సునీతా విలియమ్స్‌ స్వగ్రామంలో సంబరాలు | Akhand Jyoti in Village Celebrations were Held on Sunita Williams Return | Sakshi
Sakshi News home page

సునీతా విలియమ్స్‌ స్వగ్రామంలో సంబరాలు

Published Wed, Mar 19 2025 7:03 AM | Last Updated on Wed, Mar 19 2025 11:04 AM

Akhand Jyoti in Village Celebrations were Held on Sunita Williams Return

న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(Astronaut Sunita Williams) సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె స్వస్థలమైన గుజరాత్‌లోని ఝులసాన్‌లో ప్రజలు భగవంతునికి హారతులు అర్పిస్తూ, ప్రార్థనలు చేశారు. అలాగే సంబరాలు జరుపుకున్నారు.

అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వారిలో వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్  ఉన్నారు. వ్యోమగాములంతా డ్రాగన్ క్యాప్సూల్(Dragon Capsule) నుండి బయటకు వచ్చారు. వెంటనే వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములు విజయవంతంగా తిరిగి వచ్చిన తరుణంలో భారతదేశంతో పాటు అమెరికాలో వేడుకల వాతావరణం నెలకొంది. సునీతా విలియమ్స్‌తో పాటు క్రూ-9 సభ్యుల ధైర్యసాహసాలు, విజయాల గురించి జనం చర్చించుకుంటున్నారు.
 

డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చిన మూడవ వ్యక్తి సునీతా విలియమ్స్. ఆమె బయటకు రాగానే అందరినీ చిరునవ్వుతో పలకరించారు. క్యాప్సూల్ నుండి వ్యోమగాములను బయటకు తీసుకువచ్చే ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. క్యాప్సూల్ లోపల వ్యోమగాములంతా సీట్ బెల్టులతో కట్టి ఉంటారు. సునీతా విలియమ్స్‌తో పాటు ఇతర వ్యోమగాములను తీసుకువస్తున్న క్యాప్సూల్ భూ వాతావరణం(Earth's atmosphere)లోకి ప్రవేశించినప్పుడు, 3500 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి కారణంగా అది ఎర్రటి అగ్ని బంతిలా కనిపించింది. అయితే ఆ క్యాప్యూల్‌ లోనికి ఉష్ణోగ్రత ప్రవేశించకుండా దానిని తయారుచేస్తారు. క్యాప్సూల్ లోపల ఉష్ణోగ్రత దాని బయట ఉష్టోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది.



ఇది కూడా చదవండి: భూమిపైకి క్షేమంగా సునీత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement