52 ఎకరాల భూమి సేకరించారు. ఆ భూమిలో కొద్దిమేర మెరక చేసి.. మౌలిక సదుపాయల కల్పనను అప్పటి ప్రభుత్వం గాలికి వదిలేసింది. కనీసం నిర్వాసితులకు ప్లాట్లు కూడా కేటాయించకుండా చేతులు దులుపుకుంది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించింది. రెండుసార్లు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించి లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వంశీమోహన్ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితుల గృహ నిర్మాణాలకు రెండు దఫాలుగా రూ. 4.50 లక్షలు చొప్పన ఒక్కొక్కరికీ రూ.9 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్వాసితులు చెల్లించాల్సిన రూ.3.76 కోట్ల స్టాంప్ డ్యూటీకి మినహాయింపు కల్పించి ఉచితంగా ప్లాట్ల రిజి్రస్టేషన్ చేసి దస్తావేజులను అందజేశారు. సమస్యల పరిష్కారానికి రూ. 80.48 కోట్లు మంజూరు.. విమానాశ్రయ నిర్వాసితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.80.48 కోట్లు ఖర్చు చేయనుంది. వీటిలో ఎయిర్పోర్ట్ అవుట్ డ్రెయిన్ కోసం ఇళ్లు తొలగించిన 47 కుటుంబాలకు అద్దె బకాయిలు రూ.1.21 కోట్లు, ఆర్అండ్ఆర్ స్థలంలో మౌలిక సదుపాయాలకు రూ.41.20 కోట్లు, గృహ నిర్మాణాలకు రూ. 38.06 కోట్లు వ్యయం చేయనుంది. ఇప్పటికే అద్దె బకాయిలు, నిర్వాసితులకు మొదటి విడతగా గృహ నిర్మాణాలకు చెల్లించేందుకు రూ. 17.35 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను కాంపిటెంట్ అథారిటీ, గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారి ద్వారా నిర్వాసితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు. ఇంకా గృహ నిర్మాణాలకు రెండో విడత నిధులు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్థలంలో లెవలింగ్, రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కోసం మిగిలిన రూ. 63.12 కోట్లు కూడా కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఉన్నవాడు ఎలాగైనా బతుకుతాడు కానీ పేదవాడు..?
-
ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం
సాక్షి, సూర్యాపేట: గన్నవరం(ఏపీ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ శనివారం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగానే బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్న క్రమంలో.. సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది. -
చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. ఆదివారం ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడంటూ దుయ్యబట్టారు. ‘‘గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.. పేదలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కుడా పేదలకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సెంటు భూమికుడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వారిని విమర్శించడానికి సిగ్గుశరం ఉండాలి’’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. చదవండి: వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్! -
ఆత్మకూరు PACS బ్యాంక్ డిపాజిట్స్ గోల్ మాల్ బాధితులకు చెక్కుల అందజేత
-
లోకేష్ ను ఓ ఆట ఆడుకున్న వంశీ
-
మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీనే: వంశీ
-
‘జూనియర్ ఎన్టీఆర్‌ను బ్లాక్ చేయడం కోసమే లోకేష్ యాత్ర’
కృష్ణా జిల్లా: లోకేష్ చేస్తున్న యాత్ర వల్ల ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చిచెప్పారు. లోకేష్ యాత్ర అనేది ఏదో ఒక రికార్డ్ ప్రయోజనం కోసమే తప్పితే, ఆ యాత్ర వల్ల ఒక్క ఓటు కూడా పెరగదన్నారు వంశీ. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడిన వంశీ.. లోకేష్ అనేవాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒక్కటే. లోకేష్ యాత్ర వల్ల ఒక్క ఓటు కూడా పెరగదు. చంద్రబాబుకు పడని ఓటు లోకేష్‌కు ఎలా పడుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌ను బ్లాక్ చేయడం కోసమే లోకేష్ యాత్ర. లోకేష్ యాత్ర కారణంగా కార్యకర్తలంతా ఆర్థికంగా చితికిపోయారు. వాళ్ల సొమ్మంతా లోకేష్ పప్పుకి, టిఫన్లకే సరిపోతుంది. మేమేదో గోడదూకుతామని కొందరు మెరుపు కలలు కంటున్నారు. అవి మెరుపు కలలు మాత్రమే, అటువంటి పరిస్థితి లేదు. నేను ఐఎస్బీలో పరీక్ష రాస్తున్నందున ఎమ్మెల్యేల మీటింగ్‌కు వెళ్లలేదు.గోబెల్స్ ప్రచారం చేయడంలో చంద్రబాబు నంబర్‌వన్. టీడీపీ ఒక ఎమ్మెల్సీ గెలవడం వల్ల వైఎస్సార్సీపీకి నష్టం లేదు’ అని పేర్కొన్నారు.