
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్, బుచ్ విల్మోర్‌ల రాకకోపం ఎదురుచూస్తున్నవారికి అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిష్ట్రేషన్(నాసా) శుభవార్త చెప్పింది. వీరు అంతరిక్షం నుంచి 2025, మార్చి చివరిలో భూమికి తిరిగి రానున్నట్లు వెల్లడించింది. సాంకేతిక ఇబ్బందులు, మిషన్ రీషెడ్యూలింగ్ కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు.
నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం క్రూ-10 మిషన్ మార్చి 12న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు బయలుదేరుతుంది. ఈ మిషన్‌లో అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్ (నాసా), టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ), కిరిల్ పెస్కోవ్ (రోస్కోస్మోస్) ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక, క్రూ-9 మిషన్ (సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కూడినది) భూమికి తిరిగి వస్తుంది.
క్రూ-10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుందని, ఒక వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉంటుందని బుచ్ విల్మోర్ తెలిపారు. దీని తరువాత ఆ వ్యోమగాములు మార్చి 19 నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. నాసా, స్పేస్‌ఎక్స్‌లు ఈ మిషన్‌ను వేగవంతం చేశాయి.
ఈ మిషన్‌లో జరుగుతున్న జాప్యంపై స్పేస్‌ఎక్స్ సీఈవో ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యోమగాములను ఇంత కాలం ఐఎస్‌ఎస్‌లో వదిలివేయడం సరికాదని అన్నారు. కాగా ఈ మిషన్‌లో పోలాండ్, హంగేరీల వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన శుభాన్షు శుక్లాను కూడా ఐఎస్‌ఎస్‌కు పంపనున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే శుభాన్షు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన మొదటి భారతీయునిగా నిలుస్తారు. మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది.
ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో
Comments
Please login to add a commentAdd a comment