Special court
-
ఎస్సీ ,ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్
సాక్షి, విజయవాడ : తనకు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ ,ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో వంశీ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)కు కోర్టు ఆదేశించింది. అయితే, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం కావాలని పీపీ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. -
మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఎవరీ సజ్జన్ కుమార్?ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే.. 1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టుజనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారునానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్ఐఆర్లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి. ఇప్పటికే యావజ్జీవంఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. -
లిక్కర్ కేసులో కేజ్రీవాలే కీలకం: సీబీఐ
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ హైడ్రామా నడిచింది. కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టాలంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని వాదించింది. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ కోరింది. లిక్కర్ కేసులో సోమవారం నాడు తీహార్ జైల్లోనే సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బుధవారం ఉదయం తీహార్ జైలు అధికారులు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం.. కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే.. కేజ్రీవాల్‌ను ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ తరఫు లాయర్. అయితే.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి అందుకు అభ్యంతరం తెలిపారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన అవసరానికి గల కారణాలను సీబీఐ, న్యాయమూర్తికి వివరించారు.‘‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాలే కీలకం. ఆయన నివాసంలోనే మద్యం పాలసీ తయారైంది. సౌత్‌లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారు. రూ.338 కోట్లు ేతులు మారినట్లు ఆధారాలున్నాయి. అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీబీఐ వాదించింది. విచారణ జరుగుతున్న సమయంలో.. కేజ్రీవాల్ కళ్లు తిరుగుతున్నాయని, టీ-బిస్కెట్ కావాలని కోరారు. దీంతో ఆయన షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని నిర్ధారించుకున్న అధికారులు.. కోర్టు అనుమతితో ఆయన్ని మరో గదిలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. #WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal being produced at the Rouse Avenue Court by CBI for a hearing in the liquor policy case. pic.twitter.com/ruFdQNecu4— ANI (@ANI) June 26, 2024 -
పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెషన్ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ. 20 వేల రూపాయలు జరిమానా విధించింది. కాగా, 2021, ఆగస్ట 13వ తేదీన కర్నూలు జిల్లా హోళగుంద మండలం బి. హల్లీ గ్రామానికి చెందిన బోయ రంగన్న అనే వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది . -
2018లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
లక్నో : 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావా కేసు విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది. ప్రత్యక కోర్టు న్యాయమూర్తి సెలువులో ఉన్న కారణంగా కేసు వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ.. హోమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజయ్ మిశ్రా సుల్తాన్ పూర్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ.. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశామన్నారు. కానీ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణ జరగలేదని, ఏప్రిల్ 22కి వాయిదా వేసినట్లు తెలిపారు. 2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను విశ్వసిస్తుందని చెబుతున్నప్పటికీ, హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారని అన్నారు. అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగస్టు 4, 2018న రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతుంది కాగా, ఈ కేసులో గతేడాది డిసెంబర్లో రాహుల్ గాంధీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. తదనంతరం, రాహుల్ గాంధీ ఫిబ్రవరి 20న అమేథీలో భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసి, కోర్టు నుంచి బెయిల్ పొందారు. -
కవితను అరెస్టు చేసిన సీబీఐ.. ప్రత్యేక కోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు. కస్టడీ కోరనున్న సీబీఐ! రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ శనివారం కవితను తీహార్ జైలులో ప్రశ్నించిన విషయం విదితమే. మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో వాట్సాప్ చాట్లు, భూ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరనున్నట్లు తెలిసింది. -
93 పేలుళ్ల కేసు నుంచి తుండాకు విముక్తి
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు నుంచి మాఫియా డాన్, వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అబ్దుల్ కరీం తుండా(81)కు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అతడిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. తుండాపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టి వేస్తూ గురువారం అజ్మేర్లోని ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా 22 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుండా బాంబుల తయారీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కాగా, హమీదుద్దీన్ 14 ఏళ్లుగా, ఇర్ఫాన్ 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. బాంబు పేలుళ్లతోపాటు వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. -
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్‌సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
డ్రగ్స్ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ఉన్న తరహాలోనే ఈ ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందని వెల్లడించారు. మత్తు పదార్థాలతో విద్యార్థులు, యువత నిర్విర్యం అవుతున్నారని, వారిని దీని నుంచి రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్‌నాబ్)ను పటిష్టం చేస్తున్నామన్నారు. మత్తుపదార్థాలు ఎవరికీ అందుబాటులో లేకుండా సమూలంగా నిర్మూలిస్తామని చెప్పారు. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధేతో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలో మత్తుపదార్థాలు పండించడం కంటే వినియోగం ఎక్కువగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. గ్రేహౌండ్స్, ఎస్ఐబీలు ఏ విధంగా అయితే మావోయిస్టులను అణచివేశాయో, అదేవిధంగా మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. టీఎస్ నాబ్ కోసం అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్యను నియమించామని, మరో 301 మంది అధికారులతో దీనిని బలోపేతం చేస్తామని సీఎం చెప్పారు. వీరికి గ్రేహౌండ్స్, ఎస్ఐబీలో పనిచేస్తున్న వారికి ఇస్తున్న మాదిరిగా అలవెన్సు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి..డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయం అని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలతోపాటు ఇతరత్రా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. సినీతారల డ్రగ్స్ కేసు పురోగతిలో ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు రెండుఫోర్లు టీఎస్నాబ్కు కేటాయించామని తెలిపారు. ఏఓబీతోపాటు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపుతామని, ఇందుకు టీఎస్ నాబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విదేశీయుల కోసం డీఅడిక్షన్ కేంద్రం చర్లపల్లి జైలులో రెండు ఎకరాల స్థలంలో డీఅడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. నైజీరియా, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ, మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారని, అలాంటి వారికోసం ఈ డీఅడిక్షన్ కేంద్రం పనిచేస్తుందన్నారు. విభాగాల అధిపతుల నియామకం వరకే నా పని ఆయా విభాగాల అధిపతులను నియమించడంవరకే తన పని అని, ఆ తర్వాత వారికి కింద ఎవరు కావాలన్నది వారి నిర్ణయానికి వదిలేస్తున్నట్టు చె ప్పారు. తాను అడిగిన ఫలితాలు రాకపోతే, సంబంధిత విభాగ అధిపతి సమాధానం చెప్పాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. మూడు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించినా వారికీ అవసరమైన మ్యాన్‌పవర్‌ను వారే పిక్ చేసుకుంటారన్నారు. రాష్ట్ర సలహా మండలి.. రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తామని దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు అయ్యే మహాత్మా జ్యోతిబా పూలే ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్, రీసెర్చ్ ఆన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్’లా ఈ సలహామండలి పనిచేస్తుందన్నారు. ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్‌తో పాటు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్, ఆకునూ రి మురళి లాంటి మేధావులతో ఇది ఉంటుందన్నారు. అన్నిరకాల గురుకుల విద్యాలయాలు, మండలస్థాయిలో ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ సంస్థ పర్యవేక్షణలో ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం గురుకు లాలు ఏర్పాటు చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించలేదని, అగ్గిపెట్టెల్లాంటి అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్య 100 రోజుల్లో పరిష్కారం జర్నలిస్టుల సమస్యలను వందరోజుల్లో పరిష్కరిస్తామని, ప్రెస్ అకాడమీ చైర్మన్‌ను సంక్రాంతిలోగా నియమిస్తామన్నారు. ఇళ్ల స్థలాల అంశం మరోసారి రాకుండా పూర్తిస్థాయిలో జర్నలిస్టుల సమస్యను ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామని అందరికీ ఇళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. -
చెక్ బౌన్స్ కేసులో దోషిగా మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి మధు బంగారప్పను చెక్ బౌన్స్ కేసులో ప్రత్యేక కోర్టు దోషిగా తేలి్చంది. ఫిర్యాదుదారులైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు రూ.6.96 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆయనను ఆదేశించింది. మరో రూ.10 వేలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష అనుభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెట్‌ను మొదటి నిందితులుగా, ఆకాశ్ ఆడియో–వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధు బంగారప్ప రెండో నిందితుడిగా కోర్టు గుర్తించింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ నుంచి మధు బంగారప్ప రూ.6 కోట్లు డిపాజిట్ రూపంలో తీసుకున్నారు. చాలా రోజులు తిరిగి చెల్లించలేదు. గట్టిగా నిలదీయగా చెక్కు ఇచ్చారు. బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయ్యింది. దాంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు వెల్లడి
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్ఐఏ(National Investigation Agency) న్యాయస్థానం. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్‌తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాక్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్ కుట్ర పన్నాడు. అయితే.. తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇక ‘ముజాహిద్దీన్ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్‌ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్. నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్‌లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది కూడా. -
వచ్చే 13 వరకు జైల్లోనే ఇమ్రాన్
