
వాషింగ్టన్ డీసీ: తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు(Astronauts) తిరిగి భూమికి చేరుకోవడంపై యునైటెడ్ స్టేట్స్‌లోని అధ్యక్షుని అధికారిక కార్యాలయం వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇచ్చారని, దానిని నిలబెట్టుకున్నారని వైట్‌హౌస్ పేర్కొంది.
అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా(American space agency NASA)కు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని, వైట్ హౌస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ఒక వీడియో షేర్ చేస్తూ పేర్కొంది. ఈరోజు వారు సురక్షితంగా భూమిపైకి దిగారని, వ్యోమగాములను సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు ఎలోన్ మస్క్, స్పేస్‌ఎక్స్, నాసాకు వైట్‌హౌస్ కృతజ్ఞతలు తెలిపింది.
PROMISE MADE, PROMISE KEPT: President Trump pledged to rescue the astronauts stranded in space for nine months.
Today, they safely splashed down in the Gulf of America, thanks to @ElonMusk, @SpaceX, and @NASA! pic.twitter.com/r01hVWAC8S— The White House (@WhiteHouse) March 18, 2025
డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'(Truth Social)లో వ్యోమగాములు తిరిగి వచ్చిన క్షణాలను షేర్ చేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో భూమికి తిరిగి వచ్చారు. ఎనిమిది రోజుల మిషన్ కోసం బయలుదేరిన సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఆమె సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment