
సాక్షి, విజయవాడ : తనకు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ ,ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వంశీ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)కు కోర్టు ఆదేశించింది. అయితే, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం కావాలని పీపీ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.