ఆశారాం కేసులో తీర్పు రిజర్వు | Rajasthan court to pronounce verdict against Asaram rape case on April 25 | Sakshi
Sakshi News home page

ఆశారాం కేసులో తీర్పు రిజర్వు

Published Sun, Apr 8 2018 4:24 AM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM

Rajasthan court to pronounce verdict against Asaram rape case on April 25 - Sakshi

జోధ్‌పూర్‌: రేప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంపై తీర్పును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ కేసులో గత 5 నెలలుగా సాగుతున్న వాదనలు శనివారంతో ముగియగా జడ్జి తీర్పును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.

రాజస్తాన్‌లోని మనాయి గ్రామం సమీపంలో ఆశారాం ఆశ్రమం ఉంది. ఆశారాం తనను రేప్‌ చేశారని అదే ఆశ్రమంలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 2012లో పోలీసులకు ఫిర్యాదుచేయడంతో 2013లో ఆశారాంను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జోధ్‌పూర్‌ జైలులో ఉంటున్న ఆయనకు నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement