Spiritual Science
-
Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా!
పురాణాలు ఇప్పుడు కాలక్షేపం కోసం కాదు. వయసు మళ్లిన వారి కోసం మాత్రమే కాదు. మిలీనియల్స్ నుంచి జెన్ జెడ్ వరకు యువతరం పురాణాలను ఇష్టపడుతోంది. అయితే అది చదువు రూపంలో కాదు. గేమింగ్ రూపంలో. ఇండియన్ మైథలాజికల్ గేమ్స్‌ను ఆడడానికి గేమర్స్‌లో 82 శాతం మంది ఇష్టపడుతున్నట్లు చెబుతోంది గేమింగ్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఫండ్ సంస్థ లుమికై. అర్జునుడి నుంచి కర్ణుడి వరకు రకరకాల పురాణపాత్రలలో ‘ప్లేయర్’ రూపంలో పరకాయ ప్రవేశం చేస్తోంది యువతరం...వెల్కమ్ టు గేమ్ జోన్..అహ్మదాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శాన్వీకి గేమింగ్ అంటే బోలెడంత ఇష్టం. ఎక్కువ సమయాన్ని టెక్ట్స్బుక్స్తోనే గడిపే శాన్వీ కాసేపు వీడియో గేమ్స్ ఆడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డెత్స్ డోర్’ నుంచి ‘మాన్స్టర్ హంటర్’ వరకు ఎన్నో గేమ్స్ ఆడింది. అయితే ఒక ఫ్రెండ్ సలహా ప్రకారం కొన్ని నెలల క్రితం తొలిసారిగా ఇండియన్ మైథలాజికల్ గేమ్ ఆడింది. ఇక అప్పటి నుంచి అలాంటి గేమ్స్ మాత్రమే ఆడుతోంది.‘మైథలాజికల్ గేమ్స్‌కు ఇతర గేమ్స్‌కు తేడా ఏమిటో తొలిసారిగా తెలుసుకున్నాను. ఇవి కేవలం కాలక్షేప ఆటలు కావు. పురాణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని పెంచుతాయి’ అంటుంది శాన్వీ. ‘చిన్న పట్టణాలతోపాటు గ్రామీణ ్రపాంతాలలో కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగింది. మన దేశంలో పెద్ద గేమింగ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. గతంతో ΄ోల్చితే వచ్చిన మార్పు ఏమిటంటే మన సాహిత్యం, సంస్కృతితో ముడిపడి ఉన్న పాత్రలను యువ గేమర్స్ ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్–క్లాస్ టెక్నాలజీతో మనవైన పాత్రలను ఇండియన్ స్టూడియోలు డెవలప్ చేస్తున్నాయి’ అంటుంది ‘విన్జో గేమ్స్’ కో–ఫౌండర్ సౌమ్య సింగ్ రాథోడ్.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మన పురాణాలు, చరిత్ర, సంస్కృతి, జానపద సాహిత్యంలోని పాత్రల ఆధారంగా మరిన్ని గేమ్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ నుంచి రానున్నాయి అంటుంది సౌమ్య. ‘పురాణాలను గేమింగ్‌తో మిళితం చేయడంతో ప్లేయర్స్ కొత్త రకం అనుభూతికి గురవుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ గేమ్స్ ఆకట్టుకుంటున్నాయి’ అంటున్నాడు ‘ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్’ ఫౌండర్ చిన్మయ్ శర్మ. ‘మన పురాణాల్లో దాగున్న ఎన్నో ఇతివృత్తాలు డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఆ పాత్రలు యూత్‌ను ఆకట్టుకునేలా గేమ్‌ను డిజైన్ చేస్తున్నారు’ అంటున్నాడు యుగ్ మెటావర్స్ సీయీవో ఉత్కర్ష్ శుక్లా.మైథలాజికల్ గేమ్స్ అనేవి ఎక్కువగా ఫస్ట్–పర్సన్ షూటర్(ఎఫ్‌పీఎస్) గేమ్స్. మెయిన్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆడే గేమ్స్.‘టెస్ట్ యువర్ స్కిల్స్ ఇన్ దిస్ ఎపిక్ స్ట్రాటజీ గేమ్’ అంటూ ఆహ్వానించిన ‘కురుక్షేత్ర: అసెన్షన్’ దిల్లీకి చెందిన సజనికి బాగా నచ్చింది. ఈ వీడియో గేమ్‌లో అర్జునుడు, భీముడు, కర్ణుడులాంటి ఎన్నో పాత్రలు ఉంటాయి.‘మైథలాజికల్ గేమ్స్ మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళతాయి. మన పురాణాలు, జానపదాల ఆధారంగా గేమ్స్‌ను రూపొందించే అద్భుత అవకాశం ఇప్పుడు గేమ్ డెవలపర్లకు వచ్చింది. దేవ, దానవుల మధ్య యుద్ధానికి సంబంధించి సెకండ్ గేమ్‌ను రూపొందిస్తున్నాం’ అంటున్నాడు ‘కురుక్షేత్ర’ గేమ్‌ను రూపొందించిన ‘స్టూడియో సిరా’ కో–ఫౌండర్ అభాస్ షా.‘కురుక్షేత్ర’ను తక్కువ సమయంలో ఆరు లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు.మన దేశంలోనే కాదు ఆగ్నేయాసియా దేశాలలో కూడా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందించిన గేమ్స్‌ను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టాన్ని క్యాష్ చేసుకోవడం అని కాకుండా ఈ గేమ్స్ ద్వారా యువతలో నైతిక విలువలు పాదుకొల్పే, ఆత్మస్థైర్యం పెంచగలిగే ప్రయత్నం చేస్తే భవిష్యత్ కాలంలో వాటికి మరింత ఆదరణ పెరుగుతుంది. రాజీ పడకుండా...నోడింగ్ హెడ్స్ గేమ్స్ కంపెనీ రూపొందించిన ‘రాజీ: యాన్ ఏన్షియెంట్ ఎపిక్’ మనల్ని మన పురాణ ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. మన దేవాలయాల సౌందర్యం నుంచి ఇతిహాస కళ వరకు ఈ గేమ్‌లో ప్రతిఫలిస్తుంది. కంపెనీ ్రపారంభం నుంచి మన పురాణాల ఆధారంగా గేమ్‌ను రూపొందించాలని కల కన్నది పుణేకు చెందిన ‘నోడింగ్ హెడ్స్ గేమ్స్’ కంపెనీ ఫౌండర్ శృతి ఘోష్.‘రాజీ’ రూపంలో తన కలను నిజం చేసుకుంది.‘గ్రీకు ఇతర పురాణాలు సినిమాలు, గేమ్స్ రూపంలో మనల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఆ స్థాయిలో మన పురాణాలు గుర్తింపు పొందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పురాణాల ఆధారంగా రాజీ గేమ్‌కు రూపకల్పన చేశాం. ఇది ఎంతో మంది డెవలపర్లకు స్ఫూర్తిని ఇచ్చింది. ఎంత చెప్పినా మన పురాణాల్లో నుంచి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంటుంది’ అంటుంది శృతి ఘోష్.– శృతి ఘోష్ -
ఉమ్మి వేశాడని చితకబాదిన పోలీస్
విశాఖపట్నం, ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): తన కారుపై ఉమ్మి వేశాడనే నెపంతో ఓ వ్యక్తిని పోలీసు ఉద్యోగి చితకబాదాడు. తాళ్లతో కట్టి మరీ వాతలు వచ్చేలా కుటుంబ సభ్యులంతా కలిసి కొట్టారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన పొలమర శెట్టి మాధవరావు సోమవారం రాత్రి కంచరపాలెంలో ఉన్న తన దుకాణాన్ని మూసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వద్ద రోడ్డుపై పార్కింగ్ చేసి ఉన్న తన కారుపై ఉమ్మి వేశాడని నెపంతో శ్రీనివాసరావు అనే పోలీసు ఉద్యోగితోపాటు అతని కుటుంబ సభ్యులంతా కలిసి అత్యంత దారుణంగా మాధవరావును తాళ్లతో కట్టి కొట్టారు. రాత్రి 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకు కొడుతునే ఉన్నారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితుడు మాధవరావును విడిపించి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో తన పర్సు, షాపు తాళాలు, ద్విచక్రవాహనం తీసుకున్నారని బాధితుడు వాపోతున్నాడు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అకారణంగా దాడి చేసి కొట్టిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
కర్మపా.. భారత్ తిరిగి రండి!
న్యూఢిల్లీ: అమెరికాలో నివాసముంటున్న టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు కర్మపా ఓజియెన్ ట్రిన్లే డోర్జీ భారత్‌కు తిరిగిరావాలని కేంద్రం కోరింది. ఢిల్లీలో ఆశ్రమం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించడానికి కూడా అంగీకరించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కర్మపా భారత్‌లోనే ఉండాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారని, ప్రభుత్వం కూడా తిరిగిరావాలని ఆయన్ని కోరిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారి ఒకరు తెలిపారు. అయితే కర్మపా భారత్ తిరిగిరావడానికి అయిష్టం వ్యక్తం చేసినట్లు చెప్పారు. దేశం లోపల, వెలుపల ఎలాంటి ఆంక్షలు లేకుండా సంచరించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కర్మపా డిమాండ్ చేస్తున్నారు. దలైలామా మాదిరిగా తనకూ స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించనందుకు అసంతృప్తితో కర్మపా డొమినికా పాస్పోర్టుతో అమెరికాలో నివాసముంటున్నారు. -
మీరు జాతీయవాదులా?
న్యూఢిల్లీ: దేశంలో ఆందోళనలు సృష్టిస్తున్న మూకోన్మాద ఘటనలకు పాల్పడుతున్నవారెవరూ తమను తాము జాతీయవాదులుగా చెప్పుకోవద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో చట్టాల ద్వారా మాత్రమే మార్పు సాధ్యం కాదని.. సమాజ ప్రవర్తనలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. మూకోన్మాద ఘటనలపై రాజకీయాలు చేయాలనుకుంటున్న వారిపైనా వెంకయ్య మండిపడ్డారు. ఈ ఘటనలకు రాజకీయ పార్టీలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మూక దాడుల ఘటనలను ఆపేందుకు చట్టం మాత్రమే సరిపోదు. సామాజిక మార్పు అవసరం. మీరు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నట్లయితే.. ఓ మనిషిని ఎలా చంపుతారు? ఓ వ్యక్తి మతం, కులం, వర్ణం, లింగం ఆధారంగా వివక్ష చూపిస్తారా? జాతీయవాదం, భారత్ మాతాకీ జై అనే పదాలకు విశాలమైన అర్థం ఉంది. మూకదాడుల ఘటనలు ఓ పార్టీ పని కాదు. మీరు ఈ వివాదాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారంటే విషయాన్ని పలుచన చేస్తున్నట్లే. ఇదే జరుగుతోందని స్పష్టంగా చెప్పగలను’ అని వెంకయ్య పేర్కొన్నారు. ‘నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. అత్యాచారాలు ఆగిపోయాయా? నేను ఈ అంశంపై రాజకీయాలు మాట్లాడటం లేదు. పార్టీలు కొన్ని అంశాలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. ఒక బిల్లు ద్వారా, రాజకీయ తీర్మా నం, పాలనాపరమైన నిర్ణయంతోపాటుగా ఈ దుర్మార్గపు ఆలోచనను సమాజం నుంచి పూర్తిగా తొలగించేలా మార్పు తీసుకురాగలగాలి. ఇదే విషయాన్ని నేను పార్లమెంటులో కూ డా చెప్పాను’ అని వెంకయ్య స్పష్టం చేశారు. -
విశాఖలో 12న ముస్లింలతో జగన్ ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 12వ తేదీన విశాఖపట్నంలో ముస్లింలు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. పాదయాత్రలో ఇప్పటికే జగన్ వివిధ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో(2014) సీఎం చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలతో తీవ్రంగా మోసపోయిన వర్గాల ప్రజలంతా ఈ సమ్మేళనాల్లో జగన్‌ను కలుసుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. వారు మోసపోయిన తీరును, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతూ ఆయా వర్గాల వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ పాల్గొంటున్న ఈ కార్యక్రమాలన్నింటికీ భారీఎత్తున జనం హాజరై ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. అంతేగాక.. తమ సమస్యలు పరిష్కారం కావాలన్నా, తమ బతుకులు బాగుపడాలన్నా జగన్ గెలుపు ఒక్కటే పరిష్కారమనే విశ్వాసాన్ని ఆయా వర్గాలవారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న విశాఖపట్నం నగరంలో ఆ వర్గం వారితో జగన్ సమావేశం అవుతున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకోసం చంద్రబాబు పొందుపర్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా మళ్లీ కొత్తగా వారిని మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను జగన్ ఈ సమావేశంలో తిప్పికొట్టడమేగాక సీఎం నిజస్వరూపాన్ని గ్రహించాలని పిలుపునివ్వబోతున్నారు. 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్టీఎస్ రోడ్డు–అరిలోవలో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖ ముస్లింలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు. -
ఆకలి లౌకికమా?!
పండిట్ శేఖరమ్ గణేష్ దియోస్కర్ హితవాది పత్రిక సంపాదకుడిగా సుప్రసిద్ధుడు. ఒకరోజు ఆయన తన మిత్రులిద్దరితో స్వామి వివేకానందను కలుసుకోవడానికి వచ్చాడు. ఆ ఇద్దరి మిత్రులలో ఒకరు పంజాబీ అని తెలుసుకున్న స్వామీజీ, అప్పుడు పంజాబ్‌లో నెలకొని ఉన్న తీవ్ర ఆహార కొరతను గురించి వారితో ఆదుర్దాగా మాట్లాడారు. ఆ సమయంలో భారతదేశంలో తాండవిస్తున్న కరువు కాటకాలను గురించే స్వామీజీ మనస్సులో మథన పడుతున్నారు. అందువల్ల వచ్చిన సందర్శకులతో ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి అసలు మాట్లాడనే లేదు. స్వామీజీ నుంచి సెలవు పుచ్చుకునే సమయంలో ఆ పంజాబీ వ్యక్తి అసంతృప్తి వెలిబుచ్చుతూ ఇలా అన్నాడు : ‘‘మహాశయా, ఆధ్యాత్మికపరమైన విషయాలను మీ ముఖతా వినాలని మేము ఆసక్తితో ఎదురు చూశాం. కాని దురదృష్టవశాత్తూ మన సంభాషణ లౌకిక విషయాల మీదకు వెళ్లింది. మన సమయం వృథా అయిందని భావిస్తున్నాను’’ అన్నారు. ఈ మాట వినగానే స్వామీజీ గంభీర ముద్ర దాల్చి ఇలా స్పందించారు : ‘‘మహాశయా! నా దేశంలో ఒక వీధి కుక్క సైతం పస్తున్నా, దానికి ఆహారం ఇచ్చి రక్షించడమే అప్పటికి నా వంతు అవుతుంది’’ అన్నారు. స్వామీజీ మహాసమాధి తర్వాత కొన్ని సంవత్సరాలకు పండిట్ దియోస్కర్ ఆ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆనాటి స్వామీజీ వచనాలు తన మనస్సులో చెరగని ముద్రవేసి దేశభక్తి అంటే ఏమిటో నిజమైన ఆర్థాన్ని ప్రప్రథమంగా తెలియజేశాయని చెప్పాడు. మంటే మట్టి కాదు.. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, జప తపాలు మాత్రమే కాదు అని దీని అర్థం. -
అనంతం నుంచి అనంతానికి...
సత్యంగా చెప్పబడే అనంతశక్తి సకల చరాచర సృష్టికి హేతువని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఒకే ఒక సత్యాన్ని కొందరు బ్రహ్మగా, మరికొందరు ఆత్మగా, మరి కొందరు ఈశ్వరునిగా గుర్తిస్తూ ఉండగా, సైంటిస్టులు విశ్వశక్తిగా లేక అనంతశక్తిగా నిర్ధరిస్తున్నారు.ఆ అనంతశక్తిని చూద్దామంటే చూడలేము. స్పృశిద్దామంటే స్పృశించలేము. అంతులేనిది, కాలాతీతమైనది. నిశ్చలంగా ఉండగలిగేది. ఖాళీ లేనంతగా వ్యాపితమైంది , రూపంలేనిది. అదే సమయంలో అన్ని ఖగోళరూపాలుగా మారగలిగేది. కాంతిగా, శబ్దంగా, ఉష్ణంగా, జీవంగా, నిర్జీవంగా, ఏ పదార్థంగానైనా మారగలిగేది. కొలమానాలకు అతీతమైనది. దానిని అర్థం చేసుకోవడమే సాధ్యమవుతుంది. అటువంటి మహాశక్తి గురించి ఉపనిషత్తులు బ్రహ్మమని, సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి ఆత్మ అనీ విశ్లేషణలు చేశాయి. వేల సంవత్సరాల క్రితమే మహర్షులు ఆ అనంత శక్తిని ఏ విధంగా ఊహించగలిగారోనన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఆత్మ అనంతము, సర్వరూపధారి, నిష్క్రియత్వమైనదని శ్వేతాశ్వతరోపనిషత్ చెప్పగా, అది సత్యం, అదే ఆత్మ అంటూ ఛాందోగ్యోపనిషత్ అంటుండగా, అందరిలో ఉండే నీ ఆత్మయే అతడు అంటూ బృహదారణ్యకోపనిషత్ తేటతెల్లం చేస్తోంది. ఆత్మ సర్వాంతర్యామి కాబట్టి, మనలో కూడా ఆ అనంత శక్తే నిండి ఉన్నదనేది తెలుసుకోవాలి. భౌతిక రూపాలు వేరు కాబట్టి లక్షణాలు మాత్రమే భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం జీవుల పుట్టుకకు కారణం సూర్యరశ్మి, భూమి, జలం, వాయువు అని తెలుస్తోంది. ఆధ్యాత్మికత ఒక అడుగు ముందుకువేసి ఈ నాలుగు శక్తులకు ఆకాశాన్ని జోడించి పంచభూతాలుగా పేర్కొన్నది. విజ్ఞానశాస్త్ర పరంగా ఆలోచిస్తే భూమి తదితర గ్రహాలు సూర్యుని నుండి పుట్టినవి. ఈ సూర్యునిలో ఉన్నవి హైడ్రోజన్, హీలియం వాయువులు. ఈ వాయువుల్లో ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు అత్యల్ప ప్రమాణాల్లోనే ఉన్నవి. కేంద్రక సంలీనం ప్రక్రియ వలననే ఈ సౌరశక్తి జనిస్తుంది! ఈ అత్యల్ప ప్రమాణాల ఎలక్టాన్ర్, ప్రోటాన్, న్యూట్రాన్లు క్వార్కు లాంటి అత్యంత సూక్ష్మకణాలనుండి ఉద్భవించినవని, ఈ క్వార్కులు అనంతశక్తి నుండి రూపాంతరం చెందినవే. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మగా చెప్పబడే అనంతమైన శక్తి నుండి ఉద్భవించినవేనని ఆధునిక విజ్ఞాన శాస్త్రం తెలుపుతోంది. అనంతశక్తిలోనే ఉద్భవించి, చరించి, కాలప్రమాణం ముగిసిన అనంతరం తిరిగి ఈ భౌతిక రూపాలన్నీ శక్తి రూపాన్ని పొందుతూ వస్తున్నాయి. మరోవిధంగా చెప్పుకుంటే జీవి తన ప్రాణం కోల్పోయిన తర్వాత దహించ బడితే, ఆ శరీరం కొంత ఉష్ణం, కొంత వాయువు, కొంత నీటి ఆవిరి, కొంత బూడిద, కొంత కాంతిశక్తిగా విఘటనం చెందుతుంది. అవే పంచభూతాలని మనకు తెలుసు. – గిరిధర్ రావుల -
అందుకే నేను ఇలా ఉన్నాను మరి!
మూడురోజులుగా తిండి లేని ఒక యాచకుడు ఆ దారిన వెళ్లే ఒక కారును ఆపి ‘‘కాస్త ధర్మం చెయ్యండి బాబూ’’అన్నాడు. యాచకుడి కట్టూబొట్టూ చూసి అతనేదో మంచి కుటుంబం నుండి వచ్చిన వాడై ఉంటాడని, అతని మాట తీరు చూస్తే కాస్త చదువుకున్నవాడని అనిపించింది కారులోని వ్యక్తికి. పైగా, అతను తనకు అప్పుడే ప్రమోషన్ వచ్చిందన్న సంతోషంలో ఉన్నాడు. దాంతో అతను జేబులో నుంచి వందరూపాయల నోటు తీసి యాచకుడికి ఇవ్వబోయాడు. ఆ వంద రూపాయల నోటుకేసి చూస్తూ పక్కనే కూర్చున్న స్నేహితుడు పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అన్నాడు అతను. ‘‘అతి త్వరలో నువ్వు కూడా నా స్థానంలో ఉండాల్సి వస్తుందనిపించి నవ్వొచ్చింది. కనిపించిన ప్రతివాడికీ ఇలా దానం చేస్తూ పోతే చివరికి ఏమీ మిగలదు. నేనందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలే నాకు రావలసిన ప్రమోషన్ కూడా మిస్సయింది’’ అన్నాడు స్నేహితుడు. దానికతను నవ్వుతూ, ‘‘బహుశా అందుకేనేమో నాకు ప్రమోషన్ వచ్చింది. కారు కూడా కొనుక్కోగలిగాను. నువ్వేమో అలాగే ఉన్నావు ఎదుగూబొదుగూ లేకుండా’’ నవ్వుతూనే అంటించాడు. మీరు ఇస్తూ పోతే మీ దగ్గర ఉన్నదంతా అయిపోతుందనేది సాధారణ ఆర్థిక సూత్రాలకు సంబంధించినది. అదే ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారమైతే మీరు ఏమీ ఇవ్వకుండా ఉన్నట్లైతే మీ దగ్గర ఏదీ మిగలదు. అదే మీరు ఇస్తూ పోతే మీ దగ్గర చాలా చాలా ఉంటుంది. బాహ్య, అంతర్గత ప్రపంచాల చట్టాలు పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ముందు మీరు అంతర్గతంగా చక్రవర్తి స్థాయికి ఎదగండి. అప్పుడే పంచేందుకు మీ దగ్గర చాలా ఉంటుంది. – ఓషో భరత్ -
ధర్మాన్ని తెలుసు కోవడమే జ్ఞానం తత్త్వ రేఖలు
భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం హేతుబద్ధతను మించిన తర్కాన్ని ఏనాడో చేసింది. వాటి రూపాలే ఉపనిషత్తులు. పూర్ణమదః పూర్ణమిదం అంటూ ‘థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ’ సూత్రాన్ని సంస్కృత భాష వేల ఏళ్ల క్రితమే ఉద్భోధించింది. తదేజతి తన్నైజతి అంటూ విశ్వశక్తి గురించి అప్పుడే విశ్లేషణ చేసింది. కామం, సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, లజ్జ, బుద్ధి, భయం అన్నీ మనోరూపాలేనని మానసిక శాస్త్రాన్నీ విడమర్చింది. ఇలా అనేక శాస్త్రాలకు బీజమేశాయి ఉపనిషత్తులు. వీటిని ఆకళింపు చేసుకుంటే ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు ఆచరణలో పెట్టడం సాధ్యం అవుతుంది. తద్వారా మనిషి అరిషడ్వర్గాలను అణచివేసి, నిష్కామకర్మను దినచర్యగా చేసుకోగలుగుతాడు. నిష్కామకర్మ వలన ఎలాంటి భవబంధాలు మనిషిని తాకలేవు. తద్వారా మృత్యుంజయ మంత్రంలో చెప్పినట్టుగా మనిషి మృత్యుభావనను జయించి అమృతమయ జీవితాన్ని జీవించగలుగుతాడు. అదే ఆధ్యాత్మికజ్ఞాన లక్ష్యం.ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక సాధారణ మానవుడు రజ్జుసర్ప భ్రాంతిని పొందుతున్నాడు. అంటే ఈ కనిపించే భౌతిక రూపాలు సత్యమనుకుంటూ బంధనాలు వేసుకుంటున్నాడు. కులం మతం లాంటి బలహీనతలను పొందుతున్నాడు. ప్రకృతిలో మానవుడు ఒక భాగమేనన్న నిజాన్ని మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రాకృతిక రూపాలు ఏ విధంగా తమ తమ కర్మలను ఆచరించి ఇతర ప్రాకృతిక రూపాల మనుగడకు దోహదపడుతున్నాయో, ఆ విధంగా మానవుడు కూడా తన మానవత్వ కర్మలను ఆచరించి, పాంచభౌతిక రూపాన్ని సాధించి, చివరకు పంచభూతాల ద్వారా అనంతశక్తిగా మార్పుచెందడమే ధర్మం. అదే మోక్షం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞానం చేత కర్మఫలాలు శాశ్వతం అనుకుంటున్నాం. అయితే, సృష్టి, స్థితి, లయలు అనేవి నిరంతర క్రియలు అని తెలుసుకుని కర్మఫలాలు ఆశించకుండా కర్మలు ఆచరించడమే నిష్కామకర్మ. ఏతావాతా నిష్కామకర్మకు ఆధారం జ్ఞానం. జ్ఞానమంటే హేతువాదమే! జ్ఞాన సాహిత్య నిధి అయిన ఉపనిషత్తులు, ఆదిశంకరుని అద్వైతాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం తద్వారా నిష్కామ కర్మలను ఆచరించడం ద్వారా అరిషడ్వర్గాలను చిదిమి వేయగలం. నిష్కామ కర్మ వల్ల ప్రతిఫలించే తాదాత్మ్యత హృదయాంతరాల నుండి మొదలుకొని ముఖవర్చస్సు వరకు ఆవహించి ఉంటుంది. అద్వైతజ్ఞాని ప్రతి జీవిలోనూ, నిర్జీవిలోనూ, పంచభూతాలలోనూ, శూన్యంలోనూ అంతర్లీనంగా ఉండే ఈశావాస్యమిదం సర్వాన్ని దర్శించగలుగుతాడు. ’అహం బ్రహ్మాస్మి’ని అనుభవించగలుగుతాడు. – గిరిధర్ రావుల -
నేనున్నానని... భరోసా
కాకినాడలోని జేఎన్టీయూ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్ వరకు కొనసాగింది. అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారు. జగదీశ్వరి, కాకినాడ: ఫీజు రీయింబర్స్మెంట్ అంటున్నారు. రేషన్, ఆధార్‌కార్డు తెమ్మంటున్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ అందడంలేదు. ఏడాది చదువు ఆగిపోతే డిటైన్డ్ అంటున్నారు. పేదలం మా పిల్లలను ఎలా చదివించుకోవాలి? పేదవాళ్లు ఇబ్బంది పడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలిని కోరుతున్నామన్నా.. వైఎస్ జగన్: అక్కా.. ఇంకా ఎంతో దూరం లేదు. ఆరు నెలలు ఓపికపట్టు. మొత్తం వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాం. గట్టిగా దేవుడిని మొక్కు అక్కా, రెండు కొబ్బరికాయలు కొట్టు. విజయ్ : చేపలు నిల్వ చేసుకోవడానికి సదుపాయాలు లేవు. ఫలితంగా దళారుల చేతిలో మోసపోతున్నాం. మీరు వచ్చిన తర్వాత మాకు కోల్డ్ స్టోరేజీలు పెట్టాలి. మోడల్ మార్కెట్లు స్థాపించాలి. సాగర తీరంలో గ్రామాల్లో వీటిని నిర్మించి ఇవ్వాలి. వైఎస్ జగన్: చాలా మంచి సలహా ఇది. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ప్రోసెసింగ్ చేయాలి. లేదంటే కోల్డ్ స్టోరేజీలో అయినా పెట్టాలి. అప్పుడే రేటు ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మంచి సలహా ఇచ్చావు. ఎక్కడెక్కడ ఏమేమీ పెట్టాలనే దానిపై అధ్యయనం చేద్దాం. దీనికి రమణన్న అటెండ్ అవుతారు. కుమారి, కాకినాడ: అన్నా.. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు. బ్యాంకులకు వెళ్లి అడిగితే మీకు రుణాలు చంద్రబాబు ఇచ్చాడా? మేము ఇచ్చామా? అంటున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొండబాబు కూడా చెప్పారని అంటే కొండబాబు వచ్చి కట్టడు కదమ్మా అంటున్నారన్నా.. నెలకు రూ.30 వేలు పొదుపు చేసుకుంటామన్నా. ఇప్పుడు మా పొదుపు డబ్బులు పోయాయి. రుణాలు ఇవ్వడంలేదు. మళ్లీ ఇప్పుడు గ్రూపుకు రూ.లక్ష ఇస్తాడని మా వీధిలో పుకార్లు లేపుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేయనోడు, ఇప్పుడు లక్ష ఇస్తామంటే ఎలా నమ్ముదామని మా వాళ్లకు చెప్పాను. జగన్ మాట ఇస్తే తప్పడు. మనం జగన్‌కే ఓటు వేద్దామని చెప్పాను. నీవు సీఎం అయ్యాక ఏడు కొండలు నడిచి ఎక్కుతాను. వైఎస్ జగన్: చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. దీంతో వడ్డీ, చక్ర వడ్డీలుగా మారి బ్యాంకులు ఇంటికి నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వాలు రైతులు, అక్కచెళ్లమ్మల రుణాలకు కట్టే వడ్డీలు నేరుగా బ్యాంకులకు చెల్లించేవి. దాని వల్ల బ్యాంకులు వారికి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేవి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వడ్డీ కట్టకుండా మానేశాడు. రైతులకైతే పూర్తిగా కట్టడమే మానే శాడు. ప్రతి అక్కకు, చెళ్లమ్మకు చెబుతున్నా మీరెవరూ భయపడకండీ, మీకు ఎంతైనా అప్పులుండనీవ్వండి. ఎన్నికల తేదీ వరకు మీకు ఎంతైనా అప్పు ఉండనీ, ఆ సొమ్ములు మొత్తం నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బుతో మీరేమైనా చేసుకోవచ్చు. మళ్లీ బ్యాంకులు సున్నా వడ్డికే రుణాలు ఇవ్వాలి. ఆ పరిస్థితి మళ్లీ వచ్చేందుకు, తీసుకువచ్చేందుకు ఆ ప్రతి అక్కకు, చెళ్లమ్మకు హామీ ఇస్తున్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వడ్డీ డబ్బులు కడుతుందని చెబుతావున్నా. సత్తిబాబు, కాకినాడ: అన్నా.. చంద్రబాబు పదవిలోకి రాకముందు పోర్టులో ఏ సమస్యలున్నా తీరుస్తానని ఇక్కడకు వచ్చి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. పోర్టులో పని చేసే వారికి కనీసం రూ.12 వేలు ఆదాయం వచ్చేలా చేయండన్నా.. మాకు ప్రస్తుతం రూ.మూడునాలుగు వేలే వస్తోంది. సరిపోవడం లేదన్నా.. లోకల్ వాళ్లకు పని కల్పించండన్నా.. మీ పక్షాన మేమంతా ఉంటాం. వైఎస్ జగన్: సత్తెన్నా.. ఒక్క పోర్టు మాత్రమే కాదు. ఆంధ్రరాష్ట్రంలో ఏ పరిశ్రమ ఉండనీ, ఏ యూనిట్ అయినా ఉండనీ. ఎక్కడన్నా ఉండనీ. దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం ద్వారా కట్టిన పరిశ్రమైనా సరే, కట్టబోయే పరిశ్రమైనా సరే 75 శాతం లోకల్ రిజర్వేషన్ కల్పించాలని స్పష్టం చేస్తాం. దాని వల్ల ఎవరైనా కూడా ఖచ్చితంగా 75 శాతం ఉద్యోగాలు లోకల్ వాళ్లకే ఇవ్వాలి. వాసుపల్లి కృష్ణ దుమ్మళ్లపల్లి: అన్నా.. మా గ్రామంలో 2005లో వైఎస్ మినీ హార్బర్ కట్టేందుకు శిలాఫలకం వేశారు. ఇక్కడ వంతెన ఉంది. ఇరుకుగా ఉండడం వల్ల సముద్రంలోనే బోట్లు నిలిపాల్సిన పరిస్థితి. తుపాను సమయంలో బోట్లు దెబ్బతింటున్నాయి. ఆ వంతెనను మీరు పెద్దదిగా చేస్తే మా పది మత్స్యకార గ్రామాల్లోని 40 వేల మంది మీకు అండగా ఉంటాం. వైఎస్ జగన్: వాసన్నా.. నాన్న చేస్తానని చెప్పి చనిపోయారు. చంద్రబాబునాయుడు ఎలాగూ చేయలేదు. నీవు చూపిస్తున్న ఫొటోలు చూస్తే ఖచ్చితంగా బ్రిడ్జి పెద్దదిగా చేయడం అవసరమనే అనిపిస్తోంది. పూర్తిగా అధ్యయనం చేసి ఖచ్చితంగా చేద్దాం. ప్రసన్నకుమార్, తూరంగి: కాకినాడలో వైఎస్సార్ పేరుపై ఆక్వా యూనివర్సిటీ నెలకొల్పాలి. వైఎస్ జగన్: అవును ఇది నా మనసులో కూడా ఉంది. కచ్చితంగా మెరైన్ యూనివర్సిటీ స్థాపించాలి. మీరు అడుగుతున్నట్లుగా మత్స్య కార ప్రాంతంలోనే ఉండాలి. కాకినాడ సరైన ప్రాంతం. ఖచ్చితంగా ఈ ప్రాంతంంలో వచ్చేటట్లుగా చేస్తానని హామీ ఇస్తున్నా. ప్రసాద్, ఎంపీటీసీ, ఉప్పాడ: నమస్తే అన్నా.. ఉప్పాడ గ్రామం పూర్తిగా వైఎస్సార్ సీపీ. ప్రస్తుత ఎమ్మెల్యే మా గ్రామాన్ని దత్తత తీసుకున్నానంటూ కక్ష సాధిస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్‌కు గతంలో వైఎస్సార్ నిధులు మంజూరు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం హార్బర్ నిర్మించలేదు. బోటులు తిరగబడుతున్నాయి. మీరు సీఎం అయ్యాక హార్బర్ కట్టి మా ప్రాణాలు కాపాడతారని కోరుతున్నాం. నాన్నగారు మా గ్రామాలకు రక్షణగా జియో ట్యూబ్ వేశారు. మీరు మినీ హార్బర్ కట్టించాలి. వైఎస్ జగన్: చేద్దాం ప్రసాదన్నా. మారెమ్మవ్వ ఏమైనా మాట్లాడాలా? ఒకసారి మారెమ్మ అవ్వకు మైకు ఇవ్వు. దేవుడు, కొత్తపేట: మా పిల్లలకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నా.. తిప్పకు ఎనిమిది మంది ఉంటే ఆరుగురికే వేట నిషేధ పరిహారం ఇస్తున్నారు. అందులోనూ ఇద్దరికే వస్తోంది. పెద్ద బోట్లలో 15 మంది ఉంటున్నారు. ఎనిమిది మందికే ఇస్తున్నారు. మీరు వచ్చాక అందరికీ ఇవ్వాలి. తీర ప్రాంతంలోని ఇళ్లకు రూ.3 లక్షలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇంటికి రెండు పేర్లకు ఇవ్వాలని కోరుతున్నా. వైఎస్ జగన్: దేవుడన్నా.. నీవు చెప్పినవన్నీ ఆలోచన చేద్దాం అన్నా. -
ఆధ్యాత్మిక గురువు వాస్వానీ కన్నుమూత
పుణె: వయోభారంతో కొద్ది రోజులుగా ఆశ్రమంలో చికిత్సపొందుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాధు వాస్వానీ మిషన్ అధిపతి దాదా జేపీ వాస్వానీ (99) గురువారం తుదిశ్వాస విడిచారు. ‘గత 3 వారాలుగా పుణేలోని ఓ ప్రైవేటు ఆస్పతిలో వాస్వానీ చికిత్స పొందుతున్నారు. గత రాత్రే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఉదయం ఆశ్రమంలో కన్నుమూశారు’ అని మిషన్ సభ్యురాలు తెలిపారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో 1918 ఆగస్టు 2న సింధి కుటుంబంలో వాస్వానీ జన్మించారు. వచ్చే నెలలోనే ఆయన వందో పుట్టిన రోజు కావడంతో మిషన్ సభ్యులు భారీగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈలోపే కన్నుమూయడంతో భక్తులు, అభిమానులు శోకసంద్రంలో మునిగారు. వాస్వానీ సామాజిక సేవ, బాలిక విద్య, జంతు సంరక్షణ లాంటి సేవా కార్యక్రమాల్ని మిషన్ ద్వారా నిర్వహించేవారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయన భక్తులుగా మారారు. 150కి పైగా పుస్తకాలు.. వాస్వానీ 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రాశారు. వీటిలో ఇంగ్లిష్‌లో 50 పుస్తకాలు రాయగా.. సింధి భాషలో ఎక్కువగా రాశారు. ఆయన రచనలను మరాఠీ, హిందీ, కన్నడ, గుజరాతీ, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, మాండరిన్, జర్మనీ, పలు విదేశీ భాషల్లోకి అనువదించారు. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి పలు అవార్డులు, బిరుదులు, సత్కారాలు పొందారు. ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక యూ థాంట్ పీస్ అవార్డుని 1998లో అందుకున్నారు. గత మేలోనే రాష్ట్రపతి కోవింద్ వాస్వానీ మిషన్ సందర్శించి అక్కడి ఇంటర్నేషనల్ స్కూల్‌ని ప్రారంభించారు. వాస్వానీ 99వ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తరచూ వాస్వానీ మిషన్‌ను సందర్శించేవారు. ప్రముఖుల సంతాపం.. దాదా వాస్వానీ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ‘వాస్వానీ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సమాజంలోని పేదలు, అభాగ్యుల కోసమే జీవించారు. బాలికలకు విద్యను అందించడం కోసం ఎంతగానో కృషి చేశారు’ అని పేర్కొంటూ ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. ‘దాదా జేపీ వాస్వానీ నన్నెంతో ప్రభావితం చేశారు. 28 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన ప్రపంచ సర్వమత సదస్సులో ఆయనతో కలసి పాల్గొనే అవకాశం దక్కింది. 2013లో వాస్వానీ మిషన్ స్థాపించిన నర్సింగ్ కళాశాల ప్రారంభించడానికి పుణేకు వెళ్లాను’ అని ఓ ట్వీట్లో మోదీ వెల్లడించారు. వాస్వానీ లేని లోటు పూడ్చలేనిదని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపాన్ని తెలిపారు. నేడు సాయంత్రం అంత్యక్రియలు.. దాదా వాస్వానీ అంత్యక్రియలు శుక్రవారం వాస్వానీ మిషన్‌లోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని వందలాది మంది భక్తులు, అభిమానుల దర్శనార్థం అక్కడే ఉంచారు. అంత్యక్రియలకు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. -
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు వస్వాని కన్నుమూత
పుణె : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా జేపీ వస్వాని కన్నుమూశారు. సోమవారం తన 99వ ఏట పుణెలో మరణించారు. దాదా వస్వాని 1918 ఆగస్టు2న పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలోని హైదరబాద్‌లో జన్మించారు. ఆయన పూర్తి పేరు జస్వాన్ పహ్లజ్ రాయ్ వస్వాని. శాఖాహారాన్ని, జంతు హక్కులను ప్రచారం చేయటానికి ఆయన కృషిచేశారు. ఇందుకోసం ‘‘సాధూ వస్వాని మిషన్’’ పేరిట ఓ ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన దాదాపు 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రచించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి యూనైటెడ్ నేషన్స్ ‘‘యూ తంత్ పీస్ అవార్డ్’’ను బహుకరించింది. ఆయన పుట్టిన రోజును ‘‘గ్లోబల్ ఫర్గివ్నెస్ డే’’గా జరుపుకుంటున్నారు. వస్వాని ‘‘బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్’’ లండన్, ఆక్స్‌ఫర్డ్‌లోని ‘‘గ్లోబల్ ఫోరమ్ ఫర్ స్పిరిచువల్ లీడర్స్’’ తదితర ప్రముఖ ప్రదేశాలలో తన ప్రసంగాన్ని వినిపించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోది, పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
చాలినంత ఉన్నాయా?!
ఆయన ఓ తాత్విక గురువు. జ్ఞాని. మానవ అవసరాలకు సంబంధించి, తత్వాల గురించి ఎన్నో అమూల్యమైన విషయాలను తన ప్రసంగాల ద్వారా తెలియ చెప్పిన ఆధ్యాత్మిక వేత్త.ఓసారి ఓ ధనవంతుడొకరు ఆయనను చూడ్డానికి వచ్చాడు. వస్తూనే గురువుకు దణ్ణం పెట్టి చేతిలో ఉన్న ఓ సంచి ఆయనకు అందించాడు. గురువు ఆ సంచిని తీసుకుని దానివంక నవ్వుతూ చూశారు.‘‘ఏమిటిది’’ అని అడిగారు.‘‘మీ ఆశ్రమానికి నా వల్ల చేతనైన విరాళం ఇవ్వాలనిపించింది‘‘ అని అన్నాడు ధనవంతుడు.‘‘ఇందులో ఏముంది?’’ అన్నారు గురువు.‘‘వెయ్యి బంగారు నాణాలు’’ అన్నాడు ధనవంతుడు దర్పంగా. ‘‘సంతోషం’’ అంటూనే ధనవంతుడి వంక చూసి ‘‘మీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ బంగారు నాణాలు ఉండే ఉంటాయి కదూ..’’ అని అడిగారు గురువు.‘అవునండీ.. ఉన్నాయి’’ అన్నాడు ధనవంతుడు. ‘‘అవన్నీ మీకు చాలినంతగానే ఉన్నాయా’’ అని గురువు ప్రశ్నించారు.ధనవంతుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపటి తర్వాత ధనవంతుడు ‘‘లేదు స్వామీ, ఇంకా కూడా కావలసి వస్తోంది. అందుకే రాత్రీ పగలూ అని చూసుకోకుండా శ్రమిస్తున్నాను’’ అన్నాడు ధనవంతుడు.గురువు ఆ మాటలు విని తన చేతిలో ఉన్న డబ్బు సంచిని తిరిగి ఆ ధనవంతుడికే ఇచ్చేశారు.ఇచ్చి, ‘‘ఈ నాణాల అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది... మీ దగ్గరే ఉంచుకోండి’’ అన్నారు.ధనవంతుడు ముందు తెల్లబోయాడు. తర్వాత తనకు ఏదో అర్థమైందన్నట్టుగా తలపంకించి, గురువుకు దణ్ణం పెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మనిషికి డబ్బు అవసరమే. అది తీరని ఆశ. ఎంతున్నా చాలదు అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్లకు ఎవరిౖకైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినా వారిలో ఇస్తున్నప్పుడు ఆనందముండదు. లోలోపల ఏదో తరిగిపోతున్నట్టే అనిపిస్తుంది. ఉన్నదానితో తృప్తి పడే మనసున్నప్పుడే ఎవరికైనా సాయం చేసినప్పుడు సంతృప్తిగా ఉంటుంది. – యామిజాల జగదీశ్ -
బాస్ వేధిస్తోందని...
ఆగ్రా: బాస్ వేధిస్తుందన్న కారణంతో ఓ ఉద్యోగి చేసిన పని అతన్ని చిక్కుల్లో పడేసింది. విధుల నుంచి సస్పెండ్ కావటంతోపాటు విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... అలీఘడ్ జిల్లా కోర్టులో వికాస్ గుప్తా అనే వ్యక్తి ఓ మహిళా సివిల్ జడ్జి దగ్గర ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అతని వ్యవహారశైలిలో మార్పును గమనించిన ఆమె.. తన ఛాంబర్లో సీసీటీవీ ఫుటేజీని ఉంచారు. ఓరోజు ఆమె నీళ్లు అడగ్గా, గ్లాసులో ఉమ్మేసి మరీ ఆమెకు నీటిని అందించాడు. అదంతా సీసీటీవీలో రికార్డయ్యింది. ఫుటేజీని చూసిన ఆమె ఈ విషయంపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతవారం ఈ ఘటన చోటు చేసుకోగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై ఎంప్లాయిస్ యూనియన్ నేత ఉమా శంకర్ యాదవ్ స్పందించారు. ‘గుప్తా చేసింది ముమ్మాటికీ తప్పే. అయితే గత రెండు నెలలుగా అతనిపై వేధింపులు ఎక్కువయ్యాని తెలిసింది. అప్పటి నుంచి అతని మానసిక స్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బహుశా అందుకే ఇలా చేసి ఉంటాడేమో’ అని యాదవ్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా సెషన్స్ న్యాయమూర్తి పీకే సింగ్ ఓ సీనియర్ అధికారితో విచారణకు ఆదేశించారు. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని జడ్జి ఆ అధికారిని ఆదేశించారు. -
సంతోషం మీ సొంతమా?
‘సంతోషం ఎక్కడో కాదు, మనలోనే ఉంటుంది’ అని తత్వవేత్తల నుంచి ఆధ్యాత్మిక గురువుల వరకు చెబుతుంటారు. సంతోషాన్ని ఆస్వాదించగల నేర్పు ఉంటే చాలు. మనలో ఆ నేర్పు ఉందా? 1. మీకు ఎదురైన ప్రతి అంశంలోనూ పాజిటివ్ కోణాన్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. మీకు ఎదురైన సమస్యలో ఇమిడి ఉన్న ప్రతిబంధకాలను కాకుండా దానికి పరిష్కారమార్గాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎ. అవును బి. కాదు 3. ప్రతిరోజూ మనసారా నవ్వగలిగే కామెడీ షోలు, తమాషా సన్నివేశాలకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఎ. అవును బి. కాదు 4. న్యూస్పేపర్లో కాని మంచిపుస్తకాల నుంచి కాని స్ఫూర్తిదాయకమైన రచనలను కనీసం కొద్దిపేజీలైనా సరే ప్రతిరోజూ చదువుతారు. ఎ. అవును బి. కాదు 5. అప్పుడప్పుడూ మీ ఆలోచనలు ఎలా సాగుతున్నాయని ఆత్మపరిశీలన చేసుకుంటుంటారు. ఎ. అవును బి. కాదు 6. బస్సులో ఇబ్బంది పడుతున్న వారి కోసం మీ సీటునివ్వడంలాంటిచిన్నదైనా సరే... రోజుకు ఒకటైనా ఇతరులకు ఉపయోగపడే పని చేసి తృప్తిపడుతుంటారు. ఎ. అవును బి. కాదు 7. ప్రతిరోజూ మీకు సంతోషం కలిగించే ఒక చిన్న పనినైనా చేసుకుంటారు. ఇష్టమైనది తినడం, చదవడం, బీచ్‌లో షికారుకెళ్లడం, టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ చూడడం వంటి చిన్న పనుల్లో దొరికే సంతోషం అనంతం. ఎ. అవును బి. కాదు 8. ఎవరైనా సంతోషంగా ఉన్నా, మీకు లేనివి వారికి ఉన్నా ఈర్ష్యపడడం అనేది తెలియకుండా జరిగిపోతోంది. ఎ. కాదు బి. అవును 9. మీ ఫ్రెండ్స్ మనసు బాగాలేనప్పుడు మీతో కలిసి కబుర్లు చెబుతూ సాంత్వన పొందాలనుకుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సంతోషం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు, దానిని నిండుగా ఆస్వాదిస్తున్నారు. ‘బి’లు ఎక్కువైతే సంతోషంగా జీవించడానికి మీ చుట్టూ ఉన్న ఏ అంశాన్నీ మీరు వినియోగించుకోవడంలేదనుకోవాలి. -
పెరటి వైద్యం
బాధను ఔషధం తొలగిస్తుంది. అయితే బాధకు ఒకే ఔషధం ఉండదు! ఇదే జీవితంలోని పెద్ద సందిగ్ధత. ఈ సందిగ్ధత కంటే బాధే నయం అనిపిస్తుంది కొన్నిసార్లు! ఇన్ని ఔషధాలేమిటి? ఇంత అయోమయం ఏమిటి? జాషువా పొల్లాక్ అంతర్జాతీయ వయెలినిస్ట్. యు.ఎస్. ఆయనది. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. జీవితంలో సమస్యల పరిష్కారాలకు ‘హార్ట్ఫుల్నెస్ వే’ అనే ఒక కొత్త మందును కనిపెట్టారు పొల్లాక్. దీనికి ఆయన చెప్పిన తేలికపాటి అర్థం ‘సంతృప్తి చెందడం’. రెండు రోజుల క్రితం ఈయన చండీఘర్ వచ్చినప్పుడు..‘సంతృప్తి చెందడం అంటే ఏమిటి? సరిపెట్టుకోవడమా?’ అని అడిగారు మనలాంటి వాళ్లు కొందరు ఆయన్ని. ‘కాదు, సంతృప్తి చెందడమే’ అన్నారు పొల్లాక్. అప్పుడిక జీవితంలో ఏ సమస్యా బాధించదట. సమస్య ఉంటుంది కానీ, బాధ ఉండదు. ఇదీ పొల్లాక్ వైద్యం. అర్థమవడం కొంచెం కష్టమే. ‘మెడిటేషన్ చేస్తే అర్థం చేసుకోవడం సాధ్యమే’ అంటాడు మళ్లీ పొల్లాక్. సమస్య కన్నా పెద్ద సమస్యలా అనిపిస్తాయి ఈ సాధనలన్నీ. వేదాంతిది ఒక వైద్యం. ఆధ్యాత్మిక వేత్తది ఒక వైద్యం. ఏ వైద్యమూ వద్దనే నాస్తికుడిది ఒక వైద్యం. ఇది సుఖంగా అనిపిస్తుంది.. వైద్యం చేయించుకోకుండా తిరగడం! మరి నొప్పీ? అదొక్కటే ఉంటే చాలదా.. వైద్యం నొప్పి కూడా ఎందుకు? ఇదొక ధోరణి. పొల్లాక్ ‘హార్ట్ఫుల్నెస్ వే’ కూడా మనల్ని అక్కడికే తీసుకెళుతుంది. వైద్యుడు లేని చోటుకు, వైద్యం అవసరం లేని చోటుకు! ‘‘జీవితంలో ఒకేచోట ఉండిపోండి. ఎక్కడున్నారో అక్కడే. అదే స్నేహితులు, అదే కుటుంబం, అదే ఉద్యోగం. నిస్పృహ వస్తుంది. రానివ్వండి. ధ్యానం ఉంది కదా.. దాంతో మీ గుండెనిండా సంతృప్తి నింపుకోండి. నిస్పృహ పోతుంది’’ అంటాడు పొల్లాక్! అంటే మనకు మనమే వైద్యులం. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనేది మన ఫీలింగ్. ఇన్నర్ హీలింగ్‌కి కావలసింది మన నాడికి మన చెయ్యే. బహుశా ఇదే కావచ్చు ‘హార్ట్ఫుల్నెస్ వే’. -
ఆశారాం కేసులో తీర్పు రిజర్వు
జోధ్‌పూర్: రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాంపై తీర్పును ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ కేసులో గత 5 నెలలుగా సాగుతున్న వాదనలు శనివారంతో ముగియగా జడ్జి తీర్పును ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. రాజస్తాన్‌లోని మనాయి గ్రామం సమీపంలో ఆశారాం ఆశ్రమం ఉంది. ఆశారాం తనను రేప్ చేశారని అదే ఆశ్రమంలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలిక 2012లో పోలీసులకు ఫిర్యాదుచేయడంతో 2013లో ఆశారాంను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జోధ్‌పూర్ జైలులో ఉంటున్న ఆయనకు నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే వీలుంది. -
ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి దూరం
విపరీతమైన ఒత్తిడితో ఉన్నప్పుడు ఆప్తులెవరైనా కాసేపు మన చేతులు పట్టుకున్నారనుకోండి. ఏమనిపిస్తుంది? ఒత్తిడి తాలూకూ ఇబ్బంది ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కదూ! అందులో వాస్తవం లేకపోలేదు అంటున్నారు గోథెన్బర్గ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని అంటున్నారు వారు. ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ ఎందుకు? ఎలా? జరుగుతుందన్న విషయాలు మాత్రం ఇప్పటివరకూ తెలియవు. ఈ నేపథ్యంలో ఛంటాల్ ట్రిస్కోలీ అనే శాస్త్రవేత్త 125 మందిపై కొన్ని ప్రయోగాలు చేశారు. దీర్ఘకాలపు స్పర్శతో శరీరంలో ఒత్తిడికి కారణమని భావిస్తున్న హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం కూడా మందగిస్తున్నట్లు తెలుసుకోగలిగారు. ఒక రకమైన మానసిక తృప్తి ఏర్పడటం వల్ల ఇలా జరుగుతున్నట్లు ఇప్పటివరకూ అనుకునేవారని.. తమ ప్రయోగాల్లో దీనికి భిన్నమైన కారణాలు తెలిసాయని ఛంటాల్ చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒత్తిడికి మరింత మెరుగైన చికిత్స అందించవచ్చునని అంటున్నారు. -
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర
-
మనసులో మోసే బండరాయి
ఒక పక్కన కూర్చుని ఆ గ్రామీణుడు వాళ్ల సంభాషణే వింటున్నాడు. ‘అసలు ప్రపంచంలో ఉన్నది ఏదైనా మన మనసులో ఉన్నదే’ అన్నాడు అందులో ఒక సన్యాసి. ఒక చిన్న ఊళ్లో, ఒక చిన్న గుడిలో ఒకాయన నివసించేవాడు. ఆ గ్రామీణుడు తన దైనందిన జీవితంలో మునిగి, తన పనులేవో చూసుకుంటూ బతికేవాడు. ఒకరోజు ఆ దారిన ప్రయాణిస్తున్న నలుగురు సన్యాసులు ఆ గుడి దగ్గర ఆగారు. రాత్రిపూట అక్కడ పడుకోవడానికి వీలవుతుందా అని అడిగారు. ఈయన ఎంతో అభిమానంగా వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు. రాత్రిపూట కట్టెపుల్లలు తెచ్చి వారికోసం చలిమంట వేశాడు. చలిమంట కాచుకుంటూ నలుగురు సన్యాసులు తీవ్రమైన ఆధ్యాత్మిక చర్చలోకి దిగిపోయారు. పదార్థమూ, చైతన్యమూ ఇట్లా ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక పక్కన కూర్చుని ఆ గ్రామీణుడు వాళ్ల సంభాషణే వింటున్నాడు.‘అసలు ప్రపంచంలో ఉన్నది ఏదైనా మన మనసులో ఉన్నదే’ అన్నాడు అందులో ఒక సన్యాసి. ‘అట్లా అయితే ఆ దూరాన ఉన్న ఆ పెద్ద బండరాయి కూడా మన మనసులోనే ఉందంటావా?’ అడిగాడు మరో సన్యాసి.‘ఒక లెక్కలో ఆలోచిస్తే అది మనలోనే ఉన్నట్టు’ మొదటి సన్యాసిని సమర్థించాడు మూడో అతను.‘అవునవును’ అంగీకరించాడు నాలుగో వ్యక్తి.కాసేపు చర్చ ఆగింది. మంట వెలుగుతోంది. వారి మాటల సారాన్ని ఆకళింపు చేసుకుంటూ అన్నాడు గ్రామీణుడు: ‘అయ్యలారా! అయితే మీ మనసులు ఇప్పుడు ఆ పెద్దబండరాయిని మోస్తూవుండాలి. ఈ కాసేపైనా దింపేయండి’. -
ప్రత్యేక పూజలు చేయడంలేదు
రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర శనివారం మొదలైంది. వారం పది రోజులపాటు సాగే ఈ ట్రిప్‌లో రజనీ పలు దేవాలయాలను సందర్శించి, ధ్యానం చేసి, ‘యోగాద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా’ వందేళ్ల వేడుకల్లో పాల్గొని చెన్నై చేరుకుంటారు. ‘‘ఇటీవల పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. ఆ ప్రయాణం కోసం ఈ ప్రయాణం (ఆధ్యాత్మిక యాత్ర)లో ప్రత్యేక పూజలు చేయాలనుకోవడంలేదు. ఎప్పటిలానే ఇది కూడా ఓ స్పిరిచ్యువల్ జర్నీ అంతే’’ అని రజనీ పేర్కొన్నారు. ముందు ధర్మశాల వెళ్లిన రజనీకి ఘనస్వాగతం లభించింది. అక్కడి శివాలయాన్ని దర్శించారాయన. ఆ తర్వాత రిషికేష్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌లో 1917లో పరమహంస యోగానంద ప్రారంభించిన ‘యోగాద సత్సంగ సొసైటీ’ (వైఎస్ఎస్) వందేళ్ల వేడుకల్లో పాల్గొంటారు. -
హిమాలయాలకు రజనీకాంత్
సాక్షి, చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. శనివారం చెన్నై నుంచి విమానంలో సిమ్లాకు బయలుదేరారు. ఆధ్యాత్మిక పర్యటనకు రజనీకాంత్ శ్రీకారం చుట్టడంతో తమిళ సంవత్సరాదిన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లాకు, తర్వాత ధర్మశాల, రిషికేశ్‌లకు వెళ్లనున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా బాబా ఆశీస్సుల కోసం వెళ్తున్నారా అని చెన్నైలో మీడియా ప్రశ్నించగా, ‘ఇప్పుడెందుకు ఆ ప్రశ్న’ అని దాట వేశారు. -
ఎన్నిసార్లు వెళ్లినా...
మళ్లీ మళ్లీ వెళుతుంటారు రజనీకాంత్. ఎక్కడికి అంటే.. హిమాలయాలకు. ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా మొదలుపెట్టే ముందు రజనీకాంత్ హిమాలయాలకు వెళతారు. అక్కడ కొన్ని రోజులు ధ్యానం చేస్తారు. పలువురు భక్తులను, గురువులను కలుస్తారు. కొన్నాళ్లుగా రాజకీయాలు, రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కాలా’, ‘2.0’, కార్తీక్ సుబ్బరాజుతో చేయబోతున్న కొత్త సినిమాల కార్యకలాపాలతో బిజీగా ఉన్న రజనీ ‘బ్రేక్’ తీసుకున్నారు. ఈ బ్రేక్ ఎందుకంటే ‘స్పిరిచ్యువల్ జర్నీ’ కోసం. వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతుంది. ఈరోజే రజనీ ప్రయాణం. సిమ్లా వెళ్లి, అట్నుంచి ధర్మశాల, ఆ తర్వాత రిషికేశ్ వెళ్లేట్లు ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఈ జర్నీ పూర్తయ్యాక కొత్త సినిమా జర్నీతో రజనీ బిజీ అవుతారట. -
ఆధ్యాత్మిక పాలన అందిస్తా
సాక్షి, చెన్నై: పార్టీ పేరు ప్రకటించి, పూర్తిస్థాయి రాజకీయ ఆరంగేట్రం చేయకముందే.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన భవిష్యత్ రాజకీయ మార్గమెలా ఉండబోతోందో స్పష్టం చేశారు. జీవన విధానంలో ఆధ్యాత్మికతను నింపుకున్న రజనీ.. తన రాజకీయ మార్గం కూడా అదే దిశలో ఉండబోతోందని తేల్చి చెప్పారు. కుల, వర్గ వివక్ష లేని ఆధ్మాత్మిక పాలన అందిస్తానని స్పష్టం చేశారు. అదేసమయంలో సుపరిపాలన అందించేందుకు సాంకేతికత, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటానన్నారు.అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్ స్థాయి తనది కాదని, తనే కాదు.. మరో వెయ్యేళ్లయినా ఆ స్థాయి నేత ఉద్భవించబోడన్న రజనీ.. ఎంజీఆర్ తరహాలో అద్భుత పాలన మాత్రం అందించగలనన్నారు. జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఆవరించిందని, దాన్ని తొలగించేందుకే తాను రాజకీయ రంగప్రవేశం చేస్తున్నానని వివరించారు. రాజకీయాలు మాట్లాడక తప్పడంలేదు! ఆధ్యాత్మిక పాలన అంటే ఏంటోనంటూ కొందరు హేళన చేస్తున్నారనీ, అలాంటి వారికి దాని సత్తా ఏంటో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. చెన్నై పూందమల్లిలోని ఎంజీఆర్ విద్య, పరిశోధన కేంద్రం 30వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన రజనీ.. అక్కడ ఎంజీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ మాట్లాడక తప్పడం లేదు’ అంటూ రజనీ తన ప్రసంగం ప్రారంభించారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే ప్రభుత్వం వాడవాడల్లో ఘనంగా జరిపిందనీ, అయితే ఆయన చిత్ర రంగానికి చెందిన వాడయినప్పటికీ సినిమా వాళ్లతో కలసి వేడుకలు నిర్వహించనే లేదని రజనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు కొత్తేమీ కాదనీ, ఎంజీఆర్, కరుణానిధి, మూపనార్, చో రామస్వామి వంటి వారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నాననీ, ఆ విద్యను ఎప్పుడు ఎలా ప్రయోగించాలో బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. సత్తా ఏమిటో చూపుతా.. ‘రాజకీయాల్లోకి సినిమా వాళ్లు ఎందుకని కొందరు ప్రశ్నించారు. రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి నాపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు, హేళనలు చేస్తున్నారు. నా వయస్సు 67 ఏళ్లు. ఈ వయసులోనూ నటుడిగా నా పని నేను చేసుకుంటుంటే కొందరు నేతలు మాత్రం వారి పని వారు సక్రమంగా చేయడం లేదు. అందుకే నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వస్తోంది’ అని రజనీ తన ప్రసంగంలో చెప్పారు. రాజకీయమంటే ముళ్లు, పాములు, రాళ్లు రప్పలతో నిండినదని తనకు తెలుసునన్నారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తానంటే అడ్డుకునేందుకు మీరెవ్వరు? తిట్ల రాజకీయాలు ఆపేస్తే మంచిది’ అని ఆయన కొందరిని పరోక్షంగా హెచ్చరించారు. ఆధ్యాత్మికతలో పరమాత్మ ఉందనీ, కుల, మత, జాతుల పరమైన పక్షపాతం లేకుండా నిజాయితీతో సేవ చేయాలన్న తపనే తన రాజకీయం అని రజనీ చెప్పారు. జయలలిత బతికున్నప్పుడు ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని ప్రశ్నిస్తున్నారనీ, అప్పట్లోనూ నేతలకు ముచ్చెమటలు పట్టించే సంకేతాలను తాను ఇచ్చిన విషయాన్ని వారు మరచిపోయినట్టు ఉన్నారని రజినీ అన్నారు. ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాక అభిమానులతో మాట్లాడుతున్న రజనీ -
ఉమ్మితో మధుమేహ పరీక్ష
మనోహరాబాద్(తూప్రాన్) : టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలో కొత్తగా నిర్మించిన డయాబెటోమిక్స్ పరిశ్రమను శనివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఐసీసీ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డి, పారిశ్రామికవేత్త వరప్రసాద్‌రెడ్డి తదితరులతో కలసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలో డయాబెటిక్ పరీక్ష పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైద్య పరీక్షల ఖర్చులకు భయపడి గ్రామీణులు ఆస్పత్రులకు వెళ్లడం లేదన్నారు. అలాంటి వారి కోసమే వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు రమేశ్, శ్రీనివాస్ బృందం ఏళ్లపాటు శ్రమించి ఆధునిక పరిజ్ఞానంతో డయాబెటిక్ పరికరాన్ని రూపొందించిందని, ఈ పరికరం ద్వారా ఇంటి వద్దనే ఒక డాలర్ ఖర్చుతో.. షుగర్ పరీక్ష చేసుకోవచ్చని అన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ పరికరం ఓ వరమన్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి పరికరం లేదని, ఇందుకు డాక్టర్లు అభినందనీయులని కేటీఆర్ కొనియాడారు. శాంతబయోటెక్ సంస్థవ్యవస్థాపకుడు, డయాబెటోమిక్స్ సంస్థ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. 20 సంవత్సరాల కృషి ఫలితమే ఈ డయాబెటోమిక్స్ పరిశ్రమ అని చెప్పారు. తాము రూపొందించిన పరికరంతో రక్త సేకరణ లేకుండా.. ఇంటి వద్దే ఉమ్మితోనే మధుమేహ పరీక్ష చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టెక్నికల్ బోర్డ్ డైరెక్టర్ బిందుదేవి, డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ రామకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్ నాగేళ్ల, పీవీఆర్, గాంధీ ఆస్పత్రి గైనకాలజిస్ట్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మీ రాతలో మీరు
చేతిరాత కూడా వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. కావాలంటే మీరు సెల్ఫ్‌చెక్ చేసుకోండి. మీ చేతిరాత బట్టి మీరేమిటో స్వయంగా తెలుసు కోండి. ఇది సరదాగానే కానీ నిజాయితీగా సమా ధానాలు ఇవ్వడం కూడా ముఖ్యమే. ముందుగా మీ స్వదస్తూరీతో రాసిన దానిని ఎదురుగా ఉంచు కోవడం మరువకండి. 1. మీ చేతిరాత ఇలా ఉంటుంది ఎ) వాలుగా.. బి) నిటారుగా.. సి) ఎడమవైపు వొంపుగా.. 2. మీ రాతలో అక్షరాలు.. ఎ) గొలుసుకట్టు బి) పదాలు విడిగా.. సి) పొడి అక్షరాలు 3. వాక్యాలు ఎంత దగ్గరగా ఉంటాయి ఎ) దూరంగా.. బి) పొందికగా.. సి) మరీ దగ్గరగా.. 4. మీరు రాసినప్పుడు వాక్యాలు పేజీలో ఏ దిశగా ఉంటాయి? ఎ) కింద నుంచి పై భాగానికి.. బి) తిన్నగా గీత గీసినట్టు.. సి) ఏటవాలుగా.. 5. మొత్తంగా మీ దస్తూరీని చూస్తే ఎలా కనిపిస్తుంది? ఎ) అందంగా.. పొందికగా.. బి) స్పష్టంగా.. పొడిపొడిగా సి) భారంగా.. సంక్లిష్టంగా.. మీరిచ్చే సమాధానాలు బట్టి మీ చేతిరాతను ఇలా విశ్లేషించుకోవచ్చు. 1. అక్షరాలు ఎడమవైపు వాలుగా ఉంటే మీరు బిడియస్తులు. తిన్నగా ఉంటే ఎదుటివారిని ఆకట్టుకునే తత్త్వం ఉన్నవారు. అక్షరాలు కుడి వైపు వాలుగా ఉంటే గట్టి స్వభావం, సొంత నిర్ణయాల మీద ఆధారపడేవారు. 2. గొలుసుకట్టు రాత అయితే మీరు మంచి మాటకారి. విడి పదాలుగా రాస్తే మీరు బిడియస్తులు. పొడి అక్షరాలయితే మీరు తెలివిగా, స్పష్టంగా వ్యవహరించే స్వభాగం గలవారు. 3. వాక్యాల మధ్య దూరం ఎక్కువయితే మీరు ఏకాంతాన్ని ఇష్టపడతారు. పొందికగా రాసేవారయితే డబ్బు దుబారా చేసేవారు, ఎక్కువ మాట్లాడేవారు. బాగా దగ్గరగా రాస్తే మీరు చాలా ఆర్గనైజ్డ్గా వ్యవహరిస్తారు. 4. వాక్యాలు కింది నుంచి పైకి వెళ్తుంటే మీరు చాలా ఎనర్జిటిక్‌గా, ఆశావాదిగా, స్పష్టమైన అవగాహన ఉన్నవారిగా భావించవచ్చు. వాక్యాలు తిన్నగా రాస్తే మీరు ఒత్తిడికి లోనవుతుండవచ్చు. కింది వైపు వాలుగా ఉంటే మీరు దృఢచిత్తం గలవారిగా, ఒంటరితనాన్ని ఇష్టపడే వారిగా పరిగణించవచ్చు. 5. మీ దస్తూరీ పొందికగా ఉంటే మీరు సున్నిత స్వభావులని, మొహమాటస్తులని, ఆధ్యాత్మిక భావనలు గలవారిగా భావించ వచ్చు. స్పష్టంగా రాసేవారయితే పట్టుదల, దృఢచిత్తం గలవారవుతారు. రాత భారీగా కనిపిస్తుంటే, మీరు ఎనర్జిటిక్‌గా, చలాకీగా, ఏ పరిస్థితులకయినా ఇమిడిపోయే తత్త్వం గలవారిగా పరిగ ణించవచ్చు. -
సాధ్వీమణులకు వందనం..
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత, నిబద్ధత అవసరం.. అవి చేకూరాలంటే మానసిక ప్రశాంతత ఉండాలి.. అందుకు ఏకైక మార్గం ఆధ్యాత్మికత.. తమ ప్రవచనాలు, ప్రసంగాల ద్వారా ఎందరికో సాంత్వన చేకూర్చిన సాధ్వీమణులను ఓసారి స్మరించుకుందాం.. శ్రీ శారదా దేవి భారత మహిళా సాధువుల్లో అత్యంత ప్రముఖులు. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని. 1858లో శారదామణి ముఖోపాధ్యాయ్గా జన్మించిన ఆమెకు ఐదేళ్ల ప్రాయంలో 23 ఏళ్ల రామకృష్ణ పరమహంసతో వివాహం జరిగింది. కౌమార దశలోకి ప్రవేశించగానే దక్షిణేశ్వర్‌లోని కాళీమాత గుడిలో పూజారిగా పనిచేసే భర్తను కలుసుకోవడానికి వేల మైళ్లు ప్రయాణించారు. భర్తను చేరుకునే సమయానికి ఆయన ఆధ్యాత్మిక యోగిగా మారారు. భార్యగా, భక్తురాలిగా, సహాయకురాలిగా పరమహంస సాహచర్యంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. పరమహంస ఆమెను కాళీ మాత అవతారంగా, దైవ మూర్తిగా భావించి శారదాదేవిగా నామకరణం చేశారు. తమ ఆశ్రమానికి వచ్చే మహిళా భక్తుల్ని సాదరంగా ఆహ్వానించేవారు. వారికి ఆధ్యాత్మిక అంశాలు బోధించేవారు. భర్త దైవైక్యం పొందిన తర్వాత శిష్యులందరికీ గురువుగా మారారు. ఎంతో మంది భక్తులను పొందారు. శారదాదేవి గౌరవార్థం ఆమె భక్తుల్లో ఒకరు 1954లో శ్రీ శారదా మఠ్ రామకృష్ణ శారదా మిషన్ స్థాపించారు. దీని ద్వారా ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల్లో శాఖలు కలిగి ఉంది. మైత్రేయి ప్రాచీన భారతదేశంలో అత్యంత మేధావిగా పేరుగాంచిన మహిళగా అనేక పురాణాల్లో మైత్రేయి ప్రస్తావన ఉంది. విద్యా వ్యాప్తికై ఆమె ఎంతగానో కృషి చేశారు. వైదిక భారతదేశంలో స్త్రీలకు కూడా విద్యావకాశాలు ఉన్నాయనడానికి నిదర్శనంగా నిలిచారు. భారతీయ మహిళా మేధావులకు దర్పణంగా నిలిచిన మైత్రేయి స్మారకార్థం ఢిల్లీలోని ఒక విద్యా సంస్థకి ఆమె పేరు పెట్టారు. భైరవీ బ్రాహ్మణి రామకృష్ణ పరమహంస 1861లో భైరవీ బ్రాహ్మణిని గురువుగా స్వీకరించారు. ఆమె ఎల్లప్పుడూ రామ, వైష్ణవ దేవతల ప్రతిమలను ప్రతిబింబించే ‘రఘువీర్ శిల’ను తన వెంట తీసుకువెళ్లేవారు. గౌడీయ వైష్ణవం, తంత్ర విద్యను ఆచరించేవారు. దైవత్వం పట్ల నమ్మకాన్ని, భక్తి శాస్త్రాలను బోధించారు. శక్తిని పూజించేందుకు కావాల్సిన తంత్ర విద్యను రామకృష్ణకు ఉపదేశించారు. 64 రకాల తంత్ర సాధనాలను కేవలం రెండేళ్లలో రామకృష్ణకు బోధించారు. రామకృష్ణ వీటిని పూర్తి స్థాయిలో ఆచరించేందుకు చిత్తశుద్ధి, నిగ్రహం పొందేందుకు మంత్ర, జప, పురస్కరణ వంటి సంస్కృతులు పాటించేవారు. సంప్రదాయ విరుద్ధమైన వామాచార ఆచారాన్ని(పూర్తిస్వేచ్ఛగా జీవించడం, మాంసాహారం భుజించడం, బ్రహ్మచర్యం వదలటం) కూడా రామకృష్ణకు బోధించారు. కానీ ఆయన ఈ ఆచారాన్ని పూర్తిస్థాయిలో ఆచరించలేదు. కుమారి పూజ, కుండలిని యోగ, యోగాసనాలు బోధించిన పరిపూర్ణ గురువుగా మన్ననలు అందుకున్నారు. అవ్వయ్యార్ తమిళంలో అవ్వయ్యార్ అంటే గౌరవనీయులైన మహిళ అని అర్థం. తమిళ సాహిత్యంలో ఈ పేరుతో సుమారు ముగ్గురు కవయిత్రులు ఉన్నారు. వారిలో ఒకరు 1 వ శతాబ్దంలో జీవించినట్లు, 59 పద్యాలు రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. అవ్వయ్యార్-2 చోళ వంశ పాలనా సమయంలో(10వ శతాబ్దం) జీవించారు. రోజువారీ జీవితంలో చేయకూడని, చేయాల్సిన పనుల గురించి సామాన్య భాషలో పద్యాలు రచించారు. ఆమె రాసిన పద్యాలు నేటికీ తమిళ పాఠ్య పుస్తకాల్లో దర్శనమిస్తున్నాయి. తను ఎంతో ఙ్ఞాన సంపదను కలిగి ఉన్నానని, ఇక నేర్చుకోవాల్సిందేమీలేదని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మారువేషంలో వచ్చిన మురుగన్ ఙ్ఞానసముపార్జన నిత్యప్రవాహం వంటిదని, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమెకు బోధ చేయడంతో మరలా విద్యాభ్యాసం ప్రారంభించిందని, చిన్నారుల కోసం పుస్తకాలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. ఉభయ భారతి ఒకప్పటి మాహిష్మతి(మహిషి) రాజు మందన మిశ్రా భార్య. జైత్ర యాత్రలో భాగంగా ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు మాహిష్మతి రాజ్యానికి చేరుకున్నపుడు రాజుతో మేధో చర్చకు సిద్ధమవుతారు. ఈ చర్చలో విజేతను నిర్ణయించే బాధ్యతను రాజు భార్యకు అప్పగిస్తారు. చర్చలో ఓడితే రాజు సన్యాసం స్వీకరించాలనే షరుతు కూడా విధిస్తారు. వాదోపదవాదాలను, గణాంకాలను బేరీజు వేస్తూ శంకరాచార్యుల వారిని విజేతగా నిర్ణయిస్తుంది ఉభయ భారతి. షరతు ప్రకారం రాజు సన్యాసం స్వీకరిస్తారు. భర్త అడుగుజాడల్లో నడిచే భారతీయ స్త్రీ కనుక ఆమె కూడా సన్యాసం స్వీకరించి, ఇద్దరూ కలిసి ఙ్ఞాన మార్గాన్ని వ్యాప్తిచేస్తూంటారు. ఈ క్రమంలో ఆమె గంగా నది ఒడ్డున ఆశ్రమంలో శిష్యురాళ్లతో కలిసి జీవిస్తూ ఉంటారు. స్నానపానాదుల కోసం రోజూ గంగా నదికి వెళ్లే దారిలో బ్రహ్మఙ్ఞానిగా పిలువబడే సన్యాసి వారికి తారసపడతారు. అన్నింటినీ పరిత్యజించిన ఆ సాధువు ఒక మట్టికుండను మాత్రం ఎల్లప్పుడూ తన వద్దే పెట్టుకుని, ఒక దిండులాగా భావించి దానిపై నిద్రిస్తూ ఉంటారు. ఇది గమనించిన ఉభయ భారతి ‘నిజమైన సన్యాసులు దేనిని కూడా ఆస్తిగా, ప్రేమపూర్వకమైన దానిగా భావించరని’ తన శిష్యులకు చెబుతుండగా ఆ మాటలు విన్న సన్యాసి ఆగ్రహించి కుండను దూరంగా విసిరివేస్తారు. ‘నాడు ఆ కుండను మీ దగ్గర పెట్లుకుని అభిమానం పెంచుకున్నారు. నేడేమో అహంకారంతో దానిని పగులగొట్టారు’ అన్న ఉభయ భారతి మాటలు ఆయనకు కనువిప్పు కలిగిస్తాయి. ఈ విధంగా ప్రతిఒక్కరినీ ఙ్ఞాన మార్గాన్ని బోధిస్తూ తన జీవితాన్నిసంఘసంస్కరణకు అంకితం చేశారు ఉభయ భారతి. శ్రీ ఆండాళ్ వైష్ణవ మతాన్ని ఆచరించిన 12 మంది అళ్వార్లలో ఏకైక మహిళా అళ్వార్. 8వ శతాబ్దానికి చెందిన వారు. పెరుమాళ్(విష్ణుమూర్తి)ని స్తుతిస్తూ పదిహేనేళ్ల ప్రాయంలో ‘తిరుప్పావై’(తమిళం) రచించారు. ఇందులో గల 30 చరణాలను పసురామాలు అంటారు. వైష్ణవ మతాన్ని ఆచరించే అళ్వార్లు సంకలనం చేసిన ‘దివ్య ప్రబందం’లోని అంతర్భాగాలుగా వీటిని పేర్కొంటారు. పెరియళ్వార్గా పిలువబడే విష్ణుచిత్త అనే సాధువు తులసి మొక్క కింద కనిపించిన పసిపాపను చేరదీసి, కొదాయి(గోదా)గా నామకరణం చేశారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ భగవంతుని పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తి, ఆరాధనా భావం వలన భగవంతుడినే తన భర్తగా భావించి ఊహాలోకంలో విహరించేవారు. విష్ణుమూర్తి విగ్రహానికి అలంకరించే పూలమాలను తాను ముందుగా ధరించేవారు. ఇది గమనించిన ఆమె తండ్రి విష్ణుచిత్త ఆగ్రహించారు. అతని కలలో విష్ణుమూర్తి కనిపించి, తాను గోదా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు చెప్పడంతో నాటి నుంచి గోదా, ఆండాళ్,-దేవున్ని పాలించే బాలికగా పేరుపొందారు. కొంతమంది భక్తులు ఆమెను ‘సూది కొడుత సుదర్కోడి’గా పిలుచుకుంటారు. గోదా వివాహం రంగనాథ స్వామితో జరిపించేందుకు విష్ణుచిత్త ఆమెను శ్రీరంగం గుడికి తీసుకువెళ్లగా గర్భగుడిలోకి ప్రవేశించిన ఆమె దేవునిలో ఐక్యమైపోయింది. మీరా బాయి కృష్ణ భక్తురాలుగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మీరాబాయి. రాజస్థాన్‌లోని కుడ్కి జిల్లాలో జన్మించారు.16వ శతాబ్దానికి చెందినవారు. మీరాబాయి రాజపూత్ వంశానికి చెందినవారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా శ్రీ కృష్ణుడిని తన భర్తగా పూజించడంతో అత్తారింటివారు ఆమెను పీడించినట్లుగా కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. అక్క మహాదేవి 12వ శతాబ్దంలో సాగిన వీరశైవ భక్తి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లో ముఖ్యులు. కన్నడ భాషలో 430కి పైగా వచన పద్యాలు రచించారు. మంత్రోగోప్య, యోగత్రివిధి రచనలు కన్నడ సాహిత్యంలో ఆమెకు ఉన్నత స్థానం కల్పించాయి. వీరశైవ ప్రచారకులు బసవన్న, సిద్ధారామ, అల్లమప్రభు భక్తి ఉద్యమంలో మహాదేవి కృషికి గౌరవసూచకంగా ఆమెను ‘అక్క’ అని పిలిచేవారు. చెన్న మల్లికార్జుడిని(శివుడు) ఆమె భర్తగా భావించేవారు. శ్రీ దయామాత అమెరికాలోని ఊథా నగరంలో 1914లో జన్మించిన చెందిన రాచెల్ ఫాయె రైట్ తన 17వ ఏట భారత ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానందను కలుసుకున్నారు. పరిపూర్ణమైన ప్రేమ గురించి, జీవిత సత్యాల గురించి యోగానంద చేసిన ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. యోగానంద తన మొదటి శిష్యురాలిగా స్వీకరించారు. ‘దయా మాత’గా నామకరణం చేశారు. యోగానంద మరణానికి ముందు తన వారసత్వాన్ని కొనసాగించాల్సిందిగా ఆమెను కోరారు. అతికొద్ది మంది మహిళా ఆధ్యాత్మికవేత్తలు ఉన్న సమయంలో యోగానంద వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతను స్వీకరించారు. మహిళాఅనుచర గణాన్ని సంపాదించుకున్నారు. 1955లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రస్తుతం సుమారు 60 దేశాల్లో కేంద్రాలు కలిగి ఉంది. తన శిష్యులకు కర్మ యోగాను బోధించారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగాను ప్రవేశపెట్టి, ప్రాచుర్యం కల్పించారు. సంపన్న కుటుంబంలో జన్మించిన మాతాజీ బాల్యం నుంచే గాంధీ ఆశ్రమాన్ని సందర్శించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. 1947లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సంస్కృతి, సాంప్రదాయాలు, జాతీయత, నైతిక విలువల పట్ల యువతకు అవగాహన కల్పించేవారు. 1970లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘నిన్ను నడిపించే శక్తి ఏదో నీవు కనుగొనాలంటే ధ్యాన సాధన చేయాల’ని బోధించేవారు. ఈవిధమైన ధ్యాన ప్రక్రియకు సహజ యోగాగా నామకరణం చేశారు. ఈ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. ఈ క్రమంలోనే నిర్మలా శ్రీ వాస్తవను ఆమె అనుచరులు మాతాజీ నిర్మలాదేవిగా పిలిచేవారు. 90వ దశకంలో అంతర్జాతీయ సహజ యోగా ఆరోగ్య, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన మహిళలకు ఆశ్రయం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పారు. అనేక పాఠశాలలు, అంతర్జాతీయ సంగీత, కళా అకాడమీని స్థాపించారు. మా నిత్యా స్వరూప ప్రియానంద ఈమె అసలు పేరు సుదేవి. కెనడాకు చెందిన సుదేవి 2010లో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ‘ఫ్రీ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అగైనెస్ట్ ఎన్లైటెన్మెంట్’ పేరుతో వీడియోలు పోస్ట్ చేసేవారు. తన ఛానెల్లో ముఖ్యంగా హిందుత్వ, మార్మికత, శాకాహార, ఙ్ఞానోదయ, భూలోకేతర అంశాల గురించి చర్చించేవారు. 2011లో తాను భూలోకేతర మూలాలు కలిగిన వ్యక్తినని ప్రకటిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. దాదాపు 40 వేల మంది అనుచరగణాన్ని సంపాదించారు. 2015లో నిత్యానంద ఆశ్రమంలో చేరి స్వరూపాప్రియానందగా మారారు. ‘లివింగ్ అద్వైత’ అనే టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. జంతు ప్రేమికురాలైన మాతాజీ, వాటి హక్కుల కోసం పోరాడుతున్నారు. శ్రీ ఆనందమయి మా బెంగాల్‌కు చెందిన వారు. హిందూ ఆధ్యాత్మిక గురువు. 20 శతాబ్దానికి చెందిన తత్త్వవేత్తగా, సాధ్విగా గుర్తింపు పొందారు. వేలాది మంది అనుచరులను సంపాదించుకున్నారు. వారందరూ ఆమెను ఒక గురువుగా, దేవుని ప్రతిరూపంగా, దేవీ మాతగా కొలిచేవారు. సాధ్వి రితంభరా జీ(దీదీ మా) పంజాబ్‌కు చెందిన రితంభరా జీ సమకాలీన భారతీయ ఆధ్యాత్మికవేత్తల్లో ప్రముఖులు. హిందూ మత ప్రచారకులు. మానవతావాది. సామాజిక వేత్త. విశ్వహిందూ పరిషత్,ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ఉన్నారు. ‘దుర్గా వాహిని’ సేన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘వాత్సల్యగ్రామ్’ అనే సంస్థను స్థాపించి అనాథలు, వృద్ధులు, వితంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆప్యాయంగా అమ్మలా ఆదరించే గుణం కలిగిన ఆమెను అనుచరగణం ‘దీదీ మా’ అని పిలుస్తారు. ఆనందమూర్తి గురూ మా నవతరం ఆధ్మాత్మికవేత్త. క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు,యూదులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా మతాలకతీతంగా ఆమెకు అనుచరులు ఉన్నారు. ఆమె ప్రవచనాలకు లింగ, వర్గ, మత, రాజకీయ, భౌగోళిక హద్దులంటూ ఏమీలేవు. జైనిజం, బుద్ధిజం, కళలు, ఉపనిషత్తులు, యోగాలలో ప్రావీణ్యం కలవారు. ప్రతీ అంశాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయతను జోడించి తర్కించగల ఙ్ఞాననిధి. బాలికా విద్యను ప్రోత్సహించడానికి, భ్రూణహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడానికి ‘శకి’్త అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా అన్ని వర్గాల పేద విద్యార్థినులకు విద్యా అవకాశం కల్పించడంతో పాటు, ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది. బ్రహ్మకుమారి భారతీయ మూలాలతో ప్రారంభమై ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బ్రహ్మకుమారీస్’ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. బ్రహ్మకుమారీలు శివుడిని గురువుగా భావిస్తారు. సామాజిక సేవను బాధ్యతగా స్వీకరించి జీవితాంతం సేవకే అంకితం అవుతారు. ఈ సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ, సంస్కృతులతో పాటు ధ్యానం, రాజయోగా వంటి ఆధ్మాత్మిక భావనలు ప్రచారం చేస్తున్నారు. రాణి హేమలేఖ ఒక గురువుగా భర్త హేమచూడ, అత్త ఇలా ఎంతో మందిని తన ఙ్ఞాన సంపద ద్వారా అభ్యుదయ మార్గంలోకి నడిపించారు. ఆమె ప్రవచనా ప్రభావం ఎంతగా ఉండేదంటే.... ఒకానొక సమయంలో రాజ్యమంతా బ్రహ్మ ఙ్ఞానులుగా మారారట. వారి రాజ్యంలోని చిలకలు కూడా ఆమె ప్రవచనా వల్లెవేసేవట. ఈ విషయాలు ‘త్రిపుర రహస్యం’లో పేర్కొనబడినాయి. రాణి చూడల యోగ వశిష్ఠ గ్రంథంలో ఈమె గురించి పేర్కొనబడింది. మేధావుల నుంచి ఆర్జించిన ఙ్ఞానాన్ని తన భర్త రాజా సిఖిధ్వజ్కు బోధించడం ద్వారా గురువుగా మారారు. - సుష్మారెడ్డి యాళ్ళ -
2020 నాటికి వెల్నెస్ టూరిజంలో భారత్ నం.1
వ్యయప్రయాసలకోర్చి పుణ్యం మూటగట్టుకోవడానికి చేసే తీర్థయాత్రలు అనాదిగా ఉన్నవే. వినోదం కోసం, ఆటవిడుపు కోసం చేసే విహారయాత్రలు కూడా తెలిసినవే. ఇటీవలి కాలంలో స్వస్థత కోసం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక వికాసంతో పాటు శారీరక ఉత్తేజం కోసం యాత్రలు చేసే పర్యాటకులు పెరిగారు. ఇలాంటి పర్యాటకాన్ని ‘వెల్నెస్ టూరిజం’ అంటున్నారు. తీర్థయాత్రలు, వినోద విహార యాత్రలకు వెళ్లే పర్యాటకుల కంటే ఇటీవలి సంవత్సరాల్లో ‘వెల్నెస్ టూరిజం’ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం మార్కెట్ పరిమాణం 2015 నాటికి 56,320 కోట్ల డాలర్లు (రూ.35.83 లక్షల కోట్లు) మేరకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం మార్కెట్ వార్షిక వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతోందని ‘గ్లోబల్ వెల్నెస్ ఎకానమీ మానిటర్’ తాజా సంచిక వెల్లడించడం విశేషం. వెల్నెస్ టూరిజం మార్కెట్లో ప్రపంచవ్యాప్త వృద్ధి రేటును మించి భారత్ దాదాపు 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇదే దూకుడు కొనసాగితే ఈ రంగంలో భారత్ 2020 నాటికి అగ్రస్థానంలో నిలవగలదని నిపుణుల అంచనా. స్వస్థత నుంచి సౌందర్యం వరకు... స్వస్థత పొందడం నుంచి సౌందర్యం పెంపొందించుకోవడం వరకు అనేక కారణాలతో పర్యాటకులు ‘వెల్నెస్ టూరిజం’ బాట పడుతున్నారు. ‘వెల్నెస్ టూరిజం’లో పర్యాటకులు రవాణా, వసతి సౌకర్యాల కోసం ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత తాము ఆశించిన ప్రయోజనం మేరకు సౌందర్య చికిత్సలు, ఒత్తిడి నివారణ చికిత్సలు, యోగ, ధ్యానం, ప్రత్యామ్నాయ ఆహార చికిత్సలు, మూలికా చికిత్సలు, మసాజ్, స్పా వంటి సేవల కోసం వెచ్చిస్తున్నారు. పని ఒత్తిడే ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం శరవేగంగా పెరుగుతుండటానికి పని ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో పనిచేసే ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పని ఒత్తిడి ఫలితంగా ఉద్యోగుల్లో తలెత్తే ఆరోగ్యసమస్యల వల్ల ప్రపంచ ఆర్థికరంగం ఉత్పాదకత సుమారు 10–15 శాతం మేరకు తగ్గుతున్నట్లు అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. పని ఒత్తిడి వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యలే వెల్నెస్ టూరిజం పెరుగుదలకు దోహదపడుతున్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి జనాభా ఆర్థికంగా పరిపుష్టం కావడం, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం, వార్ధక్య నియంత్రణ వస్తువులు, సేవలపై ఆసక్తి పెరగడం, సౌందర్యం కోసం, వార్ధక్య నివారణ కోసం ఎంత మొత్తమైనా ఖర్చు చేసే తత్వం పెరగడం, ఒత్తిడిని అధిగమించడంతో పాటు ఆధ్యాత్మిక వికాసం, మానసిక ప్రశాంతత కోసం ఎంత దూరమైనా వెళ్లాలనుకోవడం వంటి కారణాలు ‘వెల్నెస్ టూరిజం’ రంగాన్ని వృద్ధి మార్గంలో పరుగులు తీయిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం వెల్నెస్ టూరిజం రంగంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈ రంగంలో భారత్ పన్నెండో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముప్పయి దేశాలు వెల్నెస్ టూరిజం కేంద్రాలుగా ఉంటున్నాయి. వాటిలో సుమారు 86 శాతం వెల్నెస్ టూరిజం వ్యాపారం తొలి ఇరవై స్థానాల్లో ఉన్న దేశాల్లోనే సాగుతోంది. భారత్‌లో వెల్నెస్ టూరిజం రంగం కొంత ఆలస్యంగా పుంజుకున్నా, గత కొద్ది సంవత్సరాలుగా శరవేగంగా వృద్ధి సాధిస్తోంది. రిషికేశ్, ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల వద్ద ఉండే రిషికేశ్ పుణ్యక్షేత్రంగా తరతరాలుగా ప్రసిద్ధి పొందింది. ఇదివరకు ఇక్కడకు వచ్చేవారిలో అత్యధికులు తీర్థయాత్రికులే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. కేవలం పుణ్యం కోసం వచ్చే తీర్థయాత్రికులే కాదు, స్వస్థత, ప్రశాంతత వంటి పురుషార్థాల కోసం వచ్చే వెల్నెస్ టూరిస్టులను సైతం రిషికేశ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రిషికేశ్‌లో వంద ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ‘ఆనంద’ రిసార్ట్స్‌కు దేశ విదేశాలకు చెందిన వెల్నెస్ టూరిస్టులు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నారు. ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు నాలుగేళ్ల కిందట భారత్ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిరోజులు ప్రశాంతంగా గడిపి వెళ్లారు. చుట్టూ పచ్చని వనాలు, కనుచూపు మేరలో ధవళ కాంతులతో కనువిందు చేసే హిమాలయాలు ఇక్కడకు వచ్చే పర్యాటకులను ఇట్టే సేద దీరుస్తాయి. ‘ఆనంద’ రిసార్ట్స్‌లో సంప్రదాయ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఎనభై రకాల స్పా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్‌లో మరికొన్ని ప్రకృతి వైద్య కేంద్రాలు, యోగ, ఆయుర్వేద కేంద్రాలు కూడా వెల్నెస్ టూరిస్టులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. భారత్‌లో ఆకట్టుకునే ప్రదేశాలు భారత్‌లో వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా యోగ, ఆయుర్వేదంతో పాటు చక్కని పరిసరాలు, ప్రకృతి సౌందర్యంతో చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలకు దేశ విదేశాల వెల్నెస్ టూరిస్టులు బారులు తీరుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్తాన్, గోవా వంటి రాష్ట్రాలకు వెల్నెస్ టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. మన దేశంలో పెద్దసంఖ్యలో వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకునే టాప్–10 ప్రదేశాలు... వాటి వివరాలు... బెంగళూరు కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం దేశంలో ప్రధానమైన ఐటీ హబ్‌గా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇది ఐటీ హబ్ మాత్రమే కాదు, వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్న విలక్షణ నగరం కూడా. ఏడాది పొడవునా చల్లని వాతావరణంతో ఉండే బెంగళూరుకు విదేశీ పర్యాటకులు రకరకాల పనుల మీద వస్తుంటారు. ఇటీవలి కాలంలో దేశ విదేశాల నుంచి వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో బెంగళూరు నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. బెంగళూరులోని ఆయుర్వేదగ్రామ్ హెరిటేజ్ వెల్నెస్ సెంటర్, శ్రేయస్ యోగా రిట్రీట్ వంటి కేంద్రాలు వెల్నెస్ టూరిస్టులకు చక్కని విడిదిగా ఉంటున్నాయి.. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో నిండిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు వెల్నెస్ టూరిస్టులు పెద్దసంఖ్యలో బారులు తీరుతుంటారు. సంప్రదాయ పద్ధతుల్లో చర్మ సమస్యలు, కీళ్ల సమస్యలు, జుట్టురాలడం, మానసిక కుంగుబాటు, అధిక బరువు వంటి రుగ్మతలకు ఇక్కడి నిపుణులు చికిత్స అందిస్తారు. ఇక్కడ కొద్దిరోజులు ప్రశాంతంగా గడిపితే యవ్వనోత్సాహం ఉరకలేస్తుందని పర్యాటకులు చెబుతుంటారు. కోవళం, కేరళ ఆయుర్వేదం భారతదేశం అంతటా వ్యాప్తిలో ఉన్న ప్రాచీన వైద్య ప్రక్రియే అయినా, గడచిన కొన్నేళ్లలో ఆయుర్వేదానికి కేరళ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్లా మారింది. ముఖ్యంగా పంచకర్మ చికిత్సకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వివిధ నగరాల్లో కేరళ పంచకర్మ ఆయుర్వేద కేంద్రాలు వెలసినా, వెల్నెస్ టూరిస్టులు మాత్రం ఈ చికిత్స కోసం నేరుగా కేరళ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. కేరళలోని కోవళం పంచకర్మ ఆయుర్వేద చికిత్సకు ప్రధాన కేంద్రంగా ఉంటోంది. సౌందర్యపోషణ, వార్ధక్య నివారణ, ఒత్తిడి నివారణ చికిత్సల కోసం దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఎగబడుతున్నారు. కోవళంలోని ‘లీలా కోవళం’ పంచకర్మ చికిత్స, యోగా చికిత్సలకు ప్రధాన కేంద్రంగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కోవళంలోనే సోమతీరం చికిత్స కేంద్రం కూడా వెల్నెస్ టూరిస్టులకు పంచకర్మ, ఆయుర్వేద, యోగ, ప్రకృతి ఆహార చికిత్సలను అందిస్తోంది. గోవా ఇటీవలి కాలంలో గోవాకు వెల్నెస్ టూరిస్టుల తాకిడి కూడా పెరిగింది. గోవాలో ప్రత్యేకమైన స్పాలు, ఆయుర్వేద, ప్రకృతి వైద్య కేంద్రాలు వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అరేబియన్ సముద్రపు అందాలను తిలకిస్తూ సేదదీరేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడ సౌందర్య పోషణ, వార్ధక్య నివారణ చికిత్సలను పొందేందుకు మక్కువ చూపుతున్నారు. గోవాలోని దివార్ దీవిలో ‘దేవాయ’ ఆయుర్వేద, ప్రకృతి వైద్య, యోగా కేంద్రం వెల్నెస్ టూరిస్టులకు వివిధ రకాల సేవలందిస్తోంది. ఇక్కడి నిపుణులు ఒత్తిడి నుంచి ఉపశమనానికి తగిన యోగ పద్ధతుల్లో చికిత్సను, ప్రకృతి సహజమైన సమతుల ఆహారాన్ని అందిస్తారు. మసాజ్, హైడ్రోథెరపీల ద్వారా పలు దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం కలిగిస్తారు. పుణే, మహారాష్ట్ర మహారాష్ట్రలోని పుణే నగరం ప్రధానంగా వ్యాపార కేంద్రంగానే అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో ఈ నగరం వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకోవడంలో ముందంజలో నిలుస్తోంది. ఇక్కడ ఏర్పాటైన ఆత్మంతన్ కేంద్రం వెల్నెస్ టూరిస్టులకు సంప్రదాయ ఆయుర్వేద, యోగ, ప్రకృతి చికిత్సలతో పాటు పాశ్చాత్య పద్ధతులకు చెందిన రకరకాల మసాజ్‌లు, టర్కిష్ హమామ్ స్నానాలు, హైడ్రోథెరపీ, ఆక్యుప్రెషర్, బాడీ పాలిష్ వంటి విలక్షణమైన సేవలను అందిస్తోంది. ప్రాక్ పాశ్చాత్య పద్ధతులకు చెందిన సేవలన్నీ ఒకే కేంద్రంలో లభిస్తుండటంతో దేశ విదేశీ వెల్నెస్ టూరిస్టులు ఇక్కడకు క్యూ కడుతున్నారు. చర్మసౌందర్యం మెరుగుపరచడానికి, కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి ఇక్కడి చికిత్సలు ఎంతో బాగుంటున్నాయని, ఇక్కడి వాతావరణం ఒత్తిడిని ఇట్టే దూరం చేస్తోందని ఇక్కడకు వచ్చే పర్యాటకులు చెబుతుండటం విశేషం. మెహ్సానా, గుజరాత్ గుజరాత్‌లోని చారిత్రక నగరం మెహ్సానా. ఇక్కడకు సాధారణంగా చరిత్రపై ఆసక్తి, పరిశోధనపై అభిలాష గల పర్యాటకులే ఇదివరకు ఎక్కువగా వస్తుండేవారు. ఇటీవలి కాలంలో ఈ నగరానికి వెల్నెస్ టూరిస్టుల రాక కూడా పెరుగుతోంది. మెహ్సానా నగరంలోని నింబా నేచర్ క్యూర్ సెంటర్ దేశ విదేశాలకు చెందిన వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అధునాతన ప్రకృతి చికిత్స కేంద్రం విలక్షణ రీతుల్లో సౌందర్య పరిరక్షణ, వార్ధక్య నివారణ, స్థూలకాయ నివారణ చికిత్సలను అందిస్తోంది. వైబ్రో మసాజ్, అయాన్ డీటాక్స్, మడ్ బాత్, స్పైన్ బాత్, డైట్ థెరపీ వంటి చికిత్సల కోసం పెద్ద సంఖ్యలో వెల్నెస్ టూరిస్టులు ఇక్కడకు వస్తుంటారు. సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్ హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా నగరానికి వినోదయాత్రల కోసం పర్యాటకులు వస్తుండటం చిరకాలంగా కొనసాగుతున్నదే. ఇటీవలి కాలంలో ఇక్కడకు వచ్చేవారిలో వెల్నెస్ టూరిస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ ఉన్న వైల్డ్ ఫ్లవర్ హాల్ కేంద్రం వెల్నెస్ టూరిస్టులకు వివిధ రకాల స్వస్థత సేవలను అందిస్తోంది. స్థూలకాయం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి, శరీరంలోని మలినాలను తొలగించుకునే డీటాక్స్ చికిత్సలు చేయించుకోవడానికి ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. రీవైటలైజింగ్ బాడీ థెరపీ, స్కిన్‌కేర్, నెయిల్ కేర్ వంటి ప్రత్యేక సౌందర్య చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు, యోగా, ప్రత్యేక స్నాన చికిత్సలు వంటి సేవలతో సేదదీరేందుకు వెల్నెస్ టూరిస్టులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆగ్రా, ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరం చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్‌కు ఆలవాలం. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచిన తాజ్‌మహల్ అందాలను తిలకించేందుకే ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుండేవారు. తాజ్‌మహల్ సందర్శనతో పాటు సంప్రదాయ చికిత్సలతో, యోగా, మసాజ్ వంటి సేవలతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వెల్నెస్ టూరిస్టులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆగ్రాకు వస్తున్నారు. తాజ్ మహల్‌కు దాదాపు అరకిలోమీటరు దూరంలోని ‘అమర్‌విలాస్’ రిసార్ట్ వెల్నెస్ టూరిస్టులకు చక్కని విడిదిగా ఉంటోంది. ప్రత్యేకమైన స్పా, మసాజ్, రీవైటలైజింగ్ బాడీ థెరపీతో పాటు నెయిల్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ వంటి సౌందర్య పోషణ చికిత్సలు, యోగా, మెడిటేషన్ శిక్షణ, ప్రకృతి ఆహార చికిత్సలు వంటి సేవలు లభిస్తుండటంతో పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ముచ్చటపడుతుంటారు. అజబ్‌గఢ్, రాజస్తాన్ రాజస్తాన్‌లోని ఆరావళి పర్వతశ్రేణులపై ఉండే అజబ్‌గఢ్ పట్టణం చారిత్రక ప్రాంతంగా పేరుపొందింది. చరిత్ర, పురావస్తు పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారే ఒకప్పుడు ఇక్కడకు ఎక్కువగా వచ్చేవారు. ఇక్కడి అమన్బాగ్ శాంక్చుయరీ అరుదైన పక్షులకు, జంతువులకు ఆలవాలంగా ఉంటోంది. చుట్టుపక్కల రాష్ట్రాల విద్యార్థులు అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చిపోతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఇక్కడ ఆయుర్వేద సౌందర్య చికిత్స, స్వస్థత కేంద్రాలు, యోగా కేంద్రాల వంటివి ఏర్పడటంతో వెల్నెస్ టూరిస్టుల తాకిడి పెరిగింది. వెల్నెస్ టూరిజం రంగంలో మన దేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నా, తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ రంగంలో కొంత వెనుకబడే ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన పర్యాటక ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తగినన్ని ఉన్నా, ఈ ప్రాంతాల్లో వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకోలేకపోతున్నాయి. వెల్నెస్ టూరిస్టులను ఆకట్టుకునే వసతులను ఈ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించినట్లయితే, ఈ రంగంలో తెలుగు రాష్ట్రాలో అభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్‌లో వెల్నెస్ టూరిజం భారత ప్రభుత్వం 2002లో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ నినాదంతో ప్రచారం ప్రారంభించిన తర్వాత దేశంలో వెల్నెస్ టూరిజం రంగం వేగంగా పుంజుకోవడం మొదలైంది. మన దేశంలో తరతరాల సంపదగా ఉన్న ఆయుర్వేదం, సిద్ధ వంటి ప్రాచీన వైద్య విధానాలు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను ఇచ్చే ధ్యానం, యోగా వంటి అనాది విద్యలు ఇక్కడకు వచ్చే వెల్నెస్ టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వెల్నెస్ టూరిస్టులుగా భారత్‌కు వస్తున్న వారిలో సామాన్య పర్యాటకులే కాకుండా, ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతుల వంటి ప్రముఖులు కూడా ఉంటుండటం విశేషం. నాలుగేళ్ల కిందట భారత పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్, కెమిల్లా దంపతులు రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపి వెళ్లారు. ఇతరేతర కారణాలపై వచ్చే పర్యాటకుల కంటే వెల్నెస్ టూరిజం కోసం వచ్చే పర్యాటకులు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుండటంతో ఈ రంగం నానాటికీ ఆర్థికంగా బలపడుతోంది. అంతర్జాతీయంగా వెల్నెస్ టూరిజం వార్షిక వృద్ధి రేటు 6.8 శాతం వరకు ఉంటే, భారత్‌లో ఈ రంగంలో వార్షిక వృద్ధి రేటు దాదాపు 20 శాతం వరకు ఉంటోంది. ఈ రంగంలో ఇదే దూకుడు కొనసాగితే 2020 నాటికి వెల్నెస్ టూరిజంలో భారత్ మొదటి స్థానానికి చేరుకోగలదని ఆర్థిక నిపుణులు, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
స్పిరిట్ ట్యాంక్‌లో పడి కార్మికుడు మృతి
-
సంప్రదాయ సంబరం
మన సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? వాటిని శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి– అనేది తెలుసుకోవడం అవసరం. ఓర్పును నేర్పే ముగ్గులు ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో వేస్తే చాలు. గంటసేపు వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ గీతలు గీయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. పైటచెంగును సరి చేసుకుంటూ, జడను వెనక్కు వేసుకుంటూనే ముగ్గు మీద బోలెడంత ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే సమస్యాపూరణం లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. గంగిరెద్దులు.. హరిదాసులు... భిక్షానికీ ఓ ధర్మం.. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామ సంకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది అని చెబుతారు పెద్దలు. అసహ్యం నుంచి అద్భుతాల గొబ్బెమ్మ కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు. జీవితం దారం వంటిదని చెప్పే పతంగం మనిషికి ఆత్మనిగ్రహం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. లాగితే తెగిపోతుంది. వదలకుంటే ఎగరలేదు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైనా! చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్నదిని మరచిపోలేదని చెప్పడానికే గాలిపటాలు ఎగుర వేస్తారు. కోడిపందేలు యుద్ధనీతిని గెలిపించే పందెం పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది. పశు పూజలు... శ్రమకు కృతజ్ఞత చెల్లింపులు సంక్రాంతికి ఇంటినిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు. కనుమును పశువుల పండుగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. -
భీతి వద్దు ప్రీతి ఉండాలి
గొల్లపూడి మారుతిరావు. ఈ పేరు చెబితే సినీ జీవితంలో ఆయన పోషించిన పాత్రలు కళ్లెదుట కదలాడతాయి. సాహితీవేత్తలకు రచనలు మనసులో మెదులాడతాయి. రచయితగా 60 ఏళ్లు నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ 78 ఏళ్ల బహుముఖ ప్రజ్ఞాశాలి నిత్య దైవారాధికుడు. దైవ పూజతోనే దైనందిన జీవనం మొదలపెట్టే గొల్లపూడి ఆలయానికి వెళ్లనిదే నిద్రపోరు. నిత్యం ఏదో ఆధ్యాత్మిక గ్రంథం చదువుతూనే ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా ప్రవచనాలు చెబుతున్నారని తెలిస్తే సతీ సమేతంగా వెళ్లి ఏదో ఓ మూల కూర్చొని వింటూ లీనమైపోతారు. దైవం పట్ల భీతి ఉండటం కంటే ప్రీతి ఉండటం మేలని ‘నేను నా దైవం’ శీర్షిక కోసం గొల్లపూడి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మీ జీవితం విశాఖ, విజయనగరంల మధ్య ఎక్కువగా గడిచినట్టుంది? అవును. మాది మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. నేను పుట్టింది విజయనగరం. పెరిగింది విశాఖ. చిన్నప్పుడు విశాఖపట్నం నుంచి విజయనగరంకు ప్రయాణం అంటే పెద్ద విశేషంగా ఉండేది. ఇప్పుడు గంట కూడా పట్టని ప్రయాణం ఆ రోజుల్లో నాలుగు గంటలకు పైగా సాగేది. అప్పట్లో విజయనగంలో ఎడ్ల బళ్లలో తిరిగిన జ్ఞాపకం ఇంకా మర్చిపోలేదు. ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండేది? ఒక నమ్మకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే అది– దైవం అంతా చూస్తూ ఉంటాడు మనం ఎవరికీ ఏమీ చేయకపోతే ఎవరూ మనల్ని ఏమీ చేయరు.. అంతా మంచే జరుగుతుంది అనేది ఆ భావనకు మూలం అనుకుంటా. మా నాన్న గారు కంపెనీలో గుమస్తాగా జీవితాన్ని ఆరంభించి కంపెనీ ఇన్చార్జి స్థాయికి ఎదిగారు. పెద్ద కలలకు పోకుండా గౌరవ ప్రదంగా బతికే వాళ్లం. ఏ రోజూ భోజనం లేదు మంచినీళ్లు లేవు అనే పరిస్థితి మా జీవితాల్లో ఎప్పుడు ఎదుర్కో లేదు. గౌరవంగా, తృప్తిగా, డిగ్నిఫైడ్‌గా జీవించాం. భేషజాలకు పోని ఫాల్స్ ప్రెస్టేజ్ ప్రమేయం లేని ప్రశాంతమైన డిగ్నిఫైడ్ జీవితం గడపడం మా తల్లిదండ్రులు నాకు నేర్పారు. నాన్న గారు రోజూ గాయత్రి జపం చేసేవారు. అమ్మగారు భగవద్గీత చదివేవారు. సుదర్శన నామం చేసేవారు. మా తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఏటా పుణ్యక్షేత్రాలకు వెళ్లేవాడని. ఆ తర్వాత ఏనాడు దైవ చింతన వదల్లేదు. ఉద్యోగంలోనే కాదు..రచయతగా..నటుడిగా ఎక్కడకు వెళ్లినా దైవారాధన వీడలేదు. మొన్ననే భద్రాచలంలో మూడురోజుల పాటు ఉన్నాను. ఆ రోజుల్లో డిగ్రీ చేయడం విశేషం అనే చెప్పుకోవాలి... మనిషి సంస్కారానికి రెండు మార్గాలుండాలి. ఒకటి దైవమార్గం రెండు విద్యామార్గం. మా నాన్న చదువు ముఖ్యం అనుకోవడం నా అదృష్టం. విశాఖలో 1956–59 మధ్య బీఎస్సీ హానర్స్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. అప్పట్లో మా నాన్నగారి జీతం 30 రూపాయలు ఉండేది. నా టర్మ్ ఫీజు కూడా అంతే ఉండేది. అయినా ఆయన చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని పోషించుకుంటూ నా టర్మ్ ఫీజు కట్టేవారు. బస్సుకు వెళ్లడానికి డబ్బులిచ్చేవారు. పాకెట్ మనీ లాంటివి ఇవ్వలేదు. ఒక్క రోజు కూడా నా ఖర్చుతో కాఫీ తాగలేదు. ఇప్పటికి కూడా హొటల్కు వెళ్లి కాఫీ, టిఫిన్ తీసుకోవాలంటే మనస్కరించదు. చాలా త్వరగా ఉద్యోగ జీవితాన్ని వెతుక్కున్నట్టున్నారు? మధ్యతరగతి వాళ్లకు వేణ్ణీళ్లకు ఎంత తొందరగా చల్లనీళ్లు దొరికితే అంత మంచిది. అందుకే బీఎస్సీ హానర్స్ పూర్తి కాగానే రచనా రంగంపై ఉన్న మక్కువతో 20 ఏళ్లకే జర్నలిజంలో అడుగుపెట్టాను. 1961లో వివాహమైంది. 1962 అక్టోబర్‌కు పెద్దబ్బాయి పుట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ వచ్చింది. 20 ఏళ్ల పని చేశాను. ఏ దేవుడంటే ఇష్టం? నాకు దేవుళ్లందరూ ఇష్టమే. ఫలానా దేవుడంటేనే ఇష్టమని లేదు. నా జీవితంలో ఆలయాలకు వెళ్లని రోజంటూ ఉండదు. ఎంత బిజీగా ఉన్నా సమీపంలోని ఏదో ఒక ఆలయానికి వెళ్లాల్సిందే. గుడికి వెళ్లకుండా నిద్రపోవడం అంటే నాకేమిటో వెలితిగా ఉంటుంది. పగటి వేళ పని ఒత్తిడిలో గుడికి వెళ్లలేకపోతే పడుకునే ముందైనా ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తర్వాతే పడుకుంటాను. ఇక విశాఖలో ఉంటే ఒక రోజు మర్రిపాలెం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తాను. ఒకరోజు ఈస్ట్‌పాయింట్ కాలనీ బాబా గుడికి వెళ్తాను. హైవేపై ఉన్న యోగాంజలి స్వామి గుడికి ఇంకోక రోజు ఎంవీపీ కాలనీలో ఉన్న శివాలయానికి వెళ్తాను. దేవాలయాలుæ నెగిటివ్ థింకింగ్‌ని దూరం చేసే ఒక్క చక్కటి వ్యవస్థ. అక్కడకు వెళ్తే మనసు నిర్మలంగా ఉంటుంది. దైవం పట్ల భక్తి గొప్పదా? భయం గొప్పదా? దేవుడికి భయపడటం సరి కాదు. దేవునికి ప్రేమించాలి. దేవుడిలో మమేకం కావాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి దగ్గర చనువు ప్రదర్శించగలగాలి. దేవుడి పట్ల భయం ప్రదర్శిస్తూ దూరం ఉండేకంటే దేవుని దగ్గర నిష్కపటంగా సర్వసన్నిహితంగా ఉండటం సరిౖయెనదని నేను భావిస్తాను. దైవారాధన చేయాల్సింది భయంతో కాదు భక్తితో. రోజూ దేవుణ్ణి దర్శించడం, గుడికి వెళ్లడం, లేదా దైవ నామస్మరణ చేయడం వల్ల మనకు ఆత్మశక్తి వస్తుంది. దేవుడు ఉన్నాడన్న భరోసా వస్తుంది. దాని వల్ల జీవితంలో ఎదురైన కష్టనష్టాలు ఎదుర్కొంటాం. దైవం ఉన్నది ఆయన నుంచి శక్తి పొందడానికి. కోరికల కోసం వరాల కోసం బేరసారాలు చేయడం కంటే మన జీవితం ఆయనకు వదిలిపెట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళ్లడం సరైనదని నేను భావిస్తాను. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికతకు ప్రత్యేకంగా నిర్వచనం అంటూ లేదు. నా దృష్టిలో తోటి వారికి అపకారం చేయకుండా చేతనైన సహాయం చేస్తూ జీవించడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక గ్రంథాలు దైవ జ్ఞానాన్ని, దైవ స్పృహను కలిగిస్తాయి. ఆ క్రమంలో మనల్ని మనం కూడా తెలుసుకుంటాం. విశ్వశక్తిని, మానవశక్తికి సమన్వయం చేసుకుంటూ మానవ కల్యాణానికి ఉపక్రమించడమే అసలైన ఆధ్యాత్మికత అని నేను అనుకుంటాను. మీ ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది? నా భార్యకు దైవభక్తి ఎక్కువ. ఇప్పటికి మూడుసార్లు రామకోటి రాసింది. మూడోసారి రాసిన రామకోటిని ఇటీవలే భద్రాద్రి రాముడికి సమర్పించాం. అలాగే ఇంట్లో మా కోడళ్లు కూడా పూజలు చేస్తారు. జర్మనీలో స్థిరపడిన మా మనవరాలు కూడా నిత్యం పూజలు చేస్తుంది. నేను దైవస్మరణ చేస్తానే తప్ప నేను ప్రత్యేకంగా కూర్చొని పూజ, జపం చేయను. ప్రవచనాలు ఎక్కువగా వింటారట? ప్రవచనాలు వినడం మాకు చాలా ఇష్టం. మల్లాది చంద్రశేఖరశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, సుందర చైతన్యానంద, చినజియ్యర్ స్వామి, చిన్మాయానంద, పార్థసారథి, దయానంద సరస్వతి, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎక్కడ ఉన్నా వెళ్తాం. ప్రవచనం ఎక్కడ జరిగినా ఏదో మూల కూర్చొని ప్రశాంతంగా విని ఇంటికి వెళ్లడం ఆనందం. అంతే కాని సత్సంగలో చేరడం స్వామి వారు రాగానే పూలు జల్లడం నాకు తెలియదు. మనుషుల్లో మీరు చూసిన దైవత్యం? ఎదుటవారికి సాయం చేయాలనే గుణం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉన్నట్టే. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్యం ఉన్నట్టే. జీవితంలో బాగా బాధపడిన సందర్భాలు? నా కుమారుడు శ్రీనివాస్ చనిపోయిన ఘటన నా జీవితంలో చేదు జ్ఞాపకం. ఎంతో సంతోషంగా సాగుతున్న మా జీవితంలో వాడి మరణం మాకు తీరని లోటు. అది ఎప్పటికి పూడ్చలేనిది. రచనా రంగంలో ఎప్పుడు అడుగుపెట్టారు? కళాశాల సమయంలోనే చిన్న చిన్న రనలు చేసేవాడిని. నా రచనలు చూసి నా మిత్రులు, అధ్యాపకులు ఎంతగానో ప్రోత్సహించేవారు. ఎప్పటికైనా నువ్వు గొప్ప రచయిత అవుతావని వెన్ను తట్టేవారు. నాలో నటుడు కూడా ఏయూలో చదువుతున్నప్పుడే బయటకొచ్చాడు. ఎన్నో నాటకాలు వేసే వాళ్లం. ఆల్ ఇండియా రేడియోలో చేరిన రెండేళ్లకు అనుకోకుండా సినీ రచయతగా అవకాశం వచ్చింది. కడపలో పనిచేసే రోజుల్లో సినిమాల్లోకి రచయితగా వచ్చాను. డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్‌ప్లే రాసాను. ఆ తర్వాత ఆత్మగౌరవం సినిమాకు రాసాను. అప్పుడు నా వయస్సు 24 ఏళ్లు. నేడు 78 ఏళ్లు. అంటే 54 ఏళ్లుగా సినిమాలకు రచనలు చేస్తూనే ఉన్నా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుణ్ణయ్యాక ఇప్పటికి 290 సినిమాల్లో నటించా. నటిస్తూనే ఉన్నా. చిన్నప్పట్నుంచీ పూజలంటే చాలా ఇష్టం. పెళ్లయిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూ వచ్చాను. అందరి దేవుళ్లనూ పూజిస్తాను. ఫలానా దైవం అంటూ ఏమీలేదు. నా భర్తతో కలిసి అన్ని తీర్థయాత్రలు పూర్తిచేశాను. మూడుసార్లు రామకోటి రాశాను. నా జీవితాంతం రాస్తూనే ఉంటాను. – శివకామ సుందరి మీ పిల్లలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతారు? ఏ దైవాన్ని కొలిచినా అభ్యంతరం చెప్పను.కాని దైవచింతనతో గడపని చెబుతాను. దేవుని పట్ల భక్తి, ఇంకొకర్ని ఇబ్బంది పెట్టని ప్రశాంతంగా జీవనం సాగించమని చెబుతా. అదే నేను నేర్చుకున్న జీవిత సత్యం. అదే నా జీవన మార్గం. – పంపన వరప్రసాదరావు -
100 సూక్తుల వివేకం
ఇంటలెక్చువల్ మాంక్ ఆఫ్ ఇండియా షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ‘సోదర సోదరీమణులారా’ అనే సంబోధనతో ఆయన ప్రారంభించిన ప్రసంగం పాశ్చాత్య ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన పాశ్చాత్య మేధావులు ఆయనను ‘ఇంటలెక్చువల్ మాంక్ ఆఫ్ ఇండియా’ అని శ్లాఘించారు. తొలిసారిగా పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ తాత్విక విశిష్ఠతను ప్రత్యక్షంగా విశదీకరించిన ఆధ్యాత్మిక గురువు ఆయన. చిన్నప్పుడు అల్లరి పిల్లాడిగా అమ్మ చీవాట్లు తిన్న నరేంద్రుడు, పెరిగి యువకుడయ్యాక రామకృష్ణ పరమహంస శిష్యుడిగా మారాడు. ఆయన మార్గదర్శకత్వంలో అంతులేని జిజ్ఞాసతో ఆధ్యాత్మిక మర్మాలను ఆకళింపు చేసుకుని, స్వామీ వివేకానందగా ఎదిగాడు. భారతీయ ఆధ్యాత్మిక సంపద ఘనతను ప్రపంచానికి చాటే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని, ఆ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చాడు. ‘మనుషులను తీర్చిదిద్దడమే నా పని’ అని ప్రకటించి, మనుషులను తీర్చిదిద్దే పనికే తన జీవితాన్ని అంకితం చేశాడు. ‘ప్రపంచమే పెద్ద వ్యాయామశాల. మనల్ని మనం మరింత దృఢంగా తీర్చిదిద్దుకునేందుకే ఇక్కడకు వచ్చాం’ అంటూ మానవ జన్మ ప్రయోజనాన్ని ఉద్బోధించిన మహనీయుడు స్వామీ వివేకానంద. యువశక్తిపై అపారమైన విశ్వాసం గల ఆయన తన బోధనలతో యువకుల్లో నూతనోత్సాహాన్ని నింపాడు. అందుకే ఆయన జయంతిని మన ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా గుర్తించింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన పలికిన ఆణిముత్యాల్లాంటి మాటలు..సత్యం కోసం దేనినైనా త్యాగం చేయవచ్చు. అయితే, దేనికోసమైనా సత్యాన్ని త్యాగం చేయకూడదు. ►బలమే జీవనం. బలహీనతే మరణం ►సత్యం, స్వచ్ఛత, నిస్వార్థం... ఈ మూడు లక్షణాలూ ఉన్నవారిని సృష్టిలోని ఏ శక్తీ నాశనం చేయలేదు. ►అన్ని శక్తులూ మీలోనే ఉన్నాయి. మీరు ఏదైనా చేయగలరు. మీరు అన్నీ చేయగలరు. ఇది నమ్మండి. మిమ్మల్ని మీరు బలహీనులని ఎప్పుడూ అనుకోకండి. ►మీ అంతట మీరే లోపలి నుంచి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు. ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. ►ఎవరిపైనా ఆధారపడవద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందగలరు. ►నిజమైన మార్గదర్శకత్వం చీకట్లో చిరుదీపంలాంటిది. అది అన్నింటినీ ఒకేసారి చూపించదు. అయితే, మీరు వేసే ప్రతి అడుగు సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తుంది. ►మీకు సాయం చేసేవారిని మరచిపోవద్దు. మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించవద్దు. మిమ్మల్ని నమ్మినవారిని మోసగించవద్దు. ►అస్తిత్వంలోని అసలు మర్మం భయం లేకపోవడమే. దేనికీ భయపడవద్దు. భయపడితే మీరే భయంగా మారిపోతారు. ►నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే, నిరంతరం శ్రమించే వాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. ►మతాల మర్మం వాటి సిద్ధాంతాల్లో కాదు, ఆచరణలోనే ఉంది. మంచిగా నడుచుకోవడం. ఇతరులకు మంచి చేయడం. ఇదొక్కటే అన్ని మతాల సారాంశం. ►ఆదర్శవంతుడు వెయ్యి తప్పులు చేస్తాడనుకుంటే, ఆదర్శరహితుడు యాభైవేల తప్పులు చేస్తాడనేది నిస్సంశయం. అందువల్ల ఆదర్శాలను కలిగి ఉండటం మంచిది. ►మహిళలను తగిన రీతిలో గౌరవించిన దేశాలే ఔన్నత్యాన్ని సాధిస్తాయి. మహిళలను గౌరవించని దేశాలేవీ ఉన్నతిని సాధించలేవు. ►బలహీనతలూ బంధనాలూ ఊహాజనితాలే. బలహీనపడవద్దు. దృఢంగా నిలబడండి. అనంతమైన శక్తి మీలోనే ఉంది. ►రాజకీయంగా, సామాజికంగా ఎవరైనా స్వాతంత్య్రం సాధించవచ్చు. ఎవరైనా ఒక మనిషి తన వ్యామోహాలకు, ఆకాంక్షలకు బానిసగా ఉన్నంత కాలం నిజమైన స్వేచ్ఛలోని స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాదించలేడు. ►మీపై మీకు నమ్మకం లేనంత కాలం మీరు దేవుడిని నమ్మలేరు. ►విశ్వాసం... విశ్వాసం... విశ్వాసం... మన విశ్వాసమే మనం. విశ్వాసమే దైవం. ఔన్నత్యానికి విశ్వాసమే మార్గం. ►మీ విధికి మీరే విధాతలని గ్రహించండి. బాధ్యతలను స్వీకరించి ధైర్యంగా ముందడుగు వేయండి. ►ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ►కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు. ►మీ సహచరులకు నాయకత్వం వహించాలనే ఆలోచన చేయకండి. దానికి బదులు వారికి మీ శాయశక్తులా సాయం చేయండి. ►మతాలన్నీ సమానమే. వాటి పద్ధతుల్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా, వాటి సారాంశం ఒక్కటే. ►వేదాలు, ఖురాన్, బైబిల్... ఇవేవీ లేని చోటుకు మానవాళిని ముందుకు నడిపించాలనుకుంటాం. అయితే, వేదాలు, ఖురాన్, బైబిల్ మధ్య సామరస్యంతోనే అది సాధ్యమవుతుంది. ►మతాలన్నీ పిడివాదాలకు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. మనుషుల్లో హేతుబద్ధతకు దోహదపడేవిగా ఉండాలి. ►హేతుబద్ధమైన కార్యాచరణతోనే బాల్యవివాహాలు, అవిద్య వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుంది. ►సమాజంలో మార్పు తెచ్చేందుకు చేపట్టే ఎలాంటి కార్యాచరణ అయినా ఉపరితలానికే పరిమితం కారాదు. హేతుబద్ధమైన కార్యాచరణ ఏదైనా అట్టడుగు స్థాయి నుంచి మొదలైతేనే సమాజంలో సమూలమైన మార్పులు సాధ్యమవుతాయి. ►కరువు కాటకాలతో, ప్రకృతి విపత్తులతో, మహమ్మారి రోగాలతో మనుషులు అల్లాడే చోటుకు వెళ్లండి. ఆపన్న హస్తాల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారికి శక్తివంచన లేకుండా సేవ చేయండి. ►జీవుడే దేవుడు. ఎవరైనా మానవసేవ ద్వారా భగవంతుడికి చేరువ కావచ్చు. ►ఒక వితంతువు కన్నీళ్లు తుడవలేని, ఒక అనాథ నోటికి అన్నం అందించలేని ఏ దేవుడినైనా, ఏ మతాన్నైనా నేను విశ్వసించను. ఆకలితో అలమటిస్తున్న సాటి మానవులను పట్టించుకోని ప్రతి మనిషినీ నేను ద్రోహిగానే పరిగణిస్తాను. ►ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే చాలు. జరగాల్సిన పనులు వాటంతట అవే జరిగిపోతాయి. ►ప్రతి గొప్ప పనికీ మూడు దశలు ఎదురవుతాయి– అవహేళనలు, వ్యతిరేకత... చివరకు ఆమోదం. తాము ఉన్న కాలాని కంటే ముందు ఆలోచించే వాళ్లను ప్రపంచం అపార్థం చేసుకుంటుంది. ►ఎల్లప్పుడూ అత్యున్నత ఆదర్శాలను కలిగి ఉండండి. ఈర్ష్యను, స్వార్థాన్ని విడిచి మనో స్థైర్యంతో ముందుకు సాగండి. అప్పుడు మీరు ప్రపంచాన్నే కదిలించగలరు. ►ధర్మానికీ, దేశానికీ ఉపయోగపడని శరీరం, ధనం ఎంతగా పెరిగినా వ్యర్థమే. ►సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు. ►మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించండి. ►అనాలోచితంగా తొందరపడి ఏ పనీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల... ఈ మూడూ కార్యసిద్ధికి ఆవశ్యకాలు. అయితే, ఈ మూడింటి కంటే ప్రేమ మరింత ఆవశ్యకం. ►దయార్ద్ర హృదయంతో ఇతరులకు సేవ చేయడం మంచిదే గాని, సర్వజీవులను భగవత్ స్వరూపాలుగా ఎంచి సేవించడం ఇంకా మంచిది. ►జీవితంలో ధనం నష్టపోతే కొంత పోగొట్టుకున్నట్లు. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే మాత్రం సర్వస్వం కోల్పోయినట్లే. ►నియంత్రణ లేని మనస్సు గమ్యం తెలియక పతనం వైపు నడిపిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విజయ తీరాల వైపు నడిపిస్తుంది. ►అసత్యానికి దూరంగా ఉండండి. సత్యానికి కట్టుబడి ఉండండి. సత్యానికి కట్టుబడి ఉంటే ఆలస్యమైనా విజయం సాధించి తీరుతాం. ►భయాన్ని వీడండి. మనిషి పతనానికైనా, పాపానికైనా భయమే కారణం. ►దృఢ సంకల్పం, పవిత్రాశయం తప్పక ఫలితాలను ఇస్తాయి. వీటిని ఆయుధాలుగా ధరించిన వారు అన్ని విఘ్నాలనూ ప్రతిఘటించి నిలువగలుగుతారు. ►లక్ష్యం కోసం అలుపెరుగకుండా శ్రమిస్తుంటే నేడు కాకుంటే రేపైనా విజయం సిద్ధిస్తుంది. ►ఒక్క క్షణం సహనం ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. ►మనం మార్పు చెందితే ప్రపంచమంతా మారుతుంది. మనం పరిశుద్ధులమైతే ఈ లోకమంతా పరిశుద్ధమవుతుంది. ►మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులుగానే మిగిలిపోతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులవుతారు. ►రోజుకు కనీసం ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఈ ప్రపంచంలోని అద్భుతమైన మనిషిని కలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు. ►ధీరులు, సమర్థులు అయిన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. వీరోచిత ధైర్య సాహసాలతో కడవరకు ప్రయత్నాన్ని కొనసాగించే వారికే విజయం వరిస్తుంది. ►ఫలితంపై ఎంత శ్రద్ధ చూపుతారో, దాన్ని పొందే మార్గాలపైనా అంతే శ్రద్ధ చూపాలి. ►అసూయను, అహంభావాన్ని విడనాడండి. ఇతరుల మేలు కోసం సమష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది. ►తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకవంతుడు చేపట్టే ప్రతి పనినీ తనకు నచ్చేలా మలచుకుంటాడు. ఏ పనీ అల్పమైనది కాదు. ►మనకు కావలసినది శ్రద్ధ. మనిషికీ మనిషికీ నడుమ తేడాలకు కారణం వారి శ్రద్ధలోని తారతమ్యాలే. ఒక మనిషిని గొప్పవాడిగా, మరో మనిషిని బలహీనుడిగా చేసేది శ్రద్ధే. ►భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకుంటూ ఉండాలి. ►వేదాంత పరిభాషలో పాపమనేదే లేదు. మనం పాపాలు అనుకున్నవన్నీ పొరపాట్లు మాత్రమే. ►అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో, అపవిత్రమైన ఆలోచన కూడా అంతే చెడ్డది. ►ప్రతి బాధ్యత పవిత్రమైనదే. బాధ్యతపై మనకు గల భక్తి మాత్రమే భగవంతునికి మనం చేయగల అత్యుత్తమమైన అర్చన. ►మనిషిలో ముందుగానే నిక్షిప్తమై ఉన్న సంపూర్ణతకు ఒక రూపాన్నిచ్చేదే విద్య. ►అత్యున్నత లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించడానికి మీ జీవితాన్నంతా ధారపోయండి. ►మానవ జీవిత లక్ష్యం ఇంద్రియ భోగం కాదు. జ్ఞాన సాధనమే జీవిత గమ్యం. ►మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించడం అంత సులభం. ►సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు. ►ఓర్పుగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం, సత్యానుభూతి కోసం తీవ్రంగా తపించడం... ఇవి మాత్రమే మానవాళి భవిష్యత్తును సుసంపన్నం చేయగలవు. ►ధనార్జనలోనైనా, భగవదారాధనలోనైనా, మరే ఇతర పనిలోనైనా ఏకాగ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ పని అంత చక్కగా నెరవేరుతుంది. ►మన దేశంలో రెండు మహా పాతకాలు ఉన్నాయి. అవి: స్త్రీలను అణగదొక్కడం, నిరుపేదలను కుల నిబంధనలతో వేధించడం. ►ఇతరుల దోషాల గురించి ఎన్నడూ ముచ్చటించకు. వారెంత దుష్టులైనా సరే. దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ►బాహ్యప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే కాని, అంతః ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచితమైన పని. ►విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కాని దైవం విగ్రహం మాత్రమేనని ఆలోచిస్తే మాత్రం పొరపాటే. ►సజీవ దైవాలను సేవించండి. అంధుడు, వికలాంగుడు, నిరుపేద, దుర్బలుడు, క్రూరుడు... ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు. వారిలోని భగవంతుడిని గుర్తించండి చాలు. ►బలమే జీవనం. బలం సంక్షేమాన్ని, అంతులేని జీవితాన్ని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. బలహీనతే మరణం. బలహీనత అంతులేని దుఃఖాన్ని, శ్రమను కలిగిస్తుంది. ►మిమ్మల్ని మీరు అనంత శక్తి సమన్వితమైన ఆత్మ స్వరూపులుగా భావించుకోండి. అప్పుడు ఎలాంటి శక్తి వెల్లడవుతుందో చూడండి. ►ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. జ్ఞాన సముపార్జనకు ఏకాగ్రతే ఏకైక మార్గం. ►నిలువెల్లా స్వార్థం నిండిన మనిషే ఈ లోకంలో అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. స్వార్థం లేశమైనా లేని మనిషి పరమానందాన్ని పొందుతాడు. ►ప్రపంచంలో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. జీవితకాలంలో మనకున్న సమయం తక్కువ. అందువల్ల మనకు అవసరమైనది ఒంటపట్టించుకోవడమే జ్ఞానం. ►అహంకార మమకారాలు, నేను, నాది అనే భావనలే ఈ లోకంలోని అనర్థాలన్నింటికీ కారణం. ►శారీరక శుభ్రత అవసరమే అయినా, మానసిక పవిత్రత మరింత ముఖ్యం. మనో మాలిన్యాలను తొలగించుకోనిదే బాహ్యశుద్ధి వల్ల ఉపయోగం లేదు. ►మనిషనేవాడు ముందు ఆత్మాభిమానం కలిగి ఉండాలి. ఆత్మాభిమానం లేనివాడు మనిషిగా ఎదగలేడు. ►కార్యసాధన శక్తి కంటే కష్టాలను భరించే శక్తి చాలా గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి చాలా చాలా గొప్పది. ►స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో వెయ్యిసార్లు విఫలమైనా వెనుకంజ వేయకుండా మరోసారి ప్రయత్నించండి. ►ఇతరులకు చేసిన మంచి కొంచెమైనా సరే, అది అంతర్గత శక్తిని మేల్కొలుపుతుంది. మంచిని కనీసం తలచుకున్నా, అది మనసును అనంత శక్తితో నింపుతుంది. ►తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ►తనను తాను కించపరచుకోవడం అన్ని బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ►పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మను దర్శించుకోగలరు. ►మిమ్మల్ని మీరు నిరుపేదలుగా అనుకోవద్దు. ధనం కంటే మంచితనం, పవిత్రతలే నిజమైన సంపద. ►పోరాటంలోనైనా, మృత్యువులోనైనా మీ శక్తినే విశ్వసించండి. ప్రపంచంలో పాపమనేది ఏదైనా ఉంటే అది మన బలహీనత మాత్రమే. ►డబ్బులేని మనిషి నిరుపేద కాదు. నిజానికి జీవితంలో లక్ష్యం లేని మనిషే నిరుపేద. ►ఒక సమయంలో ఒకే పని చేయండి. ఆ పని చేస్తున్నంత సేపూ మీలోని సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించండి. ►స్వార్థం లేకుండా ఉండటమే అన్ని నీతుల్లోకీ గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతిపనీ గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. ► పవిత్రత ఒక మహత్తర శక్తి. దాని ముందు మిగిలినవన్నీ భయంతో కంపిస్తాయి. ►పట్టు విడవకుండా పనిచేయండి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోండి. ►పరిపూర్ణమైన అంకిత భావం, పవిత్రత, అత్యంత సునిశిత బుద్ధి కలిగిన కొద్దిమంది పనిచేసినా ప్రపంచంలో పెనుమార్పులు సంభవిస్తాయి. ►అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది. యోగం ద్వారా జ్ఞానం, జ్ఞానం నుంచి ప్రేమ, ప్రేమ వల్ల పరమానందం లభిస్తాయి. ►నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు గాని, ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే అన్ని ప్రార్థనల కంటే ఎక్కువగా మనల్ని భగవంతుడికి చేరువ చేస్తుంది. ►మీ నైజాన్ని అర్థం చేసుకుని, ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకుని, దానినే అంటిపెట్టుకుని పనిచేయండి. ►సహృదయం నుంచి భగవద్వాణి వినిపిస్తుంది. సంకుచితమైన బుద్ధి నుంచి వెలువడేది స్వార్థమే. ► నిరుత్సాహులై, అధైర్యపడేవారు జీవితంలో ఏ పనినీ సాధించలేరు. ►ఇతరులు ఏమి అనుకున్నా, ఏమి చేసినా మీరు మాత్రం మీ పవిత్రతను, నైతిక స్థైర్యాన్ని, భగవద్భక్తి స్థాయిని దిగజార్చుకోకండి. ►బలహీనతకు విరుగుడు బలం గురించి ఆలోచించడమే గాని, బలహీనతను గురించి చింతించడం కాదు. ► మెదడుకు, హృదయానికి సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్నే అనుసరించండి. ►విధేయత, సంసిద్ధత, కర్తవ్యం పట్ల ప్రేమ... ఈ మూడూ మీలో ఉంటే ఏ శక్తీ మిమ్మల్ని అడ్డుకోలేదు. ►మనిషిలో దైవత్వం దాగి ఉంది. ప్రతి మనిషీ తనలోని దైవత్వాన్ని వెలికితీసి తన ప్రవర్తనలో వ్యక్తపరచడం సాధ్యమే. అదే మానవ జీవిత లక్ష్యం. -
ఉత్తమ గృహస్థ ధర్మాలంటే ఏమిటి?
గృహస్థాశ్రమంలో భార్యాభర్తల పరస్పర ప్రవర్తన ఎలా ఉండాలనే విషయమై పెద్దలు చక్కగా చెప్పారు. ముందుగా భర్త, భార్య గురించి – ‘‘ఈమె తన తల్లి దండ్రులు, సోదరులు మొదలైన వారినందర్నీ విడిచి నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈమెకు ఏవిధమైన కష్టమూ కలగనివ్వకూడదు. తిండి, బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటుండకూడదు. అన్ని విషయాలలోనూ ఈమెకే ఎక్కువ సుఖం లభించాలి’’ అని భావించాలి. ఆమె బాగోగులను, ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకోవాలి. మరి భార్యకు ఎటువంటి భావం ఉండాలంటే – ‘‘నేను నా గోత్రాన్ని, కుటుంబాన్నీ, పుట్టినింటిలో ఉండే స్వేచ్ఛాస్వాతంత్య్రాలనూ వదులుకుని వీరి ఇంటికి వస్తున్నాను. వీరివల్ల నాకు అవమానం, కష్టం కలగకూడదు. అదేవిధంగా నా వల్ల వీరికి దుఃఖం, అవమానం, నింద, తిరస్కారం జరుగకూడదు. నేనెంత కష్టమైనా అనుభవిస్తాను కానీ, వీరికి మాత్రం నా వల్ల కొంచెం కూడా కష్టం నష్టం కలుగరాదు.’’ అంటూ ఆమె తన సుఖ సంతోషాలకన్నా, భర్త, అత్తమామలు, ఆడపడచులు, బావగార్లు, మరుదులు, తోటికోడళ్లు, తదితరుల సుఖసంతోషాలను దృష్టిలో ఉంచుకొని ఇహ పర శ్రేయస్సు కోరుకోవాలి. గృహస్థాశ్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవరచుకోవాలి. ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యను అర్థాంగిగా గుర్తించి అహంకారాలకు, అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని, ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తెరిగి గృహానికి యజమానిగా తనవంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి. అదేవిధంగా భార్య కూడా, భర్త మనోభావాలకు, అభిరుచులకూ అనుగుణంగా వ్యవహరించడం, పెద్దలను ఆదరాభిమానాలతో సేవించడం వంటి ఉన్నత విలువలు కలిగి ఉండాలి. అప్పుడే కుటుంబంలో శాంతి, సామరస్యాలు నెలకొంటాయి. పరిస్థితులు బాగా లేనపుడు వాటిని అవగాహనతో పరిష్కరించుకోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అన్యోన్యతతో, అవగాహనతో వ్యవహరించాలి. -
కడుపు నిండిన వారికి కాదు... డొక్కలు ఎండిన వారికి...
ప్రత్యుపకారం చేసే స్తోమత లేని నిరుపేదలకు, దీనులకు, అభాగ్యులకు చేసే సాయమే భక్తులకు అత్యంత ఫలదాయకమని శాస్త్రాలు బోధించాయి. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం. ఉన్నవారికే విందు భోజనాలు పెట్టడమూ అంతే. నీళ్లు చెట్టుకు, చేనుకు పోయాలి లేదా గొంతెండి పోతున్న వారి దప్పిక తీర్చాలి. అదే దేవుడు మెచ్చే మంచి పని. లేనివారికి పచ్చడన్నం పెట్టినా పరమాన్నంతో సమానంగా భావిస్తాడు. ఇందుకో చిన్న ఉదాహరణ చూద్దాం... ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులను ఆహ్వానించాడు. అయితే వాళ్లంతా కూడబలుక్కొని ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. అందుకతను నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన సేవకులను పురమాయించాడు. వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. అయినా ఇంకా స్థలముంటే, భిక్షగాళ్లను, కూలీలను పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల కడుపులూ నిండాయి. ధనికుని హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది. -
పవిత్ర బంధం!
ఒకప్పుడు పెళ్లిళ్లకు జాతకాలు చూడటం కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం. ఇప్పుడు జాతక పరిశీలన చేయడం అందరికీ అలవాటుగా, ఆచారంగా మారిపోయింది. వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే ‘‘అమ్మో అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దనీ, మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మూలనున్న ముసలివాళ్లు కూడా ఎగిరిపోతారని, జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడికి గండం అని, విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంకేదో అని, మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మరోటి అవుతుందని... ఇలా చాలా మూఢ నమ్మకాలు సమాజంలో పాతుకు పోయి ఉన్నాయి. ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించేటట్లయితే ఇంక వ్యక్తిగత జాతకాలెందుకు? కోడలి నక్షత్రం వల్లో, మరొకరి రాశి వల్లో చెడు జరుగుతుందనుకోవడం అసంబద్ధం. నక్షత్రాలపైన మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యాభర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు లేక అన్నదమ్ములకు వర్తింపచేయడం ఏ మాత్రం సహేతుకం కాదు. కాబట్టి జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్య, వినయం, వివేకం, గుణం, సాంప్రదాయం, సంస్కారం, రూపం గల వధువులను వదులుకోవద్దు. ఏమాత్రం సంకోచం లేకుండా మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే, గుండెల మీద కుంపటి ఉన్నట్లు భావించేవారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఇప్పుడది కాస్తా తిరగబడింది. అవును మరి, చేసిన పాపం ఊరికే పోతుందా? మగపిల్లలం మాకేమిటని విర్రవీగిన వారు కాస్తా ఇప్పుడు అమ్మాయిలు, వారి అమ్మానాన్నలు చెప్పిన సవాలక్ష నిబంధనలకు తలవంచి మరీ తాళి కట్టేస్తున్నారు. అబ్బాయిల తలిదండ్రులు తమ కొడుక్కి ఎలాగయినా పెళ్లి జరిగేలా చూడమని దేవుళ్లకి ముడుపులు కడుతున్నారు. ఏమయినా, ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలి. అలా మార్పు రావాలంటే ముందు మనం మారాలి. జాతక పరిశీలన బంధాలను ముడి వేయడానికే తప్ప మనుషులను దూరం చేయడానికి కాదు. -
లక్ష్మిఅంటే..?
భగవద్భక్తులపై కోపగించేవారి గృహంలో లక్ష్మీదేవే కాదు. శ్రీ హరి కూడా ఉండడు. అతిథులకు భోజన సత్కారాలు జరగనిచోట. లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళ లాడుతూ ఉండనిచోట, ఇల్లాలు కంటతడి పెట్టినచోట, హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తున్నా, ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరంగా గడ్డిపరకలను తెంచినా, పచ్చటి చెట్లను పడగొట్టినా లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది. నిరాశావాదులను, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో భోజనం చేసే వారిని లక్ష్మి వరించదు. పశుపక్షులను హింసించే చోట వుండనే వుండదు. సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట వుండదు. మరి లక్ష్మీదేవి ఎక్కడెక్కడ వుంటుందంటే, శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్నచోట, కష్టపడి పని చేసే వారి ఇంట, ఆశావాదుల ఇంట, ధనాత్మకమైన ఆలోచనలు చేసే వారి ఇంట, ప్రేమానురాగాలతో పిలుచుకునే వారి ఇంట, అతిథులతోనూ, తోటివారితోనూ ఆత్మీయంగా మసలుకునే వారి ఇంట లక్ష్మి విరాజిల్లుతుంది. అన్నిటి కంటే సంతృప్తికి మించిన ధనం ఎక్కడా లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. అప్పుడు ఎల్లవేళలా శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుంది. సంపద మన అధీనంలో ఉండాలి కాని, మనం సంపద అధీనంలో ఉండకూడదు. ఏ కాస్త గర్వించినా, అహంకారం చూపినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థం. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. లక్ష్మి అంటే, ఒక వృత్తిదారుడికి చేతినిండా పని దొరకడం, కష్టపడి పని చేసేవారికి తగిన ప్రతిఫలం లభించడం, పండితులకు వారి పాండిత్యానికి, ప్రతిభా సంపత్తులకు తగిన గౌరవం దొరకడం ఆరోగ్యం, విద్యార్థులకు తగిన సీట్లు లభించడం, ఇల్లాలికి భర్త అనురాగం, పిల్లల ప్రేమ లభించడం కూడా లక్షే్మ. -
భయాన్ని భయపెట్టాలి!
జీవితంలో ఎన్నో భయాలు తలెత్తుతాయి. వూహించుకున్నవి కొన్ని. వాస్తవమైనవి కొన్ని. భయాలు లేని మానవుడు ఉండడు కాని, ‘అసలెందుకు భయపడాలి’ అని ధైర్యంగా ప్రశ్నించే సందర్భం వస్తుంది. అప్పుడైనా దాన్ని ఉపయోగించుకోవాలి. భయం రహస్యమేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే, మనిషిని వెనక్కి లాగేదల్లా భయమే! దాన్ని జయించడమే జీవితం... జీవన పోరాటం. కోరికలతో సతమతమయ్యేవాడు భయపడాలి. కోట్లకు పడగలెత్తాలనుకున్నవాళ్లు భయపడాలి. మంచివాళ్లకు చెడు చేయడానికి ఉవ్విళ్లూరే వాళ్లు భయపడాలి. స్వార్థపరులు భయపడాలి. అయితే, ‘లోకానికి మంచి చేద్దాం’ అనుకున్నవారిని చూసి భయమే భయపడుతుంది. సత్యం ఉన్నచోట భయమన్నదే ఉండదు. భయం గల చోట లొసుగులుంటాయి. అబద్ధాలుంటాయి. మనిషి ఎందుకు భయపడాలి? భగవన్నామ స్మరణ చేయలేకపోతున్నందుకే అతడు భయపడాలంటుంది భాగవతం! ‘ఎవరు పుణ్యాత్ములో, నిర్భయులో... వారే నా నామస్మరణ చేస్తా’రంటాడు పరమాత్మ. భయాన్ని దునుమాడే వజ్రాయుధమే దైవస్మరణ. అందువల్ల భయాన్ని భయపెట్టాలంటే ధైర్యంగా ఉండాలి. చేసేది మంచిపని అయినప్పుడు, భయం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. చివరకు ఆచూకీ లేకుండా పోతుంది. భగవన్నామ స్మరణ, ఆత్మవిశ్వాసం, పరోపకారం, పరాక్రమం... ఇత్యాది మంచి గుణాలే అసలైన ఆయుధాలు. ఆ ఆయుధాలను చేత ధరించండి. భయాన్ని బయటికి పంపెయ్యండి. -
అదే నేనైతేనా..?
కొలంబస్ సాహసవంతమైన నౌకాయాత్ర చేసి అమెరికాను కనుగొన్నాడు. ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. తిరిగి రాగానే ఆయనకు గౌరవ సూచకంగా అనేక సన్మానాలు, సత్కారాలు చేశారు. అది చూసి ఓర్వలేని కొందరు ఒకరోజు ఒక విందులో ‘‘అదేమంత ఘనకార్యం? ఈ మాత్రానికే ఇంత ఘనమైన సన్మానాలు చేయాలా?’’ అన్నారు. భోజన కార్యక్రమం అయ్యాక కొలంబస్ ఒక ఉడికించిన గుడ్డును బల్లమీద పెట్టి సమావేశంలోని ఎవరైనా సరే గుడ్డును తిన్నగా నిలబెట్టగలరా?’’ అని అడిగాడు. అందరూ ప్రయత్నించారు. కానీ ఆ పని చేయలేకపోయారు. తరువాత కొలంబస్ గుడ్డు పైభాగాన్ని కొద్దిగా వేలితో తొలగించి సమతలంగా చేసి క్షణంలో బల్లమీద నిటారుగా నిలబెట్టాడు. అందరూ అది చూసి ‘ఇదేమంత కష్టమైన పని? మేమూ చేస్తాం’ అని గట్టిగా కేకలు వేశారు. ఆ మాటలకు కొలంబస్ చిరునవ్వు నవ్వుతూ ‘‘చేయగలరు. కానీ, నేను చేసేంతవరకు చేయలేకపోయారు కదా... సూక్ష్మదృష్టి, సమయస్ఫూర్తి లోపించడం వల్ల తేలికైన పనులు కూడా అసంభవమనిపిస్తాయి. గొప్పదనాన్ని ఆపాదించవలసినది శ్రమకు కాదు.. సూక్ష్మబుద్ధికి’’ అని అంటాడు. మనలో కూడా చాలామంది అలానే వ్యవహరిస్తారు. ఎవరైనా ఎంతో కష్టంతో సాధించిన పనిని ‘ఓస్... అదెంత? నేనూ చేసేయగలను అంతకన్నా అందంగా.. అవలీలగా చేసేయగలను’ అంటూ అవతలి వారిని, వారు చేసిన పనిని తేలిగ్గా తీసిపారేస్తారు. అది చాలా తప్పు. వీరు చేయగలిగి ఉంటే అప్పుడే చేసి ఉండొచ్చు కదా, వేరే వాళ్లు చేసిన తర్వాత వారిని తక్కువ చేయడం ఎందుకు? అంటే వాళ్లు చేసి చూపించేదాకా వీళ్లకు దానిని ఎలా చేయాలో తెలియదనైనా అర్థం, లేదంటే అవతలి వారు చేసిన పనిని అభినందించడం అయినా తెలియదని అర్థం. అంతేగా! అది చాలా తప్పు. అలాంటి వారు మనకు నిత్యజీవితంలో చాలామంది చాలా సందర్భాల్లో కనిపిస్తూనే ఉంటారు. ఒక్కోసారి అలాంటి వారిలో మనం కూడా ఉండొచ్చు. అందుకే ఎవరినీ, తేలిగ్గా చూడకూడదు. -
నా జీవితంలో చాలా ఎత్తు పల్లాలను చూశా..
చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ... అమ్మ చందమామను చూపించేది. చంద్రుడు కనపడేవాడు... అమ్మ ప్రేమ చల్లని వెన్నెలలా అనిపించేది. ఝాన్సీ తల్లి శారద... తన బిడ్డకు దైవమార్గాన్ని చూపించింది. ఈ నిరాడంబర మార్గంలో... దేవుడిని ఆర్తిగా తలుచుకుంటే చాలు కనపడతాడు... ప్రేమగా పిలిస్తే చాలు... పలుకుతాడు. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు ఝాన్సీ. యాంకర్‌గా మనకు సుపరిచితమే! ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఝాన్సీ ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ముందు కనిపించిన దేవతా విగ్రహాలు, వాటి అలంకరణ చూడగానే ఆహ్లాదంగా అనిపించింది. నటరాజ విగ్రహం, ఆ పక్కనే బుద్ధుడు, ఓ వైపు గణేశుని మూర్తులు.. అందంగా, పొందికగా ఉన్న ఆ అలంకరణ చూసి ఝాన్సీకి దైవభక్తి అధికమే అనుకున్నాం. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. ఆధ్యాత్మిక కోణాన్ని ఊహించినదానికి భిన్నంగా ఆవిష్కరించారు. దేవుడిని బాగా కొలుస్తారనుకుంటాను. దైవశక్తి మీద అంతటి నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? మనకు అర్థం కాని శక్తి ఏదో మన చుట్టూ ఉంది. ఇది నాస్తికులైనా సరే ఒప్పుకోవాల్సిందే! ఇక భక్తి అంటారా.. ఇదంతా మన పెద్దల ఆచారాల నుంచి వస్తుంది. మా అమ్మమ్మ ఉదయాన్నే సూర్యనమస్కారం చేసుకోనిదే ఏ పనీ మొదలుపెట్టేది కాదు. మా నాన్న (రాజారావు)కు సాయిబాబా అంటే అచంచలమైన విశ్వాసం. ఇక అమ్మ (శారద) ధ్యానమార్గం నాకు దైవాన్ని ఇంకా దగ్గర చేసింది. ఆమె సాయిధామం, విపాసన, ప్రజ్ఞారణ్య స్వామి.. ధ్యాన మార్గాలను అనుసరిస్తుంది. మానసిక సంస్కారానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. వీరందరి ప్రభావం నా జీవితంపై ఉంది. ఇవే దైవానికి చేరువ చేశాయి. మానసిక సంస్కారానికి ధ్యానం ఉపయోగపడుతుందని, దైవాన్ని పరిచయం చేసిందని అన్నారు అదెలా? దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి ఎలా వేరయిపోతుందో అలా మనం ఉండాలని పెద్దవాళ్లు చెబుతుంటారు. అంటే, జీవితాను భవాలను గ్రహించాలి. చివరకు అంతే సులువుగా ఆ బంధాలను నుంచి దూరమవ్వాలి. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ విధానం ధ్యానం తెలియజేస్తుంది. నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే అంతే డిటాచ్డ్గా ఉండటం నేర్చుకున్నాను. ఇందుకు అమ్మ ఆధ్యాత్మిక పరంగా నాకు పెద్ద గైడ్. ఏదైనా స్పిరిచ్యువల్ బుక్స్ కనిపిస్తే చాలు అమ్మ చదవకుండా వదిలిపెట్టదు. వాటిలో మంచి వాక్యాలుంటే అండర్లైన్ చేసి, మరీ నాకు వినిపిస్తుంది. చిన్నప్పడు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకూ పంపించింది. ఈ విధానం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండేలా చేసింది. ఆ ఆనందం దైవం అని నమ్ముతాను. డిటాచ్మెంట్, అటాచ్మెంట్ అనే భావన బలమవ్వడానికి మీ అమ్మగారి ధ్యానమార్గంతో పాటు యోగుల పరిచయాలు ఏమైనా సాయపడ్డాయా? సత్యప్రదానంద, స్వామి ప్రజ్ఙారణ్య, యోగి తపోవన వంటి వారి ద్వారా కొంత తెలిసింది. అలాగే ఈషా మెడిటేషన్ ద్వారా కూడా ఆధ్యాత్మిక కోణంలో మార్పులు వచ్చాయి. మెహిదీపట్నం లక్ష్మీనగర్‌లో ఒక నిరాహారి యోగిని ఉంటారు. ఆమె పండు తప్ప మరే ఆహారమూ తీసుకోరు. మా పాప మూడునెలల వయసులో వారి ఆశీస్సులు ఇప్పిద్దామని వెళ్లాం. అక్కడకు వెళ్లి ఆ గదిలో కూర్చున్నాం. ఆ గదిలో పెద్ద పెద్ద గురువుల ఫొటోలు ఉన్నాయి. ఆమె ఆశీర్వచనం పూర్తయ్యాక ఆ ఫొటోల మీద నుంచి పూలు రాలి పాప మీదుగా పడ్డాయి. మేం కోరుకున్నది అమ్మ ఇప్పించిందని అర్థమయ్యింది. ధ్యానం నిరాడంబరాన్ని పరిచయం చేసింది. ఇలాంటప్పుడు పండుగల సందడి, పూజలకు అయ్యే ఖర్చు వీటి గురించి ఏమనుకుంటారు? పండుగలు, ఆచారాలు వేటికీ దూరంగా ఉండను. మన పూర్వీకులు పండుగలు పెట్టడంలో అర్థం.. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని అని. ఇంటితో పాటు మన లోపల బూజులు కూడా దులుపుకోవాలని నేను అనుకుంటాను. అందుకు ధ్యానం సాయపడుతుంది. అలాగే, నాలుగు రకాల పిండివంటలు చేసుకొని, ఇంట్లో నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటాం. మొన్నటి దీపావళి పండుగే తీసుకుంటే టపాసులు కాల్చడం అనేది కొన్నాళ్ల క్రితమే మానేశాం సౌండ్ పొల్యూషన్ అని. దీపాలతో అలంకరణ మాత్రం చాలా ఇష్టపడతాను. ఏదైనా మూఢంగా పాటించకూడదు. ప్రకృతికి హాని కలిగించకుండా పండుగలు జరుపుకోవాలి. శివాలయాల్లో అభిషేకాల పేరుతో అన్ని పాలు వృథా చేయాలా పేదవాళ్లకు దానం ఇవ్వచ్చు కదా అని కొంతమంది అంటుంటారు. కానీ అది వృథా కాదు. మన పెద్దవాళ్లు ఎంతో ఆలోచించి ఆ ఆచారం పెట్టి ఉంటారు. కానీ, ప్రతి ఒక్కరూ లీటర్ల కొద్ది పాలు తీసుకెళ్లి పోయనక్కర్లేదు. స్పూన్ పాలతో కూడా స్వామికి అభిషేకం చేయవచ్చు. మనలో దైవం పట్ల ఆర్తి ఉండటమే ముఖ్యం. వినాయక నిమజ్జన సమయంలో ‘బకెట్ గణేశ్’ పేరుతో ఒక క్యాంపెయిన్ చేశాను. మట్టితో చేసినవైనా ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన విగ్రహాలతో చెరువులు నింపేయడం ఎందుకు? ఇంట్లోనే బకెట్ నీటిలో నిమజ్జనం చేసుకోవచ్చు కదా అని వివరించాను. ఆచారాల పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టవద్దు. దైవానికి సంబంధించి జీవితాంతం మరిచిపోలేని ఘటన? ఐదేళ్ల క్రితం తిరుపతి వెళ్లాం. కింద పద్మావతి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో నేనూ మా పాప ధన్య నిల్చున్నాం. అంతసేపూ లైన్లో నిల్చొని అమ్మవారి ముందుకు దర్శనం ప్లేస్‌కి వచ్చేసరికి మా పాపను అక్కడ సెక్యూరిటీగార్డ్ ‘నడువు నడువు’ అని రెక్కపట్టుకొని లాగేసింది. దాంతో అమ్మవారి దర్శనానికి వచ్చాననే విషయం మర్చిపోయి పాపకోసం పరిగెత్తాను. ఆ సెక్యూరిటీ ఆవిడతో ‘ఏంటమ్మా.. చిన్న పిల్ల. అలా లాVó స్తే జబ్బనొప్పి పెట్టదా..’ అంటూ గొడవపడ్డాను. పాపను కలుసుకున్నాక అది ‘ఏం ఫర్వాలేదమ్మా!’ అని చెప్పాక గానీ అమ్మవారు గుర్తురాలేదు. అక్కడ కొద్ది క్షణాలు భక్తురాలిగా కాకుండా నాలో అమ్మ బయటకు వచ్చేసింది. కళ్లమ్మట నీళ్లొచ్చేశాయి. ‘అయ్యో, అమ్మ దర్శనం చేసుకోలేకపోయానే.. అమ్మా.. నేనేం తప్పు చేశాను. గంటసేపనగా నీ దర్శనం కోసం లైన్లో నిల్చున్నాను. తీరా నీ ముందుకు వచ్చేసరికి క్షణమైనా నిన్ను చూడకుండానే బయటకు వచ్చేశాను. నిన్ను చూసే భాగ్యం ఎందుకు కలిగించలేదమ్మా! నాలో అహం ఏదైనా ఉండి ఇలా జరిగిందా?’ అనుకుని బాధగా ద్వారం నుంచి బయటకు వెళ్లబోయాను. అప్పుడే..మరో ఎగ్జిట్ గేట్ నుంచి వస్తూ ఒక పెద్దావిడ నా భుజం మీద చేయి వేసి.. ‘ఏంటమ్మా, నా కోసం ఇంత దూరం వచ్చావు. పిలుస్తున్నా పలక్కుండా వెళ్లిపోతావేంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా!’ అంది. నుదుటన రూపాయికాసింత బొట్టు, ఎర్రచీర కట్టుకుని.. ఉంది ఆవిడ. నేను ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదు. అమ్మవాళ్లకు ఈ విషయం చెబుదాం అని బయటకు వస్తుండగా ఒక పెద్దాయన తెల్లపంచె కట్టుకొని ఎదురొచ్చారు. ‘శతమానం భవతీ శతాయుః.. ’ అంటూ వేదాశీర్వాదం ఇస్తూ.. ‘నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. అంతా మంచే జరుగుతుంది’ అంటూ పండు ఇచ్చి దీవించారు. ఆ తర్వాత అతనూ కనిపించలేదు. ఆర్తి లోపల ఉంటే చాలు దేవతలే దిగివస్తారు అని ఆ సమయంలో అనిపించింది. వాళ్లు సాధారణ మనుషులే అయి ఉండవచ్చు. కానీ, నాకు మాత్రం స్వామి, అమ్మవారు అంతటా ఉన్నారు అని ఆ ఘటన ద్వారా తెలిసింది. ఇప్పటికీ తలచుకుంటే అదో గొప్ప అనుభూతి. అంతటా ఉన్న దేవుడే మీ జీవితంలో ఒడిదొడుకులనూ ఇచ్చాడుగా! మరి కోపం లేకుండా ఇంతటి భక్తి ఏంటి? ఒక్కో సమయంలో ప్రస్టేషన్ ఉంటుంది. అది సహజమైన లక్షణం కూడా! కానీ, దాన్నుంచి బయటపడటం అనేది ముఖ్యం. ఈ జీవితంలో కష్టసుఖాలు మన పూర్వ జన్మ కర్మలు. వాటిని ఫేస్ చేయగలిగే ధైర్యాన్ని మాత్రం నువ్వే ఇవ్వు అనుకుంటాను. నా జీవితంలో చాలా ఎత్తు పల్లాలను చూశాను. అలాంటి సమయంలో ఎమోషనల్‌గా రియాక్ట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పరిస్థితులే ధైర్యాన్ని పెంచుతుంటాయి. వీటిని దాటడానికి ఆ దైవం నుంచే శక్తి ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. భగవంతునితో ఒక బాండ్ ఉందని ఎప్పుడూ నమ్ముతాను. కొన్ని సందర్భాలలో ‘నువ్వే చేశావు’ అని భగవంతున్ని నిందాస్తుతి చేయవచ్చు. కానీ, ఆ బాండేజ్ మాత్రం తొలగిపోదు. అది ఎలా ఉంటుందంటే తల్లికీ–బిడ్డకూ ఉన్న అనుబంధంలా ఉంటుంది. పిల్లవాడు ఏదో కావాలని అమ్మతో పేచీకి దిగుతాడు. అమ్మ ఇవ్వకపోతే వాడు ఆమెతో మాట్లాడడు. ఆ సమయంలో అమ్మ దగ్గరకు తీసుకున్నా ఆమె నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ, ఎంతసేపు ఆ కోపం.. మళ్లీ అమ్మకోసం వస్తాడు. ఇదీ అంతే! మీ పాపకు దైవాన్ని ఏవిధంగా పరిచయం చేస్తుంటారు? పిల్లలు వినరు. అయినా విసుగులేకుండా మనమే వారికి ఇలాంటివి పరిచయం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వారు జీవితాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇవి ఉపయోగపడతాయి. పాప చిన్నప్పుడు నలుగురిలోకి వచ్చి మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడేది. నలుగురు ఉన్నప్పుడు వారేం అనుకుంటారో అని కలవకపోయేది, మాట్లాడకపోయేది. దాన్నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేశాను. అదొక్క ఇన్సిడెంట్‌తో ముడిపడిలేదు. అది రోజువారీ ప్రయత్నం. మన ఆచార వ్యవహారాలన్నీ పరిచయం చేస్తుంటాను. పిల్లల్లో మన సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల బీజం వేయడం వరకు మాత్రం మనం చేయాల్సిన పని. భవిష్యత్తులో వాళ్లు ఎలా ఉంటారో అది వారి ఇష్టం. మనం చెప్పినవి, పాటించిన ఆచారాలు ఎప్పుడో అప్పుడు వారి జీవితంలో తప్పక ఉపయోగపడతాయి. సేవే దైవం అనిచెబుతుంటారు. అన్నిటికన్నా మిన్న ఏ సేవ గొప్పదని మీరు భావిస్తారు? తోటి జీవుల పట్ల దయతో, ప్రేమగా ఉండటమే అన్నింటికన్నా మిన్న. ఆటిజం పిల్లలతో ఉన్నప్పుడు ఈ భావన కళ్లకు కట్టింది. శరీరం ఎదిగి, మెదడు వికాసం చెందని ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు దేవుడు ఎంత శక్తి ఇచ్చి ఉంటాడో కదా అనిపిస్తుంది. అలాంటి పిల్లల్లో లోపం పక్కన పెట్టేసి వాడికి ఇంకేదో ఎక్స్ట్రా శక్తిని ఇచ్చి ఉంటాడు దేవుడు అదేంటా అని వెతుకుతాను. దానిని వెలికి తీయడానికి ఆరాటపడతాను. ఈ ఇంట్లో అలంకరణ కోసం తగిలించిన ఈ షో పీసులు చూడండి. ఇవి వాళ్లు చేసినవి. ఆ పిల్లలతో ఉన్నంతసేపు దేవునితో ఉన్నట్టే ఉంటుంది. అందుకే అలాంటి సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. అలాగే, మహిళలకు ఉపయోగపడే టీవీ ప్రోగ్రాములు చేస్తున్నాను. బాధితులతో ఇంటరాక్ట్ అవుతుంటాను. కష్టాల నుంచి వారు గట్టెక్కిన విధానాలు తెలుసుకుంటాను. కొందరికి ధైర్యం చెబుతుంటాను. దైవం దగ్గర చాలా ఎనర్జీ ఉంది. అది తోడుకున్నవారి తోడుకున్నంత. యాంకరింగ్‌లో అందం ప్రధాన భూమికగా ఉంటుంది. ఎలాంటి సౌందర్యం దైవత్వానికి చేరువచేస్తుందంటారు? నిస్సంకోచంగా అంతఃసౌందర్యమే! అందుకు మనల్ని మనం నిత్యం సంస్కరించుకోవాలి. లోపల ఎలాంటి మకిలీ లేకుండా జాగ్రత్తపడితే చాలు ఆ సౌందర్యం ముందు ఏ మేకప్ అయినా దిగదుడుపే. అలాగే, మన చుట్టూ రిలేషన్స్ బాగుండేలా చూసుకోవాలి. ఎదుటివారితో విభేదించవచ్చు కానీ, శత్రువులుగా చూడకూడదు. సాధ్యమైనంతవరకు ఉన్న జీవితంలోని తప్పులను సవరించుకుంటూ, సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటే చాలు. ప్రత్యేకమైన పూజలు చేయనక్కర్లేదు. అలాగని అన్నింటినీ దూరం పెట్టేయకూడదు. ఇది కార్తీకమాసం. నేనూ ఉదయాన్నే ఓ దీపం వెలిగిస్తాను. ఏదైనా ఒకరోజు ఉపవాసం ఉంటాను. ఏదీ కష్టంగా భావించకూడదు. దైవశక్తిని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఈ జగత్తు నుంచి కావల్సినంత ఆధ్యాత్మిక శక్తి మనకు అందుతుంది. ఇక్కడ చూస్తే దేవతా విగ్రహాలు చాలానే అమర్చారు. ధ్యానం ద్వారా అంతర్ముఖులు అవడం గురించి తెలిసిన మీరు ఈ విగ్రహాలను అమర్చడం ఎందుకు? విగ్రహాలూ దైవానికి చేరువచేసే సాధనాలే. ధ్యానముద్రలో ఉండే బుద్ధుడి రూపం, ప్రతి పూజలో అగ్రతాంబూలమిచ్చే గణనాథుడు ముచ్చటగా అనిపిస్తారు. ఈ నటరాజ విగ్రహాన్ని చిత్తూరు వాకర్ అసోసియేషన్ వాళ్లు కానుకగా ఇచ్చారు. మొన్న మా పై పోర్షన్వాళ్లు అయ్యప్పస్వామి పూజ చేస్తూ నన్నూ పిలిచారు. వెళ్లాలనుకున్నాను. కానీ, వందల సంఖ్యలో స్వాములు వస్తున్నారు. అక్కడ స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. వాళ్లందరిలోకి వెళ్లి ఆ వాతావరణాన్ని డిస్ట్రర్బ్ చేయడం ఇష్టం లేదు. ఆ సమయంలోనే ఈ శివుడికి రంగు వేయాలనిపించింది. ఇది పూర్తి ఇత్తడి విగ్రహం. సిల్వర్ కలర్‌తో పూర్తి పెయింట్ వేసేశాను. పైన వాళ్లు స్వామికి అభిషేకాలు చేస్తున్నారు. అంతసేపు నేను ఈ శివయ్యకు పెయింట్‌తో అభిషేకం చేశాను. ఈ భావన రాగానే కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. ధ్యానంలో దైవానికి రూపం ఉండదు. రూపంగా ఏ దైవాన్ని కొలుస్తారు? శివయ్య అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయసు అనుకుంటా – గుళ్లో అభిషేక సమయంలో తెలియకుండానే కళ్లమ్మట నీళ్లు వచ్చేశాయి. కారణమేమీ లేదు. అమ్మకు చెబితే.. గత జన్మ సంస్కారాలు ఈ జన్మకూ వస్తాయమ్మా అంది. శివ క్షేత్రాలలో శ్రీకాళహస్తికి వెళ్లడం కూడా అనుకోకుండా జరిగింది. ఇంట్లో నిత్యం పూజలు చేసినా రాని శక్తి గుడికి వెళితే వస్తుంది. గుడి నిర్మాణానికి ఎందరి చేతులు తోడయ్యాయో వారి ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. అందుకేనేమో ఎంత మంది వెళ్లినా అందరికీ శక్తి లభిస్తుంది. ఎస్విబీసీ ఛానెల్లో ‘యాత్రా’ ప్రోగ్రామ్ పాతిక ఎపిసోడ్స్ చేశాను. షూటింగ్ ఉన్నన్నాళ్లూ ఒక తీర్థయాత్రకు వెళుతున్నాను అనిపించేది. ధర్మపురి నరసింహస్వామి క్షేత్రానికి వెళ్లినప్పుడు.. లోపల స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. నేను కళ్లు మూసుకుని కూర్చున్నాను. నాకు తెలియకుండానే ధ్యానంలో అలా గంట సేపు ఉండిపోయాను. అభిషేకం పూర్తయ్యాక కళ్లు తెరిచాను. అప్పటి వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నాకో అద్భుతం. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి
ఆదిశంకరాచార్యుల వారు తను రాసిన ఒక గ్రంథాన్ని ‘శివానందలహరి’ అన్నారు. మరొకటి అమ్మవారి మీద రాసినప్పుడు దానిని ‘శ్రీమాతానందలహరి’ అనో, శ్రీమాతాలహరి’ అనో అనాలి. కానీ ఆయన ‘సౌందర్య లహరి’ అన్నారు. ఎందుకంటే – సౌందర్యమంటే అమ్మే. లోకంలో ‘‘మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుంది’’ అని ఎవరూ అనరు. ఎవరి అమ్మ వాళ్ళకు అందం. అమ్మకు ఎంత ఐశ్వర్యం ఉన్నది, ఎంత చదువు ఉన్నదీ అన్నదానితో సంబంధం ఉండదు. రోడ్డు నిర్మాణంలో ఒళ్ళంతా చెమటపట్టి కూలీపని చేసుకునే తల్లికి సమీపంలోనే ఆడుకుంటున్న ఒక పిల్లను దారిన పోతున్న ఆగర్భ శ్రీమంతురాలయిన ఒక స్త్రీ ఎత్తుకుని నోట్లో పంచదార పోసే ప్రయత్నం చేస్తే... ఇంత డబ్బున్న ఆమె, ఇన్ని నగలు వేసుకున్నామె, ఈమె పెట్టిన పంచదార తిందాం, ఈమె ముందు మా అమ్మ ఏ పాటి’’ అని ఆ పిల్ల అనుకోదు. బలవంతంగా విడిపించుకుని వెళ్ళి చెమటతో, దుమ్ముతో తడిసిముద్దయిన తన తల్లి ఒళ్లో వాలిపోతుంది. అమ్మే క్షేమం. అమ్మే సంతోషం. బిడ్డకు ఎంత వయసొచ్చినా అమ్మలో అందం అంటే క్షేమమే. అమ్మకున్న మరో గొప్పతనం ఎక్కడుంటుందంటే తన కడుపున పుట్టిన పిల్లల్లో అందరికన్నా పనికిమాలిన వారు, అర్భకులు ఎవరోవారిని ఎక్కువ ప్రేమిస్తుంది, ఎక్కువగా దగ్గరకు తీసుకుంటుంది. వారిని ఎక్కువ స్మరిస్తుంటుంది. లోకంలో మిగిలిన వాళ్ళు సమర్థత ఉన్న పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అమ్మ తన సంతానంలో అర్భకుడు, చేతకానివాడైన బిడ్డ వృద్ధిలోకి రావాలని తహతహలాడుతుంది. అటువంటి అమ్మ వెళ్ళిపోయిన తరువాత ఇక అలా ప్రేమించే వాళ్ళుంటారని ఆ కొడుకు విషయంలో చెప్పడం కష్టం. మిగిలిన వారికి వాడు నిస్సందేహంగా బరువే. అమ్మ నిరంతరం వాడి క్షేమం కోసమే ప్రార్థిస్తుంది. అటువంటి వ్యక్తి సృష్టిలో ఉండరు. భగవంతుని దయ ఎటువంటిదో అమ్మదయ అటువంటిది. అందుకే మిగిలిన సంతానం అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి. -
భక్తపరాధీనుడు
ఏడుకొండలవాడు, ఆశ్రిత వత్సలుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకో తెలుసా? దీని వెనుక ఓ వృత్తాంతం ఉంది. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు. గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమైపోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించు కుంటాడు. గడ్డంపై నుండి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్, ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి, రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు. భగవంతుడు భక్తుల కోసం పడరాని పాట్లు పడ్డాడు. పడుతుంటాడు. తన్నులు, తాపులు తిన్నాడు. భక్తి ప్రేమపాశానికి బద్ధుడై పూదోటలో బందీగా ఉన్నాడు. పప్పు రుబ్బాడు. పిండి విసిరాడు. ఎన్నో చేశాడు. భక్తులు చేయవలసిందల్లా భగవంతుణ్ని మనస్పూర్తిగా ప్రేమించడమే. -
మధురం... మధురం... వచనం మధురం
కొందరికి ఎదుటి వాళ్లకి ఏమాత్రం ఇష్టంలేని మాటలు మాట్లాడటం సరదా. మన మాటలు వినలేక చెవులు మూసుకుంటుంటే చూడాలనుకుంటారు. మన మాటలు ప్రియం కలిగించినా లేకపోయినా... అప్రియం మాత్రం కలిగించకూడదు. మధురంగా మాట్లాడటం ఒక కళ. మధురంగా మాట్లాడలేకపోయినా ఫరవాలేదు కానీ, చెడ్డగా మాత్రం మాట్లాడకూడదు. చక్కగా, ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఉన్నట్టుండి ఒకడు ‘‘అమ్మో! ఇప్పుడు వర్షం పడిందంటే మన పని గోవిందా’’ అనో, ఈ ఏసీ గదికి కనక పొరపాటున నిప్పంటుకుందనుకోండి, మనలో ఒక్కడు కూడా మిగలడు’’ అనో అంటాడు. అంతే! వాతావరణం ఉన్నట్టుండి గంభీరంగా మారిపోతుంది. మనం మాట్లాడేది సత్యమే అయినప్పటికీ, అది హితవుగా ఉండాలి. మన కళ్లు ఎప్పుడూ మంచి దృశ్యాలనే చూడాలి, చెవులు ఎల్లప్పుడూ మంచి మాటలనే వినాలి. చేతులు ఎప్పుడూ మంచి పనులే చేయాలి, నాలుక ఎప్పుడూ మధురంగానే మాట్లాడాలి. మనం మంచి మాటలు వినాలంటే, మంచి మాటలనే పలకాలి. ‘అబ్బే! నాకు మెరమెచ్చు మాటలు చెప్పడం చేతకాదండీ, ముక్కుసూటిగా... ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం నా నైజం’ అంటారు. అవతలి వారు కూడా అలాగే మాట్లాడితే మన మనసుకు ఎలా అనిపిస్తుందో ఆలోచించాలి. చిలకలా ముద్దు మాటలు మాట్లాడలేకపోయినా, కోకిలలా పాటలు పాడలేకపోయినా, కాకిలా కర్ణకఠోరంగా మాత్రం మాట్లాడకూడదు. కటువుగా మాట్లాడేవారు నిజంగా మంచివారే అయినా, వారిని అందరూ అర్థం చేసుకోలేరు. మనం అవతలి వారికి కష్టాలలో సాయం చేయలేకపోయినా, హితకరంగా మాట్లాడటం వల్ల వారు ఎంతో సాంత్వన పొందుతారు. -
మనకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు!
భక్తిలో తొమ్మిది మార్గాలున్నాయని, అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, నమస్కరించడం, దాస్యం, సఖ్యం, ఆత్మార్పణ చేసుకోవడం అని, వాటిలో ఏ ఒక్కమార్గాన్ని చిత్తశుద్ధితో అవలంబించినా భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని బాబా బోధించాడు. భక్తజనుల పక్షపాతి అయిన శ్రీ షిర్డిసాయి క్తులకు వచ్చిన కష్టాలను తాను స్వీకరించి, వారిని ఆయా బాధలనుంచి విముక్తులను చేసిన ఉదంతాలు సాయి సచ్చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రేమించటం తప్ప ద్వేషించటం ఎరుగని సాయి తన భక్తులు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మందలిస్తారు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహు చక్కగా వసూలు చేసుకుంటాడు. సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయి భగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ప్రశాంతచిత్తంతో మొరపెట్టుకుంటే చాలు ఆయన భక్తుల మొర ఆలకిస్తాడు. అడిగినది ఇస్తాడు. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. సాయిబాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. -
పఠించడం కాదు... పారాయణం చేయాలి!
రామాయణం జీవనధర్మ పారాయణం. అందులోని విషయాలు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగ పడతాయి. రాముని వంటి (పితృవాక్య) పరిపాలకుడు, సీతవంటి మహాసాధ్వి, వశిష్ఠుని వంటి గురువు, సుమంత్రుని వంటి మంత్రి, లక్ష్మణ భరత శతృఘ్నుల వంటి సోదరులు, గుహుని వంటి ఉదారుడు, హనుమంతుని వంటి బంటు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, విభీషణుని వంటి శరణార్థి, రావణ బ్రహ్మ వంటి ప్రతినాయకుడు మరే ఇతర కావ్యంలోనూ కాదు... కాదు ఈ విశ్వవిశాల ప్రపంచంలోనే కానరారు. రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటిరాజుకోసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరు దాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామ మయం’’ అని ప్రస్తుతించారు. లక్ష్మణుడు కైక మీద కోపంతో ఆమెను నిందిస్తుంటే ‘వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలే కాని ఇతరులను నిందించడం ధర్మం కాదు’ అని శ్రీరాముడు లక్ష్మణునికి హితవు చెబుతాడు. అంతేకాక ఒకరి గొప్పతనాన్ని ఎక్కువ చేసి చెప్పడానికి, మరొకరిలో ఉన్న అవలక్షణాలనూ, క్రూరత్వాన్ని బయటపెట్టడం కూడా సక్రమమార్గం కాదని లక్ష్మణునికి రామచంద్రుడు వివరించాడు. ఈ బోధ దేశకాలాతీతంగా మానవత్వం ఉన్న వారందరూ మననం చేసుకుని ఆచరించాలి. ఇలా మన నిత్యజీవితంలో ఆదర్శంగా నడవడానికీ లోక కల్యాణానికి వినియోగపడే రీతిలో బ్రతకడానికి అవశ్యమయిన అనేకానేక ధర్మసూక్ష్మాలు, నీతివాక్యాలూ రామాయణ సాగరంలో దొరికే ముత్యాలు. -
పూజించడమే కాదు... ఆచరించాలి ..!
హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీరామచంద్రుని పక్షాన చేరి ఆయన విజయానికి మూల కారణమయ్యాడు. మహాభారతయుద్ధంలో పాండవ మధ్యముడైన అర్జునుని పతాకంపై నిలిచి, పాండవుల విజయానికి కారణభూతుడయ్యాడు. అందుకే ఆంజనేయుని ప్రార్థించి చేసే ఏ పని అయినా తప్పక నెరవేరుతుందని నమ్మకం. అయితే, ఇంతటి బలం, శక్తిసామర్థ్యాలు ఆయనకు ఎక్కడినుంచి వచ్చాయంటారు? అచంచలమైన భక్తే ఆంజనేయుని బలం. తనస్వామి ఎక్కడో లేడంటూ గుండెను చీల్చి హృదయంలో సీతారామలక్ష్మణులను చూపిన ధీమంతుడు ఆయన. అప్పగించిన పని వరకే చేస్తాను, మొత్తం పనితో నాకు సంబంధం లేదు అని అనుకోలేదు. సీతను చూసి రమ్మంటే లంకానగరం నిర్మాణం, రావణుని బలాబలాలు, యుద్ధవ్యూహం వంటివన్నీ అంచనా వేసి అనేక కార్యాలు చక్కబెట్టుకు వచ్చి తన స్వామి మెప్పు పాందాడు హనుమ. యువత హనుమను చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. స్వామి కార్యాన్ని నెరవేర్చడం కోసం నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. తాను కనీసం ఎప్పుడూ చూసి ఎరుగని సీతామాతను గుర్తించి, ఆమె ముందు శ్రీరాముని గుణగానం చేశాడు. తనపై ఆమెకు ఏమూలో శంక మిగిలి ఉన్నదని గ్రహించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపాడు. అడ్డువచ్చిన రాక్షసులను అవలీలగా మట్టుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఏ హానీ చేయదన్న వరం ఉన్నా, రావణుని సమక్షానికి వెళ్లేందుకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి బ్రహ్మపట్ల తన విధేయతను చాటుకున్నాడు. లంకాధీశుని కంటే ఎత్తుగా ఉండేట్లు తన వాలంతో ఆసనాన్ని ఏర్పరచుకుని దాని మీద ఆసీనుడయ్యాడు. నిష్కారణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేందుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. సీతజాడకోసం పరితపిస్తున్న రామునికి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘దృష్ట్వాన్ దేవి’ (చూశాను సీతను) అని చెప్పి కొండంత ఉపశమనం కలిగించాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శదంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. హనుమను పూజించేవారు ఆయనలోని మంచి లక్షణాలను గ్రహించాలి. అలవరచుకోవాలి. అప్పుడే ఆ భక్తికి సార్థకత. కేవలం పూజలు చేయడం వల్ల, ఉపవాసాలుండటం వల్ల కాదు... -
సనాతన ధర్మానికి పురాతన వైభవం
యతిగా... పీఠాధిపతిగా... ధార్మిక యోగిగా... సనాతన ధర్మ పరిరక్షణకు పన్నెండేళ్లుగా అహరహం కృషి చేస్తున్నారాయన. వసుధైక కుటుంబం అన్న భావనను ఆచరణాత్మకంగా లోకానికి చాటి చెబుతున్న యతిశ్రేష్ఠులాయన. ఒక పరమహంస పరివ్రాజకాచార్యులు ఎలా ఉండాలో అన్న సనాతన వైదిక ధర్మానికి సజీవోదాహరణం. నిరాడంబరమైన రూపం, నిర్వా్యజకరుణామృతాన్ని కురిపించే వాత్సల్యం ఆయన స్వభావం. ప్రతి ఒక్కరి జీవితానికీ పనికివచ్చే ప్రత్యక్షోదాహరణలతో సాగుతుంది వారి అనుగ్రహభాషణం. ఎవరినైనా సరే ఆత్మీయంగా పలకరించడం వారి నైజం. రోజుకు వందలాది మైళ్ల దూరమైనా సరే సంచారం చేసి, పిలిచిన వారు ఎవరైనా సరే, ఎంత దూరమైనా సరే, ఏమాత్రం తీరిక దొరికినా వెళ్లి ఆశీరనుగ్రహాన్ని అందించడం వారు ఏర్పరచుకున్న నియమం. ఆయనే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి. లెక్కకు మిక్కిలి యాగాలలో, దేవతా ప్రతిష్ఠాపనలలో, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలలో పాల్గొని సనాతన ధర్మానికి పురాతన వైభవ కారకులవుతున్నారు. శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులుగా బాధ్యతలు చేపట్టి పుష్కరకాలంగా ధార్మిక తేజస్సును పరివ్యాప్తం చేస్తున్న మాధవానంద సరస్వతీ స్వామి పరిచయం ఇది. కర్ణాటక రాష్ట్రంలోని బసవకళ్యాణ్ పట్టణంలో వెలసిన సనాతన సదానంద ఆశ్రమంలో పీఠాధిపతులుగా విరాజిల్లారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీమదనానంద సరస్వతీ స్వామి. మెదక్ జిల్లా టేక్మాల్ ప్రాంతంలో జన్మించిన శ్రీ స్వామివారు ఆజన్మ బ్రహ్మచర్యంతో సర్వసంగ పరిత్యాగులై అకుంఠిత జపతపో యజ్ఞాలను నిర్వహించి దైవప్రేరణతో కర్ణాటకలోని బసవ కళ్యాణ్‌కి చేరారు. అక్కడి పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద యతివరులకు అనుంగు శిష్యులైనారు. వారి ఆజ్ఞ మేరకు చేర్యాల, సిద్ధిపేట, తొగుట తదితర ప్రాంతాలలో విస్తతంగా పర్యటించి ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించి వందలాది మందికి ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను అందించి నిరతాన్నదానవ్రతులుగా కోటిలింగాల ఆలయాల ప్రతిష్ఠాపకులుగా నిలిచారు. అంత్య సమయంలో గురుశుశ్రూషకై తిరిగి బసవకళ్యాణ్‌కి చేరి అక్కడే గురువుగారి ఆజ్ఞ మేరకు తదనంతర పీఠాధిపతులుగా నిలిచిపోయారు. అపరశివావతారులైన శ్రీ మదనానంద సరస్వతీ స్వామివారికి అంతేవాసులుగా ప్రియతమ అనుచరులుగా మెలిగి తురీయాశ్రమాన్ని స్వీకరించారు కృష్ణానంద సరస్వతీ స్వామివారు. గురువాజ్ఞను శిరసావహించి రాంపురంలోని శ్రీ గురుమదనానంద సరస్వతీపీఠాన్ని నెలకొల్పి గురువుల మార్గంలోనే త్యాగమయ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ నిరతాన్నదాన వ్రతాన్ని కొనసాగిస్తూ ఆదర్శ తపోమూర్తిగా విరాజిల్లుతున్నారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతను సమస్తాన్నీ తన భుజస్కంధాలపై ధరించి పీఠాన్ని దివ్య ఆధ్యాత్మిక కేంద్రంగా ఇతోధి కంగా అభివృద్ధిపరిచారు శ్రీరామశైలేశ్వరశర్మ గారు (ధర్మాధికారి), వారి సోదర ద్వయం. నిరంతర వైరాగ్య మార్గంలో శ్రీ కృష్ణానందుల వారి పూర్వాశ్రమ పుత్రులైన శైలేశ్వరశర్మ గురుమదనానందుల వద్ద మంత్రదీక్షను పొంది కఠోర సాధనలతో తమ ఆధ్యాత్మిక మార్గాన్ని సుస్థిరపరచుకున్నారు. గురువులకే ఆశ్చర్యానందాలను కలిగించే సాధన వారికి అలవడింది. దానికితోడు సన్యస్తులై పీఠాధిపతులుగా విరాజిల్లుతున్న శ్రీ కృష్ణానందస్వాముల యోగ సాధనలను ప్రత్యక్షంగా గమనించడం, వారి సేవలలోనే సమయాన్ని వెచ్చిస్తూ పీఠాభివృద్ధికి నిరంతరాయంగా పాటుపడడం శైలేశ్వర శర్మ నిర్ణిద్ర కృషీవలత్వానికి నిదర్శనం.పీఠంలో మూడేళ్ల క్రితం జరిగిన శతకోటి గాయత్రీ మహాయజ్ఞం అనంతరం శైలేశ్వరశర్మ తన జీవన విధానాన్ని పూర్తిగా వాన ప్రస్థాశ్రమ పద్ధతిలోకి మార్చుకున్నారు. వారి ధర్మపత్ని శ్రీమతి లలిత సహధర్మచారిణిగా భర్తసేవలలోనే గడుపుతూ గురు వృద్ధులను, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆదర్శమూర్తిగా విరక్త జీవనాన్ని గడుపుతున్నారు. తురీయాశ్రమ స్వీకారం డిసెంబర్ 15, 2005 శ్రీదత్తజయన్తి రోజున తొగుట రాంపురంలోని ‘గురుమదనానంద సరస్వతీ పీఠం’లో కృష్ణానంద సరస్వతీ స్వామివారు వారి పూర్వాశ్రమ పుత్రులు, పీఠానికి ధర్మాధికారిగా ఉన్న శ్రీరామశైలేశ్వర శర్మకు ‘మాధవానంద సరస్వతీ స్వామి’గా దీక్షితనామాన్ని ఇచ్చి సన్యాసదీక్షను ప్రసాదించారు. పీఠానికి తమ ఉత్తరాధికారిగా శ్రీ మాధవానంద సరస్వతీ స్వామిని ప్రకటించారు.మాధవానందసరస్వతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (తెలుగు) పట్టం పొందారు. రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి రచించిన ప్రసిద్ధ ‘తందనాన రామాయణం’పై పరిశోధన గావించి ఎం.ఫిల్ పట్టాను స్వీకరించారు. చాలాకాలం ఉపన్యాసకులుగా పనిచేసి డిగ్రీ విద్యార్థులకు తెలుగు పాఠాలను బోధించారు. బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథశర్మ వద్ద శిష్యరికం గావించి భారత, భాగవత ఉపనిషదాదులపై ప్రవచనాలను గావించే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు. ఎన్నోచోట్ల ప్రవచనాలను గావించారు. శ్రీ గురుమదనానందుల ఆరాధనోత్సవాలను గురుపాదుకాపూజలను అత్యంత భక్తిప్రపత్తులతో ఆచరించారు. జ్ఞాన వయోవృద్ధుల సేవలతో ఆధ్యాత్మిక భాండాగారాన్ని పెంపొందించుకున్నారు.ఒక స్వచ్ఛంద సేవా కేంద్రంగా, ఆధ్యాత్మిక నిలయంగా సాంగవేదవిద్యాలయంగా ఆదర్శ విద్యాలయంగా అన్నదాన కేంద్రంగా పీఠాన్ని బహుముఖీనంగా ప్రవర్ధిల్లజేశారు. వాస్తు జ్యోతిషాది విషయాలలో భక్తుల సందేహాలను తీర్చి ఓదార్చేవారు. ఇన్ని విలక్షణ విశిష్ట లక్షణాలను సంతరించుకుని అందరికీ ఆదర్శ ప్రేమమూర్తిగా అలరారుతూ తమలోని విరక్త భావాన్ని తపస్సాధనా మార్గంలో సుసంపన్నం గావించుకున్న మాధవానంద స్వామి బోధలు... ధర్మాచరణే శిరోధార్యం... ప్రేమతత్వం సకల చరాచర సృష్టిలో నిండి ఉంది. అపరిమిత చైతన్యస్వరూపమైన పరమాత్మ దర్శనాపేక్ష గల శ్రేయోమార్గం ద్వారా పరంపరాగత దర్శనాన్ని కోరుకోవడంలో తప్పేముంది? సంసారం ఒక కాలుతున్న ఇనుపగుండులాంటిది. దాన్ని ఎంతకాలం భరిస్తాం.నిత్యం మన కళ్ల ముందు కదలాడే నిత్య చైతన్య స్వరూపాన్వేషణమే పారమార్థిక సత్యం. దాన్ని అనుభవిస్తే తప్ప సంపూర్ణ తాత్వికావిష్కరణ చేయలేం. చక్కెరలో తీపి ఎలా ఉంటుందో పారమార్థిక తత్వాన్వేషణ ఫలితం అలా ఉంటుంది, కోరికల వల్ల రాగం పెరుగుతుంది. దానివల్ల కోపం కలుగుతుంది. పరమాత్మ దర్శన ఇచ్ఛనే కలిగి ఉండాలి. ఆదిశంకరుల నుండీ అనుసరించిన ఆదర్శమార్గంలోనే ధర్మాన్ని ఆచరించడమే ముఖ్య ధ్యేయం. – మరుమాముల -
నిస్వార్థ ప్రేమ!
దేశ సంచారం చేస్తున్న ఒక జ్ఞానికి ఒక మామిడి పండు దొరుకుతుంది. ఆ మామిడిపండు ప్రత్యేకత ఏమిటంటే, ఆ పండు తిన్న వారి ఆయుష్షు పెరుగుతుంది. విషయం తెలిసిన జ్ఞాని ఆ పండును తాను తినడం కన్నా ప్రజలకు మేలు చేసే రాజు తింటే మంచిదని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా జ్ఞాని తనంతట తానుగా రాజసభకు రాజుకిస్తాడు. రాజు ఆ పండు తీసుకుని తాను తినడం కన్నా తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భార్యకు ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఆమెకు ఇస్తాడు. అయితే ఆమె దానిని తినకుండా కుంటివాడైనా తన శక్తియుక్తులతో గుర్రపుస్వారీలో విశేష ప్రతిభతో తనను ఆనందపరచిన గుర్రపురౌతుకు ఇస్తుంది. ఆ వికలాంగ రౌతు ఆ పండు తీసుకుని తన భార్య దీర్ఘకాలం జీవించాలనే ఆశతో ఆమెకు ఇస్తాడు. ఆమెది ఎంతో గొప్పమనసు అని, తనకన్నా ఆమె దీర్ఘకాలం జీవిస్తే బాగుంటుందని అనుకుంటాడు. తాను అవిటివాడిని.... తన వల్ల ఎవరికి ఏం లాభముంటుంది అనుకుని ఆ పండుని తన భార్యకు ఇస్తాడు. కానీ ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుకు ఇస్తే ఆయన ఆయుష్షు పెరిగి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనుకుని అనుకుంటుంది. ఆమె రాజుకు పండు ప్రాధాన్యాన్ని చెప్పి ఇమ్మంటుంది తమ భర్తను. అతను అలాగే అని ఆ పండు తీసుకువెళ్ళి రాజుకు అందజేస్తాడు. మామిడి పండు తిరిగి తన చేతికి రావడం తెలిసి రాజు ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజే రాజు రాజ ్యపాలనను కొడుకుకి అప్పగించి సన్యసిస్తాడు. ప్రేమ అనేది ఏదో ఆశించి, లోలోపల ఏదో అనుకుని స్వార్థచింతనతో కూడినదై ఉండకూడదనేదే ఈ కథ సారాంశం. ఆశించడానికి అతీతంగా ఉండాలి ప్రేమ. అప్పుడే ప్రేమతోపాటు ప్రేమను ప్రేమించే వ్యక్తులూ విజయం సాధిస్తారు. -
జ్ఞాపకాల దొంతర
ఒకప్పుడు నీళ్లు తోడే చేద బకెట్లు, కడవలు బావిలో పడిపోతే పెద్దవాళ్లు గాలం వేసి గాలించి దానిని వెలికి తీసేవారు. కాలక్రమేణా వస్తున్న మార్పులతో ఇప్పుడు బావులు పూడిపోతే వాటితోపాటు గాలాలు ఆ పూడికలో కూరుకుపోయాయి. నీళ్లు కాచుకునేందుకు రాగికాగులను ఉపయోగించేవారు. పదిమంది అతిథులు వస్తే వండి వార్చడానికి వీలుగా గాడిపొయ్యిలు, వాటిమీద పెట్టి వండేందుకు పెద్ద పెద్ద ఇత్తడి గుండిగలు, గంగాళాలు ఉండేవి. వాటర్ హీటర్లు, గీజర్లు రావడంతో రాగికాగులు కాస్తా చిలుం పట్టిపోయాయి. కిరోసిన్ స్టవ్వులు, గ్యాస్ స్టవ్‌లు, కుకర్లు, కరెంట్ కుకర్లు వచ్చి పొయ్యిల్ని పూడ్చేసి, గుండిగలను, గంగాళాలను ముందు అటకమీదికి, ఆ తర్వాత పాత ఇత్తడి సామాన్ల కొట్టుకు తరలించేశాయి. పెద్దవాళ్లు సేదతీరడానికి ఉపయోగించిన పడక్కుర్చీలను ఈజీచైర్లు, రివాల్వింగ్ చైర్లు పొయ్యిలోకి నెట్టేశాయి. నాయనమ్మ, తాతయ్యలు నడుంవాల్చిన నులకమంచాలు, గర్భిణులు, బాలింతలకు విశ్రాంతినిచ్చిన పట్టెమంచాలు, నవదంపతుల సల్లాపాల జోరుకు ఊతమిచ్చిన నగిషీలు చెక్కిన పాతకాలపు పందిరి మంచాలు పాత ఫర్నీచర్ షాపులకు ఎప్పుడో తరలి వెళ్లిపోయాయి. వాటిస్థానంలో కూర్చుంటే కూరుకుపోయేంత మెత్తగా ఉండే డన్లప్ పరుపులు, నడుం నొప్పి వాళ్లకు ఒకింత గట్టిగా ఉండే కాయిర్ పరుపులు, అత్యాధునిక హంగులుండే డబుల్ కాట్ మంచాలే ఇప్పుడు పల్లెటూళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. ఇళ్లముందు నలుగురైదుగురు అమ్మలక్కలు కూర్చుని కబుర్లు చెప్పుకునే అరుగులు, గ్రామకచేరీలు, గ్రామచావడిలు, గ్రామఫోన్లు ఎప్పుడో కనుమరుగై పోగా, లౌడ్ స్పీకర్లు, మైక్సెట్లు, పెద్దలు తీర్పులు చెప్పే రచ్చబండలు, జెండాచెట్లు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పప్పు రుబ్బురోళ్లు, కారం దంచుకునే రోళ్ల సంగతి సరేసరి! పైన చెప్పుకున్న వస్తువులన్నీ ఒకనాటి జ్ఞాపకాలు. మీ ఇంటిలో పెద్దవాళ్లుంటే వీలైతే వాళ్లున్నంత కాలం ఆ వస్తువులని కూడా ఉండనివ్వండి. కనీసం వాళ్లు ఆ వస్తువులతోనైనా తమ భావాలను పంచుకుంటారు. గోడు వెళ్లబోసుకుంటారు. ఊసులాడుకుంటారు. పాతరేసిన జ్ఞాపకాల తేగలను తవ్వుకుని, కమ్మటి అనుభూతులను పొందుతారు. నోట్లు, బంగారం, వెండి పాత బడినా వాటి విలువ తగ్గదు కదా. అలాగే పెద్దవాళ్లు, వాళ్లు వాడిన వస్తువులనూ గుర్తుంచుకుంటే చాలు. -
బాబా జీవితమే మార్గదర్శనం!
బాబా జీవితాన్ని గమనిస్తే గీతాసారం కనిపిస్తుంది. అర్జునుడికి కృష్ణభగవానుడు భగవద్గీత బోధించడం ద్వారా కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినట్లు, తను జీవించే రీతినే అత్యుత్తమ జీవనమార్గంగాఅందరికీ ఆదర్శంగా నిలిపారు బాబా. రాముడు, రహీము ఒక్కడే! ఏ మాత్రం తేడాలేదు. మరిక వారి భక్తులు ఎందుకు విడిపోయి పోట్లాడుకోవటం, అందరూ కలసి జాతీయ సమైక్యతసాధించండి అని చెప్పిన బాబా సామాజిక సమస్యలకు సమాధానం చెప్పారు. అనేకమైన లౌకిక బాధలకు పరిష్కార మార్గం చూపారు. ఒక ఫకీరుగా, పరమయోగిగా, నిరంతరఆత్మానుసంధానంలో మునిగి ఉండే బాబా భక్తుల కోసం – మానవాళికోసం వారిలో ఒకరిగా, వారితో కలసి జీవించారు. ఆడారు, పాడారు, కష్టాలు, కన్నీళ్లలో సహానుభూతిని ప్రదర్శించారు.తనవైన లీలలతో కాపాడారు. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవరూపంలో అవతరించేది మనుష్యులను ఉద్ధరించేందుకే. ఎన్ని మత సంబంధ విషయాలు విన్నా,ఎన్ని గ్రంథాలు చదివినా కలగని ఆత్మసాక్షాత్కారం సద్గురుసాయి సమక్షంలో సులభంగా లభించేది. మత గ్రంథాలు ఇవ్వలేని జ్ఞానాన్ని బాబా ఎంతో సరళంగా భక్తుల మనసులకుపట్టించేవారు. ఆయన జీవనశైలి, ఆయన పలుకులే పరోక్షంగా భక్తుల సందేహాలకు సమాధానాలిచ్చేవి. క్షమ, నెమ్మది, ఫలాపేక్ష లేకపోవటం, దానం, ధర్మం, శరీరాన్ని, మనస్సునుస్వాధీనమందుంచుకోవటం, అహంకారం లేకపోవటం, గురుశుశ్రూష, వినయం వంటి శుభలక్షణాలన్నీ బాబా అనుసరించినవే. మానవాళికి మార్గదర్శకాలుగా నిలిచేవే. అందుకే భగవద్గీతఎలా మార్గదర్శకంగా నిలుస్తోందో, సాయిగీత కూడా చాలామందికి మార్గనిర్దేశం చేస్తోంది. -
పరమాత్మ దర్శనానికి సోపానం
ఆధ్యాత్మిక ప్రదేశం ఎలా ఉంటుంది? అంటే... మన మనోఫలకం మీద ఒక అందమైన సంప్రదాయబద్ధమైన చిత్రం రూపుదిద్దుకుంటుంది. అందులో ఎటుచూసినా దేవుని విగ్రహాలు, పుష్పాలంకరణలు, అగరువత్తి ధూపం, నిత్య నైవేద్యకైంకర్యాలు కనిపిస్తాయి. కర్పూర హారతి పరిమళం, ఘంటారావాలు మార్మోగుతూ భక్తుల్ని అలౌకిక ఆనందంలో ముంచెత్తుతుంటాయనే అనుకుంటాం.కానీ... ఈ ఆధ్యాత్మిక వారధి అలా ఉండదు. శ్వేతకపోతంలా ఉంటుంది. విశాలమైన హాలు, తెల్లటి పరదాలు, నేల మీద తెల్లటి చిన్న మెత్తలు. ఎదురుగా ఎర్రటి వెలుగు. ఆ మెత్త మీద పద్మాసనంలో కూర్చుని వెలుగుతున్న దీపాన్ని చూస్తూ కళ్లు మూసుకుని భృకుటి మీద దృష్టి కేంద్రీకరించడమే ఇక్కడి నిత్యపూజ. తనలోకి తాను ప్రయాణించడమే తీర్థయాత్ర. పరమాత్మ దర్శనమే అత్యున్నత శిఖరం. ఆ శిఖరాన్ని చేరే సోపానమే ధ్యానసాధన. రాజయోగ ధ్యానసాధన. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనుసరిస్తున్న మోక్షమార్గం. అలౌకికమైన ఆనందసాధనకు రాజమార్గం. శాంతివనంలో విహరించే తెల్లటి పావురాల్లాగ బ్రహ్మకుమారిలు శ్వేతాంబరులై సంచరిస్తుంటారు. చిరునవ్వే వారి సుభూషణం. ప్రపంచంలోని ప్రసన్నత అంతా అక్కడే రాశిపోసినట్లు ఉంటుంది వాతావరణం. దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రతి భౌతికరూపంలోనూ పరమాత్ముని దర్శించడం, గౌరవించడం మన సనాతన ధర్మం. అయితే, దేవుడు విశ్వమంతటా వ్యాపించిన శక్తి స్వరూపం అంటుంది రాజయోగం. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడమే ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రధాన లక్ష్యం. విలువలతో కూడిన జీవితాన్ని సాగించడం, ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా శాంతి నిండిన ప్రపంచం రూపొందుతుందని నమ్మే దైవమార్గమిది. పరమాత్మ దర్శనం కోసం మహోన్నతులు అవలంబించిన మార్గాలను విశ్లేషిస్తుంది. తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడు పుణ్యాత్ముడు. జాతి హితం కోసం సత్యాగ్రహంతో ఉద్యమించిన గాంధీజీ మహాత్ముడు. తండ్రి మాట కోసం రాజ్యాన్ని, పౌరుల మనోభిప్రాయాన్ని గౌరవించడం కోసం భార్యను వదులుకుని రాముడు «ధర్మాత్ముడయ్యాడు. పరమాత్మదర్శనంలో భాగంగా వాళ్లనుసరించిన మార్గాలవి. సత్యాన్వేషణలో జీవితాన్ని మమైకం చేసుకున్న పరమోత్కృష్టులు గురునానక్, మహమ్మద్ ప్రవక్త, గౌతమబుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఏసుక్రీస్తు. సామాన్యులమైన మనం పరమాత్మ దర్శనం కోసం వాళ్లనుసరించిన మార్గాలను అనుసరించడంలో తప్పులేదు, వారు సూచించిన విలువలను పాటించడం మంచిదే. కానీ వారిలోనే పరమాత్మను చూడాలనుకుంటే... అది సాధ్యమయ్యే పని కాదు. వ్యక్తిని, విగ్రహాన్ని పూజించడమే పరమాత్మను చేరే పథం అనే మిథ్య నుంచి బయటకు రావాలంటోంది రాజయోగ. తాము విశ్వసించిన జ్ఞానామృతాన్ని సమాజానికి పంచుతుంటారు బ్రహ్మకుమారి సోదరీమణులు. శాంతి సేవలు! ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలు ఐదు ఖండాల్లో, 140 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం వరకే తమ పరిధిని పరిమితం చేసుకోవడం లేదు. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు సోదర సోదరీమణులు, సేవాకార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రాథమిక విద్యకు కూడా నోచుకోని గ్రామాలలో ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలను ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు చదువు చెప్తున్నారు. మనిషి – ప్రకృతి! మనిషి – ప్రకృతి పరస్పర ఆధారితాలు. మనం ఉద్రేకపూరితంగా ఉంటే ఆ ప్రకంపనలు ప్రకృతిలో ప్రతిబింబిస్తాయి. అకాల వర్షాలు, వరదలు, కరువు, సునామీ, భూకంపాల రూపంలో బహిర్గతమవుతాయి. అవే ప్రకంపనలు మనిషిలో రక్తపోటు, గుండెపోటు, మేధోపరమైన అలజడులకు దారితీస్తాయి. వాటిని నివారించడానికి మన జీవనశైలిని మార్చుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుని స్వీయ నియంత్రణ పాటించినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్తుంది రాజయోగ. మారిన చిత్తరువు! ఓం శాంతి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ధ్యాన కేంద్రాల నిర్వహణ బాధ్యత మొత్తం స్త్రీలదే. ఇందుకు బీజం వేసింది విష్ణుమూర్తి రూపం, సమాజం ఆడపిల్ల పట్ల చూపించిన వివక్ష. ఆశ్చర్యంగా ఉందా? ఒకసారి విష్ణుమూర్తి రూపాన్ని గుర్తు తెచ్చుకోండి! పాల సముద్రంలో శేషపాన్పుపై పడుకుని ఉంటాడు, లక్ష్మీదేవి అతడి కాళ్లు పడుతూ ఉంటుంది. ఇదే చిత్రం ప్రజాపిత బ్రహ్మను ఆలోచింపచేసింది. దేవతలనే ఇలా చూపిస్తున్న సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఎలా లభిస్తుంది? ఇదీ ఆయనలో మొదలైన సందేహం. దేవుడంటే ఇలా ఉండడు. ఉండకూడదు కూడా. అయితే దేవుడు ఎలా ఉంటాడో కనుక్కోవాలి? సాటి మనిషి అయిన స్త్రీని సమానంగా చూడలేనప్పుడు విష్ణుమూర్తి అయినా సరే అతడికి దైవత్వం ఎలా వస్తుంది... అనుకున్నాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఆయనకు సమాన హోదాలో దీటుగా నిలబడిన రూపాన్ని గీయించారు, పటం కట్టించారు. లక్ష్మీనారాయణులు ఇలా ఉంటారని భారతీయ సమాజానికి చూపించారు ప్రజాపిత బ్రహ్మ. – వాకా మంజులారెడ్డి -
అహంతోనే అన్ని అనర్థాలూ!
షిరిడీసాయి తత్వంలో అహానికి చోటు లేదు. అహం పట్ల బాబాకు ఎనలేని కోపం ఉండేది. బాబా అన్ని వేళలా అందరికీ అహాన్ని వీడమని బోధించారు. భక్తుల్లో తనను ఆశ్రయించి వచ్చిన వారిలో మొదటగా అహాన్ని తొలగించేవారు. అహం అనేది మనిషికి గుడ్డితనం లాంటిదన్నది బాబా భావన. అహంకారపు చీకట్లు తొలగనిదే ఏ మనిషినీ తన దరికి చేర్చుకునేవారు కాదు. తన ప్రేమతత్వంలో మానసికానందాన్ని, తన జీవిత చరిత్ర రాయటానికి అనుమతి కోసం వచ్చిన హేమాదిపంతుకు బాబా మొదటగా ఈ సందేశాన్నే అందించారు. మతాలపేరిట మనుషుల నడుమ అంతరాలను ఆయన తన మతంలో చేర్చలేదు. సమస్తప్రాణులు ఒకటేనని, ప్రేమ, దయ, కరుణలతో మానవ జీవిక సాగాలని, భగవంతునియందు అపారనమ్మకంతో మంచికర్మలు చేయడమే పరమావధిగా జీవించాలని, దానగుణం కలిగి ఉండటం, పనిపట్ల శ్రద్ధ వహించటం, బాధ్యతలను ఏమారకపోవటం ప్రతిమనిషి పరమ కర్తవ్యాలని గీతాసారంలా... బాబా తనదైన సాయిగీతలా భక్తులకు చెప్పేవారు. తనను విశ్వసించిన వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయమిచ్చేవారు. తన భక్తిసామ్రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో దేనికీ కొరత లేకుండా జీవిస్తారని భరోసా ఇచ్చే బాబా, యోగులలో పరమయోగి. నమ్మిన వారి ఏలిక. జీవితమంటేనే ప్రేమమయమని చాటిన సత్యస్వరూపుడు. బాబాను పూజించడంతో సంతృప్తి పడటం, ఉపవాసాలు ఉండి ఊరడిల్లడం, షిరిడీ వెళ్లి సంతోషపడటమే కాదు... ఆయన బోధలను ఆచరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సద్గురువు అనుగ్రహం లభిస్తుంది. -
మహర్షులు– మహనీయులు
అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో మొదటివాడు. సప్తరుషులలో రెండవవాడు. అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరుతెచ్చుకుంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతి«థ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు తాము అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయ్యి ఉండాలని అంటారు. అనసూయ దేవి అంగీకారంతో అత్రి మహర్షి సరేనంటాడు. వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటిపిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనినీ, అనసూయాదేవిని వేడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు. అపుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు. చాలా కాలం పిల్లలు కలగకపోవటంతో అత్రి మహర్షి భార్యతో కలిసి తపస్సు చేస్తాడు. దాని వల్ల కొన్నాళ్ళకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, అనసూయా దేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు, దూర్వాసుడు పుడతారు. జీవనం సాగించటానికి ధనం అవసరం అవ్వటంతో అత్రి మహర్షి పృథు చక్రవర్తి దగ్గరకు వెళతాడు. పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయదేవితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు. అలాగే ఒకసారి దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అవుతుంది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు. అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, పూజ విధానం, దేవతా ప్రతిష్ఠ మొదలైన వాటి గురించి చెప్పబడింది. దత్తపుత్రుడిని స్వీకరించటం అనే దాని గురించి మొట్టమొదట చెప్పింది అత్రి మహర్షే. మన మహర్షుల గురించి తెలుసుకోవడం మనకెంతో మంచిది. -
మంచి మార్గంలో...
‘‘ఇటీవల కాలంలో యువత ఆధ్యాత్మిక చింతన, మంచి ప్రవర్తన వంటి మంచి పనులు మరచి తప్పుదారి పడుతున్నారు. వారు అనుసరిస్తున్న చెడు మార్గాన్ని తప్పించి మంచిమార్గంలో నడిచేలా చేయడమే మా సినిమా కథాంశం. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, జనవరిలోగా పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాత కృష్ణదేవ్. ప్రశాంత్నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా స్వీయ దర్శకత్వంలో వానమామలై కృష్ణదేవ్ నిర్మిస్తున్న ‘శ్రీకరం శుభకరం నారాయణీయం’ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీమతి మధు కెమెరా స్విచ్చాన్ చేయగా, సముద్రాల వేణుగోపాలచారి క్లాప్ ఇచ్చారు. -
ఆ నామమే చాలు...
ఒక వృద్ధుడు చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానదీ తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ‘ఇతన్ని చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? లేక ఇదంతా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా? విష్ణువా?’ అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి ‘‘మహానుభావా! సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి’’ అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ‘‘ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణుభక్తుడు. అయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటినుంచి కలిపురుషుడు వీలయినంత వరకు హరినామస్మరణ జరగకుండా అడ్డుపడుతూ, ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. పుణ్యపురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు. అందుకే ధర్మం ఈ మాత్రం ఒంటి కాలిమీదనైనా నిలబడగలుగుతోంది. -
పూజ పరమార్థం
కొందరు పూజ ప్రారంభంలో సంకల్పం విషయంలో చాలా శ్రద్ధ చూపుతారు. తమకున్న అనేక కోరికలు సఫలం కావాలని సంకల్పంలో చెప్పుకుంటారు. గుడికి వెళితే, పూజారికి తమ పేరు, గోత్రం చెబుతారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులవి, తెలిసిన వాళ్లవి, తమకు ఇష్టమైన వారివి... ఇలా కనీసం ఒక డజనుకుపైగా పేర్లు, గోత్రాల జాబితా చెప్పందే వదలరు. ఆ తర్వాత పూజమీద మాత్రం మనసు లగ్నం చేయరు. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎక్కడైనా దేవుడి ప్రతిమ కనిపిస్తే, అక్కడినుంచే ఒక నమస్కారం విసిరేస్తారు. గుడికి వెళ్లినప్పుడు మాత్రం దేవుడి మీద మనసు లగ్నం చేయరు. ముందువాళ్లని, పక్కవాళ్లని తోసుకుంటూ, తామే ముందుగా వెళ్లడం మీదే దృష్టి అంతా. ఇంకొందరికి కోరికల మీద తప్ప దేవుడి మీద భక్తి ఉండదు. ఏ దేవుడు ఏ కోరిక తీర్చడంలో ప్రసిద్ధో తెలుసుకుని ఆయా ఆలయాలకు వెళుతుంటారు. నిజానికి కోరికలు కోరడంలో తప్పేమీలేదు. కానీ, తన భక్తులకు ఏమి కావాలో ఈశ్వరునికి తెలుసనే విషయం మీద నమ్మకం ఉంటే అలా చేయరు. మనకేది మంచిదో దానిని ఎప్పుడు ఎలా, ఎవరి ద్వారా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసే పూజ నిజమైనది కాదు. భక్తితో ఈశ్వరార్చన చేయడంæసద్గుణం. సర్వాంతర్యామి అయిన భగవంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మనసుకు పశాంతత, ఏకాగ్రచిత్తం లభిస్తాయి. వాటితోపాటు అక్కడ నిత్యం చూసే ఆచారాలు (ఆచరించే వాటిని ఆచారాలు అంటాం) మనలను ఆలోచింపచేస్తాయి. వాటివెనుక కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని, ఈ ఆచారాల వెనుక లౌకికమైన, వేదాంతపరమైన అంశాలు మిళితమై ఉన్నాయని ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అవసరం. గుడికి వెళ్లిన కాసేపూ మనసును ప్రశాంతంగా ఉంచుకుని, భగవంతుడి మీద లగ్నం చేస్తే, మనకు కావలసినవేవో ఆయనే తీరుస్తాడు కదా! -
అమ్మానాన్నలు సంతోషంగా ఉంటేనే...
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని శాస్త్రాలు చెప్పాయి. తల్లిదండ్రులే ప్రత్యక్షదేవతలని ప్రవచనాలలో వింటూ ఉంటాం. కానీ, తల్లిదండ్రులను పాతసామాన్ల గదిలోనో, పశువులపాకలోనో పడేసే పిల్లలు ఉన్నారు. అలాంటి వారిని ఏమనాలి? ఒక కుమారుడు కానీ, కుమార్తెకానీ ఈ శరీరంతో తిరుగాడుతున్నారంటే అందుకు కారకులైనది తల్లిదండ్రులే కదా, వారుండబట్టే కదా, ఈ భూమి మీదకు రాగలిగింది. ఆ విషయాన్ని విస్మరించి, నా తల్లిదండ్రులు నాకేమిచ్చారు, నేను వారికెందుకు కృతజ్ఞత చూపించాలి? ఎందుకని వారికి ఈ వయసులో సేవలు చేయడం, వారి అవసరాలు తీర్చడమెందుకు అనుకుని వారిని పూర్తిగా పనికిరాని వారిగా పక్కన పెడతారు. తేజస్సును, బ్రహ్మ స్వరూపంలో తేజస్సుగా, వీర్యంగా నిక్షేపించినవాడు కేవలం తండ్రి. తన కన్నబిడ్డల శరీరానికి ఆధారమైన తల్లీ తండ్రి శరీరంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా నమస్కరించాలి, లేకపోయినా నమస్కరించాలి. కృతజ్ఞులమై ఉండాలి. అలా లేనివారిని చూసి చూసి... పితృదేవతాస్వరూపంలో ఉన్న తల్లిదండ్రులు – అటువంటి సంతానాన్ని కన్నందుకు కుమిలిపోతారట. అయితే ఏమిటి? అనుకుంటారేమో, పితృదేవతలు సంతోషంగా లేకపోతే, ఈ లోకంలో మనం సంతోషంగా ఉండలేమట. అది గుర్తుపెట్టుకోవాలి. -
చెట్ల మాంసాన్ని మీరు తినబోతున్నారు..!!
టెపిక్, మెక్సికో : మరికొద్ది సంవత్సరాల్లో మీరు జంతువుల మాంసానికి బదులు చెట్ల నుంచి తయారు చేసిన మాంసాన్ని ఆస్వాదించబోతున్నారు. అవును. ప్రపంచవ్యాప్తంగా మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అడుగులు పడుతున్నాయి. 2050 కల్లా ధనిక దేశాల్లో జంతువుల మాంసం మాయమవుతుందని ఓ పరిశోధకుడి రిపోర్టు. ఆయన ప్రకారం చెట్ల నుంచి తయారు చేసిన మాంసం లేదా ఫ్యాక్టరీల్లో తయారు చేసిన మాంసం మార్కెట్లో, రెస్టారెంట్లలో మాంసాహార ప్రియులకు విందుగా మారుతుంది. సాధారణ జంతువుల మాంసంతో పోల్చితే అత్యధిక ప్రొటీన్ విలువలతో రుచిగా ఈ మాంసం ఉంటుంది. పురుగులు, స్పిరులినా లాంటి ప్రత్యమ్నాయంగా మారుతాయని మరికొందరు పరిశోధకులు చెప్పారు. యూఎన్ ఫుడ్ అగ్నికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ప్రకారం.. 2050 కల్లా మానవ అవసరాల రీత్యా వ్యవసాయ ఉత్పత్తులు 50 శాతం పెరగాల్సివుంది. -
ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా!
సాధారణంగా చాలామంది తాము అనుకున్న పని జరగకపోయినా, కోరిన కోరిక తీరకపోయినా, ఆశించినది అందకపోయినా ‘ఆ భగవంతుడేమిటండీ!’ అంటాం. కానీ ఓ పని జరిగిందంటే ఆ పని జరగడం వెనుక ఒకడున్నాడని గుర్తు. ‘నీవు’ అనే వాడివి ఒకడుంటేనే ’బాగున్నావా?’ అని అడుగుతారు. బాగుండడం అనేది దేనిమీద ఆధారపడింది? ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం మీద. తీసిన ఊపిరి వదలకపోతే.. వదిలిన ఊపిరి తీయకపోతే శివం, శవం అవుతుంది. మరి ఊపిరి తీసిన వాడెవరు. నీవే. మరి పోయిన వాళ్ళందరూ ఊపిరి తీయడం చేతగాకనో, మర్చిపోయో వెళ్ళిపోయారా! ఊపిరి తీసి వదిలిపెడుతున్నంత కాలం నాన్నగారు, గురువుగారు, మామయ్యగారు, అన్నయ్యగారు... అబ్బో ఎన్ని అనుబంధాలో... ఆ వాయువు తీయడం ఆగిపోయింది. చివరికి భార్య, పిల్లలు, బంధువులు కూడా ‘ఆయన శరీరం కట్టె, దాన్నెలా పట్టుకుంటాను’ అంటారు. అంటే నీ శుభాలన్నీ ఆశ్రయించి ఉన్నది నీ ఊపిరిని. దాన్ని పని చేయించేవాడు వేరొకడున్నాడు. నీవు నిద్రపోతున్నా దాన్ని సజావుగా పనిచేయిస్తున్నాడు కదా... వాడున్నాడని నమ్మడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి మనకి? అందుకే అన్నారు పెద్దలు శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించమని... మనం కనీసం ఈ మాత్రం ఉంటున్నామన్నా, పొద్దున్నే లేచి కాఫీనో, టీనో తాగుతూ పేపరు చదువుతూ భార్యాపిల్లలతో కబుర్లు చెప్పుకుంటున్నామన్నా కూడా అందుకు భగవంతుడి అనుగ్రహం ఉందని గ్రహించాలి. -
పిలిస్తే పలుకుతా..!
దైవం మానుష రూపేణా... అన్నదానికి నిలువెత్తు నిదర్శనం షిరిడీ సాయి జీవితం. బాబా బోధల్లో దానధర్మాలు చేయడం, ఇతరులకు ఆపద సమయంలో సాయం చేయడం ప్రధానమైనవి. ఎప్పుడూ సత్యం మాట్లాడాలి. ధర్మమార్గాన్ని అనుసరించాలి. దొంగతనం, వ్యభిచారం చేయరాదు. మూఢనమ్మకాలను, మూర్ఖపు ఆలోచనలు విడిచిపెట్టాలి. సమాజ శ్రేయస్సుకు తోడ్పడే శుభకార్యాలు ఆచరించాలి. అయితే మంచి చేయకుండా కొందరు అంతరాయాలు కల్పిస్తారు కాబట్టి కార్యం పూర్తయ్యే వరకూ గుప్తంగా ఉంచటం మంచిది. హింసతో చేసినది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని పరిత్యజించాలి. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. మంచిపనులకు ఫలం సుఖం రూపంలోనూ, చెడుపనులకు ఫలం కష్టం రూపంలోనూ అనుభవించవలసి ఉంటుంది. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహుచక్కగా వసూలు చేసుకుంటాడు. సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయిభగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ఆయన మహా సమాధి చెంది వందేళ్లు గడుస్తున్నా, ప్రశాంత చిత్తంతో మొరపెట్టుకుంటే చాలు... భక్తుల మొర ఆలకిస్తాడు. కోరినది ఇస్తాడు. అందుకు ఆయన భక్తులే సాక్షులు. సాయిబాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. హింసతో కూడుకున్నది ఎంతటి మహత్కార్యమైనా అది శుభప్రదం కాదు. కనుక ఏ పనిలోనూ హింసకు తావివ్వరాదు. అహంకారాన్ని వదలిపెట్టకుండా షిరిడీ వచ్చినా ప్రయోజ నం శూన్యం. -
అ‘ధర్మకర్తలు’శంకరునికే శఠగోపం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : అది నగరం నడిబొడ్డులోని గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. నగరానికి చెందిన దాత సంస్థను ఏర్పాటుచేసి ఎకరాలకు ఎకరాల భూమి రాసిచ్చా రు. సంస్థ బాగోగులు చూసుకోవడానికి ధర్మకర్తలను నియమించారు. ట్రస్టీలుగా ఉన్న ఆ ధర్మకర్తలే సంస్థ భూములను తె గనమ్మేసి దాత ఆశయానికి తూట్లు పొడిచారు. ఏలూరులోని శంకరమఠం ఆస్తులపై కన్నేసి అన్యాక్రాంతం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రామచంద్రరావు పేటలో శంకర మఠం అనే ఆధ్యాత్మిక సంస్థను 1946లో నగరానికి చెందిన వడ్లమన్నాటి సుందరమ్మ అనే దాత స్థాపించారు. సం స్థ నిర్మాణం, అభివృద్ధి కోసం సుమారు 18 ఎకరాల భూమిని అదే సంవత్సరం ఫిబ్రవరి 2న ట్రస్ట్ డీడ్ రాసి రిజిస్ట్రేషన్ చేయించారు. మఠం నిర్వహణ కోసం ధ ర్మకర్తలను నియమించారు. శంకర మఠానికి తన పేరు పెట్టాలని, ఏలూరులో ప ర్యటించే పీఠాధిపతులు, వారి శిష్య పరి వారం కోసం ఆశ్రమం నిర్మించాలని, వా రికి భోజన సదుపాయాలు కల్పించాలని విల్లు రాసి ధర్మకర్తల చేతిలో పెట్టారు. శంకర మఠం నిర్మాణంలో ఉండగానే ఆ మె మరణించారు. శంకర మఠాన్ని కొంతకాలం బాగానే నిర్వహించిన ధర్మకర్తలు, దాత సుందరమ్మ వారసుల పర్యవేక్షణ లేకపోవడంతో విల్లులో ఉన్న నిబంధనల ను తమకు అనుకూలంగా మార్చుకుని సంస్థ ఆస్తులను విక్రయించడం మొదలు పెట్టారు. మఠం అభివృద్ధిని వదిలేశారు. దాత ఇచ్చిన ఆస్తులివే.. దాత సుందరమ్మ రాసిన విల్లు ప్రకారం రామచంద్రరావుపేట పడమర ‘ఈ’ వా ర్డులోని టౌన్ సర్వే 87,88, 146 నంబర్లలోని 3.06 ఎకరాల భూమిలోనే శంకరమఠం నిర్మించారు. దీని అభివృద్ధి కోసం 1948లో పత్తేబాద మోతే నరసింహరావు తోటకు పశ్చిమంగా (అశోక్‌నగర్ ప్రాం తం) ఉన్న 8.32 ఎకరాల తమలపాకు తోటను రాసి ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ చేయిం చారు. అలాగే 1949 జనవరి 4న పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలోని 295వ నంబర్ పట్టాలో దక్షిణం వైపు ఉన్న, తనకు చెందిన మరో 8 ఎకరాల భూమిని కూడా శంకర మఠం అభివృద్ధి కోసమే రాసి విల్లు రిజిస్టర్ చేయించారు. దీంతో పాటు తన వంట మనిషి జాలమ్మ అనే మహిళ తనకు సేవలు చేస్తుండటం తో మెచ్చి సత్యవోలులోని 295 నంబర్ పట్టాలో 2 ఎకరాల భూమిని 1949లోనే రాసి ఆమె జీవిత కాలం అనుభవించవచ్చని, ఆమె మరణానంతరం ఆ భూమి కూడా శంకర మఠానికే చెందుతుందని వి ల్లు రిజిస్టరు చేయించారు. ఇవన్నీ తాను ధర్మకర్తగా నియమించిన ఈదర వెంకట్రావు చేతిలో పెట్టారు. శంకర మఠం అభివృద్ధికి తాను రాసిన భూములను అవసరం మేరకు విక్రయించుకోవచ్చని విల్లులో పేర్కొన్నారు. సుందరమ్మ ఆశయానికి తూట్లు శంకర మఠం అభివృద్ధి చేసి దానికి తన పేరు పెట్టాలని కోరిన దాత సుందరమ్మ ఆశయానికి ధర్మకర్త తూట్లు పొడిచారు. మఠానికి ఆమె పేరు పెట్టి మఠంలో ఆమె ఫొటో పెట్టగా అవి ప్రస్తుతం కనుమరుగైపోయాయి. అలాగే మఠం అభివృద్ధి కోసం అవసరమైతే విక్రయించుకోవచ్చు అనే పాయింటు ఆధారంగా ధర్మకర్త త మలపాకు తోటలోని 8.32 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా మార్చి, సత్యవోలులోని 8 ఎకరాల భూమిని కూడా విక్రయించేశా రు. దాంతోపాటు శంకర మఠం ఉన్న 3.06 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మ ఠం ఉన్న భూమి 581.77 చదరపు గజా లు మినహా మిగిలిన భూమిని అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. బంగారు, వెండి ఆభరణాలు కూడా.. శంకర మఠానికి దాత సుందరమ్మ పలు బంగారు, వెండి ఆభరణాలు కూడా సమర్పించారు. 1970లో సుందరమ్మ కోడలు రాజేశ్వరి ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరిం చే నాటి సంస్థ భూములు అన్యాక్రాంతమయ్యాయని, బంగారు, వెండి ఆభరణాలు కూడా కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఇదిలా ఉండగా 1972 లో శంకరమఠం దేవాదాయశాఖ పరిధి లోకి వెళ్లింది. ఈ సందర్భంలో సెక్షన్ 38 ప్రకారం తయారు చేసిన దస్త్రంలో రాజేశ్వరి ఈ అంశాలను లిఖిత పూర్వకంగా ప్రస్తావించారు. అయినా దేవాదాయశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో 1990లో ఈదర వెంకట్రావు మనుమడు ఈదర వెంకటరమణ ప్రసాద్ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్నారు. వంట మనిషికి రాసిన భూమి కూడా.. 1990 నుంచి ధర్మకర్తగా ఉన్న వెంకటరమణ ప్రసాద్ దాత సుందరమ్మ వంట మనిషికి అనుభవ హక్కు, అనంతరం శంకర మఠానికి చెందేలా విల్లు రాసి ఉ న్న సత్యవోలులోని భూమిని విక్రయిం చారు. ప్రస్తుతం ఈ భూమి ఎకరం రూ. 50 లక్షలకు పైగానే పలుకుతోంది. విల్లులో విక్రయిం చుకునే హక్కు కల్పించిన దాదాపు 20 ఎకరాల భూమిని ముందుగానే అమ్మివేసిన ధర్మకర్తలు అనంతరం వారి వారసునికి విల్లు అప్పగించగా, విల్లులో విక్రయపు హక్కులు లేవని స్పష్టంగా రాసి ఉన్నా రమణప్రసాద్ అమ్మడం విమర్శలకు దారి తీసింది. నానమ్మ ఆశయాల కోసం పోరాడతాం ఏలూరు ప్రజలకు ఆధ్యాత్మికతను పంచడానికి మా నాయనమ్మ శంకర మఠం నిర్మించి, దాని అభివృద్ధికి భూములను రాసిచ్చారు. ధర్మకర్తలు వాటిని అమ్ముకోవడం దారుణం. నానమ్మ ఆశయాలు నెరవేర్చడానికి, శంకర మఠాన్ని అభివృద్ధి చేయడానికి కృషిచేస్తాం. దేవాదాయశాఖ అధికారులు మఠం అభివృద్ధికి సహకరించాలి. – వడ్లమన్నాటి వెంకట లక్ష్మీ సీతారాం, దాత సుందరమ్మ మనుమడు క్రయవిక్రయాలకు తావులేకుండా చేశాం శంకర మఠానికి చెందిన కొన్ని భూములు అమ్మివేసినట్టు మా దృష్టికి వచ్చింది. మిగిలిన ఆస్తులను విక్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం శంకరమఠం ఉన్న 581.77 గజాల స్థలాన్ని క్రయవిక్రయాలకు తావులేకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో 22ఏ(1)(సి) చేయిం చాం. దాత సుందరమ్మ ఆశయాల మేరకు శంకరమఠాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటాం. – సీహెచ్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయశాఖ -
దేవుడిలాంటి మనిషి!
దేవుడు ఏ రూపంలో సాక్షాత్కరిస్తాడో ఎవరూ చెప్పలేదు. ఆ దేవుడు కూడా చెప్పలేడేమో తను ఏ రూపంలో మనిషికి సాక్షాత్కరిస్తాడో! మనిషికి దేవుడిని సాక్షాత్కరింపజేసేవారు వేరే ఉంటారు. ఎవరు ఆ ‘వేరే’? మనుషుల్లోని దేవుళ్లు! మనిషి కంటే ఒక మెట్టు పైన ఉన్నవాళ్లు, దేవుడిని మనిషి దగ్గరికి ఒక మెట్టు కింది దించగలిగిన వాళ్లు.. ఈ ‘మనుషుల్లోని దేవుళ్లు’. వీళ్లకు మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు.. ‘మనిషి’ అని గానీ, ‘దేవుడు’ అని గానీ అనకుండా! మనిషి అంటే మరీ తక్కువైపోతారనీ, దేవుడు అంటే మరీ ఎక్కువైపోతారని కాదు దీని అర్థం. మనిషికి, దేవుడికి మధ్య వారధిగా ఉన్నవారు మనిషీ, దేవుడు కాకుండా మరొకటేదైనా అయి ఉంటారు కదా! అందుకు. మళ్లీ ‘దేవుడిలాంటి మనిషి’ వేరు! దేవుడిలాంటి మనిషి అకస్మాత్తుగా సాక్షాత్కరిస్తాడు. దేవుడిలా! అతడిని ఏ దేవుడో వచ్చి సాక్షాత్కరింపజేయడు. మనకే అనిపిస్తుంది, కళ్లెదుట దేవుడు ప్రత్యక్షమైనట్లుగా. ‘ఏంటలా ఉన్నా?’ అంటాడు ఆ దేవుడి లాంటి మనిషి. మనతో ఏ బంధమూ, ఏ సంబంధమూ, ఏ అనుబంధమూ, ఏ భవబంధమూ లేని ఆ మనిషి! ‘తిన్నావా?’ అని అడుగుతాడు. ‘పిల్లలు ఎలా ఉన్నారు?’ అంటాడు. ‘కంటిలో ఆ చెమ్మ ఏమిటి?’ అని అంటాడు. ‘నేనేమైనా చేయగలనా?’ అని కూడా మనసును నిమురుతాడు. దేవుళ్లే వచ్చి దర్శించుకునే మనిషిలా అనిపిస్తాడు అప్పుడా దేవుడిలాంటి మనిషి! ఏమిటి తేడా ఈ దేవుడిలాంటి మనిషికి, మనుషుల్లోని దేవుడికి? మనుషుల్లోని దేవుడికి ఒక ఆశ్రమం ఉంటుంది. దేవుడి లాంటి మనిషి.. ఆశ్రయం కోసం మన దగ్గరికి వచ్చిన దేవుడిలా ఉంటాడు. మనుషుల్లోని దేవుడి దగ్గరకు మనం వెళ్తాం. దేవుడిలాంటి మనిషి మన దగ్గరకు వస్తాడు. అంతే తేడా. అంతే తేడా కాదు. అంత తేడా! దేవుడికీ, దేవుడిలాంటి మనిషి మధ్య కూడా తేడా ఉంది. మనం వెళ్లే దేవుడికి అంతకుముందే కట్టిన గుడి ఒకటి ఉంటుంది. మన దగ్గరకు వచ్చే దేవుడు మన గుండెలో గుడి కట్టుకుని వెళ్తాడు. మనం వెళ్లే దేవుడి దగ్గర తోపులాట ఉంటుంది. మన దగ్గరకు వచ్చే దేవుడు మన కోసమే వాళ్లను వీళ్లను తోసుకుని వస్తాడు. ఇవన్నీ కాదు, మనం వెళ్లే దేవుడి దగ్గర మన సమస్యలన్నీ చెప్పుకుంటాం. మన దగ్గరకు వచ్చే దేవుడు అడిగి మరీ మన సమస్యలు తెలుసుకుంటాడు. -
ఆశీర్వచన ఫలం... ఆశీర్వచన బలం
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను విద్యాప్రాప్తిరస్తు అని, పెళ్ళయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అనీ... ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృద్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ... ఇలా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా? అవి ఫలిస్తాయా? అంటే ఫలిస్తాయనే చెప్పొచ్చు. సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వజన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు, పీఠాధిపతులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు – వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. అందుకే పెద్దలకు నమస్కరించి, వారి ఆశీస్సులు అందుకోవాలి. వీలయితే వారికి ఏమైనా సాయం చేసి, వారి మనసును సంతోషంతో నింపాలి కానీ, అపచారాలూ, అపకారాలూ చేసి, వారి మనస్సు నొప్పించడం సరికాదు. ఆలయానికి వెళ్లినప్పుడు వయసులో మనకన్నా పెద్దవారు కనిపించినప్పుడు, వరసలో వారిని ముందుపోనివ్వడం, వారికి ఏదైనా సేవ చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులతోపాటు పెద్దల దీవెనలు కూడా పొందవచ్చు. మార్కండేయుడు, ధృవుడు వంటివారు కూడా పెద్దల ఆశీస్సుల వల్లే ఆయుష్షు, యశస్సు పొందారని తెలుస్తోంది. -
శక్తినిచ్చే అమ్మ పూజ
దేవీనవరాత్రులలో శక్తి పూజ ప్రధానం. దేవి అంటే పరమేశ్వరుని శక్తి. ఈ శక్తిని స్త్రీ స్వరూపిణిగా భావించి కొలవడం ఆచారమైంది. ఆమె దయాతత్వాన్ని అంబ అని, అతిలోక సౌందర్యాన్ని త్రిపుర సుందరి అని, ఆమె భయంకర స్వరూపాన్ని కాళి అని ఉపాసిస్తాం. దుర్గాసప్తశతి ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ అని కీర్తిస్తుంది. అమ్మవారి అసలు పేరు జ్ఞానప్రసూనాంబిక. ప్రసూనం అంటే పుష్పం. జ్ఞానమనే పుష్పం తనదిగా కల తల్లి అని అర్థం. ప్రసూనానికి ఎలా సుగంధం ఉంటుందో, ఆ సుగంధాన్ని తన చుట్టుపక్కల అందరికీ అవతలి వారి ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా ఎలా వెదజల్లుతూ ఉంటుందో అలాగే అమ్మవారు కూడా జ్ఞానప్రసూనాంబ కాబట్టి జ్ఞానాన్ని నిరంతరం‡పంచుతూనే ఉంటుంది. దసరా ఉత్సవాల పదిరోజులపాటూ అమ్మను రోజుకో రూపంలో అలంకరిస్తారు. ప్రతినిత్యం అమ్మకు ఇష్టమైన లలితాసహస్రనామస్తోత్రం, బాలాత్రిపురసుందరీ స్తవం, మహిషాసుర మర్దినీ స్తోత్రం, కనకధారాస్తవం, దుర్గాసప్తశ్లోకీ... ఇలా భక్తులు ఆమె సమక్షంలో ఏదో ఒక శ్లోకాన్నో, అష్టోత్తరాన్నో పారాయణం చేస్తూ కనిపిస్తారు. దాని మూలంగా మానసికంగా ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని పొందుతారు. ఆలయంలో ఉన్న అమ్మను స్తుతించకపోయినా ఫరవాలేదు. ఇంటిలో ఉండే అమ్మను ప్రేమగా పలకరించడం, ఆత్మీయంగా కబుర్లు చెప్పడం మాత్రం మరచిపోరాదు. -
భక్తి శ్రద్ధలు
ఆత్మీయం భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు మనుషుల చేత అద్భుతకార్యాలను చేయిస్తాయి. అయితే ఆ నామస్మరణలో భక్తిశ్రద్ధలు ముఖ్యం. అవి లేకుండా పవిత్ర నామాల్ని ఎన్నిసార్లు స్మరించినా కలిగే ఫలితం నిష్ఫలం. సాయినాథుడు తన భక్తులనుంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని దక్షిణగా కోరాడు. అవి తనకిస్తే బతుకుల్ని తీయబరుస్తానని అభయమిచ్చారు. మనం చేసే పనిలో కూడా మనం చూపే భక్తిశ్రద్ధలే ఆ పనిలో రాణించేలా చేస్తాయి. భక్తి, శ్రద్ధ– సబూరి...ఇవి రెండూ కలిస్తే కలిగేది మేలిమి విశ్వాసం. ఇవే మనల్ని భగవంతునికి దగ్గర చేసే సాధనాలు. ఇందులో ఎటువంటి అనుమానానికి, అపోహలకు ఆస్కారం లేదు. ఉన్నదంతా విశ్వాసమే. ఇటువంటి శ్రద్ధాభక్తులు ఎవరికైతే ఉంటాయో, వారే మహనీయులుగా మారతారు. శ్రీ సాయి సచ్చరిత్రలో బాబా చెప్పినట్లు ... ఈ శరీరాన్ని ధర్మకార్యాచరణకే వినియోగించాలి. సత్కర్మలు ఆచరించాలి. పరమాత్మకోసం ఆరాటపడాలి. అదే నిజమైన భక్తి. అదే నిజమైన ఆధ్యాత్మిక దృక్పథం. అది అలవడాలంటే భక్తి, శ్రద్ధలను కలిగి ఉండాలి. -
శుభాన్నే సంకల్పించాలి
ఆత్మీయం భారతీయ ఆధ్యాత్మిక వాఙ్మయం అత్యంత ప్రాచీనమైనది, శాస్త్రీయమైనది. భూమి, సౌరవ్యవస్థలోని గ్రహాల పరిభ్రమణం మొదలైన వివరాలను మన మహర్షులు ఎంతో శోధించి మనకు అందించారు. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ ఆధ్యాత్మికమైనవే. కంటికి కనిపించని పరబ్రహ్మ దర్శనం వేదధర్మం వలన కలుగుతుంది. నీరు, నిప్పు, గాలి, సూర్యచంద్రులు, పర్వతాలు, పుడమి, చెట్టు, చేమా...అన్నీ ఈశ్వరమయాలు. అవి మనకు శాంతిని, సుఖాన్ని కలిగించాలని అధర్వణ వేదం ఆకాంక్షిస్తోంది. చుట్టూ ఉన్న ప్రపంచంలోని స్థావర జంగమాలన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకోవడమే కాక ఏ పీడలూ లేకుండా ఉండాలని ఆకాంక్షించారు వేదర్షులు. వేదాలు మనకు బోధించింది ఏమిటంటే.. మనం చేయగలిగినదంతా చేసి, ఊహించని ఫలం ఎదురైనప్పుడు ప్రారబ్ధమనో, దైవ సంకల్పమనో సమాధానపడాలి. ఆ ఫలం కూడా గతంలో మన కర్మకు ప్రతిఫలంగానే భావించాలి. ఏదేమైనా శుభాన్నే సంకల్పించడం, ఆశించడం మన విధి. భగవద్గీతను బోధించిన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వేదధర్మాన్ని బోధించాడు. వేదాలు, ఉపనిషత్తులు మనకేవో అర్థంకాని విషయాలు చెబుతాయని అనుకోనక్కర్లేదు. చిన్న చిన్న కథలతో జ్ఞానమార్గాన్ని చూపించే శక్తియుక్తులు వాటిలో చాలా ఉన్నాయి. మనిషి చేయాల్సిందల్లా ఆ జ్ఞానాన్ని పొందడానికి త్రికరణశుద్ధిగా గురువును అనుసరించడమే. అప్పుడు సమాజమంతా జ్ఞానమయమే అవుతుంది. -
విష్ణుమయం
ఆత్మీయం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీహరి. అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ తానుంటానన్నాడు కాబట్టి విష్ణువును స్థితికారుడనీ, సమస్త ప్రాణులనూ రక్షించే వాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. విష్ణువు అంటే విశ్వమంతా నిండిన వాడని అర్థం. ఈ సృష్టిలో అత్యుత్తమమైనవిగా పేర్కొనదగ్గ జ్ఞానం, అమరత్వం, వాత్సల్యం, సౌశీల్యం మొదలైన సమస్త సద్గుణాలు, నవరస భరితాలైన వస్తు వాహనాభరణాలు, రాజోపచారాలు, దైవోపచారాలు, సమస్త సదాచారాలకు ఆధారభూతమైన సంపదలన్నింటికీ శ్రీహరే ఆధారభూతుడు. సమస్త దేవగణాదులలోనూ విష్ణువు కంటే మిన్న అనదగ్గవాడు లేడు. అదేవిధంగా ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రం కంటె అధికమైనది లేదు. దుష్టరాక్షసులకు వరాలనిచ్చి, లోకాలను ఇబ్బందుల పాలు చేసి, చివరకు తాము కూడా ఇబ్బందుల పాలైన బ్రహ్మను, మహేశ్వరుడినీ కూడా విష్ణువే కాపాడిన ఉదంతాలు మనం చూస్తుంటాం. మంత్రపుష్పం అంతా విష్ణుమయమే. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుభగవానుని విశేషాలు తెలిపేవే విష్ణు సహస్రనామాలు. ఈ నామాలన్నీ విశ్వవ్యాప్తమైన ఆయన శక్తిని, అనంతమైన ఆయన లీలలనూ తెలియచేస్తూ, మనం ఏ రూపంలో భగవంతుడిని కొలిచినా దేవుడొక్కడే అనే భావనను కలుగచేస్తాయి. -
విచక్షణ ప్రధానం
ఆత్మీయం ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఒకరోజు సాయంత్రం వాకిలి అరుగుమీద కూర్చుని రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఆనందిస్తున్నారు. పక్కనున్న శిష్యుడికి పాటలలోని భావాన్ని, గాన మాధుర్యాన్ని వివరిస్తున్నారు. కాస్సేపటికి ఆయనను చూడడానికి ఒక సాధువు వచ్చారు. ఏంటీ? ఇవాళ షికారుకెళ్ళలేదా?’’ అడిగారు సాధువు. ‘లేదు... ఇదిగో ఈ పాటలు వింటున్నాను. బాగున్నాయా?’’ అడిగారు గురువు. ఏమిటీ ఆయన పాటలు వింటున్నారా? ఆయన తాగుబోతటగా? చుక్కజీnకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంతెందుకు తాగందే పాడలేడు...’’ అని ఆ గాయకుడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు సాధువు. అప్పుడు గురువుగారు ‘‘మనకు కావలసింది ఆయన గొంతు బాగుందా? లేదా? పాట బాగా పాడుతున్నాడా? లేదా అనేవే ముఖ్యం... ఏమంటారు?అన్నారు. ఏదో పనున్నట్టు అక్కడినుంచి వెళ్ళిపోయాడు సాధువు. కొంతసేపైంది. మరో సాధువు వచ్చాడు గురువుగారిని చూడటానికి. రేడియోలో వినిపిస్తున్న పాట విని సాధువు కూర్చుంటూనే ఆ పాట పాడుతున్న గాయకుడి గురించి పొగిడాడు. ‘ఆయన గాత్రం అమోఘం. ఆయన ఏ పాటైనా ఆస్వాదించి పాడతారు. ఆ తీరు నాకు చాలా ఇష్టం’ అన్నాడు. అప్పుడు గురువుగారు ‘‘ఆ గాయకుడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడటగా? చుక్క లేనిదే క్షణంæఉండలేడంటారు అందరూ...’’ అన్నారు. దాంతో ఆ సాధువు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరు సాధువులతోనూ గురువుగారి మాట తీరును గమనిస్తున్న శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. సమయం చూసుకుని ‘‘గురువుగారూ, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’’ అన్నాడు. గురువుగారు ఇలా అన్నారు – ‘‘కాయగూరలు తూకం వేయడం దుకాణదారు పని. ఆ త్రాసులో మనుషులను కూర్చోపెడితే అది విరిగిపోదూ? అందుకే ఎవరు ఎవర్ని తూకం వేసినా నేను అడ్డుపడి ఏదో ఒకటి మాట్లాడి ఆ విమర్శను సరి చేస్తాను. ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం సందిగ్ధంలోకి నెట్టేసుకోకూడదు. మనకు హాని లేనంత వరకు ఎవరు ఏం చెప్పినా నష్టం లేదు. విచక్షణ ముఖ్యం’’ అని! -
దైవంలో ఉండటమే భక్తుడి లక్షణం
ఆత్మీయం దేవుడు చాలా పెద్దగా ఉంటాడేమో అన్నది ఓ పదేళ్ల బాలుడి సంశయం. అదే విషయం తండ్రిని అడిగాడు. అప్పుడే ఆకాశంలో వెళుతున్న ఒక విమానాన్ని చూపించి, అంతుంటాడు దేవుడని తండ్రి చెప్పాడు. దేవుడంత చిన్నవాడా అన్నాడా బాలుడు నిరుత్సాహంగా. మరునాడు తండ్రి విమానాశ్రయానికి తీసుకెళ్తే అక్కడ విమానాల్ని దగ్గర నుండి చూసి ‘విమానాలు ఇంత పెద్దవా?’ అన్నాడా బాలుడు. ‘‘అవును దూరం నుండి అన్నీ చిన్నవే. దేవుడూ అంతే. ఆయనకు సమీపంగా ఉంటే ఆయనెంత పెద్దవాడో అర్థమవుతుంది’’ అన్నాడు తండ్రి. ధర్మశాస్త్రోపదేశకుడొకాయనను ‘దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిలోకి అతి ప్రాముఖ్యమైనదేది?’ అనడిగాడు ఒకతను. ప్రాముఖ్యమైనవి ఒకటి కాదు రెండున్నాయంటూ, దేవుని సంపూర్ణంగా ప్రేమించాలన్నది మొదటిది కాగా, దేవుని సంపూర్ణంగా ప్రేమించినట్టే, మన పొరుగువాడిని కూడా అంతే ప్రేమించాలన్నది రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని జవాబిచ్చాడు. ‘నిజమే, బలులివ్వడం, హోమాలు చేయడం కన్నా ముఖ్యమైనది. దేవుని, మన పొరుగువానిని ప్రేమించడమే ముఖ్యమని అతను అంగీకరించాడు. అందుకు ఆ ఉపదేశకుడు, నీవు స్వర్గానికి దూరంగా లేవని వ్యాఖ్యానించాడు. దైవానికి దూరంగా ఉండటం కన్నా, దగ్గరగా ఉండటం మంచిదే! కాని ఈ రెండింటి కన్నా దైవంలో ఉండేవారు నిజంగా ధన్యులు. దేవుని మహా లక్షణాలు, ఆయన శక్తి భక్తునికి సొంతమవుతాయి. లోకమన్నా, లోకభోగాలన్నా అందరికీ ఆకర్షణే! దీపం పురుగులకూ దీపానికి ఉన్న ఆకర్షణలాంటిదే ఇది. చివరకు ఆ పురుగులన్నీ దీపం వెలుగులో తిరుగుతూనే దీపం మంటలో పడి అంతమవుతాయి. లోకానికి వెలుగు, మంట రెండూ ఉన్నాయి. లోకం వెలుగులో ఎదిగి బాగుపడాలనుకునేవారు చివరకు దాని మంటలో మాడి మసైపోక తప్పదు. -
మనసును మంచి భావాలతోనే నింపుకోవాలి
ఆత్మీయం మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ఒక్క హిందూమతంలోనే ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు. -
నువ్వు నీలా ఉండటమే ఆనందం!
ఆత్మీయం కూలిపని చేసుకునే వారినుంచి కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందమే. ఏ పని చేసినా ఆనందం కోసమే. ప్రతిక్షణం ఆనందం కోసమే పాకులాడతారు. ఆనందం ఎక్కడ ఉందో అని ప్రతిచోటా వెదుకుతారు. కాని దానిని ఎప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఇంత శాస్త్రీయ పురోగతి సాధించి అత్యాధునిక సౌకర్యాలు, విలాసాలు అనుభవించినా ఎందుకు ఇంకా దుఃఖంలోనే ఉన్నాడు. భౌతికంగా ఎంత అభివృద్ధి సాధించినా అంతర్గతంగా మాత్రం బికారిలాగే ఉన్నాడు. ఎందుకిలా జరుగుతోంది? అనే సందేహం మనలో చాలామందిని వేధిస్తోంది. మొట్టమొదట తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆనందం అనేది ఎక్కడోవెతికితే దొరికే విషయం కాదు. అది ప్రతి వ్యక్తి లోనూ అంతర్గతంగా ఉంటుంది. అసలు నీ సహజ స్థితే ఆనందం. దానికోసం ఎక్కడ వెతికినా ఆనందానికి దూరమైనట్టే. ఒక ముసలామె సూది ఇంట్లో పోగొట్టుకొని దానికోసం ఇంటి వెనకాల వెతికిందట. ఆలా ఉంది మన పరిస్థితి. ఇంతకాలం భౌతిక విషయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ సమయాన్ని వృథా చేసుకున్నాం. నీవే ఒక సచ్చిదానంద స్వరూపం. ‘ఆనందం నాలో ఉండటమేంటి? అని సందేహం వచ్చింది. సత్తు అంటే సత్యం అంటే ఈ క్షణం. చిత్తు అంటే మనస్సు అంటే నా మనస్సు ఈ క్షణంతో సంపూర్ణంగా ఉన్నప్పుడు కలిగేదే సచ్చిదానందం. మనం ఏ పని చేసేటప్పుడు ఆ పనిలో పూర్తిగా లీనం అవుతూ చేయాలి. ఐస్‌క్రీమ్ తినేటప్పుడు దానిని హాయిగా తినాలి. ఆనందించాలి. చాకొలేట్ చప్పరించేటప్పుడు ఆ తియ్యదనాన్ని పూర్తిగా అనుభవిస్తూ చప్పరించాలి. పని విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆడుతు పాడుతూ పని చేస్తే అలుపూ సొలుపూ ఉండదన్న సినీ కవి పాటలాగే ఆనందంగా చేస్తే ఆస్వాదిస్తాం. లేదంటే భారంగా ఉంటుంది. పిల్లలకీ, పెద్దలకీ అదే తేడా! చాకొలేట్ తినేటప్పుడు వాళ్లు మరో పని మీద దృష్టి పెట్టరు. అది నోటినిండా, మూతినిండా అవుతోందని లెక్కపెట్టరు. అన్నం తినేటప్పుడూ, పడుకునేటప్పుడూ కూడా అంతే! అందుకే ఆనందంగా ఉండాలంటే మనం మళ్లీ మరోసారి పిల్లలమైపోదాం. -
మతం కాదు... మానవ ధర్మం
ఆత్మీయం బౌద్ధం మతమా లేక దర్శనమా? అని చాలామందికి అనుమానం. దానిని ఏ పేరుతో పిలిచినా తప్పులేదు. ‘బౌద్ధం’ బౌద్ధంగానే ఉంటుంది కాని మారదు. పేరులోనేముంది? మనం ‘మల్లె’ అని పిలిచే పదాన్ని మరేపేరుతో పిలిచినా దాని సుగంధం ఒకటే. మధురంగా ఉంటుంది. రాజకుటుంబంలో జన్మించి, అతిలోక సౌందర్యవతి అయిన భార్యను, ముద్దులు మూటగట్టే కుమారుని పొందాడు గౌతముడు. సుఖభోగాలు పొందడం ఆయనకు అతి సులభమైన పని. అయితేనేం, సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దుఃఖ విముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసార సుఖాలను గడ్డిపోచతో సమానంగా త్యజించి ‘త్యాగం’ అంటే ఇలా ఉండాలి అని చూపిన ఆచరణశీలి. అంతులేని ధనరాశులతో పొందలేని ఆత్మజ్ఞానం అనంతమైన జ్ఞానసాగరంలోని కేవలం ఒక్క బిందువుతోనే అపారంగా పొందవచ్చని గ్రహించాడు. తానేది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే అక్షరాలా ఆచరించాడు. ఆయన బోధనలు మానవ ధర్మబద్ధమైన, హేతుబద్ధమైన, పవిత్రమైన జీవనానికి Ðð లుగు బాటలు పరిచాయి. శాంతంతో కోపాన్ని, సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించవచ్చునని, ప్రేమ వల్లనే ద్వేషం నశిస్తుందని ఆయన బోధించాడు. మతమంటే మరేదో కాదు, అన్ని ప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండడమేనని, అందరినీ ప్రేమించడమే మానవత్వమని నిరూపించాడు. అందువల్ల బౌద్ధమతం అనేకంటే, బౌద్ధం అనడమే సరైనది. -
అంతటా ఆ దైవమే కానీ...
ఆత్మీయం పర్వదినాలు, పండుగలలో సంగతలా వుంచి మామూలు రోజులలో ముఖ్యంగా సెలవు దినాలలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కారణం ఈ యాంత్రిక జీవనంలో ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతుండడమే. అలాగే ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఆలయ సందర్శనం చేయడం వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకం, పాపభీతి, దేవుని పట్ల గల నమ్మకం అంతకంతకూ పెరిగి పోతోంది. అందుకే ఇప్పుడు వయసు మళ్లిన వారిలో కంటే యువతలో ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులలో ఎక్కువగా కనపడుతోంది. కొందరు సరదా కోసం గుడికెళితే, మరి కొందరు మనశ్శాంతికి, ఇంకొందరు కోరికలు కోరడానికి, మరికొందరు మొక్కులు తీర్చుకోవడానికి– ఇలా ఏదో ఒక కారణాలతో గుడికెళ్లి, దైవదర్శనం చేసుకునేవారు ఎక్కువ. కారణం... ఇంట్లో పూజగదిలో లభించని ప్రశాంతత ఆలయంలో లభిస్తుంది. ఇంట్లో పూజించేది ఆ మూర్తినే అయినా, మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఒక పవిత్రమైన భావన, మాటలకందని అనుభూతి, మనశ్శాంతి కలుగుతాయి. కారణం ఏమిటి? దేవాలయాలలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడే యంత్రాన్ని కూడా ప్రతిష్ఠాపన చేస్తారు. అది యోగులు, యోగుల వంటి స్వామీజీల చేతుల మీదుగా జరుగుతుంది. ఆ యంత్రాలలోని బీజాక్షరాలు స్వరబద్ధమైన మంత్రాల ద్వారా మన చెవులను చేరి మన కోరికలను తీరుస్తాయి. ఆ సమ్మోహన శక్తే మనల్ని వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణించి ఆయా ఆలయాలలోని దేవతల దర్శనం చేసుకునేలా చేస్తుంది. మనం చేసే పూజల వల్ల, ఆలయంలో నిత్యధూపదీప నైవేద్యాల వల్ల ఆ Ô¶ క్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. కారణం ఏమైతేనేం, విగ్రహం నిగ్రహం కోసమే అన్నారు సామాన్య పరిభాషలో చెప్పాలంటే... ఇంట్లో సిస్టమ్‌లో సీడీలోనో, టీవీలోనో చూసేదీ సినిమానే. అదే పెద్ద పెద్ద థియేటర్లలో పెద్ద తెరమీద చూసేదీ అదే సినిమా. అనుభూతిలోనే తేడా. అందుకే ఆలయం ఆలయమే... పూజగది పూజగదే; మందిరం మందిరమే! -
ఆదర్శ హనుమ
ఆత్మీయం నేటి కథానాయకుల నుంచి నేర్చుకోగలిగింది, నేర్చుకోవలసిందీ ఏమున్నా లేకపోయినా, యువత హనుమను చూసి నేర్చుకోవలసింది మాత్రం చాలా ఉంది. ఆయనను పూజించడం సరే, అసలాయనను ఎందుకు పూజించాలి, ఆయన నుంచి స్ఫూర్తిగా ఏమి తీసుకోవాలో చెబితే పిల్లలే కాదు, యువకులు కూడా హనుమను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. అవేమిటో చూద్దాం... స్వామి కార్యాన్ని నెరవేర్చడం కోసం నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. తాను కనీసం ఎప్పుడూ చూసి ఎరుగని సీతమ్మను గుర్తించి, ఆమె ముందు శ్రీరాముని గుణగానం చేశాడు. తనపై ఆమెకు ఏమూలో శంక మిగిలి ఉన్నదని గ్రహించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపాడు. అడ్డువచ్చిన రాక్షసులను అవలీలగా మట్టుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఏ హానీ చేయదన్న వరం ఉన్నా, రావణుని సమక్షానికి వెళ్లేందుకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి బ్రహ్మపట్ల తన విధేయతను చాటుకున్నాడు. లంకాధీశుని కంటే ఎత్తుగా ఉండేట్లు తన వాలంతో ఆసనాన్ని ఏర్పరచుకుని దాని మీద ఆసీనుడయ్యాడు. నిష్కారణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేందుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. సీతజాడకోసం పరితపిస్తున్న రామునికి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘దృష్ట్వాన్ దేవి’ (చూశాను సీతను) అని చెప్పి కొండంత ఉపశమనం కలిగించాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శదంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, చురుకుదనం, మాటకారితనం, పౌరుషం, పరోపకారం, అచంచలమైన ఆత్మవిశ్వాసం, దీక్ష, కార్యదక్షత, అపారమైన ప్రభుభక్తి, వజ్రంలా ప్రకాశించే ఆరోగ్యకరమైన శరీరం కలవాడు ఆంజనేయుడు. హనుమంతుని వంటి నమ్మినబంటు, దౌత్యవేత్త, మంత్రి మరెక్కడా కానరాడు. అందుకనే ఆయన చిరంజీవిగా.. ఆదర్శప్రాయుడిగా నేటికీ శాశ్వతంగా భక్తుల మనోఫలకంపై నిలిచిపోయాడు. -
మంచి పని వల్ల ఎప్పటికైనా మంచే!
ఆత్మీయం ఇతరులకు మనం మంచి చేస్తే మంచి ఫలితాన్ని, చెడు చేస్తే చెడు ఫలితాన్నీ పొందుతామన్న సూక్తిని హిందూమతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కుమతం, జైనమతం వంటి అన్ని మతాలూ బోధించాయి. అయితే దీని మీద మనకి నమ్మకం కాని, గురి కాని, గౌరవం కాని, భయం కాని లేకపోవడంతో ఈ దైవనియమాన్ని అర్థం చేసుకుని మన బాగు కోసం ప్రవర్తించడం మనం పూర్తిగా విస్మరించాం. దీని ఫలితమే నిత్యం నేడు మనం దినపత్రికల్లో చూసే వివిధ అకృత్యాలు, అన్యాయాలు, ఇతర దారుణాలు. ‘నేను ఇతరులను బాధించి లబ్ధి పొందితే, తిరిగి దానికి నేను ఎక్కువ రెట్లు బాధ అనుభవించి, నేను లబ్ధి పొందిన దానికంటే ఎక్కువ రెట్లు కోల్పోతాను’ అనే నమ్మకంతో కూడిన భయం స్పష్టమైన ఉదాహరణలతో మనకి అందక పోవడం వల్లే మనుషులు అన్యాయాలు చేయడానికి వెరవడం లేదు. కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. దీనినే అమెరికన్లు‘సరైన మనిషి, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు. -
నిశ్చలత్వమే యోగం
ఆత్మీయం ఈ భౌతిక ప్రపంచంలో మంచి జరిగినా, చెడు జరిగినా తాము దాన్ని ప్రశంసించకుండా, విమర్శించకుండా ఎవరైతే ఉంటారో, ఎటువంటి భావాన్నీ వెలిబుచ్చక కలత చెందక నిశ్చలంగా ఉంటారో అటువంటి వారినే యోగులంటారు. నిలకడగల జ్ఞాని లేదా యోగి తాబేలు వంటివాడు. ఏదైనా అవసరం కలిగినప్పుడు తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునే సౌకర్యం ఏవిధంగా కలిగి ఉంటుందో, అదేవిధంగా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడే సమగ్రమైన జ్ఞాని, యోగి. సమదర్శనులు రమణమహర్షి వలె జనన మరణ స్థితులను జయించిన వారై ఉంటారు. అటువంటి సమదర్శనులయిన జ్ఞానుల చేత ఈ దేహం, సంసార బంధాలలో తగులుకోక జనన మరణ చక్రాన్ని జయించబడింది. అటువంటి వారు బ్రహ్మమువలె దోషం లేని వారయినందువల్ల బ్రహ్మములోనే ఉన్నవారు కాగలరు. అంటే అన్నింటిలోనూ సమదృష్టి గల మనస్సు, ఆత్మ సాక్షాత్కారం గల వారి çహృదయానికి ప్రతీకయే గాక సాక్షాత్తూ దేవుని వలె రాగద్వేషాలకు అతీతులం కాగలం. దోషరహితులమై ఆధ్యాత్మికానందాన్ని అనుభవించగలం. -
ధ్యానం... అంతరయానం!
ఆత్మీయం అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే... అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం (తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. ఆ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికే ధ్యానం చేయడం అవసరం. ధ్యానం అంటే నిర్మలమైన, నిశ్చలమైన నీలోకి నీవు చేసే ప్రయాణం. -
గోవర్ధనుడు
∙ ఆవును సాదుకుంటామన్న షరతుపై... 261 మంది రైతులకు ఆవుల పంపిణీ ∙ 650 కి చేరిన వాటి సంతతి... ∙ గో సేవలో తరిస్తున్న రాజమౌళి–బాలమణి దంపతులు ‘రైతులకు ఆవులను ఇచ్చి వాటి సంతతి వృద్ధి చెందితే రైతు, రైతుపై ఆధారపడ్డ సమాజం... తద్వారా దేశానికి మేలు జరుగుతుందని నమ్మే వారిలో నేనొకడిని. అందుకే రైతులకు గోవులను పంపిణీ చేస్తున్నా’ అని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి చౌరస్తాకు చెందిన వ్యాపారవేత్త శెనిశెట్టి రాజమౌళిగుప్తా అంటున్నారు. 2011 అక్టోబర్ 24న శెనిశెట్టి రాజమౌళి, బాలమణి దంపతులు ‘గోమాత సేవా సంస్థ’ను ప్రారంభించారు. అప్పటినుంచి రైతులకు గోవులను దానం చేయడం మొదలుపెట్టారు. కబేళాకు తరలించే గోవులను కొనుగోలు చేయడం, వాటిని తన ఇంటి వద్ద ఉన్న గోశాలలో సంరక్షించి పేద రైతులకు అందించడం ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నారు. రాజమౌళి గుప్తా రైస్‌మిల్ వ్యాపారి. ఆయన ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు అధిక సమయం కేటాయిస్తూ రైతుల ఇంట ఆవులు ఉండాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు గోమాత సేవా సంస్థను ప్రారంభించి గడచిన ఆరేళ్లుగా రైతులకు గోవులను అందజేస్తున్నారు. ఆవును సాదుకుంటామన్న అగ్రిమెంట్‌పైనే... తాము ఆవును సాదుకుంటామని ముందుకు వచ్చి, అగ్రిమెంటు (ప్రమాణపత్రం)పై సంతకం చేస్తేనే ఆ రైతుకు ఆవును అందిస్తున్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఆవును అమ్మకూడదు. ఆవును సాదలేని పరిస్థితుల్లో బంధువులకో, స్నేహితులకో ఇచ్చి దాన్ని కాపాడాలన్న కచ్చితమైన నిబంధనను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 261 మంది రైతులకు ఆవులను దానం చేయగా, దాదాపు అందరూ వాటిని పెంచి పెద్ద చేసుకుంటున్నారు. వాటిద్వారా గో సంపద 650కి పెరిగింది. ఒక్కో రైతు వద్ద ఒక్క దానితో నాలుగైదు తయారయ్యాయి. రైతుల వద్ద వెయ్యి ఆవులు తయారైతే తన లక్ష్యం నెరవేరినట్టేనని చెబుతున్న రాజమౌళి, త్వరలోనే తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగు పొరుగు జిల్లాల రైతులకు కూడా... మాచారెడ్డి ప్రాంతానికి చెందిన రైతులకే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన వారికీ ఆవులను అందించారు. ఎక్కువగా సిద్దిపేట, సిరిసిల్లా, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల రైతులకు ఆవులను దానం చేశారు. ఒక్క మాచారెడ్డి మండలంలోనే 16 గ్రామాలకు చెందిన 88 మంది రైతులకు గోవులను అందించాడు. కామారెడ్డి, భిక్కనూరు, సదాశివనగర్, లింగంపేట, తాడ్వాయి, దోమకొండ, గాంధారి మండలాల రైతులతోపాటు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలానికి చెందిన కొందరు రైతులకు ఆవులను అందించారు. సిరిసిల్లా జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లా, ముస్తాబాద్, వేములవాడ మండలాలతోపాటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్ మండలాలకు చెందిన రైతులకు గోవులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడీ గో దాన కర్ణుడు. ఇలాంటి వారుంటే సమాజం కొంతయినా అభివృద్ధి చెందుతుందేమో! – సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి – ఫోటోలు: జి.అరుణ్ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి... గోజాతి అంతరిస్తున్న కొద్దీ అనర్థాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గో ఆధారిత వ్యవసాయం దెబ్బతిన్న తరువాత రసాయనాలతో పండించిన ఆహార ఉత్పత్తులు తిని ప్రజలందరూ అనారోగ్యం పాలవుతున్నారు. తద్వారా ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నాం. రైస్‌మిల్‌కు వచ్చే రైతులు ఎన్నో రకాల కష్టాలు చెప్పుకుంటుంటే, వారికోసం నేను ఏదైనా చేయాలని ఆలోచించాను. నా సంపాదనలో కొంత భాగాన్ని రైతులకు గోవులను అందించడానికి వెచ్చించాలని నిర్ణయించుకుని గోమాత సేవాసంస్థను స్థాపించాను. అనుకున్నట్లు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆవును తీసుకున్న రైతులు గో సంతతిని వృద్ధి చేసుకుంటుండడం ఆనందంగా ఉంది. వెయ్యి ఆవులు తయారైతే నా సంకల్పం పూర్తిగా నెరవేరినట్టే. – శెనిశెట్టి రాజమౌళిగుప్తా, గోమాత సేవా సంస్థ వ్యవస్థాపకులు గోమాతను కాపాడుకోవాలె... ప్రతీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. మా దగ్గర ఆవులు ఉన్నాయని చాలా మంది పండుగలు, పూజా కార్యక్రమాలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ల సందర్భంలో గోమూత్రం, గోపేడ కోసం వచ్చేవారు. రైతుల దగ్గర గోవులు లేకపోవడం వల్లే చాలామంది మా దగ్గరకు వస్తున్నారని, అందుకే రైతులకు గోవులు ఇవ్వాలనుకుని ఐదారేళ్లుగా అందిస్తున్నాం. రైతుల దగ్గర గో సంతతి పెరుగుతోందని తెలిసి ఎంతో సంతోషపడుతున్నాం. – బాలమణి, గోమాత సేవా సంస్థ ప్రతినిధి ఒక్కదానితోని నాలుగు అయినయి... నాలుగేండ్ల కిందట రాజమౌళి సేటు ఆవును ఇచ్చిండు. అప్పటిసంది ఆవును పానం లెక్క సాదుకున్న. ఆవు మూడు ఈతలు ఈనింది. ఇప్పటికి నాలుగు అయినయి. ఎవలకి ఇయ్య. అమ్ముకోను గూడ. ఇంకా పెంచుకుంట. ఏ కష్టం వచ్చినా ఆవును అమ్ముకోను. – సూర్య, రైతు, గజ్యానాయక్ తండా -
పారాయణ పరమార్థం
ఆత్మీయం శిష్యుల ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేవాడే ఉత్తమ గురువు. అందుకే గురువును సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్త స్వరూపంతో పోలుస్తారు. బాబా అచ్చంగా అటువంటి సద్గురువు. ఆత్మసాక్షాత్కార సాధనకు మార్గం చూపించే చుక్కాని వంటివాడు. శ్రీసాయి బోధనకు ప్రత్యేక స్థలం, సమయం, సందర్భం ఉండేవి కావు. సందర్భాన్ని బట్టి బాబా ప్రబోధం ప్రవాహం మాదిరి జాలువారేది. ఒకనాడు ఒక భక్తుడు ఇంకో భక్తుని గురించి అతని పరోక్షంలో ఇతరుల ముందు నిందించసాగాడు. తోటి భక్తునిలోని ఒప్పులను విడిచి, అతను చేసిన తప్పులను కావాలనే ఎత్తి చూపుతూ హీనంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అతని తీరుతో పక్కనే ఉన్న ఇతర భక్తులు నొచ్చుకున్నారు. తన సర్వజ్ఞతతో సదరు భక్తుని బుద్ధిని గ్రహించారు బాబా. పరనిందకు పాల్పడిన భక్తుడిని సరిదిద్దాలను కున్నారు. ఒకనాడు బాబా లెండీతోటకు వెళ్లేటప్పుడు తోటి భక్తుడిని నిందించిన భక్తుడు బాబాకు ఎదురు పడ్డాడు. అప్పుడు బాబా ‘‘ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప లభించని మనిషి పుట్టుక పుట్టి పరనిందకు పాల్పడటమంటే అవతలివారి మలినాలను నీ నాలుకతో శుభ్రపరుస్తున్నట్టే లెక్క. ఇకముం§ð ప్పుడూ అలా చేయకు’’ అని మందలించారు. బాబా చెప్పిన నీతి గ్రహించిన ఆ భక్తుడు వెంటనే తన తప్పు దిద్దుకున్నాడు. మనం బాబా సచ్చరిత్ర పారాయణ చేస్తాం, భక్తితో లెంపలు వేసుకుంటాం. నైవేద్యం పెట్టి, నీరాజనం సమర్పిస్తాం కానీ, బాబా చెప్పిన ఇలాంటి విషయాలు ఆచరించినప్పుడే అది అసలైన పారాయణ అవుతుంది. -
శుభాలకు స్వాగతం...
ఆత్మీయం లోకమంతా డబ్బు చుట్టూతానే తిరుగుతూ ఉంటుందని ధనమూలం ఇదం జగత్ అనే లోకోక్తి చెబుతోంది. అది నిజం. నిత్యం లేచింది మొదలు, నిద్రించేదాకా ప్రతి ఒక్కదానికీ డబ్బు అవసరమే. అందుకే అందరికీ డబ్బు మీద ప్రేమ. డబ్బులిచ్చే దేవతల మీద అధిక భక్తి. అందులోనూ వరాలనిచ్చే వరలక్ష్మీదేవత అంటే ఇంకా ఎక్కువ భక్తి. ఈ రోజు ఆమె అనుగ్రహం పొందడం కోసం శాయశక్తులా పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. అయితే, మనసును మాత్రం పట్టించుకోరు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారు మన ఇంట కాలు పెట్టాలని వాకిళ్లను ఏ విధంగా అయితే బార్లా తెరుచుకుని ఉంటామో, మనసులోకి సానుకూల భావనలు రావాలని, ధనాత్మకమైన ఆలోచనలు కలగాలని మనసును కూడా అదేవిధంగా తెరిచి ఉంచుకోవాలి. మురికి పట్టిన భావాలను, ఆలోచనలను శుభ్రం చేసుకోవాలి. కుళ్లుబుద్ధిని కడిగేయాలి. పిరికి మాటలను, పిరికి భావాలను తరిమి కొట్టాలి. ధైర్యసాహసే లక్ష్మీ అన్నారు కాబట్టి, మనసులో ధైర్యాన్ని నింపుకోవాలి. కుటుంబ సభ్యుల పట్ల, తోటివారి పట్ల ప్రేమను నింపుకోవాలి. పదిమందికీ సాయం చేయాలన్న భావనను కలిగి ఉండాలి. ఐశ్యర్యమంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు, ఆయుష్షు, ఆరోగ్యం, ధన, కనక వస్తు, వాహనాలు, దాసదాసీజనం, యశస్సంపదలు, నిన్ను ప్రేమించే వారు కూడా అని తెలుసుకోవాలి. ఈ వరలక్ష్మీ వ్రతం రోజున సానుకూల భావనలతో మనసును నింపుకుందాం. అందుకు సిద్ధమేనా మరి! -
నేరము.. హింస
ఆత్మీయం అహింసా పరమోధర్మః అన్నారు పెద్దలు. అంటే హింసించకుండా ఉండటమనేది అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమమైనదని అర్థం. అలాగని హింస అంటే, జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, అంటే జంతువులు, పక్షుల్ని కట్టేసి పెంచుకున్నా హింసే అన్నాడు బుద్ధభగవానుడు. బానిసత్వాన్నీ హింసగానే పరిగణించాడు. చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, కఠినంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, రెండర్థాల పదాలతో బాధపెట్టినా– ఇవన్నీ ‘జీవహింస’గానే చెప్పాడు. ఐతే ఏదైనా కావాలని, తెలిసి చేస్తేనే అది నేరం అవుతుందని, తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన జీవహింస ఎంత పాపకార్యమో చెప్పే ఒక జాతక కథ ఉంది. ఒకడు ఒక దేవతకు ఒక మేకపోతును బలిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మేకపోతు పెద్దగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి బలిచ్చేవాడు కత్తిదించుతాడు. వెంటనే ఏడుస్తుంది. అప్పుడు వాడు– ‘‘ ఓ మేకా! ఎందుకు నవ్వావు? ఎందుకు ఏడ్చావు?’’ అని అడిగాడు. అప్పుడు ఆ మేక ‘‘ఓరీ మూర్ఖుడా! నేనూ నీకులాగా ఒక యజ్ఞంలో మేకను వధించాను. పుణ్యం రాకపోగా 500 జన్మలు మేకగా పుట్టే పాపం కలిగింది. ఇప్పటికి 499 సార్లు మేకగా పుట్టి మెడ నరికించుకున్నాను. ఇది ఆఖరిది. ఈ రోజుతో నా పాపం తీరిపోతుందని ఆనందంతో నవ్వాను. ఇక నన్ను చంపడం వల్ల నీకు ఐదువందల మేక జన్మలు కలుగుతాయి కదా! అని నీ దుస్థితికి బాధపడి ఏడ్చాను’’ అంది. అంటే– ‘జీవహింస’ ఎంత పాపకార్యమో’ అని చెప్పడానికి చెప్పిన కథ ఇది. దీనిలోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకోవడం అవసరం.