ఇస్లామాబాద్: అధికార రహస్య పత్రాల లీకేజీ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు సెప్టెంబర్ 13వ తేదీ వరకు ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. తోషఖానా కేసులో ఇమ్రాన్‌కు దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలుశిక్షను కొట్టివేస్తూ మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రహస్య పత్రాల లీకేజీ కేసు విచారణలో ఉన్నందున ఆయనకు ఒక రోజు రిమాండ్ విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ విచారణను పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జైలులోనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జడ్జి అబువల్ హస్నత్ జుల్కర్నయిన్ బుధవారం జైలుకు చేరుకున్నారు. జైలు లోపలే కేసును విచారించి, ఇమ్రాన్ రిమాండ్‌ను వచ్చే 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారని జియో న్యూస్ తెలిపింది. దీంతో, ఆగస్ట్ 5 నుంచి ఉంటున్న అటోక్ జైలు నుంచి వెంటనే విడుదల కావాలన్న ఇమ్రాన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయిందని జియో న్యూస్ పేర్కొంది. విచారణ సమయంలో ఇమ్రాన్ తరఫు లాయర్ల బృందంలోని ముగ్గురికి మాత్రమే లోపలికి వెళ్లేందుకు అవకాశం కల్పించారని తెలిపింది. గత ఏడాది మార్చిలో పార్లమెంట్లో ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులు ముందు జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్.. తనను గద్దె దించేందుకు విదేశీ శక్తి కుట్ర పన్నిందనేందుకు ఇదే సాక్ష్యమంటూ ఓ డాక్యుమెంట్‌ను తీసి బహిరంగంగా చూపించారు. అమెరికా విదేశాంగశాఖ అధికారులు అక్కడి పాక్ రాయబారితో భేటీ అయ్యారని, దానికి సంబంధించిన వివరాలున్న డాక్యుమెంట్లను చట్ట విరుద్ధంగా పొందిన ఇమ్రాన్ వాటిని బహిరంగ పరిచారని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయనపై అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో డానిశ్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం (బిహార్), ఇమ్రాన్ ఖాన్ (మహారాష్ట్ర), ఒబైదుర్ రెహా్మన్ (హైదరాబాద్) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్ భక్తల్ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది. చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్ర పిళ్లైకు షాక్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్‌ను స్పెషల్ కోర్టు తిరస్కరించింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పిళ్లై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇక, అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఈ స్కామ్‌లో ఇతర విషయాల్లో పిళ్లై కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడించింది. గతేడాది నవంబర్ 11న పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో తాను కవితకు బదులు భాగస్వామిగా వ్యవహరించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ (ఎల్1) లో యాక్సెస్ వచ్చిందంటూ పిళ్లై ఇచ్చిన స్టేట్మెంట్ను ఈడీ ప్రస్తావించింది. కవిత తెలంగాణ సీఎం కూతురని లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రుకు పిళ్లై వివరించినట్లు తెలిపింది. మరోసారి విందులో పిళ్లై ఫోన్ ద్వారా ‘ఫేస్ టైమ్’లో సమీర్‌ను కవితతో మాట్లాడించినట్లు వివరించింది. ఈ సందర్భంగా కవిత, సమీర్‌ను అభినందించడమే కాకుండా, లిక్కర్ బిజినెస్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. కవిత, అరుణ్ పిళ్లైలు ఆప్ నేత, లిక్కర్ స్కామ్‌లో కీలకమైన విజయ్ నాయర్, దినేశ్ అరోరాలను గతేడాది ఏప్రిల్ 8న ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో కలిసినట్లు పేర్కొంది. 2022లో హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను, సమీర్ కలిశారని, ఈ భేటీలో శరత్ చంద్రా రెడ్డి, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ప్రస్తావించింది. ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్! -
అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ప్రయాగ్‌రాజ్(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్–రాజకీయ నేత అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్ సోదరుడు ఖాలిద్ అజీం అలియాస్ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్ పోలీస్ వ్యాన్ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను అతీక్ కిడ్నాప్ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్ జైలుపాలయ్యాడు. -
మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు: ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియాను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఈ కేసు విచారణకు ఆయనను 10 రోజులు రిమాండ్‌కు అప్పగించాలాని కోరారు. ఈ సందర్భంగా కోర్టులో వాడీవేడీగా వాదనలు సాగాయి. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాదులు దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్, ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదనలు విన్పించారు. ఈ సందర్బంగా జోహెబ్ వాదిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్, సిసోడాయా, కల్వకుంట్ల కవితతో పాటు పలువురు కుట్ర పన్నారని కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్.. ఆప్ నేతలకు దాదాపు రూ.100 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో 30 శాతం మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూప్‌కి ఇచ్చినట్లు వివరించారు. 'కే కవితను విజయ్ నాయర్ కలిశారు. పాలసీ ఎలా ఉందో చూపాలని విజయ్ను కవిత అడిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తరపున విజయ్ నాయర్ వ్యవహరిస్తున్నారు.పాలసీ విధానాలు GOM నివేదికను మంత్రుల కన్నా రెండు రోజుల ముందు బుచ్చిబాబుకి కవిత ఇచ్చారు. ఇండోస్పిరిట్స్ కంపెనీకి L1 లైసెన్స్‌ని ఇప్పించడంలో సిసోడియా పాత్ర ఉంది. లిక్కర్ పాలసీ తయారీలో కీలక పాత్ర మనీష్ సిసోడియాది. లిక్కర్ వ్యాపారం మొత్తం కొంతమందికే కట్టబెట్టారు. లిక్కర్ బిజినెస్‌లో సౌత్ గ్రూప్ పాత్ర ఉంది. 12 శాతం మార్జిన్ తో హోల్ సేలర్స్‌కి లాభం వచ్చేలా కొత్త పాలసీలో మార్పులు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హోల్‌సేల్ వ్యాపారం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ విధానాన్ని అమలు చేశారు. పాలసీ తయారు చేశాక కొంత మంది ప్రవేట్ వ్యక్తులకు పంపారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు బయటకు ఎలా వచ్చాయి?. సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా మద్యం విధానంలో మార్పులు చేశారు. కేవలం కంటి తుడుపు చర్యగా ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలకు భారీ ప్రయోజనాలు కలిపించే విధంగా మద్యం పాలసీ రూపకల్పన చేశారు. మొత్తం కుట్రను సమన్వయం చేసేది విజయ్ నాయర్. ఈ స్కామ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులు , రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక శాఖలు ఉన్నాయి. సంజయ్ సింగ్ (ఆప్ ఎంపీ) అరోరాకు ఫోన్ చేసి పార్టీ ఫండ్ గురించి మాట్లాడారు. లిక్కర్ వ్యాపారం మొత్తం కొంతమందికే కట్టబెట్టారు. ఏడాది వ్యవధిలో 14 ఫోన్లు ధ్వంసం చేశారు. సిసోడియా కొనుగోలు చేసిన ఫోన్లలో, తన పేరు మీద లేని సిమ్‌కార్డులను ఉపయోగించారు. అతను ఉపయోగించిన ఫోన్ కూడా అతని పేరు మీద లేదు. జెట్ స్పీడుతో ఇండోస్పిరిట్స్ దరఖాస్తు క్లియర్ అయింది. మనీశ్ సిసోడియా 14 ఫోన్లు ఉపయోగించారు. కేవలం 2 మాత్రమే రికవర్ అయ్యాయి.' అని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వాదనలు విన్న న్యాయస్థానం ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. సిసోడియాను 10 రోజుల కస్టడీకి(మార్చి 17 వరకు) అనుమతి ఇచ్చింది. దీంతో అధికారులు మరో 10 రోజుల పాటు ఆయనను విచారించనున్నారు. కాగా.. సిసోడియాను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఆప్ కార్యక్తరలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. చదవండి: దూకుడు పెంచిన ఈడీ.. బిహార్ డిప్యూటి సీఎంకు షాక్! -
రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద
బరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ప్రత్యేక కోర్టుకు సినీనటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా గైర్హాజర్ కావడంతో గత నెలలో కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరుకావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ‘‘మాజీ ఎంపీ , బీజేపీ నాయకురాలు జయప్రద కోర్టు ఎదుట హాజరై బెయిల్ దరఖాస్తును సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’’ అని ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. స్థానిక అధికారుల అనుమతి లేకుండా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఆమె రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. -
నా ఒకేఒక్క తప్పు.. మంత్రి కావడం!
ఢిల్లీ: మంత్రి కావడమే తాను చేసిన పెద్ద తప్పైపోయిందని, ఆ పదవే లేకుంటే తనపై ఆరోపణలు.. కేసు ఉండేవి కావని ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ అంటున్నారు. ఈ మేరకు మనీల్యాండరింగ్ కేసులో బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థనలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ ఎదుట సత్యేందర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ హరిహరణ్ శుక్రవారం వాదనలు వినిపించారు. విచారణ దశలో ఉండడంతో.. తొలి బెయిల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని ఈ సందర్భంగా అడ్వొకేట్ హరిహరణ్ గుర్తు చేశారు. అయితే ఆరోపణల్లో పేర్కొన్నట్లు తన క్లయింట్ ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌గా, షేర్‌హోల్డర్‌గా లేరనే విషయాన్ని ప్రస్తావించారు. మంత్రి పదవితో ప్రజా జీవితంలోకి రావడమే తన తప్పైందంటూ సత్యేందర్ తరపున ఆయన వాదించారు. ఒకవేళ పదవిలో లేకుంటే.. అసలు తనపై కేసే ఉండేది కాదని చెప్పారాయన. అంతేకాదు.. ఈడీ సమర్పించిన ఆధారాల్లో సదరు కంపెనీల్లో జైన్ వాటాలు కలిగి ఉన్నట్లు నిరూపితం కాలేదని హరిహరణ్ వాదించారు. ఇక సత్యేంద్ర జైన్ బెయిల్ అభ్యర్థన పిటిషన్‌పై నవంబర్ 5వ తేదీన ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, ఈడీ వాదనలు విననున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్(57) మే నెలలో అరెస్ట్ అయ్యారు. ఇదీ చదవండి: సత్యేందర్ జైన్ హవాలా లింకులపై ప్రాథమిక సాక్ష్యాలు: కోర్టు -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్‌పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
నాడు మోదీ సర్కార్‌ను కూల్చే కుట్ర
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: 2002లో గుజరాత్లో మత కలహాల తర్వాత రాష్ట్రంలో అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు పెద్ద కుట్ర జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది. సర్కారును కూల్చడానికి కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్ ఆదేశాలతో సాగించిన కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సైతం భాగస్వామిగా మారారని వెల్లడించింది. సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ తాజాగా అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె సమర్పించిన దరఖాస్తును ‘సిట్’ తిరస్కరించింది. సెతల్వాద్‌కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి డి.డి.ఠక్కర్ సోమవారానికి వాయిదా వేశారు. గుజరాత్ మత కలహాల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతోపాటు అమాయకులను ఇరికించేలా తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించారన్న ఆరోపణలతో తీస్తా సెతల్వాద్‌తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను గుజరాత్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రాజకీయ కారణాలతోనే.. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి లేదా అస్థిరపర్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారు. రాజకీయ కారణాలతో కుట్ర సాగించారు. అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించాలని చూశారు. ఇందుకోసం తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. ప్రతిఫలంగా ప్రతిపక్షం (కాంగ్రెస్) నుంచి చట్టవిరుద్ధంగా ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు, బహుమతులు పొందారు’’ అని సిట్ తన అఫిడవిట్లో ఆరోపించింది. సాక్షుల స్టేట్మెంట్లను ఉటంకించింది. అహ్మద్ పటేల్ ఆజ్ఞతోనే కుట్ర జరిగిందని, గోద్రా అల్లర్ల తర్వాత ఆయన నుంచి సెతల్వాద్, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్ రూ.30 లక్షలు స్వీకరించారని తెలిపింది. గుజరాత్ అల్లర్ల కేసులో బీజేపీ సీనియర్ నాయకుల పేర్లను చేర్చాలంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ(కాంగ్రెస్) నాయకులను సెతల్వాద్ తరచూ కలుస్తూ ఉండేవారని గుర్తుచేసింది. మరో సాక్షి చెప్పిన విషయాలను సిట్ ప్రస్తావించింది. కేవలం షబానా అజ్మీ, జావెద్ అక్తర్‌ను ఎందుకు రాజ్యసభకు పంపిస్తున్నారు? తనకెందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ 2006లో ఓ కాంగ్రెస్ నాయకుడిని సెతల్వాద్ నిలదీశారని పేర్కొంది. మోదీకి క్లీన్చిట్.. సమర్థించిన సుప్రీంకోర్టు గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీతో సహా 62 మందికి ‘సిట్’ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు గత నెలలో సమర్థించింది. ‘సిట్’ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మరుసటి రోజే సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు శ్రీకుమార్, సంజీవ్ భట్‌పై ఐపీసీ సెక్షన్ 468(ఫోర్జరీ), సెక్షన్194 (దురుద్దేశంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుజరాత్ అల్లర్ల వ్యవహారానికి సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం సృష్టించారన్న ఆరోపణలపై రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ‘సిట్’ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెతల్వాద్, శ్రీకుమార్‌ను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు జూలై 2న ఆదేశాలిచ్చింది. అహ్మద్ పటేల్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా సేవలందించిన సంగతి తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్లో సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌కు దుండగులు నిప్పుపెట్టారు. అయోధ్య నుంచి రైలులో వస్తున్న 58 మంది భక్తులు ఆహూతయ్యారు. -
చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. మళ్లీ అరెస్టుకు అవకాశం!
ముంబై: హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో జైలుపాలై.. బెయిల్ మీద విడుదలైన ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు మళ్లీ చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జంటకు బెయిల్ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా. ఈ నేపథ్యంలో.. వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్ కౌర్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. హనుమాన్ చాలీసా ఛాలెంజ్‌తో సీఎం ఉద్దవ్ థాక్రేకు ఎదురెళ్లిన ఈ ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధుల జంట.. రెచ్చగొట్టే చర్యల మీద అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. అయితే వీళ్ల బెయిల్‌ను సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఈ లోపు.. ఢిల్లీలో ఈ జంట వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెడుతోంది. పైగా సీఎం ఉద్దవ్ థాక్రేకు చాలెంజ్‌లు విసిరింది. మీడియాతో మాట్లాడడమే కాకుండా.. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నందుకుగానూ బెయిల్ రద్దు చేయాలంటూ ఖర్ పోలీస్ స్టేషన్ ఎస్సై.. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారత్ ద్వారా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ జంట ప్రెస్ మీట్లకు సంబంధించిన వీడియోలను కోర్టు సైతం పరిశీలించినట్లు సమాచారం. దీంతో నవనీత్ కౌర్, ఆమె భర్త గనుక సరైన వివరణ ఇవ్వకుంటే మాత్రం వెంటనే అరెస్ట్ దిశగా కోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: దమ్ముంటే పోటీ చేయ్.. ఉద్దవ్‌కు నవనీత్ సవాల్ -
Yediyurappa: యడ్యూరప్పకు భారీ షాక్
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు గట్టి షాక్ తగిలింది. ఆయనపై నమోదు అయిన భూ ఆరోపణలకు సంబంధించి.. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యడ్యూరప్పకు సమన్లు కూడా జారీ చేసింది. భూ సంబంధిత ‘డీనోటిఫికేషన్ వ్యవహారం’లో అవినీతికి పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు చేయాలని ఆదేశించింది బెంగళూరులోని ప్రత్యేక కోర్టు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి క్రిమినల్ కేసులపై విచారణ కోసమే ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు యడ్యూరప్పపై ఈ ఫిర్యాదు 2013లోనే నమోదు అయ్యింది. యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్న టైంలో ఈ అవినీతి జరిగిందని, వాసుదేవ రెడ్డి అనే బెంగళూరువాసి ఈ ఫిర్యాదు నమోదు చేశారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్-ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఉన్న ఐటీకారిడార్‌లో స్థలానికి సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. డీనొటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు ఎంట్రప్రెన్యూర్లకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో.. అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. యడ్యూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పెషల్ జడ్జి బీ జయంత కుమార్ ఆదేశించారు. అంతేకాదు తన ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో యడ్యూరప్పను ఆదేశించారు కూడా. చదవండి: హత్యా రాజకీయాలు బీజేపీ సంస్కృతి కాదు-షా -
కశ్మీర్ వేర్పాటువాదులకు షాక్
Terror Funding Case: కశ్మీర్ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. 2017లో కశ్మీర్ అల్లర్లకు సంబంధించి.. వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం Unlawful Activities (Prevention) Act లోని పలు సెక్షన్ల కింద నేరారోపణలు నమోదు చేయాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాదులతో పాటు పనిలో పనిగా ఉగ్రసంస్థల నేతలకూ షాక్ ఇచ్చింది కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌తో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ పేరును సైతం చేర్చింది. టెర్రర్ ఫండింగ్ కేసులో వీళ్ల పేర్లను పొందుపర్చాలని ఆదేశించింది కోర్టు. ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌజ్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పర్వీన్ సింగ్ మార్చి 16వ తేదీనే ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్ర సంస్థలు పక్కా కుట్రతోనే 2017లో కశ్మీర్లో అలజడులు సృష్టించారని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. తీవ్రవాద నిధుల కేసులో పలువురు నిందితులు పాకిస్థాన్‌తో ఉమ్మడి ఎజెండాను పంచుకున్నారని పేర్కొన్నారాయన. మొత్తం పదిహేను మంది కశ్మీరీ వేర్పాటువాద నేతలతో పాటు హఫీజ్ సయ్యద్, సయ్యద్ సలావుద్దీన్, Jammu & Kashmir Liberation Front చీఫ్ యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, ముసారత్ అలమ్‌పై నేరారోపణలు నమోదు కానున్నాయి. -
పరువు హత్య కేసు: యువరాజ్, అరుణ్‌కు మరణించే వరకు జైలు
సాక్షి, చెన్నై: సేలం జిల్లా ఓమలూరు ఇంజినీరింగ్ విద్యార్ధి గోకుల్ రాజ్ పరువు హత్య కేసులో మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఓ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్, ఆయన డ్రైవర్ అరుణ్ కుమార్‌కు మరణించే వరకు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి సంపత్‌కుమార్ తీర్పు చెప్పారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ 2015లో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సమయంలో డీఎస్పీ విష్ణు ప్రియ బలన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు దారి తీసింది. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువజన నేత యువరాజ్‌ను గుర్తించారు. అతడి డ్రైవర్ అరుణ్‌కుమార్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. దీంతో కేసును నామక్కల్ నుంచి మదురై ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్ల పాటు జరిగిన విచారణ గత వారం ముగిసింది. తీర్పుపై ఉత్కంఠ.. ఈ కేసు తీర్పును మంగళవారం మధ్యాహ్నం న్యాయమూర్తి సంపత్‌కుమార్ వెలువరించారు. యువరాజ్‌కు మూడు యావజ్జీవ శిక్షతో పాటుగా మరణించే వరకు జైలు శిక్షను విధించారు. అరుణ్‌కుమార్‌కు రెండు యావజ్జీవాలు, మరణించే వరకు జైలు శిక్ష ఇస్తూ తీర్పు చెప్పారు. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఉన్న కుమార్, సతీష్, రఘు, రంజిత్, సెల్వరాజ్ , చంద్రశేఖర్ , ప్రభు, శ్రీథర్, గిరిధర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఇక, శిక్ష పడ్డ వారందరికీ తీర్పు పునః పరిశీలనకు గానీ, క్షమాభిక్షకు గానీ అవకాశం లేకుండా తీర్పులో ప్రత్యేక అంశాలు పేర్కొన్నారు. అలాగే, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జరిమానా విధించారు. అయితే, అప్పీలుకు వెళ్లే అవకాశం మాత్రం ఉండటం గమనార్హం. అయితే, ఈ కేసులో ఐదుగురు తప్పించుకున్నారని వారికి కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని గోకుల్ రాజ్ తల్లి చిత్ర విజ్ఞప్తి చేశారు. ఈ తీర్పు సమయంలో కోర్టు ఆవరణలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: జయలలిత మరణం మిస్టరీ: పన్నీరుకు సమన్లు.. -
కాల్పుల కేసులో ఫారూఖ్‌కు జీవిత ఖైదు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2020, డిసెంబర్ 18న జరిగిన కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్‌కు ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఏ–2, ఏ–3లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు జడ్జి, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాస్‌రావు సోమవారం తీర్పునిచ్చారు. ఫారూఖ్‌ను కోర్టుకు తీసుకొచ్చినప్పటికీ కోవిడ్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు చెప్పారు. ఫారుఖ్ మరో గదిలో ఉండి జడ్జి తీర్పు విన్నాడు. విచారణలో నిందితుడి నేరం రుజువైందని జడ్జి ప్రకటించారు. ప్రత్యేక కోర్టు .. ఫారూఖ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.12వేల జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు రమణారెడ్డి, జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ రెడ్డిలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన ఫారూఖ్ అహ్మద్ తన ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్, సయ్యద్ మన్నాన్, సయ్యద్ మోతిషీన్పై తుపాకీతో కాల్పులు జరిపాడు. గాయపడిన సయ్యద్ జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
టిక్‌టాక్ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్
సాక్షి, విశాఖపట్నం: టిక్‌టాక్ (ఫన్ బకెట్) భార్గవ్‌కు మళ్లీ రిమాండ్ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మళ్లీ సోషల్ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు..) -
Hyderabad: మూడేళ్ల క్రితం లైంగికదాడి, కామాంధునికి జీవిత ఖైదు
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తె వయసున్న బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో కామాంధుడు ఎడ్ల రమేశ్ (45) బతికున్నంత కాలం జైలు జీవితం గడపాలని చిన్నారులపై లైంగిక దాడుల నియంత్రణ (పోక్సో) కేసుల విచారణ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. అలాగే రూ.20 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి బి.సురేశ్ తీర్పులో పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం లైంగిక దాడి జరిగిన సమయంలో బాలిక వయస్సు 11 సంవత్సరాల 6 నెలలని, ఈ నేపథ్యంలో బాధితుల పరిహార పథకం కింద రూ.7 లక్షలు పరిహారం ప్రభుత్వం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థను ఆదేశించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని జాతీయ బ్యాంకులో బాలిక పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఈ డబ్బును బాలిక మేజర్ అయిన తర్వాత తీసుకోవచ్చని పేర్కొంది. మిగిలిన 20 శాతం డబ్బును బాలికకు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. -
ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు బెయిల్ రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన విజ్ఞప్తిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఆదేశాలిచ్చింది. గత ఏడాది జర్నలిస్ట్ బండారి మద్దిలేటి, న్యాయవాదులు నలమాస కృష్ణ, మెంచు సందీప్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ యూఏపీఏ కింద అరెస్టు చేసింది. కాగా, ప్రత్యేక కోర్టు ఈ నిందితులకు గత సంవత్సరం ఆగస్టు 21, సెప్టెంబర్ 15, 28 తేదీల్లో వేర్వేరు తీర్పుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఎన్ఐఏ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సూచించింది. ఇటీవల ప్రత్యేక కోర్టు, కేసును తిరిగి విచారించింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది వి.పట్టాభి, న్యాయవాదులు నందిగం కృష్ణారావు, వి.రఘునాథ్ వాదించారు. కాగా బెయిల్ రద్దు చేసేందుకు ఎలాంటి కారణాలు లేనందున గతంలో బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!
సాక్షి, చెన్నై : గతంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పుగలేంది తీరు ఆపార్టీ అగ్రనాయలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామికి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పుగలేంది వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. అయితే ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ పుగలేంది కోర్టుకెక్కారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తన పరువుకు భంగం కల్గించిన పన్నీరు సెల్వం, ‡పళనిస్వామిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టుకు పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పన్నీరు సెల్వం, పళని స్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం విచారణకు ఆ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపుతూ, నేరుగా కోర్టుకు హాజరయ్యే అంశం నుంచి మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్ వేశారు. ఈ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 14వ తేదీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు. కొడనాడు కేసులో.. వాదోపవాదాలు కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం తాజాగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఉన్న కోయంబత్తూరుకు చెందిన రవి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ ముగించి, చార్జ్‌షీట్ సైతం దాఖలై ఉందని, ఈ సమయంలో మళ్లీ పునఃవిచారణ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. స్టే విధించాలని కోరారు. అయితే, రవి ఓ సాక్షి మాత్రమేనని, అతడి వాదనను పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఆమె బంధువు ఇలవరసిని విచారించేందు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈనేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు. -
సీఎం, మాజీ సీఎంలకు షాక్.. కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పుహలేంది దెబ్బకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు ఏర్పడింది. ఆ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా బెంగళూరు పుహలేంది ఇది వరకు వ్యవహరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి తొలగించారు. తనను అకారణంగా తొలగించారంటూ కోర్టు తలుపుల్ని పుహలేంది తట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ పిటిషన్ మంగళవారం చేరింది. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ పన్నీరుసెల్వం, పళనిస్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే ఈ ఆదేశాలపై స్టే కోరడమే కాకుండా, పిటిషన్ విచారణ యోగ్యం కాదని ప్రకటించాలని కోరుతూ మరో కోర్టులో పిటిషన్ల దాఖలకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది. -
ఏసీబీ స్పెషల్ కోర్టు లో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
రాసలీలల కేసు: అజ్ఞాతం వీడిన యువతి... మంత్రికి భారీ షాక్!
సాక్షి, బెంగళూరు: కన్నడనాట రోజూ ఉత్కంఠ రేకెత్తించిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో ఎట్టకేలకు పురోగతి కనిపించింది. 28 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న యువతి మంగళవారం బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి కోర్టులో హాజరవుతుందని ఆమె న్యాయవాది జగదీశ్ చెప్పడంతో ఏసీఎంఎం కోర్టు ఎదుట మీడియా, పోలీసులు ఎదరు చూశారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. బాధిత యువతికి సిట్‌పై నమ్మకం లేదని, అంతేకాకుండా ఆమెకు ప్రాణభయం ఉందని, ఈ నేపథ్యంలో కోర్టు ఎదుటే వాంగ్మూలం ఇచ్చేలా అనుమతివ్వాలని కోర్టుకు విన్నవించగా జడ్జి బాలగోపాల్ కృష్ణ ఆమోదించారు. దీంతో న్యాయమూర్తి ఎదుట యువతి హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. రహస్యంగా 2 గంటలు వాంగ్మూలం.. యువతి అత్యంత రహస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు వసంతనగరలోని గురునానక్ భవన్లో ఉన్న ఏసీఎంఎం కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక కోర్టుకి చేరుకుంది. సుమారు రెండు గంటల పాటు జడ్జి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. అక్కడ ఒక స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. ఆ తరువాత కోర్టు అనుమతితో సిట్ పోలీసులు యువతిని ఆధీనంలోకి తీసుకుని తమ ఆఫీసుకు తరలించారు. మంగళవారం రాత్రి వరకూ సిట్ ఆమెను విచారించి, మళ్లీ బుధవారం విచారణకు రావాలని పంపించివేసింది. సాక్ష్యాలను సమర్పించిన యువతి? ‘తాము ఇచ్చిన మాట ప్రకారం బాధిత యువతిని కోర్టు ఎదుటకు తీసుకొచ్చాము. ఇక పోలీసులు వారి పనిని చేయాలి. నిందితుడు స్వేచ్ఛగా బయటకు తిరగకుండా అరెస్టు చేయాలి’ అని బాధిత యువతి న్యాయవాది జగదీశ్ డిమాండ్ చేశారు. యువతి ఎలాంటి భయం లేకుండా జరిగినది మొత్తం న్యాయమూర్తి ఎదుట వెల్లడించిందని తెలిపారు. జడ్జి ముందు బాధిత యువతి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. ‘నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. రమేశ్ బలమైన నాయకుడు కావడంతో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను ఆయన బెదిరించడంతో భయపడి దాక్కున్నాను. నా తల్లిదండ్రులు, సోదరుడిని కూడా రమేశ్ ఒత్తిడి చేస్తున్నారు. నా కుటుబానికి రక్షణ కల్పించాలి’ అని యువతి కోరినట్లు సమాచారం. అలాగే తనకు రమేశ్ ఇచ్చిన బహుమతులు, ఆయనతో తీసుకున్న ఫోటోలు, చేసిన చాటింగ్, వీడియో, మొబైల్ సందేశాల తదితర సాక్ష్యాలను సిట్‌కు అందించింది. మరోవైపు వైద్య పరీక్షలు చేసే వరకు తమ రక్షణలో ఉండాలని, అందుకోసం ఎనిమిది మంది మహిళా పోలీసులతో యువతికి భద్రత కల్పించినట్లు తెలిసింది. దిక్కుతోచని జార్కిహొళి.. రాసలీలల సీడీ కేసులో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఏకాకిగా మిగిలిపోయారు. ఆయనతో పాటు యడియూరప్ప సర్కారులో మంత్రులైన నేతలు దూరం పాటిస్తున్నారు. ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న బాధిత యువతి ఏకంగా జడ్జి ముందు వాదన వినిపించడంతో ఆయనకు అరెస్టు భయం పట్టుకుంది. జార్కిహొళి ప్రమాదకర మనిషి అని, తనను చంపినా చంపవచ్చని యువతి పలు వీడియోల్లో ఆరోపించడం తెలిసిందే. మంగళవారం జరిగిన పరిణామాలతో ఆయన న్యాయ నిపుణులతో చర్చించారు. అరెస్టు అవ్వనున్నారనే ఊహాగానాల మధ్య ముందస్తు బెయిల్‌కు రమేశ్ సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఆయన న్యాయస్థానంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జార్కిహొళి మంగళవారం బెళగావిలో ఉండగా, అక్కడి ఉప ఎన్నిక నామినేషన్ల కోసం సీఎం యడియూరప్ప కూడా వచ్చారు. కానీ జార్కిహొళి సీఎంను కలవలేదు. చదవండి: జార్కిహొళి చాలా డేంజర్.. నన్ను చంపినా చంపొచ్చు ‘తమ్ముడు నన్ను నమ్ము.. వార్తల్లో చూపించేది అబద్దం’ -
బుగ్గలు గిల్లితే లైంగిక వేధింపులు కావు
ముంబై: మనసులో చెడు ఉద్దేశాలు లేకుండా మైనర్ బాలిక బుగ్గలు గిల్లితే అది నేరం కాదని ముంబైలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఒక బాలిక బుగ్గల్ని మాటిమాటికి తడిమిన 28 ఏళ్ల వయసున్న ఎలక్ట్రీషియన్‌ను కేసు నుంచి విముక్తుడిని చేసింది. అయితే అదే సమయంలో ఆ బాలిక తల్లిపై చేసిన అత్యాచార యత్నం కేసులో నేరస్తుడిగా తీర్పు చెప్పి అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే..? 2017, జూన్2న జరిగిన ఈ ఘటనలో మధ్యాహ్నం పూట తల్లీ, కూతుళ్లిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో రిఫ్రిజిరేటర్ బాగు చేయడానికి ఒక ఎలక్ట్రీషియన్ వాళ్లింటికి వచ్చాడు. ఫ్రిజ్‌ని పరీక్షించి చూసిన అతను స్పేర్ పార్ట్ వెయ్యాలని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ కూతురి బుగ్గలు గిల్లాడు. దీంతో తల్లి ఎలక్ట్రీషియన్ని గట్టిగా మందలించి తన కూతురి ఒంటిపై చెయ్యి వెయ్యొద్దని హెచ్చరించింది. ఇంతలో వంటగదిలో ఏదో పని ఉందని లోపలికి వెళ్లిన ఆ మహిళను వెనక నుంచి వచ్చి అతను కౌగిలించుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేసి ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ మళ్లీ ఆమె కుమార్తె బుగ్గలు గిల్లాడు. దీంతో ఆమె ఆ ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సంస్థకి, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఏమందంటే.. : ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఆ మహిళ చెప్పిందంతా విని బాలిక బుగ్గలు గిల్లడం పోక్సో చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. మనసులో శృంగారపరమైన వాంఛలు లేకుండా బుగ్గ గిల్లితే దానిని నేరం కింద చూడలేమని పేర్కొంది. మరోవైపు ఆ మహిళపై అత్యాచార యత్నం చేసినందుకు నిందితుడైన ఎలక్ట్రీషియన్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలి కాలంలో రకరకాల లైంగిక వేధింపులు పోక్సో చట్టం కింద నేరం కావంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. -
పాక్‌లో రేప్ చేస్తే మగతనం మటాష్!
ఇస్లామాబాద్: రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ (రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడం) చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం పాక్ ప్రభుత్వం రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది. ఈ చట్టాలను కేబినెట్ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్ కాస్ట్రేషన్ ప్రభావం కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్ టెస్ట్‌ను నిషేధిస్తారు. -
మహానాడు వేదికగా.. ఓటుకు కోట్లు కుట్ర
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బు తో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. తనను ఈ కేసులో అక్రమంగా ఇరి కించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై ఏసీబీ ఇటీవల కౌంట ర్ దాఖలు చేసింది. సండ్ర వాదనను ఏసీబీ తోసిపుచ్చింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా ఈ కుట్రలో భాగస్వామిగా మారారని పేర్కొంది. శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని తెలిపింది. అలాగే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమే యం స్పష్టంగా ఉన్నాయంది. సండ్ర పాత్రపై ఆధారాలున్న నేపథ్యంలోనే.. 2015, జూలై 6న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, తర్వాత అన్ని ఆధారాలతో 2017, ఫిబ్రవరి 18న అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని వివరించింది. ఎఫ్ఐఆర్, దర్యాప్తు తర్వాత దాఖలు చేసిన చార్జి షీట్లో ఆయన్ను చేర్చలేదని, తర్వాత లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా సండ్ర పాత్రపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది. డబ్బు తెచ్చింది ఉదయసింహనే... రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్.. సీఫ్టెన్సన్ను ప్రలోభపెట్టారని ఏసీబీ వివరించింది. స్టీఫెన్సన్కు అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చేం దుకు టీడీపీ ఎమ్మెల్యేలు బస చేసిన శంషాబాద్ నోవాటెల్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి బయలు దేరారని తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015, మే 31న మధ్యాహ్నం 4.40 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారు (మహీంద్రా స్కార్పియో–ఏపీ 09 సీవీ 9939) లో వచ్చారని వెల్లడించింది. వారు వచ్చిన కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారు (టీఎస్10యుఏ 1031)లో రూ.50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. తెచ్చిన డబ్బును సంచిలో నుంచి తీసి టీపాయ్‌పై పెట్టింది కూడా ఉదయసింహనే అని తెలిపింది. ఈ సమయంలో వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని మరోసారి రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్సన్ను కోరారని, మిగిలిన రూ.4. 5 కోట్లను ఓటింగ్ తర్వాత ఇస్తామని వాగ్ధానం చేశారని పేర్కొంది. ‘డబ్బు ఎక్కడి నుంచి తేవా లని చెప్పేందుకు నాగోలు చౌరస్తాకు రమ్మని ఉదయసింహకు రేవంత్‌రెడ్డి సూచించారు. మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి వేం కృష్ణకీర్తన్ రెడ్డి నుంచి సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను తీసుకురావాలని రేవంత్‌రెడ్డి.. ఉదయసింహకు చెప్పారు. ఈ కేసులో ఉదయసింహ పాత్ర ను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నా యి. ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలి’అని ఏసీబీ నివేదించింది. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణలో భాగం గా శుక్రవారం రేవంత్‌రెడ్డి, సండ్ర తదితరులు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా న్యాయమూర్తి అనుమతించారు. తదుపరి విచా రణను ఈనెల 27కి వాయిదా వేశారు. -
30న బాబ్రీ కూల్చివేత తీర్పు
లక్నో: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు ఈ నెల 30న తీర్పు వెల్లడించనుంది. కూల్చివేత ఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక తీర్పు రాబోతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీమనోహర్ జోషి సహా 32 మంది అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసుని విచారిస్తున్న లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే యాదవ్ తీర్పు వెలువడే 30వ తేదీన నిందితులు అందరూ న్యాయస్థానానికి హాజరు కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఉమా భారతి, కళ్యాణ్ సింగ్, వినయ్ కటియార్, స్వాధి రితంబర వంటి బీజేపీ సీనియర్ నాయకులు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 28 ఏళ్లుగా విచారణ కొనసాగుతున్న బాబ్రీ కేసులో ఈ నెల 1న వాదనలు పూర్తయ్యాయి. 351 సాక్షులు, 600 డాక్యుమెంట్లు బాబ్రీ కేసుని విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగు తుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ వాదనలు వినిపించింది. 1992 డిసెంబర్ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. -
బలవంతంగా ఒప్పించారు: రియా
ముంబై: ముంబైలోని బైకుల్లా జైల్లో ఉన్న రియాచక్రవర్తి తనకు జైల్లో ప్రాణభయం ఉన్నదనీ, తనపై మోపినవి బెయిలబుల్ నేరాలు కనుక తక్షణమే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. తాను అమాయకురాలిననీ, తనని తప్పుడు కేసులో ఇరికించారనీ రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారం మెజిస్ట్రేటు కోర్టు రియా బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్‌లు నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద బెయిల్ కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించారు. రియాని ప్రశ్నించింది పురుష అ«ధికారులేనని ఆమె న్యాయవాది సతీష్ మనే షిండే అన్నారు, ఆ సమయంలో కనీసం మహిళా పోలీసు అధికారి కానీ, కానిస్టేబుల్ కానీ లేకపోవడాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. నేరం అంగీకరించేలా రియాపై ఒత్తిడిచేశారని ఆమె లాయర్ ఆరోపించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ల బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు రానుందని షిండే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మంగళవారం స్థానిక కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు జ్యూడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. నేరం రుజువైతే రియా, ఆమె సోదరుడు షోవిక్ పదిసంవత్సరాలకు తగ్గకుండా కారాగార శిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. -
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ : ఆడపిల్లల రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల కేసులు (పోక్సో) విచారణ కోసం ఈ ప్రత్యేక కోర్టులు పనిచేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. వందకు పైగా పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్న చోట కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప , అనంతపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది. జిల్లా జడ్జి క్యాడర్‌తో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు పనిచేయనున్నాయి. కాగా మహిళ రక్షణ కొరకు ఏపీ సర్కార్ ఇదివరకే దిశ చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. -
నీరవ్ మోడీకి షాకిచ్చిన స్పెషల్ కోర్టు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంక్(పీఎన్బీ)ను మోసం చేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా నీరవ్ మోడీకి చెందిన రూ.1,400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ, ఐటీ జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అయితే ఆస్తులను జప్తు చేసే ముందు నీరవ్ మోడీకి అప్పీలు చేయడానికి 30 రోజుల సమయం ఇవ్వాలని కోర్టు తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లో ఉంటున్నారు. భారత్ దాఖలు చేసిన పిటిషన్‌పై గత ఏడాది లండన్ కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోడీని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి: బెదిరిస్తున్న నీరవ్ మోదీ -
జైపూర్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
జైపూర్: 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. ‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీచంద్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీల్దో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు. -
17 రోజుల్లోనే జీవిత ఖైదు
జైపూర్: చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 17 రోజుల్లోనే తీర్పు ప్రకటించి రాజస్తాన్‌లోని ఒక పోక్సో (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) ప్రత్యేక కోర్టు చరిత్ర సృష్టించింది. చురు జిల్లాలో నవంబర్ 30వ తేదీన 21 ఏళ్ల దయారాం మేఘ్వాల్ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మర్నాడే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 7వ తేదీన చార్జిïషీటు దాఖలు చేశారు. డిసెంబర్ 17న దయారాంకు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అంటే, 17 రోజుల్లోనే పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణ, తీర్పు.. అన్నీ ముగిశాయి. ‘పోలీసులు చురుగ్గా పనిచేశారు. సకాలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. బాధిత బాలిక వాంగ్మూలం కీలక పాత్ర పోషించింది. కోర్టు రోజువారీ విచారణ జరిపింది. దాంతో త్వరితగతిన తీర్పు సాధ్యమైంది’ అని చురు జిల్లా ఎస్పీ తేజస్విని గౌతమ్ వివరించారు. దోషి దయారాం తండ్రికి కూడా గతంలో ఒక రేప్ కేసులో జైలు శిక్ష విధించారు. -
జైపూర్ పేలుళ్లు : నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు
జైపూర్ : 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులను బుధవారం దోషులుగా తేల్చింది. ఒకరిని బెనిఫిట్ ఆఫ్ డౌట్‌గా వదిలేసింది. వివరాలు.. 2008 మే నెలలో జైపూర్ పాత నగరంలోని హనుమాన్ ఆలయ సమీపంలో 9 వరుస పేలుళ్లు జరిగాయి. 2 కిలోమీటర్ల వ్యాసార్ధంలో, 15 నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 72 మంది మృతి చెందగా, 170 మంది గాయపడ్డారు. అనంతరం అప్రమత్తమైన పోలీసులు స్థానిక హనుమాన్ ఆలయ సమీపంలోని ఒక బాంబుతో పాటు నాలుగు బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో అనేక మంది హనుమాన్ భక్తులు, విదేశీ పర్యాటకులు వస్తుండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన హర్కతుల్ జిహాదీ ఇస్లామీ (హుజి) అనే ఉగ్రవాద సంస్ధ హస్తం ఉన్నట్టు అనుమానించిన పోలీసులు.. మొహమ్మద్ షాబాజ్ హుస్సేన్, మొహమ్మద్ సైఫ్ అకా కారియోన్, మొహమ్మద్ సర్వార్ అజ్మి, మొహమ్మద్ సైఫ్ అలియాస్ సైఫుర్ రహమాన్ అన్సారీ, మొహమ్మద్ సల్మాన్‌లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించిన రాజస్థాన్ ఏటీసీ విభాగం ఐదుగురిని అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు విచారణ కొనసాగగా, ప్రత్యేక కోర్టు బుధవారం నలుగురిని దోషులుగా ప్రకటించింది. -
జిల్లాల్లో 2 పోక్సో కోర్టులు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద 300 పైగా ఎఫ్ఐఆర్లు పెండింగ్‌లో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. 100కు పైగా పొక్సొ కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక పొక్సొ కోర్టును ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పష్టతనిచ్చింది. ‘పోక్సో కేసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోక్సో కోర్టుల్లోనే విచారించాలి. ఈ కోర్టులు వేరే కేసులను విచారించకూడదు. జిల్లాల్లో పోక్సో పెండింగ్ కేసులు 100కు పైగా ఉంటే ఒక ప్రత్యేక కోర్టు, 300కు పైగా ఉంటే 2 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి’ అని పేర్కొంది. అయితే, జిల్లాలో 100 కన్నా తక్కువ పోక్సో కేసులు పెండింగ్‌లో ఉంటే.. ఇతర అత్యాచార కేసులను ఆ కోర్టులు విచారించవచ్చని వివరించింది. -
సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు బుధవారం ఆమోదం తెలిపింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసిఫాబాద్ జిల్లాలోని ఎల్లాపటార్‌లో గత నెల 24న ముగ్గురు యువకులు దళిత మహిళపై సామూహికంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. దిశ ఘటన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించిందని మంత్రి గుర్తు చేశారు. సమత కేసులో కూడా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దోషులకు వెంటనే శిక్షలు పడేలా, భాదితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. (చదవండి: వివాహితపై అత్యాచారం.. హత్య) -
వావివరసలు మరిచి.. పశువులా మారి!
సాక్షి, విజయవాడ: జస్టిస్ ఫర్ దిశా వివాదం నడుస్తున్న తరుణంలో విజయవాడ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వరుసకు కూతురైన మైనర్ బాలికను చెరపట్టి అత్యాచారం చేసిన మారుతండ్రికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదిగో ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి పేరు సైకం కృష్ణారావు. ఇబ్రహీంపట్నం వాసి. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు బిడ్డల తల్లిపై మనసు పడ్డాడు. తనకు భార్యలేదని.. ఒప్పుకుంటే పెళ్లిచేసుకొంటానని ఆమెకు ప్రపోజ్ చేశాడు. తన పిల్లలని కన్నబిడ్డల్లా చూసుకుంటానని బాస చేశాడు. భర్తతో తెగతెంపులు చేసుకొని పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ వివాహిత కృష్ణారావు ప్రతిపాదనకు ఒప్పుకుంది. ఈ క్రమంలో పదకొండేళ్ళుగా ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కొడుకు, కూతురు బాగా చదువుకుంటుండటంతో ఆ తల్లి మురిసిపోయేది. పదో తరగతి చదువుతున్న కూతురిపైనే కన్నేశాడు మారుతండ్రి కృష్ణారావు. తల్లి బైటికెళ్లిన సమయంలో మాటేసి కాటేశాడు. వరసకు కూతురన్న కనికరం కూడా లేకుండా పశువులా మారి కామవాంఛ తీర్చుకొన్నాడు. వావివరసలు మరిచి శునకానందం పొందాడు. ఇంటికొచ్చిన తల్లికి జరిగిన ఘోరం చెప్పి కన్నీటిపర్యంతమైంది కూతురు. అపరాకాళిగా మారిన ఆ తల్లి కృష్ణారావుకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో ఏడాది తిరక్కముందే కేసు విచారణకు కొచ్చింది. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కృష్ణారావును దోషిగా తేల్చారు. అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు. ఈ తీర్పుతో బాధితురాలు, ఆమె తల్లీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దిశా హత్యాచార కేసుపై పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు పట్ల సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతోంది. -
జస్టిస్ ఫర్ దిశ!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’పై జరిగిన గ్యాంగ్‌రేప్, హత్య కేసును వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడటంతో అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘దిశ’ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. -
బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి
న్యూఢిల్లీ: మీ తీర్పును 9 నెలల్లోగా వెల్లడించాలని బాబ్రీ మసీదు కూల్చివేత కేసును విచారిస్తున్న స్పెషల్ కోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. స్పెషల్ కోర్టులోని ఆ జడ్జి పదవీ కాలాన్ని తీర్పు వెల్లడించే వరకు పొడిగించింది. సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో బీజేపీ ప్రముఖులు అద్వానీ, ఎమ్ఎమ్ జోషీ, ఉమాభారతి సహా పలువురు నిందితులుగా ఉన్నారు. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో సాక్ష్యాల నమోదును కచ్చితంగా 6 నెలల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనున్న జడ్జి పదవీకాలాన్ని పొడిగించేందుకు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. యూపీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఐశ్వర్య భాతీ వాదిస్తూ.. జ్యుడీషియల్ అధికారుల పదవీకాలాన్ని పొడిగించే నిబంధనలు ఏమీలేవన్నారు. కేసు పూర్తయ్యేంత వరకు పదవీకాలాన్ని పొడిగించమని ఆదేశిస్తున్నామని, ఒకవేళ కేసు తీర్పు వెలువరించేందుకు రెండేళ్లు పట్టినా అప్పటివరకు పదవీకాలాన్ని పొడిగించాల్సిందేనని వ్యాఖ్యానించింది. -
అయోధ్య ఉగ్రదాడి కేసు : నలుగురికి జీవిత ఖైదు
లక్నో : 2005 అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వారికి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో ఓ వ్యక్తిని నిర్ధోషిగా వెల్లడించింది. 2005, జులై 5న ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు భక్తుల మాదిరి జీప్‌లో చేరుకుని అయోధ్యలోని వివాదాస్పద రామ మందిర ప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. భద్రత సిబ్బందిని నిలువరించి లోపలికి వెళ్లేందుకు బారికేడ్ల వద్ద తాము వచ్చిన వాహనంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో వాహనంలో ఉన్న నిందితులు గ్రనేడ్లు విసురుతూ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ వివాదాస్పద స్ధలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించారు. 90 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం వివాదాస్పద స్ధలానికి 70 మీటర్ల దూరంలో సీతా రసోయి ఆలయం వద్ద మిగిలిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఓ మహిళ సహా ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. కాగా ఈ కేసులో నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ ప్రయాగరాజ్ ప్రత్యేక న్యాయస్ధానం స్పెషల్ జడ్జి దినేష్ చంద్ర తీర్పు వెలువరించారు. -
‘తను పదే పదే జ్ఞాపకం వస్తోంది’
కశ్మీర్ : ఏడాదిన్నర క్రితం కథువాలో జరిగిన దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. కోర్టు తీర్పు తమకు సంతృప్తినివ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా భావించిన వ్యక్తినే నిర్దోషిగా విడుదల చేయడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘నా కూతుర్ని గుర్తు చేసుకోకుండా ఒక్క రోజు కూడా గడవడంలేదు. తను నాకు పదే పదే గుర్తుకొస్తుంటుంది. నా కళ్ల ముందే ఉన్నట్లు అన్పిస్తుంది. సోమవారం తీర్పు వస్తుందని నాకు చెప్పారు. కానీ కోర్టుకు వెళ్లి కూర్చోవాలనిపించలేదు. పదే పదే జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకోవాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే కోర్టుకు వెళ్లలేదు. అయితే తీర్పు గురించి విన్నప్పుడు నాకు సంతోషం కలగలేదు. ఏడగురు నిందితులకు మరణ శిక్ష పడాలని భావించాను. కానీ తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. సంపూర్ణ న్యాయం జరిగినట్లు అనిపించడం లేద’న్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నా చిట్టితల్లి సమాధి దగ్గరికి వెళ్లాను. దుఃఖం ఆగలేదు. నేటికి కూడా తనను తల్చుకోని ఏడుస్తూనే ఉన్నాను. నా శోకం ఇప్పట్లో తీరదు. కనీసం తీర్పు అయినా మేం కోరుకున్న విధంగా వస్తే సంతోషించే వాళ్లం. కానీ అలా జరగలేదు. నిందితులందరిని ఉరి తీస్తేనే నా చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది. న్యాయం జరుగుతుంద’న్నారు. నిరుడు జనవరిలో జమ్మూలోని కథువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు. -
మరణించేవరకు జైలు జీవితమే..
పఠాన్‌కోట్: ఏడాదిన్నర క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్‌ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసిందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఫరూఖీ ఖాన్ చెప్పారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసును సంవత్సరంపాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసును జమ్మూ కశ్మీర్లో కాకుండా బయటి కోర్టు విచారించాలని గతేడాది మే 7న సుప్రీంకోర్టు ఆదేశించడంతో పఠాన్‌కోట్ కోర్టు ఈ కేసును విచారించింది. రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద కోర్టు వారిని దోషులుగా తేలుస్తూ, బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో వేచి ఉండగా తీర్పు వెల్లడించింది. కోర్టులోకి విలేకరులను అనుమతించలేదు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా, వారిలో నలుగురు పోలీసులే కావడం గమనార్హం. మరణించేవరకు జైలు జీవితమే.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్కుమార్లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరిని దోషులుగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టంగా వివరించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్‌లు కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు సంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలిక సంచార జాతికి చెందిన అమ్మాయి కాగా, వారి మైనారిటీ జాతిని పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా పకడ్బందీగా కుట్ర పన్ని ఈ నేరానికి ఒడిగట్టారని చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. తీర్పుపై మెహబూబా హర్షం.. కోర్టు తీర్పు పట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు హర్షం వ్యక్తం చేశారు. ‘నేరస్తులను చట్టానికి లోబడి వీలైనంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరస్తులకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను ఏదైనా అనడానికి అసలు పదాలు లేవు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు గతంలో నిందితులకు మద్దతుగా నిలవడం తెలిసిందే. దోషులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చేయాలని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలంటూ హైకోర్టులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్మన్ రేఖా శర్మ కోరారు. మరణశిక్ష పడుతుందనుకున్నాం.. ‘నేరస్తులకు మరణశిక్ష పడుతుందని మేం ఆశించాం. నిర్దోషిగా బయటపడిన వ్యక్తీ.. ప్రధాన నిందితుడేనని మేం వింటున్నాం. అలాంటప్పుడు అతణ్ని ఎందుకు విడుదల చేశారు’అని బాలిక తండ్రి అన్నారు. బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తాము కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం పై కోర్టుకు వెళ్తామనీ, నిర్దోషిగా విడుదలైన విశాల్‌ను దోషిగా తేల్చాలని అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ బాలనేరస్థుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, ఏడుగురిపై విచారణను ఈ కోర్టు చూసుకుంది. ఎప్పుడేం జరిగిందంటే.. ► 2018 జనవరి 10: కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలిక గుర్రాలను మేపుతుండగా ఆమె ఆచూకీ గల్లంతు. ► జనవరి 12: బాలిక తండ్రి ఫిర్యాదుతో హీరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ► జనవరి 17: బాలిక మృతదేహం లభ్యం. గ్యాంగ్‌రేప్ తర్వాత చంపేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి. ► జనవరి 22: దేశవ్యాప్త నిరసనలతో జమ్మూ కశ్మీర్ క్రైం బ్రాంచ్‌కు కేసు బదిలీ. ► ఫిబ్రవరి 16: నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన హిందూ ఏక్తా మంచ్. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. ► మార్చి 1: ప్రధాన నిందితుడు, ఆలయ సంరక్షకుడు సంజీరామ్ను బంధువైన బాల నేరస్తుడి అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు. ► ఏప్రిల్ 9: మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా తేల్చి, వారిలో ఏడుగురిపై అభియోగపత్రాన్ని కఠువా కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ► ఏప్రిల్ 10: బాల నేరస్తుడినని చెప్పుకున్న ఎనిమిదో వ్యక్తి పైనా అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు. ► ఏప్రిల్ 14: మంత్రివర్గం నుంచి తప్పుకున్న చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. బాధితులకు న్యాయం చేయాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్. ► ఏప్రిల్ 16: కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు విచారణ ప్రారంభం. ► మే 7: కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు విచారణను మార్చిన సుప్రీంకోర్టు. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు. ► 2019 జూన్ 3: విచారణను ముగించిన పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు. ► జూన్ 10: దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లyì ంచిన కోర్టు. సాంజీ రామ్ కఠువా దోషులు దీపక్ ఖజురియా ఎస్సై ఆనంద్ దత్తా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ -
కథువా హత్యాచార కేసు : ముగ్గురికి జీవిత ఖైదు
చండీగఢ్ : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన పఠాన్‌కోట్ స్పెషల్ కోర్టు సోమవారం మధ్యాహ్నం వారిలో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్‌కుమార్‌లకు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్ధానం తుదితీర్పు వెలువరించింది. కాగా, జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
‘సంఝౌతా’లో అసిమానంద్ నిర్దోషి
పంచకుల: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి జగ్దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్ అనే పాక్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు పంపిన నోటీసులు తమకు అందలేదని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము భారత్‌కు రాకుండా అధికారులు వీసాలు నిరాకరించారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని ఎన్ఐఏ న్యాయవాది రాజన్ మల్హోత్రా ఖండించారు.ఈ కేసులో అసిమానంద్ ఇప్పటికే బెయిల్‌పై బయట ఉండగా, మిగతా ముగ్గురు నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. అసలేం జరిగింది? ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్ పౌరులే. అక్షర్ధామ్(గుజరాత్), సంకట్మోచన్ మందిర్(వారణాసి), రఘునాథ్ మందిర్(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్ఐఏ చార్జిషీట్లో తెలిపింది. భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు ఈ ఉగ్రదాడిలో చాలామంది పాకిస్తానీలు ప్రాణాలు కోల్పోయారనీ, దోషులను శిక్షించేందుకు భారత విచారణ సంస్థలు సరైనరీతిలో పనిచేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు సమన్లు జారీచేసి నిరసన తెలిపింది. మతవిద్వేషానికి కేరాఫ్ అసిమానంద్ పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా కమర్పకూర్‌లో స్వామి అసిమానంద్ జన్మించాడు. పాఠశాల స్థాయిలోనే హిందుత్వ సంస్థ పట్ల ఆకర్షితులయ్యాడు. 1971 సైన్స్ విభాగంలో డిగ్రీ చేశాక వన్‌వాసీ కల్యాణ్ ఆశ్రమంలో సేవకుడిగా చేరాడు. క్రైస్తవ మిషనరీలకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలివ్వడలో దిట్ట. 1990ల్లో గుజరాత్‌లోని దంగ్ జిల్లాలో శబరి ధామ్ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని మక్కా మసీదు, మహారాష్ట్రలోని మాలేగావ్, రాజస్తాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో అసిమానంద్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ మూడు కేసుల్లోనూ అసిమానంద్ నిర్దోషిగా తేలారు. -
డేరా బాబాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై పంచకుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డేరాబాబాతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు. (జేజేల నుంచి.. జైలు దాకా...!) ఇక ఇప్పటికే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్షపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెలువరించాక జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో 36 మంది చనిపోయారు. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. (రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా) -
తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష
చెన్నై: తమిళనాడు మంత్రి బాలకృష్ణారెడ్డికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. 1998లో హోసూర్‌లో బస్సుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ఆయనకు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లేలా వ్యవహరించినందుకు గాను న్యాయస్థానం ఆయన శిక్ష విధిస్తూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 108 మంది నిందితులు ఉండగా, వారిలో 16 మందిని కోర్టు దోషులుగా తెల్చింది. ఈ తీర్పుతో బాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, మంత్రి పదవిని కోల్పోనున్నారు. కాగా, ప్రత్యేక కోర్టు తీర్పుపై బాలకృష్ణారెడ్డి మంగళవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా సమాచారం. కాగా, తమిళనాడు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణారెడ్డి హోసూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
యాదాద్రి చిన్నారుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన వ్యవహారంపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఇది బాలల స్నేహపూర్వక కోర్టుగా ఉంటుందని పేర్కొంది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరికొందరు కూడా పిల్ దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. న్యాయవాది వసుధా నాగరాజ్ వాదిస్తూ పిల్లలను వారి తల్లులు కలుసుకునే అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఓ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. సిట్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ వారు జన్మనిచ్చిన తల్లులు కాదని, పెంచిన తల్లులని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తిచేస్తారో, చార్జిషీట్ దాఖలు చేస్తారో తెలపాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) కోర్టు ఆదేశి స్తూ విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. -
జంట హత్యల కేసులో దోషిగా తేలిన రాంపాల్
సాక్షి, న్యూఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే రాంపాల్ బాబా రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. హర్యానాలోని హిసార్ కోర్టు గురువారం ఆయనను జంట హత్యల కేసులో దోషిగా నిర్ధారించింది. ఈనెల 16, 17 తేదీల్లో ఆయనకు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. పెద్ద ఎత్తున శిష్యగణం కలిగిన రాంపాల్ ప్రస్తుతం హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు. తన అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించడం, పలువరు గాయపడిన ఘటనకు సంబంధించి 2015 నవంబర్‌లో రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించింది. తీర్పు నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు హిసార్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1800 మంది పోలీసులను నియోగించారు. 2017 ఆగస్ట్‌లో డేరా బాబాను దోషిగా తేల్చిన సందర్భంలో పంచ్కులలో చెలరేగిన ఘర్షణలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రాంపాల్ అనుచరులు హిసార్లోకి ప్రవేశించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
ఏపీ స్పీకర్ కోడెలకు చుక్కెదురు
సాక్షి, కరీంనగర్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావుకు కరీంనగర్ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టానని తానే స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. ఎన్నికల నిబంధనల్లోని వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కోర్టు విచారణ చేసింది. అంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు పెట్టారు? ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎవరికి పెట్టారో విచారణ జరపాలని పిటిషనర్ కోర్టును కోరారు. అలాగే రూ.11 కోట్ల 50 లక్షలు ఎలా వచ్చాయో ఐటీ అధికారులతో విచారించాలని పిటిషనర్ కోరారు. ఇదే కేసులో స్పీకర్ కోడెల శివ ప్రసాద్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. గత నెల 27తో స్టే ముగిసింది. దీంతో ఈ నెల 10న నేరుగా హాజరు కావాలని ఏపీ స్పీకర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆగస్టు 27న కోర్టుకు రండి
ముంబై: ఆగస్టు 27వ తేదీన తమ ముందు హాజరుకావాలని మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిల ఎగవేత కేసులో ఈడీ విజ్ఞప్తి మేరకు.. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద కోర్టు సమన్లు జారీ చేసింది. గడువు తేదీలోగా మాల్యా హాజరుకాకపోతే అతన్ని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడంతో పాటు.. అతనికి సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇటీవల మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌తో పాటు.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఎంఎస్ అజ్మీ ఈ నోటీసులు జారీచేశారు. పరారీలో ఉన్న రుణ ఎగవేతదారులపై చర్యల కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్’ కింద ఒకరిపై చర్యలు ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. పరారీలోని వ్యక్తుల ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. మాల్యాకు చెందిన రూ. 12,500 కోట్ల ఆస్తుల్ని తక్షణం స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని కూడా కోర్టును ఈడీ కోరింది. రెండు నాన్‌బెయిలబుల్ వారంట్లు రుణం ఎగవేత కేసుల్లో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ మాల్యాపై ఈడీ దాఖలు చేసిన రెండు కేసుల్లో ఇంతకుముందే కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, అతని కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీ కలిపి ప్రస్తుతం రూ. 9,990.07 కోట్లకు చేరింది. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల విషయమై మాల్యా స్పందిస్తూ.. బ్యాంకు రుణం ఎగవేత ఘటనలకు తాను ప్రచారకర్తగా మారిపోయాననడం తెల్సిందే. తన వాదనను వివరిస్తూ 2016 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రికి లేఖ రాసినా స్పందించలేదని, ప్రభుత్వం అనుమతిస్తే ఆస్తుల్ని అమ్మి రుణాలు చెల్లిస్తానని చెప్పారు. మాల్యా రీట్వీట్‌పై బీజేపీ విమర్శలు న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ట్వీట్‌ను విజయ్ మాల్యా రీపోస్టు చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మహాకూటమికి మోసగా డు మద్దతు తెలిపాడంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేసింది. బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో మాల్యా ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించాడని, అతను చేసిన రీట్వీట్ దానిని ఇప్పుడు బయటపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే బ్యాంకుల నుంచి మాల్యా రుణాలు పొందాడని ఆయన పేర్కొన్నారు. నల్లధనంపై మోదీ ప్రభుత్వ హామీల్ని తప్పుపడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ట్వీట్‌ను ఇటీవల మాల్యా రీట్వీట్ చేయడం గమనార్హం. -
హవాలా కేసులో కర్ణాటక మంత్రి
సాక్షి, బెంగళూరు: హవాలా వ్యవహారంతో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు సంబంధం ఉందని ఐటీ అధికారులు గురువారం బెంగళూరు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. మంత్రి శివకుమార్ లెక్కల్లో చూపని రూ.5 కోట్ల నగదును ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి అందజేసినట్లు ఐటీ శాఖ పేర్కొంది. 2017 జనవరి 1న ఏఐసీసీకి రూ.3 కోట్లు, అదే నెల 9న మరో రూ.2 కోట్లు కర్ణాటక కాంగ్రెస్ నేత ద్వారా ఏఐసీసీకి అందజేసినట్లు తెలిపింది. ఇందుకోసం తన హవాలా నెట్‌వర్క్‌ను వినియోగించుకున్నారని ఆరోపించింది. గతేడాది ఆగస్టులో శివకుమార్, అతని అనుచరుల ఇళ్లు, ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు జరిపి రూ.20 కోట్ల నగదుతోపాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకునే శివకుమార్‌పై ఐటీ అధికారులు తాజాగా ఫిర్యాదు చేశారు. పన్ను ఎగవేత కేసుల్లో ఇది ఆయనకు నాలుగో నోటీసు కావటం గమనార్హం. -
క్యాష్ స్కాండల్ ఉచ్చులో శివకుమార్!
బెంగళూరు : క్యాష్ స్కాండల్‌లో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంటోంది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల ఆస్తులపై దాడులు చేసిన ఆదాయపు పన్నుశాఖ తాజాగా కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేసింది. ఆర్థిక పరమైన కేసుల్లో శివకుమార్‌కు సంబంధం ఉందని బెంగళూరు ప్రత్యేక కోర్టుకు ఐటీశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. హవాలా (నగదు మార్పిడి) రాకెట్ కేసులో శివకుమార్‌కు హస్తం ఉందని గతంలోనూ ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఐటీశాఖ మరో అడుగు ముందుకేసి శివకుమార్‌పై నమోదైన కేసులు, ఆరోపణలను స్పెషల్ కోర్టుకు వివరించింది. గతంలోనూ పన్ను ఎగ్గొట్టిన కేసుల్లో ఐటీశాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతేడాది ఆగస్టులో శివకుమార్ ఇళ్లు, ఆస్తులపై ఐటీశాఖ ఆకస్మిక దాడులు చేసింది. మంత్రి ఇంటి నుంచి రూ. 20 కోట్ల నగధును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏఐసీసీకి ఆ పార్టీ నేత శివకుమార్ మొత్తం 5 కోట్ల రూపాయాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయ. 2017 జనవరి 1న ఏఐసీసీకి రూ.3 కోట్లు, అదే జనవరి 9న మరో 2 కోట్ల రూపాయలు డీకే చెల్లించినట్లు ఐటీశాఖ పేర్కొంది. క్యాష్ స్కాండల్ (నగదు కుంభకోణం) కాంగ్రెస్ పార్టీని బోనులో నిలబెట్టేలా కనిపిస్తోంది. కాగా శివకుమార్‌పై నమోదైన కేసులపై ఐటీశాఖ తమ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. -
ముషార్రఫ్‌కు భారీ షాక్; పాస్‌పోర్టు రద్దు..!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌కు ఆ దేశ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజ్యద్రోహం కేసులో కోర్టుకు హాజరవ్వనందుకు ప్రత్యేక న్యాయస్థానం ముషార్రఫ్ పాస్‌పోర్టును రద్దు చేయాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా జాతీయ గుర్తింపు కార్డును రద్దు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసింది. ముషార్రఫ్ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు అతనిపై రాజ్యద్రోహం కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ముషరాఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీలు జరపకుండా ఉండాలనే లక్ష్యంతోనే కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డేటా బేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్టు డైరెక్టరేట్ కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించాయి. కోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తే ముషార్రఫ్ ఇతర దేశాలకు వెళ్లే అవకాశంతో కొల్పోవడంతోపాటు, బ్యాకింగ్ సేవలను వినియోగించుకోలేరు. -
ఆశారాం కేసులో తీర్పు రిజర్వు
జోధ్‌పూర్: రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంపై తీర్పును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ కేసులో గత 5 నెలలుగా సాగుతున్న వాదనలు శనివారంతో ముగియగా జడ్జి తీర్పును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. రాజస్తాన్‌లోని మనాయి గ్రామం సమీపంలో ఆశారాం ఆశ్రమం ఉంది. ఆశారాం తనను రేప్ చేశారని అదే ఆశ్రమంలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 2012లో పోలీసులకు ఫిర్యాదుచేయడంతో 2013లో ఆశారాంను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉంటున్న ఆయనకు నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది. -
తెలంగాణలో చైల్డ్ ఫ్రెండ్లీ ప్రత్యేక కోర్టు!
సాక్షి, హైదరాబాద్ : లైంగిక వేధింపులకు గురయిన బాలల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని, ఈ భరోసా సెంటర్లో బాధితులకు కౌన్సెలింగ్‌తోపాటు పునరావాసం కల్పిస్తున్నామని ఆయన శనివారం విలేకరులకు తెలిపారు. గత రెండేళ్లలో పోక్సో (POCSO) చట్టం కింద బాలలపై నమోదైన వేధింపుల కేసులను భరోసా సెంటర్లో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కానీ వేధింపుల బారిన పడే బాలలకు అండగా ఉండేందుకు, వారికి సత్వర న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటుచేస్తున్నామని, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారిస్తుందని ఆయన తెలిపారు. -
నీరవ్, చోక్సీలపై వారెంట్లు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.12,700 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పై ఇక్కడి ప్రత్యేక కోర్టు శనివారం నాన్‌బెయిలబుల్ వారెంట్లు(ఎన్బీడబ్ల్యూ) జారీచేసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్(ఈడీ) మూడు సార్లు సమన్లు జారీచేసినప్పటికీ వీరిద్దరూ స్పందించకపోవడంతో ఆ సంస్థ ఫిబ్రవరి 27న కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈడీ విజ్ఞప్తి మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద న్యాయ స్థానం నిందితులపై ఎన్బీడబ్ల్యూను జారీచేసింది. -
ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయండి
విశాఖ సిటీ/విశాఖ లీగల్: ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాకపల్లి అత్యాచార బాధితులు విశాఖలో ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానాన్ని కోరారు. తమకు పరి హారం చెల్లించాలని, కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. 2007 ఆగస్టు 20న విశాఖజిల్లా జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయతీ వాకపల్లిలో తమపై 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారని 11మంది కోండు ఆదివాసీ మహిళలు దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. బాధిత మహిళలతోపాటు, నిందితులైన 13 మంది పోలీసులు మంగళవారం ఎస్సీ, ఎస్టీ కోర్టుకు హాజరయ్యారు. పాడేరు పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ ఎ.రవికుమార్, అనకాపల్లి టౌన్ పోలీస్ కానిస్టేబుళ్లు డి.రవికుమార్, డీవీఆర్ సురేశ్, కె.దేవుళ్లు, టి.ప్రసాద్, ఎస్.తాత బాబు, డి.సింహాచలం, ఆర్.చంద్రశేఖర్, ఆర్.దేవనాథ్, ఎస్.శ్రీనివాసరావు, చోడవరం పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు ఆర్.శ్రీను, సీహెచ్ విజయ్‌కుమార్ తదితరులు నింది తులుగా ఉన్నారు. సంఘటన జరిగినప్పుడు బాధిత మహిళలు పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించగా వీరిలో 8 మందిపై కేసు కొట్టేసింది. మిగిలిన 13 మంది తమపై కేసు ఎత్తేయాలని సుప్రీంకోర్టులో గత ఏప్రిల్ 26న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 1న కొట్టేసింది. ఈ కేసులో వెంటనే ట్రయల్ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో విచారణ పూర్తిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద విశాఖలో ఏర్పాటైన కోర్టు విచారణను చేపట్టింది. మంగళవారం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలాది శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పోలీసులపై నేరాభియోగ పత్రంలో పేర్కొన్న విధంగా విచారణను ప్రారంభించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుల తరఫున న్యాయవాది ఎం.రవి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఒ.వెంకట నాగేశ్వరరావు కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు. -
వడ్డీ వ్యాపారానికి లైసెన్సు తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వడ్డీ వ్యాపారం చేయాలంటే ఇకపై తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన వడ్డీకే అప్పులు ఇవ్వాలి. అధిక వడ్డీలు వసూలు చేసినా, అక్రమాలకు పాల్పడినా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు ఏపీ వడ్డీ వ్యాపారుల చట్టం (క్రమబద్ధీకరణ) సంబంధిత బిల్లును ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను నిరోధించేందుకు 2000 సంవత్సరంలోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ చట్టంగా రూపుదిద్దుకోలేదు. ఆ తరువాత 2015లో వడ్డీ వ్యాపారుల బిల్లును శాసనసభ అమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా బిల్లును తిరిగి పరిశీలించాలంటూ రాష్ట్రానికి తిప్పి పంపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తీసుకురావడానికి వీలుగా బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అయితే ఒకపక్క చట్టం తీసుకువస్తూనే మరోపక్క.. ప్రభుత్వం కావాలనుకున్న వడ్డీ వ్యాపారులకు సదరు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చే వెసులుబాటును ఇదే బిల్లులో కల్పించడం గమనార్హం. బిల్లులోని మరికొన్ని అంశాలు.. వడ్డీ వ్యాపారానికి లైసెన్సు కావాలంటే ఆ వ్యాపారం స్థాయి ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తేదీ నుంచి 30 రోజుల్లోపల సంబందిత అధికారి లైసెన్సు మంజూరు చేయవచ్చు లేదా దరఖాస్తును నిరాకరించవచ్చు. దరఖాస్తుదారు మోసం చేసే దురుద్దేశంతో ఉన్నాడని భావిస్తే లైసెన్సును నిరా>కరించవచ్చు. లైసెన్సు కాలవ్యవధి మూడేళ్ల పాటు ఉంటుంది. ప్రతి వడ్డీ వ్యాపారి తన దుకాణం లేదా వ్యాపార స్థలంలో.. వడ్డీ వ్యాపారిగా తన పేరును ప్రాంతీయ భాషలో ప్రదర్శించాలి. ప్రభుత్వం నిర్ధారించిన మేరకు గరిష్ట వడ్డీ రేటును వ్యాపారి వసూలు చేసుకోవచ్చు. వడ్డీ వ్యాపారి తాను ఇచ్చిన అప్పునకు సంబంధించి రావలసిన డబ్బును లేదా ఆస్తిని పూర్తిగా లేదా పాక్షికంగా స్వీకరించేందుకు నిరాకరించినప్పుడు, రుణ గ్రహీత సదరు అప్పును లేదా ఆస్తిని అధీకృత న్యాయస్థానంలో డిపాజిట్ చేయవచ్చు. హామీ గల, హామీ లేని అప్పులకు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ధారిస్తుంది. నిర్ధారించిన వడ్డీ రేట్లను ఆవరణలో ప్రముఖంగా కన్పించేలా ప్రదర్శించాలి. వడ్డీ వ్యాపారి ఏదేని అప్పునకు సంబంధించి అసలు మొత్తానికి మించి వడ్డీ రూపంలో వసూలు చేయరాదు. అసలు అప్పునకు సమానంగా లేదా దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసినట్లయితే ఆ అప్పును తీర్చినట్లుగానే భావించాలి. ఎక్కువగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీ వ్యాపారి అప్పు తీసుకున్న వారికి తిరిగి చెల్లించాలి. వడ్డీ వ్యాపారి ఖాతా పుస్తకాలను నిర్వహించాలి. లైసెన్సింగ్ అధికారుల తనిఖీ నిమిత్తం వాటిని అందుబాటులో ఉంచాలి. ఖాతాలను సంవత్సరానికి కనీసం ఒకసారి ఆడిట్ చేయించాలి. అధిక వడ్డీ వసూలు చేస్తే జైలు నిర్ధారిత వడ్డీ రేట్లను కాకుండా వ్యాపారులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తే ఏడాది లేదా గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. మహిళలపై లైంగిక వేధింపులు లేదా వాటికి సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు వీలుగా న్యాయస్థానానికి ప్రత్యేక హోదా కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో అధిసూచన ద్వారా, తాము ఉచితమని భావించిన వడ్డీ వ్యాపారులకు షరతులకు లోబడి ఈ చట్టానికి చెందిన అన్ని లేదా ఏవైనా కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. డిపాజిట్ వివరాలు... ఏడాదిలో లక్ష రూపాయలకు మించని మొత్తాన్ని అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.5 వేలు డిపాజిట్ చేయాలి. రూ.లక్షకు మించి రూ.5 లక్షల లోపు అప్పులిచ్చే పక్షంలో రూ.10 వేలు, రూ.5 లక్షలకు మించి రూ.10 లక్షల లోపు మొత్తమైతే రూ.50 వేలు డిపాజిట్ చేయాలి. ఏడాదిలో రూ.10 లక్షలకు మించి రూ.25 లక్షల లోపు అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.లక్ష, రూ.25 లక్షలకు మించి రూ.50 లక్షలకు లోపు మొత్తమైతే రూ.1.5 లక్షలు, రూ.50 లక్షలకు మించి అప్పులిచ్చే లైసెన్సు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి. -
సీడీ ఇస్తే ఆలోచిస్తా: దినకరన్
న్యూఢిల్లీ: రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆడియో రికార్డింగ్స్ సీడీ కాపీ ఇవ్వాలని ప్రత్యేక కోర్టుకు అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మొర పెట్టుకున్నారు. దినకరన్ స్వర నమూనా సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్, ఇతరులతో దినకరన్ టెలిఫోన్లో జరిపిన సంభాషణలకు సంబంధించిన సీడీ నకలును ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టు జడ్జి పూనమ్ ఛౌదరిని కోరారు. స్వర నమూనా ఇవ్వాలా లేదా అనేది సీడీ పరిశీలించిన తర్వాత చెబుతామని దినకరన్ నిర్ణయం తీసుకుంటారని కోర్టుకు ఆయన తరపు లాయర్ తెలిపారు. స్వర నమూనా తిరస్కరించే హక్కు నిందితులకు ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. దినకరన్, చంద్రశేఖర్ స్వర నామూనాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న కోర్టు విచారించనుంది. మల్లికార్జున బెయిల్ పిటిషన్ కూడా అదే రోజు విచారణకు రానుంది. కాగా, దినకరన్, ఆయన సన్నిహితుడు మల్లికార్జున, హవాలా ఆపరేటర్ నాథూ సింగ్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు హాజరు పరిచారు. వీరికి విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 29 వరకు పొడిగించింది. -
జయలలిత కేసు విచారణ ఖర్చు ఎంతో తెలుసా ?
-
జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
⇒ 2003 నుంచి ఇప్పటివరకు అయిన ఖర్చు రూ. 5 కోట్లుగా లెక్క తేల్చిన అధికారులు ⇒ జయ సొత్తు వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి ఖర్చులు రాబట్టుకోనున్న కర్ణాటక సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులను జయ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి కర్ణాటక తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. జయ అక్రమాస్తుల కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ 2003 నవంబర్ 18న సుప్రీం కోర్టు తీర్చు చెప్పింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 27న కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేక కోర్టును, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2014 వరకు ఈ కోర్టులో విచారణ జరిగింది. ఈ పదేళ్లలో రూ. 2.86 కోట్లు ఖర్చయినట్లు లెక్కగట్టారు. ఈ కోర్టు, కార్యాలయం ఏర్పాటుకు రూ.4.81 లక్షలు, టెలిఫోన్ బిల్లులకు రూ.1.37 లక్షలు ఖర్చయినట్లు తేలింది. ప్రత్యేక కోర్టు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులే రూ.90.13 లక్షలయినట్లు తేలింది. తమిళ భాషలో ఉన్న వేలాది పేజీల దస్తావేజులను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడానికి రూ.6.51లక్షలు, వాటి జిరాక్స్‌కు రూ.2.17 లక్షలు ఖర్చయింది. తమిళనాడు సెషన్స్ కోర్టులోని దస్త్రాలను ఇక్కడికి తేవడానికి అయిన ఖర్చు రూ.8.63 లక్షలుగా తేల్చారు. ఇతరత్రా అన్ని ఖర్చులు మరో 1.70 కోట్లు అయిందని అధికారవర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా జయలలిత, శశికళ తదితరులు బెంగళూరుకు వచ్చినప్పుడు వారికి కల్పించిన భద్రతకే భారీగా ఖర్చయినట్లు సమాచారం. ప్రత్యేక కోర్టులో 2014లో విచారణ ముగిసింది. ఆ తర్వాత హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా జయలలిత, ఇతరులకు భద్రత, ఇతరత్రా ఖర్చులు, వారు జైలుకు వచ్చినప్పుడు అయిన ఖర్చులు కనీసం రూ. 2 కోట్లు అయ్యాయని అధికారులు వెల్లడించారు. జయ బృందం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో ఈ ఖర్చులను కర్ణాటక ప్రభుత్వం రాబట్టుకొంటుందని సమాచారం. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
'తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాం'
-
లొంగిపోయిన చిన్నమ్మ
చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు చేరుకున్న శశికళ బృందం - పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ప్రత్యేక కోర్టుకు హాజరు - ప్రత్యేక సదుపాయాలకు న్యాయమూర్తి తిరస్కృతి - అక్కడి నుంచి జైలుకు తరలింపు - శశి, ఇళవరసిలకు ఒకే గది.. శశికళకు ఖైదీ నెం 9234 సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కోరిన శశికళ విన్నపాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. శశికళతో పాటు ఇదే కేసులో దోషులుగా ఉన్న ఇళవరసి, సుధాకర న్లు కూడా వెళ్లారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక కోర్టులో తొలుత లొంగిపోయి అనంతరం వీరు జైలుకు వెళ్లాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక కోర్టును పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన శశికళ... పూమల్లి, పెరంబదూరు, కాంచీపురం, రాణీపేట, వెల్లూరు, వాణం బాడి, అంబూరు, క్రిష్ణగిరి, హోసూరు మీదుగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 5.15 గంటలకు జైలు వద్దకు శశికళ, ఇళవరసిలు ఒకే వాహనంలో వచ్చి కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి అశ్వత్థ నారా యణ వారితో ‘మీకు సుప్రీంకోర్టు శిక్ష విధించి న విషయం తెలిసిందా’అని అడిగారు. ఇందు కు వారు ‘తెలుసు, అందుకే ఇక్కడ లొంగిపోవ డానికి వచ్చామ’ని బదులిచ్చారు. వివరాల నమోదు, సాధారణ వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి అనుమతితో శశికల, ఇళవరసి లు పది నిమిషాల పాటు బంధువు లతో మాట్లాడారు. అనంతరం వారిద్దరినీ జైల్లోని మహిళల బ్యారక్‌లోనికి తీసుకెళ్లారు. సుధాక రన్ మాత్రం సాయంత్రం 6.15 గంటలకు కోర్టుకు వచ్చారు. ‘మా కారు డ్రైవరుపై కొంత మంది దాడికి పాల్పడడంతో వేరే మార్గంలో జైలుకు రావాల్సి వచ్చింది’అని ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చారు. కోర్టు ప్రక్రియ ముగిశాక అతన్ని జైల్లోకి తీసుకెళ్లారు. జైలు వద్ద ఎలాంటి అల్లర్లు చోటుచేసు కోకుండా బెంగళూరు పోలీసులు 200 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శశికళ విన్నపం తిరస్కరణ జైల్లోకి వెళ్లడానికి రెండు వారాల గడువు, ఇంటి నుంచి భోజనం కల్పించాలని శశికళ తన న్యాయవాదుల ద్వారా చేసిన విజ్ఞప్తిని న్యాయ మూర్తి తిరస్కరించారు. ఏ–క్లాస్ ఖైదీగా పరిగణించే విషయంలో జైలు ప్రధానాధికారిని సంప్రదించి, పొందవచ్చని సూచించారు. శశికళ గంభీరంగా, చిరునవ్వుతో జైలులోకి వెళ్తూ కనిపించారు. జైలు అధికారులు శశికళకు 9234 నంబర్, ఇళవరసికి 9235, సుధాకరన్‌కు 9236 నంబర్‌ను కేటాయించారు. శశికళ, ఇళవరసిలకు ఒకే గది కేటాయించారు. శశికలకు మూడు నీలిరంగు చీరలు, ఒక ప్లేటు, ఒక చెంబు, ఒక గ్లాసు, ఒక కంబళి, దిండు, దుప్పటిని అందజేశారు. ప్రతి శుక్రవారం మాంసాహారం, పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందజేస్తారు. జైలులోని ఇతర ఖైదీలతో కలిసి టీవీ చూడవచ్చు. సాధారణ ఖైదీలతో పాటు వారు జైలులో చేయాల్సిన పనిని (అగరబత్తీలు, క్యాండిల్స్ తయారీ, నేతపని తదితరాలు)ఆదివారం కేటాయిం చనున్నారు. ఇందుకు రోజుకు రూ.50 వేతనం లభిస్తుంది. శశికళ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి శశికళ నటరాజన్ జైలుకు చేరుకునే సమయంలో కొంతమంది ఆందోళనకారులు కాన్వాయ్‌లోని వాహనాలతో పాటు తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న కొన్ని వాహనాలపై దాడికి పాల్పడ్డారు. కేకలు వేస్తూ రాళ్లు చెప్పులతో దాడికి దిగారు. దీంతో ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి, ఆందోళనకారులను చెదర గొట్టారు. కాగా, పన్నీరుసెల్వం మద్దతు దారులే ఈ దాడికి పాల్పడ్డారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు. చెన్నై జైలుకు బదిలీకి ప్రయత్నాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తమిళనాడులో దాఖలైంది కాబట్టి తమను బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నైలోని పుళల్ జైలు లేదా మరేదైనా జైలుకు మార్చేందుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. తమిళనాడుకు తరలింపును కోరుతూ బెంగళూరు కోర్టులో త్వరలో పిటిషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ముందుగా తమ అంగీకారాన్ని తెలిపితేనే బెంగళూరు కోర్టు శశికళ పిటిషన్‌ను పరిశీలిస్తుందని నిపుణులు అంటున్నారు. బెంగళూరు కోర్టులో లొంగిపోయినందున కనీసం రెండు నెలలు అగ్రహార జైల్లో గడపాల్సి ఉంటుంది. సాధారణ ఖైదీగానే శశికళ జైల్లో తనకు వీఐపీ వసతులు కల్పించాలని కోరుతూ బెంగళూరు జైలు అధికారులకు శశికళ ఒక ఉత్తరం ద్వారా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మినరల్ వాటర్, ప్రత్యేకంగా ఎయిర్ కండీషన్డ్ గది, ఇంట్లో తయారైన భోజనం, వాకింగ్ సౌకర్యం కల్పించాలని ఆ ఉత్తరంలో కోరినట్లు సమాచారం. ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి మా త్రమే ఫ్యాన్, వార్తాపత్రికల సరఫరా తదితర సౌకర్యాలు కల్పించేందుకు వీలవు తుందని అధికారులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం జైలు జీవితాన్ని ప్రారంభించిన శశికళను అధికారులు సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తేనే ఇంటి నుంచి ఆహారం పొందవచ్చని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. -
మారన్ బ్రదర్స్‌కు భారీ ఊరట
-
మారన్ బ్రదర్స్‌కు భారీ ఊరట
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో 2 జీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మారన్ సోదరులకు ఊరట లభించింది. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు నిందితులందరికీ ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అవినీతి , మనీ లాండరింగ కేసులో మారన్ సోదరులపై ఉన్న అభియోగాలను కొట్టి వేసింది. వీరిపై సీబీఐ , ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఈకీలక ఆదేశాలు జారీ చేశారు. మాజీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్ సహా, ఆయన సోదరుడు కళానిధి మారన్, కళానిధి భార్య కావేరీ కళానిధి, సౌత్ ఆసియా ఎఫ్ ఎం లిమిటెడ్ ఎండీ, షణ్ముగం ఇతర రెండు (ఎస్‌ఏఎఫ్‌ఎల్ , సన్ డైరెక్ట్ టివీ ప్రెవేట్ లిమిటెడ్) కంపెనీలకు ఊరట కల్పించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన కేసుల నుంచి వీరికి విముక్తి కల్పించింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి రెండు వేర్వేరు విషయాలను విన్న జరిగినది. యుపిఎ ప్రభుత్వం మంత్రిగా ఉన్న దయానిధి మారన్ తన పలుకుబడితో మలేషియా వ్యాపారవేత్త టి.ఎ. ఆనంద కృష్ణన్ కు సహాయం చేశారని సీబీఐ ఆరోపించింది. ఎయిర్ సెల్ లో అతిపెద్ద వాటాదారుడు శివశంకరన్ తో బలవంతంగా తన వాటాలను అమ్మించారని ఆరోపిస్తూ సీబీఐ చార్జ్ షీట దాఖలు చేసింది. మాక్సిస్ అనుబంధం సంస్థ అయిన గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది. దీనికిగాను దయానిధికి భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు స్పెషల్ కోర్టు ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. -
కొత్తపల్లి గీత భర్తకు అరెస్టు వారెంట్
విచారణకు గైర్హాజరైన కోటేశ్వరరావు కిందికోర్టు తీర్పును సమర్థించిన నాంపల్లి కోర్టు సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామ కోటేశ్వరరావుకు నాంపల్లి ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసిన కేసులో ప్రత్యేక కోర్టు విధిం చిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. విచారణ సంద ర్భంగా కోటేశ్వరరావు కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయ నపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతోపాటు కింది కోర్టు ఇచ్చిన తీర్పు సబబేనని నిర్ధారించింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా డైరెక్టర్‌గా ఉన్న కోటేశ్వరరావు పీఎన్బీ నుంచి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతోపాటు చెల్లని చెక్కులు ఇచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారిం చిన ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 2015లో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది. అయితే ఈ కేసులో కొత్తపల్లి గీతను కూడా నిందితురాలిగా చేర్చాలంటూ పీఎన్బీ చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
హైకోర్టుకు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు తీర్పు ధ్రువీకరణ కోసం ఎన్ఐఏ కోర్టు సోమవారం హైకోర్టుకు పంపగా, రెఫర్ ట్రయల్ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఎన్ఐఏ కోర్టు అయిదుగురిని దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు గత సోమవారం తీర్పునిచ్చిన విషయం విదితమే. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! -
భత్కల్ సహా ఆ ఐదుగుర్ని వెంటనే ఉరితీయాలి
అప్పీలు చేసే అవకాశం ఇవ్వకూడదు రక్షాపురం (చంద్రాయణగుట్ట): దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులైన ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించడంపై మృతుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 18మంది అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ముష్కరుల్ని వెంటనే ఉరితీయాలని, వారికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యావత్ హైదరాబాద్‌ను దిగ్భ్రాంతపరిచిన ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 140మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో చంద్రాయణగుట్ట రక్షాపురానికి చెందిన స్వప్నారెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వప్నారెడ్డి కుటుంబసభ్యులు స్వాగతించారు. అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న దోషులకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని, వారిని తొందరగా ఉరితీయాలని వారు డిమాండ్‌చేశారు. స్వప్నారెడ్డిని ఉగ్రవాదులు ఆ కారణంగా పొట్టనబెట్టుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరవాసులకు చేదు అనుభవం మిగిల్చిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లపై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు.. దోషులు యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్, జియావుర్ రెహ్మాన్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్‌లకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
ఆ ఐదుగురికి ఉరిశిక్ష
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురూ దోషులేనని గత మంగళవారం నిర్ధారించిన కోర్టు ఇవాళ వారికి శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద సోమవారం అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాలుపంచుకున్నారని ఎన్ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్ భత్కల్ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదవగా, అనంతరం వాటిని ఎన్ఐఏకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3, 5 సెక్షన్ల కింద ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. దేశంలోనే తొలి కేసుగా రికార్డు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఆపై రియాజ్ భత్కల్ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, వారణాసి... ఇలా వీరు విరుచుకుపడని మెట్రో, నగరం లేవు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. 2007 నవంబర్ 25న వారణాసి కోర్టుల్లో పేలుడుకు పాల్పడిన ఈ ముష్కరులు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు మీడియాకు ఈ–మెయిల్ పంపారు. అప్పుడే తొలిసారిగా ఐఎం పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఉన్నదెవరు, దాన్ని నడిపిస్తున్నదెవరనే అంశాలు మరో ఏడాది దాకా బయట పడలేదు. 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. అంతకుముందు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు అన్ని కేసులూ పలు కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్సుఖ్నగర్ పేలుళ్లు రికార్డుకెక్కాయి. -
‘దిల్సుఖ్నగర్’ దోషులకు 19న శిక్షలు ఖరారు
- ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారణ - ఐదుగురు నిందితులపైనా నేరం నిరూపణ - పరారీలో సూత్రధారి రియాజ్ భత్కల్ - వచ్చే సోమవారం శిక్షలు ఖరారు - ఇండియన్ ముజాహిదీన్ కేసుల్లో నేరం రుజువైన తొలి కేసు సాక్షి, హైదరాబాద్ రాజధానిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురూ దోషులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. దోషులకు వచ్చే సోమవారం (19న) శిక్షలు ఖరారు చేయనున్నారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద మంగళవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాలుపంచుకున్నారని ఎన్ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్ భత్కల్ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదవగా, అనంతరం వాటిని ఎన్ఐఏకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3, 5 సెక్షన్ల కింద ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. కేసులో ‘ప్రత్యేకత’లెన్నో దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో అనేక ‘ప్రత్యేకతలు’న్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఉగ్రవాదుల్ని ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అలాగే వారిని మిగతా రాష్ట్రాలకూ తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ప్రాధాన్యం దృష్ట్యా ఇక్కడి కేసుల విచారణ పూర్తయ్యేదాకా వారిని మరో ప్రాంతానికి తరలించే ఆస్కారం లేకుండా తెలంగాణ సర్కారు 2014లో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ముష్కరుల్ని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారు. కేసు విచారణ తొలుత ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయస్థానంలో జరిగింది. భద్రతా కారణాలతో పాటు విచారణ త్వరిగతగతిన పూర్తి చేయడానికి చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఓ సందర్భంలో ఐసిస్ ఉగ్రవాదుల సాయంతో యాసీన్ భత్కల్ తప్పించుకునే అవకాశం ఉందనే హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో జైలు వద్ద నిత్యం ఆక్టోపస్ కమాండోల పహారా ఏర్పాటు చేశారు. ఈ పేలుడులో మరణించిన 17 మందిలో ఓ మహిళ గర్భవతి. గర్భస్థ శిశువును హత్య చేయడం నేరమేనంటూ మృతుల సంఖ్యను 18గా దర్యాప్తు అధికారులు నిర్థారించారు. దేశంలోనే తొలి కేసుగా రికార్డు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఆపై రియాజ్ భత్కల్ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, వారణాసి... ఇలా వీరు విరుచుకుపడని మెట్రో, నగరం లేవు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. 2007 నవంబర్ 25న వారణాసి కోర్టుల్లో పేలుడుకు పాల్పడిన ఈ ముష్కరులు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు మీడియాకు ఈ–మెయిల్ పంపారు. అప్పుడే తొలిసారిగా ఐఎం పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఉన్నదెవరు, దాన్ని నడిపిస్తున్నదెవరనే అంశాలు మరో ఏడాది దాకా బయట పడలేదు. 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. అంతకుముందు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు అన్ని కేసులూ పలు కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్సుఖ్నగర్ పేలుళ్లు రికార్డుకెక్కాయి. వచ్చే సోమవారం శిక్షలు ఖరారు చేస్తే, శిక్షలు పడిన తొలి కేసుగానూ ఇదే నిలుస్తుంది. -
భరించాల్సిన బాధ్యత భర్తదే..
బాగోగులతో అత్తమామలకు సంబంధం లేదు: ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ: భర్త నుంచి మాత్రమే వసతి, నిర్వహణ సౌకర్యం పొందే హక్కు భార్యకు ఉంటుందని, అత్త, మామలకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రత్యేక కోర్టు వెల్లడించింది. ఒక గృహహింస కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి అనిల్‌కుమార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక మహిళ వివాహం చేసుకొని తన భర్త, అత్తమామలతో నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో నివాసం ఉండేది. అయితే మనస్పర్థల కారణంగా అత్తమామలు కొడుకు, కోడలిని బయటకు పంపారు. ఈ క్రమంలో ఆ మహిళ తన వసతి, నిర్వహణ ఖర్చులు అత్తమామలు భరించాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోడలికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై ఆమె అత్త సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. తన ఆస్తిలో కోడలికి నివాసం కల్పించడం కుదరదని, అ బాధ్యత కేవలం ఆమె భర్తపైనే ఉంటుందంటూ వాదించింది. ఈ వాదనతో ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.