
ఘనంగా జగదాంబదేవి జాతర
మండలంలోని పరిమండల్ గ్రామపంచాయతీ పరిధిలోని జగదాంబదేవితండాలో జాతర ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
నిర్మల్(మామడ) : మండలంలోని పరిమండల్ గ్రామపంచాయతీ పరిధిలోని జగదాంబదేవితండాలో జాతర ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలంతో జాతర కన్నల పండువగా ఉంది.
గ్రామంలోని భక్తులతో పాటు దూరప్రాంతాల నుంచి భక్తుల అధిక సంఖ్యలో హాజరై దర్శనం చేసుకున్నారు. చాలా మంది కుటుంబ సమేతరంగా జాతరకు తరలి వచ్చి ఆహ్లాదంగా గడిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఆటవస్తువులు, మిఠాయి దుకాణాలు వెలిశాయి.